khadar vali
-
సిరిధాన్యాల అంబలే నిజమైన వైద్యుడు
సాక్షి, హైదరాబాద్: సిరిధాన్యాల ఆహారమే, ముఖ్యంగా అంబలే, మన కడుపులో వుండి అనుక్షణం నిజమైన వైద్యుడని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఖాదర్ వలి అన్నారు. ఆరోగ్యంగా జీవించాలని అనుకునే ప్రతి ఒక్కరూ రోజుకు రెండు పూటలూ సిరిదాన్యాల అంబలి భోజనానికి నిమిషాలు ముందు విధిగా తాగుతూ ఆరోగ్యంగా జీవించాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా తుర్కాయంజల్ రాగన్నగూడలోని లక్ష్మీ మెగా టౌన్షిప్ లో ఆదివారం రాత్రి అనుదిన అంబలి ఉచిత పంపిణీ కేంద్రాన్ని డాక్టర్ ఖాదర్ వలీ ప్రారంభించారు. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు మేరెడ్డి శ్యామ్ ప్రసాద్ రెడ్డి తన సతీమణి దివంగత జయశ్రీ జ్ఞాపకార్థం అనుదినం అంబలి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించటం అభినందనీయం అని డాక్టర్ ఖాదర్ ప్రశంసించారు. తాను రోజూ భోజనానికి ముందు అంబలి తప్పకుండా తాగుతానని, రెండుపూటలా సిరధాన్యాలే తింటానని, 67 యేళ్లు నిండినా ఏటువంటి సమస్యలు లేవన్నారు. మన ఆహారం ప్రపంచవ్యాప్తంగా కంపెనీల పరమై పోయిందని, మనం ఆహార సార్వభౌమత్వాన్ని కోల్పోయామని అంటూ.. అనారోగ్యకరమైన ఆహారాన్ని కంపెనీలు అమ్ముతూ వుంటే ప్రజలు ఆనారోగ్యం పాలవుతూ ఔషధాలతోనే జీవనం వెళ్లదీస్తున్నామని డా. ఖాదర్ అన్నారు. ప్రతి కిలో శరీర బరువుకు 4 గ్రాముల కన్నా ప్రోటీన్ ఎక్కువ అవసరం లేదని, ఎక్కువ ప్రోటీన్ తినది అని కంపెనీలు వ్యాపారాభివృద్ధి కోసమే ప్రచారం చేస్తున్నాయని డా. ఖాదర్ స్పష్టం చేశారు. ప్రసిద్ధ చిత్రకారులు తోట వైకుంఠం తదితరులు ఈ సమావేశం లో పాల్గొన్నారు. చదవండి: చలిగాలిలో వాకింగ్: ఊపిరితిత్తులు జాగ్రత్త! -
గన్మెన్లతో దస్తగిరి దాదాగిరి
సాక్షి ప్రతినిధి, కడప/రైల్వేకోడూరు: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో బెయిల్‌పై ఉన్న ప్రధాన నిందితుడు దస్తగిరి దర్జాగా సెటిల్మెంట్లకు తెగబడుతున్నాడు. సీబీఐ సిఫార్సుల మేరకు ఐదుగురు గన్మెన్లను సమకూర్చుకుని పోలీస్ స్టేషన్ వద్దే దర్జాగా బహిరంగంగా బెదిరింపులకు దిగడం నివ్వెరపరుస్తోంది. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నడిబొడ్డున సోమవారం పట్టపగలు మూడు షాపులకు తాళాలు వేసిన దస్తగిరి వాటిని ఖాదర్‌వలీ అనే వ్యక్తికి అప్పగించాలంటూ బెదిరింపులకు దిగాడు. పోలీస్‌స్టేషన్ పక్కనే గన్మెన్లతో హల్చల్ చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. 30 ఏళ్లుగా షాపులు నిర్వహిస్తున్నా.. రైల్వే కోడూరులో అబ్దుల్ వాహిద్, శివయ్యనాయుడు, వైష్ణవి మెడికల్స్‌కు చెందిన సుబ్బరాయుడికి పోలీస్‌స్టేషన్ పక్కనే మూడు షాపులున్నాయి. వాటిని 30 ఏళ్లుగా అద్దెకు ఇచ్చారు. వాటి విలువ సుమారు రూ.2.5 కోట్లకు పైబడి ఉంటుంది. అయితే ఆ మూడు షాపులు ఖాదర్‌వలీ అనే వ్యక్తివి అంటూ దస్తగిరి రంగప్రవేశం చేశాడు. డాక్యుమెంట్లు ఉన్నాయని, మీరంతా ఖాళీ చేయాలంటూ వీరంగం వేశాడు. దీనిపై ఆదివారం రాత్రి స్థానిక సీఐ విశ్వనాథరెడ్డి కార్యాలయంలో ఇరువర్గాల మధ్య చర్చలు సాగాయి. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం దస్తగిరి రెండు కార్లలో అక్కడికి చేరుకున్నాడు. ఐదుగురు గన్మెన్లను వెంట బెట్టుకొని ప్రధాన రహదారిలో నడుచుకుంటూ వెళ్లి మూడు షాపులకు తాళాలు వేశాడు. అనంతరం పెద్ద మనుషుల సూచన మేరకు జిరాక్స్ డాక్యుమెంట్లు తీసుకొని 10 రోజుల్లో తిరిగి వస్తానంటూ హెచ్చరించాడు. రైల్వేకోడూరుకు చెందిన ఖాదర్‌వలీ ఆ షాపులు తనవేనని ఏనాడూ ముందుకొచ్చిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి రైల్వే కోడూరు పోలీసులకు ఫిర్యాదు అందింది. మందు, ముక్క.. విలాస జీవితం వివేకా హత్య కేసులో నిందితుడైన దస్తగిరి విలాస జీవితం గడుపుతూ తరచూ దందాలు, దౌర్జన్యకాండకు దిగుతున్నాడు. కష్టపడితేనే పూట గడిచే స్థితి నుంచి ఖరీదైన కార్లలో తిరిగే స్థాయికి చేరుకున్నాడు. అతడిప్పుడు చుక్క, ముక్క లేకుండా భోజనం చేసే పరిస్థితి లేదు. ఖరీదైన స్కాచ్ ఎప్పుడూ వెంట ఉండాల్సిందే. ప్రైవేట్ పంచాయితీలు నిత్యకృత్యమయ్యాయి. సెటిల్మెంట్లపై దృష్టి పెట్టాడు. ప్రాణరక్షణ పేరిట ఐదుగురు గన్మెన్లను సమకూర్చుకుని దౌర్జన్యాలకు తెగబడుతున్నాడు. పోలీస్ స్టేషన్లలోనే దాడులు.. అప్రూవర్‌గా మారిన దస్తగిరి పోలీసులను సైతం లెక్కచేయడం లేదు. ఏకంగా పోలీసు స్టేషన్లలోనే దౌర్జన్యాలు, దాడికి తెగబడుతున్నాడు. వైఎస్సార్ జిల్లా తొండూరులో మల్లెల గ్రామానికి చెందిన పెద్ద గోపాల్ అనే వ్యక్తిపై పోలీసు స్టేషన్లోనే దస్తగిరి దాడి చేశాడు. ఈ మేరకు క్రైమ్ నంబర్ 41/2022 కింద 2022 మే 29న కేసు నమోదైంది. అదే మండలంలో ఎలక్ట్రిక్ ఉపకరణాల చౌర్యం కేసు కూడా 2022 ఆగస్టు 2న దస్తగిరిపై నమోదైంది. ♦ శ్రీకాళహస్తిలో దర్గా స్థలంపై 20 ఏళ్లుగా ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న వివాదంలో బెదిరింపులకు పాల్పడిన ఘటనకు సంబంధించి ఖాదర్‌బాషా అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు దస్తగిరిపై క్రైమ్ నెంబర్ 121/2022 కేసు నమోదైంది. ♦ వైఎస్సార్ జిల్లా యర్రగుంట్ల కేంద్రంగా ఫైనాన్స్ వాహనాల సీజ్, వ్యక్తుల మధ్య ఉన్న విభేదాల్లో తలదూరుస్తూ దస్తగిరి సెటిల్మెంట్లకు దిగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఏ దస్తగిరి అంటావేందీ..? బెయిల్‌పై ఉన్న నిందితుడు దస్తగిరి షరతులను ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాడు. ‘‘హలో... నేను దస్తగిరిని మాట్లాడుతున్నా! ఏ దస్తగిరి అంటావేందీ..? వైఎస్ వివేకానందరెడ్డిని చంపిన దస్తగిరిని’’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బెయిల్ షరతులేవీ తనకు వర్తించవన్న రీతిలో యథేచ్ఛగా దౌర్జన్యాలకు దిగుతున్నాడు. -
షుగర్ వ్యాధిగ్రస్తులకు ‘తీపి’ కబురు.. పామ్ నీరా, బెల్లం!
తియ్యని ఆహారం ఎవరికైనా ఆనందదాయకమే. అయితే, తీపి పదార్ధాలుగా విరివిగా వాడుకలో ఉన్న చెరకు చక్కెర, చెరకు బెల్లంలను షుగర్ వ్యాధిగ్రస్తులు తినలేరు. వీటిలో అధిక మోతాదులో గ్లూకోజ్ ఉండటం వల్ల ఆరోగ్యానికి హాని జరిగే పరిస్థితి ఉండటమే ఇందుకు కారణం. అయితే, ఫ్రక్టోజు ఎక్కువగా ఉండే తాటి/ ఈత/ కొబ్బరి/ జీలుగ చెట్ల నీరాతో తయారు చేసే సంప్రదాయక బెల్లం అయితే ఎవరికైనా ఆరోగ్యదాయకం అంటున్నారు నిపుణులు. తాటి/ ఈత/ కొబ్బరి/ జీలుగ చెట్లు అత్యంత ఆరోగ్యదాయకమైన, ఆల్కహాల్ రహిత పానీయాన్ని అందిస్తాయి. ఇదే నీరా. నీరాను తాజాగా సేవించటం ఆరోగ్యదాయకం (పులిస్తే కల్లుగా మారుతుంది). తాటి, ఈత, కొబ్బరి, జీలుగ నీరాతో తయారు చేసే బెల్లం చాలా ఆరోగ్యదాయకమైన తీపి పదార్థమని పూర్వకాలం నుంచే మనకు తెలుసు. ప్రజల్లో ఆరోగ్యస్పృహ పెరుగుతున్న నేపథ్యంలో తాటి/ఈత నీరా, బెల్లం తదితర ఉత్ప త్తుల తయారీ, వాడకం పుంజుకుంటున్నది. తెలుగు రాష్ట్రాల్లో ఈత, తాటి(పామ్) ఉత్పత్తులకు ఆదరణ ఈత నీరా, బెల్లం ఉత్పత్తికి అనంతపురంలో గీత కార్మికుల సహకార సంఘం శ్రీకారం షుగర్ వ్యాధిగ్రస్తులూ పరిమితంగా వాడొచ్చంటున్నారు నిపుణులు.. సహకార సంఘం ఆధ్వర్యంలో.. అనంతపురం జిల్లాలో ప్రకృతిసిద్ధమైన ఈత చెట్లు విస్తారంగా ఉన్నాయి. ప్రభుత్వ, రైతుల భూముల్లో లక్షలాది ఈత చెట్లున్నాయి. వీటి నుంచి కల్లు తీసి విక్రయించటం రివాజు. అయితే, ఈత కల్లుకు బదులు నీరా తీసి విక్రయించడంతోపాటు.. నీరాతో బెల్లం తయారు చేసి ప్రజలకు అందించడం మేలని అనంతపురానికి చెందిన సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ రూరల్ యాక్షన్ (సెర) వ్యవస్థాపకులు ఎస్. కుళ్లాయస్వామి తలపెట్టారు. సిరిధాన్యాలతోపాటు తాటి/ఈత/జీలుగ నీరా, బెల్లం వాడకాన్ని ప్రోత్సహిస్తున్న స్వతంత్ర ఆహార, ఆరోగ్య శాస్త్రవేత్త డా. ఖాదర్ వలి స్ఫూర్తితో కుళ్లాయస్వామి ఈత నీరా, బెల్లం ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. 500 మంది ఈడిగ గీత కార్మికులతో ‘సెర నీరా టాపర్స్ కోఆపరేటివ్ సొసైటీ’ని నెలకొల్పారు. పరిశుద్ధమైన ఆధునిక పద్ధతిలో నీరా బాట్లింగ్, స్టెయిన్లెస్ స్టీలు పరికరాలతో ఈత బెల్లం తయారీ యూనిట్‌ను నాలుగు నెలల క్రితం నెలకొల్పారు. రోజుకు 500 లీటర్ల నీరా సేకరణ 500 ఈత చెట్లను ఎంపిక చేసుకొని సభ్యుల ద్వారా రోజుకు దాదాపు 500 లీటర్ల నీరాను సేకరిస్తున్నారు. 250 చెట్ల నుంచి ఒక రోజు, మిగతా 250 చెట్ల నుంచి తర్వాత రోజు నీరా సేకరిస్తున్నారు. అక్టోబర్ నుంచి నాణ్యమైన నీరా వస్తుంది. వంద లీటర్ల నీరాను వడకట్టి బాటిల్స్‌లో నింపి అదే రోజు విక్రయిస్తున్నారు. మిగతా 400 లీటర్ల నీరాతో 40 కిలోల బెల్లం ఉత్పత్తి చేస్తున్నారు. చామలపల్లి నుంచి తాటి, ఈత ఉత్పత్తులు తెలంగాణ పామ్ నీరా అండ్ పామ్ ప్రొడక్ట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా చందూరు మండలంలోని చామలపల్లి కేంద్రంగా తాటి, ఈత నీరా, బెల్లం తదితర ఉత్పత్తుల తయారీ గతంలోనే ప్రారంభమైంది. చామలపల్లి పరిసర గ్రామాల నుంచి తాటి నీరాను, వరంగల్ జిల్లా ధర్మసాగర్ ప్రాంతం నుంచి ఈత నీరా సేకరిస్తున్నారు. నీరా, బెల్లంతో పాటు తాటి సిరప్, పామ్ షుగర్, పామ్ బూస్ట్ తదితర ఆరోగ్యదాయకమైన అనేక వినూత్న ఉత్పత్తులు తయారు చేసి ప్రజలకు అందిస్తున్నట్లు ఫౌండేషన్ నిర్వాహకులు వింజమూరు సత్యం(98498 28999), వేణు తెలిపారు. నవంబర్ నుంచి ఈత, డిసెంబర్ నుంచి తాటి నీరా సేకరణ తిరిగి ప్రారంభిస్తామని వారు తెలిపారు. ఇందుకోసం ఎక్సయిజ్ శాఖ తోడ్పాటుతో అనంతపురంలోని పోలిస్ కాంప్లెక్స్‌లో నీరా స్టాల్ నెలకొల్పనున్నట్లు కుళ్లాయస్వామి తెలిపారు. ఈత నీరాలో ఆల్కహాల్ లేదని సి.ఎఫ్.టి.ఆర్.ఐ. లాబ్ రిపోర్టులో తేలింది. చిత్తూరులోని ప్రభుత్వ లాబ్‌లో టెస్ట్ రిపోర్టు వచ్చిన తర్వాత నీరాను ఇతర ప్రాంతాలకు సరఫరా చేయడానికి ఎక్సైజ్ అనుమతులు వస్తాయన్నారాయన. – పంతంగి రాంబాబు ఈత ఉత్పత్తులను అందరూ వాడొచ్చు ఈత చెట్టుకు ఏడాదికి రూ.150–200 వరకు రైతుకు చెల్లించి నిపుణులైన గీత కార్మికుల పర్యవేక్షణలో నీరా సేకరిస్తున్నాం. కిలో ఈత బెల్లం తయారీకి 10 లీటర్ల నీరా అవసరం. కిలో బెల్లం ఉత్పత్తికి రూ. 650 వరకు ఖర్చవుతున్నది. రూ. వెయ్యి రిటైల్ ధరకు విక్రయిస్తున్నాం. ఎటువంటి రసాయనాలు, ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఈ ఉత్పత్తులను తయారు చేస్తున్నాం. ప్రజలందరూ, షుగర్ ఉన్న వారు సైతం వాడదగ్గ ఆరోగ్యదాయక ఉత్పత్తులు కావటంతో స్థానికంగానే కాకుండా అనేక నగరాల్లోనూ ఈత ఉత్పత్తులను విక్రయించే ప్రయత్నం చేస్తున్నాం. – ఎస్. కుళ్లాయస్వామి (92464 77103), సెరా నీరా టాపర్స్ కోఆపరేటివ్ సొసైటీ, అనంతపురం ఆరోగ్యకరమైన తీపి పదార్థాలు ఈత, తాటి, కొబ్బరి, జీలుగ.. ఈ చెట్ల నుంచి తీసిన నీరా, దానితో తయారు చేసే బెల్లం ఆరోగ్యకరమైన దేవుడిచ్చిన తీపి పదార్థాలు. ఇవి మన సంస్కృతిలో ఉన్న ప్రకృతిసిద్ధమైన, పర్యావరణ హితమైన తీపి పదార్థాలు. వీటిలోని ప్రకృతికి దగ్గరగా ఉండే లవణాంశాలు మనిషికి రోగనిరోధక శక్తిని అందించి మేలు చేస్తాయి. ఈత నీరా, బెల్లంను హెబిఎ1సి 7–8 లోపు ఉన్న షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా రోజుకు 10–15 గ్రా. మించకుండా తీసుకోవచ్చు లేదా వారానికోసారి ఈత బెల్లంతో చేసిన తీపి పదార్ధాన్ని 50 గ్రా. వరకు తినొచ్చు. తీపి పదార్థాలను ఎవరైనా సరే రోజూ తినకూడదు. చెరకు ఎస్టేట్ల వల్ల ఏకపంటల (మోనోకల్చర్) సాగు ప్రబలి, 18% జీవవైవిధ్యం నాశనమైంది. గ్లూకోజ్ ఎక్కువగా ఉండే చెరకు బెల్లం, చక్కెర వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది. ఈత, తాటి, కొబ్బరి, జీలుగ నీరా, బెల్లంలో ఫ్రక్టోజు ఎక్కువ ఉంటుంది. ఫ్రక్టోజు ఉన్న తీపి పదార్థం ఏ హానీ చేయదు. – డా. ఖాదర్‌వలి, స్వతంత్ర ఆహార, ఆరోగ్య శాస్త్రవేత్త చదవండి: కాఫీ దుకాణంతో ఆదాయం.. 25 దేశాలు పర్యటించిన వృద్ధ దంపతులు! -
రోగ నిరోధక శక్తి పెరగాలంటే చిరుధాన్యాలే సరి..!: ఖాదర్ వలి
వాషింగ్టన్: చిరు ధాన్యాలతో ఆరోగ్య సిరి లభిస్తుందని మిలెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఖాదర్ వలి ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్), ఓం సాయి బాలాజీ ఆలయం సంయుక్తంగా నిర్వహించిన వెబినార్‌లో స్పష్టం చేశారు. తరతరాల నుంచి వాడిన చిరు ధాన్యాలను మనం విస్మరించడం వల్ల నేడు అనేక రోగాలు, వైరస్లు మానవ శరీరంపై సులువుగా దాడి చేస్తున్నాయని ఆయన అన్నారు. నాట్స్, ఓం సాయి బాలాజీ ఆలయం సంయుక్తంగా నిర్వహించిన వెబినార్‌లో ఖాదర్ వలి మాట్లాడారు. కొర్రలు, సామలు, అండు కొర్రలు, ఊదలు, అరికెలు ఈ ఐదింటిలో అద్బుతమైన ఔషద గుణాలు ఉన్నాయని ఆయన వివరించారు. మనలోని రోగ నిరోధక శక్తిని ఈ ఐదు చిరు ధాన్యాల వాడకంతో పెంచుకోవచ్చని తెలిపారు. మన ఆరోగ్యాన్ని మన పూర్వీకులు ఎలా కాపాడుకున్నారు..? వాళ్లు ఎందుకు అంత బలంగా ఉన్నారనే విషయాన్ని ఖాదర్ వలి వివరించారు. ఈ వెబినార్ లో పాల్గొన్న అనేక మంది అడిగిన ఆరోగ్య ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. చిరు ధాన్యాలపై ఉన్న సందేహాలను తీర్చారు. చిరు ధాన్యాల వాడకాన్ని మన జీవన విధానంలో భాగం చేసుకుంటే సగం జబ్బులను నియంత్రించవచ్చని తెలిపారు.కాగా ఈ వెబినార్‌కు దాదాపు 200 మందికి పైగా ఔత్సాహికులు ఆన్లైన్ ద్వారా అనుసంధానమయ్యారు. ఈ వెబినార్ నిర్వహణలో నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు కార్యదర్శి ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ఉపాధ్యక్షుడు (ఫైనాన్స్,మార్కెటింగ్) శ్రీనివాస్ మల్లాది, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ కాండ్రు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, నాట్స్ టెంపా బే విభాగం సమన్వయకర్త ప్రసాద్ ఆరికట్ల, తదితరులు కీలక పాత్ర పోషించారు. ఈ వెబినార్‌కు మద్దతు అందించిన నాట్స్ బోర్డు ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ అధ్యక్షుడు విజయ్ శేఖర్ అన్నే, నాట్స్ నాయకులు రవి గుమ్మడిపూడి, శ్రీనివాస్ కాకుమాను, రంజిత్ చాగంటి, మురళీ మేడిచెర్లలకు నాట్స్ టెంపాబే విభాగం కృతజ్ఞతలు తెలియజేసింది. చదవండి: అన్నమయ్య సంకీర్తనలు- సామాజిక దృక్పథంపై కార్యక్రమం -
హైదరాబాద్‌లో 5,6 తేదీల్లో డా. ఖాదర్ సభలు
అటవీ కృషి నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార, ఆరోగ్య నిపుణులు డా. ఖాదర్ వలి సభలు 2020 జనవరి 5,6 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఈ సభలో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందే మార్గాలపై ప్రసంగిస్తారు. ప్రవేశం ఉచితం. బి.హెచ్.ఇ.ఎల్.లో: 5వ తేదీ (ఆదివారం) ఉ. 10 గం. నుంచి మ. 1 గం. వరకు హైదరాబాద్ రామచంద్రాపురంలోని బి.హెచ్.ఇ.ఎల్. కమ్యూనిటీ సెంటర్లో డా. ఖాదర్ సభ జరుగుతుంది. వివరాలకు.. ప్రవీణ్‌బాబు – 76619 09151. ప్రగతి రిసార్ట్స్‌లో: 5వ తేదీ (ఆదివారం) సా. 4 గం. నుంచి మ. 7 గం. వరకు హైదరాబాద్ శివారులోని ప్రగతి రిసార్ట్స్‌లో డా. ఖాదర్ వలి సభ జరుగుతుంది. జె.ఎన్.టి.యు.లో: హైదరాబాద్ కూకట్పల్లి జె.ఎన్.టి.యు. ఆవరణలోని యు.జి.సి. హెచ్.ఆర్.డి.సి. ఆడిటోరియంలో 6వ తేదీ (సోమవారం)న ఉ. 9 గం. నుంచి మ. 11 వరకు జరిగే సభలో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. డా. రమణానాయక్ – 95551 63014, డా. కరుణాకర్‌రెడ్డి – 90529 98899. ఉస్మానియావర్సిటీలో: ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలోని కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియంలో 6వ తేదీ(సోమవారం) సా. 3 గం. నుంచి 5 గం. వరకు డా. ఖాదర్ వలి సభ జరుగుతుంది. వివరాలకు.. డా. రమణానాయక్– 95551 63014. ఫిబ్రవరి 7–9 తేదీల్లో విశాఖలో ఆర్గానిక్ మేళా 7న గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సమ్మేళనం నేలతల్లికి ప్రణమిల్లుతూ రసాయనిక అవశేషాల్లేని అమృతాహారాన్ని పండించే రైతులు తమ ఆహారోత్పత్తులను తాము నిర్ణయించిన ధరకు నేరుగా వినియోగదారులకు అమ్ముకునేందుకు, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకోవడానికి రైతుల మేళాలు ఎంతగానో ఉపకరిస్తాయి. గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం (ఆం. ప్ర.) 2020 ఫిబ్రవరి 7,8,9 తేదీల(శుక్ర, శని, ఆదివారాల)లో విశాఖపట్నం ఎం.వి.పి. కాలనీలోని ఎ.ఎస్.రాజా గ్రౌండ్స్ (ఆళ్వార్‌దాస్ గ్రౌండ్స్)లో విశాఖ ఆర్గానిక్ మేళా నిర్వహించనుంది. వివరాలకు.. 99512 82288, 81251 77871, 94908 10438, 98495 22191. -
1,2లలో కర్నూలు జిల్లాలో డా. ఖాదర్ వలీ సదస్సులు
సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం, అటవీ కృషి పద్ధతులపై డిసెంబర్ నెల 1, 2 తేదీల్లో కర్నూలు జిల్లాలో జరిగే సదస్సుల్లో ప్రముఖ ఆహార, ఆరోగ్య, అటవీ కృషి నిపుణులు డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. ప్రవేశం ఉచితం. 1వ తేదీ (ఆదివారం) ఉ. 10 గం. నుంచి కర్నూలులోని బి.క్యాంపులో గల సిల్వర్‌జూబ్లీ కళాశాల ఆడిటోరియంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ద్రోణ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో జరిగే సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. సూర్యప్రకాశ్‌రెడ్డి – 96038 34633, ఆనందరావు – 93981 24711, ప్రశాంత్‌రెడ్డి – 95029 90938. డిసెంబర్ 1వ తేదీ సా. 5.30 గంటలకు నంద్యాలలోని శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో డా. ఖాదర్ వలి సదస్సు జరుగుతుంది. వివరాలకు.. 94416 54002, 91006 70553. డిసెంబర్ 2వ తేదీ (సోమవారం) ఉ. 10 గంటలకు కోయిలకుంట్లలోని అయ్యప్పస్వామి గుడి హాల్లో కోయిలకుంట్ల పంచాయతీ, మానవతా సేవా సంస్థ, రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. సుబ్బారెడ్డి – 94407 54184, వీరభద్రశివ – 93466 69655. సిరిధాన్యాల సాగు, వాననీటి సంరక్షణపై సదస్సు నేడు మిషన్ జలనిధి, వాటర్ మేనేజ్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సిరిధాన్యాల సాగు, వాననీటి సంరక్షణపై నేటి ఉదయం 9 గం. నుంచి సిద్ధిపేట జిల్లా జగ్దేవ్పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో రైతు సదస్సు జరగనుంది. సాక్షి సాగుబడి పేజీ ఇన్చార్జ్ పంతంగి రాంబాబు, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు సంగెం చంద్రమౌళి, వాటర్ మేనేజ్మెంట్ ఫోరం చైర్మన్ మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి, మిషన్ జలనిధి చైర్మన్ జి.దామోదర్‌రెడ్డి అవగాహన కల్పిస్తారు. వివరాలకు.. కృష్ణమోహన్ – 99490 55225. 1న సేంద్రియ కూరగాయలు, ఆకుకూరల సాగుపై శిక్షణ డిసెంబర్ 1(ఆదివారం)న ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతు శిక్షణ కేంద్రంలో సేంద్రియ వ్యవసాయ విధానంలో క్యాబేజి, కాలిఫ్లవర్, వంగ, బెండ, టమాట, గోరుచిక్కుడు, బీర, కాకర, సొరకాయలు, ఆకుకూరల సాగుపై ప్రకృతి వ్యవసాయదారులు శరత్‌బాబు, శివనాగమల్లేశ్వరరావు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666, 0863–2286255. 1న బసంపల్లిలో ప్రకృతి వ్యవసాయ శిక్షణ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వివిధ పంటల సాగుపై అనంతపురం జిల్లా సి కె పల్లి మండలం బసంపల్లిలోని దేవాలయ ఆశ్రమ ప్రాంగణంలో డిసెంబర్ 1వ తేదీ(ప్రతి నెలా మొదటి ఆదివారం)న సీనియర్ రైతు నాగరాజు శిక్షణ ఇస్తారు. ఉ. 9 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఉంటుంది. ఫీజు రూ. 100. వివరాలకు.. 91826 71819, 94403 33349. 29,30 తేదీల్లో హైదరాబాద్‌లో చిరుధాన్యాలపై సదస్సు భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ(ఐ.ఐ.ఎం.ఆర్.) ఆధ్వర్యంలో ఈ నెల 29,30 తేదీల్లో హైదరాబాద్ కొండాపుర్‌లోని హెచ్.ఐ.సి.సి.లో న్యూట్రిసెరియల్స్ –2019 కాంక్లేవ్ జరగనుంది. వివరాలకు.. 040–24599331, 95501 14466. -
నవంబర్ 10, 11 తేదీల్లో డా. ఖాదర్‌వలి సభలు
సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందే మార్గాలు, సిరిధాన్యాల సాగు పద్ధతులపై రైతులోకం ఫౌండేషన్, తెలంగాణ ఇంజనీర్ల సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 10 (ఆది వారం) ఉ. 10 గం. నుంచి మ. 2 గం. వరకు తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కేంద్రం నారాయణపేటలోని జీపీ శెట్టి ఫంక్షన్ హాల్లో జరిగే సదస్సులో ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార – ఆరోగ్య నిపుణులు డా. ఖాదర్ వలి (మైసూరు) ప్రసంగిస్తారు. వివరాలకు.. జె.సి.ఎం. – 93965 84805. అదేరోజు సా. 4 గం. నుంచి 7 గం. వరకు నాగర్‌కర్నూల్‌లో మార్కెట్ యార్డు (కలెక్టర్ ఆఫీసు ఎదురుగా) జరిగే సభలో డా. ఖాదర్ ప్రసంగిస్తారు. వివరాలకు.. నవీన్ – 90522 22244. నవంబర్ 11(సోమవారం)న మధ్యాహ్నం 2 గం. నుంచి సా. 5 గం. వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాల్మకుల్ గ్రామంలోని స్కూల్ గ్రౌండ్లో జరిగే సభలో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. రాజ్ భూపాల్ – 90901 29999. ప్రొఫెసర్ (డా.) డి. రామ్‌కిషన్– 94407 12021, మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి – 99638 19074. ప్రవేశం ఉచితం. అందరూ ఆహ్వానితులే. 3న ఆదిలాబాద్, 4న కొత్తపేట(హైదరాబాద్)లో.. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సహకారంతో నవంబర్ 3 (ఆదివారం) ఉ. 10 గం. నుంచి ఆదిలాబాద్‌లోని జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై జరిగే అవగాహన సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. అదేవిధంగా, 4(సోమవారం)న సా. 4 గం. నుంచి 7 గం. వరకు హైదరాబాద్ దిల్సుఖ్నగర్ వద్ద కొత్త పేటలోని బాబూ జగ్జీవన్‌రాం హాల్ (రైతు బజార్ పక్కన)లో జరిగే సదస్సులో డా. ఖాదర్‌వలి ప్రసంగిస్తారని ఆయన తెలిపారు. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 70939 73999, 96767 97777. 1న తిరుపతిలో సిరిధాన్యాలపై రౌండ్ టేబుల్ సమావేశం సిరిధాన్యాలు సాగు చేస్తున్న రైతులు ఎదు ర్కొంటున్న సమస్యలపై చర్చిం చేందుకు భార తీయ కిసాన్ సంఘ్, ఆం.ప్ర. గోఆధారిత వ్యవ సాయదారుల సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 1వ తేదీ(శుక్రవారం)న తిరు పతిలోని యూత్ హాస్టల్ (ముత్యాలరెడ్డి పల్లి)లో ఉ. 10 గం. నుంచి రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. సిరిధాన్యాలు సాగు చేసే రైతుల సమస్యలను క్రో డీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్క రింపజేయడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు బీకేఎస్ నేత కుమారస్వామి తెలిపారు. వివరాలకు.. గంగాధర్ – 98490 59573. 3న మేలైన పశుగ్రాసాల సాగుపై కొర్నెపాడులో శిక్షణ రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడులో నవంబర్ 3వ తేదీ(ఆదివారం)న ఉ.10 గం. నుంచి సా. 4 గం. వరకు సూపర్ నేపియర్ తదితర మేలైన పశుగ్రాసాల సాగుపై గన్నవరం పశువైద్యకళాశాల ప్రొఫెసర్ డా.సి.హెచ్. వెంకటశేషయ్య, పాడి రైతు విజయ్ (గుంటూరు) రైతులకు శిక్షణ ఇస్తారని ఫౌం డేషన్ చైర్మన్ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపా రు. సూపర్ నేపియర్ కణుపులు కొన్నిటిని శిక్షణ పొందే రైతులకు పంపిణీ చేస్తామన్నారు. వివరాలకు.. 97053 83666, 0863–2286255. 3న బసంపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సీజనల్ పంటలు, పండ్లతోటల సాగుపై నవంబర్ 3వ తేదీ (ప్రతి నెలా మొదటి ఆదివారం)న అనంతపురం జిల్లా సికెపల్లి మండలం బసంపల్లిలోని దేవాలయ ఆశ్రమ ప్రాంగణంలో రైతులకు సీనియర్ ప్రకృ తి వ్యవసాయదారుడు నాగరాజు శిక్షణ ఇస్తారు. ఉ. 9 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఇస్తారు. రుసుము రూ. 100. వివరాలకు.. 91826 71819, 94403 33349. -
జూన్ 2,3 తేదీల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో డా. ఖాదర్ వలి సభలు
సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై జూన్ 2, 3 తేదీల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త డా.ఖాదర్ వలి సభలు రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్నాయి. ప్రవేశం ఉచితం. అందరూ ఆహ్వానితులే. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జూన్ 2(ఆదివారం)వ తేదీ ఉ. 9.40 గం. నుంచి మ. 12.30 గం. వరకు పద్మశాలి కళ్యాణ మండపంలో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. 99595 77280, 96767 97777. తిరుపతిలోని మహతి కళాక్షేత్రం(ప్రకాశం రోడ్)లో జూన్ 2వ (ఆదివారం) సా. 4 గం. నుంచి 7 గం. వరకు డా. ఖాదర్ వలి సభ జరుగుతుంది. వివరాలకు.. 99499 52020. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని వరదరాజుల స్వామి దేవాలయం ఆవరణలో జూన్ 3వ (సోమవారం) ఉ. 9.30 గం. నుంచి మ. 12.30 గం. వరకు డా. ఖాదర్ వలి సభ జరుగుతుంది. వివరాలకు: 88869 02902, 96767 97777 -
19, 20 తేదీల్లో డా. ఖాదర్ వలి ప్రసంగాలు
హైదరాబాద్, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌లలో సిరిధాన్యాలతో భూతాపాన్ని, సకల వ్యాధులనూ జయించవచ్చని కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేస్తున్న స్వతంత్ర శాస్త్రవేత్త డా. ఖాదర్ వలి ఈ నెల 19, 20 తేదీల్లో హైదరాబాద్, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌లలో హైదరాబాద్, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌లలో జరిగే ఆహార, ఆరోగ్య, అటవీ వ్యవసాయ సభల్లో ప్రసంగిస్తారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్ల తోడ్పాటుతో వివిధ సంస్థల ఆధ్వర్యంలో జరిగే ఈ సభలకు అందరూ ఆహ్వానితులే. ఖైరతాబాద్‌లో: 19వ(ఆదివారం) తేదీ (ఉ. 9–12 గం.)న హైదరాబాద్ ఖైరతాబాద్ జంక్షన్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ సంస్థ తమ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న ఆహార, ఆరోగ్య సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. 040–23314969. సూర్యాపేటలో: 19వ (ఆదివారం) తేదీ (సా. 5 గం. – 8 గం.)న సూర్యాపేటలో నేచర్స్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో జరిగే ఆహార, ఆరోగ్య సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. కె. క్రాంతికుమార్ – 96032 14455, శివప్రసాద్–86868 71048. గచ్చిబౌలిలో: 20వ (సోమవారం) తేదీ (ఉ. 10 గం. – 2 గం.)న హైదరాబాద్ గచ్చిబౌలిలో ‘ఇస్కీ’ ఆవరణలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఆర్ అండ్ డి సెంటర్ (కేర్ ఆస్పత్రి పక్కన)లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్‌కు చెందిన వాటర్ మేనేజ్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో రైతుల కోసం జరిగే ప్రత్యేక సభలో డాక్టర్ ఖాదర్ వలి అటవీ వ్యవసాయ పద్ధతి, వాననీటి సంరక్షణ, తక్కువనీటితో సిరిధాన్యాల సాగుపై ప్రసంగిస్తారు. వివరాలకు.. శంకర్‌ప్రసాద్ – 90003 00993, ముత్యంరెడ్డి – 94419 27808 మహబూబ్‌నగర్‌లో: 20వ (సోమవారం) తేదీ(సా. 5–7 గం.)న మహబూబ్‌నగర్(న్యూ టౌన్)లోని క్రౌన్ ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రాంకిషన్ ఆధ్వర్యంలో ఆహారం, ఆరోగ్యం, అటవీ వ్యవసాయంపై డాక్టర్ ఖాదర్ వలి తదితరులు ప్రసంగిస్తారు. వివరాలకు.. 94407 12021. -
10, 11 తేదీల్లో కడప జిల్లాలో డా. ఖాదర్ వలి సభలు
సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందే మార్గాలపై ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆరోగ్య, ఆహార, అటవీ వ్యవసాయ నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి ఈ నెల 10, 11 తేదీల్లో డా. వైఎస్సార్ కడప జిల్లాలో నాలుగు సభల్లో ప్రసంగించనున్నారు. పులివెందుల: 10 (ఆదివారం) ఉ. 10 గంటలకు పులివెందులలో సరస్వతి విద్యా మందిరం (పార్నపల్లి రోడ్డు)లో ఆధునిక రోగాలు – దేశీయ ఆహారంతో నియంత్రణ, నిర్మూలన అనే అంశంపై డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. ప్రవేశం ఉచితం. అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. 94411 05405, 94409 72504. కడప: 10 (ఆదివారం) సా. 4.30 గం.కు కడపలోని కొత్త బస్టాండ్ ఎదురుగా గల కందుల ఎస్టేట్‌లో సీబీఐటీ కాలేజీ ఆధ్వర్యంలో జరిగే సభలో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. ప్రవేశం ఉచితం. అందరూ ఆహ్వానితులే. మహిళలకు ప్రత్యేక ఆహ్వానం. వివరాలకు.. 96408 08099, 96660 71719. తాడిపత్రి: 11 (సోమవారం) ఉ. 9.30 గంటలకు తాడిపత్రిలోని శ్రీ కృష్ణదేవరాయ కమ్యూనిటీ హాల్ (శ్రీనివాసపురం, దివాకర్ పెట్రోల్ బంకు వెనుక)లో స్పర్శ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగే సభలో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. 98490 98387, 96766 35193. ప్రొద్దుటూరు : 11 (సోమవారం) సా. 4.30 గంటలకు ప్రొద్దుటూరులోని అనిబిసెంట్ మునిసిపల్ హైస్కూల్ (ఎగ్జిబిషన్ గ్రౌండ్)లో సీబీఐటీ కాలేజీ ఆధ్వర్యంలో జరిగే సభలో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. ప్రవేశం ఉచితం. అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. 96408 08099, 96660 71719. పత్తి పంట ఉంటే, వెంటనే పీకెయ్యండి! అవును. మీరు సరిగ్గానే చదివారు.. తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పత్తి వేసిన రైతులకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం(íపీజేటీఎస్ఏయూ) ద్వారా డిసెంబర్ నెలాఖరుకు పత్తి పంటను తీసివేసి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని పదే పదే విజ్ఞప్తి చేసింది. అయినా ఇప్పటికీ, నీటి వసతి కింద పత్తిని వేసిన రైతులు పంటను కొనసాగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల నవంబర్, డిసెంబర్ నెలల్లో ఆశించిన ఎర్ర గులాబీ రంగు పురుగు ఉధృతి పెరిగి రాబోయే ఖరీఫ్ పంటకాలంలో ఎక్కువ నష్టం కలిగించే ఆస్కారం ఉంది. కాబట్టి రైతాంగమంతా ఫిబ్రవరి మొదటి వారానికి తప్పనిసరిగా పత్తి పంటను తీసివేసి, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని పీజేటీఎస్ఏయూ విస్తరణ సంచాలకులు కోరారు. ఫిబ్రవరి నుంచి మే వరకు తెలంగాణలోని ఏ ప్రాంతంలోనూ పత్తి పంట లేకుండా చూసుకోవడం ద్వారా అంటే.. క్రాప్ హాలిడే ప్రకటించడం ద్వారా గులాబీ రంగు పురుగు రాబోయే ఖరీఫ్ పంటకు రాకుండా నివారించుకోవచ్చని సూచించారు. 10న సిరిధాన్యాల సాగు, మిక్సీతో మరపట్టడంపై శిక్షణ ఈనెల 10 (ఆదివారం)న ఉ. 10 గం.– సా. 4 గం. వరకు రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడులో సిరిధాన్యాలు మిక్సీతో మరపట్టించడం, సిరిధాన్యాల సాగు, అటవీ చైతన్య ద్రావణం తయారీపై కడప జిల్లాకు చెందిన రైతు శాస్త్రవేత్త విజయకుమార్ శిక్షణ ఇవ్వనున్నారు. అటవీ చైతన్య ద్రావణాన్ని ఉచితంగా పంపిణీ చేస్తారు. వివరాలకు.. 97053 83666, 0863–2286255. 23న కరీంనగర్లో ఎన్.సి.ఓ.ఎఫ్. సేంద్రియ రైతు సమ్మేళనం కేంద్ర వ్యవసాయ శాఖకు చెందిన జాతీయ సేంద్రియ వ్యవసాయం కేంద్రం (ఎన్.సి.ఓ.ఎఫ్.) ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని రెవెన్యూ గార్డెన్స్ (కలెక్టరేట్ ఎదురుగా)లో ఈ నెల 23 (శనివారం) ఉ. 9 గం. – సా. 5 గం. వరకు రైతు సమ్మేళనం జరగనుంది. వేస్ట్ డీ కంపోజర్ టెక్నాలజీతో సేంద్రియ వ్యవసాయం చేసే పద్ధతులు, పీజేఎస్ ఇండియా సర్టిఫికేషన్, సేంద్రియ మార్కెట్ అనుసంధానంపై సేంద్రియ రైతు సమ్మేళనం నిర్వహిస్తున్నామని ఎన్.సి.ఓ.ఎఫ్. డైరెక్టర్ డా. కృష్ణచంద్ర, శాస్త్రవేత్త డా. వూట్ల ప్రవీణ్ కుమార్ తెలిపారు. వివరాలకు.. విశ్రాంత వ్యవసాయ సంయుక్త సంచాలకులు సముద్రాల జనార్దన్‌రావు– 93969 69217, 84640 09350. మార్చి 1–3 తేదీల్లో హైదరాబాద్‌లో సేంద్రియ ఉత్పత్తుల మేళా గోఆధారిత రైతు మిత్ర సంఘం ఆధ్వర్యంలో మార్చి 1, 2, 3 తేదీల్లో హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పారామం నైట్ బజార్లో సేంద్రియ ఉత్పత్తుల మేళా (ప్రదర్శన, అమ్మకాలు, అవగాహన సదస్సులు) జరగనుంది. 1న ఉ. 10 గంటలకు మహా రైతు సమ్మేళనం జరుగుతుంది. సేంద్రియ వ్యవసాయంపై ఇష్టాగోష్టి ఉంటుంది. 2న మ. 3 గంటలకు సేంద్రియ వ్యవసాయంపై సదస్సు ఉంటుంది. 3న మ. 3 గంటలకు జరిగే సేంద్రియ వ్యవసాయం–ఆరోగ్య అవగాహన సదస్సులో స్వతంత్ర శాస్త్రవేత్త డా. ఖాదర్ వలి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ముందుగా పేర్లు నమోదు చేసుకున్న సేంద్రియ, ప్రకృతి వ్యవసాయదారులు తమ ఉత్పత్తులను ఉచితంగా అమ్ముకోవడానికి అనుమతి ఉంటుందని గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం తెలంగాణ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం రాజు తెలిపారు. వివరాలకు.. 76598 55588, 91001 02229, 92465 33243, 98666 47534. -
ఇదిగో ‘సిరి’ లోకం!
ఆరోగ్యం కోసం ఆహారం.. ఆహారం కోసం వ్యవసాయం.. వ్యవసాయం కోసం అడవి! ఇదీ అటవీ వ్యవసాయానికి మూలసూత్రం. రైతు తమకున్న వ్యవసాయ భూమిలో విధిగా (కనీసం 20%) కొద్ది భాగాన్నయినా అటవీ జాతి చెట్ల పెంపకానికి కేటాయించాలని అటవీ వ్యవసాయ (కాడు కృషి) నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త డా. ఖాదర్ వలి సూచిస్తున్నారు. పొలం అంతా ఒకే పంట వేయడం అనర్థదాయకం.. సిరిధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజ పంటలను ఒకే పొలంలో పక్కపక్కనే కలిపి సాగు చేయాలి.. జీవవైవిధ్యంతోనే సాగుకు జవజీవాలు చేకూరతాయని, చీడపీడల బెడద కూడా తగ్గిపోతుందన్నది సారాంశం. అటవీ కృషిపై డా. ఖాదర్ వలితో ఇటీవలి సంభాషణ నుంచి కొన్ని విశేషాలు ‘సాగుబడి’ పాఠకుల కోసం.. ప్రకృతిలో ఏ జీవీ, ఏ వ్యవస్థా ఒంటరిగా మన జాలదు, పరస్పరాధారితంగానే విరాజిల్లుతుంటాయి. ప్రకృతితో, అడవితో వ్యవసాయానికి అంతటి విడదాయరాని అనుబంధం ఉందని అంటారు స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార – ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి. ఇందుకోసం ‘అటవీ వ్యవసాయ’ (కాడు కృషి) పద్ధతికి ఆయన రూపకల్పన చేశారు. మైసూరుకు సమీపంలోని కిబిని డ్యాం దగ్గరలోని తన పదెకరాల వ్యవసాయ క్షేత్రంలో తాను అనుసరిస్తూ రైతులకూ శిక్షణ ఇస్తున్నారు (అటవీ వ్యవసాయంపై డా. ఖాదర్ వలి అభిప్రాయాలతో కూడిన కథనం ‘సిరిధాన్యాలే నిజమైన ఆహార పంటలు’ శీర్షికన 2017 సెప్టెంబర్ 19న, ‘మిక్సీ–సిరిధాన్యాల మిల్లు’ కథనం 2017 డిసెంబర్ 26న ‘సాగుబడి’లో ప్రచురితమైన సంగతి తెలిసిందే). మూడున్నర ఎకరాల్లో అడవిని పెంచుతూ, పక్కనే మిగతా భూమిలో సిరిధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలను పండిస్తున్నారు. ఆ వ్యవసాయ క్షేత్రం విశేషాలను పరిశీలిద్దాం. వర్షపు నీటి సంరక్షణకు కందకాలు వ్యవసాయంలో నీటి కొరతను అధిగమించడానికి పొలంలో కందకాలు తవ్వుకోవడం ద్వారా వర్షపు నీటిని ఎక్కడికక్కడ ఇంకింపజేసుకోవడం తెలివైన పని. డా. ఖాదర్ వలి క్షేత్రం కొండ ప్రాంతం కావడంతో (30%) ఏటవాలుగా ఉంటుంది. వాన నీటిని ఒడిసిపట్టుకోవడంతోపాటు భూసారం కొట్టుకుపోకుండా కాపాడుకోవడం కోసం ప్రతి వంద మీటర్లకు ఒక వరుసలో మీటరు లోతు, మీటరు వెడల్పున కందకాలు తవ్వారు. కందకాలలో 10 మీటర్లకు ఒక చోట కట్ట వేశారు. కందకంలో పండ్ల చెట్లు నాటారు. గట్ల మీద 400 మునగ చెట్లు వేశారు. సేంద్రియ వ్యవసాయ క్షేత్రంలోకి పరిసర పొలాల నుంచి రసాయనిక అవశేషాలతో కూడిన వర్షపు నీరు రాకుండా చూసుకోవడం అవసరం. బయటి నుంచి వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చే వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేయడానికి సరిహద్దు చుట్టూ అడుగు లోతు, అడుగు వెడల్పున కందకం తవ్వారు. సరిహద్దులో అక్కడక్కడా పెద్ద గుంతలు ఏర్పాటు చేశారు. రసాయనిక అవశేషాలకు విరుగుడుగా ఆ గుంతల్లో ‘అటవీ చైతన్య ద్రావణం’ పోసి, వాన నీటిని భూమిలోకి ఇంకింపజేస్తారు. అక్కడి సాధారణ వార్షిక వర్షపాతం 800 ఎం.ఎం.–1000 ఎం.ఎం. మధ్య ఉంటుంది. తొలి పంట వర్షాధారంగానే సాగు చేస్తారు. భూమిలోకి ఇంకింపజేసిన నీటిలో మూడింట రెండొంతుల వరకు.. స్ప్రింక్లర్లతో రెండో పంటకు వాడుతున్నారు. సిరిధాన్యాల సాగు ఎలా? కొర్రలు, సామలు, అరికెలు, అండుకొర్రలు, ఊదలను డా. ఖాదర్ వలి సిరిధాన్యాలుగా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. వీటిని ముఖ్య ఆహారంగా తింటూ ఉంటే కొద్దికాలంలో జబ్బులను తగ్గించుకోవడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ఆయన చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సిరిధాన్యాల వినియోగం బాగా పెరిగినందున రైతులు సైతం వీటి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఇంతకీ సిరిధాన్యాల సాగుపై డా. ఖాదర్ వలి సూచనలేమిటో చూద్దాం. మిశ్రమ సాగే మేలు ప్రతి రైతు భూమిలో కనీసం 20% విస్తీర్ణంలో అడవిని పెంచాలి. మిగతా 80% భూమిలో పంటలు పండించుకోవాలి. సిరిధాన్యాలను ఏక పంట (మోనో క్రాప్)గా కాకుండా పప్పుధాన్యాలు (అపరాలు), నూనెగింజలతో కలిపి పండించడం ఉత్తమం. సాగుకు ఎంపిక చేసుకున్న పొలంలో 60% విస్తీర్ణంలో కొర్రలు లేదా సామలు లేదా అరికెలు లేదా అండుకొర్రలు లేదా ఊదలు, 30% విస్తీర్ణంలో కంది/ పెసర/ వేరుశనగ/ శనగ/ మినుము వంటి పప్పుధాన్యాలు, 10% విస్తీర్ణంలో నువ్వులు లేదా కుసుమలు లేదా వేరుశనగ వంటి నూనె నూనెగింజలు పక్కపక్కనే సాగు చేయాలి. పప్పుధాన్యం పంట పక్కన ఉన్న పంటలకు వాతావరణం నుంచి గ్రహించిన నత్రజనిని అందిస్తుంది. ఎకరం నుంచి ఏడు ఎకరాల వరకు విస్తీర్ణాన్ని ఒక గ్రిడ్‌గా భావించి మిశ్రమ పంటలను ఈ నిష్పత్తిలో సాగు చేసుకోవాలి. ప్రతి గ్రిడ్‌లో ఈ మూడు రకాల పంటలను పక్కపక్కనే ఉండాలన్న మాట. ఎంత విస్తారమైన పొలంలోనైనా అలాగే గ్రిడ్లుగా విభజించుకొని సాగు చేయాలి. అప్పుడు ప్రతి గ్రిడ్‌లోనూ అన్ని రకాల పంటలూ సాగవుతూ ఉంటాయి. గ్రిడ్‌లో గత పంట కాలంలో వేసిన చోట వచ్చే పంట కాలంలో ఇతర పంటలు వేసేలా పంటల మార్పిడి పాటించాలి. ఉదా.. 20 ఎకరాల పొలం ఉంటే 4 ఎకరాల్లో అడవిని పెంచాలి. 16 ఎకరాల్లో రెండు ఎకరాలకో గ్రిడ్‌గా విభజించి పంటలు పండించాలి. కొన్ని గ్రిడ్లలో సిరిధాన్యాలు ప్రధాన పంటైతే, మరికొన్ని గ్రిడ్లలో కూరగాయలు కూడా ప్రధాన పంటలుగా వేసుకోవచ్చు. టర్పిన్లతో చీడపీడలకు విరుగుడు సిరిధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలను కలిపి సాగు చేయడం ద్వారా చీడపీడల నుంచి తమను తాము రక్షించుకునే శక్తి పంటలకు కలుగుతుంది. ఏ మొక్కలైనా ఆకుల ద్వారా వైవిధ్య భరితమైన వాసనలను గాలిలోకి వదులుతూ ఉంటాయి. ఈ వాసనలను టర్పిన్స్ అంటారు. కొన్ని రకాల మొక్కలు విడుదల చేసే వాసనలు మనుషుల ఇంద్రియాలు గ్రహించగలుగుతాయి. కొన్నిటిని గ్రహించలేవు. మనుషులు గ్రహించలేని వాసనలను కూడా పిల్లులు, కుక్కలు, పందులు, పక్షులు గ్రహించగలుగుతాయి. ఈ వాసనలు పంటలపై చీడపీడలను నియంత్రించడంలో ఉపయోగపడతాయి. అండుకొర్ర మొక్కల వాసనలను గ్రహించడం ద్వారా వేరుశనగ మొక్కలు అంతర్గతంగా చీడపీడలను తట్టుకునే శక్తిని సంతరించుకుంటాయి. అందువల్లనే, కనీసం 3 నుంచి 5 రకాల పంటలను కలిపి మిశ్రమ పంటలుగా సాగు చేస్తే ప్రకృతి సమతుల్యత ఏర్పడుతుంది. ఒకే పంటను వేయడం సమస్యలను ఆహ్వానించడమేనని, పాశ్చాత్య ఆలోచనా ధోరణితో వస్తున్న సమస్య ఇదేనని డా. ఖాదర్ అన్నారు. అండుకొర్రలు వర్సెస్ అడవి పందులు అండుకొర్ర పంట మొక్కలు విడుదల చేసే వాసనలు (టర్పిన్లు) అడవి పందులకు సుతరాము గిట్టదు. పొలానికి చుట్టూతా 4 వరుసలుగా అండుకొర్రలను సాగు చేస్తే ఆ పొలం వైపు అడవి పందులు రాకుండా దూరంగా ఉంటాయి. ∙డా. ఖాదర్ పొలంలో మిశ్రమ పంటల సాగు వరి, సిరిధాన్యాల సాగుకు కావాల్సిన నీరెంత? సిరిధాన్యాలుగా మనం పిలుచుకుంటున్న కొర్రలు, అరికలు, అండుకొర్రలు, సామలు, ఊదలను నాలుగు వర్షాలు పడితే చాలు.. అంతగా సారం లేని మెట్ట భూముల్లో కూడా పండించుకోవచ్చు. వరి ధాన్యం, చెరకు వంటి పంటలు పండించడానికి సాగు నీరు పెద్ద మొత్తంలో అవసరమవుతోంది. కిలో వరి బియ్యం పండించానికి 9,000 లీటర్ల నీరు, కిలో సిరిధాన్యాల (కొర్రలు, అరికలు, అండుకొర్రలు, సామలు, ఊదల)ను సాగు చేయడానికి 300 లీటర్ల నీరు చాలు. అంటే, కిలో వరి బియ్యంతో ఐదుగురికి ఒకసారి భోజనం పెట్టవచ్చు. 30 కిలోల సిరిధాన్యాలతో 240 మందికి ఒకసారి భోజనం పెట్టవచ్చు (పట్టిక చూడండి). నీటి వనరులు నానాటికీ క్షీణిస్తున్న ఈ తరుణంలో ప్రధాన ఆహార పంటలుగా సిరిధాన్యాలను సాగు చేసుకోవడమే అన్ని విధాలా ఉత్తమ మార్గమని మనందరం గ్రహించాలని డా. ఖాదర్ చెబుతున్నారు. అటవీ చైతన్య ద్రావణంతో జవజీవాలు నిస్సారమైన భూములను సైతం మూడు నెలల్లో సారవంతం చేయడానికి భూసార వర్థిని అయిన ‘అటవీ చైతన్య’ ద్రావణం ఉపయోగపడుతుందని డా. ఖాదర్ అంటున్నారు. ఇది ఎరువు కాదు. భూమిలో సూక్ష్మజీవ రాశిని ఇబ్బడిముబ్బడిగా పెంపొందించే తోడు (మైక్రోబియల్ కల్చర్) మాత్రమే. అటవీ చైతన్య ద్రావణం తయారు చేసే పద్ధతి: 20 లీటర్ల కుండలో 10 లీటర్ల నీరు పోసి, లీటరు అటవీ చైతన్యం కలిపి, పావు కిలో సిరిధాన్యాల పిండి, పావు కిలో పప్పుల పిండి, 50 గ్రాముల తాటి బెల్లం కలపాలి. దీన్ని రోజూ కలియదిప్పాలి. వారం రోజులకు వాడకానికి సిద్ధమవుతుంది. 21 రోజుల వరకు వాడుకోవచ్చు. ఏమిటి ప్రయోజనం? ఆమ్ల, క్షార గుణాలు సమసిపోయి భూమి సాధారణ స్థితికి చేరుకొని జవజీవాలను సంతరించుకోవడానికి అటవీ చైతన్య ద్రావణం దోహదం చేస్తుంది. లీటరు అటవీ చైతన్య ద్రావణానికి 20 లీటర్ల నీరు కలిపి నేలపై పిచికారీ చేయాలి. సాయంత్రం 5–6 గంటల మధ్య భూమిపై అటవీ చైతన్య ద్రావణాన్ని పిచికారీ చేస్తే మూడు–ఆరు నెలల్లో ఆ భూమి సాగుకు యోగ్యంగా జీవవంతం అవుతుందని డా. ఖాదర్ చెబుతారు. మొదటి నెలలో.. వారానికి 2 సార్లు, రెండో నెలలో.. వారానికోసారి, మూడో నెలలో.. 10 రోజులకోసారి, నాలుగో నెల నుంచి 15 రోజులకోసారి అటవీ చైతన్య ద్రావణం పిచికారీ చేస్తూ ఉంటే భూసారం పెరుగుతుంది. సాయంత్రం వేళల్లో పిచికారీ చేస్తాం కాబట్టి ఉదయం కల్లా నేల పీల్చుకొని నేల జవజీవాలను పొందుతుంది. ఆచ్ఛాదన వేయాల్సిన అవసరం లేదు. ఎండలు మండిపోయే మే నెలలో తప్ప ఏడాది పొడవునా దీన్ని పిచికారీ చేసుకోవచ్చని డా. ఖాదర్ తెలిపారు. అటవీ ప్రసాదం అటవి వ్యవసాయానికి మూలాధారమని డా. ఖాదర్ వలి చెబుతున్నారు. అందుకే పొలంలో 20% శాతంలో అటవీ జాతి చెట్లను పెంచాలని, ఆ చెట్లు రాల్చే ఆకులను పోగు చేసి, వేసవిలో పొలంలో చల్లి, ఆ ఆకులపై ‘అటవీ చైతన్య’ ద్రావణం పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి. భూమి లోతుల నుంచి పోషకాలను గ్రహించే చెట్లు రాల్చిన ఆకులే ‘అటవీ ప్రసాదం’ వంటివని, భూమికి పోషకాహారమని అంటారు. అటవీ సహితం చీడపీడల బెడద నుంచి పంటల రక్షణకు ‘అటవీ సహితం’ ద్రావణాన్ని డా. ఖాదర్ వలి వాడుతున్నారు. వివిధ రకాల ఔ«షధ మొక్కల ఆకులతో దీన్ని తయారు చేస్తారు. పాలు కారే మొక్కల ఆకులు 2 రకాలు (జిల్లేడు, మర్రి, పలవర బొప్పాయి వంటివి), 2 చేదు రకాలు (వేప, కానుగ వంటివి), ఆకర్షణీయంగా ఉండే చెట్ల పూలు, ఆకులు (మందార, తంగేడు వంటివి) ఇవన్నీ 6 కేజీలు తీసుకొని.. దంచాలి. దీన్ని కుండలో వేసి లీటరు దేశీ ఆవు మూత్రం, 10 లీటర్ల నీరు కలిపి.. వారం మురగబెట్టాలి. తర్వాత వడకట్టుకొని లీటరుకు 20 లీటర్ల నీరు కలిపి పంటలపై పిచికారీ చేయాలి. అటవీ చైతన్య ద్రావణం ఔషధ మొక్కలు ఒకే పంట సాగు చేయడం మూర్ఖత్వం! పొలం అంతా ఒకే రకం పంటను పండించడం మూర్ఖత్వం. మోనోకల్చర్ నుంచి బయటకు రావాలి. మిశ్రమ పంటలు సాగు చేయాలి. అటవీ కృషి పద్ధతుల్లో 30 రకాల పంటలు పండించమని సూచిస్తున్నాం. కనీసం 5 రకాలైనా పొలంలో పెంచుకోవడం రైతులు అలవాటు చేసుకోవాలి. సిరిధాన్య పంటలకు కూడా కొన్ని చోట్ల కత్తెర పురుగు సోకడానికి కారణం ఒకే పంటను సాగు చేయడమే. పొలంలోని విస్తీర్ణంలో 60% ఏక దళ పంటలు, 30% పప్పుధాన్యాలు, 10% నూనె గింజల పంటలు సాగు చేయాలి. సిరిధాన్య పంటలు, నువ్వులు, గోంగూర, వేరుశనగ వంటి పంటలను కలిపి పండించాలి. కత్తెర పురుగు నివారణకు సీతాఫలం ఆకులు, గింజల ద్రావణం చక్కగా పనిచేస్తుంది. ఒకే పంట పండిస్తూ ఉంటే ఒక పురుగు పోయినా మరొకటి వస్తుంది. మిశ్రమ పంటలే శ్రేయస్కరం. – డాక్టర్ ఖాదర్ వలి, అటవీ కృషి నిపుణులు – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
3న పద్మారంలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ
గ్రామభారతి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3 (ఆదివారం)న రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం పద్మారంలో పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న సీనియర్ రైతు మనోహరాచారి తన వ్యవసాయ క్షేత్రంలో రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఉ. 10 గం.- సా. 4 గం. వరకు శిక్షణ ఉంటుంది. ప్రవేశ రుసుము : రూ. వంద. వివరాలకు.. 97057 34202. 3న కొర్నెపాడులో పండ్లు, కూరగాయల సాగుపై శిక్షణ రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడి గుంట దగ్గరలోని కొర్నెపాడులో ఫిబ్రవరి 3 (ఆదివారం)న ప్రకృతి వ్యవసాయ విధానంలో పండ్ల తోటలు, కూరగాయల సాగుపై శిక్షణ ఇవ్వనున్నారు. ఉద్యాన సహాయ సంచాలకులు రాజా కృష్ణారెడ్డి, డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కరుణశ్రీ రైతులకు శిక్షణ ఇస్తారు. ఉద్యాన శాఖ రాయితీలనూ తెలియజేస్తారు. ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు శిక్షణ ఉంటుంది. రిజిస్ట్రేషన్ వివరాలకు.. 97053 83666, 0863-2286255. 16 నుంచి పర్మాకల్చర్ డిజైన్ కోర్సు అరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్స్ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ శాశ్వత వ్యయసాయ (పర్మాకల్చర్) నిపుణులు కొప్పుల నరసన్న ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు పర్మాకల్చర్పై శిక్షణా శిబిరం(పర్మాకల్చర్ డిజైన్ కోర్సు) జరగనుంది. జహీరాబాద్ సమీపంలోని బిడకన్నె గ్రామంలో అరణ్య సంస్థ ఏర్పాటు చేసిన సుసంపన్న శాశ్వత వ్యవసాయ క్షేత్రంలో శిక్షణ ఉంటుంది. నరసన్న, పద్మతోపాటు పలువురు నిపుణులు అనేక అంశాలపై శిక్షణ ఇస్తారు. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు.. 79817 55785, 040 - 24142295. మార్చిలో హైదరాబాద్‌లో సేంద్రియ ఉత్పత్తుల మేళా అమృతాహారాన్ని పండిద్దాం, ఆరోగ్య తెలంగాణను సాధిద్దాం అన్న నినాదంతో మార్చి 1,2,3 తేదీల్లో హైదరాబాద్(హైటెక్ సిటీ) శిల్పారామం నైట్ బజార్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి సేంద్రియ మేళా నిర్వహించనున్నట్లు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం తెలంగాణ అధ్యక్షులు డా. ఎ. వీరభద్రరావు, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం రాజు (76598 55588) తెలిపారు. సేంద్రియ రైతుల ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలతోపాటు ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, అటవీ కృషి నిపుణులు డా. ఖాదర్ వలి తదితరులతో మూడు రోజులూ అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. అటవీ చైతన్య ద్రావణం పంపిణీ చేస్తారు. స్టాల్స్, ఇతర వివరాలకు.. 76598 55588, 91001 02229. -
27,28,29 తేదీల్లో డా. ఖాదర్‌వలి ప్రసంగాలు
సిరిధాన్యాలు–కషాయాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందే మార్గాలు, సిరిధాన్యాలను రసాయన రహిత పద్ధతుల్లో పండించుకోవడంపై జనవరి మూడో వారంలో తెలుగు రాష్ట్రాల్లో వివిధ చోట్ల ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార, ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి ప్రసంగించనున్నారు. ప్రవేశం ఉచితం. జనవరి 27 (ఆదివారం)న ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు విజయవాడలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ గ్రౌండ్ (పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డు)లో సిరిధాన్యాలపై రాష్ట్రస్థాయి సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది. వివరాలకు.. 98481 23050, 99632 32104, 98493 12629. జనవరి 28 (సోమవారం) ఉ. 10– మ. 1 గం. వరకు ఖమ్మంలోని ఇ.ఆర్.ఆర్. రిసార్ట్స్ (మమతా ఆసుపత్రి రోడ్డు)లో తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్, ఇ.ఆర్.ఆర్. రిసార్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే సభలో డాక్టర్ ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. 98490 01725, 70939 73999 జనవరి 28 (సోమవారం)న సా. 4 గం.– రా. 7 గం. వరకు నల్లగొండలోని లక్ష్మీ గార్డెన్స్ (హైదరాబాద్ రోడ్డు)లో డాక్టర్ ఖాదర్ వలి ప్రసంగిస్తారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్, లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహిస్తున్నాయి. వివరాలకు.. 98486 99282, 70939 73999. జనవరి 29 (మంగళవారం)న ఉ. 10 గం. – మ. 1 గం. వరకు హైదరాబాద్ మెహిదీపట్నంలోని అశోక గార్డెన్స్, కొణిజేటి ఎన్క్లేవ్ (ఎక్స్‌ప్రెస్ హైవే పిల్లర్ 83 వద్ద)లో డాక్టర్ ఖాదర్ వలి సిరిధాన్యాల సాగు, అటవీ చైతన్య ద్రావణం తయారీ, సిరిధాన్యాలను మిక్సీలతో శుద్ధి చేయడంపై తదితర అంశాలపై ప్రసంగిస్తారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్, కొణిజేటి గార్డెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహిస్తున్నాయి. వివరాలకు.. 94419 27808, 70939 73999. 26న చెవుటూరులో ప్రకృతి సేద్యంపై శిక్షణ కృష్ణా జిల్లా జి. కొండూరు మండలం చెవుటూరులోని గోసేవా క్షేత్రంలో ఈ నెల 26 (శనివారం) ఉ. 9 గం.– సా. 4 గం. వరకు ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అనంతపురం జిల్లా బసంపల్లికి చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు తాడిమర్రి నాగరాజు చేత శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గోసేవా క్షేత్రం నిర్వాహకులు పోకూరి బాలకృష్ణ, ఇందిరారాణి తెలిపారు. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 91826 71819, 94407 46074. గోపాలనపై 4 రోజుల సర్టిఫికెట్ కోర్సు గోపాలనలో వివిధ అంశాలపై బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు చెందిన ఎస్.ఎస్.ఐ.ఏ.ఎస్.టి. ఆధ్వర్యంలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు 4 రోజుల సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తున్నట్లు ట్రస్టు బాధ్యులు ఉమామహేశ్వరి తెలిపారు. వివిధ దేశీ జాతులకు చెందిన వెయ్యి ఆవులతో కూడిన గోశాలను ప్రామాణికంగా నిర్వహిస్తున్న బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో శిక్షణ ఇస్తారు. దేశీ ఆవుల విశిష్టత, వాటి ఆలన – పాలన, సేంద్రియ మేత, ఎ2 పాల ఉత్పత్తి, గోమయం, గోమూత్రాలతో ఫినాయిల్, విభూది, అగర్బత్తీ, పంచగవ్య వంటి ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇస్తారు. కోర్సు చందా: రూ. 5 వేలు. రిజిస్ట్రేషన్ ఇతర వివరాలకు.. 90004 08907, 79937 95246, 93810 25358. -
17,18 తేదీల్లో సిరిధాన్యాల అటవీ వ్యవసాయంపై శిక్షణ
అటవీ కృషి నిపుణులు డా. ఖాదర్ వలి పర్యవేక్షణలో కర్ణాటకలో జనవరి 17, 18 తేదీల్లో అటవీ చైతన్య ద్రావణంతో భూసారం పెంపుదల, సిరిధాన్యాలు – పప్పుధాన్యాల మిశ్రమ సాగు, సిరిధాన్యాల శుద్ధి విధానాలపై తెలుగు రైతుల కోసం శిక్షణా కార్యక్రమం జరగనుంది. హెచ్.డి. కోటెకు దగ్గరలోని హ్యాండ్ పోస్టులోని మైరాడ బేస్ క్యాంప్‌లో వసతి. బిదర హల్లి కబిని డ్యాం దగ్గర గల అటవీ వ్యవసాయ క్షేత్రంలో శిక్షణ నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ ఇతర వివరాలకు.. 99017 30600, 81234 00262, 93466 94156. మార్చి 15–17 తేదీల్లో నాగపూర్ బీజోత్సవం మహారాష్ట్రలోని నాగపూర్ నగరంలో వరుసగా ఏడో ఏడాది దేశీ బీజోత్సవం జరగనుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విత్తన పరిరక్షకులు విత్తనాలను ప్రదర్శనకు ఉంచుతారు. ఈ బీజోత్సవంలో దేశీ వంగడాలతోపాటు సేంద్రియ ఆహారోత్పత్తులు, సుస్థిర జీవన శైలికి దోహదపడే ఉత్పత్తులు, సేంద్రియ ఖాదీ తదితర ఉత్పత్తులను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు.. 90750 12745 13న కొర్నెపాడులో సేంద్రియ పశుగ్రాసం సాగుపై శిక్షణ ప్రకృతి వ్యవసాయ విధానంలో పశుగ్రాసాలు, సూపర్ నేపియర్ సాగుపై గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు రైతు శిక్షణా కేంద్రంలో జనవరి 13 (ఆదివారం)న రైతు సీతారామశాస్త్రి, గన్నవరం పశువైద్య కళాశాల ప్రొఫెసర్– హెడ్ డాక్టర్ సి.హెచ్.వెంకట శేషయ్య రైతులకు ఉ. 10 గం.ల నుంచి సా. 5 గం.ల వరకు శిక్షణ ఇస్తారు. అనంతరం శిక్షణకు హాజరైన రైతులకు సూపర్ నేపియర్ కణుపులను ఉచితంగా పంపిణీ చేస్తారు. పాల్గొనదలచిన రైతులు రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు సంప్రదించవలసిన నంబర్లు.. 97053 83666, 0863 2286255 -
జనవరిలో కట్టె గానుగతో నూనెల ఉత్పత్తిపై శిక్షణ
సహజ సాగు పద్ధతిలో పండించిన నూనె గింజలతో కట్టె గానుగ ద్వారా వంట నూనెలను నాణ్యతా ప్రమాణాలతో కూడిన పద్ధతుల్లో ఉత్పత్తి చేయడంపై యువతీ యువకులకు న్యూ లైఫ్ ఫౌండేషన్(హైదరాబాద్) శిక్షణ ఇవ్వనుంది. 18 ఏళ్లు నిండిన కనీసం పదో తరగతి చదివిన వారు అర్హులని, హైదరాబాద్ ఎ.ఎస్ రావు నగర్లో 2019 జనవరి 18వ తేదీ నుంచి 7 రోజుల పాటు శిక్షణ ఉంటుందని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివశంకర్ షిండే తెలిపారు. ఆసక్తిగలవారు తమ వివరాలను ఈనెల 31లోగా 81210 08002, 70133 09949 నంబర్లకు ఎస్.ఎం.ఎస్. లేదా వాట్సాప్ ద్వారా సమాచారం పంపవలసిందిగా సూచించారు. జనవరి 18–20 తేదీల్లో సేంద్రియ, చిరుధాన్యాల ప్రదర్శన సేంద్రియ వ్యవసాయోత్పత్తులు, చిరుధాన్యాలపై కర్ణాటక ప్రభుత్వ వ్యవసాయ శాఖలో సేంద్రియ విభాగం ఆధ్వర్యంలో 2019 జనవరి 18–20 తేదీల్లో బెంగళూరులో అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన జరగనుంది. పౌష్టికాహారం, సుస్తిర వ్యవసాయం, రైతు ఆదాయ భద్రత, కొత్త మార్కెట్లు, కొత్త తరం మెచ్చే మేలైన ఆహారం అనే అంశాలకు ఈ ప్రదర్శనలో ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. సేంద్రియ ఉద్యాన ఉత్పత్తులు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాల సాగులో మేలైన పద్ధతులు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ తదితర అంశాలపై చర్చాగోష్టులు కూడా ఏర్పాటవుతున్నాయి. వివరాలకు.. 26641152,53 , 90087 48074 https://organics-millets.in/ ప్రకృతి వ్యవసాయ గీత రచనల పోటీ ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి కృషి చేస్తున్న విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం కేంద్రంగా పనిచేస్తున్న జట్టు ట్రస్టు ప్రకృతి వ్యవసాయ గీతాల పోటీలను నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కవులు, రచయితలు ఈ పోటీలో పాల్గొనవచ్చని ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ డా. డి. పారినాయుడు తెలిపారు. ప్రథమ బహుమతి రూ. 10 వేలు, ద్వితీయ బహుమతి రూ. 5 వేలు, తృతీయ బహుమతి రూ. 5 వేలతోపాటు అంగీకరించిన మరో 10 రచనలకు రూ. వెయ్యి చొప్పున బహుమతులు ఇస్తారు. కవులు, రచయితలు జనవరి 2019 రెండో తేదీ లోగా 94401 64289, 94940 12244 నంబర్లకు వాట్సప్ ద్వారా గాని, jattutrust1 @gmail.comMకు ఈమెయిల్ ద్వారా గాని పంపవచ్చు. 30న హైదరాబాద్‌లో సిరిధాన్యాలపై డా. ఖాదర్ ప్రసంగం సిరిధాన్యాలు, కషాయాలు, కట్టె గానుగ నూనెలు తదితర దేశీ ఆహార పదార్థాలతో ఆధునిక రోగాల నియంత్రణ–నిర్మూలనపై ఈ నెల 30 (ఆదివారం)న సా. 4.30 గం. నుంచి రాత్రి 7 గం. వరకు కూకట్‌పల్లిలోని పి.ఎన్.ఎం. హైస్కూల్ ఆవరణ (కూకట్పల్లి బీజేపీ కార్యాలయం ఎదురు లైన్)లో కృషి రత్న, స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార–ఆరోగ్య నిపుణులు డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారని రైతునేస్తం ఫౌండేషన్ అధ్యక్షులు వై. వెంకటేశ్వరరావు తెలిపారు. వివరాలకు.. 70939 73999, 98493 12627, 96767 97777. -
23న సిరిధాన్యాల సాగుపై కొర్నెపాడులో డా. ఖాదర్ శిక్షణ
ఈ నెల 23న రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో సిరిధాన్యాల సాగుపై అటవీ కృషి పితామహులు, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి రైతులకు శిక్షణ ఇస్తారు. కొర్రలు, అరికెలు, సామలు, ఊదలు, అండుకొర్రల సాగు, అటవీ చైతన్య ద్రావణం తయారీ, మిక్సీతో సిరిధాన్యాల బియ్యం ఉత్పత్తి వంటి అంశాలపై డా. ఖాదర్ రైతు దినోత్సవం సందర్భంగా 23 (ఆదివారం) ఉ. 10గం.ల నుంచి సా.4 గం.ల వరకు శిక్షణ ఇవ్వనున్నారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు తెలిపారు. అదేవిధంగా, సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందే మార్గాలపై ఈనెల 24 (సోమవారం)న ఒంగోలులోని కాపు కళ్యాణ మండపం (పండరిపురం) లో ఉ. 10 గం.ల నుంచి మ. 1 గం.ల వరకు, అదేరోజు సా. 4 గం.ల నుంచి 7 గం.ల వరకు విజయవాడలోని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం(మొగల్రాజపురం), 25(మంగళవారం)న ఉ. 10 గం. నుంచి 12.30 గం. వరకు ఏలూరులోని అమలోద్భవి సెయింట్ మేరీస్ స్కూల్(అశోక్‌నగర్)లో డాక్టర్ ఖాదర్ వలి ఉపన్యసిస్తారు. ప్రశ్నలకు జవాబులిస్తారు. వివరాలకు.. 83675 35439, 96767 97777, 0863–2286255 22, 23 తేదీల్లో నరసాపురంలో సిరిధాన్యాలు–ప్రకృతి సేద్యంపై సదస్సులు ఆంధ్రప్రదేశ్ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, నరసాపురం లయన్స్‌క్లబ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో ప.గో. జిల్లా నరసాపురంలోని వై.ఎన్. కాలేజీ శ్రీ అరవిందో ఆడిటోరియంలో ‘మనం ఏమి తినాలి? ఏమి తింటున్నాం? మనం ఏమి పండించాలి? ఏమి పండిస్తున్నాం’ అనే అంశంపై సదస్సులు జరగనున్నాయి. 22న ఉ. 9 గం.ల నుంచి దేశీ విత్తనాల ప్రత్యేకత– కూరగాయల సాగులో 5 లేయర్ పద్ధతిపై శివప్రసాదరాజు, ఔషధ మొక్కలపై దాట్ల సుబ్బరాజు, ప్రకృతి వ్యవసాయంలో మెలకువలపై సుబ్రహ్మణ్యంరాజు ప్రసంగిస్తారు. మహిళలకు ‘మిల్లెట్స్ రాంబాబు’ చిరుధాన్యాలతో వంటలు నేర్పిస్తారు. 23న ఉ. 9 గం.లకు డా. ఖాదర్ వలి చూపిన బాటలో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందే పద్ధతులు – సిరిధాన్యాల సాగుపై ప్రముఖ ప్రకృతి వ్యవసాయదారుడు ఎం.సి.వి. ప్రసాద్ (ప్రకృతివనం), లయన్స్ క్లబ్ సేంద్రియ వ్యవసాయ విభాగం అధ్యక్షులు డాక్టర్ పి.బి. ప్రతాప్‌కుమార్ (94401 24253) ప్రసంగిస్తారు. ప్రవేశం ఉచితం. అందరూ ఆహ్వానితులే. 27–28 తేదీల్లో అటవీ కృషిపై మైసూరులో శిక్షణ అటవీ వ్యవసాయ పద్ధతిపై రైతులకు ఈ నెల 28, 29 తేదీల్లో కర్ణాటకలోని హెచ్.డి. కోట, హ్యాండ్ పోస్టు బేస్ క్యాంప్, మైరాడలో అటవీ వ్యవసాయ (కాడు కృషి) నిపుణులు డా. ఖాదర్ వలి తెలుగులో రైతులకు శిక్షణ ఇస్తారు. తాను తయారు చేసిన ‘అటవీ చైతన్య ద్రావణం’తో స్వల్పకాలంలోనే భూసారం పెంపుదల, వాన నీటి సంరక్షణ, సిరిధాన్యాలు + నూనెగింజలు + పప్పుధాన్యాల మిశ్రమ సాగు పద్ధతులు, సిరిధాన్యాల బియ్యాన్ని మిక్సీతో తయారు చేసుకోవడం.. వంటి విషయాలపై రైతులకు శిక్షణ ఇస్తారు. తదనంతరం బిదర హల్లి కబిని డ్యాం దగ్గర గల డా.ఖాదర్‌వలి అటవీ వ్యవసాయ మోడల్ ఫామ్ సందర్శన కూడా ఉంటుంది. వివరాలకు.. 81234 00262, 97405 31358, 99017 30600. కూరగాయలు, పండ్లు సోలార్ ప్రాసెసింగ్‌పై జనవరిలో శిక్షణ సొసైటీ ఫర్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ (సీడ్) అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో 2019 జనవరి 29 నుంచి 4 రోజుల పాటు సోలార్ డ్రయ్యర్లలో పండ్లు, కూరగాయలను ప్రాసెస్ చేసి, అంతర్జాతీయ ప్రమాణాలతో వివిధ ఆహారోత్పత్తులను తయారు చేయడంపై శిక్షణ ఇవ్వనుంది. వివరాలకు.. ‘సీడ్’ ప్రధాన కార్యదర్శి, ఆర్.శ్యామల: 040–23608892, 96526 87495. -
23న సిరిధాన్యాల సాగుపై కొర్నెపాడులో డా. ఖాదర్ శిక్షణ
ఈ నెల 23న రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో సిరిధాన్యాల సాగుపై అటవీ కృషి పితామహులు, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి రైతులకు శిక్షణ ఇస్తారు. కొర్రలు, అరికెలు, సామలు, ఊదలు, అండుకొర్రల సాగు, అటవీ చైతన్య ద్రావణం తయారీ, మిక్సీతో సిరిధాన్యాల బియ్యం ఉత్పత్తి వంటి అంశాలపై డా. ఖాదర్ రైతు దినోత్సవం సందర్భంగా 23 (ఆదివారం) ఉ. 10 గం.ల నుంచి సా. 4 గం.ల వరకు శిక్షణ ఇవ్వనున్నారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు తెలిపారు. పాల్గొనదలచిన వారు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలి. వివరాలకు.. 83675 35439, 96767 97777, 0863–2286255 16న ఇంటిపంటలపై రఘోత్తమరెడ్డి శిక్షణ గుంటూరు జిల్లా కొర్నెపాడు రైతు శిక్షణా కేంద్రంలో ఈ నెల 16(ఆదివారం)న ఇంటిపంటలపై మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి శిక్షణ ఇస్తారు. టెర్రస్ గార్డెనింగ్, బాల్కనీ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్‌లో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల సాగుపై ఉ. 10 గం.ల నుంచి సా. 5 గం.ల వరకు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 0863–2286255 22, 23 తేదీల్లో నరసాపురంలో సిరిధాన్యాలు–ప్రకృతి సేద్యంపై సదస్సులు ఆంధ్రప్రదేశ్ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, నరసాపురం లయన్స్‌క్లబ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో ప.గో. జిల్లా నరసాపురంలోని వై.ఎన్. కాలేజీ శ్రీ అరవిందో ఆడిటోరియంలో ‘మనం ఏమి తినాలి? ఏమి తింటున్నాం? మనం ఏమి పండించాలి? ఏమి పండిస్తున్నాం’ అనే అంశంపై సదస్సులు జరగనున్నాయి. 22న ఉ. 9 గం.ల నుంచి దేశీ విత్తనాల ప్రత్యేకత– కూరగాయల సాగులో 5 లేయర్ పద్ధతిపై శివప్రసాదరాజు, ఔషధ మొక్కలపై దాట్ల సుబ్బరాజు, ప్రకృతి వ్యవసాయంలో మెలకువలపై సుబ్రహ్మణ్యంరాజు ప్రసంగిస్తారు. మహిళలకు ‘మిల్లెట్స్ రాంబాబు’ చిరుధాన్యాలతో వంటలు నేర్పిస్తారు. 23న ఉ. 9 గం.లకు డా. ఖాదర్ వలి చూపిన బాటలో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందే పద్ధతులు – సిరిధాన్యాల సాగుపై ప్రముఖ ప్రకృతి వ్యవసాయదారుడు ఎం.సి.వి. ప్రసాద్ (ప్రకృతివనం), లయన్స్‌క్లబ్ సేంద్రియ వ్యవసాయ విభాగం అధ్యక్షులు డాక్టర్ పి.బి. ప్రతాప్‌కుమార్ (94401 24253) ప్రసంగిస్తారు. ప్రవేశం ఉచితం. అందరూ ఆహ్వానితులే. ఈజిప్టులో తాటి/ఈత ఉత్పత్తులపై అంతర్జాతీయ సదస్సు ఆరోగ్యదాయకమైన తాటి/ఈత బెల్లం, తదితర ఉప ఉత్పత్తులపై అంతర్జాతీయంగా ఆసక్తి పెరుగుతోంది. ఈజిప్టులోని ఆశ్వన్ నగరంలో ఈ నెల 15–17 తేదీల్లో తాటి/ఈత ఉప ఉత్పత్తులపై తొలి అంతర్జాతీయ సదస్సు(బై–పాల్మ) జరగను ంది. తూ.గో. జిల్లా పందిరిమామిడిలోని తాటి పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పీసీ వెంగయ్య ఈ సదస్సుకు హాజరుకానున్నారు. -
నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో 9, 10, 11 తేదీల్లో డా. ఖాదర్ వలి సభలు
అటవీ కృషి పద్ధతిలో ఆరోగ్యదాయకమైన సిరిధాన్యాలు పండించడం.. సిరిధాన్యాలు, కషాయాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందే మార్గాలపై ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార – ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి డిసెంబర్ 9, 10, 11 తేదీల్లో నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో వివిధ సభల్లో ప్రసంగించనున్నారు. డిసెంబర్ 9 (ఆదివారం) ఉ. 10 గం. నుంచి నెల్లూరు జిల్లా గూడూరులోని దువ్వూరు నారాయణరెడ్డి కమ్యూనిటీ హాలు (ఐ.సి.ఎస్. రోడ్డు)లో, అదే రోజు సా. 4.30 గం. నంచి నెల్లూరులోని జి.పి.ఆర్. గ్రాండ్ (మినీ బైపాస్ రోడ్డు)లో, డిసెంబర్ 10 (సోమవారం) ఉ. 10 గం. నుంచి కడప జిల్లా రాజంపేటలోని తోట కన్వెన్షన్ సెంటర్(మన్నూరు)లో, అదే రోజు సా. 4.30 గం. నుంచి తిరుపతిలోని లక్ష్మీ వేంకటేశ్వర కళ్యాణ మండపం (పద్మావతిపురం, తిరుచానూరు రోడ్డు, తిరుపతి)లో, 11వ తేదీ చిత్తూరులోని డా. బి.ఆర్.అంబేద్కర్ భవన్(కలెక్టర్ బంగ్లా వెనుక) డాక్టర్ ఖాదర్ వలి సభలను నిర్వహిస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు∙తెలిపారు. అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. ఇతర వివరాలకు.. 96767 97777, 70939 73999. జనవరిలో జాతీయ ఉద్యాన ప్రదర్శన–2019 బెంగళూరు హెసరఘట్టలోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐ.ఐ.హెచ్.ఆర్.)ఆధ్వర్యంలో వచ్చే సంవత్సరం జనవరి 23–25 తేదీల్లో జాతీయస్థాయి ఉద్యాన ప్రదర్శన జరగనుంది. ఉద్యాన పంటల సాగులో కొత్త ఆవిష్కరణలను శాస్త్రవేత్తలు, రైతులు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, సాధారణ ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ఐ.ఐ.హెచ్.ఆర్. ఈ ప్రదర్శన నిర్వహిస్తోంది. ఉద్యాన తోటల సాగులో కొత్త సవాళ్లు – పరిష్కారాలపై రైతులు – శాస్త్రవేత్తల మధ్య చర్చలు జరుగుతాయి. ఐ.ఐ.హెచ్.ఆర్., ప్రైవేటు కంపెనీల విత్తనాలు, మొక్కలను అమ్ముతారు. వినూత్న పోకడలతో అభివృద్ధి సాధిస్తున్న ఆదర్శ రైతులను సత్కరిస్తారు. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు... డాక్టర్ ఎ. టి. సదాశివ– 98450 97472 sadashiva.AT@icar.gov.in, డా. టి. ఎస్. అఘోర – 99861 00079 aghora.TS@icar.gov.in 080-23086100 Extn - 280 13,14 తేదీల్లో అటవీ కృషిపై మైసూరులో డా. ఖాదర్ శిక్షణ అటవీ కృషి పద్ధతిపై రైతులకు డిసెంబర్ 13–14 తేదీల్లో హెచ్.డి. కోట, హ్యాండ్ పోస్టు బేస్ క్యాంప్, మైరాడలో అటవీ కృషి నిపుణులు డా. ఖాదర్ వలి, బాలన్ తెలుగులో రైతులకు శిక్షణ ఇస్తారు. అటవీ చైతన్య ద్రావణంతో భూసారం పెంపుదల, వాన నీటి సంరక్షణ, సిరిధాన్యాలు + నూనెగింజలు + పప్పుధాన్యాల మిశ్రమ సాగు పద్ధతులు, సిరిధాన్యాల ధాన్యాన్ని మిక్సీతో బియ్యాన్ని తయారు చేసుకోవడం.. వంటి విషయాలపై రైతులకు శిక్షణ ఇస్తారు. ఫీజు తదితర వివరాలకు.. 93466 94156, 97405 31358, 99017 30600. డిసెంబర్ 8 నుంచి పాలేకర్ 10 రోజుల సేనాపతి శిక్షణ 500 మంది తెలంగాణ రైతులకూ అవకాశం గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ప్రకృతి వ్యవసాయంపై పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్ ఆధ్వర్యంలో డిసెంబర్ 8 నుంచి 17 వరకు సుమారు 8 వేల మంది రైతులకు సేనాపతి శిక్షణా శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఆం. ప్ర. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ శిబిరంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 500 మంది రైతులు కూడా పాల్గొనేందుకు అవకాశం ఉంది. వీరిని ఎంపిక చేసే బాధ్యతను తమకు అప్పగించినట్లు గ్రామభారతి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి సూర్యకళ తెలిపారు. పాలేకర్ స్వయంగా శిక్షణ ఇచ్చే ఈ శిబిరంలో తెలంగాణ రైతులకూ శిక్షణ, భోజనం, వసతి ఉచితం. రైతులు కప్పుకోవడానికి కంబళ్లు వెంట తెచ్చుకోవాలి. శిబిరానికి హాజరయ్యే ఉద్దేశం ఉన్న తెలంగాణ రైతులు గ్రామభారతి ప్రతినిధి ఎం. బాలస్వామిని 93981 94912, 97057 34202 నంబర్లలో సంప్రదించి ముందుగా పేర్లు, వివరాలు నమోదు చేయించుకోవాలని కోరారు. -
నెల్లూరు, గూడూరు, రాజంపేట, తిరుపతిలో డిసెంబర్ 9, 10 తేదీల్లో డా. ఖాదర్ వలి సభలు
అటవీ వ్యవసాయం ద్వారా ఆరోగ్యదాయకమైన సిరిధాన్యాలు పండించడం.. సిరిధాన్యాలు, కషాయాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందే మార్గాలపై ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార – ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి డిసెంబర్ 9, 10 తేదీల్లో నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో వివిధ సభల్లో ప్రసంగిస్తారు. డిసెంబర్ 9 (ఆదివారం) ఉ. 10 గం. నుంచి నెల్లూరు జిల్లా గూడూరులోని దువ్వూరు నారాయణరెడ్డి కమ్యూనిటీ హాలు (ఐ.సి.ఎస్. రోడ్డు)లో, అదే రోజు సా. 4.30 గం. నుంచి నెల్లూరులోని జి.పి.ఆర్. గ్రౌండ్ (మినీ బైపాస్ రోడ్డు)లో, డిసెంబర్ 10 (సోమవారం) ఉ. 10 గం. నుంచి రాజంపేటలోని తోట కన్వెన్షన్ సెంటర్లో, అదే రోజు సా. 4.30 గం. నుంచి తిరుపతిలో డాక్టర్ ఖాదర్ వలి సభలను నిర్వహిస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు తెలిపారు. అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. ఇతర వివరాలకు.. 96767 97777, 70939 73999. -
18,19 తేదీల్లో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో డా. ఖాదర్ సభలు
అటవీ వ్యవసాయ పద్ధతుల్లో కరువు కాలంలోనూ సిరిధాన్యాల సాగు చేసే పద్ధతులు, సిరిధాన్యాలు–కషాయాలతో కూడిన దేశీ ఆహారం ద్వారా ఆధునిక రోగాలన్నిటినీ పారదోలే పద్ధతులపై ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార, ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి ఈ నెల 18, 19 తేదీల్లో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సభల్లో ప్రసంగిస్తారు. 18(ఆదివారం)న ఉ. 10 గం.కు హిందూపురంలోని బెంగళూరు రోడ్డులోని రాజధాని ఫంక్షన్ హాల్లో డా. ఖాదర్ ప్రసంగిస్తారు. 18వ తేదీ సా. 4.30 గం. నుంచి అనంతపురంలోని రామ్‌నగర్ కమ్మ సంఘం ఆడిటోరియంలో డా. ఖాదర్ వలి సభ జరుగుతుంది. వివరాలకు.. భానుజ – 94400 17188, ఆదరణ రామకృష్ణ – 98663 45715, కుళ్లాయస్వామి– 92464 77103. 19(సోమవారం)న ఉ. 10 గం. నుంచి 1 గం. వరకు జెడ్పీ మాజీ చైర్మన్ నారాయణ ఆధ్వర్యంలో గుంతకల్లులోని శంకరానందగిరి స్వామి ఎయిడెడ్ డిగ్రీ కాలేజీ ఆవరణలో డాక్టర్ ఖాదర్ ప్రసంగిస్తారు. వివరాలకు.. నారాయణ(98480 91989). 19న సా. 4.30 గం. నుంచి 8 గం. వరకు కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కాలేజి(బి.క్యాంప్)లో డా. ఖాదర్ ప్రసంగిస్తారు. వివరాలకు.. పి. సూర్యప్రకాశ్‌రెడ్డి – 96038 34633. ప్రవేశం ఉచితం. -
4న మిక్సీతో సిరిధాన్యాల శుద్ధిపై శిక్షణ
సిరిధాన్యాలను మిక్సీలతో ఇంటిపట్టున సులభంగా శుద్ధి చేసి బియ్యం తయారీ, అటవీ చైతన్య ద్రావణంతో సిరిధాన్యాల సాగుపై ఈ నెల 4న గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడులో శిక్షణ ఇస్తారు. ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు శిక్షణ ఉంటుంది. డా. ఖాదర్ వలి అనుయాయి, అటవీ కృషి నిపుణులు బాలన్(మైసూరు) తదితరులు తెలుగులో శిక్షణ ఇస్తారు. పేర్లు నమోదు చేసుకోగోరే వారు 83675 35439, 97053 83666 నంబర్లలో సంప్రదించవచ్చు. -
కరువును జయించిన సిరిధాన్యాలు!
తెలుగు రాష్ట్రాల్లో ఈ ఖరీఫ్ సీజన్లో కొన్ని జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి.వరి వంటి పంటలు కొన్ని జిల్లాల్లో ఎండిపోయాయి. అయితే, వర్షాధారంగా సాగులో ఉన్న కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికలు, ఊదలు వంటి సిరిధాన్య పంటలు మాత్రం కరువును తట్టుకున్నాయి. నెల నుంచి రెండున్నర నెలల వరకు వాన దేవుడు మొహం చాటేసినప్పటికీ.. సిరిధాన్య పంటలు తట్టుకొని బతికాయి. వర్షాభావం వల్ల ఎదుగుదల మందగించి, దిగుబడి కొంత తగ్గినప్పటికీ ఈ పంటలు రైతులను నిరాశపర చకపోవటం విశేషం. అధిక పెట్టుబడులు అవసరమైన ఇతర పంటలు రైతులను నష్టాల ఊబిలోకి నెడుతూ ఉంటే.. స్వల్ప ఖర్చుతోనే సాగైన సిరిధాన్య పంటలు మెట్ట రైతులకు కొండంత భరోసానిస్తున్నాయి. అటవీ కృషి వ్యవసాయ పద్ధతిలో డాక్టర్ ఖాదర్ వలి (మైసూరు) వద్ద శిక్షణ పొంది, ఆయన అందించిన ‘అటవీ చైతన్య ద్రావణం’ ఉపయోగించి సిరిధాన్యాలను విజయవంతంగా సాగు చేస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు రైతుల అనుభవాలు ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం. వత్తుగా చల్లితే కలుపు బెడద ఉండదు! వర్షాధార వ్యవసాయ భూములు 60% వరకు ఉన్నాయి. ఇటువంటి భూములు వేలాది ఎకరాలు పడావు పడి ఉన్నాయి. 15 ఏళ్లుగా బీడుపడిన అటువంటి భూమిలో తెలంగాణకు చెందిన నలుగురు స్నేహితులు ఉమ్మడిగా కొర్రలు, అరికల వంటి సిరిధాన్యాలను వర్షాధారంగా సాగు చేసి సత్ఫలితాలు సాధిస్తున్నారు. విత్తనం వత్తుగా వేశారు. కలుపు తీయలేదు. ఎరువులూ వేయలేదు. పిచికారీలూ చేయలేదు. తక్కువ ఖర్చుతో, అద్భుత పోషక – ఔషధ గుణాలు కలిగిన సిరిధాన్య పంటలను కేవలం వర్షాధారంగా సాగు చేసి ఎకరానికి కనీసం 5–6 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తామని భరోసాతో చెబుతున్నారు. మెట్ట ప్రాంత రైతులకు, ముఖ్యంగా తెలంగాణ రైతులకు ఈ పంటలు ఎంతో అనువైనవని వారు చెబుతున్నారు. కరువును తట్టుకోవటంతో పాటు అప్పులు చేయాల్సిన అవసరం లేని పంటలని చాటిచెబుతున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన ఎమ్మెస్సీ, బీఈడీ చదువుకున్న మైల నర్సింహ, త్రిపురారానికి చెందిన ఎం. శ్యాంప్రసాద్‌రెడ్డి(అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ గ్రీన్‌కార్డ్ కలిగిన ఈయన గత ఏడాది తిరిగివచ్చేసి వ్యవసాయం చేస్తున్నారు), హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆనాజిపురానికి చెందిన పూదిరె భాస్కర్, అల్వాల్‌కు చెందిన అభ్యుదయ రైతు రామానుజం క్రాంతికిరణ్ ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి కలిగిన స్నేహితులు. ‘ప్రకృతి ఆధారిత వ్యవసాయం’ పేరిట రెండేళ్లుగా వాట్సాప్ గ్రూపును నిర్వహిస్తూ రైతుల్లో ప్రకృతి సేద్యంపై అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మైసూరుకు చెందిన అటవీ కృషి నిపుణులు డా. ఖాదర్ వలీ వద్దకు వెళ్లి సిరిధాన్యాల సాగులో జూన్‌లో శిక్షణ పొందివచ్చారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఆడిటోరియంలో సిరిధాన్యాల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు సదస్సును నిర్వహించారు. అధిక పెట్టుబడులకు అప్పులు చేసి పత్తి, వరి తదితర పంటలు సాగు చేయడానికి బదులు తక్కువ పెట్టుబడితో, అధిక లాభాలనిచ్చే సిరి«ధాన్య పంటలను సాగు చేయమని రైతులకు చెప్పడంతోపాటు.. ఈ నలుగురు మిత్రులు కూడా సాగు చేశారు. కౌలు భూమిలో సిరిధాన్యాలు పండిస్తున్న శ్యాం ప్రసాద్‌రెడ్డి, భాస్కర్, నర్సింహ, క్రాంతి చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలోని ఇరవై నాలుగు ఎకరాలలో, చౌటుప్పల్ మండలంలోని లక్కారంలో మరో ఏడు ఎకరాలను కౌలుకు తీసుకొని సిరిధాన్యాల పంటలను ఈ ఏడాది జూలై ఆఖరులో విత్తారు. ఎర్ర నేల పదెకరాల్లో అండుకొర్రలు, ఏడెకరాల్లో ఊదలు, 6 ఎకరాల్లో కొర్రలు, 4 ఎకరాల్లో అరికెలు విత్తారు. మరో ఏడెకరాల నల్లరేగడి నేలలో సామలు విత్తారు. ఎర్త్‌మూవర్‌తో చదును చేయించి ట్రాక్టర్‌తో ఫ్లౌ, కల్టివేటర్ వేయించారు. ఎకరానికి సాధారణంగా 3 కిలోల వరకు ఈ సిరిధాన్య విత్తనాలను రైతులు చల్లుతూ ఉంటారు. అయితే, వీరు ఎకరానికి 4 కిలోల విత్తనాన్ని 3 రెట్లు ఇసుకలో కలిపి వెదజల్లారు. కొన్ని చోట్ల విత్తనం లోతుగా పడి మొలవలేదు. 70% విత్తనం మొలిచింది. తర్వాత 5 వారాల పాటు చెప్పుకోదగ్గ వర్షం పడలేదు. మొదట్లో ఏపుగా పెరిగిన మొక్కలు తర్వాత వాడిపోవటం ప్రారంభమైంది. ఇక ఎండిపోతుందా అనుకున్న దశలో మంచి వర్షం పడింది. ఆశలు వదులుకున్న ఈ నలుగురు మిత్రులు చెలక వైపు వారం వరకు వెళ్లలేదు. తీరా వెళ్లి చూసే సరికి పంట తిప్పుకొని.. ఏపుగా పెరగటంతో ఆశ్చర్యపోయారు. తర్వాత కురిసిన ఒకటి, రెండు వర్షాలతో పంట బాగా ఎదిగింది. దీర్ఘకాలిక పంట అరిక తప్ప మిగతా 4 పంటలు కోతకు వచ్చాయి. వచ్చే వారంలో కోతలు కోయబోతున్నారు. ఈ సిరిధాన్యాల పంటలో కలుపు తీయటం గాని, ప్రత్యేకంగా ఎలాంటి పై మందులు, రసాయన/సేంద్రియ ఎరువులు వాడ లేదు. దుక్కి, విత్తనాల కొనుగోలు, విత్తనాలు చల్లే ఖర్చులు మినహా అదనపు ఖర్చులు చేయకపోవటం విశేషం. నూర్పిళ్ల తర్వాత సిరిధాన్యాల ధాన్యాన్ని పొట్టు తీసి బియ్యంగా, రవ్వగా, పిండిగా మార్చి నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ఈ నలుగురు యువ రైతులు సమాయత్తమవుతున్నారు. – ఎం. వేణు, సాక్షి, చిట్యాల, నల్లగొండ జిల్లా ఎకరానికి ఐదారు క్వింటాళ్ల దిగుబడి మా గుండ్రాంపల్లి గ్రామ శివారులో ఉన్న భూములు గత 15∙ఏళ్ళుగా సాగునీరు లేక పడావు పడి ఉన్నాయి. అలాంటి భూమిని నలుగురు యువ రైతులం కౌలుకు తీసుకొని సిరిధాన్య పంటలు పండిస్తున్నాం. అంతా స్వయంగా పొలం పనులు చేస్తూ సిరిధాన్యాల విత్తనాలు చల్లాం. డబ్బు ఖర్చయ్యే ఎలాంటి రసాయన ఎరువులు, మందులు ఈ పంటలకు అసలు వాడలేదు. దీంతో మాకు ఖర్చు చాలా తగ్గిపోయింది. 5 వారాలు వర్షం లేకపోయినా, పడావు భూముల్లో పంటలు విజయవంతంగా పండించాం. విత్తనాలు వెదజల్లాం. అండుకొర్రలు, సామలు, ఊదలు బాగా పండాయి. ఎకరానికి ఐదారు క్వింటాళ్లు వస్తాయి. కొర్రలు, అరికలు 3–4 క్వింటాళ్లు వస్తాయి. పశువుల ఎరువు తోలుకొని, నాగలి సాళ్లకు వేసుకొని, అంతరసేద్యం చేసుకునే రైతులకు ఎకరానికి 7–8 క్వింటాళ్ల సిరిధాన్యాల దిగుబడి ఖాయంగా వస్తుందని నా నమ్మకం. విత్తనాలను ఉచితంగా ఇస్తాం. – మైల నర్సింహ (99492 59239), గుండ్రాంపల్లి, చౌటుప్పల్ మండలం, నల్లగొండ జిల్లా రెండున్నర నెలలు వర్షం లేకపోయినా.. లక్ష్మీనారాయణరెడ్డిది ఎస్. కొత్తపల్లి. అనంతపురం జిల్లాలో హిందుపూర్‌కు దగ్గర్లో ఉంటుంది. అటవీ కృషి పద్ధతిపై డాక్టర్ ఖాదర్ వలి గారి వద్ద శిక్షణ పొందిన తర్వాత మా పది ఎకరాలలో కొర్ర, అండుకొర్ర, సామ, ఊద, అరికెలను సాగు చేస్తున్నారు. మే, జూన్‌లో వర్షాలు పడిన తర్వాత జూన్‌లో 8 ఎకరాల్లో సిరిధాన్యాల విత్తనాలు వెదజల్లారు. జూన్ 4న నారు పోసి, జూన్ 24న 2 ఎకరాల్లో నీరు పెట్టి నాట్లు వేశారు. తర్వాత పూర్తిగా వర్షాధారంగానే సాగు చేశారు. జూలై, ఆగస్టులో చుక్క వర్షం కురవలేదు. సెప్టెంబర్ మూడో వారంలో, అక్టోబర్ మొదటి వారంలో రెండు వర్షాలు పడ్డాయి. అటవీ చైతన్య ద్రావణాన్ని పంటలపై 3 సార్లు పిచికారీ చేశారు. రెండున్నర నెలలకు పైగా వర్షం కురవకపోవడం వల్ల ఆ ప్రాంతంలో వర్షాధారంగా సాగవుతున్న సీజనల్ పంటలు ఎండిపోయాయి. కానీ, లక్ష్మీనారాయణరెడ్డి పొలంలో సిరిధాన్య పంటలు మాత్రం బెట్టను తట్టుకున్నాయి. పెరుగుదల మందగించిందే తప్ప పంట ఎండిపోలేదు. సుదీర్ఘ విరామం తర్వాత రెండు వర్షాలు పడ్డాయి. వాడిపోయిన పంట ఆశ్చర్యకరంగా మళ్లీ పచ్చబడి, కంకులేసింది. ఒకటి, రెండు వారాల్లో కోతలు కోయబోతున్నారు. వరుసలుగా నాటిన అరికె పంట నాటిన పంటే బాగుంది! 5 రకాల సిరిధాన్యాల్లో ఊదలు, అండుకొర్ర, అరికె పంటలు బాగా పెరిగాయి. కొర్ర బాగానే వచ్చింది కానీ పక్షులు పూర్తిగా తినేశాయి. మాకేమీ మిగల్చలేదు. సామలు సరిగ్గా పెరగలేదు. వెదజల్లిన పంటల కన్నా నాట్లు వేసిన పంట బాగుంది. నాటిన అరికెల దుబ్బుకు 30కి పైగా పిలకలు ఉన్నాయి. ఊద, కొర్రలో 10–15 పిలకలు వచ్చాయి. అండుకొర్ర కూడా చాలా పిలకలు వచ్చాయి. సాధారణంగా రాగులు వేస్తుంటాం. రాగి అయితే ఎండిపోయి ఉండేది. అంతకన్నా తక్కువ నీటితోనే పండేవి కాబట్టే కొర్ర, అండుకొర్ర, అరికె, ఊద, సామ పంటలు రెండున్నర నెలలు ఎండిపోకుండా బతికి ఉన్నాయి. నెలకో వర్షం పడినా ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చేవి. ఇప్పుడు ఎకరానికి 3 క్వింటాళ్ల వరకు రావచ్చనుకుంటున్నాం. ఇంతటి కరువులోనూ మాకు దక్కిన ఆ పాటి సిరిధాన్యాలే మాకు మహాప్రసాదం వంటివి. రైతులంతా ఈ పంటలు పండించుకోవాలి. – ఎస్. లక్ష్మీనారాయణరెడ్డి(99017 30600), ఎస్.కొత్తపల్లి, చిలమత్తూరు మండలం, అనంతపురం జిల్లా ఖరీఫ్‌లో ఒకటే వర్షం కురిసినా ఎకరానికి 5 క్వింటాళ్ల దిగుబడి అటవీ చైతన్య ద్రావణంతో కొర్రలు, అండుకొర్రలు, అరికెలు, సామలు, ఊదలు వంటి సిరిధాన్యాలను ఈ ఖరీఫ్‌లో 40 ఎకరాల్లో సాగు చేశాం. మా దగ్గర ఒకే వర్షం పడింది. మా చుట్టు పక్కల ఇతర పంటలు ఎండిపోయాయి. మా పొలంలో సిరిధాన్యాల పంటలు బెట్టను తట్టుకొని నిలబడ్డాయి. పంట కోతకు వచ్చింది. వచ్చే వారం కోస్తాం. ఎకరానికి 5 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఇంకో రెండు, మూడు వర్షాలు పడి ఉంటే ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. మహబూబ్‌నగర్‌లో ఒక్క వర్షంతోనే పెరుగుతున్న సిరిధాన్య పంటలు; – బసవరాజ్ (93466 94156), గొరిట, నాగర్‌కర్నూల్ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా 7.5 క్వింటాళ్ల దిగుబడి గుంటూరు జిల్లా పుల్లడిగుంట వద్ద కొర్నెపాడులో రైతు శిక్షణా కేంద్రం వద్ద నల్ల రేగడి భూమిలో 10 ఎకరాల్లో ఈ ఖరీఫ్‌లో 5 రకాల సిరిధాన్యాలను సాగు చేశాం. నేలలో ఘనజీవామృతం వేశాం. ఒకటి రెండు సార్లు జీవామృతం పిచికారీ చేశాం. వర్షాధారంగానే సాగు చేశాం. ఇటీవల సామలు నూర్చాం. ఎకరానికి 7.5 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కొర్రలు, ఊదల కంకులు ఔరా అనిపించేంతగా చాలా పెద్దగా పెరిగాయి. ఎకరానికి పది క్వింటాళ్ల దిగుబడి రావచ్చు. మెట్ట రైతులకు సిరిధాన్య పంటలు వరప్రసాదాలే. అందుకే రైతులకూ శిక్షణ ఇస్తున్నాం. – యడ్లపల్లి వెంకటేశ్వరరావు (9849005182), అధ్యక్షుడు, రైతునేస్తం ఫౌండేషన్ కొర్నెపాడులోని తన పొలంలో డా. ఖాదర్‌తో యడ్లపల్లి వెంకటేశ్వరరావు నీటి వసతి ఉన్న భూముల్లోనూ సిరిధాన్యాలను సాగు చేయవచ్చు వర్షాధారంగా వ్యవసాయం చేసే మెట్ట ప్రాంత భూములతోపాటు.. సాగు నీటి సదుపాయం ఉన్న ఆయకట్టు భూముల్లో కూడా సిరిధాన్యాలను సాగు చేసుకోవచ్చు. నాలుగు వర్షాలు పడితే చాలు. వర్షాల మధ్య ఎక్కువ రోజులు ఎడం వచ్చినప్పటికీ తట్టుకొని బతికి మంచి దిగుబడిని అందిస్తాయి. నీటి వసతి ఉన్న భూముల్లోనూ పండుతాయి. ఏడాది పొడవునా వర్షాలు కురిసే ప్రాంతాల్లో సైతం సామలు వంటి సిరిధాన్యాలు పండుతాయి. ఎర్ర నేలలు, రాళ్ల నేలలు, నల్ల నేలల్లోనూ పండుతాయి. – డాక్టర్ ఖాదర్ వలీ, అటవీ కృషి నిపుణులు, మైసూరు మిక్సీలతోనే సిరిధాన్యాల పొట్టు తీయిస్తాం చాలా ఏళ్లుగా పడావుగా ఉన్న 30 ఎకరాల్లో ఈ ఖరీఫ్‌లో 5 రకాల సిరిధాన్య పంటలను సాగు చేశాం. డా. ఖాదర్ వలి గారి వద్ద నుంచి తెచ్చిన అటవీ చైతన్య ద్రావణాన్ని రెండుసార్లు పిచికారీ చేశాం. ఇసుకలో కలిపి విత్తనం చల్లాం. కొన్ని చోట్ల పంట పల్చగా వచ్చింది. పల్చగా మొలిచిన చోట్ల కలుపు పెరిగి, పంట సరిగ్గా ఎదగలేదు. వత్తుగా మొలిచిన చోట్ల పంట బాగానే వచ్చింది. ఈ వారంలో నూర్పిడి చేయబోతున్నాం. నూర్చిన సిరిధాన్యాలను బుచ్చి పద్ధతిలో మిక్సీలతోనే శుద్ధి చేసి పొట్టు తీసి.. వినియోగదారులకు అందించాలన్నది మా ఆలోచన. సిరిధాన్యాల సాగుపై సదస్సు నిర్వహించాం. అటవీ చైతన్య ద్రావణాన్ని చాలా మంది రైతులకు ఇచ్చాం. వచ్చే ఏడాదికి సిరిధాన్యాలు సాగు చేసే చాలా మంది రైతులకు ఈ ద్రావణాన్ని, విత్తనాలను అందిస్తాం. – దత్తా శంకర్ (86398 96343), ధ్యానహిత, షాబాద్, రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో సిరిధాన్య పంటలో దత్తా -
28న హైదరాబాద్‌లో డా. ఖాదర్ వలి ప్రసంగాలు
‘సిరిధాన్యాలు – అమృతాహారం’ అనే అంశంపై ఈ నెల 28(ఆదివారం) ఉ. 10 గం. నుంచి మ. 1.30 గం. వరకు హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పారామం సంప్రదాయ వేదికలో ప్రగతి రిసార్ట్స్ రజతోత్సవాల సందర్భంగా జరిగే సభలో ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి ప్రారంభోపన్యాసం చేస్తారు. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ డబ్ల్యూ.ఆర్.రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని ప్రగతి గ్రూప్ సీఎండీ డా. జీబీకే రావు తెలిపారు. అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. 84990 78294. అదేరోజు సా. 4 గం. నుంచి 7 గం. వరకు శిల్పారామం సంప్రదాయ వేదికలోనే డాక్టర్ ఖాదర్‌వలి దేశీ ఆహారంతో వ్యాధుల్లేని జీవనంపై ప్రసంగిస్తారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు తెలిపారు. వివరాలకు.. 040–23395979. 29న మెహదీపట్నంలో.. వర్షాధారంగా సిరిధాన్యాలు సాగుచేసుకొని, మిక్సీతో శుద్ధి చేసుకొని తినటం ద్వారా ఆధునిక రోగాల నుంచి విముక్తి పొంది సంపూర్ణ ఆరోగ్యం పొందే పద్ధతులపై ఈనెల 29న సా. 5.30 గం. నుంచి 7.30 గం. వరకు హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి ప్రసంగిస్తారు. పిల్లర్ నం. 83 దగ్గర పల్లవి గార్డెన్స్ కొణిజేటి ఎన్‌క్లేవ్‌లో ఉచిత అవగాహన కార్యక్రమం జరుగుతుందని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు తెలిపారు. వివరాలకు.. 9676797777. -
16న షాబాద్‌లో డాక్టర్ ఖాదర్ ప్రసంగం
అటవీ కృషి నిపుణులు, ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార–ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి ఈ నెల 16(ఆదివారం)న రంగారెడ్డి జిల్లా షాబాద్‌లోని ధ్యానహిత హైస్కూల్ ఆవరణలో జరిగే సదస్సులో ప్రసంగిస్తారు. ఉ. 9.30 గం. నుంచి మ. 1 గం. వరకు సదస్సు జరుగుతుందని ధ్యానహిత సొసైటీ డైరెక్టర్ డా. ఎన్. శైలజ తెలిపారు. అటవీ చైతన్య ద్రావణంతో మెట్ట భూముల్లో కొర్రలు, అరికలు వంటి సిరిధాన్యాలను వర్షాధారంగా రసాయనాలు వాడకుండా సహజ పద్ధతిలో సాగు చేసుకునే పద్ధతులు.. సిరిధాన్యాలను రోజువారీ ప్రధానాహారంగా తింటూ షుగర్, ఊబకాయం, రక్తహీనత, కేన్సర్ తదితర ఏ జబ్బులనైనా పూర్తిగా తగ్గించుకునే పద్ధతులను డా. ఖాదర్ వివరిస్తారు. అనంతరం ప్రశ్నలకు బదులిస్తారు. 16వ తేదీ సా. 6 గం.లకు డా. ఖాదర్ ధ్యానహిత స్కూల్ ఆవరణలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారు. రైతులు, మహిళలు, పురుషులు, యువతీయువకులు ఎవరైనా పాల్గొనవచ్చు. ప్రవేశం ఉచితం. డా. ఖాదర్ తయారు చేసిన అటవీ చైతన్య ద్రావణాన్ని 300 మంది రైతులకు ఈ సందర్భంగా ఉచితంగా పంపిణీ చేస్తారని డా. శైలజ వివరించారు. మిక్సీతో సిరిధాన్యాల బియ్యం తయారీపై శిక్షణ కొర్రలు తదితర సిరిధాన్యాలను నూర్చిన తర్వాత మిక్సీతో సులువుగా పొట్టు తీసే పద్ధతిపై 16వ తేదీ సా. 3–5 గం.ల మధ్య రంగారెడ్డి జిల్లా షాబాద్‌లోని ధ్యానహిత హైస్కూల్ ఆవరణలో డా. ఖాదర్, బాలన్ కృష్ణ రైతులు, మహిళా రైతులు, గృహిణులకు ఆచరణాత్మక శిక్షణ ఇస్తారు. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 86398 96343, 94406 65151. -
నేడు హైదరాబాద్ సరూర్‌నగర్‌లో డా. ఖాదర్ సదస్సు
హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని కొత్తపేట బాబూ జగ్జీవన్‌రాం భవన్లో ఈ నెల 28(మంగళవారం)న మ. 3 గం.ల నుంచి సా. 7 గం.ల వరకు ‘సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం– అటవీ కృషి ఆవశ్యకత’పై జరిగే సదస్సులో ప్రముఖ అటవీ కృషి, ఆహార, ఆరోగ్య నిపుణులు డా. ఖాదర్‌వలి ప్రసంగిస్తారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 98493 12629, 040–23395979.