munaga
-
అనగనగా మునగ
సంప్రదాయేతర పంటల సాగు ద్వారా ఏజెన్సీ రైతులు అధిక ఆదాయం సాధించేలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ పక్కా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రణాళికను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు వీలుగా యూట్యూబ్ చానల్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఈ చానల్ ద్వారా ప్రత్యేక వీడియోలు అప్లోడ్ చేస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. –సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంమునగ అంటే మొదటి మెట్టు‘కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం’పేరుతో ఉన్న యూట్యూబ్ చానల్లో జితేశ్ వి.పాటిల్ 40 నిమిషాల నిడివి గల వీడియోను ఈనెల 23న అప్లోడ్ చేశారు. జిల్లాలో ఎక్కువగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నారని, ఈ సంప్రదాయ పంటల సాగు వల్ల ఎకరానికి రూ.20 వేలకు మించి ఆదాయం రావడం లేదని ఆ వీడియోలో కలెక్టర్ స్పష్టం చేశారు. మునగ సాగు చేయడం ద్వారా కనిష్టంగా రూ.75 వేలు, గింజలు, ఆకుల అమ్మకం ద్వారా మరో రూ.25 వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని వివరంగా చెప్పారు.ఖర్చు లేకుండా సాగుఎకరంలో వెయ్యి మునగ చెట్లు నాటొచ్చని కలెక్టర్ పాటిల్ తెలిపారు. మొక్క నాటింది మొదలు దిగుబడి వచ్చే వరకు రైతులకు ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంటుంది, రైతులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఏంటనేవి వివరించారు. విత్తనాలు, మెటీరియల్ కాంపోనెంట్ అంతా కలిపి ఎకరానికి రూ.33 వేల దాకా ఖర్చు వస్తుందని, ఇదే సమయంలో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలకు ఉపాధి హామీ పథకం తోడైతే రూ.34,500 వరకు రైతుకు సాయం అందుతుందన్నారు. మునగ సాగుకు ఉపాధి హామీ పథకం వర్తించాలంటే ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులై ఉండాలని చెప్పారు.మార్కెటింగ్ ఈజీఒక మునగ చెట్టుకు కనిష్టంగా 180.. గరిష్టంగా 500కు పైగా కాయలు వస్తాయని తెలిపారు. ఒక చెట్టుకు 180 కాయల దిగుబడి అనుకుంటే... రూపాయికి రెండు కాయల వంతున అమ్మినా ఎకరం మీద రూ.75 వేల ఆదాయం కచ్చితంగా వస్తుందన్నారు. తక్కువ రేటుకు అమ్మితే హైదరాబాద్ నుంచి వ్యాపారులే వచ్చి మునగ కాయలు తీసుకెళతారని, మార్కెటింగ్ చేయాల్సిన అవసరమే ఉండదని చెప్పారు.నవంబర్‌లో మొదలునవంబర్ రెండో వారంలో విత్తనాల కొనుగోలుతో మొదలయ్యే ‘మిషన్ మునగ’జూన్ చివరి వారంలో దిగుబడి తీసుకునే వరకు కొనసాగనుంది. ప్రతీ నెల, ప్రతీ వారం ఏ పని చేయాలనే అంశంపై రూపొందించిన రూట్‌మ్యాప్‌ను క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు, సిబ్బందికి పంపారు. రాబోయే రబీ సీజన్లో జిల్లాలో కనీసం పది వేల ఎకరాల్లో మునగ సాగు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కలెక్టర్ ఆలోచనలు ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత జిల్లా అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిపై ఇప్పుడు ఉంది. అవగాహన తెచ్చుకొనిభద్రాద్రి జిల్లా కలెక్టర్‌గా ఈ ఏడాది జూన్ 15న జితేశ్ వి.పాటిల్ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత కొన్నాళ్లకే అశ్వారావుపేట మండలంలో పెద్దవాగుకు గండిపడింది. బాధిత రైతులతో మాట్లాడుతున్న సందర్భంలోనే జిల్లా రైతులు తక్కువ ఆదాయం పొందుతున్న అంశాన్ని కలెక్టర్ గుర్తించారు. అప్పటి నుంచి జిల్లాలో సాగు జరుగుతున్న తీరుతెన్నులు ఆయన పరిశీలించారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా రైతులకు అధిక ఆదాయం రావాలంటే మునగ సాగే మేలనే నిర్ణయానికి వచ్చారు. అంతటితో ఆగిపోకుండా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో కలిసి పక్కా రోడ్‌మ్యాప్ రూపొందించారు. మలిదశలో మునగ సాగుతో పాటు రెండు ఎకరాల పొలంలో మునగ, వెదురు సాగుతో పాటు చేపలు, తేరో టీగల పెంపకంపై దృష్టి పెట్టనున్నారు. -
మునగాకును రోజూ ఇలా తింటే అద్భుతాలు : ఒక్కసారి తింటే!
మునగాకులో ఏ, బీ, సీ విటమిన్లుంటాయి. క్యాల్షియం, పొటాషియం, ఐరన్... మెగ్నీషియం, ఫాస్ఫరస్ కూడా ఉంటాయి. తరచూ తింటే చాలా మంచిది. రోజూ కూరల్లో వేసుకుంటే ఇంకా మంచిది. నొప్పిని నయం చేయడంలో,కండరాలను బలోపేతం చేయడంలో మునగాకు అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు ఇది చర్మానికి జుట్టు సంరక్షణలో బాగా పనిచేస్తుంది. మునగాకు – పెసరపప్పుకావలసినవి: మునగాకు – 4 కప్పులు; పెసరపప్పు– కప్పు; ఎండు మిర్చి – 1;ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు; వెల్లుల్లి రేకలు– 5;ఆవాలు – టీ స్పూన్; ఇంగువ –పావు టీ స్పూన్; పసుపు – అర టీ స్పూన్;మిరపపొడి– అర టీ స్పూన్; ఉప్పు – పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి;పచ్చి కొబ్బరి తురుము– పావు కప్పు; నూనె – 2 టేబుల్ స్పూన్లు;తయారీ: మునగాకులో ఈనెలు లేకుండా ఏరి వేసి ఆకును మంచి నీటితో శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. పెసరపప్పును కూడా కడిగి సిద్ధంగా ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రేకలు, ఇంగువ వేసి వేగిన తర్వాత పెసర పప్పు వేయాలి. ఇప్పుడు మునగాకు, పసుపు, మిరపపొడి వేసి కలిపి నీరు పోసి మూత పెట్టాలి. ఉడకడం మొదలైన తర్వాత మూత తీసి మరోసారి కలిపి మంట తగ్గించి ఉడికించాలి. నీరు తగ్గి పోయిన తర్వాత కొబ్బరి పొడి, ఉప్పు కలిపి మూత పెట్టి స్టవ్ ఆపేయాలి. ఇది అన్నం, రోటీల్లోకి బాగుంటుంది. మొరింగా టీమునగాకులో ఈనెలు, చిల్లు పడిన ఆకులు, పండిపోయిన ఆకులను ఏరివేసి శుభ్రంగా కడిగి చిల్లుల ΄ పాత్రలో వేసి నీరు పోయే వరకు ఉంచాలి. తర్వాత ఆకును ఒక పేపర్ మీద కానీ నూలు వస్త్రం మీద కాని వేసి తేమ పూర్తిగా ఆరి పోయే వరకు ఉంచాలి. మునగాకును ఎండ బెట్టకూడదు, నీడలోనే ఆరబెట్టాలి. వాతావరణాన్ని బట్టి ఒకటి లేదా రెండు రోజుల్లో ఆరి పోతాయి.ఆకులను చేత్తో కదిలించినప్పుడు తేమలేకుండా గలగలలాడాలి. ఆకులను మిక్సీ జార్లో మెత్తగా పొడి చేయాలి. పొడిని జల్లించి తేమ లేని సీసాలో నిల్వ చేసుకోవాలి. టీ తయారీ: పావు లీటరు నీటిని మరిగించి అందులో టీ స్పూన్ మొరింగా ΄పౌడర్ వేసి మూత పెట్టాలి. ఓ నిమిషం తర్వాత గ్లాసులో పోసుకుని తాగాలి. రోజూ ఉదయం ఈ మొరింగా టీ తాగితే అధిక బరువు తగ్గుతుంది.గమనిక: ఇలా తయారు చేసుకున్న ΄ పొడి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది. కూరల్లో, పప్పులోకి తాజా మునగాకు దొరకని రోజుల్లో ఈ పొడిని వేసుకోవచ్చు. -
అంగన్వాడీల్లో ‘మునగ’ మెనూ
సాక్షి, అమరావతి: పోషక విలువలు అత్యధికంగా ఉండే మునగను ఆహారంలో తీసుకోవడం ద్వారా చేకూరే లాభాలను వివరిస్తూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. ప్రతి అంగన్వాడీ కేంద్రం ఆవరణలో, ఇళ్ల వద్ద మునగ చెట్ల పెంపకం చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. మునగ చెట్లను పెంచి వాటి నుంచి సేకరించిన ఆకును వారంలో రెండు రోజులపాటు అంగన్వాడీ మెనూలో చేర్చారు. మునగ ఆకు పప్పు, మునగాకు కూర ఇలా ఏదో ఒక రూపంలో అందిస్తుండటంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు విలువైన పౌష్టికాహారం అందుతోంది. మునగాకుతో మేలు ఇలా.. మునగ ఆకు ద్వారా లభించే ఐరన్ గర్భిణులు, బాలింతల్లో రక్త హీనత నివారించేందుకు దోహదం చేస్తుంది. మునగ ఆకులో ఉండే విటమిన్ ఏ కారణంగా కంటిచూపు మెరుగు పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉండే మునగ ఆకు గర్భిణుల్లో పిండం ఆరోగ్యంగా ఎదిగేందుకు దోహదం చేయడంతోపాటు సుఖ ప్రసవం జరిగేలా ఉపకరిస్తుంది. బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. మునగ ఆకును ఆహారంలో తీసుకోవడం వల్ల మంచి కొవ్వు పెరుగుతుంది. థైరాయిడ్ లాంటి అనేక సమస్యలు దరి చేరకుండా చేస్తుంది. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా.. రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందచేస్తోంది. గర్భిణులు, బాలింతలు, మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు కలిపి దాదాపు 36 లక్షల మందికి అంగన్వాడీల ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు రోజూ తల్లులకు 200 మిల్లీ లీటర్లు, పిల్లలకు 100 మిల్లీ లీటర్ల చొప్పున పాలు అందిస్తున్నారు. మునగ పొడితో మొదటి ముద్ద అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారాన్ని అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ఆదేశాల మేరకు ప్రయోగాత్మకంగా 1,475 అంగన్వాడీల్లో మునగ చెట్ల పెంపకం చేపట్టాం. వారంలో రెండు రోజులపాటు మునగ ఆకుతో చేసిన కూర, పప్పు అందిస్తున్నాం. గర్భిణులు, బాలింతలు ప్రతి రోజూ ఆహారంలో మొదటి ముద్ద మునగ ఆకు పొడితో తీసుకునేలా ప్రోత్సహిస్తున్నాం. –ఉమాదేవి, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్, ఎన్టీఆర్ జిల్లా. -
పోషకాల్లో మునగండి
సాక్షి, అమరావతి: క్యాన్సర్ నివారణతో పాటు అత్యధిక పోషకాలుండే మునగ చెట్లను ఉపాధి హామీ పథకం కూలీల ఇళ్లు, పొలాల్లో సాగు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందజేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల మంది ఉపాధి హామీ కూలీలకు ఐదేసి మొక్కల చొప్పున పంపిణీకి గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 2 వేల ఎకరాలలో కూలీలు మునగ పంటను సాగు చేసుకోవడానికి ఆర్థిక సహాయం అందజేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. మునగ చెట్లు, ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలను మొక్కల పంపిణీ సమయంలోనే కూలీలకు అవగాహన కల్పిస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, కూలీలకు పంపిణీ చేసే మునగ మొక్కలను గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోనే ఉపాధి నిధులతో ఏర్పాటు చేసిన నర్సరీలలో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 177 నర్సరీలలో ఇప్పటికే మునగ మొక్కల పెంపకం చేపట్టగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 250 నర్సరీలలో మునగ మొక్కల్ని ఉత్పత్తి చేయనున్నారు. కూలీలు తమకు ఉండే కొద్దిపాటి వ్యవసాయ భూముల్లో మునగ పంట సాగు చేసుకోవడానికి ముందుకొస్తే రెండేళ్లలో ఎకరానికి రూ.85 వేల వరకు చెల్లిస్తారు. -
Recipes: ఇడ్లీ, దోశలోకి.. మొరింగా చట్నీ, వాల్నట్ చట్నీ! తయారీ ఇలా!
Healthy And Quick Chutney Recipes For Idli And Dosa: అదే ఇడ్లీ... అదే దోశ.. కనీసం చట్నీలైనా మారుద్దాం. నోటికి రుచికరమైన చట్నీ లేకపోతే బ్రేక్‌ఫాస్ట్ కూడా బోర్ కొడుతుంది. ఇడ్లీ, దోశలతోపాటు రోజూ తినే పల్లీ, కొబ్బరి, పుట్నాలు, టొమాటో పచ్చడి కాకుండా కాస్త విభిన్నంగా, హెల్దీగా ఉండే వివిధ రకాల చట్నీలు ఎలా చేసుకోవాలో చూద్దాం... మొరింగా చట్నీ కావలసినవి: ►నూనె – టీస్పూను ►మునగ ఆకులు – అరకప్పు ►పచ్చిమిర్చి – మూడు ►పచ్చికొబ్బరి తురుము – అరకప్పు ►అల్లం తురుము – టీస్పూను ►నిమ్మరసం – టీస్పూను ►ఉప్పు – రుచికి సరిపడా. ►తాలింపు కోసం: నూనె – టీస్పూను, ఆవాలు – అరటీస్పూను, జీలకర్ర – పావు టీస్పూను, కరివేపాకు – రెండు రెమ్మలు. తయారీ: ►బాణలిలో నూనె వేసి వేడెక్కనివ్వాలి. ►కాగిన నూనెలో పచ్చిమిర్చి, మునగ ఆకులు వేసి దోరగా వేయించాలి ►ఇప్పుడు మిక్సీజార్‌లో కొబ్బరి తురుము, వేయించిన మునగ ఆకులు, పచ్చిమిర్చి, నిమ్మరసం, అల్లం, రుచికి సరిపడా ఉప్పు, అరప్పు నీళ్లుపోసి మెత్తగా రుబ్బుకుని గిన్నెలో వేసుకోవాలి ►తాలింపు వేసుకుని ఈ మిశ్రమాన్ని చట్నీలో కలిపితే రుచికరమైన మొరింగా చట్నీ రెడీ. దోశ, చపాతీల్లోకి ఇది మంచి సైడ్ డిష్. ►చట్నీలో నిమ్మరసానికి బదులు చింతపండు లేదా పెరుగు కూడా వేసుకోవచ్చు. వాల్నట్ చట్నీ కావలసినవి: ►పచ్చికొబ్బరి తురుము – అరకప్పు ►వాల్నట్స్ – పావు కప్పు ►పచ్చిమిర్చి – మూడు ►అల్లం – అరంగుళం ముక్క ►చింతపండు – గోలీకాయంత ►కరివేపాకు – రెండు రెమ్మలు ►కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను ►ఉప్పు– రుచికి సరిపడా. తాలింపు దినుసులు: నూనె – టీస్పూను, ఆవాలు – పావు టీస్పూను, మినపగుళ్లు –పావు టీస్పూను, ఇంగువ – చిటికెడు. తయారీ: ►కొబ్బరి తురుము, వాల్నట్స్, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర తరుగు, కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు వేసి, అవసరాన్ని బట్టి కొద్దిగా వేడి నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ►ఇప్పుడు తాలింపు దినుసులతో తాలింపు వేసి రుబ్బిన పచ్చడిలో కలిపితే వాల్నట్ చట్నీ రెడీ. ►ఇడ్లీ, దోశ, ఉప్మా, పన్యారంలలో ఈ చట్నీ చాలా బావుంటుంది. ఇవి కూడా ట్రై చేయండి: Recipe: ముల్లంగి తురుము, రాగి పిండి, గోధుమ పిండితో ముల్లంగి నాచిన్ రోటీ! Recipe: బనానా– కాఫీ కేక్ ఇలా తయారు చేసుకోండి! -
మునగాకు సాగు ఇలా..
పోషకాహార లోపాలకు మునగాకు సరైన మందు. కొన్ని ప్రాంతాల్లో మునగాకు ఉత్పత్తులను రోజు వారీ ఆహారంలో భాగంగా చేసుకున్నారు. ఇటీవల కాలంలో నగరాల్లోనూ పోషకాహార లోపం నివారణకు వివిధ పద్ధతుల్లో మునగ ఆకు ఉత్పత్తుల వాడకం పెరిగింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మునగ ఆకును సాగు చేయటం ఎలా? ఇంటి పెరటిలోనో లేదా పొలంలోనో కొద్దిపాటి స్థలంలో మునగ ఆకు తోట పెంపకాన్ని చేపడితే ఏడాదంతా తాజా మునగాకును పొందవచ్చు. ఉన్న కొద్దిపాటి స్థలంలోనే మంచి పంట వస్తుంది. సామాజిక స్థలాలు, తోటలు, పాఠశాల ఆవరణల్లోనూ ఈ విధానంలో మునగతోటలను సాగు చేసుకుంటే మంచి ఆరోగ్యకరమైన ఆహారం మన సొంతమవుతుంది. ఎండిన కాడల నుంచి ఆకును సేకరించాలి. తాజా ఆకును వాడుకోవచ్చు. లేదా నీడలో ఆరబెట్టిన ఆకుతో పౌడర్ తయారు చేసుకోవచ్చు. కత్తిరించిన తరువాత మునగ మొక్కలు మళ్లీ చిగురిస్తాయి. మరో 50 రోజుల్లో కోతకొస్తాయి. మునగ తోట ఏళ్ల తరబడి ఆకును ఇస్తూ ఉంటుంది. అదెలాగో చదవండి మరి.. ముందుగా 13 చదరపు అడుగుల స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. అక్కడ 2 అడుగులు లోతు మట్టి తవ్వాలి తవ్విన మట్టికి సమాన నిష్పత్తిలో కోళ్ల ఎరువు లేదా వానపాముల ఎరువును కలుపుకోవాలి తవ్విన గుంతను లేదా మడిని మట్టి, ఎరువుల మిశ్రమంతో నింపాలి. మడిని నీటితో తడుపుతుండాలి. ఆరు వారాల్లో మంచి ఎరువు తయారవుతుంది చెక్కముక్కలను ఉపయోగించి మడిని నాలుగు సమాన భాగాలుగా విభజించుకోవాలి తర్వాత మునగ విత్తనాలు నాటుకోవాలి విత్తనాలు విత్తిన తర్వాత గడ్డిని పరచి ఆచ్ఛాదన కల్పించి, నీటి తడులివ్వాలి పెంపుడు జంతువులు, పశువుల నుంచి మడికి రక్షణ కల్పించాలి మడిలో నెల రోజుల్లో ఏపుగా, వత్తుగా పెరిగిన మునగ మొక్కలు 5 వారాల్లో మునగ మొక్కలు ఇలా కనువిందు చేస్తాయి 6 వారాల వయసున్న మునగ మొక్కలు భూమి మట్టం నుంచి అడుగున్నర ఎత్తులో కత్తిరించాలి కొమ్మలను నీడలో ఆరబెట్టాలి 50–60 రోజులకల్లా మళ్లీ మునగ తోట కోతకు సిద్ధంగా ఉంటుంది మూడోసారి కోతకు సిద్ధంగా ఉన్న మునగ మొక్కలు మూడో కోతలో దాదాపు 90 కిలోల తాజా రెమ్మల దిగుబడి వస్తుంది -
1న డ్రయ్యర్ల తయారీపై శిక్షణ
ఉల్లిపాయలు, అల్లంలో తేమను తగ్గించుకొని దీర్ఘకాలం నిల్వ ఉంచుకునేందుకు, అధిక ధరకు విక్రయించుకోవడానికి రైతులకు డ్రయ్యర్లు ఉపకరిస్తాయి. కరివేపాకు, మునగాకులను కూడా డ్రయ్యర్ల ద్వారా ఎండబెట్టుకొని పొడులుగా మార్చవచ్చు. ఇందుకు ఉపకరించే డ్రయ్యర్లను రైతులు తమకు తామే తయారు చేసుకోవడంపై గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలో నవంబర్ 1న ఎల్. శ్రీనివాసరావు శిక్షణ ఇవ్వనున్నారు. వివరాలకు.. 99123 47711 -
20–22 తేదీల్లో మహారాష్ట్రలో పాలేకర్ క్షేత్ర సందర్శన
మహారాష్ట్రలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగువుతున్న ఉత్తమ పత్తి, పసుపు, మునగ, మిరప, పూలు, బత్తాయి తోటల సందర్శన కార్యక్రమం ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు జరగనుంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్ స్వయంగా హిందీ/ఇంగ్లిష్‌ల ఈ క్షేత్రాల ఉత్పాదకత గురించి రైతులకు వివరిస్తారు. నాగపూర్ నుంచి 20న ఉ. 8.30 గంటలకు ప్రారంభవమయ్యే యాత్ర వివిధ జిల్లాల్లో 3 రోజులు కొనసాగుతుంది. పాల్గొనదలచిన వారు భోజన, వసతి, రవాణా ఖర్చుల నిమిత్తం రూ. 1,200 చెల్లించాల్సి ఉంటుంది. వివరాలకు.. మనోజ్ జానియల్– 98225 15913, సచిన్ జడె–88050 09737 -
గుడ్‌ఫుడ్
మునగకాడల గురించి మనకు బాగానే తెలుసు. అయితే మునగ ఆకులు, చెట్టు బెరడు, వేర్లు కూడా ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడతాయో తెలుసా? లేత మునగ చిగుళ్లను రుబ్బి రసం తీసి, రోజూ పరగడుపున చిన్న గ్లాసుడు తాగితే బరువు తగ్గుతారు. ►మునగ చెట్టు బెరడు నుంచి తీసిన జిగురును ఆవుపాలతో కలిపి నుదుటి మీద పట్టీలా వేస్తే తలనొప్పి మాయమవుతుంది. మునగచెట్టు వేరును దంచి, రసం తీసి, తేనెలో కలిపి తాగితే వాతపు నొప్పులు తగ్గుతాయి. ►లేత మునగాకును తరచుగా తింటే ఒంటికి పట్టిన నీరు తీసేస్తుంది. మునగాకును వేయించి తినిపిస్తే, పిల్లలు పక్క తడపడం మానేస్తారు. మునగాకును, కాడలను మెండుగా తీసుకుంటే బాలింతలకు పాలు బాగా పడతాయి. ఆకును ఎండబెట్టి, పొడి చేసి పరగడుపునే ఓ చెంచాడు తింటే.. కడుపులో ఉన్న అల్సర్లు మానిపోతాయి. నిమ్మ ►నిమ్మ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఖనిజ లవణాలు శరీరంలోని మలినాలను పారద్రోలతాయి. ► ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం తాగితే, అజీర్తి సమస్య తొలగిపోతుంది. ►ఎక్కిళ్లు ఆగకుండా వస్తుంటే... రెండు చెంచాల నిమ్మరసంలో, రెండు చెంచాల తేనె కలుపుకుని తాగితే వెంటనే ఆగిపోతాయి. ►నిమ్మరసానికి కాసింత తేనె, వాము పొడి, సున్నపుతేట కలిపిన నీటినిమూడు పూటలా తాగితే... కడుపులోని నులి పురుగులు చచ్చిపోతాయి. లవంగాల పొడిలో నిమ్మరసం కలిసి పేస్టులా చేసి పూస్తే చిగుళ్ల నొప్పి మాయమవుతుంది. పంటి నొప్పికి కూడా ఇది మంచి మందు. -
మునగ పెరిగితే ఎడారి తోక ముడుచును!
ట్యునీసియా.. ఉత్తర ఆఫ్రికాలోని ఎడారి దేశం. ఇటు సహారా ఎడారి, అటు మెడిటెర్రేనియన్ సముద్రానికి సరిహద్దుల్లో ఉంటుంది. తీవ్రమైన కరువు కాటకాలు, అధిక నీటి దాహం కలిగిన ఆలివ్, బాదం వంటి పంటలను రసాయనిక పద్ధతుల్లో సాగు చేయటం వల్ల మిగిలిన కాస్త పంట భూమి కూడా ఎడారిగా మారిపోతున్న దుస్థితి. ఇటువంటి గడ్డుకాలంలో ఖండాంతరాల నుంచి ఆశాకిరణంలా వచ్చిన ఒక చెట్టు ట్యునీసియాను తిరిగి పైరు పచ్చగా మార్చేస్తోంది. ఆశ్చర్యమేమిటంటే ఆ కల్పవృక్షం మన.. మునగ చెట్టే! ట్యునీసియా కరువు కోరల్లో ఉంది. ఎడారీకరణ అంచున వేలాడుతోంది. గత కొన్నేళ్లుగా వదలని వరుస కరువులు దేశాన్ని మరింత పేదరికంలోకి నెట్టాయి. ఉన్న కాస్త మంచినీటి వనరులలో 76 శాతాన్ని సాంద్ర రసాయనిక వ్యవసాయమే పీల్చేస్తోంది. వ్యవసాయంలో మౌలిక మార్పు తెస్తే తప్ప కరువు తీరదని సారా టౌమి అనే యువతి గుర్తించింది. సారా.. పారిస్‌లో సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలి తన తండ్రి పుట్టిన దేశమైన ట్యునీసియాకు ఆరేళ్ల క్రితం తిరిగి వచ్చేసింది. ఇసుకను పంట భూముల్లోకి ఎత్తిపోసే గాలులను అడ్డుకోవడానికి మునగ చెట్లతో రక్షక వనాలను విరివిగా నాటాలని సారా ట్యునీసియా ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం తిరస్కరించినా నిరాశ చెందలేదు. తనే రైతులతో కలసి సహకార సంఘాలను ఏర్పాటు చేసి గత ఆరేళ్లుగా బహుళ ప్రయోజనకారి అయిన మునగ సాగుపై దృష్టి పెట్టారు. ‘అకాసియ ఫర్ ఆల్’ పేరిట సంస్థను నెలకొల్పి, మునగ నర్సరీని ప్రారంభించి రసాయన రహిత వ్యవసాయాన్ని వ్యాప్తిలోకి తేవడంలో సఫలీకృతమవుతున్నారు. మునగ ఆకుల పొడిని తయారు చేసి రైతుల సహకార సంఘాల ద్వారా విక్రయించడం ద్వారా అధిక నికరాదాయాన్ని పొందే మార్గాన్ని చూపారు. ఇప్పటికి 50 వేల మునగ మొక్కలు నాటారు. వచ్చే ఏడాది నాటికి 10 లక్షల మునగ మొక్కలు నాటాలన్నది ఆమె లక్ష్యం. మునగ మహాత్మ్యం.. ► మునగ చెట్లు పెరగడానికి నీరు పెద్దగా అక్కర్లేదు. రసాయనిక ఎరువులూ అవసరం లేదు. ఉప్పు నీరుతో కూడా పెరుగుతుంది. సాధారణ పంటలు లీటరు నీటిలో 3 గ్రాములకు మించిన ఉప్పదనం ఉంటే భరించలేవు. మునగ 8 గ్రాముల ఉప్పున్నా తట్టుకుంటుంది. ► మునగ చెట్టు వేర్లు 100 మీటర్ల వరకూ భూమి లోపలికి వెళ్లి నీటి తేమను తీసుకోగలవు. వేగంగా పెరుగుతుంది. ∙వాతావరణంలో నుంచి నత్రజనిని గ్రహించి భూమిని సారవంతం చేస్తుంది. కొమ్మలు నరికి నేలపై ఆచ్ఛాదనగా వేసి భూసారాన్ని పెంచుకోవడానికి అనువైనది మునగ. ► ఎటువంటి నేలల్లోనైనా సునాయాసంగా పెరగడంతోపాటు మానవాళి పౌష్టికాహార లోపాన్ని జయించడానికి దోహదపడే సూపర్ ఫుడ్ మునగ. గుప్పెడు తాజా మునగ ఆకుల్లో 4 కారెట్లలోకన్నా ఎక్కువగా విటమిన్ ఏ, ఏడు నారింజ పండ్లలో కన్నా ఎక్కువ విటమిన్ సీ ఉంది. ► మునగ విత్తనాల నూనె వంటల్లో వాడుకోవచ్చు. నూనె తీసిన చెక్కను తాగునీటిని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. మునగ గింజల పొడి మంచి సహజ ఎరువుగా ఉపయోగపడుతుంది. ► తొలి సేంద్రియ వ్యవసాయ దేశమైన క్యూబా నేత ఫిడెల్ క్యాస్ట్రోకు మునగ అంటే అమిత ప్రేమ. ‘అన్ని రకాల అమినో యాసిడ్లు కలిగి ఉన్న ఏకైక చెట్టు మునగ. శ్రద్ధగా పెంచితే హెక్టారుకు ఏడాదిలో 300 టన్నులకు పైగా పచ్చి ఆకు దిగుబడి ఇవ్వగలదు. ఇందులో డజన్ల కొద్దీ ఔషధ గుణాలు ఉన్నాయి’ అని క్యాస్ట్రో చెప్పారు. – సాగుబడి డెస్క్ -
వాణిజ్యపంటగా మునగ సాగు
అనంతపురం అగ్రికల్చర్ : సమగ్ర యాజమాన్య పద్ధతులతో మునగను వాణిజ్య పంటగా మార్చుకోవచ్చునని ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రం ప్రిన్సిపల్ ఎస్.చంద్రశేఖర్‌గుప్తా తెలిపారు. మునగ ఆకులు, కాయల్లో విటమిన్ ఏ,బీ,సీ, మెగ్నిషియం, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇటు ఆహారానికి, అటు ఆరోగ్యానికి ఇవి ప్రయోజకరం. అనువైన నేలలు–విత్తనాలు.. జిల్లాలో ఉన్న పొడి వాతావరణం పంట సాగుకు అనుకూలం. కానీ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఉంటే పూత రాలిపోయే అవకాశం ఎక్కువ. 35 నుంచి 40 డిగ్రీలలోపు వాతావరణం అనువుగా ఉంటుంది. అన్నిరకాల నేలల్లో పండించవచ్చు. మునగలో ఏకవార్షిక, బహువార్షిక రకాలు అందుబాటులో ఉన్నాయి. జాఫ్నా అనేది బహువార్షిక రకం.. మెత్తని గుజ్జుతో కాయలు రుచికరంగా ఉంటాయి. ఇంది రెండో సంవత్సరం నుంచి కాపుకు వస్తుంది. మొదటి రెండు సంవత్సరాలు కాయలు కొంచెం తక్కువగా వచ్చినా ఆ తర్వాత ఎక్కువగా కాస్తాయి. పీఎంకే–1 రకం మొక్కలు 4 నుంచి 6 మీటర్లు ఎత్తు పెరుగుతాయి. నాటిన 100 రోజుల్లో పూతకు వస్తుంది. మొదటి కోత 160–170 రోజులకు వస్తుంది. కాయ సుమారుగా 70 సెంటిమీటర్ల పొడవుగా, 150 గ్రాముల బరువుతో ఉంటుంది. సంవత్సరానికి ఒక చెట్టుకు 200–225 కాయలు వస్తాయి. వీటితో పాటు మరికొన్ని విత్తన రకాలు అందుబాటులో ఉన్నాయి. యాజమాన్యం: మునగ విత్తనాలను నేరుగా నేలలో గానీ, పాలిథీన్ సంచుల్లోగాని విత్తుకోవచ్చు. పాలిథీన్ సంచులలో పశువుల ఎరువు, ఎర్రమట్టి, ఇసుక సింగిల్ సూపర్ ఫాస్పేట్ కలిపిన మిశ్రమంతో నింపాలి. మురుగు నీటి సౌకర్యం కలిగించటానికి పాలిథీన్ సంచుల అడుగున రెండు రంధ్రాలు చేయాలి. కార్బండిజమ్‌తో విత్తనశుద్ధి చేసి ఒక్కో సంచికి ఒక విత్తనం పెట్టాలి. విత్తనం 6–10 రోజులకు మొలకెత్తుతుంది. 15–20 సెం.మీ ఎత్తు పెరిగిన తర్వాత 30–35 రోజులకు మొక్కలను ప్రధాన పొలంలో నాటాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 8–10 టన్నుల పశువుల ఎరువును వేసి కలియదున్నాలి లేదా గుంతలను తీసి, గుంతకు 10 కిలోల పశువుల ఎరువుతో పాటు, 250 గ్రాములు వేపపిండి, 250 గ్రాములు సూపర్ ఫాస్ఫేటు వేయాలి. నాటిన వెంటనే నీరు కట్టాలి. పూత, పిందె సమయంలో ఐదారు రోజులకోసారి నీరు ఇవ్వాలి. లేదంటే పూత రాలిపోతుంది. మిగతా సమయంలో వాతావరణాన్ని బట్టి నేల స్వభావాన్ని బట్టి 15 నుంచి రోజులకో తడి ఇవ్వాలి. మొక్కల మధ్య కలుపు లేకుండా చూసుకోవాలి. మొక్కలు 75–100 సెంటీమీటర్లు ఎత్తు పెరిగిన తర్వాత చివర్లు తుంచివేయాలి. ఈ విధంగా పక్క కొమ్మలు వచ్చి కాపు ఎక్కువగా వస్తుంది. పక్క కొమ్మలు కూడా కొంత పెరిగిన తర్వాత చివర్లు తుంచితే మొక్కలు గుబురుగా పెరిగి ఎక్కువ పూత, కాయ వస్తుంది. అంతర పంటగా కూడా వేసుకోవచ్చు.