23న సిరిధాన్యాల సాగుపై కొర్నెపాడులో డా. ఖాదర్‌ శిక్షణ | Dr. Khader training for small grains | Sakshi
Sakshi News home page

23న సిరిధాన్యాల సాగుపై కొర్నెపాడులో డా. ఖాదర్‌ శిక్షణ

Published Tue, Dec 18 2018 6:05 AM | Last Updated on Tue, Dec 18 2018 6:05 AM

Dr. Khader training for small grains - Sakshi

ఈ నెల 23న రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో సిరిధాన్యాల సాగుపై అటవీ కృషి పితామహులు, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్‌ ఖాదర్‌ వలి రైతులకు శిక్షణ ఇస్తారు. కొర్రలు, అరికెలు, సామలు, ఊదలు, అండుకొర్రల సాగు, అటవీ చైతన్య ద్రావణం తయారీ, మిక్సీతో సిరిధాన్యాల బియ్యం ఉత్పత్తి వంటి అంశాలపై డా. ఖాదర్‌ రైతు దినోత్సవం సందర్భంగా 23 (ఆదివారం) ఉ. 10గం.ల నుంచి సా.4 గం.ల వరకు శిక్షణ ఇవ్వనున్నారని రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ వై. వెంకటేశ్వరరావు తెలిపారు. అదేవిధంగా, సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందే మార్గాలపై ఈనెల 24 (సోమవారం)న ఒంగోలులోని కాపు కళ్యాణ మండపం (పండరిపురం) లో ఉ. 10 గం.ల నుంచి మ. 1 గం.ల వరకు, అదేరోజు సా. 4 గం.ల నుంచి 7 గం.ల వరకు విజయవాడలోని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ఆడిటోరియం(మొగల్రాజపురం), 25(మంగళవారం)న ఉ. 10 గం. నుంచి 12.30 గం. వరకు ఏలూరులోని అమలోద్భవి సెయింట్‌ మేరీస్‌ స్కూల్‌(అశోక్‌నగర్‌)లో డాక్టర్‌ ఖాదర్‌ వలి ఉపన్యసిస్తారు. ప్రశ్నలకు జవాబులిస్తారు. వివరాలకు.. 83675 35439, 96767 97777, 0863–2286255

22, 23 తేదీల్లో నరసాపురంలో సిరిధాన్యాలు–ప్రకృతి సేద్యంపై సదస్సులు
ఆంధ్రప్రదేశ్‌ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, నరసాపురం లయన్స్‌క్లబ్, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో ప.గో. జిల్లా నరసాపురంలోని వై.ఎన్‌. కాలేజీ శ్రీ అరవిందో ఆడిటోరియంలో ‘మనం ఏమి తినాలి? ఏమి తింటున్నాం? మనం ఏమి పండించాలి? ఏమి పండిస్తున్నాం’ అనే అంశంపై సదస్సులు జరగనున్నాయి.
22న ఉ. 9 గం.ల నుంచి దేశీ విత్తనాల ప్రత్యేకత– కూరగాయల సాగులో 5 లేయర్‌ పద్ధతిపై శివప్రసాదరాజు, ఔషధ మొక్కలపై దాట్ల సుబ్బరాజు, ప్రకృతి వ్యవసాయంలో మెలకువలపై సుబ్రహ్మణ్యంరాజు ప్రసంగిస్తారు. మహిళలకు ‘మిల్లెట్స్‌ రాంబాబు’ చిరుధాన్యాలతో వంటలు నేర్పిస్తారు.
23న ఉ. 9 గం.లకు డా. ఖాదర్‌ వలి చూపిన బాటలో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందే పద్ధతులు – సిరిధాన్యాల సాగుపై ప్రముఖ ప్రకృతి వ్యవసాయదారుడు ఎం.సి.వి. ప్రసాద్‌ (ప్రకృతివనం), లయన్స్‌ క్లబ్‌ సేంద్రియ వ్యవసాయ విభాగం అధ్యక్షులు డాక్టర్‌ పి.బి. ప్రతాప్‌కుమార్‌ (94401 24253) ప్రసంగిస్తారు. ప్రవేశం ఉచితం. అందరూ ఆహ్వానితులే.

27–28 తేదీల్లో  అటవీ కృషిపై మైసూరులో శిక్షణ
అటవీ వ్యవసాయ పద్ధతిపై రైతులకు ఈ నెల 28, 29 తేదీల్లో కర్ణాటకలోని హెచ్‌.డి. కోట, హ్యాండ్‌ పోస్టు బేస్‌ క్యాంప్, మైరాడలో అటవీ వ్యవసాయ (కాడు కృషి) నిపుణులు డా. ఖాదర్‌ వలి తెలుగులో రైతులకు శిక్షణ ఇస్తారు. తాను తయారు చేసిన ‘అటవీ చైతన్య ద్రావణం’తో స్వల్పకాలంలోనే భూసారం పెంపుదల, వాన నీటి సంరక్షణ, సిరిధాన్యాలు + నూనెగింజలు + పప్పుధాన్యాల మిశ్రమ సాగు పద్ధతులు, సిరిధాన్యాల బియ్యాన్ని మిక్సీతో తయారు చేసుకోవడం.. వంటి విషయాలపై రైతులకు శిక్షణ ఇస్తారు. తదనంతరం బిదర హల్లి కబిని డ్యాం దగ్గర గల డా.ఖాదర్‌వలి అటవీ వ్యవసాయ మోడల్‌ ఫామ్‌ సందర్శన కూడా ఉంటుంది.
వివరాలకు.. 81234 00262, 97405 31358, 99017 30600.

కూరగాయలు, పండ్లు సోలార్‌ ప్రాసెసింగ్‌పై జనవరిలో శిక్షణ
సొసైటీ ఫర్‌ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (సీడ్‌) అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో 2019 జనవరి 29 నుంచి 4 రోజుల పాటు సోలార్‌ డ్రయ్యర్లలో పండ్లు, కూరగాయలను ప్రాసెస్‌ చేసి, అంతర్జాతీయ ప్రమాణాలతో వివిధ ఆహారోత్పత్తులను తయారు చేయడంపై శిక్షణ ఇవ్వనుంది.
వివరాలకు.. ‘సీడ్‌’ ప్రధాన కార్యదర్శి, ఆర్‌.శ్యామల: 040–23608892, 96526 87495. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement