
చాలా మంది తెలిసో తెలియక కొన్ని ఫుడ్స్‌ను ఆరోగ్యానికి మంచిదని గుడ్డిగా నమ్మి తినేస్తున్నారు. ఫలితంగా ఆరోగ్యంగా ఉండటానికి బదులు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటో తెలుసా?
ఫ్లేవర్డ్ ఓట్ మీల్...
ఓట్స్ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలుసు. కానీ ఇది స్వచ్ఛమైన, సాదా ఓట్ మీల్‌కి మాత్రమే వర్తిస్తుంది. అయితే రకరకాల ఫ్లేవర్స్‌తో రకరకాల ఓట్ మీల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో రుచిని పెంచడానికి కృత్రిమ రంగులు, చక్కెర సిరప్ వంటి అనేక ఆరోగ్యానికి హాని చేసే వస్తువుల్ని కలుపుతారు. ఇవి తినడం మంచిది కాదు.
బ్రౌన్ బ్రెడ్...
ఈ రోజుల్లో మార్కెట్లో లభించే బ్రౌన్ బ్రెడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి పేరుకు మాత్రమే బ్రౌన్ బ్రెడ్స్. చాలా మంది వీటిని చౌకగా అమ్ముతున్నారు. అంటే ఇలాంటి బ్రౌన్ బ్రెడ్‌లో శుద్ధి చేసిన పిండి, కృత్రిమ రుచి, రంగు, చక్కెరను ఉపయోగిస్తున్నారని అర్థం. అందుకే బ్రౌన్ బ్రెడ్ కొనేటప్పుడు కొంచెం ఖర్చు ఎక్కువైనా సరే మంచి బ్రాండ్ కొనడం మేలు.
ప్యాక్ చేసిన పండ్ల రసాలు లేదా స్మూతీలు...
మార్కెట్లో వివిధ రకాల పండ్ల రసాలు, స్మూతీలు ప్యాకెట్లలో సులభంగా లభిస్తాయి. ఆరోగ్యానికి మంచిదని వీటిని తెగ కొనేస్తున్నారు. నిజానికి, ఈ ప్యాక్ చేసిన జ్యూస్‌లలో కృత్రిమ రంగులు, చక్కెర, కృత్రిమ రుచులు మొదలైన అనారోగ్యకరమైన వస్తువులు కూడా ఉంటాయి. అందుకే వీటిని కొనే ముందు వాటి ΄్యాక్ చెక్ చేస్తే పండ్ల రసాలు, స్మూతీల్లో ఏం వాడారో తెలుస్తుంది.
ఎనర్జీ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్స్...
ఈ రోజుల్లో స్పోర్ట్స్ లేదా ఎనర్జీ డ్రింక్స్ తాగే అలవాటు చాలా మందికి ఉంది. అయితే, ఈ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచిది కాదు. వీటిని తాగడం వల్ల కొంచెం ఎనర్జీ వస్తుందేమో కానీ.. రాను రాను అనారోగ్యం కూడా వస్తుంది. పిల్లలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డ్రింక్స్ తాగనివ్వకండి. వీటి బదులు ఇంట్లో చేసుకున్న పండ్ల జ్యూస్‌లు బెస్ట్.
బ్రేక్‌ఫాస్ట్ మిల్లెట్స్...
ఆరోగ్యకరమైన ఆహారం పేరుతో మార్కెట్లో బ్రేక్‌ఫాస్ట్ మిల్లెట్స్ అమ్ముతున్నారు. చాలా మంది ఈ ప్యాకేజ్డ్ మిల్లెట్స్ ఆరోగ్యానికి మంచిదని భావించి కొని తింటున్నారు. నిజానికి వీటిని తయారు చేయడానికి అదనపు చక్కెర, కత్రిమ రుచి కలుపుతారు. అంతేకాకుండా వీటిలో ఫైబర్ కూడా ఉండదు. వీటి బదులు సహజంగా దొరికే తృణధాన్యాలతో ఇంట్లోనే బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment