
గ్రామభారతి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3 (ఆదివారం)న రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం పద్మారంలో పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న సీనియర్ రైతు మనోహరాచారి తన వ్యవసాయ క్షేత్రంలో రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఉ. 10 గం.- సా. 4 గం. వరకు శిక్షణ ఉంటుంది. ప్రవేశ రుసుము : రూ. వంద. వివరాలకు.. 97057 34202.
3న కొర్నెపాడులో పండ్లు, కూరగాయల సాగుపై శిక్షణ
రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడి గుంట దగ్గరలోని కొర్నెపాడులో ఫిబ్రవరి 3 (ఆదివారం)న ప్రకృతి వ్యవసాయ విధానంలో పండ్ల తోటలు, కూరగాయల సాగుపై శిక్షణ ఇవ్వనున్నారు. ఉద్యాన సహాయ సంచాలకులు రాజా కృష్ణారెడ్డి, డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కరుణశ్రీ రైతులకు శిక్షణ ఇస్తారు. ఉద్యాన శాఖ రాయితీలనూ తెలియజేస్తారు. ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు శిక్షణ ఉంటుంది. రిజిస్ట్రేషన్ వివరాలకు.. 97053 83666, 0863-2286255.
16 నుంచి పర్మాకల్చర్ డిజైన్ కోర్సు
అరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్స్ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ శాశ్వత వ్యయసాయ (పర్మాకల్చర్) నిపుణులు కొప్పుల నరసన్న ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు పర్మాకల్చర్‌పై శిక్షణా శిబిరం(పర్మాకల్చర్ డిజైన్ కోర్సు) జరగనుంది. జహీరాబాద్ సమీపంలోని బిడకన్నె గ్రామంలో అరణ్య సంస్థ ఏర్పాటు చేసిన సుసంపన్న శాశ్వత వ్యవసాయ క్షేత్రంలో శిక్షణ ఉంటుంది. నరసన్న, పద్మతోపాటు పలువురు నిపుణులు అనేక అంశాలపై శిక్షణ ఇస్తారు. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు.. 79817 55785, 040 - 24142295.
మార్చిలో హైదరాబాద్‌లో సేంద్రియ ఉత్పత్తుల మేళా
అమృతాహారాన్ని పండిద్దాం, ఆరోగ్య తెలంగాణను సాధిద్దాం అన్న నినాదంతో మార్చి 1,2,3 తేదీల్లో హైదరాబాద్(హైటెక్ సిటీ) శిల్పారామం నైట్ బజార్‌లో తెలంగాణ రాష్ట్ర స్థాయి సేంద్రియ మేళా నిర్వహించనున్నట్లు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం తెలంగాణ అధ్యక్షులు డా. ఎ. వీరభద్రరావు, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం రాజు (76598 55588) తెలిపారు. సేంద్రియ రైతుల ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలతోపాటు ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, అటవీ కృషి నిపుణులు డా. ఖాదర్ వలి తదితరులతో మూడు రోజులూ అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. అటవీ చైతన్య ద్రావణం పంపిణీ చేస్తారు. స్టాల్స్, ఇతర వివరాలకు.. 76598 55588, 91001 02229.