31న ప్రకృతి వ్యవసాయంపై వేకనూరులో రైతు సదస్సు | Farmers Conference on Natural Farm on 31st | Sakshi
Sakshi News home page

31న ప్రకృతి వ్యవసాయంపై వేకనూరులో రైతు సదస్సు

Published Tue, Mar 26 2019 6:24 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Farmers Conference on Natural Farm on 31st - Sakshi

సుభాష్‌ పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అతి తక్కువ విత్తనంతో, అతి తక్కువ నీటితో దేశీ వరి రకాలను కృష్ణా జిల్లా అవనిగడ్డ సమీపంలోని వేకనూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయదారుడు మాదివాడ సురేంద్ర సాగు చేస్తున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 31(ఆదివారం)న దేశీ వరి ప్రకృతి సాగుపై రైతులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. సేవ్‌ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు, దేశీ వరి వంగడాల రైతు విజయరామ్‌ శిక్షణ ఇస్తారు. ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు ఉచిత శిక్షణతోపాటు భోజన వసతి కల్పిస్తున్నామని సురేంద్ర (88862 31122) తెలిపారు. విదేశాల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేసి తిరిగి స్వస్థలానికి చేరుకొని ప్రకృతి సేద్యం చేపట్టిన సురేంద్ర.. నారాయణ కామిని, కుళ్లాకర్, పరిమళసన్న, కాలాభట్‌ దేశీ వరి రకాలను ఈ ఏడాది సాగు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement