schemes
-
లాభాల తీరం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన
పీఎమ్ఎస్సెస్వై (ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన) కిందకు వచ్చే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని 2020లో ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ స్కీమ్ ద్వారా ఎలాంటి పూచీకత్తు లేకుండా చేపలపెంపకందారులకు ఏడు శాతం వడ్డీతో రెండు లక్షల రూపాయాల వరకు రుణాన్ని అందిస్తున్నారు. చేపలు, రొయ్యల పెంపకంపై ఉచిత శిక్షణనూ అందిస్తున్నారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన మహిళలకు 60 శాతం వరకు గ్రాంట్ అందుతోంది. ఈ పథకం తీర్రప్రాంతంలోని చిన్న, సన్నకారు రైతులకు లాభాల పంట పండిస్తోంది. చేపల ఎగుమతిలో భారతదేశాన్ని ముందంజలో నడిపిస్తోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఫిషరీస్, మత్స్యకారుల సంక్షేమశాఖ సహాయసంచాలకుల కార్యాలయంలో మరిన్ని వివరాలను పొదవచ్చు. జిల్లా మత్స్యశాఖ లేదా ఏదైనా హేచరీ నుంచి ఉచితంగా చేప సీడ్‌ను పొందవచ్చు. ఈ పథకానికి అధికారిక వెబ్సైట్ https://pmmsy.dof.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్ హోమ్ పేజీలో స్కీమ్ లింక్‌పై క్లిక్ చేయాలి. నింపాల్సిన ఫామ్ కనిపిస్తుంది. అందులోని వివరాలను పూరించాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా, భూమి వివరాలనూ పొందుపరచాలి. డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సహా సూచించిన పత్రాలను అప్లోడ్ చేయాలి. తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేసి.. ఫామ్‌ను సమర్పించాలి. దరఖాస్తుదారు అర్హతలు, సంబంధిత పత్రాలను ఆమోదించిన తరువాత పథకం ప్రయోజనాలను పొందవచ్చు. తీర్రప్రాంతం లేని చోటా మత్స్య సంపదను అభివృద్ధి చేసేందుకు ఈ పథకం రుణాన్ని అందిస్తోంది. కమర్షియల్ ఆక్వా కల్చర్ సిస్టమ్ కింద ఈ ప్రాజెక్ట్ విలువ రూ. 20 లక్షలు అయితే రూ. 5 లక్షల వరకు సొంత పెట్టుబడి ఉండాలి. అప్పుడు రూ. 15 లక్షల రుణాన్ని పొందవచ్చు. ఇందులో సబ్సిడీ ఉంటుంది. (చదవండి: Earth Hour: "'స్విచ్ ఆఫ్": ఆ ఒక్క గంగ ప్రకృతితో కనెక్ట్ అవుదామా..!) -
మాది స్కీమ్.. మీది స్కామ్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశ పెడితే, వాటిని స్కాములుగా చిత్రీకరించేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తోందని శాసన మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు మండిపడ్డారు. స్కాములన్నీ చేసింది టీడీపీ ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. ధైర్యం ఉంటే 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై వేసిన సిట్ నివేదికలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. గురువారం శాసనన మండలిలో ‘2019–24 మధ్య జరిగిన కుంభకోణాలు’పై లఘు చర్చ జరిగింది. టీడీపీ సభ్యురాలు అనురాధ చర్చను ప్రారంభిస్తూ గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో విపక్ష సభ్యులు అడ్డుపడి.. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే విచారణ చేసి, మాట్లాడాలని అనడంతో ఆమె నీళ్లు నమిలారు. విశాఖలో విజయసాయిరెడ్డి బినామీ పేర్లతో భూములు కొన్నారని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూములను ఆక్రమించారంటూ ఆమె విమర్శలకు దిగారు. సభలో లేని వ్యక్తుల పేర్లు ఎలా ప్రస్తావిస్తారంటూ వైఎస్సార్సీపీ సభ్యులు అరుణ్‌కుమార్, రమేష్‌యాదవ్ మండిపడ్డారు. అవి ఆక్రమించిన భూమలు కాదని స్థానిక కలెక్టర్లు నివేదిక కూడా ఇచ్చారని స్పష్టం చేశారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది.. వైఎస్సార్సీపీ సభ్యుడు కుంభా రవిబాబు మాట్లాడుతూ.. కుంభకోణాలపై టీడీపీ మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని అన్నారు. ఆనాడు ఓటుకు కోట్లు కుంభకోణంలో చిక్కుకుని రాత్రికి రాత్రే సర్దుకుని విజయవాడకు వచ్చేశారని చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అప్పటి నుంచి ఏపీలో స్కాములపర్వం మొదలెట్టి, రాష్ట్రాన్ని అవినీతిలో నంబర్ 1గా నిలబెట్టారని మండిపడ్డారు. రాజధాని పేరుతో అంతర్జాతీయ స్థాయిలో రియల్ ఎస్టేట్ స్కామ్ చేశారని దుయ్యబట్టారు. నైపుణ్యాభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని దోచేసిన కేసులో చంద్రబాబును న్యాయస్థానం జైల్లో పెట్టిందన్నారు. విచారణకు సహకరించకుండా ఆయన పీఏను దేశాలు దాటించేశారని ఎద్దేవా చేశారు. రాజధాని ప్రకటనకంటే ముందే టీడీపీ నాయకులు బినామీ పేర్లతో దళితులు, నిరుపేదల అసైన్డ్ భూములను చౌకగా కొట్టేశారన్నారు.హెరిటేజ్ పేరిట కూడా 14 ఎకరాలు కొన్నారన్నారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని 2019 ఎన్నికల్లో ప్రధాని మోదీనే చెప్పారని అన్నారు. రూ.150 కోట్లు కూడా ఖర్చవ్వని తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలకు రూ.1,115 కోట్లు వెచ్చి0చారంటే ఎంత అవినీతి జరిగిందో స్పష్టమవుతోందని అన్నారు. 23 సీట్లకు ఎందుకు పడిపోయింది? రాజధానిలో అవినీతికి పాల్పడకపోతే 2019 ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకు ఎందుకు పడిపోయిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ప్రశ్ని0చారు. పోర్టులు, స్కిల్ కాలేజీలు, వర్సిటీల నిర్మాణం, భారీగా కంపెనీలను తేవడం స్కాములు ఎలా అవుతాయని అన్నారు. 2019–24 మధ్య కుంభకోణాలపై చర్చకు నోటిసిస్తే పాతవన్నీ తోడటం సరికాదంటూ మంత్రి అచ్చెన్నాయుడు అడ్డుపడ్డారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు క్లీన్చిట్ ఇచ్చేసినట్టు చెప్పుకొచ్చారు. దీనిపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. అధికారపక్ష సభ్యులు పేపర్ల కథనాలు చూపించి కుంభకోణాలు అంటున్నారని, ఒక్క దానిపైనైనా రుజువులు చూపారా అని నిలదీశారు. విశాఖ భూములపై సిట్ నివేదిక బయటపెట్టండిటీడీపీ ప్రభుత్వం 2016లో విశాఖ భూములపై వేసిన సిట్ నివేదికను బయట పెట్టాలని బొత్స డిమాండ్ చేశారు. అందులోని వ్యక్తులు ఎవరైనా రాజకీయాలకు అతీతంగా శిక్షించాలని అన్నారు. అందులో విలువైన దసపల్లా భూములున్నాయని, ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని అధికారపక్షాన్ని నిలదీశారు. గత ప్రభుత్వాధినేత భూ బకాసురుడిగా మారి అనుయాయులతో కలిపి దోపిడీ చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అనడంతో బొత్స తీవ్రంగా స్పందించారు. ఇలాంటి దుష్ట సంప్రదాయాన్ని ప్రదర్శిస్తున్న సభలో ఉండలేం అంటూ వాకౌట్ చేశారు. ఆధారాల్లేకుండా బురదజల్లుడా? మండలిలో ఇవాళ జరిగిన ప్రశ్నోత్తరాల్లోగానీ, స్వల్పకాలిక చర్చలోగానీ ప్రభుత్వం నుంచి నిర్దిష్ట సమాధానాలు రాలేదని బొత్స చెప్పారు. మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ మీద, తమ నాయకుడి మీద ఆధారాల్లేకుండా ఆరోపణలు చేసినందునే సభ నుంచి వాకౌట్ చేశామన్నారు. మేము భారత్‌లో అడుగుపెట్టిన తర్వాత బీహార్‌లో వ్యాపారం చేయాలంటే దుర్భర పరిస్థితులు ఉంటాయని వినిపించింది. అన్ని విమానాశ్రయాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నంబర్ 1 అని చూశాం. కానీ, ఐదేళ్లలో మాకు బీహార్ చక్కటి ప్రణాళిక, సుపరిపాలనతో దూసుకెళ్తుండగా, ఏపీ పూర్తి అయోమయంగా, అవగాహన లేకుండా ఉంది. ఏపీలో అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా మాకు వచ్చిన రాజధాని డిజైన్ ప్రతిపాదనలను విరమించుకుని బయటకు వెళ్లిపోయాం.. –జపాన్ ఆర్కిటెక్చర్ సంస్థ సీఈవో వారి మేగజైన్లో ఏప్రిల్ 2017 సంచికలో రాసిన వ్యాసంలో చెప్పిన ఈ వివరాలను మండలిలో వైఎస్సార్సీపీ సభ్యుడు కుంభా రవిబాబు ప్రస్తావించారు. -
ఆదాయం పెరిగితేనే పథకాలు నడపగలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రతినెలా రూ.22 వేల కోట్ల ఆదాయం అవసరమని, అంత ఉంటేనే సంక్షేమ పథకాలను ఓ మోస్తరుగా నడపగలమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇప్పుడొస్తున్న ఆదాయంలో ఉద్యోగుల వేతనాలు, అప్పులకే రూ.13 వేల కోట్లు పోతున్నాయన్నారు. ఆర్థిక పరిస్థితి క్యాన్సర్‌లా మారిందని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఏం చేయాలో ఉద్యోగులు చెప్పాలని కోరారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన 1,292 మంది జూనియర్ కాలేజీ లెక్చరర్లు, 400 మంది పాలిటెక్నిక్ కాలేజీ అధ్యాపకులకు బుధవారం రవీంద్రభారతి వేదికగా ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రభుత్వం రొటేషన్ మాత్రమే చేస్తోంది.. ‘ప్రభుత్వానికి ప్రతి నెలా రూ.18 వేల కోట్ల నుంచి రూ.18,500 కోట్ల ఆదాయం వస్తోంది. ఇందులో రూ.6,500 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లించాల్సి వస్తోంది. రూ.6,500 కోట్లు అప్పులు తిరిగి చెల్లించేందుకు కడుతున్నాం. మిగిలిన రూ.5 వేల కోట్ల నుంచి రూ.5.5 వేల కోట్లల్లోనే 25 నుంచి 30 సంక్షేమ పథకాలకు చెల్లించాలి. ఏ ప్రాజెక్టులు కట్టాలన్నా, ఏ అభివృద్ధి చేయాలన్నా ఈ నిధులే వాడుకోవాలి. ఈ ఇబ్బంది ఉంది కాబట్టే ఒక్కో నెలలో ఒక్కో పథకానికి చెల్లింపు పెండింగ్‌లో పెడుతున్నాం. మా ప్రభుత్వం రొటేషన్ చేసే పని మాత్రమే చేస్తోంది. గత సీఎం క్యాన్సర్ ఇచ్చిపోయాడు గత ముఖ్యమంత్రి రాష్ట్రానికి క్యాన్సర్ ఇచ్చి పోయాడు. దీన్ని నయం చేసే ప్రయత్నం చేస్తుంటే పది నెలలకే దిగిపొమ్మంటున్నారు. తల తాకట్టు పెట్టి ఉద్యోగులకు ప్రతి నెలా మొదటి రోజు వేతనాలు ఇస్తున్నాం. ఉద్యోగులు విపక్షాల మాటలకు ప్రభావితం కావొద్దు. స్టేచర్ ఉందనుకునే నాయకులు స్ట్రెచ్చర్ మీదకు వెళ్ళారు. అక్కడి నుంచి మార్చురీకి కూడా నేను ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకెళ్లను. నా కాళ్లు, చేతులు బాగానే ఉన్నాయి. పనిచేసి జీవిస్తా..’అని సీఎం అన్నారు. అధ్యాపకులు భవిష్యత్తుకు బాటలు వేయాలి ‘ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందుకున్న వారిలో భావోద్వేగం కన్పిస్తోంది. పరీక్షలు రాసి 12 ఏళ్ళు నిరీక్షించారు. గత ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేమి కాలయాపనకు కారణం. న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడంపై నేను ప్రత్యేక శ్రద్ధ చూపా. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 57,946 ప్రభుత్వ నియామకాలు చేపట్టాం. దేశ చరిత్రలోనే ఇది ఎక్కడా లేదు. గత పాలకుల ఉద్యోగాలు తీసి వేయడం వల్లే ఇన్ని ఉద్యోగాలొచ్చాయి. తెలంగాణ భవిష్యత్‌కు అధ్యాపకులు బాటలు వేయాలి. అంకిత భావంతో పనిచేయాలి. ఒక్కో విద్యార్థికి ఏటా రూ.80 వేలు ఖర్చు చేస్తున్నాం.. రాష్ట్ర విద్యారంగంలో ప్రమాణాలు పడిపోతున్నాయి. ప్రభు త్వ స్కూళ్ళల్లో ప్రవేశాలు ప్రతి ఏటా తగ్గుతున్నాయి. ఒక్కో విద్యార్థికి ఏటా రూ.80 వేలకు పైగా ఖర్చు చేస్తున్నాం. విద్యార్థులు ఎక్కువగా ప్రైవేటు స్కూళ్ళల్లో ఎందుకు చేరుతున్నారో క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. నిజానికి ప్రైవేటు కన్నా ప్రభుత్వ స్కూళ్ళలోనే నాణ్యమైన టీచర్లు ఉన్నారు. అయినా ప్రజలు ఎందుకు నమ్మడం లేదు? సర్కారీ స్కూళ్ళల్లో పోటీ తత్వం పెరగాలి. ఇందుకు తగ్గ ప్రణాళికలు రూపొందిస్తాం..’అని రేవంత్ చెప్పారు. ఇంజనీరింగ్‌లో నాణ్యత ఉండటం లేదు..‘రాష్ట్రంలో ఏటా 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారు. ఇందులో 10 శాతం మందికి కూడా ఉద్యోగాలు రావడం లేదు. ప్రతి ఒక్కరూ కంప్యూటర్ కోర్సు కోసం ఆరాటపడుతున్నా, వారికి బేసిక్స్ కూడా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో విద్యతో పాటు నైపుణ్యం పెంచడమే లక్ష్యంగా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. క్రీడా రంగంలో వెనుకబాటును అధిగమించడమే లక్ష్యంగా క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు చేశాం..’అని సీఎం వివరించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, సీఎస్ శాంతికుమారి, ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన, పాఠశాల విద్య డైరెక్టర్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
న్యూఢిల్లీ: వందరోజుల కార్యాచరణకు బీజేపీ కసరత్తు
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ త్వరలో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది. అయితే ఇంతలోనే అధిష్టానం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని వివిధ విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. వికసిత్ ఢిల్లీ, ఆయుష్మాన్ భారత్ లాంటి కేంద్ర పథకాల అమలుకు, మురుగునీటి పారుదల, నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రధాన కార్యదర్శి అన్ని శాఖలను కోరారు.ఏదైనా ప్రాజెక్టు లేదా పథకాన్ని మంత్రి మండలికి సమర్పించాలనుకుంటే ముందుగా ఆ శాఖ ముసాయిదా క్యాబినెట్ నోట్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇదేవిధంగా ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స అందించే ఆయుష్మాన్ భారత్ పథకం అమలుపై క్యాబినెట్ నోట్ తయారు చేయాలని ఆరోగ్య శాఖను బీజేపీ అధిష్టానం కోరింది. బీజేపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రారంభించే పథకాలు లేదా ప్రాజెక్టుల కోసం క్యాబినెట్ ముసాయిదా నోట్లను సిద్ధం చేయాలని బీజేపీ అన్ని విభాగాల అధిపతులను ఆదేశించింది. ఢిల్లీ ప్రభుత్వ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (జీఏడీ) 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, కొత్త ప్రభుత్వానికి అందజేస్తుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు.గత ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఢిల్లీలో అమలు చేయని ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయడానికి క్యాబినెట్ నోట్ సిద్ధం చేయాలని ఆరోగ్య శాఖను బీజేపీ కోరింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేస్తామని బీజేపీ అగ్ర నేతలు హామీనిచ్చారు. దేశ రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో మురుగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాలను ప్రధాన కార్యదర్శి కోరారు.ఇది కూడా చదవండి: మళ్లీ పాక్ సరిహద్దు ఉల్లంఘన.. బుద్ధి చెప్పిన భారత్ -
కూటమి పాలనలో సమీక్షలు తప్ప క్షేత్రస్థాయిలో హామీలు అమలవడం లేదు
-
మా హయాంలో రూ.17 వేల కోట్లు అప్పుల భారం తగ్గించాం
-
కూటమి ప్రభుత్వంలో విద్యార్ధులకు తీవ్ర ఇబ్బందులు
-
ప్రజలను చంద్రబాబు నిలువునా ముంచారు: ఆదిమూలపు సురేష్
-
ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి భారీస్థాయిలో పెట్టుబడులు ప్రవహించాయి. గత క్యాలండర్ ఏడాది(2024)లో రూ. 3.94 లక్షల కోట్ల నిధులు లభించాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇవి రెట్టింపుకాగా.. ఇది మార్కెట్లపట్ల ఇన్వెస్టర్లలో పెరిగిన విశ్వాసాన్ని, దీర్ఘకాలిక పెట్టుబడులపట్ల ఆసక్తిని ప్రతిబింబిస్తోంది. ప్రధానంగా ఇందుకు క్రమానుగత పెట్టుబడి పథకాలు(సిప్‌లు) ఉపయోగపడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే కొత్త ఏడాది(2025)లో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించే వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. 2024 డిసెంబర్ ప్రారంభం నుంచి మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) పరిశ్రమలో పెట్టుబడులు తగ్గడం ప్రారంభమైనట్లు జెరి్మనేట్ ఇన్వెస్టర్ సరీ్వసెస్ సీఈవో, సహవ్యవస్థాపకుడు సంతోష్ జోసెఫ్ పేర్కొన్నారు. ఇందుకు స్టాక్ మార్కెట్ల ఆటుపోట్లు కారణమైనట్లు తెలియజేశారు. చరిత్ర ప్రకారం మార్కెట్ల ఆధారంగానే ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు ప్రవహిస్తుంటాయని వివరించారు. మార్కెట్ల ఒడిదుడుకులు ఇన్వెస్టర్లపై ప్రభావం చూపుతుంటాయని అందువల్ల ప్రస్తుత హెచ్చుతగ్గుల కారణంగా 2025లో కొత్త ఫండ్ ఆఫర్లు(ఎన్‌ఎఫ్‌వోలు), ఈక్విటీ ఫండ్ల నిధుల సమీకరణ తగ్గే అవకాశముందని అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు కొనసాగవచ్చు పరిస్థితులు సర్దుకున్నాక పెట్టుబడులపై లబ్ది చేకూరే వీలుండటంతో దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు పెట్టుబడులను కొనసాగించే వీలున్నదని సంతోష్ తెలియజేశారు. గతేడాది మొత్తం ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పథకాలకు రూ. 3.94 లక్షల కోట్లు లభించినట్లు మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్(యాంఫీ) వెల్లడించింది. 2023లో రూ. 1.61 లక్షల కోట్ల పెట్టుబడులు మాత్రమే అందుకున్నట్లు తెలియజేసింది. కాగా.. గతేడాది భారీ పెట్టుబడుల నేపథ్యంలో ఎంఎఫ్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 40 శాతం ఎగశాయి. దీంతో 2024 డిసెంబర్‌కల్లా రూ. 30.57 లక్షల కోట్లకు ఏయూఎం చేరింది. 2023లో రూ. 21.8 లక్షల కోట్లుగా నమోదైంది. మార్కెట్లు నిలకడగా బలపడటం, ఆరి్ధక అవగాహన మెరుగుపడటం, ఇన్వెస్టర్లు సిప్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు 2024లో ఈక్విటీ ఫండ్ల ఉత్తమ పనితీరుకు తోడ్పాటునిచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీ పెట్టుబడులపై అవగాహన పెంచుకోవడం ద్వారా సంపద వృద్ధికి వీలు దోహదపడినట్లు బజాజ్ ఫిన్సర్వ్ ఏఎంసీ సీఈవో గణేశ్ మోహన్ పేర్కొన్నారు. మార్కెట్లు నిలకడగా బలపడటం, పెట్టుబడుల్లో డిజిటైజేషన్‌తో ఈక్విటీ ఎంఎఫ్‌లు పెట్టుబడులను ఆకట్టుకున్నట్లు తెలియజేశారు. థిమాటిక్ ఫండ్స్ స్పీడ్ గతేడాది ఈక్విటీ పథకాలలో థిమాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ. 1.55 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్ రూ. 32,465 కోట్లు, రూ. 34,223 కోట్లు చొప్పున అందుకున్నాయి. లార్జ్ క్యాప్ ఫండ్స్‌లోకి రూ. 19,415 కోట్లు ప్రవహించాయి. పెట్టుబడుల్లో రూ. 2.5 లక్షల కోట్లతో సిప్‌లు ప్రధాన పాత్ర పోషించాయి. -
ఎన్నికల ముందు పథకాల డ్రామా
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: స్థానికసంస్థల ఎన్నికలు వస్తుండటంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పథకాల డ్రామా ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు మండిపడ్డారు. ఆ ఎన్నికలు పూర్తయితే రైతుభరోసా బంద్ అవుతుందన్నారు. మంగళవారం నల్లగొండ గడియారం సెంటర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎన్జీ కాలేజీ నుంచి గడియారం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడే నిర్వహించిన మహాధర్నాలో కేటీఆర్ ప్రసంగించారు. మేం నాట్లకు ముందు.. కాంగ్రెస్ ఓట్లకు ముందు‘రేవంత్‌కు.. ఎన్నికలప్పుడే పథకాలు గుర్తుకొస్తా యి. అవి పూర్తయితే పట్టించుకోరు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తుండటంతో ఓట్ల కోసం కొత్త డ్రామా అడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో నాట్లకు ముందు రైతుబంధు ఇచ్చాం. కానీ రేవంత్ ప్రభుత్వం రైతుభరోసా డ్రామా ఆడుతోంది’అని కేటీఆర్ దుయ్యబట్టారు. ఒక్క హామీనీ పూర్తిగా అమలు చేయలేదు ఆరు గ్యారంటీల పేరుతో మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని కేటీఆర్ విమర్శించారు. రూ. 2 లక్షల మేర రైతు రుణాలను డిసెంబర్ 9న మాఫీ చేస్తానని ప్రకటించి మోసం చేశారని ఆరోపించారు.ఏ ఊళ్లోనూ 100 శాతం రుణమాఫీ చేయలేదని.. యాసంగి రైతు భరోసా సైతం ఇవ్వలేదన్నారు. ఎన్నికల ముందు కేసీఆర్ రైతుబంధు ఇస్తానంటే రేవంత్‌రెడ్డి ఎన్నికల సంఘానికి లేఖ రాసి ఆపించారని కేటీఆర్ విమర్శించారు. వానాకాలం రైతు భరోసాను ఎగ్గొట్టారని, ఇప్పటివరకు ఒక్కో ఎకరానికి రూ.17,500 రేవంత్‌రెడ్డి బాకీ పడ్డారన్నారు. మోసం చేయడంలోనూ చరిత్రాత్మకమే బీఆర్ఎస్ రూ.12 వేలు రైతుబంధు ఇస్తానంటే, తాను రూ.15 వేలు ఇస్తానని చెప్పి రేవంత్‌రెడ్డి ప్రజలను మభ్య పెట్టారని కేటీఆర్ విమర్శించారు. ఓట్లు వేయించుకొని గెలిచాక సిగ్గులేకుండా రూ.12 వేలకు కుదించారన్నారు. ప్రజలను మోసం చేయడంలోనూ కాంగ్రెస్‌ది చరిత్రాత్మకమేనని ఎద్దేవా చేశారు. ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తానని చెప్పి, చివరకు సన్నాలకే ఇస్తానని మెలిక పెట్టి మోసం చేశారన్నారు. . కేసీఆర్ హయాంలో 11 విడతలుగా రైతుబంధు కింద రూ.73 వేల కోట్లు రైతుల అకౌంట్లలో వేశారని గుర్తు చేశారు. రైతులు తిరగబడాలి: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై తిరగబడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యార్థులు, రైతు లు, చేనేత కారి్మకులు చనిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతుబంధు, రైతుభరోసా, రుణమాఫీ విషయంలో ప్రజలు తిరుగబడాలని, నల్లగొండ నుంచే పోరుబాట పట్టాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు అండగా ఉండేందుకే..: జగదీశ్‌రెడ్డి రైతులను మోసం చేస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ అన్యాయంపై పోరాడేందుకు బీఆర్ఎస్ ముందుంటుందన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి చేస్తున్న మోసాన్ని ప్రజలకు చెప్పేందుకే కేటీఆర్ నల్లగొండ వచ్చారన్నారు. ప్రశ్నిస్తున్న రైతులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందన్నారు.పలువురు నేతల ఫోన్లు, గొలుసులు చోరీ నల్లగొండలో కేటీఆర్ పాల్గొన్న రైతు మహాధర్నాలో దొంగలు రెచ్చిపోయారు. ఎన్జీ కాలేజీ నుంచి బీఆర్ఎస్ నేతలు చేపట్టిన ర్యాలీలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, స్థానిక నేత హమీద్ సెల్ఫోన్లతోపాటు ఆరుగురు నేతల నుంచి సుమారు 11 తులాల బంగారు గొలుసులు కొట్టేశారు. దొంగల ముఠాలోని ఒకరిని టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆరోగ్యశ్రీ అంటే వై.ఎస్..రైతుబంధు అంటే కేసీఆర్ ఆరోగ్యశ్రీ పథకం పేరు చెప్పగానే ప్రజలందరికీ ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకొస్తారని కేటీఆర్ చెప్పారు. అలాగే రైతుబంధు పథకం అనగానే మాజీ సీఎం కేసీఆర్ గుర్తుకొస్తారన్నారు. ఈ పథకాలను ఎవరూ చెరపలేరన్నారు. కానీ రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని పదేపదే చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి రైతుబంధు పథకాన్ని బంద్ చేయాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. సామాన్యులకు రేషన్‌కార్డు కావాలన్నా, రైతుబంధు కావాలన్నా ప్రభుత్వం కేవలం దరఖాస్తులే తీసుకుంటోందని విమర్శించారు. -
నాలుగు పథకాలు.. ఒక్కరోజు లబ్ధిదారులు 6,15,677 మంది
సాక్షి, హైదరాబాద్: నాలుగు సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజునే 6,15,677 మందికి లబ్ధి చేకూరినట్టు ప్రభుత్వం ప్రకటించింది. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఆర్థికశాఖ రూ. 579 కోట్లు విడుదల చేసింది. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం..సోమవారం ఉదయం నుంచి రైతులు, వ్యవసాయ కూలీల ఖాతాల్లోకి ఈ నిధులు జమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 563 గ్రామీణ మండలాల్లో ఎంపిక చేసిన 563 రెవెన్యూ గ్రామాల్లో ఈ పథకాలను ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది.రైతులకు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతోపాటు రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు కొత్తగా ఆహారభద్రత కార్డులను జారీ చేసింది. ఇల్లు లేని పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం మంజూరు పత్రాలను అందించినట్టు ప్రభుత్వం తెలిపింది. పాత కార్డుల్లో అదనంగా కుటుంబసభ్యుల నమో దు ప్రక్రియను పూర్తి చేసినట్టు చెప్పింది. రైతుభరోసా 9.48 లక్షల ఎకరాలకు.. రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.569 కోట్లు విడుదల చేసింది. మొత్తం 32 జిల్లాల్లోని 563 గ్రామాల్లో 4,41,911 మంది రైతులకు ఎకరానికి తొలివిడతగా రూ.6 వేల చొప్పు న పెట్టుబడి సాయం అందింది. మొదటి రోజునే 9,48,333 ఎకరాల విస్తీర్ణంలోని భూమికి రైతు భరోసాను చెల్లించింది. 18,180 కుటుంబాలకు ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద తొలి రోజున 18,180 వేల వ్యవసాయ కూలీ కుటుంబాలకు రూ.6 వేల చొప్పున నగదు సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకానికి తొలిరోజునే ఆర్థిక శాఖ రూ.10.91 కోట్లు విడుదల చేసింది. రేషన్‌కార్డులు.. ఇందిరమ్మ ఇళ్లు రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజున 531 గ్రామాల్లో 15,414 కొత్త కార్డులు ఇచ్చింది. వీటిలో 51,912 మంది కుటుంబ సభ్యులు లబ్ధి పొందినట్లు ప్రభుత్వం తెలిపింది. పాత రేషన్‌కార్డుల్లో అదనంగా కుటుంబ సభ్యులను చేర్చాలంటూ వేలాది కార్డుదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఏళ్లకేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించింది. 1,03,674 మంది పేర్లను పాత రేషన్‌కార్డుల్లో చేర్చారు. గూడు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా తొలి రోజునే అర్హులైన 72 వేల మందికి ఇళ్ల పత్రాలను ప్రభుత్వం అందజేసింది.చరిత్రలో ప్రప్రథమం.. దేశానికే ఆదర్శం : మంత్రి సీతక్క ఏ ఆస్తి లేని కూలీలకు భరోసాగా తెలంగాణ సర్కార్ ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. చరిత్రలోనే ప్రప్రథమంగా దేశానికే ఆదర్శంగా నిలుస్తూ వ్యవసాయ కూలీలకు ఏటా రూ. 12వేల చొప్పున ఆర్థిక సాయం అందించే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. మండలంలో ఒక రెవెన్యూ గ్రామానికి : తుమ్మల రైతుభరోసా నిధులు జిల్లాలో ప్రతి మండలానికి ఒక్కో రెవెన్యూ గ్రామం చొప్పున విడుదల చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అవి సోమవారం రైతుల అకౌంట్లలో జమ అయ్యాయన్నారు. అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తామన్నారు -
కాంగ్రెస్ పార్టీ నాలుగు పథకాలపై ప్రతిపక్ష పార్టీ విమర్శనాస్త్రాలు
-
ఇవాళ అర్ధరాత్రి నుంచే ‘రైతుభరోసా’ డబ్బులు: సీఎం రేవంత్
సాక్షి,మహబూబ్‌నగర్:గతంలో కొడంగల్ నియోజకవర్గం వివక్షకు గురైంది ఇప్పుడు రాష్ట్రం మొత్తం కొడంగల్‌వైపు చూస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం చంద్రవంచలో నాలుగు కొత్త పథకాలను ఆదివారం(జనవరి26) రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.ఈ సందరర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తున్నాం. భూమికి, విత్తనానికి ఎంత సంబంధం ఉందో రైతుకు, కాంగ్రెస్‌కి అంతే అనుబంధం ఉంది. రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దే. ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రాజ్యం.వ్యవసాయం అంటే దండగ కాదు పండగ. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో 10 లక్షల లబ్ధి. 70 లక్షల మందికి రైతు భరోసా అందిస్తున్నాం. మొదటి ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలిచ్చాం. 13 నెలలుగా కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు.సర్పంచ్ ఊళ్లో లేకపోతే పదవి నుంచి దిగిపో అంటాం. మరి ప్రతిపక్షనేత సభకు రాకపోతే ఏమనాలి. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు, పదేళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌కు రేషన్ కార్డులివ్వాలనిపించలేదు.పదవి లేకున్నా నా సోదరుడు తిరుపతిరెడ్డి ప్రజాసేవ చేస్తున్నాడు..ఏ పదవి లేకున్నా నా సోదరుడు తిరుపతి రెడ్డి ప్రజా సేవ చేస్తుంటే విమర్శిస్తున్నారు. వాళ్లలా కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చి మేము దోచుకోవడం లేదు. కొడంగల్ నియోజకవర్గంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా తిరుపతిరెడ్డి అందుబాటులో ఉంటారు. పదవి ఆశించకుండా ప్రజాసేవ చేస్తుంటే వాళ్లకు కడుపు మంట వస్తోంది. అందుకే వారి కడుపు మంట తగ్గడానికి ఈనో ప్యాకెట్లు పంపుతున్నాం’అని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. -
రిపబ్లిక్ డే సందర్భంగా నాలుగు హామీలు
-
రేపు తెలంగాణలో నాలుగు పథకాలు ప్రారంభం
-
కొత్త అల్లుడికి 250 రకాల వంటకాలు పెట్టినట్టు.. జగన్ కూడా ఒకేసారి ప్రజలకి ఇచ్చాడు
-
మీ కూతురి బంగారు భవిష్యత్తు కోసం: ఇవి బెస్ట్ స్కీమ్స్..
ప్రపంచం ఎంత వేగంగా ముందుకు సాగుతున్నా.. ఆడపిల్లల విషయంలో మాత్రం ఇంకా అసమానతలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆడపిల్ల పుట్టకూడదని కోరుకునే తల్లిదండ్రులు లేకపోలేదు. చదువు, పెళ్లి ఇలాంటివన్నీ భారమనుకునేవారు నేటికీ ఉన్నారు. ఈ అసమానతలు తొలగిపోవాలి. ఆడబిడ్డలను కూడా అన్ని రంగాల్లో ఎగదనివ్వాలి. దీనిని దృష్టిలో ఉంచుకునికి, బాలికలను ప్రోత్సహించడానికి.. ప్రతి ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటారు.ఆడపిల్ల పుడితే.. భారమనుకునే ఆలోచన మారాలి. మగపిల్లలు మాత్రమే కాకుండా.. ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లోనూ తమ ముద్ర వేస్తున్నారు. కాబట్టి వారి ఎదుగుదలకు ఉపయోగపడే కొన్ని పథకాలు గురించి తల్లిదండ్రులు తప్పకుండా తెలుసుకోవాలి.సుకన్య సమృద్ధి యోజనసుకన్య సమృద్ధి యోజన (SSY) అనేది ప్రభుత్వ మద్దతుతో కూడిన పొదుపు పథకం. ఈ స్కీమ్ కింద 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. ఆడపిల్లల కోసం సంరక్షులు లేదా తల్లిదండ్రులు.. అమ్మాయి పుట్టిన తేదీ నుంచి 10 సంవత్సరాల వయస్సు వరకు మాత్రమే ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సుకన్య సమృద్ధి ఖాతాను 250 రూపాయలతో ప్రారభించవచ్చు. ఇందులో గరిష్టంగా రూ. 1.50 లక్షలు వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ స్కీమ్ ఓపెన్ చేయడానికి పోస్టాఫీస్‌ను సందర్శించి ప్రారభించవచ్చు.చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్ అనేది ఒక రకమైన మ్యూచువల్ ఫండ్. పిల్లల వివాహం, ఉన్నత విద్య మొదలైన దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గిఫ్ట్ ఫండ్లు.. డెట్ అండ్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్ల కలయికలో పెట్టే పెట్టుబడి.ఎల్ఐసీ జీవన్ తరుణ్లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. ఈ 'జీవన్ తరుణ్ స్కీమ్' అందిస్తుంది. దీనిని ప్రత్యేకంగా 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య పిల్లల విద్యకు ఆర్ధిక సహాయం అందించే లక్ష్యంతో తీసుకొచ్చారు. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తుంది. అంతే కాకుండా చదువుకునే సమయంలో విద్యా అవసరాలకు చెల్లింపులు అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా మెచ్యూరిటీ సమయంలో మొత్తం కవరేజ్ లభిస్తుంది.బాలికా సమృద్ధి యోజన (BSY)భారతదేశంలో ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాల బాలికల సంక్షేమాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో బాలికా సమృద్ధి యోజన స్కీమ్ ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద, ఆడపిల్ల పుట్టినప్పుడు నగదు ప్రోత్సాహకం అందిస్తారు. ఆ తర్వాత వారు ఉన్నత పాఠశాల వరకు విద్యను పొందేలా చూసేందుకు వార్షిక స్కాలర్షిప్లను సైతం అందించడం జరుగుతుంది.సీబీఎస్ఈ ఉడాన్ పథకంసీబీఎస్ఈ ఉడాన్ స్కీమును భారత ప్రభుత్వ మానవ వనరులు మరియు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRD) సహకారంతో 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్' (CBSE) ప్రారంభించింది. దేశంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో మహిళా విద్యార్థుల నమోదు రేటును పెంచడం దీని లక్ష్యం. -
భట్టి విక్రమార్కకు హరీశ్‌రావు ఛాలెంజ్
సాక్షి,సంగారెడ్డి: కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ఏమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. సంగారెడ్డిలో హరీశ్‌రావు సోమవారం(జనవరి13) మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేతల ప్రభుత్వం.రూ.15వేలు రైతు భరోసా ఇస్తామని మోసం చేశారు. రుణమాఫీకి నవంబర్ 30న సీఎం రేవంత్ ఇచ్చిన చెక్కు ఏమైంది.వ్యవసాయ కూలీలకు రూ.15వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడేమో సెంటు భూమి ఉన్నా ఇవ్వబోమంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎలా మోసం చేస్తోందో పండుగకు ఊళ్లకు వెళ్లేవారు రైతులకు చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలన్నీ మోసాలే. కాంగ్రెస్ మోసాలపై పోరాడాల్సిన సమయం వచ్చింది’అని హరీశ్‌రావు అన్నారు. భట్టి గోబెల్స్‌ను మించి పోతున్నారు: ఆయనకిదే నా ఛాలెంజ్..రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ రైతులను దగా చేస్తోందిసీఎం మాటలు కోటలు దాటుతున్నాయికానీ చేతలు గడప దాటడం లేదు2750 కోట్ల రూపాయలు చెక్కుని రుణమాఫీ కోసం నవంబర్ 30న సీఎం రేవంత్ ఇచ్చారుసీఎం రేవంత్ ఇచ్చిన చెక్కు డమ్మీది కావచ్చు..లేదా దారి తప్పిపోయిందా..?రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దగాని ప్రజలు గమనించాలికేసీఆర్ రైతుల కడుపులో సల్ల కదలకుండా చూసుకుంటే 13 నెలల్లో సీఎం రేవంత్ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాడుకాంగ్రెస్ పథకాల తీరు అయితే ఎగవేతలు లేకపోతే కోతలురైతులందరూ కలిసి ఉద్యమానికి సిద్ధం కావాలికాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి... మనకి రావాల్సిన పథకాలు తీసుకుందాంఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అంటే దళిత గిరిజన రైతుల పొట్ట కొట్టుడేనా..?కోటి మంది కూలీలు ఉంటే 10 లక్షల మందికే పథకాన్ని ఇస్తామని చెబుతున్నారుమాట తప్పినందుకు సీఎం రేవంత్ రైతులకు, కూలీలకు క్షమాపణ చెప్పాలిగ్రామసభలు పెడితే మీపై కూలీలు తిరగబడతారు జాగ్రత్తఎకరం లోపు భూమి ఉన్నవారిని కూడా కూలీలుగా గుర్తించి వారికి రూ. 12 వేలు ఇవ్వాల్సిందేఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క గోబెల్స్ ని మించిపోతున్నారుపూటకో తీరుగా ఆయన మాట్లాడుతున్నారునిన్న నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తికాలేదు అని అంటున్నారుమేము మహబూబ్‌నగర్ జిల్లాలోనే 600 లక్షల ఎకరాలకు నిరిచ్చాంభట్టి వ్యాఖ్యలపై నేను బహిరంగ చర్చకు సిద్ధం...ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తాఇదీ చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై నాలుగు కేసులు -
నా ప్రశ్నలకు సమాధానం లేదు..
-
సర్వేతో పథకాలకు ముప్పులేదు
బంజారాహిల్స్: ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేతో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపా రు. ఎవరికీ సంక్షేమ పథకాలను రద్దుచేయబోమని భరోసా ఇచ్చారు. అర్హులకు మరిన్ని పథకాలు అమలవుతాయని చెప్పారు. బంజారాహిల్స్ ఎన్బీటీనగర్లోని ఎన్క్లేవ్ అపార్ట్‌మెంట్స్‌లో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కమిషనర్ స్నేహ శబరీష్ తో కలిసి గురువారం ఆయన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కుటుంబ సర్వేపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచించారు. సర్వే సమాచారం గోప్యంగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజల స్థితిగతులు తెలుసుకొని పటిష్టమైన భవిష్యత్తు ప్రణాళికల ద్వారా రాష్ట్రంలో మంచి మార్పు తీసుకువచ్చి ఆదర్శ తెలంగాణను ఆవిష్కరించటమే సర్వే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటికే 30 శాతం సర్వే పూర్తయ్యిందని తెలిపారు. -
సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకు స్కెచ్..
-
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అధికారులు కృషి చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దిశా కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మైనారిటీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లు అనేక రాష్ట్రాల్లో సరైన రీతిలో అమలు కావడం లేదని.. అంగన్వాడీ స్కూళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల నిర్మాణానికి భూమి కొరత నెలకొందన్నారు.‘‘నగరంలో మురికివాడలు పెరిగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలి. దిశా కమిటీ సమావేశంలో అనేక విషయాలపై చర్చించాం. ప్రతి మూడు నెలలకోసారి పథకాల అమలు, కార్యక్రమాలపై అధికారులంతా సమీక్షించుకోవాలి. తెలంగాణలో 70-80 శాతం రెవెన్యూ హైదరాబాద్ నుంచే వస్తోంది. అయినా, జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్ డిపార్ట్ మెంట్లకు నిధుల కొరత వేధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌తో పాటు నగర పరిసర ప్రాంతాల ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత తీసుకోవాలి. రాష్ట్రంలో స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ మూతబడే పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వ అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలి’’ అని కిషన్‌రెడ్డి సూచించారు.రేపటి నుంచి పంట కొనుగోలు కేంద్రాలను తెలంగాణ బీజేపీ సందర్శించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వడ్లు, పత్తి కొనుగోలు కేంద్రాలను బీజేపీ బృందాలు పరిశీలించనున్నాయి. 9, 11, 13 తేదీల్లో రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల్లో పంట కొనుగోలు కేంద్రాలను బీజేపీ బృందాలు పరిశిలించనున్నారు. రేపు(శనివారం) ఉమ్మడి నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ బృందాలు పర్యటించనున్నాయి.రేపు(శనివారం) భువనగిరిలో కిషన్‌రెడ్డి, సూర్యాపేటలో లక్ష్మణ్, ఆదిలాబాద్‌లో యేలేటి మహేశ్వర్ రెడ్డి బృందాలు.. 11న కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను బీజేపీ బృందాలు సందర్శించనున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ బృందాలు కొనుగోలు కేంద్రాలను పరిశిలించనున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో డీకే అరుణ, వరంగల్ జిల్లాలో ఈటల రాజేందర్, మెదక్ రఘునందన్ రావు, ఖమ్మం కాటిపల్లి వెంకట రమణారెడ్డి బృందాలు పరిశీలించనున్నాయి. 13న నిజామాబాద్ జిల్లాలో పంట కొనుగోలు కేంద్రాలను ధర్మపురి అరవింద్ బృందాలు సందర్శించనున్నాయి. -
ఆంధ్రప్రదేశ్‌లో కొందరికే గ్యాస్ సిలిండర్ పథకం... 55 లక్షల మంది లబ్ధిదారులకు పథకాన్ని ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం యత్నం
-
నీకు 15 వేలు, నీకు 15 వేలు,నీకు 18 వేలు.. వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
-
TG: ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్
సాక్షి,హైదరాబాద్:ఉన్న పథకాలు బంద్ పెట్టడమే తెలంగాణలో కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణభవన్‌లో బుధవారం(అక్టోబర్ 16) మీడియాతో హరీశ్‌రావు చిట్‌చాట్‌గా మాట్లాడారు.‘ఒక చీర కాదు..రేవంత్ రెడ్డి రెండు చీరలు అన్నాడు.దసరా పండుగకు అక్క చెల్లెళ్ళను ప్రభుత్వం నిరుత్సహపరిచింది.రూ.15వేలు రైతుబంధు అన్నాడు..గుండు సున్నా చేశాడు. కేసీఆర్ కిట్ కంటే మంచి కిట్ ఇస్తామని పేద గర్బిణి స్త్రీలను మోసం చేశాడు.ముదిరాజ్,గంగపుత్రులంటే సీఎం రేవంత్‌కు చిన్నచూపు.ఆగస్టులో పోయాల్సిన చేప పిల్లలను అక్టోబర్ వచ్చినా పోయలేదు.మేం రూ. 100కోట్లు ఖర్చు చేస్తే..కాంగ్రెస్ ప్రభుత్వం చేప పిల్లల కోసం బడ్జెట్లో పెట్టిందే రూ.16కోట్లు.ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పు’అని ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి: బిల్డర్లను బెదిరించేందుకే హైడ్రా -
ఖజానాలో డబ్బుల్లేవు.. ఇప్పుడేమీ చేయలేం
పాలకొల్లు సెంట్రల్: ఖజానాలో డబ్బుల్లేవని.. ఇప్పట్లో పనులేవీ చేయలేమని మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరి నారాయణ వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా పెంకుళ్లపాడు టిడ్కో గృహాల సముదాయంలో మీడియాతో మాట్లాడుతూ.. పాలకొల్లులో నిర్మించిన టిడ్కో ఇళ్లు గందరగోళంగా ఉన్నాయన్నారు. వీటిని సరిచేద్దామంటే ఖజానాలో నిధులు లేవని, ఇప్పట్లో ఏమీ చేయలేమని తేల్చి చెప్పారు.నిధులు లేనందున ఈ విషయమై ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. డబ్బులుంటే అన్ని పథకాలూ ఒకేసారి అమలు చేసేవాళ్లమని, డబ్బులు లేకపోవడంతో చంద్రబాబు చాణక్యంతో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. దీపావళికి మూడు గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తామన్నారు. జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ 7,150 మంది టిడ్కో లబ్ధిదారుల్లో 640 మంది బ్యాంకు రుణాలు తీసుకోలేదని, వారికి ఉచితంగా ఇళ్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రితో మాట్లాడి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
పేర్ల మార్పుతో సరి.. పథకాల అమలు ఊసేది
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ప్రజలకిచి్చన హామీల అమలు కోసం జీవోలు జారీ చేయని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. వైఎస్ జగన్ సర్కారు అమలు చేసిన పథకాల పేర్లు మారుస్తూ చకచకా వరుస జీవోలు ఇస్తోంది. రైతులకు ఇచి్చన ఒక్క హామీని కూడా అమలు చేయకపోగా.. వైఎస్ జగన్ అమలు చేసిన పథకాల పేర్లను మారుస్తూ వ్యవసాయ శాఖ సోమవారం జీవో జారీ చేసింది. వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకం పేరును అన్నదాత సుఖీభవగా పేరు మారుస్తూ జీవో వెలువడింది. కానీ.. రైతులకు పెట్టుబడి సాయం అమలుకు చంద్రబాబు ప్రభుత్వం జీవో జారీ చేయలేదు.గత ప్రభుత్వం అమలు చేసిన వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పేరును వడ్డీలేని రుణాలు మార్చింది తప్ప.. పథకం అమలుకు జీవో జారీ చేయలేదు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం పేరును ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనగా మార్చింది. వైఎస్సార్ యంత్ర సేవా పథకం పేరును వ్యవసాయ యాంత్రీకరణ పథకంగా మార్చింది. వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ లేబొరేటరీస్ పేరును ఇంటిగ్రేడెట్ ల్యాబ్‌గా, వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల పేరును విలేజ్ క్లస్టర్‌గా, రైతు భరోసా కేంద్రాల పేరును రైతు సేవా కేంద్రాలుగా, ఆర్బీకే చానల్ పేరును పాడి పంటలు చానల్‌గా, ఈ–క్రాప్ యాప్ పేరును ఈ–పంటగా, వైఎస్సార్ రైతు భరోసా నెలవారీ మేగజైన్ పేరును పాడి పంటలుగా పేర్లు మార్చింది. -
స్కీములొద్దంటున్న టీడీపీ లీడర్
-
సూపర్ సిక్స్ చూస్తే భయమేస్తుంది.. చంద్రబాబుపై కేఏ పాల్ అదిరిపోయే సెటైర్లు
-
మాటలకే పథకాలు.. అమలు చేయడం మావల్ల కాదు
-
తల్లికి వందనం.. షాకిచ్చిన లోకేష్
-
ఆర్థిక శక్తి
న్యూఢిల్లీ: దేశంలో మహిళల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు 2024–25 బడ్జెట్ లో పెద్దపీట వేసినట్లు కేంద్రం తెలిపింది. వివిధ మంత్రిత్వశాఖలు, పథకాల కింద బాలికలు, మహిళల కోసం రూ. 3 లక్షల కోట్లకుపైగా కేటాయింపులు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశ ఆర్థికాభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న పాత్రను మరింత పెంచాలన్న ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ కేటాయింపులే నిదర్శనమన్నారు. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో ఉద్యోగాల్లో చేరేలా ప్రోత్సహించేందుకు దేశంలో మహిళా హాస్టళ్లను ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. పనిచేసే తల్లులకు ఆలంబనగా ఉండేందుకు పని ప్రదేశాల్లో శిశు సంరక్షణ కేంద్రాలను నిర్మిస్తామన్నారు. ఈ విషయంలో పరిశ్రమల సహకారం తీసుకుంటామని వివరించారు. మహిళలకు ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ, స్వయం సహాయక బృందాలకు మార్కెట్ అవకాశాలు లభించేలా చూస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు...: పెరిగిన మహిళా ఉద్యోగులు :..దేశంలో మహిళా ఉద్యోగుల సంఖ్య పెరిగిందని కేంద్రం తెలిపింది. ఈ ఏడాది మే నాటికి కొత్తగా 2.4 లక్షల మంది మహిళలు ఉద్యోగాల్లో చేరారని చెప్పింది. ఇది గతేడాది గణాంకాలతో పోలిస్తే 12.1% అధి కమని వివరించింది. అలాగే 2024 ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో మహిళా కార్మికశక్తి 24 శాతానికి పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే మొత్తమీద 17.2% మహిళా ఉద్యోగులు పెరిగారని.. సమ్మిళిత కార్మికశక్తి దిశగా ఇది సానుకూల పరిణామమని పేర్కొంది.స్త్రీ, శిశు సంక్షేమానికి కేటాయింపులు ఇలా..» స్త్రీ, శిశు సంక్షేమానికి రూ. 26,092 కోట్లుకేటాయించింది. ఇది గతేడాది సవరించినఅంచనాలు రూ. 25,448 కోట్ల కంటే 2.5 శాతం అధికం.» చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ఉద్దేశించిన సాక్షంఅంగన్వాడీ, పోషణ్ 2.0 పథకాలకు అత్యధికంగా రూ. 21,200 కోట్లు» శిశు సంరక్షణ సేవలు,సంక్షేమానికి ఉద్దేశించిన మిషన్ వాత్సల్య కార్యక్రమానికి గతేడాది తరహాలోనే రూ. 1,472 కోట్లు.» సంబాల్, సామర్థ్య ఉప పథకాలతో కూడిన మిషన్ శక్తి పథకానికి రూ. 3,145 కోట్లు.ఇందులో బేటీ బచావో.. బేటీ పఢావో లాంటి పథకాలతో కూడిన సంబాల్ పథకానికి రూ. 629 కోట్లు.» పిల్లల అభివృద్ధి, శిక్షణ, పరిశోధనా సంస్థ ఎన్‌ఐపీసీసీడీకిరూ. 88.87 కోట్లు, చిన్నారుల దత్తతను పర్యవేక్షించేసీఏఆర్ఏ (కారా)కు రూ. 11.40 కోట్లు.» మహిళా భద్రతను పెంచేందుకు ఉద్దేశించిన నిర్భయా ఫండ్కురూ. 500 కోట్లు.» ఐక్యరాజ్య సమితిఅనుబంధ సంస్థ యూనిసెఫ్‌కు 5.60 కోట్లు.కేటాయింపులు హర్షణీయం‘ఏ దేశానికైనా మహిళలే వెన్నెముక.దేశ సుస్థిరాభివృద్ధికి మహిళా సాధికారత, భాగస్వామ్యం కీలకం.కేంద్ర బడ్జెట్లో మహిళలకు రూ.3 లక్షల కోట్లకుపైగా కేటాయించడంఈ వాస్తవాన్ని ప్రతిబింబిస్తోంది. మహిళా హాస్టళ్లు, శిశుసంరక్షణ కేంద్రాల ఏర్పాటు, అతివలకు నైపుణ్య శిక్షణలాంటి ప్రతిపాదనలు హర్షణీయం. - రేఖా శర్మ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ -
ఇచ్చిన ప్రతి హామీ చంద్రబాబు అమలు చేయాలి
-
SC STల ఉచిత కరెంటు కట్.. రేషన్ పంపిణీ నిలిపివేత..
-
అప్పులు చేసి..... ఆ విషయంలో నో డౌట్
-
1.31 కోట్ల ఎకరాల నుంచి 2.38 కోట్ల ఎకరాలకు
తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో 2014–15లో 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న పంటల సాగువిస్తీర్ణం 2022–23 నాటికి 2.38 కోట్ల ఎకరాలకు పెరిగింది. అంటే పదేళ్ల కాలంలో కోటి ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది. సాగు విస్తీర్ణం పెరగడంతో పంట ఉత్పత్తి కూడా అదే స్థాయిలో 1.50 కోట్ల టన్నుల నుంచి 3.62 కోట్ల టన్నులకు పెరిగింది. అంటే పంట ఉత్పత్తి 2014తో పోలి్చతే ఏకంగా 137 శాతం పెరగడం గమనార్హం.వరిసాగులో దేశంలో అగ్రగామిగా నిలిచింది. 2014–15లో 35 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు కాగా, 2022–23లో ఇది ఏకంగా 121 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే తొమ్మిదేళ్ల కాలంలో 86 లక్షల ఎకరాల్లో వరి సాగు పెంపు కారణంగా, ధాన్యం ఉత్పత్తి కూడా భారీగా పెరిగింది. 2014–15లో 68 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, 2022–23 నాటికి ఇది 2.60 కోట్ల టన్నులకు పెరిగింది. – సాక్షి, హైదరాబాద్రూ.75 వేల కోట్లు రైతుబంధు కింద జమ ⇒ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.10 వేల చొప్పున రైతులకు అందించారు. ఈ పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలోనే జమ చేశారు. ప్రతి సీజన్లో సుమారు 65 లక్షల మందికి రూ.7,500 కోట్ల వరకు అందించేవారు. ఈ విధంగా ఇప్పటివరకు మొత్తం రూ. 75 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చింది. ⇒ కేసీఆర్ రైతుబీమా పథకాన్ని తీసుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వివిధ కారణాలతో మరణించిన సుమారు 1.15 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ. 5,566 కోట్ల పరిహారాన్ని అందించింది. లక్ష రుణమాఫీఅప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులకు రుణ విముక్తి చేయడమే లక్ష్యంగా గత ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది. ఇందులో భాగంగానే తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. లక్ష వరకు రుణమాఫీ చేసిన కేసీఆర్ సర్కారు.. 2018లో మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రూ.లక్ష మాఫీకి హామీ ఇచ్చింది. ఇందులో 2014లో తొలిసారి 35.31 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ. 16,144 కోట్ల రుణాలను మాఫీ చేసింది.ఇక రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 23 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.13 వేల కోట్ల రుణాలను మాఫీ చేయగా, మరో రూ. 6 వేల కోట్ల రుణాల మాఫీ పెండింగ్‌లో ఉంది. ఎన్నికల కోడ్ రావడంతో అడ్డంకి ఏర్పడింది. ఇప్పుడు రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం దాదాపు రూ. 35 వేల కోట్లు అవసరమవుతాయని అంటున్నారు. -
ఆగని ‘సంక్షేమం’
సాక్షి, అమరావతి: ఐదు సంవత్సరాలుగా ప్రతి ఏటా ముందుగానే సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి ఠంఛన్‌గా ఆయా పథకాలకు నిధులు అందిస్తున్న ప్రభుత్వం ఎన్నికల అనంతరం కూడా పథకాల అమలు కొనసాగిస్తూ వస్తోంది. ఎన్నికల కోడ్ కారణంతో మధ్యలో నిలిచిన వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, ఈబీసీ నేస్తం పథకాల లబ్ధిదారులకు ఈ 13న పోలింగ్ ముగిసిన అనంతరం ఆయా పథకాల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది.ఒక్కో మహిళకు రూ. 18,750ల చొప్పున 18న వైఎస్సార్ చేయూత పథకంలో భాగంగా రూ. 1,513.78 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం ఆయా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. 24న మరో రూ. 200 కోట్లు, 27న ఇంకో రూ. 400 కోట్లు ఆయా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. మిగిలిన వారికి కూడా పంపిణీ కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు.రాష్ట్రంలో 45–60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన అర్హులైన మహిళలకు నాలుగు విడతల్లో రూ. 75 వేల మొత్తం అందించేలా వైఎస్సార్ చేయూత పథకం అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాలుగో విడతగా పంపిణీ చేస్తున్న రూ. 5,060.49 కోట్లతో కలిపి ప్రభుత్వం గత ఐదేళ్లలో 26,98,931 మందికి ఈ ఒక్క పథకం ద్వారానే రూ.19,189.60 కోట్లు అందించినట్లు అవుతుంది. పోలింగ్ ముగిసిన మర్నాటి నుంచే ఐదేళ్లగా కొనసాగుతున్న పథకాలే అయినప్పటికీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో టీడీపీ, జనసేనల ఫిర్యాదుతో కేంద్ర ఎన్నికల సంఘం ఆయా పథకాల అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే పోలింగ్ ముగిసిన మరుసటి రోజు మే 14న 21.56 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్ ఆసరా పథకానికి సంబంధించి రూ. 1,843.07 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసింది. దీంతో 2019 ఎన్నికల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు బ్యాంకుల్లో ఉండే అప్పు మొత్తాన్ని వైఎస్సార్ ఆసరా పథకం పేరిట ప్రభుత్వం నాలుగు విడతల్లో నేరుగా అందజేసే ప్రక్రియ పూర్తయింది.2019 ఏప్రిల్ 11 నాటికి 78.94 లక్షల మంది మహిళలకు రూ.25,570 కోట్లు అప్పు ఉండగా, సీఎం జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఆ మొత్తం రుణాన్ని ప్రభుత్వం అందించింది. మరోవైపు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అగ్ర వర్ణాల్లోని 45–60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అర్హులైన పేద మహిళలకు ఈ విడతలోను రూ.15 వేలు చొప్పున లబ్ధిదారులు అందరికీ చెల్లించాల్సిన మొత్తం రూ. 629 కోట్లను చెప్పిన ప్రకారమే పోలింగ్ ముగిసిన తర్వాత ఈ నెల 20న వారి ఖాతాల్లో జమ చేసినట్టు అధికారులు వెల్లడించారు. -
ఇంటింటి అభివృద్ధి కొనసాగిద్దాం..
ఈ మంచిని కొనసాగిద్దాం..మీ బిడ్డ ఐదేళ్ల పాలనలో కేలండర్ ఇచ్చి మరీ ఏ నెలలో ఏ పథకాన్ని అందిస్తామో మీకు ముందుగానే చెప్పాడు. రైతుభరోసా, అమ్మఒడి, చేయూత.. ఇలా ఫలానా పథకాన్ని ఫలానా నెలలో ఇస్తామని చెప్పి ఏటా క్రమం తప్పకుండా ఐదేళ్లలో మీ అందరికీ మేలు చేశాడు. ప్రతి ఇంటికి మంచి చేశాడు.మన ఇంటికి జరుగుతున్న ఈ మంచిని పొరపాటున చంద్రబాబు ప్రలోభాలతో మోసపోయి పోగొట్టుకోవద్దని ప్రతి ఒక్కరికీ విన్నవించుకుంటున్నా. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో 2014లో మీరంతా చూశారు – సీఎం వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి ప్రతినిధి, కాకినాడ: మీ జగన్‌కు మీరు వేసే ఓటు.. ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపు అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు విన్నవించారు. మీ అందరికీ మంచి చేస్తూ, సంతోషాలను పంచుతూ 130 సార్లు బటన్లు నొక్కి రూ.2.70 లక్షల కోట్లు పారదర్శకంగా నేరుగా మీ చేతికే అందించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. గత ఐదేళ్లుగా చేసినమంచిని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. శనివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట, ఏలూరు జిల్లా కైకలూరు, కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. నిర్ణయాత్మక ఎన్నికలివి..మరో 36గంటల్లో ఎన్నికల సమరం జరగనుంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కావు. రాబోయే ఐదేళ్లు మీ ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలివి. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడమే. ఆయన్ను నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే. ఇది చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకి అర్థం ఇదే. గత 59 నెలలుగా మీ బిడ్డ ఎప్పుడూ చూడని విధంగా పాలనలో మార్పులు తెచ్చాడు. 130సార్లు బటన్లు నొక్కి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేశాడు. గతంలో ఎప్పుడైనా ఇలా బటన్లు నొక్కి మంచి చేసిన ప్రభుత్వాలు ఉన్నాయా? 14 ఏళ్లు పరిపాలించిన చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఏ ఒక్క మంచి అయినా గుర్తుకొస్తుందా? రాష్ట్రంలో గతంలో నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే మీ బిడ్డ వచ్చాక ఏకంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కొత్తగా ఇచ్చాడు.నా తమ్ముళ్లు, చెల్లెమ్మలే 1.35 లక్షల మంది మన సచివాలయాల్లోనే ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తున్నారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావిస్తూ 99 శాతం హామీలను అమలు చేసి విశ్వసనీయతను చాటుకున్నాం. గడప గడపకూ మన మేనిఫెస్టోను పంపించి మీరే టిక్ పెట్టాలని అక్కచెల్లెమ్మలను కోరాం. మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలను మచ్చుకు కొన్ని గడగడా చెబుతా.విద్యా విప్లవాలు..నాడు–నేడుతో బాగుపడ్డ గవర్నమెంటు బడులు, ఇంగ్లిష్ మీడియం, 6వ తరగతి నుంచే ఐఎఫ్‌పీలతో డిజిటల్ బోధన, 8వ తరగతికి రాగానే ప్రతి పిల్లాడి చేతిలో ట్యాబ్‌లు, 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్టు టీచర్లతో పాటు సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్, బడులు తెరవగానే విద్యాకానుక, రోజుకో రుచికరమైన మెనూతో గోరుముద్ద, చదువులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి, ఉన్నత చదువులు అభ్యసించే 93శాతం మంది విద్యార్థులకు పూర్తి ఫీజుల చెల్లింపు, అంతర్జాతీయ యూనివర్సిటీలతో మన కాలేజీల అనుసంధానం, ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులు, తప్పనిసరి ఇంటర్న్‌షిప్ లాంటి విద్యా విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా? అక్కచెల్లెమ్మలకు అండగా..అక్కచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, వారి పేరిటే 31లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు, అవ్వాతాతలకు ఇంటికే రూ.3 వేలు పెన్షన్, ఇంటి వద్దకే పౌరసేవలు, రేషన్, పథకాలు, రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఉచిత పంటల బీమా, నష్టపోతే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూటే 9గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతన్నలను చేయిపట్టుకుని నడిపించే ఆర్బీకేలు లాంటి విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలను గతంలో ఎప్పుడైనా చూశారా? స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ వాహనమిత్ర, నేతన్ననేస్తం, మత్స్యకార భరోసా, తోడు, చేదోడు, లా నేస్తం లాంటి పథకాలు గతంలో ఉన్నాయా? వైద్యం కోసం ఏ పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించి రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. కోలుకునే సమయంలో ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, టెస్టులు చేసి మందులు కూడా ఇచ్చేలా ఆరోగ్య సురక్ష తెచ్చాం. ప్రజల ఆరోగ్యంపై ఇంత ధ్యాస పెట్టిన ప్రభుత్వాలను గతంలో చూశారా?గ్రామ స్వరాజ్యం..ఏ గ్రామాన్ని చూసినా 600 రకాల సేవలందిస్తున్న సచివాలయాలు, ప్రతి 60 – 70 ఇళ్లకు ఇంటికే వచ్చి సేవలందించే వలంటీర్లు, నాడు–నేడుతో బాగుపడ్డ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, అక్కచెల్లెమ్మల భద్రత కోసం మహిళా పోలీసులు, ఆపదలో ఆదుకునే దిశ యాప్ లాంటివి మీ బిడ్డ పాలనలో సాకారం చేశాడు. మళ్లీ ఇంటికే అన్నీ రావాలంటే..పేదల తలరాతలు మారాలంటే ఫ్యాను గుర్తుకే ఓటేయాలి. వలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ మళ్లీ ఇంటికే రావాలన్నా, బటన్లు నొక్కిన పథకాల సొమ్ము మళ్లీ నా అక్కచెల్లెమ్మల ఖాతాలకి రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన కొనసాగాలన్నా, పేదల తలరాతలు మారాలన్నా, మన పిల్లల చదువులు, బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన ఆసుపత్రులు మెరుగుపడాలన్నా ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో మన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి. మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి.చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్‌లోనే ఉండాలి.2014 బాబు విఫల హామీలు» రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా? » రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాల్లో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? » ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు. ఎవరికైనా రూపాయి ఇచ్చాడా?» ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఈ లెక్కన ఐదేళ్లలో ఏ ఇంటికైనా రూ.1.20 లక్షలు ఇచ్చాడా ? » అర్హులందరికీ 3సెంట్లు స్థలం, పక్కా ఇళ్లు ఇస్తామన్నాడు. ఏ ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా? » రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ హామీ అమలైందా?» ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా?» సింగపూర్‌ని మించి అభివృద్ధి, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందా? చిలకలూరిపేట, కైకలూరు, పిఠాపురంలో ఎవరికై నా కనిపిస్తున్నాయా?» ప్రత్యేక హోదా తేకపోగా అమ్మేశాడు. »అదే ముగ్గురు ఇప్పుడు మళ్లీ కూటమిగా ఏర్పడి సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు అంటూ నమ్మబలుకుతున్నారు.దీవించండి..నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్, చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్‌నాయుడు, కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత, కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ను మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా.కొల్లేరు మిగులు భూముల పంపిణీ..!కొల్లేరు సమస్య పరిష్కారం కావాలంటే మళ్లీ మీ బిడ్డే ముఖ్యమంత్రిగా ఉండాలి. నేను ఇచ్చిన మాట ప్రకారం జయమంగళ వెంకటరమణ అన్నను ఎమ్మెల్సీగా చేశా. కొల్లేరు ప్రాంతంలో సర్వే దాదాపుగా పూర్తైంది. రిపోర్టు కూడా సిద్ధమైన వెంటనే మిగులు భూములను గుర్తించి పేదలకు పంపిణీ చేస్తాం. మీ బిడ్డే మీ దగ్గరకు వచ్చి ఆ పంపిణీ కార్యక్రమం చేస్తాడు. -
గొంతు నొక్కేస్తున్నారు..
ఒక ప్రభుత్వాన్ని ఐదేళ్ల కోసం ఎన్నుకుంటారు. కానీ వీళ్లందరూ 57 నెలలకే మీ బిడ్డ ప్రభుత్వాన్ని గొంతు పట్టుకుని పిసికేయాలని ఆలోచన చేస్తున్నారు. వీళ్లు గొంతు పట్టుకుని పిసికేది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదు.. నా అక్కచెల్లెమ్మల గొంతులను, నా అవ్వాతాతల గొంతులను, నా రైతన్నల గొంతులను, నా పేద విద్యార్థుల గొంతులనే అని ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతున్నా – మంగళగిరి సభలో సీఎం జగన్నేను ప్రతి సందర్భంలోనూ నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అని ఎందుకు అంటానో తెలుసా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బాహాటంగా ‘‘నా..’’ అని పిలుచుకుంటూ వారిపై ప్రేమ చూపించినప్పుడు ఆయా సామాజిక వర్గాలకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా గౌరవం, ఆత్మగౌరవం, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అది జరగాలనే తపనతోనే మీ బిడ్డ ఒక యజ్ఞాన్ని చేస్తున్నాడు.– కడప సభలో సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, గుంటూరు, సాక్షి, తిరుపతి, సాక్షి ప్రతినిధి, కడప: ‘మీరంతా ఐదేళ్ల కోసం అధికారం ఇస్తే 57 నెలలకే మీ బిడ్డ గొంతు నొక్కేస్తున్నారు! వీళ్ల దుర్మార్గాలు, కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయంటే జగన్‌కు ఎక్కడ ప్రజల్లో మంచి పేరు వస్తుందోననే ఆందోళనతో ఇంటికే వచ్చే పెన్షన్‌కు కూడా అడ్డుపడి రానివ్వకుండా చేస్తున్నారు. మీ బిడ్డ బటన్లు నొక్కి రెండు నెలలైంది. ఎన్నికల కోడ్ రాకముందే బటన్లు నొక్కినా ఎక్కడ అక్కచెల్లెమ్మలకు డబ్బులు వెళ్లిపోతాయో, ఎక్కడ జగన్‌ను వాళ్లంతా మంచివాడు అని అనుకుంటారేమోనని అది కూడా అడ్డుకుంటున్న దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు. నా అక్కచెల్లెమ్మలకు ఎట్టి పరిస్ధితుల్లోనూ పథకాల డబ్బులు అందాలని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీ బిడ్డ కోర్టుకు వెళ్తున్నాడంటే ఈ వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోయిందో ఆలోచన చేయండి. బాగా ముదిరిపోయిన తొండ లాంటి చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారు. ఒకవైపు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో జత కట్టి మరోవైపు మైనార్టీల ఓట్ల కోసం కపట ప్రేమ నటిస్తున్నారు’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరి, చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు, వైఎస్సార్ జిల్లా కడపలోని వన్‌టౌన్ సమీపాన మద్రాస్ రోడ్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. విశ్వసనీయతతో అడుగులు..మరో మూడు రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కావు. వచ్చే ఐదేళ్లు మీ ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలివి. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. మళ్లీ ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడమే. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం ఇదే. చంద్రబాబుకు ఓటు వేయడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టడమే. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. మరోవైపు మీ బిడ్డది మనసున్న ప్రభుత్వం. మీ బిడ్డ పేదవాడిని పేదవాడిగానే చూశాడు. ఏ రోజూ కులమతాలు చూడలేదు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా గత 59 నెలల కాలంలో 130సార్లు బటన్లు నొక్కి వివిధ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో జమ చేశాడు. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. గతంలో రాష్ట్రంలో నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే మీ బిడ్డ ఏకంగా మరో 2.31 లక్షల ఉద్యోగాలు కొత్తగా ఇచ్చాడు. 1.30 లక్షల మంది నా తమ్ముళ్లు, చెల్లెమ్మలే సచివాలయాల్లో కనిపిస్తున్నారు. ఎన్నికలు ముగిశాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో పారేసే సంస్కృతికి తెర దించి ఏకంగా 99 శాతం హామీలను అమలు చేసి చిత్తశుద్ధి చాటుకున్నాం. విశ్వసనీయతకు అర్థం చెప్పాం మన మేనిఫెస్టోను గడపగడపకూ పంపించి మీరే టిక్ పెట్టాలని కోరుతూ అక్కచెల్లెమ్మల ఆశీర్వాదం తీసుకున్నాం. మేనిఫెస్టోకి విశ్వసనీయత తెచ్చిన ఇలాంటి కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా ? మచ్చుకు కొన్ని గడగడా చెబుతా..మన ప్రభుత్వం తెచ్చిన కొన్ని పథకాలు మచ్చుకు కొన్ని గడగడా చెబుతా. ‘నాడు–నేడు’తో బాగుపడ్డ గవర్నమెంట్ బడులు, ఇంగ్లిష్ మీడియం, 6వ తరగతి నుంచే ఐఎఫ్‌పీలతో డిజిటల్ బోధన, 8వ తరగతికి రాగానే ట్యాబ్‌లు, 3వ తరగతి నుంచి టోఫెల్ క్లాసులు, సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్ఈ నుంచి ఏకంగా ఐబీ దాకా ప్రయాణం, బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్, బడులు తెరవగానే విద్యాకానుక, రోజుకో రుచికరమైన మెనూతో గోరుముద్ద, పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి, పూర్తి ఫీజులు చెల్లిస్తూ జగనన్న విద్యాదీవెన, ఖర్చుల కోసం వసతి దీవెన లాంటి వినూత్న పథకాలు, కార్యక్రమాలు గతంలో ఉన్నాయా? ఉన్నత విద్య అభ్యసిస్తున్న 93 శాతం మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో లబ్ధి చేకూరుస్తున్నాం. తొలిసారిగా అంతర్జాతీయ వర్సిటీల నుంచి ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులను మన డిగ్రీలలో భాగస్వామ్యం చేయడం, తప్పనిసరి ఇంటర్న్‌షిప్ లాంటివి మీ బిడ్డ తెచ్చిన విప్లవాలు కావా? ఈ రోజు ఒకటో తరగతి ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్న పిల్లవాడు 2035లో ఐబీ సర్టిఫికెట్తో పదో తరగతి పాస్ అవుతాడు. ఆ తర్వాత ఏ హార్వర్డ్ నుంచో, ఎల్ఎస్సీ, స్టాన్పర్డ్ నుంచో, ఏంఐటీ నుంచో సర్టిఫికెట్ కోర్సులతో డిగ్రీ పట్టా తీసుకుంటాడు. ఆ పిల్లవాడు అనర్గళంగా ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో మిమ్మల్ని ఆలోచన చేయమని కోరుతున్నా. పేదల తలరాతలు మార్చేందుకు మీ బిడ్డ వేస్తున్న అడుగులు ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో ఆలోచన చేయండి. విప్లవాత్మక పథకాలు, సేవలు..నా అక్కచెల్లెమ్మలు సొంత కాళ్లపై నిలబడి ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తంతోపాటు వారి పేరిటే ఏకంగా 31లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. 22లక్షల గృహ నిర్మాణాలను సైతం చేపట్టాం. అక్కచెల్లెమ్మల బాగు కోసం ఇంతగా తపించిన ప్రభుత్వాలు గతంలో ఉన్నాయా? అవ్వాతాతలకు ఇంటికే రూ.3 వేలు పెన్షన్, ఇంటి వద్దకే పౌరసేవలు, రేషన్, పథకాలు అందడం గతంలో ఎప్పుడైనా చూశారా? రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఉచితంగా పంటల బీమా, నష్టపోతే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, చేయిపట్టుకుని నడిపించే ఆర్బీకేలు లాంటి కార్యక్రమాలు గతంలో జరిగాయా?స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ వాహనమిత్ర, నేతన్ననేస్తం, మత్స్యకార భరోసా, చిరువ్యాపారులకు తోడు, చేదోడు, లాయర్ల కోసం లా నేస్తం పథకాలను తెచ్చాం. ఏ పేదవాడు వైద్యం కోసం అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించి రూ.25 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందిస్తున్నాం. విశ్రాంతి సమయంలో ఆరోగ్య ఆసరా కూడా ఇస్తున్నాం. గ్రామంలోనే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ప్రతి ఇంటినీ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాలతో ప్రజారోగ్యంపై ఇంతగా ధ్యాస పెట్టిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా? ఇవాళ ఏ గ్రామానికి వెళ్లినా 600 రకాల సేవలందిస్తున్న సచివాలయాలు కనిపిస్తున్నాయి. 60–70 ఇళ్లకు ఇంటికే వచ్చి సేవలందించే వలంటీర్లు, నాడు–నేడుతో బాగుపడ్డ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, అక్కచెల్లెమ్మలకు భద్రతగా గ్రామంలోనే మహిళా పోలీసు, దిశ యాప్ లాంటివి తీసుకొచ్చాం. 14 ఏళ్ల పాటు పరిపాలన చేశానని చెప్పుకునే చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా? ముస్లింలకు మీ జగన్ ఇస్తున్న మాట...బాగా ముదిరిపోయిన తొండ లాంటి చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారు. ఒకపక్క 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీతో జత కట్టి ఎన్డీఏలో కొనసాగుతూ మరోపక్క మైనారిటీల ఓట్ల కోసం దొంగ ప్రేమ నటిస్తున్నాడు. ఇంత మోసాలు, ఇలాంటి దగుల్బాజీ రాజకీయాలు చేసే వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉంటారా? ఆరు నూరైనా సరే ముస్లిం మైనారిటీలకు 4శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్, మీ వైఎస్సార్ బిడ్డ ఇస్తున్న మాట. మరి చంద్రబాబుకు ప్రధాని మోదీ సమక్షంలో ఇదే మాట చెప్పే దైర్యముందా?వారు మైనారిటీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పినా కూడా చంద్రబాబు ఎందుకు ఎన్డీఏలో కొనసాగుతున్నాడు? మైనారిటీ రిజర్వేషన్లు అంటే చాలు రాజకీయాలు చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరికీ అర్థం కావటానికి మీ అందరి సమక్షంలో ఒక విషయం చెబుతున్నా. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు మతం ప్రాతిపదికగా ఇచ్చినవి కాదు. ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు రిజర్వేషన్లు వర్తింపచేయటం లేదు. పఠాన్లు, సయ్యద్‌లు, మొఘల్‌లకు వర్తించడం లేదు. ఇవి కేవలం వెనకబాటుతనం ప్రాతిపదికగా ఇస్తున్న రిజర్వేషన్లు. అన్ని మతాల్లోనూ బీసీలు, ఓసీలు ఉంటారు. మరి అలాంటప్పుడు మైనారిటీలను వేరుగా చూడటం ధర్మమేనా? రాజకీయాల కోసం వారి జీవితాలతో చెలగాటం ఆడటం న్యాయమేనా? ఎట్టి పరిస్థితిలోనూ ఈ 4శాతం రిజర్వేషన్లు కచ్చితంగా కొనసాగుతాయి. ఇవే కాదు.. ఎన్ఆర్సీ, సీఏఏతో సహా ఏ విషయంలోనైనా మైనారిటీల మనోభావాలు, వారి ఇజ్జత్ ఔర్ ఇమాన్‌కు అండగా ఉంటాం. డీబీటీ స్కీమ్లే కాకుండా ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, షాదీ తోఫా, ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించడం, నలుగురు మైనారిటీలను ఎమ్మెల్సీలుగా, నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం, నా మైనారిటీ సోదరుడికి ఉప ముఖ్యమంత్రి పదవి, నా మైనారిటీ సోదరికి శాసన మండలి ఉపాధ్యక్షురాలి పదవులు ఇచ్చి గౌరవించాం. మైనారిటీ సబ్ ప్లాన్ బిల్లు తేవడం మొదలు ప్రతి సందర్భంలోనూ సముచిత స్థానం కల్పించాం. ఆ దివంగత నేత, నాన్నగారు వైఎస్ రాజశేఖరరెడ్డి మైనారిటీలకు 4శాతం రిజర్వేషన్లు ఇచ్చి రెండు అడుగులు ముందుకు వేస్తే.. ఆయన బిడ్డ మీ జగన్ మరో నాలుగు అడుగులు ముందుకేసి 7 ఎమ్మెల్యే స్థానాలు మైనార్టీలకు ఇవ్వడం ద్వారా 4శాతం రాజకీయ రిజర్వేషన్లు కూడా ఇచ్చినట్లయ్యింది. మన అభ్యర్థులను దీవించండిమంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.లావణ్య, గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య, నగరి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే రోజా, చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప, కడప ఎమ్మెల్యే అభ్యర్థి అంజాద్ బాష, కడప ఎంపీగా పోటీ చేస్తున్న నా తమ్ముడు వైఎస్ అవినాష్‌రెడ్డిని మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీలతో గెలిపించాలని కోరుతున్నా. మీ బిడ్డ ఎన్నికల కోసం ఏదీ చేయలేదు..వీళ్ల దుర్మార్గాలు, కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయంటే... అవ్వాతాతలకు మొన్నటి వరకు ఇంటికే వచ్చే పెన్షన్‌కు కూడా అడ్డుపడి రానివ్వకుండా చేసిన దౌర్భాగ్యులు వీళ్లు! మీ బిడ్డ చేసిందేదీ ఎన్నికల కోసం చేయలేదు. మీ బిడ్డ ఏదీ ఎన్నికలకు రెండు నెలల ముందు, మూడు నెలల ముందు చేసిన దాఖలాలు లేవు. మీ బిడ్డ ఏం చేసినా ముందే కేలండర్ ప్రకటించి ఇదిగో ఈ నెలలో రైతుభరోసా, అమ్మఒడి, చేయూత ఇస్తామని చెప్పి క్రమం తప్పకుండా ఐదేళ్లుగా అందించాడు. సాధారణంగా ఎవరైనా మోసం చేస్తే చీటింగ్ కేసు పెడతాం. ఛీటర్ అంటాం. దొంగతనం చేస్తే దొంగోడు అని కేసు పెడతాం. మరి ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ మేనిఫెస్టో అంటూ అందమైన హామీలిచ్చి మన జీవితాలతో ఆడుకుంటున్న వాళ్ల మీద ఎలాంటి కేసులు పెట్టాలి? పట్టపగలే ఇంత దారుణంగా ప్రజలను మోసం చేస్తున్నారు.మంగళగిరి బీసీలదేమంగళగిరి సీటు బీసీలది.. వెనుకబడిన వర్గాలది. గతంలో నేను ఆర్కేకు ఇచ్చా. ఈసారి మాత్రం మనం ఈ సీటును త్యాగం చేయాలని ఆర్కేకు చెప్పా. మనం బీసీలకు సీటు ఇస్తే... అటువైపు∙వాళ్లంతా డబ్బు మూటలతో నెగ్గేందుకు ప్రయత్నిస్తున్నారు. మీ బిడ్డ మాదిరిగా చంద్రబాబు ఎక్కడా బటన్లు నొక్కలేదు కాబట్టి ఆయన దగ్గర బాగా డబ్బులున్నాయి. అందుకుని ఓటుకు రూ.5 వేలు కూడా ఇస్తానంటాడు. ఆయన డబ్బులిస్తే వద్దనకుండా తీసుకోండి.అదంతా మన దగ్గర దోచేసిన సొమ్మే. కానీ ఓటేసేటప్పుడు మాత్రం ఎవరి వల్ల మీకు మంచి జరిగిందో ఆలోచించండి. ఎవరు ఉంటే ఈ మంచి కొనసాగుతుందో ఆలోచన చేయండి. మీ అందరికీ మంచి చేసిన ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్ లోనే ఉండాలి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ మళ్లీ ఇంటికే రావాలన్నా, బటన్లు నొక్కిన పథకాల సొమ్ము నా అక్కచెల్లెమ్మల ఖాతాలకి రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన కొనసాగాలన్నా, పేదల భవిష్యత్, తలరాతలు మారాలన్నా, మన పిల్లల చదువులు, బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన వైద్యం మెరుగుపడాలన్నా ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. 2014 బాబు విఫల హామీల్లో ముఖ్యమైనవి» రూ.87,612కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా? రూ.14,205కోట్ల పొదుపు రుణాల్లో ఒక్క రూపాయి మాఫీ చేశాడా? » ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు. ఎవరికైనా రూపాయి ఇచ్చాడా?» ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఈ లెక్కన ఐదేళ్లలో ఏ ఇంటికైనా రూ.1.20 లక్షలు ఇచ్చాడా ? » అర్హులందరికీ మూడు సెంట్లు స్థలం, పక్కా ఇళ్లు ఇస్తామన్నాడు. ఏ ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా? » రూ.10వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ హామీ అమలైందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా?» సింగపూర్‌ని మించి అభివృద్ధి, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందా? మంగళగిరి, నగరిలో ఎవరికైనా కనిపిసున్నాయా?» ప్రత్యేక హోదా తేకపోగా అమ్మేశాడు. » అదే ముగ్గురు ఇప్పుడు మళ్లీ కూటమిగా ఏర్పడి సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు అంటూ నమ్మబలుకుతున్నారు.నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ఇలా.. సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని చిలకలూరిపేటలో ఉన్న కళామందిర్ సెంటర్లో జరిగే ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలోని కైకలూరులో ఉన్న తాలూకా ఆఫీస్ సెంటర్లో జరిగే సభకు హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు కాకినాడ లోక్‌సభ స్థానం పరిధిలోని పిఠాపురంలో ఉన్న ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో జరిగే సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. -
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
-
వైఎస్సార్సీపీ పథకాలే బాబు హామీలు
సాక్షి, అమరావతి: టీడీపీ– జనసేన ప్రకటించిన తాజా మేనిఫెస్టోలో చాలా హామీలు ఇప్పటికే వైఎస్ జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లుగా విజయ వంతంగా అమలు చేస్తోంది. ఆ హామీలు ఇలా ఉన్నాయి.. టీడీపీ హామీ: స్కూల్‌కు వెళ్లే విద్యార్థులకు ఏడాదికి రూ.15వేలు ఇప్పటికే అమలవుతోందిలా: అమ్మఒడి కింద ప్రతి తల్లికి రూ.15వేలు ఇస్తోంది. ఈ మొత్తాన్ని రూ.17 వేలకు పెంచి అమలు చేస్తామని సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో ప్రకటించారు. టీడీపీ హామీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం పునరుద్ధరణ ఇప్పటికే అమలవుతోందిలా: జగనన్న విదేశీ విద్యా దీవెన పేరిట ఇప్పటికే అమలవుతోంది. సీఎం జగన్ ఒక్కొక్కరికి రూ.1.25 కోట్ల వరకు ఆరి్థక సాయం అందిస్తున్నారు. టీడీపీ హామీ: కేజీ టూ పీజీ సిలబస్‌ని రివ్యూ చేస్తాం ఇప్పటికే అమలవుతోందిలా: జగన్ ప్రభుత్వం ఇప్పటికే కేజీ టూ పీజీ సిలబస్‌ను రివ్యూ చేయడమే కాదు.. డిగ్రీలో ఆనర్స్‌ను ప్రవేశపెట్టింది. ఉన్నత విద్యలో అంతర్జాతీయ వర్శిటీలందించే 2 వేల కోర్సులను ఎడెక్స్ సరి్టఫికేషన్ ద్వారా ఇప్పటికే అందిస్తోంది. టీడీపీ హామీ: ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా ఇప్పటికే అమలవుతోందిలా: వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికే ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఖర్చు చేస్తోంది. టీడీపీ హామీ: బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందుల పంపిణీ ఇప్పటికే అమలవుతోందిలా: ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్ విలేజ్ క్లినిక్, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాల ద్వారా బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. వీరికి సొంత ఊరులోనే ప్రభుత్వ వైద్యులు వైద్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు. టీడీపీ హామీ: కిడ్నీ, తలసీమియా వంటి వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10వేలు పింఛన్ ఇప్పటికే అమలవుతోందిలా: ఇప్పటికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కిడ్నీ, తలసీమియా, సికిల్ సెల్, ఇమోఫిలియా వంటి వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేల చొప్పున పింఛన్ అందిస్తోంది. టీడీపీ హామీ: మూతపడిన ప్రతి నైపుణ్య శిక్షణా కేంద్రం పునఃప్రారంభం, విస్తరణ ఇప్పటికే అమలవుతోందిలా: వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 192 స్కిల్ హబ్‌లు, 26 స్కిల్ కాలేజీలను ఏర్పాటు చేసింది. టీడీపీ హామీ: డిజిటల్ లైబ్రరీల స్థాపన ఇప్పటికే అమలవుతోందిలా: వైఎస్ జగన్ ప్రభుత్వం సచివాలయాలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తోంది. టీడీపీ హామీ: ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ఇప్పటికే అమలవుతోందిలా: జగన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తోంది. టీడీపీ హామీ: ఇమామ్‌లకు రూ.10వేలు, మౌజన్లకు రూ.5 వేలు గౌరవవేతనం ఇప్పటికే అమలవుతోందిలా: వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమామ్‌లకు రూ.10వేలు, మౌజన్లకు రూ.5 వేలకు పెంచి మరీ అందిస్తోంది. టీడీపీ హామీ: క్రిస్టియన్ శ్మశాన వాటికలకు స్థలం కేటాయింపు, జెరూసలేం యాత్రికులకు సాయం ఇప్పటికే అమలవుతోందిలా: జగన్ ప్రభుత్వం క్రిస్టియన్ శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయిస్తోంది. జెరూసలేం యాత్రకు వెళ్లే వారికి ఏటా ఆరి్ధక సాయం అందిస్తోంది.టీడీపీ హామీ: రాష్ట్ర యువతను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు రాష్ట్రాన్ని వేదికగా మారుస్తాం. ఇప్పటికే అమలవుతోందిలా: ఆడుదాం ఆంధ్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా క్రీడా ప్రతిభను వెలికితీసే కార్యక్రమం జరుగుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారికి వైఎస్సార్ క్రీడా ప్రోత్సాహకాల పేరిట గతంలోకంటే భారీగా పెంచి ప్రోత్సాహకాలను అందిస్తోంది. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ కోసం ఆరి్థక సాయం అందిస్తోంది.టీడీపీ హామీ: రాష్ట్రంలో అనేక స్కూళ్లు మూతపడటానికి కారణమైన జీవో 117 రద్దు, మూతపడిన పాఠశాలల పునఃప్రారంభం ఇప్పటికే అమలవుతోందిలా: 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో మూతపడిన 5 వేల స్కూళ్లను జగన్ ప్రభుత్వం పునరుద్ధరించి, అందుబాటులోకి తీసుకొచి్చంది. జీవో 117 ద్వారా విద్యార్థులకు సబ్జెక్టు టీచర్లను ప్రవేశపెట్టింది.టీడీపీ హామీ: 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా, రాయితీతో సోలార్ పంప్సెట్లు, మిగిలిన విద్యుత్ ప్రభుత్వం కొనుగోలు ఇప్పటికే అమలవుతోందిలా: వైఎస్ జగన్ ప్రభుత్వం 2019 నుంచి పగటి పూట నిరంతరాయంగా 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. ఇందుకోసం రూ.1,700 కోట్లతో ఫీడర్లను ఆధునికీకరించింది. రాయితీపై సోలార్ పంపుసెట్లు ఇప్పటికే అందజేస్తోంది. మిగిలిన విద్యుత్ కొనుగోలుకు గ్రిడ్‌కు అనుసంధానించే ప్రక్రియ కూడా జరుగుతోంది.టీడీపీ హామీ: రైతులకు రూ.20 వేల పెట్టుబడి సాయం, ధరల స్థిరీకరణ నిధి, కౌలురైతులకు గుర్తింపు కార్డులు, సంక్షేమ ఫలాలు, పంటల బీమా వర్తింపు. సేంద్రీయ వ్యవసాయం చేసే వారికి ఆరి్థకంగా, సాగు, మార్కెటింగ్ అంశాల్లో తోడ్పాటు. ప్రభుత్వ రంగంలో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్ల ఆధునికీకరణ, నూతన యూనిట్ల ఏర్పాటు, దళారుల దోపిడిని కట్టడి చేసేందుకు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ చట్టం (ఏపీఎంసీ యాక్టు) పటిష్టంగా అమలు, డ్రిప్ ఇరిగేషన్‌కు 90 శాతం సబ్సిడీ, సెరికల్చర్‌కు ప్రోత్సాహం ఇప్పటికే అమలవుతోందిలా: వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లుగా రూ.13,500 చొప్పున రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. ఈ మొత్తాన్ని రూ.16 వేలకు పెంచుతున్నట్టు వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో పేర్కొంది. ఇప్పటికే రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. కౌలు రైతులకు పంట సాగు హక్కుదారు పత్రాలు (సీసీఆర్సీ) ప్రభుత్వం జారీ చేస్తోంది. సీసీఆర్సీలు పొందిన కౌలు రైతులకు భూ యజమానులతో సమానంగా సంక్షేమ ఫలాలు అందిస్తోంది. పంటల బీమా కూడా వర్తింపచేసి అమలు చేస్తోంది. ఆర్బీకే స్థాయిలో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. ఏపీఎంసీ యాక్టును సమర్ధవంతంగా అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు డ్రిప్ ఇరిగేçషన్ కోసం 90 శాతం సబ్సిడీ అందిస్తోంది. పట్టు రైతులకు కూడా ప్రోత్సాహకాలు ఇస్తోంది. టీడీపీ హామీ: శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాం ఇప్పటికే అమలవుతోందిలా: వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికే గ్రామ సచివాలయాల ద్వారా శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తోంది. -
బూటకపు హామీలకు కేరాఫ్ బాబు
సాక్షి, అమరావతి: బూటకపు హామీలు ఇవ్వడం.. వాటిని గాలికొదిలేయడంలో కేరాఫ్ అడ్రస్ ఎవరిదంటే అందరూ చెప్పేమాట చంద్రబాబు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ అలవికాని హామీలను ఇవ్వడం, ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపడం, ఆ తర్వాత వాటిని మర్చిపోవడం ఆయనకు వెన్నుపోటుతో పెట్టిన విద్య. ఈసారి కూడా ఇదే రీతిలో చంద్రబాబు, తన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో కొత్తగా ఒక్కటంటే ఒక్క పథకం చంద్రబాబు ఆలోచనల నుంచిలో అమలవుతున్న పథకాలను యథాతథంగా కాపీ కొట్టి మక్కీకి మక్కీ దించేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలను నిస్సిగ్గుగా కాపీ కొట్టి తన మేనిఫెస్టోలో పెట్టుకోవడం చంద్రబాబుకే చెల్లిందని రాజకీయ విశ్లేషకులు, ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కాపీ క్యాట్ బాబు.. రాష్ట్రంలో ప్రజలకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా అందిస్తామని చంద్రబాబు మేనిఫెస్టోలో పేర్కొన్నారు. వాస్తవానికి ఇప్పటికే వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఏకంగా రూ.25 లక్షలకు పెంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తోంది. ఈ స్థాయిలో ఉచిత వైద్యాన్ని అందిస్తున్న రాష్ట్రం దేశంలోనే ఏపీ ఒక్కటే కావడం గమనార్హం. చంద్రబాబు పాలనలో కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఆరోగ్యశ్రీ పథకం అందేది.అలాంటిది అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్ రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటికీ ఈ పథకాన్ని వర్తింపజేశారు. దీంతో రాష్ట్రంలో 90 శాతానికిపైగా కుటుంబాలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చాయి. వీరందరికీ రూ.25 లక్షల వరకూ వైద్య సేవలు పూర్తిగా ఉచితమే. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇదే హామీ ఇవ్వడం వల్ల కొత్తగా ప్రజలకు వచ్చే ప్రయోజనమేముందని చర్చ జరుగుతోంది. డిజిటల్ హెల్త్ కార్డులూ కాపీయేనా బాబు? ఆరోగ్యశ్రీ పరిమితి పెంపునే కాకుండా మరో దాన్ని కూడా చంద్రబాబు నిస్సిగ్గుగా కాపీ కొట్టి మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఇప్పటికే వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో 4.7 కోట్ల మందికిపైగా డిజిటల్ హెల్త్ కార్డులు అందజేసింది. ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రతి కుటుంబానికి స్మార్ట్ హెల్త్ కార్డులు పంపిణీ చేసింది. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే డిజిటల్ వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ అంశంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు చంద్రబాబు సైతం తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని హామీ ఇవ్వడం పట్ల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. బాబు దగా మరువని ప్రజలు 2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో వైద్య ఆరోగ్య విధానం పేరిట చంద్రబాబు మొత్తం 14 హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చిన పాపానపోలేదు. జిల్లాకు ఒక నిమ్స్ ఆస్పత్రి నిర్మాణం అంటూ దాన్ని కూడా గాలికొదిలేశారు. ఆరోగ్యశ్రీలో కొత్త వ్యాధులను చేర్చి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత పరీక్షలు, చికిత్సలు, ఆపరేషన్ల సౌకర్యం కలి్పస్తాం అని మేనిఫెస్టోలో ప్రకటించిన బాబు కల్లబొల్లి మాటలతో ప్రజలను వంచించారు.2007లో వైఎస్సార్ హయాంలో 942 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తే.. చంద్రబాబు ప్రభుత్వం ఎనీ్టఆర్ వైద్యసేవగా దానిపేరు మార్చి కేవలం 117 వ్యాధులను మాత్రమే పెంచింది. అయినా వాటికి ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స సరిగా అందని దుస్థితి ఉండేది. ఇలా అనేక బూటకపు హామీలతో 2014లో అధికారంలో వచ్చి చంద్రబాబు చేసిన దగాను ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు. మందులూ మక్కీకి మక్కీ కాపీ.. తాము అధికారంలోకి వస్తే బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందులు పంపిణీ చేస్తామంటూ చంద్రబాబు మరో హామీ ఇచ్చారు. వాస్తవానికి రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్ విలేజ్ క్లినిక్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలను ఇప్పటికే పూర్తి స్థాయిలో అమలు చేస్తోంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా బీపీ, షుగర్, ఇతర జబ్బులున్న వారిని గుర్తించారు.బాధితులందరికీ సొంత గ్రామాలు, వార్డుల్లోనే ప్రభుత్వ వైద్యులు క్రమం తప్పకుండా ఫాలోఅప్ వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక మంచానికి పరిమితం అయిన వారి ఇళ్ల వద్దకే వెళ్లి సేవలు అందజేస్తున్నారు. ఉచితంగా మందులూ అందిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ వైద్యులే ప్రజల ఇంటి ముంగిటకే వెళ్లి సేవలు వైద్య సేవలు అందిస్తుంటే.. తాము అధికారంలోకి వస్తే మందులు ఉచితంగా ఇస్తామంటూ చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు. -
మండుటెండల్లోనూ జన సునామీ
సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన ఎన్నికల మలి విడత ప్రచారానికి జనం పోటెత్తారు. సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్రను తలపిస్తూ వెల్లువలా తరలివచ్చారు. ఆదివారం అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి జిల్లా వెంకటగిరి, శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా కందుకూరులో నిర్వహించిన సభలకు మండుటెండల్లోనూ ప్రజలు ప్రభంజనంలా కదిలివచ్చారు. తీవ్ర ఎండను, ఉక్కపోతను ఖాతరు చేయకుండా సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రసంగాన్ని ఆసాంతం ఆసక్తితో విన్నారు. గత 58 నెలల్లో చేసిన మంచిని సీఎం వివరించారు.ఈ పథకాలు మళ్లీ కొనసాగాలన్నా.. మరింత మేలు జరగాలన్నా.. పేదింటి భవిష్యత్తు మరింత గొప్పగా మారాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన కావాలన్నా.. మన పిల్లల బడులు బాగుపడాలన్నా.. ఆస్పత్రులు, వ్యవసాయం మరింత మెరుగుపడాలన్నా మన ప్రభుత్వం మళ్లీ రావాలన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కడానికి మీరంతా సిద్ధమేనా అని సీఎం జగన్ అడగ్గా మేమంతా సిద్ధమేనంటూ దిక్కులు పిక్కటిల్లేలా ప్రజలు నినదించారు. లక్షలాది మంది పిడికిళ్లు ఒక్కసారిగా పైకి లేపడంతో తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు దద్దరిల్లిపోయాయి. వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోను అన్ని వర్గాల ప్రజలూ పూర్తి స్థాయిలో ఆమోదించారనడానికి మూడు సభల్లో ఉవ్వెత్తున ఎగిసిన జనకెరటాలే నిదర్శనమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రచారాలకు జనస్పందన కనిపించడం లేదు. మొన్న సిద్ధం సభలు.. నిన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. నేడు మలి విడత ప్రచారంలో తొలి రోజు నిర్వహించిన సభలు గ్రాండ్ సక్సెస్ కావడంతో వైఎస్సార్సీపీదే అధికారమని రాజకీయ పరిశీలకులు తేల్చిచెబుతున్నారు.తరలివచ్చిన తాడిపత్రి.. ఎన్నికల మలి విడత ప్రచారానికి అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమవుతుందని తెలుసుకున్న నియోజకవర్గ ప్రజలు గ్రామాలకు గ్రామాలు తరలివచ్చారు. హెలీప్యాడ్ నుంచి సభ జరిగే వైఎస్సార్ సర్కిల్‌కు చేరుకునే వరకూ సీఎం జగన్ కాన్వాయ్ వెంట వేలాది మంది పరుగులు తీశారు. సభా ప్రాంగణానికి ఉదయం 11.55 గంటలకు చేరుకునే సరికి ఇసుకేస్తే రాలనంత స్థాయిలో జనంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. అప్పటికే 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయినప్పటికీ ప్రజలు లెక్కచేయలేదు. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ప్రతి ఇంటా తెచ్చిన విప్లవాత్మక మార్పులను సీఎం జగన్ వివరించారు. 2014–19 మధ్య బీజేపీ, జనసేనతో కూటమి కట్టి చంద్రబాబు చేసిన మోసాలు, అరాచకాలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు అదే కూటమి కట్టి అడ్డగోలు హామీలు ఇస్తూ వస్తున్న చంద్రబాబును నమ్మితే పులి నోట్లో తలపెట్టడమేనని చాటిచెబుతూ సీఎం చేసిన ప్రసంగానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.వెల్లువెత్తిన వెంకటగిరి..తిరుపతి జిల్లా వెంకటగిరిలో షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ ప్రచార సభ ప్రారంభమవుతుందని తెలుసుకున్న వేలాది మంది ప్రజలు వెల్లువలా పోటెత్తారు. 43 డిగ్రీల ఉష్ణోగ్రత, విపరీతమైన ఉక్కపోత ఇబ్బంది పెడుతున్నా వెనుకడుగేయలేదు. సభా ప్రాంగణానికి సీఎం జగన్ చేరుకునే సరికి మధ్యాహ్నం 2.25 గంటలైంది. దాదాపు రెండు గంటలు ఆలస్యంగా వచ్చినా జనం నిల్చున్న ప్రాంతం నుంచి కదల్లేదు. సీఎం జగన్‌ను చూడగానే హర్షధ్వానాలు చేస్తూ కేరింతలు కొట్టారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కాదని.. మన తలరాతలు మారుస్తాయని.. ఎవరి వల్ల మీకు మంచి జరిగింది.. ఎవరితో ఆ మంచి కొనసాగుతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. దీంతో ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ నినదిస్తూ వేలాది మంది ఒక్కసారిగా జయజయధ్వానాలు చేశారు.కదిలివచ్చిన కందుకూరునెల్లూరు జిల్లా కందుకూరులో షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ ప్రచార సభ ఉంటుందని తెలుసుకున్న ఆ నియోజకవర్గ ప్రజలు ఉదయం 10 గంటల నుంచే భారీ ఎత్తున కదిలివచ్చారు. దాంతో మధ్యాహ్నం 12 గంటలకే కందుకూరు జనసంద్రంగా మారింది. కందుకూరులో హెలీప్యాడ్ నుంచి సభ జరిగే కేఎంసీ సర్కిల్ వరకూ సీఎం జగన్ కాన్వాయ్ వెంట జనం పరుగులు తీశారు. ఆయనను దగ్గరి నుంచి చూసేందుకు పోటీపడ్డారు. సభా ప్రాంగణానికి సీఎం జగన్ చేరుకునే సరికి సాయంత్రం 4 గంటలైంది. అప్పటికి 42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. అంతటి ఎండలోనూ గంటలకొద్దీ నిలబడ్డ జనం సీఎం జగన్‌ను చూడగానే ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. సీఎం జగన్ ప్రసంగాన్ని జనం శ్రద్ధగా విన్నారు. ‘సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని చంద్రబాబులా బడాయి మాటలు నేను చెప్పడం లేదు. 58 నెలల పాలన మీద ప్రోగ్రెస్ రిపోర్టు మీ ముందు ఉంచి మార్కులు వేయండి అని మీ బిడ్డ అడుగుతున్నాడు’ అని సీఎం జగన్ చేసిన విజ్ఞప్తికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ‘మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లో ఉండాలి.. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి.. తాగేసిన టీ గ్లాస్ సింక్‌లోనే ఉండాలి’ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. దీనికి ప్రజలు సైతం శ్రుతి కలపడం విశేషం. మండుటెండల్లోనూ, తీవ్రమైన ఉక్కపోతల్లోనూ మూడు సభలకు పోటాపోటీగా జనం కదిలిరావడం.. ఒకదానికి మించి ఒకటి గ్రాండ్ సక్సెస్ కావడంతో రాబోయేది ఫ్యాన్ సునామీయేనని రాజకీయ విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు. ప్రచారం సాగే కొద్దీ వైఎస్సార్సీపీ ప్రభంజనం అంతకంతకూ పెరగడం ఖాయమని.. ఇది చూసి పోలింగ్‌కు ముందే కూటమి నేతలు, శ్రేణులు కాడి పారేయడం తథ్యమని స్పష్టం చేస్తున్నారు. -
సేద్యంలో సేవలకు సలాం
సాక్షి, అమరావతి: రైతుల సంక్షేమం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్త పథకాలు, ఉత్తమ విధానాలు అమలు చేస్తోందని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. వ్యవసాయ రంగంలో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ఇతర రాష్ట్రాలు అనుసరించి ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని సూచించింది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం అమలు చేయడంతో అప్పుల వలయం నుంచి రైతాంగం విముక్తి పొందుతున్నారనీ, ఆర్బీకేలు పారదర్శకంగా ఉంటూ రైతాంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని కితాబిచ్చింది. వికసిత్ భారత్ దిశగా ప్రోత్సాహానికి వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉత్తమ విధానాలు, ఆచరణలతో నీతి ఆయోగ్ నివేదిక విడుదల చేసింది. ఇందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల కోసం కొత్తగా అమలు చేస్తున్న పథకాలు.. ఉత్తమ విధానాలు, ఆచరణలను ప్రముఖంగా ప్రస్తావించింది. వీటిని ఇతర రాష్ట్రాలు నేర్చుకోవడానికి, భాగస్వామ్యం చేయడానికి నివేదికను విడుదల చేసినట్లు పేర్కొంది. ఈ నివేదికలో నీతి ఆయోగ్ పేర్కొన్న అంశాలివే.. వడ్డీ భారం మొత్తం ప్రభుత్వమే చెల్లింపు వైఎస్సార్ సున్నా వడ్డీతో రుణ భారం నుంచి రైతులు విముక్తి పొందారు. వారి సంక్షేమం, ప్రయోజనాలే లక్ష్యంగా ఈ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. సకాలంలో పంట రుణాలు చెల్లించే రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని ప్రభుత్వం వర్తింప చేస్తోంది. వడ్డీ రాయితీ మొత్తాన్ని రైతుల బ్యాంకుల ఖాతాల్లోనే నేరుగా జమ చేస్తోంది. వడ్డీ భారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ..లబ్ధిదారులు సకాలంలో రుణాన్ని చెల్లిస్తే ప్రభుత్వం వడ్డీని తిరిగి చెల్లిస్తోంది. పంటలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా రైతుల ప్రయోజనాల కోసం సీఎం వైఎస్ జగన్ ఉచిత పంటల బీమా కొత్త పథకాన్ని అమలు చేస్తున్నారు.ఈ పథకం కింద రైతుల నమోదును సులభతరం చేయడంతో పాటు కేవలం టోకెన్‌గా ఒక రూపాయి మాత్రమే వసూలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ ఉచిత పంటల బీమాను వర్తింప చేయడంతో రైతులకు వరంగా మారింది. వాతావరణ మార్పులు, ప్రకతి వైపరీత్యాలు లాంటి సమయాల్లో పంటలు దెబ్బతిన్న రైతులకు ఆయా సీజన్లోనే క్లెయిమ్‌లను నేరుగా రైతుల ఖాతాలకే జమ చేస్తున్నారు. దీంతోపాటు పంటల భౌతిక ధ్రువీకరణ కూడా రైతులకు అందిస్తోంది. రైతాంగానికి బీమా నమోదు రసీదులను కూడా పంపిణీ చేస్తున్నారు. ఉచిత పంటల బీమా నమోదు ప్రక్రియ వీలైనంత సరళంగా, అవాంతరాలు లేకుండా చేస్తున్నారు. ఈ పథకం విజయవంతంగా అమలయ్యే తీరు వ్యవసాయ అభివద్ధిని సూచిస్తోంది. రైతు భరోసా అందించే ఏకైక రాష్ట్రం వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకాలను ఏపీ ప్రభుత్వం మాత్రమే అమలు చేస్తోందని నీతి ఆయోగ్ పేర్కొంది. రైతులకు ఆర్థిక సాయం గ్రాంట్‌గా అందిస్తున్నారని తెలిపింది. ఏడాదిలో మూడు విడతల్లో రైతులకు రూ.13,500 చొప్పున అందిస్తున్నారని, సీజన్ ప్రారంభంలో భూమిని సిద్ధం చేసి, విత్తనాలు కొనుగోలు చేయడం, ఎరువులు, కూలీల చార్జీల నిమిత్తం రైతులకు ఉపయోగపడేలా ఈ పథకాలను అమలు చేస్తున్నారని నివేదిక వివరించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు ఈ పథకంలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొంది. ఉచిత విద్యుత్ కోసం ఏటా రూ.8,748 కోట్లు వ్యవసాయంలో ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి సుమారు రూ.8,748 కోట్లు చెల్లిస్తోందని నీతి ఆయోగ్ నివేదికలో తెలిపింది. దీన్ని మరింత పటిష్టపరిచేందుకు వచ్చే 30 ఏళ్ల పాటు నిరంతరాయంగా కొనసాగించేందుకు ముందస్తు చర్యలను ప్రభుత్వం చేపట్టిందని నివేదిక స్పష్టం చేసింది. దీంతో పాటు వ్యవసాయ విద్యుత్‌కు నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తోందని, ఇందుకోసం అన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల బిల్లులకు ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తుందని పేర్కొంది. ఉచిత విద్యుత్ బిల్లు సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుందని తెలిపింది. కేంద్రం సూచించిన సంస్కరణల్లో భాగంగా నగదు బదిలీ పథకాన్ని అమలు చేయనుందని, ఈ పథకంలో వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించడంతో రైతులపై ఆరి్థక భారాన్ని తగ్గిస్తుందని తెలిపింది. వచ్చే 30 ఏళ్లపాటు ఉచిత విద్యుత్ అందించడానికి 10,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను అభివద్ధి చేయనుందని తెలిపింది. రైతుల వ్యవసాయానికి ఉచితంగా పగటి పూట 9 గంటలపాటు విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్మిషన్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు రూ.1,700 కోట్లను ప్రభుత్వం వ్యయం చేసిందని నివేదిక తెలిపింది.అందివచ్చిన ఆర్బీకేలు: వ్యవసాయంలో సవాళ్లను పరిష్కరించేందుకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇది ఉత్తమ ఆచరణగా నీతి ఆయోగ్ కితాబు ఇచ్చింది. రైతులకు నాణ్యమైన ఇన్పుట్లు, సేవలు అందించడంతోపాటు సామర్థ్యం పెంపుదల, విజ్ఞాన వ్యాప్తిని ఆర్బీకేలు అందిస్తున్నాయని తెలిపింది. ఇవి పంటల సేకరణ కేంద్రాలుగా పని చేస్తూ రవాణా ఖర్చులను తగ్గించడం ద్వారా పారదర్శకంగా రైతాంగానికి భరోసా ఇస్తున్నాయని వ్యాఖ్యానించింది. ఈ కేంద్రాలు అధిక దిగుబడి సాధించడంలోను, పంటల నాణ్యతను మెరుగుపరిచేందుకు సహాయపడటంలో విజయవంతమయ్యాయని నివేదిక తెలిపింది. ఆర్బీకేలను పంటల కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించిన తరువాత రైతులు తమ ఉత్పత్తులను గ్రామంలోనే విక్రయించుకునే వీలు కలిగింది. వీటి ద్వారా రైతాంగం ప్రభుత్వ పథకాలు నేరుగా పొందుతున్నారు. ముందుగా పరీక్షించడం ద్వారా నకిలీ విత్తనాలను నిరోధించడంతో పాటు ప్రైవేట్ అవుట్లెట్లలో అధిక ధరలను నిరోధిస్తున్నాయి. వ్యవసాయ యాంత్రీకరణ, ఉచిత పంటల బీమా నమోదు కార్యక్రమాలు ఆర్బీకేలు నిర్వహిస్తున్నాయి. రైతులకు కావాల్సిన సలహాలు, సూచనలు శాస్త్రవేత్తలు అందిస్తున్నారు. -
అక్కచెల్లెమ్మలకు మరింత స్థిర ఆదాయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 45–60 ఏళ్ల మధ్య ఉన్న పేద అక్కచెల్లెమ్మల సంక్షేమమే లక్ష్యంగా, వారు ప్రతి నెలా మరింత స్థిర ఆదాయం పొందడానికి గత ఐదేళ్లు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాలను అమలు చేసింది. వచ్చే ఐదేళ్లు కూడా ఈ పథకాలను అమలు చేస్తామని తాజాగా ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్సార్సీపీ ప్రకటించింది.ఈ మూడు పథకాల ద్వారానే రాష్ట్రంలో 45–60 ఏళ్ల మధ్య వయసు ఉన్న అన్ని సామాజికవర్గాలకు చెందిన దాదాపు 43 లక్షల మంది అక్కచెల్లెమ్మలు ప్రయోజనం పొందారు. వీరిలో 18.37 లక్షల మంది ప్రభుత్వ సాయాన్ని ఉపయోగించుకుంటూ కొత్తగా వివిధ రకాల వ్యాపారాలు ఏర్పాటుకు ముందుకొచ్చారు.మరికొంతమంది తమకు వచ్చిన శాశ్వత జీవనోపాధులను ఏర్పాటు చేసుకున్నారు. తద్వారా ఇప్పటికే ప్రతి నెలా రూ. 10 వేల దాకా స్థిర ఆదాయం పొందుతున్నారు. ఆయా పథకాలను మరో ఐదేళ్ల పాటు కొనసాగించడం ద్వారా ఇంకా లక్షలాది పేద కుటుంబాలు ప్రతి నెలా స్థిర ఆదాయం పొందుతాయని అధికార వర్గాలు, ఆర్థిక నిఫుణులు పేర్కొంటున్నారు.వైఎస్సార్ చేయూత (తమ కాళ్లపై తాము నిలబడేలా ఇకపై రూ.1.50 లక్షల వరకు) ఈ ఐదేళ్లు 33.15 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.75 వేలు ఇచ్చింది. ఇలా ఇప్పటికే రూ.19,189 కోట్లు అందజేసింది. వచ్చే ఐదేళ్లూ ఇలా.. 45–60 ఏళ్ల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఏదో ఒక ఆదాయం ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటుంది. అది పెన్షన్ లేదా చేయూత కావచ్చు.. ఇలా ఉండేలా చేయూత పథకాన్ని కొనసాగిస్తారు. ♦ వచ్చే ఐదేళ్లలో నాలుగు విడతల్లో రూ.18,750 చొప్పన మరో రూ.75 వేలు ప్రభుత్వం అందిస్తుంది. మొత్తంగా 8 విడతల్లో రూ.1.50 లక్షల లబ్ధి చేకూరినట్టవుతుంది. ♦ అలాగే బ్యాంకులతో, ప్రఖ్యాత సంస్థలతో టై అప్ కోసం సూచనలు, సలహాలు ఇస్తూ లేదా వారి సొంత వ్యాపారం ద్వారా వారు నిలదొక్కుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. వైఎస్సార్ కాపు నేస్తం(కాపు అక్కచెల్లెమ్మలకు భరోసా.. ఇకపై రూ.1.20 లక్షల వరకు)♦ 4.63 లక్షల మంది కాపు అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15,000 చొప్పున నాలుగు విడతల్లో రూ.60 వేలు ప్రభుత్వం అందజేసింది. ఇలా ఇప్పటికే రూ.2,030 కోట్లు ఇచ్చింది. ♦ వచ్చే ఐదేళ్లలో నాలుగు విడతల్లో రూ.15,000 చొప్పున మరో రూ. 60 వేలు అందజేస్తుంది. మొత్తంగా 8 విడతల్లో రూ.1.20 లక్షల లబ్ధి.♦ కాపు, బలిజ, తెలగ ఒంటరి కులాల అక్కచెల్లెమ్మలకు ఏదో ఒక ఆదాయం ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటుంది. అది పెన్షన్ లేదా కాపు నేస్తం కావొచ్చు.. ఇలా ఉండేలా వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని కొనసాగిస్తూ 45 నుంచి 60 ఏళ్ల లోపు ఆ వర్గాల నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15 వేల చొప్పున నాలుగు విడతల్లో వచ్చే ఐదేళ్లలో రూ.60 వేలు అందజేస్తారు.వైఎస్సార్ ఈబీసీ నేస్తం(అగ్రవర్ణాల పేద అక్కచెల్లెమ్మలకు చేదోడు.. ఇకపై రూ.1.05 లక్షల వరకు)♦ ఈ ఐదేళ్లలో ఇప్పటికే 4.95 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.1,877 కోట్లు ప్రభుత్వం అందజేసింది. ♦ వచ్చే ఐదేళ్లలో నాలుగు విడతల్లో రూ.15,000 చొప్పున మరో రూ.60 వేలు అందిస్తుంది. మొత్తం ఏడు విడతల్లో రూ.1.05 లక్షల లబ్ధి♦రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజికవర్గాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు ఏదో ఒక ఆదాయం ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటుంది. అది పెన్షన్ లేదా ఈబీసీ నేస్తం కావొచ్చు. ఇలా ఉండేలా వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని కొనసాగిస్తూ 45 నుంచి 60 ఏళ్ల లోపు ఆ వర్గాల నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15 వేల చొప్పున నాలుగు విడతల్లో వచ్చే ఐదేళ్లలో మరో రూ. 60 వేలు అందిస్తారు.ఆర్థిక తోడ్పాటుకు అదనంగా..♦ కేవలం ఆర్థికసాయం అందజేయడానికే ప్రభుత్వం పరిమితం కాలేదు. వైఎస్సార్ చేయూత తదితర పథకాల ద్వారా అందుకున్న నగదును ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు పూర్తి స్వేచ్ఛని ఇచ్చింది. గత ఐదేళ్లలో చిన్న, మధ్యతరహా వ్యాపారాలతో ముందుకొచ్చిన లబ్ధిదారులకు అదనపు తోడ్పాటును కూడా అందించింది. ఇందులో భాగంగా నాలుగేళ్ల క్రితమే హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ఐటీసీ, ప్రాక్టర్ – గాంబుల్, రిలయన్స్ రిటైల్, అమూల్, అజియో బిజినెస్ వంటి అంతర్జాతీయ వ్యాపార సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. ♦ ప్రభుత్వం అందజేసిన లబ్ధితో కొత్తగా శాశ్వత జీవనోపాధిని పొందడానికి ముందుకొచ్చిన వారికి ఆయా వ్యాపార సంస్థల ద్వారా తగిన శిక్షణ అందజేశారు. మిగిలిన రిటైల్ వ్యాపారుల కంటే తక్కువ ధరలకే ఆయా దిగ్గజ సంస్థలు తమ ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాయి. లేదంటే అక్కచెల్లెమ్మలు తయారు చేసే ఉత్పత్తులను నేరుగా ఆయా సంస్థలే కొనుగోలు చేస్తూ తోడ్పాటును అందిస్తున్నాయి. ♦ శాశ్వత జీవనోపాధిని పొందే క్రమంలో ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సహాయానికి అదనంగా ఇంకా నిధుల అవసరం పడితే.. ఆ మొత్తాన్ని కూడా బ్యాంకుల నుంచి రుణాల రూపంలో తక్కువ వడ్డీకే అందేలా ప్రభుత్వం సహకారం అందించింది. -
కాపీ కొట్టిన మేనిఫెస్టోనే అంతా చెబుతోంది!
తెలుగు దేశం పార్టీ కోసం పనిచేస్తున్న ‘కన్సల్టెన్సీ’ హెడ్ రాబిన్ శర్మ ‘‘ఎన్నికల్లో టీడీపీ గెలుపు దుర్లభమనీ, తాము చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదనీ, చంద్రబాబుకు ఏమాత్రం విశ్వసనీయత లేక పోవడమే అసలు సమస్య’’ అనడం రేపు ‘పోలింగ్ బూత్’లో తటస్థ ఓటరుపై గట్టి ప్రభావం చూపి స్తుంది. ఎందుకంటే, ఇది మరొక ప్రత్యర్థి రాజకీయ పార్టీ అంటున్న మాట కాదు. మన కోసం మనం ‘ఫీజు’ కట్టి పెట్టుకున్న ‘సర్వీస్ ప్రొవైడర్’ వ్యక్తం చేసిన నిస్సహాయత. ఇది ఎటువంటిది అంటే, మన ‘ఫ్యామిలీ డాక్టర్’– ‘‘మీ జబ్బును నేను తగ్గించ లేకపోతున్నాను’’ అని పెదవి విరవడం వంటిది. వాళ్ళు అటువంటి ముగింపుకు రావడానికి కారణం, ఆరు నెలల క్రితం ‘మేనిఫెస్టో’లో నుంచి ‘బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ’ పేరుతో ‘సూపర్ సిక్స్’ పథకాలు ‘ట్రయిల్’ కోసం విడుదల చేశారు. ఆ తర్వాత దానికి విస్తృతంగా ప్రచారం చేసినా ప్రజల నుండి స్పందన లేదు. ఈ ‘టీం’ ఇటువంటి అభిప్రాయానికి రావడానికి ఇదే ప్రధాన కారణం అయింది. ఈ దశలో ‘రిస్క్ మేనేజ్మెంట్’ కోసం ప్రశాంత్ కిషోర్ తెరపైకి వచ్చి, తన ప్రకటనకు ముందూ వెనుకా ఎటువంటి వివరణ లేకుండా, ‘ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలవదు’ అని ఏకవాక్య ప్రకటన చేసి మళ్ళీ ఎక్కడా కనిపించకుండా నిష్క్రమించారు. ఈ ప్రకటన మనం నమ్మడం కోసం ముందుగా – ‘ఈ ఎన్నికల్లో నేను టీడీపీ కోసం పనిచేయడం లేదు’ అని ప్రకటించాక, ‘వైఎస్సార్సీపీ గెలవదు’ అన్నారు. ఇది జరిగాక కావొచ్చు, చివరి ప్రయత్నంగా ప్రశాంత్ కిషోర్– ‘వదలొద్దు మరో ప్రయత్నం చేయండి’ అని రాబిన్ శర్మ బృందానికి సూచించారు. ఇప్పుడు టీడీపీ పూర్తి స్థాయిలో ‘మేనిఫెస్టో’ వెల్లడించిన తర్వాత కూడా అన్ని ‘సర్వే’ నివేదికలు జగన్‌కు అనుకూలంగా ఉన్నాయి. సరిగ్గా ఈ కాలంలోనే, చంద్రబాబు తన ప్రసంగాల్లో ‘బ్యాలెన్స్’ కోల్పోవడం మొదలయింది. సభకు వచ్చినవాళ్లను ‘మీ ఊళ్లో గంజాయి దొరుకుతోందా’ అని గుచ్చి గుచ్చి అడుగుతూ తనకు అనుకూలమైన సమా ధానం పొందేందుకు ఇబ్బంది పెడుతున్నారు. ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థిని సాధారణంగా శత్రు వుగా చూడరు. జగన్ విషయంలో బాబు ఆ హద్దు ఎప్పుడో దాటారు. ఎప్పుడైనా ఎన్నికల ‘నోటిఫికేషన్’ అంటే చంద్ర బాబుకు ఆయన పార్టీ అభ్యర్థులకు అది ‘టెండర్ నోటీస్’ వంటిది. అందుకే ఎన్నికల సమయానికి ఆర్థిక నేరస్థులూ, ‘ఎన్నారై’లూ అ పార్టీలో అభ్య ర్థులుగా ఉంటారు. వీరి వద్ద నుంచి నిధులను సమీకరించి ముందుగా వాటిని తన నేలమాళిగలో దాచి, అప్పుడు తన పార్టీ ‘మేనిఫెస్టో’ అంటూ బాబు ప్రజల ముందు ‘టెండర్’ దాఖలు చేస్తారు. గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ఐదేళ్ళ సంపాదనముందుగా దాచిన దానికి అదనం. ప్రతి ఎన్నికలో బాబుది ఇదే ‘ఫార్ములా’. అందుకే, ప్రతిపక్ష నాయ కుడిగా బాబు ఎలాగోలా నెట్టుకుంటూ తన పార్టీ ఉనికిని ఎన్నికల వరకు దొర్లించి, చివరిలో ఎవరో కొందరి మద్దతు తీసుకుని; మళ్ళీ తన టోపీని ఎన్నికల ‘ఎరీనా’లోకి విసురుతారు. గెలిస్తే, ‘డబల్ బెనిఫిట్’; ఓడిపోతే, ‘సింగిల్ బెనిఫిట్’. బాబుకు ఎన్నికలు అంటే, ఇంత ‘సింపుల్’.అందుకే గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను తప్పు పట్టిన బాబు, ఎన్నికల ముందు ‘సూపర్ సిక్స్’ అంటూ అరువు తెచ్చుకున్న అంశాలతో ‘కిచిడీ’ మేనిఫెస్టో’ ప్రకటించారు. అందులోని అంశాలు: టీడీపీ అధికారంలోకి వస్తే ‘మహా శక్తి’ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు ‘స్త్రీనిధి‘ కింద నెలకు 1500 రూపాయలు, ‘తల్లికి వందనం’ పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే.. వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున, ‘దీపం‘ పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల సరఫరా చేయడం, స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. జగన్ సంక్షేమ పథకాలను తప్పు పట్టి, మళ్ళీ వాటినే పేర్లు మార్చి అమలుచేస్తాననే ఈ ‘యూ టర్న్’ ఏమిటి? అనే ప్రశ్నకు జవాబు మనం మూడు చోట్ల వెతకాలి. మొదటిది అమరావతి. బాబును నమ్మి అక్కడ భూములు కొన్న ‘ఎన్నారై’లకు ఈ ఎన్నికల్లో బాబు గెలుపు అవసరం. అది వారికి జీవన్మరణ సమస్య. అందుకే వాళ్ళు స్వయంగా నెల ముందుగా ఇండియా వచ్చి టీడీపీ కోసం ఇక్కడ ప్రచారం చేసే పనిలో ఉన్నారు. రెండవది – ‘మార్గదర్శి’ రామోజీరావు భవిష్యత్తు. మూడవది – పై రెండింటి కంటే సంక్లిష్టమైన కొడుకు లోకేష్ చుట్టూ అల్లుకుని ఉన్న కుటుంబ చట్రంలో నుంచి బాబు క్షేమంగా బయటపడటం. బయట నుంచి దీన్ని చూస్తున్న మనకే వీటికి పరిష్కారం ఉందని అనిపించడం లేదు. ఇంకా మనకు తెలియనివి ఎన్ని ఉన్నాయో వాటి సంగతి ఏమిటో... మరో నెల రోజులు కాలం తర్వాత తెలుస్తుంది. - వ్యాసకర్త మాజీ శాసన సభ్యులు మొబైల్: 98481 28844 - అడుసుమిల్లి జయప్రకాష్ -
అంజన్న సాక్షిగా అబద్ధాలు చెబుతారా?
కరీంనగర్ టౌన్: ఆరు గ్యారంటీలను అమలు చేశామని అంటున్న కాంగ్రెస్ నేతలు కొండగట్టు అంజన్న సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. కొండగట్టు అంజన్న చాలా పవర్ ఫుల్ అని, ఆయన సన్నిధిలో అబద్ధాలాడిన, దొంగ హామీలిచ్చిన కేసీఆర్, ఆయన కుమార్తె కవితకు ఏ గతి పట్టిందో కాంగ్రెస్ నేతలకూ అదే గతి పడుతుందని హెచ్చరించారు. ‘ఆరు గ్యారంటీలను అమలు చేశామంటున్న ఆ కాంగ్రెస్ నేతను అడుగుతున్నా.. మహిళలకు ప్రతి నెలా రూ.2500 ఎంతమందికి ఇచ్చారు..? రైతులు, కౌలు రైతులకు రూ.15వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు ఎంతమందికి అందించారు..? ధాన్యం క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చారా..? తరుగు లేకుండా ధాన్యాన్ని సర్కారే కొనుగోలు చేస్తామన్నారు.. చేశారా..? అని ప్రశ్నించారు. కరీంనగర్లో గురువారం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీజేపీ మండలాల అధ్యక్షులు, ఇన్చార్జిల తో బండి çసమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కై నయ్.. రెండుపార్టీలు కలిసి నన్ను ఓడించడానికి కుట్ర చేస్తున్నయి.’’ అని ఆరోపించారు. ప్రజలకు కాంగ్రెస్ మంచి చేస్తే పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నుంచి హుస్నాబాద్‌కు ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. ఈ నెల 21న వేలాదిమందితో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధిగా నామినేషన్ వేస్తున్నట్లు బండి ప్రకటించారు. -
జనంలోకి జననేత.. పథకాల కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ (ఫొటోలు)
-
ఈ–స్కూటర్‌కు రూ.10,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాల విక్రయాలను దేశవ్యాప్తంగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని బుధవారం ప్రకటించింది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ టూవీలర్‌కు రూ.10,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తారు. సుమారు 3.33 లక్షల యూనిట్ల ఈ–టూవీలర్లకు మద్దతు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అలాగే ఈ–రిక్షా, ఈ–కార్ట్ కొనుగోలుకు రూ.25,000 వరకు, పెద్ద ఈ–త్రీవీలర్‌కు రూ.50,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం ఉంటుంది. 41,000 యూనిట్లకు ఈ స్కీమ్‌ను విస్తరిస్తారు. ఈ పథకం కోసం భారీ పరిశ్రమల శాఖ రూ.500 కోట్లను కేటాయించింది. 2024 ఏప్రిల్‌తో మొదలై జూలై వరకు ఈ స్కీమ్‌ను అమలు చేస్తారు. ఫేమ్–2 సబ్సిడీ పథకం ఈ ఏడాది మార్చి 31న ముగుస్తుండడంతో ప్రభుత్వం కొత్త పథకాన్ని పరిచయం చేసింది. ఇవి చదవండి: పేటీఎంకు మరో బిగ్ షాక్..! -
ఆర్బీఐ అంబుడ్స్‌మన్ స్కీములకు ఫిర్యాదుల వెల్లువ
ముంబై: రిజర్వ్ బ్యాంక్ అంబుడ్స్‌మన్ స్కీముల కింద వివిధ సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 2022–23లో ఇవి 68 శాతం పెరిగి 7.03 లక్షలుగా నమోదయ్యాయి. మొబైల్/ఎల్రక్టానిక్ బ్యాంకింగ్, రుణాలు, ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు, పింఛను చెల్లింపులు, రెమిటెన్సులు మొదలైన వాటికి సంబంధించిన ఫిర్యాదులు వీటిలో ఉన్నాయి. ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోవడం, ఆర్బీఐ–సమీకృత అంబుడ్స్‌మన్ స్కీము (ఆర్బీ–ఐవోఎస్) కింద దాఖలు చేసే ప్రక్రియను సరళతరం చేయడం తదితర అంశాలు ఫిర్యాదుల నమోదుకు దోహదపడ్డాయని అంబుడ్స్‌మన్ స్కీము వార్షిక నివేదిక పేర్కొంది. అత్యధికంగా 83.78 శాతం ఫిర్యాదులు (1,93,635) బ్యాంకులపై వచ్చాయి. అంబుడ్స్‌మన్ ఆఫీసులు 2,34,690 ఫిర్యాదులను హ్యాండిల్ చేశాయి. సమస్య పరిష్కారానికి పట్టే సమయం సగటున 33 రోజులకు మెరుగుపడింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇది 44 రోజులుగా ఉంది. -
పంజాబ్‌లో ‘ఉచిత రేషన్’ ఎలా అందిస్తున్నారు?
రాబోయే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే పంజాబ్‌లోని భగవంత్ మాన్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలకు ఉచిత రేషన్ అందిస్తోంది. పంజాబ్‌లో ఇంటింటికీ ఉచిత రేషన్ పథకాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. ఈ పథకం కింద లబ్ధిదారులు ఇంటి వద్దనే రేషన్ అందుకోవచ్చు. మొదటి దశలో పంజాబ్‌లోని 25 లక్షల మందికి ఈ పథకం ప్రయోజనాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద ఒక్కొక్కరికి ఐదు కిలోల గోధుమ పిండిని ఉచితంగా అందజేస్తారు. మిగిలిన రేషన్ సరుకులను దఫదఫాలుగా అందించనున్నారు. పంజాబ్‌లో 38 లక్షల మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు. 20, 500 ప్రభుత్వ రేషన్ దుకాణాలు ఉన్నాయి. 1,500 మందికి పైగా యూత్ డెలివరీ ఏజెంట్లు ఉన్నారు. మొదటి దశలో 25 లక్షల కుటుంబాలకు రేషన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద లబ్ధిదారులు ప్రతి నెలా ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందుకోవచ్చు. లబ్ధిదారులు గోధుమపిండి స్థానంలో ఇతర అందుబాటులో ఉన్న ఆహార ధాన్యాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. పంజాబ్ ప్రభుత్వం ప్రారంభించిన ఇంటింటికీ రేషన్ పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారు లబ్ధిపొందవచ్చు. -
‘నమో డ్రోన్ దీదీ’ అంటే ఏమిటి? ఎవరికి ప్రయోజనం?
వ్యవసాయం ఎంతో శ్రమతో కూడుకున్నది. అయితే ఇప్పుడు టెక్నాలజీ సహాయంతో ఇది సులభతరంగా మారుతోంది. మరోవైపు వ్యవసాయరంగంలో మహిళల ప్రాధాన్యత పెంచేందుకు ప్రభుత్వం నూతన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపధ్యంలో రూపొందినదే ‘నమో డ్రోన్ దీదీ’ పథకం. వ్యవసాయ పనులకు ‘నమో డ్రోన్ దీదీ’ పథకం మరింత సహయకారిగా మారింది. ఈ పథకాన్ని దేశంలో తొలుత పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. ఫలితాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం దీనిని విస్తరించబోతోంది. ఈ నేపధ్యంలోనే ఈ పథకంలో భాగస్వాములైన 300 మంది మహిళలు మార్చి 11న ప్రధాని నరేంద్ర మోదీ ఎదుట తమ అనుభవాలను పంచుకోనున్నారు. అలాగే వారు డ్రోన్‌ను ఎగురవేసే విధానాన్ని కూడా నాటి కార్యక్రమంలో ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం న్యూఢిల్లీలోని పూసా సెంటర్లో నిర్వహించనున్నారు. ఆరోజు ప్రధాని మోదీ వెయ్యమంది మహిళలకు డ్రోన్లను అందజేయనున్నారు. డ్రోన్‌తో పాటు బ్యాటరీతో పనిచేసే వాహనాన్ని కూడా మహిళలకు ఇవ్వనున్నారు. గుజరాత్‌లోని భరూచ్ జిల్లాకు చెందిన కృష్ణ హరికృష్ణ పటేల్ డ్రోన్ దీదీగా పనిచేస్తున్నారు. డ్రోన్ల సాయంతో 45 నిమిషాల్లో వ్యవసాయ పనులు పూర్తి చేయవచ్చని తెలిపారు. డ్రోన్ ఆపరేట్ చేస్తూ పంటలను పర్యవేక్షించడం, పురుగుమందులు, ఎరువులు పిచికారీ చేయడం, విత్తనాలు వెదజల్లడం లాంటి పనులు సులభంగా చేయవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం 450 మంది డ్రోన్ దీదీలు 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని వ్యవసాయ కార్యకలాపాలలో తమ సేవలను అందిస్తున్నారు. ఈ ఏడాది వెయ్యి మంది మహిళలను డ్రోన్ దీదీలుగా తయారు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డ్రోన్ పైలట్లుగా మారాలనుకుంటున్న గ్రామీణ ప్రాంత మహిళలకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. లైసెన్స్ పొందిన డ్రోన్ దీదీ ఒక సీజన్లో రూ. 2.5 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. -
బెంగాల్లో స్కీములన్నీ స్కాములే
కృష్ణనగర్: పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. స్కీములను స్కాములుగా మార్చడంలో తృణమూల్ కాంగ్రెస్ పారీ్ట(టీఎంసీ) ప్రభుత్వం మాస్టర్ డిగ్రీ సాధించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో పథకాలన్నీ కుంభకోణాలుగా మారాయని ఆరోపించారు. అణచివేత, వారసత్వ రాజకీయాలు, మోసాలు, ద్రోహానికి మమత సర్కారు మారుపేరుగా మారిందని ఆరోపించారు. మోదీ శనివారం పశ్చిమ బెంగాల్లో పర్యటించారు. నాడియా జిల్లాలోని కృష్ణనగర్‌లో రూ.15,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. రూ.940 కోట్లకు పైగా విలువైన నాలుగు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రంసంగించారు. బెంగాల్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా చర్యలు చేపట్టామని చెప్పారు. రాష్ట్ర ఆరి్ధకాభివృద్ధికి, నూతన ఉద్యోగాల సృష్టికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లోని మొత్తం 42 స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందన్నారు. టీఎంసీ అంటే తూ, మై, ఔర్ కరప్షన్ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై అధికార తృణమూల్ కాంగ్రెస్ నాయకులు సాగించిన అకృత్యాల పట్ల ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వం బాధిత మహిళలను గోడు వినిపించుకోవడం లేదని, నిందితులను అరెస్టు చేయకుండా కాపాడుతోందని ధ్వజమెత్తారు. ప్రజలు ఎన్నో ఆశలతో నమ్మి అధికారం అప్పగిస్తే ప్రభుత్వం వారి సంక్షేమం కోసం చేసిందేమీ లేదని అన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం ‘మా, మాటీ, మను‹Ù’ అంటూ నినాదాలు చేసే తృణమూల్ కాంగ్రెస్ మన అక్కచెల్లెమ్మలకు రక్షణ కలి్పంచడం లేదని మండిపడ్డారు. ఎవరిని ఎప్పుడు అరెస్టు చేయాలో నేరగాళ్లే నిర్ణయిస్తున్నారని, పోలీసులు చేతులెత్తేస్తున్నారని చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్‌కు అవినీతి, బంధుప్రీతి తప్ప అభివృద్ధి అంటే ఏమిటో తెలియని ఎద్దేవా చేశారు. టీఎంసీ అంటే తూ, మై, ఔర్ కరప్షన్(నువ్వు, నేను, అవినీతి) దుయ్యబట్టారు. బిహార్‌లో అరాచక పాలన మళ్లీ రానివ్వం ఔరంగాబాద్: ప్రధాని మోదీ శనివారం బిహార్‌లో పర్యటించారు. రూ.34,800 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను లాంఛనంగా ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఔరంగాబాద్, బెగుసరాయ్ జిల్లాల్లో బహిరంగ సభల్లో మాట్లాడారు. వారసత్వ రాజకీయాలను నమ్ముకున్న నాయకులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం చేయలేకపోతున్నారని, రాజ్యసభ మార్గం ద్వారా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టాలని చూస్తున్నారని చెప్పారు. బిహార్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని అన్నారు. ఇక ఎప్పటికీ ఎన్డీయేలోనే ఉంటా: నితీశ్ కుమార్ తన ప్రయాణం ఇకపై ఎప్పటికీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతోనే అని బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 400కుపైగా స్థానాలు కచి్చతంగా గెలుచుకుంటుందని అన్నారు. ఔరంగాబాద్, బెగుసరాయ్ జిల్లాల్లో జరిగిన సభల్లో ఆయన ప్రసంగించారు. అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించడానికి తమ రాష్టానికి వచి్చన ప్రధాని మోదీకి సాదరంగా స్వాగతం పలుకుతున్నానని చెప్పారు. కొంతకాలం ఎన్డీయేకు దూరమయ్యానని, మళ్లీ తిరిగివచ్చానని, ఇకపై ఇదే కూటమిలో కొనసాగుతానంటూ ప్రధాని నరేంద్ర మోదీకి హామీ ఇస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా నితీశ్‌ను చూస్తూ ప్రధాని మోదీ చిరునవ్వులు చిందించడం విశేషం. -
ఫ్రీ కరెంట్ కావాలంటే ఇలా చేయండి.. డబ్బులు కూడా ఇస్తారు!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం 'పీఎం సూర్య ఘర్ - ముఫ్త్ బిజిలీ యోజన'కు ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద రూఫ్‌టాప్ సోలార్‌ను ఇన్స్టాల్ చేయడానికి గరిష్ఠంగా రూ.78000 సబ్సిడీ అందిస్తోంది. ఈ కొత్త స్కీమ్ ద్వారా ప్రజలు నెలకు 300 యూనిట్ల కరెంటును ఉచితంగానే పొందవచ్చు. కేంద్రం ఈ కొత్త పధకం కోసం ఏకంగా రూ.75000 కోట్లు వెచ్చిస్తోంది. సబ్సిడీ వివరాలు కేంద్ర ప్రభుత్వం ఈ ఫ్రీ విద్యుత్ పథకాన్ని పలు విధాలుగా విభజించి సబ్సిడీ అందిస్తోంది. దీని కింద ఒక కిలోవాట్ సిస్టమ్‌కు రూ. 30000, రెండు కిలోవాట్ల సిస్టమ్‌కు రూ. 60000, మూడు కిలోవాట్ల సిస్టమ్‌కు ఏకంగా రూ.78000 సబ్సిడీ అందిస్తోంది. రూఫ్‌టాప్ సోలార్‌ను ఇన్స్టాల్ చేసుకోవడానికి సుమారు రూ.1.45 ఖర్చు అవుతుంది. ఇందులో సగం వరకు రాయితీ లభిస్తుంది. రాయితీ కాకుండా మిగిలిన డబ్బు కూడా బ్యాంకులు చాలా తక్కువ వడ్డీకే అందిస్తాయి. ఉదాహరణకు 3 కిలోవాట్ సిస్టమ్‌కు రూఫ్‌టాప్ సోలార్‌ను ఇన్స్టాల్ చేసుకోవడానికి రూ.1.45 ఖర్చు అయిందనుకున్నప్పుడు, అందులో రూ. 78000 రాయితీ లభిస్తుంది. కాబట్టి మిగిలిన రూ. 67000 కూడా బ్యాంకు నుంచి తక్కువ వడ్డీకే పొందవచ్చు. నెలకు 50 యూనిట్ల విద్యుత్ వాడే వారికి 1 కిలోవాట్ నుంచి 2 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్‌ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే 150 యూనిట్ల నుంచి 300 యూనిట్లను ఉపయోగించుకునే వారికి 2 కిలోవాట్స్ నుంచి 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిం రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. పీఎం సూర్య ఘర్ - ముఫ్త్ బిజిలీ యోజనకు అప్లై చేసుకునే విధానం 👉స్టెప్-1 అధికారిక వెబ్సైట్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోండి. మీ రాష్ట్రం, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎంచుకోండి. ఎలక్ట్రిసిటీ కన్స్యూమర్ (వినియోగదారు) నెంబర్, మొబైల్ నెంబర్ & ఈ-మెయిల్ వంటి వాటిని ఎంటర్ చేయండి. 👉స్టెప్-2 వినియోగదారు నంబర్ & మొబైల్ నంబర్‌తో లాగిన్ చేయండి. ఫామ్ ప్రకారం రూఫ్‌టాప్ సోలార్ కోసం అప్లై చేసుకోండి. 👉స్టెప్-3 డిస్కమ్ నుంచి అనుమతి వచ్చిన తరువాత, రిజిస్టర్డ్ విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. 👉స్టెప్-4 ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత, ప్లాంట్ వివరాలను సమర్పించి నెట్ మీటర్ కోసం అప్లై చేసుకోండి. 👉స్టెప్-5 నెట్ మీటర్‌ను ఇన్స్టాల్ చేసిన తర్వాత, డిస్కమ్ అధికారులు చెక్ చేసి, తర్వాత పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికెట్ ఇస్తారు. 👉స్టెప్-6 కమిషనింగ్ సర్టిఫికెట్ పొందిన తరువాత బ్యాంక్ వివరాలతో పాటు క్యాన్సిల్డ్ చెక్ పోర్టల్‌లో సబ్మిట్ చేయాలి. ఇలా చేసిన 30 రోజుల లోపల సబ్సడీ అమౌట్ మీ అకౌంట్లోకి జమ అవుతుంది. -
మహాలక్ష్మి స్కీమ్ తో మహిళలకు అవస్థలు.. సజ్జనార్ క్లారిటీ
-
జగనన్న విద్యా దీవెన విడుదల
-
కేవలం పిల్లల కోసమే 57 నెలలో 73 వేల కోట్లు ఖర్చు చేశాం
-
బాబు పథకాలపై 11కు పైగా ప్రశ్నలు
సాక్షి, అమరావతి 1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోర్టల్ ‘పేదరికంపై గెలుపు’ ఈ క్రింది వానిలో సాధారణ వేదిక? 2. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘ఎన్టీఆర్ విదేశీ విద్య ఆదరణ’ పథకం ఈ క్రింది వారిలో ఏ వర్గపు విద్యార్థులకు ఉద్దేశించబడింది? 3. చేతివృత్తుల వారికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు? 4. ‘పసుపు కుంకుమ’ పథకం ఈ క్రింది వారిలో ఏ వర్గానికి ఒకసారి ఆర్థిక తోడ్పాటు అందించడానికి ఉద్దేశించబడింది? 5. చంద్రన్న పెళ్లి కానుక పథకం క్రింద కులాంతర వివాహం చేసుకున్న జంటలో ఒకరు షెడ్యూల్డ్ కులానికి చెందినవారైతే ఆ జంటకు ఇచ్చే ప్రోత్సాహక బహుమతి (రూ.లలో)... ఏంటి ఈ ప్రశ్నలు అనుకుంటున్నారా? గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018లో నిర్వహించిన గ్రూప్–2లో అడిగిన ప్రశ్నలు. ఈ ఐదు ప్రశ్నలే కాదు నాటి గ్రూప్–2 పరీక్షలో ప్రభుత్వ పథకాలపై మొత్తం 11 ప్రశ్నలు ఇచ్చారు. ముఖ్యంగా 137 నుంచి 142 వరకు వరుసగా ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలు అడిగారు. చివరకు చంద్రబాబు తెచ్చిన అట్టర్ ఫ్లాప్ పథకం పసుపు–కుంకుమపైన కూడా ప్రశ్న ఇచ్చారు. అయితే ప్రభుత్వ పథకాలపై గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నలు ఇవ్వడమేంటి అని నాడు ఎల్లో మీడియా ప్రశ్నిస్తే ఒట్టు. ఎందుకంటే నాడు అధికారంలో ఉంది.. ఎల్లో మీడియాకు కావాల్సిన చంద్రబాబు. దీంతో గ్రూప్–2లో 11 ప్రశ్నలు ఇచ్చినా ఎల్లో మీడియా ఇదేంటి అని నిలదీసింది లేదు. ఇక ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తాజాగా నిర్వహించిన గ్రూప్–2లో ఒక పదం మాత్రమే ఇస్తే అది ఎల్లో మీడియాకు పెద్ద పాపంలా కనిపించింది. అందుకే గ్రూప్స్‌లో జగనన్న భజనేనా అంటూ విష కథనాన్ని అచ్చేసింది. ఒక్క పదానికే ఎల్లో మీడియా రచ్చరచ్చ తాజాగా ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్–2 ప్రిలిమ్స్‌లో ‘మెంటల్ ఎబిలిటీ’ విభాగంలో ఒక సమస్యను పరిష్కరించేందుకు ఓ పేరాను ఇచ్చారు. అందులో ‘ఆడుదాం ఆంధ్ర’ అనే పదం మాత్రమే పేర్కొన్నారు. సదరు పేరాను చదివి 123–125 వరకు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. అంతకుమించి ‘ఈ పథకం ఎప్పుడు పెట్టారు?, ఈ పథకం ఏ తేదీన ప్రారంభించారు?’ అనే ప్రశ్నలు లేవు. అయినా సరే ‘ఆడుదాం ఆంధ్ర’ అనే ఒక్క పదమే ఎల్లో మీడియాకు తప్పుగా కనిపించింది. అలాగే 108వ ప్రశ్న.. ‘ఈ క్రింది వాటిలో ఏది తప్పుగా జతచేయబడింది?’లో భాగంగా ఇచ్చిన ‘చేదోడు’ పదం కూడా ఎల్లో మీడియాకు తప్పుగా కనిపించింది. దీంతో తట్టుకోలేక గ్రూప్–2 పరీక్షలోనూ జగనన్న భజన చేస్తున్నారంటూ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. కాగా ఏపీపీఎస్సీ చరిత్రలోనే అత్యధిక మంది అభ్యర్థులు రాసిన పరీక్షగా గ్రూప్–2 ప్రిలిమ్స్ చరిత్ర సృష్టించింది. మంచి స్టాండర్డ్స్‌తో పరీక్ష నిర్వహించిందనే ప్రశంసలు ఏపీపీఎస్సీకి దక్కాయి. దీన్ని తట్టుకోలేక ఎల్లో మీడియా చివరకు గ్రూప్–2 పరీక్షపైన కూడా విషం చిమ్మడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. -
ఇక.. నేటి నుంచి మరో రెండు గ్యారంటీలు ప్రారంభం
సాక్షి, యాదాద్రి: కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి కింద రూ.500లకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను మంగళవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. బుధవారం నుంచి ఈ రెండు పథకాలు అమలులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌కు పంపించింది. తెల్ల రేషన్‌కార్డు (ఆహార భద్రతా కార్డు) ప్రామాణికంగా ఈ రెండు పథకాలను వర్తింపజేయనున్నారు. వీటి ద్వారా జిల్లాలో 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందడంతో పాటు, నగదు బదిలీ పద్ధతిన గ్యాస్ వినియోగదారులకు రూ.500లకే సిలిండర్ అందనుంది. జిల్లాలో 2,16,942 ఆహార భద్రత కార్డులు జిల్లాలో 2,16,942 ఆహార భద్రత కార్డులున్నాయి. జిల్లాలో 3,11,415 గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. ప్రజాపాలనలో గ్యాస్ సబ్సిడీ కోసం 2,30,412 మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్యాస్ వినియోగదారులు ముందుగానే మొత్తం డబ్బులు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తరువాత ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.500పోను మిగిలిన సబ్సిడీ మొత్తాన్ని బదిలీ చేస్తుంది. తెల్లరేషన్ కార్డుదారులకు ప్రతి రీఫిల్‌కు రూ.500సబ్సిడీ అందనుంది. గడిచిన మూడు సంవత్సరాల్లో వినియోగదారులు గృహ అవసరాలకు వాడిన గ్యాస్ సిలిండర్ల ఆధారంగా గ్యాస్ సబ్సిడీ ఇవ్వనున్నారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేకంగా లెక్కలు తీశారు. మార్చి1 అనంతరం జీరో బిల్లులు.. జిల్లాలో ఉచిత కరెంట్ కోసం 2,09,899 మంది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 200 యూనిట్ల లోపు వాడే గృహ విద్యుత్ వినియోగదారులు 1,61,099 మంది ఉన్నారు. వీరి వివరాలను విద్యుత్ శాఖ సేకరించింది. లబ్ధిదారుల స్థానికత గుర్తింపు కోసం ఆధార్ కార్డు, ఆహార భద్రతా కార్డు, ఫోన్‌నంబర్లు సేకరించారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబంలో ఒక నెలలో 200 యూనిట్ల వరకు జీరో బిల్లును ఇస్తారు. మార్చి 1 అనంతరం వచ్చే విద్యుత్ బిల్లులతో జీరో బిల్లు పథకం అమలవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇవి చదవండి: లక్ష కోట్లు.. 5 లక్షల ఉద్యోగాలు -
‘అకౌంట్లలలో డబ్బులు పడేది అప్పుడే’.. రైతులకు కేంద్రం శుభవార్త!
రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 16వ విడతను ఈ నెలాఖరులోగా లబ్ధి దారులకు చెల్లిస్తున్నట్లు పీఎం కిసాన్ వెబ్ సైట్ పేర్కొంది. రైతులకు ఆర్థికంగా నిలిచేందుకు కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో రైతులకు కేంద్రం ఏటా రూ. 6 వేలు అందిస్తుంది. దీనిని ఏడాదికి రూ. 6 వేలు అంటే ప్రతి 4 నెలలకు ఓసారి మొత్తం 3 విడతలకు రూ. 2 వేల చొప్పున నేరుగా రైతుల అకౌంట్లలో డిపాజిట్ చేస్తుంది. పీఎం కిసాన్కిఅహర్హులు ఎవరంటే? పీఎం కిసాన్ పథకంలో రైతులు మాత్రమే అర్హులు. పన్ను చెల్లింపు దారులు మాత్రం కాదు. పీఎం కిసాన్ 16వ విడత విడుదల ఎప్పుడంటే? పీఎం కిసాన్ 16వ విడుత నగదు పంపిణీని ఫిబ్రవరి 28, 2024న కేంద్రం రైతులకు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తేదీన, అర్హత కలిగిన లబ్ధిదారుడి ఖాతాలో నగదు జమ చేయబడుతుంది. పీఎం కిసాన్ 16వ విడుత నగదు డిపాజిట్ అయ్యిందా? లేదా? అని చెక్ చేసుకోవాలంటే? స్టెప్1 : అర్హులైన రైతులు https://pmkisan.gov.in/ Portal పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక పోర్టల్‌లోకి వెళ్లాలి. స్టెప్2 :హోమ్ పేజీలో ఫార్మర్స్ కార్నర్ ఎంపిక చేసుకోవాలి. స్టెప్3 : పీఎం కిసాన్ బెనిఫిసియరీ స్టేటస్ తనిఖీ ఆప్షన్ ఎంపిక చేయాలి. స్టెప్4 :ఆధార్ లేదా అకౌంట్ నంబర్ లేదా ఫోన్ నంబర్ ఆప్షన్ ఎంచుకోవాలి.. స్టెప్5 : గెట్ డేటాపై క్లిక్ చేస్తే మీ స్టేటస్ స్క్రీన్ పై కనిపిస్తుంది. కేవైసీ తప్పని సరి పీఎం కిసాన్ వెబ్ సైట్ ప్రకారం.. పీఎం కిసాన్ లో నమోదు చేసుకునే రైతులు ఈ కేవైసీ తప్పని సరి చేసుకోవాలి. ఈకేవైసీ పద్దతి పీఎం కిసాన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. లేదంటే కామన్ సర్వీస్ సెంటర్ కేంద్రాలలో బయోమెట్రిక్ ఆధారిత కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు. ఈకేవైసీ ఎందుకు? కేంద్రం అందించే పీఎం కిసాన్ పథకాన్ని నేరుగా రైతులకు అందించేలా ఈకేవైసీని ప్రవేశ పెట్టింది. తద్వారా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా కేంద్రం రైతుల అకౌంట్లలో నేరుగా డబ్బుల్ని డిపాజిట్ చేస్తుంది. -
హైబ్రిడ్ ఫండ్స్‌కు భారీ డిమాండ్
న్యూఢిల్లీ: హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ పథకాలకు గత నెలలో భారీ డిమాండ్ నెలకొంది. దీంతో 2024 జనవరిలో పెట్టుబడులు 37 శాతం జంప్ చేశాయి. రూ. 20,634 కోట్లను తాకాయి. డెట్ ఫండ్స్‌పై పన్ను చట్టాలలో మార్పులరీత్యా ప్రత్యామ్నాయ పెట్టుబడి అవకాశంగా నిలుస్తుండటంతో ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. వెరసి ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2023–24) తొలి 10 నెలల్లో(ఏప్రిల్–జనవరి) హైబ్రిడ్ ఫండ్స్‌లో మొత్తం పెట్టుబడులు రూ. 1.21 లక్షల కోట్లకు చేరాయి. అయితే గతేడాది(2022–23) హైబ్రిడ్ పథకాల నుంచి నికరంగా పెట్టుబడులు వెనక్కి మళ్లిన సంగతి తెలిసిందే. హైబ్రిడ్ ఫండ్స్ అంటే హైబ్రిడ్ ఫండ్స్‌కు చెందిన మ్యూచువల్ ఫండ్ పథకాలు సాధారణంగా ఈక్విటీ, రుణ సెక్యూరిటీలు రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేస్తాయి. కొన్ని సందర్భాలలో బంగారం తదితర ఆస్తులలోనూ పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తుంటాయి. కాగా.. 2023 ఏప్రిల్ నుంచి హైబ్రిడ్ ఫండ్స్ పెట్టుబడిదారులను తమవైపు తిప్పుకున్నాయి. ఇందుకు ప్రధానంగా ఏప్రిల్ నుంచి డెట్ ఫండ్స్ పన్ను చట్టాలలో నెలకొన్న సవరణలు ప్రభావం చూపుతున్నాయి. అంతక్రితం మార్చితో ముగిసిన ఏడాదిలో రూ. 12,372 కోట్ల పెట్టుబడులు తరలిపోవడం గమనార్హం! మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్(యాంఫీ) తాజా గణాంకాల ప్రకారం జనవరిలో హైబ్రిడ్ పథకాలు రూ. 20,637 కోట్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. అంతకుముందు డిసెంబర్లో లభించిన రూ. 15,009 కోట్లతో పోలిస్తే భారీగా ఎగశాయి. ప్రధానంగా ఆర్బిట్రేజ్ ఫండ్స్, మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్‌కు అత్యధిక పెట్టుబడులు ప్రవహించాయి. ఆర్బిట్రేజ్ ఫండ్స్‌కు రూ. 10,608 కోట్లు లభించగా.. మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్‌కు రూ. 7,080 కోట్ల పెట్టుబడులు తరలి వచ్చాయి. గత ఆరు నెలల్లోనూ ఇన్వెస్టర్లు తమ మొత్తం పెట్టుబడుల్లో ఆర్బిట్రేజ్ ఫండ్స్‌కు 50–70 శాతాన్ని కేటాయించారు. ఇందుకు పన్ను మార్గదర్శకాలలో మార్పులు కారణమవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆర్బిట్రేజ్ ఫండ్స్ స్ప్రెడ్ సుమారు 8 శాతానికి చేరడం పెట్టుబడి అవకాశాలకు దారి చూపుతున్నట్లు ఆనంద్ రాఠీ వెల్త్ డిప్యూటీ సీఈవో ఫిరోజ్ అజీజ్ వెల్లడించారు. ఫోలియోలు ప్లస్ జనవరిలో హైబ్రిడ్ ఫోలియోలు 3.36 లక్షలు కొత్త గా జత కలిశాయి. దీంతో మొత్తం హైబ్రిడ్ ఫోలియోల సంఖ్య 1.31 కోట్లకు చేరింది. వెరసి మొత్తం 16.95 కోట్ల ఫోలియోలలో వీటి వాటా 7.7 శాతా న్ని తాకింది. తక్కువ రిస్క్ భరించే ఇన్వెస్టర్లకు హై బ్రిడ్ ఫండ్స్ ఉపయుక్తంగా ఉంటాయి. ఈక్విటీ మా ర్కెట్లలో పెట్టుబడులు ఆటుపోట్లకు లోనయ్యే సంగతి తెలిసిందే. అయితే ఫిక్స్డ్ ఆదాయంలో లభించే స్థిరత్వాన్ని ఇవి కల్పిస్తుండటంతో పెట్టుబడు లను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఫిక్స్డ్ ఆదా యం మార్గాలలో ఇన్వెస్ట్ చేయదలచినవారు హైబ్రి డ్ ఫండ్స్వైపు చూస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. -
Budget 2024: ‘లక్షపతి దీదీ’.. ఆర్థికమంత్రి ప్రస్తావించిన ఈ స్కీమ్ గురించి తెలుసా?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తన మధ్యంతర బడ్జెట్లో ‘లక్షపతి దీదీ’ పథకం గురించి ప్రస్తావించారు. సహాయక గ్రూపు మహిళలకు సంబంధించిన ఈ పథకం లక్ష్యాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు. "తొమ్మిది కోట్ల మంది మహిళలతో కూడిన 83 లక్షల స్వయం సహాయక సంఘాలు సాధికారత , స్వావలంబనతో గ్రామీణ సామాజిక-ఆర్థిక దృశ్యాన్ని మారుస్తున్నాయి. వారి విజయం ఇప్పటికే దాదాపు కోటి మంది మహిళలను లక్షపతి దీదీలుగా మార్చడానికి సహాయపడింది. ఈ విజయం ఉత్సాహంతో లక్షపతి దీదీ లక్ష్యాన్ని 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచాలని నిర్ణయించాం" అని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పార్లమెంటుకు తెలిపారు. అసలేంటి ఈ పథకం? గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా గ్రామాల్లోని 2 కోట్ల మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించేందుకు 'లక్షపతి దీదీ' పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద మహిళలకు ప్లంబింగ్, ఎల్ఈడీ బల్బుల తయారీ, డ్రోన్లను ఆపరేట్ చేయడం, రిపేర్ చేయడం వంటి నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తారు. తద్వారా మహిళల జీవనోపాధి మెరుగుపడి వారు ఏటా రూ.లక్షకు పైగా ఆదాయాన్ని పొందేలా తోడ్పాటు అందిస్తారు. -
వినతులు పెండింగ్ ఉండొద్దు! : మంత్రి పొంగులేటి
ఖమ్మం: ప్రజలు విన్నవించే సమస్యలను పెండింగ్‌లో పెట్టకుండా పరిష్కరించాలని రాష్ట్ర రెవె న్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులు ఆదేశించారు. కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఆయన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. నేలకొండపల్లి మండలం చెరువుమాధారానికి చెందిన రైతులు 110 ఎకరాల్లో వరి విత్తనాలు వేయగా 60 రోజుల్లోనే కంకులు వచ్చి నష్టపోయామని విన్నవించగా విచారణ చేపట్టి కంపెనీపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డీఏఓ విజయనిర్మలను ఆదేశించారు. అలాగే, రాజుపేట వద్ద నిర్మించిన చెక్‌డ్యాంను సాగర్ నీటితో నింపాలని గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు రేలా వెంకటరెడ్డి వినతిపత్రం అందజేశారు. అధికారులు విచారణ చేపట్టకుండా ఫ్యామి లీ సర్టిఫికెట్ జారీచేశారని నేలకొండపల్లి మండలం నాచేపల్లికి చెందిన మల్లెల వెంకటాచారి ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టాలని సూచించారు. ఆతర్వాత మంత్రి మాట్లాడుతూ రాజుపేటలోని ఖబరస్తాన్కు ప్రహరీ నిర్మించి విద్యుత్ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ భూముల కబ్జాపై సర్వే చేయాలని సూచించారు. మహాశివరాత్రి సందర్భంగా తీర్థాల, కూసుమంచి ఆలయాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. తొలుత మంత్రి పొంగులేటి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులతో పాటు విద్యుత్ శాఖ నుండి మంజూరైన బీమా చెక్కులను అందజేశారు. అనంతరం కూసుమంచి మండలం ధర్మాతండాకు చెందిన విద్యార్థి జర్పుల సింధు రోడ్డు ప్రమాదంలో గాయపడిన కోమాలోకి వెళ్లగా మంత్రి పరామర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 24 గంటల వైద్యసేవలు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటల పాటు వైద్యం అందేలా తమ ప్రభుత్వం కృషిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కూసుమంచి లో హోమియో ఆస్పత్రి భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం లింగారంతండాలో జీపీ భవనం, పలుచోట్ల రహదారి నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈకార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఆర్డీఓ గణేష్, జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి శ్రీరాం, ఆర్అండ్బీ ఈఈ శ్యాంప్రసాద్, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సులోచన, మత్స్యశాఖ ఏడీ ఆంజనేయస్వామితో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు వాణిశ్రీ, డాక్టర్ రాములు, ఉమామహేశ్వరరావు, బానోత్ శ్రీనివాస్‌నాయక్, మోహ న్, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు మాదాసు ఉపేందర్, జూకూరి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, కూసుమంచిలో రహదారి పక్కన ఉన్న ఓ టీ స్టాల్ వద్ద కాన్వాయ్ నిలిపిన మంత్రి టీ తాగాక నిర్వాహకుడు అనిల్‌తో మాట్లాడి వ్యాపారంపై ఆరా తీశారు. తమ్మినేని కృష్ణయ్యకు నివాళి.. మండలంలోని తెల్దారుపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం గతంలో హత్యకు గురైన నాయకుడు తమ్మినేని కృష్ణయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకులు రాయల నాగేశ్వరరావు, తమ్మినేని నవీన్, తమ్మినేని మంగతాయారు పాల్గొన్నారు. ఇవి చదవండి: కాంగ్రెస్ సై! ఖమ్మం స్థానంపై ప్రత్యేక దృష్టి.. -
దేశంలో ప్రస్తుతం లింగ నిష్పత్తి ఎంతంటే..
భారత్‌లో ప్రతి ఏడాది జనవరి24నజాతీయ బాలికా దినోత్సవాన్ని(National Girl Child Day) జరుపుకుంటారు. ఈ ఏడాది 16వ బాలికా దినోత్సవాన్ని దేశంలో జరుపుకుంటున్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకోవడం ఉద్దేశ్యం దేశంలోని బాలికలకు వారి హక్కుల గురించి అవగాహన కల్పించి, వారికున్న హక్కులు, సమస్యలతో ఎలా పోరాడాలి తదితరాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నారు. అలాగే మహిళ సాధికారతకు పెద్దపీట వేసేలా లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడమే ధ్యేయంగా ఏటా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇక ఈ రోజునే భారత తొలి మహిళా ప్రధాన మంత్రి ఇందిరా గాందీ ఈ రోజునే ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అందువల్ల మహిళ సాధికారతకు ఇదే అతిపెద్ద నిదర్శనం అని చాటి చెప్పేలా ఈ రోజునే జాతీయా బాలికా దినోత్సవంగా ఎంచుకున్నారు. తొలిసారిగా ఈ దినోత్సవాన్ని జనవరి 24, 2008న జరుపుకున్నారు. ఈ సందర్భంగా నేషన్ ఫ్యామిలీ హల్త్ సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్-5)ఏం చెబుతోంది? ప్రస్తుతం బాలికల స్థితి ఎలా ఉంది తదితరాల గురించి తెలుసుకుందాం! ఎన్హెచ్ఎస్ గత నాలుగేళ్ల సర్వేలో..2015-16లో ప్రతి వెయ్యిమంది పురుషులకు 991 మంది మహిళలు ఉండగా, 2019-21లో 1,020 మంది మహిళు మెరుగుదల కనిపించింది. ఈ కాలంలో స్త్రీల ఆయుర్దాయం కూడా గణనీయంగా మెరుగుపడింది కూడా. చెప్పాలంటే ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్న ఇన్నే ఏళ్లలో నెమ్మది నెమ్మదిగా చాలా మార్పులు సంతరించుకున్నాయి కూడా. కానీ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, నేరాలు మాత్రం తగ్గలేదు. చాలా చోట్ల కొంతమంది బాలికలకు విద్యా అవకాశాలు అందని ద్రాక్షలానే ఉండటం బాధకరం. నిజానికి భారతదేశంలో ఇందుకు సంబంధించిన కట్టుదిట్టమైన మంచి చట్టాలు ఉన్నాయి. కానీ వాటి అమల ఒక సవాలుగా ఉంది. ఆయా తాలుకా కేసుల్లో బాధిత బాలికలకు సత్వర న్యాయం కూడా అందడం లేదు. ఇక్కడ గర్ల్ చైల్డ్ ఫ్రెండ్లీ న్యాయవ్యవస్థను రూపొందించడంపై దృష్టి సారించి ఆ దిశగా వారికి న్యాయం సత్వరం అందే యత్నం చేయాల్సి ఉంది. అలాగే క్షీణిస్తున్న పిల్లల లింగ నిష్పత్తిని (సీఎస్ఆర్) సమస్యను పరిష్కరించే దిశగా 2015న హర్యానాలోని పానిపట్‌లో ప్రధానమంత్రి బేటి బచావో బేటీ పఢావో(బీబీబీపీ)ని ప్రారంభించారు. ఇది ఇది మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆరోగ్య -కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించే జాతీయ కార్యక్రమం. దీనితో భ్రూణ హత్యలకు అడ్డుకట్టవేసి, వారికి విద్యా అవకాశాలు అందేలా చేయమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఒక రకంగా బాలికల మనుగడకు, అభివృద్ధికి తోడ్పాటునిచ్చే అద్భుతమైన కేంద్ర పథకం ఇది. అలానే ఇలాంటి ఎన్నో బాలికల సంక్షేమానికి పెద్ద పీట వేసేలా ఆయా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో.. మహిళలు, చిన్న పిల్లల అభివృద్ధికి సంబంధించిన పథకాలు, స్త్రీ సంక్షేమ పథకాలు, కౌమర బాలికలు పథకం వంటివి తీసుకొచ్చింది. మహిళ సాధికారతకు, లింగ సమానత్వానికి పెద్ద పీట వేసింది. అంతేగాదు ఈ దినోత్సవం పేరుతో ఆడపిల్లల హక్కులు, స్త్రీ విద్య, ఆరోగ్యం, పోషకాహారం గురించి అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకోస్తున్నారు కూడా. అయితే లింగ వివక్ష ఇంకా ఎక్కువగానే ఉంది. మహిళలు, బాలికలు జీవితాంత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కూడా. అది సమూలంగా తొలిగి దేశంలో ఆడపిల్లలు వారి హక్కులు, గౌరవం, విలువను పొందేలా చేయగలిగేతే దేశం మరింత అభివృద్ధిని సాధించనట్లే. (చదవండి: జాతీయ బాలికా దినోత్సవం 2024: ఎదగాలి.. చదవాలి!) -
ఈ ఏడాది ఆరు గ్యారంటీలపై ప్రజల్లో ఆశలు..
ఖమ్మం: ఈ ఏడాది ఖరీఫ్‌లో సరైన వర్షపాతం నమోదు కాకపోవడంతో పాటు అకాల వర్షాలు, తుపాన్‌తో రైతులు పంటలను నష్టపోయారు. ఇక రబీలో ఆశించిన స్థాయిలో భూగర్భజలాలు లేక పంటలు లక్ష్యం మేర సాగయ్యే పరిస్థితి కనిపించక అన్నదాతలు దిక్కులు చూస్తున్నారు. అలాగే, ఉద్యోగ, ఉపాధి కోసం నిరుద్యోగులు ఏళ్లుగా ఎదురుచూపుల్లో గడుపుతున్నారు. మరోపక్క సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం ఇటీవల ప్రజాపాలన సభల్లో దరఖాస్తులు స్వీకరించిన నేపథ్యాన త్వరలోనే తమకు ఫలాలు అందుతాయని ప్రజలు భావిస్తున్నారు. సూర్యుడు మకరంలోకి చేరుతూ వెలుగులను విరజిమ్మే కాలం నుంచి తమ జీవితాల్లోనూ వెలుగులు ప్రసరించాలని అంతా కోరుకుంటున్నారు. కష్టనష్టాలు, ఒడిదుడుకుల మధ్య సాగిన బతుకులు ఈ పండుగ నుంచి మారాలని కోటి ఆశలతో ఆకాంక్షిస్తున్నారు. ఇవి చదవండి: కస్టం మిల్లింగ్ కహానీ.. -
‘దళితబంధు’ ఉంటుందా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లోని దాదాపు 11,108 మంది లబ్ధిదారులు తమ ఖాతాల్లో ఆరునెలలుగా ఉన్న సుమారు రూ.436.27 కోట్ల డబ్బును విత్ డ్రా చేసుకోలేని స్థితిలో ఉన్నారు. మరోవైపు రెండో జాబితాలో ప్రతీ నియోజకవర్గానికి 1100 మంది లబ్ధిదారుల చొప్పున ఎన్నికలకు ముందు 1.31 లక్షల మంది దళితులతో జాబితాను నాటి ప్రభుత్వం రూపొందించింది. ఈలోపు ఎన్నికల ప్రక్రియ మొదలుకావడంతో పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా కొలువుదీరిన ప్రభుత్వం ఇప్పటివరకూ ఆ పథకంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో వీరందరిలోనూ పథకం అమలుపై తీవ్రమైన ఆందోళన నెలకొంది. 11వేలమందికి చెందిన.. రూ.436.27 కోట్లు ! పథకంలో ఎంపికైన కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం, లబ్ధిదారులు ఎంచుకున్న రంగంలో నైపుణ్య శిక్షణ, వారి చేత వ్యాపారాలు ప్రారంభించే లక్ష్యంతో 2021 ఆగస్టు 16న అప్పటి సీఎం కేసీఆర్ ఆ పథకానికి శ్రీకారం చుట్టారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం శాలపల్లి వేదికగా ఈ పథకాన్ని ఆరంభించారు. హుజురాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకుని 18వేలమంది దళితులను పథకాన్ని ఎంపిక చేశారు. వీరిలో 11,315 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పు న ఇవ్వగా.. మిగిలిన వారికి రూ.10 లక్షలలోపు ఆర్థిక సాయం అందజేశారు. దళితబంధు పథకాన్ని ప్రభుత్వం తొలిదశలో తొలుత రెండురకాలుగా అమలు చేసింది. ఒకటి సాచురేషన్ (ఎంపిక చేసుకున్న ప్రాంతంలో) మోడ్, రెండోది టార్గెట్ మోడ్ (నియోజకవర్గాల వారీగా) విధానం. ఇందు లో టార్గెట్ మోడ్‌లో 11,387 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు. వారిలో 1413 మందికి రూ.126.66 కోట్లను అప్పటి ప్రభుత్వం ఖాతాల్లో వేసింది. సాచురేషన్ పద్ధతిలో మొత్తం 26,395 మందికి పథకాన్ని వర్తింపజేసింది. అందులో 9695 మందికి 309 కోట్లను విడుదల చేసింది. ఈ రెండు విధానాల్లో కలిపి 11,108 మంది ఖాతాల్లో మొత్తం రూ.436.27 కోట్లను ప్రభుత్వం ఖాతాల్లో వేసినా.. వారికి విత్‌డ్రా చేసుకునే వీలు మాత్రం ఇవ్వలేదు. రెండో జాబితాలో దయనీయం.. టార్గెట్ మోడల్లో పథకం ప్రారంభించిన ప్రభుత్వం మొత్తంగా 33 జిల్లాల్లో 119 మంది నియోజకవర్గాల్లో 1,31,500 మంది లబ్ధిదారులను రెండోదశలో ఎంపిక చేసింది. వారికి పథకం కోసం అన్ని అర్హతలు ఉన్నాయని తేల్చింది. లబ్ధిదారులకు జారీ చేసేందుకు హార్డ్ కాపీలు కూడా సిద్ధం చేసింది. వీరి కోసం రూ.749 కోట్లు కూడా ఇచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. కానీ, ఈలోపు ఎన్నికల కోడ్ రావడంతో ఎంపికైన 1,31,500 మంది లబ్ధిదారులకు ఆఖరునిమిషంలో డబ్బులు రాకుండా నిలిచిపోయాయి. దాంతో ఈ పథకం అమలుపై కలవరం నెలకొంది. సలహాదారులకు రాజభోగాలు వివిధ విభాగాలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసిన రిటైర్డ్ ఉద్యోగులను, నాయకులను రాజీనామా చేయిస్తోన్న కొత్త ప్రభుత్వం దళితబంధులో నామినేటెడ్ పోస్టుల వంక కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. దళిత బంధు కోసం ఇద్దరిని నామినేటెడ్ విధానంలో నెలకు రూ.2.50లక్షల చొప్పున వేతనాలు, వారికి ఐదుగురు సెర్ఫ్ సిబ్బందిని రిసోర్స్ పర్సన్ల (ఆరీ్ప)లుగా నియమించింది. వీరికి రూ.60 వేల నుంచి రూ.70వేల వరకు ఇస్తున్నారని సమాచారం. వీరు రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకం అమలు తీరును పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేస్తేనే నిధులు విడుదలవుతాయి. ఆరునెలలుగా దళితబంధు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయినా వీరిని కొత్త ప్రభుత్వం కూడా ఇంకా కొనసాగిస్తోంది. వీరు జిల్లాల్లో పర్యటించిన సందర్భాల్లో.. ఆయా జిల్లాల్లో ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు ఖర్చుల పేరిట చుక్కలు చూపిస్తున్నారన్న విమర్శలున్నాయి. వీరికి కారు, డ్రైవర్, ఆఫీస్ బాయ్, ట్రావెల్ అలవెన్సు తదితరాలు అదనం కావడం కొసమెరుపు. వెంటనే జమ చేయాలి మొదటి విడతగా విడుదలైన నిధులతో వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని నిర్వహించుకుంటున్నాం. ఏడాదిన్నర అవుతున్నా రెండో విడుత ఇవ్వాల్సిన మిగతా మొత్తం మా ఖాతాల్లో జమ చేయలేదు. అధికారులను అడిగితే దాటవేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రెండో విడుత నిధులను విడుదల చేసి మా ఖాతాల్లో జమ చేయాలి. – పర్లపల్లి రాజు, దళితబంధు లబ్ధిదారుడు, హుజూరాబాద్ నిధుల కోసం ఎదురుచూస్తున్నాం దళితబంధు పథకంలో మొదటి విడతలో వచి్చన నిధులతో మినీ సూపర్‌మార్కెట్ నిర్వహిస్తున్నాం. రెండో విడుత నిధులు ఇవ్వకపోవడంతో అప్పులు తెచ్చి దుకాణాన్ని నడిపించాల్సి వస్తోంది. రెండో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మలి విడత డబ్బులు విడుదల చేసి ఆదుకోవాలి. – గజ్జల అంజయ్య, లబ్దిదారుడు, హుజూరాబాద్ -
పట్టణ మహిళలకు సుస్థిర జీవనోపాధి
సాక్షి, అమరావతి: పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులు అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడడంతోపాటు సుస్థిర జీవనోపాధిపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు పట్టణ పేదరిక నిర్మూనా సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ శిక్షణలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎస్‌హెచ్‌జీ సభ్యులందరికీ సుస్థిర జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో ఇప్పటికే 11 మునిసిపాలిటీల్లో జగనన్న మహిళా మార్టులు, జగనన్న ఈ–మార్ట్, ఆహా క్యాంటీన్లు, అర్బన్ మార్కెట్లు, చేయూత జీవనోపాధి యూనిట్లు వంటివి ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా పట్టణ ప్రగతి యూనిట్లను కూడా ఈ నెలలోనే ఏర్పాటు చేయనున్నారు. మెప్మా పరిధిలో 123 పట్టణ స్థానిక సంస్థల(యూఎల్బీ)లో 25 లక్షల మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులు ఉండగా, ఇప్పటిదాకా 13.50 లక్షల మంది ప్రత్యక్షంగా స్వయం ఉపాధి పొందుతున్నారు. మిగిలిన వారిలో అత్యధిక మందితో పట్టణ ప్రగతి యూనిట్లు, ఆహా క్యాంటీన్లు, మెప్మా అర్బన్ మార్కెట్లు, చేయూత, జీవనోపాధి యూనిట్లు ఏర్పాటుచేసి స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించేందుకు సభ్యుల అభిప్రాయాలు తెలుసుకోవాలని మెప్మా మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మి ఇటీవల జిల్లాల మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్లు, సిబ్బందిని ఆదేశించారు. ఇందుకోసం ప్రాంతాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరు జిల్లాల పరిధిలో సమావేశాలు ముగిశాయి. రాయలసీమ జిల్లాల పథక సంచాలకులు, సిబ్బందికి నెల్లూరులో బుధవారం సమావేశం నిర్వహించనున్నారు. ఎస్‌హెచ్‌జీలు బలోపేతం: మెప్మా ఎండీ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు లింకేజీ ద్వారా వివిధ సంక్షేమ పథకాలు ఎంత మందికి అందాయి.. ఇంకా పొందాల్సిన వారు ఎవరైనా ఉన్నారా.. అనేదానిపై సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు మెప్మా మిషన్ డైరెక్టర్ వి.విజయలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు. అర్బన్ స్వయం సహాయక సంఘాలు బలోపేతం కావాలని, ప్రతి సభ్యురాలిని స్వయం ఉపాధి వైపు మెప్మా ప్రోత్సహిస్తుందని చెప్పారు. వారికి అందుతున్న చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, జగనన్న తోడు... వంటి పథకాలతో ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. ఆ నగదుతో వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ ఇచ్చి నైపుణ్యాలను మెరుగుపరుస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే పలు దఫాలుగా మహిళలకు శిక్షణనిచ్చి, వారితో పలు వ్యాపార సంస్థలను ఏర్పాటుచేసి విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మిగిలిన సభ్యులకు అవసరమైన సహకారం అందించేందుకు స్వయంగా సభ్యులతో మాట్లాడాలని తమ సిబ్బందిని ఆదేశించినట్లు చెప్పారు. ఇంటిని చక్కదిద్దుకునే మహిళలు వ్యాపారాన్ని విజయవంతంగా చేయగలరని తమ జగనన్న మహిళా మార్టులు, అర్బన్ మార్టులు, ఆహా క్యాంటీన్లు నిరూపించాయన్నారు. ఆయా యూనిట్ల బలోపేతం కోసం నిరంతరం శిక్షణ, పర్యవేక్షణ అందించాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. ఏపీ టిడ్కో గృహాల లబ్ధిదారులకు యూఎల్బీల పరిధిలో 100శాతం బ్యాంకు రుణాలు అందించే ఏర్పాట్లు చేశామని ఆమె వివరించారు. -
నమ్మకమైన రాబడులకు పెట్టుబడులు పెట్టే స్కీమ్..
లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే పథకం ఇది. గతంలో మిడ్‌క్యాప్ పథకంగా ఉండగా, సెబీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల పునర్వ్యస్థీకరణ ఆదేశాల నేపథ్యంలో.. లార్జ్, మిడ్‌క్యాప్ పథకంగా మారింది. లార్జ్, మిడ్‌క్యాప్ మధ్య పెట్టుబడులను వర్గీకరిస్తుంది. బీఎస్ఈ లార్జ్ మిడ్‌క్యాప్ టీఆర్ఐ సూచీని ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా భావిస్తున్నారు. రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం ఈ పథకాన్ని పెట్టుబడుల కోసం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇచ్చిన చరిత్ర ఈ పథకానికి ఉంది. లార్జ్‌క్యాప్ కంపెనీలలో పెట్టుబడులకు రిస్క్ తక్కువగా ఉంటుంది. రాబడుల్లోనూ స్థిరత్వం ఉంటుంది. మిడ్‌క్యాప్ కంపెనీల్లో అస్థిరతలు ఎక్కువగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని తెచ్చి పెడతాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పెట్టుబడుల విధానం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రంగాల వారీ, పెట్టుబడుల కేటాయింపుల విధానాలను ఈ పథకం మార్చుకుంటూ ఉంటుంది. 2014, 2017 మార్కెట్ ర్యాలీ సమయాల్లో ఈ పథకం 99 శాతం వరకు పెట్టుబడులను ఈక్విటీల్లోనే కలిగి ఉంది. అలాగే, 2015, 2018, 2020 సంవత్సరాల్లో మార్కెట్లలో అస్థిరతలు పెరిగిన సందర్భాల్లో సురక్షిత రంగాలు, కంపెనీల్లో పెట్టుబడులను పెంచుకోవడాన్ని గమనించొచ్చు. ఆ సమయంలో ఈక్విటీల్లో గరిష్ట పెట్టుబడులు 94–96 శాతం మధ్యే పరిమితం చేసింది. కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్, ఫార్మా రంగాలను అస్థిరతల సమయాల్లో నమ్ముకున్నది. స్టాక్స్‌ను కొనుగోలు చేసి, దీర్ఘకాలం పాటు అందులో కొనసాగడం అనే విధానాన్ని పాటిస్తోంది. రాబడులు ఈ పథకం ఏడాది కాలంలో ఇచ్చిన రాబడులు 25.66 శాతంగా ఉన్నాయి. ఏడాది కాలంలో బీఎస్ఈ లార్జ్‌మిడ్‌క్యాప్ టీఆర్ఐ రాబడులు కూడా ఇంచు మించు ఇదే స్థాయిలో ఉన్నాయి. ఈ పథకం మూడేళ్ల కాలంలో ఏటా 18 శాతం చొప్పున రాబడులను అందించింది. ఐదేళ్లలో 18 శాతం, ఏడేళ్లలో 17.20 శాతం, పదేళ్లలో 21.83 శాతం చొప్పున వార్షిక ప్రతిఫలాన్ని ఇన్వెస్టర్లకు పంచిపెట్టింది. బీఎస్ఈ లార్జ్ మిడ్‌క్యాప్ టీఆర్ఐతో పోలిస్తే ఐదేళ్లు, ఏడేళ్లు, పదేళ్ల కాలంలో ఈ పథకంలోనే అధిక రాబడి ఉంది. పోర్ట్‌ఫోలియో ఈ పథకం 60–70 స్టాక్స్‌తో చక్కని వైవిధ్యాన్ని పాటిస్తోంది. ప్రస్తుతం 67 స్టాక్స్ ఉన్నాయి. ఈ పథకం నిర్వహణలో 18,845 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో ఈక్విటీలకు 97.37 శాతాన్ని కేటాయించింది. నగదు, నగదు సమానాల్లో 2.63 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. ఈక్విటీల్లోనూ 67.58 శాతం పెట్టుబడులు లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 32 శాతం మేర పెట్టుబడులు కలిగి ఉంది. స్మాల్‌క్యాప్ కేటాయింపులు అరశాతానికే పరిమితమయ్యాయి. వీలైనంత వరకు రిస్క్‌ను తగ్గించి, మెరుగైన, స్థిరమైన రాబడిని అందించే వ్యూహం ఈ పథకం పెట్టుబడుల వెనుక కనిపిస్తోంది. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 28 శాతం కేటాయింపులను ఈ రంగం కంపెనీలకే కేటాయించింది. ఆటోమొబైల్ రంగ కంపెనీలకు 14 శాతం, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 11.46 శాతం కేటాయింపులు చేసింది. సేవల రంగ కంపెనీల్లో 8 శాతం, హెల్త్‌కేర్ కంపెనీల్లో 7 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. -
ఓ నేపాలీ కుటుంబం దరఖాస్తు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన ప్రతిష్టాత్మక అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమానికి స్థానికులే కాకుండా స్థానికేతరులు కూడా హాజరై పథకాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ సంఘటనలు స్థానికులను, అధికారులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రానికి ఓ నేపాలీ కుటుంబం తమకు కూడా రూ.500లకు గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకాలు వర్తింపజేయాలంటూ దరఖాస్తులు అందజేశారు. నేపాల్‌కు చెందిన దుర్గా, బును దంపతులు జూబ్లీహిల్స్‌లో అద్దెకుంటూ స్థానికంగా హోటల్లో పని చేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. మేం ఇక్కడే పుట్టి పెరిగామని, మాకు కూడా తెల్లరేషన్ కార్డు కూడా ఉంది, ఇటీవల ఎన్నికల్లో ఓటు కూడా వేశాం, ఆధార్ కార్డు సైతం పొంది ఉన్నామని అందుకే మాక్కూడా అభయహస్తం పథకాలు ఇవ్వాలంటూ తమ దరఖాస్తును అధికారులకు అందజేశారు. వీరిచ్చిన దరఖాస్తును సంబంధిత అధికారులు స్వీకరించి వారికి రశీదు అందించారు. -
ప్రజల బాగు ప్రతిపక్షాలకు ఇష్టం లేదు
అబ్దుల్లాపూర్‌మెట్: ప్రజలు బాగుండటం ప్రతిపక్షాలకు ఇష్టం లేదనీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయకుంటే బాగుండని బీఆర్ఎస్ కోరుకుంటోందని, అలాంటి ఆశలు నిజం కానివ్వబోమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తేల్చిచెప్పారు. అలాంటి పగటి కలలను కనడం బీఆర్ఎస్ మానుకోవాలని సూచించారు. ఆరు గ్యారంటీల పథకాల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని గురువారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ గ్రామంలో స్థానిక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగిన డిసెంబర్ 28నే ఆరు గ్యారంటీ పథకాల దరఖాస్తుల స్వీకరణ చేపట్టడం శుభపరిణామంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది దొరల ప్రభుత్వం కాదని, ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. మా పార్టీలోకి వస్తేనే పథకాలు.. అలాంటి బెదిరింపులు ఉండవు తెలంగాణ రాష్ట్ర బిడ్డలైతే చాలు ఆరు గ్యారంటీ పథకాల్లో అవకాశం కల్పిస్తామని ఈ విషయంలో ఎలాంటి రాజకీయ పక్షపాతం ఉండదని ఆయన తేల్చిచెప్పారు. గత ప్రభుత్వం మాదిరిగా మా పార్టీలోకి వస్తేనే.. మా పార్టీ కండువాలు కప్పుకుంటేనే.. సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పడం వంటిæ బెదిరింపులు కాంగ్రెస్ పాలనలో ఉండవని భట్టి స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వంలో రెవెన్యూ, పోలీస్తో పాటు ప్రతి వ్యవస్థ నా కోసమే ఉందన్న భావన ప్రతి పౌరుడికి కలిగిస్తామని చెప్పారు. పదేళ్లుగా మగ్గిపోయిన ప్రజలకు ఇప్పుడే ఊపిరి కోరి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరక పదేళ్లుగా బీఆర్ఎస్ పాలనలో మగ్గిపోయారని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రేషన్ కార్డులు, ఇళ్లు మంజూరు చేయకుండా గత ప్రభుత్వం దుర్మార్గపు పాలన కొనసాగించిందని విమర్శించారు. పదేళ్లుగా కాంగ్రెస్ పోరాటాలతో ప్రజలను చైతన్యవంతులను చేసి ఇందిరమ్మ రాజ్యం తీసుకువచ్చిందని, ఇప్పుడు అర్హులైన అందరికీ న్యాయం జరుగుతుందని భరోసానిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన గంటలోపే రాష్ట్ర మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం కల్పించామని గుర్తు చేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, పంచాయతీ రాజ్ కమిషనర్ హనుమంతరావు, ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కమిషనర్ శృతిఓజా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గౌతం పొట్రు, రాచకొండ సీపీ సుధీర్‌బాబు పాల్గొన్నారు. -
విదేశీ విద్యా దీవెన స్కాలర్షిప్ తో మా కల నెరవేరింది: విద్యార్థులు
-
ఏపీ విధానాలు నచ్చాయి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న పాలనా విధానాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని అంతర్ రాష్ట్ర మండలి ప్రశంసించింది. గ్రామ, వార్డు సచివాలయాలతో క్షేత్ర స్థాయిలో సమర్థవంతమైన వికేంద్రీకరణ వ్యవస్థను ఏర్పాటు చేశారని కితాబిచ్చింది. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా గ్రామాల్లో ప్రజల ఇంటి వద్దకే వైద్య సేవలు అందిస్తున్నారని, రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే)తో సాగుకు అవసరమైన అన్ని రకాల ఇన్‌పుట్స్‌ను గ్రామాల్లోనే అందుబాటులోకి తెచ్చారని కొనియాడింది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో భూ యజమానులకు కచ్చితమైన భూ హక్కు పత్రాలను అందజేస్తున్నారని..ఇదొక మంచి విధానమని (గుడ్ ప్రాక్టీస్) పేర్కొంది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలవుతున్న గుడ్ ప్రాక్టీసెస్‌పై అంతర్ రాష్ట్ర మండలి ఇటీవల ఓ నివేదికను వెల్లడించింది. అందులో మన రాష్ట్రానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సచివాలయాలతో పాలనా వికేంద్రీకరణ ♦ ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల ద్వారా క్షేత్ర స్థాయిలో సమర్థవంతమైన పాలనా వికేంద్రీకరణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తద్వారా వివిధ సంక్షేమ పథకాలతోపాటు పలు ప్రభుత్వ సేవలను పౌరుల ఇంటి వద్దకే చేరవేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, అవసరాలను తీర్చడంలో ఈ వ్యవస్థ వన్‌స్టాప్ సొల్యూషన్‌గా నిలిచింది. ♦ గ్రామాల్లో 50 ఇళ్లకు.. పట్టణాల్లో 70–100 ఇళ్లకు ఒక వలంటీర్ చొప్పున పని చేస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో 11 మంది చొప్పున, పట్టణ సచివాలయాల్లో 10 మంది చొప్పున ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరు తమ పరిధిలోని ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వ సేవలను నిర్ణీత కాల వ్యవధిలో అందిస్తున్నారు. ఆరు అంచెల్లో ట్రాక్ చేయడం ద్వారా పథకాలకు అర్హులను పారదర్శకంగా ఎంపిక చేస్తున్నారు. ఎవరికైనా అర్హత లేకపోతే అందుకు కారణాలను కూడా చెబుతూ దరఖాస్తు తిరస్కరిస్తున్నారు. సమగ్ర సర్వేతో భూ రికార్డుల శుద్ధీకరణ ♦ దశల వారీగా సమగ్ర భూ సర్వేను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. డ్రోన్స్ ద్వారా ఏరియల్ ఫ్లయింగ్‌తో సర్వే చేయడంతో పాటు గ్రౌండ్ ట్రూథింగ్, రికార్డుల తయారీ, క్షేత్ర స్థాయిలో ధృవీకరణ, రికార్డుల అప్డేషన్, సరిహద్దు వివాదాలపై అప్పీల్స్, సెక్షన్–13 నోటిఫికేషన్ ప్రచురణ, ఫైనల్ రికార్డ్ ఆఫ్ రైట్స్, స్టోన్ ప్లాంటేషన్, సబ్ డివిజన్స్.. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజి్రస్టేషన్లను క్రమానుగతంగా అమలు చేస్తున్నారు. ♦ సరిహద్దుల ఆన్లైన్ పర్యవేక్షణ, జోనల్, నిబంధనలు, భూమిపై భౌతిక మార్పులతో సహా సమగ్ర భూసర్వే చేపట్టారు. ఎటువంటి వివాదాలకు ఆస్కారం లేకుండా కచ్చితమైన భూ హక్కు పత్రాలను భూ యజమానులకు పంపిణీ చేస్తున్నారు. తద్వారా భూ రికార్డులు క్లీన్ అవుతాయి. ఇది చాలా మంచి విధానం. ‘ఫ్యామిలీ డాక్టర్’తో ప్రజల్లో నిశ్చింత ♦ డా.వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్టం చేసింది. ఇందులో భాగంగా రోగుల ఇంటి వద్దే వైద్య సేవలను అందిస్తోంది. తద్వారా చిన్న చిన్న జబ్బులకు పట్టణాలకు పరుగులు తీయాల్సిన అవసరం తప్పిందని ప్రజలు నిశ్చింతగా ఉన్నారు. ఇదొక అద్భుతమైన కార్యక్రమం. ♦ ఆయుష్మాన్ భారత్ హెల్త్–వెల్నెస్ సెంటర్ల ఏకీకరణ ద్వారా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేస్తోంది. ♦ గ్రామీణ ప్రాంతాల్లో 2,500 జనాభాకు ఒకటి చొప్పన డా.వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేసింది. ♦ ప్రతి విలేజ్ క్లినిక్‌లో ఒక కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్, ఒక ఏఎన్ఎం, ముగ్గురు నలుగురు ఆశా వర్కర్లను నియమించారు. ♦ విలేజ్ క్లినిక్స్ భవనాలను 932 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్వార్టర్‌తో సహా నిరి్మంచారు. వీటిల్లో 105 రకాల మందులు, 14 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ♦ ప్రతీ పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లను అందుబాటులో ఉంచడంతోపాటు ప్రతీ పీహెచ్‌సీకి విలేజ్ క్లినిక్స్‌ను అనుసంధానించారు. ♦ 104 మెబైల్ మెడికల్ యూనిట్‌తో సహా ఫ్యామిలీ డాక్టర్ సేవలను అందిస్తున్నారు. ఒక డాక్టర్ పీహెచ్సీలో ఓపీ సేవలను అందిస్తే.. మరో డాక్టర్ విలేజ్ క్లినిక్స్‌కు హాజరవుతున్నారు. ♦ ఫ్యామిలీ డాక్టర్ విధానంలో సాధారణ ఓపీలతో పాటు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ నిర్వహణ, యాంటినేటల్ కేర్.. తల్లులు, నవజాత శిశువులకు పోస్ట్‌నేటల్ కేర్, అంగన్వాడీలు, పాఠశాలల సందర్శన, రక్తహీనత పరీక్షలు, పర్యవేక్షణ, మంచానికే పరిమితమైన రోగుల ఇళ్ల సందర్శన, పంచాయతీల సమన్వయంతో గ్రామ పారిశుధ్య పర్యవేక్షణ జరుగుతోంది. ♦ ఈ ఏడాది మే 3 నాటికి గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ సేవలను 97,11,224 మంది ప్రజలు వినియోగించుకున్నారు. రైతులకు అండగా ఆర్బీకేలు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు మంచి విధానమని, తద్వారా ప్రభుత్వం రైతుల సాగుకు అవసరమైన అన్ని రకాల ఇన్‌పుట్స్‌ను ఉంటున్న ఊళ్లలోనే పొందే అవకాశం కల్పిందని అంతర్రాష్ట్ర మండలి నివేదిక పేర్కొంది. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరాతో పాటు వారికి పనికొచ్చే ఇతర సేవలనూ ఆర్బీకేలు అందిస్తున్నాయని తెలిపింది. అన్ని పంటలను ఈ–క్రాప్ ద్వారా నమోదు చేస్తూ, వాస్తవ సాగుదారు సమాచారాన్ని ప్రభుత్వం తెలుసుకుంటోందని.. తద్వారా నిజమైన సాగుదారులకు వైఎస్సార్ సున్నా వడ్డీ, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీలను అందిస్తోందని ప్రశంసించింది. రైతుల నుంచి పంటల కొనుగోలు కూడా ఆర్బీకేల్లోనే చేపడుతోందని తెలిపింది. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నదాతలను అన్ని విధాలా చేయి పట్టుకుని నడిపిస్తోందని కొనియాడింది. -
ఆ పథకాలకు బ్రేక్? దరఖాస్తు వారిలో ఆందోళన..
మంచిర్యాల: రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు గత ప్రభుత్వం ప్రారంభించిన పథకాల కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే ఆ పథకాలతో కొంతమంది లబ్ధి పొందగా, చాలా మంది అర్హులు దరఖాస్తు చేసుకుని వేచి చూస్తున్నారు. బీసీలు, మైనారిటీలకు రూ.లక్ష సాయం అందించేందుకు బీసీబంధు, మైనారిటీ బంధు పథకాలు ప్రారంభించి దరఖాస్తులను స్వీకరించారు. మొదటి విడతలో కొందరు లబ్ధి పొందారు. ఇక సొంత ఇంటి కలను తీర్చేందుకు గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి దరఖాస్తులను తీసుకున్నా అర్హులకు ఎలాంటి సాయం అందించలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం మారడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది. పథకాలు కొనసాగుతాయా.. కొనసాగినా తమకు వర్తిస్తాయా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. బీసీ, మైనారిటీ బంధు కొందరికే.. జిల్లా వ్యాప్తంగా బీసీబంధు కోసం దరఖాస్తు చేసుకున్న 11,107 మందిలో క్షేత్రస్థాయి పరిశీలన చేసి, అర్హులుగా 7,734 మందిని గుర్తించారు. మొదటి విడతగా నియోజకవర్గానికి 300 మంది చొప్పున మూడు నియోజకవర్గాల నుంచి 900 మందికి రూ. లక్ష సాయం అందించారు. రెండో విడతలో మరో 900 మందిని గుర్తించినా, వారికి అందించాల్సిన నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఈలోగా ఎన్నికల షెడ్యూల్ రావడంతో పథకానికి బ్రేక్ పడింది. ఇక మైనారిటీలకు రూ.లక్ష సాయం అందించేందుకు దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలో 2,709 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 100 మందిని మొదటి విడతలో గుర్తించి, వారికి రూ.లక్ష చొప్పున అందించారు. మిగతావారికి సాయం అందించేందుకు నిధులు విడుదల చేయలేదు. ‘గృహలక్ష్మి’పై సందిగ్ధం.. సొంత ఇంటి స్థలం ఉన్నవారు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. దరఖాస్తులు స్వీకరించింది. జిల్లావ్యాప్తంగా 51,764 మంది దరఖాస్తు చేసుకోగా, 40,501 మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి రూ.3 లక్షల అందించాల్సి ఉంది. నిర్మాణాలకు అనుగుణంగా మూ డు విడతల్లో దీనిని అందించాలని భావించింది. ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10, బీసీ, మైనారిటీలకు 50, జనరల్ కేటగిరీలకు 20 శాతం రిజర్వు చేశారు. నియోజకవర్గానికి 3 వేల మందికి ఇవ్వాలని భావించినా గుర్తించడంలో జరిగిన ఆలస్యంతో ఒక్కరికి కూడా లబ్ధి చేకూరలేదు. -
కొత్త సర్కార్‌పైనే ఆశలు! ఆసరా కోసం ఎదురుచూపులు..
ఖమ్మం: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో ఆసరా పెన్షన్ లబ్ధిదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీల హామీలను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హామీల్లో భాగంగా సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తొలి రోజు ఆరు గ్యారంటీలపై సంతకం చేశారు. ఈ గ్యారంటీల్లో ఆసరా పెన్షన్ అందుకుంటున్న లబ్ధిదారులకు చేయూత పథకం కింద రూ.4,000 లకు పెంచి అమలు చేస్తామని ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పడడం, రెండు పథకాలను ఇప్పటికే ప్రారంభించడంతో ఆసరా లబ్ధిదారులు తమ గ్యారంటీ కూడా అమలవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చేయూత కింద ఇచ్చిన హామీల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీకి రూ.10 లక్షలు పెంచి అమలు చేస్తున్న ప్రభుత్వం, పెన్షన్లను కూడా త్వరలోనే పెంచి అమలు చేస్తారని ఆశిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 3,11,008 మంది.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆసరా పెన్షన్ అందుకుంటున్న లబ్ధిదారులు 3,11,008 మంది ఉన్నారు. వీరిలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, ఏఆర్టీ, ఫైలేరియా, డయాలసిస్ బాధితులు ఉన్నారు. వికలాంగులకు ప్రస్తుతం రూ.4 వేల పెన్షన్ అందుతుండగా.. ఇతర లబ్ధిదారులకు రూ.2,016లు పెన్షన్ అందుతుంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చేయూత కింద వీరందరికి రూ.4 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఖమ్మం జిల్లాలో 1,91,548 మందికి నెలకు రూ.44,34,00,000లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,19,460 మందికి నెలకు రూ.26,96,67,000లు పైగా చెల్లిస్తున్నారు. కొత్త ప్రభుత్వం చేయూత అమలు చేస్తే ఉమ్మడి జిల్లాలో పెన్షన్లకు చెల్లించాల్సిన నగదు భారీగా పెరగనుంది. కేటగిరీల వారీగా పెన్షన్లు అందుకుంటున్న లబ్ధిదారుల సంఖ్య ఇవి చదవండి: లబ్ధి చేకూరేలా.. ఫైల్ తొక్కి పెట్టిందెవరు? -
పేదల సుఖసంతోషాలే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం
సింగరాయకొండ: పేద ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అందుకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సహాయ, సహకారాలు అభినందనీయమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. 2047 సంవత్సరం నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తు న్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం 17 రకాల పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. ఆయా పథకాల గురించి అందరికీ తెలిసేలా చేయడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశమని వివరించారు. కార్యక్రమంలో భాగంగా గురువారం ప్రకాశం జిల్లా కనిగిరి మండలం చాకిరాల పంచాయతీ భూతంవారిపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు కొమ్మాలపాటి వెంకట రమణమ్మతో ప్రధాని మోదీ వర్చువల్‌గా మాట్లాడారు. డ్రోన్ ద్వారా సాంకేతిక పద్ధతిలో చేస్తున్న వ్యవసాయం ద్వారా ఆమెకు కలిగిన లబ్ధిని, అనుభవాలను చెప్పాలని మోదీ కోరారు. రమణమ్మ మాట్లాడుతూ తాను ఎంఏ బీఈడీ చదివానన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాల ద్వారా డ్రోన్ ద్వారా వ్యవసాయం చేస్తున్నానని తెలిపారు. అందుకోసం ఆచార్య రంగా యూనివర్సిటీలో 12 రోజుల పాటు శిక్షణ పొందానన్నారు. ఈ విధానం ద్వారా తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేసుకుంటున్నానని, నీటి అవసరం కూడా బాగా తగ్గిందని ఆమె చెప్పారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రతి రైతూ సాంకేతిక పద్ధతిలో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. అలాగే సింగరాయకొండ మండలంలోని పాకల గ్రామంలోని మరికొంతమందితోనూ ప్రధాని మోదీ వర్చువల్‌గా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నదని కొనియాడారు. అనంతరం 24 స్వయం సహాయ గ్రూపులకు రూ.4.80 కోట్ల విలువైన బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులు అందించారు. పారిశుధ్య పనులు చేస్తున్న క్లాప్ మిత్రలను సత్కరించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణులకు సీమంతం చేశారు. ఆయుష్మాన్ భారత్ కార్డులను లబ్ధిదారులకు అందించారు. ఉజ్వల భారత్ పథకంలో భాగంగా గ్యాస్ కనెక్షన్లను లబ్ధిదారులకు ఉచితంగా అందజేశారు. డ్రోన్ వినియోగంలో శిక్షణ పొందిన రమణమ్మకు లైసెన్స్ పత్రాన్ని అందజేశారు. కలెక్టర్ దినేష్‌కుమార్, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రాం జిల్లా ఇన్చార్జి ఎం.రామచంద్రుడు, జేసీ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
గిగ్ వర్కర్స్ కోసం రాజస్తాన్ తరహా పథకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ కోసం రాజస్తాన్ తరహాలో పథకాన్ని వర్తింప జేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. సీఎం, మంత్రివర్గస్థాయిలో గిగ్ వర్కర్స్ ప్రతినిధుల బృందంతో సమావేశం ఏర్పాటు చేసి సామాజిక భద్రతతో కూడిన నిధిపై చర్చిస్తామని, తగిన ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. ఇప్పటికే పార్టీ మేనిఫెస్టోలో సంక్షేమ బోర్డు ఏర్పాటు అంశం ఉందని, ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు సాయం, సింగిల్ పర్మిట్ పాలసీ, పెండింగ్ చలాన్ 50 శాతం తగ్గింపుతో క్లియరెన్స్ లాంటి ఆలోచనలు ఉన్నాయని తెలిపారు. మంగళవారం హైదరాబాద్ యూసుఫ్‌గూడలో జీహెచ్ఎంసీ పారిశు ధ్య కార్మికులు, గిగ్ వర్కర్ల (డెలివరీ బాయ్స్ ఆటో, క్యాబ్ డ్రైవర్లు)తో ఆయన ముఖాముఖి నిర్వహించారు. డెలివరీ బాయ్స్, పారిశుధ్య కార్మికుల సమస్య లు, దినచర్య గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా కార్మికులు తమ కష్టాలు ఆయనకు వివరించారు. శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదు శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గంటల కొద్దీ పనిచేసి సంపాదించినదంతా డీజిల్, పెట్రోల్‌కే సరిపోతోందని వాపోయారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సామాజిక భద్రత, ప్రమాద, ఆరోగ్య బీమా కల్పించాలన్నారు. తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటా యించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్ధి అజారుద్దీన్ పాల్గొన్నారు. -
ఏపీలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాల అమలు భేష్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కింద గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించే టేక్ హోమ్ రేషన్ పంపిణీ ఆంధ్రప్రదేశ్‌లో బాగా అమలవుతోందని నీతి ఆయోగ్ నివేదిక కితాబు ఇచ్చిది. వివిధ రాష్ట్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీల్లో మంచి పద్ధతులపై నీతి ఆయోగ్ నివేదిక రూపొందించింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనత, పౌష్టికాహార లేమిని పూర్తిగా తొలగించడమే లక్ష్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిగిరిజన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్, మైదాన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా పక్కాగా అమలు చేస్తోందని నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కోసం ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ స్మార్ట్ ఫోన్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తోందని, తద్వారా టేక్ హోమ్ రేషన్ పంపిణీకి సంబంధించి బహుళ అంశాలను ట్రాక్ చేస్తున్నట్టు నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. తద్వారా రేషన్ పంపిణీ సమయంలో లీకేజీలను నిరోధించడంతో పాటు పక్కాగా ధ్రువీకరణ జరుగుతోందని నీతి ఆయోగ్ తెలిపింది. అంగన్వాడీ కేంద్రాల వారీగా అంగన్వాడీ వర్కర్లు ప్రతినెలా వివిధ వర్గాలకు చెందిన లబ్ధిదారుల వివరాలను యాప్‌లో నమోదు చేయడంతోపాటు ప్రతినెలా ఆ డేటాను నవీకరిస్తున్నట్టు నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. నీతి ఆయోగ్ ఇంకా ఏం చెప్పిందంటే.. ► ఈ–సాధన సాఫ్ట్వేర్ నుంచి లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా ప్రతినెలా టేక్ హోమ్ రేషన్ సరుకులు ఎంత పరిమాణం అవసరమో అంచనా వేస్తారు. గత నెలకు సంబంధించి నిల్వలు ఏమైనా ఉన్నాయా అనే వివరాలను పరిగణనలోకి తీసుకుని, ప్రతినెలా బడ్జెట్ అంచనాలను అభివృద్ధి చేస్తారు. ► సాఫ్ట్వేర్ డేటాతో మరోసారి రీ వెరిఫికేషన్ చేస్తున్నారు. ప్రభుత్వంలో నమోదైన సరఫరాదారులకు పాలు, గుడ్లు తదితర డ్రై రేషన్ సరుకులు అంగన్వాడీ కేంద్రాల వారీగా ఎంత పరిమాణం కావాలో తెలియజేస్తారు. ► జిల్లాల వారీగా ఏయే అంగన్ వాడీ కేంద్రాలకు ఎంత పరిమాణంలో డ్రై రేషన్ అవసరమో అంచనా మేరకు సరఫరాదారు డెలివరీ చేస్తారు. ►అవసరమైన మెటీరియల్ సరఫరా చేసారా లేదా అనే విషయాన్ని అంగన్వాడీ వర్కర్ యాప్‌లోని డేటా ఎంట్రీ ద్వారా బయోమెట్రిక్ ప్రమాణీకరణతో ధ్రువీకరిస్తారు. ►ఆ వెంటనే అంగన్వాడీ కేంద్రానికి సరఫరా అయిన టేక్ హోమ్ రేషన్ పరిమాణాన్ని మహిళా సూపర్వైజర్ తనిఖీ నిర్వహిస్తారు. ఆ తరువాత శిశు అభివృద్ధి ప్రాజెక్టు డైరెక్టర్ మరోసారి తనిఖీ నిర్వహిస్తారు. నాణ్యతను కూడా నిర్థారిస్తారు. -
ఇవిగో నవరత్నాల వెలుగులు
ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో ఎన్నికలకు ముందు ప్రకటించిన మేనిఫెస్టోను.. ఎన్నికల్లో గెలిచి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచే మనసా వాచా ఆచరణలోకి తీసుకురావటం మొదలుపెట్టారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆడిన మాట తప్పలేదు. ఆరంభించిన ఏ పథకాన్నీ ఆపలేదు. ఫలితంగా రాష్ట్రంలో కోట్లాది మందికి నవరత్న పథకాలు అండగా నిలిచాయి. చిన్నారులు మొదలు పండు ముదుసలి వరకు అందరూ ఆనందంగా జీవించేలా వనరులు సమకూరుతున్నాయి. కనీస అవసరాలైన కూడు, గూడు, ఆరోగ్యానికి ఢోకా లేదనే విషయం ఊరూరా కళ్లకు కడుతోంది. పేదల జీవితకాల కల అయిన ‘సొంతిల్లు’ సాకారం కావడంతో కొత్తగా ఊళ్లకు ఊళ్లే వెలుస్తుండటం కనిపిస్తోంది. అక్కచెల్లెమ్మలు సొంత కాళ్లపై నిలబడేలా చేయూత, ఆసరా అండగా నిలుస్తోంది. పేదింటి పిల్లలకు పెద్ద చదువులు.. విదేశీ విశ్వవిద్యాలయాల్లో సైతం చదివేందుకు రాచబాట సిద్ధమైపోయింది. అన్నదాతకు వ్యవసాయం పండుగగా మారింది. వెరసి నవరత్నాల వెలుగులు ప్రతి ఊళ్లోనూ ప్రసరిస్తున్నాయి. సీఎం వైఎస్ జగన్ తపన, తాపత్రయం, ఆకాంక్ష ఫలించిన తీరు లబ్ధిదారుల మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. మా బాబు మాట్లాడుతున్నాడు.. మాది నంద్యాల జిల్లాలోని దొర్నిపాడు గ్రామం. నా భర్త పేరు రామయ్య. మేము వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాం. మా బాబు జాన్విత్ రెండేళ్ల వయస్సులో శబ్దాలకు స్పందించే వాడు కాదు. ఎంత చప్పుడు చేసినా వాడిలో చలనం ఉండేది కాదు. మా పరిస్థితి చూసి, ఇరుగు పొరుగు వారు కూడా మాకు సాయంగా బాబును వివిధ రకాలుగా శబ్దాలు చేస్తూ పరీక్షించేవారు. అయినా అలానే ఉండిపోయేవాడు. ఒక రోజు ఆళ్లగడ్డ ఆస్పత్రిలో చూపించాము. అక్కడి వైద్యులు బాబుకు వైద్య పరీక్షలు చేశారు. వినికిడి లోపం ఉందని నిర్ధారించారు. వినికిడి కోసం మందులు వాడుతూనే స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేరి్పంచాం. అక్కడి ఉపాధ్యాయులకు జాన్విత్ పరిస్థితి గురించి వివరించాము. దీంతో వాళ్లు ప్రత్యేక శ్రద్ధతో పాఠాలు బోధించేవారు. అయినా అబ్బాయి చదువులో వెనుకబడ్డాడు. బాబు భవిష్యత్తు ఏమిటా అని దిగులు పడేవాళ్లం. మా అదృష్టం కొద్ది మా ఊరిలో ఒక స్వచ్ఛంద సంస్థ ఉచిత వైద్య శిబిరం పెట్టింది. అక్కడికి అబ్బాయిని తీసుకువెళ్లాం. పరీక్షించిన ఒక ప్రభుత్వ వైద్యుడు.. బాబుకు సరైన చికిత్స అందించి ఆపరేషన్ చేస్తే వినడంతో పాటు మాట్లాడే అవకాశం ఉందన్నారు. ఆ వైద్యుడి మాటలు మాలో ఆశలు రేపాయి. ఆరోగ్య శ్రీ ద్వారా ఆపరేషన్ కూడా ఉచితంగా చేస్తారని సలహా ఇచ్చారు. దీంతో ఒక రోజు నంద్యాల పట్టణంలో మధుమణి ఆస్పత్రిలో సంప్రదించాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.12 లక్షల ఖర్చు అయ్యే కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ ఉచితంగా చేశారు. బాబుకు ఇప్పుడు వినిపిస్తోంది. ఆడియో థెరపీ ద్వారా మాటలు వచ్చేందుకు వైద్యులు కృషి చేశారు. మాటలూ వచ్చాయి. జాన్విత్కు ఇప్పుడు తొమ్మిదేళ్లు. నాలుగో తరగతి చదువుతున్నాడు. బడిలో పాఠాలు వీడియో క్లాసెస్ ద్వారా బోధిస్తుండడంతో ఇంతకు ముందు కంటే బాగా అర్థం అవుతున్నాయని చెబుతున్నాడు. ఇపుడు బాబు భవిష్యత్తు గురించి మాకు ఎటువంటి బెంగ లేదు. – రాయపాటి పద్మ, దొర్నిపాడు, నంద్యాల జిల్లా ,(ఎం.హరిహరసాగర్, విలేకరి, నంద్యాల టౌన్) నా ఆ్రస్టేలియా కల సాకారం మాది శ్రీకాకుళం జిల్లా పొందూరు గ్రామం. విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనేది నా కోరిక. భవిష్యత్‌లో ఉన్నతంగా ఎదగాలని, తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాలని, మంచిగా స్థిరపడాలనేది నా ధ్యేయం. నేను పదో తరగతి వరకు పొందూరులోని ప్రైవేటు పాఠశాలలో, ఇంటర్, డిగ్రీ విశాఖలో చదివాను. కరోనా సమయంలో విదేశాల్లో చదివేందుకు అవసరమైన సబ్జెక్టుల్లో ఇంటి వద్దే ప్రిపేర్ అయ్యాను. విదేశాల్లో ఉన్న ఉత్తమ కోర్సులు చదివేందుకు అవసరమైన పరీక్షలు పాసయ్యాను. నేను ఎంచుకున్నట్టే ఆ్రస్టేలియాలో మోనష్ యూనివర్సిటీలో సీటు వచి్చంది. సుమారు రూ.60 లక్షల ఫీజులో 8 లక్షలు తగ్గించారు. మిగిలిన రూ.52 లక్షలు ఎలా చెల్లించాలో తెలియక అయోమయంలో పడిపోయాను. ఆ డబ్బు సమకూర్చాలని నాన్నకు చెప్పలేకపోయాను. ఆ్రస్టేలియాలో చదివించే స్థోమత నాన్నకు లేదు. మా నాన్న గురుగుబెల్లి శ్యామలరావు పొందూరులోని వైఎస్సార్ క్రాంతి పథంలో ఎంఎస్సీసీగా పనిచేస్తున్నారు. ఆయనకు వచ్చే జీతం కుటుంబం గడిచేందుకు మాత్రమే సరిపోతుంది. దీంతో దిక్కు తోచలేదు. సీఎం ఆదుకుంటారనే నమ్మకంతో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాను. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం కింద రూ.51,92,106 మంజూరు చేశారు. దీంతో నా గోల్ రీచ్ అవుతానన్న నమ్మకం ఏర్పడింది. 2023 జూలై 10న ఆ్రస్టేలియా వెళ్లాను. జగనన్న మంచి మనసు వల్ల నేను ఇవాళ ఆ్రస్టేలియాలోని మోనష్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ డేటా సైన్స్ చదువుతున్నాను. మొదటి సెమిస్టర్ పూర్తయ్యింది. – గురుగుబెల్లి వంశీ, మోనిష్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియా (పాయక మధుసూదనరావు, విలేకరి, పొందూరు) ఇప్పుడు అప్పుల తిప్పల్లేవు మాది కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పెండేకల్ గ్రామం. ఎనిమిది ఎకరాల భూమి ఉంది. ఏటా పంట పెట్టుబడి కోసం మా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. అప్పుల కోసం కాళ్లరిగేలా తిరిగేవాళ్లం. ఒక్కోసారి అప్పు పుట్టేది కాదు. ఈ పరిస్థితుల్లో ఇటు వ్యవసాయం వదులుకోలేక అటు పెట్టుబడులు పెట్టుకోలేక మానసికంగా కుంగిపోయేవాళ్లం. అప్పు చేసి, పెట్టుబడులు పెట్టినా పంట చేతికందుతుందన్న గ్యారెంటీ లేదు. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఇక అంతేసంగతులు. తుపానులు వచి్చనా, వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా పెట్టుబడులు, శ్రమ మట్టిలో కలిసిపోయేవి. అప్పులకు వడ్డీలు పెరిగిపోయేవి. అప్పు తీర్చలేక వడ్డీ వ్యాపారుల వద్ద మాట పడేవాళ్లం. మళ్లీ ఆ పొలాన్ని పంటసాగు చేసే స్థితికి తీసుకురావాలంటే, అదనపు పెట్టుబడులు పెట్టాల్సి వచ్చేది. పరిస్థితి పుండు మీద కారం చల్లినట్టు తయారయ్యేది. కళ్లలోంచి నీరు వచ్చేది. మా బాధ ఆ దేవుడికే తెలుసు. సీఎం వైఎస్ జగన్ పుణ్యాన ఇప్పడు ఆ బాధ తప్పింది. ఊర్లో అప్పులు తీర్చలేదన్న అవమానాలు లేవు. గొప్ప రైతుగా తలెత్తుకొని జీవిస్తున్నాను. ఖరీఫ్, రబీ సాగు మొదలెట్టే సమయానికి వైఎస్సార్ రైతు భరోసా కింద ఆర్థిక సాయం అందుతోంది. ఇప్పుడు ఎంతో ఆనందంతో ఆముదం, కంది, సజ్జ వంటి పంటలు సాగు చేస్తున్నాము. గతంలో బ్యాంకులు కూడా పంట రుణాలు సకాలంలో ఇచ్చేవి కావు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ప్రభుత్వం ఏటా ఇచ్చే రూ.13,500 పెట్టుబడులకు బాగా ఉపయోగపడుతున్నాయి. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద కూడా పరిహారం లభిస్తోంది. నాలుగేళ్లుగా అప్పుల బాధలే లేవు. పైగా రైతు భరోసా కేంద్రాల వల్ల ఎప్పటికప్పుడు విలువైన సలహాలు, సూచనలు అందుతున్నాయి. – వన్నూరప్ప, పెండేకల్, కర్నూలు జిల్లా (గవిని శ్రీనివాసులు, విలేకరి, కర్నూలు అగ్రికల్చర్) -
రైతులు బిచ్చగాళ్లలా కనిపిస్తున్నారా?
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు, రైతుబీమా ప్రపంచంలోనే అత్యుత్తమ పథకాలుగా అంతర్జాతీయ సంస్థలు ప్రశంసిస్తుండగా, కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ పథకాలను దుబారా అంటూ వ్యాఖ్యలు చేస్తు న్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు భిక్ష అంటున్న కాంగ్రెస్ పార్టీకి, రైతులు భిక్షగాళ్లలా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో బ్యాంకు అప్పుల వసూలుకు రైతుల ఇంటి తలుపులు తీసుకెళ్లిన ఘటనలు ఉండేవని, కానీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం రైతుబంధు ద్వారా 11 విడతల్లో రూ.72,815 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసిందని వెల్లడించారు. కొల్లాపూర్ సభలో కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. పాలమూరు ద్వారా కృష్ణా జలాలను ఎత్తిపోసి రైతుల పొలాలకు అందిస్తున్న ఘనత బీఆర్ఎస్ సర్కారుకే దక్కుతుందన్నారు. ధాన్యం కొనుగోలు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, సాగునీటి శిస్తురద్దు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, రుణమాఫీ ద్వారా రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టడం ద్వారా విత్తన రంగంలో దేశానికే ఆదర్శంగా నిలిచామని చెప్పారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉందన్నారు. నిందలు, వ్యక్తిగత విమర్శలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదన్నారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలను పట్టించుకోరన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, సాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
పథకం ఒకటే.. ప్రయోజనాలు రెండు
వేతన జీవులు సెక్షన్ 80సీ కింద ఒక ఏడాదిలో రూ.1.5 లక్షల పన్ను ఆదా కోసం సంప్రదాయ సాధనాలైన బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్, బీమా పాలసీలు, పీపీఎఫ్, ఎన్ఎస్ఈ తదితర సాధనాలకు ప్రాధాన్యం ఇస్తుంటారు. వీటికంటే కూడా దీర్ఘకాలానికి పన్ను ఆదా సౌలభ్యంతో కూడిన ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) మ్యూచువల్ ఫండ్ పథకాలు రాబడుల దృష్ట్యా ఎంతో మెరుగైనవి. కనీసం ఐదేళ్లు, అంతకుమించి దీర్ఘకాలం కోసం పెట్టుబడులను కొనసాగించే సౌలభ్యం ఉన్న వారు ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో పెట్టుబడులపై రెండంకెల స్థాయిలో రాబడులను అందుకోవచ్చు. ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులు ఉన్నప్పుడే సంపద సృష్టి సాధ్యపడుతుంది. మరి ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులను ఇచ్చేవి ఈక్విటీ సాధనాలే. ఈ విభాగంలో మెరుగైన పనితీరు చూపిస్తున్న పథకాల్లో పరాగ్ పారిఖ్ ట్యాక్స్‌సేవర్ కూడా ఒకటి. రాబడులు ఈ పథకం 2019 జూలై 24న ఇది ప్రారంభమైంది. ఆరంభం నుంచి ఇప్పటి వరకు సగటు వార్షిక రాబడులు 21 శాతానికిపైనే ఉన్నాయి. ముఖ్యంగా గడిచిన ఆరు నెలల్లో 12 శాతం, ఏడాది కాలంలో పెట్టుబడిపై 13.55 శాతం రాబడిని ఈ పథకం తెచ్చిపెట్టింది. పరాగ్ పారిఖ్ ట్యాక్స్ సేవర్ ఫండ్‌కు.. ఈ రంగంలో ఎంతో పేరున్న రాజీవ్ ఠక్కర్ ఫండ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలో సుదీర్ఘ అనుభవం ఉంది. పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీక్యాప్ పథకాన్ని సైతం ఆయనే నిర్వహిస్తున్నారు. ఇక ఈ పథకం గడిచిన మూడేళ్ల కాలంలో ఏటా 22 శాతానికి పైనే రాబడులను తెచ్చి పెట్టింది. ఈ పథ కం ఎక్స్పెన్స్ రేషియో (పెట్టుబడులపై ఇన్వెస్టర్లు ఏటా చెల్లించాల్సిన మొత్తం) 1.86 శాతంగా ఉంది. పెట్టుబడుల విధానం.. ఈ పథకం పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని అనుసరిస్తుంది. వ్యాల్యూ ఇన్వెస్టింగ్ విధానంలో స్టాక్స్‌ను ఎంపిక చేస్తుంటుంది. కనీసం 80 శాతం పెట్టుబడులను దేశీయ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. మరో 20 శాతం మేర పెట్టుబడుల విషయంలో ఈ పథకానికి స్వేచ్ఛ ఉంటుంది. ఈక్విటీల్లోనూ లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌ను ఎంపిక చేసుకుంటుంది. మంచి యాజమాన్యం, దీర్ఘకాలంలో స్థిరమైన వృద్ధిని చూపించే కంపెనీలను ఎంపిక చేసుకుని, దీర్ఘకాలం పాటు వాటిల్లో పెట్టుబడులను కొనసాగిస్తుంది. ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో పెట్టుబడులకు మూడేళ్ల లాకిన్ పీరియడ్ అమలవుతుంది. మూడేళ్లలోపు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఇది కూడా పెట్టుబడులు, రాబడుల స్థిరత్వానికి అనుకూలించే అంశమే. ఈ పథకం నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సమయంలో లాభం రూ.లక్షకు మించి ఉన్నట్టయితే.. రూ.లక్షకు మించి ఉన్న మొత్తంపై 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రతీ నెలా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడిని ఈఎల్ఎస్ఎస్ పథకాల నుంచి ఆశించొచ్చు. పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.2065 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 85 శాతాన్నే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. డెట్ సాధనాల్లో 15 శాతం పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం నగదు నిల్వలు పెద్దగా లేవు. ఈక్విటీ మార్కెట్లు దిద్దుబాటుకు గురై, ఆకర్షణీయమైన అవకాశాలు లభిస్తే, అప్పుడు డెట్‌లో పెట్టుబడులు తగ్గించుకుని ఈక్విటీలకు కేటాయింపులు పెంచుతుంది. పెట్టుబడుల పరంగా ఫైనాన్షియల్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగ కంపెనీలకు ప్రాధాన్యం ఇచ్చింది. 50 శాతం పెట్టుబడులను ఈ రంగాల కంపెనీలకే కేటాయించింది. -
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలు, పథకాలు, కార్యక్రమాలతో ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతోందని అంతర్రాష్ట్ర మండలి ప్రశంసలు..ఇంకా ఇతర అప్డేట్స్
-
రాజ్యాంగం చదివిన నాయకులెందరు?
ప్రజల కోసం కాకుండా, పవర్ కోసమే పథకాలు పుట్టుకొస్తున్నాయనేది రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్, ఆర్థిక శాఖ మాజీ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి ఆవేదన. ఎన్నికల ప్రక్రియను ఐదేళ్ల కాంట్రాక్టుగానే పార్టీలు చూస్తున్నాయన్నది ఆయన మాటల్లోని అంతరార్థం. కార్పొరేట్ విధాన రాజకీయాలనే అన్ని పార్టీలూ అనుసరిస్తున్నాయన్నది ఆ పెద్దాయన నిశిత పరిశీలన. సీనియర్ ఐఏఎస్‌గా ఉమ్మడి రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేసిన నాగిరెడ్డి తెలంగాణలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా..రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తాజా ఎన్నికల నేపథ్యంలో పార్టీలూ, వారిచ్చే జనాకర్షణ పథకాల హామీలు..మారుతున్న రాజకీయ ముఖచిత్రంపై ‘సాక్షి’తో నిర్మొహమాటంగా తన భావాలను పంచుకున్నారు. ఆయన మాటల్లోనే. పునాదుల్లేని పథకాలు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పొలిటికల్ తప్ప... ప్రొసీజర్ కన్పించడం లేదు. బ్యూరోక్రాట్స్ వాస్తవ పరిస్థితిని వివరించే అవకాశం ఉండటం లేదు. సంక్షేమ పథకాలకు పురిట్లోనే పునాది వేయాలి. మనకుండే అవకాశాలు, ప్రజల డిమాండ్, వనరులు... ఇవన్నీ పరిశీలించాకే పథకాన్ని అమలు చేయాలి. కానీ తెలంగాణ లో అలాంటి కసరత్తు లేదు. పాలించే నేత కలలో వచ్చిందే పథకమైతే... దానికి పునాదులెక్కడుంటాయి. అందుకే రాష్ట్రంలో ఏ పథకమైనా పూర్తిస్థాయిలో ముందుకెళ్లడం లేదు. ఇది ప్రజలకు నిరాశ కల్గించే అంశమే కాదు... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా ప్రభావం చూపుతుంది. స్థానిక సంస్థలకే బాధ్యతలిస్తే...? సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికలో స్థానిక సంస్థలను భాగస్వాములను చేయాలి. అప్పుడే మంచి ఫలితాలొస్తాయి. జవాబుదారీతనం పెరుగుతుంది. అధికారులకు ఈ బాధ్యత ఇవ్వడం వల్ల రకరకాల ఒత్తిడులు ఉంటాయి. స్థానిక గ్రామ సర్పంచ్ నేతృత్వంలో లబ్దిదారుల ఎంపిక జరిగితే... ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక పథకాల రూపకల్పన, వాటి విధివిధానాలు పల్లె ప్రజల మనోభావాల్లోంచి పుట్టుకురావాలి. దురదృష్టమేంటంటే ... మన నాయకులు ప్రజలకు దగ్గరగా ఉండటం లేదు. వారి అభిరుచి ఏంటో తెలుసుకోవడం లేదు. రైతుకు ఇస్తున్నదేంటి? ఓట్ల రాజకీయంలో రైతు పాత్ర ముఖ్యమైంది. అందుకే రైతుకు పోటీపడి పథకాలు ఇస్తామంటున్నాయి పార్టీలు. నిజాన్ని ఒక్కసారి పరిశీలించండి. మనం రైతుకు ఇస్తున్నదెంత? ఇచ్చేవన్నీ ఉచితాలేనా? కానేకాదు. రైతు ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తు న్నాయి ప్రభుత్వాలు. కొన్నేళ్లు వెనక్కి వెళ్దాం. విత్తనం రైతే తన పంటలోది వాడేవాడు. పశు సంపద ద్వారా వచ్చే ఎరువే వాడుకునే వాడు. అరకతో దున్నేవాడు. పురుగుమందుల ముచ్చటే లేదు. ఇక రైతు ట్యాక్స్ చెల్లించాల్సిన పరిస్థితి ఎక్కడ? కానీ ఇప్పుడు విత్తనం. పురుగుమందు, ఎరువులు, ట్రాక్టర్లు అన్నీ మార్కెట్లో కొనాల్సిందే. ప్రతీ చోట రైతు ట్యాక్స్ కట్టాల్సిందే. అంటే ప్రభుత్వానికి చెల్లించే పన్నుల్లో రైతు వాటా సున్నా నుంచి ఎన్నో రెట్లు పెరిగింది? ఇంకా ఉచితాలు ఇచ్చామంటారేంటి? గిట్టుబాటు ధర ఇస్తే సరిపోతుంది. భూముల విలువలు పెరగడం అభివృద్ధా? గ్లోబలైజేషన్ తర్వాత భూమి కూడా ఓ పెట్టుబడి వస్తువైంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగాన్ని కార్పొరేట్ శక్తులు ఎంచుకున్నాయి. అందుకే వాటి విలువ పెరిగింది. ఎకరం రూ. కోటికి అమ్ముడైన రైతు రూ. 50 లక్షలతో వేరొక చోట కొంటున్నాడు. అక్కడి రైతు వేరే చోటుకు ఇలా భూముల అమ్మకాలు సాగుతున్నాయి. అంతే తప్ప అభివృద్ధి వల్లే భూములు పెరిగాయని చెప్పలేం. పల్లెలెందుకు ఖాళీ అవుతున్నాయి? ప్రతీ పల్లెకూ రోడ్లున్నాయి. నీళ్లున్నాయి. కరెంట్ ఉంది. నెట్... డిష్ అన్నీ ఉన్నాయి. పట్టణాలకు సరిసమానంగానే ఉన్నాయి. కానీ పల్లె జనం పట్నం బాట పడుతున్నారు. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ పట్టణంతో ముడిపడి ఉన్నాయి. అందుకే అన్నీ ఉన్నా... జనం లేని పల్లెలను మనం చూస్తున్నాం. ఇలా అయితే, మన గ్రామీణ వ్యవస్థ ఏమవుతుంది? దీన్ని పార్టీలూ ఆలోచించాలి. రాజకీయమే తప్ప.. రాజ్యాంగం గురించి తెలుసా? ప్రపంచీకరణ ప్రభావం కావొచ్చు. రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఎంతమంది నాయకులు రాజ్యాంగం చదివారు? ఎంతమందికి చట్టాల గురించి తెలుసు? వారు చెప్పిందే చట్టం అనుకుంటున్నారు. ప్రజలకు ఇష్టమొచ్చినట్టుగా వాగ్దానాలిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తమకెందుకు అంటున్నారు. ఏదైనా పథకం తేవాలంటే అధికారులు అన్ని కోణాల్లో పరిశీలించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఐదు గంటల్లో పథకం రూపురేఖలు వెల్లడించాలనే ఒత్తిడి తెస్తున్నారు. డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో మినహా... తెలంగాణలో ప్రభుత్వ పథకాలు ప్రకటించిన విధంగా అమలవ్వలేదు. ఉప ఎన్నికలొస్తే ఆ ప్రాంతానికి మాత్రమే హడావిడిగా లబ్దిదారులను ఎంపిక చేస్తారు. ఇంకేదైనా రాజకీయ అవసరం అనుకుంటే ముందుకెళ్తారు. ఇదెక్కడి గవర్నెన్స్. కార్పొరేట్ స్టైల్లో ఉందే! ఇదేం ఎన్నికల నిఘా! ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థ పనితీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. రోజు రూ. లక్షల్లో నగదు, నగలు పట్టుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇదంతా ఎన్నికలకు తరలిస్తున్నదా? ఓ వ్యాపారి నగదు తీసుకెళ్తుంటే పట్టుకోవడం, సాధారణ పౌరుడి వద్ద డబ్బు దొరికిందని చెప్పడం విడ్డూరంగా ఉంది. వీళ్లకు ఎన్నికల్లో డబ్బు పంపిణీకి ఏమైనా సంబంధం ఉందా? ఈ నిఘా వ్యవస్థ ప్రజలను పీడించేలా ఉంది. నేను ఎన్నికల కమిషనర్‌గా ఉన్నప్పుడు దీన్ని ఎంతమాత్రం ఒప్పుకోలేదు. అనుమానం ఉంటే పేరు రాసుకుని అతనికి రాజకీయాలకు సంబంధం ఉందా? అనేది విచారణ చేయమన్నాం. ఇంతమందిని పట్టుకున్నారు సరే. ఇందులో ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా ఉన్నాడా? అసలు పంచాల్సిన డబ్బు ఎప్పుడో పల్లెలకు చేరిందనేది నా అనుమానం. అక్కడ వెదకాల్సింది పోయి... అడుగడుగునా సాధారణ పౌరులకు ఇబ్బంది కలిగించడం మంచిది కాదు. - వనం దుర్గాప్రసాద్ -
ఎన్నికల రాష్ట్రాల్లో ‘వికసిత్ భారత్ సంకల్ప్’ వద్దు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తమ పథకాలు తదితరాల గురించి ప్రజలకు వివరించేందుకు తలపెట్టిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో డిసెంబర్ ఐదో తేదీదాకా చేపట్టరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాకు గురువారం ఈ మేరకు లేఖ రాసింది. ‘నవంబర్ 20 నుంచి మొదలవుతున్న ఈ యాత్ర కోసం జిల్లా రథ్ ప్రహారీలుగా సీనియర్ ప్రభుత్వాధికారులను నామినేట్ చేయాల్సిందిగా రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసినట్టు మా దృష్టికి వచి్చంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న ఐదు రాష్ట్రాల్లో, నాగాలాండ్‌లో ఉపఎన్నిక జరుగుతున్న తపీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో డిసెంబర్ ఐదో తేదీదాకా ఇలాంటి కార్యకలాపాలేవీ చేపట్టరాదు’ అని ఆదేశించింది. -
రాజస్తాన్‌లో కాంగ్రెస్‌కు..వ్యతిరేక పవనాలు
‘రాజస్తాన్‌లో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటాపోటీగా ఉండనుంది’ : ఈ మాటలన్నది ఏ ఎన్నికల విశ్లేషకుడో కాదు. స్వయానా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాందీ! ఇది కేవలం నెల రోజుల క్రితం సంగతి!. తమ పాలనలోని ఈ రాష్ట్రంపై ఈసారి ఆ పార్టీ ఏ మేరకు ఆశలు పెట్టుకుందో చెప్పేందుకు ఈ వ్యాఖ్యలే నిదర్శనం. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఇతర రాష్ట్రాలతో, ముఖ్యంగా మధ్యప్రదేశ్‌తో పోలిస్తే రాజస్తాన్‌లో కాంగ్రెస్ పరిస్థితి అంత ఆశావహంగా ఏమీ లేదని ఆ పార్టీ స్థానిక నేతలే చెబుతున్నారు. ఇందుకు కారణాలూ అనేకం. రాజస్తాన్‌లో 1990లో బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చింది. అప్పటినుంచీ అక్కడ దానికి, కాంగ్రెస్‌కు ద్విముఖ పోరే సాగుతూ వస్తోంది. ఇక ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ ఎప్పుడూ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానాంశంగానే ఉంటుంది. అలా చూసుకున్నా ఈసారి అధికారం తమదేనని బీజేపీ ధీమాగా ఉంది. గహ్లోత్ సర్కారు విచ్చలవిడి అవినీతికి పాల్పడుతోందని, అసమర్థ పాలన సాగుతోందని సర్వత్రా అభిప్రాయం నెలకొందని చెబుతోంది. దీనికి తోడు రాష్ట్ర కాంగ్రెస్ నేతల అంతర్గత పోరు తమ పనిని మరింత తేలిక చేస్తుందని భావిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉండటం, ప్రధాని మోదీ ఛరిష్మా వంటివి మరింతగా కలిసొస్తాయని కాషాయ నేతలంటున్నారు. తమ డబుల్ ఇంజన్ నినాదానికే ఈసారి రాజస్తానీలు ఓటేస్తారని బీజేపీ ఆశతో ఉంది. ఈ నేపథ్యంలో ఒకవైపు యువ నేత సచిన్ పైలట్ అసమ్మతి రాగాలను ఎదుర్కొంటూనే, మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకతకూ అడ్డుకట్ట వేసేందుకు సీఎం అశోక్ గహ్లోత్ చెమటోడుస్తున్నారు. పథకాలే పథకాలు... ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు కొద్ది నెలల ముందునుంచే పలు ప్రజాకర్షక పథకాలకు గహ్లోత్ తెర తీశారు. ప్రభుత్వోద్యోగులకు పాత పెన్షన్ పథకం అమలు రాష్ట్రంలో కులాలవారీగా జన గణన రూ.25 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ పట్టణ ఉపాధి హామీ పథకం సామాజిక భద్రత కింద ఒక్కొక్కరికి నెలకు రూ.1,000 ఉజ్వల పథకం లబ్ధిదారులకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ కులగణన ప్రకటన ఓబీసీలు తదితర ప్రాబల్య వర్గాల్లో బాగా పని చేస్తుందని కాంగ్రెస్ ఆశిస్తోంది. తూర్పు రాజస్తాన్ కెనాల్ ప్రాజెక్టుతో ఆ ప్రాంతమంతటికీ తాగు, సాగునీరు అందిస్తామని చెబుతోంది. పథకాల్లో లబ్ధిదారులుగా చేరేందుకు ఇన్ఫ్లేషన్ రిలీఫ్ క్యాంపుల్లో పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా గహ్లోత్ స్వయంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు! బీజేపీది అదే వ్యూహం... రాష్ట్రంలో తమకనువైన పరిస్థితులు నెలకొన్నాయని బీజేపీ విశ్వసిస్తోంది. వాటినుంచి గరిష్టంగా ప్రయోజనం పొందాలని ప్రయత్నిస్తోంది. అయితే రాష్ట్ర బీజేపీలోనూ గ్రూపు తగాదాలకు కొదవ లేదు! మాజీ సీఎం వసుంధర రాజే వర్గం ఈసారి ఆమే ముఖ్యమంత్రి రేస్‌లో ముందున్నారని ఇప్పట్నుంచే ప్రచారం చేస్తున్నారు. ఇతర సీనియర్లకు ఇది నచ్చడం లేదు. దాంతో ఎందుకైనా మంచిదని మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మాదిరిగా రాజస్తాన్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ముందస్తుగా ఎవరినీ ప్రకటించలేదు. తద్వారా ఎన్నికల వేళ సీనియర్లలో అసంతృప్తులు చెలరేగి సహాయ నిరాకరణ తదితరాలకు దారి తీయకుండా జాగ్రత్త పడుతోంది. ఎప్పట్లాగే మోదీ మేనియానే తారకమంత్రంగా బీజేపీ రంగంలోకి దిగింది. ఆయన ఇప్పటికే రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. హిందూత్వ కార్డును ప్రబలంగా బీజేపీ ప్రయోగిస్తోంది. గతేడాది రాష్ట్రంలో జరిగిన మత కల్లోలాలను మోదీ స్వయంగా గహ్లోత్ సొంత అసెంబ్లీ స్థానమైన సర్దార్‌పురా ఎన్నికల సభలో ప్రస్తావించారు! ఇంటిపోరు ఏం చేసేనో...! పథకాలు, ప్రచారాల మాటెలా ఉన్నా, నానాటికీ తీవ్రమవుతున్న ఇంటి పోరుతో గహ్లోత్ సతమతమవుతున్నారు. అధికారంలోకి వచ్చిన నాటినుంచీ పార్టీ యువ నేత సచిన్ పైలట్ ఆయనకు కంట్లో నలుసుగా మారారు. 2020లో పైలట్ బహిరంగంగా గహ్లోత్‌పై తిరుగుబావుటా ఎగరేశారు. అధిష్టానం జోక్యంతో అప్పటికి తగ్గినా అడుగడుగునా గహ్లోత్‌ను ఆయన ముప్పుతిప్పలు పెడుతున్నారు. అంతటితో ఆగకుండా తీవ్రమైన అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారు. అసమర్థ పాలన సాగుతోందంటూ విమర్శలు సంధిస్తూ బీజేపీ పని తేలిక చేస్తున్నారు. అటు బీజేపీని, ఇటు అమస్మతిని, తిరుగుబాటును ఎదుర్కోలేక గహ్లోత్ సతమతమవుతున్నారు! -
స్కీంల బీఆర్ఎస్ కావాలా.. స్కాంల కాంగ్రెస్ కావాలా?
షాద్‌నగర్/తుక్కుగూడ/వికారాబాద్: వివిధ రకాల పథకాలు, కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అన్ని రంగా ల్లో అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ కావాలా.. స్కాంలతో ప్రజాధనాన్ని లూటీ చేసే కాంగ్రెస్ కావాలా? ప్రజలే ఆలోచించుకోవాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో అమలు సాధ్యం కాని హామీలిస్తూ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. గురువారం ఆయన షాద్‌నగర్‌లో ఎమ్మె ల్యే అంజయ్య యాదవ్‌తో కలిసి పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేశారు. గిరిజన బంజారా భవన్‌ను ప్రారంభించారు. అనంతరం పట్టణ శివారులోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. అలాగే వికారాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో, మహేశ్వ రం మండలం రావిర్యాలలో విజయ డెయిరీని ప్రా రంభించిన సందర్భంగానూ మంత్రి మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు దండిగా డబ్బుల మూటలు దేశాన్ని యాభై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందో అందరికీ తెలుసని కేటీఆర్ అన్నారు. ఆర్ఎస్ఎస్ వాది అయిన రేవంత్‌రెడ్డికి పీసీసీ ఇచ్చారని.. ఈ గాడ్సే బీజేపీలోకి వెళ్లడం ఖాయమని ఆరోపించారు. పంజాబ్‌కు సీఎంగా ఉన్న కెప్టెన్ అమరేందర్‌సింగ్ ఆనాడే ఈ విషయమై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాం«దీకి లేఖ రాశారని గుర్తు చేశారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్‌కు కర్ణాటక నుంచి, బీజేపీకి అదానీ సంస్థల నుంచి డబ్బుల మూటలు వస్తున్నాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో విపరీతంగా డబ్బులు పంపిణీ చేసి, ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునేందుకు రెండు పార్టీలు కుట్ర పన్నుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటాను ఎందుకు తేల్చడం లేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీ 2014లో 2022 కల్లా రైతుల ఆదాయం డబుల్ చేస్తామన్నారని కానీ ఇప్పటివరకు ఏ రైతు ఆదాయం కూడా డబుల్ కాలేదని ఎద్దేవా చేశారు. షాద్‌నగర్ సమీపంలోని సిద్దాపూర్లో 330 ఎకరాల్లో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. పాడిపంటలకు సీఎం ప్రోత్సాహం రాష్ట్రంలో పాడి పంటలను సీఎం కేసీఆర్ ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని కేటీఆర్ చెప్పారు. గత పాలకులు ప్రభుత్వ అ««దీనంలో ఉన్న విజయ డెయిరీని పట్టించుకోకుండా పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం పాడి రైతులకు లీటర్‌కు రూ.4 బోనస్ ఇచ్చి ప్రోత్సహిస్తోందని, ఇప్పటివరకు రూ.350 కోట్ల బోనస్ రైతులకు చెల్లించిందని తెలిపారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పి.సబితాఇంద్రారెడ్డి, పి. మహేందర్‌రెడ్డి, ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీలు దయానంద్, నవీన్ పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఘర్ కే వాస్తే పైసే దియా క్యా ‘ఘర్ కే వాస్తే కిసీకూ పైసే దియా క్యా’..? (ఇంటి కోసం ఎవరికైనా డబ్బులిచ్చారా?) అంటూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ సందర్భంగా కేటీఆర్ లబి్ధదారులను ఆరా తీశారు. లబి్ధదారు రహానా మాట్లాడుతూ.. ‘ఏక్ పైసా బీ కిసీకూ నై దియా.. బీస్ పచ్చీస్ లాక్కా ఘర్ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సాబ్‌నే హమారేకు దియా‘(ఎవరికీ పైసా ఇవ్వలేదు. 20–25 లక్షల విలువైన ఇంటిని సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాకిచ్చారు) అని చెప్పారు. కోడలమ్మ మంచిగా చూసుకుంటోంది సార్.. సీఎం కేసీఆర్ రూ.2 వేల వృద్ధాప్య పెన్షన్ ఇస్తుండటంతో కోడలమ్మ తనను బాగా చూసుకుంటోందని ఆసరా పెన్షన్ లబ్ధిదారు సరోజనమ్మ తనను పలుకరించిన మంత్రి కేటీఆర్‌తో చెప్పింది. -
హైదరాబాద్ లో 162 సిల్ట్ కార్టింగ్ వాహనాలు అందజేత
-
నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్‌లో మంచి పథకం కోసం ముఖ్య అంశాలు
నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్‌లో మంచి పథకం ఎంపిక చేసుకోవడం ఎలా? – స్వామినాథన్ ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకునే విషయంలో పరిశీలించాల్సిన ముఖ్య అంశాలు రెండున్నాయి. ఒకటి ఎక్స్పెన్స్ రేషియో. ప్రస్తుతం ఇండెక్స్ ఫండ్స్ మధ్య చాలా పోటీ ఉంది. 10–15 బేసిస్ పాయింట్ల (0.1–0.15 శాతం) ఎక్స్పెన్స్ రేషియోకే ఇండెక్స్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కనుక యాక్టివ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకుంటే ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో చెల్లించాల్సిన అవసరం ఉండదు. రెండోది ట్రాకింగ్ ఎర్రర్. ఒక ఇండెక్స్ ఫండ్.. తాను పెట్టుబడులను అనుసరించే ఇండెక్స్‌తో పోలిస్తే రాబడుల విషయంలో ఎంత మెరుగ్గా పనిచేసిందో చెబుతుంది. ఇండెక్స్ ఫండ్ నిర్వహణ బృందం సామర్థ్యాన్ని ఇది ప్రతిఫలిస్తుంది. తక్కువ ఎక్స్పెన్స్ రేషియోతోపాటు.. ట్రాకింగ్ ఎర్రర్ తక్కువగా ఉన్న పథకం మెరుగైనది అవుతుంది. ఈ రెండు అంశాలను ప్రామాణికంగా చేసుకుని చూస్తే ఎస్బీఐ, యూటీఐ, హెచ్డీఎఫ్సీ సంస్థల పథకాలు మెరుగ్గా పనిచేస్తున్నాయి. నేను పెట్టుబడులు పెట్టిన మ్యూచువల్ ఫండ్ వరుసగా రెండేళ్లపాటు చెత్త పనితీరు చూపించినట్టయితే, నా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం సరైనదేనా? – మునావర్ ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ పథకం నుంచి వైదొలగేందుకు, ఆ పథకం తక్కువ రాబడులను ఇస్తుండడం అన్నది ముఖ్యమైన అంశం అవుతుంది. తక్కువ పనితీరు అంటే ఇతర పథకాలతో పోలిస్తే తక్కువ రాబడులు ఇవ్వడం. వైదొలిగే నిర్ణయానికి ముందు.. మీరు పెట్టుబడులు పెట్టిన మ్యూచువల్ ఫండ్ పథకం విభాగంలోని ఇతర పథకాల పనితీరు కూడా విశ్లేషించాలి. వాటి పనితీరు కూడా తగ్గిందా..? లేక మీరు ఇన్వెస్ట్ చేసిన పథకం పనితీరు మాత్రమే తగ్గిందా? చూడాలి. మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ ఎన్ఏవీ క్షీణించడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. స్టాక్ మార్కెట్ పడిపోయినా రాబడులు తగ్గుతాయి. అన్ని పథకాలు ఏదో ఒక సమయంలో కొన్ని ప్రతికూలతలను ఎదుర్కొంటూ ఉంటాయి. అది చూసి ఒక పథకం నుంచి మరో పథకంలోకి మారిపోవడం సరైన నిర్ణయం కాబోదు. ఈ ప్రతికూల, తక్కువ పనితీరు అనేది ఒక పథకంలో కనీసం నిరంతరాయంగా రెండేళ్లపాటు కొనసాగాలి. అప్పుడు ఆ పథకంలో పెట్టుబడులను సమీక్షించుకోవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసిన పథకం తక్కువ పనితీరు చూపించడం వెనుక కారణాన్ని గుర్తించాలి. ఫండ్ మేనేజర్లో మార్పు జరిగిందా? అందుకే పనితీరు మందగించిందా? అని చూడాలి. అదే నిజమైతే ఆ పథకం నుంచి మీ పెట్టుబడులను తీసుకుని బయటకు రావచ్చు. ఒకవేళ ఫండ్ మేనేజర్లో మార్పు లేకపోతే.. రాబడులు మందగించడానికి గల కారణాన్ని సాధారణంగా వారు మీడియాకు వెల్లడించే ప్రయత్నం చేస్తుంటారు. లేదంటే ఆయా ఫండ్ సంస్థ నెలవారీ న్యూస్లెటర్లోనూ సమాచారాన్ని వెల్లడిస్తుంటారు. పథకం పెట్టుబడుల విధానం వల్ల కూడా తాత్కాలికంగా రాబడులు మెరుగ్గా ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో పథకం పనితీరును తప్పుబట్టడం సరైనది కాకపోవచ్చు. ఉదాహణకు గ్రోత్ ఆధారిత విధానంతో పోలిస్తే వ్యాల్యూ ఆధారిత పెట్టుబడుల విధానం కాస్త ఆలస్యంగా ఫలితాలను ఇస్తుంది. అటువంటప్పుడు మీరు పెట్టుబడులను దీర్ఘకాలం పాటు కొనసాగించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ తాను ఎంపిక చేసుకున్న పథకం అన్ని కాలాల్లోనూ అద్భుత పనితీరు చూపించాలని ఆశిస్తుంటారు. కానీ, ఆచరణలో ఇది సాధ్యం కాదు. అన్ని పథకాలు సానుకూల, ప్రతికూల సందర్భాలను ఎదుర్కొంటూ వెళుతుంటాయి. కనుక పెట్టుబడులను వెనక్కి తీసుకునే ముందు ఈ అంశాలన్నింటినీ చూడాలి. -ధీరజ్ కుమార్, సీఈవో వాల్యూ రీసెర్చ్ -
‘ఉపాధి’కి ఇంధనం..
మీలో ఒకడిగా.. ‘వాయిస్ ఆఫ్ ది వాయిస్‌లెస్’! ఇవన్నీ ఎవరో చెబితేనో.. ఎవరో ఉద్యమాలు చేస్తేనో తీసుకొచ్చినవి కావు. నా 3,648 కి.మీ. పాదయాత్రలో మీ సమస్యలను కళ్లారా చూశా. మీలో ఒకడిగా నాలుగేళ్లుగా మీ సమస్యల పరిష్కారం కోసం అడుగులు వేస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్ధలో ‘వాయిస్ ఆఫ్ ది పీపుల్..’ అంటారు. మీ బిడ్డ పాలనలో ‘వాయిస్ ఆఫ్ ది వాయిస్‌లెస్’ అంటే... తమ కష్టాన్ని చెప్పుకోలేని, తన ఆర్తిని వినిపించలేని పేదల గొంతుకై వాళ్ల తరపున నిలబడుతున్న ప్రభుత్వం మనది. కాబట్టే అట్టడుగున ఉన్న పేదవాడు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనసా వాచా కర్మణా మీ బిడ్డ నమ్మాడు కాబట్టి ఆ దిశగా నాలుగేళ్లలో అడుగులు పడ్డాయి. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: ఆటోలు, టాక్సీలను నడిపే డ్రైవర్ సోదరులు స్వయం ఉపాధి పొందడమే కాకుండా రోజూ లక్షలమంది ప్రయాణికులకు సేవలందిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సొంతంగా ఆటోలు, టాక్సీలు కలిగి ఉండి వాటిని నడిపే వారికి ఇన్సూరెన్స్, ఫిట్నెస్తోపాటు ఇతర ఖర్చుల కోసం ఏడాదికి రూ.పది వేల దాకా ఖర్చవుతోందన్నారు. అంత మొత్తం భరించేందుకు ఇబ్బందిపడే పరిస్థితుల్లో ఉన్న అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు మంచి చేసేందుకే ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం అందించేందుకు ‘వైఎస్ఆర్ వాహనమిత్ర’ పథకాన్ని తెచ్చినట్లు తెలిపారు. వరుసగా ఐదో ఏడాది ఈ పథకం ద్వారా మంచి చేస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం విజయవాడలోని విద్యాధరపురంలో నిర్వహించిన కార్యక్రమంలో బటన్ నొక్కి 2,75,931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.275.93 కోట్ల వైఎస్సార్ వాహన మిత్ర పథకం ఐదో విడత ఆర్ధిక సాయాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. ఆ వివరాలివీ.. ఐదేళ్లలో రూ.1,301.89 కోట్లు.. ఆటోలు, ట్యాక్సీలు నడుపుకొంటున్న నా అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల చేతుల్లో నేరుగా రూ.10 వేలు పెడుతున్నాం. ఈ డబ్బు ఎలా వాడతారు? దేనికి వినియోగిస్తారన్నది నేను అడగను. కానీ మీ అందరికి సవినయంగా ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నా. మీ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ కచ్చితంగా ఉండేలా చూసుకోండి. మీ వాహనంలో ప్రయాణికులు ఉన్నారని, మీకూ కుటుంబాలు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎంతోమందికి సేవలందిస్తున్న మీకు ప్రభుత్వం తోడుగా నిలబడుతుంది. ఒక్క ఏడాది కూడా ఈ పథకాన్ని ఆపకుండా ఐదేళ్లలో ఐదు విడతల్లో ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున సహాయం చేయడం ద్వారా ఒక్క వైఎస్సార్ వాహన మిత్ర ద్వారానే ఇప్పటివరకు రూ.1,301.89 కోట్లను నేరుగా అందించాం. గడప వద్దకే సంక్షేమం ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలు, రేషన్ కార్డుల దగ్గర నుంచి పెన్షన్ల దాకా, జనన, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలన్నీ ఇంటివద్దకే తీసుకొచ్చి అందిస్తున్నాం. మీ అవసరాలు ఏమిటో జల్లెడ పట్టి మరీ తెలుసుకుని నవరత్నాల్లోని ప్రతి సంక్షేమ పథకాన్ని నేరుగా గడపవద్దకే చేర్చుతున్నాం. నా పేద అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల పిల్లలు గొప్పగా చదవాలన్న ఆరాటంతో మన గ్రామంలోని ప్రభుత్వ బడికే ఇంగ్లిష్ మీడియం చదువులను తెచ్చాం. లంచాలు, వివక్షకు తావు లేకుండా వలంటీర్, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. మీ గ్రామానికే విలేజ్ క్లినిక్ తీసుకొచ్చి మీకు అందుబాటులో ఉంచాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను పరిచయం చేయడంతోపాటు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో బీపీ, షుగర్, హెచ్‌బీ, కఫం టెస్టులను నిర్వహిస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని తపన పడుతున్నాం. గ్రామ, వార్డు స్ధాయిలోనే మహిళా పోలీసులను ఏర్పాటు చేశాం. ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లో దిశ యాప్ ఉండేలా చూస్తున్నాం. విత్తనాల నుంచి విక్రయాల దాకా రైతన్నలకు ప్రతి అడుగులోనూ తోడుగా నిలుస్తూ ఆర్బీకేలను తీసుకొచ్చాం. రైతన్నలు.. నేతన్నలు.. గంగపుత్రులు రాష్ట్రంలో 52.39 లక్షల మంది రైతన్నల కష్టాలు, కన్నీళ్లు తెలిసిన ప్రభుత్వంగా వారికి తోడుగా నిలబడుతున్నాం. ఒక్క వైఎస్ఆర్ రైతుభరోసా కోసమే రూ.30,985 కోట్లు ఖర్చు చేశాం. పంటలు వేసే సమయానికి పెట్టుబడి ఖర్చుల కింద రైతన్నల చేతుల్లో డబ్బులు పెట్టాం. ఇలాంటి మేలు చేసిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో మరొకటి లేదని అన్నదాతలకు తెలుసు. వేట నిషేధ సమయంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార సోదరులకు అండగా నిలుస్తూ మత్స్యకార భరోసా ద్వారా 2.43 లక్షల కుటుంబాలకు ఐదేళ్లలో ఏకంగా రూ.538 కోట్లు అందించాం. మగ్గం కదిలితే తప్ప బతుకు బండి నడవని 82 వేల చేనేత కుటుంబాలకు ఐదేళ్లలో ఒక్క నేతన్న నేస్తం పథకం ద్వారానే రూ.982 కోట్లు అందించి అండగా నిలిచాం. తోడు అందిస్తూ.. చేదోడుగా నిలుస్తూ రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో రోడ్డు పక్కనే, పుట్‌ఫాత్‌ల మీద విక్రయాలు సాగించే చిరువ్యాపారులను ఆదుకునేందుకు జగనన్న తోడు, జగనన్న చేదోడు పథకాలను అమలు చేస్తున్నాం. వాళ్లు వ్యాపారాలు ఎలా చేసుకుంటున్నారు...? అందుకు పెట్టుబడి ఎక్కడ నుంచి వస్తుంది? ఆ పెట్టుబడి కోసం ఎంతెంత వడ్డీకి డబ్బులు తెస్తున్నారో గతంలో ఎవరూ పట్టించుకోలేదు.అలాంటి 15.87 లక్షల మంది చిరువ్యాపారులకు జగనన్న తోడు పథకం ద్వారా ఇప్పటివరకు వడ్డీలేని రుణాల రూపంలో రూ.2956 కోట్లు అందించాం. రజక సోదరులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల కోసం జగనన్న చేదోడు పథకం తీసుకొచ్చి 3.30 లక్షల మందికి ఇప్పటివరకు రూ.927 కోట్లు సాయం అందించాం. అమ్మ ఒడి.. విద్యా దీవెన.. వసతి దీవెన అక్కచెల్లెమ్మలు బాగుంటేనే ఆ కుటుంబాలు బాగుంటాయి. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా మీ బిడ్డ జగనన్న అమ్మఒడి పథకాన్ని తెచ్చాడు. 52 నెలల్లో 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ అమ్మఒడి కోసం రూ.26 వేల కోట్లు విడుదల చేశాం. 26.99 లక్షల మంది తల్లులకు వారి పిల్లల పెద్ద చదువుల కోసం విద్యా దీవెన ద్వారా అందించిన సహాయం రూ.11,317 కోట్లు. జగనన్న వసతి దీవెన బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చులు చెల్లిస్తున్నాం. ఏడాదికి రూ.20 వేలు వరకు అందిస్తూ జగనన్న వసతి దీవెన కోసం రూ.4,275 కోట్లు వెచ్చించాం. అక్కచెల్లెమ్మలను ఆదుకుంటూ... చంద్రబాబు రుణమాఫీ హామీని నమ్మి పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు మోసపోయారు. మాట ప్రకారం వారిని ఆదుకుంటూ వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని తెచ్చి 80 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.19,178 కోట్లు ఇచ్చాం. లేదంటే చంద్రబాబు మోసాలతో 18 శాతం ఉన్న ఎన్పీఏలు, అవుట్ స్టాండింగ్ లోన్స్ 50 శాతం దాటేవి. అక్కచెల్లెమ్మలకు వైఎస్ఆర్ సున్నావడ్డీ కూడా వర్తింపచేసి దాదాపు రూ.5 వేల కోట్లు ఇచ్చి తోడుగా నిలబడ్డాం. 26.40 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా రూ.14,129 కోట్లు వారి చేతుల్లో పెట్టాం. వైఎస్ఆర్ కాపునేస్తం ద్వారా 3.58 లక్షల మంది కాపు అక్కచెల్లెమ్మలకు రూ.2,029 కోట్లు సాయం అందించాం. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 4.39 లక్షల మంది ఓసీ నిరుపేద అక్కచెల్లెమ్మలకు అందించిన సహాయం రూ.1,257 కోట్లు. 30.76 లక్షలమంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్ధలాలిచ్చాం. ఇప్పటికే 21.32 లక్షల ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. తమకు ఇంతగా మేలు చేసిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే కాదు.. దేశ చరిత్రలోనే మరొకటి లేదని నా అక్కచెల్లెమ్మలకు తెలుసు. ఇవన్నీ ఎవరో అడిగితేనో, ఎవరో ఉద్యమాలు చేస్తేనో వచ్చినవి కావు. ఇవన్నీ కూడా మీ బిడ్డ.. మీలో ఒకడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే.. మీ కష్టాలు, సుఖాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే.. ఇది మీ ప్రభుత్వం కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో మంత్రులు పి.విశ్వరూప్, జోగి రమేశ్, తానేటి వనిత, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, వసంత కృష్ణ ప్రసాద్, రక్షణనిధి, కైలే అనిల్ కుమార్లతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రానికి జగనన్న అవసరం నేను విజయవాడలో 15 ఏళ్లుగా సీఎన్జీ ఆటో నడుపుతున్నాను. గతంలో ఇక్కడ 4 సీఎన్జీ స్టేషన్లు మాత్రమే ఉండడంతో గ్యాస్ కోసం రోజంతా పడిగాపులు పడేవాళ్లం. ఆటోలకు ఇన్సూరెన్స్‌లు, ఫిట్ నెస్‌లు చేయించుకోవడానికి కూడా కుదిరేది కాదు. పాదయాత్రలో మా స మస్యలు మీకు చెప్పగానే సానుకూలంగా స్పందించారు. మీరు సీఎం అవ్వగానే వాహనమిత్ర పథకం ద్వారా మాకు సాయం చేస్తున్నారు.ఈ విడతతో కలిపి నాకు రూ.50,000 వచ్చాయి. మీ చొరవతో విజయ వా డలో ఉన్న సీఎన్జీ స్టేషన్లు 4 నుంచి 15 అయ్యాయి. కోవిడ్ వల్ల రవాణా రంగం కుదేలైపోతే మానవత్వంతో మాకు 5 నెలల ముందే వాహనమిత్ర సాయం అందించా రు. నా తల్లి 2 నెలలు గవర్నమెంట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే వలంటీర్ వచ్చి పెన్షన్ ఇచ్చారు. మా అమ్మ చనిపోయే వరకు రూ. 81 వేలు వచ్చాయి. నా కూతురుకి అమ్మ ఒడి సాయం అందింది. నా కుమారుడికి వసతిదీవెన ద్వారా రూ.20 వేలు, ఇంజినీరింగ్ చదువుకు రూ.2,20,320 వచ్చాయి. మొత్తం నా కుటుంబానికి రూ.3,85,300 లబ్ధి కలిగింది. నా ఆటోకు ఇంధనం ఎంత అవసరమో... ఈ రాష్ట్రానికి జగనన్న కూడా అంతే అవసరం. – వినోద్, ఆటో డ్రైవర్, వాహనమిత్ర లబ్ధిదారుడు, విజయవాడ -
ఏ స్కీముకు ఎంత ఖర్చు చేశారో వివరించిన మంత్రి మేరుగు
-
విశ్వకర్మ స్కీముతో చేతివృత్తులకు చేయూత - ఎన్ఎస్ఈ ఎండీ చౌహాన్
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విశ్వకర్మ పథకంతో సంప్రదాయ హస్తకళలు, తత్సంబంధ వర్గాలకు గణనీయంగా ప్రయోజనం చేకూరగలదని నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ) ఎండీ ఆశీష్ కుమార్ చౌహాన్ తెలిపారు. మార్కెట్లు, రుణ సదుపాయాలు తగినంత స్థాయిలో అందుబాటులో లేకపోవడం వల్ల వడ్రంగులు, చేనేతకారులు, బొమ్మల తయారీదారులు మొదలైన వారు అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారని, ఈ స్కీము వారి స్థితిగతులను మార్చగలదని ఆయన చెప్పారు. దాదాపు రూ. 13,000 కోట్ల ప్రాథమిక కేటాయింపులతో విశ్వకర్మ పథకం సుమారు 30 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చగలదన్నారు. అధికారిక లెక్కల ప్రకారం దేశీయంగా 70 లక్షల పైచిలుకు చేతివృత్తుల వారు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నప్పటికీ ఇది 20 కోట్ల స్థాయిలో ఉండొచ్చని అనధికారిక లెక్కలు ఉన్నాయని చౌహాన్ తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యవసాయం తర్వాత అత్యధిక శాతం మందికి ఉపాధినిస్తున్న ఈ రంగానికి, ఇటువంటి పథకాలతో మరింత ప్రయోజనం చేకూరగలదని చిన్న, మధ్య తరహా సంస్థల శాఖ కమిటీలో ఒక సభ్యుడిగా తాను భావిస్తున్నట్లు వివరించారు. మూడు దశాబ్దాల క్రితం ఎన్ఎస్ఈ ఏర్పాటు తర్వాత దేశవ్యాప్తంగా స్క్రీన్ ఆధారిత ట్రేడింగ్ ఎలాగైతే అందుబాటులోకి వచ్చి, మార్కెట్లలో పెట్టుబడుల తీరును మార్చేసిందో.. ఈ స్కీము కూడా చేతివృత్తుల వారికి తోడ్పడగలదని చౌహాన్ చెప్పారు. -
ఔను.. 6 నెలలకు సీఎం మారడం గ్యారంటీ
పెద్దశంకరంపేట (మెదక్) / కంగ్టి (నారాయణఖేడ్): కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ కార్డు పథకాలపై ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ కార్డులు అమలు కావని, ఆరు నెలలకు ముఖ్యమంత్రి మారడం మాత్రం గారంటీ అని విమర్శించారు. అదేవిధంగా 6 నెలలకు ఒక కర్ఫ్యూ, రైతులకు 6 గంటల కరెంటు, పరిశ్రమలకు వారానికి రెండు పవర్ హాలిడేలు ఉండటం మాత్రం గ్యారంటీ అని ఎద్దేవా చేశారు. మంగళవారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేట, సంగారెడ్డి జిల్లా కంగ్టిలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎలాగూ అధికారంలోకి రాలేమని తెలిసి కాంగ్రెస్ నేతలు కల్లగోల్లి మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఇక రెండో రాజధాని బెంగళూరు అవుతుందేమో ఎమ్మెల్యేలకు ఢిల్లీ హైకమాండ్ అవుతుందని, దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లాలంటే వయా బెంగళూరు మీదుగా వెళ్లాలని, ఇక బెంగళూరు మనకు రెండో రాజధాని అవుతుందని హరీశ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హామీలు పోస్టుడేటెడ్ చెక్కులాంటివన్నారు. కర్ణాటకలో అధికారంలో ఉండి రూ.600లు పింఛన్ ఇస్తున్న ఆ పార్టీ.. తెలంగాణలో రూ.4000 ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమంటూ ప్రస్తుతం అక్కడ బస్సులు తగ్గించారన్నారు. బీఆర్ఎస్ 24 గంటలూ ఉచిత కరెంటు సరఫరా చేస్తుందని, గతంలో ఉచిత కరెంటు హామీ ఇచి్చన కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉత్త కరెంటు ఇచ్చిందని మంత్రి గుర్తు చేశారు. కిట్లు ఇచ్చే వారు కావాలో, కేసీఆర్‌ను తిట్టే వారు కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. త్వరలో బీఆర్ఎస్ నుంచి అద్భుతమైన మేనిఫెస్టో వస్తుందని వెల్లడించారు. -
స్మార్ట్ మీటర్లతో రైతుపై పైసా భారం పడదు
సాక్షి, అమరావతి: రైతులకు పగటి పూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన పథకమే డాక్టర్ వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం. ఈ పధకం క్రింద రైతులు వ్యవసాయ విద్యుత్‌కు చెల్లించాల్సి న బిల్లుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, ఆ బిల్లు మొత్తాన్ని నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ప్రత్యేక రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తుందని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మాజనార్థనరెడ్డి, కె.సంతోషరావు చెప్పారు. స్మార్ట్ మీటర్లపై అపోహలను తొలగిస్తూ వాటి వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను సాంకేతిక అంశాల ఆధారంగా వారు ‘సాక్షి’ ప్రతి నిధికి వివరించారు. వారు తెలిపిన పూర్తి వివరాలు.. రైతులకు పైసా ఖర్చు లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం అమలుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్ ఎనర్జీ మీటర్లను అమర్చాలని ఆదేశించింది. వినియోగం ఆధారంగా వ్యవసాయ సబ్సిడీ మొత్తం రైతు బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుంది. ఆ తర్వాత అంతే మొత్తం డిస్కంలకు స్వయంచాలకంగా బదిలీ అవుతుంది. వ్యవసాయ సర్వీసులకు మీటర్ల ఖర్చును సబ్సిడీగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ పథకం ప్రస్తుతం ఉచిత విద్యుత్ పొందుతున్న అందరు రైతులకు (వ్యవసాయ వినియోగదారులకి) వర్తిస్తుంది. రైతులు జేబు నుండి ఒక్క పైసా చెల్లించవలసిన అవసరం లేదు. ప్రస్తుతం ఏ విధంగా ఉచిత విద్యుత్ పొందుతున్నారో, అదే విధంగా ఇక మీదట కూడా పొందుతారు. అలాగే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ వినియోగానికి ఎటువంటి పరిమితి లేదు. వినియోగించిన యూనిట్ల బిల్లు మొ త్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే వినియోగదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. మీటరు బిగించడానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. మీటరు మరమ్మతు ఖర్చులు పూర్తిగా విద్యుత్ కంపెనీలే భరిస్తాయి. మీటర్లు కాలిపోయినా, పనిచేయకపోయినా లేదా దొంగతనానికి గురైనా, వాటికి అయ్యే ఖర్చును విద్యుత్ కంపెనీలు భరిస్తాయి. మొదటిసారైనా, తర్వాత అయినా మొత్తం ఖర్చు విద్యుత్ కంపెనీలదే. రైతులపై పైసా భారం ఉండదు. రక్షణ పరికరాలతో లాభాలు వ్యవసాయ విద్యుత్ మీటర్‌తో పాటు ఏర్పాటు చేస్తున్న భద్రతా ఉపకరణాలతో అనేక ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉండే కెపాసిటర్, వో ల్టేజి హెచ్చు తగ్గులను నివారించి వ్యవసాయ విద్యుత్ మోటారు జీవితకాలాన్ని పెంచుతుంది. మోటారు పనితనం మెరుగవుతుంది. వ్యవసాయ విద్యుత్ మోటారు స్టార్టర్, మోటారు వైండింగ్, అనుసంధానించిన వైర్లలో వచ్చిన లోపాలతో మోటారు కాలిపోవడం గాని, షార్ట్ సర్క్యూట్‌తో ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ కావడం గాని జరగకుండా కాన్ఫిగరేషన్ కంట్రోల్ బోర్డ్ (సీసీబీ) కాపాడుతుంది. వర్షాలకు తడిసినప్పుడు ఇనుప బాక్స్‌ల ద్వారా కలిగే విద్యుత్ ప్రమాదాలను షీట్ మౌల్డింగ్ కాంపౌండ్ (ఎస్ఎంసీ) బాక్స్ నివారిస్తుంది. ఇది అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుని ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. పీవీసీ వైరు ఎండకు ఎండి త్వరగా పాడవడమే కాకుండా షార్ట్ సర్క్యూట్‌తో మోటారుకు, ట్రాన్స్ఫార్మర్కు ప్రమాదకారి అవుతుంది. డబ్ల్యూపీటీసీ (అల్యూమినియం) వైరుతో వీటిని నివారించవచ్చు. అల్యూమినియం ఎర్త్ వైరు, పైపులను ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేయడం, సరైన పద్ధతిలో అనుసంధానించడం వల్ల రైతులకు మోటారు స్టార్టర్, మీటరు బాక్సు తదితర ఉపకరణాల ద్వారా షాక్ తగలదు. తద్వారా ప్రాణాపాయాన్ని నివారించవచ్చు. పథకం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు స్మార్ట్ మీటరు బిగించడం వలన రైతు ఎంత కరెంటు ఉపయోగిస్తున్నది కచ్చితంగా లెక్క తేలుతుంది. ప్రభుత్వం డబ్బులు అతనికి ఎంత వస్తున్నాయో తెలుస్తుంది. రైతు డబ్బులు చెల్లించడం వలన సరఫరా నాణ్యత, మంచి సేవలను విద్యుత్ సంస్థ నుంచి డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. మీటర్ పెట్టడం వలన జేఎల్ఎం, లైన్మెన్ నెలనెలా మీటర్ రీడింగ్ కోసం మోటారు దగ్గరకు రావడం వలన ఏదైనా సమస్య ఉన్నచో అతని ద్వారా పరిష్కారం పొందే అవకాశం ఉంటుంది. మీటర్ రీడింగ్ ను బట్టి పంపు, మోటారు పనిచేసే విధానాన్ని వారు తెలుసుకోగలరు. -
నిధుల సమీకరణలో కొత్త పథకాలు డీలా..! మొదటి ఆరు నెల్లలో రూ.25,712 కోట్లు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ నూతన పథకాల ద్వారా (ఎన్ఎఫ్వో) నిధుల సమీకరణ ఈ ఏడాది అనుకున్నంత ఆశాజనకంగా లేదు. మొదటి ఆరు నెలల్లో (జనవరి–జూన్) ఎన్‌ఎఫ్‌వోల రూపంలో సమీకరించిన నిధులు రూ.25,712 కోట్లుగా ఉన్నా యి. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో ఎన్‌ఎఫ్‌వోలు సమీకరించిన రూ.38,929 కోట్లతో పోలిస్తే 34 శాతం తగ్గాయి. ఈక్విటీ, డెట్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితులు ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. ఒకే విభాగంలో ఒకటికి మించిన పథకాలు ఆవిష్కరించకూడదంటూ సెబీ విధించిన ఆంక్షలు పెద్ద మ్యూచువల్ ఫండ్స్ సంస్థలపై ప్రభావం చూపించింది. జనవరి నుంచి జూన్ వరకు మొత్తం 115 ఎన్‌ఎఫ్‌వోలు నిధుల సమీకరణ కోసం మార్కెట్లోకి వచ్చాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన 160 ఎన్ఎఫ్వోలతో పోలిస్తే క్షీణత కనిపిస్తోంది. ఈక్విటీ ఫండ్స్ జనవరి నుంచి జూన్ వరకు ఈక్విటీ ఎన్‌ఎఫ్‌వోలు రూ.14,917 కోట్లు సమీకరించాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈక్విటీ కొత్త పథకాలు సమీకరించిన రూ.16,370 కోట్లతో పోలిస్తే 9 శాతం క్షీణత కనిపిస్తోంది. మొత్తం నూతన పథకాల ఆవిష్కరణ కూడా క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 22 నుంచి 17కు పరిమితమయ్యాయి. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ, దేశీ ఈక్విటీలు అదే పనిగా పెరుగుతూ వెళుతుండడంతో చాలా మంది ఇన్వెస్టర్లు నూతన పథకాల్లో ఇన్వెస్ట్ చేయడానికి బదులు, ఇప్పటికే ఉన్న పెట్టుబడులపై లాభాల స్వీకరణకు మొగ్గు చూపి ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెద్ద మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు రిస్క్‌తో కూడిన థీమ్యాటిక్ పథకాల ఆవిష్కరణకు మొగ్గు చూపించారు. హైబ్రిడ్ ఫండ్స్ హైబ్రిడ్ (ఈక్విటీ, డెట్ కలిసిన) న్యూ ఫండ్ ఆఫర్ల రూపంలో సమీకరించిన నిధులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 22 శాతం తగ్గి, రూ.2,141 కోట్లుగా ఉన్నాయి. డెట్ ఫండ్స్ ఎన్‌ఎఫ్‌వోలపై ప్రభావం ఎక్కువగా పడింది. ఇవి రూ.6,235 కోట్లను రాబట్టాయి. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో డెట్ ఎన్ఎఫ్వోల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.12,649 కోట్లుగా ఉన్నాయి. డెట్ ఎన్‌ఎఫ్‌వోల సంఖ్య 51 నుంచి 38కి తగ్గింది. ఇక ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు, ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌వోఎఫ్) విభాగంలోనూ ఎన్‌ఎఫ్‌వోల నిధుల సమీకరణ 66 శాతం క్షీణించి రూ.2,419 కోట్లుగా ఉంది. ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని (ద్రవ్యోల్బణం మినహాయింపు) ఎత్తివేయడం డెట్ ఫండ్స్ సమీకరణపై ప్రతికూల ప్రభావం చూపించింది. దీంతో ప్యాసివ్ లిక్విడ్, గిల్ట్ ఫండ్స్, టార్గెట్ మెచ్యూరిటీ పథకాలు ఆకర్షణ కోల్పోయాయి. మారిన పరిస్థితులు.. ఈ పరిణామంపై నిప్పన్ ఇండియా మ్యూ చువల్ ఫండ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సౌగతా ఛటర్జీ స్పందిస్తూ.. ‘‘కొత్తగా ప్రవేశించిన సంస్థలు మిన హాయిస్తే చాలా వరకు ఫండ్‌హౌస్‌ల ఉత్పత్తుల ఆఫర్ అనేది పరిమితికి చేరింది. దీంతో కొన్ని థీమ్యాటిక్ ఫండ్స్‌తో మార్కెట్లోకి వస్తున్నాయి. నిప్పన్ మ్యూచువల్ ఫండ్ మాత్రం ఎన్‌ఎఫ్‌వోల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇన్వెస్టర్లకు వినూత్న మైన ప్రతిపాదనలు ఉన్నాయని అనిపించినప్పుడే కొత్త పథకాలను తీసుకొస్తోంది. గడిచిన రెండేళ్లలో రెండే పథకాలను ఆవిష్కరించాం’’అని సౌగతా ఛటర్జీ తెలిపారు. ఇన్వెస్టర్లు కొత్త పథకాల్లో యూనిట్ ఎన్ ఏవీ రూ.10కే లభిస్తుందన్న ఉద్దేశ్యంతో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తుంటారని స్మార్ట్ వెల్త్ అడ్వైజర్స్ సీఈవో రమేశ్ పవార్ తెలిపారు. ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధులను ఇన్వెస్ట్ చేసినప్పు డే యూ నిట్ల అసలు విలువ ప్రతిఫలిస్తుందన్నారు. పెద్ద సంస్థలు కాకుండా కొత్తగా ప్రవేశించిన సంస్థలు తెచ్చే ఎన్‌ఎఫ్‌వోలకు స్పందన పెద్దగా ఉండడం లేద మరోవైపు తక్షణ లాభాల కోసం ఇన్వెస్టర్లు ఐపీవోల పట్ల మొగ్గు చూపిస్తున్నట్టు చెప్పారు. -
గృహలక్ష్మి పథకం ప్రారంభం.. కుటుంబంలో మహిళా పెద్దకు రూ.2000
బెంగళూరు: ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం గృహ లక్ష్మి పథకంతో ఘణంగా వేడుకను జరుపుకుంది. ఈ పథకంలో ప్రతి ఇంట్లో ఒక మహిళా పెద్దకు రూ.2000 అందించనున్నారు. ఈ కార్యక్రమం సీఎం సిద్ధరామయ్య స్వస్థలం మైసూర్లో జరిగింది. కేంద్రం నుంచి సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, మళ్లికార్జున ఖర్గే హాజరయ్యారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి మహిళలు కూడా కార్యక్రమానికి వచ్చారు. నేడు 50 శాతం మందికి అందాల్సిన రూ.1.08 కోట్ల లబ్దిదారులకు అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయని తెలిపారు. మిగిలిన లబ్దిదారుల అకౌంట్లలో రేపు జమ అవుతాయని స్పష్టం చేశారు. కార్యక్రమానికి హాజరైన పలువురు మహిళలు.. తమ అకౌంట్లలో డబ్బులు పడ్డాయని సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇకపై తన పిల్లల స్కూల్ ఫీజులు సులభంగా చెల్లించవచ్చని అన్నారు. Congress has always delivered as promised. Guarantee schemes guaranteed for the welfare of people. Gruha Lakshmi is launched to provide Rs 2000 for every woman head of the family.#CongressGuarantee pic.twitter.com/8nVz2uQJ1Q — Siddaramaiah (@siddaramaiah) June 2, 2023 ఫెరిఫికేషన్‌పై అభ్యంతరాలు.. జీఎస్టీ రిటర్న్‌లు ఫైల్ చేయని కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది. అయితే.. ఈ పథకం అమలు తీరుపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రేషన్ కార్డులు, ఆధార్ కార్డుల ఆధారంగా వారి జీఎస్టీ వివరాలు సేకరిస్తామని కర్ణాటక మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి లక్ష్మి హెబ్బాల్కర్ తెలిపారు. కుటుంబ సాఫ్ట్వేర్ ఆధారంగా వివరాలు భద్రపరుస్తామని పేర్కొన్నారు. అయితే.. డేటా భద్రతపై మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే ఇంటి నుంచి ఇద్దరు మహిళలకు స్కీం వర్తించకుండా జాగ్రత్తలు పాటించామని మంత్రి తెలిపారు. కానీ మరణించినవారి పేరుపై ఉన్న రేషన్ కార్డుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. త్వరలో ఈ వివరాలు మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: అమితాబచ్చన్‌కి రాఖీ కట్టిన సీఎం మమతా బెనర్జీ.. -
సంక్షేమ జాతర.. అర్హులకు టోకరా!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి :రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు ప్రవేశ పెడుతోంది. అయితే అవి అర్హులకు అందడం లేదని, నిరుపేదలకు నిరాశే ఎదురవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ దన్ను లేదా బలమైన సిఫారసు ఉంటేనే గృహలక్ష్మి, బీసీ, మైనారిటీ బంధు పథకాల జాబితాలో చోటు దక్కుతోందని ఆయా పథకాలకు అన్ని విధాలా అర్హులైన వారు వాపోతున్నారు పోటీ తీవ్రంగా ఉండటంతో.. ‘ఇప్పటికైతే పార్టీలో ముఖ్య నాయకులు, కార్యకర్తలకే పంచేద్దాం..ఈ మేరకు గ్రామాల వారీగా జాబితాలు పంపండి’ అంటూ ఎమ్మెల్యేల కార్యాలయాల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జాబితాలు సిద్ధం అవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. గృహలక్ష్మి పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 3.57 లక్షల ఇళ్లకు గాను 14.91 లక్షల దరఖాస్తులు వచ్చాయి. బీసీబంధు పథకం కింద ఒక్కో నియో జకవర్గంలో 300 మందికి, మైనారిటీ బంధు కింద 100 మందికి ఆర్థిక సహా యం చేయాలని నిర్ణయించారు. ఈ రెండు పథకాలకూ వేలల్లో దర ఖాస్తు లు వచ్చాయి. పలు జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపికను దాదాపు పూర్తి చేశారు. వాస్తవానికి అత్యంత నిరుపేదలకు, ఇచ్చే ఆర్థిక సహాయాన్ని జీవనోపాధికి ఉపయోగించుకునే సాంకేతికత, ఇతర పరిజ్ఞానం ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నా.. ఎమ్మెల్యేలు చెప్పినవారికి, బంధుగణానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, కొన్ని చోట్ల అర్హుల జాబితాల్లో చేర్చేందుకు 10 నుంచి 30% కమీషన్ మాట్లాడుకుంటున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఇచ్చే జాబితాలను తమసిబ్బందితో కలిసి పరిశీలించాల్సిన జిల్లా యంత్రాం గాలు, కనీస పరిశీలన లేకుండానే ఆమోద ముద్ర వేసేసి చేతులు దులుపు కొంటూ సంక్షేమాన్ని పక్కదారి పట్టిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. పథకం ఏదైనా అదే తీరు.. డబుల్ బెడ్రూంలు దక్కని నిరుపేద తన సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే మూడు దశల్లో రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారు. ఇందులో బీసీలకు 50 శాతం, ఎస్సీలకు 20, ఎస్టీలకు10, ఇతరులకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఆయా కులాల్లో దివ్యాంగులుంటే వారికి 5 శాతం కేటాయించాలి. కానీ మెజారిటీ నియోజకవర్గాల్లో ఈ నిబంధనలు పాటించలేదు. చేతి వృత్తులే జీవనాధారమైన నాయీ బ్రాహ్మణ, రజక, సగర పూసల, మేదరి, వడ్డెర, ఆరెకటిక, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, కంచరి ఇతర ఎంబీసీ కులాల్లో పేదరికం, వృత్తి నైపుణ్యం ఆధారంగా ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రాధాన్యతలేవీ పాటించటం లేదని జిల్లా కలెక్టర్లకు చేరిన జాబితాలు చూస్తే అర్థం అవుతోంది. మైనారిటీ బంధులో లబ్ధిదారుల సంఖ్య తక్కువే ఉన్నప్పటికీ ఇందులో కూడా నిబంధనలు, ప్రాధాన్యతల పాటింపుపై అక్కడక్కడా ఆరోపణలు విన్పిస్తుండటం గమనార్హం. పథకాలు కలెక్టర్లకు అప్పగించాలి.. ప్రస్తుతం అమలు చేస్తున్న దళిత, మైనారిటీ, బీసీ బంధుతో పాటు నిరుపేదల ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం పథకాలు పూర్తి పక్కదారి పట్టాయి. రాష్ట్ర ప్రజలు పన్నులతో వచ్చిన ఆదాయం దుర్వినియోగం అవుతోంది. నిజమైన అర్హులకు కాకుండా గ్రామ స్థాయి పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల ద్వారా జరుగుతున్న ఎంపికలతో వాస్తవ పేదలకు న్యాయం జరగడం లేదు. వెంటనే ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో కలెక్టర్లకు అప్పగించడం ద్వారా ప్రభుత్వం అందించే ప్రతి పైసా నిరుపేదల ఆర్థిక ప్రగతికి ఉపకరించేలా చర్యలు తీసుకోవాలి. – పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గృహ‘లక్షీ కటాక్షం’ లేదంట పూరి గుడిసెలో జీవితాన్ని వెల్లదీస్తున్న ఈమె పేరు గాలి ఉపేంద్ర. మహబూబా బాద్ జిల్లా నల్లెల గ్రామం. డబుల్ బెడ్రూం రాలేదు. చివరకు సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు గృహలక్ష్మి పథకంలో రూ.3 లక్షలైనా ఇస్తారన్న ఆశతో దరఖాస్తు చేసింది. అన్ని అర్హతలున్న తనకు లబ్ధి చేకూరుతుందని ఎదురుచూసింది. కానీ ఈ మారు కూడా ఇళ్లు ఇవ్వటం లేదని గ్రామ నాయకులు తేల్చేశారు. అర్హతలున్నా ఎంపిక చేయలేదు..! ఈమె పేరు రాచమల్ల మంజుల. సీఎం కేసీ ఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియో జకవర్గంలోని అలిరాజపేట గ్రామం. ఇటీ వల భర్త చనిపోవటంతో కొడుకు శ్రీకాంత్‌తో కలిసి ఇస్త్రీ షాపునకు అవసరమయ్యే పని ముట్లు కొనేందుకు బీసీబంధు పథకంలో లక్ష రూపాయల కోసం దరఖాస్తు చేసుకుంది. ఇలా ఈ ఊరిలో మొత్తం 33 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం ఇద్దరినే ఎంపిక చేశారు. అయితే ఆ ఇద్దరు తమకంటే అన్ని విధాలుగా బాగా ఉన్నవారేనని మంజుల పేర్కొంది. -
ఏపీలో పథకాల అమలు భేష్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు తీరు ప్రశంసనీయంగా ఉందని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ కనిమొళి కరుణానిధి అభినందించారు. కనిమొళి అధ్యక్షతన 11 మంది ఎంపీలతో కూడిన బృందం విశాఖ జిల్లాలోని ఆనందపురం, పద్మనాభం మండలాల్లో శనివారం పర్యటించింది. కేంద్ర నిధులతో జరుగుతున్న పనులను పరిశీలించారు. శొంఠ్యాంలోని రామ్‌సాగర్ అమృత్ సరోవర్ ట్యాంకుతోపాటు, చందక గ్రామంలో వ్యవసాయ భూరీ సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. పద్మనాభం మండలం రెడ్డిపల్లి సచివాలయంలో అందుతున్న సేవల గురించి ఆరా తీసింది. వివిధ గ్రామాలకు చెందిన స్వయం సహాయక బృందాల సభ్యులతో మాట్లాడి పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. సచివాలయాల సేవలు అద్భుతం అనంతరం నగరంలోని ఓ హోటల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన సంస్థ విభాగాలకు సంబంధించిన జిల్లా అధికారులు, యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ అధికారులతో శనివారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కనిమొళి మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు అద్భుతంగా ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత అధికారులపై ఉందన్నారు. జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు తీరుని ప్రశంసించారు. సమావేశంలో పార్లమెంటరీ కమిటీ సభ్యులు మాల రాజ్యలక్ష్మీషా, అజయ్ ప్రతాప్‌సింగ్, తలారి రంగయ్య, నరాన్భాయ్ జె.రత్వా, ఏకేపీ చిన్‌రాజ్, రాజీవ్ దిలేర్, మహ్మద్ జావెద్, వాజేసింగ్భాయ్ రత్వా, ఇరన్నా కడాది, నరేంద్రకుమార్‌తో పాటు జిల్లా కలెక్టర్ మల్లికార్జున పాల్గొన్నారు. -
కుల, మతాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించాం: ఎమ్మెల్సీ కవిత
-
అంతా.. మా ఇష్టం..! పథకాల ఎంపిక మొత్తం మేము చెప్పినట్లే..!!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పరంగా పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరు అంతా ‘స్థానిక ఎమ్మెల్యే’ చేతిలోకి వెళ్లిపోయింది. అంతా ‘వారి ఇష్టం’ అన్నట్లుగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార పక్షం ఎన్నికల తాయిలాలకు సిద్ధమైంది. పేద ప్రజల మద్దతు లభించే విధంగా ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యేలను పథకాల అమల్లో భాగస్వాముల్ని చేసింది. దీంతో బీసీ, దళిత, మైనారిటీ బంధు, గృహలక్ష్మి, డబుల్ బెడ్రూమ్ తదితర పథకాల లబ్ధిదారుల ఎంపికలో స్థానిక ఎమ్మెల్యేలు కీలకంగా మారారు. ప్రభుత్వ ఆదేశాలతో సంబంధిత అధికారులు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారగా, దరఖాస్తుల తంతు మొక్కుబడిగా మారింది. ఇప్పటికే ఇలా.. ఇప్పటికే దళితుల ఆర్థిక పరిపుష్టి కోసం అమలు చేస్తున్న దళిత బంధు పథకం కింద లబ్ధిదారుల తుది ఎంపిక స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సులతో కొనసాగుతుండగా, బీసీ కుల, చేతివృత్తుల వారికి ఆర్థిక చేయూత కింద తలపెట్టిన రూ.లక్ష సాయం కూడా వారి జాబితా కింద చేరింది. ఇక మైనారిటీ బంధు కింద వంద శాతం సబ్సిడీతో అందించే రూ.లక్ష ఆర్థిక చేయూత వ్యవహారంలో కూడా స్థానిక ఎమ్మెల్యేలు ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఇటీవల సొంత స్థలం కలిగిన నిరపేదలకు గృహలక్ష్మి కింద అందించే రూ.3 లక్షల సాయం పరిస్థితి కూడా అదే విధంగా తయారైనట్లు తెలుస్తోంది. డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తులపై విచారణ కొనసాగుతున్నా..ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందనే ప్రచారం సాగుతోంది. లక్కీ డ్రా ద్వారానే.. పంద్రాగస్టు తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ, మైనారిటీ బంధు కింద రూ.లక్ష చొప్పున పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులపై కనీసం 20 శాతం క్షేత్ర స్థాయి సర్వే కూడా పూర్తి కాలేదు. ఆఫ్‌లైన్ దరఖాస్తులు అటకెక్కగా.. కేవలం అన్లైన్ దరఖాస్తులపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. క్షేత్ర స్థాయి విచారణ కోసం మండలం యూనిట్‌గా జీహెచ్ఎంసీ, రెవెన్యూ సిబ్బంది బృందాలుగా ఏర్పాటు చేసి రంగంలోకి దింపగా.. ఇరు శాఖల సమన్వయం లోపంతో విచారణ తంతు నత్తకు నడక నేర్పిస్తోంది. అయితే దరఖాస్తులు లక్షల్లో ఉండగా, విచారణ మాత్రం వేల సంఖ్యలో కూడా పూర్తి కాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కూడా అదే విధంగా ఉంది. విచారణ పూర్తయిన దరఖాస్తుల్లో అర్హులు పెద్ద సంఖ్యలో ఉండగా .. లబ్ధిదారుల ఎంపిక ఎలా జరుగుతుందనేది స్పష్టత లేకుండా పోయింది. ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే లక్కీ డ్రా ద్వారానే లబ్ధిదారులు ఎంపిక జరుగుతుందనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అదేవిధంగా గత ఆర్థిక సంవత్సరం మైనారిటీ వర్గాలు 80 శాతం సబ్సిడీ కింద రూ.లక్ష కోసం పెద్దఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులను మైనారిటీ బంధు100 శాతం సబ్సిడీగా బదలాయించి కింద రూ.లక్ష అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. అయితే అర్హులైన దరఖాస్తుదారులు వేల సంఖ్యలో ఉండగా, అందులో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతుందని చర్చ సాగుతోంది. అయితే మైనారిటీ బంధు కూడా ఎమ్మెల్యేల సిఫార్సులతోనే పంపిణీ జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాబితాలు సిద్ధం.. ఎమ్మెల్యేల కనుసన్నల్లో రెండో విడత దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి పథకాల లబ్ధిదారుల జాబితా ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ బంధు కింద ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించినప్పటికి స్థానిక ఎమ్మెల్యేలు సిఫార్సు చేసే జాబితాలోని పేర్లతో కూడిన ఆఫ్‌లైన్ దరఖాస్తులు సైతం పరిగణలోకి తీసుకునే విధంగా మంత్రులు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. అదేవిధంగా గృహలక్ష్మి కింద అధికారికంగా దరఖాస్తులు స్వీకరించినప్పటికి..ఇప్పటికే లబ్ధిదారుల జాబితా సిద్ధమై ఎమ్మెల్యేల చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. -
TS: గృహలక్ష్మి పథకానికి లాస్ట్‌డేట్ లేదు!
సాక్షి, హైదరాబాద్: ఆగష్టు 10వ తేదీతో గృహలక్ష్మి పథకం గడువు ముగుస్తుందంటూ జరుగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించింది. అలాగే.. దరఖాస్తుల స్వీకరణకు రకరకాల పేపర్లు అడుగుతూ కొర్రీలు పెడుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాల విమర్శలపైనా స్పందించింది. గృహలక్ష్మి పథకం అనేది తెలంగాణలో కొనసాగే నిరంతర ప్రక్రియ అని, కాబట్టి దరఖాస్తుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టమైన ప్రకటన చేసింది. ఇళ్లులేని నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సొంత జాగా ఉండి.. ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకుంది. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల కోసం ప్రభుత్వం డెడ్ లైన్ విధించిందని, అర్హులైన వారు ఈనెల 10వ తేదీలోగా ధరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించిందని పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దరఖాస్తు విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ‘‘గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ. దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు,కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు దరఖాస్తు చేసే విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కాని, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవు. కాబట్టి ఇంటి నంబర్ అయినా సరే లేకుంటే ఖాళీ స్థలం ఉన్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చు అని స్పష్టం చేసింది. దీనికి గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు తమతమ ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తులు పంపించవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ. ప్రతీ నియోజకవర్గానికి ప్రస్తుతం మొదటి దశలో 3వేల ఇండ్లు పూర్తి అయిన తర్వాత.. రెండో దశలో ఇచ్చే గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఇండ్లు లేని పేదలు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు. దశల వారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి అమలు చేస్తారు అని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. గృహలక్ష్మి పథకం విషయంలో.. ప్రతి పక్షాలు, కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలు నమ్మొద్దని, పేదలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారాయన. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ - దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు,కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఇండ్లులేని నిరుపేదల కోసం ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టుకోవడానికి రూ. 3 లక్షలు ఆర్ధిక సహాయం అందించే గృహలక్ష్మి… pic.twitter.com/yLp0zgYM0s — BRS Party (@BRSparty) August 9, 2023 మార్గదర్శకాలు ఇవే.. ► ఈ పథకం కింద 100 శాతం రాయితీతో ప్రభుత్వం రూ. 3 లక్షల ఈ ఆర్థిక సాయం అందించనుంది. ► రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున మెుత్తం 4 లక్షల మంది లబ్ధిదారులకు సాయం అందిస్తారు. ► మహిళల పేరు మీదే ఆర్థిక సాయం అందిస్తారు. ► లబ్ధిదారైన మహిళ పేరిట బ్యాంకు ఖాతా తెరవాలి (జన్‌ధన్ ఖాతాను వినియోగించవద్దు) . ► కలెక్టర్లు, కమిషనర్లు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. ► ఇంటి బేస్ మెంట్ లెవెల్, రూఫ్ లెవెల్, స్లాబ్ ఇలా మూడు దశల్లో ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. ► ఇప్పటికే ఆర్సీసీ (RCC) ఇళ్లు ఉన్న వారికి, 59 ఉత్తర్వులు కింద లబ్ధి పొందిన వారు ఈ పథకానికి అనర్హులు. ► ఈ పథకం కింద ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీ, మైనార్టీలకు 50 శాతం లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. దివ్యాంగులకు 5 శాతం ప్రత్యేక రిజర్వేషన్లను ప్రకటించారు. -
సంక్షేమంపై దూకుడు
సంగారెడ్డి: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జిల్లా అధికార యంత్రాంగం సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతిష్టాత్మక పథకాలను వీలైనంత త్వరగా లబ్ధిదారుల చెంతకు చేరేలా చర్యలు చేపట్టింది. ప్రధానంగా గొర్రెల పంపిణీ, దళితబంధు వంటి పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో తొలి విడతలో 18,754 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. అయితే రెండో విడతలో 10,331 మందికి ఈ యూనిట్లను అందించాల్సి ఉండగా, ఈ పంపిణీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్బంగా ఈ యూనిట్లను పంపిణీ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ, గొర్రెలు కొనుగోళ్లు ఆలస్యం కావడంతో ఈ పంపిణీ ప్రక్రియ ముందుకు సాగలేదు. ప్రొక్యూర్మెంట్ టీంలు గొర్రెలను కొనుగోలు చేసేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పటికీ వాటిని ఇక్కడికి తేవడంలో జాప్యం జరుగుతోంది. దీంతో సుమారు 10 వేల యూనిట్లు పంపిణీ చేయాలని భావించినప్పటికీ ఇప్పటి వరకు కేవలం 342 యూనిట్లు మాత్రమే పంపిణీ చేయగలిగారు. ఇటీవల జిల్లా కేంద్రంలో కొందరు లబ్ధిదారులకు ఈ యూనిట్లకు సంబంధించిన గొర్రెలను ఇచ్చారు. దళితబంధు జాబితా వెరిఫికేషన్.. ప్రతిష్టాత్మక పథకాల్లో ప్రధానమైన దళితబంధు పథకం రెండో విడత అమలు ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన లబ్ధిదారుల జాబితాను అధికారులు వెరిఫికేషన్ చేస్తున్నారు. తొలి విడతలో నియోజకవర్గానికి వంద చొప్పున దళితబంధు లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ యూనిట్లు ఇప్పటికే గ్రౌండింగ్ పూర్తయింది. అయితే తొలి విడతలో నియోజకవర్గానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి సాచ్యూరేషన్ పద్ధతిన ఆ గ్రామంలోని దళితులందరికి ఈ పథకం కింద యూనిట్లను మంజూరు చేసిన విషయం విదితమే. ఇప్పుడు నియోజకవర్గానికి 1,100 చొప్పున యూనిట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల నుంచి లబ్ధిదారుల జాబితాలను అందజేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే అన్ని నియోజకవర్గాల నుంచి లబ్ధిదారుల జాబితాలు కలెక్టరేట్‌కు రాగా, ఒక్క జహీరాబాద్ నియోజకవర్గం నుంచి ఈ జాబితా రావాల్సి ఉంది. రెండు, మూడు రోజుల్లో ఇది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా నారాయణఖేడ్, ఆందోల్ నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలు మెదక్ జిల్లా పరిధిలో ఉండటంతో ఆయా మండలాల జాబితాలు మెదక్ జిల్లా కలెక్టరేట్‌కు పంపుతున్నారు. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే దళితబంధు యూనిట్లను మంజూరు చేసేందుకు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ సమీక్షలు ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలపై కలెక్టర్ శరత్ తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు, సన్నాహాలు చేస్తూనే.. మరోవైపు ఈ సంక్షేమ పథకాల అమలు తీరుపై సంబంధిత శాఖ అధికారులు, మండలాల్లోని సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. దళితబంధు, గొర్రెల పంపిణీ పథకం అమలుపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు చేసిన కలెక్టర్.. ఈ రెండు పథకాల అమలును వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద ఎన్నికల కోడ్ వచ్చేలోగా సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. -
బీసీలకు సంక్షేమ బలం!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీ సామాజిక వర్గానికి అదేస్థాయిలో నవరత్నాల పథకాల ద్వారా గరిష్టంగా లబ్ధి చేకూరుతోంది. వైఎస్సార్ రైతు భరోసా, పెన్షన్ కానుక, జగనన్న అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన.. ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా అత్యధిక లబ్దిదారులు బీసీలే కావడం ఇందుకు నిదర్శనం. బీసీలంటే దేశానికి బ్యాక్ బోన్ లాంటివారని బీసీ సదస్సులో చెప్పిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యరూపంలోకి తీసుకొచ్చి నాలుగేళ్లుగా సింహభాగం ప్రాధాన్యం కల్పించారు. ఇటు అభివృద్ధి, అటు సంక్షేమంలో సామాజిక న్యాయాన్ని చేకూర్చారు. రాజ్యాధికారంలో బలహీన వర్గాలకు పెద్ద పీట వేశారు. జనాభా ప్రాతిపదికన బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆయా వర్గాలకు నామినేటెడ్ పదవులను ఇచ్చారు. గత సర్కారు హయాంలో బీసీలకు బ్యాంకు రుణాలే దిక్కు కాగా అది కూడా సర్కారు సబ్సిడీ ఇస్తేనే మంజూరయ్యేవి. ఇప్పుడు వివక్షకు తావు లేకుండా నవరత్నాల ద్వారా బీసీలకు అత్యధిక ప్రయోజనం దక్కుతోంది. అర్హతే ప్రామాణికంగా.. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా నవరత్నాల లబ్దిదారులను ప్రభుత్వం గుర్తించింది. రాజకీయ జోక్యం, సిఫారసులకు తావులేకుండా అర్హతే ప్రామాణికంగా వైఎస్సార్ నవశకం ద్వారా నవరత్నాల పథకాలకు అర్హులను వలంటీర్ల ద్వారా గుర్తించారు. వివక్షకు తావులేకుండా అర్హులకు నేరుగా నగదు బదిలీ చేశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా అత్యధికంగా బీసీలకు రూ.1.56 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. నేరుగా నగదు బదిలీ ద్వారా రూ.1.06 లక్షల కోట్లు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయగా నగదేతర బదిలీ పథకాల ద్వారా రూ.49,404 కోట్ల మేర లబ్ధి కలిగింది. ఇళ్ల స్థలాల లబ్దిదారుల్లో అత్యధికంగా 16.70 లక్షల మంది బీసీలే ఉన్నారు. వైఎస్సార్ రైతు భరోసా కింద 25,09,251 మంది బీసీ రైతులకు రూ.13,891.63 కోట్లు జమ చేశారు. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 29,56,048 బీసీలకు రూ.35,720.70 కోట్ల మేర ఆరి్థక ప్రయోజనాన్ని చేకూర్చారు. ప్రతిసారి పెద్ద మనసు చాటారు రాజ్యాధికారం, సంక్షేమంలో సింహభాగం బీసీలకే కేటాయించడం సరికొత్త చరిత్ర. బీసీల విషయంలో సీఎం జగన్ ప్రతిసారి పెద్ద మనసు చాటుకుంటున్నారు. అన్ని పదవుల్లో బీసీలకు పెద్ద పీట వేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టిన ఏకైక పార్టీ వైఎస్సార్సీపీనే. బీసీ కుల గణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. కేంద్రం సానుకూలంగా లేకపోవడంతో ఏపీలో కుల జన గణనపై అధ్యయనానికి సీఎం జగన్ కమిటీని నియమించారు. బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు నడిపిస్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. – కేశన శంకరరావు, ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పిల్లల చదువులు అమ్మ ఒడి పుణ్యమే బోయ సామాజిక వర్గానికి చెందిన నేను, నా భ ర్త వినయ్ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. మా కుమార్తె చేతన ఐదో తరగతి చదువుతోంది. అమ్మ ఒడితో రూ.15,000 బ్యాంకు ఖాతాకు జమ అవుతున్నాయి. మాలాంటి పేదలు పిల్లలను చదివించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతోంది. అమ్మ ఒడి లేకుంటే పిల్లల చదువులు మాకు తలకు మించిన భారం అయ్యేది. ఇప్పుడు సంతోషంగా బడికి పోతున్నారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు జగనన్న లేఔట్లో సుమారు రూ.6 లక్షల విలువైన ఇంటి స్థలాన్ని అందించారు. ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇస్తోంది. – నాగమణి, మారంపల్లి కాలనీ, కళ్యాణదుర్గం మున్సిపాలిటీ, అనంతపురం జిల్లా మత్స్యకార కుటుంబానికి ఎంతో మేలు గత ప్రభుత్వం మా మత్స్యకారులను చులకనగా చూసింది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాలాంటి పేద కుటుంబాలకు జగనన్న ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోంది. చేపల వేట నిషేధం సమయంలో రెండు మూడు రోజుల్లోనే డబ్బులు అందించి ఆదుకుంటున్నారు. నాలుగేళ్లుగా రూ.10 వేలు చొప్పున మత్స్యకార భరోసా కింద అందిస్తున్నారు. చేపల వ్యాపారం నిర్వహించే మా అత్త వైఎస్సార్ చేయూత పథకం ద్వారా వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంది. ఆసరా పథకంతో మా ఇద్దరికీ పొదుపు సంఘాల రుణాన్ని కూడా తీర్చేశారు. మా ఇద్దరి పిల్లల్లో ఒక పాప డాక్టర్ చదువుతోందంటే జగనన్నే కారణం. చిన్న పాప ఇంటర్ చదువుతోంది. గతంలో అమ్మఒడి, ఇప్పుడు విద్యాదీవెన ఇస్తున్నారు.– మేరుగు మణి, కొమ్మాది, విశాఖపట్టణం -
తెలంగాణలో 39 అమృత్ భారత్ స్టేషన్లు.. రైల్వే స్టేషన్లకు కొత్తరూపు
సాక్షి, న్యూఢిల్లీ: అమృత్ భారత్ స్టేషన్ల పథకంలో భాగంగా తెలంగాణలోని మొత్తం 39 రైల్వే స్టేషన్లను గుర్తించి వీటిని సంపూర్ణంగా ఆధునీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మొదటి విడతగా 21 స్టేషన్లకు సంబంధించిన పనులను ఆగస్టు 6న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ‘అమృత్ భారత్ స్టేషన్ల’పథకంలో భాగంగా.. రైల్వే స్టేషన్లను ఆధునీకరించడంతోపాటు స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచి ప్రయాణి కులకు వెయిటింగ్ హాల్స్, టాయిలెట్స్, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ఉచిత వై–ఫై సదుపాయాన్ని కల్పిస్తారు. అదేవిధంగా స్థానిక ఉత్పత్తులకు సరైన గుర్తింపు కల్పించేందుకు ‘వన్ స్టేషన్ వన్ ప్రాడక్ట్’దుకాణాలు, ప్రయాణీకులకు అవసరమైన సమాచారం అందించే వ్యవస్థలు, ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు ఏర్పాటు చేస్తారు. స్టేషన్ ముందు, వెనక భాగాల్లో మొక్కల పెంపకంతో పాటు చిన్న గార్డెన్లు కూడా నెలకొల్పుతారు. ఇక స్టేషన్ల అవసరాలకు అనుగుణంగా బిజినెస్ మీటింగ్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయనున్నారు. వీటికి తోడుగా నగరానికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలను అనుసంధానం చేయడం, దివ్యాంగులకోసం ప్రత్యేక ఏర్పాట్లు, పట్టాలకు ఇరువైపులా కాంక్రీట్ బాటలు, రూఫ్ ప్లాజాలు (అవసరాన్ని బట్టి), దీర్ఘకాలంలో అవసరమయ్యే నిర్మాణాలను ఈ పథకంలో భాగంగా చేపట్టనున్నారు. కాగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో వచ్చే 40 ఏళ్ల అవసరాలు తీర్చేవిధంగా అభివృద్ధి చేసేందుకు రూ.715 కోట్లు, చర్లపల్లి టరి్మనల్ అభివృద్ధికి రూ.221 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కేటాయించిన విషయం తెలిసిందే. తెలంగాణలో మొత్తం గుర్తించిన స్టేషన్లు 39: ఆదిలాబాద్, బాసర్, బేగంపేట్, భద్రాచలం రోడ్, గద్వాల్, హఫీజ్‌పేట్, హైటెక్ సిటీ, ఉప్పుగూడ, హైదరాబాద్ (నాంపల్లి), జడ్చర్ల, జనగాం, కాచిగూడ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట జంక్షన్, ఖమ్మం, లింగపల్లి, మధిర, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మలక్‌పేట్, మల్కాజ్గిరి, మంచిర్యాల్, మేడ్చల్, మిర్యాలగూడ, నల్లగొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రామగుండం, సికింద్రాబాద్, షాద్‌నగర్, శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగుళాంబ, తాండూర్, ఉందానగర్, వికారాబాద్, వరంగల్, యాదాద్రి, యాకుత్‌పురా, జహీరాబాద్. ∙మొదటి విడతలో ఆగస్టు 6న పనులు ప్రారంభం కానున్న 21 స్టేషన్లపై రూ.894 కోట్లు ఖర్చుచేయనున్నారు. -
కేసీఆర్ పథకాలపై మంత్రి హరీష్ రావు ప్రశంసల జల్లు..!
-
ఇంతకు దిగజారుతారా.. చంద్రబాబు పథకాలపై వైఎస్ సీరియస్
-
పథకం వెల్..! పబ్లిసిటీ డల్..!!
హనమకొండ: నిరుపేద మైనార్టీ (వితంతువులు, ఒంటరి, విడాకులు తీసుకున్నవారు) మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం.. స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇటీవల ‘కేసీఆర్ కా తోఫా ఖవాతీన్ కా భరోసా’(కేసీఆర్ మహిళల కానుక) పేరుతో నూతన పథకం ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా నియోజకవర్గానికి వంద చొప్పున ఉచిత కుట్టుమిషన్లు అందించనుంది. మైనార్టీలు అధికంగా ఉన్న నియోజకవర్గాలకు అదనంగా మరో వంద మిషన్ల చొప్పున అందించనుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 నియోజకవర్గాలకు నియోజకవర్గానికి వంద చొప్పున 12 వందల మందికి కుట్టుమిషన్లు అందజేయనుంది. అలాగే, మైనార్టీలు అధికంగా ఉన్న వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు మరో వంద కుట్టుమిషన్లు పంపిణీ చేయనుంది. దరఖాస్తులకు నేటితో గడువు పూర్తి.. పథకం ప్రారంభించిన అనంతరం అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఆ గడువు నేటితో(గురువారం) ముగియనుంది. అయితే పథకం బాగున్నా సరైనా ప్రచారం కల్పించడం లేదు. దీంతో పథక ఫలాలను అందుకోలేకపోతున్నామని నిరుపేద మైనార్టీ మహిళలు వాపోతున్నారు. దరఖాస్తులను స్థానిక ఎమ్మెల్యే ద్వారా అందజేయాలని మైనార్టీ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నా.. తమకు ఎలాంటి సమాచారం లేదని స్థానిక ప్రజాప్రతినిధులు వెనక్కి పంపిస్తున్నారు. కాగా, దరఖాస్తు చేసుకోవడానికి ఆయా జిల్లాలోని మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయాల చుట్టు పేద మైనార్టీ మహిళలు ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వం విధించిన గడువును వెంటనే పొడగించాలని మైనార్టీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయోమయంలో మహిళలు.. ‘కేసీఆర్ కా తోఫా ఖవాతీన్ కా భరోసా’ పథకానికి సరైనా ప్రచారం కల్పించక పోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మైనార్టీ మహిళలు దరఖాస్తులు చేసుకోలేదని తెలుస్తోంది. ఈ పథకం స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా అమలు చేయాలని నిర్ణయించింది. ఎమ్మెల్యేల ద్వారా ఈనెల 20 వతేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి వాటిని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారుల ద్వారా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పథకం గురించి ప్రజాప్రతినిధులకే తెలియకపోవడంతో అర్హులు అయోమయానికి గురవుతున్నారు. పథకానికి అర్హతలు... ఈ పథకానికి అత్యంత నిరుపేద మైనార్టీ మహిళలు అర్హులు. (వితంతువులు, ఒంటరి, విడాకులు తీసుకున్న మహిళలు) 21 నుంచి 55 ఏళ్ల వయసు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2లక్షల లోపు ఆదాయ ఉండాలి. ఆదాయ ధ్రువీకరణ పత్రం, తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు, 5వ తరగతి విద్యార్హత, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు జతచేసి స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. గడువు సమీపిస్తుండడంతో రెండు రోజుల నుంచి ప్రజాప్రతినిధుల ఇళ్లకు వెళ్లిన మైనార్టీ మహిళలు అక్కడ పడిగాపులు కాస్తున్నారు. నిరుపేద మహిళల ద్వారా దరఖాస్తులు తీసుకున్న ప్రజాప్రతినిధులు వాటిని ఈనెల 21వ తేదీ వరకు కలెక్టర్లకు అందజేయాలి. కలెక్టర్ ఈ దరఖాస్తులను పరిశీలించి ఈనెల 27తేదీ వరకు స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు సమర్పించాల్సి ఉంది. గడువు పెంచి, విస్తృత ప్రచారం చేయాలి గడువు తేదీని పొడిగించాలి. పథకంపై విస్తృత ప్రచారం కల్పించాలి. దళితబంధు మాదిరి యూనిట్లను అందించాలి. యూనిట్ కాస్ట్లను పెంచి పేదమహిళలకు స్వయం ఉపాధి అందించాలి. ఉచిత కుట్టు మిషన్ పథకం యూనిట్లను నియోజకవర్గానికి ఐదువందల చొప్పున పొడిగించాలి. – రాజ్ మహ్మద్, అధ్యక్షుడు మైనార్టీ రైట్స్ ప్రొటెక్షన్ ఫ్రంట్, ఉమ్మడి వరంగల్ -
అదిరిపోయే ఫిక్స్డ్ డిపాజిట్ పథకం.. తక్కువ కాలపరిమితి.. ఎక్కువ వడ్డీ!
తక్కువ కాలపరిమితితో ఎక్కువ వడ్డీనిచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ల కోసం చూస్తున్నవారి కోసం ఐడీబీఐ బ్యాంక్ అదిరిపోయే ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని తీసుకొచ్చింది. 375 రోజుల కాలపరిమితితో కొత్త ఎఫ్డీ పథకాన్ని ప్రవేశపెట్టింది. జూలై 14వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన ఈ ఎఫ్డీ పథకంపై సాధారణ ప్రజలకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ రేటును ఐడీబీఐ అందిస్తోంది. ‘అమృత్ మహోత్సవ్ ఎఫ్డీ’ ప్రోగ్రాంలో భాగంగా ఈ కొత్త పథకాన్ని ఐడీబీఐ ప్రారంభించింది. కాగా ఇదే ప్రోగ్రాం కింద 444 రోజుల కాలపరిమితితో ఓ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని ఇదివరకే ప్రవేశపెట్టింది. ఈ రెండు ఎఫ్డీ పథకాలు ఆగస్టు 15 వరకు చెల్లుబాటులో ఉంటాయని ఐడీబీఐ తన వెబ్సైట్లో పేర్కొంది. ఇదీ చదవండి ➤ ‘ఎస్బీఐ యోనో’ను ఇక ఏ బ్యాంక్ కస్టమర్ అయినా వాడొచ్చు.. ఆ యూపీఐ యాప్‌లకు గట్టిపోటీ! ప్రస్తుతం ఉన్న 444 రోజుల వ్యవధి ఎఫ్డీ పథకానికి సంబంధించి కాలబుల్ (మెచ్యూరిటీ కంటే ముందే విరమించుకోవడం) ఆప్షన్‌పై గరిష్టంగా 7.65 శాతం, నాన్-కాల్ ఎంపిక కింద గరిష్టంగా 7.75 శాతం వడ్డీ లభిస్తుంది. -
స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే.. 2 కేజీల టమాటాలు ఫ్రీ..
భోపాల్: దేశంలో టమాటా ధరలు మిన్నంటాయి. సామాన్యుడు కొనలేనంత భారంగా మారాయి. కానీ మధ్యప్రదేశ్‌లో ఓ సెల్‌ఫోన్ షాప్ ఓనర్ ఈ అవకాశాన్ని సరైన విధంగా వాడుకుంటున్నాడు. ఇటు ప్రజలకు మేలు చేస్తున్నట్లు.. అటు తన బిజినెస్‌ను అభివృద్ధి చేసుకుంటున్నాడు. అదేంటంటే.. తన వద్ద స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే రెండు కేజీల టమాటాలను ఉచితంగా ఇస్తాననే ఆఫర్ పెట్టాడు. దీంతో మొబైల్ కొనుగోలుదారులు ఇటువైపే మొగ్గుచూపుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని అశోక్ నగర్లో ఆయన పేరు అభిషేక్.. తన పేరు మీదుగానే ఓ ఎలక్ట్రానిక్ దుకాణాన్ని నడిపిస్తున్నాడు. కొంత కాలంగా గిరాకీ సరిగా లేదని గ్రహించిన అభిషేక్.. ఎలాగైన వినియోగదారులను ఆకర్షించాలని అనుకున్నాడు. ఇప్పడే టమాటా ధరలు పెరిగిపోగా.. దీన్నే తన వ్యాపార సాధనంగా మార్చుకున్నాడు. కేజీ రూ.160-180 వరకు మార్కెట్లో ధర పలుకుతున్న నేపథ్యంలో ఏదైనా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే రెండు కేజీల టమాటాలు ఫ్రీగా ఇస్తానని ఆఫర్ పెట్టాడు. ఒక సెల్‌ఫోన్ మీద 300 పైనే డిస్కౌంట్ వచ్చిన అభిప్రాయం వినియోగదారునికీ కలుగుతుందని చెబుతున్నాడు. దీంతో ఇన్నాళ్లు దీవాలా తీసిన వ్యాపారం ఒక్కసారిగా ఊపందుకుందని అభిషేక్ అంటున్నాడు. సెల్ ఫోన్ కొనుగోలుదారులు అభిషేక్ షాప్‌లో కొనుగోలు చేస్తున్నారు. టమాటా పేరుతో తన షాప్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఉచితంగా అవుతుందని అభిషేక్ చెబుతున్నాడు. అటు.. దేశంలో టమాటా రేట్లపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదీ చదవండి: టేకాఫ్ కష్టమని 19 మంది ప్రయాణికులను దింపేసిన విమాన సిబ్బంది -
ముగిసిన రబీ ఉత్పత్తుల కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: రబీ ఉత్పత్తుల సేకరణ ముగిసింది. రైతులకు మద్దతు దక్కని పంట ఉత్పత్తులను మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ప్రభుత్వం రికార్డు స్థాయిలో సేకరించింది. ధరల స్థిరీకరణ ద్వారా ఏటా ప్రతి సీజన్లోను మార్కెట్లో మద్దతు ధర లభించని పంట ఉత్పత్తులను సేకరిస్తూ నాలుగేళ్లుగా ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. అదేరీతిలో 2022–23లో ఖరీఫ్, రబీ సీజన్లలో మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఫలితంగా మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు మద్దతు ధరకు మించి పెరిగాయి. సీఎం యాప్ ద్వారా రోజూ మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులను పర్యవేక్షిస్తూ కనీస మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తులను మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఖరీఫ్ 2021 సీజన్ చివరిలో మార్కెట్ ధరలు తగ్గడంతో ప్రభుత్వాదేశాలతో 3,513 మంది రైతుల నుంచి రూ.24.61 కోట్ల విలువైన 8,384 టన్నుల సజ్జలు, పెసలు, మొక్కజొన్న, రాగులు, కందులు సేకరించారు. గడిచిన ఖరీఫ్–2022 సీజన్లో సజ్జలు మినహా మిగిలిన పంట ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధరలు దక్కడంతో రైతులకు మంచి లాభాలొచ్చాయి. సజ్జలను మాత్రమే ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేశారు. 564 మంది రైతుల నుంచి రూ.3.94 కోట్ల విలువైన 1,676 టన్నులు కొనుగోలు చేశారు. రబీ 2021–22 సీజన్లో 33,566 మంది రైతుల నుంచి రూ.426 కోట్ల విలువైన 84,773 టన్నుల శనగలు, జొన్నలు, పసుపు, పెసలు సేకరించారు. ఇటీవల ముగిసిన రబీ 2022–23 సీజన్లో 39,479 మంది రైతుల నుంచి రూ.510.74 కోట్ల విలువైన 1,39,262 టన్నుల శనగలు, మొక్కజొన్న, పసుపు సేకరించారు. ప్రధానంగా 28,112 మంది రైతుల నుంచి రూ.336.83 కోట్ల విలువైన 63,132 టన్నుల శనగలు, 9,110 మంది రైతుల నుంచి రూ.139.52 కోట్ల విలువైన 71,110 టన్నుల మొక్కజొన్న, 2,257 మంది రైతుల నుంచి రూ.34.39 కోట్ల విలువైన 5,020 టన్నుల పసుపు సేకరించారు. శనగలకు సంబంధించి నూరుశాతం చెల్లింపులు చేయగా, మొక్కజొన్న రైతులకు రూ.139.06 కోట్లు, పసుపు రైతులకు రూ.7.48 కోట్లు చెల్లించారు. మిగిలిన రూ.27.37 కోట్లు చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు. గడిచిన రబీ సీజన్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో మొక్కజొన్న ధర రూ.1,500 నుంచి రూ.2 వేలకుపైగా పెరిగింది. అదేరీతిలో కందులు, పెసలు, మినుములు వంటి అపరాల ధరలు కూడా రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3,322.15 కోట్ల విలువైన 9.01 లక్షల టన్నుల పరిమాణం కలిగిన 12 రకాల పంట ఉత్పత్తులను సేకరించగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ఏకంగా రూ.7,712.32 కోట్ల విలువైన 21.56 లక్షల టన్నుల పరిమాణం కలిగిన 17 రకాల పంట ఉత్పత్తులను సేకరించింది. గతంలో ఏన్నడూ లేనివిధంగా అరటి, పత్తి, పొగాకు, బత్తాయి. టమాటా పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధరలకు సేకరించి రైతులకు అండగా నిలిచింది. -
మొబైల్ నంబర్.. మీకు నచ్చినట్టు..
ఈరోజుల్లో ప్రతిఒక్కరికీ మొబైల్ ఫోన్ ఉంటుంది. ఫోన్ లేనివారు ఉండటం చాలా అరుదు. ఇప్పుడన్నీ డ్యుయల్ సిమ్ ఫోన్ కావడంతో చాలా మందికి రెండు ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి. ఇంకొంత మందికి అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఏదైనా టెలికామ్ సంస్థ నుంచి కొత్తగా సిమ్ తీసుకుంటున్నప్పుడు చాలామంది తమకు నచ్చిన కస్టమైజ్డ్ మొబైల్ నంబర్లను ఇష్టపడతారు. కొంతమందికి ప్రత్యేకమైన ఇష్టమైన నంబర్లు ఉంటే, మరికొందరు కొన్ని నంబర్లను అదృష్టంగా భావిస్తారు. ఇలా మంచి నంబర్ల కలయిక కోసం శోధిస్తారు. అయితే తమకు కావలసిన నంబర్ కాంబినేషన్లను ఎంచుకునే అవకాశం ఉందని చాలా మందికి తెలియదు. వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్, రిలయన్స్‌తో సహా భారతీయ టెలికాం మార్కెట్లోని కొన్ని కంపెనీలు ఆసక్తిగల సబ్స్క్రైబర్లకు వారికి నచ్చిన మొబైల్ నంబర్ల నిర్దిష్ట అంకెలను అందిస్తున్నాయి. వీటిలో రిలయన్స్ జియో తక్కువ ధరకే ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు కావాల్సిన నిర్దిష్టమైన మొబైల్ నంబర్లను అందిస్తోంది. ఈ ఛాయిస్ నంబర్ స్కీమ్ ద్వారా కస్టమర్లు పూర్తి నంబర్‌ను ఎంచుకోలేనప్పటికీ తమ కొత్త జియో నంబర్లోని చివరి 4 నుంచి 6 అంకెలను ఎంచుకోవచ్చు. -
నాటా మహాసభలో..అమెరికా వైస్సార్సీపీ సోషల్ మీడియా మీట్ అండ్ గ్రీట్
నార్త్ అమెరికన్ తెలుగు అసొసియేషన్ నాటా తెలుగు మహాసభలు డల్లాస్‌లో ఘనంగా జరుగుతున్నాయి. అమెరికా, టెక్సాస్‌లోని డాలస్ కన్వెన్షన్ సెంటర్లో జూన్ 30 నుంచి జులై 2 వరకు జరుగుతున్న తెలుగు మహాసభల్లో భాగంగా అమెరికా వైస్సార్సీపీ సోషల్ మీడియా మీట్ అండ్ గ్రీట్ నిర్వహించింది. నాటా మహాసభల్లో రెండోరోజు వేడుకల్లో ఈ సమావేశం నిర్వహించారు. ఏపీలో వైకాపా ప్రభుత్వ ఏర్పాటుకు, పార్టీ బలోపేతానికి, రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో భారీ మెజార్టీతో వైకాపా అభ్యర్థులు గెలుపొందటానికి ప్రవాసులు కృషి చేయాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బయ్యపు మధుసుదనరెడ్డి తదితరులు కోరారు. గత ఎన్నికల సమయంలో ప్రతి ప్రవాస కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేశారని, మరలా ఆ పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అన్నారు. వైకాపా సోషల్ మీడియా సమన్వయకర్త సజ్జల భార్గవరెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కేంద్రీయ కార్యాలయం నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైకాపా శ్రేణులతో కలిసి పనిచేయడం, సోషల్ మీడియా ఛానళ్లను ప్రభావవంతంగా వినియోగించుకోవడం, వైకాపాను ఆయా వేదికల ద్వారా ప్రజలకు, కార్యకర్తలకు, ఓటర్లకు చేరువ చేసే విధివిధానాలు, ప్రణాళికలను ఆయన సభికులతో పంచుకున్నారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి 175కు 175 సీట్లు గెలిపించాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు. ఈ మహాసభల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ప్రవేశపెట్టిన పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. (చదవండి: డల్లాస్‌లో ఘనంగా నాటా మహాసభలు..జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు) -
ఉద్యమంగా ‘జగనన్న సురక్ష’
పేదవాడు ఎలా ఉన్నా ఏ ఒక్కరూ పట్టించుకోని పరిస్థితులు పోయి.. ప్రతి పేదవాడికి మంచి జరగాలన్న తపన, తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇలాంటి ప్రభుత్వం దేశ చరిత్రలో ఎక్కడా ఉండదు. రాష్ట్రంలో 99 శాతానికిపైగా అర్హులందరికీ పథకాలు అందుతున్న పరిస్థితి ఉంది. అయితే సాంకేతిక కారణాలో, మరే ఇతర కారణాల వల్లో మిగతా ఒక్క శాతం మంది కూడా మిగిలిపోకూడదన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రతి ఇంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా, దానిని పరిష్కరించాలన్న చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: పేదలకు మేలు చేసేందుకు ‘జగనన్న సురక్ష’ కార్యక్రమాన్ని ఉద్యమంగా నిర్వహిస్తున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. దేశ చరిత్రలో ప్రతి ఇంటికీ వెళ్లి.. ఏమైనా సమస్యలున్నాయా అని అడుగుతున్న తొలి ప్రభుత్వం ఇదేనని స్పష్టం చేశారు. పేదల పట్ల ఇంతగా ప్రేమ చూపిస్తున్న ప్రభుత్వం.. ఇంతగా మమకారం చూపిస్తున్న ప్రభుత్వం బహుశా ఎక్కడా ఉండకపోవచ్చని చెప్పారు. అర్హులైన ఏ ఒక్కరూ కూడా పలానా సేవలు, పలానా పథకం లబ్ధి అందలేదని చెప్పే అవకాశం ఉండకూడని విధంగా సమస్యలు పరిష్కరించాలన్నదే ధ్యేయమని పునరుద్ఘాటించారు. అందులో భాగంగానే జల్లెడ పట్టి.. అర్హులను గుర్తించి, పథకాలే కాదు వారికి కావలసిన డాక్యుమెంటేషన్లను కూడా ఈ కార్యక్రమంలో ఇస్తారని తెలిపారు. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వం చేపట్టిన మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘జగనన్న సురక్ష’ను శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నెల రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు, మండల, గ్రామ, వార్డు సచివాలయాల అధికారులు, సిబ్బందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, వలంటీర్లు, ప్రజా ప్రతినిధులు, గృహ సారథులు, మనందరి ప్రభుత్వాన్ని అభిమానించే ఉత్సాహవంతులు అందరూ.. నేరుగా పేద లబి్ధదారుల దగ్గరకు వెళ్లడమే జగనన్న సురక్షా కార్యక్రమం అన్నారు. నోరు తెరిచి అడగలేని, అర్హత ఉండీ పొరపాటున ఎక్కడైనా మిగిలిపోయిన అర్హుల తలుపు తట్టి, లబ్ధి చేకూర్చే మంచి కార్యక్రమం అని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. అర్హుల కోసం జల్లెడ పడతాం ♦ అర్హులెవ్వరూ మిగిలిపోకూడదని ప్రతి ఆరు నెలలకు ఒకసారి జూలై, డిసెంబర్ మాసాల్లో పథకాలు మంజూరు చేస్తున్నాం. దీనికి మరో ప్రయత్నంగా ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇంకా ఎక్కడైనా, ఎవరైనా మిగిలిపోయే పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నాం. 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో మిగిలిపోయిన అర్హుల కోసం జల్లెడ పట్టే ఈ కార్యక్రమం నెల పాటు కొనసాగుతుంది. ♦ ఆదాయం, కులం, బర్త్, కొత్త రేషన్ కార్డులు, సీసీఆర్సీ కార్డులు, ఆధార్‌కు బ్యాంక్ లింకేజి, ఆధార్ కార్డుల్లో మార్పులు తదితర సేవలన్నీ ఈ కార్యక్రమం కింద చేపడతారు. దాదాపు 11 రకాల సేవలు ఎలాంటి సర్విసు చార్జీ లేకుండా అందించేలా అడుగులు వేస్తున్నాం. ఆధార్ కార్డుల మార్పులకు కోసం ఇప్పటికే కేంద్రంతో మాట్లాడి 2,500 సెంటర్లు ఏర్పాటు చేయించాం. వాటికి సంబంధించిన విధి, విధానాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. ఆ మేరకు సేవలను జగనన్న సురక్ష కార్యక్రమం కింద అందిస్తారు. రాష్ట్రంలో ప్రతి ఇంటి తలుపు తడుతూ.. ♦ వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, గృహసారథులు, ప్రజాప్రతినిధులు, మన ప్రభుత్వం మీద ప్రేమ ఉన్న ఉత్సాహవంతులు ఒక బృందంగా ఏర్పడి వారం రోజులపాటు రాష్ట్రంలో ఉన్న 1.60 కోట్ల ఇళ్లకు వెళ్లి ప్రతి ఇంటి తలుపు తడతారు. లబ్ధి అందని వారు, ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్న వారిని గుర్తించి, పరిష్కారానికి ప్రయత్నిస్తారు. వారి దగ్గర నుంచి డాక్యుమెంట్లు సేకరించి సచివాలయంలో సమర్పిస్తారు. ♦ ఒక టోకెన్ నంబరు జనరేట్ చేసి, సర్వీసు రిక్వెస్ట్ నంబర్ కేటాయించి.. దానిని ఆయా కుటుంబాలకు అందిస్తారు. సంబంధిత సచివాలయాల పరిధిలో ఎప్పుడు క్యాంపులు పెడతారు, మండల అధికారులు ఎప్పుడు వస్తారన్న తేదీ కూడా వారికి చెబుతారు. ఆ రోజున వారిని క్యాంపులకు తీసుకు వచ్చి సమస్యలు పరిష్కరించేలా చూస్తారు. ♦ ఈ నెల రోజుల్లో క్యాంపుల సందర్భంగా మండల స్థాయి అధికారులతో కూడిన బృందాలు ఒక రోజంతా సచివాలయాల్లోనే ఉండి ఈ సమస్యలను పరిష్కరించి, సరి్టఫికెట్లు ఇస్తారు. తాసీల్దార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఈవో ఒక టీంగా, డిప్యూటీ తాసీల్దార్, ఎంపీడీఓ రెండో టీంగా ఏర్పడతారు. ♦ ప్రతి మండలంలో ప్రతిరోజూ రెండు సచివాలయాలు కవర్ అవుతాయి. జూలై 1 నుంచి ఈ క్యాంపులు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని దాదాపు 5.3 కోట్ల మంది పౌరులందరికీ చేరువయ్యేలా 1.6 కోట్ల కుటుంబాలకు సంబంధించిన ఇళ్లను సందర్శించేలా ఈ కార్యక్రమం జరుగుతుంది. లక్షల మంది ఉద్యోగులు, వలంటీర్లు ♦ రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలకు అనుబంధంగా సురక్ష క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. పేదవాడికి సాయం చేయడం కోసం సచివాలయాల సిబ్బంది, ఉద్యోగులు, వలంటీర్లు సహా లక్షల మంది ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. ఇందులో 1.50 లక్షల మంది సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, 2.60 లక్షల మంది వలంటీర్లు ఇందులో పాల్గొంటున్నారు. ♦ 26 జిల్లాలకు ప్రత్యేక సీనియర్ ఐఏఎస్ అధికారులను పర్యవేక్షక అధికారులుగా నియమించాం. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఇతర అధికారులు అన్ని క్యాంపుల్లో పాల్గొంటారు. అక్కడ సేవలు అందుతున్న తీరుపై వీరు తనిఖీలు చేస్తారు. ఈ కార్యక్రమం జరుగుతున్న తీరుపై జిల్లా కలెక్టర్లు రోజువారీ సమీక్షలు చేస్తారు. వారానికి ఒకరోజు సీఎంఓ, చీఫ్ సెక్రటరీ కూడా మానిటరింగ్ చేస్తారు. క్యాంపుల నిర్వహణలో జాగ్రత్తలు ♦ సచివాలయాల్లో క్యాంపులు నిర్వహించేటప్పుడు సదుపాయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తాగునీరు, భోజనం, కూర్చోవడానికి తగిన సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ప్రతి క్యాంపును ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కచ్చితంగా సందర్శించాలి. లబ్దిదారులకు క్యాంపుల గురించి సరైన సమాచారం అందించాలి. ♦ జగనన్నకు చెబుదాం ద్వారా వచ్చిన సమస్యలను ఇదే కార్యక్రమంలో మిళితం చేసి వాటిని కూడా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలి. ప్రజలు పూర్తిగా సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ వాళ్లు అడిగింది సాధ్యం కాని పరిస్థితులు ఉంటే ఆ విషయాన్ని వాళ్లకు అర్థమయ్యేలా వివరించాలి. దాన్ని కూడా జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగం చేసుకోవాలి. రెవెన్యూ డివిజన్ల వారీగా కూడా ఈ కార్యక్రమంపై పర్యవేక్షణ అవసరం. ఈ అంశంపై కూడా కలెక్టర్లు ధ్యాస పెట్టాలి. ♦ ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కె వి రాజేంద్రనాథ్ రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, వ్యవసాయ, సహకార శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి హెచ్ అరుణ్ కుమార్, సీసీఎల్ఏ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్, గృహ నిర్మాణ శాఖ ఎండి జి లక్ష్మీషా, మున్సిపల్ అడ్మిని్రస్టేషన్ కమిషనర్ పి కోటేశ్వరరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఏ సూర్యకుమారి, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అదనపు డైరెక్టర్ భావన, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అప్పుడు, ఇప్పడు పరిస్థితి గమనించండి ♦ నాలుగేళ్ల క్రితం గత ప్రభుత్వంలో పరిస్థితులను చూడండి. ఏ పట్టణాన్ని, ఏ గ్రామాన్ని, ఏ వార్డును తీసుకున్నా.. ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, ప్రభుత్వ అధికారుల చుట్టూ, జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి లంచాలు ఇచ్చుకునే పరిస్థితి ఉండేది. మరో వైపు వివక్షకు గురవుతూ ప్రజలు ఇబ్బంది పడేవారు. మీరు ఏ పార్టీ వారనే ప్రశ్న ఎదురయ్యేది. ♦ మనం అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లలో ఆ పరిస్థితిని పూర్తిగా మార్చాం. ఇప్పుడు పెన్షన్ కావాలన్నా.. రేషన్ కావాలన్నా నేరుగా ఇంటికే వచ్చే గొప్ప వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం. ఆరు నెలల్లోనే దాదాపు 600 రకాల పౌరసేవలు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గ్రామ స్థాయిలో ప్రజల ముంగిటకు తీసుకు వచ్చాం. ♦ అర్హతే ప్రామాణికంగా కులం, మతం, పార్టీ చూడకుండా, రాజకీయాలకు తావే లేకుండా.. ఎక్కడా ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా, వివక్షకు తావు ఇవ్వకుండా పారదర్శకంగా పౌర సేవలు అందించడం మన ప్రభుత్వంలోనే మొదలైంది. ♦ అందువల్లే ఇవాళ ప్రతిపక్షాలకు అజెండా అన్నది మిగల్లేదు. ఇంతకు ముందు రేషన్ కార్డులు కావాలని, ఇళ్ల పట్టాలు కావాలని, పెన్షన్లు కావాలని.. ఉద్యమాలు జరిగే పరిస్థితులు ఉండేవి. ఈ రోజు పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు, బర్త్, ఇన్‌కం, డెత్, ఇన్‌కం సర్టిఫికెట్లు గ్రామ స్థాయిలోనే అందుతున్నాయి. ♦ ఈ నాలుగేళ్లలో నవరత్నాల ద్వారా రూ.2.16 లక్షల కోట్లు బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో డీబీటీ ద్వారా నేరుగా జమ చేశాం. నాన్ డీబీటీలో ఇళ్ల స్థలాల విలువ కూడా కలుపుకుంటే అది రూ.3.10 లక్షల కోట్లు దాటింది. -
జగనన్న సురక్షకు సర్వం సిద్ధం
సాలూరు: తన పాలనలో పార్టీల కతీతంగా, అర్హతే ప్రామాణింగా, అత్యంత పారదర్శకంగా, అవినీతి రహితంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రజలకు అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో చారిత్రక నిర్ణయానికి తెరతీశారు. ఏవైనా కారణాల వల్ల ఎవరైనా అర్హులకు సంక్షేమ పథకాలు అందనట్లయితే వారికి పథకాలు అందించేలా, సేవలకు సంబంధించి అవసరమైన పత్రాలు వెంటనే మంజూరుచేసే నూతన కార్యక్రమానికి నాంది పలికారు. ప్రజల వద్దకు నేరుగా వలంటీర్లు, సచివాలయ గృహసారథులను పంపించి సమస్యలు, ఇబ్బందులు తెలుసుకోవడంతో పాటు వారికి పథకాలు లేదా పత్రాల మంజురుకు సంబంధించి సమస్యలుంటే తెలుసుకుని వెంటనే పరిష్కరించే దిశగా జగనన్న సురక్ష కార్యక్రమానికి నాంది పలికారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 23న ప్రారంభించనున్నారు. కార్యక్రమం విధివిధానాలు ఈ నెల 24నుంచి వలంటీర్లు, గృహసారథులులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికీ వెళ్లి జగనన్న సురక్ష కార్యక్రమం ఆవశ్యకతను వివరిస్తారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటారు. పథకాలు, సేవలకు సంబంధించి ప్రజలు సమస్యలు తెలిపిన పక్షంలో వివరాలను తెలుసుకుని, సేవలకు సంబంధించి అవసరమైన ఆదాయ, కుల, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, మ్యారేజ్ సర్టిఫికెట్, మ్యుటేషన్లు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, ఆధార్‌లో మొబైల్ నంబర్ అప్డేషన్, క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్‌లు వంటివి మంజూరు గురించి వివరిస్తారు. ఎవరైనా పథకాలు, సేవలకు సంబంధించిన సమస్యలు చెప్తే వాటికి సంబంధించి అవసరమైన దరఖాస్తులను తీసుకుని సచివాలయంలో అందజేస్తారు. కార్యాచరణ ఇలా ప్రతి సచివాలయం పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిస్తారు. వారంలో మూడు సచివాలయాల చొప్పున నెలరోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎంపీడీఓ/మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్లు ఒక టీమ్‌గా, తహసీల్దార్, ఈఓపీఆర్డీ/మరో టీమ్‌గా ఏర్పాటవుతారు. మున్సిపాలిటీ, మండలంలోని అన్ని సచివాలయాల్లో ఈ క్యాంపు నిర్వహించే దిశగా అధికారులు ఏర్పాట్లు చేశారు. జగనన్న సురక్ష ద్వారా అర్హులుగా గుర్తించిన వారికి ఆగస్టు 1న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లబ్ధి చేకూరుస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి స్పష్టంగా ఆదేశించారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిని జల్లెడ పట్టి అర్హులెవరైనా ఏవైనా సాంకేతిక, ఇతర కారణాల వల్ల పథకాలు పొందలేకపోతే వారిని గుర్తించి పథకాలు అందేలా చేయడంతో పాటు ప్రజలకు అవసరమైన ప్రధాన సర్టిఫికెట్లు సత్వరమే ప్రజలకు అందించనున్నాం. – పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖామంత్రి -
28న ‘అమ్మ ఒడి’.. ఏపీ సర్కార్ కీలక మార్గదర్శకాలు జారీ..
సాక్షి, అమరావతి: జగనన్న అమ్మఒడి 2022–23 పథకం అమలుకు ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేసింది. తమ పిల్లలను పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు పంపుతున్న తల్లుల ఖాతాల్లో ఈ నెల 28న అమ్మఒడి నగదును జమ చేయనుంది. కుటుంబంలో చదువుకుంటున్న పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా తల్లి/సంరక్షకుడు ఏటా రూ.15 వేలు చొప్పున పొందచ్చని పేర్కొంది. ► ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబానికి చెందిన విద్యార్థులు తల్లులు పథకానికి అర్హులు. ► పేదరికంలో ఉన్న కుటుంబాల ఆదాయం గ్రామాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలుకు మించకూడదు. ► ఆదాయపన్ను చెల్లించేవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లు అమ్మఒడికి అర్హులు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ► వ్యవసాయ భూమిలో మెట్ట అయితే 10 ఎకరాల్లోపు, మాగాణి భూమి 3 ఎకరాల్లోపు, రెండూ కలిపి ఉంటే 10 ఎకరాల్లోపు ఉండాలి. ► విద్యుత్ గరిష్ట వినియోగం నెలకు 300 యూనిట్లు మించనివారు కూడా అర్హులే. ► నాలుగు చక్రాల వాహన యజమానులకు సంబంధించి డ్రైవర్లు సొంతంగా నడుపుకునే ట్యాక్సీలతో పాటు ట్రాక్టర్లు, ఆటోలకు కూడా మినహాయింపునిచ్చింది. వీరు అమ్మఒడి పథకానికి అర్హులే. ► పట్టణాల్లో స్థిరాస్తికి సంబంధించి ఇంటి విస్తీర్ణం 1,000 చదరపు అడుగులు మించకుండా ఉంటే అమ్మఒడిని వర్తింపజేస్తారు. ► పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్ కాకుండా పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ వంటి కోర్సుల్లో చేరేవారికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను అమలు చేస్తారు. చదవండి: తిరుమల: 19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల -
Fact Check: అర్హులకు పరిహారం జమచేస్తే నిందలా?
‘సంక్షేమ ఫలాలు అందని అర్హులెవరైనా ఉంటే వెతికి మరీ వారికి నేరుగా అందిస్తుంటే ఎవరైనా అభినందించాలిగానీ ఈనాడు మాత్రం పనిగట్టుకుని బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. వాస్తవాలు తెలుసుకోకుండా బటన్ నొక్కిన ఏడాదికి ఖాతాల్లో సొమ్ము అంటూ తప్పుడు కథనాన్ని వండివార్చింది’.. అంటూ వ్యవసాయ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో ఖండించింది. రైతులపై పైసా భారం పడకుండా నోటిఫైడ్ పంటలను సాగుచేసిన ప్రతీ ఎకరాకు డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి బీమా కల్పిస్తోంది. ఈ–క్రాప్‌లో నమోదు ప్రామాణికంగా ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు. అర్హత పొందిన వారికి తరువాత ఏడాది సీజన్ ప్రారంభమయ్యేలోగా పరిహారం చెల్లిస్తున్నారు. ఇలా గడిచిన నాలుగేళ్లుగా 44.66 లక్షల మందికి రూ.6,684.84 కోట్ల బీమా పరిహారం చెల్లించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఖరీఫ్–2021 సీజన్లో అర్హత పొందిన 15.61 లక్షల మంది రైతులకు గతేడాది జూన్ 14న రూ.2,977.82 కోట్లు జమచేసింది. ఒక సీజన్‌కు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో పరిహారం అందించడం చరిత్రలో ఇదే తొలిసారి. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అర్హులైన ఏ ఒక్కరూ మిగిలిపోకూడదనే ఉద్దేశంతో పరిహారం అందని వారి నుంచి, ఆర్బీకేల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హత సాధించిన మేరకు ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసింది. అయితే, కొన్ని సంశయాత్మక ఖాతాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో పునఃపరిశీలన చేశారు. అందులో అర్హత పొందిన వారికి సంబంధించిన విస్తీర్ణానికి గతంలో ఏమైనా చెల్లింపులు జరిగాయా లేదా అని కూడా పునఃపరిశీలన చేశారు. ఒకటి రెండుసార్లు క్షేత్రస్థాయిలో పునఃపరిశీలన తర్వాత అన్ని వి«ధాలుగా అర్హత పొందిన వారి జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శించారు. ఇలా అర్హత పొందిన 9 వేల మందికి ఈనెల 14న రూ.90 కోట్లు జమచేశారు. తొలుత అర్హత పొందిన వారిలో వీరు కేవలం 0.2 శాతం మాత్రమే. వాస్తవాలిలా ఉంటే.. సాంకేతిక కారణాలతో ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన జాప్యాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుని బీమా పరిహారం ఏడాదికి జమచేసినట్లుగా వాస్తవాలను మరుగున పరిచేలా ప్రచురించిన వార్తను ఖండిస్తున్నట్లు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. -
జగనన్న నాకు ఇచ్చిన గొప్ప వరం..!
-
జగనన్న అందిస్తున్న ‘విద్యాదీవెన’ పథకం వల్ల మా అమ్మాయి చదువుకు మేము అప్పులు చేయాల్సిన అవసరం లేదు..!
-
Karnataka: ఇంటి పెద్ద అత్తా? కోడలా?.. ఇంటింటా ‘గృహలక్ష్మి’ కలహాలు!
కర్నాటక ప్రభుత్వం ‘గృహలక్ష్మి’ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద రూ. 2000 మొత్తాన్ని ప్రతీనెలా ఇంటిలోని పెద్దకు ఇవ్వనున్నారు. ఈ పథకానికి సంబంధించిన ప్రకటన వెలువడగానే చాలా ఇళ్లలో అత్తాకోడళ్ల మధ్య గొడవలు పెరిగాయనే వార్తలు వస్తున్నాయి. ఇందుకు పలు ఉదాహరణలు కూడా కనిపిస్తున్నాయి. ఈ పథకం కింద వచ్చే మెత్తం ఎవరు తీసుకోవాలనే దానిపై చాలా కుటుంబాలు తమలో తాము గొడవలు పడుతున్నాయి. చాలా కుటుంబాలలో అత్తాకోడళ్లు కలిసి ఉండటం లేదు. అటువంటప్పుడు ఈ మొత్తాన్ని ఎవరికి ఇస్తారని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం అత్తలకే చెందాలని కొందరు అంటుండగా, కోడళ్లకే దక్కాలని మరికొందరు అంటున్నారు. అయితే సఖ్యతగా ఉన్న కొన్ని కుటుంబాలలోని అత్తాకోడళ్లు ఆ మొత్తాన్ని చెరిసగం పంచుకుంటామని చెబుతున్నారు. దీని గురించి కర్నాటక శిశు, మహిళా శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బల్కర్ మాట్లాడుతూ ‘గృహలక్ష్మి’ పథకం కింద అందించే మొత్తాన్ని పంచుకోవడంతో కుటుంబ సభ్యులదే అంతిమ నిర్ణయం అని అన్నారు. అయితే ఇంటిపెద్దగా అత్తకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఆమె ఇవ్వాలనుకుంటే కోడలికి ఈ మొత్తాన్ని అందించవచ్చన్నారు. పీడబ్ల్యుడీ మంత్రి సతీష్ జార్కీహోలీ మాట్లాడుతూ ‘గృహలక్ష్మి’ పథకం మొత్తం అత్తకే చెందాలని అన్నారు. ఆమెనే ఇంటిపెద్ద అని అన్నారు. ఈ విషయంలో అత్తాకోడళ్లు సయోధ్యతో మెలగాలని సూచించారు. -
ఈ-అప్పీళ్ల పథకం నోటిఫై
న్యూఢిల్లీ: ఈ-అప్పీల్స్ పథకాన్ని ఆదాయపన్ను శాఖ నోటిఫై చేసింది. దీంతో అప్పీళ్లను ఎలక్ట్రానిక్ రూపంలో దాఖలు చేసుకోవడం, వాటిని ప్రాసెస్ చేయడం వీలు పడుతుంది. ‘ఈ–అప్పీల్స్ స్కీమ్, 2023’ కింద ఆదాయపన్ను శాఖ జాయింట్ కమిషనర్ (అప్పీల్స్) తన ముందు దాఖలైన అప్పీళ్లను ప్రాసెస్ చేయనున్నారు. దీని కింద బాధిత మదింపుదారులు JCIT (అప్పీల్స్) JCIT కంటే తక్కువ ర్యాంక్‌లో ఉన్న అసెస్సింగ్ అధికారి ఆమోదించే ముందు కొన్ని ఆర్డర్లను అప్పీల్ చేయవచ్చు. "జాయింట్ కమీషనర్ (అప్పీల్స్) ఈ పథకం నిబంధనలకు అనుగుణంగా దాని ముందు దాఖలు చేసిన లేదా కేటాయించిన లేదా బదిలీ చేయబడిన అప్పీళ్లను పరిష్కరించాలి" అని నోటిఫికేషన్ పేర్కొంది. JCIT (A)కి ఇన్కమ్ టాక్స్ అథారిటీ, మినిస్టీరియల్ స్టాఫ్, ఎగ్జిక్యూటివ్ లేదా కన్సల్టెంట్లు బోర్డు ద్వారా అవసరమని భావించే విధంగా అప్పీళ్లను పరిష్కరించడంలో సహాయపడతారు.అప్పీళ్ల కేసుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పన్ను చెల్లింపుదారుల వివరణ సైతం విననున్నారు. ఇదీ చదవండి: CSK ఓనరు, నికర విలువ ఎంత? ఈ విషయాలు తెలుసా? Ravindra Jadeja వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్ సూపర్ పిక్స్ వైరల్ డిఫరెంట్ లుక్స్‌లో టాప్ లీడర్స్: దిమ్మదిరిగే ఫోటోలు -
డైరెక్ట్ సెల్లింగ్ పేరిట రూ.1000 కోట్ల దందా!
సాక్షి, హైదరాబాద్: డైరెక్ట్ సెల్లింగ్ పేరుతో ప్రారంభమైన ఈ–స్టోర్ ఇండియా సంస్థ దేశవ్యాప్తంగా రూ. 1,000 కోట్ల దందా సాగించినట్లు హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. ప్రధానంగా రెండు రకాలైన స్కీములతో అమాయకులను ఆకర్షించి భారీ స్కామ్‌కు పాల్పడినట్లు తేల్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు నగర కొత్వాల్ సీవీ ఆనంద్ తెలిపారు. డీసీపీ డాక్టర్ పి.శబరీష్, ఏసీపీ ఎన్.అశోక్ కుమార్‌లతో కలసి మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. యాక్సస్ ఈ–కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఆయుర్‌కేర్ హెల్త్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ–స్టోర్ ఇండియాను నిర్వహిస్తోంది. దీనికి హిమాయత్‌నగర్, మలక్‌పేట ప్రాంతాలకు చెందిన మనీష్ కత్తి, సయ్యద్ అజ్మల్ సజ్జద్ మార్కెటింగ్ ఇన్చార్జులుగా వ్యవహరిస్తున్నారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద నమోదు చేసుకున్న యాక్సస్ ఈ కార్ప్ సంస్థ తమ స్కీమ్‌లకు ప్రభుత్వ అనుమతి ఉందని నమ్మబలుకుతూ నిరుద్యోగులకు ఎర వేస్తోంది. ఈ రెండు స్కీముల పేరుతో... ఇండివిడ్యువల్ డి్రస్టిబ్యూషన్ స్కీమ్ కింద అనేక మందిని ఈ–స్టోర్ ఇండియా సభ్యులుగా చేర్చుకుంది. ఎవరైనా రూ. 8,991 చెల్లించి సభ్యుత్వం తీసుకుంటే వారికి సంస్థ రూ. 9 వేల విలువైన ఆయుర్వేద ఉత్పత్తులు, కంపెనీ పేరుతో ఉన్న బోర్డు అందిస్తుంది. బోర్డును తమ ఇల్లు, దుకాణం ముందు తగిలించి ఆ ఫొటోను సంస్థకు పంపాలి. అప్పటి నుంచి కంపెనీ 36 నెలలపాటు నెలకు రూ. 1,100 చొప్పున ఇస్తామని చెప్పి పన్ను మినహాయింపుల తర్వాత రూ. 825 కొంతకాలం చెల్లిస్తుంది. ఈ సభ్యుడికి ఓ గుర్తింపు నంబర్ ఇచ్చి మరో రూ.9 వేల విలువైన ఈ–స్టోర్ ఉత్పత్తులను కొనేలా చేస్తుంది. అందుకు ప్రతిగా కొంతకాలం సభ్యుడికి చెల్లింపులు చేసి ఆపై బోర్డు తిప్పేస్తుంది. ఇక సూపర్ మార్కెట్ స్కీమ్‌లో పెట్టుబడి భారీగా ఉంటుంది. ఒక్కో వ్యక్తి రూ. 25 లక్షల చొప్పున చెల్లించి సూపర్ మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలి. దీనికి అద్దె, మౌలికవసతులు, ఉద్యోగులను తామే ఏర్పాటు చేస్తామని కంపెనీ నమ్మబలుకుతుంది. వందల మంది నుంచి రూ. కోట్లు.. ఈ సంస్థ స్కీముల్లో చేరి దేశవ్యాప్తంగా అనేక మంది రూ. వందల కోట్లు నష్టపోయారు. ఇప్పటివరకు రూ. 1000 కోట్ల దందా చేసిన ఈ–స్టోర్ ఇండియా 300 మందిని ముంచింది. వారిలో రాష్ట్రానికి చెందిన 44 మంది కూడా ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు 9 మందిని నిందితులుగా గుర్తించి మనీష్, అజ్మల్ సజ్జద్‌లను అరెస్టు చేశారు. -
Mahila Samman Scheme: గుడ్‌న్యూస్: మహిళా సమ్మాన్ డిపాజిట్‌పై కీలక ప్రకటన
న్యూఢిల్లీ: కేంద్ర సర్కారు 2023–24 బడ్జెట్లో మహిళా సమ్మాన్ (Mahila Samman Scheme) పేరుతో ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రకటించింది. గరిష్టంగా రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వార్షిక వడ్డీ 7.5 శాతం. రెండేళ్లకు గడువు ముగుస్తుంది. మహిళల కోసమే ఈ డిపాజిట్‌ను తీసుకొచ్చింది. అయితే ఇందులో పెట్టుబడిపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) తాజాగా స్పష్టం చేసింది. ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! అదే సమయంలో రాబడిపై టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత) అమలు చేయరని పేర్కొంది. సీబీడీటీ ఆదేశాల ప్రకారం మహిళా సమ్మాన్ సర్టిఫికెట్లో వచ్చే వడ్డీ ఆదాయం రూ.40వేలు మించకపోతే టీడీఎస్ వర్తించదని స్పష్టమవుతోందని నాంజియా అండర్సన్ ఇండియా పార్ట్నర్ నీరజ్ అగర్వాల్ తెలిపారు. ఈ పథకంలో గరిష్ట పెట్టుబడిపై ఒక ఏడాదిలో 7.5 శాతం మేరకు రాబడి రూ.15,000గానే ఉంటుందని, కనుక టీడీఎస్ వర్తించదన్నారు. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో.. -
చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం గుర్తురాదు
-
మరింత సమర్థంగా ‘ప్రత్యక్ష నగదు బదిలీ’
సాక్షి, అమరావతి: ప్రజా సంక్షేమంలో దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. పథకాల అమలులో పారదర్శకతకు, నిష్పాక్షికతకు పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా ప్రతి పథకాన్ని ప్రతి లబ్ధిదారుకి ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందిస్తోంది. దీని ద్వారా అవినీతి, ఆశ్రితపక్షపాతానికి తావు లేకుండా పథకం ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. ప్రత్యక్ష నగదు బదిలీని మరింత సమర్ధంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన పలువురు మంత్రులు సభ్యులుగా రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అధ్యక్షతన పలు శాఖల అధికారులు సభ్యులుగా ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ‘ప్రత్యక్ష నగదు బదిలీకి అత్యంత సానుకూల ప్రభావం ఉన్న నేపథ్యంలో పథకాల వర్క్‌ఫ్లోను నిరంతరం క్రమబద్ధీకరించడంతో పాటు కొత్తగా వస్తున్న సాంకేతికతలను స్వీకరించడం, వివిధ విభాగాలను సమన్వయం చేయడం, లీకేజీలను తగ్గించడం బదిలీ వ్యయాన్ని తగ్గించడం ద్వారా మరింత సమర్ధవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నవరత్నాల్లోని పలు పధకాలను ప్రత్యక్ష నగుదు బదిలీ ద్వారా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంది. వివిధ పథకాల లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా ఆర్ధిక సాయం అందుతోంది. సమర్ధంగా, పారదర్శకంగా, జవాబుదారీగా ఎటువంటి లీకేజీ లేకుండా ప్రత్యక్ష నగదు బదిలీ అమలవుతోంది అనడానికి లబ్ధిదారులే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నారు. అలాగే ఈ విధానం సామాజిక శ్రేయస్సుపై సానుకూల ప్రభావం చూపుతోంది. లబ్ధిదారులతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తోంది. ఇలాంటి ప్రత్యక్ష నగదు బదిలీని మరింత సమర్ధంగా అమలు చేయడం కోసమే సమన్వయ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది’ అని ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. రాష్ట్రస్థాయి ప్రత్యక్ష నగదు బదిలీ కమిటీ ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, ఐటీ, పరిశ్రమలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ, కార్మిక, ఉపాధి, శిక్షణ, మహిళా, శిశు అభివృద్ధి శాఖల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి సభ్య కన్వీనర్‌గా ఉంటారు. ఈ కమిటీకి ముఖ్యమంత్రి ఏ మంత్రినైనా లేదా నిపుణులనైనా ఆహ్వానించవచ్చు. రాష్ట్రస్థాయి కమిటీ లక్ష్యాలు రాష్ట్రస్థాయి కమిటీ ప్రత్యక్ష నగదు బదిలీకి విస్తృత దృష్టితో దిశను నిర్ధారిస్తుంది. ప్రత్యక్ష నగదు బదిలీ విస్తృత విధానాలు, లక్ష్యాలు, వ్యూహాలను రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయిస్తుంది. మరింత సమర్ధత, పారదర్శకత, జవాబుదారీ పెంపొందించే లక్ష్యాలను నిర్ధారిస్తుంది. ఎగ్జిక్యూటివ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఆర్థిక శాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక సీఎస్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక సీఎస్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, కార్మిక శాఖ కార్యదర్శి, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళికా శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి సభ్య కన్వీనర్‌గా ఉంటారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ లక్ష్యాలు ఎగ్జిక్యూటివ్ కమిటీ రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయాల అమలుకు చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయాలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడానికి చర్యలు తీసుకుంటుంది. -
Fact Check: కన్యా సుమంగళ యోజన, అమ్మాయిలకు నెలకు రూ.4500?
సాక్షి,ముంబై: కేంద్ర ప్రభుత్వ పథకాలు, లబ్దిదారులకు ప్రయోజనాలు అంటూ పలు పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ కావడం కామన్‌గా మారి పోయింది. నిజా నిజాలతో సంబంధం లేకుండా యూజర్లు వీటిని షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా అలాంటి పోస్ట్ ఒకటి హల్చల్ చేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కొత్త పథకం ‘కన్యా సుమంగళ యోజన’ కింద ఆడబిడ్డలున్న కుటుంబాలకు నెలకు రూ.4,500 అందజేస్తుందనే న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది. (లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన సమంత! ధర ఎంతంటే?) కన్యా సుమంగళ యోజన కింద కుటుంబంలో కుమార్తె ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం నెలకు రూ.4,500 స్టైఫండ్‌ను అందజేస్తోందని సర్కారీ వ్లాగ్ అనే యూట్యూబ్ ఛానెల్ వీడియో అప్లోడ్ చేసింది. దీనిపై స్పందించిన పీఐబీ ఫాక్ట్ చెక్ టీమ్ అసలు విషయాన్ని ప్రకటించింది. ఇది నకిలీ వార్త అని కొట్టిపారేసింది. కేంద్ర ప్రభుత్వం అలాంటి పథకం దేన్ని అమలు చేయడం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీం తన అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది. కాగా ప్రధానమంత్రి కన్యా సుమంగళ యోజన అనేది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం. రాష్ట్రంలోని బాలికల విద్య, ఆరోగ్య సంరక్షణ కోసం కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకం 25 అక్టోబర్ 2019న లక్నోలో ప్రారంభించింది. 'Sarkari Vlog' नामक यूट्यूब चैनल के एक वीडियो में दावा किया गया है कि जिनके परिवार में बेटियां हैं उन्हें 'कन्या सुमंगला योजना' के तहत केंद्र सरकार हर महीने ₹4,500 दे रही है #PIBFactCheck ➡️ यह दावा फर्जी है ➡️ केंद्र सरकार द्वारा ऐसी कोई योजना नहीं चलाई जा रही है | pic.twitter.com/D724QS7byI — PIB Fact Check (@PIBFactCheck) May 2, 2023 -
ఇవా పెరోన్ బాటలో ఏపీ
దాతృత్వం పేదల నుంచి సంపన్నులను ఎడంగా ఉంచుతుంది. సహాయం పేద లను సంపన్నులతో సమస్థాయికి పెంచు తుంది. – ఇవా పెరోన్, అర్జెంటీనా దివంగత ప్రథమ మహిళ మే 7 ఇవా పెరోన్ జయంతి. తన జన్మభూమిలోనే కాక, ప్రపంచంలో ఆకలి, పేదరికం, అనారోగ్యం మానవాళిని పట్టి పీడిస్తున్న ప్రతి మూలలోనూ ఈనాటికీ ఆమె భావాలు ఆమెను కారణజన్మురాలిని చేస్తూనే ఉన్నాయి. జీవితపు కనీసావసరాలకు పరిష్కారం చూపే నాయకులు లేనప్పుడు భారీస్థాయిలో ఆర్థిక అసమానతలు ఏర్పడతాయని నమ్మినవారు ఇవా పెరోన్. శ్రామిక వర్గాల గౌరవాన్ని పొందిన ‘అర్జెంటీనా ఆధ్యాత్మిక నాయకురాలు’గా ఆమె ప్రసిద్ధి చెందారు. మానవీయమైన ఆర్థిక సమానత్వ సాధనకు అంకిత భావంతో పని చేసినందుకే ఆమెకు ఆ పేరు వచ్చి ఉంటుందని నా భావన. ఎందుకంటే అవసరంలో ఉన్న వారి తక్షణ కష్టాలను అర్థం చేసుకోడానికి మనలో ఆధ్యా త్మికమైన బాధ్యత ఉండాలి. అదొక రోజువారీ పనిలానో, వేష ధారణలానో ఉండకూడదు. ఇవా దీనిని అర్థం చేసుకున్నారు. ఆచరణలో పెట్టారు. భవిష్యత్ సంరక్షణ అనే ముసుగులో నాయకులుగా చలా మణీ అవుతున్నవారు.. ఆసరాతో ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు పాటుపడుతున్న నిజమైన నాయకులపై దుష్ప్రచారానికి ఒడిగట్టడం పేదల స్థితిగతులు ఏ మాత్రం మెరుగుపడకుండా అడ్డుకుంటుంది. అర్జెంటీనా అధ్యక్షుడు జువాన్ పెరోన్ సతీమణిగా ఇవా ఆ దేశంలోని ఉన్నత వర్గాలకు ప్రభుత్వ రాయితీలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించారు. ఆమె తన సొంత ‘ఇవా ఫౌండేషన్’తో వాలంటీర్ వ్యవస్థను ఏర్పరిచారు. వ్యాపార వర్గాలు సమకూర్చిన నిధులు, నేషనల్ లాటరీ, ఇతర నిధులలో గణనీయమైన కోతలతో మిగిలిన వనరులతో అర్జెంటీనా అంతటా ఆమె ఈ వాలంటీర్ వ్యవస్థతో వేలాది ఆసుపత్రులు, పాఠశా లలు; అనాథ, వృద్ధాశ్రమాలు, స్వచ్ఛంద సంస్థలను ప్రారంభించి ప్రజాసంక్షేమానికి తోడ్పడ్డారు. ఆ దేశంలో మహిళలకు ఓటు హక్కు చట్టం రూపుదాల్చడం ఇవా కృషి ఫలితమే. 1949లో ఆమె పెరొనిస్టా ఫెమినిస్టు పార్టీని స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే – ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, సహాయ పథకాలపై వినిపిస్తున్న కొన్ని ప్రతికూల అభిప్రాయాలు నా చెవిని సోకాయి. కానీ నిశితంగా పరిశీలించిన మీదట రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల కోసం ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక తోడ్పాటు ఆదర్శవంతమైనదని నేను గ్రహించాను. ఆ సంకల్పబలం ఇవా పెరోన్‌ను తప్పక గుర్తు చేస్తుంది. రెండు ముఖ్యమైన పరిశీలనలతో నేనీ మాట అంటున్నాను. ఒకటి : ఏపీలో ప్రతి ఒక్క పేద వర్గం గత నాలుగేళ్లలో ఆర్థికంగా మెరుగు పడింది. రెండు వ్యవస్థీకృత నిర్మాణం, ప్రక్రియల ద్వారా ఆర్థిక సహాయం పంపిణీ అవుతోంది. అది కూడా చాలా గౌరవప్రదంగా, అతి తక్కువ సమస్యలతో అత్యంత ప్రభావవంతంగా! అర్జెంటీనాలో ఇవా స్మారకస్థలి వద్ద వ్యాస రచయిత్రి మరి అలాంటప్పుడు ఆర్థిక సహాయ పథకాలపై ఎందుకీ సణుగుడంతా?! ఎందుకంటే రాజకీయ ప్రయోజనాల కోసం విషయాన్ని వివాదాస్పదం చేయడానికే! ఎవరైనా నేలకు ఒక చెవిని ఆన్చితే రెండు స్పష్టమైన కథనాలు వినిపిస్తాయి. మొదటి కథనం.. సంతృప్తి చెందిన లబ్ధిదారుల గురించి, వారికి సరళంగా అందుతున్న సహాయం గురించి ఉంటుంది. రెండో కథనం మొదటి కథనానికి విరుద్ధంగా, నిందాపూర్వకంగా ఉంటుంది. హమీలను అమలు చేయడం కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడాన్ని ప్రత్యర్థులు ఆర్థిక వ్యవస్థకు జరుగుతున్న చేటుగా ప్రచారం చేస్తున్నారు. ఇటాంటి ప్రచారాలు ఏదీ కూడా... నిబద్ధత కలిగి, పేదల సంక్షేమానికి కట్టుబడి నిశ్చయంతో ముందుకు సాగుతూ ఉన్న నాయకుడిని ఏమీ చేయలేవు. పూర్వం తమ పాలనలో, తమ విధానాలతో పరిశ్రమలను తెచ్చామనీ, నేటి మౌలిక సదు పాయాలన్నీ ఆనాటి తమ చొరవ వల్లే రూపుదిద్దుకున్నాయనీ, అవన్నీ దీర్ఘకాలికమైన ప్రయోజనాలిచ్చేవనీ చెప్పుకునే నాయ కులు ఇవాళ్టి గురించి పట్టించుకోరా? ఆకలితో ఉన్న పిల్లవాడికి ఆహారం ఇవ్వడానికి తల్లి ఈ రోజు పడుతున్న క్షోభను; వృద్ధులు, అశక్తులకు ఈరోజు అవసరమైన ఆసరాను, విద్యార్థి జీవితానికి విద్య ద్వారా ఈ రోజు ఏర్పరచవలసిన ధీమాను కేవలం భవిష్యత్ అవసరాల పెట్టుబడుల గురించి ఆలోచించే మనస్తత్వాలు గుర్తించలేవు. వర్తమానానికి, భవిష్యత్తుకు సమతుల్యత అవసరం. అదిప్పుడు కచ్చితంగా ఏపీలో ఉంది. ఆర్థికాభివృద్ధి పథంలో జరుగుతున్న సహాయ పథకాలపై అబద్ధాలను ప్రచారం చేస్తూ, మంచిని తిరస్కరిస్తున్న ప్రత్యర్థి రాజ నీతిజ్ఞులు పునరాలోచన చేయాలి. ఇవా పెరోన్ మాదిరిగా ప్రపంచంలో చిరస్మరణీయం అయేందుకు నిబద్ధతతో కూడిన నిజా యితీ, పట్టుదల అవసరం. ఇవా పెరోన్ తన 33వ ఏట మరణించారు. ఆమె జీవిత కాలం బహు స్వల్పమే అయినప్పటికీ ఆమె ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిజమైన నాయకులకు ప్రేరణగా పనిచేస్తూనే ఉంటుంది. -రాణీ రెడ్డి -
ఈ పెట్టుబడి పథకాలతో జాగ్రత్త: ఇన్వెస్టర్లకు కీలక హెచ్చరిక
న్యూఢిల్లీ: కచ్చితమైన రాబడులు ఇస్తామంటూ ముగ్గురు వ్యక్తులు ఆఫర్ చేస్తున్న పెట్టుబడి పథకాల్లో ఇన్వెస్ట్ చేయ వద్దంటూ పెట్టుబడిదారులకు ఎన్ఎస్ఈ హెచ్చరిక జారీ చేసింది. వీణ, అంకితా మిశ్రా, విషాల్ అనే వ్యక్తులు ఈ తరహా పెట్టుబడి పథకాలను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ((2023-24లో రుణ వృద్ధి 10 శాతమే: నోమురా అంచనా) (ఇదీ చదవండి: బేబీ షవర్: ఉపాసన పింక్ డ్రెస్ బ్రాండ్, ధర ఎంతో తెలుసా?) వీరు ఎన్ఎస్ఈ వద్ద సభ్యులుగా లేదా అధికారిక వ్యక్తులుగా నమోదు చేసుకోలేదని ఎన్ఎస్ఈ స్పష్టం చేసింది. ఇన్వెస్టర్లు తమ ట్రేడింగ్ ఖాతా వివరాలు (యూజర్ ఐడీ, పాస్వర్డ్) వీరితో పంచుకోవద్దని కోరింది. స్టాక్ మార్కెట్లో కచ్చితమైన రాబడులు అంటూ వీరు ఆఫర్ చేసే ఎలాంటి పథకం అయినా, ఉత్పత్తిలో, సంస్థలో ఇన్వెస్ట్ చేయవద్దని సూచించింది. ఒకవేళ పెట్టుబడులు పెడితే అది ఇన్వెస్టర్లు స్వీయ రిస్క్ తీసుకున్నట్టుగా పరిగణించాలని కోరింది. ఈ విషయంలో ఎన్ఎస్ఈకి ఎలాంటి బాధ్యత ఉండదని స్పష్టం చేసింది. (శ్యామ్ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ.. తెలుగు రాష్టాల్లో మరింత విస్తరణ) -
సీఎం ఎస్టీ ఎంటర్ ఎంట్రెప్రినేటర్ షిప్ ఇన్నోవేషన్ స్కీం ప్రారంభం
-
ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై మల్లాడి కృష్ణ రావు ప్రశంశలు
-
పిల్లిలంకలో రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించిన ఎంపీ బోస్
-
జగన్ పథకాలు భేష్ అన్న టీడీపీ ఎమ్మెల్యే
-
రాష్ట్ర ప్రభుత్వం దార్శనికతతో వ్యవహరిస్తోంది
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం దార్శనికతతో వ్యవహరిస్తోందని, అందులో భాగంగానే పాఠశాల విద్యను ప్రోత్సహించేందుకు జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, నాడు–నేడు, గోరుముద్ద వంటి పలు పథకాలను తీసుకొచ్చిందని హైకోర్టు తెలిపింది. ఈ పథకాలకు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని చెప్పింది. పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఇచ్చే ప్రతిభా పురస్కారాలను ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేయడం ఏకపక్షం, వివక్షాపూరితం కాదని స్పష్టం చేసింది. ఈ పురస్కారాలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 82ను కొట్టేసేందుకు నిరాకరించింది. జీవోను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను కొట్టేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంగారావు ఇటీవల తీర్పు చెప్పారు. 10వ తరగతి విద్యార్థులకు ఇచ్చే ప్రతిభా పురస్కారాలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకే పరిమితం చేస్తూ 2019లో జారీ చేసిన జీవో 82ను సవాలు చేస్తూ ఏపీ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం, పలువురు విద్యార్థులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ గంగారావు విచారణ జరిపి, తీర్పు వెలువరించారు. పేదల కోసం విధాన నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది ‘ప్రతిభా పురస్కారాల ప్రదానం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం విద్యలో నాణ్యతను ప్రోత్సహించడం, పేద, అణగారిన వర్గాల పిల్లల ఉన్నత విద్యకు అయ్యే ఖర్చును భరించడం. ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే 2017–18 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో చదివిన విద్యార్థులకే ఎక్కువ ప్రతిభా పురస్కారాలు దక్కాయి. ప్రతి ఏటా 50 శాతానికి పైగా అవార్డులు ప్రైవేటు పాఠశాలలే పొందుతున్నాయి. 2019లో ప్రభుత్వం జీవో 82 ద్వారా ఈ పురస్కారాల పథకం పేరును మార్చింది. డాక్టర్ అబ్దుల్ కలాం విద్యా పురస్కారాలుగా నామకరణం చేసింది. ఈ అవార్డులను కేవలం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే పరిమితం చేసింది. సమాజంలో పేద, అణగారిన వర్గాల పిల్లల అభ్యున్నతి కోసం విధాన నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వ పాఠశాలలకే ప్రతిభా పురస్కారాలను పరిమితం చేయాలన్నది అలా తీసుకున్న విధానపరమైన నిర్ణయం. అందులో జోక్యం చేసుకోలేం. తమకు కూడా ఆ అవార్డును వర్తింపజేయాలని కోరే హక్కు పిటిషనర్లకు లేదు. జీవో 82 పిటిషనర్ల హక్కులను ఏ రకంగానూ హరించడంలేదు. ప్రభుత్వ ఉత్తర్వులు ఏ రకంగానూ ఏకపక్షం కాదు. వివక్షాపూరితమూ కాదు. విద్యార్థుల తెలివితేటల ఆధారంగా సహేతుకమైక వర్గీకరణ ఎంత మాత్రం తప్పుకాదు’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. -
జగనన్న విద్యాకానుక కిట్టు.. విద్యార్థులు అదిరేట్టు
రాప్తాడురూరల్: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ విద్యకు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. నాడు–నేడు కార్యక్రమంతో ప్రతి ప్రభుత్వ పాఠశాలకు లక్షలాది రూపాయలు వెచ్చించి మౌలిక వసతులు కల్పించారు. కొత్త భవనాలు, మరుగుదొడ్లు, తరగతి గదులు, పెయింటింగ్, ఫర్నీచర్ ఇలా ఒకసారి పరిశీలిస్తే కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులకు పైసా భారం పడకుండా 9 రకాల వస్తువులతో కూడిన ‘జగనన్న విద్యా కానుక’ కిట్లను 1–10 తరగతుల విద్యార్థులకు అందజేస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్స్, ఆక్స్ఫర్డ్, పిక్టోరియల్ డిక్షనరీలు, బ్యాగు, మూడు జతల యూనిఫాం, షూ, బెల్ట్ కిట్‌లో ఉంటాయి. ఇప్పటికే మూడేళ్లు కిట్లను ఇచ్చారు. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి నాల్గో విడత కిట్లను అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 1–10 తరగతుల విద్యార్థులు 2,22,212 మంది ఉన్నారు. వీరికోసం రూ. 36.66 కోట్లు ఖర్చు చేసి కిట్లు అందజేస్తున్నారు. కార్పొరేట్ విద్యార్థుల్లా.. ప్రభుత్వ విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులు ఎలాగైతే యూనిఫాం, షూ, బెల్ట్ ధరించి వెళతారో మూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అదే తరహాలో వారికి ఏమాత్రం తీసిపోని విధంగా పాఠశాలలకు వెళ్తున్నారు. డ్రెస్ కోడ్‌తో పాటు ప్రతి విద్యార్థీ షూ వేసుకుంటున్నారు. ఈసారి యూ‘న్యూ’ఫాం విద్యార్థుల యూనిఫాం ఈసారి రంగు మారింది. గతంలో బాలికలకు పింక్, బ్లూ కాంబినేషన్, బాలురకు లైట్ స్కై, థిక్ బ్లూ కాంబినేషన్లో యూనిఫాం ఇచ్చేవారు. గతంలో ప్లెయిన్లో ఉండే యూనిఫాం ఈసారి బాలికలకు మాత్రం చెక్స్ కల్గినవి ఇస్తున్నారు. బ్యాగులు గతంలో ముందువైపు స్కై బ్లూ, వెనుక వైపు నేవీబ్లూ కలరు ఉండేది. ఈసారి యూనిఫాం, బ్యాగులు రంగులు మారాయి. కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగించే తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పంపాలంటే ఆర్థిక ఇబ్బందులతో గతంలో వెనుకడుగు వేసేవారు. ఒకవేళ పంపినా ఆ తర్వాత నోట్ పుస్తకాలు, ఇతర సామగ్రి కొనుగోలుకు అరకొర ఖర్చు కూడా భరించలేక చాలామంది డ్రాపౌట్స్‌గా మారేవారు. అయితే, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. విద్యార్థులకు పుస్తకాలే కాదు... జగనన్న విద్యాకానుక రూపంలో రూ. 1,650 విలువైన సామగ్రి ఉచితంగా అందిస్తున్నారు. ఇప్పటికే మూడేళ్లు కిట్లు అందజేసిన ప్రభుత్వం.. నాలుగో సారి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో ఎక్కడా లేదు ప్రభుత్వ పాఠశాలల పిల్లల యూనిఫాం, షూ క్వాలిటీని ఒక ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించి ఇవ్వడం అనేది దేశంలో ఎక్కడా లేదు. కార్పొరేట్ తరహా డ్రెస్‌కోడ్‌తో తమ పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారనే ఆనందం తల్లిదండ్రుల్లో ఉంది. జగనన్న విద్యా కిట్లు చాలా నాణ్యతగా ఉంటున్నాయి. ప్రభుత్వం పిల్లల చదువు విషయంలో రాజీలేకుండా ఖర్చు చేస్తోంది. - ఎం.సాయిరామ్, ఏపీఓ, సమగ్ర శిక్ష -
ఎస్సీ కార్పొరేషన్ పథకాల కోసం దరఖాస్తు చేసుకోండి: మంత్రి మేరుగ
సాక్షి, అమరావతి: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలు చేయనున్న అమృత్ జలధార, యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ పథకాలలో లబ్ది కోసం అర్హులైన ఎస్సీలు దరఖాస్తులు చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున ఒక ప్రకటనలో కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ జలధార పథకం కింద ఎస్సీ రైతుల భూములకు నీటి వసతిని కల్పించేందుకు బ్యాంకులు, ఇతర సంస్థల ద్వారా ఇప్పటికే రుణాలు మంజూరైన రైతులకు బోరు బావులు, స్పింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకోవడానికి రూ.50 వేలు సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. రైతులు రెండున్నర ఎకరాల భూమి, రూ.3 లక్షలకు లోపు వార్షిక ఆదాయం కలిగిన రైతులు అమృత్ జలధార పథకంలో లబ్ది పొందేందుకు అర్హులని తెలిపారు. అలాగే యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ పథకంలో భాగంగా ట్రాక్టర్లు, ట్రాలీలు, కమర్షియల్ వాహనాలు, వేర్ హౌసెస్ తదితర స్వయం ఉపాధి పథకాలకు ఇప్పటికే బ్యాంకులు, ఇతర సంస్థల ద్వారా రుణాలు మంజూరైన ఎస్సీ యువతకు రూ.60 వేలు సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. అమృత్ జలధార పథకం కోసమైతే పట్టాదారు పాసు పుస్తకాలు, రవాణాకు సంబంధించిన యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ పథకం కోసమైతే వ్యాలీడ్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటుగా ఆదాయ, కుల, విద్యా ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డ్, ఆధార్, బ్యాంక్ పాసుపుస్తకాల నకళ్లతో దరఖాస్తులు చేసుకోవాలని నాగార్జున వివరించారు. అర్హులైన వారు తమ దరఖాస్తులను ఆయా జిల్లాలకు చెందిన ఎస్సీ కార్పొరేషన్ ఇ.డి.లకు తమ దరఖాస్తులను సమర్పించాలని కోరారు. ఈ పథకాల మంజూరు లో పరిమితి లేదని అర్హులైన వారందరికీ వీటిని మంజూరు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. చదవండి: ‘ఎన్టీఆర్ హయాంలో రామోజీతో ఇలాంటి ప్రచారమే!’.. ప్రసన్నకుమార్‌రెడ్డి ఫైర్ -
10 నుంచి రాగి జావ
సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ త్వరలో ముగియనుండటంతో కొద్ది రోజులుగా నిలిచిపోయిన పథకాలు, కార్యక్రమాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మంగళవారం తన కార్యాలయ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్చి, ఏప్రిల్ నెలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పథకాలపై చర్చించి అమలు తేదీలను ఖరారు చేశారు. ఎన్నికల కోడ్‌తో సంబంధం లేనందున మార్చి 10వ తేదీ నుంచి మధ్యాహ్న భోజనంలో రాగి జావ అమలును ప్రారంభించాలని నిర్ణయించారు. పిల్లల్లో ఐరన్, కాల్షియం లోపాలను నివారించే లక్ష్యంతో మధ్యాహ్న భోజన పథకం మెనూలో రాగి జావను చేర్చిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ కారణంగా కొద్దిగా ఆలస్యమైన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను ఏప్రిల్ 6 నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం ట్రయల్ రన్ ఇప్పటికే మొదలై విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మార్చి 14వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణ అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచి్చంది. బీఏసీ సమావేశంలో చర్చించి సమావేశాల షెడ్యూలును ఖరారు చేయనున్నారు. మార్చి, ఏప్రిల్‌లో షెడ్యూల్ ఇలా.. మార్చి 18న సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు. జగనన్న విద్యాదీవెన లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటీ పద్ధతిలో నగదు జమ. మార్చి 22న ఉగాది సందర్భంగా ఉత్తమ సేవలందించిన వలంటీర్ల పేర్ల ప్రకటన. ఏప్రిల్ 10న అవార్డులు, రివార్డులు ప్రదానం. మార్చి 23న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం. మార్చి 25 నుంచి వైఎస్సార్ ఆసరా. ఏప్రిల్ 5 వరకూ కొనసాగనున్న కార్యక్రమం మార్చి 31న జగనన్న వసతి దీవెన. ఏప్రిల్ 6న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో అమలు ఏప్రిల్ 18న ఈబీసీ నేస్తం. ఏప్రిల్ 10న ఉత్తమ సేవలందించిన వలంటీర్లకు సన్మానం -
దేశంలోని నిరుద్యోగులకు మోదీ రూ.6,000 భృతి.. నిజమెంత?
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి బేరోజ్గారి భత్తా యోజన కింద దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్రం ప్రతి నెల రూ.6,000 భృతిగా ఇస్తోందని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన సందేశాలు వాట్సాప్‌లో చక్కర్లుకొడుతున్నాయి. కొందరైతే అప్లై చేసుకోవడానికి ఫేక్ లింకులు కూడా పెడుతున్నారు. సైబర్ నేరగాళ్లు కూడా దీన్నే అదునుగా తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. నిరుద్యోగ భృతి ఇప్పిస్తామని ఆశజూపి అమాయకుల నుంచి డబ్బు కూడా వసూలు చేస్తున్నారు. వెబ్సైట్ లింకులు పంపి బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుని వాటిని ఖాళీ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా ఈ వ్యవహారంపై ఫ్యాక్ట్ చెక్ చేసింది. అసలు ఈ ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని ఇప్పటివరకు తీసుకురాలేదని చెప్పింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిరోద్యగ భృతి సందేశాలు మొత్తం ఫేక్ అని తేల్చింది. వీటిని ఎవరూ నమ్మొద్దని, మోసపోవద్దని సూచించింది. एक वायरल #Whatsapp मैसेज में दावा किया जा रहा है कि प्रधानमंत्री बेरोजगारी भत्ता योजना के तहत सरकार बेरोजगार युवाओं को हर महीने ₹6,000 का भत्ता दे रही है। #PIBFactCheck ▶️यह मैसेज फर्जी है। ▶️भारत सरकार ऐसी कोई योजना नहीं चला रही। ▶️कृपया ऐसे मैसेज फॉरवर्ड ना करें। pic.twitter.com/w0mfOyEAMI — PIB Fact Check (@PIBFactCheck) February 20, 2023 చదవండి: ఒక్క రూపాయి చిల్లర ఇవ్వని కండక్టర్.. కోర్టుకెళ్లిన ప్రయాణికుడు.. ఎంత పరిహారం వచ్చిందంటే? -
సహకారోద్యమం బలోపేతం!
న్యూఢిల్లీ: దేశంలో సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాబోయే ఐదేళ్లలో గ్రామ పంచాయతీల్లో 2 లక్షల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు(పీఏసీలు), పాడి–మత్స్య సహకార సంఘాలు ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా దాదాపు 99,000 పీఏసీలు ఉండగా, 63,000 మాత్రమే చురుగ్గా ఉన్నాయి. 1.6 లక్షల పంచాయతీల్లో పీఏసీలు లేవు. 2 లక్షల గ్రామాల్లో పాడి–మత్స్య సహకార సంఘాల్లేవు. అక్కడ వాటిని, తీర గ్రామాల్లో మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేస్తారు. ఐదేళ్లలో 2 లక్షల బహుళ ప్రయోజనకర పీఏసీలు, పాడి–మత్స్య సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. దీంతో రైతుల ఆదాయం పెరగడంతోపాటు గ్రామాల్లో నూతన ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఉత్తర సరిహద్దుల్లో ‘భవ్య గ్రామాలు’ దేశ ఉత్తర సరిహద్దుల్లో ఉన్న గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం వైబ్రాంట్ విలేజెస్ ప్రోగ్రామ్(వీవీపీ) పేరిట నూతన పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2022–23 నుంచి 2025–26 దాకా మూడేళ్ల వ్యవధిలో రూ.4,800 కోట్లతో వీవీపీ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిక పథకం. ఇందులో రూ.2,200 కోట్లను రోడ్ల నిర్మాణం కోసం ఖర్చు చేస్తారు. ఈ పథకంతో సరిహద్దు గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. వీవీపీ స్కీమ్‌తో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రం పాలిత ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలియజేసింది. షింకున్ లా సొరంగం కేంద్ర పాలిత ప్రాంతమైన లద్ధాఖ్లోని సరిహద్దు ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించడానికి 4.1 కిలోమీటర్ల పొడవైన షింకున్ లా సొరంగం నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. నిమూ–పదామ్–దార్చా రోడ్డు లింక్‌లో రూ.1,681 కోట్లతో ఈ సొరంగం నిర్మిస్తారు. 2025 డిసెంబర్ నాటికల్లా నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో లద్ధాఖ్‌కు సులువుగా చేరుకోవడానికి ఈ టన్నెల్ ఉపయోగపడుతుందని వివరించారు. దేశ భద్రతకు సైతం ఈ ప్రాజెక్టు చాలా కీలకమని చెప్పారు. శ్రీనగర్–కార్గిల్–లేహ్ టన్నెల్ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామన్నారు. -
కేసీఆర్ సర్కార్ భారీ ప్రణాళిక.. జాగా ఉంటే నిధులు.. లేదంటే స్థలం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేదలకు ఇంటి వసతి కల్పించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. సొంత జాగా ఉన్నవారితో పాటు లేని పేదలకు కూడా గృహ వసతి కల్పించే అంశంపై కసరత్తు ప్రారంభించింది. సొంత జాగా ఉంటే ఇళ్ల నిర్మాణానికి నిధులు, భూమి లేని వారికి నిర్ధారిత పరిమాణంలో స్థలాల కేటాయింపు దిశగా ఆలోచన చేస్తోంది. దీనిపై త్వరలోనే ముఖ్యమంత్రి స్థాయిలో సమావేశమై విధివిధానాలను ఖరారు చేయనున్నారు. సొంత జాగా ఉన్న వారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించటం ద్వారా వారే ఇళ్లను నిర్మించుకునే పథకానికి గతేడాది బడ్జెట్లో శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే విధివిధానాలు ఖరారు చేయకపోవటంతో ఆ బడ్జెట్ కాలంలో నిధులు విడుదల చేయలేదు. తాజా బడ్జెట్లో 4 లక్షల ఇళ్లను మళ్లీ ప్రతిపాదించారు. ఎమ్మెల్యేల ఒత్తిడి నేపథ్యంలో.. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం పేదలు నయా పైసా చెల్లించాల్సిన అవసరం లేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇచ్చే పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పథకం రూపురేఖలు గొప్పగా ఉన్నప్పటికీ, ముందుకు సాగని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారు లక్షల్లో ఉండగా, ఈ ఇళ్లు తక్కువ సంఖ్యలో ఉండటంతో ఒకరికి ఇస్తే వంద మంది గొడవకు దిగే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి ఆశించిన ప్రయోజనం లభించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలామంది ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు. పేదల ఇళ్ల విషయంలో వెంటనే దిద్దుబాటు అవసరమంటూ ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు కేటీఆర్, హరీశ్‌లకు వివరించారు. దీంతో దీనిపై ప్రభుత్వం కస రత్తు ప్రారంభించింది. ఇందుకోసం అసైన్డ్ భూములను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. సొంత స్థలాలు లేని వారి కోసం.. సొంత స్థలాలు ఉన్నవారు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించి బడ్జెట్లోనూ రూ.12 వేల కోట్ల నిధులు కేటాయించింది. తద్వారా నాలుగు లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది. అయితే కేవలం సొంత జాగా ఉన్నవారికే ఇస్తే జాగా లేని వారి నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయనే వాదన తాజాగా తెరపైకి వచ్చింది. దీంతో సొంత స్థలాలు లేనివారి వివరాలు ప్రభుత్వం సేకరిస్తోంది. అలా స్థలాలు ఇవ్వాల్సి వస్తే ఎంతమంది లబ్ధిదారులుంటారు? ఒక్కొక్కరికి 60 గజాల నుంచి 80 గజాల వరకు అందించాలంటే ఎంత భూమి అవసరమవుతుంది? సరిపడా ప్రభుత్వ భూమి ఉందా? లేని పక్షంలో ఎంతభూమిని సమీకరించాల్సి వస్తుంది? వినియోగంలో లేని అస్సైన్డ్ భూములను వాడుకునే వీలుందా?.. తదితర అంశాలపై వివరాలను వచ్చే సోమవారం నాటికి అందజేయాల్సిందిగా తాజాగా అధికారులకు ఆదేశాలు అందినట్టు తెలిసింది. ఈ వివరాలు అందిన తరువాత తుది నిర్ణయం తీసుకుని భారీ స్థాయిలో ఒకే దఫాలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
PMSYM: నెలకు రూ.3 వేల పెన్షన్, దరఖాస్తు చేసుకోవడం ఎలా?
సాక్షి, ముంబై: దేశంలోని అసంఘటిత కార్మికుల కోసం ప్రధానమంత్రి శ్రమ యోగి మన్ధన్ యోజన నెలవారీ పెన్షన్ అందించనుంది. వృద్ధాప్యంలో ఉన్న కార్మికులకు ఈ పథకం కింద నెలకు రూ.3,000 పెన్షన్ ఈ పథకం అందిస్తుంది. ముఖ్యంగా రూ.15,000 లోపు నెలవారీ ఆదాయం ఉన్న టైలర్లు, చెప్పులు కుట్టేవాళ్లు, రిక్షా పుల్లర్లు , ఇంటి కార్మికులు వంటి అసంఘటిత రంగంలోని కార్మికులకు 60 ఏళ్ల దాకా ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనుంది. అర్హతలు ♦ దరఖాస్తుదారుడి వయస్సు 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి ♦ తప్పనిసరిగా ఆధార్ కార్డ్ , బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి. ♦ అలాగే ఆదాయపు పన్ను చెల్లించే వారు EPFO, NPS, NSIC సబ్స్క్రైబర్లు ఈ పథకం ప్రయోజనాలను పొందలేరు. పీఎం శ్రమ యోగి మన్ధన్ యోజన వృద్ధాప్యంలో ఉన్న కార్మికులకు పెన్షన్ ప్రయోజనాలను అందించడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి మంధన్ యోజనను అమలు చేస్తోంది. ఈ పథకం కింద పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి కార్మికుడికి 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెలా రూ.3,000 పెన్షన్ వస్తుంది. అసంఘటిత రంగంలో పనిచేసే వారు, నెలవారీ ఆదాయం రూ. 15,000 కంటే తక్కువ ఉన్నవారు ఈ పథకాని అర్హులు. ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి మీ వయస్సు 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంత పెట్టుబడి పెట్టాలి? కార్మికుల సహకారం ఆధారంగా ఈ పెన్షన్ లభిస్తుంది. ఇందుకు కోసం ప్రతి నెలా రూ.55 నుండి రూ. 200 వరకు డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌లో 50 శాతం లబ్ధిదారుడు, 50 శాతం ప్రభుత్వం జమ చేస్తుంది. ఒక వేళ పింఛనుదారుడు మరణిస్తే అతని భార్య లేదా భర్త పెన్షన్ మొత్తాన్ని పొందుతారు. ఈ సందర్భంలో ప్రతి పెన్షనర్ సంవత్సరానికి రూ.36,000 పెన్షన్ పొందుతారు. దరఖాస్తు చేసుకోవడం ఎలా? ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో రెండు రకాలుగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మన్ధన్ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫాం నింపిన తరువాత రిజిస్టర్డ్‌మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటిపీని ఎంటర్ చేస్తే చాలు. ఇక ఆఫ్‌లైన్ ద్వారా అయితే కామన్ సర్వీస్ సెంటర్లో వివరాలను అందించి దరఖాస్తు చేసుకోవచ్చు. Get yourself registered on PMSYM by following these steps.@mygovindia @DGLabourWelfare #pmsym #registration #onlineregistration pic.twitter.com/P23XngQwOw — Ministry of Labour (@LabourMinistry) February 7, 2023 -
అన్నదాతలకు వరాలు: భారీ రుణాలు, కొత్త స్కీములు, కీలక ప్రకటనలు
న్యూఢిల్లీ: 2023-24 వార్షిక బడ్జెట్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయానికి భారీ ప్రోత్సాహాకాలు ప్రకటించారు. అమృత కాలంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌గా అభివర్ణించిన ఈ బడ్జెట్లో దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోన్న వ్యవసాయ రంగానికి, రైతులకు కొన్ని శుభవార్తలు చెప్పారు ఆర్థికమంత్రి. అలాగే భారత దేశాన్ని చిరుధాన్యాల (మిల్లెట్ క్యాపిటల్) కేంద్రంగా మారుస్తామని ప్రకటించడం గమనార్హం. ముఖ్యంగా రైతులకు అందించే రుణ లక్ష్యాన్ని గత ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే 11 శాతానికి పైగా పెంచారు. వ్యవసాయం కోసం డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు, రుణ సదుపాయం, మార్కెటింగ్ సదుపాయం వ్యవసాయ స్టార్ట్ప్స్కు చేయూత, ప్రత్యేక నిధి ఏర్పాటు లాంటి చర్యలతోపాటు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. అలాగే చిరుధాన్యాల ప్రోత్సాహానికి శ్రీఅన్న పథకం, మత్స్య శాఖలోని వివిధ వర్గాల ప్రోత్సాహాకానికి పెట్టుబడులు, ఇతర కేటాయింపులను కూడా ప్రకటించారు. రూ.18 లక్షల కోట్లనుంచి రూ.20 లక్షల కోట్లకు పెంపు వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ.20 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. గత ఏడాది వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.18 లక్షల కోట్లుగా ఉండగా ప్రస్తుతం 11 శాతం మేర పెంచినట్లు ఆమె ప్రకటించారు. వచ్చే ఆర్థిక ఏడాదికి సంబంధించి డైరీ, పశు పోషణ, మత్స్య సాగు వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. అలాగే సేంద్రీయ వ్యవసాయానికి ఊతమిచ్చేలా కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. అగ్రికల్చర్ స్టార్టప్‌లకు బడ్జెట్లో వరాలు ప్రకటించారు ప్రస్తుతం రైతులు వాడుతోన్న రసాయన, ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు రాష్ట్రాలకు కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటించింది. పీఎం ప్రణామ్ కింద పది వేల బయో ఇన్పుట్ రీసోర్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. అలాగే కనీసం కోటి మంది సేంద్రీయ సాగు చేసేలా ప్రోత్సహిస్తారు. ♦రూ.6వేల కోట్లతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంట్లో భాగంగా MSME పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తారు. మత్స్య సాగు రైతులను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో కొత్త సబ్ స్కీమ్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి. మత్స్యకారులు, చేపలు అమ్ముకునేవారితో పాటు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి, మార్కెట్ విస్తరణకోసం ఈ నిధులను వినియోగించనున్నారు. ♦ యువ పారిశ్రామికేత్తల ద్వారా అగ్రి స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అగ్రికల్చర్ యాక్సిలేటర్ ఫండ్ కింద అగ్రి స్టార్టప్‌లకు ప్రోత్సహాన్ని అందిస్తారు. రైతులకు మేలు చేసే ఏ సృజనాత్మకతనైనా ప్రోత్సహిస్తారు. కొత్త టెక్నాలజీ అన్నదాతలకు అందుబాటులోకి తెస్తారు. ♦ అన్ని అగ్రీ సొసైటీల వివరాలను డిజిటలైజ్ చేస్తారు. దీని వల్ల రైతుల వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉంటాయి. భవిష్యత్తులో రైతులకు చేసే ఎలాంటి ప్రయోజనమైనా దీని ద్వారా జరగనుంది. ♦ రైతులు తమ ఉత్పత్తుల నిల్వ కోసం మరిన్ని గిడ్డంగులు నిర్మించేందుకు చర్యలు ♦ పత్తి సాగు మెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు. పత్తి కోసం ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయం ♦ చిరుధాన్యాల పంటలకు సహకార కోసం శ్రీ అన్న పథకం. రాగులు, జొన్నలు, సజ్జలు తదితర పంటలకు ప్రోత్సాహం ♦ మిలెట్స్ ప్రోగ్రామ్ ద్వారా ప్రజలకు పోషకాహారం అందేలా చేయడమే కాదు.. ఆహార భద్రతకూ భరోసా ఇస్తున్నామని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి. హైదరాబాద్‌లోని మిలెట్ ఇన్స్టిట్యూట్ను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ప్రభుత్వం మద్దతు ఇస్తుందన్నారు. త్వరలోనే భారత్ తృణ ధాన్యాలకు గ్లోబల్ హబ్‌గా మారుతుందన్నారు నిర్మలా సీతారామన్. ♦ హార్టికల్చర్ రంగాన్ని ప్రోత్సహించేందుకు కీలక ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి సుమారు రూ.2,200 కోట్లతో ఆత్మ నిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. ♦ కర్ణాటకలోని కరువు ప్రాంతాలకు రూ.5,300 కోట్ల సాయాన్ని ప్రకటించారు. దీని వల్ల ఆ ప్రాంతంలోని రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది -
కేంద్ర బడ్జెట్ 2023: గుడ్ న్యూస్.. మహిళల కోసం మరిన్ని పథకాలు
ప్రపంచ ఆర్థిక దృక్పథం నిరాశాజనకంగా ఉన్నప్పటికీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2023-24ను సమర్పించారు. ఆనంతరం ఆమె ప్రసంగిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలో ఉందని, ఉజ్వల భవిష్యత్తు వైపు పయనిస్తోందన్నారు. 2014 నుంచి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పౌరులందరికీ మెరుగైన జీవన ప్రమాణాలతో పాటు గౌరవప్రదమైన జీవితాన్ని అందించాయన్నారు. మహిళల కోసం ప్రత్యేకం పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం వల్ల సమగ్ర అభివృద్ధిపై శ్రద్ద పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ బడ్జెట్లో రైతులు, యువత, మహిళలు ,వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. మహిళా సాధికారత దిశగా కృషి చేస్తున్నామన్న నిర్మలమ్మ వారి కోసం మరిన్ని పథకాలు ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పారు. స్వయం సహాయక బృందాల ద్వారా గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతను పెంచడం బడ్జెట్లోని ముఖ్యమైన వాటిలో ఒకటి అని చెప్పారు. యువతకు ఉపాధి లభించేలా ఉద్యోగాల వృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇక వ్యవసాయంలో ఆధునీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనే కొత్త పథకాన్ని బడ్జెట్లో కేంద్రం ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ ఫిక్సిడ్ డిపాజిట్ పథకంలో ఖాతాదారులు చేసే డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్టంగా రూ.2 లక్షలు వరకు ఈ పథకంలో డిపాజిట్ చేయవచ్చు. పాక్షిక మినహాయింపులకు అవకాశం ఉంటుంది. -
‘ఉపాధి’కి గడ్డు రోజులు?
సాక్షి, హైదరాబాద్: త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివిధ రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలున్న చోట్ల ఈ పథకం సరిగా అమలు కావడం లేదని, చేపట్టిన పనులు సరిగా లేవని, నిధులు పక్కదారిపట్టడమో లేక వినియోగం సరిగా లేకపోవడమో జరుగుతోందన్న అభిప్రాయంతో కేంద్రం ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాల్లో పటిష్ట అమలు ద్వారా నిర్దేశిత లక్ష్యాల సాధన, కచ్చితమైన ప్రయోజనం కలిగేలా చేయాలన్న ఆలోచనతో ఆయా రాష్ట్రాల్లో పరిశీలనకు ఓ టాస్క్‌ఫోర్స్‌ను కేంద్రం నియమించింది. తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం పూర్తి చేసిన టాస్క్‌ఫోర్స్ ప్రధానమంత్రి కార్యాలయానికి నివేదిక సమర్పించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ పథకంలో భారీగా మార్పులు జరగొచ్చునని, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు చేసే బడ్జెట్ కేటాయింపులు కూడా తగ్గొచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ పథకానికి గడ్డురోజులు తప్పవనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి నిధులు తగ్గిపోతాయా? కేంద్రం రాష్ట్రానికి రెండేళ్ల క్రితం చేసిన కేటాయింపులతో పోల్చితే 2023–24 బడ్జెట్లో అధిక కేటాయింపులు ఉండక పోవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉపాధి పనులకు హాజరయ్యే కూలీలకు.. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ ద్వారా లైవ్ లొకేషన్లో హాజరు నమోదును కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తప్పనిసరి చేసింది. దీంతో పాటు కూలీలు, వారి కుటుంబాల జాబ్ కార్డులను వారి వారి ఆధార్ నంబర్లతో అథెంటికేషన్ చేయాలని ఆదేశించింది. లేనిపక్షంలో చేసిన పనికి కూలీ మొత్తం బ్యాంక్ ఖాతా ల్లో పడే అవకాశం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎన్ఎంఎంఎస్ యాప్‌లో కూలీల హాజరు నమోదు క్షేత్రస్థాయిలో ఇబ్బందులెదురవుతున్నాయి. కూలీల జాబ్ కార్డులతో ఆధార్ అథెంటికేషన్ పూర్తికాలేదు. దీంతో నిధులు తగ్గే అవకాశం ఉందంటున్నారు. క్రమంగా తగ్గిపోతున్న కేటాయింపులు.. దేశవ్యాప్తంగా 2022 ఏప్రిల్–డిసెంబర్ల మధ్య 5.56 కోట్ల కుటుంబాలు ఈ పథకం కింద పనులు కోరాయి. అంతకుముందు ఏడాది అవే నెలలతో పోల్చితే కోటి కుటుంబాల మేర తగ్గుదల నమోదైంది. ఈ నేపథ్యంలోనే 2023–24 బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయనేది చర్చనీయాంశమైంది. 2019–20లో రూ.71,687 కోట్లు కేటాయించారు. కానీ కరోనా మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో 2020–21లో రూ.1.11 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించారు. కానీ 2021–22కు వచ్చేసరికి రూ.98 వేల కోట్లకు, 2022–23లో రూ.73 వేల కోట్లకు దిగజారింది. ఈ నిధులు సరిపోకపోవడంతో సప్లిమెంటరీ గ్రాంట్ల కోసం గత డిసెంబర్లో కేంద్రానికి విజ్ఞప్తులు వెళ్లాయి. ఈ పరిస్థితుల్లోనే 2023–24 బడ్జెట్ పెరుగుతుందా లేదా అన్న సందిగ్థత నెలకొంది. తగ్గించే అవకాశమే ఉంది.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ పథకం కింద చేసే ఖర్చును కేంద్రం తగ్గించింది. అందువల్ల వచ్చే ఆర్థిక ఏడాదిలో ఈ పథకానికి చావా రేవా? అన్న సమస్య ఉత్పన్నం కావొచ్చు. ఎన్ఎంఎంఎస్ యాప్ అమల్లోకి తీసుకురావడం, జాబ్‌కార్డులతో ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి వంటి వాటితో కూలీలు ఈ పథకం నుంచి దూరమవుతున్నారు. ఈ ఏడాది ఉపాధి హామీ పథకం కింద వ్యయం తక్కువైనందున, దానిని సాకుగా చూపి బడ్జెట్ కేటాయింపులు తగ్గించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ఈ పథకం కింద 2021– 22లో రూ.4 వేల కోట్లు ఖర్చు కాగా, 2022– 23లో రూ.2,087 కోట్ల వ్యయమే చేశారు. ఈ నేపథ్యంలో వివిధ పనుల కోసం ఇవ్వాల్సిన రూ.1,100 కోటను కూడా నిలిపేసింది. వచ్చే బడ్జెట్లో ఈ పథకానికి నిధులు ఎలా ఉంటాయోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. – చక్రధర్ బుద్ధా, డైరెక్టర్, లిబ్టెక్ ఇండియా -
ప్రైవేటు బ్యాంకర్లతో కేంద్ర పథకాలపై సమీక్ష
న్యూఢిల్లీ: ఆర్థిక సేవలు అందుబాటులోకి తీసుకుని రావడానికి సంబంధించిన పథకాలు, సామాజిక భద్రతకు ఉద్దేశించిన కార్యక్రమాల్లో ప్రైవేటు బ్యాంకింగ్ సాధించిన పురోగతిని ఆర్థికశాఖ మంగళవారం సమీక్షించింది. ఈ మేరకు ప్రైవేటు బ్యాంకర్లతో సీనియర్ ఆర్థికశాఖ అధికారులు ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్థికశాఖ సేవల కార్యదర్శి (డీఎఫ్ఎస్) డాక్టర్ వివేక్ జోషి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ప్రైవేటు రంగ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధాన్‌మంత్రి జన్‌ధన్ యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, పీఎం సేవానిధి వంటి పథకాల పురోగతి సమీక్షలో ప్రధాన అంశంగా ఉందని డీఎఫ్ఎస్ ఒక ట్వీట్లో పేర్కొంది. ఇదే అంశంపై గత వారం జోషి ప్రభుత్వ రంగ బ్యాంకర్లతో సమీక్ష జరిపిన సంగతి తెలిసిందే. చదవండి: అప్పట్లో రియల్ ఎస్టేట్ కింగ్.. ఇప్పుడేమో లక్షల కోట్ల ఆస్తిని కోల్పోయి -
స్థలాలకు అద్దె వల.. రూ.3 లక్షలు పెడితే 6 లక్షలు.. 'రియల్' దగా..
‘‘మా ఫామ్‌ల్యాండ్‌లో రూ. 3 లక్షలుపెట్టి రెండు గుంటలు (242 గజాలు) కొంటే ప్రతి నెలా రూ. 15 వేల అద్దె చొప్పున 20 నెలల తర్వాత రూ. 3 లక్షల అసలు సహా మొత్తం రూ. 6 లక్షలు చెల్లిస్తాం. 4 గుంటల స్థలానికి రూ. 6 లక్షలు చెల్లిస్తే ప్రతి నెలా రూ.30 వేల చొప్పున 20 నెలల తర్వాత రూ. 12 లక్షలు ఇస్తాం. 8 గుంటలకు రూ. 12 లక్షలు కడితే నెలకు రూ. 24 వేల చొప్పున 20 నెలల్లో రూ.24 లక్షలు రిటర్న్ చేస్తాం’’ హైదరాబాద్‌కు 140 కి.మీ. దూరంలోని నారాయణ్‌ఖేడ్‌లో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఫామ్‌ల్యాండ్ వెంచర్ పేరిట వినియోగదారులను ఆకర్షించేందుకు జోరుగా సాగిస్తున్న ప్రచారం ఇది. ప్రీలాంచ్ పేరిట గత కొన్నేళ్లుగా హైదరాబాద్ సహా ప్రధాన పట్టణాల్లో కొందరు బిల్డర్లు వేలాది మంది మధ్యతరగతి ప్రజల సొంతింటి కలలను కల్లలు చేసి సొమ్ము చేసుకుంటుంటే తాజాగా మరికొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఖాళీ స్థలాలను వెంచర్ల పేరు చెప్పి బై బ్యాక్, రెంటల్ ఇన్‌కం, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వంటి కొత్త పేర్లతో సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారు. ఏడాదిలో అద్దె సహా కట్టిన సొమ్మును వాపసు చేస్తామంటూ నమ్మించి ఫామ్ ప్లాట్లు, ఖాళీ స్థలాలను అక్రమ మార్గంలో విక్రయిస్తున్నారు. మార్కెట్ రేటు ప్రకారం గజానికి రూ. 5 వేలు కూడా పలకని ప్రాంతంలో గజం రూ. 10 వేలకుపైనే విక్రయించి ముందే డబ్బు వసూలు చేసుకుంటున్నారు. డీటీసీపీ, హెచ్ఎండీఏ నుంచి ఎలాంటి అనుమతులు, రెరాలో నమోదు చేసుకోకుండానే వెంచర్లలో ప్లాట్లను విక్రయిస్తున్నారు. నమ్మకస్తులే మధ్యవర్తులుగా.. గ్రామాలు, శివారు ప్రాంతాలలో టీచర్లు, ఎల్ఐసీ ఏజెంట్లు, రిటైర్డ్ ఉద్యోగులను రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా నియమించుకుంటున్నారు. గ్రాఫిక్స్ హంగులను అద్ది రంగురంగుల బ్రోచర్లను ముద్రించి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. ప్రతి నెలా స్టార్ హోటళ్లలో మధ్యవర్తులతో సమావేశం నిర్వహించి, ఎక్కువ విక్రయాలు చేసిన ఏజెంట్లకు విదేశీ టూర్లు, కార్లు, బంగారం వంటివి బహుమతులుగా అందజేస్తున్నారు. అసలుకు రెట్టింపు ఆశ చూపి... చట్ట నిబంధనల ప్రకారం ఫామ్‌ల్యాండ్ వెంచర్లను రియల్ ఎస్టేట్ సంస్థలు కనీసం అర ఎకరం, ఆపై మొత్తాల్లోనే విక్రయించాలి. అయితే అంత విస్తీర్ణంలోని భూముల ధరలు రూ. పదుల లక్షలు, ఆపైనే ఉంటాయి కాబట్టి సామాన్యులు అంత డబ్బు పెట్టి కొనే పరిస్థితి ఉండదనే ఉద్దేశంతో ఆయా సంస్థలు ఫామ్‌ల్యాండ్ వెంచర్లను గజాలు లేదా గుంటల లెక్కన విక్రయిస్తున్నాయి. నిరీ్ణత కాలం తర్వాత అసలుకు రెట్టింపు డబ్బు ఇస్తామని ఆశ చూపుతూ వినియోగదారులతో అగ్రిమెంట్లు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల మాత్రం అధికారులకు లంచాలు ఇచ్చి ఆ స్థలాలను వ్యవసాయ భూములుగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అయితే ఒకవేళ అగ్రిమెంట్ గడువు తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ పతనమై సంస్థ డబ్బు తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోయినా లేదా కంపెనీ బోర్డు తిప్పేసినా కొనుగోలుదారులే మోసపోతున్నారు. తమకు కొసరు ఇవ్వకపోయినా పరవాలేదు అసలు సొమ్ము ఇస్తే చాలంటూ సంస్థల చుట్టూ తిరుగుతున్నారు. కానీ దీనిపై చాలా మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సైతం వెనకాడుతున్నారు. అలా చేస్తే తమ పేర్లు బయటపడటంతోపాటు ఆయా సంస్థలు కోర్టులోనే తేల్చుకోమంటాయేమోనని భయపడుతున్నారు. ఈ పట్టణాల్లో కుప్పలుతెప్పలుగా... సదాశివపేట, నారాయణ్‌ఖేడ్, నందివనపర్తి, చేవెళ్ల, జనగాం, బచ్చన్నపేట, చౌటుప్పల్, యాదాద్రి వంటి హైదరాబాద్ నుంచి 100 కి.మీ. దూరంలో ఉన్న ప్రాంతాల్లో ఈ తరహా ప్రాజెక్టులు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. రహదారులు, విద్యుత్, మురుగునీటి వ్యవస్థ వంటి కనీస మౌలిక వసతులు కూడా సరిగా లేని ప్రాంతాలలో వందలాది ఎకరాలలో ప్రాజెక్ట్‌లు చేస్తున్నామని మాయమాటలు చెబుతున్నాయి. కరోనా కాలంలో పుట్టుకొచ్చిన ఏవీ ఇన్ఫ్రాకాన్, జయ గ్రూప్, ఫార్చ్యూన్ 99 తదితర సంస్థలు ఈ మోసాలకు పాల్పడుతున్నాయి. బై బ్యాక్ పేరుతో మోసపోయా... జనగాం జిల్లాలోని పెంబర్తిలో 11 ఎకరాలలో ఓ సంస్థ వేసిన వెంచర్లో బై బ్యాక్ స్కీమ్ కింద రూ. 20 లక్షలకు 183.33 గజాల స్థలం కొన్నా. 12 నెలల తర్వాత లాభం రూ. 10 లక్షలు, మొదట్లో నేను కట్టిన రూ. 20 లక్షలు కలిపి మొత్తం రూ. 30 లక్షలు తిరిగి చెల్లిస్తామని సంస్థ నాతో అగ్రిమెంట్ చేసుకుంది. కానీ ఏడాది దాటినా సొమ్ము చెల్లించడం లేదు. – ఓ బాధితుడి ఆవేదన. స్కీమ్‌లలో తీసుకొని మోసపోవద్దు... ప్రీలాంచ్, బై బ్యాక్, రెంటల్ గ్యారంటీ అంటూ రకరకాల పేర్లతో సామాన్యులను కొందరు వ్యాపారులు ఆకర్షిస్తున్నారు. టీఎస్–రెరా, నిర్మాణ అనుమతులు లేని ఏ ప్రాజెక్ట్‌లలోనూ ప్రజలు స్థలాలు కొనుగోలు చేయకూడదు. రెరా రిజి్రస్టేషన్ లేని మధ్యవర్తులను నమ్మి మోసపోకూడదు. –విద్యాధర్, సెక్రటరీ, టీఎస్–రెరా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి... రియల్టీ మార్కెట్‌ను స్కీమ్‌ల పేరుతో కొందరు బిల్డర్లు చెడగొడుతున్నారు. స్థలం కొనుక్కోవాలనుకొనే సామాన్యుల ఆశలను ఆసరా చేసుకొని మోసం చేస్తున్నారు. స్కీమ్‌ల పేరుతో విక్రయించే స్థలాలను రిజిస్ట్రేషన్ చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – సునీల్ చంద్రారెడ్డి, అధ్యక్షుడు, నరెడ్కో తెలంగాణ చదవండి: బీఆర్ఎస్.. బందిపోట్ల రాక్షసుల సమితి -
అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలకు సెబీ గుడ్ న్యూస్!
న్యూఢిల్లీ: పన్ను ఆదా ప్రయోజనంతో కూడిన ఈఎల్ఎస్ఎస్ (equity-linked savings scheme )పథకాలకు సంబంధించి సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రతి మ్యూచువల్ ఫండ్స్ సంస్థ ఒక్కటే ఈఎల్ఎస్ఎస్ పథకాన్ని నిర్వహించేందుకు సెబీ అనుమతించేది. ఒకటే సంస్థ ఒకటికి మించిన ఈఎల్ఎస్ఎస్ స్కీమ్‌లను నిర్వహించకూడదు. కానీ, ఇక మీదట యాక్టివ్ ఈఎల్ఎస్ఎస్ పథకాలను ఆఫర్ చేసే ప్రతి సంస్థ ప్యాసివ్ విభాగంలో (ఇండెక్స్‌ల పరిధిలోని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేవి) ఈఎల్ఎస్ఎస్ పథకాన్ని తీసుకొచ్చేందుకు అనుమతించింది. ఈ మేరకు అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలకు సమాచారం ఇచ్చింది. కానీ, ఈ విషయంలో పలు షరతులు విధించింది. ఇప్పటికే యాక్టివ్ ఈఎల్ఎస్ఎస్ పథకం నిర్వహించే అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ/మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థ) ప్యాసివ్ స్కీమ్‌ను కూడా తీసుకురావాలని భావిస్తే.. యాక్టివ్ పథకంలోకి ఇక మీదట పెట్టుబడులను తీసుకోకూడదు. -
Karnataka: మహిళలపై కాంగ్రెస్ వరాల జల్లు..సెపరేట్‌గా మేనిఫెస్టో!
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మహిళలపై వరాలజల్లు కురిపించింది. ఏకంగా మహిళల కోసం ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో పెడతానంటూ పలు హామీలు ఇచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక వాద్రా ఒక కార్యక్రమంలో తాము గనుక అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతి నెల రూ. 2000 ఇస్తామని ప్రకటించారు. గృహలక్ష్మీ యోజన కింద ఎలాంటి షరతులు లేకుండా అందరికీ ఉపకరించే బేసిక్ ఆదాయం కింద ఏడాదికి రూ. 24,000 నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ని అందిస్తామని హామి ఇచ్చిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అంతేగాదు ఈ గృహలక్ష్మీ యోజన అనేది కాంగ్రెస్ పార్టీ అధికమైన ఎల్పీజీ గ్యాస్ ధరల తోపాటు తమ రోజు వారీ ఖర్చుల నిమిత్తం మహిళలకు ఉపకరించేలా చేసిన ప్రయత్నమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ప్రతి మహిళ సాధికారిత తోపాటు తన కాళ్లపై తాను నిలబడి తన పిల్లలను చూసుకునే సామర్థ్యాంతో ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటుంది. అందుకనే ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్య్రాన్ని అందివ్వాలని అనుకుంటున్నట్లు తెలిపింది. ఈ పథకం ద్వారా 1.5 కోట్ల మందికి పైగా మహిళలు లబ్ధి పొందుతారని పార్టీ తెలిపింది. అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోని కూడా విడుదల చేస్తామని చెప్పింది. ఈ మేరకు ప్రియాంక గాంధీ " నేను నాయకురాలిని(నా నాయకి) " అనే కార్యక్రమంలో ప్రసంగిస్తూ... కర్ణాటకలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బీజేపీ పాలిత ప్రాంతాల్లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందంటూ విమర్శించారు. పైగా మంత్రులు ఉద్యోగాల్లో సుమారు 40% కమిషన్ తీసుకుంటున్నారని అన్నారు. అంతేగాదు కర్ణాటకలో సుమారు రూ. 1.5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారంటూ పెద్ద ఎత్తున్న ఆరోపణలు చేశారు. అలాగే పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ స్కామ్ గురించి మాట్లాడుతూ..కర్ణాటకలో లంచాలు ఇవ్వకుండా ఏది జరగదన్నారు. పోలీసుల పోస్టులనే అమ్ముకునే సిగ్గుమాలిన మోసాలు జరుగుతున్నాయంటూ విరుచుకుపడ్డారు. అయినా మీరు అధికారుల నుంచి ఆశించేది ఇదేనా? అని ప్రజలను ప్రశ్నించారు. ముందుగా పిల్లలను, బాలికలను ఉద్యోగాలు వచ్చేలా చదివించండి అని చెప్పారు. అలాగే బెంగుళూరులో జరగాల్సిన సుమారు 8వేల కోట్ల అభివృద్ధి పనులు గురించి ఆలోచించండి అని ప్రియాంక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. (చదవండి: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. 9 రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్!) -
ఇతర రంగాలకూ పీఎల్ఐ స్కీమ్
న్యూఢిల్లీ: ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం ఎంతో ప్రయోజనకరమని మెజారిటీ వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో పీఎల్ఐ కింద ఇతర రంగాలకూ ప్రోత్సాహకాలు లభిస్తాయన్న ఆశాభావం వారి నుంచి వ్యక్తమైంది. డిమాండ్ బలోపేతానికి వీలుగా బడ్జెట్లో ప్రకటించే చర్యలు అన్ని రంగాల్లో వృద్ధికి ఊతంగా నిలుస్తాయన్న అభిప్రాయం కంపెనీల ప్రతినిధుల్లో వ్యక్తమైంది. మూలధన వ్యయాలపైనా బడ్జెట్ దృష్టి సారిస్తుందని అంచనా వేస్తున్నారు. డెలాయిట్ సర్వే వివిధ రంగాల్లోని పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను తెలుసుకుంది. మూలధన వ్యయాలు, మౌలిక సదుపాయాలకు రుణాలను అందించడం వృద్ధికి కీలకమన్న అభిప్రాయం వ్యక్తమైంది. భారత ప్రభుత్వ బాండ్ల ద్వారా నిధులు సమీకరించాలని సర్వేలో 60 శాతం మంది సూచించారు. రానున్న బడ్జెట్ నుంచి పరిశ్రమ ఏమి ఆశిస్తుందో తెలుసుకునే ప్రయత్నం సర్వేలో భాగంగా డెలాయిట్ చేసింది. 10 రంగాల నుంచి 181 మంది ప్రతినిధులు సర్వేలో పాల్గొని అభిప్రాయాలు తెలియజేశారు. పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు ►70 శాతానికి పైగా పరిశ్రమల ప్రతినిధులు పీఎల్ఐ పథకం తమ రంగం వృద్ధికి మేలు చేస్తుందని చెప్పారు. ► 60% మంది పీఎల్ఐ ప్రోత్సాహకాలను మరిన్ని రంగాలకు ప్రకటిస్తారని ఆశిస్తున్నారు. ►పన్నుల్లో మార్పులు తెస్తే అది పరిశ్రమల వృద్ధికి ప్రయోజనం కలిగిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. రానున్న బడ్జెట్లో ఎక్కువ మంది బలంగా దీన్ని కోరుకుంటున్నారు. ► ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు పెట్టుబడుల వృద్ధికి దోహదం చేస్తాయని భావిస్తున్నారు. ► ఎంఎస్ఎంఈలను జీవీసీ కిందకు తీసుకొస్తే పరిశ్రమల వృద్ధి స్థిరత్వానికి సాయపడుతుందని, వాణిజ్య లావాదేవీలు పెరుగుతాయని చెప్పారు. ► 45 శాతం మంది పన్ను బాధ్యతలను ప్రభుత్వం తగ్గిస్తుందని అంచనా వేస్తుంటే, 44 శాతం మంది టీడీఎస్‌కు సంబంధించి స్పష్టత కోరుకుంటున్నారు. ► మూలధన లాభాల పన్ను నిర్మాణాన్ని మరింత సులభతరంగా మార్చాలని పరిశ్రమ కోరుతోంది. ► కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 14 రంగాలకు పీఎల్ఐ కింద రూ. 2 లక్షల కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించింది. తోలు, సైకిల్, టీకాల తయారీ, టెలికం ఉత్పత్తులకు పీఎల్ఐ విస్తరణ ప్రతిపాదన పరిశీలనలో ఉంది. చదవండి: స్టార్టప్‌లో పెట్టుబడులు.. వ్యాపారంలోనూ దూసుకుపోతున్న బాలీవుడ్ స్టార్లు! -
ఈ కేంద్ర పథకం గురించి మీకు తెలుసా.. ఇలా చేస్తే రూ.15 లక్షలు వస్తాయ్!
రైతుల పరిస్థితిని మెరుగుపరిచేందుకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలతో పాటు అనేక విధానాలను అనుసరిస్తున్నాయి. మోదీ సర్కార్ ఇప్పటికే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, ఉచిత రేషన్ వంటివి అందిస్తూ రైతులకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఈ తరహాలోనే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ (FPOల) పేరుతో మరో పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా రైతులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అనగా రైతులకు ప్రధానమంత్రి ఎఫ్పిఓ పథకం కింద రూ. 15 లక్షల వరకు సహాయం అందిస్తారు. తద్వారా వారు వ్యవసాయ పరిశ్రమలో ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అయితే రైతులు వ్యవసాయం, వ్యాపారం చేసేందుకు సహకరించే ఈ పథకం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు కూడా. దీని కింద రైతులకు అందించే డబ్బులను వ్యవసాయ పనిముట్లు, ఎరువులు సహా ఇతరాత్రా సాగు సంబంధ వ్యాపార అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అయితే ఇందుకోసం, 11 మంది రైతులు కలిసి ఒక సంస్థని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం రూ.15 లక్షలు వరకు గ్రాంట్ ఆఫ్ మ్యాచింగ్ ఈక్విటీ ఇస్తుంది. అందుకోసం ప్రభుత్వ వెబ్సైట్ ఈనాం (ENAM) లో నమోదు కావాల్సి ఉంటుంది. చదవండి: Double Toll Tax Rate: వాహనదారులకు భారీ ఊరట?..ఫాస్టాగ్‌పై కోర్టులో పిటిషన్..అదే జరిగితే.. -
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలర్ట్.. ఈ సర్వీసులకు చార్జీలు చెల్లించాలి!
మీరు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ప్రయోజనాలను పొందుతున్నారా? అయితే ఈ అలర్ట్ మీకోసమే. ఈ స్కీంలో ఇప్పటికే లబ్ధిదారులు ఈకేవైసీ (eKYC) పూర్తి చేయాలని ప్రభుత్వం సూచనలు చేసింది. ఆపైనే లబ్దిదారులకు డబ్బులు కూడా అందుతాయని తెలిపింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం లబ్దిదారులు చేయనున్న ఈకేవైసీకి ఇకపై చార్జ్(రుసుము) చెల్లించాల్సి ఉంటుంది. రుసుము తప్పనిసరి డీబీటీ అగ్రికల్చర్ బీహార్ వెబ్సైట్ ప్రకారం చూస్తే.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రయోజనం పొందే రైతులు అందరూ ఇకేవైసీ పూర్తి చేసుకోవాలి. లేదంటే స్కీమ్ ప్రయోజనాలు పొందలేరు. లబ్దిదారులు నేరుగా ఆన్లైన్లో ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు లేదా మీ దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఇది పూర్తి చేసుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఆన్లైన్లో ఈకేవైసీ ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్లి ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని భావిస్తే.. చార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ విధానంలో కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకున్నదానికి రుసుము రూ. 15గా ప్రభుత్వం నిర్ణయించింది. లేదంటే పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా ఓటీపీ విధానంలో ఇకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. దీనికైతే ఎలాంటి చార్జీలు ఉండవు. ఆన్లైన్లో పీఎం కిసాన్ ఈకేవైసీ ►ముందుగా పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్లండి ►అందులో ఉన్న Pm Kisan Ekyc పై క్లిక్ చేయండి ►అక్కడ మీ ఆధార్ నంబరుతో పాటు క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి ►మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయండి. ►అక్కడ ఉన్న సమాచారం ఆధార్‌తో సరిపోలితే మీ పీఎం కిసాన్ ఈకేవైసీ అప్డేట్ పూర్తవుతుంది. చదవండి: రైల్వే శాఖ ఆదాయానికి గండి.. ఆ ప్యాసింజర్ల సంఖ్య తగ్గుతోంది, కారణం అదేనా! -
క్లిష్ట సమయంలోనూ వీడని ఔదార్యం: ఉక్రెయిన్ చేయూత
రష్యా దాడులతో సతమతమవుతున్న ఉక్రెయిన్ ఆఫ్రికన్ దేశాలు ఎదుర్కొంటున్న ఆహార కొరతకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్ స్కీ తీవ్ర కరువును ఎదుర్కొంటున్న దేశాలకు సుమారు 150 మిలియన్ల డాలర్లు ఖరీదు చేసే ఆహార ధాన్యాలను ఎగుమతి చేసేందుకు గ్రెయిన్ ఫ్రమ్ ఉక్రెయిన్ పథకాన్ని ప్రారంభించారు. ఉక్రెయిన్ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నివశించే మిలియన్ల మంది ప్రజలు విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నప్పటికీ ఈ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 1923-33 శీతాకాలంలో మిలియన్ల మంది ఉక్రెయిన్లను పొట్టనబెట్టుకున్న రష్యా యుగం నాటి కరువు హోలోడోమోర్ కోసం జరిగిన ఉక్రెయిన్ వార్షిక స్మారక దినం సందర్భంగా ఈ ఫథకాన్ని ప్రారంభించారు. తమతో యుద్ధానికి దిగి ఆఫ్రికాలో ఆహార తీవ్ర ఆహార కొరతకు కారణమైందని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయంటూ రష్యా రకరకాల కథనాలను వెలువరిస్తుంది. దీంతో వాటన్నింటిని తిప్పికొట్టేలా తాజాగా ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది ఉక్రెయిన్. ఈ మేరకు ఇథియోఫియా, సూడాన్, సౌత్‌సూడాన్, సోమాలియా, యెమెన్‌లతో సహా దేశాలకు ధాన్యాన్ని ఎగుమతి చేయడానికి ప్రభుత్వం యూరోపియన్ యూనియన్‌తో సహా 20కి పైగా దేశాల నుంచి సుమారు రూ.150 మిలయన్ డాలర్లను సేకరించిందని జెలెన్స్కీ చెప్పారు. కరువు ముప్పును ఎదుర్కొంటున్న దేశాలకు ఉక్రెనియన్ ఓడరేవుల నుంచి కనీసం 60 నౌకలను పంపాలని ప్లాన్ చేస్తున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. ప్రస్తుతం ఉక్రెయిన్ రాజధానిలో లక్షలాది మంది విద్యుత్ కొరతను ఎదుర్కొటున్నారని చెప్పారు. అంతేగాక ఉక్రెయిన్‌లోని 27 ప్రాంతాలలో 14 ప్రాంతాల్లో విద్యుత్ వినియోగంపై ఆంక్షలు ఉన్నాయని తెలిపారు. అదీగాక మాస్కో దళాలు ఖేర్సన్ నగరం నుంచి వైదొలగినప్పటికీ షెల్లింగ్ దాడులు కొనసాగిస్తూనే ఉందని, ఈ దాడిలో సుమారు 32 మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఏదీఏమైనా రష్యా ఉక్రెయిన్‌పై పదేపదే ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగా యూఎన్ ఒప్పందం ప్రకారం ఉక్రెయిన్ నల్ల సముద్రపు ఓడరేవుల నుంచి ఎగుమతి చేసిన ఆహారం అత్యంత తీవ్ర స్థాయిలో ఆహార కొరతను ఎదుర్కొంటున్న దేశాలకు చేరడం లేదంటూ రష్యా తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో జెలెన్స్కీ ఈ పథకాన్ని ప్రకటించారు. (చదవండి: ఉక్రెయిన్‌కి సునాక్ మద్దతు హామీ) -
అవ్వాతాతలకు అగ్రసర్ పథకం
-
భారతీయులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన సునాక్!
UK-India Young Professionals Scheme: ఇండోనేషియాలో బాలి వేదికగా జరుగుతున్న జీ20 తొలిరోజు సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాసేపు ఇరువురు నేతలు ముచ్చంటించారు. అదీగాక సునాక్ ప్రధాని అయ్యాక వారివురు భేటీ అవ్వడం ఇదే తొలిసారి. సమావేశం అనంతరం యూకే ప్రధాని భారత్‌కి ఒక పెద్ద వీసా స్కీం ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు యూకేలో ఉండి, పనిచేసేలా భారత యువ నిపుణలు కోసం ప్రతి ఏడాది సుమారు 3 వేల వీసాలకు అనుమతిస్తున్నట్లు బ్రిటన్ కార్యాలయం పేర్కొంది. గతేడాది అంగీకరించిన యూకే భారత్ స్వేచ్ఛ వలసల ఒప్పంద(మొబిలిటీ అండ్ మైగ్రేషన్ అగ్రిమెంట్) భాగస్వామ్యన్ని గురించి నొక్కి చెబుతూ ఇటువంటి పథకం కింద ప్రయోజనం పొందిన మొదటి దేశం భారత్ అని బ్రిటన్ ప్రభుత్వ పేర్కొంది. ఈ మేరకు ధృవీకరించిన యూకే యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ కింద 18 నుంచి 30 ఏళ్ల వయసు కలిగి, డిగ్రీ చదివిన భారతీయ పౌరులు రెండేళ్ల వరకు యూకేలో ఉండి, పనిచేయడం కోసం 3 వేల వీసాలకు అనుమతిచ్చింది బ్రిటన్. ఈ పథకం ద్వారా భారత్ బ్రిటన్ల ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక వ్యవస్థలు బలోపేతం కావడం తోపాటు ఇండో పసిఫిక్ ప్రాంతంలో బలమైన సంబంధాలు ఏర్పడటానికి ఉపకరిస్తుందని యూకే ప్రధాని డౌన్ స్ట్రీట్ కార్యాలయం పేర్కొంది. అలాగే ఇండో ఫసిఫిక్ ప్రాంతాల్లో దాదాపు అన్ని దేశాల కంటే యూకే భారత్‌తోనే ఎక్కువ సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలిపింది. అంతేగాక బ్రిటన్‌లో అంతర్జాతీయ విద్యార్థుల్లో దాదాపు నాలుగింట ఒక వంతు భారత్‌కి చెందిన వారు ఉన్నారని అందువల్ల యూకేలోని భారత్ పెట్టుబడితో యూకే అంతటా వారికి సుమారు 9,500 ఉద్యోగాలకు మద్దతు ఇస్తోందని చెప్పింది. ప్రస్తుతం యూకే భారత్‌తో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నట్లు బ్రిటన్ వెల్లడించింది. ఒకవేళ ఈ ఒప్పందం ఖరారు అయితే యూరోపియన్ దేశంతో జరుపుకున్న తొలి ఒప్పందం అవుతుందని పేర్కొంది. అదిగాక ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న దాదాపు 24 బిలయిన్ పౌండ్ల వాణిజ్య సంబంధాలను ఈ ఒప్పందం మరింత బలపరుస్తుందని చెప్పింది. అభివృద్ధి చెందుతున్న దేశం అయిన భారత్ ఈ ఆర్థిక అవకాశాలను వినియోగించుకునేలా బ్రిటన్‌తో వాణిజ్య ఒప్పందాలను కొనసాగించాలని బ్రిటన్ ఆకాంక్షిస్తోంది. భారత్‌తో మొబిటిటీ(స్వేచ్ఛ) భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేలా ఇమ్మిగ్రేషన్ నేరస్తులను తొలగించే సామర్థ్యాన్ని కూడా పటిష్టం చేసుకుంటున్నట్లు బ్రిటీష్ ప్రభుత్వం పేర్కొంది. The British government said that India is the first visa-national country to benefit from such a scheme, highlighting the strength of the UK-India Migration and Mobility Partnership agreed last year.@RishiSunak #UK #India #Visa https://t.co/VWRRWoRvoh pic.twitter.com/oDN1B6jULH — Khaleej Times (@khaleejtimes) November 16, 2022 (చదవండి: జీ20: బైడెన్‌తో మీట్.. సునాక్‌తో ముచ్చట్లు.. ఆయనతో షేక్‌హ్యాండ్)