సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీ సామాజిక వర్గానికి అదేస్థాయిలో నవరత్నాల పథకాల ద్వారా గరిష్టంగా లబ్ధి చేకూరుతోంది. వైఎస్సార్ రైతు భరోసా, పెన్షన్ కానుక, జగనన్న అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన.. ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా అత్యధిక లబ్దిదారులు బీసీలే కావడం ఇందుకు నిదర్శనం. బీసీలంటే దేశానికి బ్యాక్ బోన్ లాంటివారని బీసీ సదస్సులో చెప్పిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్యరూపంలోకి తీసుకొచ్చి నాలుగేళ్లుగా సింహభాగం ప్రాధాన్యం కల్పించారు.
ఇటు అభివృద్ధి, అటు సంక్షేమంలో సామాజిక న్యాయాన్ని చేకూర్చారు. రాజ్యాధికారంలో బలహీన వర్గాలకు పెద్ద పీట వేశారు. జనాభా ప్రాతిపదికన బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆయా వర్గాలకు నామినేటెడ్ పదవులను ఇచ్చారు. గత సర్కారు హయాంలో బీసీలకు బ్యాంకు రుణాలే దిక్కు కాగా అది కూడా సర్కారు సబ్సిడీ ఇస్తేనే మంజూరయ్యేవి. ఇప్పుడు వివక్షకు తావు లేకుండా నవరత్నాల ద్వారా బీసీలకు అత్యధిక ప్రయోజనం దక్కుతోంది.
అర్హతే ప్రామాణికంగా..
కులమతాలు, రాజకీయాలకు అతీతంగా నవరత్నాల లబ్దిదారులను ప్రభుత్వం గుర్తించింది. రాజకీయ జోక్యం, సిఫారసులకు తావులేకుండా అర్హతే ప్రామాణికంగా వైఎస్సార్ నవశకం ద్వారా నవరత్నాల పథకాలకు అర్హులను వలంటీర్ల ద్వారా గుర్తించారు. వివక్షకు తావులేకుండా అర్హులకు నేరుగా నగదు బదిలీ చేశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా అత్యధికంగా బీసీలకు రూ.1.56 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూర్చింది.
నేరుగా నగదు బదిలీ ద్వారా రూ.1.06 లక్షల కోట్లు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయగా నగదేతర బదిలీ పథకాల ద్వారా రూ.49,404 కోట్ల మేర లబ్ధి కలిగింది. ఇళ్ల స్థలాల లబ్దిదారుల్లో అత్యధికంగా 16.70 లక్షల మంది బీసీలే ఉన్నారు. వైఎస్సార్ రైతు భరోసా కింద 25,09,251 మంది బీసీ రైతులకు రూ.13,891.63 కోట్లు జమ చేశారు. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 29,56,048 బీసీలకు రూ.35,720.70 కోట్ల మేర ఆరి్థక ప్రయోజనాన్ని చేకూర్చారు.
ప్రతిసారి పెద్ద మనసు చాటారు
రాజ్యాధికారం, సంక్షేమంలో సింహభాగం బీసీలకే కేటాయించడం సరికొత్త చరిత్ర. బీసీల విషయంలో సీఎం జగన్ ప్రతిసారి పెద్ద మనసు చాటుకుంటున్నారు. అన్ని పదవుల్లో బీసీలకు పెద్ద పీట వేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌లో ప్రైవేట్ బిల్లు పెట్టిన ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీనే.
బీసీ కుల గణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. కేంద్రం సానుకూలంగా లేకపోవడంతో ఏపీలో కుల జన గణనపై అధ్యయనానికి సీఎం జగన్ కమిటీని నియమించారు. బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు నడిపిస్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. – కేశన శంకరరావు, ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు
పిల్లల చదువులు అమ్మ ఒడి పుణ్యమే
బోయ సామాజిక వర్గానికి చెందిన నేను, నా భ ర్త వినయ్ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. మా కుమార్తె చేతన ఐదో తరగతి చదువుతోంది. అమ్మ ఒడితో రూ.15,000 బ్యాంకు ఖాతాకు జమ అవుతున్నాయి. మాలాంటి పేదలు పిల్లలను చదివించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతోంది. అమ్మ ఒడి లేకుంటే పిల్లల చదువులు మాకు తలకు మించిన భారం అయ్యేది. ఇప్పుడు సంతోషంగా బడికి పోతున్నారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు జగనన్న లేఔట్‌లో సుమారు రూ.6 లక్షల విలువైన ఇంటి స్థలాన్ని అందించారు. ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇస్తోంది. – నాగమణి, మారంపల్లి కాలనీ, కళ్యాణదుర్గం మున్సిపాలిటీ, అనంతపురం జిల్లా
మత్స్యకార కుటుంబానికి ఎంతో మేలు
గత ప్రభుత్వం మా మత్స్యకారులను చులకనగా చూసింది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాలాంటి పేద కుటుంబాలకు జగనన్న ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోంది. చేపల వేట నిషేధం సమయంలో రెండు మూడు రోజుల్లోనే డబ్బులు అందించి ఆదుకుంటున్నారు. నాలుగేళ్లుగా రూ.10 వేలు చొప్పున మత్స్యకార భరోసా కింద అందిస్తున్నారు.
చేపల వ్యాపారం నిర్వహించే మా అత్త వైఎస్సార్ చేయూత పథకం ద్వారా వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంది. ఆసరా పథకంతో మా ఇద్దరికీ పొదుపు సంఘాల రుణాన్ని కూడా తీర్చేశారు. మా ఇద్దరి పిల్లల్లో ఒక పాప డాక్టర్ చదువుతోందంటే జగనన్నే కారణం. చిన్న పాప ఇంటర్ చదువుతోంది. గతంలో అమ్మఒడి, ఇప్పుడు విద్యాదీవెన ఇస్తున్నారు.– మేరుగు మణి, కొమ్మాది, విశాఖపట్టణం
Comments
Please login to add a commentAdd a comment