
అటవీ వ్యవసాయం ద్వారా ఆరోగ్యదాయకమైన సిరిధాన్యాలు పండించడం.. సిరిధాన్యాలు, కషాయాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందే మార్గాలపై ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార – ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి డిసెంబర్ 9, 10 తేదీల్లో నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో వివిధ సభల్లో ప్రసంగిస్తారు.
డిసెంబర్ 9 (ఆదివారం) ఉ. 10 గం. నుంచి నెల్లూరు జిల్లా గూడూరులోని దువ్వూరు నారాయణరెడ్డి కమ్యూనిటీ హాలు (ఐ.సి.ఎస్. రోడ్డు)లో, అదే రోజు సా. 4.30 గం. నుంచి నెల్లూరులోని జి.పి.ఆర్. గ్రౌండ్ (మినీ బైపాస్ రోడ్డు)లో, డిసెంబర్ 10 (సోమవారం) ఉ. 10 గం. నుంచి రాజంపేటలోని తోట కన్వెన్షన్ సెంటర్‌లో, అదే రోజు సా. 4.30 గం. నుంచి తిరుపతిలో డాక్టర్ ఖాదర్ వలి సభలను నిర్వహిస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు తెలిపారు. అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. ఇతర వివరాలకు.. 96767 97777, 70939 73999.