భోపాల్: దేశంలో టమాటా ధరలు మిన్నంటాయి. సామాన్యుడు కొనలేనంత భారంగా మారాయి. కానీ మధ్యప్రదేశ్‌లో ఓ సెల్‌ఫోన్ షాప్ ఓనర్ ఈ అవకాశాన్ని సరైన విధంగా వాడుకుంటున్నాడు. ఇటు ప్రజలకు మేలు చేస్తున్నట్లు.. అటు తన బిజినెస్‌ను అభివృద్ధి చేసుకుంటున్నాడు. అదేంటంటే.. తన వద్ద స‍్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే రెండు కేజీల టమాటాలను ఉచితంగా ఇస్తాననే ఆఫర్ పెట్టాడు. దీంతో మొబైల్ కొనుగోలుదారులు ఇటువైపే మొగ్గుచూపుతున్నారు.
మధ్యప్రదేశ్‌లోని అశోక్ నగర్‌లో ఆయన పేరు అభిషేక్.. తన పేరు మీదుగానే ఓ ఎలక్ట్రానిక్ దుకాణాన్ని నడిపిస్తున్నాడు. కొంత కాలంగా గిరాకీ సరిగా లేదని గ్రహించిన అభిషేక్.. ఎలాగైన వినియోగదారులను ఆకర్షించాలని అనుకున్నాడు. ఇప్పడే టమాటా ధరలు పెరిగిపోగా.. దీన్నే తన వ్యాపార సాధనంగా మార్చుకున్నాడు. కేజీ రూ.160-180 వరకు మార్కెట్‌లో ధర పలుకుతున్న నేపథ్యంలో ఏదైనా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే రెండు కేజీల టమాటాలు ఫ‍్రీగా ఇస్తానని ఆఫర్ పెట్టాడు. ఒక సెల్‌ఫోన్ మీద 300 పైనే డిస్కౌంట్ వచ్చిన అభిప్రాయం వినియోగదారునికీ కలుగుతుందని చెబుతున్నాడు.
దీంతో ఇన్నాళ్లు దీవాలా తీసిన వ్యాపారం ఒక్కసారిగా ఊపందుకుందని అభిషేక్ అంటున్నాడు. సెల్ ఫోన్ కొనుగోలుదారులు అభిషేక్ షాప్‌లో కొనుగోలు చేస్తున్నారు. టమాటా పేరుతో తన షాప్ అడ్వర్టైజ్‌మెంట్ కూడా ఉచితంగా అవుతుందని అభిషేక్ చెబుతున్నాడు. అటు.. దేశంలో టమాటా రేట్లపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇదీ చదవండి: టేకాఫ్ కష్టమని 19 మంది ప్రయాణికులను దింపేసిన విమాన సిబ్బంది
Comments
Please login to add a commentAdd a comment