నచ్చినట్లే ఉంటున్నారా..? | Habits In Life That You Should Not Change For Others | Sakshi
Sakshi News home page

నచ్చినట్లే ఉంటున్నారా..?

Published Sat, Mar 22 2025 11:25 AM | Last Updated on Sat, Mar 22 2025 11:44 AM

Habits In Life That You Should Not Change For Others

ఇతర పరిస్థితులు ఎలా ఉన్నా సరే, జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే, డబ్బు, ఆస్తులు, పరపతి ఉన్నా కొందరు సంతోషంగా ఉండలేరు. ఎందుకంటే ఇతరుల మాటలు, సలహాల వల్ల చాలా మంది తమను తాము  మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా తమ సెల్ఫ్‌ ఐటెంటిటీని, తద్వారా సంతోషాన్ని కూడా కోల్పోతున్నారు. జీవితంలో ఇతరుల కోసం మార్చుకోకూడని అలవాట్లు ఏంటో తెలుసుకుందాం.  

మీ గుర్తింపును కాపాడుకోండి
ఇలా ప్రవర్తించవద్దు, అలా మాట్లాడవద్దు, ఇలా ఆలోచించవద్దు అని ఇతరుల మీకు సలహాలు ఇస్తుంటే వాటిని అంతగా పట్టించుకోకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సొంత నిర్ణయాలు, ఆలోచనలు ఉంటాయి. వాటిని అనుసరించే ముందుకు సాగాలి. ఇతరుల్ని ఫాలో అయితే మీ సొంత గుర్తింపును కోల్పోయే ప్రమాదముంది. ఇతరుల కోసం ప్రతి రోజూ మిమ్మల్ని మీరు మార్చుకుంటూపోతే.. చివరికి 
మిగిలేది ఏముండదు. ప్రపంచానికి భిన్నంగా ఉండటం, మీ గుర్తింపును కాపాడుకోవడం ఏ మాత్రం తప్పు కాదని గుర్తుంచుకోండి.

వ్యక్తిగత వ్యవహారాలలో తలదూర్చనివ్వద్దు
ప్రతి వ్యక్తికి పర్సనల్‌ స్పేస్‌ ఉంటుంది. కొన్ని సీక్రెట్స్‌ దాచడంతో ΄ాటు ఒంటరిగా గడిపే హక్కు ఉంది. అయితే, ఎవరైనా మిమ్మల్ని పదే పదే నియంత్రించడానికి ప్రయత్నిస్తుంటే వారికి దూరంగా ఉండటమే మేలు.  వేరే వాళ్లు మీరు చేసే ప్రతి పనిలో జోక్యం చేసుకుంటుంటే అది ఏ మాత్రం సరైనది కాదని గమనించండి. మీ పర్సనల్‌ స్పేస్‌ని గౌరవించుకోండి. మీ వ్యక్తిగత జీవితంలో దూరవద్దని స్పష్టంగా చెప్పేయండి.

పీస్‌ ఆఫ్‌ మైండ్
ఎవరైనా సరే, మీతో సంబంధం ఉన్నా లేకపోయినా మీ మానసిక ప్రశాంతతను చెడగొట్టే వారికి దూరంగా ఉండటమే మంచిది. కొందరు ఏం కాదు అంతా కరెక్ట్‌గా ఉందని మీ మనసును చికాకు పెట్టవచ్చు. కానీ, మీరే సంతోషం లేకుంటే దాని ఉపయోగం ఏంటి? అందుకే ప్రతికూల పరిస్థితులు, వ్యక్తుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మీ ఆనందానికి ప్రాముఖ్యత ఇవ్వండి.

నైతిక విలువలపై రాజీ వద్దు
కొందరు లేదా కొన్ని పరిస్థితులు మిమ్మల్ని మోసగాళ్లుగా, అబద్ధాల కోరుగా మార్చటానికి ప్రయత్నించవచ్చు. కొందరు మీ చేత తప్పు పనులు చేయించడానికి బలవంతం పెడతారు. అయితే, ఇక్కడ నైతిక విలువలు పాటించడం ముఖ్యమని గుర్తించుకోండి. ఎవరో చె΄్పారని, వాళ్లు బలవంతం చేశారని చెడ్డ పనులు చేస్తే భవిష్యత్తులో కష్టాలే పలకరిస్తాయి. ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా నిలబడినప్పటికీ.. ఏది కరెక్టో దానివైపే నిల
బడండి.

నో చెప్పడం నేర్చుకోండి
ఇతరులు ఎల్లప్పుడూ వారి మాటలే వినాలని, వారి కోసమే సమయం కేటాయించాలని భావిస్తారు. అంతేకాకుండా వారి కోరికల ప్రకారం ఇతరుల జీవించాలని కోరుకుంటారు. అయితే, వేరే వాళ్లు చెప్పే పనులన్నింటికీ యస్‌ చెప్పుకుంటూ ΄ోతే మీకు మిగిలేది ఏమీ ఉండదు. సంతోషం, ఆనందం అన్నీ దూరమై΄ోతాయి. అందుకే ఇతరులకు నో చెప్పడం నేర్చుకోండి. ఇతరులకు నో చెప్పడానికి ఎందుకు సంకోచం. మీ పరిమితుల్ని మీరే నిర్ణయించుకోండి.

కలల్ని, ఆశయాల్ని వదులుకోకండి
చాలా మంది మనం ఏదైనా నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటే సూటి ΄ోటి మాటలతో వెనక్కు లాగే ప్రయత్నం చేస్తారు. ఈ వయసులో నువ్వు ఏం సాధిస్తావు. ఇందులో నష్టం తప్ప లాభం ఉండదు, వేరే పని చూసుకుంటే మంచిదని లేని΄ోని సలహాలు ఇస్తుంటారు. అయితే, ఒకటి మాత్రం ఆలోచించండి. మీ జీవితాన్ని ఇతరుల ప్రకారం జీవించాలనుకోకూడదు. మీకు ఏదైనా సాధించాలని ఉంటే ఆ దిశగా అడుగులు వేయండి. మీ కలలకు విలువ ఇవ్వండి. లేదంటే తర్వాత పశ్చాత్తాపపడతారు.

మీకు మీరే ముఖ్యం
మన అవసరాల్ని తీర్చుకుని మిగతావారిని పట్టించుకుంటే చాలా మంది స్వార్థుపరులనే ట్యాగ్‌ వేసేస్తారు. మీకు మీరు ప్రాధాన్యత ఇచ్చుకోవడం స్వార్థం కాదని గుర్తుంచుకోండి. అది మీపై మీరు చూపించుకునే స్వీయ ప్రేమ. 

మీ ఆనందాన్ని, అవసరాల్ని ఇతరుల కోసం మార్చుకుంటే మిమ్మల్ని మీరు కోల్పోయినట్టే. ఇతరులకు అవసరమైనప్పుడు మాత్రమే సాయం చేయండి. ఎవరో ఏదో అనుకుంటారని ఇతరుల కోసం మీ అవసరాల్ని త్యాగం చేస్తే చాలా కోల్పోతారు. 

(చదవండి: పంటపొలాల్లో డ్రోన్‌..! ఇక నుంచి ఆ పనుల్లో మహిళలు..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement