Petrol
-
ఇంధన కొరత.. భారీగా తగ్గిన మోదీ కాన్వాయ్
ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పొదుపు చర్యల్లో భాగంగా తన కాన్వాయిలోని కార్ల సంఖ్యను భారీగా తగ్గించనున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి కేవలం రెండు వాహనాల్లోనే తన కాన్వాయి ఉండనున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న వేళ పెట్రోల్, డీజీల్ వాడకం తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు.అదే విధంగా పలువురు కేంద్రమంత్రుల కాన్వాయిలోని వాహనాల సంఖ్య సైతం భారీగా తగ్గింది. హోంశాఖ మంత్రి అమిత్ షా కాన్వాయి మూడు వాహనాలకు తగ్గగా రక్షణ శాఖ మంత్రి కాన్వాయి 11 వాహనాల నుంచి నాలుగు వాహనాలకు తగ్గించారు. కాగా ఇటీవల దేశ ప్రజలకు పొదుపు చర్యలు చేపట్టాలని ప్రధాని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని సైతం స్వయంగా ఆ నిబంధనలను పాటిస్తున్నట్లు తెలుస్తోంది.కాగా ఇటీవల హైదరాబాద్‌లోని బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రధాని దేశానికి కీలక సూచనలు చేశారు. " పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడింది. దీంతో పెట్రోల్, డీజీల్ ధరలు తీవ్రంగా పెరిగాయి. ప్రస్తుత కష్ట సమయాల్లో ప్రజలంతా సంయమనం పాటించాలి. విదేశీ ప్రయాణాలు, దుబారా ఖర్చులు పూర్తిగా తగ్గించుకోవాలి. పెట్రోల్, డీజిల్‌ను పరిమితంగా వినియోగించాలి. ప్రజా రవాణానే అధికంగా వాడాలి ఎలక్టిక్ వాహనాల వైపు మళ్లాలి" అని సూచించారు.#WATCH | Delhi: Prime Minister Narendra Modi has reduced his convoy size significantly. Reduction in vehicles was done while maintaining essential security components as per SPG protocol. pic.twitter.com/kuC9OfyAxN— ANI (@ANI) May 13, 2026 -
ఏ క్షణమైనా పెట్రో బాంబ్.. భారీగా పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు!
-
ఎదుటివారికి చెప్పేటందుకేనా ప్రధాని నీతులు!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికి అంతా ఊహిస్తున్న సందేశం ఇచ్చేశారు. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తర్వాత మోదీ కొన్ని చర్యలు చేపడతారని ,అవి ప్రజలపై భారం మోపేవిగా ఉండక తప్పదని భావించారు. హైదరాబాద్ లో జరిగిన భారతీయ జనతా పార్టీ బహిరంగ సభలో ఆయన పలు అంశాలు ప్రస్తావించి అసలు సమస్య కూడా చెప్పేశారు. ఆయన చెప్పినవి సూచనలుగా తీసుకుంటారా? లేక జరగబోయే పరిణామాలుగా తీసుకుంటారా అన్నది ప్రజల ఇష్టం.ఒక ఏడాదిపాటు బంగారం కొనవద్దని చెప్పడం నిజంగా సంచలనమైన సంగతే. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలని చెప్పడం అసాధారణమేమీ కాకపోయినా, భవిష్యత్తులో వీటి ధరలు పెంచుతారన్న సంకేతాలు ఇచ్చినట్లు అయ్యింది. విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని, యూరియా వాడకం నియంత్రించాలని ఇలా తొమ్మిది పాయింట్లపై ప్రజలకు సలహాలు ఇచ్చారు. విదేశీ మారక ద్రవ్యాన్ని పొదుపు చేయడం కోసం ఈ చర్యలు చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు.వీటన్నిటిని దేశ భక్తితో ముడిపెట్టడంపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. దేశం ఎదుర్కుంటున్న సమస్యలను ప్రజలకు వివరించడం తప్పు కాదు. కాని ఆయన కూడా సాధారణ రాజకీయ నేత మాదిరే వ్యవహరిస్తున్నారన్నదే బాధ. ఇంతకాలంగా ప్రధానమంత్రిగా ఉంటూ దేశ ప్రజల అభిమానం చూరగొంటున్న నేతగా ఆయన రాజనీతిజ్ఞుడుగా ఉంటే సంతోషంగా ఉంటుంది. కాని ఆలా చేయలేకపోతున్నారే అన్న భావన ఆయన అభిమానులలో ఏర్పడుతోంది.దాదాపు మూడు నెలలుగా గల్ఫ్ లో యుద్ద వాతావరణం నెలకొంది. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు, ఇరాన్ కు మద్య సాగుతున్న ఘర్షణల ప్రభావం ప్రపంచం అంతటా పడుతోంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని మూసివేయడం, ఇతరత్రా అంతర్జాయతీయ పరిణామాలు అందరిని కలవరపరుస్తున్నాయి. ఈ క్రమంలోనే కమర్షియల్ వంట గ్యాస్ ధరను అమాంతం పెంచాల్సి వచ్చింది. అప్పుడే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయని ఊహించారు.కాని శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులు ఆ ఊసు ఎత్తకుండా జాగ్రత్తపడ్డారు. కేంద్రం తరపున అధికారులు ఎప్పటికప్పుడు ఆయిల్ ధరలు పెరగవని చెబుతూ వచ్చారు. కానీ.. ఎన్నికలు పూర్తయి, ఫలితాలు వెల్లడైన వారం రోజులకే అసలు రంగు బయటపడింది. ప్రధాన మంత్రే ఆర్థిక సంక్షోభం గురించి స్వయంగా వివరించారు. సమీప భవిష్యత్తులో చమురు ధరలు పెరగవచ్చన్నది ఎక్కువ మంది అంచనాగా ఉంది.ఇక ఈ పొదుపు సూత్రాలు చెప్పడానికి ఆయన ఎంపిక చేసుకున్న వేదిక సరైనదేనా అన్న ప్రశ్న వస్తుంది. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన పార్టీ బహిరంగ సభలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. పెట్రోల్ ,డీజిల్ వాడకం తగ్గించుకోండని, ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని చెప్పారు. సొంత వాహనాలను వదలి మెట్రో,బస్ లను వాడాలని చెప్పారు. ఆక్షేపణ లేదు. ఈ సమస్య గురించి ఆయనకు ముందుగానే తెలుసు కదా! అలాంటప్పుడు ఇంత భారీ సభను నిర్వహించడం ఎంతవరకు సరి? లక్షల మందిని సమీకరించి, వారందరిని వాహనాలలో తీసుకురావడానికి ఎంత పెట్రోల్, డీజిల్ అవసరం అవుతాయో ఆయనకు తెలియదా?ప్రజలకు పొదుపు మంత్రం చెప్పి, తామేమో ఇలా జనాన్ని పోగు చేయడానికి చమురును వాడవచ్చా! రెండున్నరేళ్ల తర్వాత జరిగే తెలంగాణ శాసనసభ ఎన్నికలకోసమో, లేక హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల కోసమో ఈ సభ పెట్టినట్లు లేదా? అలాగే తెలంగాణలో ఆయన పలు శంకుస్థాపనలు ,ప్రారంభోత్సవాలు చేశారు. అది కూడా హైదరాబాద్ నుంచి రిమోట్ ద్వారానే జరిపారు. ఆ పని ఢిల్లీ నుంచి కూడా చేసి ఉండవచ్చు కదా అన్న సందేహానికి అవకాశం ఇచ్చారు. దేశంలోని ఆయా నగరాలలో ప్రజా రవాణా అంత మెరుగ్గా లేదన్న సంగతి ఆయనకు తెలుసు కదా!ముందుగా దానిని మెరుగు చేయకుండా బస్సుల్లో వెళ్లండి అంటే అది ఎలా సాధ్యం అవుతుంది. మోదీ చెప్పిన సూత్రాలలో బంగారం కొనుగోలు చేయవద్దని చాలా ముఖ్యమైన ప్రకటనగా కనిపిస్తుంది. ఇది మహిళల సెంటిమెంట్‌కు వ్యతిరేకంగా ఉండవచ్చు. ప్రత్యేకించి హిందూమతం అంటూ నిత్యం జపం చేసే బీజేపీ ఈ ప్రతిపాదన చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. దీని ప్రభావం దేశ వ్యాప్తంగా బంగారం షాపులపై ఉంటుంది. నిజంగానే ప్రజలు బంగారం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం మానివేస్తే దాని విపరిణామాలు కూడా గణనీయంగానే ఉంటాయి. కొన్నివేల గోల్డ్ షాపులు దెబ్బతింటాయి.వేలాది మంది ఉద్యోగాలకు గండం ఏర్పడుతుంది. ఇన్నేళ్లుగా ఆత్మనిర్భర్ పేరుతో కేంద్రం అమలు చేస్తున్న విధానాలు పెద్దగా ఫలించడం లేదని ఆయన చెప్పినట్లుగా ఉంది. గోల్డ్ బాండ్ల పేరుతో ప్రజల నుంచి నిధుల సేకరణ కూడా ఫలితం ఇవ్వలేదన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. విదేశీ వస్తువుల వినియోగం తగ్గించాలని అన్నారు. బాగానే ఉంది. కాని తమ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అమరావతి పేరుతో ఎన్నివేల కోట్ల అప్పు చేస్తున్నది మోదీకి తెలియదా? అక్కడ నిర్మాణాల కోసం ఈ మధ్య కొన్ని కోట్ల లీటర్ల డీజిల్ ను మళ్లించే యత్నం చేయడంపై కేంద్రం అభ్యంతరం చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవసరమైన నిర్మాణాలు చేపట్టి, పొదుపుగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెప్పి ఉంటే బాగుండేది కదా!హైదరాబాద్‌లో స్వయంగా చంద్రబాబు ఇంటికి ప్రధాని వెళ్లారు కదా! ఆ సందర్భంగా ఏపీలో జరుగుతున్న దుబారా గురించి కూడా సలహా ఇచ్చి ఉంటే బాగుండేదేమో! చదరపు అడుగుకు రూ.18 వేల వరకు ఖర్చు పెడుతున్న ప్రభుత్వంగా ఏపీ రికార్డు సాధిస్తోంది.ఈ నిర్మాణాలలో ఎన్ని రకాల సరుకులను విదేశాల నుంచి తెప్పిస్తోందో తెలియదు. ఒక్క అద్దాలకే రూ.2540 కోట్లు వెచ్చించబోతున్నారే. అవన్ని ఇండియాలో తయారయ్యేవా? లేక దిగుమతి చేసుకోవల్సి ఉంటుందా? వంట నూనెలు తగ్గించుకోవాలని కూడా మోడీ సలహా ఇచ్చారు.ఇన్నేళ్ల పాలనలో వంట నూనెల విషయంలో కూడా దేశం స్వయం సమృద్ధి సాధించలేకపోవడం అవమానమే. రైతులు యూరియా వాడకం తగ్గించాలని అన్నారు. ఉక్రెయిన్,రష్యా యుద్దం మూడేళ్లుగా జరుగుతోంది. త్వరలో ముగుస్తుందని చెబుతున్నారు. ఈ దశలో యూరియా గురించి మోడీ జాగ్రత్తలు చెబుతున్నారు. సేంద్రీయ ఎరువులు, ప్రత్యామ్నాయ ఎరువులు అందుబాటులో ఉంటే రైతులు తప్పనిసరిగా మార్చుతారు. అది చేయకుండా యూరియా వాడవద్దంటే, పంటలు సరిగా పండకపోతే రైతులకు కలిగే నష్టాన్ని ఎవరు భరిస్తారు? ప్రజలు విదేశీ పర్యటనలను తగ్గించుకోవాలని ప్రధాని సలహా ఇచ్చారు. ఇదేదో ఏపీ ప్రభుత్వానికి ఇచ్చి ఉండాల్సింది. ఈ మధ్య కాలంలో చిత్రమైన శిక్షణల పేరుతో మంత్రులు, అధికారులను బృందాలుగా సింగపూర్ పంపుతున్నారు. దీనివల్ల ఏపీకి కలిసి వచ్చేది ఏమి ఉందో ఎవరికి తెలియడం లేదు.ప్రభుత్వ ఖజానా పై కోట్ల భారం పడుతోంది.వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ మీటింగుల గురించి కూడా ప్రధాని సూచన చేశారు. ఇప్పటికే అలాంటివి జరుగుతున్నాయి. కాని వాటివల్ల కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. మామూలు రోజుల్లో ప్రధాని ప్రజలకు ఇలాంటి సలహాలు ఇచ్చి ఉంటే తప్పక చిత్తశుద్ది అర్ధం అవుతుంది.కాని ఎన్నికల సమయంలో ఒక రకంగా ,ఆ తర్వాత మరో రకంగా వ్యవహరిస్తుండడమే విమర్శలకు దారి తీస్తుంది.గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు డాలర్‌తో రూపాయి విలువను పోల్చి విమర్శలు చేసిన మోడీ, అప్పటికన్నా విలువ దాదాపు రెండు రెట్లు తగ్గినా ఇంతవరకు మాట్లాడలేదు.ప్రధాని చెప్పిన నవ సూత్రాలపై లోక్ సభ లో విపక్ష నేత రాహోల్ గాంధీ ధ్వజమెత్తారు. ఇది మోదీ ప్రభుత్వ వైఫల్యం అని, ప్రధాని అయిన 12 ఏళ్లకు ఈ స్థితికి దేశాన్ని దిగజార్చారని వ్యాఖ్యానించారు. ఎప్పుడో 1965లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్నప్పుడు పాక్ యుద్దం, కరువు పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలు వారానికి ఒక పూట ఉపవాసం చేయాలని విజ్ఞప్తి చేశారు. దానిని ఆయన తొలుత తన కుటుంబం నుంచే ఆచరించి చూపారు.తద్వారా దేశభక్తి అంటే ఏమిటో తెలియచేశారు. అలాగే ముందుగా మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ నేతలు దేశభక్తిని నిజమైన రీతిలో ఆచరించి,అప్పుడు ప్రజలకు చెబితే ఆదర్శవంతంగా ఉంటుంది కదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వాహన, వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్‌షాక్?
సాక్షి,న్యూఢిల్లీ: వంటగ్యాస్, పెట్రోల్,డీజిల్ వినియోగదారులకు బిగ్‌షాక్ తగలనుంది. వచ్చే వారంలో కేంద్రం లీటర్ పెట్రోల్‌కు రూ.2 నుంచి రూ.4వరకు.. వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.40 నుంచి రూ.50వరకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇరాన్-అమెరికా యుద్ధంలో ఆయిల్ కంపెనీలకు లక్ష కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. అయితే, పెట్రోల్,డీజిల్ ధరలు పెంచకపోతే ఆ భారం భరించలేమని కంపెనీలు చెబుతున్నాయి. ఒక్కసారిగా రేట్లు పెంచితే ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని కేంద్రం ఆందోళనలో ఉంది.ఈ క్రమంలో దశలవారీగా పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలను పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. హర్మూజ్‌ను మూసివేయడంతో భారత్‌కు ముడిచమురు సరఫరా నిలిచిపోయింది. దీంతో కంపెనీలు రష్యా,పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి ఎక్కువ రేట్లకు ముడిచమురును కొనుగోలు చేస్తున్నాయి. -
పెట్రోల్.. డీజిల్.. బంగారంపై మోదీ వ్యాఖ్యల వెనుక అసలు కారణం ఇదే..
-
అప్పటి వరకు బంగారం కొనుగోలు చేయొద్దు : ప్రధాని మోదీ
సాక్షి,హైదరాబాద్: బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా బంగారం అత్యంత ఖరీదైందిగా మారింది. అందుకే ప్రజలు ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయకపోవడం మంచిదన్నారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభకు మోదీ హాజరయ్యారు.ఈ సభలో మోదీ మాట్లాడుతూ.. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడింది. దీంతో పెట్రోల్, డిజీల్ ధరలు తీవ్రంగా పెరిగాయి.గ్యాస్,యూరియా ధరలు అమాంతం పెరిగినప్పటికీ ప్రజలపై భారం పడకూడదనే ఉద్దేశంతో ధరలు పెంచడం లేదు. "ప్రస్తుత కష్ట సమయాల్లో ప్రజలంతా సంయమనం పాటించాలి. విదేశీ ప్రయాణాలు, దుబారా ఖర్చులు పూర్తిగా తగ్గించుకోవాలి. పెట్రోల్, డీజిల్‌ను పరిమితంగా వినియోగించాలి. ప్రజా రవాణానే అధికంగా వాడాలి" అని మోదీ అన్నారు.ప్రజలంతా ఎలక్టిక్ వాహనాల వైపు మళ్లాలని, వాటినే వినియోగించాలని కోరారు. ప్రస్తుతం ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని ఉక్రెయిన్- రష్యా యుద్ధం, పశ్చిమాసియా యుద్ధాలతో సరఫరా చైన్ దెబ్బతింది అని మోదీ అన్నారు. ఆ నష్టాన్ని కేంద్రమే భరిస్తోందని తెలిపారు. వంట నూనెలు ఎరువుల మందులను పూర్తిగా తగ్గించాలని పురుగుల మందులు, ఎరువుల వినియోగాన్ని తక్కువ చేయాలని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
ఇంధన మంట షురూ!
కొంతకాలంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు ఇకపై పెరిగే అవకాశం కనిపిస్తోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి వద్ద ఏర్పడిన అంతరాయాల కారణంగా ముడి చమురు ధర ఇటీవల బ్యారెల్‌కు 70 డాలర్ల నుంచి 110 డాలర్లకుపైగా పెరిగింది. ఈ నేపథ్యంలో మే 15 లోపు చమురు కంపెనీలు ధరల పెంపునకు మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ప్రపంచం అతలాకుతలం.. భారత్ పరిస్థితి ఏంటి?ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా కలిగిన హార్మూజ్ జలసంధిలో వారాల తరబడి నెలకొన్న అంతరాయం గ్లోబల్ ఎనర్జీ షాక్‌కు దారితీసింది. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ ఇంధన రేషనింగ్‌ను ప్రవేశపెట్టగా, శ్రీలంక, పాకిస్థాన్ పనిదినాలను తగ్గించి ఇంధనాన్ని ఆదా చేసే ప్రయత్నం చేస్తున్నాయి. దక్షిణ కొరియా దశాబ్దాల తర్వాత ధరలపై పరిమితులు విధించింది. అయితే, భారత్ మాత్రం ఇప్పటివరకు ఎక్కడా కొరత లేకుండా పరిస్థితిని అదుపు చేయగలిగింది.చమురు కంపెనీల నష్టాలుప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ధరలు పెరగకపోవడంతో ఇవి నెలకు సుమారు రూ.30,000 కోట్ల మేర నష్టాన్ని భరిస్తున్నాయి. ముడి చమురు ధరలు గరిష్ట స్థాయికి చేరినప్పుడు ప్రభుత్వం, ఈ సంస్థలు కలిసి పెట్రోల్‌పై రూ.24, డీజిల్‌పై రూ.30 భారాన్ని వినియోగదారులపై పడకుండా తామే భరించాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటికీ అంతర్జాతీయ ఒత్తిడి దృష్ట్యా ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. సంక్షోభాన్ని తట్టుకొని..ఇలాంటి పరిస్థితుల్లోనూ భారత్ ఇంధన భద్రతను కాపాడుకోగలగడానికి కారణం ప్రభుత్వ వ్యూహాత్మక చర్యలే.దేశీయగా ఎల్పీజీ ఉత్పత్తిని రోజుకు 36,000 టన్నుల నుంచి 54,000 టన్నులకు యుద్ధ ప్రాతిపదికన పెంచారు.రష్యా, యూఎస్, పశ్చిమ ఆఫ్రికా వంటి దేశాల నుంచి దిగుమతులు పెంచి సరఫరాను స్థిరీకరించారు. ముడి చమురు సోర్సింగ్(మన దేశానికి ఎగుమతులు చేసేవి) దేశాల సంఖ్య 27 నుంచి 40కి పెరిగింది.గత దశాబ్ద కాలంలో ఎల్పీజీ టెర్మినల్స్ రెట్టింపు అవ్వడం, ఇథనాల్ మిశ్రమం 1.5% నుంచి 20%కి పెరగడం భారత్‌కు రక్షణ కవచంగా నిలిచింది.దేశీయ రిఫైనరీలు ప్రస్తుతం 100% మించిన సామర్థ్యంతో పనిచేస్తూ నిరంతరాయంగా ఇంధనాన్ని అందిస్తున్నాయి.అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిన ప్రతిసారీ సామాన్యుడిపై భారం పడకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. అయితే చమురు కంపెనీల ఆర్థిక స్థిరత్వం దెబ్బతినకుండా ఉండాలంటే రాబోయే వారం రోజుల్లో ధరల సర్దుబాటు తప్పకపోవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొంటే తప్ప చమురు సెగ తగ్గేలా లేదు.ఇదీ చదవండి: భయం వద్దు.. నైపుణ్యమే హద్దు -
ఇండియాతో పోలిక.. పాకిస్తాన్ పరువు తీసిన కియోసాకి
ఇరాన్ యుద్ధ మేఘాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతుంటే, పొరుగు దేశాలైన భారత్, పాకిస్తాన్ల మధ్య ఉన్న ఆర్థిక వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఇంధన సంక్షోభంపై సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర విశ్లేషణ చేశారు. భారత్ తన దూరదృష్టితో సంక్షోభాన్ని తట్టుకుంటుంటే, పాకిస్తాన్ అబద్ధపు ప్రచారాలతో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిందని ఆయన ఎత్తిచూపారు.పాక్ వద్ద ఒక్క రోజు నిల్వలు కూడా లేవు!పాకిస్తాన్ పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను కియోసాకి తన ఫేస్బుక్ పోస్ట్‌లో ప్రస్తావించారు. ఇస్లామాబాద్ వద్ద కనీసం ఒక్క రోజుకు సరిపడా ‘వ్యూహాత్మక చమురు నిల్వలు’ కూడా లేవని మాలిక్ అంగీకరించారు.కియోసాకి ఏమన్నారంటే‘న్యూఢిల్లీ తన అత్యవసర నిల్వలను పెంచుకోవడంలో నిమగ్నమైతే, ఇస్లామాబాద్ మాత్రం తమ చమురు సరఫరా సురక్షితంగా ఉందని ప్రపంచాన్ని నమ్మించే పనిలో ఉంది. కానీ వాస్తవం వేరు. భారత్‌లో పెట్రోల్ ధరలు స్థిరంగా ఉంటే, పాకిస్తాన్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి’పాక్‌లో భగ్గుమంటున్న ధరలుఏప్రిల్ ప్రారంభం నుండి పాకిస్తాన్లో ఇంధన ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్ లీటరుకు రూ.321 నుండి ఏకంగా రూ.458కి (43% పెరుగుదల) చేరింది. డీజిల్ లీటరుకు రూ.335 నుండి రూ.520కి (55% పెరుగుదల) పెరిగింది. ఈ అస్థిరత వల్ల దేశంలో సరఫరా గొలుసు విచ్ఛిన్నమై, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు దీనిని ‘జాతీయ అత్యవసర పరిస్థితి’గా అభివర్ణిస్తున్నాయి.భారత్ విజయం వెనుక రహస్యం..భారత్ ఈ స్థాయి సంక్షోభాన్ని ఎలా తట్టుకోగలుగుతుందో వివరిస్తూ కియోసాకి కీలక విషయాలు వెల్లడించారు. భారత్ నిర్మించున్న వ్యూహాత్మక నిల్వలు 60 నుండి 70 రోజులకు సరిపోతాయి. ప్రభుత్వం కేవలం ‘ఒక సంతకం’తో ఈ అత్యవసర చమురును విడుదల చేసి మార్కెట్‌ను స్థిరీకరించగలదు.భారత్ కేవలం గల్ఫ్ దేశాలపైనే కాకుండా రష్యా, వెనిజులా వంటి దేశాల నుండి చమురు దిగుమతులను పెంచుకుని తన నెట్‌వర్క్‌ను విస్తరించింది. ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద చమురు శుద్ధి దేశంగా ఉన్న భారత్, ఎగుమతి సుంకాలను సర్దుబాటు చేస్తూ దేశీయ ధరలు పెరగకుండా అడ్డుకోగలిగింది.పాక్ మంత్రి నిస్సహాయతపాకిస్తాన్ పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ కూడా భారత్ సన్నద్ధతను ప్రశంసించక తప్పలేదు. "భారత్ వద్ద 600 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉండటమే కాకుండా, వారు ఐఎంఎఫ్ (IMF) కఠిన నిబంధనల కింద లేరు. అందుకే వారు పన్నులు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించగలుగుతున్నారు. కానీ మేము ప్రతి పైసా కోసం ఐఎంఎఫ్ అనుమతి తీసుకోవాల్సి వస్తోంది" అని ఆయన వాపోయారు.యుద్ధం ఈ ఆర్థిక అంతరాన్ని సృష్టించలేదని, కేవలం ఇరు దేశాల మధ్య ఉన్న సన్నద్ధత లోపాన్ని బయటపెట్టిందని కియోసాకి విశ్లేషించారు. హోర్ముజ్ జలసంధి మూతపడితే, దిగుమతులపైనే ఆధారపడ్డ పాకిస్తాన్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. -
వచ్చే వారం పెరగనున్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు.. ఎంతంటే?
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా వాహనదారులకు, వంట గ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ తగలనుంది. ఇరాన్‌పై అమెరికా మధ్య యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం నేపథ్యంలో భారతీయ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ ఎల్పీజీ ధరలను పెంచే దిశగా కసరత్తు చేస్తున్నాయి.జాతీయ కథనాల ప్రకారం, వచ్చే వారంలోనే ధరల పెంపు జరిగే అవకాశం ఉంది. గృహ వినియోగ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌పై రూ.50 వరకు పెరుగవచ్చని, పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.5 వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం.ఇప్పటివరకు ఎన్నికల నేపథ్యంలో ధరల పెంపుపై సంయమనంతో ఉన్న ఆయిల్ కంపెనీలు, ఇప్పుడు వారాంతంలో ధరలను పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం సాధారణ ప్రజలపై నేరుగా ప్రభావం చూపనుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
పెట్రోల్, డీజిల్ సమస్య మన వల్ల రాలేదని చెప్పండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సంక్షోభానికి ప్రభుత్వమే కారణమన్న వాస్తవం ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో ప్రభుత్వం దాన్నుంచి తప్పించుకొనేందుకు మల్లగుల్లాలు పడుతోంది. రాజధాని కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయలు మేలు చేసేలా చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల కారణంగానే దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత వచ్చిందన్న విషయం కేంద్ర ప్రభుత్వ లేఖలతో బయటపడింది. వారం రోజులుగా రాష్ట్ర ప్రజలను అతలాకుతలం చేస్తున్న పెట్రోల్ డీజిల్ కొరత వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని ఊరూవాడా తెలిసిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. దీంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రులతో చంద్రబాబు ఎప్పటి మాదిరిగానే రాజకీయ అంశాలపై మాట్లాడారు.ఈ సందర్భంగా ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత పెద్ద అంశంగా మారిందని, ఉన్నట్టుండి ఈ సమస్య రావడానికి ప్రభుత్వమే కారణమనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లిందని పలువురు మంత్రులు ప్రస్తావించినట్లు సమాచారం. రాజధాని పనులు చేసే కాంట్రాక్టర్లకు రిటైల్ ధరలో బల్‌్కగా ఆయిల్ సరఫరా చేయాలని కంపెనీలను ఒత్తిడి చేయడం ద్వారా ప్రభుత్వమే ఈ సమస్య సృష్టించిందని ప్రజల్లో విస్తృతంగా జరుగుతున్న చర్చను కొంతవరకైనా నివారించాలంటే మంత్రులు మాట్లాడాలని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. పెట్రోల్, డీజిల్ సమస్య ప్రభుత్వం వల్ల రాలేదని చెప్పాలని మంత్రులకు సూచించినట్లు సమాచారం. ఆయిల్ కంపెనీల వల్లే ఈ సమస్య వచ్చిందని, ఇందులో ప్రభుత్వం తప్పు లేదని విస్తృతంగా ప్రచారం చేయాలని కోరినట్లు తెలిసింది.ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయిల్ కొరత ఉందని బలంగా ప్రచారం చేయాలని, అప్పుడే ప్రజలు కొంత శాంతిస్తారని చెప్పినట్లు సమాచారం. రాజధాని పనులకు అవసరమైన ఆయిల్ సరఫరా చేయాలని కేంద్రానికి రాసిన లేఖలు, అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలు, ఆయిల్ కంపెనీలకు ప్రభుత్వం రాసిన లేఖల వివరాలు బయటకు ఎలా వెళ్లాయనే అంశంపైనా చర్చ జరిగింది. ఈ వివరాలన్నీ బయటకు వెళ్లడం వల్ల ఇబ్బంది వచ్చిందని, ఇలాంటి సమాచారం బయటకు వెళ్లకుండా చూడాలని చంద్రబాబు ఉన్నతాధికారులకు చెప్పినట్లు సమాచారం.9 మంది మంత్రులు ఒకేసారి సింగపూర్ పర్యటనకు వెళ్లడం, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు, రాజధాని నిర్మాణాలకు అంచనాలకు మించి భారీ రేట్లతో పనులు చేస్తున్న అంశాలపై మంత్రులు స్పందించాలని చెప్పినట్లు తెలిసింది. ఎంత చెప్పినా కొందరు మంత్రులు ఇలాంటి విషయాలపై మాట్లాడటంలేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ తమ వల్లే వచ్చిందని వైఎస్సార్సీపీ చెబుతోందని, దాని క్రెడిట్ మొత్తం టీడీపీకే దక్కేలా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి చెప్పాలని చంద్రబాబు మంత్రులకు సూచించారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులే నిజమైన విజేతలు: సీఎంటీమ్ ఏపీ పనితీరు వల్లే తనకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్–2025 అవార్డు వచ్చిందని, మంత్రులు, అధికారులు, ఉద్యోగులే నిజమైన విజేతలని సీఎం చంద్రబాబు అన్నారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చిన సందర్భంగా చంద్రబాబు గురువారం మంత్రులు, సీఎస్, డీజీపీ, సెక్రటరీలు, హెచ్వోడీలకు ఆత్మీయ విందు ఇచ్చారు. వివిధ శాఖల్లో మంచి పనితీరు కనబరిచిన జిల్లా, మండల స్థాయి ఉద్యోగులను కూడా విందుకు ఆహ్వానించారు. తొలుత మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమావేశమై రానున్న రోజుల్లో ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, చేరుకోవాల్సిన లక్ష్యాలు, అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై చర్చించారు. -
పెట్రోల్, డీజిల్.. తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ఆయిల్ సంస్థలకు తెలంగాణ సివిల్ సప్లయ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. పెట్రోల్, డీజిల్ సరఫరాను తక్షణమే 15 శాతం పెంచాలని ఆదేశించింది. బంకుల్లో నోస్టాక్ బోర్డులు పెట్టకూడదని.. బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. డీజిల్ సరఫరా 190 శాతం పెరిగిందని.. 21,295 కిలో లీటర్లు పంపిణి చేసినట్లు తెలిపారు.పెట్రోల్ సరఫరా 118 పెంచామని తెలిపారు. మొత్తం ఫ్యూయల్ సరఫరా 158 శాతం పెరిగిందన్న స్టీఫెన్ రవీంద్ర.. బ్లాక్ మార్కెటింగ్‌పై ప్రత్యేక దాడులు చేస్తున్నామన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని.. ఇతర రాష్ట్ర వాహనాలపై నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. -
పెట్రోల్ ధరల పెంపు?: క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.10, రూ.12.50 పెరిగినట్లు ఒక వార్త నెట్టింట్లో తెగ వైరల్ అయింది. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పదించింది.పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ (MoPNG) పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వు జారీ చేయలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ స్పష్టం చేసింది. ''ఇంధన ధరల పెంపునకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఉత్తర్వు నకిలీది. భారత ప్రభుత్వం అటువంటి ఉత్తర్వు ఏదీ జారీ చేయలేదు" అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ 'X' లోని ఒక పోస్ట్‌లో పేర్కొంది.పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఇంధన కొరత ఉన్న సమయంలో.. ఫ్యూయెల్ ధరల పెరుగుదల వార్త, ప్రజల్లో ఆందోళన కలిగించింది. అంతే కాకుండా పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు జరుగుతున్న సమయంలో.. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నిజమే అని చాలామంది భావించారు. అయితే ధరల పెరుగుదల నిజం కాదని, పీఐబీ అధికారికంగా వెల్లడించింది.🚨FAKE NEWS!An order circulating on social media claims to be issued by the Ministry of Petroleum and Natural Gas, stating that petrol and diesel prices have been increased by ₹10 and ₹12.50, respectively.#PIBFactCheck:❌ This order is #FAKE .✅ The Government of India… pic.twitter.com/tMmJa0Y4qA— PIB Fact Check (@PIBFactCheck) April 29, 2026కాగా.. మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతానికి యథాతథంగా ఉంటాయని తెలిపారు. నిత్యావసర ఇంధనాలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, ఆమె వినియోగదారులకు హామీ ఇచ్చారు. ఎల్పీజీ, పెట్రోలియం, డీజిల్ తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయి, ధరలు కూడా పెరగలేదు. కాబట్టి దయచేసి ఆందోళన చెందవద్దని శర్మ అన్నారు. -
ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం కృత్రిమ కొరతేనా ?
-
పెట్రోల్ ధర రూ.10, డీజిల్ ధర రూ.12.50 పెరిగిందా?
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిందనే కథనాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, ఆ కథనాల్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఖండించింది. దేశంలో ఇంధన ధరలు పెరగలేదని, స్థిరంగా ఉన్నట్లు పేర్కొంది.కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ పెట్రోల్ ధరలను రూ.10, డీజిల్ ధరలను రూ.12.50 పెంచినట్లు సోషల్ మీడియా పోస్టులు వైరల్‌గా మారాయి. ఇంధన ధరల పెంపుపై వస్తున్న వదంతులను భారత ప్రభుత్వం బుధవారం ఖండించింది. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన అధికారిక ఉత్తర్వు అంటూ ప్రచారంలో ఉన్న ఓ పత్రాన్ని ట్వీట్లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో షేర్ చేసింది. ఆ పత్రం ‘నకిలీ’దని ప్రకటించింది. వదంతులను నమ్మొద్దని కోరింది. ఇంధన ధరలు పెరిగాయంటూ సర్క్యూలేట్ అవుతున్న పత్రాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ చెక్ చేసింది. అది ఫేక్ న్యూస్ అని తేల్చింది. భారత ప్రభుత్వం అటువంటి ఉత్తర్వులేవీ జారీ చేయలేదు’అని పేర్కొంది.🚨FAKE NEWS!An order circulating on social media claims to be issued by the Ministry of Petroleum and Natural Gas, stating that petrol and diesel prices have been increased by ₹10 and ₹12.50, respectively.#PIBFactCheck:❌ This order is #FAKE .✅ The Government of India… pic.twitter.com/tMmJa0Y4qA— PIB Fact Check (@PIBFactCheck) April 29, 2026 -
వట్టిమాటలు కట్టి‘పెట్రో’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ సంక్షోభం తీవ్రమైంది. వారం రోజులుగా ఈ సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. సంక్షోభాన్ని నివారించడంలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైంది. పైగా కృత్రిమ కొరతకు కారణమైంది. పర్యవసానంగా రాష్ట్రంలో ఏ బంకు వద్ద చూసినా నో స్టాక్ బోర్డులే దర్శమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంఓ చంద్రబాబు సర్కార్‌ను మొద్దు నిద్ర నుంచి మేల్కొపేందుకు వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద నిరసనలకు పిలుపు నిచి్చంది. మంగళవారం వైఎస్సార్సీపీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలతో పాటు ప్రజలు భాగస్వాములు కావటం విశేషం. దీంతో నిరసన కార్యక్రమం దిగి్వజయమైంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సర్కార్ వైఫల్యాన్ని నేతలు ఎండగట్టారు. ‘ఏపీలో మద్యం పుల్ .. డీజిల్ పెట్రోల్ నిల్, పెట్రోల్, డీజిల్ వెంటనే సరఫరా చేయాలి, దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా సంక్షోభం లేదు.. ఇక్కడే ఎందుకు? ఇది పూర్తిగా ప్రభుత్వ అసమర్థత ప్రభుత్వం, ఇంధనం అవసరమైనంత అందుబాటులో ఉండేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి’ అంటూ రాసిన ప్లకార్డులు వైఎస్సార్సీపీ నాయకులు చేతపట్టుకొని బంకుల వద్ద నిరసన తెలిపారు.పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కూటమి ప్రభుత్వం మాత్రం మాటలతో కాలయాపన చేస్తోందని వారు విమర్శించారు. వారం రోజులుగా తీవ్ర సమస్య ఉన్నా.. బాబు సర్కారు పబ్లిసిటీ డ్రామాలు ఆడడం ఏమిటని నిలదీశారు. మొన్న యూరియా .. నిన్న గ్యాస్ .. నేడు ఇంధన కొరత! ఇలా ఈ ప్రభుత్వంలో ప్రజలకు నిత్యం నరకం కనపడుతోందని దుయ్యబట్టారు. ఈ ఇంధన సంక్షోభం బాబు సృష్టించిందేనని విమర్శించారు. విజయవాడ కేంద్రంలో వైఎస్సార్సీపీ నేతలు ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. బాబు పబ్లిసిటీ స్టంట్లు ఆపి.. వట్టిమాటలు కట్టిపెట్టి ఇంధన సంక్షోభాన్ని నివారించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా..⇒ ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ⇒ గుంటూరులో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం, యువజన విభాగం నాయకులు సైకిల్ తొక్కుతూ నిరసన తెలిపారు. ⇒ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నాయకులు నిరసన తెలిపారు. ⇒ కోనసీమజిల్లా కొత్తపేటలో డీజిలు లేక ఆగిపోయిన రైతు ట్రాక్టరుకు పగ్గం కట్టి బంకు వద్దకు తీసుకువచ్చి వినూత్న నిరసన తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ నేతలు నిరసన గళమెత్తారు. కొన్ని ప్రాంతాల్లో మోటార్‌సైకిళ్లతో నిరసన తెలిపారు. రాజోలులో ట్రక్కు ఆటోను తాళ్లతో లాగి నిరసన తెలిపారు. ⇒ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ నాయకులు సర్కారు తీరుపై నిరసన తెలిపారు. రాజమండ్రిలో పెట్రోల్ బంక్ వద్ద ఖాళీ డీజిల్ డబ్బాలతో నిరసన తెలిపారు. కాకినాడ జిల్లాలోనూ బంకుల వద్ద ఆందోళన కార్యక్రమాలు సాగాయి. ⇒ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నాయకులు పెట్రోల్ బంకులను సందర్శించి సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ⇒ విశాఖ జగదాంబ జంక్షన్లో ఆటోలకు తాడు కట్టి లాగుతూ తమ నిరసన తెలియజేసి, క్యూలో ఉన్న వినియోగదారులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అన్ని నియోజకవర్గాల్లోనూ నాయకులు గళమెత్తారు.⇒ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖాళీ డీజిల్ డ్రమ్ములతో నిరసన తెలిపారు. ⇒ తిరుపతిలో ఎద్దుల బండిపై ఆటోను ఎక్కించి ర్యాలీ నిర్వహించి వైఎస్సార్సీపీ నేతలు నిరసన తెలిపారు. -
‘దేశంలో ఎక్కడా లేని కొరత ఏపీలోనే ఎందుకు?’
ఢిల్లీ: ఢిల్లీ: ఏపీలో పెట్రోల్,డీజిల్ సంక్షోభానికి సంబంధించి కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్‌ను వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి కలిశారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో పెట్రో కొరత వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని నీరజ్ మిట్టల్ దృష్టికి తీసుకెళ్లారు అవినాష్‌రెడ్డి. ఏపీలోని పరిస్థితులను చక్కదిద్ది అవసరమైన పెట్రోల్, డీజిల్, ఎల్పీజీని అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారుఅనంతరం అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ పెట్రోల్, డిజిల్ కొరత దేశంలో ఎక్కడా కొరత లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మరి ఏపీలో ఎందుకు కొరత ఏర్పడింది?, డిమాండ్‌కు, సప్లైకి మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది. పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టాయి. 70 శాతం పెట్రోల్ బంకులు కొరత వల్ల పనిచేయడం లేదు. పెట్రోలు 200 రూపాయలకు మించి బైక్‌లకు పోయడం లేదు. పొరుగు రాష్ట్రంలో ఇలాంటి కొరత ఎక్కడా లేదు. వ్యవసాయ రంగం ఆక్వాకల్చర్ ట్రాన్స్పోర్ట్ తదితర రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రజల రోజువారి పనుల పైన తీవ్రమైన అంతరాయం కలిగిస్తుంది. ప్రజల కష్టాలు తీర్చాల్సిన రాష్ట్ర ప్రభుత్వం హోర్డర్స్ తో కుమ్మక్కయింది. పలు ఆయిల్ కంపెనీలు కూడా సప్లైని తగ్గించాయి. కమర్షియల్ ఎల్పీజీ రేట్లు పెంచినా, బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోంది. ఏపీలోని పరిస్థితులను చక్కదిద్ది అవసరమైన పెట్రోల్ డీజిల్ ఎల్పీజీని అందుబాటులోకి తేవాలి. హోర్డింగు, బ్లాక్ మార్కెటింగ్, ఉద్దేశపూర్వక తగ్గింపు తదితర అంశాలపై దృష్టి పెట్టాలి’ అని అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. -
చంద్రబాబు కాదు.. చేతకాని బాబు బాబుపై మహిళల ఉగ్రరూపం
-
బాబుకి బుద్ధి రావాలి... రేపు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంక్ వద్ద YSRCP భారీ నిరసన
-
చేతకాని దద్దమ్మలు, నారా లోకేష్ ఎక్కడికో పారిపోయాడు
-
నకిలీ విజనరీ నిర్లక్ష్యం.. ఏపీలో ఇంధన కష్టాలు
-
బాబు క్యూ విజన్.. నలిగిపోతున్న ఏపీ ప్రజలు
-
ఏపీ, తెలంగాణలో ముదురుతున్న ఇంధన సంక్షోభం... బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు
-
ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభంపై వైఎస్ జగన్ ఆగ్రహం
తాడేపల్లి: ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం వచ్చిందంటే అది కూటమి ప్రభుత్వం సృష్టించిన కొరతే అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని కొరత సృష్టించి వ్యాపారులకు దోచి పెట్టడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయిందంటూ ధ్వజమెత్తారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా అనుకూలంగా మార్చుకుని దోచుకునే మార్గాలను వెతుక్కోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ మండిపడ్డారు. చంద్రబాబు చేతగాని పాలనకు నిదర్శనం అంటూ పెట్రోలు బంకుల దగ్గర వాహనదారుల ఇక్కట్ల వీడియోలను ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. విత్తనాలు దగ్గర నుంచి వంట గ్యాస్ వరకూ ఇదే పరిస్థితి‘విత్తనాలు, ఎరువులు, యూరియా మొదలు, వంట గ్యాస్ వరకు మన రాష్ట్రంలో అదే జరిగింది. తాజాగా ఆ జాబితాలో పెట్రోల్, డీజిల్ చేరింది. కృత్రిమ కొరత సృష్టించి, దాని ద్వారా దోచుకునే పర్వానికి కూటమి నాయకులు సిద్ధమయ్యారు. నిజానికి పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటక, తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు. సరఫరాలో సంక్షోభం లేదు. కానీ, ఇక్కడ డీలర్లు, కూటమి నాయకులు కుమ్మక్కవడంతో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే, ధరలు పెంచుతారని భావిస్తున్న డీలర్లు పెట్రోల్, డీజిల్ బ్లాక్ చేస్తున్నారు. వారితో కూటమి నాయకులు జత కట్టారు. అంతా కలిసి దోపిడీకి సిద్ధమయ్యారు. అయినా నిజం ఒప్పుకోకుండా, సరఫరా మరింత తగ్గుతుందన్న భయంతో వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తున్నందువల్ల డిమాండ్ పెరిగి, కొరత ఏర్పడిందని కుంటి సాకులు చెబుతున్నారు. వాస్తవం మీకు కూడా తెలుసు..వాస్తవం ఏమిటన్నది మీక్కూడా తెలుసు. అందుకే పెట్రోల్, డీజిల్ సంక్షోభంపై సమగ్రమైన రివ్యూ కూడా చేయకుండా, కేవలం లీకులతో సరి పెడుతున్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ఉద్దేశపూర్వక కొరత వల్ల అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఈ కృత్రిమ కొరత రైతులను కూడా తీవ్ర నష్టాలకు గురి చేస్తోంది. ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలకు తగిన డీజిల్ అందక కార్యకలాపాలు నిల్చిపోతున్నాయి. రబీ పంటల కోత కాలంలో ఈ సంక్షోభం మరింత తీవ్రమైంది. కోత యంత్రాలకు రోజుకు సుమారు 100 నుంచి 160 లీటర్ల డీజిల్ అవసరం ఉండగా, సరఫరా లేకపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోతున్నాయి. చేపలు మరియు రొయ్యల పెంపకంలో ఉపయోగించే ఏరిఏటర్లు కూడా డీజిల్‌పై ఆధారపడటంతో, ఆక్వా రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దకపోతే ప్రజలు మీకు తగిన గుణపాఠం చెబుతారు’ అని హెచ్చరించారు..@ncbn గారూ, ఎక్కడ ఏ సమస్య వచ్చినా అనుకూలంగా మార్చుకుని దోచుకునే మార్గాలను వెతుక్కోవడం మీకు వెన్నతో పెట్టిన విద్య. లేని కొరత సృష్టించి వ్యాపారులకు సహకరిస్తూ మీరు లాభపడడం అలవాటుగా మారింది. విత్తనాలు, ఎరువులు, యూరియా మొదలు, వంట గ్యాస్ వరకు మన రాష్ట్రంలో అదే జరిగింది.తాజాగా ఆ… pic.twitter.com/xLLCXcFuHr— YS Jagan Mohan Reddy (@ysjagan) April 27, 2026 -
ఏపీలో పెట్రో కొరతపై కేంద్రానికి ఎంపీ గురుమూర్తి లేఖ
ఢిల్లీ: ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభాన్ని నివారించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి కోరారు. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. ‘ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ రాష్ట్రంలో 4510 పెట్రోల్ బంకుల్లో 70 శాతం నో స్టాక్ బోర్డులు వెలిశాయి. వాహనదారులకు పెట్రోల్, డీజిల్ రేషన్ విధిస్తున్నారు. కానీ పెట్రోలియం శాఖ దేశ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ సప్లై కి ఎలాంటి అవరోధాలు లేవని చెప్తుంది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ నుంచి ఎలాంటి డిమాండ్ లేదని ప్రభుత్వం చెప్తుంది. క్షేత్రస్థాయికి , ప్రభుత్వ లెక్కలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ప్రజలు ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం చర్యలు శూన్యం. పెట్రోల్ డీజిల్ కొరత ఫలితంగా వ్యాపారులు రైతులు పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని కొరతకు గల కారణాలను దర్యాప్తు చేయాలి. బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ తదితర అంశాలపై దృష్టి సారించాలి. ఏపీ అవసరాలకు తగిన పెట్రోల్ డీజిల్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. -
పెట్రోల్ బంక్ డీలర్లతో బాబు కుమ్మక్కు..! బ్లాక్ అమ్మకాలు..!
-
ఏపీకి కూటమి శాపం.. ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఇక్కడేందుకు? (ఫొటోలు)
-
ఏపీలో తీవ్రంగా పెట్రోల్, డీజిల్ సంక్షోభం.. అంగీకరించిన చంద్రబాబు
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ సంక్షోభం తీవ్రంగా వేధిస్తున్న విషయాన్ని సీఎం చంద్రబాబు సూచన ప్రాయంగా అంగీకరించారు. ఏపీలో పెట్రో కొరతకు సంబంధించి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆయన సమీక్షలో అధికారులు కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. కంపెనీలు రిటైల్ ఔట్లెట్లకు ఇంతకు ముందులా క్రెడిట్ ఇవ్వడం లేదని తెలిపారు. దీని ఫలితంగా గత మూడు రోజులుగా రాష్ట్రంలో ఇంధన కొరత కొనసాగుతోందన్నారు. అధికారులతో చెప్పిన దానితో ఏకీభవించిన చంద్రబాబు.. ఈ ఇంధన సంక్షోభాన్ని తొందరగా నిలువరించాలని చంద్రబాబు సూచించారు. కాగా, మూడు రోజుల నుంచి ఏపీలో పెట్రో కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వం పెద్దగా స్పందించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. నయార, రిలయన్స్, జియో బంకులకు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. శనివారం పెట్రోల్, డీజిల్ డిమాండ్ 34 శాతం పెరగగా, ఆదివారం 22 శాతం పెరిగింది.విజయవాడ నుండి తిరుపతి వరకు హైవేలలో అనేక పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. వ్యవసాయ కోత యంత్రాలు, ఆక్వా రంగాలకు కూడా డీజిల్ కొరత తీవ్రంగా ప్రభావం చూపుతోంది. రైతులు ఇబ్బందులు పడుతున్నారు.సమస్య ఎప్పటికి సాధారణ స్థితికి వస్తుందో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
No పెట్రోల్.. No డీజిల్.. APలో వాహన దారుల కష్టాలు
-
బంకుల వద్ద భారీ క్యూలు.. గంటల కొద్దీ వెయిటింగ్
-
నో పెట్రోల్.. నో డీజిల్ మూతపడుతున్న పెట్రోల్ పంపులు..
-
ప్రేయసి రావే
హైదరాబాద్: పెట్రోల్ క్యాన్‌తో హైటెన్షన్ టవర్ ఎక్కిన ఓ యువకుడు తన ప్రేయసితో మాట్లాడించాలని.. లేకపోతే పెట్రోల్ పోసుకుని దూకుతానని పోలీసులను బెదిరించాడు. ఇలా దాదాపు మూడు గంటల పాటు మండుటెండలో ముచ్చెమటలు పట్టించాడు. అల్లాపూర్ ప్రాంతానికి చెందిన సాల్మాన్ రాజ్‌కు ఎస్ఆర్టీనగర్కు చెందిన యువతితో పరిచయమైంది. ఈ క్రమంలో ఇటీవల సాల్మన్‌రాజ్ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది.ఆ తరువాత ఆమెకు దగ్గరకావాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో బుధవారం పెట్రోల్ క్యాన్‌తో మోతీనగర్ పార్కులో ఉన్న హైటెన్షన్ టవర్‌ను ఎక్కాడు. సమాచారం అందుకున్న బోరబండ పోలీసులు సురేందర్‌తో మాట్లాడాడు. యువతితో మాట్లాడించాలని యువకుడు కోరాడు. అయితే ఆతరువాత బోరబండ ఎస్హెచ్ఓ సురేందర్ మాటల్లోకి దించి దిగివచ్చేలా చేశాడు. అనంతరం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
ఇంధనంగా ఇథనాల్!
20కి బదులుగా 21%.. ప్రస్తుత వాహనాల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని ప్రస్తుతమున్న 20% నుంచి 21%కి పెంచవచ్చని ప్రభు త్వం గత వారం సూచించింది. ఇటీ వలి కాలంలో వస్తున్న ఆధునిక ఇంజన్లు కొంత అదనపు మార్పును తట్టుకునేలా రూపొందాయి. ఇంజన్ హార్డ్‌వేర్‌లో ఎటువంటి ఖరీదైన మార్పులు చేయకుండానే ఈ 21% మిశ్రమాన్ని వాడొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. సాక్షి, స్పెషల్ డెస్క్: ఇప్పటి వరకు మీ వాహనంలో వాడుతున్న పెట్రోల్‌లో ఇథనాల్ 20% మాత్రమే ఉంటోంది. రాబోయే రోజుల్లో ఇది 85% చేరే అవకాశం ఉంది. ముడి చమురు దిగుమతుల్లో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి సారించిన భారత్.. ఈ85 ఇంధనాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ముసాయిదా నిబంధనలను ప్రభుత్వం అతి త్వరలో విడుదల చేయనుంది. ఇంధన రంగంలో భారత్ స్వయంసమృద్ధి సాధించాలని, సమీప భవిష్యత్తులో దేశం 100% ఇథనాల్ మిశ్రమానికి చేరుకోవాలన్న కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ఈ85 అంటే ఇంధనంలో 85% ఇథనాల్, 15% పెట్రోల్ ఉంటుంది. ఈ85 దేశవ్యాప్తంగా అందుబాటులోకి రావడా నికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాకు ముప్పు ఏర్పడటంతో స్వదేశీ ఇథనాల్ వాడకాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై పెట్రోలియం, రవాణా, వ్యవసాయ శాఖల మధ్య ఏకాభిప్రాయం ఉంది. వాహన తయారీ సంస్థలు కూడా ఈ మార్పునకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ85 ఇంధనం ప్రాథమిక పరీక్షల్లో ఇంజన్లపై ఆశాజనక ఫలితాలను ఇచ్చిందని సమాచారం. అధిక మొత్తంలో ఇథనాల్‌ను కలపాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దశాబ్దం క్రితమే పురుడుపోసుకుంది. 2016లోనే ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాల కోసం ఈ85 ఇంధన వినియోగాన్ని నోటిఫై చేశారు. దీంతోపాటు ఈ85, స్వచ్ఛమైన ఇథనాల్ (ఈ100) కోసం ఉద్గార ప్రమాణాలను కూడా అప్పుడే ప్రకటించారు. ప్రత్యేక ఇంధన గ్రేడ్‌గా.. ఈ85 అనేది ప్రస్తుతం ఉన్న ఈ20 పెట్రోల్ కంటే భిన్నమైన, ఒక ప్రత్యేక ఇంధన గ్రేడ్‌గా ప్రవేశపెడతారు. ఇంత అధిక శాతం ఇథనాల్‌తో వాహనం నడవాలంటే ఇంజన్లు ప్రత్యేకంగా తయారవ్వాలి. సాధారణ పెట్రోల్ ఇంజిన్లు, ఇంధన వ్యవస్థలు అంతటి అధిక ఆల్కహాల్ శాతాన్ని తట్టుకునేలా రూపొందలేదు. అయితే 2023లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ20 గ్రేడ్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని 27% వరకు పెంచుకోవడానికి అనుమతి ఉంది. డీజిల్‌లో సైతం.. దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడానికి డీజిల్‌లో ఇథనాల్‌ను కలపాలని భారత్ భావిస్తోంది. కొన్ని పైలట్ ప్రాజెక్టులు ఆశాజనకమైన ఫలితాలను ఇవ్వడంతో ప్రధానమంత్రి కార్యాలయం ఈ ఆలోచనను సమీక్షిస్తోంది. ఇది దేశానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలుసుకోవడానికి త్వరలోనే ఒక సమగ్ర నివేదిక రానుంది. పెద్ద మొత్తంలో ఆదా.. ⇒ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (ఈబీపీ) కార్యక్రమం ద్వారా భారత్ ఏటా సుమారు 4.5 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును ఆదా చేయగలిగింది. ⇒ ఇప్పటివరకు విదేశీ మారక ద్రవ్యం రూపంలో సుమారు రూ.1.65 లక్షల కోట్లు ఆదా అయింది. ⇒ ఇథనాల్ ఉత్పత్తికి చెరకు, మొక్కజొన్న రైతులకు రూ.1.18 లక్షల కోట్లకు పైగా చెల్లించారు. ⇒ భారత్ తన చమురు అవసరాల కోసం 85 శాతానికిపైగా ఇతర దేశాలపై ఆధారపడుతోంది. ఇథనాల్ రకాలు.. 1వ తరం: చెరకు రసం, మొలాసిస్, మొక్కజొన్న, పాడైపోయిన ఆహార ధాన్యాల నుంచి తయారు చేస్తారు. 2వ తరం: వరి గడ్డి, గోధుమ గడ్డి, మొక్కజొన్న పిప్పి వంటి పంట వ్యర్థాల నుంచి ఉత్పత్తి చేస్తారు. 3వ తరం: ఆల్గే (నాచు) వంటి మూలాల నుండి రూపొందిస్తారు. కొన్ని సవాళ్లు.. ⇒ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో శక్తి కొంచెం తక్కువ. దీనివల్ల వాహనం ఇచ్చే మైలేజ్ స్వల్పంగా తగ్గే అవకాశం ఉంటుంది. ⇒ అధిక మొత్తంలో ఇథనాల్ వాడాలంటే వాహనాల్లో ప్రత్యేకమైన ఫ్లెక్స్–ఫ్యూయల్ ఇంజిన్లు అవసరమవుతాయి. -
వాహనదారులకు అలెర్ట్.. పెట్రోల్‌కి గుడ్‌బై?
ఢిల్లీ: వాహనదారులకు అలెర్ట్. పశ్చిమాసియా యుద్ధం కారణంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలో కేంద్రం పెట్రోల్‌లో ఇథనాల్ కలిపి అమ్మకాలు నిర్వహించేలా డ్రాఫ్ట్ బిల్లు (ప్రతిపాదిత చట్టం) సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే, ఆ డ్రాఫ్ట్ బిల్లులో గతంలో చెప్పినట్లుగా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలిపి అమ్మకాలు నిర్వహించేలా కాకుండా.. 85శాతం ఇథనాల్.. 15శాతం పెట్రోల్ మాత్రమే వాహనాల్లో వినియోగించేలా కేంద్రం ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. భారత్ తన ఇంధన అవసరాల కోసం దాదాపు 90శాతం విదేశాల నుంచి ఎక్కువగా గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. రానున్న రోజుల్లో చమురు దిగుమతులు తగ్గించుకునేలా ప్రయత్నాలు ప్రారంభించిందిఇదే అంశంపై పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖకు సంబంధం ఉన్న సీనియర్ ప్రభుత్వ అధికారులు జాతీయ మీడియాతో మాట్లాడారు. త్వరలోనే ప్రభుత్వం ఇథనాల్ 85 (ఈ85) అంశాన్ని డ్రాఫ్ట్ రూపంలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. అంతేకాదు ఇథనాల్ 85పై ఇటు ప్రభుత్వంలో అటు మార్కెట్లో సైతం ఏకాభిప్రాయం ఉంది ప్రాథమిక పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ85 కోసం ఇంజన్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. మార్కెట్లో విడుదలయ్యేందుకు రెండేళ్ల సమయం పడుతుందని అంచనా. మరో అధికారి మాట్లాడుతూ..ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాలు సైతం 15శాతం పెట్రోల్,85శాతం ఇథనాలు కలిపి అమ్మకాలు నిర్వహించేలా ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న డ్రాఫ్ట్ బిల్లుపై అంగీకారం తెలిపాయని,త్వరలో అధికారిక ప్రకటన చేస్తాయన్న ఆయన.. ‘మార్కెట్ ఏకాభిప్రాయం ఇప్పటికే కుదిరింది. ఈ85 కోసం వాహనాల ప్రాథమిక పరీక్షలు కూడా పూర్తయ్యాయి’అని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఈ20 పెట్రోల్‌కు భిన్నంగా, ఈ85ను ఒక ప్రత్యేక ఇంధన గ్రేడ్‌గా ప్రవేశపెట్టనున్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ20 వేరియంట్లో ఇథనాల్ మిశ్రమాన్ని 27శాతం వరకు కలపవచ్చు. ఇంధన సంక్షోభం మధ్య కేంద్రం తీసుకుంటున్న ఈ నిర్ణయం దేశానికి కీలక మలుపు కానుంది. పెట్రోల్‌పై ఆధారాన్ని తగ్గించి, దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్ వినియోగాన్ని పెంచడం ద్వారా రైతులకు మద్దతు లభించనుంది. పర్యావరణానికి ప్రయోజనం కలిగించడమే కాకుండా, చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చే అవకాశం ఉంది. అయితే, కొత్త ఇంజిన్లు, మౌలిక సదుపాయాలు, వినియోగదారుల అవగాహన వంటి సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. ఈ85 ప్రవేశం భారత ఇంధన రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. -
నెల్లూరు జిల్లాలో దారుణం, శ్రీనుపై పెట్రోల్ పోసి తగలబెట్టిన టీడీపీ వర్గం
-
21 నెలల కనిష్ఠానికి ఎల్పీజీ వినియోగం
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరా గొలుసును అతలాకుతలం చేస్తున్న వేళ, భారత ఇంధన రంగంలో విరుద్ధమైన ధోరణులు కనిపిస్తున్నాయి. ఒకవైపు యుద్ధ భయాలతో రవాణా ఇంధనాలైన పెట్రోల్, డీజిల్‌కు విపరీతమైన గిరాకీ పెరగ్గా, మరోవైపు వంట గ్యాస్ వినియోగం గత 21 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) విడుదల చేసిన తాత్కాలిక గణాంకాలు ఈ ఆసక్తికర అంశాలను వెల్లడించాయి.ఎల్పీజీ వినియోగంలో భారీ క్షీణతమార్చి 2026లో దేశీయ ఎల్పీజీ వినియోగం గణనీయంగా తగ్గింది. గత నెలతో పోలిస్తే 16 శాతం, గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 13 శాతం క్షీణత నమోదైంది. మార్చిలో మొత్తం వినియోగం 2.38 మిలియన్ టన్నుల వద్ద నిలిచింది. జూన్ 2024 తర్వాత ఎల్పీజీ వినియోగంలో ఇంతటి భారీ పతనం నమోదు కావడం ఇదే తొలిసారి.దిగుమతులపై హార్మూజ్ ప్రభావంభారతదేశం తన ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందులో సుమారు 90 శాతం దిగుమతులు వ్యూహాత్మకమైన హార్మూజ్ జలసంధి గుండానే సాగుతుంటాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ సంక్షోభం ఈ జలసంధి ద్వారా రవాణాను ప్రభావితం చేయడంతో ఫిబ్రవరిలో 2 మిలియన్ టన్నులుగా ఉన్న దిగుమతులు మార్చి నాటికి 1.1 మిలియన్ టన్నులకు పడిపోయాయి.పెట్రోల్, డీజిల్‌కు డిమాండ్సరఫరాలో అంతరాయాలు కలగవచ్చనే భయంతో వినియోగదారులు ముందు జాగ్రత్తగా ఇంధన కేంద్రాలకు క్యూ కట్టడం వల్ల రవాణా ఇంధనాల వినియోగం ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరింది.ఇంధనంమర్చి నెల వినియోగంవృద్ధి (నెలవారీ)వృద్ధి (వార్షిక)డీజిల్8.73 MT (రికార్డు)14%8%పెట్రోల్3.78 MT (రికార్డు)12%8% వార్షిక ధోరణి ఆశాజనకంమార్చి నెలలో ఎల్పీజీ వినియోగంలో క్షీణత కనిపించినప్పటికీ 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం వినియోగం మాత్రం ఆశాజనకంగానే ఉంది. గతేడాది కంటే 6 శాతం వృద్ధి చెంది 33.21 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఇది 2019 ఆర్థిక సంవత్సరం తర్వాత నమోదైన అత్యధిక వార్షిక వృద్ధి కావడం విశేషం.ప్రభుత్వ భరోసా - ప్రత్యామ్నాయ మార్గాలుప్రస్తుత అస్థిరతపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ దేశంలో ఇంధన నిల్వలు తగినంతగా ఉన్నాయని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. దేశీయ ఎల్పీజీ వినియోగంలో 90 శాతంపైగా ఉన్న గృహ అవసరాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎల్పీజీపై భారాన్ని తగ్గించేందుకు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) కనెక్షన్లను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. మార్చిలోనే 3 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వగా ఏప్రిల్ చివరి నాటికి మరో 6 నుంచి 7 లక్షల మంది కొత్త వినియోగదారులను చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: గ్రాట్యుటీ.. రిటైర్మెంట్ గిఫ్ట్! -
పెట్రోల్ బండ్లు బ్యాన్.. రిజిస్ట్రేషన్లు బంద్!
దేశ రాజధానిలో వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు 'ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2026-2030' ముసాయిదాను రవాణా శాఖ విడుదల చేసింది. ఈ కొత్త పాలసీ ప్రకారం.. రానున్న రెండేళ్లలో పెట్రోల్ వాహనాల రిజిస్ట్రేషన్లపై పూర్తిస్థాయిలో నిషేధం విధించి, నగరాన్ని ఈవీ హబ్‌గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.కీలక గడువులు ఇవే..పెట్రోల్ వాహనాలను దశలవారీగా తొలగించేందుకు ప్రభుత్వం స్పష్టమైన టైమ్ లైన్లను ప్రకటించింది. జనవరి 1, 2027 నుండి ఢిల్లీలో కొత్తగా కేవలం ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల (ఆటోలు) రిజిస్ట్రేషన్‌కు మాత్రమే అనుమతి ఉంటుంది. పెట్రోల్/సీఎన్జీ ఆటోల రిజిస్ట్రేషన్ నిలిచిపోనుంది.ఏప్రిల్ 1, 2028 నుండి పెట్రోల్ ద్విచక్ర వాహనాలపై (బైకులు, స్కూటర్లు) పూర్తిస్థాయి ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. అప్పటి నుండి కేవలం ఎలక్ట్రిక్ టూ-వీలర్లను మాత్రమే అనుమతిస్తారు.ఇక వాణిజ్య వాహనాల విషయానికి వస్తే.. డెలివరీ యాప్‌లు, అగ్రిగేటర్ల పరిధిలోని వాహనాలకు జనవరి 1, 2027 నుంచే కఠిన నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం ఉన్న BS-6 వాహనాలను డిసెంబర్ 31, 2026 వరకు మాత్రమే అనుమతించి, ఆపై పూర్తిగా ఈవీలను తప్పనిసరి చేయనున్నారు.వ్యక్తిగత వాహనాలే కాకుండా, ప్రభుత్వ, విద్యాసంస్థల వాహనాలపై కూడా ఈ ప్రభావం ఉండనుంది. 2030 నాటికి 30 శాతం పాఠశాల బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం ఏటా నిర్దిష్ట కోటాను పెంచుకుంటూ పోతారు.ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసే వాహనాలన్నీ 100% ఎలక్ట్రిక్ మాత్రమే అయి ఉండాలి. అలాగే అద్దెకు తీసుకునే వాహనాలను కూడా తక్షణమే ఈవీలుగా మార్చాలని నిర్ణయించారు.ఢిల్లీకి వచ్చే ఇతర రాష్ట్రాల బస్సులు కూడా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ లేదా హైడ్రోజన్ ఇంధన సాంకేతికతకు మారాల్సి ఉంటుంది.ప్రజాభిప్రాయ సేకరణఈ మార్పులు ఆకస్మికంగా కాకుండా, సామాన్యులకు ఇబ్బంది కలగకుండా దశలవారీగా అమలు చేస్తాం. మౌలిక సదుపాయాలు, ఛార్జింగ్ పాయింట్ల విస్తరణపై ప్రభుత్వం భారీగా దృష్టి సారించిందని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు.ప్రస్తుతం ఈ ముసాయిదాను పౌరులు, నిపుణుల సలహాల కోసం పబ్లిక్ డొమైన్లో ఉంచారు. రాబోయే 30 రోజుల్లో వచ్చే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ప్రభుత్వం దీనిపై తుది నోటిఫికేషన్ జారీ చేయనుంది. శీతాకాలంలో ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేసే కాలుష్య కోరల నుండి విముక్తి పొందేందుకు ఈ ఈవీ పాలసీ కీలకం కానుంది. -
పాక్‌లో ‘పెట్రో’ మంట: ప్రధాని మాస్టర్ ప్లాన్ ఇదే!
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 459 పాకిస్తానీ రూపాయలకు చేరడంతో సామాన్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరల పెంపుతో రావల్పిండి, ఇస్లామాబాద్‌లలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తక్షణమే పెంచిన ధరలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.పెట్రోల్ ధరల పెంపు ప్రభావం స్థానిక మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. రవాణా భారం పెరగడంతో కూరగాయలు, గోధుమ పిండి, మాంసం వంటి నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగాయి. ఆటో, రిక్షా ఛార్జీల మోతతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. స్కూల్ వ్యాన్ నిర్వాహకులు సైతం నెలవారీ ఫీజులను రూ.1,000 మేర పెంచేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రావల్పిండి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఆర్సీసీఐ) అధ్యక్షుడు ఉస్మాన్ షౌకత్ మాట్లాడుతూ.. రవాణా ఖర్చులు రెట్టింపు అయ్యాయని, దీనివల్ల ఆహార, నిర్మాణ రంగాలపై తీవ్ర ప్రభావం పడుతున్నదన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌తో సంబంధం లేకుండా, ప్రభుత్వమే లీటర్‌పై రికార్డు స్థాయిలో రూ.160.61 పన్ను విధిస్తోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే అనవసర ఖర్చులు తగ్గించుకుని, పన్నుల భారం ప్రజలపై పడకుండా ఐఎంఎఫ్ (ఐఎంఎఫ్)తో చర్చలు జరపాలని ఆయన సూచించారు.మరోవైపు రాజకీయ పక్షాలు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాయి. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేతలు సఫ్దార్ అలీ అబ్బాసీ, నహీద్ ఖాన్ ఈ పెంపును ‘ఆర్థిక అణచివేత’గా అభివర్ణించారు. సామాన్య, కార్మిక వర్గాల జీవన ప్రమాణాలను ఇది తీవ్రంగా దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటున్న నేపథ్యంలో పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మోసిన్ నఖ్వీ ఒక ప్రకటన చేశారు. ప్రధాని ఆదేశాల మేరకు ఇస్లామాబాద్‌లో 30 రోజుల పాటు ప్రయాణికులందరికీ ఉచిత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇది కూడా చదవండి: 345 మంది భారత మత్స్యకారులకు ఊరట -
‘మమ్మల్ని చంపేయండి’.. పాక్‌లో అల్లకల్లోలం
ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు పాకిస్తాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇంధన సంక్షోభం దాయాది దేశాన్ని ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీసింది. ఆకాశాన్ని తాకిన చమురు ధరలు దేశవ్యాప్తంగా అల్లకల్లోలాన్ని సృష్టించాయి. ప్రభుత్వం ధరలు పెంచడం, ప్రజలు ఆగ్రహంతో రోడ్ల మీదకు రావడం, ఆపై ప్రధాని దిగిరావడం.. వెరసి పాకిస్తాన్ ప్రస్తుతం ఒక అగ్ని గుండంలా మారిపోయింది.యుద్ధం మొదలై నెల రోజులు దాటడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ప్రభావం పడింది. 85 శాతం చమురును ‘హోర్ముజ్ జలసంధి’ ద్వారా దిగుమతి చేసుకునే పాకిస్తాన్‌కు ఇది శాపంగా మారింది. శుక్రవారం రాత్రి పాక్ ప్రభుత్వం పెట్రోల్ ధరలను ఏకంగా 42.7 శాతం పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 485కి చేరుకుంది. ఈ నిర్ణయంతో జనం బెంబేలెత్తిపోయారు. పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి.ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెనక్కి తగ్గక తప్పలేదు. పెంచిన ధరను అదే రోజు రూ. 378కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ‘ఈ తగ్గిన ధర కనీసం నెల రోజుల పాటు అమల్లో ఉంటుంది. మీ జీవితాలు సాధారణ స్థితికి వచ్చే వరకు నేను విశ్రమించను’ అని ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పెట్రోల్ ధర తగ్గించినప్పటికీ, డీజిల్ ధర సామాన్యుడిని వణికిస్తోంది. లీటర్ డీజిల్ ధరను రూ. 335.86 నుంచి ఏకంగా రూ. 520.35కి పెంచారు. అయితే, ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం దానిపై విధించే లెవీని తొలగించింది. మరోవైపు బంగ్లాదేశ్‌లో కూడా ఇదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ ఎల్పీజీ (ఎల్పీజీ), సీఎన్జీ (సీఎన్జీ)ధరలను 29 శాతం మేర పెంచారు.పాక్ ప్రభుత్వం ప్రకటించిన ఊరట చర్యలుపాకిస్తాన్లో ప్రజా నిరసనల సెగను తగ్గించేందుకు ప్రభుత్వం కొన్ని కీలక రాయితీలను ప్రకటించిందిఉచిత ప్రయాణం: ఇస్లామాబాద్, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభుత్వ బస్సుల్లో 30 రోజుల పాటు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు.సబ్సిడీలు: సింధ్ ప్రభుత్వం మోటార్ సైకిలిస్టులకు, చిన్న రైతులకు ప్రత్యేక సబ్సిడీలను ప్రకటించింది.రవాణా ఛార్జీలు: పెరిగిన ధరల భారాన్ని ప్రయాణికులపై వేయవద్దని పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ షరీఫ్ రవాణాదారులను కోరారు.వీధుల్లోకి జనం: ‘మమ్మల్ని చంపేయండి’లాహోర్ వంటి నగరాల్లో నిరసనలు మిన్నంటాయి. ‘ప్రభుత్వం మాపై పెట్రోల్ బాంబు వేసింది. మమ్మల్ని చంపేయండి. ఈ భారాన్ని మేము భరించలేము’ అని నిరసనకారుడు నవీద్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశాడు. మరో నిరసనకారుడు హఫీజ్ అబ్దుల్ రవూఫ్ మాట్లాడుతూ.. ఇది కేవలం యుద్ధం వల్ల వచ్చిన ధరల పెరుగుదల కాదని, ఐఎంఎఫ్ (ఐఎంఎఫ్)ఒత్తిడి వల్లే ప్రభుత్వం ఇలా చేస్తోందని విమర్శించారు.ముందున్నది గడ్డు కాలమే..పాకిస్తాన్ జనాభాలో దాదాపు 25 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారు. ఇలాంటి తరుణంలో ఇంధన ధరల పెరుగుదల దేశ ఆర్థిక వ్యవస్థను మరింత కుంగదీసింది. మార్చి 28న ఐఎంఎఫ్ నుంచి 1.2 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయానికి ప్రాథమిక ఒప్పందం కుదిరినప్పటికీ, సరఫరా వ్యవస్థలో ఆటంకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాబోయే వారాలు పాకిస్తాన్ ప్రభుత్వానికి అగ్నిపరీక్ష లాంటివే. యుద్ధం సద్దుమణగకపోతే దాయాది దేశ పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉంది.ఇది కూడా చదవండి: స్కూల్లో దెయ్యం?... పిల్లల చందాలతో గుడి కట్టి.. -
‘4 గంటలకే అన్నీ ఆఫీసులు మూసేయండి’
ఢాకా: పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల ప్రభుత్వాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. తాజాగా, బంగ్లాదేశ్‌లో ఇంధన సంక్షోభం తీవ్రతరం కావడంతో ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది.ఈ మేరకు ప్రజలకు కీలక విజ్ఞప్తి చేసింది. అన్ని దుకాణాలు, షాపింగ్ మాల్స్ సాయంత్రం 6 గంటలకు మూసివేయాలని ఆదేశించింది. కార్యాలయాలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు మాత్రమే పనిచేయాలి. బ్యాంకులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు మాత్రమే తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.పశ్చిమాసియా యుద్ధం కారణంగా బంగ్లాదేశ్‌లో ఇంధన సరఫరా సంక్షోభం మరింత తీవ్రమైంది. దేశం 95 శాతం ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుండటంతో ధరలు పెరగడం, సరఫరా అస్థిరత పెరగడం వల్ల ప్రభుత్వం కఠినమైన ఖర్చు నియంత్రణ చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి తారిక్ రహ్మాన్ నేతృత్వంలోని కేబినెట్ 180 రోజుల మితవ్యయ ప్రణాళికకు ఆమోదం తెలిపింది. ఈ చర్యలలో భాగంగా ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం, కొత్త వాహనాలు లేదా కంప్యూటర్లు కొనుగోలు చేయకూడదని నిర్ణయం తీసుకుంది. అధికారుల విదేశీ ప్రయాణాలను 50 శాతం తగ్గించడం, సమావేశాలు, సదస్సుల ఖర్చులను పరిమితం చేయడం, వివాహాలు మరియు ఇతర కార్యక్రమాల్లో అలంకార లైటింగ్ నిషేధం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో భారతదేశం ఇప్పటికే 5,000 టన్నుల డీజిల్‌ను బంగ్లాదేశ్‌కు సరఫరా చేసింది. మరిన్ని సరఫరాల కోసం చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నిర్ణయాలు సాధారణ ప్రజల జీవితంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. దుకాణాలు, మాల్స్ ముందుగానే మూసివేయడం వల్ల వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకింగ్ లావాదేవీలు కూడా తగ్గిన సమయానికి పరిమితం కావడంతో ఆర్థిక కార్యకలాపాలు మందగించనున్నాయి.మొత్తం మీద, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇంధన వినియోగాన్ని తగ్గించి, ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి కఠినమైన మితవ్యయ చర్యలు చేపట్టింది. ఈ చర్యలు తాత్కాలికంగా ప్రజలకు ఇబ్బందులు కలిగించినా, దీర్ఘకాలంలో ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో సహాయపడతాయని అధికారులు విశ్వసిస్తున్నారు. -
నయారా బాటలో షెల్ ఇండియా!
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇటీవల పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచిన నయారా ఎనర్జీ బాటలోనే తాజాగా ‘షెల్ ఇండియా’ సైతం ఏప్రిల్ 1 నుంచి ఇంధన ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ భయాల నేపథ్యంలో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటడంతో నష్టాలను తగ్గించుకునేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.బెంగళూరులో ధరల మోతతాజా పెంపుతో కర్ణాటక రాజధాని బెంగళూరులో షెల్ కంపెనీ అవుట్లెట్లలో ఇంధన ధరలు కింది విధంగా ఉన్నాయి. స్థానిక పన్నుల వ్యత్యాసం కారణంగా ఇతర నగరాల్లో ఈ ధరలు స్వల్పంగా అటు ఇటుగా ఉండవచ్చు.ఇంధనం రకంపెంపు (లీటరుకు)తాజా ధర (సాధారణ)ప్రీమియం వేరియంట్ ధరపెట్రోల్రూ. 7.41రూ. 119.85రూ. 129.85డీజిల్రూ. 25.01రూ. 123.52రూ. 133.52అంతర్జాతీయ సంక్షోభంఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 60 శాతం మేర పెరిగింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా సరఫరాకు అంతరాయం కలగవచ్చనే ఆందోళనలు ధరలను మరింత పెంచుతున్నాయి. భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో ఈ సరఫరా గొలుసులో తలెత్తే స్వల్ప మార్పులైనా దేశీయ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.ప్రైవేట్ వర్సెస్ ప్రభుత్వ రంగ సంస్థలుముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ధరలను దాదాపు స్థిరంగా ఉంచడం గమనార్హం. అయితే ప్రైవేట్ రిటైలర్లు అయిన షెల్, నయారా వంటి సంస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలకు లభించే సబ్సిడీలు లేదా నష్టపరిహారాలు ప్రైవేట్ సంస్థలకు అందవు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా తమ మనుగడ సాగించాలంటే పెరిగిన భారాన్ని కస్టమర్లపై వేయడం తప్ప మరో మార్గం లేదని ప్రైవేట్ వర్గాలు పేర్కొంటున్నాయి.ఇదీ చదవండి: దక్షిణాదిలో ఆరోగ్యం భేష్.. ఆర్థిక ప్రణాళికలే వీక్! -
‘ఇథనాల్’ ఇంధనమే ఆదుకుంటోంది..
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో.. దిగుమతి చేసుకున్న ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వ 'ఇథనాల్ మిశ్రమ విధానం' (Ethanol Blending Policy) భారత్‌కు రక్షణ కవచంలా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. శనివారం జేవార్‌లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, దేశ ఇంధన భద్రతలో రైతుల పాత్రను కొనియాడారు.చమురు దిగుమతులకు అడ్డుకట్ట..ముడి చమురు దిగుమతుల కోసం వెచ్చించే వేల కోట్ల రూపాయలను ఆదా చేయడంలో పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన చెరకు రైతులు కీలక పాత్ర పోషించారని ప్రధాని తెలిపారు. "ఇథనాల్ మిశ్రమ విధానం లేకపోతే, మనం విదేశాల నుండి అదనంగా 4.5 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. రైతులే మన దేశ విదేశీ మారకద్రవ్యాన్ని కాపాడారు" అని ఆయన పేర్కొన్నారు.భారత్‌కు అవసరమైన చమురులో దాదాపు 40% పశ్చిమాసియా నుండే అందుతోంది. ప్రస్తుత యుద్ధ వాతావరణం వల్ల ధరలు పెరిగినప్పటికీ, ఇథనాల్ వాడకం వల్ల భారత్ ఆ ప్రభావాన్ని తట్టుకోగలుగుతోందని ప్రధాని వివరించారు.వేగంగా ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ఖరీదైన ముడి చమురు దిగుమతులను తగ్గించడం, విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్న భారత ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ మోదీ ప్రభుత్వ హయాంలో వేగం పుంజుకుంది. నిర్ణయించుకున్న 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని, గడువు కంటే ఐదేళ్ల ముందే గత ఏడాది భారత్ సాధించింది.ఈ క్రమంలో గత ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా E20 (20% ఇథనాల్ మిశ్రమం) సరఫరా అవుతోంది. దీంతో ఇదే ఉత్సాహంతో 2030 నాటికి పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని 30 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దిగుమతి చేసుకున్న ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా భారతత్ గత 10 ఏళ్లలో సుమారు రూ.1.36 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసిందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ గతేడాది జూలైలో తెలిపింది. -
Mann Ki Baat: పెట్రోల్ సంక్షోభంపై ప్రధాని మోదీ క్లారిటీ
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నా, ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ముంచుకొస్తున్నా భారత్ ఏమాత్రం బెదిరిపోదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆదివారం నాటి 132వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనే సత్తా భారత దేశానికి ఉందని అన్నారు.వదంతులు నమ్మొద్దు.. ఐక్యంగా ఉందాం!పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 28 నుంచి మొదలైన ఈ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం పడుతోందని, ముఖ్యంగా ‘స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్’ గుండా రవాణా నిలిచిపోవడం ఇంధన సరఫరాకు సవాలుగా మారిందని పేర్కొన్నారు. ‘ఇది క్లిష్ట సమయం. 140 కోట్ల మంది భారతీయులు ఐక్యంగా ఉండాలి. స్వార్థ రాజకీయాల కోసం ఈ విషయాన్ని వాడుకోవద్దు. వదంతులు వ్యాప్తి చేస్తూ దేశానికి నష్టం కలిగించకండి’ అని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ఆయన కోరారు.అండగా నిలిచిన గల్ఫ్ దేశాలుగల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న కోటి మంది భారతీయుల భద్రతపై ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా సౌదీ అరేబియా, యూఏఈ, ఇజ్రాయెల్ వంటి పలు దేశాల నేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. భారతీయులకు అండగా నిలుస్తున్న గల్ఫ్ దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశీయంగా ఇంధన భారాన్ని తగ్గించేందుకు కేంద్రం ఇప్పటికే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని, పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) మౌలిక సదుపాయాలను వేగవంతం చేస్తున్నామని చెప్పారు.జ్ఞాన భారతం - యువ శక్తిదేశంలోని పురాతన తాళపత్ర గ్రంథాలు, రాగి రేకులు, ప్రాచీన రాతప్రతులను భద్రపరిచేందుకు చేపట్టిన ‘జ్ఞాన భారతం’ సర్వే గురించి మోదీ వివరించారు. అలాగే ‘మై భారత్’ (MY Bharat) ద్వారా లక్షలాది మంది యువత దేశ నిర్మాణంలో భాగస్వాములవుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. టీ20 వరల్డ్ కప్ విజయం, జమ్మూ కాశ్మీర్ రంజీ ట్రోఫీ గెలవడం వంటి క్రీడా విజయాలను ఆయన కొనియాడారు. ప్రజల ఆరోగ్యంపై ప్రధాని స్పందిస్తూ.. ఆహారంలో చక్కెర వాడకాన్ని తగ్గించాలని, వంట నూనె వినియోగాన్ని 10 శాతం మేర కోత విధించాలని ప్రధాని సూచించారు. జల సంరక్షణలో భాగంగా నిర్మించిన 70 వేల అమృత్ సరోవర్ల విజయాన్ని ఉదాహరిస్తూ, సుస్థిర భవిష్యత్తు కోసం దేశంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. -
సొంత వాహనం పక్కన పెట్టండి.. మెట్రో ఎక్కండి!
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఒకవైపు వేసవి, మరోవైపు పెట్రోల్, డీజిల్ కొరత. దీంతో చాలామంది సొంత వాహనాలను తాత్కాలికంగా పక్కన పెట్టి మెట్రోల్లో ప్రయాణం చేస్తున్నారు. సాధారణ రోజుల్లో కంటే ప్రయాణికుల సంఖ్య పెరిగింది. వారం క్రితం రోజుకు 4.5 లక్షల మంది ప్రయాణం చేయగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 4.7 లక్షల నుంచి 4.85 లక్షలకు పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పశి్చమాసియా యుద్ధం కారణంగా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై నెలకొన్న అనిశ్చితి, రెండు రోజులుగా అకస్మాత్తుగా బంకుల్లో రద్దీ వంటి పరిణామాల కారణంగా మెట్రో రైళ్లకు డిమాండ్ పెరిగింది. కొత్త కోచ్‌లకు బ్రేక్.. ⇒ ఉద్యోగులు, విద్యార్ధులు, ఐటీ నిపుణులు ఇతర వర్గాల చెందిన ప్రయాణికులు సమ్మర్ హీట్ బారిన పడకుండా ఉండేందుకు మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. నాగోల్ నుంచి అమీర్‌పేట్, ఎల్బీనగర్ నుంచి మియాపూర్ కారిడార్లతో పాటు జేబీఎస్– ఎంజీబీఎస్ కారిడార్‌లోనూ ప్రయాణికుల రద్దీ పెరిగినట్లు అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో ప్రతిరోజు సుమారు 5 లక్షల మందికి పైగా మెట్రోల్లో ప్రయాణం చేసే అవకాశం ఉంది. కాగా.. ప్రయాణికుల డిమాండ్ మేరకు కోచ్‌ల సంఖ్య పెరగడం లేదు. ⇒ ప్రస్తుతం నగరంలోని మూడు కారిడార్లలో ప్రతి రోజు సుమారు 1000 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ప్రతి 3 నుంచి 5 నిమిషాలకు ఒకటి చొప్పున మెట్రో అందుబాటులో ఉన్నప్పటికీ ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. అన్ని మెట్రో రైళ్లకు కేవలం 3 బోగీలే ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది. అదనంగా మరో 3 బోగీలను ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితం భావించారు. ఈ క్రమంలో ఎల్అండ్టీ సంస్థ హైదరాబాద్ మెట్రో రైల్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకోవడంతో కొత్త కోచ్‌ల కొనుగోలుకు బ్రేక్ పడింది. అరకొర కోచ్‌లతో ప్రయాణికులకు ఇబ్బందులు ఇప్పట్లో తప్పేలే లేవు. -
సోషల్ మీడియా అసత్య వార్తలతో దేశం ఇబ్బంది పడింది! : కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత ఉందని వస్తున్న వదంతులను నమ్మొద్దని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య వార్తలతో అనేక రకాలు ఇబ్బందులు వస్తున్నాయని, దీంతో ఒక్క కుటుంబమో, ఒక వ్యక్తి ఇబ్బంది పడడం లేదని, యావత్ దేశం ఇబ్బంది పడేలా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయిల్ కంపెనీలు, డీలర్లతో కలిసి కిషన్‌రెడ్డి సీజీజీ టవర్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో గత వారం రోజులుగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సరఫరాలపై ప్రజల్లో ఒక రకమైన ఆందోళన నెలకొందన్నారు. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ పంపుల్లో ఇంధనం లేదని చెప్పడం, కొంతసేపు పంపులను మూసివేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని, ఈ పరిస్థితులు ప్రజల్లో భయాందోళనలను కలిగించాయని చెప్పారు. దేశానికి అవసరమైన ఇంధనం కొరత లేకుండా ఉండేందుకు, ఇతర దేశాలు నిర్ణయించిన ధరలను చెల్లించి అయినా సరే, పెట్రోల్, డీజిల్ వంటి ఉత్పత్తులను దేశానికి తీసుకురావడంలో కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని దేశాలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారని తెలిపారు. దేశంలో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని, ఈ పరిస్థితుల్లో మనం ఇంధన వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ, దేశవ్యాప్తంగా రైల్వేలను విద్యుదీకరణ చేస్తూ, పెట్రోల్ వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. కొరత పేరుతో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఎక్కువ ధరకు అమ్మినా, స్టాక్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ప్రజలు, వ్యాపారులకు కావాల్సిన వాటిని సకాలంలో చేర్చేలా కంపెనీలు, ఏజెన్సీలు చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనల ప్రకారం గతంలో గ్యాస్ బుక్ చేసుకున్నట్టుగా ఇంటి దగ్గరకి వచ్చి ఇస్తారని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పొల్చితే మన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, కొంతమేర ధరల తగ్గిస్తే ప్రజలకు ఉపశమనం కలిగించినట్టు అవుతుందన్నారు. ప్రజలకు భారం కావొద్దని కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించద్దని చెప్పారు. ఈ సమావేశంలో జగన్మోహన్రెడ్డి, అమరేందర్‌రెడ్డి, సుశీల్‌కుమార్ రాయ్, నిలేశ్, పీయూష్ మిత్తల్ పాల్గొన్నారు. -
ఇదేందయ్యా ఇది.. ఇలా పెట్రోల్ తీసుకెళ్తారు!
-
4 లీటర్ల పెట్రోలు దాచాడని... 21 రోజుల జైలు, జరిమానా!
కొలంబో: పశ్చిమాసియా కల్లోలం పుణ్యమా అని పెట్రోలు, డీజిల్, ఎల్పీజీ ఇప్పుడు బంగారం కంటే ప్రియంగా మారాయి. ఈ నేపథ్యంలో కేవలం 4 లీటర్ల పెట్రోలును ఇంట్లో దాచిన పాపానికి ఓ వ్యక్తి ఏకంగా కటకటాలపాలు కావాల్సి వచ్చింది! ఈ వింత ఉదంతం శ్రీలంకలో చోటుచేసుకుంది. ఉత్తర శ్రీలంకలోని నికవెరతియా ప్రాంతానికి చెందిన లసంత కుమార బాలసూర్య (48) ఇంట్లో సోదాల్లో 4 లీటర్ల పెట్రోల్ దొరికింది. దాంతో పోలీసులు మనవాడిని అరెస్టు చేసి బోనెక్కించారు. తల్లిదండ్రుల శ్రాద్ధకర్మ నిమిత్తం ఇంటి పరిసరాల్లోని చెత్తను కాల్చేందుకు ఆ పెట్రోలు తెచ్చుకున్నానని మొత్తుకున్నా లాభం లేకపోయింది.అతనికి 21 రోజుల జైలు శిక్ష, రూ.1,500 జరిమానా విధిస్తూ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన వెంటనే ఇంధన అక్రమ నిల్వలపై లంక కఠిన నిషేధం విధించింది. కనుక, దాచింది నాలుగు లీటర్లే అయినా నేరం నేరమే పొమ్మంటూ చట్టం ఇలా తన పని తాను చేసుకుపోయింది! పౌరుల పెట్రోల్, డీజిల్ వాడకంపై లంక ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. వాటి అమలుకు మార్చి 15 నుంచి క్యూఆర్ ఆధారిత విధానం తెచ్చింది. దాని ప్రకారం కార్లకు వారానికి 15 లీటర్లు, బస్సులకు 60 లీటర్లు మాత్రమే అనుమతిస్తారు. -
సజావుగా పెట్రో ఉత్పత్తుల సరఫరా
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాకు సంబంధించి సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి తెలిపారు. పశి్చమాసియాలో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం సాయంత్రం నిర్వహించిన వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు అంశాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని చెప్పారు. 33 జిల్లాల్లోనూ గ్యాస్ సరఫరా, పెట్రోల్, డీజిల్ విక్రయాలు.. బ్లాక్ మార్కెట్ నిరోధానికి కమిటీలు ఏర్పాటు చేసి నోడల్ అధికారులను నియమించినట్టు సీఎం తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో ఆస్పత్రులు, పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను పంపుతున్నట్టు సీఎం వెల్లడించారు.ప్రతి బంక్‌లో స్టాక్ ఎంత ఉంది.. ఎంత వినియోగిస్తున్నారనే దానిపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని సీఎం తెలిపారు. తెలంగాణలో సాధారణ రోజుల్లో రోజుకు 36,189 కిలోలీటర్ల పెట్రోల్, డీజిల్ వినియోగం జరుగుతుందని, ప్రస్తుతం 1,88,210 కిలోలీటర్ల నిల్వలు ఉన్నట్టు సీఎం వివరించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై సోషల్ మీడియాలో భయాందోళనలు కలిగేలా పోస్టులు పెడు తున్న వారిపై చట్టపరమైన చర్య తీసుకుంటున్నట్టు తెలిపారు. శిలాజ ఇంధనాలపై దృష్టి...తెలంగాణలో శిలాజ ఇంధనాలపై (బొగ్గు, చమురు, గ్యాస్) ఆధార పడడం తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని.. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి పెంచుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణలో ఈవీలపై వంద శాతం రోడ్డు పన్ను, రిజి్రస్టేషన్ ఫీజు మినహాయించామన్నారు. ఈవీల తయారీ, బ్యాటరీ ఎకో సిస్టమ్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్టు పీఎం మోదీ దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ నగరంలో 1.20 లక్షలకు పైగా ఉన్న పెట్రోల్, డీజిల్ ఆటోలను రెట్రో ఫిటింగ్ ద్వారా ఈవీలుగా మార్చే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఆరీ్టసీలో ఇక ముందు అన్ని ఈవీ బస్సులనే వినియోగించనున్నట్టు సీఎం రేవంత్ ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి పాల్గొన్నారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్‌రెడ్డి కేరళ, అసోం, గోవా, పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో కీలకంసాక్షి, న్యూఢిల్లీ: సీఎం రేవంత్‌రెడ్డికి జాతీ యస్థాయిలో ప్రాధాన్యం పెరుగుతోంది. ఏఐసీసీ తాజాగా ప్రకటించిన పుదుచ్చేరితోపాటు కేరళ, అసోం, గోవా రాష్ట్రాల స్టార్ క్యాంపెయినర్ల జాబితాల్లో ఆయనకు చోటు దక్కింది. కేరళ, అసోం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రకటించిన 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాలలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాం«దీ, ప్రియాంక గాం«దీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లతోపాటు రేవంత్‌రెడ్డి ఉన్నారు. పుదుచ్చేరి జాబితాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్లకు కూడా చోటు దక్కింది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ సమరి్పంచింది. -
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ పన్ను తగ్గింపు
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధనం ధరలు పెరిగిపోతున్నాయి. చాలాదేశాల్లో ఇంధన అత్యవసర పరిస్థితి విధించారు. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.10 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని రద్దు చేసింది. దీనివల్ల చమురు కంపెనీలపై భారం తగ్గి, రిటైల్ ధరల పెరుగుదలను అరికట్టినట్లు అయ్యిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతుండడంతో మనదేశంలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.ఎక్సైజ్ డ్యూటీని భారీగా తగ్గించడంతో వినియోగదారులపై అదనంగా ఎలాంటి భారం పడబోదని సమాచారం. ప్రస్తుతం పెట్రోల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ పన్ను లీటర్‌కు రూ.13 ఉండగా.. తాజాగా రూ.10 తగ్గించడంతో అది రూ.3కు చేరుకుంది. డీజిల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ పన్ను లీటర్‌కు రూ.10 ఉంది. తగ్గింపు తర్వాత సున్నాకు చేరింది. ఈ తగ్గింపుతో ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి రూ.1.75 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని పరిశ్రమ వర్గాల అంచనా. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో చమురు ధరల పెరుగుదల నుంచి ప్రజలకు రక్షణ లభిస్తుందంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. రిటైల్ ధరలు యథాతథం ముడి చమురు ధరల పెరుగుదల వల్ల ఆయిల్ కంపెనీలు నష్టపోతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.24, డీజిల్‌పై లీటర్‌కు రూ.30 చొప్పున నష్టం వస్తోందని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి చెప్పారు. ప్రత్యేక అదనపు ఎక్సైజ్ పన్ను తగ్గడంతో ఆయిల్ కంపెనీలు కొంతవరకు కోలుకుంటాయని, నష్టాలు భర్తీ అవుతాయని అధికారులు అంటున్నారు. రిటైల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. అంటే ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు ప్రయోజనం నేరుగా వినియోగదారులకు బదిలీ అయ్యే అవకాశం లేదు.పరోక్షంగానే ప్రయోజనం ఉంటుంది. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత రిఫైనరీలకు వచ్చిన లాభాల నేపథ్యంలో 2022 జూలైలో తొలిసారిగా ప్రవేశపెట్టి, 2024 డిసెంబర్లో ఉపసంహరించుకున్న ఎక్స్‌పోర్టు పన్నును ప్రభుత్వం పునరుద్ధరించింది. డీజిల్‌పై లీటర్‌కు రూ 21.50, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్)పై లీటర్‌కు రూ.29.50 చొప్పున ఎగుమతి సుంకాన్ని(విండ్‌ఫాల్ ట్యాక్స్) విధించింది. అయితే, ఈసారి ఓఎన్జీసీ వంటి సంస్థలు దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై ఎలాంటి విండ్‌ఫాల్ పన్ను విధించలేదు. ఎన్నికల కోసమే ఈ స్టంట్: కాంగ్రెస్ పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు పట్ల విపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ వ్యంగ్యంగా స్పందించారు. ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే ప్రభుత్వం ఈ స్టంట్‌కు తెరతీసిందని విమర్శించారు. గత 12 ఏళ్లలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు చాలాసార్లు తగ్గాయని, అప్పుడు మన దేశంలో రిటైల్ చమురు ధరలు తగ్గించలేదని చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు ఉండడంతో ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ‘ఏప్రిల్ 30 దాకా వెయిట్ చేయండి’అంటూ జైరామ్ రమేశ్ శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఆ తర్వాత రిటైల్ ధరలు పెరుగుతాయని పరోక్షంగా తేలి్చచెప్పారు. -
సుంకం తగ్గినా తగ్గని ధరలు.. సామాన్యుడికి మొండిచేయి!
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల అస్థిరత, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ ఇంధన రంగంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ, సామాన్య వినియోగదారుడికి మాత్రం బంకుల వద్ద ధరల్లో తక్షణ ఉపశమనం లభించలేదనే వాదనలున్నాయి. చమురు విక్రయ సంస్థల (ఓఎంసీ) నష్టాలను పూడ్చేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.సుంకాల కోత.. మారని ధరలు!కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.13 నుంచి రూ.3కి తగ్గించింది. అలాగే, గతంలో లీటరుకు రూ.10గా ఉన్న డీజిల్ ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తొలగించింది. అయితే, ఈ తగ్గింపు ప్రయోజనం నేరుగా వినియోగదారుడికి బదిలీ కావడం లేదు. హార్మూజ్ జలసంధి మూసివేత భయాలు, మధ్యప్రాచ్య దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరాకు అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో పెరిగిన దిగుమతి వ్యయాన్ని తట్టుకోవడానికి, చమురు సంస్థల ఆర్థిక రికవరీకి సహాయపడటానికే ఈ సుంకాల కోత ఉపయోగపడనుంది.నయారా ఎనర్జీ ధరల పెంపుదేశంలో ప్రధాన ప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థ అయిన నయారా ఎనర్జీ వినియోగదారులపై ధరల భారాన్ని మోపింది. అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరల పెరుగుదల వల్ల ఏర్పడిన సేకరణ ఖర్చులను భర్తీ చేసేందుకు పెట్రోల్ లీటరుకు రూ.5 పెంచింది. డీజిల్ లీటరుకు రూ.3 పెంచింది. రోస్నెఫ్ట్ మద్దతు గల ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న తన 6,967 ఫిల్లింగ్ స్టేషన్లలో ఈ పెంపును అమలు చేసింది. వివిధ రాష్ట్రాల్లో ఉండే వ్యాట్ వ్యత్యాసాల వల్ల కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.5.30 వరకు అదనంగా పెరిగే అవకాశం ఉంది.ప్రధాన నగరాల్లో తాజా ధరలు (మార్చి 27)ప్రభుత్వ రంగ సంస్థల (ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్) ఇంధన ధరల్లో మార్పులు లేనప్పటికీ నగరాల వారీగా ప్రస్తుత ధరలు ఇలా ఉన్నాయి.నగరంపెట్రోల్ (లీటరుకు)డీజిల్ (లీటరుకు)ఢిల్లీరూ. 94.72రూ. 87.62ముంబైరూ. 104.21రూ. 92.15బెంగళూరురూ. 102.84రూ. 88.95హైదరాబాద్రూ. 107.41రూ. 95.65చెన్నైరూ. 100.75రూ. 92.34 గమనిక: పైన పేర్కొన్నవి ప్రభుత్వ రంగ సంస్థల ధరలు. ప్రైవేట్ బంకుల్లో (నయారా వంటివి) ఈ ధరలు రూ.3 నుంచి రూ.5 వరకు ఎక్కువగా ఉండవచ్చు.ఎందుకీ అస్థిరత?ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు సరఫరా గొలుసును దెబ్బతీస్తున్నాయి. దీనివల్ల బ్యారెల్ ముడిచమురు ధర అమాంతం పెరిగింది. ప్రైవేట్ సంస్థలు తమ నష్టాలను తగ్గించుకోవడానికి ధరలను పెంచగా ప్రభుత్వ సంస్థలు ఎక్సైజ్ సుంకం తగ్గింపు ద్వారా ఆ నష్టాన్ని భర్తీ చేసుకుంటున్నాయి. వెరసి, సామాన్యుడికి ఒరిగేదేమీ లేదు.ఇదీ చదవండి: విడాకులు ఇస్తే ఉమ్మడి ఆస్తి ఎవరిది? -
డీజిల్..పెట్రో.. ఇదేమిట్రో!
హైదరాబాద్: అసలే కొరత.. ఆపై అక్రమ విక్రయం కొంత.. పశ్చిమాసియా యుద్ధం, చమురు సంస్థల నిబంధనల వల్ల కొన్ని పెట్రోల్ బంక్‌లు నో స్టాక్ బోర్డు పెడుతున్నాయంటూ వచి్చన వదంతులకు వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్‌కు కటకట ఏర్పడిందంటూ వచి్చన వాహనదారులతో బంక్‌లు కిటకిటలాడుతున్నాయి. తెరిచి ఉన్న ఏ బంకు వద్ద చూసినా డీజిల్, పెట్రోల్ కోసం వాహనదారుల బారులే బారులు.. ఈ నేపథ్యంలో కూకట్పల్లి ఆలి్వన్ కాలనీలోని ఓ బంక్ నిర్వాహకులు.. విడిగా బాటిళ్లు, క్యాన్లు పట్టుకొని వచి్చనవారికి కూడా డీజిల్, పెట్రోల్ విక్రయిస్తున్నారు. ఇది చట్టవిరుద్ధం. ప్రమాదకరం కూడా. అధికారులు నిఘా పెట్టి అక్రమ విక్రయాన్ని అడ్డుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. -
రెండు నెలల దాకా నో ఫికర్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం ఇండియాలో భయాందోళనలు సృష్టిస్తోంది. ప్రధానంగా ఇంధనం విషయంలో జనం బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం పంపుల వద్ద బారులు తీరుతున్నారు. గృహ వినియోగ ఎల్పీజీ సరఫరాలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా వాణిజ్య ఎల్పీజీ సరఫరా తగ్గింది. హోటళ్లు మూతపడుతున్నాయి. ఇంధనం విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో గందరగోళం మరింత పెరిగిపోతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం పదేపదే ప్రకటనలు చేస్తున్నా వదంతులు మాత్రం ఆగడం లేదు. అందుకే ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇచ్చింది. దేశంలో 60 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలున్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. మరో రెండు నెలల దాకా మనకు ఢోకా లేదని భరోసా ఇచ్చింది. అలాగే 8 లక్షల టన్నుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని, దీంతో దేశమంతటా ఒక నెల మొత్తం గ్యాస్ అవసరాలు తీరుతాయని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఎంతమాత్రం లేదని వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగా కొందరు తప్పుడు ప్రచారం చేయడం వల్ల జనం ఆందోళనకు గురై ఇంధనం కోసం ఎగబడ్డారని తెలిపింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ప్రభుత్వం మన దేశంలో చమురు, ఎల్పీజీ నిల్వల వివరాలను బయటపెట్టడం ఇదే మొదటిసారి. ‘క్యాష్ అండ్ క్యారీ’వల్ల అంతరాయం నిజమే దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ పంపుల్లో చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ స్పష్టంచేసింది. అవి సాధారణంగానే పని చేస్తున్నాయని, చమురు సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదంటూ వివరణ ఇచ్చింది. కొన్నిచోట్ల పరిమితంగానే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నారంటూ వచ్చిన వార్తలను ఖండించింది. చమురు కంపెనీలు కొత్తగా అమలు చేస్తున్న ‘క్యాష్ అండ్ క్యారీ’విధానం వల్ల చిన్న పట్టణాల్లో కొంత అంతరాయం ఏర్పడిన మాట వాస్తవమేనని అంగీకరించింది. నిధుల సమస్య కారణంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడకుండా చర్యలు చేపట్టామని, ఈ విషయంలో పంపుల యజమాన్యాలకు సహకరిస్తున్నట్లు పేర్కొంది. ఇంధనం, ఎల్పీజీ సరఫరా ప్రస్తుతం పూర్తి సురక్షితంగా, నియంత్రణలోనే ఉన్నట్లు వెల్లడించింది. అన్ని రిటైల్ ఇంధన కేంద్రాల్లో తగినంత నిల్వలు ఉన్నాయని పునరుద్ఘాటించింది. ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా దురుద్దేశపూర్వకంగా సాగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరూ విశ్వసించవద్దని విజ్ఞప్తి చేసింది. 150కిపైగా దేశాల నుంచి దిగుమతి ప్రపంచంలో అత్యధిక చమురు శుద్ధి సామర్థ్యం కలిగిన నాలుగో దేశం భారత్. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల్లో ఐదో స్థానంలో ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం, హార్మూజ్ జలసంధి మూసివేత వల్ల ముడి చమురు, గ్యాస్ దిగుమతులు సగానికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత తలెత్తకుండా 150కిపైగా దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. మనదేశంలో అన్ని రిఫైనరీలు 100 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నాయని, రాబోయే 60 రోజులకు సరిపడా ముడి చమురు సరఫరాల ఒప్పందాలను భారతీయ చమురు కంపెనీలు ఇప్పటికే ఖరారు చేసుకున్నాయని స్పష్టంచేసింది. మన దగ్గర మొత్తం 74 రోజులకు సరిపడా ముడి చమురును, ఇంధనాన్ని నిల్వ చేసకొనే సామర్థ్యం ఉన్నట్లు వెల్లడించింది.ఇంధన ఎమర్జెన్సీకి ఆస్కారం లేదు ప్రపంచంలో ఎక్కడం ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నా సరే మన దగ్గర ప్రతి పౌరుడికి రెండు నెలలపాటు స్థిరంగా ఇంధనం సరఫరా చేయగలమని కేంద్రం తెలిపింది. రాబోయే కొన్ని నెలలపాటు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టామని వెల్లడించింది. ఎల్పీజీ విషయంలో దేశీయంగానే ఉత్పత్తిని పెంచుతున్నామని, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకుంటున్నామని కేంద్రం స్పష్టంచేసింది. ఇంధనం, గ్యాస్‌పై తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కొన్ని దేశాల్లో జాతీయ ఇంధన ఎమర్జెన్సీ విధించారని, సరఫరా తగ్గించారని, ధరలు పెంచారని.. మన దేశంలో అలాంటి పరిస్థితికి ఆస్కారమే లేదని తేల్చిచెప్పింది. -
పెట్రోల్ కష్టాలకు చెక్.. ఇదిగో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు!
ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా.. భారతదేశంలో పెట్రోల్ కొరత ఏర్పడిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం ఇంధన కొరత లేదని చెబుతున్నప్పటికీ.. హైదరాబాద్ వంటి నగరాల్లో.. వాహనదారులు పెట్రోల్ కోసం బంకుల దగ్గర బారులు తీరారు. ఈ తరుణంలో కొత్త కారు కొనాలకునేవారు ఈవీలపై ద్రుష్టి సారిస్తున్నారు. కాబట్టి ఈ కథనంలో గొప్ప మైలేజ్ ఇచ్చే బెస్ట్ కార్లు గురించి తెలుసుకుందాం.👉టాటా టియాగో ఈవీ: 187 కిమీ (24 కిలోవాట్ బ్యాటరీ)👉టాటా టిగోర్ ఈవీ: 190 కిమీ (26 కిలోవాట్ బ్యాటరీ)👉ఎంజీ కామెట్ ఈవీ: 193 కిమీ (17.3 కిలోవాట్ బ్యాటరీ)👉సిట్రోయెన్ eC3: 228 కిమీ (29.2 కిలోవాట్ బ్యాటరీ)👉ఎంజీ విండ్సర్ ఈవీ: 308 కిమీ (38 కిలోవాట్ బ్యాటరీ)👉ఎంజీ జెడ్ఎస్ ఈవీ: 339 కిమీ (50.3 కిలోవాట్ బ్యాటరీ)👉టాటా నెక్సాన్ ఈవీ: 350 కిమీ (45 కిలోవాట్ బ్యాటరీ)👉కియా కారెన్స్ క్లావిస్ ఈవీ: 364 కిమీ (51.4 కిలోవాట్ బ్యాటరీ)👉టాటా కర్వ్ ఈవీ: 365 కిమీ (55 కిలోవాట్ బ్యాటరీ)👉టాటా హారియర్ ఈవీ: 401 కిమీ (75 కిలోవాట్ బ్యాటరీ)👉హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్: 432 కిమీ (51.4 కిలోవాట్ బ్యాటరీ)👉మహీంద్రా బీఈ 6: 449 కిమీ (79 కిలోవాట్ బ్యాటరీ)👉మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ: 456 కిమీ (79 కిలోవాట్ బ్యాటరీ)👉మహీంద్రా XEV 9S: 478 కిమీ (79 కిలోవాట్ బ్యాటరీ) -
పెట్రోల్ కోసం పరుగులు.. కొరత ఉందా.. అపోహా..?
-
గుంటూరులో పెట్రోల్ కష్టాలు మూతపడ్డ 8 బంకులు
-
పెట్రోల్‌కు ప్రత్యామ్నాయం.. జనం షాకింగ్ నిర్ణయం!
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే భయాందోళనలు అందరిలో నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో పలువురు వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద ఇంధనం కోసం కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు. అయితే గంటల తరబడి వేచి చూసినా చుక్క పెట్రోల్ దొరకని దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో సామాన్యులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు.పెట్రోల్ కష్టాలు.. ఈవీ వైపు అడుగులుయుద్ధం ఎఫెక్ట్‌తో చమురు కొరత ఏర్పడవచ్చన్న వార్తల నేపథ్యంలో హైదరాబాద్‌లోని పెట్రోల్ బంకుల వద్ద తీవ్ర రద్దీ కనిపిస్తోంది. అయితే ఈ ఇబ్బందులను భరించలేక చాలా మంది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వైపు మళ్లుతున్నారు. తాజాగా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ వద్ద వినియోగదారులు తమ గోడును వెళ్లగక్కారు.వినియోగదారుల ఆవేదనఒక కస్టమర్ మాట్లాడుతూ ‘పెట్రోల్ కోసం మూడు నాలుగు గంటల పాటు లైన్లో నిలబడినా ఫలితం ఉండటం లేదు. జేబులో డబ్బులు ఉన్నా.. ఇంధనం దొరకడం లేదు. ఈ టెన్షన్ కంటే ఒక ఎలక్ట్రిక్ బండి కొనుక్కోవడం ఎంతో ఉత్తమం అనిపించింది. అందుకే ఆలోచించకుండా ఈరోజే కొత్త ఈవీ స్కూటర్‌ను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్తున్నాను’ అని పేర్కొన్నారు.పెట్రోల్ ధరల పెరుగుదల, పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని నిర్ణయించుకున్నానని ఒక వినియోగదారుడు అనగా, మరొకరు..పెట్రోల్ కోసం దాదాపు 30 నుండి 40 నిమిషాలు లైన్లో నిలబడాల్సి వచ్చిందని, భవిష్యత్తులో పెట్రోల్ కొరత ఏర్పడితే రోజువారీ అవసరాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయంగా ఈవీని ఎంచుకున్నట్లు తెలిపారు. ఇంకొక వినియోగదారుడు మాట్లాడుతూ తన కుమార్తె కోసం గత 6 నెలల నుండి ప్లాన్ చేస్తున్నామని, ఆమెకు సరైన వయసు రావడంతో ఇప్పుడు ఈవీ కొనిచ్చామని చెప్పారు.. నాన్న స్కూటర్ కొనిచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, తాను, తన తమ్ముడు కలిసి ఈ కలర్‌ను ఎంచుకున్నామని కుమార్తె తెలిపింది.‘నిన్న రాత్రి పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీని చూసి, భవిష్యత్తులో పెట్రోల్ దొరకదేమో అనే భయంతో ఈ రోజే ఈవీ బండిని డెలివరీ తీసుకున్నట్లు ఒక వినియోగదారుడు చెప్పారు. బండి ముందు భాగంలో సరుకులు పెట్టుకోవడానికి చాలా ఖాళీ స్థలం ఉందని, వ్యాపార అవసరాలకు ఇది చాలా సౌకర్యంగా ఉందని అన్నారు. దీనికి జీరో మెయింటెనెన్స్ అని తెలిపారు. తన దగ్గర పాత యాక్టివా ఉన్నప్పటికీ, పెట్రోల్ కష్టాల వల్ల దీనికి మారానని పేర్కొన్నారు. ఈవీ షోరూమ్‌ల వద్ద సందడిగత రెండు రోజులుగా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు అమాంతం పెరిగాయని షోరూమ్ యజమానులు చెబుతున్నారు. కేవలం పెట్రోల్ భయం మాత్రమే కాకుండా, ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేకపోవడం, తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం (100-120 కి.మీ) ప్రయాణించే వీలుండటంతో సామాన్యులు వీటిని కొనేందుకు క్యూ కడుతున్నారు. పెట్రోల్ కష్టాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రోడ్లపై కేవలం ఎలక్ట్రిక్ వాహనాలే ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: కేంద్రం
👉కొరత వదంతులను కొట్టిపారేసిన కేంద్రందేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయికొరత వదంతులను కొట్టిపారేసిన కేంద్రం👉డిమాండ్ కంటే సప్లై ఎక్కువ చేస్తున్నాం: స్టీఫెన్ రవీంద్ర తెలంగాణలో మొత్తం పెట్రోల్ బంకులు 4321సాధారణంగా 5883 కిలో లీటర్ల పెట్రోల్ అవసరంనిన్న ఒక్కరోజు పెట్రోల్ 10,799.5 కిలో లీటర్ల విక్రయంనిన్న ఒక్కరోజు 84 శాతం పెట్రోల్ అధికంగా విక్రయంసివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడి13,231 కిలో లీటర్ల డీజిల్ ప్రతినిత్యం సాధారణంగా అవసరంనిన్న ఒక్కరోజు 22,127 కిలో లీటర్ల డీజిల్ విక్రయం2173 డీజిల్ ట్యాంకర్లు ఉన్నాయి1056 పెట్రోల్ ట్యాంకర్లు ఉన్నాయిఎల్పీజీ డొమెస్టిక్ 1.28 కోట్ల కనెక్షన్లు ఉన్నాయి, కమర్షియల్ 63,550 కనెక్షన్లు ఉన్నాయిడిమాండ్ కంటే సప్లై ఎక్కువ చేస్తున్నాంపైప్ న్యాచురల్ గ్యాస్ లో లక్షా మూడు వేల 275 కనెక్షన్లు ఉన్నాయిసీఎన్జీ స్టేషన్లు 225 ఉన్నాయి..PNG, CNG expansion చేయడానికి చర్యలు తీసుకుంటున్నాంసప్లై చైన్ లో ఇబ్బంది లేకుండా చర్యలుఅడ్డగోలుగా పెట్రోల్ ధరలు👉 సూర్యాపేట జిల్లా: హుజూర్నగర్ లో పెట్రోల్ బంకుల్లో పెరిగిన పెట్రోల్ ధరలుఓ బంకులో ఏకంగా లీటర్ పెట్రోల్ కు ఐదు రూపాయలకు పైగానే వడ్డన అదేంటని ప్రశ్నించిన వినియోగదారులకు సమాధానం చెప్పని బంకు నిర్వాహకులు👉పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న పుకార్లు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగడంతో పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు భారీగా క్యూలు కట్టారు. ప్రజలు భయాందోళన చెందడంతోనే అమ్మకాలు ఈ స్థాయిలో పెరిగాయని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఇంధన కొరత ఉందనే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ స్పష్టం చేశారు. సుమారు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. అందువల్లే నో స్టాక్ బోర్డులు👉 విజయవాడ: ఏపీ సివిల్ సప్లై డైరెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ఆయిల్ కంపెనీలు, పెట్రోల్ డీలర్స్, సివిల్ సప్లై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్అడ్వాన్స్ లు చెల్లించినా సరఫరా నిలిపివేస్తున్నారంటున్న డీలర్లుఅందువల్లే నో స్టాక్ బోర్డు పెడుతున్నామన్న పెట్రో డీలర్ల ఫెడరేషన్సడెన్ గా ఇండెంట్ క్యాన్సిల్ చేయడంతోనే సమస్య వస్తోందని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫెడరేషన్ఏపీ వ్యాప్తంగా 5 వేల పెట్రోల్ బంకులుట్యాంకర్లను తామే స్వయంగా పర్యవేక్షిస్తామన్న అధికారులుఈరోజు సాయంత్రంలోగా లాగిన్ యాక్సిస్ ప్రభుత్వానికి ఇవ్వాలని ఓఎంసీలకు ఆదేశంగుంటూరులో మూతపడుతున్న పెట్రోల్ బంకులు👉 గుంటూరు సిటీలో పెట్రోల్ లేక మూతపడుతున్న పెట్రోల్ బంకులునగరంలో పెట్రోల్ లేక మూతపడ్డ 8 పెట్రోల్ బంకులుపెట్రోల్ ఉన్న బంకుల్లో పెట్రోల్ కోసం బారులు తీరిన జనంప్రభుత్వం అంతా బానే ఉంది అని చెప్తోంది కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉందని మండిపడుతున్న ప్రజలుఇప్పటికే గ్యాస్ దొరకట్లేదు నూనె ధరలు పెరిగాయి ఇప్పుడు పెట్రోల్ దొరకట్లేదని ఆగ్రహిస్తున్న ప్రజలు👉కృష్ణాజిల్లా: గుడివాడ పట్టణంలో పెట్రోల్ బంక్‌లు మూతపడ్డాయి. బంక్‌ల వద్ద నో పెట్రోల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. గుంటూరు సిటీలో పెట్రోల్ లేక బంక్‌లు మూతపడుతున్నాయి. నగరంలో 8 పెట్రోల్ బంక్‌లు మూతపడ్డాయి. పెట్రోల్ కోసం జనం బారులు తీరారు. ప్రభుత్వం అంతా బానే ఉందని చెప్తోంది కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే దారుణంగా ఉందంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికే గ్యాస్ దొరకట్లేదని.. నూనె ధరలు పెరిగాయని.. ఇప్పుడు పెట్రోల్ దొరకట్లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పెట్రోల్ కోసం రాజేష్ కష్టాలు
-
60 రోజులకు సరిపడా నిల్వలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇంధన కొరత ఉందనే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ స్పష్టం చేశారు. సుమారు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఇంధన సరఫరాపై తలెత్తిన అపోహలు, పెట్రోల్ బంక్‌ల వద్ద రద్దీ తదితర పరిణామాల నేపథ్యంలో ఆయన బుధవారం బంజారాహిల్స్‌లోని టీజీ ఐసీసీసీలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన, అదనపు సీపీ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ ఎన్.శ్వేతలతో పాటు పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జనర్ మాట్లాడుతూ.. ‘ఆయిల్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. నగర వ్యాప్తంగా సరఫరా నిరాటంకంగా కొనసాగుతోంది. ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు వచ్చి వాహనాలకు ఫుల్ ట్యాంకులు చేయించుకోవడంతో డిమాండ్ పెరిగింది. ఈ కారణంగానే కొన్ని చోట్ల తాత్కాలికంగా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీన్ని కొరతగా భావించవద్దు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 22న 3,024 కిలో లీటర్ల ఇంధనం అమ్ముడు కాగా... కొరత వదంతుల నేపథ్యంలో 23న 6,400 కిలో లీటర్లకు చేరుకుంది’ అన్నారు.ప్రజల భయాందోళనతోనే..‘ప్రజలు భయాందోళన చెందడంతోనే అమ్మకాలు ఈ స్థాయిలో పెరిగాయి. ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా బాటిళ్లు, డబ్బాల్లో లూజ్ పెట్రోల్ లేదా డీజిల్ విక్రయించే బంకులపై చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియాలో ప్రజలను భయాందోళనలకు గురిచేసే వారిపై నిఘా ఉంచాం. అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. కమిషనరేట్ పరిధిలోని 240 పెట్రోల్ బంకుల్లో పరిస్థితిని సివిల్ సప్లైస్, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నాం’ అన్నారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ.. ‘ఆయిల్ సంస్థలు, పౌర సరఫరాల శాఖ అధికారులతో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నాం. ప్రజల సౌకర్యార్థం ప్రత్యేకంగా కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేశాం. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా పరిధిలోని 186 బంకుల్లో ఇంధన సరఫరా సజావుగా సాగుతోంది. ప్రజలు అనవసర ఆందోళనతో బంకుల వద్ద రద్దీ పెంచవద్దు. నిత్యావసర సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. క్షేత్రస్థాయిలో యంత్రాంగం అప్రమత్తంగా ఉంది’ అని కోరారు. -
బంకులు.. బారులు
సాక్షి, హైదరాబాద్: ఇంధనం సెగ రాష్ట్రంలోని వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆయిల్ కొరత వార్తలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే దేశంలో ఎక్కడా చమురు కొరత లేదని కేంద్రం స్పష్టం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే విషయం పదేపదే చెబుతోంది. ఆయిల్ కంపెనీలు సైతం సరిపడా డీజిల్, పెట్రోల్ నిల్వలున్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటనలిస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. హైదరాబాద్ మహానగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గత రెండు మూడురోజులుగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులుతీరి కన్పిస్తున్నారు. గంటలకొద్దీ పడిగాపులు పడుతున్నారు. కార్లు, ద్విచక్ర వాహనాలు కిక్కిరిసి ఉంటున్నాయి. కొన్ని బంకులు నిరాటంకంగా పని చేస్తుంటే.. కొన్నిచోట్ల మాత్రం బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కన్పిస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం, చమురు, సహజ వాయువుల కొరత వార్తల నేపథ్యంలో ఈ నో స్టాక్ బోర్డులు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వాహనదారులు అవసరం ఉన్నా, లేకపోయినా డీజిల్, పెట్రోల్ ట్యాంక్ నిండా నింపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా ఏరోజు కారోజు ఇంధనం నింపుకునే క్యాబ్ డ్రైవర్లు, ఇతర గిగ్ వర్కర్లు, సామాన్య ప్రజలు కూడా ఎంతో కొంత అదనంగా ట్యాంకు నింపుకోవాలని చూస్తుండటంతో తెరిచి ఉన్న బంకుల వద్ద క్యూలు పెరిగిపోతున్నాయి. కొందరు సీసాలు, పెద్దపెద్ద క్యాన్లు, డ్రమ్ముల్లో సైతం ఇంధనం నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని బంకులు మూతపడి కన్పిస్తుండటంతో వాహనదారుల్లో ఆందోళన రెట్టింపవుతోంది. బంకులు మూత పడి ఉండటానికి ‘నో క్రెడిట్’ సమస్య ప్రధాన కారణమని తెలుస్తుండగా..ప్రభుత్వాలు, ఆయిల్ కంపెనీల ప్రకటనలను పట్టించుకోకుండా ప్రజలు ఎక్కడ పెట్రోల్, డీజిల్ దొరుకుతోందో తెలుసుకొని మరీ కొనుగోళ్లు చేస్తుండటంతో తెరిచి ఉన్న బంకులు కిక్కిరిసిపోయి కన్పిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోమవారం నుంచే.. పశ్చిమాసియాలో యుద్ధం ఎప్పుడో మొదలైనా..సోమవారం సాయంత్రం నుంచే బంకుల వద్ద డీజిల్, పెట్రోల్ కోసం వాహనదారులు క్యూలు కట్టడం ప్రారంభించారు. ఆ ఫొటోలు టీవీలు, సోషల్ మీడియాలో ప్రసారం కావడంతో చమురు కొరతపై భయాందోళనలు మొదలయ్యాయి. బంకులన్నీ వాహనదారులతో నిండిపోవడం మొదలయ్యింది. మంగళ, బుధవారాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. భారీగా పెరిగిన డిమాండ్ ఇంధన కంపెనీల లెక్కల ప్రకారం రాష్ట్రంలోని సుమారు 3,600 పెట్రోల్ బంకులకు సాధారణంగా రోజుకు సగటున 13,752 కిలోలీటర్ల ఇంధనం అవసరం ఉంటుంది. తదనుగుణంగా ఆయిల్ కంపెనీలు సగటున 14,729 కిలోలీటర్లు సరఫరా చేసేవి. కానీ ప్రస్తుతం డిమాండ్ ఒక్కసారిగా 17,246 కిలోలీటర్లకు చేరింది. దీనికి అనుగుణంగా ఆయిల్ కంపెనీలు కూడా సరఫరాను 17,898 కిలోలీటర్లకు పెంచినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కానీ ఇప్పటికీ కొన్ని బంకులు నోస్టాక్ బోర్డులతో మూతపడి కన్పిస్తున్నాయి. మరికొన్ని బంకులు వాహనాలతో కిక్కిరిసి ఉంటున్నాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల్లో రెట్టింపు స్థాయిలో పెట్రోల్ విక్రయాలు పెరిగినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నెల 22న 3,024 కిలోలీటర్ల ఇంధనం విక్రయాలు జరగ్గా, 23న ఇది రెట్టింపై 6,400 కిలోలీటర్లకు చేరుకుంది. వచ్చిన స్టాక్ వచ్చినట్టు ఖాళీ హైదరాబాద్, రంగారెడ్డితో పాటు మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో కూడా ఇంధనానికి అగచాట్లు ఎదురవుతున్నాయి. పరిశ్రమలు, రవాణా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో డీజిల్ వినియోగం గణనీయంగా పెరిగింది. వినియోగం పెరగడంతో ఉదయం వచ్చిన స్టాక్ అదే రోజు ఖాళీ అవుతోంది. దీంతో పలు పెట్రోల్ బంకులు మధ్యాహా్ననికే ‘నో స్టాక్’ బోర్డులు పెట్టేస్తున్నాయి. హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్‌లు హైదరాబాద్ నగరంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఉదయం నుంచే వాహనదారులు బంకుల వద్దకు చేరుకోవడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వస్తోంది. ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్ ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులన్నీ బుధవారం ఉదయం నుంచే వాహనదారులతో నిండిపోగా, ట్రాఫిక్ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. గచ్చిబౌలిలోని ప్యారడైజ్ వద్ద ఉన్న పెట్రోల్ బంక్‌ను పోలీసులే మూసివేయించినట్లు ఖాన్ అనే వైద్యుడు ‘సాక్షి’కి తెలిపారు. కొన్ని బంకుల వద్ద గంటల తరబడి వేచి చూసిన తర్వాత స్టాక్ అయిపోయిందని చెబుతున్న పరిస్థితి ఉంది. దీంతో సాధారణ ప్రజలతో పాటు హైదరాబాద్ నగరంలో వేల సంఖ్యలో ఉన్న ఆన్లైన్లో ఆహారం, నిత్యావసరాలు, ఇతర వస్తువులు చేరవేసే కార్మీకులు, ఉబర్, రాపిడోల వంటి ద్వారా సేవలందించే క్యాబ్ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు జిల్లాల్లో సైతం వాహనదారుల్లో ఆందోళన కొనసాగుతోంది. క్యాన్లలో పెట్రోల్‌తో ప్రమాదం డీజిల్, పెట్రోల్ కొరత లేదంటున్న ప్రభుత్వాలు, ఆయిల్ కంపెనీలు..ఈ విషయంతో పాటు వాస్తవ పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, వారు ఇబ్బందులు పడకుండా చూడాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్యాన్లలో పెట్రోల్ పోయవద్దని బంకుల యజమానులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు కూడా కేవలం అవసరమైన మేరకే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని, క్యాన్లలో నిల్వ ఉంచుకోవడం ప్రమాదకరం, చట్ట విరుద్ధం అని పేర్కొంటున్నారు. నో క్రెడిట్..అడ్వాన్స్ పేమెంట్‌తో అసలు సమస్య! రాష్ట్రంలో ఇంధనం కొరత లేదని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. ఇక డీలర్లు కూడా సంక్షోభానికి కారణం కొరత కాదని, ఆయిల్ కంపెనీలు తీసుకొచ్చిన కొత్త నిబంధనలేనని పేర్కొంటుండటం గమనార్హం. వారి కథనం ప్రకారం.. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో.. గతంలో ఉన్న ‘క్రెడిట్’ సౌకర్యాన్ని రద్దు చేసి, ‘అడ్వా¯న్స్ పేమెంట్’ పద్ధతిని అమలు చేస్తుండటంతో బంకుల యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు లక్షల్లో పేరుకు పోయిన పాత బకాయిలు కూడా సమస్య తీవ్రతకు కారణమవుతున్నట్లు తెలిసింది. పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త స్టాక్ ఇస్తామన్న కంపెనీల నిబంధనతో పలు బంకులు ఆర్డర్లు ఇవ్వలేకపోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బంకులు మూత పడుతున్నాయి. నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇది చూసి తెరిచి ఉన్న బంకులకు వాహనదారులు రెండు, మూడు రెట్ల ఎక్కువ సంఖ్యలో పోటెత్తుతుండటంతో..క్రెడిట్, ఇతర సమస్యల్లేని ఆ బంకుల్లో స్టాక్ గంటల్లోనే ఖాళీ అవుతోంది. పెట్రోల్, డీజిల్ కొరత లేదు: పౌరసరఫరాల శాఖ కమిషనర్ ‘రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు. రాష్ట్రంలో ఇప్పటికీ సుమారు 20 వేల కిలోలీటర్ల పెట్రోల్ అందుబాటులో ఉంది. సరఫరా వ్యవస్థలో కూడా ఎలాంటి అంతరాయం లేదు. మంగళవారం ఒక్కరోజే 1,500 పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లను పంపించాం. వాహనదారులు అనవసరంగా ఎక్కువ పెట్రోల్ నిల్వ చేసుకోవద్దు..’ అని పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని, అవసరం లేకుండా ఆయిల్ కొనుగోలు చేయవద్దని (ప్యానిక్ కొనుగోళ్లు) మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, పౌరసరఫరాల శాఖ అధికారులతో ఇంధన నిల్వలపై సమీక్ష జరిపారు. తప్పుడు ప్రచారం నమ్మొద్దు: హైదరాబాద్ సీపీ ‘హైదరాబాద్‌లో ఇంధనం కొరత లేదు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు. నగరంలో దాదాపు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు. నగర వ్యాప్తంగా చమురు సరఫరా నిరాటంకంగా కొనసాగుతోంది. అవసరానికి మించి కొనుగోలు చేయొద్దు. కేవలం వదంతుల వల్లే రద్దీ ఏర్పడుతోంది..’ అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన హెచ్చరించారు. నగరంలో తాజా పరిస్థితిపై బుధవారం టీజీసీసీసీలో వారు సమీక్ష జరిపారు. అవసరానికి మించి కొనుగోళ్లతో స్టాక్ ఖాళీ: డీలర్ల సంఘం ‘ఇంధన కొరత అంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుండటంతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద క్యూలు కడుతున్నారు. మళ్లీ ఆయిల్ దొరుకుతుందో లేదో అని అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో స్టాక్ త్వరగా అయిపోతోంది. ప్రజలు వదంతులు నమ్మొద్దు. ప్యానిక్ కొనుగోళ్లు నిలిపివేయాలి. కంటైనర్లు, సీసాల్లో కూడా తీసుకోకూడదు..’ అని తెలంగాణ పెట్రోలియం డీలర్ల సంఘం అధ్యక్షుడు ఎం.అమరేందర్‌రెడ్డి సూచించారు. ‘పాత బకాయిలు చెల్లిస్తేనే ఆయిల్ కంపెనీలు ఇంధనం సరఫరా చేస్తున్నాయి. క్రెడిట్ (ఉద్దెర)లో పెట్రోల్, డీజిల్ ఇవ్వడం లేదు. ఇది కొన్ని బంకులు మూతపడటానికి, తెరిచి ఉన్నచోట క్యూలు పెరగడానికి కారణమవుతోంది..’ అని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. -
పుకార్లు నమ్మొద్దు.. ఇంధన కొరత లేదు: సీపీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇంధన కొరత ఉందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ తెలిపారు. నగరంలో దాదాపు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని.. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.ఇంధన సరఫరాపై తలెత్తిన అపోహల నేపథ్యంలో ఇవాళ (బుధవారం) టీజీసీసీసీలో కలెక్టర్ హరిచందన, అదనపు సీపీ తప్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ శ్వేత, సివిల్ సప్లై అధికారులతో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. ఆయిల్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, నగరవ్యాప్తంగా సరఫరా నిరాటంకంగా కొనసాగుతోందని తెలిపారు.ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు వచ్చి వాహనాలకు ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వల్ల అకస్మాత్తుగా డిమాండ్ పెరిగి.. కొన్ని చోట్ల తాత్కాలికంగా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని.. దీనిని కొరతగా భావించవద్దని కోరారు. తప్పుడు ప్రచారాల వల్ల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 22న 3,024 కిలో లీటర్ల ఇంధనం అమ్ముడవగా, 23న ఆ సంఖ్య రెట్టింపై 6,400 కిలోలీటర్లకు చేరుకుందని, జనం భయాందోళన చెందడం వల్లే అమ్మకాలు ఈ స్థాయిలో పెరిగాయని పేర్కొన్నారు.ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా బాటిళ్లు, డబ్బాల్లో లూజ్ పెట్రోల్ లేదా డీజిల్ విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేసే వారిపై నిఘా ఉంచామని.. అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. కమిషనరేట్ పరిధిలోని 240 పెట్రోల్ బంకుల్లో పరిస్థితిని సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు.హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ.. ఆయిల్ సంస్థలు, సివిల్ సప్లై అధికారులతో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, ప్రజల సౌకర్యార్థం ప్రత్యేకంగా కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా పరిధిలోని 186 బంకుల్లో ఇంధన సరఫరా సజావుగా సాగుతోందని, ప్రజలు అనవసర ఆందోళనతో బంకుల వద్ద రద్దీ పెంచవద్దని కోరారు. నిత్యావసర సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, క్షేత్రస్థాయిలో యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రజలు వాస్తవాలను గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
కొత్త నిబంధనలు.. రేషన్ బియ్యం తరహాలో రేషన్ పెట్రోల్, డీజిల్
లుబ్లియానా: పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం ప్రపంచ దేశాలపై ప్రత్యక్షంగా పడుతోంది. ఇంధన కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంధన కొరతను ఎదుర్కొనే ప్రయత్నంగా యూరోపియన్ యూనియన్ సభ్యదేశం స్లోవేనియా ఇంధన రేషన్ విధానాన్ని అమలు చేసింది. దీంతో వాహన దారులు పెట్రోల్ బంకులకు పోటెత్తుతున్నారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించింది. దీని ఫలితంగా గల్ఫ్ దేశాల నుంచి ముడి చమురు, ఇతర సహజ వనరులు రవాణా చేసే నౌకలపై ప్రతికూల ప్రభావం ఏర్పడింది. ఈ అంతరాయాలను ఎదుర్కొనేందుకు స్లోవేనియా కొత్త చర్యలు చేపట్టింది. ఈ విధానాన్ని అమలు చేసిన తొలి యూరోపియన్ యూనియన్ దేశంగా నిలిచింది. స్లోవేనియా ప్రభుత్వం నిర్ణయంతో ఆ దేశంలోని పెట్రోల్, డీజిల్‌లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. దీంతో వాహన దారులకు పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. ఇంధన రేషన్ రూల్స్‌లో భాగంగా వ్యక్తిగత వాహనదారులు రోజుకు గరిష్టంగా 50 లీటర్ల ఇంధనం వరకు కొనుగోలు చేసుకోవచ్చు. వ్యాపారాలు, రైతులకు మరింత సడలింపు ఇచ్చి రోజుకు 200 లీటర్ల వరకు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. ఇంధనం కొరత లేదు‘స్లోవేనియాలో తగినంత ఇంధనం ఉంది. ఇంధనం గిడ్డంగులు నిండుగా ఉన్నాయి. ఇంధన కొరత ఉండదని నేను మీకు హామీ ఇస్తున్నాను’ అని ప్రధాన మంత్రి రాబర్ట్ గోలోబ్ అన్నారు. స్లోవేనియా ప్రభుత్వం నిర్ణయాలను అక్కడి పెట్రోల్ బంకులు నిర్వాహకులే అమలు చేయాలి. వినియోగదారులు అనుమతించిన పరిమాణం కంటే ఎక్కువ ఇంధనాన్ని నిల్వ చేసుకోకుండా ఉద్యోగులు నిర్ధారించుకోవాలి. ఈ సందర్భంగా విదేశీ డ్రైవర్ల కోసం కఠినమైన పరిమితులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఇంధన విక్రయ సంస్థలను కూడా ప్రోత్సహిస్తోంది.ఈ చర్యల ఫలితంగా స్లోవేనియాలో ‘ఫ్యూయల్ టూరిజం’ ఊపందుకుంది. స్లోవేనియాలో పెట్రోల్,డీజిల్ తక్కువ ధరకే లభ్యం కావడంతో దాని సరిహద్దు దేశాల ప్రజలు సైతం క్యూకట్టారు. స్లోవేనియాకు వచ్చి ఇంధనం కొనుగోలు చేస్తున్నారు. -
హైదరాబాద్ ను కుదిపేస్తున్న పెట్రోల్, డీజిల్ టెన్షన్
-
హైదరాబాద్ : పెట్రోల్ బంక్‌ల వద్ద భారీ క్యూ.. వదంతులతో జనం పరుగులు (ఫొటోలు)
-
మొదలైన పెట్రోల్.. డీజిల్ కష్టాలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు..
-
భారత్‌లో గ్యాస్, పెట్రోల్ సంక్షోభం..! మోదీ క్లారిటీ..
-
పెట్రోల్ రేటు పెంపు? చమురు కొరతపై మోదీ రివ్యూ మీటింగ్..
-
పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారుల అవస్థలు
-
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం
-
నో స్టాక్.. పెట్రోల్ బంకులు క్లోజ్
-
భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
భారత్‌లో ప్రీమియం పెట్రోల్ ధరలు పెరిగాయి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) తన ప్రీమియం పెట్రోల్ ధరను లీటరుకు రూ .2 పెంచింది. సవరించిన రేట్లు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ రంగ పెట్రోలియం కంపెనీ ఈ పెంపు వెనుక ఎటువంటి కారణాన్ని పేర్కొననప్పటికీ, కొనసాగుతున్న ఇరాన్-యుఎస్ వివాదం మధ్య ప్రపంచ ముడి చమురు ధరలలో హెచ్చుతగ్గులు, లాజిస్టిక్స్ ఖర్చులలో మార్పులే ఈ నిర్ణయానికి కారణమని భావిస్తున్నారు.ఇక హైదరాబాద్‌లో ఈ ధరలు కనిష్ఠంగా రూ.2.26 మేర పెరిగినట్లు పెట్రోల్ డీలర్స్ చెబుతున్నారు. అయితే.. ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చు మేరకు ఒక్కో బంకులో ఒక్కోరకంగా ధరల్లో తేడాలు ఉండే అవకాశాలున్నాయని వివరిస్తున్నారు. అంటే.. అయిదు నుంచి పది పైసల మేర ఈ తేడా ఉంటుందని వెల్లడించారు.సాధారణ పెట్రోల్ ధరలో మార్పు లేదు..సాధారణ పెట్రోల్ వాడే సామాన్యులకు మాత్రం ఈ పెంపు నుంచి ఉపశమనం లభించింది. హెచ్‌పీసీఎల్ సాధారణ పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. అంతేకాకుండా, చమురు సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని సంస్థ స్పష్టం చేసింది. "అదనపు సరకు రవాణా ఇప్పటికే మార్గంలో ఉంది. రాబోయే రోజుల్లో దేశీయ సరఫరా మరింత బలోపేతం అవుతుంది. ప్రజలు పుకార్లను నమ్మవద్దు" అని హెచ్‌పీసీఎల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా విజ్ఞప్తి చేసింది.ఏమిటీ ప్రీమియం పెట్రోల్?ప్రీమియం పెట్రోల్‌ను ‘హై-ఆక్టేన్ ఫ్యూయల్’ లేదా ‘పవర్ పెట్రోల్’ అని పిలుస్తారు. ఇది సాధారణంగా లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ బైక్‌లు, హై-పెర్ఫార్మెన్స్ ఇంజిన్లలో వాడతారు. ఇది ఇంజిన్ పనితీరును మెరుగుపరచడమే కాకుండా, మైలేజీని కూడా పెంచుతుంది. ఈ ధరల పెంపు ప్రధానంగా లగ్జరీ వాహన యజమానులపై, సంపన్న వర్గాలపైనే ప్రభావం చూపనుంది.డీజిల్ ధర కూడా పెంపు హెపీసీఎల్ను అనుసరిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) కూడా బల్క్ డీజిల్ ధరను లీటరుకు ఏకంగా లీటరుకు రూ.22 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు రూ.87.57 గా ఉన్న లీటరు డీజిల్ ధర.. తాజా రేట్ల పెంపుతో రూ.109.59కి చేరుకుంది. రిటైల్ పెట్రోల్ బంకుల్లో లభించే డీజిల్ ధరలపై ప్రస్తుతం పెద్దగా ప్రభావం లేనప్పటికీ.. నేరుగా కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో డీజిల్ కొనే పారిశ్రామిక వినియోగదారులకు షాక్ తగిలింది.రవాణా ఛార్జీలు పెరిగే అవకాశంబల్క్ డీజిల్ ధరల పెరుగుదల ప్రధానంగా తయారీ రంగం, భారీ పరిశ్రమలు, లాజిస్టిక్స్ విభాగాలపై తీవ్రంగా ప్రభావం చూపనుంది. సిమెంట్, ఉక్కు కర్మాగారాలు, భారీ యంత్రాలను నడిపే పరిశ్రమలకు డీజిల్ వినియోగం అధికంగా ఉంటుంది. ఇది లీటరుకు రూ.22 పెరగడం వల్ల వారి ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరుగుతుంది. అలాగే నేరుగా కంపెనీల నుంచి డీజిల్ కొనే భారతీయ రైల్వే, రాష్ట్ర రవాణా సంస్థలు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పెంపు వల్ల రవాణా ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి దారితీయవచ్చు.వచ్చేవారం పెట్రోల్ మోత?పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్నా.. చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతున్నా.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సామాన్యులపై పెట్రోల్ భారం వేయలేదు. దేశంలో 60 రోజులకు సరిపడా వ్యూహాత్మక నిల్వలు ఉన్నప్పటికీ.. వచ్చేవారం నుంచి పెట్రోల్ మోతకు చమురు సంస్థలు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఆ మేరకు పెట్రోల్, డీజిల్‌పై రూ.3 నుంచి రూ.5 మేర అదనపు భారం మోపే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలిపాయి.ఇదీ చదవండి: అతి భారీగా తగ్గిన బంగారం.. అంతలోనే.. -
పెట్రోలు వెతల సిత్రాలు చూశారా..!
-
ఇంధన కొరత లేదు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ మనదేశంలో ఇంధన కొరత ఎంతమాత్రం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి వెల్లడించారు. పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఏవియేషన్ టర్బైన్ ఇంధన నిల్వలు సరిపడా ఉన్నట్లు తెలిపారు. ఇంధనం విషయంలో ప్రజలను ఆందోళనకు గురిచేసేలా తప్పుడు ప్రచారం చేయొద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు. గురువారం లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇంధన కొరత గురించి ప్రస్తావించారు. దీనిపై హర్దీప్సింగ్ పురి సమాధానం ఇచ్చారు. దేశంలోని 33 కోట్ల కుటుంబాలకు ఎల్పీజీ సరఫరాకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ముఖ్యంగా పేద కటుంబాలకు ఎలాంటి కొరత రానివ్వబోమని ప్రకటించారు.దేశీయ సరఫరా వ్యవస్థను పరిరక్షిస్తామన్నారు. అన్ని రకాల ఇంధనం విషయంలో రిటైల్ ఔట్లెట్ల వద్ద సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పారు. సప్లై చైన్స్ యథాతథంగా పని చేస్తున్నాయని వెల్లడించారు. అన్ని రాష్ట్రాలకు అదనంగా కిరోసిన్ కేటాయిస్తున్నా మని తెలిపారు. ఇంధన సరఫరాలో సంక్షోభం ఉన్నప్పటికీ మన దగ్గర మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవని హర్దీప్సింగ్ పురి స్పష్టంచేశారు.ఎల్పీజీ ఉత్పత్తిని 28% పెంచినట్లు వివరించారు. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలను బట్టి చూస్తే మన దేశంలో ఇంధనం ధరలు తక్కువగానే ఉన్నాయని వ్యాఖ్యానించారు. హార్మూజ్ జలసంధిలో చమురు రవాణా ఆగిపోయినప్పటికీ ఇతర దేశాల నుంచి మనకు ముడి చమురు అందుతూ నే ఉందని గుర్తుచేశారు. 2006–07లో కేవలం 27 దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకున్నామని, ప్రస్తుతం 40 దేశాల నుంచి దిగుమ తి చేసుకుంటున్నామని తెలియజేశారు. మోదీ దౌత్య నీతి వల్లే ముడి చమురు విషయంలో ఆటంకాలు లేకుండాపోయాయని మంత్రి ఉద్ఘాటించారు. -
హైదరాబాద్ లో పశ్చిమాసియా యుద్ధ ప్రభావం..మూతపడుతున్న హోటళ్లు (ఫొటోలు)
-
వాటర్ ట్యాంకులో డీజిల్.. ఇలా చేస్తే ఎలా?
పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు దేశాన్ని తాకాయి. ఇదివరకే వంటగ్యాస్ కొరతతో దేశవ్యాప్తంగా పలు హోటళ్లు, రెస్టారెంట్లు మూతబడ్డాయి. ఇక తదుపరి క్రూడాయిల్ కొరత ఏర్పడనుందేమో అనే భయంతో ఒక వ్యక్తి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏకంగా వాటర్ ట్యాంకర్ నిండా డీజిల్ నింపుకెళ్లారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. హర్మూజ్ జలసంధిని ఇరాన్ నిర్భందించడంతో చమురు నౌకల రవాణా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఇదివరకే దేశంలో వంటగ్యాస్, LPG, CNG కొరత ఏర్పడింది. అయితే ప్రభుత్వం వీటికి ఇబ్బందులు ఏమి లేవని సదరు సంస్థలను ఉత్పత్తి పెంచమని ఆదేశించామని ప్రకటించింది. అదేవిధంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు సైతం రెండు మాసాలకు సరిపడా ఉన్నాయని ప్రత్యామ్నాయ మార్గాల్లో చమురు రవాణా చేపడుతున్నామని ప్రకటించింది. అయితే ఇలా ప్రకటించినటప్పటికీ కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వేల లీటర్లు నిల్వ చేసి ఇతరులను ఇబ్బందులకు గురిచేసే యత్నం చేస్తున్నారు.తాజాగా దానికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఒక వ్యక్తి నీటిని నిల్వచేసే ఒక ట్యాంకర్లో డీజీల్ నింపి నిల్వచేస్తున్నారు. దేశంలో డీజీల్ కొరత ఏర్పడే అవకాశం ఉందనే ఈ విధంగా చేస్తున్నట్లు తెలిపారు. అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆ వ్యక్తి దాదాపు ఐదువేల లీటర్ల డీజీల్ నిల్వ ఉంటుందని అది దాదాపు రెండువందల మందికి సరిపోతుందని అంటున్నారు. అయితే పెట్రోల్, డీజీల్ కొరత వదంతులతో చాలా మంది టౌన్లలో, గ్రామాలలో ఇదేవిధంగా చేస్తున్నారని దీనివల్ల పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇలా చేయడం వల్ల కొరత ఏర్పడడమే కాదని ఇది చాలా ప్రమాదమన్నారు. సీసాలలో ఆయిల్ తీసుకెళ్లడానికి అనుమతించని దేశంలో ట్యాంకర్లలో ఎలా నింపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తి 5 వేల లీటర్లు తీసుకుంటే ఇక చమురుకొరత రాకుండా ఏలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. అతనిపై కేసు నమోదు చేసి ఆ పెట్రోల్ బంక్ లైసెన్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియాల్సి ఉంది. The govt says it has fuel reserves for 50–60 days, but if it doesn’t curb rumors and panic, and fails to crack down on hoarders and black marketeers, that 50–60 day stock won’t last even two weeks.This man here is (proudly) filling 5,000 litres of fuel, enough to meet the needs… pic.twitter.com/6zYWunZbw5— THE SKIN DOCTOR (@theskindoctor13) March 11, 2026 -
అర్థరాత్రి.. అమాంతంగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు
కొలంబియా: శ్రీలంక ప్రజలకు ప్రభుత్వ రంగ చమురు సంస్థ సియాలోన్ పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీ) అర్థరాత్రి పెద్ద షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ధరలు మార్చి 9 అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.సీపీసీ లెక్కల ప్రకారం.. ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు గత వారం 92–93 అమెరికన్ డాలర్ల వద్ద ఉండగా, కొన్ని రోజుల్లోనే 115 డాలర్లకు చేరాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, సరఫరా అంతరాయం వంటి అంశాలు ఈ పెరుగుదలకు కారణమయ్యాయి. ఈ పరిస్థితులు శ్రీలంకలో ఇంధన ధరలపై తక్షణ ప్రభావం చూపాయి.ఆక్టేన్ 92 అంటే పెట్రోల్‌లోని ఆక్టేన్ రేటింగ్ (Octane Rating) ను సూచిస్తుంది. ఇది ఇంధనం ఇంజిన్‌లో నాకింగ్ (knocking) లేకుండా ఎంత వరకు కంప్రెషన్‌ను తట్టుకోగలదో చూపించే ప్రమాణం. ఆక్టేన్ 92 అంటే ఇంధనం 92 స్థాయి కంప్రెషన్‌ను తట్టుకోగలదని అర్థం. వాటి ఆధారంగాఆక్టేన్ 92 -పెట్రోల్ లీటరుకు రూ.317ఆక్టేన్ 95- పెట్రోల్ రూ.365సాధారణ డీజిల్- రూ.303హై-పర్ఫార్మెన్స్ వాహనాలకు వినియోగించే డీజిల్- రూ.353కిరోసిన్ -రూ.195ప్రతి లీటరుకు సగటున రూ.22–25 వరకు పెరిగినట్లు తెలుస్తోంది.ఈ పరిణామం శ్రీలంక ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారింది. ఇంధన ధరల పెరుగుదల వల్ల రవాణా, ఉత్పత్తి, వినియోగదారుల ఖర్చులు అన్నీ ప్రభావితమవుతాయి. ప్రభుత్వం తక్షణ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో అకస్మాత్తుగా వచ్చే ఇబ్బందులను తగ్గించవచ్చు. దీర్ఘకాలికంగా, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, శక్తి సామర్థ్య విధానాలు అమలు చేయడం ద్వారా స్థిరమైన పరిష్కారం సాధ్యమవుతుంది. -
పాకిస్తాన్లో పేలిన ‘పెట్రో’ ధరల బాంబు
ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్లో పెట్రో ధరల బాంబు పేలింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ సరఫరా చైన్‌లో తలెత్తిన ఆటంకాల నేపథ్యంలో పాకిస్తాన్ పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ శనివారం అర్ధరాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ ధరలను లీటరుకు ఏకంగా 55 రూపాయల చొప్పున పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశ చరిత్రలో ఇంతటి భారీ స్థాయిలో ధరలు పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.తాజా పెంపుతో పాకిస్తాన్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 266.17 నుంచి రూ. 321.17కు చేరింది. అంటే దాదాపు 17 శాతం మేరకు పెరిగింది. ఇక రవాణా రంగానికి కీలకమైన హైస్పీడ్ డీజిల్ ధర లీటరుకు రూ. 280.86 నుంచి ఏకంగా రూ. 335.86కు (20 శాతం పెంపు) ఎగబాకింది. పెరిగిన ఈ ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని అధికారులు తెలిపారు. పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వైజ్ మాలిక్, ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబుతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ జరిపిన ప్రతీకార దాడుల వల్ల గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర అనిశ్చితి నెలకొందని వారు పేర్కొన్నారు. ‘పొరుగు దేశంలో రాజుకున్న నిప్పు ఇప్పడు ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఈ సంక్షోభం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేం’ అని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న తీవ్ర హెచ్చుతగ్గుల దృష్ట్యా, ఇకపై ప్రతి వారం పెట్రో ధరలను సమీక్షించాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. కాగా పాకిస్తాన్‌కు వచ్చే చమురు రవాణాలో అధిక భాగం ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ జలసంధి గుండానే జరుగుతుంటుంది. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల ఈ మార్గంలో సరఫరా నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో చమురు నౌకలను రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది కూడా చదవండి: డేరా బాబా కేసు.. పంజాబ్ హైకోర్టు సంచలన తీర్పు -
చావుకు అడ్డొస్తోందని భార్యపై పెట్రోల్ దాడి
తిరుమలాయపాలెం: కిడ్నీ సంబంధిత సమస్యతో నరకయాతన పడుతున్న ఓ వ్యక్తి తన జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడాలని ప్రయత్నించాడు. కానీ కుటుంబంలో విషాదం నింపొద్దని అడ్డు తగలడమే ఆయన భార్యకు శాపమైంది. ఈక్రమంలో సదరు వ్యక్తి భార్యపై పెట్రోల్ పోసి మంట అంటించాక పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై జగదీశ్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. తిరుమలాయపాలెంకు చెందిన తోటమళ్ల నాగభూషణం(65) రెండేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు.ఈ సందర్భంలో ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి మూడు సార్లు ప్రయత్నించగా భార్య జయమ్మ అడ్డుపడింది. నానాటికీ సమస్య పెరుగుతుండడంతో అడ్డుపడుతున్న భార్యను ముందు చంపి ఆ తర్వాత తాను చనిపోవాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈమేరకు గురువారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత ముందుగానే తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. కాగా, నాగభూషణం దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉండగా అందరికీ వివాహాలు జరిగాయి.వీరి కుమారుడు మండల కేంద్రంలోనే మరోచోట ఉంటున్నాడు. ఇంట్లో నుంచి మంటలు వస్తుండగా స్థానికులు గమనించి కుమారుడికి సమాచారం ఇవ్వగా వచ్చి భార్యాభర్తలను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ నాగభూషణం శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందగా, జయమ్మ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
లీటర్ పెట్రోల్ 500రూపాయలా!
-
చమురు సమస్యకు చాన్స్ లేదు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో స్వల్పకాలికంగా ఇంధనాల సరఫరాలో ఆటంకాలేర్పడినా భారత్‌కి ఇబ్బందేమీ ఉండదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మన దగ్గర 6–8 వారాల డిమాండ్‌కి సరిపడేంతగా పెట్రోల్, డీజిల్, ఇతర ఇంధనాల నిల్వలు ఉన్నాయని వివరించాయి. ప్రభుత్వం రోజువారీగా, ప్రతి గంటకు పరిస్థితిని సమీక్షిస్తోందని చమురు శాఖ అధికారి ఒకరు తెలిపారు. వారం పది రోజుల్లో ఈ సంక్షోభం ముగిసిపోయే అవకాశం ఉందనే అంచనాలు నెలకొన్నట్లు వివరించారు. దేశీయంగా 25 రోజులకు సరిపడే స్థాయిలో క్రూడాయిల్, ఇంధనాల నిల్వలు ఉన్నాయని, ఒకవేళ సంక్షోభం మరింత కాలం కొనసాగినా దాదాపు అంతే కాలానికి సరిపడేంతగా ఆయిల్ సరఫరా అమెరికా, రష్యా మొదలైన దేశాల నుంచి వస్తోందని పేర్కొన్నారు. దేశీయంగా వైజాగ్, మంగళూరు, పాదూర్ నిల్వ కేంద్రాల్లో 100 మిలియన్ బ్యారెళ్ల పెట్రోలియం రిజర్వ్‌లు ఉన్నాయి. ధరలు పెరిగితే దిగుమతుల బిల్లులు భారం .. తక్షణమైతే ఇంధనాలకు కొరత ఏర్పడకపోవచ్చు కానీ క్రూడాయిల్ ధరలు, రవాణా.. బీమా వ్యయాలు పెరగడమనేది భారత దిగుమతుల బిల్లు, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారి చెప్పారు. అంతర్జాతీయంగా ప్రామాణికమైన బ్రెంట్ క్రూడాయిల్ ధర ఇరాన్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి సుమారు 10 శాతం పెరిగి బ్యారెల్‌కి 80 డాలర్ల స్థాయిని దాటింది. 2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ క్రూడాయిల్ దిగుమతుల కోసం 137 బిలియన్ డాలర్లు వెచ్చించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో 206.3 మిలియన్ టన్నుల క్రూడాయిల్ దిగుమతుల కోసం 100.4 బిలియన్ డాలర్లు వెచ్చించింది. మరోవైపు, పశ్చిమాసియాలో అనిశ్చితుల వల్ల స్వల్పకాలికంగా తలెత్తే సవాళ్లను పరిష్కరించుకునేలా దేశీయంగా పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) సహా కీలక పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, నిల్వలను నిరంతరం సమీక్షించేందుకు ఆయిల్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది వారంలో ఏడు రోజులూ, ఇరవై నాలుగు గంటలు పని చేస్తుందని చెప్పారు. అత్యధికంగా చమురును దిగుమతి చేసుకునే దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో, రిఫైనింగ్‌లో నాలుగో స్థానంలో, పెట్రోలియం ప్రొడక్టుల ఎగుమతుల్లో అయిదో స్థానంలో ఉంది. -
కర్ణాటక: అల్లుని ఇంటిపై...
మండ్య( కర్ణాటక): యువతి ప్రేమించి పెళ్లి చేసుకోగా ఆమె తండ్రి రౌద్రరూప దాల్చాడు, అల్లుని ఇంటికి నిప్పంటించిన సంఘటన మండ్య తాలూకాలోని చుంచగహళ్లి గ్రామంలో శనివారం జరిగింది. వివరాలు.. అదే గ్రామంలో ఒకే వీధిలో నివసించే చెందిన వినోద్, కావ్య ప్రేమించుకున్నారు. ఇద్దరిదీ ఒకే కులం. కానీ యువతి తండ్రి చన్నేగౌడకు ఈ పెళ్లి ఎంతమాత్రం ఇష్టం లేదు. నవంబర్ 19న ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుని దగ్గర్లోనే ఓ చోట కాపురం పెట్టారు. డబ్బు, బంగారం బూడిద.. కుమార్తె, అల్లుడు ఏ ఇంటిలో ఉన్నారో తెలుసుకున్న మామ చన్నేగౌడ శనివారం ఉదయం వెళ్లి ఇంటిలోకి పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఆ సమయంలో దంపతులు లేరు. మంటలు వ్యాపించి, ఇంట్లో ఉన్న వస్తువులు, ఫరి్నచర్, టీవీ తదితరాలు కాలిపోయాయి. ఇల్లు పూర్తిగా దెబ్బతినింది. ఇంట్లోని రూ.10 లక్షల నగదు, 250 గ్రాముల బంగారం కూడా కాలిపోయినట్లు వినోద్ కుటుంబీకులు విలపించారు. ఈ సమయంలో చన్నేగౌడ కూడా గాయపడ్డాడు, అతనిని చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు, క్లూస్ టీం చేరుకుని ఆధారాలను సేకరించారు. డీఎస్పీ యశ్వంత్ కుమార్, సీఐ నవీన్ కేసు నమోదు చేశారు. భార్యాభర్తలను మద్దూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన తర్వాత యువతి కుటుంబం గ్రామం వదిలి వెళ్లిపోయింది. -
అరాచక పాలన.. ఇంట్లోకి వచ్చి దాడులు
-
జియో-బీపీ యాక్టివ్ టెక్నాలజీ పెట్రోల్
ఇంధన రిటైలింగ్, మొబిలిటీ సంస్థ జియో-బీపీ తాజాగా ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా వినూత్నమైన ’యాక్టివ్’ టెక్నాలజీ పెట్రోల్‌ని ఆవిష్కరించింది. కీలకమైన ఇంజిన్ విడిభాగాలను శుభ్రంగా ఉంచుతూ, పనితీరును మెరుగుపరుస్తూ, మెయింటెనెన్స్ వ్యయాలను తగ్గిస్తూ, అదనంగా ఖర్చులేమీ లేకుండా వాహనం ఏటా మరో 100 కి.మీ. ఎక్కువ దూరం ప్రయాణించేందుకు ఉపయోగపడేలా ఈ ఇంధనం ఉంటుందని సంస్థ తెలిపింది.మోటర్‌సైకిల్‌లో నింపి, కోయంబత్తూరులోని టెస్ట్ ట్రాక్‌లో 4,000కు పైగా కి.మీ. మేర దీని సామర్థ్యాలను ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు సంస్థ చైర్మన్ సార్థక్ బెహూరియా తెలిపారు. దేశీయంగా వాహనదారులు సాఫీగా నడిచే, విశ్వసనీయమైన, తక్కువ మెయింటెనెన్స్ ఉంటూ ఇంధనంపై అదనంగా వెచి్చంచకుండా ఎక్కువ మైలేజీ ఉండాలని కోరుకుంటారని ఆయన పేర్కొన్నారు. దీనికి అనుగుణంగానే జియో–బీపీ యాక్టివ్ టెక్నాలజీ పెట్రోల్‌ని రూపొందించినట్లు వివరించారు. దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్ దిగ్గజం బీపీ కలిసి జియో–బీపీని జాయింట్ వెంచరుగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి తగలబెట్టిన మహిళ
నల్లగొండ జిల్లా: నాంపల్లి మండలం కేతేపల్లిలో దారుణం జరిగింది. ప్రియుడి భార్యను ఓ మహిళ అత్యంత కిరాతకంగా హత్య చేసింది. నగేష్‌తో సుజాత అనే మహిళకు గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం నగేష్ ఇంట్లో తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. భార్య మమతను పక్కకు తప్పించేందుకు హత్య చేయాలని సుజాత, నగేష్ ప్లాన్ వేశారు. మమతపై పెట్రోల్ పోసి సుజాత నిప్పంటించింది. తీవ్ర గాయాలతో మమత మరణించింది. మంటలు అంటుకుని ఐదు నెలల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని ఆసుపత్రికి తరలించారు. -
పెట్రోల్ కంటే.. పాలు, నీళ్ల ధరలే ఎక్కువ!.. ఎక్కడంటే?
ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశంగా వెలుగొందిన వెనెజువెలా.. నికోలస్ మదురో అరెస్టు తర్వాత తీవ్ర సంక్షోభంతో సతమతమవుతోంది. దీంతో నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందనంత స్థాయికి చేరిపోయాయి. పెట్రోల్ ధరల కంటే.. వాటర్ బాటిల్, పాలు ధరలు ఎక్కువైపోయాయి.ధరలు ఇలా..ఒక లీటరు పెట్రల్: రూ. 45.10ఒక లీటరు పాలు: రూ. 160.60ఒక లీటరు వాటర్ బాటిల్: రూ. 223.70ఒక లీటరు వంట నూనె: రూ. 315 నుంచి రూ. 405అమెరికా ఆంక్షలు, సరఫరా గొలుసులను తీవ్రంగా దెబ్బతినడంతో ఆర్ధిక సంక్షోభం ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే తాగు నీరు కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని అంటున్నారు. ఇక్కడ కరెన్సీకి విలువ తగ్గిపోవడం వల్ల.. లావాదేవీలు కూడా కష్టతరం అయిపోయింది.వెనెజువెలా ఆర్ధిక పతనానికి కారణాలు➤వ్యవసాయం, తయారీ రంగాలను విస్మరించి.. ఎక్కువగా చమురుపైనే ఆధారపడటం.➤నైపుణ్యం లేనివారికి పదవులు కట్టబెట్టడం వల్ల, నిర్వహణ లోపాలు తలెత్తాయి.➤ఆదాయం లేకపోవడంతో.. ప్రభుత్వం విచ్చలవిడిగా కరెన్సీ ముద్రించింది. దీనివల్ల దేశ కరెన్సీ ఎక్కువైంది. విలువ పెరిగిపోయింది.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే బంపరాఫర్.. ప్రయాణికులకు శుభవార్త! -
ఈ25 దిశగా భారత్!
సాక్షి, స్పెషల్ డెస్క్: పెట్రోల్‌లో ఇథనాల్ వాటా మన దేశంలో అక్టోబర్ నాటికి 19.97% వచ్చి చేరింది. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (ఈబీపీ) కార్యక్రమం గడువు కంటే ముందుగా భారత్ లో సక్సెస్ అయింది. ఈ ఊపుతో కేంద్ర పెట్రో లియం మంత్రిత్వ శాఖ తదుపరి కార్యాచరణ సిద్ధం చేస్తోందని సమాచారం. ఈ25 లక్ష్యానికి కొన్ని నెలల్లోనే శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. ఎటువంటి అడ్డంకులు లేకుండా దశలవారీగా ఈ27, ఈ30 కార్యక్రమం సైతం పూర్తవుతుందని ధీమాగా ఉంది.ఈబీపీ కార్యక్రమంలో భాగంగా 2030 నాటికి ఈ20 (పెట్రోల్‌లో ఇథనాల్ వాటా 20%) సాధించాలని ప్రభుత్వం గతంలో లక్ష్యం విధించుకుంది. కానీ గడువు కంటే వేగంగా.. అది కూడా పదేళ్లు ముందుగానే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి జోష్ తెచ్చింది. తదుపరి ఈ25 (పెట్రోల్‌లో ఇథనాల్ వాటా 25%) నిబంధన అమలు దిశగా పావులు కదుపుతున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశ ఇథనాల్ ప్రయాణం ఆపలేనిదని కొన్ని రోజుల క్రితం పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ వ్యాఖ్యానించారు. ఇథనాల్‌కు హామీ ధర నిర్ణయించడం, తయారీకి బహుళ ముడిపదార్థాలను అనుమతించడం, దేశవ్యాప్తంగా డిస్టిలేషన్ సామర్థ్యం పెంచడం వంటి స్థిరమైన విధాన సంస్కరణల ద్వారా ఈ విజయం సాధ్యమైందని ప్రభుత్వం చెబుతోంది. బీఐఎస్ ప్రమాణాలు, ఆర్థిక ప్రోత్సాహకాల మద్దతుతో దశలవారీగా ఈ25, ఈ27, ఈ30 వైపు భారత్ మళ్లుతుందని స్పష్టం చేస్తోంది.ఏడేళ్లలో రూ.1.5 లక్షల కోట్లువాస్తవానికి 2022 నవంబర్ నాటికి పెట్రోల్‌లో ఇథనాల్ వాటా 10.02% మాత్రమే. మూడేళ్లలోనే ఈ వాటా రెండింతలు అయిందంటే ప్రభుత్వం, ఆయిల్ కంపెనీల దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పెట్రోల్‌లో ఇథనాల్ వాటా 2014లో కేవలం 1.53% మాత్రమే. ఈబీపీ కారణంగా భారత్‌కు ముడి చమురు దిగుమతి ఖర్చులు భారీగా తగ్గుతున్నాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెద్ద ఎత్తున అదా అవుతుండడంతోపాటు స్థిరమైన ఇంధన వినియోగం దిశగా ఈ కార్యక్రమం ఒక పెద్ద ముందడుగు అని ప్రభుత్వం భావిస్తోంది. ఈ జీవ ఇంధనం వాడటంతో ఏడేళ్లలో రూ.1.5 లక్షల కోట్లకుపైగా ఆదా కావడం విశేషం. ఈ20 సాధించేందుకు బ్రెజిల్‌కు 20 ఏళ్లు పట్టిందని ప్రభుత్వం గుర్తు చేస్తోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల టెండర్ల ప్రకారం 2025–26 ఇథనాల్ సరఫరా సంవత్సరానికిగాను మన దేశంలో డిమాండ్‌ను మించి ఇథనాల్ సప్లై ఉంది. మొత్తం డిమాండ్: 1,350 కోట్ల లీటర్లు (ఈబీపీ కోసం 1,050 కోట్ల లీటర్లతో సహా).సరఫరా: 1,775 కోట్ల లీటర్లు.ప్లాంట్ల స్థాపిత సామర్థ్యం: 1,900 కోట్ల లీటర్లు. -
పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుంటే నో పెట్రోల్!
పర్యావరణ పరిరక్షణ, పెరుగుతున్న వాహన కాలుష్య నివారణే లక్ష్యంగా ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో చెల్లుబాటు అయ్యే ‘పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్’(పీయూసీ) లేని ఏ వాహనానికీ పెట్రోల్ లేదా డీజిల్ విక్రయించకూడదని రాష్ట్ర రవాణా యంత్రాంగం (ఎస్టీఏ) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.చమురు సంస్థలకు కీలక ఆదేశాలుఈ నిబంధనను తక్షణమే అమలు చేయాలని కోరుతూ ఇండియన్ ఆయిల్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రిలయన్స్, షెల్ వంటి ప్రైవేట్ చమురు సంస్థలకు కూడా రవాణా శాఖ లేఖలు రాసింది. ప్రతి ఫ్యుయల్ స్టేషన్ వద్ద వాహనదారుడి పీయూసీ సర్టిఫికేట్‌ను సిబ్బంది భౌతికంగా లేదా డిజిటల్ రూపంలో తనిఖీ చేసిన తర్వాతే ఇంధనం పోయాల్సి ఉంటుంది.అవగాహన కార్యక్రమాలుఈ కొత్త నిబంధనపై వాహనదారులకు, పెట్రోల్ బంక్ సిబ్బందికి తగినంత అవగాహన కల్పించాలని చమురు సంస్థలను కోరింది. ఒకవేళ సర్టిఫికేట్ లేని వాహనాలకు ఇంధనం సరఫరా చేస్తే సంబంధిత డీలర్లపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఎస్టీఏ హెచ్చరించింది.చట్టపరమైన నిబంధనలు ఇవే..మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 190(2), సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, 1989లోని రూల్ 115 ప్రకారం.. ప్రతి వాహనం నిర్దేశిత ఉద్గార ప్రమాణాలకు లోబడి ఉండాలి. పీయూసీ లేకుండా వాహనం నడపడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోందని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.ఢిల్లీ బాటలోనే ఒడిశాదేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్రమైన స్థాయికి చేరడంతో అక్కడ ఇప్పటికే ‘నో పీయూసీ - నో ఫ్యూయల్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ-4) అమల్లో ఉంది. అదే బాటలో ఒడిశా ప్రభుత్వం కూడా ముందుస్తు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టింది.ఇదీ చదవండి: పన్ను చెల్లింపుదారుల సోషల్ మీడియా, ఈమెయిల్స్‌పై నిఘా -
బోరబండలో హిజ్రాల బీభత్సం..!
హైదరాబాద్: కేసులు పెడుతూ తమను వేధిస్తున్న హిజ్రా నాయకురాలిపై చర్యలు తీసుకోవాలంటూ హిజ్రాలు చేసిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాలు.. మోనాలిసా అనే ట్రాన్స్‌జెండర్ కూకట్పల్లి ఇందిరానగర్‌లో నివాసం ఉంటోంది. ప్రజల నుంచి దౌర్జన్యంగా డబ్బులు డిమాండ్ చేస్తున్న కొంతమంది హిజ్రాలపై పలు పోలీస్ స్టేషన్లలో ఆమె ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై ప్రశ్నించేందుకు పద్మ అనే హిజ్రా మోనాలిసా వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరగడంతో పద్మపై మోనాలిసా చేయి చేసుకుంది. దీంతో కక్ష పెంచుకున్న పద్మ తన తోటి ట్రాన్స్జెండర్లతో కలిసి సోమవారం మధ్యాహ్నం బోరబండ బస్టాప్ వద్దకు చేరుకుంది. మోనాలిసాపై చర్యలు తీసుకోవాలంటూ బైఠాయించి పెద్దఎత్తున వారు నినాదాలు చేశారు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్‌ను నవ్య అనే హిజ్రా తెరిచింది. గుర్తుతెలియని వ్యక్తి లైటర్ వెలిగించడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఎనిమిది మంది వరకు హిజ్రాలకు గాయాలు కాగా నిరసనను అడ్డుకునేందుకు పోలీసు వచ్చిన బోరబండ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురేందర్‌కు సైతం స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ హిజ్రాలను మోతీనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం ఐఎస్ సదన్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. బోరబండ ఏసీపీ, మధురానగర్ ఎస్హెచ్ఓలు ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నట్లు, స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు బోరబండ ఎస్హెచ్ఓ సురేందర్ తెలిపారు. పోలీసులకు ఎలాంటి సమాచారం అందించకుండా ఆందోళన నిర్వహించిన వారి పట్ల చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. -
త్వరలో పెట్రోల్ వాహనాల రేట్లకి ఈవీలు
న్యూఢిల్లీ: వచ్చే నాలుగు నుంచి ఆరు నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) రేట్లు కూడా పెట్రోల్ వాహనాల ధరల స్థాయిలో లభించగలవని అంచనా వేస్తున్నట్లు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడటమనేది ఆర్థికంగా భారం కావడంతో పాటు పర్యావరణంపరంగాను ప్రతికూల పరిణామాలకు దారి తీస్తోందన్నారు. ఏటా ఇంధన దిగుమతులపై రూ. 22 లక్షల కోట్లు వెచి్చంచాల్సి వస్తోందని 20వ ఫిక్కీ ఉన్నత విద్యా సదస్సు 2025లో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. అయిదేళ్లలోగా భారత్‌ను ప్రపంచంలోనే నంబర్ వన్ ఆటోమొబైల్ పరిశ్రమగా నిలపాలని నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. ‘నేను రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ. 14 లక్షల కోట్లుగా ఉండేది. ప్రస్తుతం రూ. 22 లక్షల కోట్లకు చేరింది‘ అని గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం రూ. 78 లక్షల కోట్లతో అమెరికా ఆటోమొబైల్ పరిశ్రమ అగ్రస్థానంలోను, రూ. 47 లక్షల కోట్ల పరిమాణంతో చైనా తొలి రెండు స్థానాల్లో ఉండగా, భారత్ మూడో స్థానంలో ఉంది. మరోవైపు, దేశ పురోగతికి స్వచ్ఛ ఇంధనాల వినియోగం చాలా కీలకమని మంత్రి వివరించారు. మొక్కజొన్న నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేయడం వల్ల రైతులకు అదనంగా రూ. 45,000 కోట్ల మేర ఆదాయం వచి్చందని పేర్కొన్నారు. ఇక 2027 నాటికల్లా ఘనవ్యర్ధాలను రహదారుల నిర్మాణంలో వినియోగించే ప్రాజెక్టును చేపట్టినట్లు మంత్రి చెప్పారు. ఉన్నత విద్యాభ్యాసం, నైపుణ్యాలను పెంచుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత కీలకంగా మారిందని ఆయన పేర్కొన్నారు. -
అమానుషం.. యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన గ్రామస్తులు
సాక్షి,హైదరాబాద్: మెదక్ జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. బైక్‌లను దొంగిలించాడనే నెపంతో ఓ దొంగను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు అతడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఈ దుర్ఘటనలో 90 శాతం కాలిన గాయాలతో బాధితుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.పోలీసుల వివరాల మేరకు.. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో దారుణం జరిగింది. బైక్ దొంగతనం చేయబోయిన ఇద్దరు యువకుల్లో ఒకరిపై గ్రామస్తులు పెట్రోల్ పోసి నిప్పంటించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామానికి చెందిన మహిపాల్, యవాన్ అనే ఇద్దరు యువకులు. పార్క్ చేసిన బైక్‌లను చోరీ చేసి మార్కెట్లో అమ్ముకుని జీవనం కొనసాగిస్తుంటారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వడియారం గ్రామంలో ఓ బైక్‌ను దొంగతనం చేశారు. దొంగతనానికి వస్తూ వస్తూ..అక్కరకొస్తుందని ఓ బాటిల్ పెట్రోల్‌ను వెంట తెచ్చుకున్నారు.అయితే దొంగిలించిన బైక్‌లో పెట్రోల్ లేకపోవడంతో నిర్మానుష్య పప్రాంతానికి తీసుకెళ్లి బండిలో పెట్రోల్ నింపాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా బండిని కొంతదూరం నెట్టుకుని వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో దుర్గామాత నిమజ్జనోత్సవానికి వెళుతున్న యువకులు బైక్ చోరీ చేసిన నిందితుల్ని గుర్తించారు. యువకులు దాడి చేసేందుకు ప్రయత్నించగా.. మహిపాల్ పరారయ్యాడు. యవాన్‌ను స్తంభానికి కట్టారు. అతని జేబులో ఉన్న పెట్రోల్‌ను తీసుకుని తగలబెట్టారు. యవాన్ 90 శాతం కాలిన గాయాలతో తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాధితుణ్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. యవాన్‌పై దారుణానికి తెగబడ్డ గ్రామస్తులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. -
అంబేడ్కర్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పు
వెదురుకుప్పం/తిరుపతి మంగళం: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో టీడీపీ మూకలు దారుణానికి ఒడిగట్టాయి. వెదురుకుప్పం మండలం, బొమ్మయ్యపల్లె పంచాయతీ దేవళంపేట గ్రామంలో గురువారం అర్ధరాత్రి అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్రోలు పోసి తగులబెట్టారు. పక్కా ప్రణాళికతోనే టీడీపీకి చెందిన రౌడీ మూకలు ఈ ఘాతుకానికి పాల్పడ్డాయి. తొలి నుంచి వ్యతిరేకమే..సర్పంచ్ చొక్కా గోవిందయ్య, దళిత నాయకులు కలిసి దేవళంపేటలో 2023లో 10 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. అప్పట్లోనే స్థానిక టీడీపీ నాయకులు సతీష్‌నాయుడు, పయణితో పాటు వారి అనుచరులు కొంతమంది ఈ విగ్రహాన్ని నెలకొల్పకుండా చేయాలని విఫలయత్నం చేశారు. ఆ తర్వాత సైతం అంబేడ్కర్ విగ్రహాన్ని అక్కడ లేకుండా చేయాలని అనేకమార్లు ప్రయత్నించారు. కూటమి ప్రభుత్వం రావడంతో సతీష్‌నాయుడు ఎమ్మెల్యే థామస్ ప్రధాన అనుచరుడినని చెప్పుకుంటూ స్థానిక సర్పంచ్ గోవిందయ్యను పలు రకాలుగా వేధింపులకు గురిచేశాడు. ఈ క్రమంలోనే గురువారం అర్ధరాత్రి అంబేడ్కర్ విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి తగులబెట్టారు. విగ్రహం ఉన్న ప్రాంతంలో మంటలు ఎగిసి పడుతుండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే సర్పంచ్ గోవిందయ్యకు సమాచారం అందించారు. జరిగిన ఘటనను 100కు డయల్ చేసి చెప్పడంతో నగరి డీఎస్పీ మహ్మద్ అజీజ్, కార్వేటినగరం సీఐ హనుమంతప్ప, వెదురుకుప్పం ఎస్ఐ వెంకటసుబ్బయ్య తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఘటనపై సర్పంచ్ గోవిందయ్య వెదురుకుప్పం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ‘మీ కాళ్లు పట్టుకుంటా న్యాయం చేయాలి’ అంటూ రోడ్డుపై సర్పంచ్ పోలీసుల కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ నేతల ధర్నాఘటనకు కారకులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వైఎస్సార్సీపీ మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, వైఎస్సార్సీపీ గంగాధర నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దళిత, ప్రజా సంఘాల నేతలు దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహం ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ దేవళంపేటకు చేరుకుని ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుమునుపే అనుమానితులైన సతీష్‌నాయుడు, అతని అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, డీఆర్ఓ, వెదురుకుప్పం తహసీల్దార్ బాబు దేవళంపేటకు చేరుకుని ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆందోళన కారులకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా నిప్పు పెట్టిన అంబేడ్కర్ విగ్రహం స్థానంలో శుక్రవారం రాత్రి అధికారులు నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేడ్కర్ విగ్రహానికి దుండగులు నిప్పు పెట్టిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారడంతో ఆగమేఘాల మీద అధికారులు కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడే..ఎమ్మెల్యే థామస్ ఆధ్వర్యంలో ఇలాంటి అకృత్యాలు చోటుచేసుకుంటున్నాయి. అంబేడ్కర్ విగ్రహాన్ని తగలబెట్టిన వ్యక్తి ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు. జరిగిన ఘటనను సుమోటోగా తీసుకుని అంబేడ్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించాలి. ఈనెల 25 లోపు న్యాయం జరగకుంటే 15 వేల మందితో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఖబడ్దార్. – నారాయణస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రిజాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహంఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. జాతీయ ఎస్సీ కమిషన్‌కు శుక్రవారం ఎంపీ ఈ మేరకు ఒక లేఖ రాశారు. ఈ ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గురుమూర్తి ఫిర్యాదు చేసిన రెండు గంటలలోపే కమిషన్ సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. 30 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీని ఆదేశించింది. నిర్దిష్ట గడువులోపు నివేదిక అందించనట్లయితే, భారత రాజ్యాంగం ఆర్టికల్ 338 ప్రకారం సివిల్ కోర్ట్ అధికారాలను వినియోగించి, సంబంధిత అధికారులను వ్యక్తిగతంగా లేదా ప్రతినిధి ద్వారా కమిషన్ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేస్తామని హెచ్చరించింది. -
‘నా బ్రెయిన్ విలువ రూ.200 కోట్లు’.. గడ్కరీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు నెలకు రూ.200కోట్ల ఆదాయం వస్తుంది. ఎవర్ని మోసం చేసి సంపాదించాల్సి ఖర్మ పట్టలేదంటూ నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా వాతావరణ కాలుష్యం తగ్గింపుతో పాటు ఇతర ఉపయోగాల్ని దృష్టిలో ఉంచుకుని 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాలు జరపాలంటూ కేంద్రం నిర్ణయించింది. 20శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాల అంశంలో తన కుటుంబం ఆర్థికంగా లబ్ది పొందుతోందంటూ వచ్చిన ఆరోపణల్ని గడ్కరీ ఖండించారు.నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ పాల్గొన్నారు. ‘ఈ సందర్భంగా నా బ్రెయిల్ విలువ రూ.200కోట్లు.. నేను మోసంతో కాదు, నిజాయితీతో సంపాదిస్తున్నాను. నా కుమారులు వ్యాపారంలో ఉన్నారు. నేను వారికి సలహాలు ఇస్తాను. కానీ మోసం చేయను. ఇటీవల నా కుమారుడు ఇరాన్ నుంచి 800 కంటైనర్ల యాపిల్స్‌ను దిగుమతి చేశాడు. అలాగే 1000 కంటైనర్ల అరటిపళ్లను ఎగుమతి చేశాడు’అని చెప్పారు.నాకు డబ్బుకు కొదవలేదు. షుగర్ ఫ్యాక్టరీ, డిస్టిల్లరీ, పవర్ ప్లాంట్ వ్యాపారాలు ఉన్నాయన్న గడ్కరీ.. ఇవన్నీ వ్యక్తిగత లాభం కోసం కాకుండా వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు చేస్తున్నానని స్పష్టం చేశారు. కొద్దిరోజుల క్రితం ఓ సందర్భంలో ఈ20 ఇంధనంపై వస్తున్న విమర్శలపై గడ్కరీ స్పందించారు. ‘తనపై రాజకీయంగా కుట్ర జరుగుతోందని, అందుకు పెయిడ్ సోషల్ మీడియా ప్రచారం జరగుతోందని ఆరోపించారు. సుప్రీంకోర్టు కూడా ఈ20 ఇంధనంపై దాఖలైన పిల్ ను తిరస్కరించిందని గడ్కరీ గుర్తు చేశారు. ఈ విమర్శలన్నీ తనను రాజకీయంగా దెబ్బతీయడానికి పెట్రోల్ లాబీలు చేస్తున్న ప్రయత్నాలని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, రైతులకు మంచి జరిగే వరకు తన ప్రయత్నాలు కొనసాగిస్తానని గడ్కరీ స్పష్టం చేశారు.ఈ ఇంధనం సురక్షితమైనదే. ఇది దిగుమతి ప్రత్యామ్నాయంగా, ఖర్చు తగ్గించే, కాలుష్యాన్ని తగ్గించే, రైతులకు మేలు చేసే విధంగా రూపొందించామన్నారు. అంతేకాక, వాహనాల స్క్రాప్ విధానాన్ని ప్రోత్సహించేందుకు జీఎస్టీ రాయితీ ఇవ్వాలని ఆర్థిక మంత్రికి సూచించానని కూడా గడ్కరీ వెల్లడించారు. -
‘పవన్ పెట్రోల్ బంక్’లో కల్తీ పెట్రోలు..!
శేరిగూడ, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్న మున్సిపల్ పరిధిలోని శేరిగూడ సమీపంలోని ‘పవన్ పెట్రోల్ బంక్’లో కల్తీ చేస్తున్న ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ కారుకు ఆ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొట్టించిన అనంతరం ఆగిపోయింది. పెట్రోల్ కొట్టించిన తర్వాత కారు ఆగిపోవడంపై అనుమానం వచ్చింది సదరు కారు యజమానికి. నిన్న(గురువారం, సెప్టెంబర్ 11వ తేదీ) రాత్రి పెట్రోల్ కొట్టించిన తర్వాత కారు ఆగిపోవడంతో బంక్ సిబ్బంది మార్నింగ్ రమ్మన్నారు. ఇక చేసేది లేక ఆ కారును అక్కడే వదిలేసి వేరే కారులో వారు వెళ్లిపోయారు. ఈ రోజు ఉదయం కారును తీసుకెళ్లడానికి వచ్చిన సమయంలో పెట్రోల్ బంక్ మేనేజర్.. తమ ఓనర్ వస్తారని, అప్పటిదాకా వెయిట్ చేయాలని చెప్పినట్లు కారు బాధితుడి తెలిపాడు.అయితే మధ్యాహ్నం అయినా బంక్ యజమాని రాకపోవడంతో ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చారు. తాము ఫుల్ ట్యాంక్ చేయించుకున్న తర్వాత కారు ఆగిపోవడంతోనే అనుమానం వచ్చిందని, అయితే చేసేది లేక అప్పుడు వెళ్లిపోయి, మళ్లీ ఈరోజు వచ్చామన్నారు. తమను పట్టించుకోకపోవడంతో పోలీసులకి ఫిర్యాదు లైవ్‌లోనే పెట్రోల్ తీస్తే అసలు విషయం బయటపడింది. తనిఖీలో భాగంగా బాటిల్లో తీసిన పెట్రోల్‌లో సగానికి పైగా నీళ్లే ఉన్నాయని, అందుచేత తమ కారు ఆగిపోయిందని తెలిపాడు. ఇలాగే చాలామంది తమ వాహనాలు దారిలో ఆగిపోవడంతో మళ్లీ బాటిల్స్ పట్టుకుని ఆ బంక్‌కు వచ్చిన సంగతిని బాధితుడు తెలిపాడు. -
రాజకీయంగా నన్ను టార్గెట్ చేసి.. గడ్కరీ సంచలన వ్యాఖ్యలు
ఇథనాల్ కలిపిన ఇ20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో విస్తృత ప్రచారం నడుస్తోంది. ఈ వ్యవహారంపై స్పందిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తనను లక్ష్యంగా చేసుకునే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారాయన. E20 ఫ్యూయల్ విషయంలో ఈ మధ్య సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం నడుస్తోంది. E20 ఫ్యూయల్ వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతుందని.. ఇంజిన్‌కు నష్టం కలుగుతుందని పోస్టులు కనిపిస్తున్నాయి. పాత వాహనాలకూ ఇది అనుకూలం కాదు అంటూ గడ్కరీ ఆలోచనను తప్పుబడుతూ విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రచారంపై భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(SIAM ) వార్షిక సమావేశంలో గడ్కరీ స్పందించారు. ఈ ప్రచారం వెనుక పెట్రోల్ లాబీ ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. వాతావరణానికి కలుగుతున్న హానిని తగ్గించడంలో E20 ఫ్యూయల్ కీలక పాత్ర పోషిస్తుంది. SIAM, భారత ఆటోమొబైల్ పరిశోధనా సంఘం(ARAI) లాంటి సంస్థలు E20 ఫ్యూయల్‌ను సురక్షితమైన, సమర్థవంతమైనదిగా పేర్కొన్నాయి. మైలేజ్ తగ్గుదల అంటూ జరుగుతున్న ప్రచారాన్ని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. పైగా సుప్రీం కోర్టు కూడా E20 ఫ్యూయల్‌పై దాఖలైన PILను తిరస్కరించింది.. సోషల్ మీడియాలో నన్ను రాజకీయంగా లక్ష్యంగా చేసుకునే ప్రచారం జరిగింది. అది చెల్లించిన ప్రచారం(పెయిడ్ క్యాంపెయిన్). అందుకే నేను దానికి ప్రాధాన్యం ఇవ్వను. పెట్రోల్ లాబీ చాలా ధనికం. అది ఎంతో శక్తివంతంగా ఉంది. వాళ్లే ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రోత్సహిస్తు ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారాయన.E20 ఫ్యూయల్ అనేది 80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్ మిశ్రమంతో తయారైన ఇంధనం. ఇథనాల్ అనేది.. జొన్న, బియ్యం, పంచదార వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారవుతుంది. ఇది పర్యావరణ హితమైంది. దేశీయంగా తయారయ్యే, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించే ప్రత్యామ్నాయ ఇంధనం. అందుకే గడ్కరీ దీనిని ప్రమోట్ చేస్తున్నారు. E20 ఫ్యూయల్ లక్ష్యం ఏంటంటే.. కార్బన్ ఉద్గారాలను తగ్గించడం. రూ. 22 లక్షల కోట్ల విలువైన ఫాసిల్ ఫ్యూయల్ దిగుమతులను తగ్గించడం అలాగే.. రైతులకు ఆదాయం పెంచడం (ఇథనాల్ తయారీ ద్వారా ₹45,000 కోట్ల లాభం వచ్చినట్లు గడ్కరీ పేర్కొన్నారు). అయితే.. గడ్కరీ ఓ క్లియర్ విజన్‌తో ముందుకు వెళ్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, బయోఫ్యూయల్స్, ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ల ఆలోచనతో పాటు పాత వాహనాలను స్క్రాప్ చేయడం ద్వారా రేర్ ఎర్త్ మెటల్స్ పొందడం.. తద్వారా ఈ తరహా ఆలోచనలతో భారత ఆటో పరిశ్రమను ప్రపంచంలో #1 స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ఆయన పని చేస్తున్నారు. -
దేశంలో ‘పెరుగుతున్న ఇథనాల్ బ్లెండింగ్’
సాక్షి, న్యూఢిల్లీ: ఇథనాల్‌తో కలిసిన పెట్రోల్‌ను ఇంధనంగా వాడటం వల్ల రైతుల ఆదాయం పెరగడమే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడిందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. 2014–15 నుంచి 2025 జూలై వరకు రైతులకు రూ.1.25 లక్షల కోట్లు నేరుగా చెల్లించగా, దేశానికి రూ.1.44 లక్షల కోట్ల విదేశీ మారకాన్ని ఆదా చేసినట్లు ఆయన వివరించారు. అలాగే 736 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గి, 244 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు అవసరం తక్కువైందని ఇటీవల పార్లమెంట్ వేదికగా వెల్లడించారు. ఇథనాల్ మిశ్రమం పెరుగుదల పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 2022 జూన్‌లోనే 10% లక్ష్యాన్ని చేరింది. తర్వాత ఇది 2022–23లో 12.06%, 2023–24లో 14.60%, 2024–25లో జూలై 31 నాటికి 19.05%గా నమోదైంది. కేవలం జూలై నెలలోనే 19.93% సాధించడం విశేషమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇథనాల్ ఉత్పత్తి కోసం ముడి సరుకుల విస్తరణ, పన్ను రాయితీలు, వడ్డీ సబ్సిడీ పథకాలు, సహకార చక్కెర కర్మాగారాలకు మల్టిఫీడ్ స్టాక్ ప్లాంట్లకు ఆర్థిక సాయం వంటి చర్యలు తీసుకున్నామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వివరించారు. -
ఇథనాల్ కలిపిన పెట్రోలుపై సుప్రీంకోర్టులో పిల్!
ఇరవై శాతం ఇథనాల్ కలిపిన పెట్రోలు అమ్మకాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇథనాల్ లేని పెట్రోలును ఎంచుకునే సౌకర్యం వినియోగదారులకు కల్పించాలని కోరుతూ అక్షయ్ మల్హోత్ర అనే న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ సౌకర్యం కల్పించకపోవడం 2019 నాటి వినియోదారుల హక్కుల చట్టాన్ని ఉల్లంఘించడమేనని, ప్రజల ప్రాథమిక హక్కులకూ భంగం కలిగించేదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఇథనాల్ కలిపిన పెట్రోలును విక్రయించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నిన్న మొన్నటివరకూ పెట్రోలులో కలిపే ఇథనాల్ మోతాదు పది శాతం మాత్రమే ఉండగా.. ఆగస్టు ఒకటవ తేదీ నుంచి దీన్ని ఇరవై శాతానికి పెంచారు. అయితే చౌక ఇథనాల్‌ను కలుపుతున్నా అంతమేరకు పెట్రోలు ధరలు తగ్గకపోవడంపై, ఈ-20 పెట్రోలు కారణంగా తమ వాహనాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, మైలేజీ తగ్గుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2023 ఏప్రిల్ కంటే ముందు తయారైన వాహనాలు, కాలుష్య నివారణ మార్గదర్శకాలు బీఎస్-6లు రెండింటికీ ఈ ఈ-20 పెట్రోలు అనుకూలంగా లేదన్నది ఆరోపణ. ఈ-20 ఇథనాల్ ఇంజిన్ భాగాలను దెబ్బతీస్తుందని, సామర్థ్యాన్ని తగ్గించడమే కాకుండా తుప్పు పట్టేందుకు అవకాశాలు ఎక్కువ చేస్తుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఇథనాల్ మిశ్రమ ఇంధనం వల్ల కలిగే నష్టాలను భర్తీ చేసేందుకు బీమా కంపెనీలు ససేమిరా అంటూండటం గమనార్హం.వినియోగదారుల అవగాహనపెట్రోల్ కంటే తక్కువ ధరకు ఇథనాల్ లభిస్తోందని కానీ ప్రభుత్వం మాత్రం అందుకు తగ్గట్టుగా పెట్రోలు ధరలు తగ్గించలేదని పిటిషనర్ ఆరోపించారు. పెట్రోలు బంకుల్లో లభిస్తున్నది ఇథనాల్ కలిపినదా? కాదా? అన్నది కూడా స్పష్టంగా తెలియడం లేదని తగిన లేబలింగ్, ప్రకటనలు లేకపోవడం వల్ల వినియోగదారులు గందరగోళానికి గురవుతున్నారని తన పిటిషన్లో పేర్కొన్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఇథనాల్ లేని పెట్రోలును కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చిందీ పిటిషన్. ఇథనాల్ లేదా ఇతర పదార్థాలను కలిపి అందిస్తూంటే ఆ విషయాలను స్పష్టం చేస్తున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో అన్ని పెట్రోల్ స్టేషన్లలో ఇథనాల్ లేని పెట్రోల్‌ను కూడా అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టును కోరింది. దీంతోపాటే మిశ్రమం ఎంత? ఏ ఏ పదార్థాలను కలిపింది కూడా పెట్రోలు బంకుల్లో స్పష్టంగా ప్రకటించాలని... ఆయా వాహనాలు మిశ్రమ ఇంధనానికి అనువైనవా? కావా? అన్న సమాచారాన్ని వినియోగదారులకు అందించాలని సూచించింది. ఈ-20 పెట్రోలు వాడకం ప్రభావం వాహనాలపై ఎలా ఉంటుందన్న విషయాన్ని దేశవ్యాప్తంగా అధ్యయనం చేయాలని అభ్యర్థించింది.ఇదీ చదవండి: పాలసీ ఏజెంట్లు చెప్పని విషయాలు -
'అలాంటి ఒక్క వాహనం చూపించండి': గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతుందనే వాదనలు నిజం కాదని, రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మైలేజీపై E20 పెట్రోల్ ప్రభావం అనే ప్రశ్నకు సమాధానంగా ఇచ్చారు.''ప్రపంచంలో ఎక్కడైనా E20 పెట్రోల్ కారణంగా సమస్యలు ఎదుర్కొన్న ఒక వాహనాన్ని మీరు నాకు చూపించండి'' అని బహిరంగంగా సవాలు విసిరారు. ఇంధనం కారణంగా ఇంజిన్‌కు పెద్దగా నష్టం జరగదు. అయితే కొత్త కార్లలో మైలేజ్ 2 శాతం, అప్‌గ్రేడ్ చేసిన విడి భాగాలను ఉపయోగించిన కార్ల మైలేజ్ 6 శాతం తగ్గే అవకాశం ఉంది. ఇది సర్వ సాధారణం అని చెప్పవచ్చు. దీనిని సమస్యగా పరిగణించలేము.స్థానికంగా ఉత్పత్తి చేసిన ఇథనాల్ వాడకం వల్ల, భారతదేశానికి పెట్రోల్ దిగుమతి ఖర్చు తగ్గుతుంది. అంతే కాకుండా ఈ ఇంధనం కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుందని గడ్కరీ పేర్కొన్నారు. క్వింటాల్ మొక్కజొన్న ధర రూ.1,200 నుంచి రూ.2,600 ఉంటుంది. దీని నుంచి ఇథనాల్ తయారు చేస్తారు. కాబట్టి ఇంధన ధరలు కొంత తగ్గుతాయని అన్నారు.ఇదీ చదవండి: జీతం వచ్చిన ఐదు నిమిషాలకే ఉద్యోగి రాజీనామా: హెచ్ఆర్ ఏమన్నారంటే?ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల.. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో మొక్కజొన్న విస్తీర్ణం మూడు రెట్లు పెరిగింది. దీనివల్ల రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని నితిన్ గడ్కరీ అన్నారు. ఈ విధంగా వైవిధ్యపరచడం వల్ల జీడీపీలో వ్యవసాయ వాటా ప్రస్తుత 12 శాతం నుండి 22 శాతానికి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో 'ఇథనాల్'ను 100 శాతం ఇంధనంగా ఉపయోగించనున్నట్లు ప్రకటించారు. -
ఇథనాల్ ఎకానమీ మంచీ చెడూ!
ఇంధన వినియోగం పెరగకుండా ఇండియా ఆర్థిక పురోగతి సాధ్యపడదు. వచ్చే ఇరవై ఏళ్లలో జీడీపీ వృద్ధి రేటు ఎంత ఎగబాకుతుందో, ఇది కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. ఇళ్లకు, ఫ్యాక్టరీలకు, ఆఫీసు లకు విద్యుత్ సరఫరా పెంచాల్సిఉంటుంది. రవాణా అవసరాలకు మరింత ఇంధనం సమకూర్చాలి. మూడొంతుల విద్యుదుత్పత్తికి బొగ్గే ఆధారం. మిగిలిన ఒక వంతు సోలార్, హైడ్రో, న్యూక్లియర్, బయోమాస్ మార్గాల ద్వారా ఉత్పత్తి అవుతోంది. ఈ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వ్యవస్థాపక సామర్థ్యం మొత్తం విద్యుత్ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో 50 శాతానికి చేరినప్పటికీ, వాస్తవ ఉత్పత్తి 25 శాతం మించిలేదు. చేరుకున్న లక్ష్యం బొగ్గు నిక్షేపాల్లో ఇండియా ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. అయినా 20 శాతం అవసరాలకు దిగుమతులపై ఆధార పడుతున్నాం. దీంతో విదేశీ బొగ్గు కోసం 20 బిలియన్ డాలర్లు (రూపాయల్లో దాదాపు 1.70 లక్షల కోట్లు) ఖర్చు పెట్టక తప్పడం లేదు. రవాణారంగం అవసరాలకు మరింత ఎక్కువగా దిగు మతులపై ఆధారపడాల్సి వస్తోంది. దేశవ్యాప్త ముడిచమురు విని యోగంలో 90 శాతం దిగుమతి అవుతోంది. గతేడాది 24.2కోట్ల టన్నుల క్రూడాయిల్ విదేశాల నుంచి వచ్చింది. అంతర్జాతీయ క్రూడ్ ధరలు బ్యారెల్ 65 నుంచి 85 డాలర్ల మధ్య ఉంటాయనుకుంటే, ఈ దిగుమతులపై 125 నుంచి 150 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం (రూ. 10 లక్షల కోట్ల నుంచి 13 లక్షల కోట్లు) వెచ్చించాల్సి వస్తుంది. శుభ వార్త ఏమిటంటే, పెట్రోలు, డీజిలు ఎగుమతులు ముడి చమురు దిగుమతుల కంటే వేగంగా పెరుగుతున్నాయి.గడచిన ఏడాది, 6.5 కోట్ల టన్నుల పెట్రోలు, డీజిలు మంచి లాభాలతో ఎగుమతి అయ్యాయి. ఇండియా చమురు శుద్ధి సామర్థ్యం 20 శాతం పెరిగి 31 కోట్ల టన్నులకు చేరుకోబోతోంది. దేశీయ అవసరాల కంటే వేగంగా రిఫైనింగ్ కెపాసిటీ పెరుగుతోంది. పశ్చిమ మహారాష్ట్రలో నెలకొల్పాలని ప్రతిపాదించిన కొత్త రిఫైనరీ వల్ల ఉత్పత్తి, ఉపాధి, ఎగుమతులు ఇంకా ఊపందుకుంటాయి. భవిష్యత్తులో దేశీయ రిఫైనింగ్ కెపాసిటీలో నాలుగో వంతు ఎగు మతులకు అందుబాటులో ఉంటుంది. దీనివల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది. ఇది విశేషమే అయినప్పటికీ, మనం గుర్తు పెట్టు కోవలసిన విషయం ఒకటుంది. ప్రపంచం శిలాజ ఇంధనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించి వేస్తోంది. ఇండియా సైతం కర్బన ఉద్గారాల కాలుష్యాన్ని తగ్గించే ప్రధాన ధ్యేయంతో పెట్రోలు, డీజిలులో ఇథనాల్ బ్లెండింగ్‌ను పెంచేసింది. ఇండియాలో చెరకు నుంచి, మొక్కజొన్న, బియ్యం తదితర ఆహార ధాన్యాల నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేస్తున్నారు. 2013లో 1.5 శాతంతో ప్రారంభించిన ఇథనాల్ బ్లెండింగ్ ఇప్పటికే 20 శాతం లక్ష్యాన్ని చేరుకుంది. ఈ వృద్ధి పెట్రోలు, డీజిలు వినియోగ వృద్ధి కంటే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ (ఈబీపీ) విజయవంతం అయ్యేందుకు వీలుగా ఇథనాల్ ఉత్పత్తిదారులకు ప్రత్యేక సబ్సిడీలు ఇస్తున్నారు. తక్కువ జీఎస్టీ రేట్ల వర్తింపు, రుణాలపై వడ్డీ రాయితీ వంటి పలు ప్రోత్సాహకాలు అమలు అవుతున్నాయి. ఇథనాల్ ఉత్పత్తి టెక్నాలజీలో ఇండియా ప్రపంచ అగ్రగామిగా అవతరించింది. ఇథనాల్ ఇంత శాతం కలపాలి అనే నిబంధన వల్ల ఆయిలు కంపెనీలు ఆ మేరకు ఉత్పత్తిదారుల నుంచి తప్పనిసరిగా దాన్ని కొనుగోలు చేసితీరాలి. కాబట్టి, ఇథనాల్‌కు మార్కెటింగ్ సమస్య లేదు. ప్రస్తుతం 1,810 కోట్ల లీటర్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉండగా,ఇందులో చెరకు లేదా మొలాసిస్ ఆధారిత ప్లాంట్ల కెపాసిటీ 816 కోట్ల లీటర్లు. మిగిలిన దానిలో మొక్కజొన్నలు, బియ్యం సహా ధాన్యం నుండి ఇథనాల్ తయారు చేసే కెపాసిటీ 858 కోట్ల లీటర్లు. మరో 136 కోట్ల లీటర్ల కెపాసిటీ ప్లాంట్లు ఈ రెండు ముడి సరుకు లనూ ఉపయోగించుకుని పనిచేస్తాయి.నాలుగు ప్రయోజనాలునాలుగు ధ్యేయాలతో పదేళ్ల క్రితం ఈబీపీ అమలులోకి వచ్చింది. ప్రధానంగా ఒనగూరే ప్రయోజనం క్రూడాయిలు దిగు మతుల మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. మరో మూడు ధ్యేయాలు ఉన్నాయి. అవి: విదేశీ మారక ద్రవ్యం ఆదా, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెంపు. ఇప్పటికే 20 శాతం బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకున్నందు వల్ల, ఈబీపీ తన ధ్యేయాల సాధనలో ఎంతవరకు సఫలీకృతమైందో పరిశీలిద్దాం. ఈ కార్యక్రమం అమల్లోకి వచ్చి 2024 నాటికి పదేళ్లయ్యింది.1. ఈ కాలంలో క్రూడాయిలు దిగుమతుల్లో 1.8 కోటి టన్నులు ఆదా చేయగలిగాం. కానీ ఇది మొత్తం దిగుమతిలో 0.8 శాతం మాత్రమే. 2. విదేశీమారక ద్రవ్యం పరంగా చూస్తే ఈ ఆదా విలువ దాదాపు రూ. 1.06 లక్షల కోట్లు. (రూపాయి సగటు మారకం రేటు ప్రకారం 10 బిలియన్ డాలర్లు). ఇది కూడా పదేళ్ల వ్యయంలో 0.5 శాతం కంటే తక్కువ. 3. ఇక కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను ఈబీపీ 5.4 కోట్ల టన్నులు తగ్గించగలిగింది. శాతంలో చూస్తే 1 శాతం కంటే తక్కువ. 4. వ్యవసాయానికి సంబంధించినంత వరకు, ఈబీపీ ఫలి తంగా రైతాంగం ఆదాయం పదేళ్లలో రూ. 1 లక్ష కోట్లు పెరిగింది. అదే సమయంలో డిస్టిలరీలు మరో లక్ష కోట్లు అదనంగా గడించాయి.శాతం ప్రకారం చూస్తే, చెరకు లేదా మొక్కజొన్న రైతుల వ్యవ సాయ ఆదాయంలో వృద్ధి ఫర్వాలేదన్నట్లు ఉంది. ఈబీపీ వచ్చిన తర్వాత చెరకు మార్కెట్లో అస్థిరత తొలగిపోయింది. అప్పటి వరకు చెరకు అధికోత్పత్తి సమస్య ఉండేది. ధాన్యాల విషయానికి వస్తే, 50 లక్షల టన్నుల బియ్యాన్ని ఇథనాల్ తయారీకి మళ్లించాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి ప్రపంచ ఎగుమతుల్లో 9 శాతానికి, దేశీయ ఉత్పత్తిలో 4 శాతానికి, ప్రభుత్వ గోదాముల్లో మూలుగుతున్న నిల్వల్లో 10 శాతానికి సమానం.దుష్పరిణామాలుబియ్యం, మొక్కజొన్న వంటి ధాన్యాలను ఈబీపీ కోసం తరలించడం వల్ల ఉత్పన్నమైన దుష్పరిణామం ఏమిటంటే, దేశంలో కోళ్ల దాణా పరిశ్రమ చిక్కుల్లో పడింది. మొక్కజొన్నల నికర ఎగు మతిదారుగా ఉన్న ఇండియా నికర దిగుమతిదారుగా మారింది. ధాన్యంగా అమ్మేకంటే వాటితో ఇథనాల్ తయారు చేసి అమ్మడం డిస్టిలరీలకు లాభసాటిగా మారింది. ఈ ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం ఆహార ద్రవ్యోల్బణానికీ దారితీసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం దేశంలోని 81 కోట్ల మంది పేదలకు అయిదేసి కిలోల గోధుమలు లేదా బియ్యం ఉచితంగా సమ కూరుస్తోంది. దీనికోసం, ప్రభుత్వం పెద్దఎత్తున ధాన్యం సేకరణ, పంపిణీలు చేపట్టవలసి వచ్చింది. ఇక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోలు, డీజిలు అమ్మకాల మీద 50 శాతం పైనే ఎక్సయిజ్; ఇతర పన్నులు చెల్లిస్తున్నాయి. ఇథనాల్ మీద పన్నుల భారం నామమాత్రం కాబట్టి, ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఈ భారం వారికి గణనీయంగా తగ్గుతుంది. అందుకే పెట్రోలు, ఇథనాల్ సుంకాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించే అంశాన్ని పరిశీలించాలి. 20 శాతం బ్లెండింగు గొప్ప మైలురాయే. ఈ సందర్భంగా, ఆహార భద్రతపై దుష్ప్రభావాలు, ఆహార ద్రవ్యోల్బణం, రాయితీలు, ఆర్థిక భారం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈబీపీ విధానాన్ని పునఃసమీక్షించడం అవసరం.అజిత్ రానాడే వ్యాసకర్త ప్రముఖ ఆర్థికవేత్త -
ఒడిశాలో అమానవీయం
భువనేశ్వర్: ఒడిశాలోని పూరీ జిల్లాలో దారుణం జరిగింది. 15 ఏళ్ల బాలికపై గుర్తు తెలియని దుండుగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. 70 శాతం కాలిన గాయాలతో బాధితులు భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. బయాబర్ గ్రామంలోని నవగోపాల్పూర్ బస్తీలో శనివారం చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్తుండగా, ముగ్గురు వ్యక్తులు మోటార్‌సైకిల్ వచ్చి అడ్డగించారు. సమీపంలోని భార్గవి నది గట్టుకు బలవంతంగా లాక్కెళ్లారు. చేతులు కట్టేసి పెట్రోల్ చల్లి, నిప్పంటించి, వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం చేరవేశారు. అనంతరం పోలీసులు ఆమెను మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్‌కు తరలించారు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఎనిమిదో తరగతి వరకు చదుకుంది. మధ్యలో చదువు మానేసింది. ఆమె తండ్రి మెకానిక్‌గా పని చేస్తున్నాడు. బాలిక పట్ల రాక్షసంగా ప్రవర్తించిన దుండగులను త్వరలో అరెస్టు చేస్తామని ఒడిశా డీజీపీ వై.బి.ఖురానియా ప్రకటించారు. బాలికను హత్య చేయడానికి ఎందుకు ప్రయత్నించారన్నది తెలియరాలేదు. మరోవైపు ఈ ఘటనపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని మండిపడ్డాయి. మహిళలపై నిత్యం అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదని మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోపించారు. విపక్ష తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సైతం తీవ్రంగా స్పందించింది. ‘బేటీ బచావో’ అంటే ఇదేనా? అని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులు రక్తంతో తడిచాయని విమర్శించింది. ఒడిశాలో వారం రోజుల క్రితమే కాలేజీ విద్యార్థిని(20) ఆత్మాహుతికి పాల్పడింది. ప్రొఫెసర్ లైంగికంగా వేధిస్తుండడంతో భరించలేక తనకు తానే నిప్పంటించుకొని మృతిచెందింది. ఈ ఘటన రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలచివేసింది. -
మణిపూర్‌లో మళ్లీ ఘర్షణలు
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. మొయితీ వర్గం నాయకులను పోలీసులు శనివారం అరెస్టు చేయడంతో ఆ వర్గం ప్రజలు ఆదివారం వీధుల్లోకి వచ్చారు. నిరసనలతో హోరెత్తించారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. నిషేధాజ్ఞలు లెక్కచేయకుండా ఆందోళనలు చేశారు. రోడ్లపై టైర్లు వేసి దహనం చేశారు. దాంతో ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్ జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా దళాల రాకపోకలు అడ్డుకొనేందుకు రోడ్లు తవ్వేశారు. దుకాణాలపై దాడులకు దిగారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. తమ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాజధాని ఇంఫాల్‌లో కొందరు ఆత్మాహుతికి ప్రయత్నించినట్లు తెలిసింది. ముందు జాగ్రత్తగా ఇంఫాల్ లోయలోని ఐదు జిల్లాల్లో ప్రభుత్వం మొబైల్, ఇంటర్నెట్ సేవలు రద్దు చేసింది. కొన్నిచోట్ల కర్ఫ్యూ సైతం విధించింది. ఆంక్షలు ఐదు రోజులపాటు అమల్లో ఉంటాయని ప్రకటించింది. మరోవైపు మణిపూర్ గవర్నర్ అజయ్‌కుమార్ భల్లా రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఘర్షణలు కొనసాగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొందరు ఎమ్మెల్యేలు రాజభవన్లో గవర్నర్‌ను కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు ఆయనకు వివరించారు. మరోవైపు అస్సాంలోని జిరిబామ్ జిల్లాలోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. మొయితీ వర్గానికి చెందిన అరంబాయ్ తెంగోల్ తెగ కీలక నాయకుడితోపాటు మరికొందరు సభ్యులు పోలీసులు శనివారం అరెస్టు చేయడం మణిపూర్, అస్సాంలో ఘర్షణలకు దారితీసింది. ఆ కీలక నాయకుడు కానన్ సింగ్ అంటున్నారు. అతడికి మొయితీల్లో గట్టి పట్టుంది. మణిపూర్‌లో 2023 నుంచి మొయితీలు, కుకీల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో 260 మందికిపైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.సీఎం బీరేన్‌సింగ్ రాజీనామా చేయడంతో ఫిబ్రవరి నుంచి రాష్ట్రపతి పాలన సాగుతోంది.ఇది కూడా చదవండి: ‘డెమోక్రాట్లకు నిధులిస్తే బాగోదు’.. మస్క్‌కు ట్రంప్ వార్నింగ్ -
పెట్రోల్ అమ్మకాలు పెరిగాయ్..
న్యూఢిల్లీ: వేసవి నేపథ్యంలో పెట్రోల్ అమ్మకాలు ఊపందుకున్నాయి. ఈ నెల మొదటి 15 రోజుల్లో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 10 శాతం పెరిగినట్టు ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థల (బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ) గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. ఇంధన అమ్మకాల్లో 90 శాతం వాటా ఈ సంస్థల చేతుల్లోనే ఉంది. మే 1–15 తేదీల మధ్య 1.37 మిలియన్ టన్నుల పెట్రోల్ అమ్మకాలు జరిగాయి.వేసవి సెలవుల్లో వ్యక్తిగత వాహన వినియోగం పెరగడం ఇందుకు మద్దతుగా ఉంది. డీజిల్ విక్రయాలు 2 శాతం పెరిగి 3.36 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. రవాణా, వ్యవసాయ రంగంలో ప్రధానంగా వినియోగించే డీజిల్ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలోనూ 2 శాతం పెరగడం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో డీజిల్ విక్రయాలు 8.23 మిలియన్ టన్నులుగా ఉన్నాయి.క్రితం ఏడాది ఇదే కాలంలోని అమ్మకాల కంటే 4 శాతం అధికం. ఏప్రిల్‌నెల మొదటి 15 రోజుల్లో డీజిల్ అమ్మకాలు 3.19 మిలియన్ టన్నులతో పోల్చి చూస్తే 5 శాతం వినియోగం పెరిగినట్టు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతుండడంతో గత కొన్ని నెలలుగా డీజిల్ అమ్మకాల్లో వృద్ధి పరిమితంగానే ఉంటున్నట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఎల్పీజీ అమ్మకాలదీ ఎగువబాటే విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు మే మొదటి 15 రోజుల్లో 3,27,900 టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలం అమ్మకాల కంటే 1.1 శాతం తగ్గాయి. పాకిస్థాన్‌తో ఘర్షణల నేపథ్యంలో ఉత్తరాదికి విమాన సరీ్వసులు ప్రభావితం కావడం వినియోగం తగ్గడానికి కారణంగా తెలుస్తోంది. ఎల్పీజీ అమ్మకాలు 10.4 శాతం పెరిగి 1.34 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. -
పెట్రోల్, డీజిల్, గ్యాస్‌పై టెన్షన్.. ఆయిల్ కంపెనీ క్లారిటీ
భారత్-పాకిస్థాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరత వస్తుందేమోనన్న ఆందోళనతో పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను ముందే కొని నిల్వ చేసుకునేందుకు దేశంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద జనం క్యూ కడుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) స్పష్టత ఇచ్చింది. దేశంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.ఈ మేరకు ఐఓసీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్)లో ఒక పోస్ట్ చేసింది. "భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంధనం, ఎల్పీజీ మా అన్ని అవుట్లెట్లలో సమృద్ధిగా అందుబాటులో ఉంది" అని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇండియన్ ఆయిల్ వద్ద ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, తమ సరఫరా మార్గాలు సజావుగా పనిచేస్తున్నాయని తెలిపింది. వినియోగదారులు అనవసర ఆందోళనతో పెట్రోల్ బంక్‌లకు పోటెత్తవద్దని సూచించింది.ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి, ప్రతీకారంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో ఈ భయాందోళనలు నెలకొన్నాయి.#IndianOil has ample fuel stocks across the country and our supply lines are operating smoothly.There is no need for panic buying—fuel and LPG is readily available at all our outlets.Help us serve you better by staying calm and avoiding unnecessary rush. This will keep our…— Indian Oil Corp Ltd (@IndianOilcl) May 9, 2025 -
ఏప్రిల్‌లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు ఇలా..
న్యూఢిల్లీ: కీలక ఇంధనాలైన పెట్రోల్, డీజిల్ వినియోగం ఏప్రిల్‌లో పెరిగింది. వరుసగా కొన్ని నెలల పాటు క్షీణత అనంతరం 4 శాతం మేర అమ్మకాలు పెరిగాయి. ఏప్రిల్‌లో డీజిల్ వినియోగం 8.23 మిలియన్ టన్నులకు చేరుకుంది. క్రితం ఏడాది ఏప్రిల్ నెల అమ్మకాలతో పోల్చి చూస్తే 4 శాతం పెరిగినట్టు పెట్రోలియం ప్రణాళిక, విశ్లేషణ విభాగం (కేంద్ర పెట్రోలియం శాఖ పరిధిలోని) డేటా తెలియజేస్తోంది.2023 ఏప్రిల్ నెల విక్రయాలతో పోల్చి చూసినా 5.3 శాతం మేర వినియోగం పెరిగింది. కరోనా ముందు నాటి సంవత్సరం 2019 ఏప్రిల్ నెల గణాంకాలతో పోల్చి చూస్తే 10.45 శాతం అధికం కావడం గమనించొచ్చు. కస్టమర్లు క్రమంగా ఎలక్ట్రిక్, పెట్రోల్ వేరియంట్ల వైపు మొగ్గు చూపిస్తుండడంతో డీజిల్ వినియోగంపై కొంత కాలంగా నెలకొన్న సందేహాలకు తాజా గణంకాలు తెరదించినట్టయింది. మొత్తం పెట్రోలియం ఇంధనాల్లో డీజిల్ వాటా 38 శాతంగా ఉంటుంది.ఇక ఏప్రిల్ నెలలో పెట్రోల్ అమ్మకాలు సైతం క్రితం ఏడాది ఇదే నెల గణాంకాలతో పోల్చి చూస్తే 4.6 శాతం పెరిగి 3.43 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. గతేడాది ఏప్రిల్‌లో ఎన్నికల కారణంగా పెట్రోల్ అమ్మకాలు 19 శాతం వృద్ధిని నమోదు చేయగా, నాటి గరిష్ట పరిమితి మీద మెరుగైన వృద్ధి నమోదైంది. ఎల్పీజీ విక్రయాలు 6.7 శాతం పెరిగి 2.62 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు 3.25 శాతం తగ్గి 7,66,000 టన్నులుగా ఉన్నాయి. -
బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయమన్నా పోయరు!
వాతావరణంలోని గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జులై 1, 2025 నుంచి ‘ఎండ్-ఆఫ్-లైఫ్(ఈఓఎల్-నిబంధనల ప్రకారం వాడకూడని వాహనాలు)’ వాహనాలకు ఇంధనం నింపడాన్ని నిషేధించాలని నిర్ణయించింది. దేశ రాజధానిలో వాయు కాలుష్యానికి ప్రధాన కారమవుతున్న వాహనాల ఉద్గారాలను నియంత్రించడమే లక్ష్యంగా 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలు, 10 ఏళ్లకు పైబడిన డీజిల్ వాహనాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.ఈ చర్యలను అమలు చేయడానికి ఢిల్లీలోని అన్ని ఇంధన స్టేషన్లలో జూన్ 30, 2025 నాటికి ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్పీఆర్) కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ అధునాతన వ్యవస్థ ఈఓఎల్ వాహనాలను గుర్తించి, వాటిలో ఇంధనం నింపకుండా నిరోధించేందుకు సాయం చేస్తుంది. ఈ ఆంక్షలు ఒక్క ఢిల్లీకే పరిమితం కావని కొందరు అధికారులు తెలుపుతున్నారు. నవంబర్ 1, 2025 నుంచి నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలోని ఐదు జిల్లాల్లో ఈ నిషేదాజ్ఞలు ఉండబోతున్నాయి. ఇందులో గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, సోనిపట్లు ఉన్నాయి. ఏప్రిల్ 1, 2026 నాటికి ఈ విధానం మొత్తం ఎన్సీఆర్ను పరిధిలో విస్తరించబోతున్నట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: బీమా ప్రీమియం రేట్ల నోటిఫికేషన్లో జాప్యంమరోవైపు 2025 నవంబర్ 1 నుంచి బీఎస్-6 కాని రవాణా, వాణిజ్య గూడ్స్ వాహనాలను ఢిల్లీలోకి ప్రవేశించడాన్ని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సీఏక్యూఎం) నిషేధించింది. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలలో వాహన కాలుష్యం క్లిష్టమైన సమస్యగా ఉన్నందున ఈ విధానాలు స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడానికి, ప్రజారోగ్యాన్ని రక్షించడానికి ఎంతో తోడ్పడుతాయని అధికారులు తెలిపారు. -
పెళ్లీడుకొచ్చిన పిల్లలను వదిలేసి.. ఇదేం పాడు పని నారాయణ
బాపట్ల టౌన్ : అతడికి 64 ఏళ్లు. ఆమెకు 54. ఇద్దరికీ వేర్వేరు కుటుంబాలున్నాయి. పెళ్లీడుకొచ్చిన సంతానం ఉన్నారు. ఆర్థికంగా స్థిరపడినవారే. పిల్లలు ఉన్నత విద్యావంతులు. అయినా వారి వల్లమాలిన వివాహేతర సంబంధం ప్రాణాల మీదకు తెచ్చింది. ఆ పెద్దాయన తన మాట వినలేదనే ఆవేశంలో ఆమె అఘాయిత్యానికి ఒడిగట్టింది. ఈ ఘటన బాపట్లలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు...రిటైర్డ్ రైల్వే ఉద్యోగి తులాబందుల లక్ష్మీనారాయణ బాపట్ల రైల్వేస్టేషన్ ఎదుట ఐఆర్సీటీసీ సెంటర్ నిర్వహిస్తున్నారు. పట్టణానికి చెందిన నల్లమోతు మాధవితో కొన్నేళ్ళుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఇదిలాఉండగా లక్ష్మీనారాయణ భార్య అరుణాదేవి కళ్ళకు ఆపరేషన్ చేయించే నిమిత్తం హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న మాధవి లక్ష్మీనారాయణను వెళ్ళటానికి వీల్లేదంటూ అడ్డగించింది. కుటుంబ సభ్యులతో కలిసి అరుణాదేవిని పంపించాలంటూ హెచ్చరించింది. దీనికి ఆయన అంగీకరించకపోవడంతో శుక్రవారం ఉదయం తన వెంట తెచ్చుకున్న పెట్రోలును ముందు తనపై పోసుకొని ఆ తర్వాత లక్ష్మీనారాయణపై పోసి నిప్పంటించింది. రైల్వే స్టేషన్ ఎదురుగా ఐఆర్సీటీసీ బుకింగ్ కౌంటర్ నుంచి పొగలు రావడంతో స్థానికులు మంటలు ఆర్పివేసే ప్రయత్నం చేశారు. అప్పటికే మాధవి 80 శాతం, లక్ష్మీనారాయణ 60 శాతం కాలిపోయారు. వెంటనే స్థానికులు ఇద్దరినీ చికిత్స నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను బాపట్ల సీనియర్ సివిల్‌జడ్జి పరామర్శించి వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఇరువురినీ గుంటూరు తరలించారు. ఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. pic.twitter.com/cwB2QDewFD— Kumaruuu💙 (@CalmnessSoull) April 11, 2025 -
అక్కడ పెట్రోల్ బైకులు, సీఎన్జీ ఆటోలు బ్యాన్!
ఢిల్లీలో వాయుకాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అక్కడి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే 'ఈవీ పాలసీ 2.0'ను తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. దీనికి మంత్రి వర్గం నుంచి ఆమోదం లభించిన తరువాత.. పెట్రోల్, డీజిల్ సీఎన్జీ బైకులను పూర్తిస్థాయిలో నిషేధించడానికి ఢిల్లీ సర్కార్ అడుగులువేస్తుంది.ఈవీ పాలసీ 2.0 అమలులోకి వచ్చిన తరువాత.. వచ్చే ఏడాది నుంచే పెట్రోల్, సీఎన్జీ బైకులను బ్యాన్ చేయనున్నారు. 2027 డిసెంబర్ 31 నాటికి ఢిల్లీలో వందశాతం ఎలక్ట్రిక్ వాహనాలను నడపాలని ఉద్దేశ్యంతోనే.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సీఎన్జీ బైకులతో పాటు, సీఎన్జీ ఆటోలను కూడా నిషేదించనున్నట్లు సమాచారం. ఫ్యూయెల్ కార్లను ఎంతవరకు నిషేధిస్తారు అనేదానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.2025 ఆగస్టు 15 నుంచి ఢిల్లీలో కొత్త సీఎన్జీ ఆటో రిక్షా రిజిస్ట్రేషన్లను, రెన్యువల్స్ అనుమతించరు. కేవలం ఎలక్ట్రిక్ ఆటోల రెన్యువల్స్, రిజిస్ట్రేషన్లకు మాత్రమే అనుమతి లభిస్తుంది. ఆ తరువాత దశల వారీగా పెట్రోల్, సీఎన్జీ వాహనాలను తొలగించనున్నారు. వీటి స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాల్సి ఉంది.బైకులు, ఆటోలు మాత్రమే కాకుండా.. ఢిల్లీలో చెత్తను సేకరించే వాహనాలు, సిటీ బస్సులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు అయి ఉండాలి చెబుతున్నారు. కాగా మార్చి 31తో ముగిసిన 'ఈవీ పాలసీ'ని ఢిల్లీ ప్రభుత్వం మరో 15 రోజులు పెంచింది. ఆ తరువాత ఈవీ పాలసీ 2.0 అమలులోకి వస్తుంది. ఫ్యూయెల్ వాహనాలను.. ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయడమే ఈ కొత్త పాలసీ లక్ష్యం అని అధికారులు చెబుతున్నారు.ఢిల్లీ వాయు కాలుష్య సంక్షోభందేశ రాజధానిలో చాలా సంవత్సరాలుగా తీవ్రమైన వాయు కాలుష్య సంక్షోభం నెలకొంది. శీతాకాలంలో గాలి నాణ్యత (AQI) ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఇది మరింత తీవ్రమవుతుంది. వాహనాల ఉద్గారాలు, నిర్మాణ పనుల నుంచి వచ్చే దుమ్ము, కర్మాగారాల నుంచి వచ్చే పొగ.. పంజాబ్, హర్యానా వంటి సమీప రాష్ట్రాలలోని రైతులు గడ్డిని తగలబెట్టడం వల్ల కాలుష్యం ఏర్పడుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. పండుగల సమయంలో పటాకులు కాల్చడం, వ్యర్థాలను కాల్చడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతోంది. వాయుకాలుష్యం కారణంగా పిల్లలు, వృద్ధులలో శ్వాస సమస్యలు, ఉబ్బసం, గుండె జబ్బులకు కారణమవుతాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. -
లోకేష్‌ను కలిసిన న్యాయం జరగలేదు.. పెట్రోల్ బాటిల్‌తో టీడీపీ కార్యకర్త నిరసన
సాక్షి, అనకాపల్లి: కూటమి పాలనలో తనకు న్యాయం జరగలేదంటూ పెట్రోల్ బాటిలతో కలెక్టర్ కార్యాలయం ముందు ఓ టీడీపీ కార్యకర్త నిరసనకు దిగాడు. తన భూమిని కొంతమంది ఆక్రమించుకున్నారని.. న్యాయం జరగకపోతే కలెక్టర్ కార్యాలయం ముందు కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ టీడీపీ కార్యకర్త బుద్ధా శ్రీను హెచ్చరించాడు.అధికార పార్టీకి చెందిన తనకే న్యాయం జరగలేదని.. ఇక సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. లోకేష్‌ను కలిసిన న్యాయం జరగలేదన్నారు. రికార్డులు తారుమారు వెనక రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్న బుద్ధా శ్రీను.. న్యాయం జరగకపోతే కుటుంబంతో ఆత్మహత్యే గతి అంటూ వాపోయాడు. -
రెన్యువల్‌కూ ఓ రేటుంది!
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్ బంకుల్లో డిస్పెన్సర్ మెషీన్లకు ఏటా స్టాంపింగ్ రెన్యువల్ తప్పనిసరి. దీని కోసం గడువుకు 30 రోజులు ముందే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 15 రోజుల్లో ఇన్స్పెక్టర్ బంకును సందర్శించి వెరిఫికేషన్ పూర్తి చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు డీఎల్‌ఎంఓ ఫోర్టల్‌కు చేరిన తర్వాత ఇన్స్పెక్టర్ ఆమోదంతో వెరిఫికేషన్ షెడ్యూల్ ఈ– మెసేజ్ ద్వారా యాజమానికి అందుతోంది.ఇన్స్పెక్టర్ ఆయిల్ కంపెనీ టెక్నీషియన్‌తో బంక్‌ను సందర్శించి డిస్పెన్సర్ మెషీన్లను పరిశీలించి ధ్రువీకరణతో వివరాలు నమోదు చేస్తా రు. ఆ తర్వాత స్టాంపింగ్ ఫీజు ఆప్షన్ ఇస్తారు. చెల్లింపు జరగగానే ఇన్స్పెక్టర్ డిజిటల్ సంతకంతో కూడిన ఆన్లైన్లో ధ్రువీకరణ జారీ అవుతుంది. అయితే లంచాలకు అలవాటు పడిన కొందరు అధికారుల తీరు కారణంగా ఇవేమీ సవ్యంగా జరగడం లేదు. నాజిల్‌కు రూ.1,750 పెట్రోల్ బంకుల డిస్పెన్సర్ నాజిల్‌కు స్టాంపింగ్ రెన్యువల్ కోసం రూ.1,750 చొప్పున ఆన్లైన్లో చెల్లించాలి. అందులో రెన్యూవల్ ఫీజు రూ.1,500, సీసీ చార్జీలు రూ.250 ఉంటా యి. గడువు దాటితే మాత్రం మొదటి త్రైమాసికంలోపు 50 శాతం, రెండో త్రైమాసికంలో 100 శాతం, మూడో త్రైమాసికంలో 150 శాతం, నాలుగో త్రైమాసికంలో 200 శాతం జరిమానా చెల్లించాలి. అయితే ఇక్కడే కొందరు ఇన్స్పెక్టర్లు అనధికారికంగా వసూళ్లకు పాల్పడటం మామూలైంది. ఇదో మచ్చు తునక.. ‘గద్వాల జిల్లా అలంపూర్‌లోని పుష్పనాయుడు ఫిల్లింగ్‌స్టేషన్ డిస్పెన్సర్ మెషీన్ల స్టాంపింగ్ గడువు (ఫిబ్రవరి 9న) ముగుస్తుందని, బంకు యాజమాని 20 రోజులు ముందుగానే రెన్యువల్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే గడువు దాటిన రెండు రోజుల తర్వాత (ఫిబ్రవరి 11) ఫిల్లింగ్‌స్టేషన్‌ను సందర్శించి డిస్పెన్సర్ రెండు డ్యూయల్ నాజిల్‌కు రూ.3 వేల చొప్పున ఆరు వేలు, సీసీ ఫీజు కింద రూ.1,000, ఆలస్య రుసుం మొదటి త్రైమాసికం కింద 50 శాతం జరిమానా రూ. 3 వేలు విధించారు. మొత్తం రుసుం చెల్లించేందుకు ఆన్లైన్ ఆప్షన్ ఇవ్వడంతో యజమాని తక్షణమే చెల్లించడంతో స్టాంపింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ డీఎస్ఎస్ఆర్ పుస్తకంపై ఆరా తీసి నిర్వహణ సరిగ్గా లేదన్న సాకుతో రూ. 25,000లు జరిమానా విధించి..కేవలం రూ.5,000 చెల్లించినట్టు రశీదు చేతిలో పెట్టారు. ఇది ఒక్క ఫిల్లింగ్ స్టేషన్‌కు ఎదురైన పరిస్ధితి కాదు.. అన్ని బంకుల స్టాంపింగ్ రెన్యూవల్స్‌లో దాదాపుగా ఇదే జరుగుతోంది. జరిమానా సొమ్మును జేబులో వేసుకున్నారు స్టాంపింగ్‌కు అదనంగా డబ్బులు ముట్టజెప్పలేదని డీఎస్ఎస్ఆర్ మెయింటెనెన్స్ సాకుతో జరిమానా విధించారు. నగదు రూ.25,000 వసూలు చేసి కేవలం రూ.5,000 మాత్రమే రశీదు ఇచ్చారు. ఇన్స్పెక్టర్ తీరుపై సీసీ కెమెరా వీడియో ఫుటేజీ, ఆధారాలను జత చేస్తూ రాష్ట్ర తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్, ఉన్నతాధికారులకు ఈ–మెయిల్, స్పీడ్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేశాను. హెడ్‌క్వార్టర్ ఏసీ (అడ్మిన్)కు కూడా వివరించా. ఫిర్యాదు చేసి 55 రోజులు దాటుతోంది. అయినా ఎలాంటి స్పందన లేదు. – పుష్పనాయుడు, పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్, అలంపూర్కంట్రోలర్ దృష్టికి తీసుకెళ్లా అలంపూర్‌లోని ఫిల్లింగ్‌స్టేషన్ డిస్పెన్సర్ మెషీన్ల స్టాంపింగ్ వ్యవహారంలో ఇన్స్పెక్టర్పై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర కంట్రోలర్ దృష్టికి తీసుకెళ్లాను. యాజమాని ఆడియో, వీడియో ఆధారాలతో సహా ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది వాస్తవమే. నేను కూడా ఆ బంకు యజమానితో మాట్లాడాను. ఫిర్యాదుపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. – రాజేశ్వర్, అసిస్టెంట్ కంట్రోలర్ (అడ్మిన్ ) తూనికలు, కొలతల శాఖ, హైదరాబాద్ -
లీటర్‌కు రూ.2 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ పెంపు
-
దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
2025 ఏప్రిల్ 8 నుంచి అమలులోకి వచ్చేలా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 2 చొప్పున కేంద్రం సోమవారం పెంచింది. ప్రపంచ చమురు ధరలలో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు, ట్రంప్ సుంకాల మధ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.మంత్రిత్వ శాఖ వెల్లడించిన తన నోటిఫికేషన్లో.. పెరిగిన ఎక్సైజ్ సుంకం రిటైల్ ధరలను ఎప్పుడు, ఎలా ప్రభావితం చేస్తుందో వెల్లడించనప్పటికీ.. భారత వినియోగదారులపై దీని ప్రభావం ఉండదని ధృవీకరించింది. అంతర్జాతీయ చమురు ధరలు తగ్గడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలలో ఇటీవల తగ్గింపులతో ఎక్సైజ్ సుంకం పెరుగుదల సమతుల్యంగా ఉంటుందని భావిస్తున్నారు. PSU Oil Marketing Companies have informed that there will be no increase in retail prices of #Petrol and #Diesel, subsequent to the increase effected in Excise Duty Rates today.#MoPNG— Ministry of Petroleum and Natural Gas #MoPNG (@PetroleumMin) April 7, 2025భారతదేశంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు మార్చి 14న ఇంధన ధరలలో చివరి తగ్గింపు జరిగింది. ఎక్సైజ్ సుంకాన్ని రెండు సార్లు తగ్గించడంతో పెట్రోల్ & డీజిల్ ఎక్సైజ్‌ను లీటరుకు వరుసగా రూ. 13, రూ. 16 చొప్పున తగ్గించారు. ఇటీవల చమురు మంత్రి హర్దీప్ సింగ్ పూరి పెట్రోల్, డీజిల్ ధరలలో మరింత తగ్గింపు గురించి ఆశావాదం వ్యక్తం చేశారు, ఇది ప్రపంచ ముడి చమురు ధరలు ప్రస్తుత కనిష్ట స్థాయిలో ఉండటంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. -
బాబు పెట్రో బాదుడు రూ.5,256 కోట్లు
సాక్షి, అమరావతి: ఒకవైపు సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టి అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు సర్కారు మరోవైపు వీలైనన్ని మార్గాల్లో జనం జేబులకు చిల్లు పెడుతోంది. ఎన్నికల వాగ్దానం ప్రకారం సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేకూర్చాల్సింది పోయి పన్నుల బాదుడుతో నిలువు దోపిడీ చేస్తోంది. సంపద సృష్టించి పథకాలను అమలు చేస్తానంటూ నమ్మించిన ప్రభుత్వ పెద్దలు నడ్డి విరిగేలా రూ.వేల కోట్ల భారం వడ్డిస్తున్నారు.ఇప్పటికే విద్యుత్తు చార్జీలను పెంచి రూ.15 వేల కోట్లకుపైగా భారాన్ని జనం నెత్తిన మోపిన కూటమి సర్కారు పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామన్న హామీని నెరవేర్చకుండా తొమ్మిది నెలల్లో వాహనదారుల నుంచి ఏకంగా రూ.5,256 కోట్లకుపైగా వసూలు చేసింది. తద్వారా మరో ఎన్నికల హామీకి తిలోదకాలిచ్చింది. తాము అధికారంలోకి వస్తే పెట్రోలుపై లీటర్‌కు రూ.16 చొప్పున ధరలు తగ్గిస్తామని ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు, నారా లోకేష్ నమ్మబలికారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేశ్ పెట్రోలు బంకులు, ఆటో డ్రైవర్లు వద్దకు వెళ్లి అధికారంలోకి రాగానే గ్రీన్‌ట్యాక్స్ రద్దుతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామంటూ హామీలిచ్చారు. ఇక 2021 నవంబర్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై టీడీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.పెట్రోలుపై లీటర్‌కు రూ.16 వరకు ధర తగ్గించాలని నాడు చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంధన ధరలపై గగ్గోలు పెట్టిన ఆయన అధికారంలోకి వచ్చాక ఆ ఊసే మరిచారు. ఇది చాలదన్నట్లు ప్రకృతి వైపరీత్యాల నిధి పేరిట అదనపు సెస్ విధించేందుకు ఫైళ్లను సిద్ధం చేయడం గమనార్హం.రూ.5,256 కోట్లు తిరిగి కట్టాల్సిందేప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోలుపై లీటర్‌కు రూ.16 చొప్పున ధర తగ్గించాలని డిమాండ్ చేసిన చంద్రబాబు.. దాన్ని అమలు చేయాలని ఇప్పుడు వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. మన రాష్ట్రంలో రోజూ సుమారు 35.66 లక్షల లీటర్ల పెట్రోలు, 86.01 లక్షల లీటర్ల డీజిల్ అమ్ముడవుతున్నట్లు ఏపీ పెట్రో డీలర్స్ అసోసియేషన్స్ అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక 270 రోజుల్లో ప్రజల నుంచి కనీసం రూ.5,256 కోట్లు ముక్కుపిండి వసూలు చేసినట్లు స్పష్టమవుతోంది. ఎన్నికల హామీ అమలులో భాగంగా తక్షణం పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించడంతోపాటు ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు కూటమి నేతల హామీలను సామాజిక మాధ్యమాల్లో రీ పోస్ట్ చేస్తున్నారు. ‘‘వచ్చారు సరే.. తగ్గించరేం..?’’ అంటూ కూటమి సర్కారును నిలదీస్తున్నారు.సరిహద్దు జిల్లాల్లో బంకులు వెలవెలఇక్కడ ధరలు అధికంగా ఉండటంతో ఏపీ సరిహద్దు జిల్లాల్లో వాహనదారులంతా పక్క రాష్ట్రాలకు వెళ్లి పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో తమిళనాడు, కర్నాటక సరిహద్దు జిల్లాల్లోని పెట్రోలు బంకుల యజమానాలు వ్యాపారాలు లేక లబోదిబోమంటున్నారు. తమిళనాడు కంటే మన రాష్ట్రంలో పెట్రోలు ధర లీటరుకు రూ.7.99 అధికంగా ఉండగా కర్నాటక కంటే రూ.5.89 ఎక్కువగా ఉంది. యానాం కంటే మన రాష్ట్రంలో పెట్రోలు లీటర్‌కు రూ.12.77 అధికంగా ఉంది. ఇవన్నీ రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ అమ్మకాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. » ‘కేంద్ర ప్రభుత్వంతోపాటు 12 రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాయి. మరి మీరెప్పుడు (నాటి సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి) తగ్గిస్తారు? ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే వరకు టీడీపీ పోరాటం ఆగదు. దీనిపై అన్ని పెట్రోల్ బంక్‌ల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిస్తున్నాం. రాష్ట్రంలో పెట్రోల్ ధర రూ.16 తగ్గించి తీరాలి..’– 2021 నవంబర్ 5న మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు డిమాండ్» ‘డీజిల్ రేటు ఎంత..? కర్నాటకలో కొట్టించుకుంటున్నావా..? ఆంధ్రాలో అంత తక్కువ రేటు ఎక్కడుందబ్బా అనుకుంటున్నా..! వచ్చేది మేమే.. తగ్గించేది మేమే..!! దోచుకోవడంలో ఈ ప్రభుత్వం ఎవరినీ మినహాయించడంలేదు. మా ప్రభుత్వం రాగానే గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తాం. అడ్డగోలు చలానా విధానానికి స్వస్తి పలుకుతాం. ఆటో యూనియన్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమాన్ని అందిస్తాం. ప్రమాదంలో చనిపోయిన వారికి చంద్రన్న బీమా ద్వారా రూ.10 లక్షలు ఇచ్చి ఆదుకుంటాం. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం..’– 2023 మార్చి 27న పుట్టపర్తి యువగళం పాదయాత్రలో నారా లోకేశ్కర్ణాటక వెళ్లొస్తున్నాం..పెట్రోల్, డీజిల్ ధరలపై గగ్గోలు పెట్టిన నారా లోకేష్ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా ఎందుకు తగ్గించడం లేదు? మేం కర్ణాటక వెళ్లి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. అక్కడికి, ఇక్కడికి ధరలో చాలా వ్యత్యాసం ఉంది. – ఎస్ రామకృష్ణారెడ్డి, చిలమత్తూరు, కర్ణాటక సరిహద్దు మండలంరూ.6 తక్కువకే..ఏపీలో లీటర్ పెట్రోల్ సుమారు రూ.110 ఉంటే కర్ణాటకలో రూ.104 మాత్రమే ఉంది. ఏపీ కంటే కర్ణాటకలో రూ.6 తక్కువగా ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం వెంటనే పెట్రోల్ ధరలు తగ్గించాలి. – ఇంతియాజ్ అహమ్మద్, బసవనపల్లి, అమరాపురం మండలంరాష్ట్రంలో రోజుకు సగటు విక్రయాలు..పెట్రోలు: 35,66,066.66 లీటర్లుడీజిల్: 86,01,966 లీటర్లురోజుకు పెట్రోల్, డీజిల్ కలిపి 121.67 లక్షల లీటర్లు270 రోజులకు 328.50 కోట్ల లీటర్ల వినియోగం.. ఆ లెక్కన లీటరుకు రూ.16 చొప్పున తగ్గించకుండా చంద్రబాబు ప్రజల ముక్కుపిండి వసూలు చేసిన మొత్తం రూ.5,256 కోట్లు -
అక్కడ ఒక్కసారిగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
గత ఏడాది మార్చిలో పెట్రోల్, డీజిల్ ధరలు రెండు రూపాయలు తగ్గింది. ఆ తరువాత ధరల తగ్గుదల ఊసేలేదు. అయితే ఇప్పుడు ఇంధన ధరలను తగ్గించి, ప్రజలకు కొంత ఉపశమనం కలిగించాలనే ఉద్దేశ్యంతో మోదీ ప్రభుత్వం ముందడుగు వేసింది.2019-20లో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.72.69, రూ.65.78 వద్ద ఉండేవి. 2023-24లో రూ.96.63, రూ. 89.53 వద్దకు చేరాయి. తాజాగా ఈ ధరలను రూ. 94.74, రూ. 87.64 వద్దకు (ఢిల్లీ) తీసుకువచ్చినట్లు కేంద్ర మంత్రి 'సురేష్ గోపి' పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే ఇంధన ధరలు సుమారు రెండు రూపాయల వరకు తగ్గినట్లు తెలుస్తోంది.ఇంధన ధరలు 2021-22 సమయంలో గరిష్ట స్థాయికి చేరాయి. ఆ తరువాత ప్రభుత్వం నవంబర్ 2021 - మే 2022లో పెట్రోల్ & డీజిల్‌పై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.13, రూ.16 తగ్గించింది. దీంతో ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం.. ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న వివిధ చర్యల ఫలితంగా ఇంధన ధరలు తగ్గాయని సురేష్ గోపి అన్నారు.ఇదీ చదవండి: రూ.25 వేల కోట్ల రాజభవనంలో మహారాణి.. అయినా..!పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి, ప్రజలకు కొంత ఉపశమనం కలిగించాలంటే.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ రేట్లను తగ్గించాలని సురేష్ గోపి సూచించారు. అంతర్జాతీయ ధరల పెరుగుదల నుంచి సామాన్య ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అంతే కాకుండా దిగుమతులను తగ్గించి.. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచడం వంటివి కూడా చేస్తున్నట్లు సురేష్ గోపి వెల్లడించారు.ప్రస్తుతం తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు ఢిల్లీకి మాత్రమే పరిమితం. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడలలో పెట్రోల్ ధరలు రూ. 100 కంటే ఎక్కువే ఉంది. -
పెట్రోల్ బైక్ vs ఎలక్ట్రిక్ బైక్: ఏది ఎంచుకోవాలి?
ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతం పెట్రోల్, ఎలక్ట్రిక్ బైకులు మాత్రమే కాకుండా సీఎన్జీ బైక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే చాలామంది.. ఎలక్ట్రిక్ బైక్ కొనాలా? పెట్రోల్ బైక్ కొనాలా? అనే సందిగ్ధంలో పడుతుంటారు. ఈ కథనంలో దేనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.ఎలక్ట్రిక్ బైక్స్ప్రస్తుతం మార్కెట్లో దాదాపు ప్రతి కంపెనీ.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో బైకులను లాంచ్ చేస్తూనే ఉంది. పెట్రోల్ మోడల్స్‌తో పోలిస్తే.. ఎలక్ట్రిక్ బైకులకు మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ. అంతే కాకుండా ఇవి పర్యావరణ హితం కూడా. అంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఎలాంటి కాలుష్య కారకాలను వాతావరణంలోకి విడుదల చేయవు.ఎలక్ట్రిక్ వాహనాల్లో లిథియం అయాన్ బ్యాటరీ లేదా లిథియం అయాన్ పాస్ఫేట్ బ్యాటరీలు ఉంటాయి. ఇవి ఎక్కువ మన్నికను ఇస్తాను. సంస్థలు కూడా ఈ బ్యాటరీలపైన మంచి వారంటీ కూడా అందిస్తాయి. విద్యుత్ శక్తిని ఉపయోగించుకోవడం ద్వారా.. శిలాజ ఇంధన వినియోగం మాత్రమే కాకుండా కార్బన్ ఉద్గారాలు కూడా గణనీయంగా తగ్గుతాయి.ఇదీ చదవండి: తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులుపెట్రోల్ బైక్స్చాలా కాలంగా ఎక్కువమంది పెట్రోల్ బైకులనే ఉపయోగిస్తున్నారు. ఇంధనం అయిపోగానే.. వెంటనే ఫిల్ చేసుకోవడానికి లేదా నింపుకోవడానికి పెట్రోల్ బంకులు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎలాంటి ఆందోళన లేకుండా ఎక్కువ దూరం ప్రయాణించగల సామర్థ్యం ఈ పెట్రోల్ బైకులకు ఉంటుంది. ఈ కారణంగానే చాలామంది పెట్రోల్ బైకులను కొనుగోలు చేస్తుంటారు. పనితీరు పరంగా కూడా పెట్రోల్ బైకులు.. ఎలక్ట్రిక్ బైకుల కంటే ఉత్తమంగా ఉంటాయి.ఎలక్ట్రిక్ బైక్స్ ఎక్కువ కొనుగోలు చేయకపోవడానికి కారణంఇండియన్ మార్కెట్లో లెక్కకు మించిన ఎలక్ట్రిక్ బైక్స్ అందుబాటులో ఉన్నప్పటికీ.. చాలామంది పెట్రోల్ బైక్స్ కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతుంటారు. దీనికి ప్రధాన కారణం మౌలిక సదుపాయాలైన ఛార్జింగ్ స్టేషన్స్ కావలసినన్ని అందుబాటులో లేకపోవడం అనే తెలుస్తుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే.. ఛార్జింగ్ మధ్యలోనే ఖాళీ అవుతుందేమో అనే భయం కూడా ఎక్కువమంది కొనుగోలు చేయకపోవడానికి కారణం అనే చెప్పాలి. -
భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య
జగిత్యాల: జిల్లాలోని పొలాసలో దారుణం చోటు చేసుకుంది. భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది భార్య. భర్త కమాలకర్ కు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అవ్వగా, మరో పెళ్లి చేసుకున్నాడనేది కూడా ఆమె ఆరోపిస్తోంది. తమను రోజూ చిత్రహింసలు పెడుతున్నాడని, అందుచేత భర్తపై పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లు భార్య చెబుతోంది.గత కొన్ని నెలలుగా మద్యానికి బానిసై తమను వేధిస్తున్నాడని భార్య పేర్కొంది. భార్యా పిల్లలను కొడుతుండటంతో ఓపిక నశించి కమలాకర్ పై పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు చెబుతోంది. పిల్లలతో కలిసి కమాలకర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు భార్య స్పష్టం చేసింది. ప్రస్తుతం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కమాలకర్ పరిస్థితి విషమంగా ఉంది. -
పెట్రోల్, డీజిల్ నిక్షేపాల వెలికితీతకు ట్రయల్ రన్
లింగాల: వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలో డీజిల్, పెట్రోలు నిక్షేపాలను కనుగొనేందుకు బోరుబావుల తవ్వకాల ద్వారా ట్రయల్ రన్ ప్రారంభించారు. శాటిలైట్ ద్వారా నిర్ధారించిన పాయింట్లలో ఈ తవ్వకాలకు నాలుగు రోజుల క్రితం శ్రీకారం చుట్టారు. సుమారు 80–200 అడుగుల లోతు వరకు ఈ బోరుబావులను తవ్వుతున్నారు. ఆ తర్వాత వాటి అడుగు భాగంలో డైనమైట్లు, జిలెటిన్ స్టిక్స్, మందుగుండు సామాగ్రి పంపి పేలుస్తున్నారు.అనంతరం పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పేలుళ్లవల్ల చుట్టుపక్కల వ్యవసాయ బోరుబావులకు భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తుతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. రైతుల అనుమతుల్లేకుండా వారి పంట పొలాల్లో ఈ కార్యక్రమం చేపట్టారు. ఉదా.. లింగాల మండల కేంద్రంలోని ఎ.వి. శ్రీనివాసరెడ్డి పొలంలో అనుమతిలేకుండా తొమ్మిది బోరు బావులు తవ్వారు. జిల్లా కలెక్టర్ అనుమతులతో ఓఎన్జీసీ సంస్థ బోరుబావులు తవ్వుతోందని తహసీల్దార్ ఈశ్వరయ్య తెలిపారు. రెండ్రోజుల క్రితం కలెక్టర్ ఇచ్చిన అనుమతుల కాపీని తనకు అందించారన్నారు. ఇక ముదిగుబ్బ నుంచి జమ్మలమడుగు వరకు బోరుబావుల తవ్వకాల కాంట్రాక్టును బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సోదరుడు సురేష్ పొందినట్లు సమాచారం. -
పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ 20 శాతానికి పెంపు
గౌహతి: పెట్రోల్(Petrol)లో జీవ ఇంధనం ఇథనాల్(Ethanol)ను 20 శాతానికి పైగా కలపడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలనుకుంటున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఇందులో సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నీతి ఆయోగ్య సారథ్యంలో ఓ కమిటీ ఏర్పాటైందని వెల్లడించారు. పెట్రోల్‌లో 19.6 శాతం ఇథనాల్ కలపాలన్న లక్ష్యాన్ని ఇప్పటికే సాధించామన్నారు. 20 శాతం ఇథనాల్‌ను కలపాలన్న లక్ష్యాన్ని 2026 నాటికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అయితే అంతకుమునుపే అంటే వచ్చే నెలలోనే ఈ లక్ష్యాన్ని సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.అడ్వాంటేజ్ అసోం 2.0 బిజినెస్ సమిట్‌లో బుధవారం మంత్రి పురి ప్రసంగించారు. మనకు 1,700 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను కలిపే సామర్థ్యముండగా ఇప్పటికే 1,500 కోట్ల లీటర్లను వాడుతున్నామని చెప్పారు. వివిధ రకాలైన ఇంధన దిగుమతుల కోసం దేశం ఏటా 15,000 కోట్ల డాలర్లను విచ్చిస్తోందని మంత్రి వివరించారు. అయితే, సంప్రదాయ ఇంధనాలకు బదులుగా గ్రీన్ హైడ్రోజన్‌పై దృష్టి సారించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్ ధర 4.5 డాలర్లుగా ఉంది. దీనిని 2.5 డాలర్లకు తగ్గించ గలిగితే ఈ రంగంలో పెను విప్లవమే వస్తుందన్నారు.ఇదీ చదవండి: అగ్రి, గృహ రుణాల్లో ఎగవేతలు పెరగొచ్చుప్రస్తుతం మన దేశంలో రోజుకు 55 లక్షల బారెళ్ల ముడి చమురును వాడుతున్నామని మంత్రి తెలిపారు. సమీప భవిష్యత్తులో ఇది 65 లక్షల బ్యారెళ్ల నుంచి 70 లక్షల బ్యారెళ్లకు పెరగనుందని, అదేవిధంగా దేశీయ పెట్రోలియం, సహజ వాయువుల ఉత్పత్తి 2030కల్లా 50 లక్షల టన్నులకు చేరనుందని మంత్రి పురి అంచనా వేశారు. -
అల్లుడిపై పెట్రోలు పోసి నిప్పు పెట్టిన అత్తా మామ..
టేకులపల్లి: భార్యాపిల్లలను చూసేందుకు అత్తారింటికి వచ్చిన అల్లుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి, ఇంట్లోకి వెళ్లి తలుపుపెట్టుకున్నారు. మంటలకు తాళలేక ఎంతగా మెత్తుకున్నా వారు తలుపు తీయకపోవడంతో పక్కనే ఉన్న నీటితొట్టిలో దూకాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. పాల్వంచ మండలం దంతెలబోరు ఎస్సీకాలనీకి చెందిన బల్లెం చినవెంకటేశ్వర్లు పెద్ద కుమారుడు బల్లెం గౌతమ్ (23).. టేకులపల్లి మండలం రామచంద్రునిపేట గ్రామానికి చెందిన ఎజ్జు వెంకటేశ్వర్లు కుమార్తె కావ్యను రెండేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. సుజాతనగర్లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. గత నెల కావ్య తన ఇద్దరు పిల్లలతో కలిసి రామచంద్రునిపేటలోని పుట్టింటికి వచ్చింది. ఈ నెల 2న రాత్రి గౌతమ్ తన పిల్లలు, భార్యను చూసేందుకు రామచంద్రునిపేటకు వచ్చాడు. గౌతమ్‌ని లోపలికి వెళ్లనీయకుండా అత్తా మామ, బావమరుదులు అడ్డుకున్నారు. దుర్భాషలాడి, దాడి చేయడంతో పాటు గౌతమ్‌పై పెట్రోలు పోసి నిప్పంటించారు. అనంతరం అందరూ లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. మంటల్లో కాలుతూ ఆర్తనాదాలు చేస్తున్నా రక్షించలేదు. పక్కనే ఉన్న నీటి తొట్టిలో దూకిన గౌతమ్‌ని చుట్టు పక్కల వారు బయటకు తీసి, కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఖమ్మం, వరంగల్ ఎంజీఎంకు తరలించారు. 14 రోజుల పాటు చికిత్స పొందిన గౌతమ్ ఆదివారం మృతి చెందాడు. బోడు ఎస్ఐ పొడిశెట్టి శ్రీకాంత్‌ను వివరణ కోరగా ఈ నెల 2న రామచంద్రునిపేటలో ఘటన జరిగిందని, 11న మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. కాగా, ఈ నెల 2న ఘటన జరిగి, 11న ఫిర్యాదు వచ్చినప్పటికీ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంతో ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
యువతిపై పెట్రోల్ చల్లిన యువకుడిపై కేసు నమోదు
హుజూర్నగర్: తనను ప్రేమించడం లేదని యువతితో గొడవపడి ఆమెపై పెట్రోల్ చల్లిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన హుజూర్నగర్ పట్టణంలో జరిగింది. మంగళవారం ఎస్ఐ ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా మోటమర్రి గ్రామానికి చెందిన యువతి మూడు నెలల నుంచి హుజూర్నగర్ పట్టణంలోని తన మేనమామ ఇంటి వద్ద ఉంటోంది. స్థానికంగా కోదాడ రోడ్డులో గల ప్రైవేట్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తోంది. సదరు యువతికి మోటమర్రి గ్రామానికే చెందిన సుందర్ ప్రమోద్‌కుమార్‌తో పరిచయం ఉంది. సోమవారం ప్రమోద్‌కుమార్ యువతికి ఫోన్ చేసి మాట్లాడాలి బటయకు రమ్మని కోరగా.. ఆమె బయటకు వచ్చింది. ఈ క్రమంలో తనను ఎందుకు ప్రేమించడం లేదని ఆమెతో యువకుడు గొడవపడ్డాడు. తన వెంట బాటిల్లో తెచ్చుకున్న పెట్రోల్‌ను యువతిపై చల్లాడు. దీంతో సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
‘చౌకగా పెట్రోల్.. ప్రజలకు రాయితీల్లేవు’
మోదీ ప్రభుత్వం ఇథనాల్ మిశ్రమ(బ్లెండెడ్) పెట్రోల్‌ను తీసుకొచ్చిన నేపథ్యంలో పెట్రోల్ ధరను తగ్గించాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకెత్ గోఖలే రాజ్యసభలో డిమాండ్ చేశారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ లీటరుకు కనీసం రూ.9 చౌకగా లభిస్తున్నప్పటికీ వినియోగదారు నుంచి పూర్తి స్థాయిలో వసూలు చేస్తున్నట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వం ఈ విషయంలో ప్రజలను మోసం చేస్తోందని, ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును లాగేసుకుంటుందని విమర్శించారు. దాంతో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు కారణమవుతుందని దుయ్యబట్టారు.‘మోదీ ప్రభుత్వం పెట్రోల్‌లో 20% ఇథనాల్ కలపాలని గతంలోనే ఆదేశించింది. ఇథనాల్ చౌకైనది మాత్రమే కాదు.. వాహన మైలేజీని కూడా గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఇది బీఎస్-IV, పాత ఇంజిన్లను నాశనం చేస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ లీటరుకు కనీసం రూ.9 చౌకగా లభిస్తోంది. కానీ ప్రజలు ఈ రాయితీ పొందడం లేదు. వాస్తవ ధరకే పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం నిస్సందేహంగా ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును దొచుకుంటోంది. దాంతో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు కారణం అవతుంది. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌ను తప్పనిసరి చేస్తే మోదీ ప్రభుత్వం ధరలు తగ్గించాలి’ అని ఎంపీ తెలిపారు.𝐈𝐦𝐩𝐨𝐫𝐭𝐚𝐧𝐭:𝐘𝐨𝐮 𝐚𝐫𝐞 𝐛𝐞𝐢𝐧𝐠 𝐎𝐕𝐄𝐑𝐂𝐇𝐀𝐑𝐆𝐄𝐃 𝐛𝐲 𝐚𝐭 𝐥𝐞𝐚𝐬𝐭 ₹𝟗 𝐩𝐞𝐫 𝐥𝐢𝐭𝐞𝐫 𝐚𝐭 𝐭𝐡𝐞 𝐩𝐞𝐭𝐫𝐨𝐥 𝐩𝐮𝐦𝐩. Modi Govt has mandated 20% blending of ethanol with petrol. Ethanol is not only cheaper but also significantly reduces your car… pic.twitter.com/iEBjgp9SX9— Saket Gokhale MP (@SaketGokhale) February 5, 2025ఇథనాల్ పెట్రోల్‌పై భిన్నాభిప్రాయాలుముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, గ్రీన్ ఎన్విరాన్మెంట్ను ప్రోత్సహించడంలో భాగంగా గతంలో ప్రభుత్వం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపాలని నిర్ణయించింది. ఇథనాల్ పెట్రోల్ కంటే తక్కువ శక్తి కంటెంట్ కలిగి ఉంటుందని అభిప్రాయాలున్నాయి. ఇది వాహనం మైలేజ్‌ను 3-4% తగ్గిస్తుందని వాహన నిపుణులు చెబుతున్నారు. పాత వాహనాలకు ముఖ్యంగా బీఎస్-4 ఇంజిన్లు ఉన్న వాహనాలకు అధిక ఇథనాల్ కంటెంట్ ప్లాస్టిక్, రబ్బరు, అల్యూమినియం భాగాలకు హాని కలిగిస్తుందని తెలియజేస్తున్నారు. ఇది ఇంజిన్ పనిచేయకపోవడం, మన్నిక తగ్గడానికి దారితీస్తుందంటున్నారు.ఇదీ చదవండి: అంతకంతకూ పెరుగుతున్న పసిడి ధర! తులం ఎంతంటే..పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడం వల్ల ముడి చమురు దిగుమతులపై తక్కువ ఆధారపడే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం తెలుపుతుంది. ఇది ఇంధన భద్రతను బలోపేతం చేస్తుంది. ఇథనాల్ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గిస్తుంది. చెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. -
పేలిన పెట్రోల్ ట్యాంకర్.. 70 మంది మృతి
అబుజా : నైజీరియా ( Nigeria)లో ఘోర ప్రమాదం సంభవించింది. పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మంది దుర్మరణం చెందారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అక్కడి అధికారులు ప్రకటించారు.నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఎన్ఈఎంఏ) అధికారిక ప్రకటన మేరకు.. శనివారం నార్త్ సెంట్రల్ నైజీరియా నైజర్ రాష్ట్రం (Niger state)లో అక్రమంగా ఇంధనాన్ని తరలించే సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు ఎన్ఈఎంఏ అధికారులు నిర్ధారించారు.అగంతకులు జనరేటర్ సాయంతో ఒక పెట్రోల్ ట్యాంకర్ (petrol tanker explosion) నుంచి మరో పెట్రల్ ట్యాంకర్‌లోకి పెట్రోల్‌ను నింపి ప్రయత్నం చేశారు. అయితే, ఆ సమయంలో ఒక్కసారి జనరేటర్ పేలడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. పేలుడు ధాటికి మంటలు చెలరేగి భారీ శబ్దాలు రావడం.. స్థానికుల ఆర్తనాదాలతో భయంకరంగా పరిస్థితి మారిపోయింది. అక్కడికక్కడే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా కాలిన గాయాలతో మరికొందరు విలవిల్లాడారు.పేలుడు ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ సహాయ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాద బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాయి. అయితే, భారీ స్థాయిలో ఎగిసి పడిన మంటల కారణంగా బాధితుల్ని ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్న పలువురు రెస్క్యూ సిబ్బంది సైతం అగ్నికి ఆహుతైనట్లు ఎన్ఈఎంఏ అధికార ప్రతినిధి హుస్సేన్ ఇసా తెలిపారు. ప్రమాదాలు సర్వసాధారణంనైజీరియాలో ఇటువంటి ప్రమాదాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. నైజీరియాలో అస్థవ్యస్థంగా ఉన్న రైల్వే వ్యవస్థ కారణంగా ఎక్కువ శాతం మంది ప్రజలు రోడ్డు రవాణాను వినియోగించుకుంటున్నారు. పలుమార్లు అక్రమ ఇంధన రవాణా కారణంగా తరుచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చినట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. గతేడాది ఇదే రాష్ట్రంలో గతేడాది సెప్టెంబరులో ఇదే తరహా దుర్ఘటన జరిగింది. నైజర్ రాష్ట్రంలో పశువులను తరలిస్తున్న ట్రక్కును పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో 48 మందికి పైగా మరణించారు.నైజీరియా ఫెడరల్ రోడ్ సేఫ్టీ గణాంకాల ప్రకారం.. 2020లోనే 1,531 పెట్రోల్ ట్యాంకర్లు పేలాయి. ఫలితంగా 535 మరణించగా, 1,100 మందికి పైగా గాయాలు అయ్యాయి. ఇలాంటి ఘటనల వల్ల ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, భద్రతా నిబంధనలను పాటించాలని అధికారులు కోరుతున్నారు. అయినప్పటికీ పలువురు అక్రమంగా ఇంధనాన్ని తరలిస్తూ ప్రాణాల్ని ఫణంగా పెడుతున్నారు. -
అన్న కూతురిని ప్రేమిస్తున్నాడని..
అల్వాల్: అన్న కూతురిని ప్రేమిస్తున్నాడనే కోపంతో ఓ యువతి చిన్నాన్న ప్రేమించిన యువకుడి ఇంటిపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మాచ బొల్లారం గోపాల్‌నగర్ ఎరుకల బస్తీలో ప్రకాష్ హేమలత దంపతులు తమ కుమారుడు ప్రదీప్‌తో కలిసి నివాసం ఉంటున్నారు. ప్రదీప్ అదే ప్రాంతంలోని వివేకానందకు చెందిన బైక్ షోరూమ్‌లో పనిచేస్తున్నాడు. వివేకానంద అన్న కుమార్తెతో ప్రదీప్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో పలుమార్లు వివేకానంద ప్రదీప్‌ను హెచ్చరించాడు. అయినా ప్రదీప్ వైఖరి మార్చుకోకపోవడంతో ఆగ్రహానికి లోనైన వివేకానంద ప్రదీప్, అతడి కుటుంబసభ్యులను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి పెట్రోల్ తీసుకుని ప్రదీప్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ప్రదీప్ ఇంట్లో లేకపోవడంతో ఇంట్లో ఉన్న అతడి తల్లిదండ్రులు ప్రకాష్, హేమలతలతో పాటు ఇంటి తలుపులపై పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. ఈ ఘటనలో ప్రకా‹Ùకు తీవ్ర గాయాలు కాగా, పక్కింట్లో ఉండే దిలీప్ అనే వ్యక్తి కుమార్తె చిన్నారి చాందిని (4) రెండు కాళ్లకు మంటలంటున్నాయి. చిన్నారి చాందినిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, ప్రకాష్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు వివేకానంద పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డుపై బోల్తా పడిన పెట్రోల్ ట్యాంకర్
-
పెట్రోల్, డీజిల్ అమ్మకాలు ఎలా ఉన్నాయంటే..
పండుగల సందర్భంగా పెట్రోల్, డీజిల్‌కు డిమాండ్ ఏర్పడింది. వరుసగా కొన్ని నెలల పాటు క్షీణించిన అమ్మకాలు నవంబర్‌లో తిరిగి పుంజుకున్నాయి. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీల (ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్) గణాంకాల ప్రకారం పెట్రోల్ విక్రయాలు నవంబర్‌లో 8.3 శాతం పెరిగి 3.1 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో అమ్మకాలు 2.86 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. డీజిల్ విక్రయాలు సైతం క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 5.9 శాతం పెరిగి 7.2 మిలియన్ టన్నులకు చేరాయి.వర్షాల సీజన్లో వాహనాల కదలికలు తగ్గడం వల్ల పెట్రోల్, డీజిల్ డిమాండ్ క్షీణిస్తుంటుంది. అదే కాలంలో వ్యవసాయ రంగం నుంచి డీజిల్ డిమాండ్ తగ్గుతుంది. ఇక అక్టోబర్ నెల విక్రయాలతో పోల్చి చూస్తే.. నవంబర్‌లో 4.7 శాతం అధికంగా 2.96 మిలియన్ టన్నులు మేర పెట్రోల్ విక్రయాలు నమోదయ్యాయి. డీజిల్ విక్రయాలు 11 శాతం పెరిగి 6.5 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. పెట్రోలియం ఇంధన విక్రయాల్లో 40 శాతం వాటా డీజిల్ రూపంలోనే ఉంటుంది. వాణిజ్య వాహనాలు, వ్యవసాయ రంగంలో వినియోగించే పనిముట్లకు డీజిల్‌ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ముఖ్యంగా రవాణా రంగమే 70 శాతం డీజిల్‌ను వినియోగిస్తుంటుంది.ఇదీ చదవండి: ఇక ఉబర్‌లో ‘శికారా’ల బుకింగ్!విమానాల ఇంధనంజెట్ ఫ్యూయల్ (విమానాల ఇంధనం/ఏటీఎఫ్) అమ్మకాలు 3.6 శాతం పెరిగి 6,50,900 టన్నులుగా ఉన్నాయి. ఏటీఎఫ్ డిమాండ్ కరోనా పూర్వపు స్థాయిని దాటిపోయింది. వంటగ్యాస్ (ఎల్పీజీ) అమ్మకాలు 7.3 శాతం పెరిగాయి. 2.76 మిలియన్ టన్నులుగా నమోదైంది. అంతకుముందు నెల అక్టోబర్‌లో 2.76 మిలియన్ టన్నులుగా ఉండడం గమనార్హం. -
ధరల తగ్గుదలపై వరల్డ్ బ్యాంక్ క్లారిటీ
అంతర్జాతీయ మార్కెట్లలో వస్తువుల ధరలకు సంబంధించిన విషయాలను వరల్డ్ బ్యాంక్ తన అక్టోబర్ ఎడిషన్ కమోడిటీ మార్కెట్ ఔట్‌లుక్‌లో వెల్లడించింది. వస్తువుల ధరలు 2025లో 5 శాతం, 2026లో 2శాతం.. ఈ ఏడాది 3 శాతం క్షీణతను పొందుతాయని పేర్కొంది.క్రూడ్ ఆయిల్ ధరల విషయానికి వస్తే.. 2024లో బ్యారెల్ ధర 80 డాలర్లు కాగా, ఇది 2025లో 73 డాలర్లకు చేరుతుందని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. 2026 నాటికి ఈ ధరలు 72 డాలర్లకు పడిపోతుందని కూడా స్పష్టం చేసింది. చమురు ధరలు గణనీయంగా తగ్గుతాయని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్దాలు ప్రమాదం అని హెచ్చరించింది.ఇంధన మార్కెట్లు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు దగ్గరగా ఉంటాయి. కాబట్టి దీనివల్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. 2023 అక్టోబర్ - 2024 ఏప్రిల్ మధ్య ప్రాంతీయ వైరుధ్యాల కారణంగా చమురు ధరలు 90 డాలర్లకు చేరింది. ప్రస్తుతం ఈ ధరలు కొంత శాంతించినప్పటికీ.. రాబోయే రోజుల్లో భౌగోళిక ఉద్రిక్తతలు దీనిపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది.చమురు ధరల విషయం పక్కన పెడితే.. లోహాల ధరలు 2025 - 26లలో తగ్గే సూచనలున్నాయి. బేస్ మెటల్ ధరలు 2026లో 3 శాతం మేర తగ్గుతాయి. అయితే వచ్చే ఏడాది ఈ ధరలు స్థిరంగా ఉంటాయని సమాచారం.ఇదీ చదవండి: తండ్రి నుంచి అప్పు తీసుకుని మరీ!! మకుటం లేని మహరాజుగా ఎదిగి..బంగారం ధరల విషయానికి వస్తే.. 2024లో మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీనికి కారణం పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు అని తెలుస్తోంది. అంతే కాకుండా సెంట్రల్ బ్యాంకుల నుంచి బలమైన డిమాండ్ కూడా ధరల పెరుగుదలకు ఆజ్యం పోస్తున్నాయి. -
పుంజుకున్న పెట్రోల్ విక్రయాలు
న్యూఢిల్లీ: పండుగల సీజన్ మద్దతుతో దేశవ్యాప్తంగా పెట్రోల్ అమ్మకాలు అక్టోబర్ నెలలో 7.3 శాతం పెరిగాయి. కానీ, డీజిల్ అమ్మకాలు మాత్రం 3.3 శాతం తక్కువగా నమోదయ్యాయి. ఇంధన మార్కెట్లో 90 శాతం వాటా కలిగిన మూడు ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు (హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ) అక్టోబర్‌లో 3.1 మిలియన్ టన్నుల పెట్రోల్‌ను విక్రయించాయి. క్రితం ఏడాది ఇదే నెలలో అమ్మకాలు 2.87 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. డీజిల్ విక్రయాలు మాత్రం 3.3 శాతం తక్కువగా 6.7 మిలియన్ టన్నులకు పరిమితమయ్యాయి. పండుగల సందర్భంగా వ్యక్తిగత వాహనాల (టూవీలర్లు, ప్యాసింజర్ కార్లు) వినియోగం సాధారణంగా పెరుగుతుంది. ఇది పెట్రోల్ విక్రయాల వృద్ధికి దారితీసినట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. సాగు రంగం నుంచి డిమాండ్ తక్కువగా ఉండడం డీజిల్ అమ్మకాలు తగ్గడానికి కారణమని తెలిపాయి. గడిచిన కొన్ని నెలల నుంచి డీజిల్, పెట్రోల్ అమ్మకాలు స్తబ్దుగానే కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా అధిక వర్షాలకుతోడు, సాగు రంగం నుంచి డిమాండ్ తగ్గడం వాహనాల వినియోగాన్ని పరిమితం చేసింది. ఇక సెపె్టంబర్ నెల గణాంకాలతో పోల్చి చూసినా అక్టోబర్‌లో పెట్రోల్ విక్రయాలు 7.8 శాతం పెరిగాయి. డీజిల్ అమ్మకాలు 20 శాతం అధికంగా నమోదయ్యాయి. సెపె్టంబర్ నెలలో పెట్రోల్ వినియోగం 2.86 మిలియన్ టన్నులు, డీజిల్ వినియోగం 5.59 మిలియన్ టన్నుల చొప్పున ఉంది. 40 శాతం వాటాతో డీజిల్ అధిక వినియోగ ఇంధనంగా ఉంటోంది. 70 శాతం డీజిల్‌ను రవాణా రంగమే వినియోగిస్తుంటుంది. ఆ తర్వాత వ్యవసాయ రంగంలో ట్రాక్టర్లు, ఇతర పరికరాల కోసం దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. 2.5 శాతం అధికంగా ఏటీఎఫ్ అమ్మకాలు ఇక విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) విక్రయాలు అక్టోబర్ నెలలో క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 2.5 శాతం పెరిగి 6,47,700 టన్నులుగా ఉన్నాయి. సెపె్టంబర్ నెలలో వినియోగం 6,31,100 టన్నుల కంటే 2.6 శాతం తగ్గింది. వంటగ్యాస్ (ఎల్పీజీ) అమ్మకాలు 7.5 శాతం పెరిగి 2.82 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో వంటగ్యాస్ అమ్మకాలు 2.72 మిలియన్ టన్నులుగా ఉండడం గమనార్హం. -
ప్రీమియం వాహనాల వైపు మొగ్గు
న్యూఢిల్లీ: వాహనాల కొనుగోలుదార్లు విలాసవంతమైన, పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలతో పోలిస్తే హైబ్రిడ్ వాహనాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. దేశీ ఆటోమోటివ్ పరిశ్రమపై గ్రాంట్ థార్న్టన్ భారత్ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇందులో పాల్గొన్న వారిలో 85 శాతం మంది ప్రీమియం మోడల్స్‌ను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. 40 శాతం మంది హైబ్రిడ్ వాహనాలను ఇష్టపడుతుండగా, 17 శాతం మంది మాత్రమే ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వైపు మొగ్గు చూపారు. 34 శాతం మంది పెట్రోల్ వాహనాలకు ప్రాధాన్యమిస్తున్నారు.వినియోగదారులు మరింత భారీ ఈవీ మౌలిక సదుపాయాలు... ప్రోత్సాహకాల కోసం ఎదురుచూస్తూనే పర్యావరణ అనుకూల ఆప్షన్లను కూడా పరిశీలిస్తున్నారనే ధోరణి వల్లే హైబ్రిడ్ వైపు మొగ్గు చూపుతున్నారని సర్వే తెలిపింది. ఈ నేపథ్యంలో మారుతున్న వినియోగదారుల అంచనాలకు అనుగుణంగా రాణించేలా హైబ్రిడ్, ఎలక్ట్రిక్ సొల్యూషన్స్‌పై వాహనాల తయారీ సంస్థలు దృష్టి పెట్టాల్సిన ఉంటుందని పేర్కొంది. కీలకంగా పండుగ సీజన్... వార్షిక అమ్మకాల్లో దాదాపు 30–40 శాతం వాటా పండుగ సీజన్ విక్రయాలే ఉంటాయి కాబట్టి దేశీ ఆటోమోటివ్ పరిశ్రమకు ఇది కీలకమైన సీజన్ అని సర్వే తెలిపింది. అయితే, నిల్వలు భారీగా పేరుకుపోవడం, వాతావరణ మార్పులపరమైన అవాంతరాలు, ఎన్నికలు మొదలైనవి ఈసారి అమ్మకాల వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపినట్లు గ్రాంట్ థార్న్టన్ భారత్ పార్ట్నర్ సాకేత్ మెహ్రా చెప్పారు. యుటిలిటీ వాహనాలు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు నెలకొన్న డిమాండే.. మార్కెట్‌ను ముందుకు నడిపిస్తోందన్నారు.‘‘ఈ సెగ్మెంట్స్ వార్షికంగా 13 శాతం వృద్ధి నమోదు చేశాయి. ప్రస్తుతం ప్యాసింజర్ వాహనాల (పీవీ) విభాగంలో వీటి వాటా 65 శాతంగా ఉంది. 2025 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో దేశీ విక్రయాలు కేవలం 0.5 శాతం పెరిగి ఒక మోస్తరు వృద్ధిని మాత్రమే నమోదు చేసినప్పటికీ ఎస్‌యూవీలు, యూవీలకు డిమాండ్ నిలకడగా కొనసాగడం ప్రత్యేకమైన వాహనాల వైపు వినియోగదారులు మొగ్గు చూపిస్తుండటాన్ని తెలియజేస్తోంది’’ అని మెహ్రా వివరించారు. సవాలుగా నిల్వలు.. వాహన నిల్వలు గణనీయంగా పేరుకుపోవడం పరిశ్రమకు సవాలుగా మారింది. రూ.79,000 కోట్ల విలువ చేసే 7.9 లక్షల యూనిట్ల స్థాయిలో నిల్వలు పేరుకుపోయినట్లు మెహ్రా వివరించారు. భారీగా పండుగ డిస్కౌంట్లు ఇవ్వడం ద్వారా పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంపై ఆటోతయారీ సంస్థలు దృష్టి పెట్టాలని సూచించారు. దాదాపు 90 శాతం మంది ఈ తరహా ఆఫర్లు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, కంపెనీలు ప్రకటిస్తున్న సబ్‌్రస్కిప్షన్ విధానాలకు, అలాగే వివిధ కార్ మోడల్స్‌లో మరిన్ని భద్రతా ఫీచర్లకు కూడా డిమాండ్ పెరుగుతున్నట్లు సర్వే పేర్కొంది. ఇక కొనుగోలుదారులు డిజైన్ లేదా పనితీరు వంటి అంశాలకు మించి అధునాతన భద్రతా ఫీచర్ల వైపు మొగ్గు చూపే ధోరణి పెరుగుతోంది. -
పెట్రోల్ కల్తీని ఎలా గుర్తించాలంటే..
రాజు మూడు నెలల కిందట షోరూమ్‌లో బైక్ కొనుగోలు చేశాడు. కానీ కంపెనీ ఇచ్చిన హామీ మేరకు బైక్ మైలేజీ రావడంలేదు. కనీసం అందులో సగమైన మైలేజీ రాకపోవడంతో నిరాశ చెందాడు. అయితే బైక్ కొన్నప్పటి నుంచి తాను ఒకే పెట్రోల్ పంపులో పెట్రోల్ కొట్టించేవాడు. అనుకోకుండా ఇటీవల వేరే పంపులోని పెట్రోల్ వాడాడు. అప్పటివరకు సరిగా మైలేజీ రాని తన బైక్ ఈసారి మెరుగైన మైలేజీ నమోదు చేసింది. దాంతో తాను గతంలో వాడిన పెట్రోల్ కల్తీ అయిందని గుర్తించాడు.మీకూ ఇలాంటి సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. అందుకు కొన్ని ఏజెన్సీలు పెట్రోల్‌ను కల్తీ చేయడమే కారణం. భారత్ భారీగా పెట్రోల్‌ను దిగుమతి చేసుకుంటోంది. అందుకు పెద్దమొత్తంలో డాలర్లు ఖర్చు చేస్తోంది. దీని ప్రభావం ఆయిల్ మార్కెటింగ్ సంస్థలపై పడుతుంది. వీటికి అనుబంధంగా ఉన్న కొన్ని ఏజెన్సీలు అక్రమంగా డబ్బు పోగు చేసుకోవాలనే దురుద్దేశంతో పెట్రోల్‌ను కల్తీ చేస్తున్నాయి. అయితే మనం వాహనాల్లో వాడే పెట్రోల్ కల్తీ అయిందా..లేదా..అనే విషయాన్ని ఎలా కనుగొనాలో తెలుసుకుందాం.ఇదీ చదవండి: ఇళ్ల అమ్మకాల తగ్గుదలకు కారణాలు..రెండు నిమిషాల్లో కల్తీ గుర్తించండిలా..నిబంధనల ప్రకారం ప్రతి పెట్రోల్ పంపు సిబ్బంది విధిగా తమ వద్ద ఫిల్టర్ పేపర్ ఉంచుకోవాలి. మనం వాహనాల్లో పెట్రోల్ కొట్టించాలనుకున్నప్పుడు పెట్రోల్ పంపు సిబ్బంది నుంచి ఫిల్టర్ పేపర్ అడిగి తీసుకోవాలి. దానిపై పెట్రోల్ గన్ ద్వారా 2-3 డ్రాప్స్ పెట్రోల్ వేయాలి. 2-3 నిమిషాలు ఆ ఫిల్టర్ పేపర్‌ను ఆరనివ్వాలి. తర్వాత పెట్రోల్ పోసినచోట పేపర్‌పై ఎలాంటి మచ్చలు ఏర్పడకపోతే అది స్వచ్ఛమైన పెట్రోల్‌గా పరిగణించవచ్చు. అలాకాకుండా ఏదైనా మచ్చలు ఏర్పడితే కల్తీ జరిగినట్లు భావించాలి. -
పెట్రోల్‌పై రూ.15, డీజిల్‌పై రూ.12 లాభం..!
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడంతో భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) భారీగా లాభాలు పొందుతున్నాయి. కానీ చమురు వినియోగదారులకు మాత్రం ఆ మేరకు వెసులుబాటు ఇవ్వడంలేదు. ఇప్పటికే ఆహార ధరలు, ఇతర నిత్యావసరాల ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. క్రూడాయిల్ ధరలు తగ్గినమేరకు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) వంటి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్‌పై లీటరుకు దాదాపు రూ.15, డీజిల్‌పై రూ.12 చొప్పున లాభాలను ఆర్జిస్తున్నాయని ఇటీవల ఇక్రా నివేదికలో తెలిపింది. ముడిచమురు ధరలు తగ్గడమే ఇందుకు కారణమని పేర్కొంది. మార్చి 15, 2024లో పెట్రోల్, డీజిల్ లీటర్‌పై రెండు రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి క్రూడాయిల్ ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కానీ అందుకు అనుగుణంగా చమురు ధరలు మాత్రం తగ్గించడంలేదు. దేశంలో ఇప్పటికీ పెట్రోలు లీటరుకు రూ.100, డీజిల్ రూ.90 పైనే ఉంది. ఈ ధరలు ద్రవ్యోల్బణంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి. రవాణా నుంచి విమానయానం వరకు, పరిశ్రమలు నుంచి సరుకుల వరకు రోజువారీ అవసరాలను ప్రభావితం చేస్తున్నాయి.ప్రభుత్వ యాజమాన్యంలోని ఓఎంసీల లాభాలు రూ.86,000 కోట్ల మేర నమోదైనట్లు ఇటీవల పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. గత సంవత్సరం కంటే ఇది 25 రెట్లు ఎక్కువగా ఉంది. హెచ్‌పీసీఎల్‌కు 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.6,980 కోట్ల నష్టం వాటిల్లింది. అందుకు పూర్తి భిన్నంగా 2023-24లో సంస్థ రూ.16,014 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. పన్ను చెల్లింపు తర్వాత బీపీసీఎల్ లాభం రూ.26,673 కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరం కంటే దాదాపు 13 రెట్లు ఎక్కువ.ఇదీ చదవండి: డిపాజిట్ల పెంపునకు వినూత్న ప్రయత్నాలుఅంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దాదాపు మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయినప్పటికీ, భారతీయ వినియోగదారులకు ఇంధన ధరల్లో వెసులుబాటు కల్పించడంలేదు. మహారాష్ట్ర, హరియాణాలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించేలా ఓఎంసీలు ధరలను తగ్గించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఏదేమైనా చమురు తగ్గించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం!.. ఎంతంటే?
గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజులకు ముందు ఒక బ్యారెల్ చమురు ధర 80 డాలర్ల కంటే ఎక్కువగా ఉండేది. అయితే ఉప్పుడు ఈ ధర 70 డాలర్ల నుంచి 72 డాలర్ల మధ్య ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గడంతో మనదేశంలో లీటరు ధర రూ. 2 నుంచి రూ. 3 వరకు తగ్గే అవకాశం ఉంది.ఐసీఆర్ఏ కార్పొరేట్ రేటింగ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ గ్రూప్ హెడ్ 'గిరీష్ కుమార్ కదమ్' ఇంధన ధరల గురించి మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఉత్పత్తుల ధరలతో పోలిస్తే చమురు కంపెనీలు పెట్రోల్.. డీజిల్ ధరలపై లీటర్‌కు వరుసగా రూ.15, రూ.12 చొప్పున ఆర్జిస్తున్నాయని పేర్కొన్నారు.2024 మార్చి15న పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుపై రూ. 2 తగ్గింది. ఆ తరువాత ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా ముందుకు సాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల తగ్గుదల భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గుదలకు కారణమవుతాయని తెలుస్తోంది. అయితే ధరలు ఎప్పుడు తగ్గుతాయనేది తెలియాల్సి ఉంది. -
తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజులకు ముందు ఒక బ్యారెల్ చమురు ధర 80 డాలర్ల కంటే ఎక్కువగా ఉండేది. అయితే ఉప్పుడు ఈ ధర 70 డాలర్ల నుంచి 72 డాలర్ల మధ్య ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మన దేశంలో కూడా ఇంధన (పెట్రోల్, డీజిల్) తగ్గే అవకాశం ఉందని పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ శాఖ కార్యదర్శి 'పంకజ్ జైన్' వెల్లడించారు.అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు తగ్గడానికి ప్రధాన కారణం.. చాలా దేశాల్లో ఏర్పడ్డ ఆర్థిక మందగమనమే. అయితే తగ్గుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని OPEC+ (పెట్రోలియం ఎగుమతి దేశాలు) దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించాలని అనుకుంటున్నట్లు సమాచారం. అయితే భారత్ మాత్రం ఉత్పత్తిని పెంచాలని కోరుకుంటోంది.ఇదీ చదవండి: ప్రమాదంలో ఆండ్రాయిడ్ యూజర్లు.. భారత ప్రభుత్వం హెచ్చరికఇండియా ఎక్కువగా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటుంది. రష్యా తరువాత ఇరాక్, సౌదీ అరేబియా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. భారతదేశం ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు. దేశంలోని మొత్తం చమురులో 80% విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. -
కేంద్రం అలా.. రాష్ట్రం ఇలా: పెట్రోల్ ధరలు పైపైకి
భారతదేశంలో ఇంధన (పెట్రోల్, డీజిల్) ధరలను తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ తరుణంలో పంజాబ్ ప్రభుత్వం షాకిస్తూ పెట్రోల్, డీజిల్ ధరలపై ట్యాక్స్ పెంచుతున్నట్లు ప్రకటించింది. కొన్ని రోజులకు ముందు కర్ణాటక, గోవా రాష్ట్రాలు కూడా పెట్రోల్‌పై పన్ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇదే బాటలో పంజాబ్ ప్రభుత్వం కూడా అడుగులు వేసింది.పెట్రోల్, డీజిల్‌పై వ్యాల్యూ యాడెడ్ ట్యాక్ (వ్యాట్) పెంచుతూ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి పంజాబ్ క్యాబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అతి చిన్న వాక్యూమ్ క్లీనర్: విశేషాలుక్యాబినెట్ సమావేశం ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడిన ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా.. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పెట్రోల్‌పై వ్యాట్‌ను లీటర్‌కు 61 పైసలు, డీజిల్‌పై 92 పైసలు పెంచనున్నట్లు ఆయన వెల్లడించారు. వ్యాట్ని పెంచడం వల్ల డీజిల్‌పై రూ. 395 కోట్లు, పెట్రోల్‌పై రూ.150 కోట్ల ఆదాయం పెరుగుతుందని చీమా స్పష్టం చేశారు. -
పెట్రోల్, డీజిల్ ధరలపై త్వరలో కేంద్రం తీపి కబురు
దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది. చమురు ధరలు జనవరి కంటే కనిష్ట స్థాయికి పడిపోవడమే ఇందుకు కారణమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మార్కెట్లో ముడిచమురు ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన పదేళ్లలో గరిష్ఠంగా జూన్ 2022లో బ్యారెల్ ధర 115 డాలర్లుగా నమోదైంది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ధర దాదాపు 70 డాలర్లకు చేరింది.అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితుల వల్ల గతంలో భారీగా పెరిగిన ముడిచమురు ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇటీవల క్రూడాయిల్ ధర 70 డాలర్లకు చేరువలో ఉంది. క్రూడ్ ధరలు గరిష్ఠంగా ఉన్నపుడు చమురుశుద్ధి కంపెనీలకు నష్టాలు రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ రేట్లను కొద్దిగా తగ్గించినా దిగివస్తున్న క్రూడ్ ధరలకు అనుగుణంగా మాత్రం రేట్లను తగ్గించలేదు. దాంతో కంపెనీలకు భారీగా లాభాలు చేకూరుతున్నాయి.త్వరలో జరగబోయే హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు అధికారపక్షం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. లీటర్‌కు నాలుగు నుంచి ఆరు రూపాయలు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.ఇదీ చదవండి: సెబీ చీఫ్‌పై ఆరోపణలు.. పీఏసీ విచారణ?చమురు ధరలు తగ్గుముఖం పట్టడానికి పలు అంశాలు కారణమవుతున్నాయి. లిబియా తన ముడిచమురు సరఫరాలు పెంచింది. అక్టోబర్ నుంచి ఒపెక్ + దేశాలు ఉత్పత్తి కోతలను నిలిపివేయాలని నిర్ణయించాయి. ఒపెక్ దేశాల కాకుండా ముడిచమురు వెలికితీసే ఇతర దేశాలు వాటి ఉత్పత్తిని పెంచుతున్నాయి. దాంతో సరఫరా పెరిగి ధరలు తగ్గుతున్నాయి. -
మరింత చెరకుతోనే అనుకున్న లక్ష్యం
ముంబై: పెట్రోల్‌లో 20% మేర ఇథనాల్ మిశ్రం లక్ష్యాన్ని 2025 సరఫరా సంవత్సరంలోనే సాధించాలంటే అందుకు మరింత చెరకు వినియోగించాల్సి ఉంటుందని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. దీనివల్ల మిల్లర్లకు నగదు ప్రవాహాలు మెరుగవుతాయని పేర్కొంది. నవంబర్ నుంచి అక్టోబర్ వరకు ఇథనాల్ సరఫరా సంవత్సరంగా (ఈఎస్‌వై) పరిగణిస్తుంటారు. ఈ ఏడాది అక్టోబర్ వరకు.. ఈఎస్‌వై 2025 సీజన్ పరిధిలోకి వస్తుంది. ఈఎస్‌వై 2025 నాటికి పెట్రోల్‌లో 20% ఇథనాల్‌ను కలపాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. ‘‘ఇందుకు ఏటా 990 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం. ఇందుకు చెరకుతోపాటు, గ్రెయిన్(ధాన్యాలు)ను సైతం వినియోగించుకోవడం ద్వారానే సరఫరా మెరుగుపడుతుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ తన తాజా నివేదికలో వివరించింది. ధాన్యం ద్వారా వార్షిక ఇథనాల్ ఉత్పత్తి గణనీయంగా పెరిగి వచ్చే సీజన్ నాటికి 600 కోట్ల లీటర్లకు చేరుకుంటుందని క్రిసిల్ తెలిపింది. ప్రస్తుత సీజన్లో ఇది 380 కోట్ల లీటర్లుగా ఉంటుందని అంచనా. మిగిలిన మేర చెర కు వినియోగం ద్వారా ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. మిల్లుల్లో గణనీయమైన త యారీ సామర్థ్యం కారణంగా అది సాధ్యమేనని అభిప్రాయపడింది. చక్కెర నిల్వలను ఇథనాల్ త యారీకి మళ్లించకుండా, ఎగుమతులు చేయకుండా కేంద్రం నిషేధం విధించడంతో నిల్వలు పెరగడా న్ని క్రిసిల్ నివేదిక ప్రస్తావించింది. ఈ నిల్వలను ఇథనాల్ తయారీకి అనుమతించాలని సూచించింది. పెట్రోల్ దిగుమతులు తగ్గించుకోవచ్చు.. 20 శాతం ఇథనాల్‌ను కలపడం ద్వారా పెట్రోల్ దిగమతులపై ఆధారపడడాన్ని భారత్ తగ్గించుకోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. ఈఎస్‌వై 2021 నుంచి ఏటా పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 2–3 శాతం మేర పెరుగుతూ వస్తున్నట్టు వెల్లడించింది. ‘‘ఇథనాల్ తయారీకి ఆహార ధాన్యాల వినియోగంపై కేంద్రం ఎలాంటి నియంత్రణలు విధించలేదు. కాకపోతే డిమాండ్–సరఫరా అంచనాల ఆధారంగా ఎంత మేర చెరకును ఇథనాల్ కోసం వినియోగించుకోవాలన్నది సీజన్‌కు ముందు నిర్ణయిస్తుంది. గతేడాది వర్షాలు సరిగ్గా లేకపోవడంతో ఈ ఏడాది సీజన్లో చెరకు ఉత్పత్తిపై ప్రభావం పడింది’’అని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. దీంతో ఈ సీజన్లో చెరకు ఆధారిత ఇథనాల్ ఉత్పత్తి 250 కోట్ల లీటర్లకు పరిమితం కావచ్చని అంచనా వేసింది. ధాన్యాల ద్వారా ఇథనాల్ తయారీ 40 శాతం పెరగడంతో ఈఎస్‌వై 2024 సీజన్లో పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 14 శాతానికి చేరినట్టు వివరించింది. చెరకు నుంచి ఇథనాల్ తయారీ తగ్గడాన్ని ఇది భర్తీ చేసినట్టు తెలిపింది.భారీ స్థాయిలో చెరకు అవసరంఈఎస్వై 2025 సీజన్లోనే పెట్రోల్‌లో 20 % ఇథనాల్ లక్ష్యాన్ని సాధించాలంటే 4 మి లియ న్ టన్నుల చక్కెర తయారీకి సరిపడా చెరకును ఇథనాల్ కోసం కేటాయించాల్సి ఉంటుందని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ పూనమ్ ఉపాధ్యాయ తెలిపారు. ఈఎస్‌వై 2025 సీజన్లో స్థూల చక్కెర ఉత్పత్తి 33.5 మిలియన్ టన్నులుగా ఉంటుందని, చక్కెర వినియోగం 29.5 మిలియన్ టన్నుల స్థాయిలో ఉండొచ్చని క్రిసిల్ నివేదిక పేర్కొంది. ఈ సీజన్ చివరికి చక్కెర నిల్వలు మెరుగైన స్థాయి లో ఉంటాయంటూ.. ఇథనాల్ తయారీకి సరిపడా చెరకును అనుమతించాలని సూచించింది. దీంతో చక్కెర నిల్వలనూ తగిన స్థాయిలో వినియోగించుకోవడానికి వీలు కలుగుతుందని పేర్కొంది. -
2025-26 నాటికి ఇదే లక్ష్యం: అమిత్ షా
ఫ్యూయెల్ (పెట్రోల్, డీజిల్) వాడకాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలు ఉత్పత్తిని ప్రోత్సహించడం చేస్తోంది. కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' హైడ్రోజన్ వాహనాలను ఉత్పత్తి చేయాలని కంపెనీలకు చెబుతున్నారు. అంతే కాకుండా ఇథనాల్ వాడకాన్ని పెంచాలని సూచిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర హోం మంత్రి 'అమిత్ షా' కూడా ఇథనాల్ ఉత్పత్తిని పెంచాలని కోరుతున్నారు.మోదీ ప్రభుత్వం 2025-26 నాటికి 20 శాతం ఇథనాల్‌ను కలపాలనే లక్ష్యాన్ని సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం అన్నారు. ఇథనాల్ ఉత్పత్తి పెరిగితే ముడిచమురు దిగుమతి తగ్గుతుందని అమిత్ షా చెప్పారు. దీనికోసం చక్కెర మిల్లులు ఇథనాల్‌ను ఉత్పత్తి చేయాలని కోరారు.పెట్రోల్ వినియోగం తగ్గితే.. పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో అమిత్ షా అన్నారు. దాదాపు 5000 కోట్ల లీటర్ల పెట్రోలుకు వెయ్యి కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం ఉంటుందని కూడా ఆయన చెప్పారు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ యూనివర్సల్ 4జీ, 5జీ సిమ్: ఎక్కడైనా.. ఎప్పుడైనాఇథనాల్ను కలపడం వల్ల పర్యావరణం మెరుగుపడటమే కాకుండా.. చక్కెర మిల్లుల లాభాలు పెరగడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని అమిత్ షా అన్నారు. ఇథనాల్ ఉత్పత్తిపైన ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటామని, మంత్రుల బృందం ద్వారా ఇథనాల్ మిశ్రమాన్ని ప్రధానమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తారని షా అన్నారు. -
పెరిగిన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు.. కారణం..
ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో గతేడాది జులై నెలతో పోలిస్తే ఈసారి పెట్రోల్ అమ్మకాలు 10%, డీజిల్ అమ్మకాలు 4.3% పెరిగాయని చమురు మంత్రిత్వ శాఖ డేటా విడుదల చేసింది. జులైలో వంటగ్యాస్ అమ్మకాలు 11%, జెట్ ఇంధన వినియోగం 9% పెరిగినట్లు నివేదికలో వెల్లడించింది.గత త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో పెట్రోల్ డిమాండ్ 7.1%, డీజిల్ డిమాండ్ 1.6 శాతం పెరిగింది. మొదటి త్రైమాసికంలో జెట్ ఇంధన విక్రయాలు 11.4%, వంట గ్యాస్ విక్రయాలు 5% పెరిగాయి. వేసవి సెలవులు ముగియడం, పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కావడం ఇంధన వినియోగం పెరిగడానికి కారణమైనట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ర్యాన్సమ్వేర్ దాడి.. బ్యాంకింగ్ సేవల పునరుద్ధరణదేశీయంగా దిగుమతి చేసుకుంటున్న చమురును శుద్ధి చేసే పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో డీజిల్ 40% వాటా కలిగి ఉంది. సుదూర రవాణా, మైనింగ్, వ్యవసాయం..వంటి అవసరాలకు దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ వినియోగం పెరగడం పుంజుకుంటున్న ఆర్థిక కార్యకలాపాలకు సూచిక. విమాన ట్రాఫిక్ అధికమవడంతో జులైలో జెట్ ఇంధన డిమాండ్ పెరిగింది. కస్టమర్ల సంఖ్య విస్తరించడం వల్ల వంట గ్యాస్ వినియోగం అధికమైంది. ఈ నేపథ్యంలో ఈ రంగంలోని కంపెనీలు రాన్నున్న త్రైమాసిక ఫలితాల్లో మంచి ఫలితాలు పోస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. -
పాక్‌లో అమాంతం పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఇస్లామాబాద్: అధిక ధరలతో అల్లాడిపోతున్న పాక్ ప్రజలపై అక్కడి షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మరో భారాన్ని మోపింది. పాక్ కేంద్ర ప్రభుత్వం దేశంలో మరోమారు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పాక్ ఆర్థిక మంత్రిత్వశాఖ పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తక్షణమే పెంచుతున్నట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పెంచిన ఈ ధరలు జూలై ఒకటి నుంచి అమలులోకి వచ్చినట్లు పాక్ మీడియా పేర్కొంది.పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన పాక్ ప్రభుత్వం రాబోయే 15 రోజుల పాటు ఇవే ధరలు కొనసాగుతాయని ప్రకటించింది. అంతర్జాతీయంగా చమురు ధరల్లో చోటుచేసుకున్న హెచ్చుతగ్గుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ ప్రభుత్వం తెలిపింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పాక్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 7.45 చొప్పున పెరిగింది. దీంతో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.258.16 నుంచి రూ. 265.61కి చేరింది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 9.60 పెరిగింది. దీంతో దేశంలో లీటరు డిజిల్ ధర రూ.267.89 నుంచి 277.49కి చేరింది. ఈ నెల 12న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 బడ్జెట్ విడుదల చేసిన అనంతరం తొలిసారిగా చమురు ధరలలో పెరుగుదల చోటుచేసుకుంది. -
రెడుబుక్ ఉన్మాదమిది
ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి టీడీపీ శ్రేణుల ఆగడాలకు హద్దే లేకుండా పోయింది. ప్రధానంగా గ్రామాల్లో, ఎస్సీ, ఎస్టీ వాడల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతి పరులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. జేసీబీలతో ఇళ్లను కూలదోస్తున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులని కూడా చూడకుండా చితకబాదుతుండటం ఊరూరా కనిపిస్తోంది. శిలాఫలకాలు, వైఎస్సార్ విగ్రహాలను తొలగిస్తున్నారు.. పగలగొడుతున్నారు.బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు పంచాయతీ పరిధిలోని అద్దేపల్లి దళితవాడలో శనివారం ఉదయం 6 గంటలకు అందరూ చూస్తుండగానే టీడీపీ వర్గీయులు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇదేం కక్ష సాధింపు? గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ఎవరైనా ఇలా చేశారా? అధికారం చేజిక్కించుకుంటే ఇలా దాడులు చేయడానికి, ఆస్తులు ధ్వంసం చేయడానికి లైసెన్స్ వచ్చినట్లా? లేక అధికారంతోపాటు హిస్టీరియా ఏమైనా వచ్చిందా? రెడ్ బుక్.. రెడ్ బుక్.. అంటూ లోకేశ్‌కు వచి్చన పూనకం తాలూకు ఉన్మాదమే ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులకూ నరనరాన ఎక్కినట్లుంది. రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చడమే మీ ఉన్మాద లక్ష్యం అయితే.. ప్రజాగ్రహ జ్వాల ఉవ్వెత్తున ఎగిసి పడటం ఖాయం. ఆ సెగలో మాడి మసి అవుతారో.. లేక పద్ధతి మార్చుకుని బుద్ధిగా పాలన సాగిస్తారో చూడాలి.అద్దేపల్లి (భట్టిప్రోలు)/సాక్షి ప్రతినిధి బాపట్ల: టీడీపీ మాజీమంత్రి నక్కా ఆనందబాబు ఎమ్మెల్యేగా ఉన్న వేమూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. భట్టిప్రోలు పంచాయతీ పరిధి అద్దేపల్లి దళితవాడలో శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో అందరూ చూస్తుండగానే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. విగ్రహం ముప్పావు భాగానికి పైగా దగ్ధమైంది. దీంతో దళితవాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే, వైఎస్సార్ విగ్రహానికి సమీపంలో ఉన్న టీడీపీ జెండా దిమ్మెను వైఎస్సార్సీపీ వారు పగులగొట్టారని, అందుకు ప్రతీకారంగా వైఎస్ విగ్రహాన్ని తగులబెట్టినట్లు టీడీపీ వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. కానీ, టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే తమను రెచ్చగొట్టేందుకు జెండా దిమ్మెను కొద్దిగా పగులగొట్టుకుని ఆ సాకుతో వైఎస్ విగ్రహాన్ని కాల్చివేశారని వైఎస్సార్సీపీ నేతలు వాదిస్తున్నారు. ఇరువర్గాలూ పరస్పర ఫిర్యాదులుబాపట్ల జిల్లాలోని రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు అనంతరం టీడీపీ అరాచకపర్వం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్‌గా టీడీపీ నేతలు దాడులు చేస్తూ వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. దీంతో చాలామంది వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు గ్రామాలు వదలి వెళ్లిపోయారు.ఈ పరిస్థితిలో టీడీపీ జెండా దిమ్మెలను పగులగొట్టే పరిస్థితి వైఎస్సార్సీపీ నేతలకు లేదన్నది టీడీపీ నేతలకూ తెలుసు. కాకపోతే ఏదో ఒక సాకుచూపి విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. టీడీపీ కార్యకర్తలే వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఏడు మందిపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. టీడీపీ జెండా దిమ్మె ధ్వంసం చేశారంటూ టీడీపీ నేతలు ప్రతిగా 14 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలపై కేసులు : ఎస్‌ఐఈ ఘటన గురించి తెలుసుకున్న వేమూరు సీఐ పి.రామకృష్ణ, ఎస్ఐ కాసుల శ్రీనివాసరావు, సిబ్బందితో çఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విషయం తెలుసుకున్న బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ కూడా భట్టిప్రోలు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. కాగా, వైఎస్సార్ విగ్రహం దగ్ధం చేసిన ఏడుగురిపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.నిందితులపై 435, 427, 507 ఆర్/34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. మరోవైపు టీడీపీ జెండా దిమ్మను ధ్వంసం చేసినట్లు ఆ పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. దళితవాడలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీస్ పికెట్ ఏర్పాటుచేశారు. విగ్రహాలు ధ్వంసం హేయం : మేరుగుస్ఫూర్తిని నింపిన మహనీయుల విగ్రహాల ధ్వంసం, దహనం చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడటం హేయమైన చర్య అని మాజీమంత్రి మేరుగు నాగార్జున అన్నారు. విగ్రహం దహనం విషయం తెలుసుకున్న ఆయన అద్దేపల్లిని సందర్శించి విగ్రహాన్ని పరిశీలించారు. టీడీపీ దురాగతాన్ని ఖండించారు.హుటాహుటిన మరొక విగ్రహం ఏర్పాటుకు యత్నంవైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు శనివారం రాత్రి అద్దేపల్లి విచ్చేసి కాలిపోయిన వైఎస్ విగ్రహాన్ని పరిశీలించారు. అక్కడే వైఎస్సార్ మరో విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. విగ్రహం ఏర్పాటు పూర్తయ్యే వరకూ ఆయన స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని మౌనదీక్ష చేశారు. దళితవాడ ప్రజలు అండగా వచ్చి ఆయనకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు. రాత్రి 10గంటల ప్రాంతంలో పోలీసులు అశోక్‌బాబు దీక్షను భగ్నంచేసి ఆయన్ను రేపల్లె తరలించారు. అక్కడా ఆయన పోలీసు వాహనం దిగకుండా దీక్ష కొనసాగిస్తున్నారు. మహిళలు, చిన్నారులు అని చూడకుండా పోలీసులు నిర్ధాక్షిణ్యంగా లాఠీచార్జి చేశారు. విగ్రహాన్ని దగ్ధం చేయడం గ్రామ చరిత్రలో బ్లాక్ డేగా నిలిచిందని.. చంద్రబాబు రాక్షస పాలనకు ఇది పరాకాష్టని అశోక్‌బాబు మండిపడ్డారు. -
గోవాలో ఒక్కసారిగా పెరిగిన ఇంధన ధరలు
గోవా రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్) పెంపును ప్రకటించింది. పెట్రోల్ ధర రూ.1, డీజిల్ ధరను 60 పైసలు పెంచుతూ.. స్టేట్ గవర్నమెంట్ అండర్ సెక్రటరీ (ఆర్థిక) ప్రణబ్ జి భట్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ధరల పెరుగుదల ఈ రోజు (జూన్ 22) నుంచే అమలులోకి వస్తాని పేర్కొన్నారు.ధరల పెరుగుల తరువాత గోవాలో లీటరు పెట్రోల్ ధర రూ. 95.40, డీజిల్ రూ. 87.90 వద్ద ఉంది. కర్ణాటకలో ఇంధన ధరలను పెంచుతూ ప్రకటనలు జారీ చేసిన తరువాత గోవా ప్రభుత్వం కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. అయితే కర్ణాటక పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా రూ. 3, రూ. 3.5 పెంచుతూ గత వారంలో కీలక ప్రకటన వెల్లడించింది.ధరల పెరుగుదల సమంజసం కాదని, ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష నాయకుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు యూరి అలెమావో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజల మీద పెను భారం మోపాలని ఇలాంటి ప్రకటనలు చేస్తుందని అన్నారు. ఇటీవలే విద్యుత్ చార్జీలు పెంచారు, ఇప్పుడు ఇంధన ధరలు పెంచారని అలెమావో పేర్కొన్నారు.విద్యుత్ చార్జీలను పెంచిన తరువాత, అవినీతికి ఆజ్యం పోయడానికి ఇప్పుడు ఇంధన ధరలను పెంచిందని, సామాన్యులను ఇంకెంత బాధపెడతారు అంటూ.. గోవా ఆమ్ ఆద్మీ ప్యారీ చీఫ్ అమిత్ పాలేకర్ తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. -
ప్రపంచానికి సవాలుగా మారుతున్న ఖనిజ లోహాల కొరత
పర్యావరణ పరిరక్షణకు అవసరమైన పరిశోధనలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. కొత్త టెక్నాలజీల వినియోగం ద్వారా పరిశుభ్రమైన ఇంధనాలతో ప్రపంచంలో కాలుష్యాన్ని, వాతావరణ విధ్వంసాన్ని అదుపు చేయగలుగుతున్నాం. అయితే పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన ఖనిజ లోహాల కొరత ప్రపంచానికి పొంచి ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బయిన్లు, సోలార్ ప్యానెల్స్ తదితర నూతన సాధనాలకు కీలకమైన ఖనిజ లోహాలు తగినంత స్థాయిలో ఇక ముందు లభ్యం కాకపోవచ్చని తాజా సమాచారం చెబుతోంది.శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గాలంటే కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ప్రత్యామ్నాయాలకు రాగి, లిథియం లోహాలు అవసరం. రాగి విద్యుత్ ఉత్పత్తికి, లిథియం బ్యాటరీలు పనిచేయడానికి కీలకమనే విషయం తెలిసిందే. 2035 నాటికి ప్రపంచానికి అవసరమైన రాగి డిమాండును 70 శాతం, లిథియం డిమాండును 50 శాతం మేరకే తీర్చగలిగే పరిస్థితులున్నాయని పారిస్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) తన తాజా నివేదికలో హెచ్చరించింది. కిందటేడాది లిథియం, కోబాల్ట్, నికెల్, గ్రాఫైట్ ధరలు తగ్గడం మంచి పరిణామామమేగాని, దీంతో ఈ లోహాల ఉత్పత్తిలో నిమగ్నమైన రంగాల్లో పెట్టుబడులు తగ్గడం వల్ల భవిష్యత్తులో ఈ ఖనిజ లోహాల కొరత ప్రపంచదేశాల ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుందని ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫతీహ్ బిరోల్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘సోలార్ ప్యానెల్స్, బ్యాటరీలు, ఎలక్ట్రిక్ కార్లు వంటి నూతన సాంకేతిక సాధనాలకు ప్రపంచంలో డిమాండు విపరీతంగా పెరుగుతోంది. వాటి తయారీకి అత్యంత కీలకమైన ఖనిజ లోహాల సరఫరా తగినంత స్థాయిలో లేకపోతే ఈ డిమాండును తట్టుకోవడం కష్టమవుతుంది’ అని ఐఈఏ వివరించింది.2040 వరకు 80వేల కోట్ల డాలర్లుమైనింగ్ ప్రాజెక్టుల్లో 2040 వరకు ఇన్వెస్టర్లు 80వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడితేనే ప్రపంచంలో ఉష్ణోగ్రతలను పారిశ్రామిక యుగం మునుపటి స్థాయికి అంటే 1.5 డిగ్రీల సెల్సియస్ కు పరిమితం చేయడం సాధ్యమౌతుందని అంచనా. మైనింగ్ రంగంలో పెట్టుబడులు మందగిస్తే ఖనిజ లోహాల సరఫరా గణనీయంగా పడిపోతుందని ఐఈఏ హెచ్చరించింది. ప్రపంచంలో ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఉపకరించే సాధనాల తయారీకి కీలకమైన గ్రాఫైట్ వినియోగం 2040 నాటికి నాలుగు రెట్లు పెరుగుతుందని అంచనా. పైన పేర్కొన్న కీలకమైన కొన్ని ఖనిజ లోహాల ధరలు కొవిడ్ ముందునాటి స్థాయిలకు పడిపోయాయి. బ్యాటరీల తయారీకి అవసరమైన లోహాల ధరలు బాగా తగ్గిపోయాయి. అయినా భవిష్యత్తులో వాటి కొరత తప్పదని నిపుణులు భావిస్తున్నారు.ఇండియాలో బ్యాటరీల తయారీకి అవసరమైన లిథియం నిక్షేపాలు పెద్ద మొత్తాల్లో ఉన్నట్టు గతేడాది కనుగొన్నారు. శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించడానికి, ప్రపంచ ఉష్ణోగ్రతలను అదుపు చేయడానికి అవసరమైన ఖనిజ లోహాల ఉత్పత్తి కేవలం కొన్ని దేశాకే పరిమితం కావడం మంచిది కాదు. దానివల్ల వాటి సరఫరా సాఫీగా సాగదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో కీలక స్థానానికి చేరిన ఇండియా వంటి పెద్ద దేశాల్లో ఈ ఖనిజ లోహాల లభ్యత, విస్తృత స్థాయిలో ఉత్పత్తి ఎంతో అవసరమని అంతర్జాతీయ ఇంధన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.- విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
సాక్షి, అమరావతి: ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం ముందస్తు కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పెట్రోల్, డీజిల్‌ను కంటైనర్లు, సీసాల్లో విక్రయించరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్షిప్ లైసెన్స్ రద్దు చేస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అన్ని పెట్రో డీలర్లకు తాజాగా మార్గదర్శకాలను ఎన్నికల సంఘం జారీ చేసింది. పెట్రోల్ బంకులపై నిరంతరం ఫ్లైయింగ్ స్క్వాడ్ నిఘా ఉంటుందని స్పష్టం చేసింది. బంకుల్లో ఎన్నికల సంఘం ఆదేశాలను ప్రదర్శించడమే కాకుండా గొడవలు చేసే వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఈసీ సూచించింది. ఈ ఆదేశాల మేరకు ఏపీ పెట్రో డీలర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ రావి గోపాలకృష్ణ కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని డీలర్లకు సూచించారు. -
పెట్రోల్, డీజిల్ @ రూ.125
-
శిలాజ ఇంధనాలకు రాయితీలు తగ్గితేనే...
శిలాజ ఇంధనాల వినియోగం నానాటికీ పెరుగుతున్నందు వల్ల కాలుష్యం మరింత పెరుగుతోంది. అందుకే ప్రపంచ దేశాలు ఆ ఇంధనాలపై ఇస్తున్న సబ్సిడీలను తగ్గించాలని వివిధ అంతర్జాతీయ సంస్థలూ, సదస్సులూ దశాబ్దాలుగా పిలుపునిచ్చాయి. ఉదాహరణకు కాప్– 21 సదస్సులో 40 కంటే ఎక్కువ దేశాలు శిలాజ ఇంధన సబ్సిడీలను తొలగించడానికి ఒక ఉమ్మడి ప్రకటన చేశాయి. అయినా కూడా పారిశ్రామిక దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు శిలాజ ఇంధనాల ఉత్పత్తి, వినియో గానికి బడ్జెట్ బదిలీలు, పన్ను మినహాయింపులు, ఆర్థిక హామీలు అందజేస్తూనే ఉన్నాయి. ఈ సబ్సిడీల వలన వాతావరణానికి ప్రాథమికంగా హాని చేస్తున్న శిలాజ ఇంధనాల ఉపయోగం పెరుగుతూనే ఉన్నది. అభివృద్ధి చెందిన దేశాల నుంచి తగిన చర్యలు లేకపోవడంతో వర్ధమాన దేశాలు కూడా ముందడుగు వేయడానికి సిద్ధంగా లేవు. 2023లో భారతదేశంలో మొత్తం ఇంధన సబ్సిడీలు రూ. 3.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ‘ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్’ చేసిన కొత్త పరిశోధన ప్రకారం ఇవి గత తొమ్మిదేళ్లలో గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దేశంలో ఇంధన వనరుల డిమాండ్ పెరగడంతో పాటు, 2022లో ప్రపంచ ఇంధన సంక్షోభం నేపథ్యంలో, ప్రభుత్వం 2023లో అన్ని రకాల ఇంధన వనరుల లభ్యతను విస్తరిస్తూ హైబ్రిడ్ విధా నాన్ని అవలంభించింది. పెరుగుతున్న ఇంధన వినియోగం, ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తరువాత అంతర్జాతీయ ఇంధన ధరల సంక్షోభం ప్రభావం, అనేక దేశాలు అనుకున్న లక్ష్యాలకు వ్యతిరేకంగా శిలాజ ఇంధనాలకు మద్దతును గణనీయంగా పెంచాయి. భారతదేశం కూడా ఈ దిశ గానే అనేక చర్యలు అమలులోకి తెచ్చింది. 2022– 2023లో గరిష్ఠ స్థాయికి చేరుకున్న శిలాజ ఇంధన ధరల ప్రభావం నుంచి పేద, మధ్య తరగతి కుటుంబాలను ఆదుకోవడానికి భారత ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ రిటైల్ ధరలను పరిమితం చేసింది. పన్నులను తగ్గించింది. వ్యాపారులు, వినియోగ దారులకు ప్రత్యక్ష నగదు బదిలీలు చేసింది. ఆయా చర్యల ఫలితంగా చమురు, గ్యాస్ సబ్సిడీలు 2022తో పోలిస్తే 2023లో 63 శాతం పెరిగాయి. అయితే, 2023లో మొత్తం ఇంధన సబ్సిడీలలో బొగ్గు, చమురు, గ్యాస్ సబ్సిడీలు దాదాపు 40 శాతం కాగా, కాలుష్య రహిత ఇంధన వనరుల (క్లీన్ ఎనర్జీ)కు సబ్సిడీలు 10 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. మిగిలిన సబ్సిడీలలో ఎక్కువ భాగం విద్యుత్ వినియోగానికీ, ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినవీ ఉన్నాయి. ఇదే కాలంలో బొగ్గు సబ్సిడీలు కూడా 17 శాతం పెరిగాయి. మొత్తంగా క్లీన్ ఎనర్జీ సబ్సిడీల కంటే శిలాజ ఇంధన సబ్సిడీలు ఐదు రెట్లు ఎక్కువ. కేంద్ర ప్రభుత్వం 2023లో ప్రభుత్వ ఆధీనంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలకు ప్రత్యక్ష బడ్జెట్ బదిలీల ద్వారా చమురు, గ్యాస్ రంగానికి గణనీయమైన మద్దతును అందించింది. ఈ కాలంలో, మొత్తం చమురు – గ్యాస్ సబ్సిడీలు కనీసం రూ.70,692 కోట్లకు పెరి గాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వ సబ్సిడీల కారణంగా వరి, గోధుమలు, మక్కలు, చెరుకు వంటి ఆహార సంబంధిత ఉత్పత్తుల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేయ డానికి చాలా మంది మొగ్గుచూపుతున్నారు. ఒకవైపు ఆహార భద్రత సాధించటానికీ, ఆకలి తగ్గించడానికీ వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం... ఇంకొక వైపు సబ్సిడీలు ఇచ్చి అదే ఆహార పంటలను ఇతరత్రా ఉపయోగాలకు మళ్ళిస్తోంది. ఇందువల్ల కలిగే దీర్ఘకాలిక దుష్ప్రభావం ఊహించలేని విధంగా ఉండవచ్చు. 2020 ఆర్థిక సంవత్సరంలో, కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి మొత్తం ఇంధన ఆదాయం రూ. 6,99,565 కోట్లుగా అంచనా. ఇది మొత్తం ప్రభుత్వ ఆదాయంలో దాదాపు 17 శాతం. ఇంధన వనరుల నుంచి వచ్చే ఆదా యంలో ఎక్కువ భాగం (83శాతం) చమురు, గ్యాస్ నుండి వస్తోంది. పునరుత్పాదక ఇంధనం నుంచి 1 శాతం కంటే తక్కువే వస్తోంది. ఈ ఆదాయం కూడా ఎక్కువగా కేవలం రెండు పన్నుల నుండి వస్తోంది: కేంద్ర ఇంధన ఎక్సైజ్, రాష్ట్ర స్థాయి వ్యాట్. శిలాజ ఇంధన శక్తి వనరుల వల్ల ఆదాయం 2030 నాటికి అదనంగా రూ. 30 వేల కోట్ల నుంచి రూ. 3,40,000 కోట్లకు పెరగవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఈ ఆదాయం కోల్పోవటానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. క్రమంగా ఈ ఆదాయం మీద ఆధార పడటం తగ్గించడానికి కూడా సుముఖంగా లేవు. అయితే శిలాజ ఇంధనాల వల్ల ఆదాయం మాత్రమే కాదు భారం కూడా ఉంటుంది. ఇంధనాల ధరలో ప్రతిబింబించని ఖర్చుల భారం చాల ఎక్కువ. ఒక అంచనా ప్రకారం ఈ భారం ప్రభుత్వ ఆదాయానికి ఐదు రెట్లు ఎక్కువ. ఈ భారం రకరకాలుగా ఉంటుంది. ప్రధానంగా నీరు, గాలి, ఇతర ప్రకృతి వనరుల కాలుష్యం వల్ల కలిగే మరణాలు, అనారోగ్య సమస్యలు, వాటిని అధిగమించడానికి కల్పించవలసిన మౌలిక సదుపాయాల రూపంలో ఈ భారాన్ని చూడవచ్చు. అందుకే కాలుష్య రహిత ఇంధన (క్లీన్ ఎనర్జీ) ఉత్పత్తులు పెంచడానికి చర్యలు తీసుకోవాలని అనేక అంతర్జాతీయ సంస్థలు అంటున్నాయి. ప్రపంచ వాతా వరణ సదస్సులలో కాలుష్య రహిత ఇంధనాల వైపు ఉత్పత్తి, వినియోగ రంగాలు మారాలని ఎప్పటి నుంచో ఒత్తిడి ఉంది. ‘గ్లాస్గో కాప్ 26’ సదస్సులో బొగ్గు ఆధా రిత విద్యుత్, ఇతర ఇంధన ఉపయోగాలను క్రమంగా తగ్గించాలని పెట్టిన ముసాయిదా తీర్మానాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకించింది. కేవలం బొగ్గు కాకుండా అన్ని రకాల శిలాజ ఇంధనాల ఉపయోగం క్రమంగా తగ్గించాలని వాదించింది. దుబాయి కాప్ 28 సదస్సులో ఈ దిశగా అన్ని రకాల శిలాజ ఇంధనాలను దశల వారీగా తగ్గించాలనే తీర్మానం దాదాపు ఖరారు అయినా సర్వామోదం పొందలేదు. పెరుగుతున్న కర్బన కాలుష్యం కారణంగా భూమి ఉష్ణోగ్రతలు పెరిగి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తు న్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదకర శిలాజ ఇంధ నాలపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా వాటికి రాయితీలు తగ్గించాలి. అది సాధ్యం కావాలంటే సమూల ఆర్థిక పరివర్తనం అవసరం. ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. క్లీన్ ఎనర్జీ అందుబాటులోకి వస్తే ఆర్థిక వృద్ధి సుస్థిరం అవుతుంది. శిలాజ ఇంధన దిగుమతుల మీద ఆధారపడిన ఆర్థిక అభివృద్ధి సుస్థిరం ఎప్పటికీ కాలేదు. ప్రకృతిని కలుషితం చేస్తూ అభివృద్ధి దిశగా పయనించడం దుర్భరంగా ఉంటుంది. అందుకే కర్బన కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా అవసరమైన వాతా వరణ లక్ష్యాలను చేరుకోవడం కోసం ఒక ఆచరణాత్మక దృష్టి అవసరం. ప్రభుత్వం శిలాజ ఇంధన పన్ను ఆదా యంలో కొంత భాగాన్ని కొత్త కాలుష్య రహిత శక్తి వనరుల వైపు మళ్ళించాలి. సుస్థిర అభివృద్ధికీ, సమాన ఫలాలు అందరికీ అందించే ఆర్థిక వ్యవస్థకూ ఇంధనాల కూర్పు చాల కీలకం. డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
పెట్రోల్, డీజిల్‌పై రూ.2 తగ్గింపు
న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: దాదాపు రెండేళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. త్వరలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రానుండగా పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు రూ.2 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగ సంస్థలు తెలిపాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి తగ్గించిన ధరలు అమల్లోకి రానున్నాయని కేంద్ర చమురు శాఖ గురువారం సాయంత్రం తెలిపింది. ధర తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.96.72 నుంచి రూ.94.72కు, డీజిల్ ధర రూ.89.62 నుంచి 87.62కు రానుంది. వారం క్రితమే కేంద్రం వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.100 మేర తగ్గించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇలా.. స్థానిక, అమ్మకం పన్నులు కలిపి రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ.2.70, డీజిల్ ధర రూ. 2.54 మేర తగ్గనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ.109.66గా ఉన్న పెట్రోల్ ధర రూ.106.96కు తగ్గనుండగా, డీజిల్ ధర రూ.97.82 నుంచి రూ. 95.28కు తగ్గనుంది. -
వాహనదారులకు శుభవార్త.. భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
లోక్‌సభ 2024 ఎన్నికల వేళ వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల మీద ఏకంగా రూ. 2 తగ్గింపు ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. కొత్త ధరలు మార్చి 15, ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వస్తుంది. పెట్రోలు, డీజిల్ ధరలను రూ. 2 తగ్గించడం ద్వారా దేశంలోని కోట్లాది మంది భారతీయుల సంక్షేమం, సౌలభ్యమే తన లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిరూపించుకున్నారని మంత్రి అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో తగ్గింపు నగరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రస్తుతం 89.62 రూపాయలున్న లీటరు డీజిల్ రేపటి నుంచి రూ. 87.62లకు విక్రయిస్తారని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశ రాజధానిలో 96.72 రూపాయలుగా ఉన్న లీటరు పెట్రోల్ రేపటి నుంచి రూ. 94.72 కి లభిస్తుంది. पेट्रोल और डीज़ल के दाम ₹2 रुपये कम करके देश के यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी ने एक बार फिर साबित कर दिया कि करोड़ों भारतीयों के अपने परिवार का हित और सुविधा सदैव उनका लक्ष्य है। वसुधा का नेता कौन हुआ? भूखण्ड-विजेता कौन हुआ? अतुलित यश क्रेता कौन हुआ? नव-धर्म… https://t.co/WFqoTFnntd pic.twitter.com/vOh9QcY26C — Hardeep Singh Puri (मोदी का परिवार) (@HardeepSPuri) March 14, 2024 -
కొత్త ప్రభుత్వం ఏర్పాటుతోనే తగ్గిన పెట్రో ధరలు
ముడిచమురు ధరలు పెరుగుతున్నప్పటికీ నేడు(సోమవారం)బీహార్, యూపీలలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర 84 డాలర్లను దాటేసింది. సోమవారం ఉదయం దేశీయ ప్రభుత్వ చమురు సంస్థలు విడుదల చేసిన పెట్రోల్, డీజిల్ ధరల్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఈరోజు యూపీ, బీహార్లలో చమురు చౌకగా మారింది. ప్రభుత్వ చమురు సంస్థలు అందించిన వివరాల ప్రకారం నోయిడాలో పెట్రోల్ ధర 17 పైసలు తగ్గి లీటరు రూ. 96.59కు చేరింది. డీజిల్ కూడా 17 పైసలు తగ్గి రూ. 89.76కి చేరుకుంది. బీహార్ రాజధాని పాట్నాలో పెట్రోల్ ధర తగ్గింది. ఇక్కడ పెట్రోల్ ధర 11 పైసలు తగ్గి, లీటరు రూ. 107.48కి విక్రయిస్తున్నారు. డీజిల్ కూడా లీటరుకు 10 పైసలు తగ్గి రూ.94.26కి చేరుకుంది. హర్యానా రాజధాని గురుగ్రామ్‌లో ఈరోజు పెట్రోలు ధర 29 పైసలు పెరిగి లీటరుకు రూ. 97.10కి చేరగా, డీజిల్ ధర 27 పైసలు పెరిగి రూ. 89.96కి చేరింది. గ్లోబల్ మార్కెట్లో సోమవారం ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 84.18 డాలర్లకు చేరుకోగా, డబ్ల్యుటిఐ రేటు బ్యారెల్‌కు 78.60 డాలర్లకు చేరింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలు మారుతుంటాయి. కొత్త రేట్లు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ మొదలైనవి జోడించిన తర్వాత, దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపవుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా మారడానికి ఇదే కారణంగా నిలుస్తోంది. కాగా బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే చమురు ధరలు తగ్గడం శుభపరిణామంగా ఆ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. -
Hyderabad: పెట్రోల్ బంకుల్లో జనం క్యూ.. పెట్రోల్‌పై పుకార్లు
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్ బంక్‌లు బంద్ అంటూ మళ్లీ పుకార్లు వ్యాపించడంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జనం పెట్రోల్ కోసం బంకుల వద్ద బారులు తీరారు. నగరంలోని పాతబస్తీలో వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టారు. కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర నోస్టాక్ బోర్డులు సైతం వెలిశాయి. అయితే, పెట్రోల్ బంక్‌లు బంద్ కాలేదని, వాహనదారులు భయపడాల్సిన పనిలేదని ఇవి పుకార్లేనని బంక్‌ల యాజమాన్యం స్పష్టం చేశారు. ఇక.. ఇటీవల హిట్ అండ్ రన్ కేసుల్లో.. కేంద్ర ప్రభుత్వం తీసుకుచ్చిన కఠిన నిబంధనలను నిరసిస్తూ అయిల్ ట్రాక్కుల డ్రైవర్లు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గత మంగళవారం పెట్రోల్, డీజిల్ కొరత ప్రజలకు చుక్కలు చూపించింది. ప్రధానంగా హైదరాబాద్, ఇతర నగరాలు, పట్టణాల్లోని బంకులకు వాహనాలు పోటెత్తడం, ప్రధాన రహదారుల పక్కన కూడా బారులు తీరడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మధ్యాహ్నానికల్లా చాలావరకు బంకులు మూతపడటం, తెరిచి ఉన్న బంకులను ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఫోర్ వీలర్లు చుట్టు ముట్టడంతో ఒక దశలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. పలుచోట్ల బంకుల సిబ్బంది, వాహనదారుల మధ్య ఘర్షణలు జరగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. చదవండి: Banjara Hills: బండ్ల గణేష్ కారు డ్రైవర్ భార్య ఆత్మహత్య.. -
రష్యా వద్దు.. సౌదీయే ముద్దు.. పరిస్థితులు తారుమారు?
ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగిన రష్యాపై అమెరికా సహా సంపన్న దేశాలు ఆంక్షలు విధించాయి. ఆదాయం పెంచుకోవడానికి తన మిత్ర దేశాలకు రష్యా రాయితీపై ముడి చమురు సరఫరా చేసింది. దీన్ని భారత్ అనుకూలంగా మార్చుకుని రష్యా నుంచి ముడి చమురు దిగుమతి పెంచుకుంది. అయితే క్రమంగా యుద్ధ భయాలు తొలగిపోతుండడంతో రష్యా నుంచి ఇండియాకు దిగుమతి అవుతున్న క్రూడాయిల్ ఖరీదుగా మారుతోంది. ఉక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచి రష్యన్ క్రూడ్‌ను చాలా తక్కువ రేటుకు ఇండియన్ కంపెనీలు కొంటున్నాయి. తాజాగా ఈ క్రూడ్‌పై ఇస్తున్న డిస్కౌంట్‌ను రష్యా తగ్గించింది. ప్రస్తుతం బ్యారెల్‌పై 3-4 డాలర్ల వరకు మాత్రమే డిస్కౌంట్ ఇస్తోంది. కానీ, రవాణా ఛార్జీలను మాత్రం తగ్గించలేదని, సాధారణం కంటే ఇంకా ఎక్కువగానే ఉన్నాయని క్రూడ్ విక్రయిస్తున్న కంపెనీలు చెబుతున్నాయి. పశ్చిమ దేశాలు రష్యన్ క్రూడ్‌పై బ్యారెల్‌కు 60 డాలర్ల ప్రైస్ లిమిట్‌ను విధించిన విషయం తెలిసిందే. ఈ ధర కంటే కొద్దిగా తక్కువకు ఇండియన్ కంపెనీలు క్రూడాయిల్ కొంటున్నాయి. అదే ఆయిల్‌ను డెలివరీ చేస్తున్న రష్యన్ కంపెనీలు బ్యారెల్‌కు 11 నుంచి 19 డాలర్ల వరకు రవాణా ఛార్జీని వసూలు చేస్తున్నాయని సమాచారం. దాంతో రష్యా నుంచి వరుసగా క్రూడాయిల్ దిగుమతులు తగ్గుతున్నాయి. అందుకు ప్రత్యామ్నాయంగా గత నెలలో సౌదీ అరేబియా నుంచి ముడి చమురు దిగుమతులు పెరిగాయి. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి 22 శాతం నుంచి 16 శాతానికి తగ్గితే, సౌదీ అరేబియా నుంచి నాలుగు శాతం పెరిగింది. చెల్లింపుల సమస్య తలెత్తడంతో రష్యా నుంచి గత నెలలో క్రూడాయిల్ కొనుగోళ్లు 11 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. రష్యాలోని సొకోల్ తదితర ప్రాంతాల నుంచి ఐదు క్రూడాయిల్ చమురు రవాణా నౌకలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాయని తెలుస్తుంది. భారత్‌లో టాప్ రిఫైనరీ సంస్థగా ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మాత్రమే సొకోల్తోపాటు రష్యాలోని రోస్ నెఫ్ట్ ప్రాంతం నుంచి చమురు కొనుగోళ్లకు వార్షిక ఒప్పందం కుదుర్చుకుంది. చెల్లింపు సమస్యను తగ్గించుకోవడానికి గత నెలలో సౌదీ అరేబియా సహా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి చమురు కొనుగోలు ప్రారంభించిందని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. ఇదీ చదవండి: రూ.10 వేలకోట్లు అప్పు చేసిన ‘రిచ్‌డాడ్ పూర్‌డాడ్’ పుస్తక రచయిత.. చమురు దిగుమతి చేసుకున్నందుకు రష్యాకు రుబెల్స్, రూపీల్లో చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ చెల్లింపులకు చాలా విలువ ఉంటుంది. దాంతో కంపెనీలు కొంత ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు చమురుపై ఇస్తున్న డిస్కౌంట్‌ను తగ్గిస్తూ, రవాణా ఛార్జీలు తగ్గించకపోవడంతో ఈ పరిస్థితులు ఏర్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. -
తెలంగాణలో ప్రజలకు చుక్కలు చూపిన పెట్రోల్, డీజిల్ కొరత
-
ట్యాంకర్ డ్రైవర్ల సమ్మెతో పెట్రోల్ కటకట!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం పెట్రోల్, డీజిల్ కొరత ప్రజలకు చుక్కలు చూపించింది. ప్రధానంగా హైదరాబాద్, ఇతర నగరాలు, పట్టణాల్లోని బంకులకు వాహనాలు పోటెత్తడం, ప్రధాన రహదారుల పక్కన కూడా బారులు తీరడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మధ్యాహ్నానికల్లా చాలావరకు బంకులు మూతపడటం, తెరిచి ఉన్న బంకులను ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఫోర్ వీలర్లు చుట్టు ముట్టడంతో ఒక దశలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. పలుచోట్ల బంకుల సిబ్బంది, వాహనదారుల మధ్య ఘర్షణలు జరగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. సాయంత్రానికి పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. బంకుల వద్ద ట్రాఫిక్ స్తంభన ప్రభావం ప్రధాన కూడళ్లు, రహదారులపై పడింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌తో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. పనుల మీద బయటకొచ్చిన వారు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక పెట్రోల్, డీజిల్ అయిపోయిన వాహనదారుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. రాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారంతో.. వాస్తవానికి రెండురోజుల క్రితమే వంటగ్యాస్, డీజిల్, పెట్రోల్ ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మెకు దిగారు. ఫలితంగా ప్రెటోల్ బంకులకు సరఫరా నిలిచిపోయింది. ఇక బుధవారం నుంచి దేశవ్యాప్తంగా ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు పూర్తి స్థాయిలో సమ్మెకు దిగనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడంతో వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు పోటెత్తారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కోసం వేలాదిగా వాహనాలు బారులు తీరాయి. సమ్మె ఎన్ని రోజులు కొనసాగుతుందో అన్న ఆందోళనతో ఎక్కువమంది ట్యాంకులు ఫుల్ చేయించడం కన్పించింది. కొందరు నిబంధనలకు విరుద్ధంగా పెద్దపెద్ద క్యాన్లలో ఆయిల్ నింపుకొని తీసుకెళ్లారు. దీంతో మధ్యాహ్నానికల్లా చాలా వరకు బంకుల్లో నిల్వలు ఖాళీ అయ్యాయి. ఆయా బంకుల యాజమానులు బంకులు మూసేసి నో స్టాక్ బోర్డులు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,500 పెట్రోల్ బంకులు ఉండగా 3 వేల వరకు బంకులు మూతపడటంతో సాయంత్రానికి పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమయ్యింది. హైదరాబాద్ నగరంలోని పెట్రోల్ బంకులన్నింటిలో నిల్వలు ఖాళీ అయ్యాయి. తాత్కాలికంగా సమ్మె విరమణ రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో నిల్వలు ఖాళీ కావడంతో డీలర్ల సొంత ట్యాంకర్లను రంగంలోకి దింపారు. వారు ఆందోళన విరమించి ఇంధన సరఫరాకు సిద్ధమయ్యారు. మరోవైపు సమ్మె తాత్కాలికంగా విరమిస్తున్నట్లు రాష్ట్ర పెట్రోల్ డీజిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి ప్రకటించారు. కేంద్రం తీసుకొచ్చిన మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లుకు నిరసనగా డ్రైవర్లు సోమవారం నుంచి ఆయిల్ టాంకర్స్ నిలిపివేసి ఆకస్మిక సమ్మెలోకి వెళ్ళారని తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ల అసోసియేషన్లు కూడా సమ్మె విరమించే అవకాశాలు ఉండటం, చమురు సంస్ధల డిపోల వద్దకు డీలర్ల ట్యాంకర్లు లోడింగ్‌కు చేరుకోవడంతో బుధవారం ఆయిల్ సరఫరాకు అంతరాయం ఉండబోదని డీలర్ల వర్గాలు ప్రకటించాయి. ఇంధన సరఫరాలో కొరత ఉండదు: పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఇంధన ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మెకు పిలుపునివ్వడంతో పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ మంగళవారం పౌరసరఫరాల భవన్లో బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్ ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సమ్మె చేస్తున్న ట్యాంకర్ల డ్రైవర్లతో చర్చించాలని, రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌కు కొరత లేకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురు కాకుండా చూడాలన్నారు. ఆయిల్ కంపెనీలకు, డ్రైవర్లకు తాము పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తక్షణమే విధుల్లో చేరాలని ట్యాంకర్ల డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి కొరత ఉండదని, ప్రజలు ఆందోళనకు గురికావద్దని కమిషనర్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అప్పా జంక్షన్ వద్ద ఎస్ఐకి గాయాలు! రాజేంద్రనగర్: బండ్లగూడ అప్పా జంక్షన్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం రాత్రి సిబ్బందికి వాహనదారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పెట్రోల్ కోసం వచ్చిన సందర్భంగా వాగ్వావాదం జరగడంతో పరస్పరం దాడి చేసుకున్నట్టు సమాచారం. ఈ పెట్రోల్ బంకును పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా.. విధుల్లో ఉన్న ఒక ఎస్ఐ ర్యాంకు అధికారితో పాటు సిబ్బందికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. అయితే దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు చెప్పారు. -
HYD Long Queues At Petrol Pumps:హైదరాబాద్‌లో వాహనదారులకు పెట్రో ట్రబుల్స్ (ఫొటోలు)
-
హైవేను దిగ్భంధించిన ఆందోళనకారులు..!


