unique
-
దీపావళి మర్నాడు.. హింగోట్ యుద్ధంలో 15 మందికి గాయాలు
ఇండోర్: మనదేశంలో విభిన్న సంప్రదాయాలు కనిపిస్తాయి. వీటిలో కొన్ని ఎంతో వింతగా అనిపిస్తాయి. ఇటువంటి వింత సంప్రదాయం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కొనసాగుతోంది. దీపావళి మర్నాటి రోజున ఇండోర్ జిల్లా గౌతమ్‌పురాలో సంప్రదాయం పేరుతో కళంగి- తుర్రా సమూహాల మధ్య హింగోట్ యుద్ధం శుక్రవారం జరిగింది. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ యుద్ధాన్ని వీక్షించేందుకు ఇండోర్, ఉజ్జయిని, ధార్, దేవాస్ సహా సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. రాష్ట్రంలో దీపావళి మర్నాడు ఈ తరహా యుద్ధం జరిగే ఏకైక ప్రదేశం గౌతమ్‌పురా. ఈ యుద్ధంలో 15 మందికి పైగా యోధులు మరియు ప్రేక్షకులు గాయపడ్డారు.ఇండోర్ హింగోట్ యుద్ధం చూసేందుకు వచ్చే ప్రేక్షకుల కోసం స్టేడియం ప్రాంతంలో 25 అడుగుల ఎత్తులో నెట్‌ను ఏర్పాటు చేశారు. యుద్ధభూమిలో భద్రతను దృష్టిలో ఉంచుకుని, 300 మందికి పైగా పోలీసులను మోహరించారు. దీంతో పాటు పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.గౌతమ్పురాను గౌతమ ఋషి నగరంగా పరిగణిస్తారు. ఏళ్ల తరబడి సాగుతున్న హింగోట్ యుద్ధం ఎలాంటి ప్రచారం లేకుండానే ఉత్కంఠభరితంగా సాగుతుంటుంది. రాష్ట్రంలోని పలు నగరాల నుంచి వేలాది మంది ప్రేక్షకులు హింగోట్ యుద్ధాన్ని వీక్షించేందుకు తరలివస్తుంటారు. ఈ సారి ఈ యుద్ధాన్ని చూసేందుకు వచ్చేవారితో మైదానం మొత్తం నిండిపోయింది. హింగోట్ యుద్ధంలో ముందుగా ఇరువర్గాల యోధులు డప్పుల మోతతో ఊరేగింపుగా వచ్చారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తలపై శిరస్త్రాణం, చేతుల్లో కవచాలు, నిప్పుల బాణాలు భుజాలకు తగిలించుకుని యోధులు మైదానంలోకి రావడంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రారంభంలో 50 నుండి 60 మంది యోధులు ముఖాముఖి తలపడ్డారు. సుమారు గంటపాటు జరిగిన ఈ యుద్ధం రాత్రి 7.30 గంటలకు ముగిసింది. ఇది కూడా చదవండి: 1,101 మంది మహిళలు.. ఒకే రంగు చీరతో కాళీ పూజలు -
అమ్మవారికి కష్టాలు చెప్పుకుంటూ.. ట్రాన్స్జండర్ల పూజలు
జంషెడ్పూర్: దేశంలోని పలు ప్రాంతాల్లో దుర్గామాత పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇదే నేపధ్యంలో జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ట్రాన్స్‌జంటర్లు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా వీరు నవరాత్రులలో దుర్గామాతను ఘనంగా పూజిస్తున్నారు.ఈ ట్రాన్స్‌జండర్లు దుర్గామాత విగ్రహం తయారీకి పశ్చిమ బెంగాల్ నుండి గంగానది మట్టిని తీసుకువచ్చి తమ చేతులతో విగ్రహాన్ని తయారు చేస్తారు. తాము చేసే ఆరాధన మిగిలినవారి ఆరాధనకు భిన్నంగా ఉంటుందని ఈ కమ్యూనిటీకి చెందిన అమర్జీత్ సింగ్ గిల్ తెలిపారు. తమ కమ్యూనిటీకి చెందినవారు ఈ తొమ్మిది రోజులు దుర్గా అమ్మవారి విగ్రహం ముందు కూర్చుని, తాము తమ జీవితంలో ఎదుర్కొన్న కష్టనష్టాలను చెప్పుకుంటారు. అలాగే ప్రపంచశాంతి కోసం ప్రార్థిస్తారు.ప్రతి సంవత్సరం దేశంలోని పలు ప్రాంతాల నుంచి ట్రాన్స్‌జండర్లు ఇక్కడికి తరలివచ్చి, దుర్గమ్మవారి పూజల్లో పాల్గొంటారు. ఇక్కడ జరిగే పూజల్లో మతపరమైన నియమాలను అనుసరించడంతో పాటు ట్రాన్స్‌జండర్లు తమ భావోద్వేగాలను అమ్మవారితో పంచుకుంటారు. ఇది కూడా చదవండి: అమెరికా వర్జీనియా నగరంలో వైభవంగా దసరా, బతుకమ్మ వేడుకలు! -
‘మూల్‌చంద్’ పాన్ షాప్.. పాన్ ప్రియులకు ఫుల్ క్రేజ్
జైపూర్: రాజస్థాన్‌లోని బికనీర్ పట్టణం సట్టాబజార్‌లో ఉన్న ముల్సా-పుల్సా పాన్ షాపుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈపాన్షాపు ఓనర్ పూల్‌చంద్ కట్టే రుచికరమైన పాన్ల కోసమే కాకుండా ఆయన ధరించే బంగారు ఆభరణాలు చూడడానికి కూడా ఎక్కువ మంది కస్టమర్లు వస్తుంటారు.పూల్‌చంద్ కట్టే వివిధ రకాల పాన్లు రుచిచూసేందుకు బికనీర్ వాసులే కాకుండా దూర ప్రాంతాల నుంచి పాన్‌ప్రియులు విచ్చేస్తారు. పూల్‌చంద్ స్వయంగా పాన్లు కట్టడమే కాకుండా కస్టమర్లను నవ్వుతూ పలకరిస్తుండటం షాపుకు ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. ఇటీవలి కాలంలో పాన్లు కట్టడంలో పూల్‌చంద్‌కు ఆయన కుమారుడు కూడా సాయం చేస్తున్నాడు. షాపు ఉదయాన్నే 5 గంటలకు మొదలై అర్ధరాత్రి 2 గంటల వరకు కస్టమర్లతో కిటకిటలాడుతూనే ఉంటుంది. ముల్సాపుల్సా పాన్‌షాపులో పాన్లు రూ.20 నుంచి మొదలుపెట్టి రూ.200 వరకు దొరుకుతాయి. VIDEO | Bikaner is home to a unique 'Paan' seller. His shop in the Satta Bazar area of the city has been attracting customers not just for the Paan but also for the gold ornaments he adorns with grace. Phoolchand owns the Mulsa-Phulsa paan shop, which sells various flavours of… pic.twitter.com/Ou3U6zsvDZ— Press Trust of India (@PTI_News) June 2, 2024 -
6000 కి.మీ ఎగురుతూ ఛత్తీస్‌గఢ్‌కు అరుదైన పక్షి!
పక్షి ప్రేమికులు సంబరపడే వార్త ఇది. కెనడా, అమెరికాలకు ఆనుకుని ఉన్న మధ్యధరా సముద్ర ప్రాంతాల్లో కనిపించే వింబ్రెల్ పక్షి తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాఘర్ జిల్లాకు తరలివచ్చింది. ఇది దాదాపు ఆరు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చింది.ఈ పక్షి మొదటిసారిగా ఈ ప్రాంతంలో కనిపించింది. దీనిని చూసేందుకు అటవీశాఖ సిబ్బందితో పాటు సామాన్యులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. వింబ్రల్ పక్షి ఖైరాఘర్ జిల్లా మొహభట్టా గ్రామానికి తరలివచ్చింది. దాని శరీరంపై రేడియో కాలర్ అమర్చారు. ఈ కాలర్ అంచనా ధర రూ.10 లక్షలని తెలుస్తోంది. ఆ పక్షి వెనుక భాగంలో సోలార్ జీపీఎస్ కాలర్ కూడా ఉంది. దీని ద్వారా అది ఎంత దూరం ఎగురుతూ ఇక్కడకు చేరిందో తెలుస్తుంది.ఈ కాలర్‌ను ఆ పక్షికి 2023 నవంబర్ 16న ఒక ద్వీపంలో అమర్చారు. ఆ పక్షి దాదాపు 6 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని దీని ద్వారా తెలుస్తోంది. ఆ పక్షి పాకిస్తాన్ మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్కు చేరుకుంది. దీవి నుంచి బయలుదేరిన ఆ పక్షి అరేబియా సముద్రానికి చేరుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్‌కు చేరుకుని, అక్కడ నాలుగు రోజుల పాటు మకాం వేసింది.ఈ పక్షి భారత తీరంలో 10 రోజులు ఉండి, తరువాత ఖైరాఘర్ జిల్లాలోని మొహభట్టా గ్రామానికి చేరుకుంది. ఇక్కడ ఈ పక్షి నీటిలో ఉల్లాసంగా తిరుగుతూ కనిపిస్తోంది. గత మూడు రోజులుగా ఈ పక్షి ఇక్కడే ఉంటోంది. ఈ పక్షి రెండు కాళ్లపై ఆకుపచ్చ, పసుపు రంగుల జెండాలు ఉన్నాయి. యూరప్‌లోని ఒక సంస్థ ఈ పక్షిని పర్యవేక్షిస్తున్నదని సమాచారం. వింబ్రల్ పక్షి రాకపై తమకు సమాచారం అందిందని ఖైరాగఢ్ డీఎఫ్ఓ అమిత్ తివారీ తెలిపారు. సాధారణంగా ఈ పక్షి మధ్యధరా సముద్ర తీరంలో నివసిస్తుంది. ఇది సంతానోత్పత్తి కోసం వివిధ ప్రదేశాలను వెతుకుతూ ఉంటుంది. -
‘ఏడడుగులు’ వారివి.. ఎనిమిదో అడుగు అందరిదీ’
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా వివిధ పార్టీలు విస్తృతంగా ప్రచారాలు సాగిస్తున్నాయి. ఇదే సమయంలో ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలంటూ ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేస్తోంది. ఇదేవిధంగా ఓటు హక్కు విలువను తెలియజేస్తూ ముద్రితమైన ఓ పెళ్లి కార్డు ఇప్పుడు వార్తల్లో నిలిచింది. యూపీలోని అలీఘర్‌లో త్వరలో ఓ ఇంట వివాహ వేడుక జరగనుంది. ఇందుకోసం వారు ముద్రించిన పెళ్లి కార్డు అతిథులకు ఓటు హక్కు విలువను తెలియజేస్తోంది. సాధారణంగా పెళ్లిలో వధూవరులు అగ్ని సాక్షిగా ఏడడుగులు వేస్తారు. అయితే ఈ కార్డులో ఎనిమిదో అడుగు ప్రస్తావన కూడా ఉంది. అలీఘర్కు చెందిన అంకిత్, సుగంధిల వివాహం ఏప్రిల్ 21 న జరగనుంది. అంకిత్ తండ్రి ఓటర్లకు ఓటుపై అవగాహన కల్పించేందుకు వినూత్న రీతిలో పెళ్లి కార్డు ముద్రింపజేశారు. అంకిత్ తండ్రి కాళీచరణ్ వృత్తిరీత్యా బేకరీ వ్యాపారి. ఆయన తన కుమారుని పెళ్లి శుభలేఖలో ‘ఓటు వేసే రోజున మీ పనులన్నీ పక్కన పెట్టి ఓటు వేయండి. దేశాన్ని ఉద్ధరించేవాడిని ఎన్నుకోండి’ అని రాశారు. పెళ్లిలో నూతన దంపతులు సాధారణంగా ఏడడుగులు వేస్తారని, అయితే భరత మాత సాక్షిగా పెళ్లి జంటతోపాటు అతిథులంతా ఎనిమిదో అడుగు వేయాలని, అది ఓటు వేసేందుకు చేసే ప్రమాణం లాంటిదని పేర్కొన్నారు. ఓటర్లను చైతన్యపరిచేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు కాళీచరణ్ పేర్కొన్నారు. అలీఘర్‌లో ఏప్రిల్ 26న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. -
కాంగ్రెస్, బీజేపీలతో ‘రెండున్నర అక్షరాల పార్టీ’ పోరు!
దేశంలో లోక్‌సభ ఎన్నికల వేడి కొససాగుతోంది. ఈ నేపధ్యంలో పలు వింతలు, విడ్డూరాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో పోటీకిదిగే జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల గురించి అందరికీ ఎంతోకొంత తెలిసేవుంటుంది. అయితే ఎవరికీ అంతగా తెలియని ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ రాబోయే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఆ పార్టీ పేరు ‘ఢాయీ అక్షర్’ అంటే రెండున్నర అక్షరాలు. ఇంతకీ ఈ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తోంది? భక్త కబీర్ ఒక శ్లోకంలో ఢాయీ అక్షర్ అనే పదాన్ని ప్రయోగించారు. ‘శ్రీరాం’ అనే అర్థంతో కబీర్ దీనిని ఉపయోగించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు చెందిన రాకేష్ సోంకర్ ‘ఢాయీ అక్షర్’ పార్టీని స్థాపించారు. ఇప్పుడు ఆయన రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో జబల్పూర్ నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఆయన స్థాపించిన ‘రెండున్నర అక్షరాల పార్టీ’ ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్‌లతో తలపడనుంది. కాగా రాకేష్ 13వ సారి ఎన్నికల బరిలో దిగారు. ఇప్పటి వరకు ఆయన ఆరు అసెంబ్లీ, ఐదు లోక్ సభ, ఒక మేయర్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన రాకేష్ సోంకర్‌కు ఎన్నికల సంఘం ఆటో గుర్తును కేటాయించింది. అందుకే ఆయన ఇటీవల ఆటోడ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన ఎన్నికల ఫిలాసఫీ కూడా ఎంతో విచిత్రంగానే ఉంది. తాను ఎన్నికలకు ప్రచారం చేయబోనని ఆయన ప్రకటించారు. అయితే ప్రచారం ద్వారా రాకేష్ తన అభిప్రాయాలను ఎవరికీ తెలియజేయనప్పుడు ఆయనకు ఓటు వేసేదెవరని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చని, అందుకే తాను కూడా ఎన్నికల బరిలో దిగానని రాకేష్ చెబుతున్నారు. -
దీపావళి వేళ... అమ్మవారికి రోబోటిక్ హారతులు!
దేశవ్యాప్తంగా ఆదివారం దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పిల్లాపెద్దా అంతా ఉత్సాహంగా వేడుకల్లో మునిగితేలారు. పటాకుల మోతతో దేశంలోని వీధులన్నీ దద్దరిల్లిపోయాయి. ఆకాశం అద్భుత కాంతులతో వెలిగిపోయింది. ఇదిలావుండగా దీపావళి రోజున లక్ష్మీపూజ చేయడం పలు ప్రాంతాల్లో ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా ఉత్తరాదిన దీపావళినాడు ప్రతి ఇంటా తప్పనిసరిగా లక్ష్మీ పూజలు చేస్తుంటారు. ఈ నేపధ్యంలో ఢిల్లీకి చెందిన ఒక రొబోటిక్ కంపెనీ విచిత్ర రీతిలో దీపావళి వేడుకలు నిర్వహించింది. శ్రీమహాలక్ష్మి అమ్మవారికి రోబో చేతులు మీదుగా హారతులిప్పించింది. దీనికి సంబంధించిన వీడియోను ‘ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా’ సోషల్‌మీడియా ప్లాట్ ఫారం ‘ఎక్స్’లో షేర్ చేసింది. ఈ వీడియోను నెటిజన్లు అమితంగా ఇష్టపడుతున్నారు. ఇది కూడా చదవండి: యూపీలో పేలిన బాంబు.. ఒకరి మృతి! Delhi based robotics company Orangewood's unique Diwali celebration. pic.twitter.com/eW6vafKOqH — Indian Tech & Infra (@IndianTechGuide) November 12, 2023 -
దేశ నలుమూలల నుంచి నాట్య తోరణంలో పాల్గొన్న నృత్యకారులు
-
వెరైటీగా మొక్కజొన్న తినాలకుంటే జుట్టూడింది!
సోషల్ మీడియా అనేది వాకింగ్ కామెడీ షో లాంటిది. ఎవరైనా సోషల్ మీడియా సముద్రంలోకి దూకినప్పుడు వింతలు విడ్డూరాలు అనేకం కనిపిస్తాయి. ప్రతిరోజూ లెక్కలేనన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఒక వీడియో వైరల్‌గా మారింది. దీనిలో ఒక యువతి మొక్కజొన్న తినడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించి భంగపడింది. ఈ వీడియోను చూసిన వారెవరైనా నవ్వకుండా ఉండలేకపోతున్నారు. వైరల్ వీడియోలో డ్రిల్ మెషిన్‌కు మొక్కజొన్న పొత్తు గుచ్చి, ఒక అమ్మాయి దానిని తినేందుకు ప్రయత్నిస్తుంది. కొంత సమయం వరకు అంతా బాగానే ఉంది. తరువాత ఒక్కసారిగా ఆమె జుట్టు కొద్దిమేరకు మెషీన్లో ఇరుక్కుపోయి ఊడిపోతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ X (గతంలో Twitter)లో @ZeroIQPeople అనే పేజీలో ఈ వీడియో పోస్ట్ చేశారు. ఇప్పటివరకూ 15 వేల 600 మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియో చూసిన ఒక యూజర్.. ‘అందుకే యువతులు పవర్ టూల్స్‌కు దూరంగా ఉండాలని చెప్పేది’ అని రాశాడు. మరో యూజర్ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశారు. ఇది కూడా చదవండి: అమెరికన్లు త్వరగా ఎందుకు మరణిస్తున్నారు? pic.twitter.com/DQVFNWZH5P — People With 0 IQ (@ZeroIQPeople) October 1, 2023 -
ఫిఫ్త్ ఫ్లోర్లో పెట్రోల్ బంక్ ఎందుకు కట్టారు? వాహనదారులు ఎలా వెళతారు?
ప్రపంచంలో లెక్కలేనన్ని వింతలు విడ్డూరాలు కనిపిస్తాయి. వాటిని చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. తాజాగా ఇలాంటి వింత ఉదంతం వైరల్ అవుతోంది. భవనంలోని 5వ అంతస్తులో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం విస్మయం గొలుపుతోంది. ఈ భవనానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను @TansuYegen అనే వినియోగదారు ట్విట్టర్లో షేర్ చేశారు. కోట్లాది మంది యూజర్స్ ఈ వీడియో చూశారు. ఈ భవనంలోని ఐదవ అంతస్తులో గల పెట్రోల్ బంక్ దగ్గరకు వాహనదారులు ఎలా వెళతారనే ప్రశ్న అందరిమదిలోనూ మెదులుతోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ పెట్రోల్ బంక్ చైనాలోని చాంగ్కింగ్లో నిర్మితమయ్యింది. పెట్రోలు బంక్‌కు వచ్చిన కొన్ని వాహనాల్లో ఇంధనం నింపుతున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు. నిజానికి ఈ భవనం తక్కువ ఎత్తులోనే ఉంది. ఇది కొండ ప్రాంతం కావడంతో భవనం దిగువ భాగంలో నిర్మించబడింది. జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ భవనం ఐదవ అంతస్తుకు వెనుక నుంచి మరో మార్గం ఉంది. ఆ దారిగుండా వాహనదారులు సులభంగా పెట్రోల్ బంక్‌కు చేరుకోగలుగుతారు. చైనావాసుల ప్రతిభకు ఈ పెట్రోల్ బంక్ అద్భుతమైన ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా చదవండి: ఫిరోజ్ గాంధీ అంత్యక్రియలు అలా ఎందుకు జరిగాయి? అల్లుని మృతదేహాన్ని చూసి నెహ్రూ ఏమన్నారు? Refueling on the rooftop of a parking lot and subway passing through a residential building in the city of Chongqing, China. pic.twitter.com/gKZpbUA9wn — Tansu YEĞEN (@TansuYegen) September 2, 2023 -
స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే.. 2 కేజీల టమాటాలు ఫ్రీ..
భోపాల్: దేశంలో టమాటా ధరలు మిన్నంటాయి. సామాన్యుడు కొనలేనంత భారంగా మారాయి. కానీ మధ్యప్రదేశ్‌లో ఓ సెల్‌ఫోన్ షాప్ ఓనర్ ఈ అవకాశాన్ని సరైన విధంగా వాడుకుంటున్నాడు. ఇటు ప్రజలకు మేలు చేస్తున్నట్లు.. అటు తన బిజినెస్‌ను అభివృద్ధి చేసుకుంటున్నాడు. అదేంటంటే.. తన వద్ద స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే రెండు కేజీల టమాటాలను ఉచితంగా ఇస్తాననే ఆఫర్ పెట్టాడు. దీంతో మొబైల్ కొనుగోలుదారులు ఇటువైపే మొగ్గుచూపుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని అశోక్ నగర్లో ఆయన పేరు అభిషేక్.. తన పేరు మీదుగానే ఓ ఎలక్ట్రానిక్ దుకాణాన్ని నడిపిస్తున్నాడు. కొంత కాలంగా గిరాకీ సరిగా లేదని గ్రహించిన అభిషేక్.. ఎలాగైన వినియోగదారులను ఆకర్షించాలని అనుకున్నాడు. ఇప్పడే టమాటా ధరలు పెరిగిపోగా.. దీన్నే తన వ్యాపార సాధనంగా మార్చుకున్నాడు. కేజీ రూ.160-180 వరకు మార్కెట్లో ధర పలుకుతున్న నేపథ్యంలో ఏదైనా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే రెండు కేజీల టమాటాలు ఫ్రీగా ఇస్తానని ఆఫర్ పెట్టాడు. ఒక సెల్‌ఫోన్ మీద 300 పైనే డిస్కౌంట్ వచ్చిన అభిప్రాయం వినియోగదారునికీ కలుగుతుందని చెబుతున్నాడు. దీంతో ఇన్నాళ్లు దీవాలా తీసిన వ్యాపారం ఒక్కసారిగా ఊపందుకుందని అభిషేక్ అంటున్నాడు. సెల్ ఫోన్ కొనుగోలుదారులు అభిషేక్ షాప్‌లో కొనుగోలు చేస్తున్నారు. టమాటా పేరుతో తన షాప్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఉచితంగా అవుతుందని అభిషేక్ చెబుతున్నాడు. అటు.. దేశంలో టమాటా రేట్లపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదీ చదవండి: టేకాఫ్ కష్టమని 19 మంది ప్రయాణికులను దింపేసిన విమాన సిబ్బంది -
అది అత్యంత విచిత్ర జీవి.. పాలివ్వడమే కాదు.. గుడ్లు కూడా పెడుతుంది!
ప్రపంచంలో అనేక వింత జీవులు ఉన్నాయి. వీటిని చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది.అటువంటి వాటిలో ఒకటే ప్లాటిపస్. చూసేందుకు ఈ జీవి ఎంతో విచిత్రంగా ఉంటుంది. దీని ముఖం బాతు ముఖాన్ని పోలివుంటుంది. దీని శరీరం సీలు చేప మాదిరిగా ఉంటుంది. ఇది క్షీరద జాతికి చెందిన జీవి. ఇది పాలిచ్చి పెంచే జంతువు అయినప్పటికీ.. గుడ్లను కూడా పెడుతుంది. ఇది మిశ్రమ జీవిలా కనిపిస్తుంది. ఇలాంటి మిశ్రమ జాతి జీవులు ప్రపంచంలో ఐదు రకాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనం ప్లాటిపస్కు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. శాస్త్రవేత్తలు దీనిని నమ్మలేదు 1799లో తొలిసారి ఈ ప్లాటిపస్ శాస్త్రవేత్తల కంటికి చిక్కింది. దీనిని చూడగానే వారు తెగ ఆశ్చర్యపోయారు. దీని శరీరం, ముఖం ఎంతో వింతగా.. పొంతన లేని విధంగా కనిపించింది. ఇలాంటి జీవి భూమిపై ఉందనే విషయాన్ని నమ్మలేకపోతున్నామన్నారు. తొలుత దీనిని రెండు జీవులుగా భావించిన శాస్త్రవేత్తలు తమపరిశోధనల ద్వారా అది ఒక జీవేనని తేల్చారు. తరువాత అటువంటి జీవి సజీవంగానే లభ్యం అయ్యింది. రక్షణ కోసం విషం జిమ్ముతూ.. ప్లాటిపస్ ఇతర జీవుల నుంచి రక్షణ కోసం విషం జిమ్ముతుంటుంది. దాని వెనుక కాళ్లలో ఒక ముల్లులాంటిది ఉంటుంది. దానిలో విషం ఉంటుంది.తన రక్షణకు అది ఆ ముల్లును ఇతర జీవులకు గుచ్చుతుంది. అయితే మనిషికి ప్లాటిపస్ ముల్లు గుచ్చుకోవడం వల ఎటువంటి హాని జరగను. అయితే తట్టుకోలేకంత నొప్పి కలుగుతుంది. ఇది కూడా చదవండి: మన వర్సిటీలు ప్రపంచంలో మేటి -
SUV పైన బోటు.. అందులో ఎమ్మెల్యే.. వీడియో వైరల్
లక్నో: ఇటీవల కాన్పూర్ లో కురిసిన వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోజులు గడుస్తున్నా నిలిచిపోయిన నీటిని తొలగించడానికి యూపీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని నిరసనగా తన SUV వాహనం మీదకు బోటు ఎక్కించి అందులో కూర్చుని నగరమంతా తిరుగుతూ నిరసన తెలిపారు సమాజ్ వాది పార్టీ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్ పాయ్. కాన్పూర్‌లో ఇటీవల కుండపోతగా వానలు కురిశాయి. దీంతో రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలన్న ప్రయత్నంలో వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు ఆర్య నగర్ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్ పాయ్. తన SUV పైకి ఒక బోటును ఎక్కించి అందులో కూర్చుని తెడ్డు చేతపట్టుకుని నగరమంతా ఈదారు. కాన్పూర్ లోని సరసయ్య ఘాట్ దగ్గర మొదలైన ఈ కార్యక్రమం బడా చౌరాహా, మేష్టన్ రోడ్, మూలం గంజ్ ఎక్స్ ప్రెస్ రోడ్, ఫూల్ బాగ్ మీదుగా కొనసాగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో వీఐపీ రోడ్, సివిల్ లైన్స్, బాబుపూర్వ, రాయ్ పూర్వలో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయని ఇక జుహీ బ్రిడ్జి వద్దైతే ఆ వరద ఉధృతికి ఇటీవల ఒక డెలివరీ ఏజెంటు కూడా చనిపోయాడని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో ప్రజలను కూడా లైఫ్ జాకెట్లు, బోట్లు వాడమని సలహా ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు అంతర్జాలంలో హల్చల్ చేస్తోంది. कानपुर में सपा विधायक @AmitabhBajpai का जलभराव को लेकर अनोखा प्रदर्शन। अपनी कार के ऊपर नाव रख उसपर सवार होकर सड़कों पर निकले नगर निगम की विफलता पर किया प्रदर्शन ,उनका कहना है कि बारिश के चलते शहर बन गया था टापू pic.twitter.com/yEO1zFUtf5 — Anurag Verma ( PATEL ) (@AnuragVerma_SP) June 30, 2023 ఇది కూడా చదవండి: మహారాష్ట్ర బస్సు ప్రమాదం.. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు -
ఊహించని ప్రదేశాలలో వింత ఆవిష్కరణలు
-
ఈ ఇల్లు చాలా ప్రత్యేకం: అమ్మకానికి బ్రిడ్జ్ హౌస్.. ధర ఎన్ని కోట్లో తెలుసా?
మీరు ఇప్పటివరకూ ఇన్నో రకాల ఇళ్లు చూసి ఉంటారు. ఖరీదైన భవంతుల గురించి విని ఉంటారు. కొండలపై రూ.కోట్లు పెట్టి కట్టిన , విలాసవంతమైన నివాసాల గురించి చదివి ఉంటారు. కానీ ఓ కాలువ బ్రిడ్జిపై నిర్మించిన ఈ ప్రత్యేకమైన ఇంటి గురించి తెలుసా? యునైటెడ్ స్టేట్స్‌లోని లాస్ ఏంజెల్స్‌లోని అల్హంబ్రా వాష్ కాలువకు అడ్డంగా బ్రిడ్జ్‌పై నిర్మించిన ఇల్లు తాజాగా అమ్మకానికి వచ్చింది. దీని విలువ దాదాపు రూ. 2 కోట్లు. ఒక పడకగది, ఒక బాత్రూమ్ ఉన్న ఈ ప్రత్యేకమైన ఇంటిని కంపాస్ రియల్ ఎస్టేట్ పోర్టల్ వెబ్సైట్లో విక్రయానికి ఉంచారు. 450 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని కొనుక్కునే వారు అందమైన రూఫ్ టాప్ డాబాను ఆనందించవచ్చని, రిటైల్ దుకాణాలు, ఎల్ఏ ఫిట్నెస్, 99 రాంచ్, మెయిన్ స్ట్రీట్‌లో మంచి ఫుడ్‌స్టాల్స్‌కు సమీపంలో ఉండవచ్చని, ఇది నిజంగా గొప్ప ఆస్తి అని ఇంటిని అమ్మకానికి ఉంచిన పోర్టల్ పేర్కొంది. Welcome to the L.A. Troll Apartment. You can live under a bridge for only $250,000 https://t.co/6crQ2gvOls pic.twitter.com/l5M7Yjpbjk — Mighty AP (@themightyap) June 6, 2023 లాస్ ఏంజిల్స్ టైమ్స్ కథనం ప్రకారం.. ఆహ్లాదకరమైన కాలువ నీటి ప్రవాహానికి ఎదురుగా, రోడ్డు వంతెన పక్కన ఈ ఇల్లు ఉంటుంది. ఇంటి డాబా మీదకు వెళ్తే సుందరమైన పరిసరాలను వీక్షించవచ్చు. ఈ ఇల్లు ఒకప్పటి తన హైస్కూల్ స్నేహితుని తల్లిదండ్రులకు చెందినదని దీన్ని అమ్మకానికి ఉంచిన కంపాస్ ఏజెంట్ డౌగ్ లీ చెప్పారు. ఇదీ చదవండి: Oldest Real Estate Agent: 74 ఏళ్ల వయసులో రియల్ఎస్టేట్ ఏజెంట్! పరీక్ష రాసి మరీ.. -
ప్రపంచంలోని టాప్ 10 ప్రత్యేక భవనాలు
-
ఆ పూలను తాకితే చాలు.. ఓ అద్భుతాన్ని చూసిన ఫీలింగ్!
ప్రకృతి.. తన వైవిధ్యాలతో మానవమాత్రుల్ని ఎప్పటికప్పుడు అబ్బురపరస్తూనే ఉంటుంది. గమ్మతైన అందాలతో నివ్వెరపరస్తూనే ఉంటుంది. బాతుల్ని పోలిన పువ్వులు.. వినడానికే వింతగా ఉంది కదూ! ఈ చిత్రాలను చూస్తే మీకే అర్థమవుతుంది. కలేనా మేజర్ ఆర్కిడ్ అనే జాతికి చెందిన మొక్క పువ్వులు అచ్చం ఎగురుతున్న బాతుల్లా ఉంటాయి. చూడటానికి ఇవి రెక్కలు విచ్చుకుని పైకి ఎగురబోతున్నట్లే తారసపడతాయి. తూర్పు, దక్షిణ ఆస్ట్రేలియాలో ఈ మొక్కలు అధికంగా కనిపిస్తుంటాయి. ఈ పూల తల భాగంపైన తాకితే చాలు.. వెంటనే టచ్ మి నాట్ మొక్కలాగా ముడుచు కుంటాయి. ఊహించని ప్రమాద సూచికగా భావించి, అమాంతం తలను వాల్చుకుని దాక్కున్నట్టుగా అలా ముడుచుకుంటాయన్నమాట. అద్భుతం కదూ! -
ఆ జంట కళ్లు చెబుతాయి ‘ప్రేమ’ ఎంత స్వచ్ఛమైనదో!
మనసుకు నచ్చాలే కానీ మనిషి రూపంతో పనేముంటుంది? ప్రేమ గుడ్డిదని అనేవాళ్లు అంటూనే ఉంటారు. ఒక్కటైన ఆ జంట కళ్లు చెబుతాయి తమ ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో? ఈ అరుదైన బ్రిటన్ జంటే అందుకు ఉదాహరణ. క్లో లస్టెడ్ అనే మహిళ ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు. ఆమె భర్త జేమ్స్.. పొడవు 3 అడుగుల 7 అంగుళాలు మాత్రమే. 2016లో వీరి పెళ్లి వార్త ప్రపంచాన్నే అబ్బురపరచింది. 2021, జూన్ 2న ఈ కారణంతోనే (ఇలా భార్యాభర్తల మధ్య ఉండే ఎత్తుల తేడాతో) గిన్నిస్ రికార్డ్‌లకు ఎక్కింది ఈ జంట. ప్రస్తుతం జేమ్స్ (33) నటుడుగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా పని చేస్తున్నాడు. క్లో (27) ఉపాధ్యాయురాలు గా పనిచేస్తోంది. వీరికి పెళ్లై ఐదేళ్లు కాగా.. వారికి ఒలీవియా అనే రెండేళ్ల కూతురు కూడా ఉంది. ఎముకలపై ప్రభావం చూపే డయాస్ట్రోఫిక్ డిస్ప్లేసియా అనే రుగ్మతతో బాధ పడుతున్న జేమ్స్.. ఎదుగుదల లేకుండా పొట్టిగానే ఉండిపోయాడు. 2012లో మొదటిసారి వీళ్లు కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒకరిని ఒకరు కలుసుకున్నారు. 2014లో జేమ్స్... క్లోను ప్రపోజ్ చేశాడట. ప్రస్తుతం తమ రెండేళ్ల కూతురితో కలసి దిగిన వీరి ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. -
హైదరాబాద్ రెస్టారెంట్‌కి ఇండస్ట్రియలిస్ట్ హర్ష్ గోయెంకా ఫిదా!
ప్రముఖ ఇండస్ట్రియలిస్టు హర్ష్ గోయెంకా దృష్టిని ఆకర్షించింది హైదరాబాద్‌కి చెందిన ఓ రెస్టారెంట్, సాధారణ రెస్టారెంట్లకి భిన్నంగా ఫుడ్ సర్వ్ చేయడం ఈ రెస్టారెంట్ ప్రత్యేకత. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్న ఫ్లాట్‌ఫారమ్ నంబర్ 65 రెస్టారెంట్లో టేబుల్స్‌పై మినీ ట్రాక్స్ ఉంటాయి. మనం ఆర్డర్ చేసిన ఫుడ్ ఆ ట్రాక్‌పై మాల్గాడీలో ప్రయాణిస్తూ మన దగ్గరికి వస్తుంది. ఫ్లాట్‌ఫామ్ నంబర్ 65కి సంబంధించిన వివరాలు హైదరాబాదీలు సుపరిచితమే అయినా హర్స్ గోయెంకా లాంటి ఇండస్ట్రియలిస్టు తన ట్విట్టర్లో ఈ రెస్టారెంట్‌కి సంబంధించిన వీడియో పోస్ట్ చేయడంతో దీని ప్రత్యేకతలు మరోసారి సోషల్ మీడియా వేదికగా చర్చకు దారితీసింది. If you are missing train travel, here’s a unique restaurant in Hyderabad #Platform65pic.twitter.com/SVvvmkqr25 — Harsh Goenka (@hvgoenka) September 14, 2021 చదవండి: Work From Home చాలు.. నా భర్తను ఆఫీస్‌కు రమ్మనండి బాబోయ్ -
అదో వెరైటీ విలేజ్.. పురుషులకో భాష, మహిళలకు మరో భాష
సాధారణంగా ఒక రాష్ట్రానికి ఒకే భాష ఉంటుంది. అదే వాళ్ల మాతృ భాష కూడా అవుతుంది. ఆ ఊళ్లో మాత్రం రెండు భాషలు మాట్లాడుతారట. అది కూడా మహిళలకు ఓ భాష. పురుషులు మరో భాష. అదేం వింత, ఎక్కడా అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే.. సౌత్ నైజీరియాలోని ఓ గ్రామంలో అక్కడి ప్రజలు భాష విషయంలో పాటిస్తున్న ఆచారం ఇది. ఎందుకంటే వారు ఇలా వేర్వేరు భాషలు మాట్లాడటం తమకు దేవుడిచ్చిన వరంగా భావిస్తారట. ఆ ఉరిలో.. వ్యవసాయం చేసుకునే ఉబాంగ్ అనే తెగ వాళ్లే ఎక్కువగా ఉంటారు. అయితే.. వాళ్లు రెండు భాషలు మాట్లాడటం ఆనవాయితీగా పాటిస్తున్నారు. ఉదాహరణకు, ఒక స్త్రీ యమ్‌ను 'ఇరుయ్' అని పిలవగా, పురుషులు మరోలా పిలుస్తారట. మహిళలు దుస్తులను 'అరిగా' అని పురుషులు దీనిని 'ఎన్కి' అని పిలుస్తారు. ఇలా పురుషులకు, మహిళలకు వేర్వేరు భాషలు ఉన్నా వారి మధ్య భాషపరంగా ఏ సమస్యలు తలెత్త లేదని అక్కడి ప్రజలు చెప్తుతున్నారు. ఇలా వాళ్లకి భాషలు విభజించినప్పటికీ కొన్ని పదాలు మాత్రం కామన్‌గా ఉంటాయట. చిన్నపిల్లలు 10 ఏళ్ల వయసు వచ్చే వరకు ఏ భాష మాట్లాడినా పట్టించుకోరు కానీ.. మగ పిల్లలు మాత్రం 10 ఏళ్లు దాటితే ఖచ్చితంగా పురుషుల భాషనే మాట్లాడాలి. ఈ విషయంలో ఎవరూ ఒత్తిడి చేయకపోయినా మహిళల భాషను పురుషులు మాట్లాడితే మాత్రం వింతగా చూస్తారట. అందుకే అక్కడి నియమాలు తెలిసిన వాళ్లు ఎవ్వరూ తమ భాష కాకుండా వేరే మాట్లాడరు. చదవండి: Siddharth: హీరో సిద్ధార్థ్ మృతి అంటూ సంతాపం, స్పందించిన హీరో -
ఇదో విచిత్రమైన 'క్యూ'
న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ ప్రభావంతో ప్రజల కష్టాలకు అద్దం పట్టే సన్నివేశం ఒకటి మధ్యప్రదేశ్ లోచోటుచేసుకుంది. నగదు మార్పిడి కోసం బ్యాంకుల ముందు బారులు తీరుతున్న జనం లైన్లలో గంటల తరబడి నిలబడలేక, తమకు బదులుగా పాస్ బుక్ లను లైన్లలో ఉంచడం ఆసక్తికరంగా మారింది. మధ్యప్రదేశ్ లోని శివపురిలో ఈ అరుదైన క్యూ లైన్ ప్రజల బాధలకు అద్దం పట్టింది. లైన్లలో బ్యాంకు ఖాతాదారులకు బదులుగా బ్యాంక్ పాస్ బుక్ లను ఉంచారు. నవంబరు 8 రాత్రి నుంచి అమల్లోకి వచ్చిన పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా ప్రజల్లోతీవ్ర ఆందోళన నెలకొంది. పాత నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద నగదు విత్ డ్రాల కోసం ఏటీఎం సెంటర్ల దగ్గర జనం బారులు తీరడం విదితమే. కాగా రద్దయిన పాత నోట్లను మార్చుకునే నగదుపరిమితిని కుదిస్తూ కేంద్రం గురువారం ప్రకటించింది. ఇప్పటివరకూ ఉన్న 4500 మార్పిడి పరిమితిని 2000 వేలకు కుదించింది. దీంతో ప్రజలనుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. పరిమితిని పెంచాల్సింది పోయి, తగ్గించడం తప్పుడు నిర్ణయమన్న విమర్శలు చెలరేగాయి. -
యు టెలివెంచర్స్ తాజా స్మార్ట్‌ఫోన్...
న్యూఢిల్లీ: మైక్రోమ్యాక్స్ అనుబంధ సంస్థ యు టెలివెంచర్స్ తాజాగా 4జీ స్మార్ట్ ఫోన్ ‘యూనిక్’ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ. 4,999. ఇది సెప్టెంబర్ 15 నుంచి ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌లో ఫ్లాష్ సేల్ కింద అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. -
చూసొద్దాం... రాక్ గార్డెన్స్!
దేనికీ స్పందించని మనిషిని రాతితో పోలుస్తుంటారు. కానీ ఈ రాతి ఉద్యానాలను సందర్శించిన వారు ఆ పోలిక తప్పని చెబుతారు. జీవం ఉట్టిపడే ఈ ఉద్యానాల ప్రత్యేకత అలాంటిది. రాతి కట్టడాల గురించి తెలుసు, పచ్చని మొక్కలతో అలరారే ఉద్యానాలూ తెలుసు... మరి పూర్తిగా రాళ్లతోనే నిర్మితమైన ఉద్యానాల గురించి తెలుసా!! లేదంటే ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. మనిషి చేతుల్లో పురుడు పోసుకున్న ఈ ప్రకృతి వనాలను సందర్శిస్తే ‘రాళ్లలో ఉన్న నీరు కళ్లకెలా తెలుసు...’ అని సంధించిన ఓ మహాకవి ప్రశ్నకు సమాధానం ఇవేనా అనిపించకమానదు. నెక్ చంద్ రాతి వనం మన దేశంలోని చండీగఢ్‌లో సుఖ్నా సరస్సుకు దగ్గరలో ఉన్న రాతి ఉద్యానం సృజనాత్మకతకు, నూతన ఆవిష్కరణకు, అద్భుత చాతుర్యానికి పెట్టింది పేరు. చండీగఢ్‌లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగంలో రోడ్ ఇన్స్పెక్టర్ అయిన నెక్ చంద్ ఈ ఉద్యాన సృష్టికర్త. 1957లో 12 ఎకరాల స్థలంలో 18 ఏళ్లపాటు కృషి చేసి దేశంలోనే ప్రత్యేక ఉద్యానంగా దీన్ని తీర్చిదిద్దాడు. వాస్తవానికి ఈ గార్డెన్ ఏర్పాటుపై నిషేధం విధించింది అప్పటి ప్రభుత్వం. అందుకని 18 ఏళ్లపాటు చీకటి రాత్రుల్లోనే ఎవరికీ తెలియకుండా ఈ రాతి తోటను సృష్టించాడు. రాత్రివేళ రహస్యంగా సమీపంలోని అడవికి వెళ్లి, రాళ్లను చేతులతో మోసుకొచ్చేవాడు. కొండ ప్రాంతాలకు సైకిల్ పై వెళ్లి పెద్ద పెద్దరాళ్లను తీసుకువచ్చేవాడు. కూల్చివేసిన భవనాల నుంచి వ్యర్థాలను సేకరించి తెచ్చేవాడు. వీటన్నింటి మిశ్రమంతో నృత్యభంగిమల్లో ఉన్నవి, సంగీతకారుల శిల్పాలు, జంతువులకు సంబంధించిన శిల్పాలను ఇక్కడ ఏర్పాటు చేశాడు. ఈ పార్క్ కోసం 50 మంది శ్రామికులు రేయింబవళ్లు ఏకాగ్రతతో పని చేశారు. 1975లో ఈ రాతి ఉద్యానం వెలుగులోకి రావడం, ప్రభుత్వం చంద్ శ్రమను గుర్తించి, పట్టణంలో పనికిరాని వస్తువులను, విరిగిన సెరామిక్ రాళ్లను ఇందుకోసం ఉపయోగించమని సూచించింది. 1976లో ఈ పార్క్‌ను పబ్లిక్ ప్లేస్‌గా గుర్తించి ప్రజల సందర్శనకు అనుమతి ఇచ్చింది. 1983లో ఈ ఉద్యానం పేరిట ప్రత్యేక తపాలా బిళ్ళను వెలువరించారు. ఈ రాక్‌గార్డెన్ సందర్శనకు ప్రతిరోజూ 5 వేల మందికి పైగా సందర్శకులొస్తున్నారు. సన్ యట్-సెన్ చైనీస్ గార్డెన్ కెనడాలోని వాంకోవర్‌లో కొలువుదీరిన ఈ సంప్రదాయ గార్డెన్‌ను రాయి, నీరు, గ్రహాలు, నిర్మాణం.. ఈ నాలుగు అంశాలను ప్రాతిపదికగా తీసుకొని రూపొందించారు ఉద్యాన సృష్టికర్తలు జో వాయ్, డొనాల్ వ్యుఘన్లు. 1985-1986లో నిర్మించిన ఈ గార్డెన్‌కి చైనాలోని తాయ్ సరస్సు దగ్గర ఉన్న రాళ్లను తెప్పించి నిర్మించారు. తాయ్ సరస్సులోని రాళ్లకు అతీంద్రియ శక్తులు ఉంటాయని, అదృష్టాన్ని కలిగిస్తాయని చైనీయుల నమ్మకం. ఆధునిక చైనా జాతీయ నాయకుడైన డాక్టర్ సన్ యట్-సెన్ పేరును దీనికి పెట్టారు. ప్రకృతికి దీటుగా ఏర్పాటు చేసిన ఈ ఉద్యానం విజ్ఞాన, విహార, ధ్యానానుభూతులను ఏకకాలంలో కలిగిస్తోంది. డంబర్టన్ ఓక్స్ గార్డెన్ అమెరికాలోని వాషింగ్టన్ డి.సిలో డంబర్టన్ ఓక్స్పేరుతో ఉంది ఈ రాతి వనం. బీట్రిక్స్ ఫెర్రాండ్ అనే వ్యక్తి రంగురంగు రాళ్లతో అత్యద్భుతంగా 1920ల కాలంలో ఈ రాతి ఉద్యానాన్ని రూపొందించారు. అలంకరణ కోసం రకరకాల రాతి ముక్కలను ఈ స్టైల్ గార్డెన్ నిర్మాణానికి ఉపయోగించారు. వాకర్ రాక్ గార్డెన్ వాషింగ్టన్లో వాకర్ రాక్ గార్డెన్‌ను ఆంటోనీ గౌడి 1950లో అభివృద్ధి చేశాడు. దీని రూపకర్త మిల్టన్ వాకర్. ఇతను బోయింగ్ విమానాల మెకానిక్‌గా పనిచేసేవాడు. తన భార్య మిల్టన్‌తో కలిసి 20 ఏళ్లపాటు అత్యంత ప్రేమగా ఈ ఉద్యానాన్ని సృష్టించాడు. ఈ రాతి ఉద్యానంలోని కట్టడాలకు రాళ్లు, చెక్కలు, రంగురంగుల గాజు ముక్కలను ఉపయోగించాడు. 18 అడుగుల పొడవైన టవర్, అలంకృత ఫౌంటెయిన్లు, ఆల్ఫ్స్ పర్వతాలను పోలిన సుందర రూపాలు, సీతాకోకచిలుకలను పోలిన రాళ్ల నిర్మాణాలు ఇక్కడ కనువిందుచేస్తాయి. -
ఆభరణానికే అందం...
చాలా వెరైటీ వంటకాలు ఉన్నాయి కదా అని అన్నీ ఒకేసారి తినలేం. అలాగే ఏడు వారాల నగలు ఉన్నాయి కదా అని అన్నీ ఒకేసారి ధరించకూడదు. కట్టుకునే దుస్తులకే కాదు, పెట్టుకునే ఆభరణాలకూ ఓ ప్రత్యేకత ఉంటుంది. సమయం, సందర్భాలను బట్టి ఆభరణాలు ధరించాలి. ఆ ఆభరణాలలో మీరు మరింత ఆకర్షణీయంగా, అందంగా కనిపించాలంటే ఏది రాంగో, ఏది రైటో తెలిసుండాలి. అందుకు ఈ మెలకువలు పాటించి, ఆభరణాలకే అందాన్ని తీసుకురండి. నగలు ఆడవారికి ఎంత ఇష్టమో తెలిసిందే! పెళ్ళిళ్లకు, ఇతర ఫంక్షన్లకు వెళ్లినప్పుడు చీరల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.కాని నగలు ఒకే తరహావి పెట్టుకెళతారు. ఇక చాలా మంది చేసే పొరపాటు.. ఒకటికి రెండు, మూడు నగలు వేసుకోవడం. ధరించిన చీరకు, వేసుకున్న నగకు ఏ మాత్రం పొంతన లేకపోవడం... రోల్డ్‌గోల్డ్ కంటే బంగారు ఆభరణా లలో ఈ పొరపాట్లు ఎక్కువగా జరుగుతుంటాయి. మెడ పొడవుగా/ కురచగా ఉంటే!: ఆభరణాలు ధరించేటప్పుడు మెడను బట్టి ఎంచుకోవాలి. మెడ సన్నగా పొడవుగా ఉన్నదా, లేక కురచగా లావుగా ఉన్నదా అనేది చూసుకోవాలి. అలాగే వయసును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఒక వయసు వచ్చేసరికి మెడ మీద ముడతలు వచ్చేస్తాయి. మెడ పొడవుగా సన్నగా ఉంటే చౌకర్స్, నెక్లెస్ పెట్టుకోవచ్చు. అదే మెడ కురచగా.. లావుగా ఉన్నా, ముడతలుగా ఉన్నా నెక్లెస్‌లు పెట్టుకునే ధైర్యం చేయకూడదు. పొడవాటి హారాలు వేసుకోవాలి. ఫ్యాబ్రిక్‌కు తగిన ఆభరణం: వెళ్లబోయే వేడుక ఏంటి? ఏ చీర కట్టుకుంటున్నాం.. అనే దాన్ని బట్టి ఆభరణాలను ఎంపిక చేసుకోవాలి. షిఫాన్ చీర ధరించినప్పుడు పట్టుచీరపైకి వేసుకునే నగలు ధరించకూడదు. పోచంపల్లి, గద్వాల వంటి కాటన్ చీరలు కట్టుకున్నప్పుడు డల్ మెటల్స్, ఉడెన్ జ్యుయలరీ బాగా సూటవుతుంది. బంగారు ఆభరణాలైతే యాంటిక్ ఫినిషింగ్ చేసినవి నప్పుతాయి. షిఫాన్, జార్జెట్.. వంటి చీరలు కట్టుకున్నప్పుడు సంప్రదాయ ఆభరణాలు ఎంత మాత్రం నప్పవు. వీటికి ఫంకీ జువెల్లరీ... అదీ ఒక నగ మాత్రమే ధరించాలి. లేదా స్టైలిష్ ముత్యాలు వేసుకోవాలి. సన్నటి సింగిల్ లైన్ నెక్లెస్‌లు కూడా బాగుంటాయి. పట్టుచీర ధరించినప్పుడు బంగారు ఆభరణాలు, కెంపులు, పచ్చలు బాగుంటాయి. పట్టుచీరలో గోల్డ్, సిల్వర్ థ్రెడ్ డిజైన్స్ ఉంటాయి. ఆ గోల్డ్ డిజైన్‌కి ఈ గోల్డ్ జువెల్రీ బాగా సూటవుతుంది. అందుకే ముందు ఏ తరహా చీర కట్టుకుంటున్నామో దృష్టిలో పెట్టుకొని, దానికి తగిన ఆభరణాన్ని ఎంపిక చేసుకోవాలి. రంగులకు తగిన ఆభరణం: ఎంపిక లేదు, ఆభరణాలు తక్కువ ఉన్నాయి అనుకుంటే ఒకే ఒక్క నగ ధరించవచ్చు. అది కూడా సరైనది లేదు అనుకుంటే చీరకు సరిగ్గా మ్యాచ్ అయ్యే పెద్ద పెద్ద జూకాలు, హ్యాంగింగ్స్ పెట్టుకుంటే చాలు. అంతే కాని రాంగ్ జువెల్లరీ వేసుకోకూడదు. బ్లౌజ్‌కు తగినవిధంగా...!: హైనెక్ బ్లౌజ్ వేసుకుంటే మెడను పట్టి ఉంచే నెక్లెస్ అసలు పెట్టుకోకూడదు. హారం మాత్రమే వేసుకోవాలి. డీప్ నెక్ బ్లౌజ్ ధరిస్తే నెక్లెస్ బాగుంటుంది. ఒక్క నగే సరైన ఎంపిక: ఎప్పుడైనా రెండు మూడు నగలు వేసుకుంటే అవి ఎంత అందంగా ఉన్నా ఆకర్షణీయంగా కనిపించరు. పెళ్లిళ్లకు రెండు మూడు హారాలు వేసుకోవచ్చు. అయితే అవి కూడా మ్యాచింగ్ ఆభరణాలై ఉండాలి. ఒక హారాన్ని పోలిన డిజైన్, స్టోన్స్ వంటివి రెండు, మూడవ హారాలలోనూ కనిపించాలి. అప్పుడే బాగుంటాయి. పెళ్ళిళ్లకు తయారయ్యేవారు కొంతమంది అతిగా నగలు పెట్టుకుంటారు. చెవులకు, చేతులకు. నడుముకు, మెడలోనూ, శిరోజాలకు.. ఇలా అన్ని భాగాలనూ ఆభరణాలతో అలంకరిస్తే బాగానే ఉంటుంది. అలా కాకుండా ఏదో ఒక పార్ట్‌ని మాత్రమే ఎక్కువగా నగలతో అలంకరిస్తే కళ తప్పుతుంది. ఎక్కువ ఆభరణాలను అలంకరించుకోలేని వారు ఒక్క నగతో సరిపెట్టుకుంటే మంచిది. మిగతా ఏ సందర్భంలోనైనా ఒక్క నగే బాగుంటుంది. ఉన్నాయి కదా అని రెండు, మూడు హారాలు వేసుకోవడం వల్ల కట్టుకున్న చీర, మేకప్, శిరోజాల అలంకరణ మీద కన్నా ఎదుటివారి దృష్టి ముందుగా నగలమీదకు వెళుతుంది. దీంతో అందంగా కనిపించరు. మ్యాచింగ్ క్యాచింగ్...: ఎంపిక చేసుకున్న చీర, కేశాలంకరణ, శారీరక సౌష్టవం, ఆభరణం,... మొత్తం అందంగా కనిపించాలంటే కట్టుకున్న చీరకు ఆభరణం మ్యాచ్ అయి ఉండాలి. కొంతమంది మంగళసూత్రాలు, నల్లపూసలు, నెక్లెస్ అన్నీ ఓపిగ్గా ధరిస్తారు కానీ. సరైన పాదరక్షలు తొడుక్కోరు. అంతెందుకు... రోజూ వేసుకునే కేశాలంకరణే వేడుకలోనూ ఉంటుంది. ఒక్క నగలు మాత్రమే ప్రత్యేకంగా కనిపిస్తాయి. అందుకే ఎదుటివారి దృష్టి నగలమీదకే వెళుతుంది. మనకు ఉన్న నగలు మాత్రమే అందంగా కనిపించాలంటే ఆభరణాలు ఎన్ని రకాలైనా ధరించవచ్చు. మనం అందంగా కనిపించాలంటే ఆభరణాల ఎంపిక, ధరించడంలో కనీస జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. 1- షిఫాన్, జార్జెట్.. చీరలు ధరించినప్పుడు సంప్రదాయ ఆభరణాలు నప్పవు. ఫంకీ, స్టైలిష్ ముత్యాల ఆభరణాలు ధరిస్తే బాగా కనిపిస్తారు. 2- రెండు, మూడు హారాలు ధరించడం,చీరకు సూటవని ఆభరణాల వల్ల అందం దెబ్బతింటుంది. 3- అంచు ఉన్న షిఫాన్ చీరలు కట్టినప్పుడు ఒక నగను మాత్రమే, ధరించాలి. కేశాలంకరణ పైన దృష్టిపెట్టాలి. 4- ఒకేసారి పూసలు, నల్లపూసలు, ఫంకీ జువెల్రీ ధరించడం అంటే అలంకరణను మనమే పాడుచేసుకున్నట్టు. చీర రంగులోని ఏదో ఒక రంగును ప్రతిబింబించే నగను ఒకటే ధరిస్తే లుక్ అధునాతనంగా కనిపిస్తోంది. 5- వంగపండు రంగు జార్జెట్ చీరకు గోల్డ్ బార్డర్ ఉంది. ఆభరణాలను కూడా అదేవిధంగా జత చేయాలి. గోల్డ్ కలర్లో ఉన్న స్టైలిష్ ఆభరణాన్ని ధరిస్తే మోడ్రన్ లుక్‌లో కనిపిస్తారు. ఇలాగే ప్రతి చీరకు ఎంపికలో ప్రత్యేకత ఉండాలి. మోడల్స్: కావ్య, ప్రియాంజలి ఫొటోలు: శివ మల్లాల కర్టెసీ: మంగారెడ్డి ఫ్యాషన్ డిజైనర్ www.mangareddy@gmail.com -
పాత వస్త్రాలే పెళ్ళికానుక
సంస్కృతి పెళ్లి పేరు చెప్పగానే ముందుగా తలపుకొచ్చేవి కట్నకానుకలు. ఇక్కడ భారీ అలంకరణతో కనిపిస్తున్న గిరిజన మహిళను చూశారుగా...ఆమె పెళ్లికి ఆమెకిచ్చిన కట్నం ఆ అలంకరణ మాత్రమే. అవును... ఆ అలంకరణనకు ఉన్న ప్రత్యేకత అలాంటిది. వందల సంవత్సరాల నుంచి వారసత్వంగా వస్తున్న ఆ వస్తువులే అక్కడి అమ్మాయిలకిచ్చే ఆస్తిపాస్తులు. అలంకరణ వస్తువులొక్కటే కాదు వస్త్రాలు కూడా వారసత్వంగా వస్తాయి. పెళ్లనగానే కొత్త బట్టలు, కొత్త వస్తువులు ఉంటాయని తెలుసు మనకి. కాని ‘డ్రోక్పా’ తెగ గిరిజనులు మాత్రం దీనికి భిన్నంగా ఏళ్లనాటి పాతవస్త్రాలకు, వస్తువులకే ప్రాధాన్యం ఇస్తారు. భారత్- పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం జమ్మూ కాశ్మీర్ దగ్గర ధహను లోయల్లో నివసించే ‘డ్రోక్పా’ తెగకు చెందిన గిరిజనులు పాటించే సంప్రదాయమిది. ఆ లోయలో ఉన్న మూడు గ్రామాల్లో 2,500మంది డ్రోక్పా తెగవారు ఇప్పటికీ వారి సంప్రదాయాలను తు.చ తప్పకుండా పాటిస్తున్నారు. తమ సొంత తెగవారిని మాత్రమే పెళ్లాడే ఈ గిరిజనులు పెళ్లప్పుడు పెళ్లికూతురుని తయారుచేయడమొక్కటే పెద్దపనిగా భావిస్తారు. ఒంటినిండా రకరకాల ఆభరణాలతో అమ్మాయిని అలంకరిస్తారు. రెండు మూడు వందల ఏళ్లనాటి అలంకరణ వస్తువులు వారి దగ్గర భద్రంగా ఉంటాయట! వాటితో నిండుగా పెళ్లికూతురికి అలంకరణ చేశాక తలపై ప్రత్యేకమైన పూలముస్తాబు చేస్తారు. అడవి మొత్తం తిరిగి ప్రత్యేకంగా ఉండే పూలను సేకరించి పెళ్లికూతురు, పెళ్లికొడుకు తలపై పూలగుత్తులు విరబూసినట్టు అలంకరిస్తారు. ఆ సమయంలో మిగతావారి ముస్తాబు కూడా భారీగా ఉంటుంది. ఈ తెగకున్న మరో ప్రత్యేకత... వీరి పూర్వీకులు కొందరు అలెగ్జ్జాండర్ సైన్యంలో పనిచేశారట. ఇప్పటికీ ఈ విషయాన్ని వారు ఎంతో గొప్పగా చెప్పుకుంటారు.