
ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత ఆదా చేయాలని చూస్తారు. అయితే డబ్బు సురక్షితంగా ఉంటాలంటే?, మంచి రాబడి పొందాలంటే?.. తప్పకుండా పోస్టాఫీస్ పథకాలలో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. ఇందులో ఒకటి 'పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్'. ఈ స్కీమ్ ద్వారా ఎంత వడ్డీ వస్తుంది. ఇతర ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంలో మీరు నెలకు 5000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే.. రూ. 8 లక్షల రిటర్న్స్ పొందవచ్చు. ఎలా అంటే.. మీరు నెలకు రూ. 5000 ఇన్వెస్ట్ చేస్తే.. ఏడాదికి రూ. 60వేలు అవుతుంది. మీకు ఈ స్కీములో 6.7 శాతం వడ్డీ లభిస్తుంది. ఇలా ఐదేళ్లు ఇన్వెస్ట్ చేస్తుంటే.. మీ మొత్తం రూ. 3లక్షలు అవుతుంది. దీనికి వడ్డీ కింద రూ. 56,830 లభిస్తాయి.
మీరు ఈ స్కీమ్ కింద రూ. 5000.. పదేళ్లు ఇన్వెస్ట్ చేస్తే మీ పెట్టుబడి రూ.6 లక్షలు అవుతుంది. ఈ డిపాజిట్‌పై 6.7 శాతం వడ్డీ మొత్తం రూ. 2,54,272 అవుతుంది. దీని ప్రకారం 10 సంవత్సరాల కాలంలో మీ మొత్తం డిపాజిట్ చేసిన మొత్తం రూ. 8,54,272 అవుతుంది. ఇలా పదేళ్లలో రూ. 5000 ఇన్వెస్ట్ చేస్తూ రూ. 8లక్షల కంటే ఎక్కువ పొందువచ్చు.
ఇదీ చదవండి: ఇన్వెస్టర్లు ధనవంతులవుతారు.. ఇదే మంచి సమయం: డొనాల్డ్ ట్రంప్
గత సంవత్సరం 2023లో.. ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌పై వడ్డీ రేట్లను పెంచింది. వడ్డీ పెరగడం వల్ల పెట్టుబడిదారులకు లభించే రిటర్న్స్ కూడా ఆశాజనకంగా ఉంటాయి. పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరిస్తుంది, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ వడ్డీ చివరి సవరణ 29 సెప్టెంబర్ 2023న జరిగింది.
50 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు
మీరు సమీపంలోని ఏదైనా పోస్టాఫీసుకు వెళ్లి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఇందులో పెట్టుబడిని రూ.100 నుంచి ప్రారంభించవచ్చు. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ మెచ్యూరిటీ వ్యవధి ఐదు సంవత్సరాలు, కానీ మీరు ఈ వ్యవధి పూర్తయ్యేలోపు ఖాతాను మూసివేయాలనుకుంటే.. క్లోజ్ చేసుకోవచ్చు. ఇందులో లోన్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ అకౌంట్ ఒక ఏడాది పాటు యాక్టివ్‌గా ఉన్న తరువాత.. మీరు డిపాజిట్ చేసిన మొత్తంలో 50 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు. దీనిపై వడ్డీ రేటు 2 శాతం కంటే ఎక్కువ.