
ఉల్లిపాయలు, అల్లంలో తేమను తగ్గించుకొని దీర్ఘకాలం నిల్వ ఉంచుకునేందుకు, అధిక ధరకు విక్రయించుకోవడానికి రైతులకు డ్రయ్యర్లు ఉపకరిస్తాయి. కరివేపాకు, మునగాకులను కూడా డ్రయ్యర్ల ద్వారా ఎండబెట్టుకొని పొడులుగా మార్చవచ్చు. ఇందుకు ఉపకరించే డ్రయ్యర్లను రైతులు తమకు తామే తయారు చేసుకోవడంపై గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలో నవంబర్ 1న ఎల్. శ్రీనివాసరావు శిక్షణ ఇవ్వనున్నారు.
వివరాలకు.. 99123 47711