
పుట్టగొడుగులు...(Mushrooms) అదేనండీ.. మష్రూమ్స్ పోషకాలకే కాదు... రుచికి కూడా పెట్టింది పేరు. కాస్త ఉప్పూకారం వేసి మరికాస్త మసాలా దట్టించామంటే ఆ టేస్ట్ అదుర్స్.. అందుకే పుట్టనిండా రుచులు... పొట్టనిండా విందు! అందుకే పుట్టగొడుగులతో మంచి రుచికరంగా చేసుకునే వంటకాలను గురించి తెలుసుకుందాం.ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.
మష్రూమ్స్ మంచూరియా
కావలసినవి: మైదా – అర కప్పు; మష్రూమ్స్ – 250 గ్రాములు; కార్న్‌ఫ్లోర్-3 టేబుల్ స్పూన్లు; అల్లం, వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; నీళ్లు -కప్పు; ఉప్పు -తగినంత; పంచదార-అర టీ స్పూన్; పచ్చి మిర్చి- 3 (సన్నగా తరగాలి); అల్లం వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్; ఉల్లికాడల తరుగు-టేబుల్ స్పూన్; బెల్ పెప్పర్-1 (సన్నగా తరగాలి). సాస్ కోసం: నల్ల మిరియాల పొడి -చిటికెడు; పంచదార – చిటికెడు; సోయా సాస్ – టీస్పూన్
తయారీ: ∙పుట్టగొడుగులను కడిగి, తుడిచి, సగానికి కట్ చేయాలి ∙ఒక గిన్నెలో సాస్ మినహా పై పదార్థాలన్నీ తీసుకోవాలి ∙తగినన్ని నీళ్లు ΄ోసి పిండిని బాగా కలుపుకోవాలి ∙స్టౌ పై బాణలి పెట్టి, తగినంత నూనె పోసి, వేడి చేయాలి. పుట్టగొడుగులను పిండిలో ముంచి, కాగుతున్న నూనెలో వేసి, గోధుమ రంగు వచ్చేవరకు వేయించి, తీసి, పక్కన పెట్టుకోవాలి ∙అదే నూనెలో, కట్ చేసి పెట్టుకున్న ఉల్లి కాడలను వేసి, నిమిషం సేపు వేయించి, తీసి పక్కనుంచాలి ∙నల్ల మిరియాలు, ఉప్పు, చక్కెర, సోయా సాస్ కలిపి పక్కనుంచాలి. ఈ సాస్‌లో వేయించిన పుట్టగొడుగులను వేసి, అన్నింటికీ సాస్ పట్టేలా బాగా కదిలించాలి. తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీరతో అలంకరించి, సర్వ్ చేయాలి.
మష్రూమ్స్ పులావ్
కావలసినవి: నూనె- 3 టేబుల్ స్పూన్లు; బాస్మతి బియ్యం – ఒకటిన్నర కప్పు; మష్రూమ్స్- 250 గ్రాములు; ఉల్లిపాయ-1 (సన్నగా తరగాలి); టమోటా-1 (ముక్కలుగా కట్ చేసుకోవాలి); బంగాళదుంప-1; పచ్చిమిర్చి- 2; అల్లం వెల్లుల్లి పేస్ట్-టీ స్పూన్; కొబ్బరిపాలు-కప్పు; నీళ్లు -3 కప్పులు; ఉప్పు-తగినంత; మసాలా దినుసులు - (బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు -3, లవంగాలు -5, నల్లమిరియాలు - 6, జీలకర్ర – టీ స్పూన్)
తయారీ: బియ్యాన్ని కడిగి అరగంటసేపు నానబెట్టాలి. అన్ని కూరగాయలతో పాటు మష్రూమ్స్ కూడా కడిగి, కట్ చేసి పెట్టుకోవాలి ∙ప్రెజర్ కుక్కర్‌లో, నూనె వేసి వేడిచేయాలి. జీలకర్రతో సహా మొత్తం మసాలా దినుసులు వేసి, సువాసన వచ్చే వరకు వేయించాలి ఉల్లిపాయ తరుగు వేసి, వేయించుకోవాలి. అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు తరిగిన టమోటాలు, బంగాళదుంప ముక్కలు వేసి ఉడికించాలి. తర్వాత పుట్టగొడుగులను కలపాలి. సన్నని మంట మీద పుట్టగొడుగులు సగం ఉడికేంత వరకు 5 నిమిషాలు ఉంచాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. పచ్చిమిర్చి వేసి, వేగాక, బియ్యం పోసి కలపాలి.
దీంట్లో కొబ్బరి పాలు, నీళ్లు కలపాలి. ఉప్పు వేసి, రుచి సరిచూసుకొని, కుకర్ మూత పెట్టాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి, స్టౌ ఆపాలి. 5–10 నిమిషాలు ఆగి, కుకర్ మూత తీసి, కొత్తిమీర, పుదీనా ఆకులతో అలంకరించాలి. గుండ్రంగా తరిగిన ఉల్లిపాయలతో సర్వ్ చేయాలి. దీనికి కాంబినేషన్‌గా రైతాను వడ్డించాలి.
Comments
Please login to add a commentAdd a comment