7న ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మామిడి సాగుపై శిక్షణ | Nature Agriculture Training | Sakshi
Sakshi News home page

7న ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మామిడి సాగుపై శిక్షణ

Published Tue, Dec 3 2019 6:50 AM | Last Updated on Tue, Dec 3 2019 6:50 AM

Nature Agriculture Training - Sakshi

మామిడి సాగులో వివిధ దశల్లో ప్రకృతి వ్యవసాయదారులు పాటించాల్సిన మెలకువలపై గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 7(శనివారం)న ఉ. 9 గం. నుంచి సా. 4 గం. వరకు కృష్ణాజిల్లా నూజివీడులోని ఛత్రపతి సదన్‌లో సదస్సు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. రాజేష్‌ – 91779 88422

9న నాచుగుంట గోశాలలో ప్రకృతి వ్యవసాయ శిక్షణ
ప.గో. జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంటలోని గోపాలకృష్ణ గోశాలలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ఈ నెల 9 (సోమవారం) ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు రైతులకు శిక్షణ ఇస్తారు. కొత్త పద్ధతులను అవలంబించే రైతులు అనుభవాలను పంచుకుంటారు. అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. జగదీష్‌ – 78934 56163.

8న ‘చిరు’తిళ్ల తయారీపై ఉచిత శిక్షణ
గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్‌ శిక్షణా కేంద్రంలో ఈ నెల 8(ఆదివారం) ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు జొన్నలు, అరికలు, కొర్రలతో మురుకులు/జంతికలు, బూందీ, నువ్వు లడ్డూలు, వేరుశనగ చిక్కీ తదితర చిరుతిళ్ల తయారీపై ఉచిత శిక్షణ ఇస్తారు. ముందుగా పేర్ల నమోదుకు 97053 83666, 0863 – 2286255.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement