ఫిఫ్త్‌ ఫ్లోర్‌లో పెట్రోల్‌ బంక్‌ ఎందుకు కట్టారు? వాహనదారులు ఎలా వెళతారు? | China Unique Petrol Pump On 5th Floor, Shocks People | Sakshi
Sakshi News home page

China Unique Petrol Pump: ఫిఫ్త్‌ ఫ్లోర్‌లో పెట్రోల్‌ బంక్‌.. ఎలా వెళ్లాలి?

Published Sun, Sep 10 2023 9:18 AM | Last Updated on Mon, Sep 11 2023 11:08 AM

China Unique Petrol Pump on 5th Floor - Sakshi

ప్రపంచంలో లెక్కలేనన్ని వింతలు విడ్డూరాలు కనిపిస్తాయి. వాటిని చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. తాజాగా ఇలాంటి వింత ఉదంతం వైరల్‌ అవుతోంది. భవనంలోని 5వ అంతస్తులో పెట్రోల్ బంక్‌ ఏర్పాటు చేయడం విస్మయం గొలుపుతోంది.

ఈ భవనానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను @TansuYegen అనే వినియోగదారు ట్విట్టర్‌లో షేర్ చేశారు. కోట్లాది మంది యూజర్స్‌ ఈ వీడియో చూశారు. ఈ భవనంలోని ఐదవ అంతస్తులో గల పెట్రోల్ బంక్‌ దగ్గరకు వాహనదారులు ఎలా వెళతారనే ప్రశ్న అందరిమదిలోనూ మెదులుతోంది.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ పెట్రోల్ బంక్‌ చైనాలోని చాంగ్‌కింగ్‌లో నిర్మితమయ్యింది. పెట్రోలు బంక్‌కు వచ్చిన కొన్ని వాహనాల్లో ఇంధనం నింపుతున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు. నిజానికి ఈ భవనం తక్కువ ఎత్తులోనే ఉంది. ఇది కొండ ప్రాంతం కావడంతో భవనం దిగువ భాగంలో నిర్మించబడింది. జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ భవనం ఐదవ అంతస్తుకు వెనుక నుంచి మరో మార్గం ఉంది. ఆ దారిగుండా వాహనదారులు సులభంగా పెట్రోల్‌ బంక్‌కు చేరుకోగలుగుతారు. చైనావాసుల ప్రతిభకు ఈ పెట్రోల్ బంక్‌ అద్భుతమైన ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. 
ఇది కూడా చదవండి: ఫిరోజ్‌ గాంధీ అంత్యక్రియలు అలా ఎందుకు జరిగాయి? అల్లుని మృతదేహాన్ని చూసి నెహ్రూ ఏమన్నారు?
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement