Beat the heat : తాటి ముంజెల్ని ఇలా ఎపుడైనా తిన్నారా? | Beat the heat Healthy Ice apple Indian Summer Recipes | Sakshi

Beat the heat : తాటి ముంజెల్ని ఇలా ఎపుడైనా తిన్నారా?

Apr 14 2025 8:41 PM | Updated on Apr 14 2025 8:54 PM

Beat the heat  Healthy Ice apple Indian Summer Recipes

 సీజన్‌కు తగ్గట్టుప్రకృతి అనేక పళ్లను మానవజాతికి అందిస్తుంది ప్రస్తుతం  సమ్మర్‌ సీజన్‌ నడుస్తోంది. మరి సమ్మర్‌  అనగానే  నోరూరించే  మామిడిపళ్లతో పాటు తాటి ముంజలు గుర్తొస్తాయి. పల్లె, పట్నం తేడా లేకుండా ఎక్కడ చూసినా  ముంజలు మనల్ని ఊరిస్తుంటాయి. తాటిముంజలు , నీటిముంజలు, పాల ముంజలు.. ఎలా పిలుచుకుంటేనేం, ఎండకాలంలో వీటిని  ఒక్కసారైనా రుచి  చూడాల్సిందే. . ‘ఐస్‌ ఆపిల్స్‌’  అంటే   పిలుచుకునే వీటిల్లో పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి.

శరీరాన్ని చల్లగా చేస్తాయి తాటి ముంజెలు.  మండించే ఎండల్లో ఎండవేడిమిని తట్టుకునేందుకు  ముంజెల్లో లభించే పుష్కలమైన నీరు  ‘డీహైడ్రేషన్‌’కు  చక్కగా పనిచేస్తాయి. తక్షణమే శక్తినిస్తాయి. తాటిముంజల్లో విటమిన్‌-బి, ఐరన్‌, క్యాల్షియం పుష్కలం. వీటిలోని నీరు అధిక బరువు సమస్యను పరిష్కరించడంలో సాయపడుతుంది. వికారం, వాంతులు వంటి లక్షణాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు తాటిముంజల్ని తినడం వల్ల ఉపశమనం లభిస్తుంది.  కొంతమందికి ఎండకాలం మొహం మీద పొక్కులు వస్తుంటాయి. ముంజల్ని కనుక తింటే, ఆ ఇబ్బంది ఉండదని నిపుణులు అంటారు.అలాగే  లివర్‌ సమస్యలు నియంత్రణలోకి వస్తాయి. వీటిలోని పొటాషియం శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది.  జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.

వేసవిలో మాత్రమే దొరికే తాటి ముంజెలంటే చాలామందికి భలే ఇష్టముంటుంది. అయితే అంత మధురమైన ముంజెలను మరింత మధురంగా చేసుకోవడం ఎలా? ఈజీగా, టేస్టీగా ఇలా ట్రై చేస్తే సరి పిల్లలేంటి... పెద్దలు కూడా ఇష్టంగా లాగించేస్తారు.  వంటలు కూడా చేసుకోవచ్చు. ప్రాంతాలు, పద్ధతులనుబట్టి కొందరు వీటిలో సగ్గుబియ్యం, బెల్లం వేసి వండుతారు. చూసేందుకు అచ్చం పాయసంలా కనిపిస్తూ నోరూరిస్తుందీ వంటకం. మనం ఇపుడు తాటి ముంజెల హల్వా, జ్యూస్‌ను తయారు చేసుకోవచ్చు. వాటి తయారీని  చూద్దాం.


తాటి ముంజెల  హల్వా
ముందుగా చిన్నమంట మీద కళాయిలో 2 కప్పుల చిక్కటి పాలు మరిగించి, అందులో దోరగా వేయించిన ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటూ గరిటెతో ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అనంతరం దానిలో రెండు కప్పుల మెత్తటి ముంజెల గుజ్జు వేసుకుని దగ్గరపడే వరకూ  తిప్పాపాలి. అభిరుచిని బట్టి కొద్దిగా ఫుడ్‌ కలర్, రెండు టేబుల్‌ స్పూన్ల నెయ్యితో  పాటు ఏలకుల  పొడి, వేయించిన బాదం, జీడిపప్పు వంటివి కలిపి దగ్గరపడ్డాక ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఆ మిశ్రమం బాగా చల్లారాక ముక్కలుగా కట్‌ చేసుకుని ఆరగించొచ్చు.

తాటి ముంజెల జ్యూస్‌  
రెండు కప్పు ముంజెల గుజ్జు, అర కప్పు కాచిన చిక్కటి  పాలు, అర కప్పు పాల  పొడి, రెండు టేబుల్‌ స్పూన్ల ఫ్రెష్‌ క్రీమ్‌ లేదా విప్పింగ్‌ క్రీమ్, సరిపడా పంచదార కలిపి బాగా గిలకొట్టాలి. లేదా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని డీప్‌ ఫ్రీజర్‌లో పెట్టి, గడ్డ కట్టాక తింటే సూపర్‌ ఉంటుంది.ముంజెకాయల గుజ్జులో కొద్దిగా నీళ్లు, తేనె వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. వడకట్టి చల్లగా తాగాలి. ఏలకుల  పొడి వేసుకుంటే ఫ్లేవర్‌ మరింత బాగుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement