
పీఎమ్‌ఎస్సెస్‌వై (ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన) కిందకు వచ్చే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని 2020లో ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ స్కీమ్ ద్వారా ఎలాంటి పూచీకత్తు లేకుండా చేపలపెంపకందారులకు ఏడు శాతం వడ్డీతో రెండు లక్షల రూపాయాల వరకు రుణాన్ని అందిస్తున్నారు. చేపలు, రొయ్యల పెంపకంపై ఉచిత శిక్షణనూ అందిస్తున్నారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన మహిళలకు 60 శాతం వరకు గ్రాంట్ అందుతోంది. ఈ పథకం తీర్రప్రాంతంలోని చిన్న, సన్నకారు రైతులకు లాభాల పంట పండిస్తోంది.
చేపల ఎగుమతిలో భారతదేశాన్ని ముందంజలో నడిపిస్తోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఫిషరీస్, మత్స్యకారుల సంక్షేమశాఖ సహాయసంచాలకుల కార్యాలయంలో మరిన్ని వివరాలను పొదవచ్చు. జిల్లా మత్స్యశాఖ లేదా ఏదైనా హేచరీ నుంచి ఉచితంగా చేప సీడ్‌ను పొందవచ్చు. ఈ పథకానికి అధికారిక వెబ్‌సైట్ https://pmmsy.dof.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్ హోమ్ పేజీలో స్కీమ్ లింక్‌పై క్లిక్ చేయాలి. నింపాల్సిన ఫామ్ కనిపిస్తుంది.
అందులోని వివరాలను పూరించాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా, భూమి వివరాలనూ పొందుపరచాలి. డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సహా సూచించిన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. తర్వాత సబ్‌మిట్ పై క్లిక్ చేసి.. ఫామ్‌ను సమర్పించాలి. దరఖాస్తుదారు అర్హతలు, సంబంధిత పత్రాలను ఆమోదించిన తరువాత పథకం ప్రయోజనాలను పొందవచ్చు. తీర్రప్రాంతం లేని చోటా మత్స్య సంపదను అభివృద్ధి చేసేందుకు ఈ పథకం రుణాన్ని అందిస్తోంది. కమర్షియల్ ఆక్వా కల్చర్ సిస్టమ్ కింద ఈ ప్రాజెక్ట్ విలువ రూ. 20 లక్షలు అయితే రూ. 5 లక్షల వరకు సొంత పెట్టుబడి ఉండాలి. అప్పుడు రూ. 15 లక్షల రుణాన్ని పొందవచ్చు. ఇందులో సబ్సిడీ ఉంటుంది.
(చదవండి: Earth Hour: "'స్విచ్ ఆఫ్": ఆ ఒక్క గంగ ప్రకృతితో కనెక్ట్ అవుదామా..!)
Comments
Please login to add a commentAdd a comment