Training for Farmers
-
ఆర్బీకేలకు నూతన సాంకేతిక సొబగులు
సాక్షి, అమరావతి/కంకిపాడు/ఉయ్యూరు: సుస్థిర వ్యవసాయ–ఆహార వ్యవస్థలను ఏర్పర్చుకోవడంతోపాటు రాష్ట్రంలోని రైతుల్లో సాంకేతిక సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో చేపట్టనున్న టెక్నికల్ కోఆపరేషన్ ప్రాజెక్టు (టీసీపీ) కోసం ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టులో భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) భాగస్వామిగా వ్యవహరించనుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక ఎంఓయూ కార్యక్రమంలో ఎఫ్ఏఓ కంట్రీ హెడ్ టోమియో షిచిరీ, ఐసీఏఆర్ డెప్యుటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అశోక్‌కుమార్ సింగ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్యలు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు కింద వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకే)ను మరింత బలోపేతం చేయడానికి రానున్న రెండేళ్లపాటు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహకారాన్ని అందించనున్నారు. అంతర్జాతీయంగా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వచ్చే నూతన సాంకేతిక పరిజ్ఞానంపై రైతులు, ఆర్బీకే సిబ్బంది, అధికారులు..శాస్త్రవేత్తలకు శిక్షణనివ్వనున్నారు. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు : సీఎం జగన్ గడిచిన రెండున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు, చర్యలతో వ్యవసాయ రంగంలో పెనుమార్పులు వస్తున్నాయని సీఎం వైఎస్ జగన్ అన్నారు. గతంలో నకిలీ విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల వాడకంతో రైతులు తీవ్రంగా నష్టపోయే వారన్నారు. నాణ్యమైన.. ధృవీకరించిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు సరఫరా చేసేందుకు నియోజకవర్గ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్స్ తీసుకొచ్చామన్నారు. ప్రతీ పంటకు, ప్రతీ రైతుకు మద్దతు ధర లభించేలా కృషిచేస్తున్నామని.. పగడ్బందీగా అమలుచేస్తున్న ఈ–క్రాపింగ్ ద్వారా వాస్తవ సాగుదారులకు మేలు జరుగుతుందన్నారు. మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారని కొనియాడారు. ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలకు అంతర్జాతీయ ప్రశంసలు దక్కడం ఆనందంగా ఉందన్నారు. త్వరలో సేంద్రీయ పాలసీనీ తీసుకొస్తున్నామని తెలిపారు. ఆర్బీకే, ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, ఆర్బీకే స్టూడియో సందర్శన అంతకుముందు.. కృష్ణాజిల్లా గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, ఆర్బీకే స్టూడియో, పెనమలూరు మండలం వణుకూరు ఆర్బీకే కేంద్రాన్ని ఎఫ్‌పీఓ కంట్రీ హెడ్ టోమియో షిచిరీ తమ బృందంతో సందర్శించారు. ఆర్బీకేలోని డిజిటల్ లైబ్రరీ, సీడ్ టెస్టింగ్ కిట్, కియోస్క్ తదితర సౌకర్యాలను పరిశీలించారు. ఆర్బీకేల ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాలకు అందిస్తున్న సేవలను ఆరా తీశారు. ధాన్యం సేకరిస్తున్న విధానాన్ని పరిశీలించి ఉయ్యూరు మండలం బోళ్లపాడులో రైతులతో ముచ్చటించారు. బ్యాంకింగ్ కరస్పాండెంట్లతో మాట్లాడి ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆర్బీకేల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలు చాలా బాగున్నాయంటూ వారంతా కితాబిచ్చారు. అనంతరం నగరంలోని ఓ హోట్ల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో ఆర్బీకే సేవలను వ్యవసాయ, ఉద్యాన, మత్స్య శాఖ కమిషనర్లు హెచ్ అరుణ్‌కుమార్, డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్, కే. కన్నబాబు, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, పశు సంవర్థక శాఖ డైరెక్టర్ ఆర్ అమరేంద్రకుమార్లు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఎఫ్‌పీఓ–ఐసీఏఆర్ బృందానికి వివరించారు. శాఖల వారీగా అందిస్తున్న సేవలపై ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ను వారంతా తిలకించారు. ఆర్బీకేలు ప్రపంచానికే రోల్‌మోడల్ ఆర్బీకే లాంటి వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదని ఎఫ్‌పీఓ కంట్రీ హెడ్ టోమియో షిచిరీ అన్నారు. గ్రామ పంచాయతీ స్థాయిలో రైతులకు సేవలందించేందుకు ఏర్పాటుచేసిన ఆర్బీకే వ్యవస్థను విప్లవాత్మక మార్పులకు రోల్‌మోడల్‌గా నిలుస్తుందన్నారు. రైతులకు నాణ్యమైన ఇన్పుట్స్ సరఫరా చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఇంటిగ్రేటేడెట్ అగ్రి ల్యాబ్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, ఆర్బీకే స్టూడియోల ఏర్పాటు వినూత్న ఆలోచన అన్నారు. వీటి ద్వారా రైతులకు మరింత చేరువయ్యేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయన్నారు. ఆర్బీకేల బలోపేతానికి ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిన ఆర్బీకే వ్యవస్థను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలుచేసేలా సిఫార్సు చేస్తామని ఐసీఎఆర్ డెప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఏకే సింగ్ అన్నారు. ఆర్బీకేలతో పాటు ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, ఆర్బీకే స్టూడియోలను ప్రపంచంలో ఎక్కడా చూడలేదన్నారు. జాతీయ స్థాయిలో అమలుచేయాల్సిన కార్యక్రమాలెన్నో ఇక్కడ అమలుచేస్తున్నారని చెప్పారు. బృందం వెంట ఎఫ్ఏఓ ప్రతినిధి డాక్టర్ సి కొండారెడ్డి, సీనియర్ ఫుడ్ సేప్టీ అండ్ న్యూట్రిషన్ ఆఫీసర్ ధర్మపురి శ్రీధర్, జాతీయ వ్యవసాయ ధ్రువీకరణ నిపుణుడు నచికేత్ ఉడుప, ఐïసీఏఆర్ డైరెక్టర్ డాక్టర్ జేవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
22న కాకినాడలో ప్రకృతి వ్యవసాయ శిక్షణ
ప్రకృతి వ్యవసాయంపై లోతైన అవగాహన కలిగించే లక్ష్యంతో సొసైటీ ఫర్ అవేర్నెస్ అండ్ విజన్ ఆన్ ఎన్విరాన్మెంట్(సేవ్) స్వచ్ఛంద సంస్థ ఈ నెల 22 (ఆదివారం)న కాకినాడలో రైతులకు శిక్షణ ఇవ్వనుంది. ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటి? పెట్టుబడి, ఖర్చులు తగ్గించుకునే మార్గాలు, రైతులు పంట దిగుబడులను మొత్తం నేరుగా అమ్ముకోకుండా కొంత మొత్తాన్ని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి అమ్ముకోవడం, అధికాదాయం కోసం ప్రయత్నాలు, దేశీ విత్తనాల ఆవశ్యకత, దేశీ ఆవు విశిష్టత తదితర అంశాలపై సేవ్ సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్ శిక్షణ ఇస్తారు. ఆసక్తి గల రైతులు ముందుగా తమ పేర్లను ఫోన్ చేసి నమోదు చేసుకోవాలి. 86889 98047 94495 96039. వేదిక: చల్లా ఫంక్షన్ హాల్, వినాయకుని గుడి ఎదుట, విద్యుత్ నగర్, కాకినాడ. వ్యవసాయం–ప్రపంచీకరణపై 14న సదస్సు వ్యవసాయ రంగ సమస్యలు– ప్రపంచీకరణపై పునరాలోచన అనే అంశంపై ఈ నెల 14 (శనివారం) ఉ. 9 గంటల నుంచి సికింద్రాబాద్ తార్నాకలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో సదస్సు అవేర్నెస్ ఇన్ యాక్షన్ సంస్థ ఆధ్వర్యంలో జరగనుంది. వ్యవసాయ వాణిజ్యంలో ప్రపంచీకరణ, సరళీకరణ విధానాల ప్రభావం, సుంకాలు, ఆహార సబ్సిడీలు తదితర అంశాలపై చర్చ జరుగుతుంది. రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు.. 72859 18294 -
7న ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మామిడి సాగుపై శిక్షణ
మామిడి సాగులో వివిధ దశల్లో ప్రకృతి వ్యవసాయదారులు పాటించాల్సిన మెలకువలపై గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 7(శనివారం)న ఉ. 9 గం. నుంచి సా. 4 గం. వరకు కృష్ణాజిల్లా నూజివీడులోని ఛత్రపతి సదన్‌లో సదస్సు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. రాజేష్ – 91779 88422 9న నాచుగుంట గోశాలలో ప్రకృతి వ్యవసాయ శిక్షణ ప.గో. జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంటలోని గోపాలకృష్ణ గోశాలలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ఈ నెల 9 (సోమవారం) ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు రైతులకు శిక్షణ ఇస్తారు. కొత్త పద్ధతులను అవలంబించే రైతులు అనుభవాలను పంచుకుంటారు. అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. జగదీష్ – 78934 56163. 8న ‘చిరు’తిళ్ల తయారీపై ఉచిత శిక్షణ గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ శిక్షణా కేంద్రంలో ఈ నెల 8(ఆదివారం) ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు జొన్నలు, అరికలు, కొర్రలతో మురుకులు/జంతికలు, బూందీ, నువ్వు లడ్డూలు, వేరుశనగ చిక్కీ తదితర చిరుతిళ్ల తయారీపై ఉచిత శిక్షణ ఇస్తారు. ముందుగా పేర్ల నమోదుకు 97053 83666, 0863 – 2286255. -
31న ప్రకృతి వ్యవసాయంపై వేకనూరులో రైతు సదస్సు
సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అతి తక్కువ విత్తనంతో, అతి తక్కువ నీటితో దేశీ వరి రకాలను కృష్ణా జిల్లా అవనిగడ్డ సమీపంలోని వేకనూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయదారుడు మాదివాడ సురేంద్ర సాగు చేస్తున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 31(ఆదివారం)న దేశీ వరి ప్రకృతి సాగుపై రైతులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. సేవ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు, దేశీ వరి వంగడాల రైతు విజయరామ్ శిక్షణ ఇస్తారు. ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు ఉచిత శిక్షణతోపాటు భోజన వసతి కల్పిస్తున్నామని సురేంద్ర (88862 31122) తెలిపారు. విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేసి తిరిగి స్వస్థలానికి చేరుకొని ప్రకృతి సేద్యం చేపట్టిన సురేంద్ర.. నారాయణ కామిని, కుళ్లాకర్, పరిమళసన్న, కాలాభట్ దేశీ వరి రకాలను ఈ ఏడాది సాగు చేశారు. -
జనవరిలో కట్టె గానుగతో నూనెల ఉత్పత్తిపై శిక్షణ
సహజ సాగు పద్ధతిలో పండించిన నూనె గింజలతో కట్టె గానుగ ద్వారా వంట నూనెలను నాణ్యతా ప్రమాణాలతో కూడిన పద్ధతుల్లో ఉత్పత్తి చేయడంపై యువతీ యువకులకు న్యూ లైఫ్ ఫౌండేషన్(హైదరాబాద్) శిక్షణ ఇవ్వనుంది. 18 ఏళ్లు నిండిన కనీసం పదో తరగతి చదివిన వారు అర్హులని, హైదరాబాద్ ఎ.ఎస్ రావు నగర్లో 2019 జనవరి 18వ తేదీ నుంచి 7 రోజుల పాటు శిక్షణ ఉంటుందని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివశంకర్ షిండే తెలిపారు. ఆసక్తిగలవారు తమ వివరాలను ఈనెల 31లోగా 81210 08002, 70133 09949 నంబర్లకు ఎస్.ఎం.ఎస్. లేదా వాట్సాప్ ద్వారా సమాచారం పంపవలసిందిగా సూచించారు. జనవరి 18–20 తేదీల్లో సేంద్రియ, చిరుధాన్యాల ప్రదర్శన సేంద్రియ వ్యవసాయోత్పత్తులు, చిరుధాన్యాలపై కర్ణాటక ప్రభుత్వ వ్యవసాయ శాఖలో సేంద్రియ విభాగం ఆధ్వర్యంలో 2019 జనవరి 18–20 తేదీల్లో బెంగళూరులో అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన జరగనుంది. పౌష్టికాహారం, సుస్తిర వ్యవసాయం, రైతు ఆదాయ భద్రత, కొత్త మార్కెట్లు, కొత్త తరం మెచ్చే మేలైన ఆహారం అనే అంశాలకు ఈ ప్రదర్శనలో ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. సేంద్రియ ఉద్యాన ఉత్పత్తులు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాల సాగులో మేలైన పద్ధతులు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ తదితర అంశాలపై చర్చాగోష్టులు కూడా ఏర్పాటవుతున్నాయి. వివరాలకు.. 26641152,53 , 90087 48074 https://organics-millets.in/ ప్రకృతి వ్యవసాయ గీత రచనల పోటీ ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి కృషి చేస్తున్న విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం కేంద్రంగా పనిచేస్తున్న జట్టు ట్రస్టు ప్రకృతి వ్యవసాయ గీతాల పోటీలను నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కవులు, రచయితలు ఈ పోటీలో పాల్గొనవచ్చని ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ డా. డి. పారినాయుడు తెలిపారు. ప్రథమ బహుమతి రూ. 10 వేలు, ద్వితీయ బహుమతి రూ. 5 వేలు, తృతీయ బహుమతి రూ. 5 వేలతోపాటు అంగీకరించిన మరో 10 రచనలకు రూ. వెయ్యి చొప్పున బహుమతులు ఇస్తారు. కవులు, రచయితలు జనవరి 2019 రెండో తేదీ లోగా 94401 64289, 94940 12244 నంబర్లకు వాట్సప్ ద్వారా గాని, jattutrust1 @gmail.comMకు ఈమెయిల్ ద్వారా గాని పంపవచ్చు. 30న హైదరాబాద్‌లో సిరిధాన్యాలపై డా. ఖాదర్ ప్రసంగం సిరిధాన్యాలు, కషాయాలు, కట్టె గానుగ నూనెలు తదితర దేశీ ఆహార పదార్థాలతో ఆధునిక రోగాల నియంత్రణ–నిర్మూలనపై ఈ నెల 30 (ఆదివారం)న సా. 4.30 గం. నుంచి రాత్రి 7 గం. వరకు కూకట్‌పల్లిలోని పి.ఎన్.ఎం. హైస్కూల్ ఆవరణ (కూకట్పల్లి బీజేపీ కార్యాలయం ఎదురు లైన్)లో కృషి రత్న, స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార–ఆరోగ్య నిపుణులు డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారని రైతునేస్తం ఫౌండేషన్ అధ్యక్షులు వై. వెంకటేశ్వరరావు తెలిపారు. వివరాలకు.. 70939 73999, 98493 12627, 96767 97777. -
23న సిరిధాన్యాల సాగుపై కొర్నెపాడులో డా. ఖాదర్ శిక్షణ
ఈ నెల 23న రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో సిరిధాన్యాల సాగుపై అటవీ కృషి పితామహులు, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి రైతులకు శిక్షణ ఇస్తారు. కొర్రలు, అరికెలు, సామలు, ఊదలు, అండుకొర్రల సాగు, అటవీ చైతన్య ద్రావణం తయారీ, మిక్సీతో సిరిధాన్యాల బియ్యం ఉత్పత్తి వంటి అంశాలపై డా. ఖాదర్ రైతు దినోత్సవం సందర్భంగా 23 (ఆదివారం) ఉ. 10గం.ల నుంచి సా.4 గం.ల వరకు శిక్షణ ఇవ్వనున్నారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు తెలిపారు. అదేవిధంగా, సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందే మార్గాలపై ఈనెల 24 (సోమవారం)న ఒంగోలులోని కాపు కళ్యాణ మండపం (పండరిపురం) లో ఉ. 10 గం.ల నుంచి మ. 1 గం.ల వరకు, అదేరోజు సా. 4 గం.ల నుంచి 7 గం.ల వరకు విజయవాడలోని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం(మొగల్రాజపురం), 25(మంగళవారం)న ఉ. 10 గం. నుంచి 12.30 గం. వరకు ఏలూరులోని అమలోద్భవి సెయింట్ మేరీస్ స్కూల్(అశోక్‌నగర్)లో డాక్టర్ ఖాదర్ వలి ఉపన్యసిస్తారు. ప్రశ్నలకు జవాబులిస్తారు. వివరాలకు.. 83675 35439, 96767 97777, 0863–2286255 22, 23 తేదీల్లో నరసాపురంలో సిరిధాన్యాలు–ప్రకృతి సేద్యంపై సదస్సులు ఆంధ్రప్రదేశ్ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, నరసాపురం లయన్స్‌క్లబ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో ప.గో. జిల్లా నరసాపురంలోని వై.ఎన్. కాలేజీ శ్రీ అరవిందో ఆడిటోరియంలో ‘మనం ఏమి తినాలి? ఏమి తింటున్నాం? మనం ఏమి పండించాలి? ఏమి పండిస్తున్నాం’ అనే అంశంపై సదస్సులు జరగనున్నాయి. 22న ఉ. 9 గం.ల నుంచి దేశీ విత్తనాల ప్రత్యేకత– కూరగాయల సాగులో 5 లేయర్ పద్ధతిపై శివప్రసాదరాజు, ఔషధ మొక్కలపై దాట్ల సుబ్బరాజు, ప్రకృతి వ్యవసాయంలో మెలకువలపై సుబ్రహ్మణ్యంరాజు ప్రసంగిస్తారు. మహిళలకు ‘మిల్లెట్స్ రాంబాబు’ చిరుధాన్యాలతో వంటలు నేర్పిస్తారు. 23న ఉ. 9 గం.లకు డా. ఖాదర్ వలి చూపిన బాటలో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందే పద్ధతులు – సిరిధాన్యాల సాగుపై ప్రముఖ ప్రకృతి వ్యవసాయదారుడు ఎం.సి.వి. ప్రసాద్ (ప్రకృతివనం), లయన్స్ క్లబ్ సేంద్రియ వ్యవసాయ విభాగం అధ్యక్షులు డాక్టర్ పి.బి. ప్రతాప్‌కుమార్ (94401 24253) ప్రసంగిస్తారు. ప్రవేశం ఉచితం. అందరూ ఆహ్వానితులే. 27–28 తేదీల్లో అటవీ కృషిపై మైసూరులో శిక్షణ అటవీ వ్యవసాయ పద్ధతిపై రైతులకు ఈ నెల 28, 29 తేదీల్లో కర్ణాటకలోని హెచ్.డి. కోట, హ్యాండ్ పోస్టు బేస్ క్యాంప్, మైరాడలో అటవీ వ్యవసాయ (కాడు కృషి) నిపుణులు డా. ఖాదర్ వలి తెలుగులో రైతులకు శిక్షణ ఇస్తారు. తాను తయారు చేసిన ‘అటవీ చైతన్య ద్రావణం’తో స్వల్పకాలంలోనే భూసారం పెంపుదల, వాన నీటి సంరక్షణ, సిరిధాన్యాలు + నూనెగింజలు + పప్పుధాన్యాల మిశ్రమ సాగు పద్ధతులు, సిరిధాన్యాల బియ్యాన్ని మిక్సీతో తయారు చేసుకోవడం.. వంటి విషయాలపై రైతులకు శిక్షణ ఇస్తారు. తదనంతరం బిదర హల్లి కబిని డ్యాం దగ్గర గల డా.ఖాదర్‌వలి అటవీ వ్యవసాయ మోడల్ ఫామ్ సందర్శన కూడా ఉంటుంది. వివరాలకు.. 81234 00262, 97405 31358, 99017 30600. కూరగాయలు, పండ్లు సోలార్ ప్రాసెసింగ్‌పై జనవరిలో శిక్షణ సొసైటీ ఫర్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ (సీడ్) అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో 2019 జనవరి 29 నుంచి 4 రోజుల పాటు సోలార్ డ్రయ్యర్లలో పండ్లు, కూరగాయలను ప్రాసెస్ చేసి, అంతర్జాతీయ ప్రమాణాలతో వివిధ ఆహారోత్పత్తులను తయారు చేయడంపై శిక్షణ ఇవ్వనుంది. వివరాలకు.. ‘సీడ్’ ప్రధాన కార్యదర్శి, ఆర్.శ్యామల: 040–23608892, 96526 87495. -
1న డ్రయ్యర్ల తయారీపై శిక్షణ
ఉల్లిపాయలు, అల్లంలో తేమను తగ్గించుకొని దీర్ఘకాలం నిల్వ ఉంచుకునేందుకు, అధిక ధరకు విక్రయించుకోవడానికి రైతులకు డ్రయ్యర్లు ఉపకరిస్తాయి. కరివేపాకు, మునగాకులను కూడా డ్రయ్యర్ల ద్వారా ఎండబెట్టుకొని పొడులుగా మార్చవచ్చు. ఇందుకు ఉపకరించే డ్రయ్యర్లను రైతులు తమకు తామే తయారు చేసుకోవడంపై గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలో నవంబర్ 1న ఎల్. శ్రీనివాసరావు శిక్షణ ఇవ్వనున్నారు. వివరాలకు.. 99123 47711 -
30న పాలకొల్లులో ప్రకృతి సేద్యం–సిరిధాన్యాల ఆహారంపై సదస్సు
ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకత, సేంద్రియ వ్యవసాయోత్పత్తుల విశిష్టత, సిరిధాన్య వంటకాల తయారీ– వినియోగం, ప్రయోజనాలపై రైతులను, ప్రజలను చైతన్యవంతం చేసే లక్ష్యంతో ఈ నెల 30న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని సత్యవతి మెమోరియల్ లయన్స్ కమ్యూనిటీ హాల్లో సదస్సు జరగనుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, పాలకొల్లు అర్బన్– రూరల్ లయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో ఉ. 9 గం. నుంచి మ. 3 గం. వరకు సదస్సు జరుగుతుంది. 29న సిరిధాన్య వంటకాలపై ఆహార నిపుణులు ‘మిల్లెట్స్ రాంబాబు’ శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 98487 11445, 94401 24253 -
సమీకృత సహజ సేద్యంపై నారాయణరెడ్డి శిక్షణ
గోఆధారిత సమీకృత సహజ సేద్య నిపుణులు, దొడ్డబళ్లాపూర్ (కర్ణాటక)కు చెందిన ప్రముఖ రైతు ఎల్. నారాయణ రెడ్డి (84) అక్టోబర్ 21 (ఆదివారం)న హైదరాబాద్‌లోని కేశవ మెమోరి యల్ ఎడ్యుకేషనల్ సొసైటీ(నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గర) ఆడిటోరియంలో రైతులకు తెలుగులో శిక్షణ ఇస్తారు. భాగ్యనగర్ గోపాలాస్, రైతునేస్తం, నేచర్స్‌వాయిస్ సంయుక్త ఆధ్వర్యం లో ఉ. 9 గం. నుంచి సా. 6 గం. వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో గోఆధారిత సమీకృత సహజ వ్యవసాయం, ఆహారం, జీవన విధా నంపై వివిధ అంశాలలో శిక్షణ ఇస్తారు. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు.. 70939 73999, 70608 43007 నంబర్లలో సంప్రదించవచ్చు. -
13న కషాయాలు, ద్రావణాలపై శిక్షణ
రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులో ఈనెల 13న ప్రకృతి వ్యవసాయ విధానంలో తెగుళ్లు, చీడపీడల నివారణకు ఉపయోగించే కషాయాలు, ద్రావణాల తయారీ, ఉపయోగించే విధానంపై రైతు శాస్త్రవేత్తలు విజయ్‌కుమార్ (కడప జిల్లా), ధర్మారం బాజి (గుంటూరు జిల్లా) రైతులకు శిక్షణ ఇస్తారు. పాల్గొనదలచిన రైతులు ముందుగా పేర్ల నమోదుకు 97053 83666, 0863 – 2286255 నంబర్లలో సంప్రదించవచ్చు.