recipes
-
'బిర్యానీ' పూర్తిగా మాంసం ఆధారిత వంటకమా?
ఆహార ప్రియులకు ఇష్టమైన వంటకాల్లో అగ్రస్థానం బిర్యానీదే. అంతేగాదు ఆన్లైన్ ఎక్కువ ఆర్డర్ చేసేది కూడా బిర్యానీ. అయితే ఈ వంటకం ఇరాన్లో ఉద్భవించిందని, మొఘల్ పాలన కారణంగా భారత ఉపఖండంలో నెమ్మదిగా భాగమైందని చెబుతుంటారు పాక నిపుణులు. ఆ విధంగా మనకు బిర్యానీ తెలిసిందేనది చాలామంది వాదన. అయితే అసలు బిర్యానీ అంటే మాంసంతో కలిపి చేసేదే బిర్యానీ అని, కూరగాయలతో చేసే వెజ్ బిర్యానీ అనేది బిర్యానీనే కాదని అంటున్నారు. నెట్టింట దీనిపై పెద్ద చర్చ నడుస్తోంది. మరీ ఇంతకీ వెజ్ బిర్యానీ అనేది ఉందా..?. మాంసం ఆధారిత వంటకమే బిర్యానీనా అంటే..వెజ్ లేదా నాన్ వెజ్ బిర్యానీ రెండూ వాటి రుచి పరంగా ఎవర్ గ్రీన్ అనే చెప్పొచ్చు. అయితే పాక నిపుణులు మాత్రం బిర్యానీ అనగానే మాంసంతోనే చేసే వంటకమని నమ్మకంగా చెబుతున్నారు. కానీ మరికొందరు మాత్రం కూరగాయలతో చేసినదే బిర్యానీ అని వాదిస్తున్నారు. ప్రముఖ చెఫ్‌లు పాక నిపుణులు బిర్యానీని పూర్వం సుగంధ ద్రవ్యాల తోపాటు, జంతువుల కొవ్వుని కూడా జోడించి మరింత రుచిని తీసుకొచ్చారని చెబుతున్నారు. అందువల్ల మాంసం లేకుండా తయారుచేసిన వంటకాన్ని నిజంగా "బిర్యానీ"గా పరిగణించలేమని అన్నారు. అయితే కాలక్రమే ఆహార వంటకాలు అభివృద్ధి చెందడంతో.. మాసంహారం తినని వాళ్ల కోసం ఇలా కూరగాయలు జోడించి చేయడంతో అది కాస్త వెజ్ బిర్యానీగా పిలవడం జరిగిందన్నారు. అయితే అది నిజమైన బిర్యానీ కాదని తేల్చి చెబుతున్నారు ప్రముఖ చెఫ్, ఫుడ్ ల్యాబ్ వ్యవస్థాపకుడు సంజ్యోత్ కీర్. అలాగే కూరగాయలు జోడించినంత మాత్రమే దానికి బిర్యానీ ఘమఘలు రావని, దానికి సుగంధ ద్రవ్యాలు తోడైతేనే.. కూరగాయలు రుచిగా మారి మనకు అద్భుతమైన వెజ్ బిర్యానీ సిద్ధమవుతుందని చెప్పారు. అందువల్ల కూరగాయలతో చేసినదాన్ని బిర్యానీగా పరిగణించరని అన్నారు. చాలామందికి ఇది నచ్చకపోయినా..వాస్తవం ఇదేనని అన్నారు. అలా అని వెజ్ బిర్యానీని కూడా తీసిపారేయలేం. ఎందుకంటే కాటేజ్ చీజ్ (పనీర్), సోయా బీన్, టోఫు, పుట్టగొడుగులు, జాక్‌ఫ్రూట్ (కథల్) లేదా ఖర్జూరం (ఖజూర్) వంటి కూరగాయలతో మరింత రుచికరంగా చేస్తున్నారు చెఫ్‌లు. చెప్పాలంటే..మాంసంతో చేసినన బిర్యానీ రుచి కూడా దానిముందు సరిపోదేమోనన్నంత టేస్టీగా ఉంటోందన్నారు చెఫ్ సంజ్యోత్ కీర్. (చదవండి: యూట్యూబ్ చూసి సెల్ఫ్ సర్జరీ..! వైద్య నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్) -
వేసవిలో పెరుగు పులిసిపోయిందా? బెస్ట్ టిప్స్ ఇవిగో!
పెరుగు లేనిదే అన్నం తిన్నట్టే ఉండదు చాలామందికి. అంతేకాదు పెరుగు కమ్మగా ఉండాలి. కొంచెం పులిసినా ఇక దాన్ని పక్కన పెట్టేస్తారు. ఇది గృహిణులకు పెద్ద టాస్కే. అందులోనూ వేసవి కాలంలో పెరుగు తొందరగా పులిసిపోతుంది. కానీ పెరుగు మిగిలినా, పుల్లగా అయినా పాడేయక్కర్లేదు. మిగిలిన పెరుగు,పుల్లటి పెరుగుతో రుచికరమైన వంటలు చేసుకోవచ్చు తెలుసా? దీంతోపాటు కొన్ని ఇంట్రిస్టింగ్ టిప్స్ మీకోసం..వేసవికాలంలో ఫ్రిజ్‌లో పెట్టినా కూడా టేస్ట్ మారిపోతుంది. మిగిలిపోయిన, లేదా పులిసిన పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియకు, పేగుల ఆరోగ్యానికి చాలా మంచింది. అందుకే మిగిలిన పెరుగును తాలింపు పెట్టుకుంటే, రుచిగానూ ఉంటుంది ఆరోగ్యానికి మంచిది. అలాగే ఈ పెరుగులో కాస్త మైదా, వరిపిండి కలిపి అట్లు పోసుకొని తినవవచ్చు. బోండాల్లా వేసుకొని తినవచ్చు. పుల్లట్లుపెరుగుతో చేసుకునే అట్లు భలే రుచిగా ఉంటాయి. పెరుగులో ఒక కప్పు మైదా, రెండు కప్పుల బియ్యం పిండి కలిపి కొద్ది సేపు పక్కన పెట్టుకోవాలి. ఇందులో కావాలంటే కొద్దిగా బొంబాయి రవ్వ కూడా కలుపు కోవచ్చు. దోసెలు వేసుకునే ముందు సన్నగాతరిగిన ఉల్లి, పర్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర ఉప్పు వేసి దోశల పిండిలా జారుగా ఉండాలి. వేడి వేడి పెనంపై కొద్దిగా నూనె వేసి ఈ దోసలను దోరగా కాల్చుకుంటే సరిపోతుంది. అల్లం లేదా టమాటా చట్నీతో బ్రేక్‌ఫాస్ట్‌లా లేదంటే ఈవినింగ్ టిఫిన్లా తినవచ్చు.మజ్జిగ పులుసు పులిసిన పెరుగును కాస్త నీరు కలిపి మజ్జిగలా చేయండి. దాంట్లో రెండు టీ స్పూన్ల శెనగపిండి కలిపి పక్కనుంచుకోవాలి. కుక్కర్లో సొరకాయ, బెండకాయ ముక్కల్ని పెద్ద ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి కలపాలి. తరువాత పసుపు, ఉప్పు, కాసిన్ని నీరు పోసి కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ మీద పెట్టండి. రెండు, మూడు కూతలు వచ్చేదాకా ఆగాలి. ఆ తరువాత మూత తీసి, కొత్తి మీర చల్లి, కొద్దిసేపు మరగనివ్వాలి. ఇపుడు ముందుగానే కలిపి పెట్టుకున్న మజ్జిగ కలిపి మరో రెండు నిమిషాలు మరగనిస్తే చాలు. చివరిగా దీన్ని మెంతులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేయించి తాలింపు పెట్టుకోండి. ముద్దపప్పు , మజ్జిగపులుసు కాంబినేషన్ అదుర్స్ . సింపుల్గాఎండుమిర్చి, మెంతులు, కరివేపాకుతో తాలింపు వేసి, పచ్చి ఉల్లిపాయ ముక్కులు, క్యారెట్ తురుము కలుపుకుని వేడి వేడి అన్నంతో తిన్నా కూడా రుచిగా ఉంటుంది. బోండాలుపెరుగులో మైదా, బియ్యం పిండి,కాస్త వంట సోడా కలిపి పెట్టుకోవాలి. పెరుగు పుల్లగా ఉంటే ఎక్కువ సేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. లేదంటే రెండు మూడు గంటలు నానిన తరువాత బాగా బీట్ చేసి బోండాల్లాగా వేసుకుంటే రుచిగా ఉంటాయి. (పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి లేదంటే బోండాలు పేలే అవకాశం ఉంది). కావాలనుకుంటే ఇందులో ఉల్లిపాయ, పర్చిమిర్చి, కొత్తిమీరలను ముక్కలుగా చేసి కలుపుకుని కాగుతున్న నూనెలో పునుగుల్లా వేసుకోవడమే. అల్లం ,లేదా పల్లీ చట్నీతో తింటే ఆహా అనాల్సిందే.చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?మరికొన్ని చిట్కాలు మిగిలిపోయిన పెరుగును తినడానికి ఇష్టపడని వారు.. దాన్ని పండ్ల రసాలు, స్మూతీస్ తయారీలోనూ వాడుకోవచ్చు. స్మూతీస్ చేసే క్రమంలోనే బ్లెండర్లో పండ్లు, తేనె, కొన్ని ఐస్‌ముక్కలతో ΄ాటు కొద్దిగా పెరుగు వేసి బ్లెండ్ చేస్తే దాని రుచి పెరుగుతుంది.మటన్, చికెన్ వండే ముందు చాలా మంది మ్యారినేట్ చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో పెరుగును కూడా కలిపితే మాంసం ముక్కలు మరింత మృదువుగా మారి త్వరగా ఉడకటమే కాదు, కూర రుచి మరింత పెరుగుతుంది.సలాడ్ గార్నిష్/డ్రస్సింగ్ కోసం కొత్తమీర/పుదీనా వంటి ఆకులు, వెల్లుల్లి ముక్కలు, నిమ్మరసం, ఆలివ్ నూనె వంటివి వాడుతుంటారు. అయితే క్రీమీగా చిలికిన పెరుగును వాటి పైనుంచి సన్నటి తీగలాగా పోస్తే సలాడ్ నోరూరిస్తుంది. ఇంకా తింటుంటే మధ్యమధ్యలో పుల్లపుల్లగా నోటికి తగులి టేస్టీగా ఉంటుందని అంటున్నారు.చిప్స్, క్రాకర్స్, కాల్చిన కాయగూర ముక్కలు, ఫ్రెంచ్ ఫ్రై స్ వంటి వాటిని వివిధ రకాల పదార్థాలతో తయారుచేసిన డిప్పింగ్ సాస్‌లో ముంచుకొని తింటుంటారు. అయితే ఈ డిప్స్ తయారీలో కొద్దిగా పెరుగును ఉపయోగిస్తే వాటి రుచి, చిక్కదనం పెరుగుతాయి. పెరుగుతో రుచికరమైన డిప్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం పెరుగును ఒక క్లాత్‌లో వేసి అందులోని నీటిని తీసేయాలి. ఆ తర్వాత దీన్ని బాగా చిలికితే క్రీమీగా తయారవుతుంది. ఇప్పుడు మీ రుచికి తగినట్లుగా చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి కలుపుకోవాలి. ఇష్టం ఉంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, స్వీట్‌కార్న్ వంటివి జత చేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. చదవండి: సుదీక్ష అదృశ్యం : తల్లిదండ్రుల షాకింగ్ రిక్వెస్ట్! -
Sunday Special: నాటుకోడి కూర, ఫిష్ ఫ్రై, బగారా రైస్
సండే వచ్చిందంటే.. మాంచి ఫుడ్ ఉండాల్సిందే.. ఇష్టమైన కూర అదీ అదిరిపోయే రుచి ఉంటే.. ఆ ఆనందమే వేరు. టమ్మీ ఫుల్.. దిల్ ఖుష్. మరి అలాంటి ఆదివారం ఆనందాన్ని పొందాలనుకుంటే.. బగారా రైస్ పచ్చిపులుసు, చేప వేపుడు, నాటుకోటి కూర.. దిల్ఫుల్గా ఇంట్రస్టింగ్ రెసిపీస్ మీకోసం...పచ్చిపులుసుకావల్సినవి: చింతపండు – నిమ్మకాయ పరిమాణం (వేడి నీళ్లలో నానబెట్టి, గుజ్జు తీయాలి); ఉప్పు – తగినంత; నీళ్లు – 3 కప్పులు; పచ్చిమిర్చి – 4; జీలకర్ర – టీ స్పూన్; కొత్తిమీర – టేబుల్‌స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; ఉల్లిపాయ – 1; ఎండుమిర్చి – 2; వెల్లుల్లి – 4 రెబ్బలు; నూనె – 2 టేబుల్ స్పూన్లు; కరివేపాకు – రెమ్మ; ధనియాల పొడి – అర టీ స్పూన్.తయారీ: ∙ చింతపండు గుజ్జులో నీళ్లు కలపాలి. ∙రోట్లో పచ్చిమిర్చి, ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, కొత్తిమీర, పసుపు వేసి కచ్చాపచ్చాగా దంచాలి. ఈ మిశ్రమాన్ని చింతపండు రసంలో కలపాలి. స్టౌ మీద మూకుడు పెట్టి నూనె వేసి అందులో మిగిలిన జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ధనియాల పొడి వేసి, వేయించి ఈ పోపు మిశ్రమాన్ని చింతపండు రసంలో కలపాలి. తీపి కావాలనుకున్న వారు టీ స్పూన్ పంచదార / బెల్లం కలుపుకోవచ్చు. ఉల్లిపాయ తరుగు పైన వేసి, అన్నంలోకి వడ్డించాలి.నాటు కోడి కూరకావల్సినవి: నాటు కోడి ముక్కలు-అరకేజీ; పచ్చిమిర్చి-4, టొమాటోలు - 2(తరగాలి); అల్లం-వెల్లుల్లి పేస్ట్-2 టీ స్పూన్లు; గరం మసాలా (లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు)-2 టీ స్పూన్లు; ఉల్లిపాయలు-2, ఎండుమిర్చి -2; పసుపు-అర టీ స్పూన్; ఉప్పు-తగినంత; కారం - టీ స్పూన్; ఎండుకొబ్బరి- 2 టీ స్పూన్లు; నూనె-3 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు-2 టేబుల్ స్పూన్లుతయారీ: ∙నాటుకోడి ముక్కలలో కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం– వెల్లుల్లి పేస్ట్ కలిపి పక్కనుంచాలి. మందపాటి గిన్నె/కుకర్‌లో నూనె వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు వేసి, కలపాలి. అల్లం–వెల్లుల్లి ముద్ద వేసి, వేగాక కలిపి ఉంచిన చికెన్ వేసి 10 నిమిషాలు ఉడికించాలి. టొమాటో వేసి మగ్గనివ్వాలి. 2 కప్పుల నీళ్లు పోసి, ఉప్పు, కారం, ఎండుకొబ్బరి వేసి మరో 15 నిమిషాలు ఉడికించాలి. కుకర్‌లో అయితే 3 విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. దించే ముందు సిద్దం చేసుకున్న గరం మసాలా, కొత్తిమీర వేయాలి. రోటీలు, అన్నంలోకి ఈ కూరను వడ్డించాలిచేప వేపుడుకావల్సినవి: చేప ముక్కలు- 6; కారం -అర టీ స్పూన్; మొక్కజొన్న పిండి – టీ స్పూన్; ఉప్పు -తగినంత; నిమ్మరసం- అర టీ స్పూన్; గుడ్డు-1; నూనె – తగినంత; ధనియాల పొడి-టీ స్పూన్; గరం మసాలా- అర టీ స్పూన్; అల్లం-వెల్లుల్లి పేస్ట్ -టీ స్పూన్; కొత్తి మీర – టీ స్పూన్; నూనె – 3 టేబుల్ స్పూన్లు (తగినంత).తయారీ: గిన్నెలో చేప ముక్కలు వేసి కారం, మొక్కజొన్నపిండి, ఉప్పు, నిమ్మరసం, గుడ్డు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నిమ్మరసం వేసి కలిపి అరగంట పక్క నుంచాలి. కడాయిలో నూనె వేసి అందులో చేప ముక్కలు వేసి, వేయించాలి. చేప ముక్కలు వేగిన తర్వాత కొత్తిమీర చల్లి దించాలి. గుండ్రంగా తరిగిన ఉల్లిపాయలను అలంకరించి చేప ముక్కలను అన్నంలోకి సైడ్ డిష్‌గా వడ్డించాలి. ఇవి స్నాక్స్‌గానూ బాగుంటాయి.చదవండి: #WomenPower :హంపీ టెంపుల్లోని ఈ సారథుల గురించి తెలుసా?బగారా రైస్ కావల్సినవి: బాస్మతి బియ్యం/బియ్యం - 2 కప్పులు+ ఉల్లిపాయలు 3 (సన్నగా నిలువుగా తరగాలి); బిర్యానీ ఆకు3; పచ్చి మిర్చి7 (సన్నగా తరగాలి); కొత్తిమీర -2 టేబుల్ స్పూన్లు ; పుదీనా ఆకులు -గుప్పెడు; అల్లం - వెల్లుల్లి పేస్ట్ -2 టీ స్పూన్లు; ఉప్పు-తగినంత; నెయ్యి / నూనె -అర కప్పు; నీళ్లు-5 కప్పులు; లవంగాలు-10; యాలకులు -7; కరివేపాకు.తయారీ: గిన్నెలో నూనె వేడి చేసి, ఉల్లి తరుగు గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. అందులో పచ్చిమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, కరివే΄ాకు, పుదీనా ఆకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సన్నని మంట మీద పచ్చివాసన పోయేవరకు వేయించాలి. ∙దీంట్లో బియ్యం వేసి 2 నిమిషాలు వేయించాలి. ఉప్పు కూడా వేసి మరో మారు కలిపి, 5 కప్పుల నీళ్లుపోసి ఉడికించాలి. చివరగా కొత్తిమీర, వేయించిన ఉల్లి తరుగు చల్లి దించాలి.చదవండి: ఇక్కడ జిమ్‌లో చేరాలంటే నెలకు తొమ్మిది లక్షలు!నోట్: పోపులో పచ్చిబఠాణీలు, మొక్కజొన్న గింజలు, బీన్స్ వేసి కూడా బగారా రైస్ చేసుకోవచ్చు. దీనిలోకి మాంసాహార వంటకాలే కాదు బంగాళదుంప కూర, గుత్తి వంకాయ కూర, పప్పు వంటి శాకాహార రుచులను కూడా వడ్డించవచ్చు. -
పుట్టనిండా రుచులు, పొట్టనిండా విందు! ట్రై చేశారా!
పుట్టగొడుగులు...(Mushrooms) అదేనండీ.. మష్రూమ్స్ పోషకాలకే కాదు... రుచికి కూడా పెట్టింది పేరు. కాస్త ఉప్పూకారం వేసి మరికాస్త మసాలా దట్టించామంటే ఆ టేస్ట్ అదుర్స్.. అందుకే పుట్టనిండా రుచులు... పొట్టనిండా విందు! అందుకే పుట్టగొడుగులతో మంచి రుచికరంగా చేసుకునే వంటకాలను గురించి తెలుసుకుందాం.ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.మష్రూమ్స్ మంచూరియా కావలసినవి: మైదా – అర కప్పు; మష్రూమ్స్ – 250 గ్రాములు; కార్న్‌ఫ్లోర్-3 టేబుల్ స్పూన్లు; అల్లం, వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; నీళ్లు -కప్పు; ఉప్పు -తగినంత; పంచదార-అర టీ స్పూన్; పచ్చి మిర్చి- 3 (సన్నగా తరగాలి); అల్లం వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్; ఉల్లికాడల తరుగు-టేబుల్ స్పూన్; బెల్ పెప్పర్-1 (సన్నగా తరగాలి). సాస్ కోసం: నల్ల మిరియాల పొడి -చిటికెడు; పంచదార – చిటికెడు; సోయా సాస్ – టీస్పూన్తయారీ: ∙పుట్టగొడుగులను కడిగి, తుడిచి, సగానికి కట్ చేయాలి ∙ఒక గిన్నెలో సాస్ మినహా పై పదార్థాలన్నీ తీసుకోవాలి ∙తగినన్ని నీళ్లు ΄ోసి పిండిని బాగా కలుపుకోవాలి ∙స్టౌ పై బాణలి పెట్టి, తగినంత నూనె పోసి, వేడి చేయాలి. పుట్టగొడుగులను పిండిలో ముంచి, కాగుతున్న నూనెలో వేసి, గోధుమ రంగు వచ్చేవరకు వేయించి, తీసి, పక్కన పెట్టుకోవాలి ∙అదే నూనెలో, కట్ చేసి పెట్టుకున్న ఉల్లి కాడలను వేసి, నిమిషం సేపు వేయించి, తీసి పక్కనుంచాలి ∙నల్ల మిరియాలు, ఉప్పు, చక్కెర, సోయా సాస్ కలిపి పక్కనుంచాలి. ఈ సాస్‌లో వేయించిన పుట్టగొడుగులను వేసి, అన్నింటికీ సాస్ పట్టేలా బాగా కదిలించాలి. తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీరతో అలంకరించి, సర్వ్ చేయాలి.మష్రూమ్స్ పులావ్ కావలసినవి: నూనె- 3 టేబుల్ స్పూన్లు; బాస్మతి బియ్యం – ఒకటిన్నర కప్పు; మష్రూమ్స్- 250 గ్రాములు; ఉల్లిపాయ-1 (సన్నగా తరగాలి); టమోటా-1 (ముక్కలుగా కట్ చేసుకోవాలి); బంగాళదుంప-1; పచ్చిమిర్చి- 2; అల్లం వెల్లుల్లి పేస్ట్-టీ స్పూన్; కొబ్బరిపాలు-కప్పు; నీళ్లు -3 కప్పులు; ఉప్పు-తగినంత; మసాలా దినుసులు - (బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు -3, లవంగాలు -5, నల్లమిరియాలు - 6, జీలకర్ర – టీ స్పూన్) తయారీ: బియ్యాన్ని కడిగి అరగంటసేపు నానబెట్టాలి. అన్ని కూరగాయలతో పాటు మష్రూమ్స్ కూడా కడిగి, కట్ చేసి పెట్టుకోవాలి ∙ప్రెజర్ కుక్కర్లో, నూనె వేసి వేడిచేయాలి. జీలకర్రతో సహా మొత్తం మసాలా దినుసులు వేసి, సువాసన వచ్చే వరకు వేయించాలి ఉల్లిపాయ తరుగు వేసి, వేయించుకోవాలి. అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు తరిగిన టమోటాలు, బంగాళదుంప ముక్కలు వేసి ఉడికించాలి. తర్వాత పుట్టగొడుగులను కలపాలి. సన్నని మంట మీద పుట్టగొడుగులు సగం ఉడికేంత వరకు 5 నిమిషాలు ఉంచాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. పచ్చిమిర్చి వేసి, వేగాక, బియ్యం పోసి కలపాలి.దీంట్లో కొబ్బరి పాలు, నీళ్లు కలపాలి. ఉప్పు వేసి, రుచి సరిచూసుకొని, కుకర్ మూత పెట్టాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి, స్టౌ ఆపాలి. 5–10 నిమిషాలు ఆగి, కుకర్ మూత తీసి, కొత్తిమీర, పుదీనా ఆకులతో అలంకరించాలి. గుండ్రంగా తరిగిన ఉల్లిపాయలతో సర్వ్ చేయాలి. దీనికి కాంబినేషన్‌గా రైతాను వడ్డించాలి. -
భాగ్యనగరంలో బెంగాలీ రుచులు.. లొట్టలేస్తున్న ఆహార ప్రియులు
విభిన్న సంస్కృతుల సమ్మేళనం, విభిన్న రుచుల సంగమం హైదరాబాద్.. వారసత్వం పేర్చిన ఈ ఆహార సంస్కృతిలో దేశవ్యాప్తంగా అన్ని రుచులనూ నగరవాసులు ఆదరిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. ఈ కల్చరల్ డైవర్సిటీలో తన ప్రశస్తి సువాసనలు నలుదిశలా వెదజల్లుతున్నాయి. అందుకు చక్కని వేదికైంది బెంగాలీ రుచులు (Bengali Recipes) ప్రదర్శన. నగరంలో బెంగాలీలు ఉన్నప్పటికీ దాదాపు 40 శాతం వరకూ స్థానికులు కూడా ఆదరణ చూపిస్తున్నారని హైటెక్ సిటీలోని ‘ఓ కలకత్తా’ రెస్టారెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫిరోజ్ సాద్రి తెలిపారు. గత 25 సంవత్సరాలుగా బెంగాలీ రుచులను అందిస్తున్న ‘ఓ కలకత్తా’.. హైదరాబాద్ వేదికగా బెంగాలీ ఆహార సంస్కృతిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో నగరానికి బెంగాలీ ఫుడ్ కల్చర్ వచ్చిన తీరు, ఇక్కడ వినూత్నంగా అందుబాటులో ఉన్న వెరైటీ డిషెస్ గురించి ఫిరోజ్ సాద్రి వెల్లడించారు.– సాక్షి, సిటీబ్యూరో దేశాన్ని వందల ఏళ్లు పాలించిన బ్రిటిష్ వారు బెంగాల్ కేంద్రంగా ఎంచుకున్నారు.. ఎందరో ముస్లిం రాజవంశస్తులు పరిపాలించిన ప్రాంతం కూడా బెంగాల్. ఈ ఇద్దరికీ ప్రధాన కేంద్రం హైదరాబాద్ (Hyderabad). ఇలా సాంస్కృతిక పరిణామంలో నగరానికి బెంగాలీ ఆహారం వచ్చింది. బ్రిటిష్‌వారు స్పైసీ తక్కువ, తీపి ఎక్కువ ఇష్టపడతారు. ఇందులో భాగంగా వారు ప్రత్యేకంగా తయారుచేసుకున్న బెంగాలీ వెరైటీ అడాబ్ చిగిరీ. ఇది కొబ్బరి నీరు (Coconu Water), కొబ్బరి క్రీంతో తయారు చేసే అరుదైన వంటకం. ఈ వెరైటీ ‘ఓ కలకత్తా’లో లభిస్తుంది. దీనిని నగరవాసులు ఇష్టంగా ఆరగిస్తున్నారు. ఇదీ చదవండి: Ma Illu ట్విన్స్ విజేత, శ్వేత అనాథలు కాదు అంగరంగ వైభవంగా పెళ్లి! హిల్సా ఆఫ్ పాతూరి.. ఈ వెరైటీ మాన్సూన్ సీజన్లో మాత్రమే లభించే అరుదైన హిల్సా చేపతో తయారు చేస్తారు. దీనిలో మిలియన్ల సంఖ్యలో సన్నని ఎముకలుంటాయి. వీటన్నింటినీ సృజనాత్మకంగా తొలగించి, అరిటాకులో కొబ్బరిని కలిపి స్టీమ్ చేసి వడ్డించే వినూత్న వంటకం. ఇది కలకత్తా స్పెషల్, ఖరీదైనది కూడా. మాన్సూన్ సీజన్లో బ్రహ్మపుత్ర నదిలో బ్రీడింగ్ కోసం వలస వచ్చే అరుదైన చేప కావడమే దీని ప్రత్యేకత. మోచా.. అరటి పువ్వుతో ప్రత్యేకంగా తయారు చేసే కలకత్తా వంటకం. అరటి పువ్వులో పోషక విలువలుంటే చిన్న చిన్న పెటల్స్‌తో దీనిని తయారు చేస్తారు. ఆరోగ్యంతో పాటు రుచికరమైనదని చెఫ్ వెల్లడించారు. గోబిందో బోగ్.. బెంగాల్లో గోబిందో బోగ్ రైస్‌ను దేవుని ఆహారంగా భావిస్తారు (ఫుడ్ ఫర్ ది గాడ్). ఇది బెంగాల్లో తప్ప మరెక్కడా దొరకదు. సాధారణ బియ్యం, బాస్మతి బియ్యానికీ భిన్నంగా, రుచికరంగా ఉంటుంది. అత్యంత సాధారణమైన బెంగాలీ వంటకం ఈ రైస్ వెరైటీ. జర్నా ఘీ.. తెలుగువారి ఆహారంలో నెయ్యికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అలాగే బెంగాలీలు కూడా ఆహార పదార్థాల్లో నెయ్యికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఇందులో భాగంగానే ఫ్లేవర్ కోసం బెంగాలీలు జర్నా నెయ్యిని వాడతారు. ఇది ఒక్క స్పూన్‌తో మొత్తం రుచినే మార్చేస్తుంది. ఇవే కాకుండా ఇండియన్ చికెన్ కట్లెట్, రాయల్ మటన్ చాన్ప్,కోల్‌కతా బిర్యానీ, రాధూనీ మసాలా, రాధా తిలక్ రైస్, చానా పాతూరి, జాక్ ఫ్రూట్ టిక్కీ (స్పైసీ.. సూపర్ ఫుడ్), పెఫెటా చీజ్, మలాయీ కర్రీ, పెటాయ్ పరోటా, ఆమ్ఆచావో ఇలా.. విభిన్న రకాల బెంగాలీ రుచులతో ఓ కలకత్తాలో నోరూరిస్తుందని చెఫ్‌లు పేర్కొన్నారు. 1992లో ముంబై వేదికగా నాలుగు టేబుళ్లతో ‘ఓన్లీ ఫిష్’ పేరుతో అంజన్ ఛటర్జీ ప్రారంభించిన హోటల్ క్రమంగా హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా వంటి 8 ప్రాంతాలతో పాటు యూఏఈ, లండన్‌లో వండి వడ్డిస్తున్నారు. ఆమ్ అదా అల్లంనగరవాసులకు సరికొత్త బెంగాలీ రుచులను అందించడానికి కలకత్తా పరిసర ప్రాంతాల నుంచి ఆమ్ ఆదా అల్లంను పరిచయం చేశారని ఫిరోజ్ సాద్రి తెలిపారు. దీనిని మామిడి అల్లం అని పిలుస్తారు. దీంతో చేసే ఆమ్ ఆదా మాచ్‌కు నగరంలో ఆదరణ పెరుగుతోంది. మిస్టీ దహీ(దోయి) బెంగాల్ నుంచి ఎవరైనా హైదరాబాద్ వస్తున్నారంటే విమానంలో కూడా ఓ బాక్స్‌లో పార్సిల్ తెచ్చుకునే ప్రియమైన వెరైటీ ఈ మిస్టీ దహీ(దోయి). ఇది కూడా బెంగాలీ సిగ్నేచర్ వెరైటీ. మటన్ టిక్యాముస్లింలు ఎక్కువగా ఉండే కలకత్తాలో వారి ప్రత్యేక వంటకం ఇది. షాఫ్రాన్, రోజ్ వాటర్ సమ్మిళితంగా సంప్రదాయ వంటగా దీనిని చేస్తారు. దీనిని నగరవాసులు సైతం ఇష్టంగా తింటున్నారు. చదవండి: Birthright Citizenship మరోసారి బ్రేక్: భారతీయులకు భారీ ఊరట -
మార్కెట్లో విరివిగా పచ్చి బఠాణీ : పిల్లలుమెచ్చే, ఆరోగ్యకరమైన వంటకాలు
స్కూలుకెళ్లే పిల్లలున్న ఇంటి కళ వేరు. డ్రాయింగ్ రూమ్‌లో స్కూలు బ్యాగ్‌లు. వంటగదిలో లంచ్ బాక్సులు పలకరిస్తాయి. ఆ వంటింటి మెనూ భిన్నంగా ఉంటుంది. రోజూ కొత్తగా వండాలి... హెల్దీగా ఉండాలి. ఆ తల్లికి వంట రోజూ ఓ మేధోమధనమే. వారంలో ఓ రోజు ఇలా ట్రై చేయండి. మార్కెట్లో ఇపుడు ఎక్కడ చూసిన పచ్చి బఠానీ విరివిగా కనిపిస్తోంది. బఠానీలతో ఎలాంటి వంటలు చేయాలి అని ఆలోచిస్తున్నారా? పచ్చిబఠానీలను దాదాపు అన్ని కూరల్లోనూ కలిపి వండుకోవచ్చు. బంగాళా దుంప, బఠానీతో పానీ పూరీ స్టఫింగ్‌ను ఇంట్లోనే చేసుకోవచ్చు. ఉదాహరణకు, వంకాయ, బంగాదుంప, క్యారట్, క్యాబేజీ లాంటి వాటితో కలిపి బచ్చి బఠానీని వండుకుంటే, రుచితోపాటు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బఠానీ పులావ్ చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు.పీస్ పులావ్కావలసినవి: బాసుమతి బియ్యం- కప్పు; పచ్చి బఠాణీ-పావు కప్పు; నీరు-3 కప్పులు; బిర్యానీ ఆకు-ఒకటి; ఒక యాలక్కాయ, లవంగం-1; దాల్చిన చెక్క – అర అంగుళం ముక్క; ఉప్పు-పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి; నిమ్మరసం- అర టీ స్పూన్.పోపు కోసం... నెయ్యి– 2 టేబుల్ స్పూన్లు; పచ్చిమిర్చి-1 (నిలువుగా చీరాలి); షాజీరా-టీ స్పూన్.తయారీ: ∙బియ్యాన్ని కడిగి పది నిమిషాల సేపు మంచినీటిలో నానబెట్టాలి. బఠాణీలను కడిగి పక్కన పెట్టాలి. ∙నీటిని ఒక పాత్రలో మరిగించాలి. నీరు మరగడం మొదలైన తర్వాత అందులో బఠాణీలు, బియ్యం వేయాలి. బియ్యం ఉడికేటప్పుడే నిమ్మరసం, యాలక్కాయ, లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఉప్పు వేయాలి. అన్నం ఉడుకుతున్నప్పుడే మరో స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి అందులో నెయ్యి వేడి చేసి పచ్చిమిర్చి, షాజీరా వేసి వేగిన తర్వాత ఉడుకుతున్న అన్నంలో వేసి అన్నం మెతుకులు విరగకుండా జాగ్రత్తగా కలిపి మూత పెట్టాలి. మంట తగ్గించి నీరు ఇంకిపోయిన తర్వాత దించేయాలి. పచ్చి బఠానీతో ఆరోగ్య ప్రయోజనాలుబఠానీలలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. పిల్లలకు శక్తినిస్తుంది. జీర్ణశక్తికి మంచిది. జింక్, రాగి, మాంగనీస్, ఇనుము లాంటివి లభిస్తాయి. రోగాల బారిన పడకుండా ఉంటారు.ప్రోటీన్‌తో పాటు విటమిన్ కె బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది. జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. గర్భిణీ స్త్రీలకు మేలు చేస్తాయి. పిండానికి తగిన పోషణను కూడా అందిస్తాయి. అలాగే ఇవి రుతుక్రమ సమస్యలలో కూడా ఉపయోగపడతాయి.బఠానీలు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీంతో గుండెపోటు, రక్తపోటు వంటి వ్యాధులను నివారించవచ్చు. పచ్చి బఠానీలు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్ కూడా అదుపులో ఉంటుంది. రెగ్యులర్‌గా తినడం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. ముఖ్యంగా కడుపు క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. పచ్చి బఠానీలను తినడం వల్ల యవ్వనంగా కనిపిస్తారు, వృద్ధాప్య ప్రభావం త్వరగా కనిపించదు. గమనిక: ఎండు బఠాణీలైతే రాత్రంతా నానబెట్టాలి. ఇవి చదవండి: బామ్మకు స్వీట్ సర్ప్రైజ్ : 20 లక్షలకు పైగా వ్యూస్అత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు -
గృహిణి అంత చులకనా? అందుకే ఇలా చేశా!
‘కలలు కనడం మానవద్దు. కలలను సాకారం చేసుకోవాలంటే కష్టపడాలని మరువద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆశలకలను త్యాగం చేయవద్దు’ అంటోంది అరుణా విజయ్. తోటి గృహిణులకు ఆమె ఇస్తున్న సందేశం ఇది. గృహిణి అంటే ఏ పనీ రానివాళ్లనే అపోహతో కూడిన వెక్కిరింతకు చెంప చెళ్లుమనిపించింది అరుణ. ఏ సోషల్‌మీడియా అయితే ఆమెను తక్కువ చేసి మాట్లాడిందో అదే సోషల్ మీడియాలో ఇప్పుడామె ఒక ఇన్ఫ్లూయెన్సర్. మాస్టర్ షెఫ్ టాప్ 4 గా నిలిచి ప్రశంసలందుకుంటోంది. ఆమె వంటలకు వ్యూస్, లైక్స్‌తో విజేతగా నిలిచింది. అపోహ తొలగింది! చెన్నైలో పుట్టి పెరిగిన అరుణ 22 ఏళ్లకు పెళ్లి చేసుకుని ఇంటికి పరిమితమైంది. పదిహేనేళ్ల వయసు నుంచే వంటగదిలో ప్రయోగాలు చేసిన అరుణ భార్యగా, తల్లిగా ఇంటి బాధ్యతల నిర్వహణలో విజయవంతమైన మహిళ అనే చెప్పాలి. ఆమెది ఉద్యోగం చేసి డబ్బు సం పాదించాల్సిన అవసరం లేని జీవితమే. కానీ గృహిణి అనగానే తేలిగ్గా పరిగణించే సమాజం ఆమెకు చేసిన గాయాలెన్నో. తాను ఏదో ఒకటి సాధించాలనే కోరిక రగులుతూనే ఉండేదామెలో. ఆ కోరికే ఆమెను మాస్టర్ షెఫ్ ఇండియా 2023పోటీలకు తీసుకెళ్లింది. పోటీదారుల మీద రకరకాల కామెంట్లు రువ్విన సోషల్ మీడియా అరుణను ‘ఈవిడా... ఈవిడ గృహిణి’ అంటూ చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ లేదనే భావంతో తేలిక చేసింది. మాస్టర్ షెఫ్ కంటెస్టెంట్లలో అరుణకు ఎదురైన చేదు అనుభవం ఇది. దక్షిణ భారత వంటలు ఇడ్లీ, దోశెలతో ఆమె ప్రయోగాలు న్యాయనిర్ణేతల నోట్లో నీళ్లూరించాయి. పోటీదారుల్లో నాలుగవ స్థానంలో నిలిచింది. పోటీ పాల్గొన్న నాటికి టాప్ ఫోర్లో నిలిచిన నాటికి మధ్య ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకుంటూ ‘‘సోషల్ మీడియా కామెంట్లకు మనసు గాయపడి కన్నీళ్లతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని’ చెప్పింది. మన సమాజంలో ‘గృహిణి అంటే ఏమీ తెలియని వ్యక్తి’ అనే అభిప్రాయం బలంగా ముద్రించుకుపోయి ఉంది. ఆ అపోహను తుడిచి పెట్టగలిగాను. గృహిణుల మనోభావాలకు నేను గళమయ్యాను’’ అంటోంది అరుణా విజయ్. View this post on Instagram A post shared by Aruna Vijay (@aruna_vijay_masterchef) -
Sankranti 2025 : సులువుగా చేసుకునే పిండి వంటలు మీకోసమే!
భారతదేశం అంతటా మకర సంక్రాంతిని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలుగువారు ఎంతో పవిత్రంగా భావించే అతి ముఖ్యమైన పండుగ. భోగి, సంక్రాంతి, కనుక, ముక్కనుమ ఇలా ఒక్కోరోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. సంక్రాంతి వస్తోందంటే బోలడెన్ని పిండి వంటలు చేయాలి. చుట్టాలు, బంధువులు ముఖ్యంగా కొత్త అల్లుళ్లకి మర్యాదల సందడి ఎక్కువగా ఉంటుంది. మరి సంక్రాంతికి ఈజీగా చేసుకునే కొన్ని వంటకాల్ని చూద్దాం. పూర్ణం బూరెలుకావల్సినవి: పచ్చి శనగపప్పు - 2 కప్పులుమినప్పప్పు - కప్పుకొత్త బియ్యం - 2 కప్పులుబెల్లం తురుము - 2 కప్పులునెయ్యి - అర కప్పునూనె -సరిపడతయారి: మినపప్పు, బియ్యం కడిగి సరిపడా నీళ్లు పోసి కనీసం నాలుగైదు గంటలు నానబెట్టాలి. తర్వాత జారుగా కాకుండా, మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. శనగపప్పులో తగినన్ని నీళ్లు పోసి కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకోవాలి. చల్లారాక మందపాటి గిన్నెలో ఉడికించిన శనగపప్పుతోపాటు తరిగిన బెల్లం వేసి మళ్లీ ఉడికించాలి. బెల్లం పాకం వచ్చి, ఈ మిశ్రమం ఉండ చేసుకునే విధంగా అయ్యేలాగా ఉడికించుకోవాలి. చివరగా యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి దింపేయాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవాలి. ఆ తరువాత కడాయిలో నూనె పోసి బాగా కాగనివ్వాలి. ఇపుడు ముందే చేసిపెట్టిన ఒక్కో ఉండనూ మెత్తగా రుబ్బిన పప్పు మిశ్రమంలో ముంచి జాగ్రత్తగా నూనెలో వేసి, బంగారురంగు వచ్చేవరకు వేయించాలి. వేడివేడిగా బూరెల్లో నెయ్యి వేసుకొని తింటే భలే రుచిగా ఉంటాయి. నువ్వుల బొబ్బట్లు, బెల్లంతోకావల్సిన పదార్తాలు : తెల్ల నువ్వులు - 2 కప్పులు; బెల్లం తురుము - 2 కప్పులు; యాలకుల పొడి - ఒకటిన్నర టీ స్పూన్; మైదాపిండి- ఒకటిన్నర కప్పులు; నెయ్యి - సరిపడినంతతయారి: మైదాపిండిలో చిటికెడు ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసి చపాతీ పిండిలాగా మృదువుగా కలుపుకోవాలి. ఆ తరువాత దీనిని కొద్దిసేపు తడిబట్ట కప్పి ఉంచాలి. ఈలోపు బాణలిలో నువ్వులు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి. నువ్వులు చల్లారిన తర్వాత బెల్లం తురుము వేసి, రెండూ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో రుచికి, సువాసన కోసం యాలకులకు కూడా కలపాలి.ఇపుడు కలిపి ఉంచుకున్న పిండిని చిన్న ఉండలుగా చేసుకొని, చపాలీగా వత్తి అందులో నువ్వుల మిశ్రమం పెట్టి బొబ్బట్టు మాదిరిగా వత్తాలి. దీనిని పెనం మీద నెయ్యి వేస్తూ రెండు వైపులా మాడిపోకుండా జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఇదీ చదవండి : ఆంధ్ర దంగల్‌కు సై అంటున్న.. తెలంగాణ కోళ్లు! ఇంట్రస్టింగ్ విషయాలు పాకం గారెలుకావల్సినవి: మినప్పప్పు -అర కిలో, బెల్లం అర కిలో, కొద్దిగా నీళ్లు, నూనె - వేయించేందుకు సరిపడా నెయ్యి - 50 గ్రాములు యాలకుల పొడి - 1 టీ స్పూన్ ఉప్పు - రుచికి సరిపడాతయారి: పొట్టు తీసిన మినప్పప్పును ముందురోజు రాత్రి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నీళ్లన్నీ వంపేసి, గారె చేయడానికి అనువుగా పిండి గట్టిగా ఉండేలా రుబ్బుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు కలుపుకోవాలి.బెల్లం తురుములో తగినన్ని నీళ్లు పోసి లేతపాకం పట్టి, అందులో యాలకుల పొడి కలిపి పక్కన ఉంచాలి.గారెలు వత్తుకొని, నెయ్యి కలిపిన నూనెలో దోరగా వేయించి, వేడిగా ఉండగానే పాకంలో వేయాలి. వీటిని ఓ పూటంతా కదపకుండా ఉంచితే పాకంలో గారెలు బాగా నాని రుచిగా ఉంటాయి.గోధుమరవ్వ హల్వాకావల్సినవి: చిన్నగోధుమ రవ్వ - 1కప్పుపాలు - 2 కప్పులు; నీళ్లు - 1 కప్పుయాలకుల పొడి - చిటికెడుజీడిపప్పు పలుకులు - 10కిస్మిస్ - 10పంచదార - 2 కప్పులునెయ్యి - 4 పెద్ద చెంచాలుకుంకుమపువ్వు - కొద్దిగాతయారీ: మందపాటి గిన్నెలో నెయ్యి కొద్దిగా వేసి వేడిచేసుకోవాలి. ఇందులో జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే నెయ్యిలో రవ్వ వేసి దోరగా కమ్మని వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ రవ్వను ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇపుడు మరో గిన్నెలో చిక్కని పాలు, నీళ్లు కలిపి బాగా మరిగించాలి. దానిలో గోధుమరవ్వను కొద్ది కొద్దిగా పోస్తూ, ఉండలు లేకుండా కలుపుతూ ఉడకనివ్వాలి. రవ్వ బాగా ఉడికాక అందులో పంచదార, నెయ్యి కూడా వేసి బాగా కలపాలి. పంచదార కరిగి, హల్వా కొద్దిగా దగ్గరకి వచ్చేవరకు కలుపుతూ సన్నని మంట మీద ఉడికించాలి. దీంట్లో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, కుంకుమ పువ్వు వేసి మంట తీసేయాలి. ఘుమఘుమలాడే గోధుమరవ్వ హల్వా రెడీ. ఇదీ చదవండి : HMPV : మళ్లీ మాస్క్ వచ్చేసింది.. నిర్లక్ష్యం వద్దు! -
నోరూరించే కేఎఫ్‌సీ చికెన్ తయారీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ..!
ప్రస్తుతం యువతరం చాలా ఇష్టంగా లాగించే చికెన్ వెరైటీలో కేఎఫ్‌సీ ఒకటి. చాలామందికి ఈ కేఎఫ్‌సీ చికెన్ అంటే మహా ఇష్టం. ఫ్రైడ్ చికెన్‌లో ఇంతలా ప్రత్యేకతను సంతరించుకునేలా విభిన్నంగా ఎలా తయారు చేయాగలిగారో వింటే ఆశ్చర్యపోతారు. అందులోనూ లేటు వయసులో తన ఆర్థిక భద్రత గురించి కలిగిన ఆందోళన బిజినెస్ మెదలుపెట్టాలన్న ఆలోచనకు దారితీసింది. అదే చివరికి వెరైటీ రెసిపీని తయారు చేసేందుకు పురిగొల్పింది. చివరకు కనివిని ఎరుగని రీతీలో సక్సెస్‌ని అందుకుని స్ఫూర్తిగా నిలిచాడు. కలను సాకారం చేసుకోవాలన్న తపన ఉంటే వయసు పెద్ద అడ్డంకి కాదని ప్రూవ్ చేశాడు.అతడే కేఎఫ్‌సీ చికెన్ సృష్టికర్త కల్నల్ హార్లాండ్ సాండర్స్. అందరూ యంగ్ ఏజ్‌లో తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తారు. కొందరూ పూర్తి స్థాయిలో విజయవంతమవ్వగా మరికొందరూ..చిన్న చిన్న విజయాలతో సరిపెట్టుకుంటారు. చివరికి రిటైర్డ్ వయసు వచ్చేటప్పటికీ ఎంతోకొంత ఆర్థిక భద్రతతో కాలం వెళ్లదీస్తుంటారు. అయితే కల్నల్ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. చెప్పాలంటే ఎన్నో బిజినెస్‌లు చేశాడుగానీ ఎందులోనూ మంచి విజయం దక్కించుకోలేదు. అలా 65 ఏళ్లు వచ్చేటప్పటికీ అతడు ఎందులోనూ సక్సెస్ అందుకోని వ్యక్తిగా మిగిలిపోయాడు. పోనీ మిగతా జీవితం సాఫీగా గడిపేందుకు ఎలాంటి ఆర్థిక భద్రతను వెనకేసుకోలేదు. అతడి వద్ద కేవలం రూ. 8వేల రూపాయలే ఉన్నాయి. ఒక్కసారిగా ఏంటీ జీవితం ఇలా వృధాగా అయిపోయిందన్న బాధ కల్నల్‌ని నిలువనివ్వలేదు. ఆ సమయంలోనే తాను ఒక రుచకరమైన రెసిపీని తయారు చేయాలని గట్టిగా అనుకున్నాడు. తాను తయారు చేసే రెసిపీని చూడగానే తానే గుర్తొచ్చేలా.. అత్యద్భుతంగా తయారు చేయాలనుకున్నాడు. తన వద్ద కొద్దిపాటి వనరులతో చికెన్‌తో వెరైటీ రెసిపీ ఏదైనా చేయాలనుకున్నాడు. చెప్పాలంటే రెస్ట్ తీసుకునే వయసులో లక్ష్యం కోసం ఆహర్నిశలు కష్టపడటం మొదలుపెట్టాడు కల్నల్. ఫ్రైడ్ చికెన్ అంటే చాలామందికి ఇష్టమనే విషయం గ్రహించాడు. దానిలోనే ప్రత్యేక రుచితో కూడిన వెరైటీ ఫ్రైడ్ చికెన్ చేయాలనుకున్నాడు. అక్కడకు వరకు బాగానే ఉంది. తాను తయారు చేసిన ఫ్రైడ్ చికెన్లు సమీపంలోని రెస్టారెంట్ల వద్దకు వెళ్లి చేసి చూపించి వాళ్ల చేత శెభాష్ అనిపించుకోవడం అంత ఈజీ కాలేదు కల్నల్‌కి. ఏకంగా ఒక వెయ్యి తొమ్మిది సార్లుకు పైగా అతడు చేసిన రెసిపీ రిజక్ట్ అయ్యింది. విసుగు, కోపం వచ్చేస్తున్నా.. వెనకడుగు వేయకుండా వారి చేత బాగుంది అని ఒప్పుకునేదాక ప్రయత్నం విరమించలేదు. ఒక రోజు మజ్జిగలో నానబెట్టిన చికెన్‌ని బ్రెడ్ పౌడర్‌లో దొల్లించి తాను రెడీ చేసి పెట్టుకున్న మసాల మిశ్రమంలో ముంచి డీప్ ఫ్రై చేసి ఇవ్వగా ఒక రెస్టారెంట్ ఆ టేస్ట్‌కి ఫిదా అయిపోయింది. ఇక అంతే కొద్ది కాలంలో కల్నల్ చేసిన ఫ్రైడ్ చికెన్ బాగా ఫేమస్ అయిపోయింది. దానికి కెంటకీ ఫ్రైడ్ చికెన్ పేరుతో కేఎప్సీగా జనాల్లోకి తీసుకురావడం, ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోవడం చకచక జరిగిపోయాయి. అలా 1964 నాటికి అతడి బ్రాండ్ కెంటకీ ఫ్రైడ్ చికెన్ దేశవ్యాప్తంగా 600 ఫ్రాంచైజీలను కలిగి ఉంది. అదే సంవత్సరం తన బ్రాండ్‌ని సుమారు రూ. 16 కోట్లుకు విక్రయించాడు(ప్రస్తుత రోజుల్లో రూ. 144 కోట్లకు సమానం). అయితే అతనే ఆ బ్రాండ్‌కి అంబాసిడర్, ప్రతినిధి. దీంతో కల్నల్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సెలబ్రిటీగా మారిపోయాడు. కనీస ఆర్థిక భద్రత లేని వ్యక్తి కోటీశ్వరుగా మారిపోయాడు. చాలా లేటు వయసులో లక్ష్యం కోసం యత్నంచి అతిపెద్ద సక్సెస్‌ని అందుకుని.. లక్ష్యానికి వయసుతో సంబంధం లేదని ప్రూవ్ చేశాడు.(చదవండి: 77 ఏళ్ల నాటి కేకు ముక్క..! వేలంలో ఏకంగా..) -
ఆహా ఆవకాయ! ఒక ముద్ద పడిందంటే.. ఈ రుచులను ఎప్పుడైనా ట్రై చేశారా? (ఫొటోలు)
-
జొన్నలతో అధిక బరువుకు చెక్ : ఇలా ఒకసారి ట్రై చేయండి!
జొన్నలు అనగానే గుర్తొచ్చేది జొన్న సంగటి, జొన్న రొట్టెలు, జొన్న అన్నం. కానీ జొన్నలతో జావకూడా తయారు చేసు కోవచ్చు. జొన్నలను మన ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయి. మరి ఈజీగా జొన్న, ఉప్మా, కిచిడీ, జావను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.ఫైబర్-రిచ్ మిల్లెట్ జొన్నల్ని భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా - ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆసియా,మధ్య అమెరికాలో సాగు చేస్తారు. దాదాపు వేల ఏళ్లుగా పేద, గ్రామీణ ప్రజల సాధారణ భోజనంగా ఉండేది. అయితే జొన్నలు పోషకాహారం మాత్రమే కాదు, అధికబరువుతో బాధపడేవారికి మేలు చేస్తుంది. ఇందులోని ఫైటోకెమికల్స్ బరువు తగ్గడంలో,గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో పనిచేస్తాయి.హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరుస్తాయి.శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను ,ఇన్సులిన్ సెన్సిటివిటీని నియంత్రించి డయాబెటిస్ నియంత్రణలో సహాయపపడతాయి వీటితో పాటు, ఫైబర్, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్, ఫోలేట్ జోవర్ అధికంగా ఉండటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలకు చెక్ చెప్పవచ్చు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జొన్నల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మారుస్తుంది.జొన్నలతో జావజొన్న పిండిని అరకప్పు తీసుకోవాలి, మజ్జిగ ఒక కప్పు, ఉప్పు తగినంత తీసుకోవాలి. జొన్న పిండిలో నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలపాలి. వెడల్పాటి గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి బాగా మరిగిన తరువాత ముందుగానే కలిపి ఉంచుకున్న జొన్న పిండి మిశ్రమాన్ని కలపాలి. తక్కువ మంట మీద 5 నిమిషాల పాటు ఉండలు రాకుండా, కలుపుకుంటూ ఉడికించాలి. సరిపడా ఉప్పు, పలుచని మజ్జిగ కలిపి తాగాలి. నచ్చినవాళ్లు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు అల్లం, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. (మొలకెత్తిన రాగుల పిండితో లాభాలెన్నో: ఇంట్లోనే చేసుకోండిలా! )జొన్న ఉప్మాఒక కప్పు జొన్నలు లేదా రవ్వను సుమారు 8-12 గంటలు లేదా రాత్రిపూట నానబెట్టాలి.కుక్కర్లో మంచినీళ్లు, చిటికెడు పసుపు వేసి మూడు, నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.ఇపుడు ఉప్మా పోపు కోసం పాన్ వేడి చేసి, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి, ఆవాలు , జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇష్టమున్నవారు పచ్చి బఠానీ, క్యారట్, బంగాళాదుంపు, బీన్స్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి బాగా వేగాక ఉడికిని జొన్న రవ్వను కలుపుకోవాలి. టేస్ట్ కోసం రెండు టీస్పూన్ల మాగీ మసాలా ధనియాల పొడి కలుపుకోవచ్చు. ఐదు నుండి ఎనిమిది నిమిషాలు నెమ్మదిగా మంట ఉడకనిస్తే చాలు.జోవర్ ఖిచ్డీఅరకప్పు జొన్నల్ని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఒక బాండ్లీలో క్యాప్సికమ్, టమాటా,పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు గుమ్మడికాయ (ఐచ్ఛికం) ముక్కలు, ఎండుమిర్చి జీలకర్ర, ఇంగువ, ఇతర పోపు గింజలువేసి వేయించుకోవాలి. బాగా వేగాక నాన బెట్టిన జొన్నలు, సరిపడినన్ని నీళ్లు, అరకప్పు పాలు యాడ్ చేసి కుక్కర్లో మూడు విజిల్స్ దాకా ఉడికించుకోవాలి. తినేమందు తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. దీన్ని అల్లం లేదా కొబ్బరి చట్నీతోగానీ, పుట్నాల చట్నీతోగానీ తింటే భలే రుచిగా ఉంటుంది. (డ్రీమ్ జాబ్స్ అంటే ఇలా ఉంటాయా? వైరల్ వీడియో) -
Diwali 2024 పండగొస్తోంది.. ఈజీగా చేసుకునే స్వీట్లు, కుకీస్!
పండుగ వస్తోందంటే గృహిణులకు ఒకటే పని. ఇంటి శుభ్రంనుంచి పిండి వంటల దాకా ఎడతెగని పనులతో బిజీగా ఉంటారు. పెద్దగా హడావిడిగా లేకుండా, సులభంగా, ఆరోగ్యంగా తయారు చేసుకునే కొన్ని వంటల్ని ఇపుడు చూద్దామా.రాగి కుకీస్ కావలసినవి: రాగిపిండి – కప్పు; గోధుమపిండి – కప్పు; చక్కెర పొడి – కప్పు; బేకింగ్ పౌడర్ – టీ స్పూన్; యాలకుల పొడి– అర టీ స్పూన్; నెయ్యి – 15 టేబుల్ స్పూన్లు; పాలు – 4 టేబుల్ స్పూన్లు (అవసరమైతేనే వాడాలి).తయారీనెయ్యి కరిగించి పక్కన పెట్టాలి. వెడల్పు పాత్రలో రాగిపిండి, గోధుమ పిండి, చక్కెర పొడి, యాలకుల పొడి, బేకింగ్ పౌడర్ వేసి అన్నీ సమంగా కలిసేటట్లు గరిటెతో బాగా కలపాలి. ఇప్పుడు నెయ్యి వేసి మళ్లీ కలపాలి. చపాతీల పిండిలా ముద్దగా వస్తుంది. తగినంత తేమలేదనిపిస్తే పాలు కలపాలి. ఈ పిండి మీద మూత పెట్టి అరగంట పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఒవెన్‌ను 170 డిగ్రీలు వేడి చేయాలి. పిండిని ఫ్రిజ్‌లో నుంచి తీసి పెద్ద నిమ్మకాయంత గోళీలు చేయాలి. ఒక్కో గోళీని అరచేతిలో వేసి వత్తాలి. ఫోర్క్‌తో నొక్కి గాట్లు పెట్టి బేకింగ్ ట్రేలో సర్దాలి ∙ట్రేని ఒవెన్‌లో పెట్టి 12 నిమిషాల సేపు ఉంచాలి. కుకీ మందంగా ఉందనిపిస్తే మరో నిమిషం అదనంగా ఉంచాలి ∙ఒవెన్ లేక పోతే ప్రెషర్ కుకర్‌లో కూడా బేక్ చేసుకోవచ్చు. కుకర్‌లో ఉప్పు చల్లి గాస్కెట్, వెయిట్ తీసేసి మూత పెట్టి వేడి చేయాలి. ఆ తర్వాత కుకీలను అమర్చిన ట్రేని జాగ్రత్తగా కుకర్‌లో పెట్టి సన్న మంట మీద 15 నిమిషాల సేపు ఉంచాలి. అయితే కుకర్‌లో ఒకేసారి అన్నింటినీ బేక్ చేయడం కుదరక పోవచ్చు. కుకర్ సైజ్, ట్రే సైజ్‌ను బట్టి నాలుగైదు సార్లుగా చేయాలి ఈ బిస్కట్లను గాలి చొరబడని బాటిల్లో నిల్వ చేస్తే మూడు వారాల పాటు తాజాగా ఉంటాయి. మిల్క్ బర్ఫీకావల్సిన పదార్ధాలుపాలపొడి – రెండున్నర కప్పులుపంచదార – ముప్పావు కప్పుపాలు – కప్పునెయ్యి – పావు కప్పుపిస్తా పలుకులు – మూడు టేబుల్ స్పూన్లుతయారీ విధానంగిన్నెలో పాలపొడి, పంచదార, పాలు పోసి కలుపుకోవాలి.స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని పాలపొడి మిశ్రమం, నెయ్యివేసి సన్నని మంటమీద వేయించాలి.10 నిమిషాల తరువాత మిశ్రమం పాన్ కు అతుక్కోకుండా ఉండకట్టినట్టుగా అవుతుంది. అప్పుడు ఈ మిశ్రమాన్ని తీసి బేకింగ్ పేపర్ పరిచిన ట్రేలో వేయాలి.ట్రే మొత్తం సమానంగా పరుచుకునేలా మిశ్రమాన్ని వత్తుకోవాలి. పిస్తా పలుకులు వేసి మరోసారి వత్తుకోని, గంటపాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి.రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన తరువాత నచ్చిన ఆకారంలో ముక్కలు కట్ చేసుకుంటే మిల్క్ బర్ఫీ రెడీ. -
మునగాకును రోజూ ఇలా తింటే అద్భుతాలు : ఒక్కసారి తింటే!
మునగాకులో ఏ, బీ, సీ విటమిన్లుంటాయి. క్యాల్షియం, పొటాషియం, ఐరన్... మెగ్నీషియం, ఫాస్ఫరస్ కూడా ఉంటాయి. తరచూ తింటే చాలా మంచిది. రోజూ కూరల్లో వేసుకుంటే ఇంకా మంచిది. నొప్పిని నయం చేయడంలో,కండరాలను బలోపేతం చేయడంలో మునగాకు అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు ఇది చర్మానికి జుట్టు సంరక్షణలో బాగా పనిచేస్తుంది. మునగాకు – పెసరపప్పుకావలసినవి: మునగాకు – 4 కప్పులు; పెసరపప్పు– కప్పు; ఎండు మిర్చి – 1;ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు; వెల్లుల్లి రేకలు– 5;ఆవాలు – టీ స్పూన్; ఇంగువ –పావు టీ స్పూన్; పసుపు – అర టీ స్పూన్;మిరపపొడి– అర టీ స్పూన్; ఉప్పు – పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి;పచ్చి కొబ్బరి తురుము– పావు కప్పు; నూనె – 2 టేబుల్ స్పూన్లు;తయారీ: మునగాకులో ఈనెలు లేకుండా ఏరి వేసి ఆకును మంచి నీటితో శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. పెసరపప్పును కూడా కడిగి సిద్ధంగా ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రేకలు, ఇంగువ వేసి వేగిన తర్వాత పెసర పప్పు వేయాలి. ఇప్పుడు మునగాకు, పసుపు, మిరపపొడి వేసి కలిపి నీరు పోసి మూత పెట్టాలి. ఉడకడం మొదలైన తర్వాత మూత తీసి మరోసారి కలిపి మంట తగ్గించి ఉడికించాలి. నీరు తగ్గి పోయిన తర్వాత కొబ్బరి పొడి, ఉప్పు కలిపి మూత పెట్టి స్టవ్ ఆపేయాలి. ఇది అన్నం, రోటీల్లోకి బాగుంటుంది. మొరింగా టీమునగాకులో ఈనెలు, చిల్లు పడిన ఆకులు, పండిపోయిన ఆకులను ఏరివేసి శుభ్రంగా కడిగి చిల్లుల ΄ పాత్రలో వేసి నీరు పోయే వరకు ఉంచాలి. తర్వాత ఆకును ఒక పేపర్ మీద కానీ నూలు వస్త్రం మీద కాని వేసి తేమ పూర్తిగా ఆరి పోయే వరకు ఉంచాలి. మునగాకును ఎండ బెట్టకూడదు, నీడలోనే ఆరబెట్టాలి. వాతావరణాన్ని బట్టి ఒకటి లేదా రెండు రోజుల్లో ఆరి పోతాయి.ఆకులను చేత్తో కదిలించినప్పుడు తేమలేకుండా గలగలలాడాలి. ఆకులను మిక్సీ జార్లో మెత్తగా పొడి చేయాలి. పొడిని జల్లించి తేమ లేని సీసాలో నిల్వ చేసుకోవాలి. టీ తయారీ: పావు లీటరు నీటిని మరిగించి అందులో టీ స్పూన్ మొరింగా ΄పౌడర్ వేసి మూత పెట్టాలి. ఓ నిమిషం తర్వాత గ్లాసులో పోసుకుని తాగాలి. రోజూ ఉదయం ఈ మొరింగా టీ తాగితే అధిక బరువు తగ్గుతుంది.గమనిక: ఇలా తయారు చేసుకున్న ΄ పొడి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది. కూరల్లో, పప్పులోకి తాజా మునగాకు దొరకని రోజుల్లో ఈ పొడిని వేసుకోవచ్చు. -
రాగులతో దూదుల్లాంటి ఇడ్లీ, రుచికరమైన ఉప్మా : ఇలా చేస్తే ఎవ్వరైనా ఫిదా!
తృణధాన్యాల్లో ప్రముఖమైనవి రాగులు (finger millets). రాగులతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చాల ఉన్నాయి. రాగులలో ప్రోటీన్ , ఫైబర్స్ వంటి స్థూల పోషకాలతో పాటు, కాల్షియం, మెగ్నీషియం, మెథియోనిన్, లైసిన్ ,అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఇవి సులభంగా జీర్ణం అవుతాయి. కాబట్టి చిన్న పిల్లలతోపాటు, వృద్ధులకూ ఆహారంగా ఇవ్వవచ్చు. రాగులతో రకరకాలుగా వంటకాలను తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం.ఇడ్లీని సాధారణంగా బియ్యం ,మినప్పప్పుతో తయారు చేస్తారు.కానీ హెల్తీగా రాగులతో కూడా ఇడ్లీ తయారు చేసే విధానం ఇప్పుడు తెలుసుకుందాం.కావాల్సిన పదార్థాలు ఒక కప్పు రాగుల పిండి ఒక కప్పు సూజీ/రవ్వ) ఒక కప్పు పుల్లని పెరుగుతాజా కొత్తిమీర (సన్నగా తరిగినవి)ఉప్పు (రుచి కి తగినంత ) అర టీస్పూన్ బేకింగ్ సోడాపోపుగింజలుకావాలంటే ఇందులో శుభ్రంగా కడిగి తురిమిన క్యారెట్ ,ఉల్లిపాయకూడా కలుపుకోవచ్చు.తయారీ : పిండి తయారీ వెడల్పాటి గిన్నెలో పిండి, రవ్వ, పుల్లని పెరుగు, సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. దీన్ని కనీసం అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి.వేడి నూనెలో ఆవాలు జీలకర్ర, జీడిపప్పు, కొన్ని ఎర్ర/ఎండు మిరపకాయలు, కొన్ని కరివేపాకులువేసి పోపు రెడీ చేసుకోవాలి. ఇవి వేగాక ఇందులోనే తరిగిపెట్టుకున్న క్యారట్, ఉల్లిపాయముక్కలను వేయాలి. ఇది చల్లారాక రాగుల పపిండిలో కలపాలి. తరువాత బేకింగ్ సోడా(పెరుగు పుల్లగా ఉంటే ఇది కూడా అవసరంలేదు) బాగా కలపాలి.ఇడ్లీ తయారీ: దీన్ని ఇడ్లీ కుక్కర్లేదా, ఇడ్డీపాత్రలో ఆవిరి మీదకొద్దిసేపు హైలో , తరువాత మీడియం మంటమీద ఉడికించుకోవాలి. ఇడ్లీ ఉడికిందో లేదో చెక్ చేసుకోని, తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే రాగి ఇడ్లీ రెడీ. అల్లం, పల్లీ, పుట్నాల చట్నీతోగానీ,కారప్పొడి నెయ్యితోగానీ తింటే మరింత రుచిగా ఉంటుంది. (నవరాత్రుల ఉపవాసాలు : ఈజీగా, హెల్దీగా సగ్గుబియ్యం కిచిడీ)రాగి ఉప్మా కావలసినవి: రాగి రవ్వ– కప్పు; నీరు – రెండున్నర కప్పులు; ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి; నూనె లేదా నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; కరివే΄ాకు – 2 రెమ్మలు; పచ్చిమిర్చి – 2 (తరగాలి); ఇంగువ – చిటికెడు; ఆవాలు – అర టీ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; వేరుశనగపప్పు – 3 టేబుల్ స్పూన్లు; అల్లం తరుగు – టీ స్పూన్; పచ్చి శనగపప్పు – అర టేబుల్ స్పూన్; మినప్పప్పు టీ స్పూన్; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; ఒక నిమ్మకాయతయారీ: రాగి రవ్వను కడిగి నీటిని వడపోయాలి. రవ్వ మునిగేటట్లు నీటిని పోసి అరగంట సేపు నాన పెట్టాలి. తర్వాత నీటిలో నుంచి రవ్వను తీసి పిడికిలితో గట్టిగా నొక్కి నీరంతా ΄పోయేటట్లు చేసి (ఇడ్లీ రవ్వలాగానే) పక్కన పెట్టాలి బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, వేరుశనగపప్పు, శనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేగిన తర్వాత అందులో ఉల్లియ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత రవ్వ వేసి సన్నమంట మీద దోరగా వేయించాలి. ఈ లోపు పక్కన మరో స్టవ్ మీద నీటిని వేడి చేయాలి. రవ్వ వేగి మంచి వాసన వచ్చేటప్పుడు ఉప్పు వేసి నీటిని పోసి కలిపి రుచి చూసి అవసరమైతే మరికొంత ఉప్పు కలిపి బాణలి మీద మూత పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లి మళ్లీ మూత పెట్టాలి ∙. రాగి రవ్వకు బొంబాయి రవ్వకంటే ఎక్కువ నీరు పడుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని, రవ్వ ఉడకలేదు అనుకుంటే కాసిన్ని నీళ్లు జల్లి మూత పెట్టుకోవాలి. అంతే వేడి వేడి రాగి ఉప్మా రెడీ. ఈ ఉప్మాను పల్లీ, అల్లం, మరేదైనా మనకిష్టమైన చట్నీతోగానీ తినవచ్చు.ఇవీ చదవండి : రాగిజావ రోజూ తాగుతున్నారా? ఇవి తెలుసుకోండి!రాగిముద్ద-నాటుకోడి పులుసు సూపర్ కాంబో -
తొమ్మిది రోజుల పూల బతుకమ్మలు నైవేద్యాలు..! (ఫొటోలు)
-
నవరాత్రుల ఉపవాసాలు : ఈజీగా, హెల్దీగా సగ్గుబియ్యం కిచిడీ
దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యం అనగానే పులిహోర, పాయసంలేదా క్షీరాన్నం గుర్తొస్తాయి. తొమ్మిది రోజుల పాటు, తొమ్మిది అవతారాల్లో జగన్మాతకు మొక్కుతారు. తొమ్మిది రకాల నైవేద్యాలతో దుర్గాదేవిని పూజిస్తారు. ఒంటిపూట మాత్రమే భోజనం చేస్తూ రెండోపూట పండ్లు, ఫలహారాలతో ఉపవాసాలు కూడా చేస్తారు. మరి ఉపవాస సమయంలో రాత్రిపూట తేలిగ్గా జీర్ణమయ్యే సగ్గుబియ్యంతో చేసుకునే కిచిడీ గురించి తెలుసుకుందాం.సగ్గుబియ్యం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.సులభంగా తయారు చేసుకోవచ్చు కూడా. సగ్గుబియ్యంలో ఫైబర్, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఉంటాయి.సగ్గుబియ్యం లేదా సాబుదానా కిచిడీకి కావాల్సిన పదార్థాలుసగ్గుబియ్యం, ఒక కప్పు, ఒక బంగాళదుంప - పెద్దది అయితే ఒకటి, చిన్నవి రెండుపచ్చిమిరపకాయలు నాలుగైదు,నెయ్యి , కొద్దిగా అల్లం ముక్క,ఉప్పు, తయారీసగ్గుబియ్యాన్ని నీటిలో కడిగి, నీళ్లు తీసేసి మూడు గంటలు నానబెట్టాలి.పల్లీలను వేయించి, పొట్టుతీసి, చల్లారాక కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి.అలాగే బంగాళాదుంపును ఉడికించి పొట్టు తీసి చిన్న ముక్కులుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండ్లీ పెట్టి కొద్దిగి నెయ్యి వేసుకోవాలి. ఇది వేడెక్కాక జీలకర్ర, అల్లం, పచిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇపుడు ఉడికించిన ఆలూ ముక్కల్ని వేసుకోవాలి. బాగా వేగిన తరువాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేయాలి. కొద్ది సేపు వేగాక, రెండు కప్పుల నీళ్లు పోసి సన్న మంట మీద ఉడకనివ్వాలి. ఇపుడు పల్లీల పౌడరు వేసి బాగా కలపాలి. ఒక్కసారి రుచి చూసుకొని కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. సగ్గుబియ్యం చాట్సగ్గుబియ్యం చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు సగ్గుబియ్యం, ఉడికించి, తరిగిన బంగాళాదుంప ముక్కలు, టమోటా,కప్పు చట్నీ, ఫాస్టింగ్ రాక్ సాల్ట్, నల్ల మిరియాలు, వేరుశెనగలు, చీజ్ అవసరం.తయారీ ముందుగా సగ్గుబియ్యాన్నినీటిలో గంటసేపు నానబెట్టాలి. తరువాత వేరుశెనగలను వేయించాలి. ఇప్పుడు బంగాళదుంపలను ఉడకబెట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అన్ని పదార్థాలను ఒక గిన్నెలో వేసి పెరుగు, చట్నీ కలపండి. ఉప్పు, మసాలాలు వేసి బాగా కలపాలి. అంతే సగ్గుబియ్యం చాట్ రెడీ -
Dussehera 2024 : నవరాత్రి స్పెషల్, కమ్మని ప్రసాదాల తయారీ
దసరా వేడుకలకు సమయం సమీపిస్తోంది. ఒకవైపు షాపింగ్, మరోవైపు పిండివంటలు సందడి షురూ అయిపోయింది. తొమ్మిది రోజులు అమ్మవారికి పలు రకా నైవేద్యాలు మాత్రమేకాదు, ఇంటికొచ్చే అతిథులకు, మనవళ్లు, మనవరాళ్లకు రకరకాల వంటలు చేసి పెట్టాల్సిందే. ముఖ్యంగా స్వీట్లపై పెద్ద పీట. అటు అమ్మవారికి నైవేద్యంగా ఉపయోగపడేలా, ఇటు ఇంట్లో అందరూ ఇష్టంగా తినేలా కొన్ని వంటకాలు చూద్దాం.పండుగరోజు పులిహోర, పూర్ణం బూరెలు,గారెలు, బొబ్బట్లు (భక్య్షాలు) తదితర వంటకాలు చేసుకోవడం అలవాటు. కానీ సులువుగా చేసుకొనే మరికొన్ని వంటకాలను చూద్దాం.పెసరపప్పు పొంగలికావాల్సిన పదార్థాలుబియ్యం - ఒక కప్పుపెసరపప్పు - ఒక కప్పుబెల్లం - రెండు కప్పులుకొబ్బరి ముక్కలు - అరకప్పుజీడిప్పులు ,బాదం, కిస్ మిస్కొద్దిగా, యాలకు పొడి అరస్పూనునెయ్యి - అర కప్పుతయారీ బాండ్లీలో కొద్దిగా నెయ్యి వేసి, కొబ్బరి ముక్కలు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాతజీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పులను నేతిలో దోరంగా వేయించుకోవాలిఇప్పుడు బియ్యం, పెసపప్పు బాగా కడిగి నీళ్లుపోసి నాలుగు మెత్తగా కుక్కర్లో ఉడికించుకోవాలి. కుక్కర్ మూత వచ్చిక, అన్నంలో ముందుగా తరిగిపెట్టుకున్న బెల్లం తురుము వేసుకొని అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. బెల్లం పాకం వచ్చి, పాయసంలాగా తయారవుతూ, కమ్మని వాసన వస్తూంటుంది. ఇపుడు ముందుగా వేయించుకున్న కొబ్బరిముక్కలు, జీడిపప్పులు, కిస్ మిస్లు,బాదం పలుకులు వేసి బాగా కలపాలి. చివర్లో కొద్దిగా నెయ్యి, యాలకుల పొడి వేసుకుంటే కమ్మని పెసరపప్పు పొంగలి నైవేద్యం రెడీ.కట్టు పొంగలి కావలసిన పదార్థాలుబియ్యం: రెండు కప్పులు,పెసరపప్పు: ఒక కప్పు, మిరియాలు, జీలకర్రకరివేపాకు రెండు రెబ్బలు, అయిదారు పచ్చిమిరపకాయలు కొద్దిగా నెయ్యి, నూనె,ఉప్పు తగినంత, చిటికెడు ఇంగువ: చిటికెడుతయారీ: ఒకటి రెండు చొప్పున పెసరప్పు, బియ్యం శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి.ఇపుడు స్టవ్‌మీద మూకుడు పెట్టి కొద్దిగా నూనె వేసి, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేగిన తరువాత కొలతకు తగ్గట్టుగా నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు నానిన బియ్యం, పప్పు , ఉప్పు వేసి కొద్ది సేపు ఉడకనివ్వాలి. మెత్తగా ఉడికాక నేతిలో వేయించుకొన్న జీడిపప్పులు వేసుకోవాలి. అంతే మిరియాలు, ఇంగుల ఘాటుతో, వేడి వేడి నెయ్యితో రుచికరమైన కట్టు పొంగలి రెడీ.బాదం పాయసంకావాల్సిన పదార్థాలుబాదం పప్పులు: ఒక కప్పుపాలు - ఆరు కప్పులుపంచదార - ఒక కప్పునీళ్లు - ఒక గ్లాసుకుంకుమ రేకలు: అయిదు రేకలుతయారీ: ముందుగా బాదం పప్పులను నానబెట్టుకోవాలి. శుభ్రంగా పొట్టుతీసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇపుడు కడాయి పెట్టి చిక్కని పాలు పోసి బాగా మరగనివ్వాలి. పాలు మరిగాక బాదం పేస్టు వేసి బాగా కలపాలి. కదుపుతూ పదినిమిషాల పాటూ ఉడికించాలి. బాదం పాలల్లో బాగా కలిసాక, పంచదార వేయాలి. పంచదార వేసాక పాయం చిక్కబడుతుంది. అడుగు అంటకుండా మెల్లగా కలుపుతూ మరింత చిక్కగా అయ్యేదాకా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇపుడు కొద్దిగా యాలకుల పొడి, నానబెట్టిన కుంకుమ పువ్వు రేకులను అలా పైన చల్లుకోవాలి. అంతే, టేస్టీ, టేస్టీ బాదం పాయసం సిద్దం. -
నాలుక అబద్ధం చెప్పదు..
నీర్ దోసె అంటే నూనె వేయకుండా పెనం మీద నీటిని చల్లి వేసే దోసె. మైసూర్ మసాలా దోసె, రసం ఇడ్లీ, టొమాటో ఉప్మా, ఆనియన్ ఊతప్పం... ఇవన్నీ మనకు తెలిసినవే, ఖోట్టో... ఇది ఇడ్లీ పిండిని పనస ఆకులతో అల్లిన బుట్టలో వేసి ఆవిరి మీద ఉడికించే వంటకం. ఈ దక్షిణాది రుచుల పేరు చెబితే ముంబయి వాసుల నోట్లో నీళ్లూరతాయి. క్రికెట్ ప్లేయర్లు సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్లు ఈ రుచుల కోసం ముంబయి నగరం, మాతుంగలో ఉన్న మైసూర్ కేఫ్‌ను విజిట్ చేసేవాళ్లు.స్వాతంత్య్రానికి ముందు 1936 నుంచి ముంబయిలో స్టవ్ వెలిగించిన ఈ కేఫ్‌కి గవాస్కర్, సచిన్‌ల కంటే ముందు ఏ ప్రముఖులు క్యూ కట్టారో తెలియదు. కొత్త పెళ్లికొడుకు అనంత్ అంబానీ ఆదివారాలు ఇక్కడే గడిచేవని ఇటీవల తెలిసింది. తన పెళ్లి వేడుకలో ఈ కేఫ్ స్టాల్ కూడా పెట్టించారు. వధువు రాధికా మర్చంట్‌కు ఈ కేఫ్ నిర్వహకురాలు శాంతెరీ నాయక్‌ను చూపిస్తూ ‘మీట్ మైసూర్ కేఫ్ ఓనర్’ అని పరిచయం చేశాడు. వధువు ఆ పెద్దావిడపాదాలను తాకి నమస్కరించింది. ఈ వీడియోతో శాంతెరీ ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించింది.టూర్లో ‘టేస్ట్’ చూస్తాను..ముంబయి నగరం, మాతుంగ ఏరియాలో కింగ్స్ సర్కిల్ రైల్వేస్టేషన్ దగ్గర ఉంది మైసూర్ కేఫ్. శాంతెరీ నాయక్ మామగారు నాగేశ్ రామ నాయక్ ఈ కేఫ్‌ను స్థాపించాడు. కర్నాటక నుంచి ముంబయిలో అడుగు పెట్టి ఆహారమే తన కుటుంబానికి అన్నం పెడుతుందని నమ్మారాయన. ఆ నమ్మకాన్ని నిలబెట్టారు శాంతెరీ నాయక్. ఇప్పుడామె కుమారుడు నరేశ్ నాయక్ సహాయంతో కేఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘బెస్ట్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్’ అనే ప్రజల ప్రశంసలే ఆమె అందుకున్న పురస్కారాలు. వివిధ ప్రదేశాలను పర్యటించడం ఆమె హాబీ. పర్యటనలో భాగంగా ఆయా ప్రదేశాల్లో ఏయే ఆహారాలు అందుబాటులో ఉంటున్నాయి, పర్యాటకులు ఏ రుచులను ఎక్కువ గా ఇష్టపడుతున్నారో గమనిస్తూ, వాటిని రుచి చూస్తానని చె΄్తారామె.కస్టమర్ అభిప్రాయమే తుదితీర్పు..‘‘వంటలను ఇష్టపడడమే నా సక్సెస్ ఫార్ములా. అమ్మకు సహాయం చేసే క్రమంలోనే రుచిగా వండడంలో మెళకువలు తెలిశాయి. అమ్మ వండిన పదార్థాలను ఇంటికి వచ్చిన అతిథులకు వడ్డించే బాధ్యత కూడా నాదే. వాళ్లకు ఏది నచ్చిందో అర్థమయ్యేది. అదే ఫార్ములాను కేఫ్ నిర్వహణలోనూ అనుసరించాను. మన ఉద్యోగులను నమ్మాలి, అంతకంటే ఎక్కువగా కస్టమర్లను నమ్మాలి. రుచి, అభిరుచుల విషయంలో కస్టమర్ల నోటి నుంచి వచ్చిన మాటే వేదవాక్కు. పదార్థాల రుచిని ఆస్వాదించిన నాలుక ఫీడ్ బ్యాక్ విషయంలో అబద్ధం చెప్పదు’’ అంటారు శాంతెరీ నాయక్. డెబ్బైఏళ్ల వయసులో కూడా చురుగ్గా, కేఫ్ నిర్వహణ పట్ల శ్రద్ధగా ఉన్నారామె. వార్థక్యం దేహానికి మాత్రమే, మనసుకు కాదు, పనిచేసే మనస్తత్వానికి కాదని నిరూపిస్తున్నారు శాంతెరీ నాయక్. -
ఈవినింగ్ స్నాక్స్ : ఒక్కసారి టేస్ట్ చేస్తే అస్సలు వదలరు
వర్షాకాలంలో సాయంత్రంపూట ఏదైనా తినాలనిపిస్తుంది. అలాగే స్కూలు నుంచి పిల్లలు కూడా ఏదో ఒకటి తినడానికి కావాలని మారాం చేస్తూ ఉంటారు. నోటికి రుచిగా ఉండే వెరైటీ స్నాక్స్ కోసం ఆశగా ఎదురు చూసే అత్త మామలు..వీళ్లందర్నీ సంతృప్తి పరచాలంటే.. ఇదిగో ఐడియా!పల్లీ పకోడికావలసినవి: వేరు శనగపప్పు – పావు కిలో (పచ్చివి); శనగపిండి – 2 టేబుల్ స్పూన్లు; బియ్యప్పిండి– టేబుల్ స్పూన్; మొక్కజొన్న పిండి (కార్న్‌ఫ్లోర్)– టీ స్పూన్; మిరపపొపడి– టీ స్పూన్; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి; చాట్ మసాలా పొడి– టీ స్పూన్; ఇంగువ – పావు టీ స్పూన్; నిమ్మరసం – టీ స్పూన్; కరివేపాకు – 2 రెమ్మలు; నీరు – పావు లీటరు (అవసరాన్ని బట్టి వేయాలి); నూనె – వేయించడానికి తగినంత.తయారీ: వేరుశనగపప్పును మెత్తటి వస్త్రంలో వేసి తుడవాలి. ఆ తర్వాత వాటిని ఒక పాత్రలో వేయాలి. అందులో శనగపిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, మిరప్పొడి, చాట్ మసాలా, ఇంగువ, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు నిమ్మరసం వేసి మరోసారి సమంగా కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీటిని వేస్తూ పిండి వేరుశనగపప్పుకు పట్టేటట్లు మిశ్రమాన్ని తడి పొడిగా కలుపుకోవాలి. బాణలిలో నూనె వేడి చేయాలి. మరగడం మొదలైన తర్వాత మంట తగ్గించి వేరుశనగపప్పుల మిశ్రమాన్ని చేత్తో తీసుకుని వేళ్లను కదుపుతూ గింజలు విడివిడిగా పడేటట్లు జాగ్రత్తగా నూనెలో వదలాలి. నూనెలో కాలుతున్నప్పుడు చిల్లుల గరిటెతో కలియబెడుతూ లోపల గింజలో పచ్చిదనం పోయి దోరగా వేగే వరకు కాలనిచ్చి తీయాలి. ఇలా మొత్తం పప్పులను వేయించి ఒక పాత్రలో వేయాలి ∙ఇప్పుడు అదే నూనెలో కరివేపాకులు వేసి చిటపటలాడిన తర్వాత తీసి పకోడీ మీద వేసి కలపాలి. ఈ పల్లీ పకోడీ మరీ వేడి ఉన్నప్పుడు తింటే రుచి తెలియదు. వేడి తగ్గిన తరవాత తినాలి. చల్లారిన తర్వాత గాలి దూరని డబ్బాలో నిల్వ చేస్తే వారం రోజులు తాజాగా ఉంటాయి.పీ నట్ చాట్కావలసినవి: వేరు శనగపప్పు – కప్పు (వేయించినవి); ఉల్లిపాయ – 1 (తరగాలి); టొమాటో – 1 (తరిగి గింజలు తొలగించాలి); కొత్తిమీర తరుగు – పావు కప్పు; నిమ్మరసం – టీ స్పూన్; మిరప్పొడి– అర టీ స్పూన్; చాట్ మసాలా– టీ స్పూన్; ఉప్పు – పావు టీ స్పూన్; నూనె– 2 టీ స్పూన్లు.తయారీ: ∙బాణలిలో నూనె వేడి చేసి స్టవ్ ఆపేయాలి. నూనెలో మిరపపొడి, చాట్ మసాలా, వేరుశనగపప్పు వేసి కలపాలి. పప్పు వేడెక్కిన తర్వాత ఒక పాత్రలోకి తీసుకుని ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, కొత్తిమీర వేయాలి. చివరగా నిమ్మరసం చల్లి, ఉప్పు కలపాలి. ఇది అన్ని వయసుల వారికీ మంచి ఆహారం. -
ఆషాఢంలో.. మునగాకు తినాలని మీకు తెలుసా!?
ఆషాడంలో గోరింటాకు పెట్టుకుని మురిసిపోతాం. మునగాకు తినాలని కూడా చెప్పారు పెద్దవాళ్లు. మహిళల ఆరోగ్యాన్ని సంప్రదాయాల పట్టికలో చేర్చారు. పెద్దవాళ్లు చెప్పిన పద్ధతులను పాటిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.కొబ్బరి మునగాకు వేపుడు..కావలసినవి..మునగాకు పావు కేజీ;పసుపు – పావు టీ స్పూన్;పచ్చి కొబ్బరి తురుము– పావు కప్పు;ఉల్లిపాయ ముక్కలు– పావు కప్పు;ఉప్పు – అర టీ స్పూన్;మిరప్పొడి– టీ స్పూన్;నూనె – టేబుల్ స్పూన్;ఆవాలు– అర టీ స్పూన్;పచ్చి శనగపప్పు – టేబుల్ స్పూన్;వెల్లుల్లి రేకలు– 4;కరివేపాకు– 2 రెమ్మలు.తయారీ..మునగాకులో పుల్లలు తీసివేసి, ఆకును శుభ్రంగా కడిగి నీరు పోయేటట్లు చిల్లుల పాత్రలో వేయాలి.అరగంటసేపు పక్కన ఉంచాలి. బాగా ఆరిన తర్వాత ఒక పాత్రలోకి తీసుకుని అందులో కొబ్బరి తురుము, పసుపు వేసి కలపాలి.బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, ఎండుమిర్చి, పచ్చి శనగపప్పు వేసి అవి వేగిన తర్వాత వెల్లుల్లి రేకలు, ఉల్లిపాయ ముక్కలు, మిరప్పొడి, కరివేపాకు వేసి వేయించాలి.అవి వేగిన తర్వాత ముందుగా కలిపి సిద్ధంగా ఉంచుకున్న మునగాకు, కొబ్బరి మిశ్రమం, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి సన్న మంట వేగనివ్వాలి.మధ్యలో మూత తీసి కలుపుతూ ఆకులో పచ్చిదనం, తేమ పోయే వరకు వేగనిచ్చి ఉప్పు సరిచూసుకుని ఆపేయాలి.మొరింగా ఆమ్లెట్..కావలసినవి..కోడిగుడ్లు – 2;మునగాకు – అర కప్పు;ఉప్పు – పావు టీ స్పూన్;మిరియాలపొడి– పావు టీ స్పూన్;వెన్న లేదా నెయ్యి– టేబుల్ స్పూన్.తయారీ..మునగాకులో పుల్లలు ఏరివేసి ఆకును శుభ్రంగా కడిగి నీరంతా పోయేటట్లు చిల్లుల పాత్రలో వేయాలి.నీరు కారిపోయిన తర్వాత తరిగి ఒక పాత్రలో వేయాలి.అందులో ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి.ఆ తర్వాత కోడిగుడ్లు కొట్టి సొనవేసి కలపాలి.పెనం వేడిచేసి వెన్న లేదా నెయ్యి వేసి కరిగిన తర్వాత మునగాకు, కోడిగుడ్ల మిశ్రమాన్ని వేయాలి.ఒకవైపు కాలిన తర్వాత తిరగేసి రెండోవైపు కూడా దోరగా కాలనిచ్చి స్టవ్ ఆపేయాలి. గమనిక: కోడిగుడ్డు సొన కాలే సమయంలో మునగాకు కూడా మగ్గిపోతుంది. పచ్చివాసన వస్తుందని సందేహం ఉంటే మునగాకును పెనం మీద పచ్చివాసన పోయే వరకు వేయించి ఆ తర్వాత మిగిలిన దినుసులను కలిపి ఆమ్లెట్ వేసుకోవాలి.ఇవి చదవండి: ఆషాఢంలో అత్తాకోడళ్లు ఒక గడప దాటకూడదా? -
పచ్చిమిర్చితో అందమా? అస్సలు ఊహించలేరు!
పచ్చి మిరపకాయలేని కూరను ఊహించలేం కదా. పచ్చిమిర్చి అనగానే సహజంగా సుర్రున మండే కారం, కూరల్లో వాటి ప్రాధాన్యత, ఇంకాస్త ముందుకెడితే ఊరబెట్టిన మిరపకాయలు గుర్తొస్తాయి కదా. కానీ మన శరీరానికి కావాల్సిన విటమిన్లు పచ్చి మిర్చిలో పుష్కలంగా ఉంటాయి. జుట్టు అందాన్ని, చర్మమెరుపును సాధించవచ్చు. రోగ నిరోధక వ్యవస్థను పెంచే విటమిన్ సీ, చర్మ సంరక్షణకు తోడ్పడి, కంటి చూపును మెరుగు పరిచే విటమిన్ ‘ఏ’ కూడా వీటి ద్వారా లభ్యమవుతుంది తెలుసా? మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే.పచ్చిమిర్చిని శాస్త్రీయంగా క్యాప్సికమ్ ఫ్రూట్సెన్స్ అంటారు. మిర్చిల్లో క్యాప్సైసిన్ అనే పదార్థమే దీని రుచి కారంగా ఉండడానికి కారణం. దీన్ని ఏడాది పొడవునా సాగు చేస్తారు. దాదాపు 400 రకాల పచ్చి మిరప కాయలు వినియోగంలో ఉన్నాయట. వీటిల్లో ఒక్కొక్కటి ఒక్కో స్థాయిలో ఘాటు కలిగి ఉంటాయి.యాంటీమైక్రోబయల్ లక్షణాలతోపాటు, పచ్చి మిరపకాయలలో ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్స్, ఎసెన్షియల్ ఆయిల్స్, టానిన్లు, స్టెరాయిడ్స్ , క్యాప్సైసిన్ వంటి అనేక మొక్కల సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. పచ్చి మిరపకాయల్లో ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి పోషకాలతో పాటు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయని పరిశోధనలో తేలింది.పచ్చి మిరపకాయల వల్ల కలిగే ప్రయోజనాలుదీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణడయాబెటిస్కు రోగులకు ఉపయోగపడుతుంది.రక్తహీనతను నయం చేయడంలో సహాయపడుతుందిబరువు తగ్గడానికి సహాయం చేయడంచలికాలంలో శరీర ఉష్ణోగ్రతలను బ్యాలెన్స్ చేస్తుందిపొట్టలో అల్సర్లను తగ్గిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ కారణంగా పచ్చిమిర్చి నొప్పి నివారిణిగా పనిచేస్తుంది.కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. బోలు ఎముకల వ్యాధి నివారణలో సహాయం చేస్తుందిజీర్ణక్రియను మెరుగుపరుస్తుందిఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది.వీటిల్లోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడితే, విటమిన్ ఈ వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది.జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుందిశరీరంలో రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. జలుబు, దగ్గు సమస్యలకు పచ్చిమిర్చి దివ్యౌషధం.నోట్: ఆరోగ్య ప్రయోజనాలున్నాయి కదా అని దేన్నీ అతిగా తినడం మంచిది కాదు. శృతిమించితే ప్రయోజనాలు లభించక పోగా అనారోగ్యాన్ని చేతులారా కొని కొంటామనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. -
నయా ట్రెండ్ : అమ్మమ్మ చేతి వంట
నిన్నటి తరం పిల్లలకు అమ్మమ్మ నాన్నమ్మ వంటకాల రుచి గురించి చెబితే చాలు నగర వాసపు జీవితాల్లో ఆ రుచిని మిస్ అవుతున్న విధానాన్ని తలుచుకొని మరీ బాధ పడి పోతారు. ఆనంద్ భరద్వాజ్ అతని భార్య నళిని పార్థిబన్‌లు చెన్నైలో ఉంటున్నతమ అమ్మమ్మ జానకి పాటి వంటకాలను పండగల సమయాల్లో ఎంతగా కోల్పోతున్నామో గ్రహించారు. చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి, అమ్మమ్మ వద్దకు పరిగెత్తుకు వెళ్లారు. 82 ఏళ్ల అమ్మమ్మ చేత వ్యాపారాన్ని ప్రారంభించారు.నేడు 32 దేశాలకు ఆ రుచులను అందిస్తూ ఈ వయసులో అమ్మమ్మను వ్యాపారవేత్తగా మార్చేశారు. దేశంలో దక్షిణ భారతీయ వంటకాలకు ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ముఖ్యంగా పండగల సమయాల్లో బామ్మలు వండే పిండివంటల రుచి మనుమలను నగరవాసం నుంచి లాక్కుని వచ్చేలా చేస్తుంది. అచ్చం ఇదే విధంగా 2015లో దీపావళి సమయంలో కుటుంబ సభ్యులు బామ్మ జానకి పాటి స్పెషల్ వంటకాలను మిస్ అయ్యారు. బామ్మ చేతి వంట రుచి గొప్పతనాన్ని ఆమె మనవడు ఆనంద్ భరద్వాజ్ అతని భార్య నళిని పార్థిబన్ మరీ మరీ గుర్తు చేసుకున్నారు. ‘దీపావళికి మా అమ్మమ్మ జాంగ్రీలు, మురుకులు, మైసూర్ పాక్‌లను చాలా జాగ్రత్తగా తయారు చేసేది. ఆమె వంట చేస్తున్నప్పుడు మనవళ్లైన మాకు కథలు కూడా చెబుతుండేది. ఆ జ్ఞాపకం నేడు ఎస్కెసి (స్వీట్ కారం కేఫ్)ను ప్రారంభించేలా చేసింది’ అని చెబుతుంది నళిని పార్ధిబన్. రూ.2000 ల పెట్టుబడిఆనంద్, నళిని తమ అమ్మమ్మ చేతి వంట రుచిని ప్రపంచానికి పరిచయం చేయాలను కున్నారు. సంప్రదాయ దక్షిణ భారత స్నాక్న్కు ఆధునిక ట్విస్ట్ ఇవ్వడానికి వారు చాలా ప్రయత్నాలే చేశారు. అయితే, ఈ ప్రయాణం కష్టమైందని త్వరలోనే గ్రహించారు. చాలా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరించాయి. దీంతో ఇంటిలోని ఒక చిన్న గదిలో రూ.2000 పెట్టుబడితో ప్రారంభించారు. మొదట కస్టమర్లను సంపాదించడానికి వార్తాపత్రికల మధ్యలో కరపత్రాలను ఉంచి, పంపిణీ చేసింది. దీంతో ఆర్డర్లు వెల్లువెత్తడం పారంభించాయి. జనం కొద్ది రోజుల్లోనే అమ్మమ్మ స్నాక్స్‌ని బాగా ఇష్టపడ్డారు. ప్రతి దశలోనూ కొత్త ఉత్సాహం‘వంటకాలన్నీ అమ్మమ్మవే. ఆమె చెప్పినట్టే చేస్తాం. కానీ, వంటను దగ్గరగా ఉండి పర్యవేక్షిస్తుంటాం. ఎక్కడా రాజీ పడకుండా చూసుకుంటాం’ అని నళిని చెబితే, ‘నాణ్యమైన దినుసులతో పాటు ప్రేమ, శ్రద్థతో మా కుటుంబం కోసం చేసే విధంగా తయారు చేస్తాం’ అని జానకి పాటి చెబుతుంది. పాటీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా తయారుచేస్తుంది. తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా ఈ బామ్మ ఉత్సాహాన్ని ఎవరైనా పొందవచ్చు. క్రికెటర్ ఎంఎస్ ధోని పట్ల తన ప్రేమను సోషల్‌మీడియా ద్వారా పంచుకొని ఆనందిస్తుంటుంది. జీవితంలోని ఈ దశనూ ఆనందంగా గడపడం కోసం ఉత్సాహంగా పనిచేస్తుంది. ‘ఇది నాకు పునర్జన్మ లాంటిది. మీరు ప్రయత్నించేవరకు మీకూ తెలియదు మీలోని శక్తి ఎంతో’ అని అందరికీ చెబుతుంది. ‘మా బామ్మలోని శక్తి మాకూ ప్రేరణగా పనిచేస్తుంది. ఆమె తన అభిమాన క్రికెటర్నీ ఉత్సాహపరుస్తుంది. అలాగే, సరికొత్త మొబైల్ యాప్స్ గురించి నేర్చుకుంటుంది. ఆమెకు జీవితం పట్ల ఉన్న అభిరుచి అసమానమైనది’ అంటూ తమ అమ్మమ్మ గురించి ఆనందంగా వివరిస్తుంది నళిని. నేడు ఎస్కెసి (స్వీట్ కారమ్ కేఫ్) స్టార్టప్ భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 32 దేశాలకు విస్తరించి, అమ్మమ్మ చేతి వంట సూపర్ అంటోంది. -
Ugadi 2024 : అదిరిపోయే వంటలు, వేప పువ్వు చారు ఒక్కసారి రుచిచూస్తే..!
పండగొచ్చిందంటే పూజలు వ్రతాలే కాదు. దేవుడికి భక్తితో పెట్టే నైవేద్యాలు. అంతేకాదు ఇష్టమైన వంటలు, మధురమైన స్వీట్లు ఉండాల్సిందే.. ఈ సందర్భంగా మీకోసం స్పెషల్ వంటలు.. బెల్లం బీట్రూట్ అరటిపండు కేసరి కావలసినవి: బాగా ముగ్గిన అరటిపండు – 1; బీట్రూట్ ముక్కలు – అర కప్పు బొంబాయి రవ్వ – అర కప్పు; బెల్లం తురుము – కప్పు; నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు; పాలు – అర కప్పు; జీడి పప్పులు – తగినన్ని; ఏలకుల పొడి – చిటికెడు తయారీ: ►ముందుగా బీట్ రూట్ ముక్కలకు అర కప్పు నీళ్లు జత చేసి, మిక్సీలో వేసి మెత్తగా ప్యూరీలా తయారు చేసి, బీట్ రూట్‌ను గట్టిగా పిండి నీళ్లు వేరు చేసి పక్కన ఉంచాలి. ►బాణలిలో నెయ్యి వేసి కరిగాక రవ్వ వేసి దోరగా వేయించాలి ►అరటి పండును చిన్న చిన్న ముక్కలుగా చేసి మెత్తగా గుజ్జులా అయ్యేలా చేతితో మెదిపి, బాణలిలో వేసి బాగా కలపాలి ►పాలు జత చేసి బాగా కలిశాక, బీట్ రూట్ నీళ్లు పోసి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి ∙బెల్లం తురుము వేసి కరిగే వరకు కలుపుతూ ఉండాలి (అవసరమనుకుంటే మధ్యలో ఒకసారి నెయ్యి వేసి కలపాలి) ►చివరగా ఏలకుల పొడి, జీడిపప్పు ముక్కలు వేసి బాగా కలిపి దించేయాలి. పులిహోర కావలసినవి: చింత పండు – 200 గ్రా; ఎండు మిర్చి – 10; పచ్చి సెనగ పప్పు – 2 టేబుల్ స్పూన్లు; మినప్పప్పు – 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు – 1 టీ స్పూను; నువ్వుల నూనె – కప్పు; ఉప్పు – తగినంత పొడి కోసం: ధనియాలు – 3 టేబుల్ స్పూన్లు; మెంతులు – టీ స్పూను; ఎండు మిర్చి – 10; ఇంగువ – కొద్దిగా; అన్నం కోసం: బియ్యం – 4 కప్పులు; పోపు కోసం; మినప్పప్పు – 3 టీ స్పూన్లు; పల్లీలు – అర కప్పు; జీడి పప్పు – అర కప్పు; కరివేపాకు – 3 రెమ్మలు; నువ్వుల నూనె – 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 3; ఉప్పు – తగినంత తయారీ: ►రెండు కప్పుల వేడి నీళ్లలో చింతపండును సుమారు అరగంటసేపు నానబెట్టాలి ►మిక్సీ జార్లో వేసి మెత్తగా గుజ్జులా అయ్యేవరకు మిక్సీ పట్టి, జల్లెడ వంటి దానిలో వడకట్టాలి (చెత్త వంటివన్నీ పైన ఉండిపోతాయి. అవసరమనుకుంటే కొద్దిగా వేడి నీళ్లు జత చేసి జల్లెడ పట్టవచ్చు. మిశ్రమం చిక్కగా ఉండాలే కాని పల్చబడకూడదు) ►ధనియాలు, మెంతులను విడివిడిగా బాణలిలో నూనె లేకుండా వేయించి, చల్లారాక విడివిడిగానే మెత్తగా పొడి చేయాలి ►బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి, ఆవాలు, మినప్పప్పు వరుసగా వేసి వేయించాలి ►చింత పండు గుజ్జు జత చే సి బాగా కలిపి నూనె పైకి తేలేవరకు బాగా ఉడికించాలి ►మెంతి పొడి జత చేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి ►మరొక బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి, మినప్పప్పు, కరివేపాకు వరుసగా ఒకదాని తరువాత ఒకటి వేసి వేయించాక, పల్లీలు, జీడి పప్పులు వేసి బాగా కలిపి దించేయాలి ►ఒక ప్లేటులో అన్నం వేసి పొడిపొడిగా విడదీసి, టీ స్పూను నువ్వుల నూనె వేసి కలిపాక, ఉడికించి ఉంచుకున్న చింతపండు గుజ్జు, పోపు సామాను వేసి కలపాలి ►ఉప్పు, చిటికెడు ధనియాల పొడి, చిటికెడు మెంతి పొడి వేసి కలిపి, గంట సేపు అలా ఉంచేసి, ఆ తరవాత తింటే పుల్లపుల్లగా రుచిగా ఉంటుంది. పచ్చిమిర్చి పప్పు కావలసినవి: కంది పప్పు – కప్పు, పచ్చి మిర్చి – 10, టొమాటో – 1, చింత పండు రసం – టీ స్పూను, ఆవాలు – టీ స్పూను, ఎండు మిర్చి – 2, ఇంగువ – చిటికెడు, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత, నూనె – టేబుల్ స్పూను, ధనియాల పొడి – అర టీ స్పూను తయారీ ►ముందుగా కంది పప్పుకి తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి ఐదారు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి ►బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, ఎండు మిర్చి వేసి వేయించాలి ►కరివేపాకు జత చేసి మరోమారు వేయించాక టొమాటో ముక్కలు వేసి మెత్తబడేవరకు కలపాలి ►మధ్యకు చీల్చి గింజలు తీసిన పచ్చిమిర్చి వేసి మరోమారు బాగా కలిపి, ఉప్పు, పసుపు జత చేసి ఉడికించాలి ►ఉడికించిన పప్పు వేసి బాగా మెదపాలి ►చింత పండు రసం, ధనియాల పొడి వేసి బాగా కలిపి, చివరగా కొత్తిమీర వేసి దించేయాలి. మామిడికాయ నువ్వుపప్పు పచ్చడి కావలసినవి: పచ్చి మామిడి కాయలు – 2; నువ్వులు – కప్పు; పచ్చి మిర్చి తరుగు – అర కప్పు; వెల్లుల్లి రేకలు – అర కప్పు; అల్లం తురుము – 2 టీ స్పూన్లు; ఇంగువ – చిటికెడు; ఆవాలు – టీ స్పూను; కరివేపాకు – 4 రెమ్మలు; ఎండు మిర్చి – 4; నూనె – 2 టేబుల్ స్పూన్లు; పసుపు – టీ స్పూను; ఉప్పు – తగినంత తయారీ: మామిడికాయ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ∙బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక మామిడికాయ ముక్కలు, పచ్చి మిర్చి, అల్లం తురుము, పసుపు వేసి బాగా కలిపి ముక్కలు మెత్తబడేవరకు ఉంచాలి ►వేరొక బాణలి లో నూనె లేకుండా, నువ్వులు వేసి వేయించి చల్లారాక మెత్తగా పొడి చేయాలి ►వేయించి ఉంచిన మామిడి కాయ ముక్కల మిశ్రమం, ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ తిప్పి ఒక పాత్రలోకి తీసుకోవాలి ►బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు వేసి వేగాక, వెల్లుల్లి రేకలు, ఎండు మిర్చి, చివరగా కరివేపాకు వేసి వేయించి తీసి, తయారుచేసి ఉంచుకున్న పచ్చడిలో వేసి కలపాలి ►వేడి వేడి అన్నంలోకి కమ్మటి నెయ్యితో తింటే రుచిగా ఉంటుంది. వేప పువ్వు చారు కావలసినవి: వేప పువ్వు – 3 టీ స్పూన్లు; చింత పండు – కొద్దిగా; ధనియాల పొడి – పావు టీ స్పూను; ఇంగువ – చిటికెడు; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; మిరియాల పొడి – పావు టీ స్పూను; మినప్పప్పు – టీ స్పూను; ఎండు మిర్చి – 4; పచ్చి మిర్చి – 2; కొత్తిమీర – కొద్దిగా; కరివేపాకు – 2 రెమ్మలు; ఉప్పు – తగినంత; పసుపు – తగినంత; నూనె – టీ స్పూను తయారీ: ►వేప పువ్వును శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి ►చింత పండును నానబెట్టి రసం తీసి పక్కన ఉంచాలి ►బాణలి లో నూనె వేసి కాగాక ఇంగువ, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వరసగా వేసి వేయించాలి ►వేప పువ్వు, పచ్చి మిర్చి తరుగు వేసి కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు వేయించాక, చింత పండు రసం వేసి బాగా కలపాలి ►రసం పొంగుతుండగా మిరియాల పొడి, ధనియాల పొడి, ఉప్పు పసుపు, కరివేపాకు, కొత్తి మీర వేసి వేసి ఒక పొంగు రానిచ్చి దించేయాలి. -
పూలను పూజల్లోనే కాదు వంటల్లో కూడా వాడేయొచ్చట..!
పూలను సాధారణంగా పూజ కోసం, ఇంటి డెకరేషన్ కోసం వాడుతుంటాం. మగువలలు తలలో అలంకరించుకోవడానికి తప్పనసరిగి వివిధ రకాల పువ్వులను ఉపయోగిస్తుంటారు. అంతవరకే మనకు తెలుసు. కానీ పూలను వంట్లో ఉపయోగించొచ్చా అనే విషయం గురించి విన్నారా?. ఔను వాటిని వంటల్లో హ్యాపీగా ఉపయోగించి వండేయొచ్చంటున్నారు. పైగా ఆరోగ్యానికి కూడా మంచిదని చెబుతున్నారు. ఎలాగో తెలుసా..! వంటల్లో వినియోగించే తినదగిన పువ్వులు సరైన విధంగా ఎంచుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే వాటిల్లో పురుగులు, పాడైనవి లేకుండా మంచిగా ఉండేవి తీసుకోవాలి. ముఖ్యంగా రసాయనాలు చల్లనివి తినడానికి వినియోగించడం ముఖ్యం. లేదంటే మనం చేసిన రెసిపీ రుచిలో తేడాలు వచ్చి టేస్ట్ బాగుండదని హెచ్చరిస్తున్నారు. అందువల్ల వండే ముందే తినదగిన పువ్వులను మంచిగా ఎంపిక చేసుకుని ఉంచుకోవడం బెటర్ అని చెబుతున్నారు. ఇక వాటితో ఎలాంటి రెసీపీలు చేసుకోవచ్చంటే.. ఎరుపు, తెలుపు, ఆరెంజ్, పసుపు.. ఇలా విభిన్న రంగుల్లో దొరికే కార్నేషన్ పూలను ఇంటి అలంకరణ, వేడుకల్లో వేదిక అలంకరణ కోసం ఎక్కువగా వాడుతుంటారు. అయితే వీటిని కేక్ డెకరేషన్ కోసమూ వాడుకోవచ్చంటున్నారు నిపుణులు. వీటి పూరేకల్లో ఉండే తియ్యదనం కేక్ రుచిని మరింతగా పెంచుతుందంటున్నారు. అయితే ఈ పూరేకల కింది భాగం కాస్త వగరుగా ఉంటుంది కాబట్టి దాన్ని కత్తిరించి పైభాగాన్ని కేక్ డెకరేషన్ కోసం ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఆమ్ల గుణాలు ఎక్కువగా ఉండే మందార పూరేకలు నోటికి పుల్లటి రుచిని అందిస్తాయి. అందుకే వీటిని ఎక్కువగా సలాడ్స్‌లో, గార్నిష్ చేయడానికి ఉపయోగిస్తారట! గులాబీ పూరేకల్ని తినేవారు చాలామందే ఉంటారు. అయితే వీటిని ఐస్‌క్రీమ్, ఇతర డిజర్ట్స్పై గార్నిష్ చేయడానికి ఉపయోగించచ్చు. కాస్త పెద్దగా ఉన్న గులాబీ రేకలైతే సలాడ్స్‌పై చల్లుకోవచ్చు. అంతేకాదు.. జెల్లీస్, షుగర్ సిరప్స్ తయారీలోనూ వీటిని వాడచ్చట!.ఆయుర్వేద పరంగా మందార రేకులతో చేసిన టీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రుతుక్రమ సమస్యతో బాధపడే వాళ్లు ఎర్రటి మందారాన్ని చెరుకురసంతో కలిపి తీసుకుంటే ఇర్రెగ్యులర్ పిరియడ్ సమస్య నుంచి ఉపశమంన పొందగలరని చెబుతున్నారు. ఇంట్లో గార్డెన్లో పెంచుకునే చిట్టి చామంతుల (చామొమైల్ పువ్వులు)తో స్ట్రాంగ్‌గా ఓ టీ పెట్టుకొని తాగితే.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. మానసిక ఆరోగ్యం కూమా మెరుగుపడుతుందంటున్నారు నిపుణులు! డైట్, ఫిట్నెస్ పాటించేవారు ఈ టీని ఆశ్రయించడం మంచిదని చెబుతున్నారు ఆకట్టుకునే రంగులో ఉండే లావెండర్ పూలను కేక్స్, కుకీస్ తయారీలోనూ వాడచ్చంటున్నారు నిపుణులు. అలాగే బయట మార్కెట్లో ఈ పూలను తేనె, సిరప్స్, వెనిగర్ తయారీలోనూ ఉపయోగిస్తుంటారట! ఫలితంగా వాటికి అదనపు రుచి, వాసనను జోడించచ్చు. పుల్లటి రుచిలో ఉండే బంతి పూరేకల్ని సలాడ్స్ డ్రస్సింగ్ కోసం, కూరల్లో గార్నిష్ కోసం వాడుకోవచ్చట!. అంతేగాదు కేక్ డెకరేషన్లో కూడా అందంగా కనిపించేలా అలంకరించొచ్చు. ఉపయోగించేటప్పుడు గుర్తించుకోవాల్సివి.. ఈ పూలను ఆహారంలో భాగం చేసుకునే క్రమంలో వాటి రుచిలో తేడా రాకుండా జాగత్త పడేల వినయోగించాలని చెబుతున్నారు చెఫ్‌లు. వాడిపోయినవి కాకుండా.. తాజా పూలు, పూరేకలు తీసుకున్నప్పుడే వాటి రుచి ఇనుమడిస్తుంది. అలాగే రసాయన ఎరువులు వాడకుండా పెంచినవే ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే వాడే ముందు వాటిని దుమ్ముధూళి లేకుండా చక్కగా శుభ్రం చేయాలి. కొన్ని పూరేకల కింది భాగం వగరుగానూ, చేదుగానూ ఉంటాయి. కాబట్టి ఆ భాగాన్ని తొలగించి కూరల్లో, ఇతర వంటకాల్లో వాడితే వాటి రుచి తగ్గకుండా జాగ్రత్తపడచ్చు. వంటకాల్లో, గార్నిష్ కోసం వివిధ రకాల పూలను ఒకేసారి వాడచ్చు. ఫలితంగా వాటి రుచి పెరుగుతుంది. అలాగే చూడ్డానికి ఆకర్షణీయంగానూ కనిపిస్తుంది. అయితే కొన్ని రకాల పూలు కొంతమందికి పడకపోవచ్చు. కాబట్టి వీటిని తీసుకున్నప్పుడు అలర్జీ వంటి సమస్యలేవైనా ఎదురైతే.. వాటికి దూరంగా ఉండడమే మంచిది. అవసరమైతే నిపుణుల సలహాలూ తీసుకుని ఉపయోగించడం మంచింది. (చదవండి: తేనెను నేరుగా వేడిచేస్తున్నారా? పాయిజన్‌గా మారి..) -
క్రాబ్స్‌తో కేక్ పాపర్స్.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?
కేక్ పాపర్స్ తయారీకి కావల్సినవి: పీతల గుజ్జు – అరకేజీ; బటర్ – రెండు టేబుల్ స్పూన్లు; స్ప్రింగ్ ఆనియన్ తరుగు – పావు కప్పు; ఎర్రక్యాప్సికం తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; సెలెరీ తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; కోషర్ సాల్ట్ – రుచికి సరిపడా; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను; గుడ్డు – ఒకటి; సోయా సాస్ – పావు టీస్పూను; మయనైజ్ – పావు కప్పు; ఆవ పొడి – పావు టీస్పూను; మిరియాల పొడి – పావు టీస్పూను; బ్రెడ్ క్రంప్స్ – ఒకటింబావు కప్పులు; నూనె – ఒకటిన్నర కప్పులు. స్పైసీడిప్: మయనైజ్ – అరకప్పు; నిమ్మరసం – టేబుల్ స్పూను; వెల్లుల్లి రెబ్బ – పెద్దది ఒకటి(సన్నగా తర గాలి); చిల్లీ సాస్ – టీస్పూను. తయారీ విధానమిలా: బాణలిలో బటర్ వేసి, కరిగిన తరువాత.. స్ప్రింగ్ ఆనియన్ , క్యాప్సికం, సెలెరీ తరుగు వేసి వేయించాలి ∙ముక్కలన్నీ మెత్తబడిన తరువాత పీతల గుజ్జు, కొత్తిమీర తరుగు వేసి వేయించాలి ∙ఇది వేగుతుండగానే.. ఒక గిన్నెలో గుడ్డు సొన, సోయా సాస్, మయనైజ్, ఆవపొడి, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి ∙కలిపిన వెంటనే వేగుతున్న పీతల గుజుజపెన ఈ మిశ్రమాన్ని వేసి ఐదు నిమిషాలు మగ్గనిచ్చి దించేయాలి. చల్లారాక మీడియం సైజు బాల్స్‌లా చుట్టుకోవాలి. బాల్స్ అన్నీ తయారయ్యాక.. బ్రెడ్ క్రంప్స్లో ముంచి కోటింగ్‌లా పట్టించి రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ∙అరగంట తరువాత నూనెలో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేస్తే క్రాబ్ కేక్ పాపర్స్ రెడీ ∙స్పైసీడిప్ కోసం తీసుకున్న పదార్థాలను గిన్నెలో వేసి కలిపి.. వేడివేడి క్రాబ్ కేక్ పాపర్స్తో సర్వ్ చేసుకోవాలి. -
పోమోగ్రానేట్ షాంపైన్ సార్బెట్.. రెస్టారెంట్ స్టైల్లో చేసేయండిలా
పోమోగ్రానేట్ షాంపైన్ సార్బెట్ తయారీకి కావల్సినవి: బ్రూట్ షాంపైన్ – ఒకటిన్నర కప్పులు; పంచదార – కప్పు; లైట్ కార్న్ సిరప్ – టేబుల్ స్పూను; దానిమ్మ రసం – ఒకటీ ముప్పావు కప్పులు; విప్డ్ప్ క్రీమ్ – రెండు టేబుల్ స్పూన్లు; దానిమ్మ గింజలు – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానమిలా: సాస్పాన్లో షాంపైన్, కార్న్ సిరప్, పంచదార వేసి మీడియం మంట మీద పంచదార కరిగేంత వరకు మరిగించి, దించిన తర్వాత దానిమ్మ రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టాలి.రెండుగంటల తరువాత మిశ్రమాన్ని ఐస్‌క్రీమ్ మేకర్‌తో బీట్ చేయాలి.క్రీమ్‌లా మారిన మిశ్రమాన్ని షాంపైన్ గ్లాస్లో వేయాలి. పైన విప్డ్ క్రీమ్, దానిమ్మ గింజలతో గార్నిష్ చేస్తే పోమోగ్రానేట్ షాంపైన్ సార్బెట్ రెడీ. -
స్వీట్ పొటాటో పీజా బాల్స్.. సింపుల్‌గా చేసుకోండిలా
స్వీట్ పొటాటో పీజా బాల్స్ తయారీకి కావల్సినవి: చిలగడ దుంపలు – అరకేజీ(తొక్కతీసి ముక్కలు తరగాలి); మటన్ ఖీమా – అరకప్పు; చీజ్ తురుము – ముప్పావు కప్పు; పీజా సాస్ – రెండు టేబుల్ స్పూన్లు; గోధుమ పిండి – ముప్పావు కప్పు; గుడ్లు – రెండు(సొనను బాగా కలిపి పెట్టుకోవాలి); బ్రెడ్ క్రంప్స్ – కప్పు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; ఉప్పు – రుచికి తగినంత. తయారీ విధానమిలా: చిలగడ దుంప ముక్కల్ని మెత్తగా ఉడకబెట్టి, చిదుముకోవాలి. ఇందులో మటన్ ఖీమా, చీజ్ తురుము, పీజా సాస్, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి, బాల్స్‌లా చుట్టి పెట్టుకోవాలి గోధుమ పిండి, గుడ్లసొన, బ్రెడ్ క్రంప్స్ను వరుసగా పెట్టుకోవాలి. దుంపల బాల్స్‌ను ముందుగా గోధుమ పిండి, తరువాత గుడ్ల సొన, చివరిగా బ్రెడ్క్రంప్స్లో ముంచి డీప్ ఫ్రైచేసుకోవాలి ∙బాల్స్ క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి మారాక తీసేసి నచ్చిన సాస్‌తో సర్వ్ చేసుకోవాలి. -
తినే గమ్(గోండ్) గురించి తెలుసా? బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు..
తినదగిన గమ్(గోండ్) లేదా గోధుమ బంక శీతకాలంలో శరీరాలను వెచ్చగా ఉంచడంలో సహయపడుతుంది. జిగురులా ఉండే ఈ ప్రత్యేకమైన పదార్థంతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఏంటీ తినదగిన గమ్ ? ఇది ఎలా ఆరోగ్యాననికి మంచిది? తినదగిన గమ్ అంటే.. తినదగిన గమ్(గోండ్) అనేది జిగురు లాంటి ఆయుర్వేద ఔషధం. ఇది స్థానికంగా గోధుమ బంక లేదా బాదాం బంక అనే పేర్లతో పిలుస్తారు. సాధారణంగా మార్కెట్లలో అయితే గోండ్ కటిరా లేదా ట్రగాకాంత్ గమ్ అనే పేర్లతో అందుబాటులో ఉంటుంది. నిజానికి గ్రీకు భాషలో ట్రాగోస్ అంటే మేక, అలాగే అకాంత అంటే కొమ్ము అని అర్థం. ఈ రెండు పదాల కలయికతో ట్రగాకాంత్ గమ్ అని పిలుస్తారు. ఇది అకాసియా చెట్ల వేర నుంచి తీసే సహజ గమ్(రెసిన్). ఇది జిగట పదార్ధం. దీని వాసన, రుచి అంటూ ఏమి ఉండదు. ఈ బంకను నీటిలో వేసినపుడు కొద్దిగా కరిగి జెల్లీలాగా మృదువుగా మారుతుంది. కలిగే ప్రయోజనాలు.. శీతాకాలంలో ఈ గోధుమ బంకను తీసుకోవడం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అయ్యి వెచ్చగా ఉండేలా చేస్తుంది. అందువల్ల దీన్ని చలికాలపు ఎనర్జీ బూస్ట్‌గా పిలుస్తారు. జీర్ణక్రియకు మంచి ఔషధం. దీన్ని స్వీట్లు, పానీయాలు, రుచికరమైన వంటకాలు తయారీలో కూడా ఉపయోగిస్తారు. కీళ్ల ఆరోగ్యంలో యాంటీ ఇన్ప్లమేటరీగా ఉపయోగపడుతుంది. అంతేగాదు ఆర్థరైటిస్‌కు సంబంధించిన సమస్యలకు చక్కటి నివారిణి ఇది. రెసిన్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో సహాయపడతాయి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో సహయపడుతుంది. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లతో సహా అవసరమైన పోషకాలకు మూలం. అందువల్ల దీన్ని మంచి పోషాకాహారం కూడా తీసుకోవచ్చు. బాలింతలకు మంచి శక్తినిచ్చే ఔషధంగా చెబుతారు. రక్త ప్రసరణను మెరుగపరిచి గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. శ్వాసకోశ సమస్యలకు చెక్కుపడుతుంది. పైగా దగ్గు, జలుబు సమస్యలను తగ్గించడంలో మంచి నివారిణిగా కూడా ఉంటుంది. దీంతో చేసుకునే వంటకాలు.. గోండ్ కీ రాబ్: గోంద్ లడూ: గోండ్ డ్రై ఫ్రూట్ పరాటా గోండ్ చిక్కి గోండ్ కీ ఖీర్ గోండ్ నువ్వుల లడ్డు (చదవండి: మహిళ చెవిలోనే గూడు కట్టేసిన సాలీడు! వేడినూనె పోయడంతో..) -
పిజ్జాతో రికార్డ్ బ్రేక్, ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయని విధంగా..
పిజ్జా.. చాలామంది యంగ్‌స్టర్స్‌కి ఫేవరెట్ రెసిపి. క్యాప్సికమ్, టమోటా, ఉల్లిపాయ, చీజ్‌తో టాపింగ్ చేసే ఇటాలియన్ వంటకం పిజ్జాను ఇష్టపడని వాళ్లు ఎవరు ఉంటారు? అందుకే సరికొత్త ప్రయోగాలతో పిజ్జా లవర్స్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా వరల్డ్ రికార్డ్ కోసం ఇద్దరు ఫ్రెంచ్ చెఫ్‌లు చీజీ మాస్టర్ పిజ్జాను తయారు చేశారు. ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయని విధంగా 1,001 చీజ్‌లతో పిజ్జా తయారు చేసి సరికొత్త రికార్డ్‌ను సృష్టించారు. వివరాల ప్రకారం.. బెనాయిట్ బ్రూయెల్,ఫాబియన్ మోంటెల్లానికో, సోఫీ హటాట్ రిచర్ట్-లూనా, ఫ్లోరియన్ ఆన్ఎయిర్లు కలిసి ఈ రెసిపీని రెడీ చేశారు. ఇంతకుముందు అత్యధికంగా 834 చీజ్‌లతో తయారు చేసిన పిజ్జా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఇప్పడు ఆ రికార్డ్‌ను బ్రేక్ చేస్తూ వెయ్యి చీజ్‌లతో క్రేజీ పిజ్జాను తయారు చేశారు. ఇందుకోసం సుమారు 5 నెలలు కష్టపడి ప్రపంచ వ్యాప్తంగా వెరైటీ చీజ్‌లను వెతికి సంపాదించారు. ఇందులో దాదాపు 940 రకాలు ప్రాన్స్‌కి చెందినవి కాగా, మిగిలినవి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి సమకూర్చారు. ప్రతి చీజ్ నుంచి రెండు గ్రాముల మోతాదులో చీజ్‌ను పిజ్జాపై టోపింగ్ చేసి ఈ వెరైటీ డిష్‌ను అందించారు. -
అటుకుల పోహాతో కేక్..ఎప్పుడైనా ట్రై చేశారా?
పోహా కేక్ తయారీకి కావల్సినవి: మైదా పిండి – 3 కప్పులు అటుకులు – ఒకటిన్నర కప్పులు (నానబెట్టి గుజ్జులా చేసుకోవాలి) అరటి పండు – 1 (ముక్కలు చేసుకోవాలి),పంచదార – 2 కప్పులు పీనట్ బటర్, బటర్ – పావు కప్పు చొప్పున బేకింగ్ సోడా – 2 టీ స్పూన్లు,పాలు – 2 కప్పులు వెనిలా ఎసెన్స్ – అర టీ స్పూన్ తయారీ విధానమిలా: ముందుగా మిక్సీ బౌల్లో పంచదార వేసుకుని పొడి చేసుకుని, అందులో బటర్, పీనట్ బటర్, అరటిపండు ముక్కలు వేసుకుని మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఒక బౌల్లోకి ఆ మిశ్రమాన్ని తీసుకుని.. అందులో బేకింగ్ సోడా, పాలు, మైదాపిండి, అటుకుల పేస్ట్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం నచ్చిన షేప్‌లో కేక్ మేకర్ తీసుకుని.. అందులో ఈ మిశ్రమం వేసుకుని సుమారు 45 నిమిషాల పాటు ఓవెన్లో బేక్ చేసుకోవాలి. ఆ కేక్‌ని కాస్త చల్లారనిచ్చి.. నచ్చిన విధంగా క్రీమ్, ఫ్రూట్స్‌తో డెకరేట్ చేసుకుని, కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. -
టొమాటో ఉప్మా రెసిపి.. ఇలా ఈజీగా చేసుకోండి
టొమాటో ఉప్మా తయారీకి కావల్సినవి: బొంబాయి రవ్వ›– ఒక కప్పు,టొమాటో ముక్కలు – పావు కప్పు, క్యారట్ తరుగు – పావు కప్పు,ఉల్లిపాయ తరుగు – అర కప్పు, బఠాణీ – అర కప్పు (నానబెట్టుకోవాలి), పచ్చిమిర్చి – 1, అల్లం తరుగు – కొద్దిగా, కరివేపాకు – ఒక రెబ్బ, కొత్తిమీర తరుగు– కొద్దిగా, జీడి పప్పు – గుప్పెడు (నేతిలో వేయించాలి), ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర – 1 టీ స్పూన్ చొప్పున, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె –2 టేబుల్ స్పూన్లు, నెయ్యి – సరిపడా, నీళ్లు– 3 కప్పులు తయారీ విధానమిలా: ముందుగా చిన్న సెగ మీద.. రవ్వను నేతిలో దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అనంతరం అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని.. తాలింపు సామాన్లు వేసుకుని ఆ వెనుకే ఉల్లిపాయ ముక్కలూ వేసి వేయించుకోవాలి. అనంతరం టొమాటో ముక్కలు, క్యారట్ తరుగు, ఆ తర్వాత బఠాణీలు వేసి మగ్గనివ్వాలి. కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత పసుపు వేసుకుని మరోసారి గరిటెతో తిప్పాలి. క్యారట్ ముక్క 80 శాతం ఉడికిన తర్వాత నీళ్లు పోసుకుని.. ఎసరు మరగనివ్వాలి. అనంతరం రవ్వ వేసుకుంటూ ఉండలు కాకుండా గరిటెతో తిప్పుతూ ఉండాలి. దగ్గరపడే సమయంలో కొత్తిమీర తురుము, జీడిపప్పు, మిగిలిన నెయ్యి వేసుకుని బాగా కలిపి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. -
పనీర్‌తో స్పెషల్‌గా క్రిస్పీ స్టిక్స్.. టేస్ట్ అదిరిపోద్ది
పనీర్ క్రిస్పీ స్టిక్స్ తయారీకి కావల్సినవి పనీర్ – అరకిలో (నిలువుగా కట్ చేసుకోవాలి), కొబ్బరి తురుము, బ్రెడ్ పౌడర్ – పావు కప్పు చొప్పున, గుడ్లు – 3, పాలు – 2 టేబుల్ స్పూన్లు (చిక్కటివి), పచ్చిమిర్చి పేస్ట్ – 1 టీ స్పూన్, అల్లం – వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, చాట్ మసాలా, నిమ్మరసం, ధనియాల పొడి, జీలకర్ర పొడి – అర టీ స్పూన్ చొప్పున, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒకపెద్ద బౌల్ తీసుకుని అందులో పచ్చిమిర్చి పేస్ట్, అల్లం – వెల్లుల్లి పేస్ట్, ఇంగువ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి.. ఆ మిశ్రమాన్ని పనీర్ ముక్కలకు పట్టించి 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో మొక్కజొన్న పిండి, ఇంకో బౌల్లో పాలు–గుడ్ల మిశ్రమం, మరో బౌల్లో కొబ్బరి తురుము లేదా బ్రెడ్ పౌడర్ వేసుకుని.. ఒక్కో పనీర్ ముక్క తీసుకుని, మొదట మొక్కజొన్న పిండిలో, తర్వాత గుడ్ల మిశ్రమంలో, ఆ తర్వాత కొబ్బరి తురుము లేదా బ్రెడ్ పౌడర్‌ను బాగా పట్టించి.. నూనెలో ఫ్రై చేసుకోవాలి. -
క్రిస్మస్ స్పెషల్: ఇటాలియన్ పీచ్ కుకీస్, ఇంట్లోనే చేసుకోవచ్చు
ఇటాలియన్ పీచ్ కుకీస్ తయారీకి కావల్సినవి: మైదా – మూడున్నర కప్పులు; వంటసోడా – టేబుల్ స్పూను; కోషర్ సాల్ట్ – పావు టీస్పూను; బటర్ – అరకప్పు; పంచదార – రెండు కప్పులు; గుడ్లు – రెండు కప్పులు; వెనీలా ఎసెన్స్ – రెండు టీస్పూన్లు; పాలు – కప్పు; ఎరుపు, పసుపు ఫుడ్ కలర్ – నాలుగు చుక్కలు (ఒక్కోటి రెండు చుక్కలు). పీనట్ బటర్ క్రీమ్: బటర్ – పావు కప్పు; వెనీలా ఎసెన్స్ – అర టీస్పూను; కోషర్ సాల్ట్ – చిటికెడు; పంచదార పొడి – కప్పు; పీచ్ ప్యూరీ – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానమిలా: ►ఒక గిన్నెలో వంటసోడా, ఉప్పు వేసి కలపాలి ∙దీనిలో బటర్, కప్పు పంచదార వేసి క్రీమ్‌లా మారేంత వరకు హ్యాండ్ మిక్సర్‌తో కలపాలి. తరువాత క్రీమ్‌ను పక్కన పెట్టుకోవాలి ∙మిక్సర్‌ను తక్కువ స్పీడ్‌లో పెట్టి గుడ్ల సొన, వెనీలా ఎసెన్స్ వేసి రెండు నిమిషాలు బీట్ చేసుకోవాలి ∙తరువాత మైదా, బటర్ మిశ్రమం అరకప్పు పాలు పోసి అన్ని చక్కగా కలిసేంత వరకు బీట్ చేయాలి. ► ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కూప్ పరిమాణంలో తీసుకుని గుండ్రని బాల్స్‌లా చేసి పైన కొద్దిగా వత్తి పీచ్ ఫ్రూట్ ఆకారంలోకి తీసుకు రావాలి ∙ఇలా అన్ని కుకీస్ రెడీ అయిన తరువాత అవెన్‌లో పెట్టి 350 డిగ్రీల ఫారిన్ హీట్స్ వద్ద పదిహేను నిమిషాలు బేక్ చేయాలి ∙పీచ్ క్రీమ్కోసం తీసుకున్న బటర్, వెనీలా ఎసెన్స్, కోషర్ సాల్ట్ లనుగిన్నెలో వేసి హ్యాండ్ మిక్సర్‌తో కలపాలి. ► ఇవన్నీ చక్కగా కలిపిన తరువాత మిక్సర్ స్పీడు తగ్గించి పంచదార పొడి, పీచ్ ప్యూరీవేసి మీడియం హై లో నిమిషం పాటు మిక్సర్‌తో కలపాలి ∙మిగిలిన అరకప్పు పాలను రెండు సగాలుగా చేసి రెండు వేర్వేరు గిన్నెల్లో పోయాలి. ఒకదానిలో ఎరుపు, మరో దానిలో పసుపు ఫుడ్ కలర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ► మరోగిన్నెలో మిగిలిన పంచదారను పెట్టుకోవాలి.కుకీస్ బేక్ అయిన తరువాత..వేడిగా ఉన్నప్పుడే కుకీస్ మధ్యలో చిన్న గాటు పెట్టి.. మధ్యలో పీచ్క్రీమ్ను వేసి శాండ్‌విచ్‌లా కొద్దిగా వత్తాలి ∙ఇప్పుడు కుకీకి ఒకవైపు ఎరు రంగు కలపిన పాలు, మరోవైపు పసుపు రంగు కలపిన పాలు అద్దాలి. చివరిగా పంచదార అద్దితే ఇటాలియన్ పీచ్ కుకీస్ రెడీ. -
కేవలం 15 నిమిషాల్లో గ్రీన్ కేక్ మిక్స్ కుకీస్ రెడీ
గ్రీన్ కేక్ మిక్స్ కుకీస్ తయారీకి కావల్సినవి: వెనీలా కేక్ మిక్స్ – మూడు కప్పులు; నూనె – ముప్పావు కప్పు; గుడ్లు – రెండు; వెనీలా ఎసెన్స్ – అరటీస్పూను; గ్రీన్ ఫుడ్ కలర్ – టీస్పూను(జెల్); పంచదార పొడి – ముప్పావు కప్పు; హార్ట్ షేప్ క్యాండీస్ – గార్నిష్‌కు సరిపడా. తయారీ విధానమిలా: కేక్ మిక్స్,నూనె, గుడ్ల సొన, వెనీలా ఎసెన్స్‌ను, గ్రీన్‌ఫుడ్ కలర్‌ను ఒక గిన్నెలో వేసి ముద్దలా కలపాలి. తరువాత రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ∙ఇరవై నిమిషాల తరువాత పిండి ముద్దను బయటకు తీసి స్కూప్ పరిమాణంలో పిండిని తీసుకుని ఉండలు చేయాలి. ఈ ఉండలను పంచదార పొడిలో ముంచి కోటింగ్‌లా అద్దాలి.తరువాత ఉండలను బేకింగ్ ట్రేలో పెట్టి, కుకీ షేప్ వచ్చేలా వత్తుకోవాలి ∙కుకీ మధ్యలో హార్ట్ ఆకారంలో ఉన్న క్యాండీని పెట్టి బేకింగ్ ట్రేని అవెన్‌లో పెట్టాలి ∙350 డిగ్రీల ఫారిన్ హీట్స్ వద్ద పదిహేను నిమిషాలు బేక్ చేస్తే గ్రీన్ కేక్ మిక్స్ కుకీస్ రెడీ. -
బేకరీ స్టైల్లో కుకీస్.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు
స్నీకర్ డూడుల్ కుకీస్ తయారీకి కావల్సినవి: మైదా – మూడు కప్పులు; టార్టారిక్ యాసిడ్ – రెండు టీస్పూన్లు; కోషర్ సాల్ట్ – టీస్పూను; వంటసోడా – ముప్పావు టీస్పూను; బటర్ –కప్పు; పంచదార – ఒకటిన్నర కప్పులు; వెనీలా ఎసెన్స్– టీస్పూను; దాల్చినచెక్క పొడి – టేబుల్ స్పూను తయారీ విధానమిలా: పెద్దగిన్నెలో మైదా, టార్టారిక్ యాసిడ్, వంటసోడా వేసి కలపాలి ∙అన్నీ కలిసిన తరువాత బటర్, ఒకటింబావు కప్పుల పంచదార వేసి మెషిన్ మిక్సర్‌తో కలపాలి ∙మిశ్రమం క్రీమ్‌లా మారిన తరువాత వెనీలా ఎసెన్స్ వేసి కలిపి రిఫ్రిజిరేటర్లో ఉంచాలి ∙మిగిలిన పంచదారలో దాల్చినచెక్క పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ∙గంట తర్వాత రిఫ్రిజిరేటర్నుంచి తీసిన మిశ్రమాన్ని రెండు టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకుని బాల్స్‌లా చేసి దాల్చినచెక్క పొడి అద్ది బేకింగ్ ట్రేలో పెట్టాలి ∙కుకీస్ అన్నీ తయారయ్యాక.. బేకింగ్ ట్రేని 350 డిగ్రీల ఫారిన్ హీట్స్ వద్ద, ఇరవై నిమిషాలు బేక్ చేస్తే స్నీకర్ డూడుల్ కుకీస్ రెడీ. -
స్నాక్స్ కోసం.. మైసూర్ బోండాలు, సింపుల్‌గా ఇలా చేసుకోవచ్చు
గోధుమ మైసూర్ బోండాలు కావలసినవి: గోధుమ పిండి – 400 గ్రాములు పెరుగు – ముప్పావు కప్పు , బొంబాయి రవ్వ – 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ సోడా, పంచదార – 1 టేబుల్ స్పూన్ చొప్పున ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా, జీలకర్ర– 1 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి – 1 టీ స్పూన్ (సన్నని తరుగు), చిన్నచిన్న కొబ్బరి ముక్కలు – 2 టీ స్పూన్లు (తురుము కూడా వేసుకోవచ్చు), కరివేపాకు – 2 రెమ్మలు (సన్నగా తురుముకోవాలి), నూనె – సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్లో బేకింగ్ సోడా, పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో ఉప్పు, బోంబాయి రవ్వ వేసుకుని కలుపుకోవాలి. అనంతరం గోధుమ పిండి, కొద్దిగా నూనె వేసుకుని బాగా కలపాలి. సుమారుగా 5 నుంచి 6 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ జారుగా, జిగటగా అయ్యేలా చేసుకోవాలి. దాన్ని రెండు గంటల పాటు నానివ్వాలి. ఆ తర్వాత అందులో జీలకర్ర,, పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరిముక్కలు, కరివేపాకు తురుము వేసుకుని రెండుమూడు నిమిషాలు బాగా కలిపి.. కాగుతున్న నూనెలో కొద్దికొద్దిగా బొండాల్లా వేసుకుంటూ దోరగా వేయించుకోవాలి. -
ఒకేసారి రెండు రకాల వంటలు చేసుకోవచ్చు, ధర కూడా తక్కువే
ఒకేసారి రెండు వెరైటీలను తయారు చేసుకునేందుకు వీలుగా ఉన్న ఈ మల్టీ కుకర్‌ను.. యూజర్ ఫ్రెండ్లీ మెషిన్‌గా చెప్పుకోవచ్చు. చిన్నచిన్న అపార్ట్‌మెంట్స్‌లో, ఓపెన్ కిచెన్స్‌లో ఇలాంటి మినీ మేకర్ అందుబాటులో ఉంటే అలుపుసొలుపు లేకుండా ఇట్టే వంట చేసేసుకోవచ్చు. ఇందులో రకరకాల రైస్ ఐటమ్స్‌తో పాటు కుడుములు, వాయికుడుములు వంటివెన్నో వండుకోవచ్చు. 3.5 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ కుకర్‌లో.. గుడ్లు, జొన్న కండెలు, దుంపలు, కేక్స్ వంటివీ ఉడికించుకోవచ్చు. మెయిన్ బేస్ మెషిన్ మీద.. స్టీల్ ట్రేలో మరో వెరైటీని కుక్ చేసుకునే వీలుంటుంది. దీనికి సరిపడా ట్రాన్స్పరెంట్ లిడ్ (మూత) ఉంటుంది. డివైస్ ముందున్న రెగ్యులేటర్ సాయంతో దీన్ని సులభంగా వాడుకోవచ్చు. దీని ధర 80 డాలర్లు(రూ.6,672). -
క్రిస్మస్ స్పెషల్: సుగర్ కుకీస్, పిల్లలు ఇష్టంగా తింటారు
సుగర్ కుకీస్ తయారీకి కావల్సినవి: బటర్ – పావు కప్పు; క్రీమ్ చీజ్ – పావుకప్పు; పంచదార – ఒకటిన్నర కప్పులు; గుడ్లు – రెండు; వెనీలా ఎసెన్స్ – ఒకటిన్నర టీస్పూన్లు; బాదం ఎసెన్స్ – పావు టీస్పూను; మైదా – రెండున్నర కప్పులు; కార్న్‌స్టార్చ్ – టేబుల్ స్పూను; వంటసోడా – టీస్పూను; ఉప్పు – పావు టీస్పూను; ఎరుపు, పచ్చరంగు కలిపిన పంచదార –గార్నిష్‌కు సరిపడా. తయారీ విధానమిలా: ఒక పెద్దగిన్నెలో బటర్, క్రీమ్ చీజ్, పంచదార, గుడ్లు, వెనీలా, బాదం ఎసెన్స్ వేసి హ్యాండ్ మిక్సర్‌తో ఐదు నిమిషాల పాటు కలపాలి ∙తరువాత మైదా, కార్న్ స్టార్చ్, వంటసోడా, ఉప్పు వేసి పిండి ముద్దలా కలపాలి ∙ఈ పిండి ముద్దను రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. రెండు గంటల తరువాత తీసి చిన్నచిన్న ఉండలుగా చేసి బేకింగ్ ట్రేలో పెట్టాలి.ఫోర్క్ సాయంతో ఉండపైన ఇంటూ ఆకారంలో ముద్ర పడేటట్లు వత్తాలి ∙ఇలా అన్నిటినీ వత్తుకున్నాక ఎరుపు, పచ్చరంగు పంచదారను ఈ కుకీస్పైన చల్లాలి ∙ఇప్పుడు బేకింగ్ ట్రేని అవెన్‌లో పెట్టి 350 డిగ్రీల ఫారిన్ హీట్స్వద్ద పదిహేను నిమిషాలు బేక్ చేస్తే సుగర్ కుకీస్ రెడీ. -
క్రిస్టమస్ స్పెషల్: సాఫ్ట్ కుకీస్.. బేకరీ స్టైల్లో
క్రిస్టమస్ సాఫ్ట్ కుకీస్: కావలసినవి: మైదా – మూడున్నర కప్పులు; వంటసోడా›– టీస్పూను; ఉప్పు – అర టీస్పూను; పంచదార – ఒకటిన్నర కప్పులు; బటర్ – కప్పు; గుడ్లు – రెండు; వెనీలా ఎసెన్స్ – రెండు టీ స్పూన్లు. తయారీ విధానమిలా: ►మైదా, వంటసోడా, ఉప్పుని ఒక గిన్నెలో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ∙బటర్లో పంచదార వేసి క్రీమ్‌లా మారేంత వరకు బీటర్‌తో కలపాలి. తరువాత ఈ క్రీమ్‌ను రెండు గంటలు రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ∙రెండు గంటల తరువాత బటర్ క్రీమ్‌లో గుడ్లసొన, వెనీలా ఎసెన్స్, మైదా మిశ్రమం వేసి ముద్దగా కలుపుకోవాలి పిండి ముద్దను రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ►రెండు గంటల తరువాత పిండి ముద్దను రొట్టెల్లా వత్తుకోవాలి ∙ఈ రొట్టెను క్రిస్టమస్ ట్రీ, స్టార్స్, బొమ్మల ఆకారంలో కట్ చేసి బేకింగ్ ట్రేలో పెట్టాలి. కుకీస్ ఆకారాన్ని బట్టి ఫుడ్ కలర్ వేసుకోవచ్చు ∙ఈ బేకింగ్ ట్రేను 400 డిగ్రీల ఫారిన్ హీట్ వద్ద పదినిమిషాలు బేక్ చేస్తే ఎంతో రుచికరమైన క్రిస్టమస్ సాఫ్ట్ కుకీస్ రెడీ. -
ఇన్‌స్టంట్‌గా చేసుకునే స్వీట్ కార్న్ గారెలు
స్వీట్ కార్న్– తోటకూర గారెలు తయారీకి కావల్సినవి: లేత స్వీట్ కార్న్ గింజలు, లేత తోటకూర ఆకులు – రెండున్నర కప్పుల చొప్పున (శుభ్రం చేసి పెట్టుకోవాలి) అల్లం – కొద్దిగా,వెల్లుల్లి రెమ్మలు – 7,ఉప్పు – తగినంత జీలకర్ర – ఒక టీ స్పూన్,సోంపు – అర టీ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు (చిన్నగా కత్తిరించుకోవాలి) బియ్యప్పిండి – పావు కప్పు పచ్చిమిర్చి – 4 (చిన్నగా తరగాలి),నూనె – సరిపడా తయారీ విధానమిలా: ముందుగా మిక్సీలో స్వీట్ కార్న్, వెల్లుల్లి రెమ్మలు, అల్లం, తోటకూర ఆకులు (కాడల్లేకుండా) బరకగా మిక్సీ పట్టుకోవాలి. అవసరం అయితే కొన్ని నీళ్లు కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని.. జీలకర్ర, సోంపు, బియ్యప్పిండి, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. మిశ్రమం మరీ జారుగా మారితే బియ్యప్పిండి పెంచుకోవచ్చు. వీటిని చిన్న చిన్న వడల్లా చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. -
బనానాతో బర్ఫీ.. సింపుల్‌గా, క్షణాల్లో చేసుకోవచ్చు
బనానా జాంగ్రీ బర్ఫీ తయారీకి కావల్సినవి: అరటిపండ్లు – 3 (చిన్న చిన్న ముక్కలుగా తరిగి మిక్సీ పట్టుకోవాలి) కొబ్బరి కోరు – ఒకటిన్నర కప్పులు, నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు, మిల్క్ పౌడర్ – 1 కప్పు, బెల్లం తురుము (జాంగ్రీ) – ముప్పావు కప్పు, ఏలకుల పొడి – అర టీ స్పూన్ (అభిరుచిని బట్టి), చిక్కటి పాలు – పావు కప్పు (కాచినవి), జీడిపప్పు, బాదం ముక్కలు – గార్నిష్‌కి సరిపడా తయారీ విధానమిలా: ఒక పాత్రలో కొబ్బరి కోరు, బెల్లం తురుము, పాలు పోసుకుని.. సిమ్ ఫ్లేమ్‌లో స్టవ్ మీద పెట్టుకుని గరిటెతో కలుపుతూండాలి. కాస్త దగ్గర పడుతున్న సమయంలో నెయ్యి, అరటిపండు గుజ్జు, మిల్క్ పౌడర్, ఏలకుల పొడి వేసి గరిటెతో తిప్పుతూండాలి. మిశ్రమం మొత్తం దగ్గర పడగానే.. ఒక బౌల్లోకి తీసుకుని జీడిపప్పు, బాదం ముక్కలతో గార్నిష్ చేసి మూడు నాలుగు గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అనంతరం కావలసిన షేప్‌లో ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. -
మీల్మేకర్ స్టఫ్డ్ చపాతీ.. భలే రుచిగా ఉంటాయి
మీల్మేకర్ స్టఫ్డ్ చపాతీ తయారీకి కావలసినవి: మీల్మేకర్ – పావు కప్పు (మెత్తగా ఉడికించుకుని, చల్లారాక తురుములా చేసుకోవాలి), గోధుమ పిండి – ఒకటిన్నర కప్పులు, వేడి నీళ్లు, నూనె – సరిపడా, మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు చొప్పున, పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్, పసుపు – చిటికెడు, కారం – 1 టీ స్పూన్ , అల్లం– వెల్లుల్లి పేస్ట్ – అర టేబుల్ స్పూన్ , టొమాటో ముక్కలు – 1 టేబుల్ స్పూన్ (చిన్నవి), కరివేపాకు, కొత్తిమీర తురుము – కొద్దిగా తయారీ విధానమిలా: ముందుగా గోధుమ పిండి, మొక్కజొన్న పిండి, మూడు గరిటెల నూనె, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని కొద్దికొద్దిగా వేడి నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకుని, తడి గుడ్డ పరచి 20 నిమిషాల పాటు పక్కనపెట్టుకోవాలి. ఈలోపు ఒక కళాయిలో 2 గరిటెల నూనె వేసుకుని.. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను దోరగా వేయించుకుని.. మీల్మేకర్ తురుమునూ వేసుకుని బాగా కలుపుకోవాలి. అల్లం–వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపి.. పసుపు, కారం, ఉప్పు, టొమాటో ముక్కలు వేసి తిప్పుతూ బాగా ఉడికించుకోవాలి. చివరగా కరివేపాకు, కొత్తిమీర తురుము వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అనంతరం చపాతీలు చేసుకుని, ఒక్కోదానిలో కొద్దికొద్దిగా మీల్మేకర్ మిశ్రమాన్ని పెట్టుకుని.. ఫోల్డ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. వీటిని వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి. -
అన్నంలోకి నిమిషాల్లో రుచులు
ఇంట్లో పేరెంట్స్ లేని సమయంలో సింపుల్‌గా చేసుకునే కొన్ని వెరైటీలను చూద్దామిప్పుడు. మ్యాగీ, పాస్తా, శాండ్విచ్, చాకోస్ వంటివన్నీ పిల్లలు.. చిటికెలో చేసుకుని, తినగలిగినవే. నిజానికి ఇదివరకటి పిల్లలైతే అటుకులు, మరమరాలు వంటివి ఇంట్లో ఉంటే చాలు.. వాటితో ఎన్నో వెరైటీలను ఇట్టే చేసుకునేవారు.అటుకులు, బెల్లం కోరు, శనగపప్పు, కొబ్బరికోరు కలుపుకొని తింటే... బలమే కాదు చాలాసేపటి వరకు ఆకలినీ ఆపుతుంది. బెల్లం పాలు కాచుకుని అటుకులు వేసుకుని తినడం, లేదంటే అటుకుల్లో కాస్త ఉప్పు, కారం వేసి దోరగా వేయించుకోవడం వంటివి చిటికెలో చేసుకోవచ్చు. ఇక మరమరాలు తడిపి.. ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, టొమాటో ముక్కలు వంటివి వేసి క్షణాల్లో రుచికరమైన స్నాక్‌ని రెడీ చేసుకోవచ్చు. 3 నిమిషాల్లో మజ్జిగ చారు కావాల్సినవి: పెరుగు – పావు కప్పు (కొద్దిగా నీళ్లు పోసుకుని.. పలుచగా చేసుకోవాలి) ఉల్లిపాయ ముక్కలు – టేబుల్ స్పూన్, కరివేపాకు, కొత్తిమీర – కొద్దికొద్దిగా, ఉప్పు – కొద్దిగా, నూనె – 2 టేబుల్ స్పూన్లు ఎండుమిర్చి – 2 (ముక్కలు చేసుకోవాలి), పసుపు – పావు టీ స్పూన్ ఆవాలు, పచ్చి శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం తురుము – కొద్దికొద్దిగా.. తయారీ: ముందు కళాయిలో నూనె వేసుకుని.. అందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. దానిలో ఉప్పు వేసుకుని, ఎండుమిర్చి ముక్కలు, అల్లం తురుము, పసుపు వేసుకుని తిప్పుకోవాలి. ఇప్పుడు ఆ తాలింపు మిశ్రమాన్ని పలుచగా చేసుకున్న పెరుగులో కలిపి బాగా తిప్పాలి. అందులో కొత్తిమీర తురుము కూడా వేసుకుని అన్నంలోకి తింటే అదిరిపోతుంది. తాలింపు వేసే సమయంలో, వేడి పాత్రను పట్టుకునేప్పుడు జాగ్రత్తలు అవసరం. 5 నిమిషాల పచ్చడి కావాల్సినవి: పచ్చిమిర్చి – 5, చింతపండు – అర నిమ్మకాయ సైజ్ (గింజలు లేకుండా తీసి, కడిగి, నానబెట్టుకోవాలి), కరివేపాకు – 2 రెమ్మలు, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు – కొద్దిగా, ఉల్లిపాయ – చిన్నది (నాలుగైదు ముక్కలు చేసుకోవాలి), నూనె – 1 టీ స్పూన్ (కాచాల్సిన పనిలేదు) తయారీ: పచ్చిమిర్చి, చింతపండు, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసుకుని కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకుని.. దానిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని, మరోసారి మిక్సీలో కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసుకుని.. కొత్తిమీర తురుము, నూనె వేసుకుని, వేడి వేడి అన్నంతో తింటే సూపర్బ్‌గా ఉంటుంది. ఇంట్లో ఏం లేనప్పుడు.. పెద్దలు అందుబాటులో లేనప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో ఈ పచ్చడి చేసుకోవచ్చు. 10 నిమిషాల లోపు కర్రీ కావాల్సినవి: ఉల్లిపాయ–1(చిన్నగా తరగాలి), టొమాటోలు – 6 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), పచ్చిమిర్చి – 2, ఉప్పు – సరిపడా, అల్లం– వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్ పైనే, కారం – 2 టీ స్పూన్, ధనియాల పొడి, గరం మసాలా – 1 టీ స్పూన్ చొప్పున, నూనె – 2 టేబుల్ స్పూన్లు పైనే.. తయారీ: ముందుగా చిన్న కుకర్‌లో నూనె వేసుకుని ఉల్లిపాయలు వేగించుకుని.. టొమాటో ముక్కలు వేసి నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఆ తర్వాత అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి మరో నిమిషం మగ్గించుకోవాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేసి గ్లాసున్నర వాటర్ పోసి.. మూతపెట్టి, మూడు విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. ఈ ప్రాసెస్ మొత్తం ఐదు నిమిషాల్లో పూర్తి అవుతుంది. కాస్త చల్లారాక.. మూత ఓపెన్ చేసి.. అందులో కరివేపాకు వేసుకుని, ఇంకాస్త గ్రేవీలా అయ్యేందుకు.. చిన్నమంటపై కాసేపు మగ్గించుకోవచ్చు. ఆ సమయంలో గరిటెతో ఇంకాస్త మెత్తగా చేసుకోవచ్చు. చివర్లో కొత్తిమీర తురుము వేసుకుని.. బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇదే మాదిరి టొమాటో ముక్కల బదులు బంగాళదుంప ముక్కలు, ఆనపకాయ ముక్కలు ఇలా చాలా కూరగాయలతోనూ ఈ వంటకాన్ని చేసుకోవచ్చు. -
మష్రూమ్ ఆరోగ్యానికి చాలా మంచిది, సూప్ చేసుకొని తాగేయండి
మష్రుమ్ సూప్ తయారీకి కావల్సినవి మష్రుమ్- 100 గ్రా (సన్నగా తరగాలి) కొత్తిమీర- ఒక కట్ట; ఉప్పు - తగినంత దాల్చిన చెక్క- చిన్న ముక్క, మిరియాల పొడి - పావుటీ స్పూన్ వెన్న లేదా నూనె- ఒక టేబుల్ స్పూన్ , మైదా- 50 గ్రా; వెల్లుల్లి రేకలు- నాలుగు తయారీ: ఒక గిన్నెలో పావు లీటరు నీరు పోసి అందులో కొత్తిమీర (సగం), దాల్చిన చెక్క, మిరియాలపొడి, ఉప్పు వేసి ఉడికించాలి. పెనంలో వెన్న వేసి మష్రుమ్స్ ముక్కలు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. ఇప్పుడు అదే పెనంలో వెల్లుల్లి రేకలు, మైదా వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న మిశ్రమాన్ని పోసి బాగా మరిగిన తర్వాత వడకట్టాలి. వడపోసిన మిశ్రమంలో మష్రుమ్ వేసి కొత్తిమీర, మిరియాల పొడి చల్లి సర్వ్ చేయాలి. -
ఇంట్లోనే పీనట్ బటర్ తయారు చేసుకోండిలా..
పీనట్ బటర్ తయారీకి కావల్సినవి పల్లీలు – ఒక కప్పు; తేనె – ఒక టేబుల్ స్పూను; పల్లీ నూనె – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – కొద్దిగా తయారీ విధానమిలా: స్టౌ మీద బాణలి వేడయ్యాక పల్లీలు వేసి బాగా దోరగా వేయించి దింపేయాలి ∙పప్పు గుత్తితో ఒత్తుతూ పైన పొట్టును తీసేయాలి ∙పల్లీలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙ఒక టేబుల్ స్పూను పల్లీ నూనె, ఒక టేబుల్ స్పూను తేనె, అర టీ స్పూను ఉప్పు వేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే ఇంట్లోనే సింపుల్‌గా తయారు చేసుకునే పీనట్ బటర్ రెడీ. దీన్ని చపాతీతో కాని, బ్రెడ్‌తో కాని తింటే రుచిగా ఉంటుంది. -
గోధుమ బిస్కట్స్.. చిటికెలో ప్రిపేర్ చేసుకోవచ్చు
గోధుమ బిస్కట్స్ తయారీకి కావలసినవి: గోధుమ పిండి– 2 కప్పులు పంచదార పొడి – ముప్పావు కప్పు పైనే(అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు), ఉప్పు – కొద్దిగా, కుకింగ్ సోడా – చిటికెడు పుచ్చగింజలు – 1 టీ స్పూన్ సోంపు – 1 టీ స్పూన్ నువ్వులు – 2 టీ స్పూన్లు, నెయ్యి, నీళ్లు – పావు కప్పు చొప్పున నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, పంచదార పొడి, ఉప్పు, కుకింగ్ సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో పుచ్చగింజలు, సోంపు, నువ్వులు, నెయ్యి, నీళ్లు పోసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. ఆ ముద్దను 15 నిమిషాల పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని మరోసారి బాగా మెత్తగా చేత్తో కలిపి.. చిన్న చిన్న బిస్కట్స్లా చేసుకుని.. నూనెలో దోరగా వేయించుకోవాలి. -
బనానా బ్రెడ్ రోల్స్.. టేస్ట్ అదిరిపోద్ది, ట్రై చేశారా?
బనానా బ్రెడ్ రోల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు అరటిపండ్లు – 2, బటర్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్ల చొప్పున, పంచదార – 3 టేబుల్ స్పూన్లు (అభిరుచిని బట్టి తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు) బ్రెడ్ స్లైస్ – 6 లేదా 8 తయారీ విధానమిలా: ముందుగా అరటిపండ్లను ముక్కలుగా చేసుకుని.. ఒక టేబుల్ స్పూన్ బటర్లో బాగా వేగించాలి. మెత్తగా గుజ్జులా మారిపోయే వరకూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. అనంతరం అందులో పంచదార, నెయ్యి వేసుకుని.. పంచదార కరిగిన వెంటనే ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఈలోపు బ్రెడ్ స్లైస్‌ని నాలుగువైపులా బ్రౌన్ కలర్ పీస్‌ని కట్ చేసి తీసేసి.. మిగిలిన బ్రెడ్ స్లైస్‌ని ఒకసారి చపాతీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు ప్రతి బ్రెడ్ స్లైస్లోనూ కొద్దికొద్దిగా బనానా మిశ్రమాన్ని వేసుకుని.. రోల్స్‌లా చుట్టుకుని.. తడిచేత్తో అంచుల్ని అతికించుకోవాలి. ఫోర్క్ సాయంతో కొనలను నొక్కి, బాగా అతికించుకోవాలి. మిగిలిన బటర్‌తో వాటిని ఇరువైపులా వేయించుకుని సర్వ్ చేసుకోవాలి. -
చిక్కుడు కాయ పప్పు.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?
చిక్కుడు కాయ పప్పు తయారీకి కావల్సినవి: చిక్కుడు కాయలు – పావు కేజీ; పెసరపప్పు – అరకప్పు; పసుపు – పావు టీస్పూను; పచ్చికొబ్బరి తురుము – అరకప్పు; ఎండుమిర్చి – నాలుగు; జీలకర్ర – టీస్పూను; కరివేపాకు – నాలుగు రెమ్మలు;ఉప్పు – తగినంత ఆవాలు – పావు టీస్పూను; నూనె – తగినంత; మినప్పప్పు – టీస్పూను; తయారీ విధానమిలా: పెసరపప్పుని కడిగి కుకర్ గిన్నెలో వేయాలి. దీనిలో కప్పునీళ్లు, పసుపు, 1/2 టీస్పూను ఉప్పు వేసి మూతపెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి. చిక్కుడు కాయలను కడిగి ఈ నూనె తీసి ముక్కలు చేసుకోవాలి. తగినన్ని నీళ్లు, చిటికెడు ఉప్పు వేసి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పచ్చికొబ్బరి, జీలకర్ర, కరివేపాకు, ఎండు మిర్చిని మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లుపోసి పేస్టు చేయాలి. ఉడికిన పెసరపప్పులో.. చిక్కుడు ముక్కలు, నూరుకున్న మసాలా పేస్టు, ఉప్పువేసి కలపాలి. ఒక పాత్రలో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, మినప్పప్పు వేసి చిటపటలాడాక మిగతా కరివేపాకు వేసి వేయించి అందులో పప్పు మిశ్రమాన్ని కలిపితే చిక్కుడుకాయ పప్పు రెడీ. అన్నం, చపాతీ, రోటీల్లోకి చాలా బావుంటుంది. -
అరటికాయతో కారం పొడి.. అన్నంలోకి సూపర్ ఉంటుంది
అరటికాయ కారం పొడి తయారీకి కావలసినవి: అరటికాయలు – మూడు; పసుపు – 1/2 టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; మినప్పప్పు – రెండు టీ స్పూన్లు; పచ్చిశనగ పప్పు – టీస్పూను; ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు; ఎండుమిర్చి – ఐదు; మిరియాలు – టీస్పూను; ఎండు కొబ్బరి తురుము – నాలుగు టీస్పూన్లు; కరివేపాకు – ఐదు రెమ్మలు; ఇంగువ – చిటికెడు; నూనె – నాలుగు టీస్పూన్లు; ఆవాలు – అరటీస్పూను. తయారీ విధానమిలా: స్టవ్ వెలిగించి మీడియం మంట మీద అరటికాయలను కాల్చాలి. చక్కగా కాలాక మంట మీద నుంచి తీసి చల్లారాక తొక్కతీసేసి, సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలిపెట్టి టీస్పూను మినప్పప్పు, పచ్చి శనగపప్పు, ధనియాలు, ఎండు మిర్చి, మిరియాలు, ఎండు కొబ్బరి తురుము, మూడు రెమ్మల కరివేపాకు, ఇంగువ వేసి దోరగా వేగాక, చల్లారనిచ్చి పొడిచేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద బాణలిపెట్టి నూనె వేయాలి. ∙వేడెక్కిన తరువాత మిగిలిన మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. చిటపటలాడాక అరటికాయ తురుము, పసుపు, రుచికి సరిపడా ఉప్పువేసి వేయించాలి. తరువాత మసాలా పొడి వేసి కలిపి మూతపెట్టి, సన్న మంట మీద ఐదు నిమిషాలు మగ్గనిస్తే అరటికాయ పొడి రెడీ. -
క్యాబేజ్‌తో ఎగ్ భుర్జి.. ఎప్పుడైనా ట్రై చేశారా? చపాతీలో బావుంటుంది
క్యాబేజ్ ఎగ్ భుర్జి తయారీకి కావల్సినవి క్యాబేజీ తురుము – రెండు కప్పులు; నూనె – మూడు టేబుల్ స్పూన్లు; ఉల్లిపాయ తరుగు – అరకప్పు; అల్లం వెల్లుల్లి పేస్టు – ఒకటిన్నర టీస్పూన్లు; పచ్చిమిర్చి – చిన్నవి ఆరు(సన్నగా తరగాలి); ధనియాల పొడి – అరటీస్పూను; పసుపు – అరటీస్పూను; కారం – ముప్పావు టీస్పూను; గుడ్లు – నాలుగు; ఉప్పు – రుచికి సరిపడా; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానమిలా: ►స్టవ్ మీద మందపాటి బాణలి పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి. ఉల్లిపాయ వేగాక, అల్లం వెల్లుల్లి పేస్టువేసి వేయించాలి. ► అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తరువాత పచ్చిమిర్చి తరుగు వేయాలి. మిర్చి వేగిన తరువాత ధనియాల పొడి, కారం, పసుపు, క్యాబేజీ తరుగు, రుచికి సరిపడా ►ఉప్పు వేసి కలిపి బాణలి మీద మూతపెట్టి సన్న మంట మీద మగ్గనివ్వాలి. ►గుడ్లసొనను ఒక గిన్నెలో వేసి బీటర్ లేదా ఫోర్క్‌తో కలిపి పక్కన పెట్టాలి. ∙క్యాబేజీ ఉడికి దగ్గర పడుతున్నప్పుడు గుడ్ల సొనవేసి కలుపుతూ వేయించాలి. ► చక్కగా వేగిన తర్వాత కొత్తిమీర చల్లుకుని దించేయాలి. ∙రోస్టెడ్ బ్రెడ్, చపాతీ, రోటీలోకి ఇది మంచి సైడ్ డిష్. -
మరమరాలతో వడ.. సింపుల్‌గా ఇలా చేసుకోండి
మరమరాల వడ.. తయారీకి కావలసిన పదార్ధాలు మరమరాలు – 3 కప్పులు (నీటిలో నానబెట్టి, గట్టిగా పిండి ఒక బౌల్‌ల్లోకి తీసుకోవాలి) పెరుగు – 3 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి – పావు కప్పు మైదా పిండి – పావు కప్పు అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, సోంపు – 1 టీ స్పూన్ చొప్పున తెల్ల నువ్వులు – 1 టీ స్పూన్ + గార్నిష్‌కి కారం – ఒకటిన్నర టీ స్పూన్, నీళ్లు – కొన్ని ఉప్పు – తగినంత, గరం మసాలా – పావు టీ స్పూన్, పంచదార – 2 టీ స్పూన్లు, నిమ్మ రసం – 1 టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర తురుము – కొద్దిగా తయారీ విధానం ముందుగా మరమరాలను గట్టిగా పిసికి, అందులో పెరుగు వేసుకుని బాగా కలిపి, 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోవాలి. అనంతరం అందులో గోధుమ పిండి, మైదా పిండి, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, సోంపు, 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు, కారం, ఉప్పు, గరం మసాలా, పంచదార, నిమ్మరసం, 3 టీ స్పూన్ల నూనె, కొత్తిమీర తురుము వేసుకుని బాగా ముద్దలా చేసుకోవాలి. అవసరమయితే కొద్దిగా నీళ్లు కలుపుకోవాలి. ఆ ముద్దను చిన్న చిన్న కట్లెట్స్ మాదిరి చేసుకుని, ప్రతి కట్లెట్కి కాస్త తడి చేసి, పైన నువ్వులు పెట్టి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. -
ఈ బ్లెండర్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే, ఏకంగా అన్ని వేలా!
పిండి, నూక, చట్నీ, జ్యూస్ ఇలా.. మిక్సీ లేకుండా వంటింట్లో ఏ పనీ సాగదు. చిత్రంలోని ఈ డివైస్.. వినూత్నమైన వాక్యూమ్ టెక్నాలజీతో డిమాండ్ క్రియేట్ చేసుకుంది. బ్లెండింగ్ చేయడానికి ముందు బ్లెండర్ జార్ నుంచి గాలిని పూర్తిగా తీసివేసి.. ఆహారాన్ని సాధారణ బ్లెండర్ కంటే స్మూత్‌గా చేస్తుంది. అందుకే ఇందులోని ఫుడ్ లేదా జ్యూస్ ఎక్కువ సేపు తాజాగా ఉంటుంది. ఈ ప్రొఫెషనల్ బ్లెండర్తో.. జ్యూస్‌లు, బేబీ ఫుడ్ (నెలల పిల్లలకు), మిల్క్ షేక్స్ ఇలా చాలావాటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ ఫుడ్ ప్రాసెసర్ బ్లెండర్లో మిలిటరీ–గ్రేడ్ లేజర్ స్టెయిన్ లెస్ స్టీల్ బ్లేడ్స్ అమర్చి ఉంటాయి. అత్యంత పదునైన ఈ బ్లేడ్స్.. ఎంతటి ఘనపదార్థాలనైనా మెత్తటి మైనంలా మార్చగలవు. ప్రొఫెషనల్ సౌండ్‌ప్రూఫ్ కవర్ కలిగిన ఈ డివైస్.. సాధారణ డివైస్ల కంటే.. 40 శాతం సౌండ్‌ని తగ్గిస్తుంది. ఈ కంటైనర్ సుమారుగా ఆరు నుంచి ఎనిమిది మందికి సరిపడా ఫుడ్‌ని లేదా జ్యూస్‌ని అందిస్తుంది. దీని ధర 807 డాలర్లు (రూ.67,116). -
పీనట్ ఐస్‌క్రీమ్ ఎప్పడైనా ట్రై చేశారా? సింపుల్ రెసిపి
పీనట్ ఐస్‌క్రీమ్ తయారీకి కావల్సినవి: స్వీటెండ్ కండెన్సడ్ మిల్క్ – 400 గ్రాములు హెవీ క్రీమ్ – 480 ఎమ్ఎల్,పీనట్ బటర్ – 250గ్రాములు వేరుశనగలు – 70 గ్రాములు (దోరగా వేయించి, తొక్క తీసి, కచ్చాబిచ్చా చేసుకోవాలి) తయారీ విధానమిలా: ముందుగా ఒక పెద్ద గిన్నెలో హెవీ క్రీమ్ వేసుకుని హ్యాండ్‌హెల్డ్ మిక్సర్‌తో బాగా నురుగు వచ్చేలా, క్రీమీగా చేసుకోవాలి. దానిలో కండెన్సడ్ మిల్క్, పీనట్ బటర్ వేసుకుని.. బాగా కలుపుకోవాలి. మెత్తగా క్రీమీగా మారిన తర్వాత.. దానిలో కచ్చాబిచ్చా చేసుకున్న వేరుశనగ ముక్కల్ని కలుపుకోవాలి. అనంతరం ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని.. సమాంతరంగా చేసుకోవాలి. 6 గంటలు పాటు ఫ్రిజ్‌లో పెట్టుకుని.. ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి. -
బేకరి స్టైల్లో స్వీట్ రైస్ కేక్.. ఇలా చేసుకోండి
స్వీట్ రైస్ కేక్ తయారీకి కావల్సినవి: బియ్యప్పిండి –100 గ్రాములు మైదాపిండి, మొక్కజొన్న పిండి – అర టేబుల్ స్పూన్ చొప్పున బ్రౌన్ షుగర్ – 60 గ్రాములు,నీళ్లు – 1 కప్పు (గోరువెచ్చగా చేసుకోవాలి) నూనె – 2 టేబుల్ స్పూన్లు,గుడ్డు – 1 తయారీ విధానమిలా: ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు గోరువెచ్చని నీటిలో బ్రౌన్ షుగర్‌ను కరిగించాలి. అందులో బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, మైదాపిండి ఒకదాని తర్వాత ఒకటి జల్లెడ పట్టుకోవాలి. అనంతరం ఉండలు లేకుండా కలుపుకోవాలి. అందులో నూనె జోడించి, హ్యాండ్‌హెల్డ్ మిక్సర్‌తో బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న కేక్ కంటైనర్ లోపల కొద్దిగా నూనె రాసి, అందులో ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి. అనంతరం 45 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించుకోవాలి. కేక్ చల్లారాక రాత్రంతా ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అనంతరం నచ్చిన విధంగా కట్ చేసుకుని.. వాటిని గుడ్డు మిశ్రమంలో ముంచి ఇరువైపులా పాన్ పై వేయించుకుని సర్వ్ చేసుకోవాలి. -
ఒడిశా పాపులర్ డిష్:హబీషా దాల్మా..సింపుల్‌గా, టేస్టీగా
హబీసా దాల్మా తయారీకి కావల్సినవి: పెసర పప్పు – కప్పు; అరటికాయ – పెద్దది ఒకటి; చేమదుంపలు – నాలుగు; టొమాటో – ఒకటి; పచ్చిబొ΄్పాయి – చిన్నది ఒకటి; అల్లం – అంగుళం ముక్క; నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు; బిర్యానీ ఆకులు – నాలుగు; ఎండు మిర్చి – ఏడు; జీలకర్ర – మూడు టేబుల్ స్పూన్లు; ఆవాలు – టీస్పూను; పచ్చికొబ్బరి తురుము – రెండు టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానమిలా: ►ముందుగా నాలుగు ఎండు మిర్చి, రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రను దోరగా వేయించి పొడిచేసి పెట్టుకోవాలి. అరటికాయ, చేమ దుంపలు, బొప్పాయి తొక్కతీసి ముక్కలుగా తరగాలి. అల్లం, టొమాటోను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. పెసరపప్పు కడిగి కుక్కర్లో వేయాలి.అందులో మూడు కప్పుల నీళ్లు, అరటి, చేమ, బొప్పాయి, అల్లం ముక్కలు, బిర్యానీ ఆకులు వేయాలి. ► రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టాలి. పెద్ద మంటమీద ఒక విజిల్ రానిచ్చి దించేయాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. వేడెక్కిన నెయ్యిలో మిగిలిన ఎండు మిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. ∙ఇవి వేగాక కుక్కర్లో ఉడికిన పప్పు మిశ్రమాన్ని వేసి కలపాలి. ∙ఇప్పుడు కొత్తిమీర తరుగు, పచ్చికొబ్బరి తరుము, మిర్చి, జీలకర్ర పొడి వేసి ఐదు నిమిషాలు మగ్గనిస్తే హబీసా దాల్మా రెడీ. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవాలి. -
స్వీట్ పొటాటోతో బిస్కెట్స్.. మీరెప్పుడైనా ట్రై చేశారా?
స్వీట్ పొటాటో బిస్కెట్స్ తయారీకి కావల్సినవి: చిలగడ దుంపలు – పావు కేజీ; పాలు – ముప్పావు కప్పు; మైదా – ఒకటిన్నర కప్పులు; కార్న్ స్టార్చ్ – రెండు టేబుల్ స్పూన్లు; పంచదార – రెండున్నర టేబుల్ స్పూన్లు; వంటసోడా – టేబుల్ స్పూను; ఉప్పు – ఒకటింబావు టీస్పూన్లు; బటర్ – అరకప్పు. తయారీ విధానమిలా: ►చిలగడ దుంపలను ఉడికించి తొక్కతీసి చిదిమి, అందులో పాలుపోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మిక్సీజార్‌లో కార్న్ స్టార్చ్, పంచదార, మైదా, వంటసోడా వేసి రెండు నిమిషాలు గ్రైండ్ చేయాలి. ► ఇప్పుడు బటర్, ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి. దీనిలో చిలగడ దుంప చిదుము వేసి పిండి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేటులో పెట్టి ముప్పావు అంగుళం మందంలో ఉండేలాగా, సమంగా ఒకటే మందంలో ఉండేటట్లు సర్దాలి. ► ఇప్పుడు చాకుతో ఇష్టమైన ఆకారంలో ముక్కలుగా కట్ చేయాలి. పిండి చేతులకు అతుక్కుంటూ ఉంటే పొడి పిండి (మైదా) చల్లుకోవాలి. ఈ ముక్కలను బేకింగ్ ట్రేలో పెట్టి 360 డిగ్రీల ఉష్ణోగ్రతలో పదిహేను నిమిషాలు బేక్ చేయాలి. ముక్కలు గోల్డెన్ కలర్లోకి మారితే స్వీట్ పొటాటో బిస్కెట్స్ రెడీ ∙గాలి చొరబడని డబ్బాలో నిల్వచేస్తే మూడు నెలలు పాడవకుండా ఉంటాయి. -
కమ్మని కార్తీకం.. కొర్రలతో లడ్డూ, రోజుకి ఒకటి తింటే చాలు
కార్తీక మాసం కావడంతో... కోవెళ్లు, లోగిళ్లు దీపాలతో కళకళలాడిపోతున్నాయి. మరో రెండురోజుల్లో కార్తీకపౌర్ణమి. పగలంతా ఉపవాసం ఉన్నవారికి సాయంత్రం చంద్రోదయం కాగానే రుచిగా... శుచిగా కమ్మని వంటలతో ఉపవాస విరమణ చేయమని చెబుతోంది ఈ వారం వంటిల్లు. తినాయ్(కొర్ర) లడ్డు తయారీకి కావల్సినవి: కొర్రలు – కప్పు; పల్లీలు – కప్పు; బెల్లం తరుగు – కప్పు; యాలకులు – మూడు. తయారీ విధానమిలా: ►కొర్రలను శుభ్రంగా కడిగి అరగంట నానబెట్టాలి. అరగంట తరువాత నీటిని వంపేసి ఎండలో ఆరబోయాలి. తడిలేకుండా ఎండిన కొర్రలను బాణలిలో వేసి బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు దోరగా వేయించాలి. ► కొర్రలు వేగిన బాణలిలోనే పల్లీలను వేసి వేయించాలి. పల్లీలు చక్కగా వేగిన తరువాత పొట్టుతీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇదే బాణలిలో బెల్లం, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లుపోసి సన్నని మంట మీద పెట్టాలి. ►బెల్లం కరిగిన తరువాత వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న కొర్రలు, పల్లీలు, యాలకులను మిక్సీజార్‌లో వేసి పొడి చేయాలి.కొర్రలు, పల్లీల పొడిని ప్లేటులో వేసుకుని, ఆ పొడిలో బెల్లం నీళ్లు వేస్తూ లడ్డులా చుట్టుకుంటే తినాయ్ లడ్డు రెడీ. బెల్లం ఇష్టపడని వారు తేనెతో లడ్డులూ చుట్టుకోవచ్చు. ఈ లడ్డు మూడు నాలుగురోజుల పాటు తాజాగా ఉంటుంది. -
ఆరేంజ్ జ్యూస్‌తో హల్వా.. ఎప్పుడైనా ట్రై చేశారా?
ఆరెంజ్ హల్వా తయారీకి కావల్సినవి: ఆరెంజ్ – 3 (జ్యూస్ తీసుకుని, వడ కట్టుకోవాలి) మొక్కజొన్న పిండి – అర కప్పు పంచదార – 1 కప్పు (నీళ్లు పోసుకుని లేతగా పాకం పట్టుకోవాలి) దాల్చినచెక్క పొడి – చిటికెడు ఫుడ్ కలర్ – ఆరెంజ్ కలర్ నట్స్ తరుగు – కొద్దిగా (గార్నిష్‌కి) తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్లో మొక్కజొన్న పిండి తీసుకుని.. అందులో ఆరెంజ్ జ్యూస్, ఫుడ్ కలర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. పంచదార పాకంలో నిమ్మరసం, దాల్చినచెక్క వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమం దగ్గర పడుతున్న సమయంలో ఆరెంజ్ మిశ్రమాన్ని వేసుకుని తిప్పుతూ ఉండాలి. బాగా దగ్గరపడిన తర్వాత ఒక బౌల్‌కి నెయ్యి రాసి.. అందులో ఆ మిశ్రమాన్ని వేసుకుని, నట్స్ తరుగు జల్లుకుని చల్లారనివ్వాలి. దగ్గర పడిన తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి. -
క్రిస్పీ చికెన్ నూడుల్స్.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది
నూడుల్ చికెన్ తయారీకి కావల్సినవి: బోన్ లెస్ చికెన్ – అర కిలో (సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి) నూడుల్స్ – 2 కప్పులు (ఉడికించి, కాస్త చల్లార్చినవి) గుడ్డు – 1,చిల్లీ సాస్ – 1 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్ – పావు కప్పు+1 టేబుల్ స్పూన్ అల్లం–వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా – అర టేబుల్ స్పూన్ చొప్పున టొమాటో సాస్ – 2 టేబుల్ స్పూన్లు మిరియాల పొడి – పావు టీ స్పూన్ ఉప్పు – తగినంత నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా చికెన్ ముక్కల్లో చిల్లీ సాస్, గరం మసాలా, అల్లం–వెల్లుల్లి పేస్ట్, టొమాటో సాస్, కారం, మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్, గుడ్డు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలిపి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఉడికించిన నూడుల్స్‌లో కార్న్ పౌడర్ వేసుకుని అటూ ఇటూ గరిటెతో కలిపి.. ఒక ప్లేట్లో కొన్ని నూడుల్స్ పరచుకుని.. ఒక్కో చికెన్ ముక్కను అందులో పెట్టి చుట్టుకోవాలి. పుల్ల గుచ్చి.. ఒక్కొక్కటిగా కాగుతున్న నూనెలో వేసుకుని, దోరగా వేయించుకోవాలి. -
ఆమ్లా ఛుందా..ఇలా చేస్తే ఎక్కువకాలం తాజాగా ఉంటుంది
ఆమ్లఛుందా తయారీకి కావల్సినవి: ఉసిరికాయలు – అరకేజీ; బెల్లం – అరకేజీ; అల్లం – చిన్నముక్క; బ్లాక్‌సాల్ట్ – ఒకటిన్నర టీస్పూన్లు; మిరియాలు – టీస్పూను; యాలక్కాయలు – ఎనిమిది; దాల్చిన చెక్క – అంగుళం ముక్క; పసుపు – టీస్పూను; కశ్మీరీ కారం – ఒకటిన్నర టీస్పూన్లు; గరం మసాలా – అర టీస్పూను; నిమ్మకాయలు – రెండు. తయారీ విధానమిలా: ►ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, ఆవిరి మీద మెత్తగా (10 నిమిషాలు) ఉడికించాలి ∙అల్లాన్ని సన్నగా తురిమి పెట్టుకోవాలి ∙యాలక్కాయలు, మిరియాలను విడివిడిగా దంచి పెట్టుకోవాలి ∙ఉడికిన ఉసిరికాయలు చల్లారాక గింజలు తీసి సన్నగా తురుముకోవాలి. ఉసిరి తురుములో బెల్లం వేసి మీడియం మంట మీద పెట్టాలి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ►నీరు పైకి తేలగానే అల్లం తురుము, బ్లాక్ సాల్ట్, మిరియాల పొడి, యాలకుల పొడిని వేయాలి ∙దాల్చిన చెక్కను తుంచి వేయాలి ∙చివరిగా పసుపు వేసి కలుపుతూ ఉడికించాలి ∙మీడియం మంట మీదే ఉంచి కలుపుతూ మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు కారం, గరంమసాలా వేసి కలపాలి. బాగా కలిసిన తరువాత దించేసి, నిమ్మరసం పిండితే ఆమ్లా ఛుందా రెడీ. గమనిక: గాజు లేదా పింగాణీ పాత్రల్లో నిల్వ చేస్తే ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. -
క్యాన్సర్ ముప్పుని తగ్గించే ఉసిరి.. పచ్చడి పెట్టుకోండిలా
తిన్న తిండి ఒంటికి పట్టేలా చేయడంతో ఉసిరి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచడం, క్యాన్సర్ ముప్పుని తగ్గించడంలో ఉసిరి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇన్ని సుగుణాలు ఉన్న ఉసిరి ప్రస్తుతం మార్కెట్లో దండిగా దొరుకుతోంది. అందుకే ఊరించే ఉసిరిని మరింత రుచిగా ఇలా చేసుకోమని చెబుతోంది ఈ వారం మన వంటిల్లు... స్పైసీ పచ్చడి తయారికి కావలసినవి: ఉసిరికాయలు – ఆరు; పచ్చి శనగపప్పు – పావు కప్పు; పచ్చిమిర్చి – మూడు; వెలుల్లి రెబ్బలు – నాలుగు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – టీస్పూను; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీస్పూను; పసుపు – పావు టీస్పూను; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – రెండు రెమ్మలు; కొత్తిమీర తరుగు – కాస్తంత తయారీ విధానమిలా: పచ్చిశనగపప్పుని శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ∙ఉసిరికాయలను శుభ్రంగా కడిగి గింజలు తీసేసి ముక్కలుగా తరుగుకోవాలి. ∙ఉసిరికాయ ముక్కలు, నానిన శనగపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లుపోసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ అయిన పచ్చడిని గిన్నెలోకి తీసుకోవాలి ∙బాణలిలో నూనె వేసి, ఆవాలు జీలకర్ర, ఇంగువ, పసుపు, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి ∙ఈ తాలింపుని పచ్చడిలో వేసి కలపాలి. చివరిగా కొత్తిమీర తరుగు వేసి కలిపితే స్పైసీ పచ్చడి రెడీ. చపాతీ, రోటీ, అన్నంలోకి ఈ పచ్చడి చాలా బావుంటుంది. -
పిల్లలకు ఇష్టమైన బనానా మోదక్.. ఇలా ట్రై చేయండి
బనానా మోదక్ తయారికి కావలసినవి: గోధుమ పిండి – కప్పు; అరటిపండ్లు – రెండు; బెల్లం – మువు కప్పు; పచ్చికొబ్బరి తురుము – టేబుల్ స్పూను; అటుకులు – రెండు టేబుల్ స్పూన్లు; సూజీ రవ్వ – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు – చిటికెడు; నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు; యాలకుల పొడి – పావు టీస్పూను; నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా. తయారీ విధానమిలా: అరటిపండ్లు, బెల్లం, కొబ్బరి తురుము, అటుకులు, సూజీరవ్వను మిక్సీజార్‌లో వేసి కొద్దిగా నీళ్లుపోసి పేస్టులా గ్రైండ్ చేయాలి ∙ఈ పేస్టుని పెద్దగిన్నెలో వేసి... గోధుమ పిండి, ఉప్పు, నెయ్యి, యాలకుల పొడి అన్ని కలిసిపోయేలా చక్కగా కలపాలి ∙ఇప్పుడు ఈ పిండిని మోదక్‌లా లేదా నచ్చిన ఆకారంలో చేసుకుని మరుగుతోన్న నూనెలో వేసి డీప్ ఫ్రైచేయాలి ∙మీడియం మంట మీద రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రె చేస్తే బనానా మోదక్ రెడీ. -
పాలపొడితో దీపావళి కోసం స్పెషల్ స్వీట్.. చేసుకోండిలా
షీర్ పీరా తయారికి కావల్సినవి: పంచదార – కప్పు; పాల పొడి – రెండు కప్పులు; బాదం పలుకులు – టేబుల్ స్పూను; జీడిపప్పు పలుకులు – టేబుల్ స్పూను; పిస్తా పలుకులు – టేబుల్ స్పూను; కిస్మిస్ – టేబుల్ స్పూను; యాలకులు – నాలుగు; నెయ్యి – టేబుల్ స్పూను; గార్నిష్ కోసం.... పిస్తా, బాదం, జీడిపప్పు పలుకులు – టేబుల్ స్పూను (పెద్దసైజువి). తయారీ విధానమిలా: డ్రైఫ్రూట్స్ పలుకులు సన్నగా పొడవుగా ఉండేలా తీసుకోవాలి. మందపాటి బాణలిలో పంచదార, కప్పు నీళ్లుపోసి మంటమీద పెట్టాలి తీగపాకం వచ్చేంత వరకు మరిగించాలి.తీగపాకం వచ్చినప్పుడు సన్నమంటమీద ఉంచాలి ∙ఇప్పుడు పాల పొడిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి.పాలపొడి దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి ∙ దగ్గర పడుతున్నప్పుడు బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులు, కిస్మిస్ ముక్కలను వేసి కలపాలి ∙చివరిగా యాలకులను పొడిచేసి వేయాలి ∙ప్లేటుకును నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని వేయాలి ∙ప్లేటంతా సమంగా పరుచుకుని పైన కొద్దిగా పిస్తా, బాదం, జీడిపప్పు పలుకులు చల్లాలి ∙స్పూను పెట్టి పైన కూడా సమంగా వత్తుకుని ప్లేటుని రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ∙రెండు గంటల తరువాత నచ్చిన ఆకారంలో ముక్కలు కట్‌చేసి సర్వ్ చేసుకోవాలి. -
సాయంత్రం టీలోకి బెస్ట్ ఆప్షన్.. మక్ పారా ఫ్లవర్స్
మక్ పారా ఫ్లవర్స్ తయారికి కావల్సినవి: మైదా– 2 కప్పులు, పంచదార పొడి– అర కప్పు, మిరియాల పొడి– అర టీస్పూన్, ఉప్పు– కొద్దిగా నూనె– 3 టేబుల్ స్పూన్లు,చిక్కటి పాలు– సరిపడా (కాచి చల్లారిన వి) నూనె– డీప్ ఫైకి సరిపడా, లవంగమొగ్గలు– కొన్ని(అభిరుచిని బట్టి) తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మైదాపిండి, మిరియాలపొడి, పంచదార పొడి, తగినంత ఉప్పు వేసుకుని కొద్దికొద్దిగా పాలు పోసుకుంటూ ముద్దల్లా చేసుకుని.. 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అనంతరం నచిన విధంగా ఫ్లవర్‌లా చేసుకోవచు. లేదా అభిరుచిని బట్టి ఒక ఫ్లవర్‌పై మరో ఫ్లవర్ ఉంచి, మధ్యలో ఒక్కో లవంగమొగ్గ గుచ్చి, కదలకుండా పెట్టుకోవచ్చు. అనంతరం వాటిని నూనెలో డీప్ ఫై చేసుకుంటే సరిపోతుంది. -
స్నాక్స్ కోసం బెస్ట్ రెసిపి.. పోహా వెజ్ కట్లెట్
పోహా వెజ్ కట్లెట్ తయారికి కావల్సినవి: అటుకులు – కప్పు; ఉడికించిన బంగాళ దుంపలు – రెండు; క్యాప్సికం తరుగు – రెండు టీస్పూన్లు; క్యారట్ తురుము – రెండు టీస్పూన్లు; పచ్చిబఠాణి – రెండు టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; ధనియాల పొడి – టీస్పూను; చాట్ మసాలా – టీస్పూను; కారం – టీస్పూను; పచ్చిమిర్చి పేస్టు – టీస్పూను; కార్న్‌ఫ్లోర్ – రెండు టేబుల్ స్పూన్లు; బ్రెడ్ ముక్కల పొడి – కప్పు; ఉప్పు – రుచికి సరిపడా;నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా. తయారీ విధానమిలా: ►అటుకులను శుభ్రంగా కడిగి పదినిమిషాలు నానబెట్టుకోవాలి ∙పదినిమిషాల తరువాత నానిన అటుకుల్లో తొక్కతీసిన దుంపలు, బఠాణి, క్యాప్సికం, క్యారట్, కొత్తిమీర తరుగు వేయాలి ∙ ► పచ్చిమిర్చి పేస్టు, చాట్ మసాలా, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పువేసి ముద్దలా కలపాలి ∙పిండిని ఉండలుగా చేసి, కట్లెట్లా వత్తుకుని పక్కన పెట్టుకోవాలి ∙కార్న్‌ఫ్లోర్‌లో నీళ్లు పోసి పేస్టులా కలపాలి. ► ఒక్కో కట్లెట్ను కార్న్‌ఫ్లోర్ పేస్టులో ముంచి, తరువాత బ్రెడ్ ముక్కల పొడిని అద్దాలి ∙బ్రెడ్ ముక్కల పొడి అద్దిన తరువాత డీప్ ఫ్రై చేసుకోవాలి ∙గోల్డెన్ కలర్లోకి మారాక తీసి సాస్ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేయాలి. -
గుడ్డుతో పొంగనాలు.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?
మసాలా ఎగ్ పనియరం తయారీకి కావల్సినవి: గడ్డ పెరుగు – 2 కప్పులు గుడ్డు – 3, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు – 1 టేబుల్ స్పూన్ చొప్పున కొత్తిమీర తురుము – కొద్దిగా అల్లం తురుము – అర టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్ మిరియాల పొడి – పావు టీ స్పూన్ ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ విధానమిలా: ముందుగా పెరుగును రెండుమూడు సార్లు అటూ ఇటూ తిరగబోసుకుని సాఫ్ట్‌గా అయ్యేలా చేసుకోవాలి. అందులో గుడ్లు పగలగొట్టుకుని బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని.. దానిపై పొంగనాల పెనం పెట్టుకుని.. ప్రతి గుంతలో కొద్దికొద్దిగా నూనె వేసుకుని.. కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని వాటిలో వేసుకుని ఇరువైపులా వేయించుకోవాలి. వీటిని.. నచ్చిన చట్నీలో వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి. -
కోకోనట్ మిల్క్ కేక్.. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు
కోకోనట్ మిల్క్ కేక్ తయారీకి కావల్సినవి: కొబ్బరి పాలు – అర లీటరు, పాలు – పావు లీటరు, పంచదార – పావు కప్పు, నిమ్మరసం – 1 టీ స్పూన్ పిస్తా, బాదం తురుము – గుప్పెడు(అభిరుచిని బట్టి మరిన్ని, నేతిలో వేయించుకోవాలి) తయారీ విధానమిలా: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. ఒక పాత్రలో పాలు పోసి.. చిన్న మంట మీద మరిగించాలి. తర్వాత కాసేపటికి నిమ్మరసాన్ని ఒక టేబుల్ స్పూన్ నీళ్లలో బాగా కలిపి.. మరుగుతున్న పాలలో చుక్క చుక్క చొప్పున వేస్తూ ఉండాలి. పాలు చిక్కబడే వరకు గరిటెతో తిప్పుతూ ఉండాలి. పాలు చిక్కబడుతున్నప్పుడు అందులో కొబ్బరిపాలు, పంచదార కలపాలి. కోవాలా అయ్యే వరకు మరిగించాలి. దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ బౌల్ తీసుకుని, దాని లోపల నెయ్యి రాసి, ఈ మిశ్రమం మొత్తం వేసుకుని.. బాదం పిస్తా పలుకులు చల్లాలి. చల్లారిన తర్వాత నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవాలి. లేదంటే నచ్చిన విధంగా క్రీమ్స్‌తో గార్నిష్ చేసుకుని బర్త్‌డే కేక్‌లా తయారుచేసుకోవచ్చు. -
పాలక్ మేథీ పూరీ..ఇలా చేస్తే లొట్టలేసుకొని తింటారు
పాలక్ మేథీ పూరీ తయారీకి కావల్సినవి: జీలకర్ర – టేబుల్ స్పూను; సోంపు – టేబుల్ స్పూను; వాము – టీస్పూను; నువ్వులు – టేబుల్ స్పూను; ధనియాల పొడి – టేబుల్ స్పూను; రెండు కప్పులు; శనగపిండి – పావు కప్పు; పసుపు – అరటేబుల్ స్పూను; ఉప్పు – రుచికి సరిపడా; కారం – టేబుల్ స్పూను; నూనె –డీప్‌ఫ్రైకి సరిపడా పచ్చిమిర్చి – మూడు; అల్లం తరుగు – టీస్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; పాలకూర తరుగు – రెండు కప్పులు; మెంతికూర తరుగు – కప్పు; గోధుమ పిండి –రెండు కప్పులు తయారీ విధానం: జీలకర్ర, సోంపు, నువ్వులు, వాము, ధనియాల పొడి, పచ్చిమిర్చి; అల్లం తరుగు, కరివేపాకుని మిక్సీజార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పాలకూర, మెంతికూర తరుగుని గిన్నెలో వేయాలి. దీనిలోనే గోధుమపిండి, శనగపిండి, కారం, పసుపు, గ్రైండ్ చేసిన మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు, టేబుల్ స్పూను నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా వేడినీళ్లు చల్లుకుంటూ ముద్దలా కలపాలి ∙పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీలా మందంగా వత్తుకోవాలి ∙గుండ్రని గిన్నె లేదా చిన్న గ్లాసుతో పూరీని చిన్న చిన్న చెక్కల్లా కట్ చేయాలి ∙అన్నీ రెడీ అయ్యాక క్రిస్పీగా మారేంత వరకు డీప్ ఫ్రై చేస్తే రుచికరమైన పాలక్ మేథీ పూరీ రెడీ. -
బెస్ట్ స్నాక్ రెసిపి.. పనీర్ కుర్కురే, ఎప్పుడైనా ట్రై చేశారా?
పనీర్ కుర్కురే తయారీకి కావల్సినవి: నిలువుగా కోసిన పనీర్ ముక్కలు – రెండు కప్పులు; పసుపు – టీస్పూను; కారం – టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; కసూరీ మేథీ – టేబుల్ స్పూన్; వాము – అరటీస్పూను; చాట్ మసాలా – టీస్పూను; గరం మసాలా – టీస్పూను; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; అల్లం వెల్లుల్లి పేస్టు – టేబుల్ స్పూను; కార్న్‌ఫ్లేక్స్ – రెండు కప్పులు; శనగపిండి – రెండు కప్పులు; నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా. తయారీ విధానమిలా: ►పనీర్ ముక్కలపైన చిటికెడు సాల్ట్, కారం, టేబుల్ స్పూను కొత్తిమీర తరుగు, చాట్ మసాలా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ► పెద్ద గిన్నె తీసుకుని శనగపిండి, వాము, అల్లం వెల్లుల్లి పేస్టు, కసూరీ మేథీ, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి ► ఇప్పుడు నీళ్లు పోసి బజ్జీపిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ∙ఒక ప్లేటులో కార్న్ ఫ్లేక్స్‌ను నలిపి పెట్టుకోవాలి ► ఇప్పుడు ఒక్కో పనీర్ ముక్కను తీసుకుని ముందుగా శనగపిండి మిశ్రమంలో ముంచాలి. తరువాత కార్న్‌ఫ్లేక్స్‌ను అద్ది సలసలా కాగుతోన్న నూనెలో వేసి డీప్‌ఫ్రై చేయాలి ∙పనీర్ ముక్క క్రిస్పీగా మారితే పన్నీర్ కుర్కురే రెడీ. -
కర్ణాటక పాపులర్ స్వీట్ రెసిపి మండిగె.. టేస్ట్ అదిరిపోతుంది
మండిగే తయారీకి కావల్సినవి: బొంబాయి రవ్వ – రెండు కప్పులు; గోధుమ పిండి – కప్పు; ఉప్పు – చిటికెడు; బెల్లం తరుగు – అరకప్పు; నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు; పచ్చకర్పూరం – చిటికెడు. తయారీ విధానం ఇలా: పెద్ద గిన్నెలో బొంబాయి రవ్వ, గోధుమ పిండి, ఉప్పు, టేబుల్ స్పూను నెయ్యివేసి కలపాలి. ఇప్పుడు నీళ్లు చల్లుకుంటూ చపాతీ ముద్దలా చేసుకోవాలి. దీనిపైన మూతపెట్టి ఇరవై నిమిషాలు పక్కన పెట్టాలి. బెల్లంలో మిగిలిన నెయ్యి, పచ్చకర్పూరం వేసి, కలిపి పక్కన పెట్టుకోవాలి ∙20 నిమిషాల తరువాత పిండిముద్దను ఉండలుగా చుట్టి, చపాతీలా వత్తుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ తీసుకుని,పైన రెండు టీస్పూన్ల బెల్లం మిశ్రమం వేసి చపాతీ అంతా పరచాలి. బెల్లం పరిచిన చపాతీపై మరో చపాతీని వేసి చ΄ాతీకర్రతో ఒకసారి వత్తుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని పెనం మీద వేసి రెండు వైపులా క్రిస్పీగా మారేంత వరకు కాల్చి తీసేయాలి. ఇలా కాలిన మండిగేను రెండు మూడు మడతలు వేసి సర్వ్ చేసుకోవాలి. -
అటుకులతో స్వీట్ రెసిపి.. టేస్ట్ బావుంటుంది ట్రై చేయండి
అటుకుల శక్కర్ పారే తయారీకి కావల్సినవి: అటుకులు – అర కప్పు (మిక్సీ పట్టుకుని పొడిలా చేసుకోవాలి) మైదా – 2 కప్పులు పంచదార – అర కప్పు నెయ్యి – 6 టేబుల్ స్పూన్లు నీళ్లు – కావాల్సినన్ని నువ్వులు – కొద్దిగా నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పంచదార, కొద్దిగా నీళ్లు పోసుకుని పంచదార కరిగేవరకు కలుపుకోవాలి. ఇప్పుడు అందులో నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత మైదా పిండి, అటుకుల పొడి, నువ్వులు వేసుకుని ముద్దలా చేసుకుని సుమారు గంటన్నర సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీల్లా ఒత్తుకుని నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవాలి. వాటిని నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది. -
బెంగాల్ పాపులర్ స్వీట్ లవంగ్ లతిక ఎప్పుడైనా ట్రై చేశారా?
లవంగ్ లతిక తయారీకి కావల్సినవి: మైదా – ముప్పావు కప్పు; ఉప్పు – రుచికి సరిపడా; పంచదార – కప్పు; లవంగాలు – పన్నెండు; నెయ్యి – డీప్‌ఫ్రైకి సరిపడా. స్టఫింగ్ కోసం: కోవా తురుము – ముప్పావు కప్పు; బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు – అరకప్పు; వేడిపాలు – అరటీస్పూను; కుంకుమ పువ్వు రేకులు – పావు టీస్పూను; పంచదార పొడి – పావు టీస్పూను; యాలకుల పొడి – అరటీస్పూను. తయారీ విధానమిలా: మైదాలో టేబుల్ స్పూను నెయ్యి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లు చల్లుకుంటూ ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి ∙పంచదారలో ఒకటిన్నర కప్పుల నీళ్లుపోసి మీడియం మంట మీద తిప్పుతూ సిరప్ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ∙స్టఫింగ్ కోసం తీసుకున్న పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో వేసి కలిపి పెట్టుకోవాలి.నానిన పిండిముద్దను ఉండలుగా చుట్టుకోవాలి. ఈ ఉండలను పూరీల్లా వత్తుకుని మధ్యలో రెండు రెండు టీస్పూన్ల స్టఫింగ్‌ను వేయాలి ∙ఇప్పుడు స్టఫింగ్ బయటకు రాకుండా రెండు పక్కలా పూరీని మూయాలి పూరీని తిరగేసి తెరచి ఉన్న మరోవైపుని కొద్దిగా తడిచేసి మూసివేయాలి. మడత ఊడి΄ోకుండా లవంగం గుచ్చాలి ఇలా అన్ని లతికలను తయారు చేసుకోవాలి. ఇప్పుడు సలల కాగుతోన్న నెయ్యిలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు డీప్‌ఫ్రై చేయాలి ∙చక్కగా వేగిన లతికలను టిష్యూపేపర్ మీద వేసుకోవాలి వీటిని తినాలనుకున్నప్పుడు పంచదార సిరప్‌ను వేడిచేసి దానిలో లతికలను వేసి పదిహేను నిమిషాలు ఉంచి, ఆ తరువాత సర్వ్ చేయాలి. -
మిల్లెట్స్‌తో హెల్దీగా కుకీస్.. పిల్లలు ఇష్టంగా తింటారు
ఊదల కుకీస్ తయారీకి కావల్సినవి: మైదా – 1 కప్పు, ఊదల పిండి – ఒకటిన్నర కప్పులు, బాదం పప్పు పొడి – ముప్పావు కప్పు సాల్టెడ్ బటర్, పీనట్ బటర్ – 100 గ్రా. చొప్పున చిక్కటి పాలు – కొద్దిగా, చాక్లెట్ క్రీమ్ – 1 కప్పు (చిప్స్ లేదా బిట్స్‌ని ఓవెన్లో కరిగించి పెట్టుకోవాలి) తయారీ విధానమిలా: మొదట పెద్ద బౌల్ తీసుకుని పటికబెల్లం పొడిని జల్లెడ పట్టుకోవాలి. అందులో సాల్టెడ్ బటర్, పీనట్ బటర్ వేసుకుని హ్యాండ్ బ్లెండర్తో బాగా బీట్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో ఊదల పిండి, బాదం పప్పు పొడి వేసుకుని చేత్తో ముద్దలా కలపాలి. అవసరాన్ని బట్టి.. సరిపడా గోరు వెచ్చని పాలు పోసి కలుపుకోవచ్చు. దీన్ని అరగంట పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఆ తర్వాత చేత్తో బిస్కట్స్లా ఒత్తుకుని, ప్రీ హీట్ చేసిన ఓవెన్లో 170 డిగ్రీల సెల్సియస్ వద్ద 20 లేదా 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అనంతరం... కరిగిన చాక్లెట్ క్రీమ్‌లో ముంచి తీసి, పైన చాక్లెట్ కోన్ సాయంతో నచ్చిన షేప్‌లో డిజైన్స్ వేసుకుని.. కాసేపు ఆరనిచ్చి సర్వ్ చేసుకోవాలి. -
సగ్గుబియ్యం టిక్కీ.. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు
సగ్గుబియ్యం టిక్కీ తయారీకి కావలసినవి: సగ్గుబియ్యం – కప్పు; వేయించిన పల్లీలు – కప్పు; బంగాళ దుంపలు – రెండు; అల్లం – రెండు అంగుళాల ముక్క; పచ్చిమిర్చి – రెండు; జీలకర్ర – టీస్పూను; కొత్తిమీర తరుగు – పావు కప్పు; నిమ్మకాయ – అరచెక్క; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానమిలా: సగ్గుబియ్యాన్ని దోరగా వేయించి, చల్లారాక పొడిచేసి పెట్టుకోవాలి ∙పల్లీలను బరకగా గ్రైండ్ చేసి సగ్గుబియ్యం పొడిలో కలపాలి. బంగాళ దుంపలను తొక్కతీసి ముక్కలుగా తరగాలి. ∙పచ్చిమిర్చి, అల్లం కూడా ముక్కలుగా తరగాలి. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర తరుగు వేసి గ్రైండ్ చేయాలి. నలిగిన మిశ్రమాన్నీ, సగ్గుబియ్యం పొడిలో వేసి, రుచికి సరిపడా ఉప్పు, నిమ్మచెక్కను పిండి రసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత పిండిని టిక్కీల ఆకారంలో వత్తుకుని డీప్‌ఫ్రై చేస్తే సగ్గుబియ్యం టిక్కీలు రెడీ ∙కొత్తిమీర చట్నీతో ఈ టిక్కీలు చాలా రుచిగా ఉంటాయి. సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
చపాతీతో క్రిస్పీ రోల్స్.. వెరైటీగా చేసుకోండిలా
క్రిస్పీ రోల్స్ తయారీకి కావల్సినవి: చపాతీలు – మూడు ; కొత్తిమీర తరుగు – అరకప్పు ; ఉడికించిన బంగాళ దుంపలు – రెండు; కారం – అరటీస్పూను; ధనియాల పొడి – టీస్పూను; గరం మసాలా – రెండు టీస్పూన్లు ; పచ్చిమిర్చి – రెండు; ఉల్లిపాయ – ఒకటి; చాట్ మసాలా – ఒకటిన్నర టీస్పూన్లు; గోధుమ పిండి –అర కప్పు; బియ్యప్పిండి – స్పూను; కార్న్‌ఫ్లోర్ – మూడు టీ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ►చపాతీలను సన్నగా పొడవుగా తరిగి, రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమంపై కొద్దిగా నీళ్లుచల్లి మరోసారి కలపాలి ∙ఇప్పుడు మెత్తగా మారిన చపాతీ మిశ్రమంలో కార్న్‌ఫ్లోర్, బియ్యప్పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి. ∙ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నని ముక్కలుగా తరగాలి. ► బంగాళదుంపలు తొక్కతీసి చిదుముకోవాలి. దీనిలో ధనియాల పొడి, గరం మసాలా; పచ్చిమిర్చి, ఉల్లి తరుగు, ఛాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ► ఇప్పుడు చేతులకు కొద్దిగా నూనె రాసుకుని దుంప మిశ్రమాన్ని రోల్స్‌గా చుట్టుకోవాలి గోధుమపిండిలో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా కలపాలి ∙ఇప్పుడు దుంపరోల్స్ను గోధుమపిండిలో ముంచి, తరువాత చపాతీ మిశ్రమాన్ని రోల్‌కు అద్దాలి. ► ఇప్పుడు రోల్‌ను మరుగుతోన్న నూనెలో వేసి, గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు వేయించి తీయాలి ∙ఇలా రోల్స్ అన్నింటిని వేయిస్తే క్రిస్పీ రోల్స్ రెడీ. -
నోరూరించే కొబ్బరి ఖీమా బాల్స్ ట్రై చేయండిలా..!
కొబ్బరి ఖీమా బాల్స్‌కి కావలసినవి: కొబ్బరి – ఒకచిప్ప కారం – అర టీస్పూను పసుపు – చిటికెడు గరం మసాలా – అరటీస్పూను ధనియాల పొడి – అర టీ స్పూను కొత్తిమీర తరుగు – మూడు టీస్పూన్లు శనగపిండి – రెండు టీస్పూన్లు పచ్చిమిర్చి – రెండు స్పూన్లు కరివేపాకు – రెండు రెమ్మలు ఉప్పు – రుచికి సరిపడా నూనె – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానం: పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకోవాలి∙ కొబ్బరి చిప్పలోని కొబ్బరిని తురుముకోవాలి∙ కొబ్బరి తురుముని గిన్నెలో వేసి.. కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి∙ చివరిగా శనగపిండివేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉండలుగా చుట్టుకోవాలి∙ బాణలిలో నూనె వేసి వేడెక్కిన తరువాత ఉండలను వేసి వేయించాలి ∙ఉండలు వేగిన తరువాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి మూడు నిమిషాలు వేయించితే కొబ్బరి ఖీమా బాల్స్ రెడీ ∙ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసంతో సర్వ్‌చేసుకోవాలి. (చదవండి: నోరూరించే రొయ్యల పచ్చడి ఇలా చేస్తే..చక్కగా లాగించేస్తారు!) -
ఫిష్ – చీజ్ బాల్స్.. టేస్ట్ అదిరిపోతుంది, ట్రై చేయండి
ఫిష్ – చీజ్ బాల్స్ తయారీకి కావల్సినవి: చేప ముక్కలు – పావు కిలో (మెత్తగా ఉడికించి, చల్లారాక మధ్యలో ముల్లు తొలగించి, పొడిపొడి తురుములా చేసుకోవాలి) బ్రెడ్ స్లైస్ – 8 లేదా 10 (నలువైపులా కట్ చేసుకుని పెట్టుకోవాలి) చీజ్ తురుము – 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్ పసుపు – కొద్దిగా, గరం మసాలా – 1 టీ స్పూన్, కోడిగుడ్లు – 2 బ్రెడ్ పౌడర్ – పావు కప్పు, చిక్కటి పాలు – కొన్ని, ఉప్పు – తగినంత నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించిన ఫిష్ తురుము, చీజ్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, గరం మసాలా వేసుకొని బాగా కలిపి ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్రతి బ్రెడ్ ముక్కను పాలలో నానబెట్టి.. గట్టిగా ఒత్తి.. అందులో కొద్దికొద్దిగా ఫిష్ మిశ్రమం పెట్టుకుంటూ బాల్లా చేసి, నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. -
పిచ్చి పీక్స్ అంటే ఇదే.. పచ్చిగుడ్డుతో వెరైటీ టీ
మనలో చాలామందికి టీ తాగనిదే రోజు గడవదు. ఎన్ని పనులున్నా మొదట టీ తాగిన తర్వాతే ప్రారంభించే వాళ్లు బోలెడు మంది ఉన్నారు. నీరసంగా, అలసటగా ఉన్నప్పుడు ఒక్క టీ అయినా పడాల్సిందే అనేలా ఫీల్ అవుతుంటారు. అంతగా మనోళ్లు ఛాయ్‌కి ప్రాధాన్యత ఇస్తారు. గ్రీన్ టీ, జింజర్ టీ, బ్లాక్ టీ, మసాలా టీ లాంటి ఎన్నో వెరైటీలు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈమధ్య సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఎగ్ టీ గురించి మీకు తెలుసా? ఈ వెరైటీ టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా టీ తయారు చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కానీ ఓ యూట్యూబర్ తయారు చేసిన వింత టీ గురించి తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే. ఈ టీ టేస్ట్ సంగతి అటు ఉంచితే, దీన్ని తయారు చేయడం చూస్తేనే కడుపులో తిప్పేస్తుంది. ఎందుకంటే ఈ టీని పచ్చిగుడ్డుతో, పండ్లతో తయారు చేస్తారు. సాధారణంగా ఎగ్ టీ అనేది వెస్ట్రన్ దేశాల్లో బాగా ఫేమస్. వియత్నాం, స్వీడన్ వంటి దేశాల్లో గుడ్డును తరచూ టీ, కాఫీల్లో కలుపుకొని తాగేస్తారు. ఇంకెందుకు ఆలస్యమని ఇప్పుడు అదే ట్రెండ్‌ను మనవాళ్లూ ట్రై చేస్తున్నారు. తాజాగా ఓ యూట్యూబర్ షేర్ చేసిన ఎగ్ టీ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె ఏం చేసిందంటే.. ముందుగా టీ గిన్నె పెట్టుకుని అందులో షుగర్, టీ పొడి వేసి వేయించింది. ఇప్పుడు యాపిల్ ని ముక్కలుగా కోసి వేసి వేయించింది. ఇప్పుడు ఒక గ్లాస్ పాలు పోసి కాసేపు మరగ బెట్టింది. కాసేపు అయ్యాక పచ్చి గుడ్డును పగుల కొట్టి ఆ టీలో కలిపేసింది. ఆ తర్వాత ఫైనల్ టచ్ కోసం యాలకులు, దాల్చిన చెక్క వేసి మళ్లీ మరిగించి ఓ కప్పులో సర్వ్ చేసింది. ప్రస్తుతం ఈ వెరైటీ ఎగ్ టీకి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్లు.. ఈ టీని తాగిన వాళ్లు బతికే ఉన్నారా? ఇలాంటి పిచ్చి ఐడియాలు ఎక్కడ్నుంచి వస్తాయో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు టీ తాగే ముందు, లేదా తర్వాత వెంటనే పండ్లను, గుడ్డును తినకూడదంటూ డైటీషియన్లు చెబుతున్న వీడియోలను కొందరు నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఎంత వెస్ట్రన్ కల్చర్‌ను ఫాలో అవుతున్నా, కొన్ని మన ఆరోగ్యానికి కూడా నప్పేలా ఉండాలి, ప్రతీది ఇలా కాపీ కొట్టందంటూ హితవు పలుకుతున్నారు. -
చిలకడదుంపతో కేక్, ఎప్పుడైనా ట్రై చేశారా? టేస్ట్ బావుంటుంది
వాల్నట్ – స్వీట్‌పొటాటో కేక్ తయారీకి కావల్సినవి: చిలగడదుంప›– 1(పెద్దది, సుమారు 450గ్రాములు ఉండాలి.) వాల్నట్ – 100 గ్రాములు,పంచదార – 200 గ్రాములు బ్రౌన్ షుగర్ – 50గ్రాములు, వెజిటబుల్ నూనె – 120 మిల్లీలీటర్లు నీళ్లు – 80 మిల్లీలీటర్లు, గుడ్లు – 2, ఉప్పు – తగినంత మైదాపిండి – 220 గ్రాములు, బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్ దాల్చినచెక్క పొడి – అర టీ స్పూన్,జాజికాయ పొడి – పావు టీ స్పూన్ తయారీ విధానమిలా: చిలగడ దుంపను సిల్వర్ పేపర్లో చుట్టి.. ఓవెన్లో బాగా బేక్ చేసుకుని.. చల్లారిన తర్వాత.. మెత్తగా చిదుముకోవాలి. అనంతరం ఒక బౌల్ తీసుకుని.. అందులో గుడ్లు, పంచదార, బ్రౌన్ షుగర్ వేసుకుని.. హ్యాండ్ బ్లెండర్తో మిక్స్ చేసుకోవాలి. తర్వాత నూనె, నీళ్లు పోసుకుని మరోసారి హ్యాండ్ బ్లెండర్తో బాగా కలుపుకోవాలి. ఇంతలో మరో బౌల్ తీసుకుని.. అందులో మైదాపిండి, బేకింగ్ పౌడర్, దాల్చిన చెక్క పొడి, ఉప్పు, జాజికాయ పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ మిశ్రమంలో మైదా మిశ్రమం కలిపి.. హ్యాండ్ బ్లెండర్తో మరోసారి కలపాలి. దానిలో చిలగడదుంప గుజ్జుని వేసుకుని.. బాగా కలిపి.. నచ్చిన షేప్‌లోని బేకింగ్ బౌల్ తీసుకుని.. అందులో ఈ మిశ్రమం మొత్తం పోసుకుని.. సమాంతరంగా పరచి ఓవెన్లో బేక్ చేసుకోవాలి. అనంతరం చాక్లెట్ బిట్స్, క్రీమ్స్‌తో నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. -
బనానా – ఓట్స్‌తో వెరైటీగా కజ్జికాయలు.. ఓసారి ట్రై చేయండి
బనానా – ఓట్స్ కజ్జికాయలు తయారీకి కావల్సినవి: అరటిపండు గుజ్జు – 1 కప్పు ఓట్స్ పౌడర్ – అర కప్పు (1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని దోరగా వేయించుకోవాలి) కొబ్బరి కోరు – పావు కప్పు పంచదార పొడి 2 టేబుల్ స్పూన్లు సోయా పాలు – పావు కప్పు నూనె – 4 టేబుల్ స్పూన్లు మైదాపిండి – 1 కప్పు, ఉప్పు – కొద్దిగా తయారీ విధానమిలా: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. అందులో కొబ్బరికోరు, ఓట్స్ పౌడర్ వేసుకుని దోరగా వేయించి.. అరటిపండు గుజ్జు, పంచదార పొడి వేసుకుని కలుపుతూ ఉండాలి. చివరిగా సోయా పాలు పోసుకుని తిప్పుతూ మూత పెట్టి చిన్న మంటపైన మగ్గనివ్వాలి. ఈలోపు మైదాపిండిలో 2 టేబుల్ స్పూన్ల నూనె, తగినంత ఉప్పు వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని ముద్దలా చేసుకుని పావు గంట పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఆ మిశ్రమంతో చిన్న చిన్న ఉండలు చేసుకుని చపాతీల్లా ఒత్తుకుని, మధ్యలో బనానా–ఓట్స్ మిశ్రమం పెట్టుకుని కజ్జికాయలుగా చుట్టుకోవాలి. వాటిని నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి నిలువ ఉండవు. -
రొయ్యలతో స్ప్రింగ్‌రోల్స్.. భలే రుచిగా ఉంటాయి
రొయ్యలు–పీనట్ రోల్స్ తయారీకి కావల్సినవి: రొయ్యలు – 15 లేదా 20 (పెద్దవి, శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. అభిరుచిని బట్టి తోక ఉంచుకోవచ్చు లేదా కట్ చేసుకోవచ్చు) స్ప్రింగ్‌రోల్ రేపర్స్ – 8 పైనే (మడతలు వేసుకుని.. క్రాస్‌గా ముక్కల్లా కట్ చేసుకోవాలి) టొమాటో సాస్ – 2 టేబుల్ స్పూన్లు చిల్లీ సాస్ – అర టీ స్పూన్ పీనట్ సాస్ –3 టేబుల్ స్పూన్లు తులసి ఆకులు – గుప్పెడు (తాజావి తీసుకుని కడిగి, చిన్నచిన్నగా తరిగి పెట్టుకోవాలి. అభిరుచిని బట్టి వాడుకోవచ్చు) నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా రొయ్యల్లో టొమాటో సాస్, చిల్లీ సాస్, పీనట్ సాస్ అన్నీ వేసుకుని.. బాగా కలుపుకోవాలి. అనంతరం ఒక్కో స్ప్రింగ్‌రోల్ రేపర్స్ ముక్క పరచుకుని.. మధ్యలో రొయ్యను ఉంచుకుని.. తోక కిందకు వచ్చేలా చేసుకుని.. పైన తులసి ఆకు ముక్కలు కొద్దిగా వేసుకుని.. రోల్స్‌లా చుట్టుకోవాలి. చివరిగా తడి చేత్తో రేపర్స్ని ఒత్తి.. ఊడిపోకుండా నొక్కాలి. కాగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుని.. దోరగా వేయించి టొమాటో సాస్‌తో సర్వ్ చేసుకోవాలి. వీటిని వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి. -
నోరూరించే చిల్లీ పనీర్.. కెచప్‌తో తింటే అదిరిపోతుంది
చిల్లీ పనీర్ తయారీకి కావల్సినవి: పనీర్ – 250 గ్రా (చిన్న ముక్కలు లేదా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి) మొక్కజొన్న పిండి – 4 టేబుల్ స్పూన్లు మిరియాల పొడి – ముప్పావు టీ స్పూన్ మైదా పిండి – 5 టేబుల్ స్పూన్లు క్యాప్సికమ్ – 2 (పెద్దపెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి) ఉల్లిపాయ – 1 (పెద్దగా కట్ చేసుకోవాలి) ఉల్లికాడ ముక్కలు – పావు కప్పు, పండు మిర్చి – 4 లేదా 5 అల్లం ముక్కలు – 2 టీ స్పూన్లు వెల్లుల్లి రెబ్బలు – 4 (రెండేసి ముక్కలుగా చేసుకోవాలి) పచ్చిమిర్చి – 2 (నిలువుగా కట్ చేసుకోవాలి) టొమాటో కెచప్ – 1 టేబుల్ స్పూన్, తేనె – 1 టీ స్పూన్, సోయా సాస్ – 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం – 1 టీ స్పూన్, నీళ్లు – పావు కప్పు, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ: ముందుగా బాగా మరిగిన వేడి నీళ్లల్లో పండుమిర్చి, 1 టీ స్పూన్ అల్లం వేసుకుని 10 నిమిషాలు నానబెట్టి పక్కనే పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత ఆ నీళ్లతోనే మిక్సీలో పేస్ట్‌లా చేసుకోవాలి. ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి, 2 టేబుల్ స్పూన్ల చిక్కటి పాలు పోసుకుని బాగా కలిపి ఉంచుకోవాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకుని.. అందులో మైదాపిండి, 3 టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండి, పావు టీ స్పూన్ మిరియాల పొడి, తగినంత ఉప్పు, అర టీ స్పూన్ నూనె వేసుకుని, కొద్దిగా నీళ్లు పోసుకుని చిక్కగా పేస్ట్‌లా చేసుకోవాలి. దానిలో పనీర్ ముక్కలు ముంచి నూనెలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అనంతరం మరో కళాయిలో 2 టీ స్పూన్ల నూనె వేసుకుని వేడి కాగానే 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుని కొద్దిగా వేగాక.. పండుమిర్చి మిశ్రమాన్ని వేసుకోవాలి. వెంటనే ఆ మిక్సీ బౌల్లో కొద్దిగా నీళ్లు పోసుకుని అటూ ఇటూ కలిపి ఆ వాటర్ కూడా పోసుకోవాలి. అనంతరం గరిటెతో మధ్యమధ్యలో తిప్పుతూ, నూనె వేరుపడేవరకూ ఉడికించి, ఆ మిశ్రమాన్ని బౌల్లోకి తీసి పక్కనపెట్టుకోవాలి. అదే కళాయిలో 1 టీ స్పూన్ నూనె వేసుకుని.. పెద్ద మంట మీద ఉల్లిపాయ ముక్కలను లైట్‌గా వేయించాలి. తర్వాత అందులో క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని తిప్పుతూ ఉండాలి. అదే మంట మీద బాగా ఎక్కువగా కాకుండా ఓ మాదిరిగా ఉడికిన క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కల్లో.. పక్కన పెట్టుకున్న పండుమిర్చి మిశ్రమంతో పాటు.. తేనె వేసుకుని తిప్పుతూ ఉండాలి. నిమిషం తర్వాత నిమ్మరసం, సోయా సాస్, కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా తిప్పాలి. తర్వాత మొక్కజొన్న పిండి–పాల మిశ్రమాన్ని వేసుకుని తిప్పాలి. ఇక అదంతా క్రీమ్‌లా మారగానే టొమాటో కెచప్, ఉల్లికాడ ముక్కలు, పనీర్ ముక్కలు వేసుకుని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. -
పాన్ కేక్స్ నుంచి కట్లెట్స్ వరకు..తక్కువ నూనెతో ఎక్కువ వంటలు
శ్రమ లేకుండా సౌకర్యాలను అందించడంతో పాటు.. కిచెన్ కి లగ్జరీ లుక్‌నీ ఇచ్చే ఈ డబుల్ సైడ్ హీటింగ్ బేకింగ్ మెషిన్ .. యూజర్ ఫ్రెండ్లీగా డిమాండ్‌లో ఉంది. ఇందులో ఇండిపెండెంట్ టెంపరేచర్ కంట్రోల్, డబుల్ పాన్ గ్రిల్లింగ్, త్రీ టైప్స్ ఆఫ్ బేకింగ్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి. మూడు లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ ఎలక్ట్రిక్ మేకర్.. రకరకాల రుచులను నిమిషాల్లో సిద్ధం చేస్తుంది. ఈ మేకర్లో గ్రిల్ లేదా ఫ్రై చేసుకోవాలంటే నూనె చాలా తక్కువ మోతాదులో సరిపోతుంది. క్లీన్ చేసుకోవడమూ సులభమే. ఇది రోజువారీ వంటకాలకే కాకుండా పార్టీలు, ఫంక్షన్స్‌లో వెరైటీ వంటకాలు చేసుకోవడానికి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో కూరలు, సూప్స్ వంటివి సిద్ధం చేసుకోవడంతో పాటు.. పాన్ కేక్స్,కట్లెట్స్ వంటివెన్నో తయారు చేసుకోవచ్చు. దీనితో షార్ట్ సర్క్యూట్ సమస్య రాదు. దీనికి అటాచ్డ్ మూతతో పాటు ఒక ట్రాన్స్పరెంట్ మూత విడిగా లభిస్తుంది. -
ఈ కొత్త రకం కుక్కర్ లో వంటలు చాలా సులభం
ఈ ఆటోమేటిక్ ప్రెజర్ కుకర్.. ఆహారంలో పోషకాలు పోకుండా హెల్దీ ఫుడ్‌ని అందిస్తుంది. ఇందులో చాలా ప్రీసెట్ ఆప్షన్స్ ఉంటాయి. కర్రీ, సూప్, దాల్, గ్రేవీ, బిర్యానీ, పులావ్.. ఇలా గాడ్జెట్ ముందువైపు ప్రత్యేకమైన సెట్టింగ్స్ ఉంటాయి. మల్టీపర్పస్ కోసం తయారైన ఈ గాడ్జెట్.. చూడటానికి అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తోంది. పైనున్న ప్రెజర్ మూతతో పాటు.. అదనంగా లభించే ట్రాన్స్పరెంట్ మూత.. చాలా రకాల వంటకాలకు అనువుగా ఉంటుంది. ప్రత్యేకమైన గ్లాస్, గరిటె, సేఫ్టీ గాడ్స్.. వంటివి డివైస్‌తో పాటు లభిస్తాయి. అవసరాన్ని బట్టి 3 స్థాయిల్లో టెంపరేచర్ పెంచుకోవచ్చు. లేదా తగ్గించుకోవచ్చు. దీనిలోని మన్నికైన నాన్–స్టిక్ 3 లీటర్స్ పాట్.. నలుగురికి లేదా ఐదుగురికి సరిపోతుంది. యాంటీ–స్కిడ్ బేస్‌తో పెద్ద ఇన్సులేట్ హ్యాండిల్ భద్రతను కలిగిస్తుంది. దీన్ని వంటరాని వారు కూడా వినియోగించడం చాలా సులభం. (చదవండి: సాయంత్రం స్నాక్స్ లో నాన్ వెజ్ రెసిపీ ) -
సాయంత్రం స్నాక్స్ లో నాన్ వెజ్ రెసిపీ
కావలసినవి: రొయ్యలు – 20 (పెద్దవి, శుభ్రం చేసుకుని మెత్తగా ఉడికించి, చిన్నగా కట్ చేసుకోవాలి) ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్ క్యారట్, బీట్రూట్ తురుము – 1 టేబుల్ స్పూన్ చొప్పున మసాలా, అల్లం–వెల్లుల్లి పేస్ట్, కారం – 1 టీ స్పూన్ చొప్పున బ్రెడ్ స్లైసెస్ – 10 (నాలుగువైపులా అంచులు కట్ చేసి పెట్టుకోవాలి) పాలు – కొద్దిగా ఉప్పు – తగినంత నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా గుడ్లు – 2 (అందులో, కొద్దిగా పాలు కలుపుకోవాలి) తయారీ: ముందుగా 1 టేబుల్ స్పూన్ నూనెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారట్ తురుము, బీట్రూట్ తురుము ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని దోరగా వేయించుకుని.. అందులో మసాలా, అల్లం–వెల్లుల్లి పేస్ట్, కారం వేసుకుని కలిపి కాసేపు మూతపెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలి. అనంతరం ఆ మిశ్రమంలో ఉడికిన రొయ్యల ముక్కలు వేసుకుని, 2 నిమిషాల పాటు గరిటెతో బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైస్కి ఒకవైపు కొద్దిగా రొయ్యల మిశ్రమం పెట్టుకుని.. మిగిలిన మూడు చివర్లకు పాలు రాసి రోల్స్‌లా చేసుకుని, అంచులు ఊడకుండా అతికించాలి. వాటిని గుడ్డు మిశ్రమంలో ముంచి నూనెలో డీప్‌ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. (చదవండి: సాయంత్రం స్నాక్స్ గా చిలకడదుంప బజ్జీలు ) -
కొత్త టెక్నిక్ తో రుచికరమైన వంటలు..
ఉదయం నుంచి రాత్రి వరకు కావాల్సిన రుచులను తయారు చేసుకోవడంలో ఈ న్యూ టెక్నాలజీ బర్నర్ భలే చక్కగా పనిచేస్తుంది. ఇది సౌకర్యవంతమైనదే కాదు.. సురక్షితమైనది కూడా. సాధారణ హాట్ ప్లేట్ బర్నర్‌తో పోలిస్తే ఇది ఫార్–ఇన్ఫ్రారెడ్ ఎనర్జీ అసెంబ్లింగ్ టెక్నాలజీతో తరచుగా ఉపయోగించడానికి, ఉష్టోగ్రతను తట్టుకునేందుకు వీలుగా రూపొందింది. ఐరన్ పాన్, స్టెయిన్ లెస్ స్టీల్, సిరామిక్, అల్యూమినియం.. ఇలా అన్ని రకాల పాత్రలనూ దీనిపై పెట్టి, కావల్సిన వెరైటీలను సిద్ధం చేసుకోవచ్చు. ఈ బర్నర్ చాలా తేలిగ్గా ఉండటంతో.. క్యాంపింగ్‌లకు తీసుకుని వెళ్లడం, చిన్నగా ఉండటంతో.. వంటగదిలో స్టోర్ చెయ్యడమూ చాలా ఈజీ. అలాగే కుకింగ్ బౌల్స్ ఉంచే క్రిస్టల్ గ్లాస్ ప్లేట్‌ను తడి వస్త్రంతో క్లీన్ చేయొచ్చు. వేరియబుల్ హీట్ సెట్టింగ్స్ కలిగిన ఈ గాడ్జెట్పైన ఫ్రై, డీప్ ఫ్రై, బాయిలింగ్, కుకింగ్ ఇలా చాలానే చేసుకోవచ్చు. హైక్వాలిటీ టెక్నాలజీ కారణంగా ఎలాంటి ప్రమాదాలూ తలెత్తవు. ఇదే మోడల్లో రెండు మూడు బర్నర్స్ ఉన్న డివైస్‌లు కూడా మార్కెట్లో అమ్ముడు పోతున్నాయి. అయితే ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. (చదవండి: Dried Prawns Pickle Recipe: నోరూరించే రొయ్యల పచ్చడి ఇలా చేస్తే..చక్కగా లాగించేస్తారు! ) -
మటన్ కీమాతో పాలక్ సమోసా.. భలే రుచిగా ఉంటాయి
కీమా పాలక్ సమోసా తయారీకి కావల్సినవి: కీమా – పావు కప్పు (మసాలా, ఉప్పు వేసి, మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి), క్యారెట్ తురుము – పావు కప్పు సోయా సాస్, టొమాటో సాస్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్ల చొప్పున మైదా పిండి – 2 కప్పులు, గోధుమ పిండి – 1 కప్పు మిరియాల పొడి – 1 టీ స్పూన్, పాలకూర గుజ్జు– ఒకటిన్నర కప్పులు (చపాతి ముద్ద కోసం), ఫుడ్ కలర్ – ఆకుపచ్చ రంగు (అభిరుచిని బట్టి పాలకూరలో కలిపి పెట్టుకోవాలి), ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో క్యారెట్ తురుము, మిరియాల పొడి, కీమా, సోయా సాస్, టొమాటో సాస్, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, అర టేబుల్ స్పూన్ నూనె, పాలకూర గుజ్జు, కొద్దిగా ఉప్పు వేసుకుని.. అవసరమైతే కాసిన్ని నీళ్లు కలుపుతూ చపాతీ ముద్దలా చేసుకోవాలి. అనంతరం ఆ ముద్దపైన తడిబట్ట కప్పి, అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని, ఆ ఉండల్ని చపాతీలా ఒత్తి, సమోసాలా చుట్టి అందులో కీమా మిశ్రమాన్ని పెట్టి ఫోల్డ్ చెయ్యాలి. వాటిని కాగిన నూనెలో వేయించి తీస్తే... భలే రుచిగా ఉంటాయి. -
క్యారట్‌తో వెరైటీగా పరియాళ్ చేసుకోండిలా
క్యారట్ పరియాళ్ తయారీకి కావల్సినవి: క్యారట్ ముక్కలు – కప్పున్నర; నూనె – రెండు టేబుల్ స్పూన్లు; ఆవాలు – పావు టీస్పూను; జీలకర్ర – పావు టీస్పూను; ఎండు మిర్చి – రెండు; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉల్లిపాయ – ఒకటి (సన్నగా తరగాలి); పచ్చిమిర్చి చీలికలు – మూడు; ఉప్పు – అరటీస్పూను; పసుపు – అర టీస్పూను; ఇంగువ – చిటికడు; పచ్చికొబ్బరి తురుము – పావు కప్పు. తయారీ విధానమిలా: ∙క్యారట్ ముక్కలను మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి ∙మందపాటి బాణలిలో నూనెవేసి కాగనివ్వాలి ∙వేడివేడి నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చివేసి చిటపటలాడనివ్వాలి ∙ఇవి వేగాక కరివేపాకు ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి వేసి తిప్పాలి ∙ఐదునిమిషాలు మగ్గాక పసుపు, ఇంగువ వేసి కలపాలి ∙ఇప్పుడు ఉడికించిన క్యారట్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కొబ్బరి తురుము వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి ∙నూనె పైకి తేలిన తరువాత దించేసి సర్వ్‌చేసుకోవాలి. -
స్నాక్స్ కోసం టేస్టీ చెగోడీలు.. ఇలా చేసుకోండి
అటుకుల చెగోడీలీకు కావల్సిన పదార్థాలు: అటుకులు – అర కప్పు,పుట్నాల పప్పు – పావు కప్పు బియ్యప్పిండి – 1 కప్పు,నెయ్యి – 1 టేబుల్ స్పూన్ నీళ్లు – 1 కప్పు+ఇంకొన్ని,కారం – 1 టీ స్పూన్ ఉప్పు – తగినంత,వాము – అర టీ స్పూన్ నువ్వులు – 2 టీ స్పూన్లు,ఇంగువా – పావు టీ స్పూన్ నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా అటుకులు, పుట్నాల పప్పును మిక్సీలో వేసుకుని మెత్తటి పొడిలా చేసుకుని జల్లెడ పట్టుకోవాలి. అందులో బియ్యప్పిండి కూడా జల్లెడ పట్టి, ఆ రెండిటినీ బాగా కలపాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని, చిన్న మంట మీద ఆ మొత్తం పిండిని దోరగా వేయించి, అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేశాక కూడా మరోసారి గరిటెతో కలిపి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత అందులో కారం, ఉప్పు, నువ్వులు, వాము, ఇంగువా వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ఈలోపు బియ్యప్పిండి తీసుకున్న కప్పుతోనే నీళ్లనూ తీసుకుని, వేడి చేసి.. ఈ మిశ్రమంలో పోసుకుని గరిటెతో అటూ ఇటూగా కలపాలి. తర్వాత చల్లారే వరకు ఓ పది నిమిషాలు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆపైన కొద్దికొద్దిగా నీళ్లు చిలకరిస్తూ.. చిన్నచిన్న ఉండల్లా తీసుకుని.. చెగోడీలు చేసుకుని.. నూనెలో దోరగా వేయించుకోవాలి. -
దానిమ్మతో కేక్ టేస్ట్ అదిరిపోతుంది.. వీకెండ్లో ట్రై చేయండి
దానిమ్మ రైస్ కేక్ తయారీకి కావల్సినవి: అన్నం – 2 కప్పులు దానిమ్మ గింజలు – అర కప్పు పైనే కొబ్బరి కోరు – 2 టేబుల్ స్పూన్లు అరటి పండు గుజ్జు – 4 టేబుల్ స్పూన్లు పాలు – పావు లీటర్ పంచదార – 1 కప్పు నెయ్యి – 1 లేదా 2 టీ స్పూన్లు దాల్చిన చెక్కపొడి – గార్నిష్‌కి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, కళాయిలో పాలు, పంచదార వేసి, పంచదార కరిగేవరకు తిప్పుతూ మరిగించాలి. ఆ మిశ్రమంలో అరటి పండు గుజ్జు, కొబ్బరికోరు వేసి మరోసారి కలుపుకోవాలి. చివరిగా అన్నం వేసి బాగా తిప్పి.. కాస్త దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అనంతరం నచ్చిన షేప్‌లో ఉండే చిన్నచిన్న బౌల్స్ తీసుకుని, వాటికి నూనె లేదా నెయ్యి రాసి.. ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసుకుని, సమాతరంగా ఒత్తుకుని.. గట్టిపడనివ్వాలి. వాటిపై దాల్చిన చెక్క పొడి, దానిమ్మ గింజలు వేసుకుని సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది. -
క్యారట్ చికెన్ మఫిన్స్.. చిన్న పిల్లలు ఇష్టం తింటారు
క్యారట్ చికెన్ కప్స్ తయారీకి కావల్సినవి: క్యారట్ తురుము – కప్పు; వెల్లుల్లి తురుము – పావు కప్పు; బాదం పప్పు పొడి – ముప్పావు కప్పు; చీజ్ తురుము – ముప్పావు కప్పు; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను; గుడ్డు – ఒకటి; చికెన్ ఖీమా – అరకప్పు; ఉప్పు, మిరియాల పొడి – రుచికి సరిపడా తయారీ విధానమిలా: పెద్ద గిన్నెలో క్యారట్, వెల్లుల్లి, చీజ్ తురుములు, కొత్తిమీర చికెన్ ఖీమా, రుచికిసరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి ∙చివరిగా గుడ్డుసొనను కూడా వేసి కలపాలి ∙ఈ మిశ్రమాన్ని మఫిన్ ట్రేలో వేసి ఇరవై నిమిషాల పాటు బేక్ చేయాలి ∙గోల్డెన్ బ్రౌన్ కలర్లో క్రిస్పీగా మారితే చికెన్ క్యారట్ కప్స్ రెడీ. -
కొత్తిమీరతో గ్రీన్ దోశ.. టేస్ట్‌తో పాటు హెల్తీ కూడా
గ్రీన్ దోశ తయారీకి కావల్సినవి: బియ్యం – కప్పు; మినప పప్పు – కప్పు: మెంతులు – టీస్పూను; కొత్తిమీర – కప్పు; పుదీనా – కప్పు; కరివేపాకు – అరకప్పు; జీలకర్ర – అరటీస్పూను; వాము – చిటికెడు; ఉల్లిపాయ – ఒకటి; పచ్చిమిర్చి – నాలుగు; ఉప్పు – టీస్పూను; నూనె –పావు కప్పు. తయారీ విధానమిలా: ∙బియ్యం, మినపపప్పు, మెంతులను శుభ్రంగా కడిగి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి ∙నానాక వీటన్నింటినీ గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలి ∙సగం మెదిగిన తరువాత అందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను వేయాలి ∙అవసరాన్ని బట్టి నీళ్లు చల్లుకుంటూ పిండిని మెత్తగా రుబ్బుకోవాలి ∙చక్కగా మెదిగిన పిండిని గిన్నెలో తీసుకుని అందులో ఉప్పు, జీలకర్ర, వాము కలపాలి ∙కాలిన పెనంపైన పిండిని దోశలా పోసుకుని కొద్దిగా నూనె వేయాలి ∙రెండువైపులా చక్కగా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన గ్రీన్ దోశ రెడీ. -
గోంగూరతో మిర్చి.. బజ్జీ ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?
గోంగూర బజ్జీ కావలసినవి: తాజా గోంగూర – కప్పు; సెనగపిండి – కప్పు; బియ్యప్పిండి – మూడు టేబుల్ స్పూన్లు; కారం – టీస్పూను; పసుపు –పావు టీస్పూను; ఇంగువ – చిటికెడు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – పావు కేజీ. తయారీ విధానమిలా: ∙గోంగూరను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ∙సెనగపిండిలో బియ్యప్పిండి, ఇంగువ, కారం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి ∙కొద్దిగా నీళ్లు పోసి చిక్కగా కలుపుకోవాలి. చివరిగా టేబుల్ స్పూన్ నూనె వేసి కలపాలి ∙ఇప్పుడు గోంగూర ఆకులను ఈ పిండిలో ముంచి మరుగుతోన్న నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్‌లోకి మారేంత వరకు వేయించి తీసేయాలి ∙నూనె ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే బజ్జీలను టిష్యూ పేపర్ మీద వేసి, నూనెను పేపర్ పీల్చుకున్న తరువాత సర్వ్ చేసుకోవాలి. -
గుడ్డుతో భలే వెరైటీలు.. ఎగ్ ఫింగర్స్ ఎప్పుడైనా ట్రై చేశారా?
ఎగ్ ఫింగర్స్ తయారికి కావల్సినవి: గుడ్లు – 4, మిరియాల పొడి – 1 టీ స్పూన్ ఉప్పు – తగినంత, మైదా పిండి – పావు కప్పు చాట్ మసాలా, కారం – పావు టీ స్పూన్ చొప్పున బ్రెడ్ పౌడర్ – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్లో మూడు గుడ్లు పగలగొట్టి.. అందులో అర టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని బాగా కలిపి.. ఆ మిశ్రమాన్ని చతురస్రాకారపు పాత్రకు నూనె రాసి.. దానిలో వేసుకుని.. స్టీమ్ చేసుకోవాలి. అనంతరం దాన్ని నచ్చిన షేప్‌లో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంతలో ఒక చిన్న పాత్రలో మిగిలిన గుడ్డు పగలగొట్టి, స్పూన్‌తో గిలకొట్టి పెట్టుకోవాలి. మరో పాత్రలో మైదా పిండి, చాట్ మసాలా, కారం వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇంకో చిన్న పాత్రలో బ్రెడ్ పౌడర్ వేసుకుని.. ఒక్కో ముక్కను మొదట మైదా మిశ్రమంలో.. తర్వాత గుడ్డు మిశ్రమంలో ముంచి అటూ ఇటూ తిప్పి.. బ్రెడ్ పౌడర్ పట్టించి.. నూనెలో దోరగా వేయించుకోవాలి. వీటిని టొమాటో సాస్‌తో తింటే భలే రుచిగా ఉంటాయి. -
మహారాష్ట్ర పాపులర్: రొయ్యలతో పోహా, భలే రుచిగా ఉంటుంది
ప్రాన్స్ పోహ తయారీకి కావల్సినవి: కావలసినవి: రొయ్యలు – 10 (మీడియం సైజ్ లేదా పెద్దవి.. తల, తోక తొలగించి.. శుభ్రం చేసుకోవాలి) అటుకులు – 3 కప్పులు (నీళ్లల్లో కడిగి.. నీళ్లు పోయేలా వడకట్టుకోవాలి), ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు (చిన్నగా కట్ చేసుకోవాలి), బంగాళదుంప›– 1 (తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు తరగాలి), పచ్చి బఠాణీ – అర కప్పు (నానబెట్టి, ఉడికించుకోవాలి) వేరుశనగలు – అర కప్పు, అల్లం తురుము – అర టీ స్పూన్ కొబ్బరి కోరు – 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తురుము – కొద్దిగా కరివేపాకు – కొద్దిగా, ఆవాలు – 1 టీ స్పూన్ పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత నూనె – 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి – 1 టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు – పావు టీ స్పూన్ తయారీ విధానమిలా: ముందుగా నూనెలో ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము వేసుకుని.. అర నిమిషం పాటు గరిటెతో తిప్పుతూ.. దోరగా వేయించుకోవాలి. అందులో వేరుశనగలు, బంగాళదుంప ముక్కలు వేసుకుని తిప్పుతూ ఉడికించుకోవాలి. బంగాళదుంప ఉడికిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తిప్పాలి. తర్వాత రొయ్యలు, బఠాణీలు వేసుకుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఉప్పు రొయ్యలు ఉడికాక.. కొబ్బరి కోరు, కొత్తిమీర తురుము వేసుకుని తిప్పాలి. ఇక చివరిగా అటుకులు వేసి ఇటూ అటూ గరిటెతో తిప్పాలి. అనంతర స్టవ్ ఆఫ్ చేసుకుని.. వేడివేడిగా ఉన్నప్పుడే కొద్దిగా అల్లం ముక్కను తురిమి.. నిమ్మకాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుందీ డిష్. -
క్యారట్ డిలైట్.. హెల్తీ అండ్ టేస్టీగా ఇలా చేసుకోండి
క్యారట్ డిలైట్ తయారీకి కావల్సినవి: క్యారట్స్ – అరకేజీ; పంచదార – అరకప్పు; కార్న్‌ఫ్లోర్ – పావు కప్పు; నీళ్లు – కప్పు; నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు; ఎండుకొబ్బరి తురుము – గార్నిష్‌కు సరిపడా. తయారీ విధానమిలా: క్యారట్ తొక్కతీసి శుభ్రంగా కడిగి ముక్కలు తరగాలి ∙ముక్కలు మునిగే అన్ని నీళ్లు పోసి రెండు విజిల్స్ రానిచ్చి, చల్లారనివ్వాలి.ముక్కలు చల్లారాక పేస్టులా గ్రైండ్ చేయాలి ∙మెత్తని పేస్టుని వడగట్టాలి ∙వడగట్టిన పేస్టులో పంచదార, కార్న్‌ఫ్లోర్, నీళ్లు వేసి కలపాలి. మిశ్రమాన్ని చక్కగా కలిపిన తరువాత మందపాటి బాణలిలో వేయాలి ∙మీడియం మంట మీద తిప్పుతూ ఉడికించాలి.మిశ్రమం చిక్కబడినప్పుడు నెయ్యి వేసి తిప్పాలి ∙అడుగంటుతున్నప్పుడు తీసి నెయ్యి రాసిన ప్లేటులో సమానంగా పోయాలి ∙గంట తరువాత నచ్చిన ఆకారంలో ముక్కలు కోసి, కొబ్బరి తురుము అద్దుకుని సర్వ్ చేసుకోవాలి. -
బ్రేక్‌ఫాస్ట్ కోసం సేమియా పనియారం.. రెసిపి ఇలా చేసుకోండి
సేమియా పనియారం తయారీకి కావల్సినవి: సేమియా – 1 కప్పు, రవ్వ – అర కప్పు పెరుగు – 1 కప్పు, కొబ్బరి పాలు – పావు కప్పు, ఉప్పు – రుచికి సరిపడా కొత్తిమీర తురుము – 1 టీస్పూన్, పచ్చిమిర్చి – 2 (సన్నగా తరిగినవి) కరివేపాకు – కొద్దిగా (చిన్నగా తురుమాలి), క్యారెట్ తురుము – 3 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, పసుపు – అర టీ æస్పూన్, నూనె – సరిపడా నీళ్లు – చాలినన్ని, నెయ్యి – 1 టీస్పూన్ తయారీ విధానమిలా: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. కళాయిలో నెయ్యి వేడి చేసుకుని అందులో సేమియా, రవ్వను దోరగా వేయించుకోవాలి. పెరుగు, ఉప్పు వేసుకుని గరిటెతో తిప్పుతూ.. ఉడికించాలి. అనంతరం కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము వేసుకుని.. కొద్దిగా నీళ్లు పోసుకుని తిప్పుతూ ఉండాలి. పసుపు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు తురుము, కొబ్బరి పాలు, ఒక కప్పు నీళ్లు పోసుకుని బాగా ఉడికించుకోవాలి. తర్వాత పొంగనాల పెనం తీసుకుని.. ప్రతి గుంతలో కొద్దికొద్దిగా నూనె పోసుకుని.. గుంత గరిటె సాయంతో సేమియా మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇరువైపులా దోరగా వేగిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. అంతే బ్రేక్‌ఫాస్ట్‌కి ఈ రెసిపి చక్కగా సరిపోతుంది. -
బీట్రూట్తో హెల్తీగా చీజ్ కేక్.. టేస్ట్ చేస్తే అస్సలు వదిలిపెట్టరు
బీట్రూట్ చీజ్ కేక్ తయారీకి కావల్సినవి: వాల్నట్స్ – 150 గ్రాములు ఎండు అంజీరాలు – 8, దాల్చినచెక్క పొడి – అర టీ స్పూన్ ఉప్పు – చిటికెడు, బీట్రూట్ తురుము – 300 గ్రాములు కోకోనట్ చీజ్ – 200 గ్రాములు కోకో పౌడర్, కొబ్బరి నూనె, నెయ్యి, మేపుల్ సిరప్ (మార్కెట్లో దొరుకుతుంది) – 4 టేబుల్ స్పూన్ల చొప్పున బాదం పాలు – 2 టేబుల్ స్పూన్లు, పిస్తా పొడి – 3 టేబుల్ స్పూన్లు తయారీ విధానమిలా: ముందుగా వాల్నట్స్ని మిక్సీ పట్టుకోవాలి. అందులో ఎండు అంజీరాలు, దాల్చిన చెక్క పొడి, 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని.. నెయ్యి కలిపి, పక్కన పెట్టుకోవాలి. అనంతరం బీట్ రూట్ తురుము, కోకోనట్ చీజ్, బాదం పాలు, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, 2 టేబుల్ స్పూన్ల మేపుల్ సిరప్ వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక కేక్ ట్రేలో ముందు వాల్నట్ మిశ్రమాన్ని .. దానిపైన బీట్రూట్ మిశ్రమాన్ని పరచి.. కాస్త ఆరి, గట్టిపడిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునే ముందు.. మిగిలిన కోకో పౌడర్, కొబ్బరి నూనె, మేపుల్ సిరప్ వేసుకుని బాగా కలిపి.. కోన్ మాదిరి కవర్లో చుట్టి.. నచ్చిన డిజైన్‌లో కేక్ ముక్కలపై గార్నిష్ చేసుకుని.. వాటిపై పిస్తా పొడిని జల్లుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. -
కోకోనట్ చికెన్ ఫ్రై.. భలే రుచిగా ఉంటుంది
కోకోనట్ చికెన్ తయారీకి కావల్సినవి: చికెన్ – అర కిలో మొక్కజొన్న పిండి – పావు కప్పు కొబ్బరి కోరు – అర కప్పు నూనె – సరిపడా, ఉప్పు – తగినంత మిరియాల పొడి – కొద్దిగా కారం – 1 టీ స్పూన్ గుడ్లు – 3 తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్లో మొక్కజొన్న పిండి, మిరియాల పొడి, కారం, కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. మరో బౌల్లో గుడ్లు కొట్టి, 2 టీ స్పూన్ల కొబ్బరి పాలు పోసుకుని, బాగా గిలగ్గొట్టి పెట్టుకోవాలి. ఇంకో బౌల్లోకి కొబ్బరి కోరు తీసుకోవాలి. ముందుగా ఒక్కో చికెన్ ముక్కను మొక్కజొన్న పిండిలో వేసి బాగా పట్టించాలి. తర్వాత దాన్ని గుడ్డు మిశ్రమంలో ముంచి వెంటనే కొబ్బరి కోరు పట్టించాలి. అనంతరం వాటిని నూనెలో దోరగా వేయించి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే.. ఈ కోకోనట్ చికెన్ ముక్కలు భలే రుచిగా ఉంటాయి. -
వీకెండ్ స్పెషల్: క్యారట్ చట్నీ.. సింపుల్‌గా ఇలా చేసుకోండి
క్యారట్ చట్నీ తయారీకి కావల్సినవి: నూనె – టీస్పూను; పచ్చిమిర్చి – ఆరు; వెల్లుల్లి రెబ్బలు – రెండు; అల్లం తరుగు – టీస్పూను; చింతపండు – గోలీకాయంత; క్యారట్ – మీడియంసైజు మూడు; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; వేయించిన వేరుశనగ గింజలు – రెండు టేబుల్ స్పూన్లు; పచ్చికొబ్బరి తురుము – టేబుల్ స్పూను;జీలకర్ర – టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా తాలింపు కోసం: నూనె – టీస్పూను; ఆవాలు – టీస్పూను; జీలకర్ర – టీస్పూను; మినపప్పు – అరటీస్పూను; పచ్చిశనగపప్పు – అరటీస్పూను; ఎండుమిర్చి – రెండు; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – రెమ్మ. తయారీ విధానమిలా: ∙బాణలిలో నూనెవేసి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపేస్టు వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి ∙ఇవన్నీ వేగిన తరువాత చింతపండు వేసి నిమిషం తర్వాత దించేయాలి ∙ఇదే బాణలిలో క్యారట్, కొత్తిమీర తరుగు, కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి ∙ఇప్పుడు వేయించిన పచ్చిమిర్చి మిశ్రమం, క్యారట్ తురుము, వేరుశనగ గింజలు, కొబ్బరి తురుము, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పువేసి గ్రైండ్ చేయాలి ∙చట్నీ మెత్తగా గ్రైండ్ చేసాక... తాలింపు దినుసులతో తాలింపు పెట్టి చట్నీలో వేయాలి ∙ఈ క్యారట్ చట్నీ ఇడ్లీ, దోశ, రోటి, అన్నంలోకి మంచి కాంబినేషన్. -
కీమాతో చీజ్ పఫ్స్.. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు
కీమా – చీజ్ పఫ్స్ తయారీకి కావల్సినవి: మటన్ కీమా – 400 గ్రాములు,చీజ్ తురుము – 4 టేబుల్ స్పూన్లు నూనె – 2 టేబుల్ స్పూన్లు,ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు వెల్లుల్లి పొడి, పసుపు, జీలకర్ర – 1 టీ స్పూన్ చొప్పున ఉప్పు – తగినంత,మసాలా పొడి – 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు – 1 టేబుల్ స్పూన్,కొత్తిమీర తరుగు – కొద్దిగా పఫ్ పేస్ట్రీ షీట్ – 1(మందంగా ఉండేది, లేదా షీట్స్ చిన్నచిన్నవి 4 లేదా 5 మార్కెట్లో దొరుకుతాయి) గుడ్డు – 1(ఒక బౌల్లో పగలగొట్టి.. కొద్దిగా పాలు కలిపి పెట్టుకోవాలి) నల్ల నువ్వులు – 1 టీ స్పూన్ పైనే(గార్నిష్‌కి) తయారీ విధానమిలా: ముందుగా నూనెలో 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ముక్కలు వేసుకుని.. దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి పొడి, కీమా వేసుకుని.. మూతపెట్టి బాగా ఉడికించుకోవాలి. అందులో పసుపు, మసాలా పొడి, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసుకుని.. గరిటెతో బాగా కలిపి.. బాగా ఉడకనివ్వాలి. అనంతరం పఫ్ పేస్ట్రీ షీట్లో కీమా మిశ్రమాన్ని నింపుకుని.. దానిపైన ఉల్లిపాయ ముక్కలు, చీజ్ తురుము, కొద్దిగా కొత్తిమీర తురుము వేసుకుని ఊడిపోకుండా తడి చేత్తో గట్టిగా ఒత్తాలి. దానిపైన గుడ్డు–పాల మిశ్రమాన్ని బ్రష్‌తో బాగా రాసి.. నువ్వులతో గార్నిష్ చేసి బేక్ చేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర తురుము జల్లి సర్వ్ చేసుకోవాలి. అభిరుచిని బట్టి చిన్న చిన్న పఫ్ పేస్ట్రీ షీట్స్‌లో కూడా కీమా, చీజ్, ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని ఉంచి.. త్రిభుజాకారంలో పఫ్స్ చుట్టుకోవచ్చు. -
క్యారట్‌తో మూంగ్‌దాల్ సలాడ్, ఓసారి ట్రై చేయండి
పచ్చిగా, కచ్చాపచ్చాగా, ఉడికించి... ఎలా తిన్నా టేస్టీగానే ఉంటుంది క్యారట్.aఅందుకే కరకరల క్యారట్‌ను మరింత రుచిగా ఇలా కూడా వండుకోవచ్చని చెబుతోంది ఈ వారం వంటిల్లు... క్యారట్ మూంగ్‌దాల్ సలాడ్ తయారీకి కావల్సినవి: క్యారట్ తురుము – కప్పు; పెసరపప్పు –పావు కప్పు; పచ్చికొబ్బరి తురుము – రెండు టేబుల్ స్పూన్లు; పచ్చిమిర్చి తరుగు – రెండు టీస్పూన్లు; నిమ్మరసం – రెండు టీస్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను. తయారీ విధానమిలా: పెసరపప్పుని శుభ్రంగా కడిగి గంటసేపు నానబెట్టుకోవాలి.నానిన పప్పులో నీళ్లు వంపేసి పప్పుని పెద్ద గిన్నెలో వేయాలి ∙ఈ పప్పులో క్యారట్ తురుము, కొబ్బరి, పచ్చిమిర్చి తురుము, నిమ్మరసం, ఉప్పువేసి చక్కగా కల΄ాలి ∙చివరిగా కొత్తిమీర తరుగుతో వేసి సర్వ్‌చేసుకోవాలి. -
అలోవెరాతో ఐస్‌క్రీమ్.. ఎప్పుడైనా తిన్నారా?
అలోవెరా ఐస్‌క్రీమ్ తయారీకి కావల్సినవి: కలబంద ముక్కలు – పావు కప్పు, పండిన కర్బూజా ముక్కలు – అర కప్పు కీర దోస –1(తొక్క తీసి, ముక్కలుగా చేసుకోవాలి) పుదీనా ఆకులు – 8 మిల్క్‌మెయిడ్ – అర కప్పు, మ్యాపుల్ సిరప్ – 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ – 1 కప్పు (ఇవి మార్కెట్లో దొరుకుతాయి), ఫుడ్ కలర్ – గ్రీన్ కలర్ (అభిరుచిని బట్టి) తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్లో ఫ్రెష్ క్రీమ్ వేసుకుని.. హ్యాండ్ బ్లెండర్తో బాగా గిలకొట్టాలి. తర్వాత ఒక మిక్సీ బౌల్లో పుదీనా ఆకులు, కలబంద ముక్కలు, కర్బూజా ముక్కలు, కీరదోస ముక్కలు వేసుకుని మిక్సీ పట్టుకుని ఆ మిశ్రమాన్ని.. ఫ్రెష్ క్రీమ్‌లో వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం మిల్క్‌మెయిడ్, మ్యాపుల్ సిరప్, కొద్దిగా ఫుడ్ కలర్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. బాగా కలిపి.. సుమారు 8 గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకుంటే రుచికరమైన అలోవెరా ఐస్‌క్రీమ్ రెడీ అయిపోతుంది. -
సున్నండలు.. తింటే మంచి బలం, మీరూ ట్రై చేయండి
సున్నండలు తయారీకి కావల్సినవి: మినప్పప్పు – 2 కప్పులు, పంచదార పొడి – 2 కప్పులు, నెయ్యి – 1 కప్పు, ఏలకులపొడి – 1/2 టీ స్పూన్ తయారు చేసే విధానం : మినప్పప్పు దోరగా వేయించుకోవాలి. చల్లారిన తరువాత పొడి చేసుకొని, అందులో వేడి చేసిన నెయ్యి పంచదారపొడి, మినప్పిండి, ఏలకుల పొడి కలిపి ఉండలుగా చేసుకోవాలి. అంతే సున్నండలు రెడీ. ఇవి రుచిగా ఉండటమే కాకుండా మంచి బలాన్నిస్తుంది. మీరూ ట్రై చేసి చూడండి. -
వినాయక చవితి స్పెషల్: స్వీట్ సందేశ్ చేసుకోండి ఇలా
స్వీట్ సందేష్ ఇలా చేసుకోండి కావలసినవి: ఉడికించిన చిలగడ దుంప – పెద్దది ఒకటి; పచ్చికొబ్బరి తురుము – ముప్పావు కప్పు; జీడిపప్పు పొడి – పావు కప్పు; కొబ్బరి పాలు – అరకప్పు; పంచదార – అరకప్పు; యాలకులపొడి – అరటీస్పూను; రోజ్ వాటర్ – టీస్పూను. తయారీ: చిలగడ దుంప తొక్క తీసి ఉండలు లేకుండా మెత్తగా చిదుముకోవాలి ∙చిదుముకున్న చిలగడ దుంప మిశ్రమంలో జీడిపప్పు పొడి వేసి కలపాలి. పంచదారలో కొద్దిగా నీళ్లుపోసి సుగర్ సిరప్‌ను తయారు చేసుకోవాలి ∙సిరప్ తయార య్యాక కొబ్బరి తురుము వేసి కలుపుతూ ఉండాలి. తీగ పాకం వచ్చినప్పుడు చిలగడదుంప మిశ్రమాన్ని వేసి కలపాలి ∙మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు కొద్దిగా కొబ్బరిపాలు వేయాలి ∙మధ్యలో కొబ్బరి పాలతో΄పాటు యాలకులపొడి, రోజ్‌వాటర్ వేసి కలుపుతూ మొత్తం కొబ్బరి పాలు అయిపోయేంత వరకు మగ్గనివ్వాలి ∙ దాదాపు ఇరవై నిమిషాల తరువాత ఈ మిశ్రమం దగ్గర పడుతుంది. అప్పుడు స్టవ్ ఆపేసేయాలి ∙ గోరువెచ్చగా ఉన్నప్పుడే మిశ్రమాన్ని చేతులతోగానీ, మౌల్డ్స్లోవేసి నచ్చిన ఆకారంలో వత్తుకుంటే స్వీట్ సందేష్ రెడీ. -
వినాయక చవితి స్పెషల్: కేసి మిథోయ్
కేసి మిథోయ్ కావలసినవి: తాజా బియ్యప్పిండి – రెండు కప్పులు; పచ్చికొబ్బరి తురుము – కప్పు; పంచదార పొడి – అరకప్పు; యాలకుల పొడి అరటీస్పూను; కొబ్బరి నీళ్లు – అరకప్పు. తయారీ: ►తడి బియ్యప్పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి ∙దీనిలో కొబ్బరి తురుము, పంచదార పొడి, యాలకుల ΄పొడి వేసి కలపాలి. ► అవసరాన్ని బట్టి కొబ్బరి నీళ్లను కొద్దికొద్దిగా వేసి పిండిని ముద్దలా కలుపుకోవాలి. ► పిండి ముద్దను చిన్న భాగాలుగా చేసి, ఉండలుగా చుట్టుకోవాలి ∙పిండిమొత్తాన్ని ఉండలుగా చుట్టుకుంటే కేసి మిథాయ్ రెడీ. ► కొబ్బరి నీళ్లకు బదులు కొద్దిగా నెయ్యికూడా కలుపుకోవచ్చు ∙రిఫ్రిజిరేటర్లో రెండుమూడురోజుల వరకు ఇవి తాజాగా ఉంటాయి. -
పండుగ స్పెషల్ గా ఈ రుచికరమైన లడ్డూలు
కావలసిన పదార్థాలు: శనగపిండి – 2 కప్పులు, ఏలకుల పొడి – 1 టీ స్పూన్, లెమన్ ఎల్లోకలర్ – చిటికెడు, పంచదార – రెండున్నర కప్పులు, ఆరెంజ్ కలర్ – చిటికెడు, రిఫైండ్ నూనె – వేయించటానికి తగినంత తయారు చేసే విధానం: శనగపిండిలో 2 కప్పుల నీళ్ళు కలిపి దీనిలో కొంత భాగానికి ఆరెంజ్ కలర్, ఇంకొంత భాగానికి లెమన్ రంగును చేర్చి చిన్న రంధ్రాల జల్లెడ సహాయంతో దోరగా వేయించుకోవాలి. మందపాటి గిన్నెలో పంచ దారకు ఒక కప్పు నీళ్ళు చేర్చి లేతపాకం తయారు చేసుకున్న బూందీని పాకంలో సుమారు ఒక గంటసేపు ఉంచి ఏలకుల పొడి, కలిపి లడ్డూగా చుట్టుకోవాలి. (చదవండి: వినాయక చవితి స్పెషల్: సేమిలా లడ్డు.. ఇలా చేసుకోండి) -
వీకెండ్ స్పెషల్: పాలకూర చికెన్ ఎగ్ బైట్స్, సింపుల్‌గా ఇలా
పాలకూర చికెన్ ఎగ్ బైట్స్ తయారీకి కావల్సినవి: పాలకూర – రెండు కప్పులు; గుడ్లు – పది; పాలు – ముప్పావు కప్పు; చీజ్ తరుగు – అరకప్పు; ఉడికించిన చికెన్ ముక్కలు – పది; ఉప్పు, మిరియాల పొడి – రుచికి సరిపడా. తయారీ విధానమిలా: ►పాలకూర, చికెన్ ముక్కలను సన్నగా తరిగి పెట్టుకోవాలి.పెద్దగిన్నెలో గుడ్ల సొన వేయాలి. దీనిలో పాలు, చికెన్, పాలకూర ముక్కలు వేసి కలపాలి. ► చివరిగా రుచికి సరిపడా, ఉప్పు, మిరియాల పొడి వేసి నురగ వచ్చేంత వరకు బాగా కలపాలి. ► ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కూప్‌లతో మఫిన్ ట్రేలో వేసి అరటగంట పాటు బేక్ చేస్తే పాలకూర చికెన్ ఎగ్ బైట్స్ రెడీ. -
పనస పండుతో పాఠోలి స్వీట్, టేస్ట్ అదిరిపోద్ది
పనస పాఠోలి తయారీకి కావల్సినవి: బియ్యం – కప్పు; పనసపండు తురుము – ఒకటిన్నర కప్పులు (తొనలను సన్నగా తురమాలి); పచ్చికొబ్బరి తురుము – పావు కప్పు; అరటి ఆకులు – పాఠోలీకి సరిపడా. స్టఫింగ్ కోసం: పచ్చికొబ్బరి తురుము – కప్పు; బెల్లం – ముప్పావు కప్పు; యాలుకలు పొడి – అరటీస్పూను. పనసపండుతో పాఠోలి.. తయారీ విధానమిలా: ►బియ్యాన్ని కడిగి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.మందపాటి బాణలిలో బెల్లం, నాలుగు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి వేసి మరిగించాలి. ► బెల్లం కరిగి నురగలాంటి బుడగలు వస్తున్నప్పుడు పచ్చికొబ్బరి తురుము వేయాలి. పాకంలో గరిట పెట్టి కలియతిప్పుతూ మిశ్రమం దగ్గర పడేంత వరకు మగ్గనివ్వాలి. ► నీరంతా ఇంకిపోయినప్పుడు అర టీస్పూను యాలకుల పొడి కలిపి చల్లారనివ్వాలి. ► ఇప్పుడు నానిన బియ్యంలో నీళ్లు తీసేసి బ్లెండర్లో వేయాలి ∙దీనిలోనే పనసపండు తురుము, కొబ్బరి తురుము వేసి మెత్తని పేస్టులా గ్రైండ్ చేయాలి. ► గ్రైండ్ అయిన మిశ్రమాన్ని గిన్నెలో తీసుకోవాలి ∙ఇప్పుడు అరటి ఆకులను శుభ్రంగా కడిగి, తడిలేకుండా తుడుచుకోవాలి. ► రుబ్బుకున్న బియ్యం పేస్టుని అరటి ఆకులపైన మందపాటి పొరలాగా వేసుకోవాలి. పొర మరీ మందంగా, మరీ పలుచగా కాకుండా మీడియంగా ఉండాలి ► చల్లారిన బెల్లం కొబ్బరి తురుముని పొరపైన మధ్యలో వేయాలి ∙ఇప్పుడు అరటి ఆకుని నిలువుగా మడిచి ఆవిరి పాత్రలో పెట్టుకోవాలి ∙ఈ ఆకులను ముఫ్పై నిమిషాల పాటు ఆవిరిమీద ఉడికిస్తే పనస పాఠోలీ రెడీ. -
వినాయక చవితి స్పెషల్: సేమిలా లడ్డు.. ఇలా చేసుకోండి
ఈసారి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్లు, ఇతర నైవేద్యాలతో పాటు... వైవిధ్యభరితమైన మరెన్నో స్వీట్లను తినిపించి ప్రసన్నం చేసుకుందాం.... సేమియా లడ్డు తయారీకి కావల్సినవి: కావలసినవి: వేయించిన సేమియా – కప్పు; కోవా – అరకప్పు; పంచదార – ఐదు టేబుల్ స్పూన్లు; రోజ్‌వాటర్ – టీస్పూను; బాదం పలుకులు – మూడు టేబుల్ స్పూన్లు. తయారీ విధానమిలా: ►బాణలిలో పంచదార వేసి సన్నని మంటమీద కరగనివ్వాలి. ► పంచదార కరుగుతున్నప్పుడే కోవా వేసి తిప్పాలి ∙పంచదార కరిగి మిశ్రమం దగ్గర పడినప్పుడు సేమియా, బాదం పలుకులు వేసి కలపాలి. ► అన్ని చక్కగా కలిసిన తరువాత రోజ్‌వాటర్ వేసి మరోసారి కలిపి స్టవ్ మీద నుంచి దించేయాలి ∙ఇప్పుడు మిశ్రమాన్ని లడ్డుల్లా చుట్టుకుంటే వర్మిసెల్లి లడ్డు రెడీ. -
మొక్కజొన్న పిండితో బిస్కెట్లు.. సింపుల్‌గా ఇలా చేసుకోండి
కార్న్ – చాక్లెట్ కుకీస్ తయారీకి కావల్సినవి: బటర్ – 125 గ్రాములు, పంచదార – 150 గ్రాములు, నూనె – 80 మిల్లీ లీటర్లు, గుడ్లు – 2, ఉప్పు – తగినంత, వనిలిన్ పౌడర్ – పావు టీ స్పూన్(మార్కెట్లో దొరుకుతుంది), మొక్కజొన్న పిండి – 80 గ్రాములు శనగపిండి – 350 గ్రాములు, బేకింగ్ పౌడర్ – 6 గ్రాములు తయారీ విధానమిలా: ►ముందుగా బటర్, పంచదార, నూనె వేసుకుని హ్యాండ్ బ్లెండర్ సాయంతో బాగా కలుపుకోవాలి. ► అందులో గుడ్లు, ఉప్పు, మొక్కజొన్న పిండి వేసుకుని మళ్లీ కలుపుకోవాలి. ► అనంతరం వనిలిన్ పౌడర్, శనగపిండి, బేకింగ్ పౌడర్ వేసుకుని ముద్దలా చేసుకోవాలి. ► తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్‌లో ఉండ చేసుకుని.. దాన్ని బిస్కట్లా ఒత్తుకుని.. పైభాగంలో నచ్చిన షేప్‌ని ప్రింట్ చేసి.. బేక్ చేసుకోవాలి. ► అభిరుచిని బట్టి రెండేసి కుకీస్ తీసుకుని.. మధ్యలో చాక్లెట్ క్రీమ్ పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చు. -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఇలా చేయండి
రైస్ పకోడా ఎలా చేయాలంటే.. కావల్సిన పదార్థాలు: అన్నం – 1 కప్పు,ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి – పావు కప్పు చొప్పున కారం – 1 టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్ ధనియాల పొడి – 1 టీ స్పూన్ , కొత్తిమీర తురుము – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో అన్నం వేసుకుని.. మెత్తగా పప్పు రుబ్బు కర్రతో ఒత్తుకుకోవాలి. అనంతరం దానిలో శనగపిండి, కారం, పసుపు, ధనియాల పొడి, కొత్తిమీర తురుము, ఉప్పు.. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకుని ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి. అనంతరం కాగే నూనెలో.. పకోడీల్లా దోరగా వేయించుకుని.. సర్వ్ చేసుకోవాలి. -
ఎక్కువ టైం లేదా? క్షణాల్లో గుడ్డుతో ఇలా వండేసుకోండి
ఎగ్ పనియారం తయారీకి కావల్సినవి: గుడ్లు – నాలుగు; మిరియాల పొడి – అరటీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; ఉల్లిపాయ – ఒకటి; పచ్చిమిర్చి – ఒకటి; క్యాప్సికం – ఒకటి; క్యారట్ – ఒకటి; బంగాళ దుంప – ఒకటి; కారం – అరటీస్పూను; ధనియాల పొడి – అరటీస్పూను; పసుపు – చిటికెడు; గరంమసాలా – పావుటీస్పూను; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను; నూనె – మూడు టేబుల్ స్పూన్లు. తయారీ విధానమిలా: ►క్యారట్, పచ్చిమిర్చి, క్యాప్సికం, ఉల్లిపాయ, బంగాళ దుంపలను సన్నని ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ► బాణలిలో టేబుల్ స్పూను నూనె వేసి కాగనివ్వాలి. బాగా వేడెక్కిన నూనెలో ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ► ఉల్లిపాయ వేగాక క్యారట్, బంగాళ దుంప ముక్కలు వేసి కలియబెట్టాలి. మూతపెట్టి ఐదు నిమిషాలు మగ్గాలి. ► తరువాత క్యాప్సికం ముక్కలు వేసి 5 నిమిషాలు వేయించాలి ∙ఇప్పుడు కారం, ధనియాల పొడి, పసుసు, గరంమసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ► ముక్కలన్నీ చక్కగా మగ్గాక కొత్తిమీర తరుగు వేసి మరోసారి కలిపి దించేయాలి ∙ఒకగిన్నెలో గుడ్లసొన, మిరియాల పొడి వేసి నురగ వచ్చేంతవరకు కలుపుకోవాలి ► ఇప్పుడు చల్లారిన ముక్కల మిశ్రమం గుడ్లసొనలో వేసి కలపాలి. ► పనియారం ప్లేటులో నూనెవేసి వేడెక్కనివ్వాలి. బాగా కాగిన నూనెలో గుడ్ల మిశ్రమం వేసి మూతపెట్టాలి. ► సన్నని మంటమీద మూడు నిమిషాలు కాల్చాలి. తరువాత రెండోవైపు తిప్పి నిమిషం పాటు కాల్చితే వేడివేడి ఎగ్ పనియారం రెడీ. -
కొబ్బరితో కార్న్ ఇడ్లీ..రుచి మాత్రమే కాదు, చాలా బలం కూడా
కోకోనట్ – కార్న్ ఇడ్లీలు తయారీకి కావల్సినవి: మొక్కజొన్న నూక – 2 కప్పులు,కొబ్బరి పాలు – 1 కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్లు ఆవాలు – 1 టేబుల్ స్పూన్, శనగపప్పు – 1 టీ స్పూన్ చాయ పప్పు – 1 టీ స్పూన్,వేరుశనగలు – పావు కప్పు అల్లం తురుము – 2 టీ స్పూన్లు,పచ్చిమిర్చి –2 (చిన్నగా తరగాలి) ఉప్పు – తగినంత,బేకింగ్ సోడా – 1 టీ స్పూన్, నెయ్యి – కొద్దిగా తయారీ విధానమిలా: ముందుగా నూనె వేడి చేసుకుని అందులో వేరుశనగలు, శనగపప్పు, చాయ పప్పు, ఆవాలు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని చిన్న మంట మీద వేయించుకోవాలి. అందులో మొక్కజొన్న నూక వేసుకుని నిమిషం పాటు గరిటెతో అటూ ఇటూ తిప్పుతూ వేయించుకోవాలి. ఆ తర్వాత కొబ్బరిపాలు, బేకింగ్ సోడా కలుపుకుని ఇడ్లీ పిండిలా చేసుకోవాలి. అనంతరం ఇడ్లీ రేకుకు నెయ్యి రాసుకుని.. కొద్దికొద్దిగా మిశ్రమం వేసుకుని ఆవిరిపై ఉడికించుకోవాలి. ఇవి బలానికి బలాన్నీ, రుచికి రుచినీ అందిస్తాయి. -
వెరైటీగా గుడ్డుతో బాదం బర్ఫీ.. ఎప్పుడైనా ట్రై చేశారా?
ఎగ్ బాదం బర్ఫీ తయారీకి కావల్సినవి: గుడ్లు – 7, పంచదార, కోవా – 250 గ్రాముల చొప్పున, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు , బటర్ – 4 టేబుల్ స్పూన్లు (కరిగించాలి), బాదం – 40 పైనే (మిక్సీలో పొడి చేసుకోవాలి), నెయ్యి – కొద్దిగా తయారీ విధానమిలా: ముందుగా గుడ్లను మిక్సీలో పగలగొట్టి వేసుకుని.. బాగా మిక్సీ పట్టుకోవాలి.అందులో పంచదార, కోవా, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు, కరిగించిన బటర్, బాదం పొడి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. అనంతరం బౌల్ తీసుకుని.. దాని అడుగున బాగా నెయ్యి రాసి.. గుడ్లు–పంచదార మిశ్రమం వేసుకుని.. ఓవెన్లో పెట్టుకోవాలి. సుమారు 170 డిగ్రీల సెల్సియస్‌లో 45 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. నచ్చిన షేప్‌లో కట్ చేసుకుని మీ అభిరుచిని బట్టి డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకుని.. సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. -
చికెన్ ఖీమా బుర్జి.. చపాతీలోకి చాలా బావుంటుంది
చికెన్ ఖీమా బుర్జి తయారికి కావల్సినవి: చికెన్ ఖీమా – పావుకేజీ; గుడ్లు – మూడు; ఉల్లిపాయ – ఒకటి; పచ్చిమిర్చి – రెండు; మిరియాలపొడి – టేబుల్ స్పూను; గరం మసాలా – టీస్పూను; పసుపు – అరటీస్పూను; జీలకర్ర పొడి – పావు టీస్పూను; ఆవాలు – టీస్పూను; మినప గుళ్లు – టీస్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; నూనె – మూడు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా; కొత్తిమీర తరుగు – గార్నిష్‌కు సరిపడా. తయారీ విధానమిలా: చికెన్ ఖీమాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ∙బాణలిలో నూనె వేసి కాగనివ్వాలి. వేడెక్కిన నూనెలో ఆవాలు, మినపగుళ్లువేసి వేయించాలి ∙ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయను ముక్కలు తరగి వేయాలి ∙ ఉల్లిపాయ ముక్కలు వేగాక ఖీమా, కొద్దిగా ఉప్పువేసి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ∙ సగం ఉడికిన ఖీమాలో పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, మిరియాల పొడి వేసి కలపాలి. ఖీమా పూర్తిగా ఉడికేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఖీమా ఉడికిన తరువాత గుడ్లసొనను వేసి రెండు నిమిషాలు పెద్ద మంట మీద తిప్పుతూ వేయించాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. గుడ్ల సొన చక్కగా వేగి నూనె పైకి తేలుతున్నప్పుడు కొత్తిమీర చల్లుకుని దించేయాలి. అన్నం, చపాతీ,రోటీలకు ఇది మంచి సైడ్ డిష్. -
పొటాటో పాప్ కార్న్.. ఇలా చేస్తే భలే రుచిగా ఉంటాయి
పొటాటో పాప్ కార్న్ తయారీకి కావల్సినవి: బంగాళదుంపలు – 3 (తొక్క తీసి.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి) చాట్ మసాలా – పావు టీ స్పూన్, కార్న్ పౌడర్ – 1 టేబుల్ స్పూన్ ఉప్పు – తగినంత, కారం – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా బంగాళదుంప ముక్కల్ని నీటిలో ఐదు నిమిషాల పాటు ఉడికించి..ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కాస్త చల్లారాక మెత్తటి క్లాత్‌తో పైపైన ఒత్తుకుని.. తడి లేకుండా చేసుకోవాలి. అనంతరం వాటిని ఒక బౌల్లో వేసుకుని.. కొద్దిగా ఉప్పు, చాట్ మసాలా, కార్న్ పౌడర్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. బౌల్‌తోనే అటు ఇటు కుదపాలి. అప్పుడే కార్న్ పౌడర్, చాట్ మసాలా, ఉప్పు.. ముక్కలకు బాగా పడతాయి. తర్వాత వాటిని కాగుతున్న నూనెలో దోరగా వేయించుకుని.. ఒక ప్లేట్లోకి తీసుకుని.. వాటిపైన కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం జల్లి.. సర్వ్ చేసుకోవాలి. -
రొయ్యలతో ఘీ ఇడ్లీ.. ఎప్పుడైనా ట్రై చేశారా?
రొయ్యలతో ఇడ్లీ కావలసినవి: రొయ్యలు – పావు కప్పు (శుభ్రం చేసుకుని, ఉప్పు, కారం, పసుపు దట్టించి ఉడికించుకోవాలి. చల్లారాక ముక్కలుగా చేసుకోవాలి) ఇడ్లీపిండి – 4 కప్పులు (ముందుగా సిద్ధం చేసుకోవాలి) బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము – 2 టేబుల్ స్పూన్ల చొప్పున గరం మసాలా – 1 టీ స్పూన్, నెయ్యి – పావు కప్పు ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర తురుము – కొద్దిగా తయారీ విధానమిలా: ముందుగా రొయ్యల ముక్కల్ని నేతిలో వేయించాలి. అందులో క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, గరం మసాలా వేసి.. దోరగా వేగాక.. తీసి పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఇడ్లీ ప్లేట్ తీసుకుని.. ప్రతి గుంతలో మినప్పిండి మిశ్రమం కొద్దికొద్దిగా వేసుకుని.. ఆపై చిన్న గరిటెతో కొద్దిగా రొయ్యల మిశ్రమాన్ని పెట్టుకుని.. అది కనిపించకుండా మళ్లీ మినప్పిండితో కవర్ చేసుకుంటూ ఇడ్లీ గుంతలు నింపుకోవాలి. ఇంతలో మరో స్టవ్ మీద.. కళాయిలో నెయ్యి వేసుకుని.. ధనియాల పొడీ వేసి.. ఒక నిమిషం పాటు గరిటెతో తిప్పి.. ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇడ్లీలు ఆవిరిపై ఉడికిన తర్వాత.. సర్వ్ చేసుకునే ముందు ప్లేట్లోకి తీసుకుని.. వాటిపై ధనియాల–నెయ్యి మిశ్రమాన్ని వేసుకుని.. కొత్తిమీర తురుము గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. -
బ్రేక్‌ఫాస్ట్‌లో సింపుల్‌గా అప్పం.. ఇలా చేసుకోండి
అప్పం తయారీకి కావలసినవి: పొట్టు తీసిన పెసరపప్పు – కప్పు ; మినపపప్పు – అరకప్పు ; సోంపు – అరటీస్పూను; అల్లం – అంగుళం ముక్క ; క్యారట్, బీట్ రూట్, ప్రెంచ్ బీన్స్, బేబీ కార్న్, పచ్చి బఠాణి – అన్నీ కలిపి కప్పు; ఉప్పు – రుచికి సరిపడా ; నూనె – వేయించడానికి తగినంత. తయారీ విధానమిలా.. ►పప్పులను శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి . ►నానిన పప్పుల్లో అల్లం, సోంపు కొద్దిగా నీళ్లు వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ►ఇప్పుడు రుబ్బిన పిండిలో కూరగాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ►గుంత పునుగుల ప్లేట్లకి కొద్దిగా నూనె రాసి పిండి మిశ్రమాన్ని అప్పల్లా వేయాలి కొద్దిగా నూనె వేసి రెండువైపులా చక్కగా కాల్చుకుంటే హెల్దీ అప్పం రెడీ. -
రోజూ కాఫీ తాగకుండా ఉండలేరా? అయితే ఇది మీకు బెస్ట్ ఛాయిస్
యూనివర్సల్ డిజైన్‌తో, స్టెయిన్ లెస్ స్టీల్ ఇంటీరియర్ థర్మల్ ట్రావెల్ మగ్‌తో ఆకట్టుకుంటున్న ఈ కాఫీ మేకర్.. 60 సెకన్లలోపే తాజా కాఫీని తయారు చేస్తుంది. ప్రయాణ సమయాల్లో, ఉదయం లేవగానే.. బిజీ లైఫ్ కోసం విలువైన సమయాన్ని ఆదా చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఈ స్టైలిష్, కాంపాక్ట్ 600 వాట్స్ కాఫీ మేకర్‌తో వేడిగా, తాజాగా తయారుచేసిన కాఫీని ఆస్వాదించొచ్చు. వన్–టచ్ ఆప్షన్‌తో కాఫీ కేఫ్‌ల ముందు గంటల తరబడి వెయిట్ చేయాల్సిన కష్టం ఉండదు. ఇది చాలా తక్కువ స్థలం తీసుకుంటుంది. మన్నికైన మెటీరియల్‌తో రూపొందిన ఈ మేకర్ని.. వినియోగించడం చాలా సులభం. కాఫీ క్యాప్సూల్స్ పెట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన మినీ బాస్కెట్‌తో పాటు.. కాఫీ పౌడర్ వేసుకోవడానికి మినీ ఫిల్టర్ ఉంటుంది. దాంతో దీన్ని యూజ్ చేయడం చాలా తేలిక. ధర 21 డాలర్లు (రూ.1,737) -
క్యారెట్–కోకోనట్ ఢోక్లా.. చేసుకోండి ఇలా
క్యారెట్–కోకోనట్ ఢోక్లా తయారీకి కావల్సినవి: క్యారెట్ తురుము – 1 కప్పు సగ్గుబియ్యం – పావు కప్పు (పిండిలా చేసుకోవాలి) బియ్యప్పిండి – పావు కప్పు, కొబ్బరి పాలు – అర కప్పు నీళ్లు – సరిపడా, బేకింగ్ సోడా – పావు టీ స్పూన్ జీలకర్ర – 1 టీ స్పూన్, నిమ్మరసం – 2 టీ స్పూన్లు కరివేపాకు, ఆవాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, ధనియాలు – కొద్దికొద్దిగా (అన్నింటినీ ఒక టీ స్పూన్ నూనెలో పోపు పెట్టుకోవాలి) తయారీ విధానమిలా: ►ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని.. అందులో క్యారెట్ తురుము, బియ్యప్పిండి, సగ్గుబియ్యం పిండి, కొబ్బరి పాలు, చిటికెడు ఉప్పు వేసి సుమారు రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మరోసారి బాగా కలిపి.. 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అందులో నిమ్మరసం జోడించాలి. ► ఇప్పుడు ఒక పాత్ర తీసుకుని, దానికి కొద్దిగా నూనె రాసి, దానిలో ఆ మిశ్రమాన్ని వేసుకుని చదునుగా చేసుకోవాలి. 15 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించి, పోపు పెట్టిన కరివేపాకు, ఆవాల మిశ్రమాన్ని వాటిపై వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. అనంతరం కట్ చేసుకుని, సర్వ్ చేసుకోవాలి. -
మీ కిచెన్‌లో ఇది ఉంటే..ఆకుకూరలు ఈజీగా తురుముకోవచ్చు
పుష్ చాపర్ మనం చేసుకునే చాలా వంటకాల్లో కూరగాయలు, ఆకుకూరల తరుగులు, తురుములనే ఎక్కువగా వాడుతుంటాం. ఇక ఉల్లిపాయ ముక్కలు లేకుండానైతే చాలామందికి వంటే పూర్తవదు. వాటన్నింటికీ ఈ పుష్ చాపర్ చక్కగా యూజ్ అవుతుంది. ఈ టూల్ కింద భాగంలో ఉన్న ట్రాన్స్పరెంట్ బౌల్లో ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇతర కూరగాయలు.. పండ్లు ఇలా అన్నింటినీ సులభంగా ముక్కలు చేసుకోవచ్చు. మరింత చిన్నగా కచ్చాబిచ్చాగా చేసుకోవచ్చు. అందుకు వీలుగా ఈ చాపర్ పై నుంచి ప్రెస్ చేస్తుంటే.. దీనిలోని సిమెట్రిక్ బ్లేడ్స్ ట్రాన్స్పరెంట్ బౌల్లో ఉన్న కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ముక్కలవుతాయి. అవి ఎంత మెత్తగా అవ్వాలో ఏ స్థాయిలో తురుము కావాలో చూసుకుంటూ ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. చాపింగ్ తర్వాత అదే బౌల్‌తో డైరెక్ట్‌గా వంటలో వేసుకోవచ్చు. అలాగే క్లీనింగ్ కూడా ఈజీగానే ఉంటుంది. ధర 25 డాలర్లు (రూ.2,081) డంప్లింగ్ మేకర్ సాధారణంగా స్టఫ్డ్ స్నాక్స్‌కి ప్రతి ఇంటా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందులో కర్జికాయలు, డంప్లింగ్స్ వంటివి ప్రత్యేకం. కాకపోతే వాటిని చేసుకోవడమే కష్టం. అందుకు సహకరిస్తుంది ఈ డంప్లింగ్ మేకర్. ఎర్గోనామిక్స్ డిజైన్ తో ఉన్న ఈ సంప్రదాయ యంత్రం.. యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తుంది. గోధుమ పిండి, లేదా మైదాపిండితో చపాతీ ముద్దలుగా చేసుకుని.. చిన్న చిన్న ఉండల్ని మేకర్‌కి ఎడమవైపు కన్నంలో పెట్టి.. గుండ్రటి చపాతీలా చేసుకోవచ్చు. ఆ వెంటనే ఆ చపాతీని కుడివైపు పెట్టుకుని.. ముందుగానే సిద్ధంగా ఉంచుకున్న నచ్చిన వెజ్ లేదా నాన్ వెజ్ స్టఫ్‌ని కొద్దిగా వేసుకుని కుడి నుంచి ఎడమ వైపు మడిచి ప్రెస్ చేస్తే చాలు డంప్లింగ్ స్నాక్స్ రెడీ! వాటిని నూనెలో వేసుకుని దోరగా వేయించుకోవచ్చు. లేదా ఆవిరిపై ఉడికించుకోవచ్చు. ఇది సమయాన్ని, శ్రమను ఆదా చేస్తుంది. దీనిలో డంప్లింగ్ రేపర్లతో పాటు.. టోర్టిలా(ప్లాట్ బ్రెడ్), మినీ పిజ్జా బేస్ వంటివీ సులభంగా తయారు చేసుకోవచ్చు. ధర 4 డాలర్లు (రూ.333). -
ఇలాంటి స్వీట్ చేస్తే ఎవరైనా బీట్రూట్ని ఇష్టంగా తింటారు
బీట్రూట్ – మిల్క్ సందేశ్ తయారీకి కావల్సినవి: బీట్రూట్ – 2 (ముక్కలు కట్ చేసుకుని మెత్తటి గుజ్జులా చేసుకోవాలి) పాల పొడి – పావు కప్పు నెయ్యి – 2 లేదా 3 టేబుల్ స్పూన్లు పంచదార పొడి – ముప్పావు కప్పు తయారీ విధానమిలా: ముందుగా స్టవ్ మంటను సిమ్‌లో పెట్టుకుని.. పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని.. అందులో బీట్రూట్ గుజ్జు వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. కాస్త దగ్గర పడుతున్న సమయంలో పాలపొడి, పంచదార పొడి వేసుకుని.. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. రెండు మూడు నిమిషాలకొకసారి కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ దగ్గర పడేదాకా అలానే ఉండికించాలి. దగ్గర పడిన తర్వాత ఒక పాత్రకు నెయ్యి రాసి.. దానిలో వేసుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత చిన్నచిన్న ఉండలుగా తీసుకుంటూ.. వాటిని నచ్చిన షేప్‌లోకి మలిచి సర్వ్ చేసుకోవాలి. -
పాలకూరతో పొంగనాలు.. భలే రుచిగా ఉంటాయి
పాలక్ పనియారం తయారీకి కావల్సినవి కావలసినవి: పాలకూర –2 కప్పులు (పేస్ట్ చెయ్యాలి) అటుకులు – పావు కప్పు (ఒకసారి కడిగేసుకుని, 2 లేదా 3 నిమిషాల పాటు.. కొద్దిగా మంచినీటిలో నానబెట్టి, గుజ్జులా చేసుకోవాలి) ఉప్మా రవ్వ – ముప్పావు కప్పు, బియ్యప్పిండి – పావు కప్పు మజ్జిగ – పావు కప్పుపైనే, శనగపప్పు – 1 టేబుల్ స్పూన్ ఉప్పు, నూనె – సరిపడా తయారీ విధానమిలా.. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో.. పాలకూర గుజ్జు, ఉప్మా రవ్వ, బియ్యప్పిండి, ఉప్పు, నానబెట్టిన అటుకుల గుజ్జు వేసుకుని.. కొద్ది కొద్దిగా మజ్జిగ వేసుకుంటూ బాగా కలిపి.. 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో రవ్వ, తగినంత ఉప్పు వేసుకుని.. మజ్జిగతో కాస్త జారుగా చేసుకోవాలి. ఇప్పుడు పొంగనాల పాన్ లో ప్రతి గుంతలోనూ కొద్ది కొద్దిగా నూనె వేసుకుని.. అందులో రవ్వ మిశ్రమాన్ని వేసుకుని ఇరువైపులా దోరగా వేయించుకోవాలి. టమోటో సాస్‌తో తింటే ఇవి భలే రుచిగా ఉంటాయి. -
నోరూరించే శాండ్విచ్.. ఇలా చేస్తే బయట కొనాల్సిన పనిలేదు
పనీర్ – కీమా శాండ్విచ్ తయారీకి కావల్సినవి పనీర్ ముక్కలు – 1 కప్పు,కీమా – అర కప్పు (మసాలా, ఉప్పు జోడించి మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి) చీజ్ స్లైస్ – 6 లేదా 8 (చిన్న చిన్నవి),బచ్చలికూర తురుము – పావు కప్పు స్వీట్ కార్న్ – 3 టేబుల్ స్పూన్లు (ఉడకబెట్టుకోవాలి),క్యాప్సికమ్ తరుగు – 2 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, కారం – అర టీ స్పూన్ చొప్పున, బ్రెడ్ స్లైస్ – 5 లేదా 6 (గ్రిల్ చేసుకున్నవి), నూనె – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత తయారీ విధానమిలా: ముందుగా ఒక పాన్‌లో నూనె వేసుకుని వేడి కాగానే.. బచ్చలికూర తురుము, క్యాప్సికమ్ తరుగు వేసుకుని కాసేపు గరిటెతో తిప్పుతూ ఉండాలి. తర్వాత ఉడికిన స్వీట్ కార్న్, వెల్లుల్లి పేస్ట్, కారం, సరిపడా ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని తిప్పుతూ ఉండాలి. అనంతరం పనీర్ ముక్కలు, కీమా, మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ మిశ్రమం కాస్త చల్లారిన తర్వాత ప్రతి బ్రెడ్ స్లైస్‌లో కొంత పనీర్ మిశ్రమం పెట్టుకుని, ఒక్కో చీజ్ స్లైస్ దానిపై వేసుకుని.. ఓవెన్ లో బేక్ చేసుకోవాలి. తర్వాత క్రాస్‌గా త్రిభుజాకారంలో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. -
పండగొస్తుంది.. తియ్యటి వేడుక చేసుకుందాం, చమ్చమ్తో
చమ్‌చమ్ తయారీకి కావలసినవి వెన్నతీయని ఆవుపాలు – నాలుగు కప్పులు; నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు; మైదా – టేబుల్ స్పూను; చక్కెర – ఒకటిన్నర కప్పులు; నీళ్లు – ఎనిమిది కప్పులు; యాలకులు – రెండు; నెయ్యి – టీస్పూను; పాలు – పావు కప్పు; క్రీమ్ – రెండు టేబుల్ స్పూన్లు; పాలపొడి – అరకప్పు; కుంకుమ పువ్వు కలిపిన పాలు – రెండు టేబుల్ స్పూన్లు; చక్కెరపొడి –టేబుల్ స్పూను; కొబ్బరి తురుము – పావు కప్పు; ట్యూటీఫ్రూటీ –మూడు టేబుల్ స్పూన్లు తయారీ విధానమిలా: ► పాలను చక్కగా కాయాలి..కాచిన పాలల్లో నిమ్మరసం వేసి విరగగొట్టి.. పన్నీర్‌ను వేరు చేసి పక్కనపెట్టుకోవాలి. ► అరగంట తరువాత పన్నీర్ మిశ్రమంలో మైదా వేసి ముద్దలా కలపాలి ∙ముద్దను పొడవాటి రోల్స్‌లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ► ఇప్పుడు పంచదారలో ఎనిమిది కప్పులు నీళ్లుపోసి 10 నిమిషాలు మరిగించాలి. ► తరువాత యాలకులు, పన్నీర్ రోల్స్‌ను వేసి పదిహేను నిమిషాలు మరిగించి పక్కన పెట్టుకోవాలి ∙బాణలిలో నెయ్యి, పావు కప్పు పాలు పోసి మరిగించాలి. ► రెండు నిమిషాల తరువాత క్రీమ్ వేసి కలపాలి. మిశ్రమం చిక్కబడిన తరువాత కుంకుమ పువ్వు కలిపిన పాలు, పంచదార పొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మిశ్రమం బాగా చిక్కబడినప్పుడు దించేస్తే కోవా రెడీ. ► ఇప్పుడు సుగర్ సిరప్‌లో ఉడికించిన రోల్స్‌ను బయటకు తీసి మధ్యలో నిలువుగా గాటు పెట్టి చల్లారిన కోవా మిశ్రమాన్ని స్టఫ్చేసి గాటుని మూసేయాలి. ► ఈ రోల్స్‌కు కొబ్బరి తురుము అద్ది, పైన టూటీఫ్రూటీపెట్టాలి ∙ఇలా అన్నీ రోల్స్‌ను చేస్తే చమ్‌చమ్ రెడీ. -
ఆనపకూయతో సాంబార్ ఒకటే కాదు, పూరీలు కూడా చేసుకోవచ్చు
ఆనపకాయ పూరీ తయారీకి కావల్సినవి: ఆనపకాయ – 1 (తొక్క తీసేసి.. గింజలు తొలగించి.. ముక్కలను మెత్తగా ఉడికించి, కాస్త చల్లారాక మిక్సీ పట్టుకోవాలి) గోధుమ పిండి –3 కప్పులు, గోరువెచ్చని నీళ్లు – సరిపడా మైదాపిండి – 1 టేబుల్ స్పూన్, జీలకర్ర, వాము – అర టీ స్పూన్ చొప్పున (కచ్చాబిచ్చా మిక్సీ చేసుకోవాలి) కొత్తిమీర తురుము – 2 టేబుల్ స్పూన్లు, ఎండు మిర్చి పొడి– 1 టీ స్పూన్ (ఎండు మిరపకాయలను కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టాలి) పసుపు – చిటికెడు,ఉప్పు – తగినంత,నూనె – సరిపడా \ తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో ఆనపకాయ గుజ్జు, గోధుమ పిండి, మైదాపిండి, కొత్తిమీర తురుము, ఎండుమిర్చి పొడి, జీలకర్ర, వాము మిశ్రమం, ఉప్పు, పసుపు, అర టీ స్పూన్ నూనె వేసుకుని, సరిపడా గోరువెచ్చని నీళ్లతో మెత్తగా ముద్దలా చేసుకోవాలి. 20 నిమిషాలు పక్కన పెట్టుకుని.. నూనె అప్లై చేసుకుంటూ చిన్న చిన్న పూరీల్లా సిద్ధం చేసుకోవాలి. తర్వాత కళాయిలో నూనె కాగనిచ్చి.. పూరీలను వేయించాలి. -
రసగుల్లాతో ఐస్‌క్రీం..ఎప్పుడైనా ట్రై చేశారా? అదిరిపోద్దంతే!
రసగుల్లా ఐస్‌క్రీమ్ తయారీకి కావల్సినవి: వెనీలా ఐస్‌క్రీమ్ – నాలుగు కప్పులు; రసగుల్లాలు – ఎనిమిది; స్ట్రాబెరీ – ఆరు; బాదం పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానమిలా: గడ్డకట్టిన ఐస్‌క్రీమ్‌ను రిఫ్రిజిరేటర్ నుంచి తీసి పదినిమిషాలు బయటపెట్టాలి ∙రసగుల్లాలను గట్టిగా పిండి సిరప్‌ను తీసేయాలి. పూర్తిగా పిండకూడదు. కొద్దిగా సిరప్ తేమ ఉండేలా పిండాలి ∙పిండిన రసగుల్లాలను చిన్నచిన్న ముక్కలు చేయాలి. స్ట్రాబెరీలను కూడా కడిగి సన్నగా తరగాలి ∙ఇప్పుడు ఐస్‌క్రీమ్‌లో రసగుల్లా ముక్కలు వేసి కలపాలి . దీనిలో స్ట్రాబెరీ ముక్కలు, బాదం పలుకులు వేసి మరోసారి చక్కగా కలపాలి. ఈ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని గిన్నెలో వేసి మూతపెట్టి రాత్రంతా లేదా కనీసం నాలుగు గంటల పాటు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి . రిఫ్రిజిరేటర్లో నుంచి తీసిన పదిహేను నిమిషాల తరువాత రసగుల్లా ఐస్‌క్రీమ్‌ను సర్వ్‌చేసుకోవాలి. -
చాక్లెట్ ట్రఫెల్స్.. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు
చాక్లెట్ ట్రఫెల్స్ తయారీకి కావల్సినవి: బాదం పప్పు – కప్పు; ఎండు కొబ్బరి తురుము – ముప్పావు కప్పు; కర్జూరాలు – పదిహేను; బాదం బటర్ – ము΄్పావు కప్పు; డార్క్ చాక్లెట్ ముక్కలు – పావు కప్పు; కొబ్బరి నూనె – అరటీస్పూను; బరకగా దంచిన పిస్తా పలుకులు – పావు కప్పు; బాదం పలుకులు – పావు కప్పు; నల్లని పొరతీసి తురిమిన ఎండు కొబ్బరి – పావు కప్పు; స్ట్రాబెరీ పొడి – పావు కప్పు. తయారీ విధానమిలా: ►కర్జూరాలను ఒకసారి కడిగి పదిహేను నిమిషాల పాటు వేడినీటిలో నానబెట్టుకోవాలి ∙బాదం పప్పు, ఎండు కొబ్బరి తురుముని దోరగా వేయించి మిక్సీజార్‌లో వేయాలి. ► నానబెట్టిన కర్జూరాలను నీరు లేకుండా తీసి మిక్సీజార్‌లో వేసి గ్రైండ్ చేయాలి ∙సగం నలిగిన మిశ్రమంలో బాదం బటర్ వేసి గ్రైండ్ చేయాలి. ► అవసరాన్ని బట్టి రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ∙ఇప్పుడు గ్రైండ్ అయిన మిశ్రమాన్ని బయటకు తీసిన నచ్చిన పరిమాణంలో లడ్డుల్లా చుట్టుకోవాలి. ► బాదం, పిస్తా పలుకులను పొడిచేసి పక్కన పెట్టుకోవాలి ∙చాక్లెట్ముక్కల్లో కొబ్బరి నూనెవేసి అవెన్‌లో 45 సెకన్లు ఉంచాలి. చాక్లెట్ కరిగిన తరువాత పక్కన పెట్టుకోవాలి. ► ఇప్పుడు ముందుగా చేసుకున్న లడ్డులాను ఒక్కోక్కటి ఎండుకొబ్బరి తురుము, పిస్తా, బాదం, స్ట్రాబెరీ పొడులు, చాక్లెట్ మిశ్రమంలో ముంచి అద్దుకుంటే ట్రఫెల్స్ రెడీ. రిఫ్రిజిరేటర్లో నిల్వచేసుకుంటే ఇవి పదిరోజుల పాటు తాజాగా ఉంటాయి. -
క్యారట్ లడ్డు.. ఒకసారి తిన్నారంటే మైమరచిపోతారు
క్యారట్ లడ్డు తయారీకి కావల్సినవి: క్యారట్ తురుము – రెండు కప్పలు; ఎండు కొబ్బరి తురుము – ఒకటిన్నర కప్పులు; కండెన్స్డ్ మిల్క్ – కప్పు; బాదం పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు; రోజ్‌వాటర్ – అరటీస్పూను; యాలకుల పొడి – అరటీస్పూను; నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు; పచ్చికొబ్బరి తురుమ – గార్నిష్‌కు సరిపడా. తయారీ విధానమిలా: రెండు స్పూన్ల నెయ్యివేసి కొబ్బరి తురుముని ఐదు నిమిషాల పాటు దోరగా వేయించాలి. కొబ్బరి వేగిన తరువాత క్యారట్ తురుము వేసి మీడియం మంట మీద పదినిమిషాలు వేయించాలి. ఇప్పుడు బాదం పలుకులు, కండెన్స్డ్ మిల్క్ వేసి కలపాలి. ఐదు నిమిషాల తరువాత రోజ్ వాటర్. యాలకుల పొడి వేసి సన్నని మంట మీద తిప్పుతూ మగ్గనివ్వాలి. మిశ్రమం చిక్కబడిన తరువాత దించేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని చల్లారిన మిశ్రమాన్ని లడ్డుల్లా చుట్టుకుని,పైన కొద్దిగా పచ్చికొబ్బరితో గార్నిష్ చేసి సర్వ్‌చేసుకోవాలి. -
తాటి చాక్లెట్ పాన్కేక్ ..సింపుల్ రెసిపి ఇలా చేసుకోండి
తాటి చాక్లెట్ పాన్కేక్ తయారీకి కావల్సినవి: తాటిపండు గుజ్జు – ఒకటిన్నర కప్పులు కోకో పౌడర్ – 1 కప్పు, మైదాపిండి, బియ్యప్పిండి – ముప్పావు కప్పు చొప్పున, మొక్కజొన్నపిండి – పావు కప్పు, కొబ్బరి తురుము – అర కప్పు పంచదార – 2 కప్పులు చిక్కటి పాలు – సరిపడా(కాచి చల్లార్చినవి) ఉప్పు – చిటికెడు, నెయ్యి – చాలినంత తయారీ విధానమిలా: ముందుగా తాటì పండు గుజ్జు, కోకోపౌడర్, కొబ్బరి తురుము, పంచదార కొద్దికొద్దిగా పాలు మిక్సీలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో ఆ మిశ్రమంతో పాటు.. మైదాపిండి, బియ్యప్పిండి, మొక్కజొన్నపిండి, కోకో పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా పాలు కలుపుకుంటూ దోశల పిండిలా సిద్ధం చేసుకుని, రెండు గంటలు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తర్వాత పాన్‌లో నెయ్యి వేసుకుని.. మందంగా పాన్ కేక్స్ చేసుకుని.. ఇరువైపులా దోరగా కాల్చుకోవాలి. వాటిపై చాక్లెట్ క్రీమ్, ఫ్రూట్స్ వేసుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. -
చపాతీలోకి సూపర్ కాంబినేషన్.. సగ్గుబియ్యం పచ్చడి
సగ్గుబియ్యం పచ్చడి తయారీకి కావల్సినవి సగ్గుబియ్యం – అరకప్పు; పెరుగు – రెండున్నర కప్పులు; అల్లం తురుము –టేబుల్ స్పూను; క్యారట్ తురుము – రెండు టేబుల్ స్పూన్లు; ఆవాలు – టీస్పూను; జీలకర్ర – టీస్పూను; పచ్చిశనగపప్పు –టీస్పూను; పసుపు – అరటీస్పూను; కొత్తిమీర తరుగు – పావు కప్పు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – మూడు టీస్పూన్లు; కరివేపాకు – రెండు రెమ్మలు; ఇంగువ – చిటికెడు. తయారీ విధానమిలా: ►సగ్గుబియ్యాన్ని పదినిమిషాల పాటు మీడియం మంట మీద వేయించి పక్కన పెట్టుకోవాలి. ► సగ్గుబియ్యం చల్లగా అయిన తరువాత పెరుగు వేసి కలపాలి. పెరుగు చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్లుపోసుకోని ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి. ► సగ్గుబియ్యం పట్టుకుంటే మెత్తగా అయ్యేంతవరకు నానాక... కొత్తిమీర తరుగు , రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి ► బాణలిలో నూనెవేసి, వేడెక్కిన తరువాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి వేయించాలి. ► ఇవన్నీ వేగిన తరువాత పసుపు, ఇంగువ, క్యారట్ తరుగు వేసి నిమిషం పాటు వేయించి తీసేయాలి ► ఈ తాలింపు మిశ్రమాన్ని సగ్గుబియ్యం మిశ్రమంలో వేసి కలిపితే సగ్గుబియ్యం పచ్చడి రెడీ. అన్నం, చపాతీల్లోకి ఈ చట్నీ మంచి కాంబినేషన్. -
ఆరోగ్యానికి చాలా మంచిది.. కరివేపాకుతో పచ్చడి, టిఫిన్స్‌లో బావుంటుంది
కరివేపాకు పచ్చడి తయారీకి కావల్సినవి: కరివేపాకులు – రెండు కప్పులు; ఎండుమిర్చి – 10; చింతపండు – పెద్ద ఉసిరికాయ అంత పరిమాణం; పొట్టుతీసిన మినపగుళ్లు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; నువ్వులు – టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; పచ్చికొబ్బరి తురుము – ముప్పావు కప్పు; బెల్లం – టేబుల్ స్పూను; ఉప్పు రుచికి సరిపడా. తయారీ విధానమిలా: ►బాణలిలో నూనెవేసి కాగనివ్వాలి. కాగిన నూనెలో మినపగుళ్లు, ఎండు మిర్చి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ► ఇదే బాణలిలో నువ్వులు వేసి దోరగా వేయించాలి. ఇవి వేగిన తరువాత కరివేపాకు ఆకులు, చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించాలి. ► కరివేపాకు వేగిన తరువాత దించేసి, కొబ్బరి తురుము వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ► కరివేపాకు మిశ్రమం వేడి తగ్గిన తరువాత బెల్లం వేసి మెత్తగా నూరుకుంటే కరివేపాకు పచ్చడి రెడీ. అన్నం, చపాతీ, ఇడ్లీ, దోశల్లోకి బావుంటుంది. -
ఫ్రైడ్రైస్లోకి కశ్మీరీ చట్నీ సూపర్ కాంబినేషన్.. ఇలా చేసుకోండి
కశ్మీరీ చట్నీ తయారీకి కావల్సినవి: కశ్మీరీ మిరపకాయలు – ఇరవై; నూనె – ఐదు టేబుల్ స్పూన్లు; వెల్లుల్లి తురుము – ఐదు టేబుల్ స్పూన్లు; అల్లం తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు –రెండు టేబుల్ స్పూన్లు; టొమాటో కెచప్ – ఐదు టేబుల్ స్పూన్లు; రెడ్‌చిల్లీ సాస్ – రెండు టేబుల్ స్పూన్లు; సోయాసాస్ – టేబుల్ స్పూను; మిరియాల పొడి – టేబుల్ స్పూను; అరోరూట్ పొడి – టేబుల్ స్పూను, చక్కెర – టేబుల్ స్పూను; వెనిగర్ – మూడు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానమిలా: మిరపకాయలను నీటిలో వేసి రెండు గంటల పాటు నానబెట్టాలి.మిరపకాయలు చక్కగా నానాక మిక్సీజార్‌లో వేసి పేస్టుచేసి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె మొత్తం వేసి వేడెక్కనివ్వాలి. బాగా కాగిన నూనెలో వెల్లుల్లి తురుము, అల్లం తరుగు, కొత్తిమీర తరుగు వేసి మీడియం మంట మీద వేయించాలి తరువాత ఎండుమిర్చి పేస్టు వేసి వేయించాలి.తరువాత టొమాటో కెచప్, రెడ్‌చిల్లీసాస్, సోయాసాస్, మిరియాల పొడి, అరోరూట్ పోడి, చక్కెర వేసి ఐదు నిమిషాలు తిప్పాలి. చివరిగా రుచికి సరిపడా ఉప్పు, వెనిగర్ వేసి రెండు నిమిషాల పాటు వెయించి దించేయాలి. నెలరోజుల పాటు నిల్వ ఉండే ఈ చట్నీ ఇడ్లీ, దోశ, నూడుల్స్, ఎగ్ఫ్రైడ్రైస్ల్లోకి మంచి కాంబినేషన్. -
టిఫిన్స్‌లోకి నిమ్మకాయ ఇన్స్టంట్ పచ్చడి.. ఇలా చేసుకోండి
ఉల్లి, పల్లి, కొబ్బరి, వెల్లుల్లి, పుట్నాల పచ్చళ్లు తినితిని చప్పగా మారిన నాలుకకు ఊరించే చట్నీలు కనిపిస్తే ప్రాణం లేచివస్తుంది. అందుకే చూడగానే నోరూరించే చట్నీలతో ఈ వారం వంటిల్లు మీకోసం... నిమ్మకాయ ఇన్స్టంట్ పచ్చడి తయారికి కావల్సినవి: నిమ్మకాయలు – పది; బెల్లం – అరకప్పు; జీలకర్ర – నాలుగు టీస్పూన్లు; ఎండు మిర్చి – ఇరవై; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానమిలా: ►నిమ్మకాయలను నాలుగు ముక్కలుగా కట్ చేయాలి.ముక్కల్లో ఉన్న గింజలన్నింటినీ తీసేయాలి (గింజలు ఉంటే పచ్చడి చేదుగా వస్తుంది). ► నిమ్మకాయ ముక్కలు, జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా పేస్టుచేయాలి ► ఎండు మిర్చి, బెల్లంను కలిపి పొడిచేయాలి ∙ఇప్పుడు నిమ్మకాయ పేస్టులో ఎండుమిర్చి పొడి, రుచికి సరిపడా ఉప్పువేసి కలపాలి. ► తాలింపు కావాలంటే వేసుకోవచ్చు. తాలింపు లేకపోయినా బావుంటుంది. ► ఈ చట్నీని వెంటనే కూడా తినవచ్చు. కానీ రెండుమూడు రోజులు మాగాక మరింత రుచిగా ఉంటుంది. ► ఇడ్లీ,దోశ, పరాటా, చపాతీ, అన్నంలోకి ఈ చట్నీ చాలా బావుంటుంది. -
శ్రావణమాసం స్పెషల్.. టేస్టీ హల్వా చేసుకోండి ఇలా
క్యారెట్–ఖర్జూరం హల్వా తయారీకి కావల్సినవి: ఖర్జూరం – పావు కప్పు (గింజలు తీసి, కడిగి, కొన్ని మంచి నీళ్లలో కొంత సేపు నానబెట్టి తీసి, ఉడికించి, మిక్సీ పట్టుకోవాలి) క్యారెట్ తురుము– 1 కప్పు, కొబ్బరి పాలు– 2 కప్పులు కొబ్బరి కోరు, కస్టర్డ్ మిల్క్– పావు కప్పు చొప్పున, నెయ్యి, పంచదార– పావు కప్పు చొప్పున (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు), కుంకుమ పువ్వు – చిటికెడు, వెనీలా ఎసెన్స్– 1 టీ స్పూన్ కిస్మిస్ గుజ్జు– 1 టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్ ముక్కలు– కొన్ని (నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి), ఫుడ్ కలర్– క్యారెట్ కలర్ (అభిరుచిని బట్టి) తయారీ విధానమిలా.. ►ముందుగా ఖర్జూరం గుజ్జు, కొబ్బరి పాలు, పంచదార, ఏలకుల పొడి వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ► అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ బౌల్లో నెయ్యి వేడి చేసుకుని.. అందులో ఖర్జూరం మిశ్రమం మొత్తం వేసుకుని చిన్న మంట మీద, గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి. ► కాస్త దగ్గర పడుతున్నప్పుడు క్యారెట్ తురుము, కస్టర్డ్ మిల్క్, ఫుడ్ కలర్ వేసుకుని తిప్పుతూ ఉండాలి. ► ఆ తర్వాత కిస్మిస్ గుజ్జు, కొబ్బరి కోరు, వెనీలా ఎసెన్స్ ఒకదాని తరవాత ఒకటి వేసుకోవాలి. ► ఆ మిశ్రమం మరింత దగ్గర పడగానే, డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒకసారి అటు ఇటు కలిపి, సర్వ్ చేసుకోవాలి. -
సొరకాయతో 'సొరాటా'.. పేరు డిఫరెంట్ ఉన్నా, టేస్ట్ బావుంటుంది
సొరాటా తయారీకి కావల్సినవి: సొరకాయ లేదా గుమ్మడి తురుము – మూడు టేబుల్ స్పూన్లు; శనగపిండి – రెండు టేబుల్ స్పూన్లు; పుదీనా తరుగు – టేబుల్ స్పూను; అల్లం తరుగు – టేబుల్ స్పూను; పసుపు – ముప్పావు టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – టీస్పూను; నెయ్యి – టీస్పూను. తయారీ విధానమిలా: పెద్దగిన్నెలో సొరకాయ తురుము, శనగపిండి, పుదీనా, అల్లం తరుగులు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. చివరిగా నూనె వేసి ముద్దలా కలుపుకోవాలి ∙ఈ ముద్దను ఉండలుగా చేసి పరాటాల్లా వత్తుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసి రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే సొరాట రెడీ. -
సాఫ్ట్ అండ్ హెల్తీ.. మొలకల డోక్లా, సింపుల్‌గా ఇలా చేసుకోండి
మొలకల డోక్లా తయారికి కావల్సినవి: శనగ మొలకలు – కప్పు; పాలకూర తరుగు – అరకప్పు; శనగపిండి –రెండు టేబుల్ స్పూన్లు; రాక్‌సాల్ట్ – టీస్పూను; నూనె – టేబుల్ స్పూను; నువ్వులు – టీస్పూను ; ఇంగువ – అరటీస్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు. తయారీ విధానమిలా: ►మొలకలు, పాలకూరను మిక్సీజార్‌లో వేసి కొద్దిగా నీళ్లుపోసి గ్రైండ్ చేయాలి. ► గ్రైండ్ అయిన మిశ్రమాన్ని గిన్నెలో తీసుకుని..శనగపిండి, రాక్ సాల్ట్ వేసి కలపాలి. ► ఈ మిశ్రమాన్ని ప్లేటులో పోసి ఆవిరి మీద పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి. ► బాణలిలో నూనెవేసి కాగిన తరువాత నువ్వులు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. ► ఇప్పుడు ఉడికిన డోక్లాపై ఈ తాలింపుని వేసి, నచ్చిన ఆకారంలో ముక్కలు కోసి సర్వ్ చేసుకోవాలి. -
చిరుజల్లుల్లో... క్రిస్పీగా సూజీ టోస్ట్, ఎలా చేయాలంటే
చల్లని సాయంకాలం ఓ మాదిరిగా పడుతోన్న వర్షం చినుకులు చూస్తు టీ తాగితే ఆ అనుభూతే వేరు. పొగలు గక్కే టీని సిప్ చేస్తూ క్రిస్పీగా, కారకారంగా ఉండే వేడివేడి స్నాక్స్ మరింత ఆనందాన్ని ఇస్తాయి. పకోడీ, బజ్జీ,సమోసాలు ఎప్పుడూ తినేవే కాబట్టి ఈసారి వంటిల్లు చెబుతోన్న స్నాక్స్‌తో టీని సిప్ చేసి చూడండి. సూజీ టోస్ట్ తయారీకి కావలసినవి: బ్రెడ్ స్లైస్‌లు – ఆరు, సూజీ రవ్వ – అరకప్పు; పెరుగు – పావు కప్పు; క్యారట్ తురుము – టేబుల్ స్పూను; ఉల్లిపాయ ముక్కలు – రెండు టేబుల్ స్పూన్లు; టొమాటో తరుగు – టేబుల్ స్పూను; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను; కారం – టీస్పూను; బటర్ – టోస్టు వేయించడానికి సరిపడా; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానమిలా: బ్రెడ్ స్లైలు తప్పించి మిగతా పదార్థాలన్నింటిని గిన్నెలో వేసి కలపాలి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దికొద్దిగా నీళ్లుపోసుకుంటూ చిక్కగా కలపాలి. కలిపిన మిశ్రమాన్ని బ్రెడ్ స్లైస్మీద మందంగా పరుచుకోవాలి. ఇలా స్లైసులన్నింటికి రాశాక, నాన్‌స్టిక్ పాన్‌పై బటర్ వేసి రెండు వైపులా చక్కగా కాల్చాలి. టోస్టు బంగారు వర్ణంలో, క్రిస్పీగా మారేంత వరకు కాల్చి తీసేయాలి. -
క్షణాల్లో ఓట్స్ స్మూతీ.. సింపుల్ రెసిపి
ఓట్స్ స్మూతీ తయారీకి కావల్సినవి: ఓట్స్ –మూడు టేబుల్ స్పూన్లు; వేయించి పొట్టుతీసిన పల్లీలు – పావు కప్పు ; అవిసెగింజలు – టేబుల్ స్పూను; సబ్జాగింజలు – టీస్పూను; దాల్చిన చెక్క – అరంగుళం ముక్క; కర్జురాలు – నాలుగు; బాగా పండిన అరటి పండు – ఒకటి. తయారీ విధానమిలా: ►ఓట్స్‌ను పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి నానిన తరువాత శుభ్రంగా కడిగి మిక్సీజార్‌లో వేయాలి. దీనిలో కప్పు నీళ్లుపోయాలి. ► పల్లీలు, అవిసె, సబ్జా గింజలు, దాల్చిన చెక్క, కర్జూరాలు, అరటిపండు ముక్కలు కూడా వేయాలి. ► వీటన్నింటిని చక్కగా గ్రైండ్ చేస్తే స్మూతీ రెడీ. -
స్టఫ్డ్ బ్రెడ్ పకోడి..చాట్ మసాలాతో తింటే అదిరిపోద్ది
స్టఫ్డ్ బ్రెడ్ పకోడి తయారికి కావల్సినవి: వైట్ బ్రెడ్‌స్లైసులు – నాలుగు; పన్నీర్ – రెండు స్లైసులు; పుదీనా, కొత్తిమీర చట్నీ – నాలుగు టీస్పూన్లు; నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా.స్టఫింగ్ : ఉడికించి చిదుముకున్న బంగాళ దుంప – కప్పు ; ఉల్లిపాయ – ఒకటి ; పచ్చిమిర్చి – రెండు; అల్లం వెల్లుల్లి పేస్టు – టీస్పూను; జీలకర్ర పొడి – టీస్పూను; ధనియాల పొడి – టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; కారం – అరటీస్పూను ; ఆమ్ చూర్ పొడి – టీస్పూను; చాట్ మసాలా – టీస్పూను; గరం మసాలా –అరటీస్పూను; కొత్తిమీర తరుగు – రెండు టీస్పూన్లు. బ్యాటర్: శనగపిండి – ఒకటిన్నర కప్పులు; బియ్యప్పిండి – మూడు టేబుల్ స్పూన్లు; వాము – అరటీస్పూను ; ఉప్పు – రుచికి సరిపడా; కారం – అరటీస్పూను ; వంటసోడా – పావు టీస్పూను. తయారీ విధానమిలా: ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. పెద్ద గిన్నెతీసుకుని స్టఫింగ్ కోసం తీసుకున్న పదార్థాలన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో బ్యాటర్ కోసం తీసుకున్న పదార్థాలు, తగినన్ని నీళ్లుపోసి పకోడి పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ అంచులను తీసేసి పుదీనా కొత్తిమీర చట్నీని రాయాలి ∙దీనిపైన బంగాళదుంపల స్టఫింగ్ మిశ్రమాన్ని పెట్టాలి. చివరిగా పన్నీర్ స్లైస్‌ను పెట్టి మరో బ్రెడ్స్లైస్తో కప్పేసి రెండు ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు బ్యాటర్లో బేకింగ్ సోడా వేసి కలపాలి. శాండ్‌విచ్‌లా స్టఫ్ చేసిన బ్రెడ్ స్లైసులను బ్యాటర్లో ముంచి... సలసల మరుగుతోన్న నూనెలో డీప్‌ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాక తీసేసి చాట్ మసాలా చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. -
తరచూ చికెన్ బిర్యానీ తింటున్నారా? ఫ్రీగా మీకు క్యాన్సర్, గుండెజబ్బులు
బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో. చిన్నా,పెద్దా అని తేడా లేకుండా చాలామంది ఫేవరెట్ ఫుడ్ లిస్ట్‌లో బిర్యానీ ముందుంటుంది. అందులోనూ హైదరాబాద్ బిర్యానీ అంటే సెలబ్రిటీలు కూడా మనసు పారేసుకుంటారు. నాన్‌వెజ్‌లో ఎన్ని వెరైటీలు ఉన్నా చికెన్ బిర్యానీ ప్రత్యేకతే వేరు. అందుకే స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ సర్వీస్ యాప్స్‌లోనూ బిర్యానీ మోస్ట్ సేలబుల్ డిష్. అయితే టేస్ట్ బాగుంది కదా అని రోజూ బిర్యానీ కుమ్మేస్తే మొదటికే మోసం వస్తుందంటున్నారు డాక్టర్లు. తరచూ బిర్యానీ తింటే ముప్పు తప్పందని హెచ్చరిస్తున్నారు. చాలామందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. ఏదైనా అకేషన్, పార్టీ ఉంటే కశ్చితంగా బిర్యానీ ఉండాల్సిందే. ఈ క్రేజ్‌కు తగ్గట్లే ఇప్పుడు మార్కెట్లో ఎక్కడపడితే అక్కడ బిర్యానీ పాయింట్లు వెలిశాయి. అయితే ఇలా ఎప్పుడు పడితే అప్పుడు బిర్యానీలు తింటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా రెస్టారెంట్స్‌లో దొరికే బిర్యానీలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వాటిలో వినియోగించే మసాలా దినుసులు,నాసీరకం పదార్థాల వల్ల కడుపులో లేనిపోని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కలర్స్‌తో క్యాన్సర్ అసలే మార్కెట్లో ఇప్పుడు కల్తీ బాగా పెరిగిపోయింది. కాదేదీ అనర్హం అన్నట్లు తినే తిండి దగ్గర్నుంచి తాగే నీళ్ల వరకు అన్నింటిని కల్తీ చేసి పడేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసి ఇష్టమొచ్చినట్లు రంగులు, ఆర్టిఫిషియల్ ఎసెన్సులు వాడేస్తున్నారు. ఇలాంటి కలర్స్ వాడటం వచ్చే క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. బిర్యానీ అధికంగా తింటే ఊబకాయం, గ్యాస్, గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. చికెన్‌పై బాక్టీరియా చికెన్‌పై సాధారణంగా సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ వంటి బ్యాక్టిరియా ఉంటుంది. కాబట్టి వండేముందు శుభ్రంగా కడిగి బాగా ఉడికిన తర్వాత మాత్రమే తినాలి. లేకపోతే ఈ బాక్టీరియా శరీరం లోపలికి చేరి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కానీ రెస్టారెంట్స్, హోటల్స్‌లో ఎంతవరకు హైజీన్ మెయింటైన్ చేస్తారన్నది చెప్పలేం. దీనివల్లే ఒక్కోసారి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తరచూ బయట బిర్యానీ తింటే గుండె సమస్యలు కూడా వస్తాయట. మేం రోజూ చికెన్ తింటున్నాం. మాకేం కాలేదు కదా అని వాదించే వాళ్లూ ఉంటారు. అయితే ఇప్పుడు సమస్యలు రాకపోయినా ప్రతిరోజూ బిర్యానీ, మసాలాలు ఎక్కువగా ఉండే వంటలు తింటే దీర్ఘకాలంలో అనేక సమస్యలు వస్తాయట. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఊబకాయంతో పాటు జీర్ణ సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయట. ప్రోటీన్ సంగతి సరే, మరి కొవ్వు? సాధారణంగా చికెన్‌లో ప్రోటీన్ అధికంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. జిమ్, వర్కవుట్స్ చేసే వాళ్ల డైట్ లిస్ట్‌లో ప్రతిరోజూ చికెన్ ఉంటుంది. దీనివల్ల ప్రోటీన్ అధికంగా శరీరంలో చేరిపోయి కొవ్వు రూపంలో మారిపోతుంది. దీంతో మీకు తెలియకుండానే బరువు పెరుగుతారు. కాబట్టి రోజూ తినే అలవాటు మానుకొని వారానికి ఒకటి లేదా రెండు సార్లు తింటే మంచిదంటున్నారు వైద్యులు. -
స్పెషల్ డేస్ కోసం ప్రత్యేకంగా ఖీర్.. ఇలా చేసుకోండి
స్వీట్ పొటాటో ఖీర్ తయారీకి కావల్సినవి: చిలగడదుంప – 300 గ్రాములు (తొక్క తీసేసి.. దుంపల్ని తురుములా చేసుకోవాలి) పాలు – 1 లీటరు, నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు, ఏలకులు – 3 కుంకుమపువ్వు – చిటికెడు, చక్కెర – అర కప్పు, ఉప్పు – చిటికెడు కస్టర్డ్ మిల్క్ – అర కప్పు, నట్స్ ముక్కలు – 3 టేబుల్ స్పూన్లకు పైనే (గార్నిష్‌కి) తయారీ విధానమిలా... ముందుగా పాన్‌లో నెయ్యి వేడి చేసుకుని, అందులో చిలగడదుంప తురుము వేసుకుని చిన్నమంట మీద గరిటెతో తిప్పుతూ 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. అనంతరం మరో పాత్రలో పాలు వేడి చేసుకుని.. అందులో కుంకుమ పువ్వు, ఏలకులు వేసుకుని తిప్పుతూ ఉండాలి. పాన్‌లో వేయించిన చిలగడదుంప తురుమును.. పాలల్లో వేసుకుని, చిన్న మంట మీద.. మధ్యమధ్యలో గరిటెతో తిప్పుతూ మెత్తగా ఉడికించుకోవాలి. అనంతరం పంచదార వేసుకుని గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. పంచదార కరిగిన తర్వాత కస్టర్డ్ మిల్క్ వేసుకుని 3 లేదా 4 నిమిషాలు ఉడకనివ్వాలి. కాస్త దగ్గర పడిన తర్వాత కొన్ని నట్స్ ముక్కలను అందులో కలిపి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునే ముందు మిగిలిన నట్స్ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. -
కడుపునిండా తిన్నా బరువు తగ్గించే పరోటా రెసిపి
బరువు పెరగకుండా ఉండేందుకు, పెరిగిన బరువు తగ్గించుకునేందుకు తిండి మానేస్తుంటారు. కానీ తింటూనే బరువు తగ్గాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అందుకే కడుపునిండా తింటూ బరువుని తగ్గించుకునే వంటకాలతో ఈ వారం వంటిల్లు... ఓట్స్ బీట్రూట్ పన్నీర్ పరాటా తయారీకి కావల్సినవి: వేయించిన ఓట్స్ – కప్పు; బీట్రూట్ ప్యూరీ – కప్పు; పన్నీర్ తరుగు – అరకప్పు; గోధుమ పిండి – అరకప్పు ; జీలకర్ర – అరటీస్పూను; వాము – అరటీస్పూను; కారం – అరటీస్పూను; ఉప్పు – అరటీస్పూను ; నూనె – రెండు టీస్పూను. తయారీ విధానమిలా: పెద్దగిన్నెలో ఓట్స్, బీట్రూట్ ప్యూరీ, పనీర్ తరుగు, గోధుమ పిండి, జీలకర్ర, వాము, కారం, ఉప్పు వేసి కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లుపోసుకుంటూ పరాటా పిండి ముద్దలా కలుపుకోవాలి. ఈ ముద్దను ఉండలుగా చేసుకుని పరాటాల్లా వత్తుకోవాలి. పరాటాలను రెండువైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు కాల్చుకుంటే పరాటా రెడీ.పెరుగు లేదా చట్నీతో సర్వ్‌చేసుకోవాలి. -
బ్రెడ్ – యాపిల్ కుల్ఫీ టేస్ట్ అదిరిపోద్ది.. ట్రై చేయండి
బ్రెడ్ – యాపిల్ కుల్ఫీ తయారీకి కావల్సినవి బ్రెడ్ స్లైసెస్ – 4 (నలువైపు బ్రౌన్ కలర్ ముక్కను తొలగించి.. మిగిలిన ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలి) యాపిల్ ముక్కలు – అర కప్పు చిక్కటి పాలు – 2 కప్పులు పంచదార – పావు కప్పు (పెంచుకోవచ్చు) డ్రైఫ్రూట్స్ ముక్కలు – పావు కప్పు (అభిరుచిని బట్టి) కుంకుమ పువ్వు – కొద్దిగా తయారీ విధానమిలా ముందుగా బౌల్లో పాలు పోసుకుని గరిటెతో తిప్పుతూ కాచుకోవాలి. పంచదార, కుంకుమ పువ్వు వేసుకుని తిప్పుతూ సగం వరకూ మరిగించుకుని చల్లారబెట్టాలి. తర్వాత యాపిల్, బ్రెడ్ పౌడర్‌ను మిక్సీలో వేసుకుని.. ఒకసారి మిక్సీ పట్టి.. అందులో చల్లార్చిన పాలను పోసుకుని మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా కుల్ఫీ మేకర్లో వేసుకుని.. సుమారు 8 గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. -
మష్రూమ్స్‌తో లాలీపాప్స్.. ఎప్పుడైనా ట్రై చేశారా?
మష్రూమ్ లాలీపాప్స్ తయారీకి కావల్సినవి: పుట్టగొడుగులు – అర కప్పు (వేడి నీళ్లల్లో ఉడికించి, శుభ్రం చేసుకుని మిక్సీ పట్టుకోవాలి), ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, క్యారెట్ తరుగు, కొత్తిమీర తురుము – 2 టేబుల్ స్పూన్ల చొప్పున, బఠాణీ, స్వీట్ కార్న్ – 3 టేబుల్ స్పూన్ల చొప్పున(ఉడికించినవి), పచ్చిమిర్చి ముక్కలు – అర టీ స్పూన్, కారం, గరం మసాలా, ఆమ్ చూర్ పౌడర్, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్ చొప్పున, బ్రెడ్ పౌడర్ – పావు కప్పు, నీళ్లు – అర కప్పు, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా.. ముందు ఒక బౌల్ తీసుకుని, అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, క్యారెట్ తరుగు, కొత్తిమీర తురుము, ఉడికించిన పుట్టగొడుగుల గుజ్జు, బఠాణీ, స్వీట్ కార్న్, పచ్చిమిర్చి ముక్కలు, కారం, గరం మసాలా, ఆమ్ చూర్ పౌడర్, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రెడ్ పౌడర్, కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని.. ఒక్కో ఉండకు ఒక్కో ఐస్‌క్రీమ్ పుల్ల గుచ్చి.. నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అనంతరం టమోటా సాస్ లేదా కొత్తిమీర చట్నీలో ముంచి సర్వ్ చేసుకోవచ్చు. -
ఇది తింటే ప్రోటీన్..మీల్మేకర్తో మొలకల టిక్కా..
మీల్మేకర్ మొలకల టిక్కా తయారీకి కావల్సినవి: మీల్మేకర్ – ఒకటిన్నర కప్పులు; పెసర మొలకలు – అరకప్పు; పాలకూర – చిన్నకట్ట ఒకటి; అల్లం – అంగుళం ముక్క; బియ్యప్పిండి – నాలుగు టేబుల్ స్పూన్లు; శనగపిండి – మూడు టేబుల్ స్పూన్లు; ధనియాల ΄÷డి – ఒకటిన్నర టీస్పూను; జీలకర్ర పొడి – టీస్పూను; రాక్ సాల్ట్ – అరటీస్పూను; కొత్తిమీర, పుదీనా తరుగు – అరకప్పు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – టిక్కి వేయించడానికి సరిపడా. తయారీ విధానమిలా: ముందుగా వేడినీటిలో మీల్ మేకర్ వేసి పదినిమిషాల పాటు నానబెట్టాలి. నానిన మీల్ మేకర్‌ను మూడుసార్లు నీటితో కడగాలి చివరిగా మీల్ మేకర్‌లోని నీటిని పిండి పక్కన పెట్టుకోవాలి ∙పాలకూరను శుభ్రంగా కడిగి, మరుగుతోన్న నీటిలో వేసి రెండు నిమిషాలు ఉంచాలి. రెండు నిమిషాల తరువాత తీసి చల్లని నీటిలో వేసి, నీటిని పిండి పక్కన పెట్టుకోవాలి ∙మిక్సీజార్‌లో పుదీనా, కొత్తిమీర, అల్లం వేసి గ్రైండ్ చేయాలి. ఇవన్నీ నలిగిన తరువాత పెసర మొలకలు వేసి గ్రైండ్ చేయాలి. చివరగా... నీళ్లు పోయకుండా మీల్మేకర్, పాలకూర వేసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని ధనియాల పొడి, బియ్యప్పిండి, శనగపిండి, జీలకర్ర పొడి, రాక్ సాల్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి పక్కనపెట్టుకోవాలి. పదినిమిషాల తరువాత పిండిమిశ్రమాన్ని టిక్కిల్లా చేసుకోవాలి ∙మీడియం మంటమీద నూనె వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు టిక్కీలను కాల్చుకుని సర్వ్ చేసుకోవాలి. -
వర్షాకాలంలో బెస్ట్ స్నాక్స్.. క్రిస్పీ మసాలా మత్రీ చేసుకోండి ఇలా
క్రిస్పీ మసాలా మత్రీ తయారికి కావల్సినవి గోధుమ పిండి – రెండు కప్పులు; వాము – అరటీస్పూను; కసూరీ మేథి – రెండు టేబుల్ స్పూన్లు; కారం – అరటేబుల్ స్పూను; గరం మసాలా – అరటేబుల్ స్పూను; కార్న్ స్టార్చ్ – టేబుల్ స్పూను ; నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా. తయారీ విధానమిలా: గోధుమ పిండిలో వాము, కసూరీ మేథి, కారం, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. దీనిలో టేబుల్ స్పూను నెయ్యివేసి మరోసారి కలపాలి ∙ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముద్దలాగ కలపాలి. మిగిలిన టేబుల్ స్పూను నెయ్యిని కార్న్‌స్టార్చ్‌లో వేసి పేస్టులా కలపాలి. పిండి ముద్దను మందపాటి గుండ్రని చెక్కల్లా వత్తుకోవాలి. ఈ చెక్కలపైన కార్న్ పేస్టురాయాలి. చెక్కలను మీడియం మంటమీద క్రిస్పీగా మారేంత వరకు డీప్ప్రై చేసుకుంటే మసాలా మత్రీ రెడీ. -
కోకోనట్ ఓట్స్ కేక్.. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు
కోకోనట్ ఓట్స్ కేక్ తయారీకి కావల్సినవి: కొబ్బరి పాలు – పావు లీటర్, కొబ్బరి తురుము – 1 కప్పు ఓట్స్ పౌడర్ – ఒకటిన్నర కప్పులు,బియ్యప్పిండి – పావు కప్పు బ్రెడ్ పౌడర్ – 1 కప్పు, పంచదార – ఒకటిన్నర కప్పులు నెయ్యి – 1 లేదా 2 టీ స్పూన్లు, నీళ్లు – 2 కప్పులు తయారీ విధానమిలా.. ముందుగా స్టవ్ ఆన్ చేసి.. పాత్రలో కొబ్బరిపాలు, పంచదార వేసి.. పంచదార కరిగేవరకూ తిప్పుతూ మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అనంతరం గరిటె సాయంతో ఒక బౌల్లో ఓట్స్ పౌడర్, బ్రెడ్ పౌడర్ వేసుకుని కొద్దికొద్దిగా కొబ్బరి పాల మిశ్రమాన్ని పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో బియ్యప్పిండి, కొబ్బరి తురుము వేసి మరోసారి కలుపుకోవాలి. తర్వాత కేక్ తయారు చేసే పాత్రకు అడుగున నెయ్యి రాసి.. అందులో ఈ మిశ్రమం వేసి.. ఓవెన్లో బేక్ చేసుకుంటే సరిపోతుంది. అభిరుచిని బట్టి క్రీమ్స్‌తో గార్నిష్ చేసుకోవచ్చు. -
స్నాక్స్ కోసం..చీజ్ కార్న్ రోల్స్ ఇలా చేసుకోండి
చీజ్ కార్న్ రోల్స్ రెసిపికి కావల్సినవి బంగాళ దుంపలు – మూడు; కార్న్ గింజలు – అరకప్పు; చీజ్ – అరకప్పు; వెల్లుల్లి తురుము – టీస్పూను; కార్న్ స్టార్చ్ – టేబుల్ స్పూను; బ్రెడ్ స్లైసులు –నాలుగు; కారం – అరటీస్పూను; గరం మసాలా – పావు టీస్పూను; ఛాట్ మసాలా – అరటీస్పూను; మిరియాల పొడి – అరటీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా. తయారీ విధానమిలా.. బంగాళ దుంపలు, కార్న్ గింజలను విడివిడిగా ఉడికించాలి ∙బంగాళ దుంపల తొక్క తీసి చిదుముకోవాలి ∙దీనిలో కార్న్ గింజలు, వెల్లుల్లి తురుము, కార్న్‌స్టార్చ్, కారం, గరం మసాలా, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి ∙ఈ మిశ్రమంలో సన్నగా తరిగిన బ్రెడ్‌స్లైసులను వేసి అన్నీ కలిసిపోయేలా కలిపి, చిన్నచిన్న ఉండలు చేసుకోవాలి. ఈ ఉండలకు వేలితో రంధ్రం చేసి చీజ్‌ను సన్నగా తురిమి పెట్టాలి తరువాత రంధ్రాలని మూసేసి రోల్స్ ఆకారం లో వత్తుకోవాలి ∙ఇలా అన్ని ఉండలను రోల్స్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు డీప్‌ఫ్రై చేసి, సాస్‌తో సర్వ్ చేసుకోవాలి.