మునగాకులో ఏ, బీ, సీ విటమిన్‌లుంటాయి. క్యాల్షియం, పొటాషియం, ఐరన్... మెగ్నీషియం, ఫాస్ఫరస్ కూడా ఉంటాయి. తరచూ తింటే చాలా మంచిది. రోజూ కూరల్లో వేసుకుంటే ఇంకా మంచిది.
నొప్పిని నయం చేయడంలో,కండరాలను బలోపేతం చేయడంలో మునగాకు అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు ఇది చర్మానికి జుట్టు సంరక్షణలో బాగా పనిచేస్తుంది.
మునగాకు – పెసరపప్పు
కావలసినవి:
మునగాకు – 4 కప్పులు; పెసరపప్పు– కప్పు; ఎండు మిర్చి – 1;
ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు; వెల్లుల్లి రేకలు– 5;
ఆవాలు – టీ స్పూన్; ఇంగువ –పావు టీ స్పూన్; పసుపు – అర టీ స్పూన్;
మిరపపొడి– అర టీ స్పూన్; ఉప్పు – పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి;పచ్చి కొబ్బరి తురుము– పావు కప్పు; నూనె – 2 టేబుల్ స్పూన్‌లు;
తయారీ:
మునగాకులో ఈనెలు లేకుండా ఏరి వేసి ఆకును మంచి నీటితో శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి.
పెసరపప్పును కూడా కడిగి సిద్ధంగా ఉంచుకోవాలి.
బాణలిలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రేకలు, ఇంగువ వేసి వేగిన తర్వాత పెసర పప్పు వేయాలి. ఇప్పుడు మునగాకు, పసుపు, మిరపపొడి వేసి కలిపి నీరు పోసి మూత పెట్టాలి. ఉడకడం మొదలైన తర్వాత మూత తీసి మరోసారి కలిపి మంట తగ్గించి ఉడికించాలి.
నీరు తగ్గి పోయిన తర్వాత కొబ్బరి పొడి, ఉప్పు కలిపి మూత పెట్టి స్టవ్ ఆపేయాలి. ఇది అన్నం, రోటీల్లోకి బాగుంటుంది.
మొరింగా టీ
మునగాకులో ఈనెలు, చిల్లు పడిన ఆకులు, పండిపోయిన ఆకులను ఏరివేసి శుభ్రంగా కడిగి చిల్లుల ΄ పాత్రలో వేసి నీరు పోయే వరకు ఉంచాలి.
తర్వాత ఆకును ఒక పేపర్ మీద కానీ నూలు వస్త్రం మీద కాని వేసి తేమ పూర్తిగా ఆరి పోయే వరకు ఉంచాలి. మునగాకును ఎండ బెట్టకూడదు, నీడలోనే ఆరబెట్టాలి. వాతావరణాన్ని బట్టి ఒకటి లేదా రెండు రోజుల్లో ఆరి పోతాయి.
ఆకులను చేత్తో కదిలించినప్పుడు తేమలేకుండా గలగలలాడాలి.
ఆకులను మిక్సీ జార్‌లో మెత్తగా పొడి చేయాలి. పొడిని జల్లించి తేమ లేని సీసాలో నిల్వ చేసుకోవాలి.
టీ తయారీ:
పావు లీటరు నీటిని మరిగించి అందులో టీ స్పూన్ మొరింగా ΄పౌడర్ వేసి మూత పెట్టాలి. ఓ నిమిషం తర్వాత గ్లాసులో పోసుకుని తాగాలి. రోజూ ఉదయం ఈ మొరింగా టీ తాగితే అధిక బరువు తగ్గుతుంది.
గమనిక: ఇలా తయారు చేసుకున్న ΄ పొడి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది. కూరల్లో, పప్పులోకి తాజా మునగాకు దొరకని రోజుల్లో ఈ పొడిని వేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment