training
-
అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ 'ప్లేస్మెంట్ ప్రోగ్రామ్': పూర్తి వివరాలు
అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ (Alladi Cloud Training) తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో 'సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్' అనే కార్యక్రమాన్ని బుధవారం (ఫిబ్రవరి 12) ప్రారంభించింది. ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న సమయంలో.. సాఫ్ట్వేర్ రంగంలో మంచి కెరీర్ అందించడానికి ఈ కార్యక్రమం ప్రారంభించారు.అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ ప్రారంభించిన ప్రోగ్రామ్‌లో.. ఏఐఎంఎల్, డేటా సైన్స్, ఫుల్ స్టాక్ జావా & పైథాన్, అజూర్ క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఆటోమేషన్ సెలీనియం టెస్టింగ్, ఎంబెడెడ్ సిస్టమ్, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ వంటి వాటికి సంబంధించిన పాఠ్యాంశాలు ఉంటాయని మల్లెషయ్య అల్లాడి వెల్లడించారు.ఈ కార్యక్రమంలో సుమారు 20 ఏళ్లకంటే ఎక్కువ అనుభవం కలిగిన సాఫ్ట్వేర్ డెవలపర్లు, పరిశ్రమ నిపుణులు అందుబాటులో ఉంటారు. ట్రైనింగ్ సమయంలో మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించడం, ఉద్యోగం సాధించడానికి కావలసిన అన్ని మెళుకువలను నేర్పుతారు. అంతే కాకుండా శిక్షణలో భాగంగా కమ్యూనికేషన్ నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాస తరగతులు కూడా నిర్వహిస్తారు.ట్రైనింగ్ పూర్తయిన తరువాత.. ACTNOW దాని బలమైన నెట్వర్క్ ద్వారా ప్రముఖ టెక్ కంపెనీలతో తగిన ఉపాధి అవకాశాలను కనుగొనడంలో సహాయపడుతుంది. సంబంధిత బ్రాంచ్ స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ, సాఫ్ట్వేర్ అభివృద్ధి పట్ల మక్కువ కలిగి ఉన్న ఎవరైనా ఈ ప్రోగ్రామ్‌లో చేరవచ్చు. -
అంగన్వాడీ సిబ్బందికి 18 నుంచి నైపుణ్య శిక్షణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఈ నెల 18 నుంచి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల ప్రాథమిక అభ్యాసాన్ని మెరుగుపరిచేలా జ్ఞానజ్యోతి కార్యక్రమం ద్వారా శిక్షణ ఇస్తారు. ఇందుకోసం సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ (సాల్ట్) ప్రోగ్రాం సాంకేతిక సహకారం అందించనుంది.మొదటి విడత ఈనెల 18 నుంచి 20 వరకు, రెండో విడత 22, 24, 25 తేదీల్లో నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 1,344 ఉన్నత పాఠశాలలే కేంద్రంగా ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.9.45కోట్లు కేటాయించింది. కాగా, శిక్షణలో పాల్గొనే అంగన్వాడీ సిబ్బందికి రోజువారీ గౌరవ భృతి ఇవ్వాలని ఏపీటీఎఫ్ అమరావతి అధ్యక్షుడు సి.వి.ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
కుంగ్ ఫూ శిక్షణ..ఆత్మరక్షణ కుర్రకారులో భారీ క్రేజ్
ఆత్మ రక్షణ క్రీడలైన కుంగ్ ఫూ, మార్షల్ ఆర్ట్స్ పై నగర వాసులకు ఆసక్తి పెరుగుతోంది. నగరంలోని జీహెచ్ఎంసీ గ్రౌండ్స్ వేదికగా అభ్యాసన చేస్తున్నారు పలువురు క్రీడాకారులు. దీంతో పాటు పతకాలు సాధిస్తూ కొందరు.. స్ఫూర్తిగా మరికొందరు ఈ మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆకర్షితులవుతున్నారు నగరవాసులు. అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలువురు క్రీడాకారులు ప్రతిభను కనబరుస్తూ పతకాలు సాధిస్తున్నారు. – సనత్‌నగర్ నగరంలో ఇటీవలికాలంలో మార్షల్ ఆర్ట్స్ శిక్షణకు ఆదరణ పెరుగుతోంది. తల్లిదండ్రుల్లో ఈ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ పట్ల పెరుగుతున్న అవగాహనే ఇందుకు కారణం. పైగా చిన్నతనం నుంచి ఇటువంటి శిక్షణలో పాల్గొనడంతో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్న మాట. దీంతో చిన్నారులు కూడా ఈ తరహా శిక్షణ తీసుకునేందుకు కఠోర దీక్షతో అభ్యాసన చేస్తున్నారు. అంతేకాకుండా జీహెచ్ఎంసీ గ్రౌండ్స్‌లో నిర్వహించే శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకుంటూ రాటుదేలుతున్నారు. ఆ‘శక్తి’ని గమనించి.. కోచ్‌లు సైతం పిల్లల్లోని ఆ‘శక్తి’ని గమనించి కుంగ్‌ఫూలో ఉన్నత శిక్షణను అందిస్తూ వివిధ పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. బేగంపేట ఓల్డ్ పాటిగడ్డలోని జీహెచ్ఎంసీ గ్రౌండ్, బ్రాహ్మణవాడీ, మాసబ్ ట్యాంక్, విజయనగర్ కాలనీల్లో కుంగ్ ఫూ – మార్షల్ ఆర్ట్స్‌లో గ్రాండ్ మాస్టర్ కంటేశ్వర్, డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ కళ్యాణ్, జీహెచ్ఎంసీ కోచ్ చందు నిరంతరం శిక్షణను అందిస్తున్నారు. 2010 జనవరి 1 నుంచి వీరు శిక్షణ కొనసాగిస్తుండగా ఇప్పటి వరకూ వందలాది మంది కుంగ్ ఫూలో శిక్షణ పొందారు. చదవండి: లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను అమ్మేసిన సోనాక్షి సిన్హా, లాభం భారీగానే! పలు పోటీల్లో... నగరంలో ఎల్బీ స్టేడియం, కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి స్టేడియం, సరూర్‌నగర్, బాలయోగి స్టేడియం తదితర ప్రాంతాల్లో ఎక్కడ పోటీలు జరిగినా ఇక్కడి చిన్నారులు పాల్గొంటూ ప్రతిభను కనబరుస్తున్నారు. ఒక్క నగరానికే పరిమితం కాకుండా రాష్ట్రంలోని వరంగల్, సిర్పూర్ కాగజ్ నగర్, బెల్లంపల్లి, మందమర్రి, ఖాజీపేటతో పాటు ఒడిస్సా, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల్లో జరిగిన జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలను సాధించారు. నాలుగేళ్ల చిన్నారుల నుంచి.. మానసిక, శారీరక దృఢత్వం, ఏకాగ్రత కోసం నాలుగేళ్ల చిన్నారి నుంచి 23 ఏళ్ల యువకుల వరకూ ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. శిక్షణ తీసుకున్న వారిలో చాలామంది వెళ్లిపోగా, ప్రస్తుతం ఆయా కేంద్రాల వేదికగా 70 మంది వరకూ శిక్షణ పొందుతున్నారు. చిన్నతనం నుంచే కుంగ్ ఫూలో శిక్షణ పొందడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయని మాస్టర్లు పేర్కొంటున్నారు. ఇదీ చదవండి : లూపస్ వ్యాధి గురించి తెలుసా? చికిత్స లేకపోతే ఎలా?!కుంగ్ ఫూతో మేలు.. కుంగ్ ఫూ, మార్షల్ ఆర్ట్స్ ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి. శారీరక, మానసిక దృఢత్వం పెరిగి, ఆత్మరక్షణతో పాటు ఆత్మస్థైర్యం పెంపొందుతుంది. మా చిన్నారులు ప్రతిభ కనబరుస్తూ.. పతకాలు సాధించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. – కంటేశ్వర్, కళ్యాణ్, చందు, కంగ్ ఫూ మాస్టర్లు మాస్టర్ల ప్రోత్సాహమే.. కుంగ్ ఫూలో నేను బ్లాక్ బెల్ట్ సాధించాను. మాస్టర్లు, కోచ్‌ల ప్రోత్సాహంతో ఇప్పటి వరకూ ఎన్నో పోటీల్లో పాల్గొన్నాను. మొత్తం 30 బంగారు, 25 వెండి, 15 కాంస్య పతకాలను సాధించానంటే.. అది వారి శిక్షణ ఫలితమే. – వాసు, కుంగ్ ఫూ క్రీడాకారుడు -
ఆలీవ్ ఆసుపత్రి ఆధ్యర్యంలో సీపీఆర్‌పై ప్రత్యేక శిక్షణ
హైదరాబాద్, జనవరి 31 2025 : గుండె జబ్బుల నుంచి ఆపత్కాలంలో బయటపడేసి, ప్రాణాలను నిలిపే అద్భుతమైన వైద్య ప్రక్రియ అయిన కార్డియో పల్మోనరీ రిససిటేషన్(సీపీఆర్)పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని ప్రముఖ కార్డియాలజిస్ట్ డా.కృతిక్ కులకర్ణి అన్నారు. అందుకు ఆలివ్ హాస్పిటల్ ఆధ్యర్యంలో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టిందనీ, సీపీఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లుగా తెలిపారు. సడెన్ హార్ట్ ఎటాక్ బారినపడిన సందర్భంలో ఈ ప్రక్రియతో ప్రాణాలను నిలపవచ్చన్నారు. విశ్వసనీయమైన వైద్య సేవలతో, ఆరోగ్య సంరక్షణలో మెరుగైన ఫలితాలతో పేరుగాంచిన ఆలివ్ హాస్పిటల్ ఈ తరహా కార్యక్రమానికి ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. రోగి ప్రాణాలను కాపాడటంలో సీపీఆర్ సమర్థవంతమైన వైద్య ప్రక్రియ అని, ఈ విషయంపై ప్రతి ఒక్కరు నైపుణ్యత సాధించాల్సిన అవసరం ఉందని డా. కృతిక్ స్పష్టం చేశారు. CPRతో కార్డియాక్ ఎమర్జెన్సీ సమయంలో వైద్య సేవలు అందించేలా పౌరులకు అవగాహన కల్పించడమే శిక్షణ కార్యక్రమం లక్ష్యమన్నారు. ఛాతీపై అరచేతుల సాయంతో ఒత్తిడి ప్రయోగిస్తూ... శ్వాస ప్రక్రియను పునరుద్ధరించాల్సి ఉంటుందన్నారు. దీంతో అవయవాలకు రక్త సరఫరా జరిగి ప్రాణాపాయం తప్పుతుందన్నారు. సీపీఆర్ ద్వారా జీవక్రియలు మూడు రెట్ల వేగంతో జరుగుతాయని పలు అధ్యయనాలు నిరూపితమైంది. కానీ దేశంలో సీపీఆర్‌పై పౌర సమాజానికి అవగాహన లేదని, నైపుణ్యాలను పెంపొందించడమే ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఉద్దేశ్యమని ఆయన తెలిపారు."CPR అనేది ముఖ్యమైన నైపుణ్యం. ఇదీ జీవ విధానంలో నిత్యం చేసుకునే ప్రక్రియల కంటే ఎంతో ముఖ్యమైనదని సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా.కృతిక్ కులకర్ణి అన్నారు. వీలైనంత ఎక్కువ మందికి సీపీఆర్ శిక్షణను అందించడం ద్వారా ఎక్కువ మంది ప్రాణాలను కాపావచ్చన్నారు. అందుకే ఎంతో ముఖ్యమైన సీపీఆర్‌పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. CPR ప్రాథమిక అంశాలను మరింత తెలుసుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని ఆన్లైన్ సమాచార, సోషల్ మీడియా మాధ్యమాలను వినియోగించుకునేలా ఆలీవ్ హాస్పిటల్ కృషి చేస్తుందన్నారు. ఇదీ చదవండి: పోషకాల పాలకూర పచ్చడి : ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్ -
మహిళలకు ఎస్బీఐ ట్రైనింగ్..
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మహిళలకు సాధికారత కల్పించే దిశగా వారికోసం ప్రత్యేకంగా రూపొందించిన శిక్షణా కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. 153 గ్రామీణ స్వయం సమృద్ధి శిక్షణా కేంద్రాల్లో (RSET) దీన్ని ప్రారంభించింది. దీనితో 5,200 మందికి ప్రయోజనం చేకూరగలదని బ్యాంకు తెలిపింది.ఇందులో భాగంగా టైలరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, వర్మికల్చర్ మొదలైన 27 అంశాల్లో శిక్షణా మాడ్యూల్స్ ఉంటాయని వివరించింది. ట్రైనింగ్‌తో పాటు ఆర్థికంగా సహాయం పొందడం, మార్కెట్ లింకేజీలు మొదలైన విషయాల్లోనూ మార్గదర్శకత్వం లభించగలదని బ్యాంకు పేర్కొంది. ప్రారంభ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శైలేష్ కుమార్ సింగ్, ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి వర్చువల్‌గా పాల్గొన్నారు.మహిళా సాధికారతకు కృషిదేశవ్యాప్తంగా స్వయం ఉపాధిని ప్రోత్సహించడంలో ఎస్బీఐ గ్రామీణ స్వయం సమృద్ధి శిక్షణా కేంద్రాల్లో కీలకంగా కృషి చేస్తున్నాయి. ప్రారంభం నుండి ఈ కేంద్రాలు దాదాపు 46,818 శిక్షణా కార్యక్రమాల ద్వారా సుమారు 12.74 లక్షల మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చాయి. వీరిలో 74% మంది అభ్యర్థులు స్వయం ఉపాధిని సాధించారు. దేశ జీడీపీకి మహిళలు దాదాపు 18 శాతం సహకారం అందిస్తున్న నేపథ్యంలో మహిళా సాధికారతను మరింత పెంచాల్సిన అవసరం ఉంది.దేశంలోని మహిళల వ్యవస్థాపకత కలలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణనీయంగా సహాయం చేసింది. స్వయం-సహాయక సమూహాల మహిళలకు అందించిన రుణాల్లో రూ.50,000 కోట్లకు పైగా సహాయంతో ఎస్బీఐ ముందంజలో ఉంది. ఆయా స్వయం-సహాయక సమూహాల్లోని సుమారు కోటి మంది మహిళల జీవితాలలో మార్పు తీసుకురావడంలో కృషి చేసింది. ఎస్బీఐ ద్వారా అందిస్తున్న సామాజిక భద్రతా పథకాలలో మహిళల భాగస్వామ్యం 50% కంటే ఎక్కువగా ఉంది. ఇక కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద బ్యాంకు చేపడుతన్న కార్యక్రమాల్లో మహిళా సాధికారత కీలకమైన అంశంగా ఉంది. -
ఎస్బీఐ ఆధ్వర్యంలో మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ
దేశంలోనే అతిపెద్ద బ్యాంకు మహిళల కోసం శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంహించింది. 21 కోట్లకు పైగా మహిళా ఖాతాదారులున్న గణ తంత్ర దినోత్సవం సందర్బంగా ఎస్బీఐ మహిళల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా సుమారు 5,200 మంది మహిళా అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుందని బ్యాంకు ప్రకటించింది.ఈ కార్యక్రమాన్ని (MoRD) కార్యదర్శి శైలేష్ కుమార్ సింగ్, ఎస్బీఐ చైర్మన్ సీఎస్సెట్టి సంయుక్తంగా ప్రారంభించారనీ ఈ ప్రారంభోత్సవంలో SBI ఎండీ వినయ్ టోన్సే కూడా పాల్గొన్నారని ఒక ప్రకటనలో తెలిపింది.'మహిళా సాధికారత' లక్ష్యంలో భాగంగా దీన్ని తీసుకొచ్చింది. 153 గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలలో (RSETIలు) మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన శిక్షణా కార్యక్రమం ద్వారా తన లక్ష్యాన్ని బలోపేతం చేస్తుంది. ఈ కార్యక్రమంలో టైలరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, బ్యూటీ సర్వీసెస్, వర్మికల్చరల్, అగర్బత్తి/కొవ్వొత్తుల తయారీ, తేనెటీగల పెంపకం, సాఫ్ట్ టాయ్ క్రియేషన్, జనపనార ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇవ్వనుందిఅలాగే శిక్షణ తీసుకునేవారికి ఆర్థిక సహాయం, సొంత వెంచర్ ఏర్పాటు, మార్కెట్ లింకేజీలను ఏర్పాటు చేయడంపై మార్గదర్శకత్వ సలహాలు కూడా అందిస్తుంది. శిక్షణ పొందేమహిళల్లో ఉత్సాహం నింపేలా స్థానిక ప్రముఖులు , విజయవంతమైన వ్యవస్థాపకులు వారి అనుభవాలను తెలిపే అవకాశం కూడా ఉంటుంది.ఇది గ్రామీణ మహిళలను స్వావలంబన చేయడంతపాటు “వికసిత్ భారత్” వైపు ఒక అడుగు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ సి.ఎస్. సెట్టి తెలిపారు.మహిళలను నైపుణ్యాలతో సన్నద్ధం చేయడం ద్వారా, దేశ నిర్మాణం విస్తృత లక్ష్యానికి దోహదపడుతూ ఆర్థిక స్వాతంత్ర్యం వైపు మహిళలప్రయాణానికి మద్దతు ఇవ్వడమే తమ లక్ష్యమన్నారు.ఎస్బీఐ చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ద్వారా మహిళలు సాధికారత సాధించి స్థిరమైన జీవనోపాధిని నిర్మించుకోవాలని గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిశైలేష్ కుమార్ సింగ్ అభిలషించారు. గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారతలో ఎస్బీఐ నిబద్ధతను ఆయన ప్రశంసించారు.మహిళల్లో ఆర్థిక అక్షరాస్యత, నైపుణ్యాభివృద్ధి , వ్యవస్థాపకతను పెంపొందించడంలో ఎస్బీఐ RSETIలు పోషించిన కీలక పాత్రను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. -
అద్భుతమై చేతిరాతకోసం చేతనైనంత మేర..!
టెక్నాలజీ యుగంలో చేతిలో సెల్ ఫోన్ వాడుతున్న రోజుల్లో కలంతో దోస్తీ చేయిస్తూ.. చేతితో అక్షరాలను అందంగా రాయిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో చేతిరాత శిక్షణా శిబిరాలను నిర్వహిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు జితేందర్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ డైరెక్టర్ వంపు మల్లయ్య. నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. జగద్గిరిగుట్ట, గాజుల రామారం, సూరారం, చింతల్æ, షాపూర్ నగర్, జీడిమెట్ల ప్రాంతాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో చేతిరాత నేర్చుకో.. మార్కులు పెంచుకో.. అనే నినాదంతో ఇంగ్లిష్ ల్యూసిడా, కర్సివ్ రైటింగ్, తెలుగులో పదాలు ఎలా రాయాలో సూచిస్తూ బడుగు, బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులకు సునాయస పద్ధతిలో, అందమైన చేతిరాతను నేర్పిస్తూ ప్రోహిస్తున్నాడు. – జగద్గిరిగుట్ట నగరంలోని జగద్గిరిగుట్టలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ల్యూసిడా, కర్సివ్ హ్యాండ్ రైటింగ్ శిక్షణను ప్రారంభించారు. విద్యార్థుల్లో మార్పు కనిపించడంతో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మల్లన్నను సంప్రదించడం, విద్యార్థులకు ఉచితంగా మెళకువలు నేరి్పంచడం మెదలుపెట్టాడు. వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పాటు, ఇటీవలె ఓ ప్రభుత్వ పాఠశాలలో శిబిరం నిర్వహిస్తున్న మల్లయ్యను కుత్బుల్లాపూర్ ఎంఈఓ జెమినీ కుమారి అక్కడికి వచ్చి అభినందించి సత్కరించారు. ప్రాణ స్నేహితుడి పేరుతో.. మరణించిన ప్రాణ స్నేహితుడు జితేందర్ పేరుతో అకాడమీ స్థాపించి, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెళకువలు నేర్పుతున్నారు. ఉచితంగా అనేక చేతిరాత శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఇతనికి సహకారం అందిస్తున్నారు. ఎక్కడ పోగొట్టుకున్నాడో.. అక్కడే వెతుక్కుంటూ.. సాంఘిక, గురుకుల సంక్షేమ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదవడంతో పాటు ఇంగ్లీసు ధారాళంగా మాట్లాడలేక పోవడం వల్ల అనేక ఉద్యోగ అవకాశాలు వదులుకోవడంతో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఉన్నత చదువులు చదివి ‘ఎక్కడైతే పోగొట్టుకొన్నామో అక్కడే వెతుక్కోవాలి అన్న పట్టుదలతో అదే ఆంగ్లంలో ల్యూసిడా, కర్సివ్ హ్యాండ్ రైటింగ్ శిక్షణ పొందారు. ఇప్పడు ఆకర్షణీయమైన టెక్నిక్స్‌తో విద్యార్థుల చేతిరాతను మారుస్తున్నాడు. ‘నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ దన్యవాదాలు. విద్యార్థులు చేతిరాతను నిర్లక్ష్యం చేయవద్దు. ఆసక్తి ఉన్న విద్యార్థులు శిక్షణ కోసం 9182989283 సంప్రదించవచ్చు’ అని వంపు మల్లయ్య చెబుతున్నారు. ల్యూసిడా, కర్సివ్ హ్యాండ్ రైటింగ్ శిబిరాలు పంజగుట్టమనం రాసే అక్షరాలు మన మనసుకు అద్దం పడతాయి. మన వ్యక్తిత్వం ఏమిటో మన చేతి రాతలో తెలుస్తుందంటారు. అలాంటి చేతిరాతను ఉర్దూ, ఇంగ్లీషులో ఎలా పెంపొందించుకోవాలి అనే అంశంపై శిక్షణ ఇస్తుంటారు. అదే కేంద్ర ఉన్నత విద్య, ఉర్దూ భాష జాతీయ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎర్రమంజిల్ లోని ఇదారే ఇ అదబియాత్ ఇ ఉర్దూ సెంటర్లోని కాలిగ్రఫీ, గ్రాఫిక్ డిజైన్ ట్రైనింగ్ సెంటర్. ఈ సెంటర్ ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా కాలిగ్రాఫీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో 2022–2024 బ్యాచ్ విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల ప్రపంచ పురాతన కాలపు అక్షరాలు, ఇస్లామ్ పవిత్ర గ్రంథమైన దివ్య ఖురాన్‌ను లిఖించిన అక్షరాలు, అరబిక్, ఉర్దూ, ఇంగ్లిష్ వివిధ ఫాంట్స్‌తో కాగితం, బియ్యం గింజ, మేక చర్మం, కోడిగుడ్డు, బాదాం గింజపై అద్భుత చిత్రాలను, ఖురాన్లో చెప్పిన ప్రవచనాలను ప్రదర్శించారు. దీంతో ఇంగ్లిష్ చేతిరాత ఎలా పెంపొందించుకోవాలి, ఒక లెటర్, పెళ్లి పత్రిక, చెక్‌బుక్‌పై ఎలా రాయాలి అన్న అంశాలను కూడా ఇక్కడ నేర్పుతారని నిర్వాహకులు ఎ.షుఖుర్, సయ్యద్ రఫియుద్దీన్ ఖాద్రీ తెలిపారు. వారం రోజుల శిక్షణ.. జితేందర్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ మా పాఠశాలలో వారం రోజుల పాటు చేతిరాత శిక్షణా తరగతులను నిర్వహించింది. దీని వల్ల ల్యూసిడా రైంటిగ్పై ఆసక్తి పెరిగింది. రానున్న వార్షిక పరీక్షల్లో అధిక మార్కులు సాధిచగలననే నమ్మకం కలిగింది. – దక్షిత, 10వ తరగతి విద్యార్థిని జెడ్పీహెచ్ఎస్ ఆత్మ స్థైర్యం పెరిగింది.. చేతిరాత శిక్షణ నాలో ఆత్మ స్థైర్యాన్ని పెంచింది. రానున్న పదో తరగతి పరీక్షలకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. గతంతో పోలిస్తే నా చేతిరాత మెరుగుపడింది. – శ్వేత, 10వ తరగతి విద్యార్థిని -
జల్లికట్టు చిన్నారి పట్టు
‘జల్లికట్టు’ అంటే ఎద్దును లొంగదీసుకుని దాని కొమ్ములకున్న అలంకరణలను సొంతం చేసుకోవడం. జల్లికట్టు ఎద్దులకు ΄పౌరుషం ఎక్కువ. కొమ్ములకు వాడి ఎక్కువ. తమ మూపురాలను తాకనివ్వవు. అందుకే ఈ మనిషి–పశువు క్రీడ తరాలుగా తమిళనాడులో ఉంది. జల్లికట్టులో దించబోయే ఎద్దుకు తర్ఫీదు ఇస్తూ పదేళ్ల యజిని వార్తల్లోకి ఎక్కింది. రాబోయే సంక్రాంతికి యజిని.. ఎద్దు‘నన్బన్’ చాలా పెద్ద వార్తలనే సృష్టించనున్నాయి.రాబోయే‘΄పొంగల్’కి తమిళనాడులో జల్లికట్టు ధూమ్‌ధామ్‌గా జరగనుంది. మదురై, తంజావూరు, తిరుచిరాపల్లి తదితర ప్రాంతాల్లో ΄పొంగల్ నుంచి మొదలై వేసవి వరకు జల్లికట్టు పోటీలు జరుగుతూనే ఉంటాయి. అక్కడి పల్లెవాసులు కూడా వేలాదిగా వీటిలో పాల్గొంటారు. తమ ఎడ్లను తెచ్చి పాల్గొనేలా చేస్తారు. మన కోళ్ల పందేలకు కోడిపుంజులను తీర్చిదిద్దినట్టే ఇందుకై ఎడ్లనూ తీర్చిదిద్దుతారు. రైతు కుటుంబాల్లో తండ్రులు వారికి తోడు పిల్లలు ఈ పనిలో నిమగ్నమవుతారు. అలాంటి రైతు కూతురే పదేళ్ల వయసున్న యజిని.ఎద్దు– మనిషిమదురైలోని మంగులం అనే గ్రామంలో శ్రీనివాసన్ అనే రైతుకు రెండు ఎడ్లు ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని జల్లికట్టులో పాల్గొనేలా చేస్తున్నాడు. ‘జల్లికట్టు’లో ‘జల్లి అంటే రెండు కొమ్ములకు అలంకరణ వస్త్రాలు ‘కట్టు’ అంటే కట్టడం. రెండు కొమ్ముల మధ్య వెండి లేదా బంగారు నాణేలు కూడా కడతారు. ఆటగాళ్లు పరిగెడుతున్న ఎద్దును తాకి, మూపురం పట్టి నెమ్మదించేలా చేసి ఆ అలంకరణలను, నాణేలను సొంతం చేసుకుంటారు. ఎన్ని సొంతం చేసుకుంటే అంత వీరుడిగా గుర్తింపు. అలాగే ఈ వీరులకు చిక్కకుండా వారి మీద కొమ్ము విసిరి తరిమికొడితే ఆ ఎద్దుకు అంతటి ఘనత. ‘మా ఎద్దు కూడా అంతటి గొప్పదే. చాలా మెడల్స్ సాధించింది’ అంటుంది యజిని.పాపకు స్నేహితుడుయజినికి ఐదేళ్లుండగా తండ్రి ఎద్దులను కొన్నాడు. వాటిలో ఒకదానికి యజిని‘నన్బన్’ (స్నేహితుడు) అనే పేరు పెట్టింది. రోజూ దానికి మేత వేయడం, నీళ్లు పెట్టడం, కబుర్లు చెప్పడం ఇదే పని. ‘నేను దగ్గరికి వెళితే ఏమీ చేయదు. పిలవగానే వచ్చేస్తుంది’ అంటుంది యజిని. గత మూడేళ్లుగా జల్లికట్టులో తండ్రితో పాటు నన్బన్ను తీసుకొని వెళుతోంది యజిని. ‘వాడివాసల్ (స్టార్టింగ్ పాయింట్) నుంచి మా నన్బన్ పరుగు అందుకోగానే చాలామంది ఆటగాళ్లు దాని మూపురం పట్టుకోవాలని, కొమ్ములు అందుకోవాలని ట్రై చేస్తారు. కాని మా నన్బన్ అందరి మీదా బుసకొట్టి దూరం పోయేలా చేస్తుంది. ఆట గెలిచాక బుద్ధిగా నా వెంట ఇంటికి వస్తుంది. ఆ ఎద్దు – ఈ ఎద్దు ఒకటేనా అన్నంత డౌట్ వస్తుంది’ అంటుంది యజిని.ట్రైనింగ్జల్లికట్టు కోసం ట్రైనింగ్ యజిని ఇస్తోంది తండ్రితో పాటు. జల్లికట్టులో పాల్గొనే ఎద్దును రోజూ వాకింగ్‌కి, స్విమ్మింగ్‌కి తీసుకెళ్లాలి. తడి నేలలో, మెత్తటి నేలలో కొమ్ములు గుచ్చి కొమ్ములు బలపడేలా చేయాలి. దీనిని ‘మన్ కుథల్’ అంటారు. ఇక మంచి తిండి పెట్టాలి. ఇవన్నీ యజిని చేస్తోంది. ‘నేను ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటున్నా. గవర్నమెంట్ జల్లికట్టు కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎద్దుకు ఎటువంటి అపాయం కలక్కుండా రూల్స్ పెట్టింది. అందుకే నన్బన్ను నేను ధైర్యంగా పోటీకి తీసుకెళ్తా’ అంటోంది యజిని. -
MahaKumbh 2025: టూర్ గైడ్లు, ట్యాక్సీ డ్రైవర్లు, వెండర్లు, సెయిలర్లకు శిక్షణ
2025, జనవరి 13 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరగనుంది. దీనికి సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మేళాకు మన దేశం నుంచే కాకుండా ప్రపంచంలోని నలుమూలల నుంచి కూడా జనం తరలిరానున్నారు.ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడికి తరలివచ్చే భక్తులకు సౌకర్యాలు, ఇతర సదుపాయాలు కల్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పర్యాటకశాఖ అధికారులు(Tourism officials) ఇక్కడికి వచ్చే భక్తులకు ప్రయాగ్‌రాజ్ చారిత్రక వైశిష్ట్యాన్ని తెలిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సిటీ టూర్ గైడ్లు, ట్యాక్సీ డ్రైవర్లు, వెండర్లు, సెయిలర్లకు శిక్షణ అందిస్తున్నారు. వీరు కుంభమేళాకు తరలివచ్చే పర్యాటకులకు సహకారం అందించనున్నారు.లక్నోలోని కాన్షీరామ్ టూరిజం మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్తో పాటు మరో సంస్థతో టూరిజం శాఖ ఎంవోయూ కుదుర్చుకుని ఔత్సాహికులకు శిక్షణ అందిస్తున్నదని ప్రాంతీయ పర్యాటక అధికారి అపరాజిత సింగ్ చెప్పారు. పర్యాటకులకు మెరుగైన అనుభూతిని అందించేందుకే ఈ శిక్షణా కార్యక్రమాన్ని నాలుగు కేటగిరీలుగా విభజించి శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. గైడ్ శిక్షణ కార్యక్రమం ఐదు రోజుల పాటు ఉంటుందని ట్రైనింగ్ డైరెక్టర్ ప్రఖర్ తివారీ తెలిపారు. ఈ గైడ్లకు ప్రథమ చికిత్స(First aid)పై కూడా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.అదేవిధంగా ట్యాక్సీ డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణతో పాటు డిజిటల్ చెల్లింపులపై అవగాహన కల్పిస్తున్నారు. పర్యాటకులతో ఎలా ప్రవర్తించాలనేదానిపై కూడా పలు సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. ప్లాస్టిక్ రహిత(Plastic-free) కుంభమేళాపై పర్యాటకులకు వివరించాలని అధికారులు శిక్షణార్థులకు తెలియజేస్తున్నారు. కాగా వివిధ విభాగాల్లో మొత్తం 4,200 మందికి శిక్షణ ఇవ్వాలని పర్యాటక శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. 360 మంది సెయిలర్లు, 451 మంది ట్యాక్సీ డ్రైవర్లు, 871 మంది గైడ్లు ఇప్పటికే శిక్షణ పొందారు.ఈ కార్యక్రమంలో శిక్షణ పొందుతున్న వారికి ప్రజారోగ్యం, పరిశుభ్రత, సీపీఆర్‌పై కూడా శిక్షణ ఇస్తున్నట్లు డాక్టర్ పుష్కర్ త్రిపాఠి తెలిపారు. మరోవైపు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పలు ఆలయాల సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. భరద్వాజ ఆశ్రమం కారిడార్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. అలాగే ఆలోప్ శంకరి ఆలయం, పాండేశ్వర్ మహాదేవ్, మంకమేశ్వర్ ఆలయం, దశాశ్వమేధ ఆలయాలలో ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరిచారు.ఇది కూడా చదవండి: New Year Celebration: రాజధాని సిద్ధం.. వేడుకలకు జనం సన్నద్ధం -
మహిళాశక్తి శిక్షణ : సత్తా చాటిన మహిళలు
చికెన్ బిర్యాని, సాధారణ బిర్యాని, బేసిక్ గ్రేవీస్, తెలంగాణ స్నాక్స్, రైతా, వెజ్ దమ్ బిర్యాని, చికెన్ కర్రీ, మిర్చి మసాల, రకరకాల అన్నం తయారీ, టీ, విభిన్న రకాల కాఫీ, సావరీ, వంటి వివిధ మెనూలను అదరగొట్టారు ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్ల నిర్వాహకులు. చెఫ్‌లు మహేష్ నిథమ్ ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్, ప్రముఖ చెఫ్ డాక్టర్ ఎంకె గణేష్, ప్లేస్మెంట్ ఆఫీసర్ మిసెల్లీ జే ఫ్రాన్సిస్ పర్యవేక్షణలో ఐదో బ్యాచ్‌లో 28 మంది మహిళలకు వంటల తయారీ, క్యాంటీన్ నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. -రాయదుర్గం పరిశుభ్రమైన వాతావరణంలో, స్వచ్ఛమైన, నాణ్యమైన వస్తువులతో ఆహార పదార్థాలను తయారు చేసి అందించేలా ఏర్పాట్లు చేయడం, దీనిపై మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం విశేషమని శిక్షణలో పాల్గొన్న మహిళలు అన్నారు. పదిరోజుల పాటు అందించిన శిక్షణలో భాగంగా చివరి రోజైన సోమవారం మహిళలు నేర్చుకున్న వంటకాలన్నీ స్వయంగా తయారుచేసిన ప్రదర్శించారు. ఈ వంటకాలను నిథమ్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (ఎస్ఈఆర్పీ), పర్యాటక శాఖ అధికారులు, ఫ్యాకల్టీ ప్రతినిధులు పరిశీలించారు. అనంతరం ఎస్ఈఆర్పీ డైరెక్టర్ డబ్ల్యూ జాన్సన్, ప్రాజెక్ట్ మేనేజర్ శ్రావణ్, నిథమ్ అధికారులు శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందించారు. ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం.. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడానికే క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని ఎస్ఈఆర్పీ డైరెక్టర్ డబ్ల్యూ జాన్సన్ తెలిపారు. శిక్షణ ముగింపు సందర్భంగా మాట్లాడుతూ క్యాంటిన్ల నిర్వహణ ద్వారా వారు ఆర్థికంగా ఎదగడమే కాకుండా మరికొంత మందికి ఉపాధి అవకాశం కల్పించనున్నారని గుర్తు చేశారు. ఆహార పదార్థాల తయారీపై ప్రత్యేక శిక్షణలో నిథమ్‌కు మంచి గుర్తింపు ఉందని, నిర్వాహకులకు ఐదు విడతల వారిగా శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. సెర్ప్ సీఈఓ డీ దివ్య, పర్యాటక శాఖ, నిథమ్ డైరెక్టర్ జెడ్, హన్మంత్ ఎప్పటికప్పుడు శిక్షణను పర్యవేక్షించారని గుర్తుచేశారు. సెర్ప్, నిథమ్, పర్యాటక శాఖ అధికారులు, ఫ్యాకల్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: స్టూడెంట్స్‌తో మహిళా ప్రొఫసర్ క్రేజీ డ్యాన్స్ : వీడియో హల్చల్ -
కోచింగ్ సెంటర్లపై కేంద్రం కొరడా!
‘వంద శాతం జాబ్ గ్యారెంటీ’, ‘100 శాతం సెలెక్షన్’ వంటి అసత్య ప్రకటనలతో, అబద్ధాలతో అభ్యర్థులను తప్పుదోవ పట్టిస్తున్న కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచి్చంది. ఇలాంటి మోసపూరిత, తప్పుడు ప్రకటనలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొంది. ఈ మేరకు వివిధ పోటీ పరీక్షలకు, ఉద్యోగ నియామక పరీక్షలకు శిక్షణ ఇచ్చే కోచింగ్ కేంద్రాలు తప్పుడు హామీలు ఇవ్వకుండా చర్యలు చేపట్టింది. మోసపూరిత హామీలతో అభ్యర్థులను ఏమార్చవద్దని వాటిని హెచ్చరించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. – సాక్షి, ఏపీ,సెంట్రల్ డెస్క్ఈ ఏడాది 6,980 ఫిర్యాదులు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (సీసీపీఏ)కు వివిధ పోటీ పరీక్షలకు, ఉద్యోగ నియామక పరీక్షలకు శిక్షణ ఇస్తున్న కేంద్రాలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని కేంద్రం పేర్కొంది. ఫ్యాకల్టీ లేకపోయినా ఉన్నట్లు మభ్యపెట్టడం, తక్కువే సీట్లే ఉన్నాయని.. త్వరపడకపోతే సీట్లు అయిపోతాయని అభ్యర్థులపై ఒత్తిడి తేవడం, గతంలో వచి్చన ర్యాంకుల ఆధారంగా ఎక్కువ ఫీజులు వసూలు చేయడం, తప్పుడు, మోసపూరిత హామీలు ఇవ్వడం వంటి ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. ఇలా 2021–22లో 4,815, 2022–23లో 5,351, 2023–24లో 16,276, ఈ ఏడాది ఇప్పటివరకు 6,980 ఫిర్యాదులు అందినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఫిర్యాదులు ఎదుర్కొంటున్న కోచింగ్ సంస్థలకు సీసీపీఏ 54 నోటీసులు పంపింది. వీటికి రూ.54.60 లక్షలు జరిమానా కింద విధించింది. 2023 సెపె్టంబర్ 1 నుంచి ఈ ఏడాది ఆగస్టు 31 వరకు రూ.1.15 కోట్లను విద్యార్థులకు పరిహారంగా ఇప్పించింది.తప్పుడు ప్రకటనలు ఇచ్చే కోచింగ్ సంస్థలపై కఠిన చర్యలు ఉండాలితప్పుడు ర్యాంకుల ప్రకటనలు ఇచ్చే కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. వాటికి జరిమానాలు విధించడం వల్ల ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం నెరవేరదు. యావజ్జీవ శిక్షకు తగ్గకుండా కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలపై చర్యలు ఉండాలి. అలాగే తమ సంస్థల్లో శిక్షణ తీసుకున్నట్టు చెప్పాలని ర్యాంకులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయా కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు డబ్బులు ఇస్తాయి. క్లాస్ రూం కోచింగ్ ఒకరి వద్ద, ఆన్లైన్ కోచింగ్ ఇంకొకరి వద్ద, మెటీరియల్/బుక్స్ మరొకరి వద్ద తీసుకున్నామంటూ ఆయా సంస్థల డబ్బులకు ఆశపడి అబద్ధాలు చెప్పే విద్యార్థులు, వారి తల్లిదండ్రులపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. యాజమాన్యాల డబ్బులకు ఆశపడి అనేక కో చింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకున్నామని చెబితే వా రిపై చర్యలు తీసుకోవాలి.మీడియా కూడా తప్పు డు ప్రకటనల పట్ల జాగరూకతతో ఉండాలి. గతంలో ర్యాంకులు సాధించిన అభ్యర్థుల హా ల్టికెట్లను పరిశీలించాకే వారి గురించి ప్రచురించేవి. ఇప్పుడు కూడా ఇలాగే వ్యవహరించాలి. తప్పుడు ప్రకటనలు ఇచ్చే కోచింగ్ సంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటే అసలు నిజాలు తెలుస్తాయి. – కె.లలిత్ కుమార్, జేఈఈ కోచింగ్ నిపుణులు, ఎడ్యుగ్రామ్360.కామ్ తప్పుదోవ పట్టించే ప్రకటనలకు అడ్డుకట్ట.. కోచింగ్ కేంద్రాలు ఉద్దేశపూర్వకంగా అభ్యర్థుల వద్ద కొంత సమాచారాన్ని దాస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కేంద్రం తెలిపింది. శిక్షణా కేంద్రాలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని.. అయితే వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు నష్టపోకుండా తాజా మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్రం వెల్లడించింది. అభ్యర్థులను తప్పుదోవ పట్టించే ప్రకటనలకు అడ్డుకట్ట వేయడమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది. తమ మార్గదర్శకాలు అభ్యర్థులకు గైడెన్స్, విద్యాపరమైన మద్దతు, ట్యూటరింగ్, స్టడీ ప్రోగ్రామ్స్, విద్యకు సంబంధించిన ప్రకటనలకు వర్తిస్తాయని స్పష్టతనిచి్చంది. కౌన్సెలింగ్, థియేటర్ ఆర్ట్స్, క్రీడలు, డ్యాన్స్, ఇతర సృజనాత్మక కార్యక్రమాలకు వర్తించవని తెలిపింది. కోచింగ్ సంస్థలకు మార్గనిర్దేశం చేసేందుకు ఈ మార్గదర్శకాలను జారీ చేస్తున్నామని వివరించింది. కోచింగ్ సెంటర్లు ఖచ్చితత్వంలో వ్యవహరించడం ద్వారా అభ్యర్థుల హక్కులను గౌరవించాలని పేర్కొంది. 50 మంది కంటే ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చేసంస్థలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని వెల్లడించింది.కేంద్రం మార్గదర్శకాలు ఇవి..» కోర్సు–వ్యవధి, అధ్యాపకుల వివరాలు, ఫీజులు–వాపసు (రిఫండ్) విధానాలు, ఎంపిక, పరీక్ష ఫలితాలు లేదా ఉద్యోగ నియామకం లేదా జీతం పెరుగుదలకు సంబంధించి మోసపూరిత హామీలను, ప్రకటనలను కోచింగ్ సంస్థలు ఇవ్వకూడదు.» ఉద్యోగాలకు ఎంపికైన లేదా ర్యాంకులు సాధించిన అభ్యర్థుల రాతపూర్వక అనుమతి లేకుండా వారి పేర్లు, ఫొటోలు లేదా ఇతర సమాచారాన్ని శిక్షణ సంస్థలు ఉపయోగించకూడదు. అలాగే వారి సమాచారాన్ని సురక్షితంగా ఉంచాలి.» సివిల్స్ రాసే అభ్యర్థుల్లో కొందరు ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వారే సొంతంగా సిద్ధమవుతారు. ఇంటర్వ్యూకు మాత్రమే శిక్షణ తీసుకుంటారు. ఇందుకు సంబంధించి అభ్యర్థులకు కోచింగ్ సెంటర్లు ముందుగానే స్పష్టతనివ్వాలి. » అభ్యర్థులకు వారి కోర్సుల గురించి స్పష్టమైన సమాచారాన్ని అందించాలి. వారి అభ్యంతరాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. » అభ్యర్థులకు కోచింగ్ సెంటర్లు తప్పనిసరిగా తమ సేవలు, వనరులు, సౌకర్యాలు, మౌలిక సదుపాయాల గురించి వివరించాలి.» తాము అందిస్తున్న కోర్సులకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వంటి సంస్థల గుర్తింపు ఉందని నిర్ధారించాలి. » చట్టబద్ధంగా అనుమతి తీసుకున్న భవనాల్లో మాత్రమే శిక్షణ కేంద్రాలను నడపాలి. » విద్యార్థులు లేదా అభ్యర్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను, ఇతర సౌకర్యాలను శిక్షణ కేంద్రాలు కల్పించాలి. » కోర్సులు, కాలపరిమితి, అధ్యాపకుల అర్హతలు, ఫీజు, రిఫండ్ విధానాలు, ఫలితాలు, జాబ్ గ్యారెంటీ వంటి అంశాలపై తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వకూడదు. » విద్యార్థులపై ఒత్తిడి తెచ్చేందుకు ‘కొన్ని సీట్లే మిగిలి ఉన్నాయి’ వంటి ప్రకటనలు ఇవ్వడం నిషిద్ధం. » కోచింగ్ సెంటర్లకు ప్రచారం కల్పించే ముందు ఎండార్సర్లు వాటి ప్రకటనలను ధ్రువీకరించుకోవాలి. » కోచింగ్ సెంటర్ల తరఫున ప్రచారం చేసే సినీ నటులు, ఇతర సెలబ్రిటీలు వారు చేసే ప్రకటనలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. » తప్పుడు ప్రకటనలు చేసినా, తప్పుదోవ పట్టించేలా ప్రకటనల్లో నటించినా కోచింగ్ సెంటర్లతోపాటు ప్రచారకర్తలూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. » ఇప్పటిదాకా.. ఏవైనా షరతులు ఉంటే చిన్నగా ‘‘స్టార్’’ గుర్తు పెట్టి.. ప్రకటన చివర్లో కనిపించీ, కనిపించకుండా వాటిని చూపించేవారు. ఇకపై ఇలా కుదరదు. ఏవైనా షరతులు ఉంటే ప్రకటన ఏ ఫాంట్ సైజులో ఉంటే అదే సైజులో షరతులను కూడా ప్రచురించాలి. » తప్పుదోవ పట్టించే ప్రకటనలపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా కోచింగ్ సెంటర్లు కచి్చతంగా జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. -
మహిళా పారిశ్రామివేత్తలకు అభినందనలు: యూఎస్ కాన్సులేట్ జనరల్
హైదరాబాద్: హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ జనరల్, అలయన్స్ ఫర్ కమర్షియలైజేషన్ అండ్ ఇన్నోవేషన్ రీసెర్చ్ (ఎసిఐఆర్) భాగస్వామ్యంతో ఇంటెన్సివ్ అకాడమీని విజయవంతంగా పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలను యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ప్రోగ్రామ్ గ్రాడ్యుయేట్లకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళా వ్యాపారవేత్తలకు వ్యాపారాల అభివృద్ధికి వ్యూహాత్మక ప్రణాళిక, మార్కెటింగ్, ఆర్థిక నిర్వహణ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చింది. ఆరు నెలల పాటుసాగిన ఈ శిక్షణా కార్యక్రమంలో తెలంగాణ, ఏపీకి చెందిన 60మంది మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. మహిళా నాయకత్వం, మహిళా ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించడం అమెరికా ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి అని జెన్నిఫర్ తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తల అకాడమీ, వనరులు, కనెక్షన్లతో మహిళలను శక్తివంతం చేయడంతోపాటు, ఇండియాతో తమ భాగస్వామ్య లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళుతుందన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ తమ క్యాంపస్‌లలో ఏడబ్ల్యూఈ కోహార్ట్‌లను నిర్వహిస్తున్నందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో శుక్రవారం కాన్సులేట్ నిర్వహించిన అకాడమీ ఫర్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (ఏడబ్ల్యూఈ) కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమం శుక్రవారం (నవంబర్ 22) జరిగింది. ఈ నెల(నవంబర్) 26న విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో మరో ఈవెంట్ జరగనుంది. -
ఫ్యామిలీ ఫార్మింగ్ : విద్యార్థులకు ప్రకృతి సేద్య శిక్షణ
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను హైస్కూలు నుంచి యూనవర్సిటీ స్థాయి వరకు విద్యార్థులకు అలవాటు చేయటం ఎంతో అవసరమనే విషయంతో ఇప్పుడు ఏకీభవించని వారు బహుశా ఎవరూ ఉండరు. రసాయనిక అవవేషాల్లేని ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తి ద్వారానే మహాభాగ్యమైన ఆరోగ్యాన్ని కాపాడుకోగలమని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. అయితే, ఈ బృహత్ కార్యక్రమాన్ని వ్యాప్తిలోకి తేవటానికి విద్యాసంస్థలతో కలసి పనిచేస్తూ స్ఫూర్తిని నింపుతూ విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయ పనులను అలవాటు చేయటంలో ప్రత్యక్ష కృషి చేస్తున్న వారిని వేళ్లపై లెక్కించవచ్చు. ఈ కోవలో మొదటి పేరు డాక్టర్ గంగాధరం. దాదాపు రెండు దశాబ్దాలుగా సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ విజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో ఆచరణాత్మక శిక్షణ ద్వారా విశేష కృషి చేస్తున్న ప్రకృతి సేద్య ప్రేమికుడు డాక్టర్ వర్డ్ గంగాధర్. ఇప్పటికే వేలాది మంది రైతులకు, విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఘనత వర్డ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తిరుపతికి చెందిన డాక్టర్ ఎం గంగాధర్‌కే దక్కుతుంది. తిరుపతిలో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలో విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకునే పద్ధతులను ఆయన గత కొన్ని నెలలుగా నేర్పిస్తున్నారు. 20 అడుగుల వెడల్పు “ 20 అడుగుల ΄÷డవు విస్తీర్ణంలో చిన్న చిన్న ఎత్తుమడులు ఏర్పాటు చేసి విద్యార్థుల చేత 15 రకాల ఆకుకూరలు, 4 రకాల కూరగాయల సాగు చేయిస్తున్నారు. ఈ నమూనాకు కుటుంబ వ్యవసాయం (ఫ్యామిలీ ఫార్మింగ్) అని పేరు పెట్టారు. డాక్టర్ గంగాధరం యూనవర్సిటీలో కొందరికి ముందుగానే శిక్షణ ఇచ్చి ‘గ్రీన్ టీమ్’లను ఏర్పాటు చేశారు. డా. గంగాధరం మార్గదర్శకత్వంలో ఈ గ్రీన్ టీమ్‌ల ఈ కుటుంబ వ్యవసాయాన్ని పర్యవేక్షిస్తున్నారు. గ్రీన్ టీం సభ్యులు ప్రతి రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు విద్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులను ఇంటింటల కుటుంబ వ్యవసాయ నమూనా మడుల దగ్గరకు ఆహ్వానించి వారికి అవగాహన కల్పిస్తున్నారు.ప్రకృతి సేద్య వ్యాప్తికి దోహదంఈ ఫ్యామిలీ ఫార్మింగ్ నమూనా ముఖ్య ఉద్దేశం గురించి వివరిస్తూ డా. గంగాధరం (98490 59573) ఇలా అన్నారు.. ‘ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆరోగ్యకరమైన 15 రకాల కూరగాయలను ఏ విధంగా సాగు చేయవచ్చో నేర్పిస్తున్నాం. ఈ నమూనా ద్వారా విశ్వవిద్యాలయ విద్యార్థులందరూ పూర్తిస్థాయిలో నమూనాపై అవగాహన తెచ్చుకోగలుగుతారు. వివిధ ప్రాంతాలలో వారి సొంత పొలాల్లో కూడా కొంచెం విస్తీర్ణంలో అయినా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అమలు చేయటం ప్రాంరంభిస్తారు. ఆ విధంగా గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం ప్రాంచుర్యానికి ఎంతో దోహదపడుతుంది. అట్లే తిరుపతి పట్టణంలో ప్రజలందరికీ ఉపయోగపడుతుందని ఆశాభావం..’ అన్నారు. (గార్బేజ్ ఎంజైమ్ : పండ్లు, కూరగాయ మొక్కలకు ఈ ద్రవం ఇచ్చారంటే!)తిరుపతి పట్టణంలోని ప్రజలు కూడా సాయంత్రం 4–5 గంటల వరకు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనవచ్చని, తమ ఇంటి వద్ద తక్కువ స్థలంలో వివిధ రకాల కూరగాయలు సాగుచేసే పద్ధతులను తెలుసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో యువత విశ్వవిద్యాలయం నుంచి హైస్కూల్ వరకు ఈ నమూనా వ్యాప్తి చెంది రాష్ట్రమంతా యువత ప్రకృతి వ్యవసాయంపై పట్టు సాధించగలరని భావిస్తున్నానన్నారు. ఈ కృషి ఫలించాలని ఆశిద్దాం. డా. గంగాధరం -
సీమాప్లో ఔషధ, సుగంధ మొక్కల సాగుపై శిక్షణ
హైదరాబాదు బోడుప్పల్‌లోని కేంద్రియ ఔషధ, సుగంధ పరిశోధన మొక్కల సంస్థ (సీమాప్) ఆవరణంలో నవంబర్ 12–14 తేదీల్లో నిమ్మగడ్డి, కాశగడ్డి, అశ్వగంధ, వటివేర్, సిట్రొనెల్లా, జెరేనియం, మింట్, పచౌళి, సోనాముఖి, కాలమేఘ్ తదితర ముఖ్య ఔషధ, సుగంధ వాణిజ్య పంటల సాగు, ప్రాసెసింగ్, నాణ్యత, మార్కెటింగ్ అంశాలపై ఆంగ్లంలో శిక్షణ ఇవ్వనున్నట్లు చీఫ్ సైంటిస్ట్ జి.డి కిరణ్‌బాబు తెలిపారు. నమోదు రుసుం రూ. 3,500. నవంబరు 8లోగా దరఖాస్తు చేసుకోవాలి. రాత్రి వసతి సదుపాయం లేదు. వివరాలకు: 94910 43252, 94934 08227ఇదీ చదవండి : దొండతో దండిగా ఆదాయం! -
ప్రభుత్వ పాఠశాలల్లో మార్గనిర్దేశకులు
సాక్షి, అమరావతి: విద్యార్థులను ఉన్నత చదువులు, ఉత్తమ భవిష్యత్ వైపు ప్రోత్సహించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలోను విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ నిపుణులను అందుబాటులో ఉంచేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనుంది.యునిసెఫ్ ప్రాజెక్టులో భాగంగా కెరీర్ గైడెన్స్ కంటెంట్ రూపకల్పనపై మొదటి విడత శిక్షణను సోమవారం నుంచి మూడు రోజులపాటు విజయవాడలో నిర్వహించనున్నట్టు సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత తెలుగు వెర్షన్ శిక్షణ పూర్తయ్యాక, ఇంగ్లిష్ మీడియంలో కూడా అందిస్తామని, దీనిద్వారా ఉపాధ్యాయులు సమర్థంగా విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేందుకు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. -
ఏఐలో శిక్షణ తీసుకుంటున్న రాజమౌళి?
సాధారణంగా దర్శకుడు రాజమౌళితో చేసే చిత్రాల కోసం హీరోలు ప్రత్యేక శిక్షణ తీసుకుంటుంటారు. కానీ ప్రస్తుతం రాజమౌళియే శిక్షణ తీసుకుంటున్నారట. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)లో ట్రైనింగ్ తీసుకుంటున్నారట. ఇటీవలి కాలంలో ఏఐని సినిమా ఇండస్ట్రీ కథ మేరకు వినియోగించుకుంటోంది. ఆల్రెడీ కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఏఐని వారి సినిమాల్లో ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి కూడా ఫిల్మ్ మేకింగ్‌లో ఏఐ తెచ్చిన మార్పులను గురించి నేర్చుకోవడానికి ప్రత్యేకమైన క్లాసులు తీసుకుంటున్నారని సమాచారం. ఈ క్లాసుల కోసం ఆయన విదేశాల్లోని ఓ ప్రముఖ స్టూడియోతో అసోసియేట్ అయ్యారని భోగట్టా. ఇక మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. ఈ చిత్రం కోసం మహేశ్‌బాబు ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు. ఈ సినిమా కోసమే రాజమౌళి ఏఐను స్టడీ చేస్తున్నారని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో చిత్రీకరణ మొదలుపెట్టనున్నట్లుగా ఈ చిత్ర కథారచయిత విజయేంద్రప్రసాద్ ఇటీవల వెల్లడించారు. అలాగే ఈ సినిమాకు కావాల్సిన లొకేషన్స్ అన్వేషణలో కార్తికేయ (రాజమౌళి తనయుడు) ఉన్నారని తెలిసింది. ఇక ఈ చిత్రం ఓ నిధి అన్వేషణ నేపథ్యంలో 18వ శతాబ్దంలో ఉంటుందని, రెండు భాగాలుగా విడుదలవుతుందని, ‘మహా రాజా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే ప్రచారాలు జరుగుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ను మించి..! ‘ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) సినిమాలోని ఇంట్రవెల్ సీన్లో లెక్కలేనన్ని జంతువులు కనిపిస్తాయి. కాగా మహేశ్‌బాబుతో తాను చేయనున్న సినిమాలో ‘ఆర్ఆర్ఆర్’ కంటే ఎక్కువ యానిమల్స్‌ని ప్రేక్షకులు చూస్తారని ఇటీవల రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. -
సేంద్రియ/ప్రకృతి సేద్యంలో 3 నెలల కోర్సు
ఈనెల22, 23 తేదీల్లో బయోడైనమిక్సేద్యంపై శిక్షణ దేశ విదేశాల్లో చిరకాలంగా కొందరు రైతులు అనుసరిస్తున్న సేంద్రియ సేద్య పద్థతుల్లో బయోడైనమిక్ సేద్యం ఒకటి. రైతులు స్వయంగా తయారు చేసుకునే ఆవు కొమ్ము ఎరువు తదితర సేంద్రియ ఎరువులను సూక్ష్మ పరిమాణంలో వేస్తూ చేసే రసాయన రహిత సేద్య పద్ధతి ఇది. టైమ్ టేబుల్ ప్రకారం ప్రతి వ్యవసాయ పనినీ నిర్దేశిత రోజుల్లో మాత్రమే చేయటం ఇందులో ప్రత్యేకత. బయోడైనమిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో బెంగళూరులోని బెంగళూరు ఇంటర్నేషనల్ సెంటర్లో రైతు శిక్షణా శిబిరం జరగనుంది. బయోడైనమిక్ సేద్యంలో అనుభవం కలిగిన రైతులు శిక్షణ ఇస్తారు. క్షేత్ర సందర్శన ఉంటుంది. ప్రవేశ రుసుము (శిక్షణ, భోజనం సహా): రూ. 1,500. వసతి ఎవరికి వారే చూసుకోవాలి. ఆసక్తి గల వారు ముందుగా గూగుల్ ఫామ్ ద్వారా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇతర వివరాలకు.. 97386 76611 సంప్రదించవచ్చు. సేంద్రియ/ప్రకృతి సేద్యంలో 3 నెలల కోర్సు కేంద్ర వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ΄్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ (ఎన్‌ఐపిహెచ్‌ఎం) దేశంలోనే పేరెన్నికగల వ్యవసాయ శిక్షణా సంస్థ. సేంద్రియ / ప్రకృతి సేద్య పద్ధతులపై రైతులు, ఎఫ్పిఓలు/ సహకార సంఘాల నిర్వాహకులు, రైతు శాస్త్రవేత్తలుగా ఎదిగి స్వయం ఉపాధి పొందాలనుకునే యువతకు లోతైన శాస్త్రీయ అవగాహన, ఆచరణాత్మక శిక్షణ కల్పించడానికి ఎన్‌ఐపిహెచ్‌ఎం 3 నెలల సర్టిఫికెట్ కోర్సు తెలుగు/హిందీ భాషల్లో నిర్వహించనుంది.నూటికి నూరు శాతం రసాయనాల్లేకుండా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయాన్ని లాభదాయకంగా చేయదలచిన వారికి ఇది సదవకాశం. నవంబర్ 27 నుంచి వచ్చే మార్చి 5 వరకు ఈ కోర్సు ఉంటుంది. వివిధ కేంద్ర వ్యవసాయ సంస్థలతో కలసి ఎన్‌ఐపిహెచ్‌ఎం నిర్వహించే ఈ కోర్సులో 3 దశలుంటాయి. మొదట 21 రోజులు రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐపిహెచ్‌ఎం ఆవరణలో శాస్త్రీయ అంశాల బోధన. తర్వాత అభ్యర్థి ఎంపిక చేసుకున్న ప్రాంతంలో 2 నెలలు క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు. ఆ తర్వాత ఎన్‌ఐపిహెచ్‌ఎంలో 10 రోజుల తుది దశ శిక్షణ ఉంటాయి. ఇంటర్ లేదా టెన్త్ తర్వాత వ్యవసాయ డిప్లొమా చేసిన 18 ఏళ్లు నిండిన అన్ని సామాజిక వర్గాల స్త్రీ పురుషులు అర్హులు. గ్రామీణ యువతకు ప్రాధాన్యం. కోర్సు ఫీజు: రూ. 7,500. శిక్షణా కాలంలో ఉచిత వసతి కల్పిస్తారు. భోజనానికి రోజుకు రూ.305 అభ్యర్థి చెల్లించాలి. ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ ఇస్తారు. దరఖాస్తులను నవంబర్ 22 లోగా పోస్టు/మెయిల్ ద్వారా పంపవచ్చు. ఇతర వివరాలకు కోర్సు కోఆర్డినేటర్ డా.కె. దామోదరాచారి (95426 38020)ని సంప్రదించవచ్చు. -
ఉద్యోగులను తొలగించేందుకు ట్రైనింగ్!!
ఉద్యోగంలో చేర్చుకోవడం ఎంత ముఖ్యమో.. తొలగించడం కూడా అంతే ముఖ్యం అంటూ, టెక్ కంపెనీ జర్నీ సీఈఓ 'ఆండ్రియాస్ రోట్ల్' (Andreas Roettl) చెబుతున్నారు. దీనికోసం నైపుణ్యం అవసరమని తమ మేనేజర్లను, టీమ్ లీడర్లకు సంస్థలే ట్రైనింగ్ ఇవ్వాలని అన్నారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఫోటో ప్రింటింగ్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్న టెక్ సంస్థ జర్నీ సీఈఓ ఆండ్రియాస్ రోట్ల్.. నాయకులంటే ఉద్యోగులను నియమించుకోవడం మాత్రమే కాదు, తొలగించడంలో కూడా కొంత నైపుణ్యం కలిగి ఉండాలని పేర్కొన్నారు. అంతే కాకుండా నేను ఉద్యోగులను తొలగించడంలో చాలా మంచివాడినని ఆండ్రియాస్ పేర్కొన్నారు.జర్నీ సంస్థలో ఉద్యోగులను ఎలా తొలగించాలో మా లీడ్‌లకు శిక్షణ ఇవ్వడంపై దృష్టి పెడతాము. మీరు కూడా అలా చేయాలని ఆండ్రియాస్ వెల్లడించారు. ఉద్యోగి పనితీరును అంచనా వేయడానికి తొలగింపు విధానాలను తప్పకుండా నేర్చుకోవాలి. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఉపయోగించడం వంటివి కూడా తెలుసుకోవాలి. పనితీరు ఎక్కువగా ఉన్న సిబ్బందికి మద్దతు ఇవ్వడం అత్యంత ప్రాధాన్యం అని అన్నారు.తొలగించడానికి సంబంధించిన విధానాన్ని ఆండ్రియాస్ రోట్ల్ ఫుట్‌బాల్ ఆటతో పోల్చారు. ఇక్కడ ఆటగాళ్లకు హెచ్చరికగా పసుపు కార్డు అందుతుంది. దీనిని మొదటి హెచ్చరికగా వెల్లడించాలి. పనితీరును మెరుగుపరచుకోవాలి, కష్టపడుతున్న ఉద్యోగులతో సంభాషణలు జరపాలని చెప్పాలి.ఇదీ చదవండి: పోయిన రూ.5 కోట్ల కారు: పట్టించిన ఎయిర్‌పాడ్స్ - ఎలా అంటే?మొదటిసారి పసుపు కార్డు అందుకున్న వ్యక్తి పనితీరులో ఎలాంటి పురోగతి కనిపించకపోతే.. రెండవ పసుపు కార్డును ఇవ్వాలి. ఇది వారు తమ ఉద్యోగానికి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైందని తెలియజేస్తుందని అన్నారు. రెడ్ కార్డు ఇవ్వాల్సిన సందర్భాలు వస్తే.. అది వేరే కథ. దానికి వేరే ప్రాసెస్ ఉంటుందని అన్నారు. ఆండ్రియాస్ రోట్ల్ చేసిన పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. అయితే ఆండ్రియాస్ ఫాలో-అప్ సందేశాన్ని పేర్కొన్నారు. నా సందేశం వల్ల బాధ కలిగి ఉండే క్షమాపణలు కోరుతున్నా అని అన్నారు. -
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఐఐటీ, నీట్ శిక్షణ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఐఐటీ, నీట్ శిక్షణ ఇచ్చేలా ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. తొలిదశలో రాష్ట్రంలోని నాలుగు పట్టణాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి, వాటి పరిధిలోని అన్ని కళాశాలల విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో ఎంపిక చేసిన కళాశాలల్లో ఐఐటీ శిక్షణను ఆదే కళాశాలకు చెందిన జూనియర్ లెక్చరర్లు ఇచ్చేవారు. ఈసారి నారాయణ కళాశాలలకు చెందిన ఐఐటీ, నీట్ సిలబస్ బోధించే సిబ్బందితో శిక్షణ ఇప్పించేందుకు ఇంటర్ బోర్డు ప్రణాళిక సిద్ధం చేసింది.తొలుత కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఆయా నగరాలకు ఐదు లేదా పది కి.మీ. పరిధిలోని ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఈ అవకాశం కల్పించనున్నారు. ఆసక్తి గల ఇంటర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు నారాయణ సిబ్బంది ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించి, ప్రతిభ చూపిన వారిని ఉచిత శిక్షణకు ఎంపిక చేయనున్నారు. ఎంపికైన విద్యార్థులు నిర్ణీత సెంటర్లో ఇంటర్ రెగ్యులర్ తరగతులతో పాటు అంతర్భాగంగా ఐఐటీ, నీట్ శిక్షణను కూడా నారాయణ విద్యా సంస్థల సిబ్బందే ఇవ్వనున్నారు.విద్యార్థుల కాలేజీలు వేరైనప్పటికీ ఈ ప్రత్యేక శిక్షణ కేంద్రాల్లో వారి హాజరు ఆన్లైన్లో నమోదు చేస్తారు. దీనివల్ల వారి అటెండెన్స్ ఇబ్బందులు లేకుండా ఉంటుందని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. కాగా, గత ప్రభుత్వంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఇదే తరహా శిక్షణను ఇంటర్ బోర్డు చేపట్టింది. ఈ ప్రత్యేక శిక్షణపై ఆసక్తి గల ప్రభుత్వ లెక్చరర్లతో వారు పనిచేస్తున్న కాలేజీల్లోనే శిక్షణ ఏర్పాట్లు చేశారు. అయితే, అనుకున్న మేర ఫలితాలు రాకపోవడంతో ఈ ఏడాది శిక్షణ విధానం మార్చినట్టు తెలుస్తోంది. విద్యార్థులకు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణ, ఐఐటీ, నీట్ నమూనా పరీక్షల నిర్వహణ వంటి అన్ని అంశాలను నారాయణ విద్యాసంస్థలే చూసుకోనున్నాయి. -
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తాం
సాక్షి, అమరావతి: ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నేరేవేర్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో నైపుణ్య శిక్షణ శాఖ, ఎంఎస్ఎంఈ, పరిశ్రమలు, సెర్ప్ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులు సమకూర్చాలని సూచించారు.నైపుణ్యాలను పెంచడం ద్వారా పెద్దఎత్తున అవకాశాలు పొందే అవకాశం ఉందని, హైబ్రిడ్ విధానంలో ఇంటినుంచే పనిచేసే కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బహుళజాతి కంపెనీలతో శిక్షణ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ చేపట్టాలన్నారు. విజయవాడ వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులు ఉపాధి చూపించాలని కోరారని, వారికి ఎటువంటి ఉపాధి కల్పన చేపట్టవచ్చనే అంశంపై పరిశీలన జరిపి కార్యాచరణ అమలు చేయాలన్నారు. వివిధ కారణాలతో గ్రామాల్లో ఉండిపోయిన వారికి పనిచేసే అవకాశాలు కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని, ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు కలిసి ఈ పని చేయాలని కోరారు. క్రీడా హబ్‌లుగా తిరుపతి, అమరావతి, విశాఖ మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడా రంగానికి తిరిగి ప్రోత్సాహం అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను కోరారు. యువజన సర్వీసులు, క్రీడల శాఖపై సమీక్షిస్తూ.. గతంలో నిలిచిపోయిన 35 క్రీడా వికాస కేంద్రాలను పూర్తి చేసేందుకు రూ.23 కోట్లు మంజూరు చేస్తున్నట్టు సీఎం తెలిపారు.గ్రామాల్లో కబడ్డీ వంటి ఆటలకు క్రీడా మైదానాలు అందుబాటులోకి తేవాలని సూచించారు. తిరుపతి, అమరావతి, విశాఖ నగరాలను క్రీడా హబ్‌లుగా మార్చాల్సిన అవసరం ఉందని, ఆ మూడు ప్రాంతాల్లో అన్ని క్రీడల నిర్వహణకు సకల సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. క్రీడా నగరంగా అమరావతిని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, ఇక్కడ అతిపెద్ద స్టేడియం నిర్మాణం చేపడతామని చెప్పారు. 2027లో జాతీయ క్రీడా పోటీలను మన రాష్ట్రంలో నిర్వహించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర సచివాలయం, కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ స్పోర్ట్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షలో మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. -
రాజ రాజ చోర
అది ఓ చిన్న పాఠశాల. విద్యార్థులు టీచర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలోఓ వ్యక్తి తరగతి గది లోపలకు వచ్చాడు. అతడి చేతిలో కత్తెర, బ్లేడు, తాళాలు, స్క్రూడ్రైవర్ వంటి సరంజామా ఉంది.వెంటనే పాఠం మొదలుపెట్టాడు.అంటే ఏవో సైన్స్ ప్రాక్టికల్స్ చెబుతున్నాడేమో అనుకోకండి. అక్కడ జరిగే సంగతి తెలిస్తే నోరెళ్లబెడతారు.పిక్ పాకెటింగ్ ఎలా చేయాలి? దొంగతనం చేసిన తర్వాత దొరక్కుండాఎలా తప్పించుకోవాలి? తాళాలను ఎలా ఓపెన్ చేయాలి వంటి అంశాల్లోఅక్కడ తర్ఫీదు ఇస్తారు.వినడానికి విడ్డూరంగా విన్నా కొన్నేళ్లుగా అక్కడ జరుగుతున్న తతంగం ఇది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖడియా, గుల్ ఖేడి, హుల్ ఖేడి అనే మూడు గ్రామాల్లో దొంగల స్కూళ్లు ఉన్నాయి. 12 సంవత్సరాల నుంచి 17 ఏళ్ల లోపు వయసున్న వారికి దొంగతనాలు, దోపిడీలు ఎలా చేయాలో అందులో శిక్షణ ఇస్తారు. అవసరమైన సందర్భాల్లో హత్యలు ఎలా చేయాలో కూడా నేర్పిస్తారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలను లక్ష్యంగా చేసుకుని ఓ దొంగల ముఠా ఈ స్కూళ్లు నడుపుతోంది. ఏడాదిపాటు సకల చోర కళల్లో శిక్షణ ఇస్తారు. జనం రద్దీగా ఉండే ప్రదేశాల్లో పిక్ పాకెటింగ్ ఎలా చేయాలి, బ్యాగు ఎలా లాక్కోవాలి? ఆపై ఎవరికీ చిక్కకుండా ఎలా పారిపోవాలి? బ్యాంకులను ఎలా దోచుకోవాలి? పోలీసులకు చిక్కితే వారి లాఠీ దెబ్బలను ఎలా తట్టుకోవాలి? వంటి అన్ని అంశాల్లోనూ సుశిక్షితులను చేస్తారు. ముఖ్యంగా పెద్దింటి పిల్లలు ఎలా వ్యవహరిస్తారో, వారు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటారో కూడా వివరించి అన్ని విధాలా సన్నద్ధం చేస్తారు. ఈ శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు దొంగతనాల్లో గ్రాడ్యుయేట్ల కిందే లెక్క. అంతేకాదు.. ఏడాదిపాటు ఇచ్చే శిక్షణ కోసం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు ఫీజుగా తీసుకుంటున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత వారిని గ్యాంగులో సభ్యులుగా చేర్చుకుంటారు. అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రాక్టికల్స్‌కు పంపిస్తారు. అలా వారు కొట్టుకొచి్చన సొమ్ము ఈ దొంగల ముఠాయే తీసుకుని, వారి తల్లిదండ్రులకు ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు మాత్రమే ఇస్తుంది. దీంతో ఇదేదో బాగుందని భావిస్తున్న ఆ చుట్టుపక్కల ఊళ్ల జనం నానా తిప్పలూ పడి ఫీజులు చెల్లించి తమ పిల్లలను దొంగల స్కూళ్లలో చేర్పిస్తున్నారు.ఇలా బయటపడింది.. ఈ దొంగల శిక్షణ వ్యవహారం చాలాకాలంగా సాగుతున్నప్పటికీ,ఇటీవల ముంబైలో జరిగిన ఓ దొంగతనంతో వెలుగులోకి వచి్చంది. ఓ బడా పారిశ్రామికవేత్త కుటుంబ వివాహ వేడుక ముంబైలోని ఓ ఖరీదైన హోటల్లో ఘనంగా జరిగింది. ఆ హోటల్లోకి ఈ ముఠాకు చెందిన కుర్రాడు పెద్దింటి బిడ్డగా చొరబడి రూ.కోటిన్నర విలువైన నగలతో మాయమయ్యాడు. నగలు కనిపించకపోవడంతో సీసీ కెమెరాలు పరిశీలించగా దొంగతనం విషయం బయటపడింది. ఆ కుర్రాడు ఎవరా అని ఆరా తీసిన పోలీసులు చివరకు మధ్యప్రదేశ్‌లోని ఈ మూలాలుగుర్తించి అవాక్కయ్యారు. పోలీసులు ఏం చేయలేరా? నిజానికి ఆ మూడు గ్రామాల్లో దొంగల స్కూళ్లు నడుస్తున్నాయనే సంగతి స్థానిక పోలీసులకు తెలిసినా వారు ఏమీ చేయలేని పరిస్థితి. ఆ ఊళ్లోకి పోలీసులు వెళ్తే చాలు.. ఊరి జనమంతా ఏకమై అడ్డుకుంటారు. ఎవరైనా అపరిచితులు అక్కడకు వెళ్లినా వదిలిపెట్టరు. దీంతో ఒక్క దొంగను అరెస్టు చేయడానికి వెళ్లాలంటే పోలీసులు పెద్ద ఎత్తున మందీమార్బలంలో వెళ్లాల్సిందే. పైగా దొంగల స్కూల్‌ను మూయించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అది మామూలు పాఠశాలలాగే ఉంటుంది. మేం విద్యార్థులకు ట్యూషన్ చెబుతున్నాం.. అది కూడా తప్పా అని ప్రశ్నిస్తారు. దీంతో పోలీసులు తిరుగుముఖం పట్టడం తప్ప చేసేదేమీ ఉండదు. దేశవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో ఈ ముఠాకు చెందిన 2వేల మందికి పైగా వ్యక్తులపై దాదాపు 8వేల కేసులు నమోదయ్యాయి. - సాక్షి సెంట్రల్ డెస్క్ -
3 ఎయిర్‌లైన్స్‌పై డీజీసీఏ చర్యలు
న్యూఢిల్లీ: వివిధ నిబంధనల ఉల్లంఘనలకు గాను మూడు విమానయాన సంస్థలు, 1 ఫ్లయింగ్ ట్రైనింగ్ సంస్థపై విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ చర్యలు తీసుకుంది. రద్దయిన ఫ్లయిట్లకు సంబంధించి ప్రయాణికులకు పరిహారం చెల్లించనందుకు గాను ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు రూ. 10 లక్షల జరిమానా విధించింది. అలాగే సంక్షోభంలో చిక్కుకున్న స్పైస్‌జెట్‌పై పర్యవేక్షణ స్థాయిని పెంచడంతో పాటు పలు ఉల్లంఘనలకు గాను ఆకాశ ఎయిర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫ్లయిట్స్ తరచుగా రద్దవుతున్న వార్తల నేపథ్యంలో ఆగస్టు 7, 8 తేదీల్లో కంపెనీ ఇంజినీరింగ్ యూనిట్ల స్పెషల్ ఆడిట్ నిర్వహించగా, నిర్దిష్ట లోపాలు తమ దృష్టికి వచ్చినట్లు డీజీసీఏ తెలిపింది. ఈ నేపథ్యంలోనే సంస్థపై పర్యవేక్షణను మరింతగా పెంచినట్లు పేర్కొంది. అటు, ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదంపై ఆడిట్ నిర్వహించిన మీదట అల్కెమిస్ట్ ఏవియేషన్ అనుమతులను డీజీసీఏ సస్పెండ్ చేసింది. -
డ్రోన్ దీదీ.. పల్లెటూరి పైలట్!
మహిళా సాధికారతకు ఉత్తమ సాధనాలలో ఒకటిగా నిలిచింది డ్రోన్ శిక్షణ. ఢిల్లీకి ఉత్తరాన ఉన్న సింఘోలా, నైరుతి జిల్లాల్లోని 200 మంది మహిళలు శిక్షణ తీసుకొని డ్రోన్ లైసెన్స్ పొందేందుకు సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా గ్రామీణ మహిళలకు సాధికారిత కల్పించే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం ‘నమో డ్రోన్ దీదీ’ పథకాన్ని కిందటేడాది చేపట్టింది. ఇందులో భాగంగా శిక్షణ పొందిన మహిళలు దేశ రాజధానిలో ఇటీవల కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ పొందిన డ్రోన్ దీదీలు పైలెట్ లైసెన్స్ సర్టిఫికెట్స్ పొంది, స్వయం ఉపాధి అవకాశాలను పొందుతారు. శిక్షణ పొందిన వారికి డ్రోన్లను ప్రభుత్వమే అందజేస్తుంది.స్వయం ఉపాధికి..డ్రోన్లను స్వయంగా ఉపయోగించడానికి, అద్దెకు ఇవ్వడానికి అనుమతిస్తారు. సర్వేలు, ఈవెంట్ షూట్లు, ఫొటోగ్రఫీ, వ్యవసాయంలో సీడింగ్, పురుగుమందులు చల్లడం వంటి వాటి కోసం డ్రోన్లను ఉపయోగించడమే లక్ష్యంగా ఉద్యోగావకాశాలు పొందుతారు.ఆర్థికాభివృద్ధికి..మూడేళ్ల కాలంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు 15 వేల డ్రోన్లను అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వ్యవసాయంతో పాటు అదనంగా మహిళలు డ్రోన్ సంబంధిత వ్యాపారాలను చేసుకునే అనుమతి లభిస్తుంది. దీనివల్ల ఆర్థిక వృద్ధి, అభివృద్ధికి మరింతగా దోహదపడుతుంది. ఎరువులను చేతితో పిచికారీ చేసే సాంప్రదాయ పద్ధతులను డ్రోన్లతో భర్తీ చేయడం ద్వారా పురుగు మందుల వల్ల కలిగే ప్రమాదం తగ్గుతుంది. పంట దిగుబడి పెరుగుతుంది.అంతేకాదు, డ్రోన్ల వాడకంలో ఖర్చులు తగ్గి, రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. టెక్నాలజీలో ఆధునాతన శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి కృషి జరపడం అంటే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను మరింత శక్తిమంతులుగా తయారు చేయడమే.ఇవి చదవండి: Health: ఆ ఆలోచన నుంచి.. బయటపడేదెలా? -
యువతకు ఫ్లిప్‌కార్ట్ నైపుణ్య శిక్షణ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వేలాది మంది యువతీ, యువకులకు ఫ్లిప్‌కార్ట్ సప్లయ్ చైన్ ఆపరేషన్స్ అకాడమీ (ఎస్సీఓఏ) నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనుంది. ఇందుకు గాను కేంద్ర నైపుణ్యాభివృద్ధి కల్పన శాఖతో అవగాహన ఒప్పందం చేసుకుంది.ఈ-కామర్స్, సరఫరా వ్యవస్థ తదితర విభాగాల్లో ఉద్యోగ నైపుణ్యాలపై ‘ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 కింద శిక్షణ ఇవ్వనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. కళాకారులు, చేనేతలు, స్వయం ఉపాధి సంఘాల మహిళలు, మహిళలు, గ్రామీణ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సాధికారత దిశగా ఐదేళ్ల మైలురాయిని పూర్తి చేసుకున్న సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఒక కార్యక్రమం నిర్వహించింది.ఈ సందర్భంగా అవగాహన ఒప్పందంపై ఫ్లిప్‌కార్ట్ ఎస్సీఓఏ, నైపుణ్య శిక్షణాభివృద్ధి శాఖ అధికారులు సంతకాలు చేశారు. 250 మంది వరకు పారిశ్రామికవేత్తలు, కళాకారులు, విక్రయదారులు, చేనేత కార్మికులు, స్వయం స్వహాయక మహిళలు ఈ కార్యక్రమానికి హాజరైనట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. -
ఎస్‌ఏపీతో క్యాప్‌జెమినీ జట్టు.. 8,000 మందికి ట్రైనింగ్
ముంబై: ఐటీ దిగ్గజం క్యాప్‌జెమినీ తాజాగా ఎస్ఏపీ ల్యాబ్స్‌తో చేతులు కలిపింది. వచ్చే మూడేళ్లలో దేశీయంగా 8,000 మంది వెనుకబడిన యువతకు ఉపాధి ఆధారిత నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు క్యాప్‌జెమినీ–ఎస్ఏపీ డిజిటల్ అకాడెమీ ప్రోగ్రాంను అందించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడనుంది.దీని ప్రకారం ఇరు సంస్థలు సంయుక్తంగా వనరుల సమీకరణ, నెట్‌వర్క్‌లు మొదలైన వాటిపై ఇన్వెస్ట్ చేస్తాయని క్యాప్‌జెమినీ ఇండియా సీఈవో అశ్విన్ యార్డి తెలిపారు. తమ కెరియర్లలో విజయాలను అందుకునేందుకు దేశ యువతకు సాధికారత కల్పించేందుకు ఈ భాగస్వామ్యం సహాయకరంగా ఉండగలదని ఎస్ఏపీ ల్యాబ్స్ ఇండియా ఎండీ సింధు గంగాధరన్ పేర్కొన్నారు. -
ఎడ్టెక్ ఇండియా!
దేశంలో ఆన్లైన్ విద్యకు అంతకంతకూ డిమాండ్ పెరిగిపోతోంది. దీంతో పలు ఎడ్ టెక్ స్టార్టప్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. కరోనా–19 పరిణామాలతో విద్యార్థులు ‘ఆన్లైన్’ బాట పట్టారు. అమెరికా తర్వాత భారత్‌లోనే ఆ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆయా కంపెనీలు ఆసక్తి చూపాయి. ఆ తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయులు తిరిగి సంప్రదాయ క్లాస్రూమ్ శిక్షణ వైపు మళ్లారు. దీంతో ఆయా కంపెనీలు సైతం ‘ఆఫ్‌లైన్’ సేవల్లోకి అడుగుపెట్టాయి. దేశంలో 2014 నుంచి 2020 వరకు ఎడ్ టెక్ రంగం విలువ 1.32 బిలియన్ డాలర్లుగా ఉండేది. అయితే కరోనా, లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఈ–లెరి్నంగ్కు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. ఒక్క 2020లోనే ఈ రంగం 1.88 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించి గత ఐదేళ్ల రికార్డును తిరగరాసింది. 2020–21 మధ్య కరోనా విస్తరణతో దేశంలో లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ రెండేళ్లల్లో దేశలోని దాదాపు 320 మిలియన్ల మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇంటికే పరిమితమయ్యారు. ఆ సమయంలో ఆన్లైన్ తరగతులు, ఈ–లెర్నింగ్ సాఫ్ట్వేర్, వర్చువల్ ట్యుటోరియల్స్, డిజిటల్ లైబ్రరీలు వంటి రంగాలు విస్తరించి, ఈ–కంటెంట్ అభివృద్ధికి పెద్ద నగరాలు కేంద్రాలుగా మారాయి. 2020 చివరి నాటికి వ్యాపార ప్రాథమిక, ఆర్థిక విశ్లేషణ, వృత్తిపరమైన కమ్యూనికేషన్స్ కోర్సుల డిమాండ్ 606 శాతం పెరిగినట్టు ఓఆర్ఎఫ్ పేర్కొంది. 2021 నాటికి ఇండియా ఎడ్టెక్ బూమ్ తిరుగులేని ప్రగతిని నమోదు చేసిందని, ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత రెండో అతిపెద్ద ఎడ్ టెక్ మార్కెట్‌గా నిలవడంతో పాటు స్టార్టప్ మార్కెట్ 2021లో 4.73 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించడం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. ఈ రెండేళ్లలో దేశంలో దాదాపు 4,500 ఎడ్టెక్ స్టార్టప్స్ పుట్టుకొచ్చాయని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్) వెల్లడించింది. భారతీయ ఎడ్ టెక్ కంపెనీలైన బైజూస్, స్కేలర్ అకాడమీ, ఎమెరిటస్, సింప్లిలెర్న్ వంటి సంస్థలు అమెరికా, ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాలకు విస్తరించాయి.మళ్లీ ‘ఆఫ్‌లైన్’లోకి అడుగులు..మన ఎడ్ టెక్ రంగం 2022 నుంచి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోందని ఓఆర్ఎఫ్ పేర్కొంది. పాఠశాలలు తిరి గి తెరవడం ఆన్లైన్ కోర్సులు నేర్చుకునే బదులు హైబ్రిడ్, సంప్రదాయ లెరి్నంగ్ విధానాల వైపు ఆసక్తి పెరగడంతో ఆన్లైన్ రంగంలో కొంత తడబాటు నెలకొందని వెల్లడించింది. దీంతో ఎడ్టెక్ కంపెనీలు తమ మా ర్కెట్‌ను కాపాడుకునేందుకు పోటీ పడుతున్నాయని, ఈ క్రమంలో కోర్సుల ధరలు, మార్జిన్లను తగ్గించినట్టు ప్రకటించింది. దీంతో పెట్టుబడిదారులు ఈ రంగంలోకి దిగేందుకు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో ఎడ్ టెక్ స్టార్టప్స్ నిధులు 2022లో 2.6 బిలియన్ డాలర్లు తగ్గిపోగా, 2023లో 0.297 బిలియన్ డాలర్లు తగ్గాయి. అంతేగాక 20 22లో ఈ రంగంలో ఉన్న 14 వేల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. మారిన పరిస్థితులు, పెరిగిన పోటీ రీత్యా భారత ఎడ్టెక్ సంస్థలు ఆన్ లైన్ సేవల నుంచి ఆఫ్‌లైన్ సే వలు అందించడం మొదలెట్టాయి. ఈ కోవలోనే బైజూస్ 2021లో ఆకాష్ ఇనిస్టిట్యూట్ ట్యుటోరియల్ సెంటర్ చైన్‌ను కొ నుగోలు చేసింది. ఫిజిక్స్ వాలా సంస్థ కూడా గతేడాది ఆఫ్‌లైన్ సేవల్లోకి వచ్చి0ది. 2024 చివరి నాటికి భార0 అంతటా 60కి పైగా విద్యాపీఠ్‌లు, పాఠశాలలు పేరు తో తెరవనున్నట్టు ప్రకటించింది. వీటితో పాటు బ్రైట్ క్యాంపస్, అన్ అకాడమీ వంటి సంస్థలు కూడా ఆఫ్‌లైన్ సేవల్లోకి ప్రవేశించాయి. జాతీయ విద్యావిధానం–2020 అమలు చేసి నాలుగేళ్లు పూర్తవడంతో ఎడ్ టెక్ రంగాలకు ప్రోత్సాహం ఉంటుందని, ఎడ్టెక్–కేంద్రీకృత ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యానికి విస్తృతమైన అవకాశాలు ఉంటాయని ఓఆర్ఎఫ్ అంచనా వేసింది. -
కోచింగ్ సెంటర్లను నియంత్రించాలి!
భారీ వర్షాల కారణంగా మురుగు కాలువ పొంగిపొర్లి, ఢిల్లీలో ఒక సివిల్ సర్వీస్ శిక్షణా సంస్థలో ఉన్న నేలమాళిగ గ్రంథాలయంలోకి వరద నీరు ఉధృతంగా ప్రవహించిన దుర్ఘటనలో ముగ్గురు విద్యా ర్థులు జల సమాధి కావటం యావత్ దేశాన్ని కలచివేసింది. చని పోయిన ముగ్గురిలో ఒకరు బిహార్ లోని ఔరంగాబాద్‌కు చెందిన తానియా సోనీ తండ్రి మంచిర్యాల సింగరేణిలో సీనియర్ మేనేజర్ కావడంతో తెలంగాణ అంశం తెరపైకి వచ్చింది. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానియా సోనీ మృతదేహాన్ని తరలించడంలో తండ్రి విజయ్ కుమార్‌కు సహాయ సహకా రాలు అందించాల్సిందిగా ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌కు ఆదే శాలు జారీ చేశారు.ఢిల్లీలోని పలు కోచింగ్ సెంట ర్లలో కనీస సౌకర్యాలు లేవనీ, కోచింగ్ సెంటర్లు నరక కూపాలుగా ఉన్నా యనీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తికి అవినాష్ దూబే అనే సివిల్స్ ఆశావహ అభ్యర్థి లేఖ రాయటంతో అందరి దృష్టి కోచింగ్ సెంటర్లపై పడింది. ప్రధానంగా మన తెలంగాణ రాజధాని హైదరా బాద్‌లో అనుమతి లేని పలు కోచింగ్ సెంటర్లు, స్టడీ హాళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇవి వరంగల్, ఇతర జిల్లా కేంద్రాలకు కూడా విస్తరించాయి. హైదరాబాద్‌లో కోచింగ్ సెంటర్ల మూలంగా అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, అమీర్ పేట్ నిరుద్యోగుల కూడళ్ళుగా పేరుపొందాయి. దేశవ్యాప్తంగా సుమారు 80 వేల పైచిలుకు కోచింగ్ సెంటర్ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం. సంవత్సరానికి 70 వేల కోట్ల వరకు వ్యాపారం జరుగు తున్నట్లు అంచనా.అడ్డూ అదుపూ లేని కోచింగ్ సెంటర్లపై మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో యూపీఏ ప్రభుత్వం తొలుత దృష్టి పెట్టింది. కోచింగ్ సెంటర్లను సేవారంగంలోకి తెచ్చి వాటిపై పన్నులు వేశారు. 2024 జనవరి 18న కోచింగ్ సెంటర్ల నియంత్రణ కోసం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఇవి ఎక్కడా అమలు కావడం లేదు. అత్యధిక కోచింగ్ సెంటర్లకు ఎటువంటి అనుమతులు ఉండవు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో నామ మాత్రపు రుసుముతో ఒక వ్యాపార సంస్థగా నమోదు చేసుకుంటారు. భవన యజమానులు అగ్నిమాపక శాఖ విధించిన రక్షణ నిబంధనలు పాటించరు. గృహ అవస రాలకు అని అనుమతి తీసుకుని ఆ భవనాలనే కోచింగ్ సెంటర్లుగా వాడుతూ విద్యుత్ శాఖ ఆదాయానికి గండి కొడుతున్నారు.ఎంతమంది విద్యార్థులు శిక్షణ పొందు తున్నారు, ఎంతెంత ఫీజులు చెల్లిస్తున్నారు అనే లెక్కలు ఉండవు. తరగతి గదిలో శిక్షణ పొందుతున్న ప్రతి విద్యార్థి పైన జీఎస్టీ వంటి పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటున్నారు. పైగా వెలుతురు లేని గదుల్లో 100 మంది కూర్చోవాల్సిన చోట 500 మందికి బోధిస్తున్నారు. కనీస మౌలిక సౌకర్యాలు ఉండవు. వీటి కన్నా కన్నా జైళ్ళు నయమనే భావన కలుగుతుంది. జైళ్ళలో మరుగుదొడ్లు, మూత్ర శాలలు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా జైలు గదుల్లో వెలుతురు ఉంటుంది. నిబంధనల ప్రకారం గదిలో లెక్కకు మించి ఖైదీలను ఉంచరు.అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ సరైన భద్రతా ప్రమా ణాలు పాటించని కోచింగ్ సెంటర్లను నియంత్రించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. ఇటీవల హరి యాణా ప్రభుత్వం కోచింగ్ సెంటర్ల నమోదు నియంత్రణ బిల్లు–2024ను తెచ్చి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను కట్టడి చేసింది. అట్లాగే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా చట్టం తెచ్చి, తల్లిదండ్రులపై ఫీజుల భారం పడకుండా విద్యార్థి నిరు ద్యోగుల శ్రేయస్సుకు పాటుపడాలి.– కోటూరి మానవతా రాయ్, వ్యాసకర్త టీపీసీసీ అధికార ప్రతినిధి; తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్, 90009 19101 -
పాక్ సైన్యం ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందిలా.. బయటపడిన ఫొటోలు
జమ్ముకశ్మీర్‌లో గత కొన్ని రోజులుగా వరుసగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఈ ఉగ్రవాద దాడుల్లో కొందరు భారత ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. అదే సమయంలో ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. తాజగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు చెందిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోలలో పాక్ దుశ్చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ స్వయంగా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందని ఈ చిత్రాలను చూస్తే తెలుస్తోంది.పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని కోట్లి ప్రాంతంలో పాక్ సైన్యం క్యాంపును ఏర్పాటు చేసి, అక్కడి యువతకు ఆయుధాలను వినియోగించడంలో శిక్షణ ఇస్తోందని తెలుస్తోంది. పాకిస్తాన్ సైన్యం ఇక్కడి యువకులను ఉగ్రవాదులుగా మార్చేందుకు శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం శిక్షణ పొందిన మాజీ ఆర్మీ లేదా కమాండోల సహాయం తీసుకుంటోందని సమాచారం.జమ్ముకశ్మీర్‌లోని దోడాలో గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులు, భారత సైన్యానికి మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు భారత సైన్యానికి చెందిన నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. తాజాగా పాఠశాలలో ఉన్న ఆర్మీ బృందంపై ఉగ్రవాదులు గ్రెనేడ్‌తో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. -
ఔషధ మొక్కల వ్యాపారంపై శిక్షణ
సుగంధ మొక్కల వ్యాపార అవకాశాలపై 10 రోజుల ఆన్లైన్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గుజరాత్ ఆనంద్‌లోని ఐసిఎఆర్ సంస్థ అయిన డైరెక్టరేట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ లాంట్స్ రీసెర్చ్‌కు చెందిన మెడి–హబ్ ఆగస్టు 1 నుంచి 12వ తేదీ వరకు రోజుకు జరుగుతుంది. రెండు విడతలుగా మొత్తం 5.30 గంటలపాటు ఈ శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఉ. 10 గం. నుంచి మ. 12.30 వరకు, మ. 2 గం. నుంచి సా. 5.30 వరకు ఇంగ్లీష్/హిందీలో జూమ్ ద్వారా శిక్షణ ఇస్తారు. వివరాలకు.. డా. స్నేహల్కుమార్ ఎ పటేల్, వాట్సాప్: 99098 52552. ఆసక్తి ఉన్న వారు ఈ గుగుల్ ఫామ్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలి -
గజరాజులతో గస్తీ
పెద్దదోర్నాల: నల్లమల అడవుల పరిరక్షణకు ఏపీ అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అమూల్యమైన వృక్షసంపద అక్రమ రవాణాను అరికట్టేందుకు.. అరుదైన వన్యప్రాణులను సంరక్షించి వేసవిలో అగ్నికీలల నుంచి అటవీ ప్రాంతాన్ని కాపాడేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ఇప్పటికే బేస్ క్యాంప్‌లు, స్ట్రైకింగ్ ఫోర్స్, యాంటీ పోచింగ్ బృందాలను ఏర్పాటు చేసింది. దీంతోపాటు అభయారణ్యాల్లో ఇకపై గజరాజులతో గస్తీ చేపట్టాలని అటవీ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రెండు అభయారణ్యాల పరిధిలో..మన రాష్ట్రంలోని ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో 3,727.82 చదరపు కిలోమీటర్ల పరిధిలో వ్యాపించి ఉన్న అడవిని కేంద్ర ప్రభుత్వం 1983లో అభయారణ్యంగా ప్రకటించింది. పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం శిఖరం వరకు రాజీవ్‌గాంధీ అభయారణ్యం.. మార్కాపురం, గిద్దలూరు, ఆత్మకూరు, నంద్యాల డివిజన్ల పరిధిలో గుండ్లబ్రహ్మేశ్వర అభయారణ్యం విస్తరించి ఉన్నాయి. వీటిలో పులులతోపాటు చిరుత, ఎలుగుబంటి, జింకలు, దుప్పులు, హైనా, నెమళ్లతోపాటు 70 రకాల క్షీరదాలు, సరీసృపాలు, ఎన్నోరకాల వృక్షాలు, ఔషధ మొక్కలు నల్లమల అభయారణ్యంలో ఉన్నాయి. ఇవన్నీ మారుమూల లోతట్టు ప్రాంతాల్లో జీవిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాలను సందర్శించి వాటిని సంరక్షించే బాధ్యత కత్తిమీద సాములా మారింది.మూలమూలల్నీ జల్లెడ పట్టేలా..మారుమూల ప్రాంతాల్లో సైతం వన్యప్రాణులు, వృక్షాలను సంరక్షించేందుకు వీలుగా అటవీ శాఖ ఉన్నతాధికారులు సుశిక్షితులైన సిబ్బంది నేతృత్వంలో ఏనుగులతో గస్తీ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. మారుమూల ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించేందుకు తమకు శిక్షణ పొందిన 9 ఏనుగులు అవసరమవుతాయని గుర్తించారు. తమకు అవసరమైన 9 ఏనుగులను ఇవ్వాల్సిందిగా ఏపీ అటవీ శాఖ అధికారులు కర్ణాటక అటవీ శాఖకు లేఖ రాశారు.దీనిపై స్పందించిన కర్ణాటక అటవీ శాఖ అధికారులు శిక్షణ పొందిన ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌కు పంపేందుకు ఆమోదం తెలిపారు. దీంతోపాటు ఏనుగులను కట్టడి చేసేందుకు మావటిలను తయారు చేసేందుకు అటవీశాఖ తమ సిబ్బందిని కర్ణాటక రాష్ట్రానికి పంపనుంది. రాష్ట్రానికి చెందిన సిబ్బంది అక్కడికి వెళ్లి గజరాజుల ఆహారపు అలవాట్లు, వాటి కదలికలు, వాటి ఇతర అలవాట్లను క్షుణ్ణంగా పరిశీలించి శిక్షణ పొందనున్నారు.6 ఏనుగులను రాజీవ్‌గాంధీ వన్యప్రాణుల అభయారణ్యానికి, మరో మూడు ఏనుగులను గుండ్లబ్రహ్మేశ్వరం అడవులకు పంపేలా చర్యలు చేపట్టన్నారు. ఏనుగుల్ని తీసుకొస్తే పెద్ద పులులు ఎక్కువగా సంచరించే లోతట్టు ప్రాంతాలైన నెక్కంటి, రేగుమానుపెంట, తూము గుండాలు, ఆలాటం తదితర ప్రాంతాల్లో సైతం ధైర్యంగా పెట్రోలింగ్ చేపట్టవచ్చని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు.ఏనుగులతో గస్తీ నిర్వహించేలా చర్యలు అభయారణ్యంలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో గస్తీ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. నడక మార్గంలో సిబ్బంది కొంతమేర వరకు మాత్రమే వెళ్లగలరు. అదే ఏనుగులతో అయితే సుదూర ప్రాంతాల్లో గస్తీ నిర్వహించవచ్చు. పులులు సంచరించే ప్రదేశాల్లో సైతం భయం లేకుండా పెట్రోలింగ్ నిర్వహించవచ్చు. మనం చేసిన విజ్ఞప్తికి కర్ణాటక అటవీ శాఖ సానుకూలంగా స్పందించింది. త్వరలో ఏనుగుల్ని నల్లమలకు రప్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. – విశ్వేశ్వరరావు, ఫారెస్ట్ రేంజి అధికారి, పెద్దదోర్నాల -
పైలట్ల కొరత తీర్చేందుకు ప్రత్యేక శిక్షణ
ఎయిరిండియా పైలట్లుగా స్థిరపడాలనుకునే వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. అందుకోసం మహారాష్ట్రలోని అమరావతిలో ఏడాదికి 180 మందికి శిక్షణ ఇచ్చేందుకు అకాడమీను ఏర్పాటు చేస్తోంది. అందులో ట్రెయినింగ్ పూర్తిచేసినవారిని నిబంధనల ప్రకారం నేరుగా సంస్థలో పైలట్లుగా నియమించుకోనున్నారు.ఏటా విదేశాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. దానికితోడు విమానయాన సంస్థలు ఎయిర్‌క్రాఫ్ట్‌లను పెంచుతున్నాయి. దాంతోపాటు దేశీయంగా టైర్2, 3 నగరాలకు కూడా విమాన సేవలను విస్తరించాలని కంపెనీలు యోచిస్తున్నాయి. అందుకు అనుగుణంగా విమానాలను కొనుగోలు చేస్తున్నాయి. అయితే కంపెనీలు భావించినట్లు ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్యను పెంచితే వాటిని నడిపేందుకు పైలట్ల అవసరం ఏర్పడనుంది. ఈ సమస్యను ముందే ఊహించిన టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా పైలట్లుగా స్థిరపడాలనుకునేవారికి ట్రెయినింగ్ ఇవ్వనుంది. శిక్షణ పూర్తిచేసుకున్నాక నేరుగా సంస్థలో ఉద్యోగం కల్పించాలని యోచిస్తోంది.ఇండిగో, స్పైస్‌జెట్ వంటి భారత విమానయాన సంస్థలు విదేశాల్లోని స్వతంత్ర పైలట్ ట్రయినింగ్ అకాడమీలతో అనుబంధంగా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఇండిగో సంస్థ విదేశాల్లోని ఏడు ఫ్టైట్ స్కూళ్లతో అనుబంధం కలిగి ఉంది. ఇప్పటికే ఈ సంస్థ అమెరికన్ కంపెనీ పైపర్, యూరోపియన్ సంస్థ డైమండ్ నుంచి దాదాపు 30 సింగిల్ ఇంజిన్, నాలుగు మల్టీ ఇంజిన్ విమానాల డెలివరీకి ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో విదేశీ అకాడమీలతో అనుబంధంగా ఏర్పడి పైలట్లును నియమించుకోనుంది.ఎయిరిండియా మాత్రం పైలట్ల కొరత తీర్చుకునేందుకు ప్రత్యేకంగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది. దేశీయంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో పైలట్ శిక్షణ తీసుకుంటున్న 40శాతంపైగా అభ్యర్థులు విదేశాలకు వెళ్తున్నారు. దాంతో స్థానికంగా పైలట్ల కొరత పెరుగుతోందని కంపెనీ వర్గాలు చెప్పాయి. ఎయిరిండియా శిక్షణలో భాగంగా పైలట్లకు టైప్-రేటెడ్ ట్రైనింగ్ అందించేందుకు ఆరు సిమ్యులేటర్లను కలిగి ఉన్న ఎయిర్‌బస్, ఎల్3 హారిస్(యూఎస్ ఆధారిత కంపెనీ)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందుకోసం గుర్గావ్లోని తన సొంత శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఎయిర్‌బస్ A320 లేదా బోయింగ్ 737 వంటి నిర్దిష్ట విమానాలను నడిపేందుకు టైప్-రేటెడ్ శిక్షణ అవసరం అవుతుంది.ఇదీ చదవండి: విమాన ప్రయాణం నాలుగు గంటలు ఆలస్యం..కారణం..టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఈ సంస్థ ఇప్పటికే 470 కొత్త విమానాలను ఆర్డర్ చేసింది. 2024లో ప్రతి ఆరు రోజులకు ఒక కొత్త విమానాన్ని ప్రవేశపెడతామని గతంలో కంపెనీ సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్స్ తెలిపారు. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఆకాసా కంపెనీలు రానున్న రోజుల్లో డెలివరీ ఇచ్చేందుకు వీలుగా దాదాపు 1,250 విమానాలను ఆర్డర్ చేశాయి. ఎయిర్ఏషియా ఇండియా మాజీ సీఈఓ సునీల్ భాస్కరన్ ప్రస్తుతం ఎయిరిండియా ఏవియేషన్ అకాడమీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. -
టెకీలకు గుడ్‌న్యూస్.. 2 లక్షల మందికి ట్రైనింగ్
క్లౌడ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీలలో భారత్‌లోని 2 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఒరాకిల్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఒరాకిల్, తమిళనాడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ రాష్ట్రంలోని విద్యార్థులకు ఉపాధి ఆధారిత శిక్షణను అందించడానికి ‘నాన్ ముదల్వన్’ కింద ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాయి.పెరుగుతున్న యువ జనాభా ఉన్న భారత్‌లోని టాప్ 12 రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. యువత, యువ ప్రొఫెషనల్స్ తమను తాము మెరుగుపరుచుకోవడానికి, కెరీర్ లక్ష్యాలను సాధించడానికి ఒక వేదికను అందించే బాధ్యతలో భాగంగా నాన్ ముదల్వన్ను ప్రారంభించినట్లు టీఎన్ఎస్డీసీ ఎండీ జె ఇన్నోసెంట్ దివ్య చెప్పారు.ఒరాకిల్ సర్టిఫికేషన్‌ను ప్రొఫెషనల్స్‌కు ఇండస్ట్రీ స్టాండర్డ్‌గా గుర్తిస్తారని, ఇది జ్ఞానాన్ని పెంచడమే కాకుండా, కంపెనీలు కోరుకునే నైపుణ్యాలను కూడా ధ్రువీకరిస్తుందని ఒరాకిల్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ప్రాంతీయ ఎండీ శైలేందర్ కుమార్ అన్నారు. దీంతో ఉద్యోగ అవకాశాలు, స్థిరత్వం పెరుగుతాయన్నారు. -
డాక్టర్ రోడ్ సేఫ్టీ: మాయా టాండన్
ఉద్యోగ విరమణ తర్వాత చాలామంది విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపాలనే ఉద్దేశంతో ఇంటికే పరిమితం అవుతుంటారు. కానీ, జైపూర్ వాసి డాక్టర్ మాయా టాండన్ మాత్రం తన రిటైర్మెంట్ జీవితాన్ని రోడ్డు ప్రమాదాల్లో ్రపాణాలు కోల్పోతున్నవారిని కాపాడేందుకు అంకితం చేసింది. స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి లక్షా ముప్పై మూడు వేల మందికి రోడ్డు భద్రతకు సంబంధించిన శిక్షణ ఇచ్చింది. జీవితం పట్ల ఉత్సాహం, సమాజం కోసం పనిచేయాలనే తపనతో గత ముప్ఫై ఏళ్లుగా డాక్టర్ మాయా టాండన్ చేస్తున్న కృషికి గానూ ఆమెను ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారం వరించింది. వైద్యసేవలోనే తరిస్తున్న టాండన్ గురించి ఆమె మాటల్లోనే...‘‘అజ్మీర్‌లో పుట్టి పెరిగాను. చిన్ననాటి నుంచి కుటుంబ మద్దతు నాకు ఎక్కువే ఉంది. అన్ని బోర్డ్ పరీక్షలలో మంచి మార్కులు సాధించి, అజ్మీర్‌లోని మెడికల్ స్కూల్లో చేరాను. జీవితమంతా నాదైన మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛ నాకు లభించింది. అజ్మీర్‌లోని హాస్పిటల్లో వైద్యురాలిగా చేరాను. అక్కడే టాండన్‌తో జరిగిన పరిచయం పెళ్లికి దారితీసింది. పెళ్లి తర్వాత జైపూర్‌కు వెళ్లాను. కొడుకు పుట్టిన తర్వాత అనస్తీషియాలజీలో డి΄÷్లమా చేశాను. డి΄÷్లమా పూర్తయ్యేనాటికి కూతురు కూడా పుట్టింది. ఆ తర్వాత అనస్తీషియాలోనే ఎమ్మెస్ కూడా చేశాను. జైపూర్‌లోని మెడికల్ కాలేజీలో అనస్తీషియాపై స్పీచ్‌లు ఇచ్చేదాన్ని. అందులో భాగంగా పీడియాట్రిక్ అనస్తీషియా కోసం లండన్ ఫెలోషిప్‌కు హాజరయ్యాను. అక్కణ్ణుంచి వచ్చాక జైపూర్‌లో పనిచేయడం ్రపారంభించాను. మూడు రోజుల కోర్సు తిప్పిన మలుపుసాధారణంగా అందరికీ అనస్తీషియాలజిస్ట్ పాత్ర తెర వెనుక పనిగా కనిపిస్తుంది. నేను మాత్రం రోగి జీవితం అనస్తీషియాలజిస్ట్ పై ఆధారపడి ఉంటుందని నమ్ముతాను. 1975లో సవాయ్ మాన్సింగ్ హాస్పిటల్లో సూపరింటెండెంట్‌గా, అనస్తీషియా హెడ్‌గా పనిచేస్తూ దాని నిర్వహణను చూశాను. 1985లో పదవీ విరమణ చేసే సమయంలో జైపూర్‌లోని రాజస్థాన్ ΄ోలీసు అకాడమీ నన్ను సంప్రదించి, రోడ్డు భద్రత, ్రపాణాలను రక్షించడంపై మూడు రోజులు కోర్సు ఇవ్వాలని కోరింది. రిటైర్మెంట్ తర్వాత అదే నా జీవిత గమనాన్ని మలుపు తిప్పుతుందని తెలియకనే వారి అభ్యర్థనను అంగీకరించాను. మూడు రోజుల కోర్సు చాలా సక్సెస్ అయ్యింది. దీంతో జైపూర్, చుట్టుపక్కల హైవేలపై ΄ోస్ట్ చేసే సీనియర్ అధికారులందరి కోసం మరొక కోర్సు ఏర్పాటు చేశారు. ఒక ఫొటోగ్రాఫర్ ఆ ఈవెంట్ ఫొటోలు తీయడానికి వచ్చాడు. కొన్ని నెలల తర్వాత అతను నాకు ఫోన్ చేసి, నేను అతని ్రపాణాలను రక్షించానని చె΄్పాడు. అదెలా అని ఆశ్చర్య΄ోయాను. ఆ ఫొటోగ్రాఫర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతని తొడల వెనక భాగంలో రక్తస్రావం అవుతూ ఉంది. అతని చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలా సహాయం చేయాలో తెలియక ప్రమాదం తాలూకు ఫొటోలు తీసుకుంటున్నారు. తనను ఎత్తి, ఒక చోట ఎలా కూర్చోబెట్టాలో చెప్పి, రక్తస్రావం తగ్గేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సాటివారికి వివరించి, ప్రమాదం నుంచి బయటపడిన విధం గురించి తెలియజేశాడు. దీంతో ఆ కోర్సు ్రపాముఖ్యత ఎంతటిదో గ్రహించాను. సమయానుకూలంగా తీసుకునే జాగ్రత్తలు మన ్రపాణాలను ఎలా కాపాడతాయో ఆ రోజు మరింతగా కళ్లకు కట్టాయి. ఎక్కడైనా ప్రమాదం జరిగితే చుట్టూ అందరూ గుమికూడుతారు. ఆ గుంపులోని వ్యక్తులలో ఎవరికీ ్రపాణాలను రక్షించే దశలు తెలియవు. దీంతో భారతదేశంలో రహదారి భద్రత తీరుతెన్నులు మార్చాలనే ఉద్దేశ్యంతో ‘సహాయ’ ట్రస్ట్‌ను ్రపారంభించాను. అప్పటి నుండి 1,33,000 మంది వ్యక్తులకు ఉచిత కోర్సులు, సెమినార్లు, ఉపన్యాసాలు ఇస్తూ వచ్చాను.కోర్సులు అన్నీ ఉచితమేకార్డియోపల్మొనరీ రిససిటేషన్ (సీపీఆర్), ప్రమాదాలను ఎదుర్కోవడానికి సరైన నిర్వహణ పద్ధతులు, అవగాహన పెంచడం దీని లక్ష్యం. ΄ోలీసు విచారణ నుండి లైఫ్ సేవర్‌ను రక్షించే వివిధ చట్టాల గురించి కూడా కోర్సులో పాల్గొనేవారికి తెలియజేస్తాం. గాయపడిన వ్యక్తికి సిపీఆర్, ప్రథమ చికిత్స ఎలా అందించాలో మేం చూపిస్తాం. ప్రజలను చేరుకోవడానికి మాకు వివిధ మార్గాలు ఉన్నాయి. ఆన్లైన్, ఆఫ్లైన్లలో సెమినార్లు ఇస్తాం. వర్క్‌షాప్‌లు, తరగతులను కూడా నిర్వహిస్తాం. అదనంగా ర్యాలీలు చేస్తాం. వీధి నాటకాలు కూడా వేయిస్తాం. ఒక చిన్న కోర్సులో మొదటి పది సెకన్లలో ఏమి చేయాలో వారికి సూచనలు అందించడానికి ్రపాధాన్యత ఇస్తాం. ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు తలకు గాయాలు, రక్తస్రావం కోసం తనిఖీ చేయమని చెబుతాం. సమస్య ఏమిటో నిర్థారించుకున్న తర్వాత ఆ వ్యక్తికి ఊపిరి, గుండెకు సంబంధించిన సమస్య ఉంటే సీపీఆర్ని ఆశ్రయించడం ఉత్తమమైన మార్గం. అంతర్గత రక్తస్రావం, కార్డియాక్ అరెస్ట్ వంటి సమస్యలలో సీపీఆర్ మాత్రమే సహాయం చేస్తుంది. మాల్స్, విమానాశ్రయాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో అత్యవసర సేవలు ఉండేలా ప్రభుత్వ సంస్థలతో కలిసి ట్రస్ట్ పని చేస్తుంది.అవగాహన లోపమే ప్రధాన అడ్డంకివర్క్షాప్లకు హాజరయ్యేందుకు ప్రజలను తీసుకురావడం మేం ఎదుర్కొంటున్న ప్రధాన అడ్డంకి. భారతీయ ప్రజానీకం ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటారు. కొంత సమయాన్ని అవగాహనకు కేటాయించాలనుకోరు. మా కోర్సులకు వచ్చి, విషయాల పట్ల అవగాహన పెంచుకోక΄ోవడంతో ఇంకా తక్కువ ప్రతిస్పందన రేటునే చూస్తున్నాం. రోడ్డు ప్రమాదాల్లో భారతదేశం ముందుంది. ప్రతిస్పందనలో మాత్రం చాలా వెనుకుంది. దీంతో మన మూలాలైన గ్రామీణ ్రపాంతాలకు వెళ్లి, ప్రజలను రక్షించడానికి కావల్సిన శిక్షణ ఇవ్వాలని ΄్లాన్ చేస్తున్నాం. కోర్సులో పాల్గొన్న వ్యక్తులు స్వచ్ఛందంగా సేవ చేయడానికి లైఫ్సేవర్కి తగిన పరికరాలను ట్రస్ట్ అందిస్తుంది. హైవేలకు సమీపంలో నివసించే గ్రామస్థులకు శిక్షణ ఇవ్వడానికి అందరి నుంచి ఆర్థిక సాయం కూడా కోరుతుంటాను. ఎందుకంటే గాయపడిన వారిని చేరుకోవడానికి, మొదటగా స్పందించినవారికి.. విరాళం ఇవ్వడానికి కూడా మేము సహాయం చేస్తుంటాం’ అని వివరిస్తుంది ఈ డాక్టర్. -
ఎన్నికల శిక్షణకు డుమ్మా.. 70 మంది అధికారులపై చర్యలు!
ఎన్నికల శిక్షణకు హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం గతంలోనే వెల్లడించించింది. అయితే దీనిని పెడచెవిన పెట్టిన కొందరు అధికారులు చిక్కుల్లో పడ్డారు. ఈ ఉదంతం యూపీలోని లక్నోలో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ప్రిసైడింగ్, పోలింగ్ శిక్షణకు హాజరుకాని 70 మంది అధికారులపై శాఖాపరమైన చర్యలు మొదలయ్యాయి. జిల్లా మేజిస్ట్రేట్ సూర్యపాల్ గంగ్వార్ ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సంబంధిత సెక్షన్ల ప్రకారం అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఎన్నికల సంఘం నిర్వహించే ఈ శిక్షణ.. ఓటింగ్ ప్రక్రియపై సమగ్ర అవగాహనను కలిగిస్తుంది. అలాగే నిష్పాక్షికంగా ఎన్నికలను నిర్వహించడానికి అనుసరించాల్సిన మార్గదర్శకాలను తెలియజేస్తుంది. ఈ శిక్షణకు హాజరు తప్పనిసరి అని ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులకు తెలియజేశారు. ఈ శిక్షణ సమయంలో ఓటింగ్ రోజున తలెత్తే సమస్యల పరిష్కారానికి అనేక వ్యూహాలను తెలియజేస్తారు. ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరుపై అధికారులకు అవగాహన కల్పిస్తారు. -
చేనేతకు సంక్షేమ అద్దకం
సాక్షి, అమరావతి: పడుగు–పేకల్లా కష్టాలు అల్లుకున్న చేనేత బతుకులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఆదరణ కోల్పోయిన చేనేత రంగానికి సంక్షేమ రంగులు అద్దారు. నేతన్న నేస్తంతోపాటు క్లస్టర్లు, నూలు రాయితీ, రుణాలు, పెన్షన్లు వంటి అనేక రకాల సాయమందించి మగ్గానికి మహర్దశ తెచ్చారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు చేనేత రంగానికి ఇచ్చిన 25 హామీల్లో ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయకపోగా కమిటీలు, అధ్యయనాలు అంటూ కాలయాపన చేశారు. బాబు ఐదేళ్ల హయాంలో రూ.442 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే, వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలు తదితర సంక్షేమ పథకాల ద్వారా రూ.3,706 కోట్లుపైగా ఖర్చు చేసింది, నేతన్న నేస్తం సాయం రూ.969.77 కోట్లు 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతి హామీని తు.చ. తప్పకుండా అమలు చేశారు. సొంత మగ్గం కలిగిన ప్రతి కార్మికునికీ నేతన్న నేస్తం ద్వారా ఏడాదికి రూ.24 వేలు చొప్పున రూ.1.20 లక్షలు అందించారు. దీనికి తోడు కరోనా కష్టకాలంలో 82 వేల చేనేత కుటుంబాలకు రూ.వెయ్యి చొప్పున జమ చేయడంతోపాటు బియ్యం, కందిపప్పు, నూనె వంటి నిత్యావసర సరుకులు అందించారు.కరోనా రెండేళ్లు సహా ఐదేళ్లుగా కేటాయించిన ఈ మొత్తం అక్షరాలా రూ.969.77 కోట్లు. ఈ నిధులతో డబుల్ జాకార్డ్, జాకార్డ్ లిఫ్టింగ్ మెషిన్ తదితర ఆధునిక పరికరాలతో తమ మగ్గాలను ఆధునికీకరించుకున్నారు. 2018–19లో నెలవారీ ఆదాయం సగటున రూ.4,680 ఉంటే ఈ పథకం అమలుతో మూడు రెట్లు పెరిగింది. మరోవైపు అర్హులైన 94,224 మంది చేనేత కార్మికులకు నెలకు రూ.3 వేలు చొప్పున పెన్షన్ అందిస్తున్నారు.ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఊతం చేనేత ఉత్పత్తులకు ఊతమిచ్చేలా ఆప్కోకు రూ.468.84 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో కలిపి) చెల్లించింది. ఆప్కో, రాష్ట్ర చేనేత జౌళి శాఖల ద్వారా ఆర్గానిక్ వ్రస్తాల తయారీ, కొత్త కొత్త డిజైన్ల రూపకల్పన తదితరాల్లో శిక్షణ ఇప్పించింది. 46కి పైగా ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. శిక్షణ అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో సబ్సిడి అందించి మగ్గాలు, షెడ్డులు, ఇతర సామగ్రిని సమకూర్చింది. అమెజాన్, మింత్ర, ఫ్లిప్‌కార్ట్, లూమ్‌ఫోక్స్, పేటీఎం, గోకూప్ వంటి ఈ– కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యం కలి్పంచింది. ఆప్కో షోరూమ్‌లు విస్తరించింది. కేరళ, ఢిల్లీ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోను ఏపీ చేనేత వస్త్రాల విక్రయాలకు చర్యలు చేపట్టింది. జీఎస్టీపై పచ్చ మీడియా గందరగోళం ((బాక్స్)) చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించే జీఎస్టీపై టీడీపీ పచ్చ మీడియా ఇటీవల అర్థంలేని విమర్శలు చేసి గందరగోళం సృష్టిస్తోంది. వాస్తవానికి చేతి వృత్తులు, గ్రామాల్లో కుటీర పరిశ్రమలపై పన్ను వేయకూడదని రాజ్యాంగంలోని ఆరి్టకల్ 43 చెబుతోంది. అయినప్పటికీ నేతకు ఉపయోగించే చిలప నూలుపై కేంద్ర ప్రభుత్వం 5 శాతం, తయారైన వస్త్రంపై 12 శాతం చొప్పున జీఎస్టీ వసూలు చేస్తోంది. తయారైన వ్రస్తానికి వసూలు చేస్తున్న జీఎస్టీని 18 శాతానికి పెంచాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను చేనేత సహకార సంఘాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో దాన్ని విరమించుకుంది. మొత్తం జీఎస్టీనే ఎత్తివేయాలని చేనేత సహకార సంఘాలు కోరుతున్నాయి. ఉప్పాడకు వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు చేనేత రంగానికి ఆరి్థక ఊతంతోపాటు అవార్డులతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రోత్సాహం అందించింది. జమ్దానీ పట్టు నేత కళను కొనసాగిస్తున్న ఉప్పాడ హ్యాండ్లూమ్స్ వీవర్స్ కో–ఆపరేటివ్ సొసైటీ(కాకినాడ)కు వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు వరించడంతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతోపాటు దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఒక జిల్లా–ఒక ఉత్పత్తి(ఓడీఓపీ)లో రాష్ట్రానికి చెందిన చేనేత రంగం హవా కొనసాగింది. దేశంలో మొత్తం మీద 64 ఉత్పత్తులు దరఖాస్తులు చేస్తే.. వాటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి చేసిన 14 ఉత్పత్తుల్లో 8 చేనేతవే కావడం విశేషం. నేతన్న నేస్తం మా జీవితంలో వెలుగులు నింపింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించిన నేతన్న నేస్తం ద్వారా ఏడాదికి రూ.24 వేలు చొప్పున ఇప్పటి వరకు రూ.1.20 లక్షల ఆరి్థక సాయం అందింది. ఆ డబ్బుతో చేనేత మగ్గాలను ఆధునికీకరించుకొని రెట్టింపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాం. – శంకర, చేనేత కార్మికుడు, కేశవనగర్, ధర్మవరం జగన్‌కు రుణపడి ఉంటాం.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మా కుటుంబం అంతా రుణపడి ఉంటుంది. ఆరోగ్యశ్రీలో రూ.మూడు లక్షలు సాయం అందించడంతో ఆపరేషన్ చేయించుకున్నాను. ప్రతి నెల పెన్షన్ వస్తోంది. నా భార్యకు చేయూత పథకం కింద రూ.18,750 నాలుగు సార్లు వచ్చాయి. వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.15 వేలు చొప్పున మూడుసార్లు వచ్చాయి. –చింతలపూడి రాంబాబు, చేనేత కార్మికుడు, వాకతిప్ప, కాకినాడ జిల్లా మగ్గాన్ని ఆధునికీకరించుకుని ఆదాయం పొందుతున్నా నేతన్న నేస్తంతో రూ.1.20 లక్షలు ఆరి్థక సాయంతో రావడంతో మగ్గాన్ని ఆధునికీకరించుకున్నాను. ముడిసరుకులు కొనుగోలు చేసుకుని అదనపు ఆదాయం పొందుతున్నాను. నేతన్న నేస్తంతోపాటు ఆసరా ద్వారా రూ.84 వేలు, అమ్మ ఒడి రూ.54 వేలు, సున్నా వడ్డీ రూ.7 వేలు ఆరి్థక సాయం అందడంతోపాటు పిల్లల్ని బాగా చదివించుకుని సమాజంలో గౌరవంగా బతుకుతున్నాను. –పిచ్చుక గంగాధరరావు, పెడన, కృష్ణా జిల్లా మగ్గాన్ని విరిచేసింది చంద్రబాబు రాష్ట్రంలో మగ్గాన్ని విరిచేసింది చంద్రబాబు. చేనేత రంగాన్ని ఆదుకుంటానంటూ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఏకంగా 25 హామీలు గుప్పించిన చంద్రబాబు ఏ ఒక్కటీ నెరవేర్చకుండా దగా చేశారు. చేనేత రుణాల మాఫీపై అధ్యయనానికి ఒక కమిటీ వేస్తూ జీవో ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. రుణమాఫీ చేయకపోవడంతో కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఇల్లు, మగ్గానికి రూ.లక్షన్నర చొప్పున సాయమందిస్తానని మోసం చేశారు. చేనేత కార్మికులకు రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి, బడ్జెట్లో ప్రతి సంవత్సరం రూ.వెయ్యి కోట్లు కేటాయింపు, ఉచిత విద్యుత్ వంటి హామీలను చంద్రబాబు మరిచారు. – బండారు ఆనందప్రసాద్, అధ్యక్షుడు, ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్. బాబు దగా, జగన్ అండబాబు హయాంలో ► ఆప్కోకు రూ.103 కోట్ల బకాయిలు పెట్టారు. ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదు ► సహకార సంఘాల్లో పనిచేసే కార్మికుల కూలీ నుంచి 8 శాతం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 8 శాతం చొప్పున మొత్తం 24 శాతం జమ చేసి ఏడాదికి ఒకసారి అందించే త్రిఫ్ట్ ఫండ్‌ను గత ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నిలిపేశారు. ► 2014 ఎన్నికల మేనిఫెస్టోలో 25 హామీలు గుప్పించి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు, ► చేనేత రుణాలు మాఫీపై అధ్యయనానికి కమిటీ వేస్తూ చేతులు దులుపుకొన్నారు. జగన్ హయాంలో ► పాత బకాయిలు కలిపి మొత్తం రూ.468.84కోట్లను చెల్లించారు. ► నేతన్న నేస్తం, నేతన్న పెన్షన్ అమలు చేశారు. సంక్షేమానికి మొత్తం రూ.3,706 కోట్లు ఖర్చు చేయడం ఒక రికార్డు. వీటితో పాటు రుణ పరపతి, ముడి సరుకులకు పెట్టుబడి, నైపుణ్య శిక్షణ, తయారీ–విక్రయాలకు క్లస్టర్ల ఏర్పాటు. మేలైన మార్కెటింగ్‌కు ఈ–కామర్స్ దిగ్గజాలతో ఒప్పందాలు. ► చేనేతకు కీలకమైన నూలు పోగుల కొనుగోలుకు జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌డీసీ) ఏర్పాటు. ► 416 ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలకు (పీహెచ్డబ్ల్యూసీఎస్) రూ.250.01కోట్ల సాయం. ► వ్యక్తిగతంగాను, స్వయం సహాక సంఘాల్లోని (ఎస్‌హెచ్‌జీ) వారికి నాలుగేళ్లలో రూ.122.50 కోట్ల విలువైన నూలు అందజేత. -
స్పెయిన్‌లో శిక్షణకు జ్యోతి యర్రాజీ
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల రజత పతక విజేత, ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ స్పెయిన్‌లో 45 రోజుల ప్రత్యేక శిక్షణ తీసుకోనుంది. జ్యోతికి సంబంధించి విమాన ప్రయాణాలు, వసతి, శిక్షణ ఇతరత్రా ఖర్చులన్నీ మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసీ) భరిస్తుందని కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్ సహా, ఈ సీజన్లో అత్యున్నత ప్రదర్శన కనబరిచేందుకు ఎంఓసీ పథకంలో ఆమెతో పాటు పలువురు అథ్లెట్లకు ఆర్థిక చేయూత ఇవ్వనున్నారు. వైజాగ్‌కు చెందిన 24 ఏళ్ల జ్యోతి గత ఆసియా క్రీడల్లో 100 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకం గెలిచింది. మరో తెలుగుతేజం, స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలకు కూడా మరింత మెరుగైన శిక్షణ కోసం ఆరి్థక సాయం అందించే ప్రతిపాదనకు ఎంఓసీ ఆమోదం తెలిపింది. -
‘శ్రీ రాముడి’ కోసం రణ్‌బీర్ దిమ్మదిరిగే వర్కవుట్..వైరల్ వీడియో
చాక్లెట్ బాయ్‌గా బాలీవుడ్లో అడుగుపెట్టి.. నటుడుగా తానేంటో నిరూపించుకున్నాడు హీరో రణ్‌బీర్ కపూర్. ‘యానిమల్ మూవీతో టాలెండెట్ హీరోగా తెలుగు ఆడియెన్స్‌కు దగ్గరయ్యాడు. తాజాగా రానున్న మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘రామాయణం’ కోసం రణ్‌బీర్ కపూర్ తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. శ్రీరాముడి పాత్ర కోసం జిమ్‌లో తెగ కష్టపడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది. రణ్‌బీర్ పెర్సనల్ ట్రైనర్ నామ్ వర్కౌట్ వీడియోను షేర్ చేశాడు. స్విమ్మింగ్ రన్నింగ్, బైక్ రైడింగ్.. జిమ్ బాల్, కెటిల్‌బెల్స్, జిమ్ రోప్‌లతో వర్క్అవుట్లు ఈ వీడియోలో చూడొచ్చు. ప్రశాంతంగా గ్రామీణ ప్రాంతంలో ట్రెక్కింగ్, బైక్ రైడింగ్, బరువులు ఎత్తడం లాంటి కీలకమైన ఎక్సర్సైజ్లు చేస్తుండటం గమనార్హం. రణ్‌బీర్ సతీమణి, హీరోయిన్ అలియా భట్, కూతురు రాహా కూడా ఉందంటూ ఫ్యాన్స్ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Training With Nam (@trainingwithnam) ఏ ప్రాతకోసమైనా పాత్రకు తగ్గట్టు ఒదిగిపోయేలా తీవ్ర కసరత్తులు చేయడం రణబీర్‌కు అలవాటు. అలా ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులకు మరింత దగ్గర య్యాడు. తాజా ఆయన వర్కవుట్స్ చూసి ఆయనఅంకితభావం అలాంటిది అంటూ ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంతో రానున్న 'రామాయణం' మూవీలో రణబీర్ కపూర్ రాముడిగా అలరించ నున్నాడు. గత ఏడాది రికార్డు కలెక్షన్స్ రాబట్టిన యానిమల్ మూవీ కోసం కూడా రణ్‌బీర్ భారీగా కండలు పెండిన సంగతి తెలిసిందే. -
త్వరలో రంగంలోకి ‘ఆపద మిత్ర’లు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొ చ్చిన ఆపద మిత్ర పథ కంలో భాగంగా తెలంగాణ అగ్నిమా పకశాఖ ఆధ్వర్యంలోనూ ‘ఆపద మిత్ర’లకు శిక్షణ ఇస్తు న్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్ జనరల్ (డీజీ) వై.నాగిరెడ్డి తెలిపారు. విపత్తుల వేళ సత్వర స్పందన కోసం స్థానికుల్లో కొందరిని వలంటీర్లుగా గుర్తించి వారికి ‘ఆపద మిత్ర’లుగా శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. తొలి విడతలో భాగంగా ప్రస్తుతం వరంగల్‌లో 95 మంది వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని.. వారికి తరగతి గది శిక్షణ పూర్తయిందని పేర్కొన్నారు. త్వరలోనే వారికి క్షేత్రస్థాయి శిక్షణ ప్రారంభిస్తామన్నారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణమే ఎలా స్పందించాలి.. ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. చుట్టుపక్కల వారిని ఎలా అప్రమత్తం చేయాలన్న అంశాలపై ‘ఆపద మిత్ర’లు శిక్షణ పొందుతారని తెలిపారు. ఫైర్ సిబ్బంది మంటలార్పే సమయంలో సహాయకులుగా వ్యవహరిస్తారని వివరించారు. సాధారణ సమయాల్లో అగ్నిప్రమాదాల నియంత్రణ, ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్థానికంగా వారి పరిధిలో అవగాహన సైతం కల్పిస్తారన్నారు. మరోవైపు ఏప్రిల్ 14 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఫైర్ సర్వీస్ వారంగా నిర్వహించనున్నట్లు నాగిరెడ్డి తెలిపారు. వారంపాటు నిర్వహించనున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు, మల్టీప్లెక్స్‌లు, మాల్స్‌లో అగ్నిప్రమాదాల నియంత్రణ, ప్రమాద సమయాల్లో ఎలా కాపాడుకోవాలన్న అంశాలపై ఫైర్ సిబ్బంది అవగాహన కల్పిస్తారని చెప్పారు. -
యువతరానికి దిక్సూచి ‘భవిత’
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చూపిస్తున్న చొరవకు పారిశ్రామికవేత్తలు ఫిదా అయ్యారు. ‘భవిత’ పేరుతో ప్రారంభించిన స్కిల్ కాస్కేడింగ్ కార్యక్రమం.. యువత భవిష్యత్తుకు దిక్సూచిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఏపీలో నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన మ్యాన్ పవర్ దొరుకుతోందని.. ఇక్కడ విద్యార్థుల్ని సానబెడితే అన్ని రంగాల్లోనూ రాణించగల సత్తా ఉందని సూచించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం.. తమలాంటి ఎందరో యువతీ యువకుల జీవన స్థితిగతుల్ని మార్చేసిందని ఉద్యోగాలు పొందిన యువత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నేను కోరుకున్న ఫీల్డ్‌లో స్థిరపడ్డాను మాది విశాఖపట్నం పెదగంట్యాడ. మా నాన్న లిఫ్ట్ ఆపరేటర్, అమ్మ గృహిణి, నాకు ఒక సోదరి కూడా ఉంది. మేం ఇద్దరం జగనన్న ప్రభుత్వం ఇచ్చిన విద్యాదీవెన, వసతి దీవెన పథకాల ద్వారా లబ్ధిపొంది చదువుకున్నాం. నా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆటోమేషన్‌లో స్ధిరప డాలని సీడాప్ ద్వారా స్కిల్ కాలేజ్‌లో జాబ్ ఓరియెంటెడ్ కోర్సు గురించి తెలుసుకొని రిజిస్టర్ చేసుకొని ట్రైనింగ్ తీసుకున్నాను. మాకు టెక్నికల్ స్కిల్స్‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ నేర్పించారు. అనేక ప్రముఖ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించాయి. నేను రెండు కంపెనీలలో మంచి ప్యాకేజ్‌కు ఎంపికయ్యాను. చెన్నైలోని రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో 4 రౌండ్ల ఇంటర్వ్యూ తర్వాత గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీగా సెలక్ట్ అయ్యాను. – దీపిక, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ, రాయల్ ఎన్ఫీల్డ్ మోటర్ కంపెనీ, చెన్నై స్కిల్లింగ్ ఎకో సిస్టమ్‌ని అభివృద్ధి చేసిన ఏపీ.. ఏపీలో యంగ్ సీఎం ఉన్నారు. అందుకే యువతకి అవకాశాలు ఎక్కువగా కల్పించాలన్న ఆలోచనలతో అడుగులు వేస్తున్నారు. సింగపూర్‌లో స్కిల్లింగ్కి ఏజ్ బార్ లేదు. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. దేశంలో స్కిల్లింగ్ ఎకోసిస్టమ్‌ని అభివృద్ధి చేసిన రాష్ట్రం ఆంధప్రదేశ్ మాత్రమే. పదిస్థాయిల్లో శిక్షణ అందించేలా స్కిల్ పిరమిడ్‌ను కూడా సీఎం జగన్ రూపొందించారు. యువతకి నైపుణ్యాన్ని పెంపొందించే ప్రోగ్రామ్ని కూడా తయారు చేశారు. పరిశ్రమలతో అనుసంధానం చేయడంతో వారికి కావాల్సిన సాంకేతిక నైపుణ్యం ఉన్న యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. – బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర ఆర్థిక, స్కిల్‌డెవలప్‌మెంట్ శాఖ మంత్రి ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోంది సీఎం జగన్ ప్రభుత్వం మా సంస్థని, పెట్టుబడుల్ని ఎంతగానో ప్రోత్సహి స్తోంది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు రావాలని ఆశిస్తున్నాం. స్కిల్ సెక్టార్ కు ఇది గొప్ప అడుగు. స్కిల్ ఎకో సిస్టమ్‌ని అభివృద్ధి చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం చర్యలకు నిజంగా అభినందనలు. కియా మోటార్స్ ఇండియా ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ఇన్‌స్టిట్యూట్‌ని శ్రీ సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేశాం. స్కిల్ డెవలప్మెంట్ సంస్థల ద్వారా అద్భుత అవకాశాలు ఏపీలో ఉన్న యువతకు అందుతున్నాయి. –కె.గ్వాంగ్లీ, కియా మోటర్స్ ఎండీ కమిట్మెంట్ ఉన్న సీఎం జగన్ దేశంలో ఇప్పటి వరకూ చాలా స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలకు హాజరయ్యాను. ఇలాంటి కమిట్మెంట్ ఉన్న ప్రభుత్వాన్ని ఇంతవరకూ చూడలేదు. యువత ముందే పారిశ్రామికవేత్తల్ని కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పడం అద్భుతం. మా సంస్థ విమానాలు తయారు చేస్తుంది. భవిష్యత్తులో విమానయానంలో ఎన్నోరకాల ఉపాధి అవకాశాలున్నాయి. లెర్నింగ్ వింగ్స్ ఫౌండేషన్ అనే స్కిల్లింగ్ భాగస్వామితో పని చేస్తున్నాం. మా సంస్థ సామర్థ్యం మేరకు స్కిల్ ఎకో సిస్టమ్‌కు మద్దతు అందిస్తాం. – ప్రవీణ యజ్ఞంభట్, బోయింగ్ ఇండియా చీఫ్ ఆఫ్ స్టాఫ్ కెమికల్ ఇంజినీర్స్ అవసరం చాలా ఉంది ఏపీ సెజ్ అచ్యుతాపురంలో మా సంస్థని ఏర్పాటు చేశాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆటమిక్ రీసెర్చ్ ఉత్పత్తుల్లో ఎంతో ఉన్నతి సాధించాం. కెమికల్ ప్రాసెసింగ్ వైపు కూడా మా సంస్థ అడుగులు వేస్తోంది. ఈ తరుణంలో మాకు కెమికల్ ఇంజినీర్స్ అవసరం ఎంతో ఉంది. నేరుగా నియామకం చేసుకోవాలని భావిస్తున్నాం. ఇందుకోసం రాష్ట్ర స్కిల్ డెవలప్ మెంట్ సొసైటీతో కలిసి పనిచేస్తున్నాం. విద్యార్థులకు మాకు అవసరమైన రీతిలో శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తాం. పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల్ని అందించడంలో సీఎం వైఎస్ జగన్ చేస్తున్న కృషి అనిర్వచనీయం. – కొయిచీ సాటో, టొయేట్సు రేర్ ఎర్త్ ప్రై.లి., ఎండీ సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు నేను మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తిచేశాను. అప్పుడు ఏపీఎస్ఎస్డీసీ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో 45 రోజులు శిక్షణ తీసుకున్నాను. శిక్షణలో నేను చాలా నేర్చుకున్నాను. మెషిన్ ఆపరేటింగ్, సాఫ్ట్‌స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పారు. 2021లో ఏషియన్ పెయింట్స్ వారి ఇంటర్వ్యూలకు హాజరై ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా ఏడాదికి రూ. 5 లక్షల ప్యాకేజ్‌లో సెలక్ట్ అయ్యాను. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్‌గా ఏడాదికి రూ. 7.2 లక్షల ప్యాకేజీ తీసుకుంటున్నాను. మా కుటుంబానికి నేను ఇప్పుడు చాలా ఆసరాగా ఉన్నాను. ఈ విధమైన శిక్షణ ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి, సీఎంకు నా కృతజ్ఞతలు. – భార్గవ్, విశాఖపట్నం మానవవనరుల్లో మనమే ముందంజ.. అత్యధికంగా నైపుణ్యంతో కూడిన మానవ వనరులున్న రాష్ట్రంగా ప్రభుత్వం తీర్చిదిద్దడంతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ ముందు వరసలో ఉంది. స్కిల్ ట్రైనింగ్ అనేది కేవలం ఉపాధి అవకాశాల్ని అందిస్తోంది. ఐదేళ్లలో 15 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వగా.. 3.8 లక్షల మందికి ఉపాధి కల్పించాం. ఇంకొందరు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారు. సీఎం జగన్ 27 స్కిల్ కాలేజీలు, 192 స్కిల్ హబ్స్, 55 స్కిల్ స్కోప్స్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. భవిత పేరుతో శిక్షణని అప్‌గ్రేడ్ చేస్తున్నాం. – సురేష్‌కుమార్, ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ -
AP: ‘ఐబీ’ సిలబస్ శిక్షణ ఇదిగో
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి గత నెల 31వతేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఐబీ సంస్థతో ఏపీ ఎస్సీఈఆర్టీ ఒప్పదం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 15 రోజుల వ్యవధిలో ఐబీ ప్రతినిధులు ఏపీలో విద్యా విధానం, సంస్కరణల అమలు, ఉపాధ్యాయ శిక్షణ తదితర అంశాలను పరిశీలించారు. ఒప్పందం జరిగిన వెంటనే విజయవాడలోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో ఐబీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సంస్థ ప్రతినిధులు కార్యకలాపాలు ప్రారంభించారు. ఈనెల 26వతేదీ నుంచి 9 రోజుల పాటు ఐబీ అధికారుల బృందం జిల్లాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా, మండల, మున్సిపల్ స్కూళ్లతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర మేనేజ్మెంట్ పాఠశాలను బృందం పరిశీలిస్తుంది. క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రభుత్వం కల్పించిన సదుపాయాలు, ఉపాధ్యాయుల సామర్థ్యాలను అంచనా వేయనున్నారు. – సాక్షి, అమరావతి తొలుత విజయవాడలో టీచర్లకు శిక్షణ ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ బోధనపై మార్చి నుంచి విజయవాడలో మాస్టర్ ట్రైనర్స్‌గా తొలుత కొందరు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నారు. మెక్సికోకు చెందిన ఐబీ ప్రతినిధి ఆల్డో ఇటీవల ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలను స్వయంగా పరిశీలించారు. సదుపాయాలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల వినియోగం, బోధనా విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబ్‌ల పనితీరును అడిగి తెలుసుకోవడంతో పాటు వారితో సంభాషించి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న ‘జగనన్న గోరుముద్ద’ను సైతం రుచి చూశారు. పాఠశాలల్లో భౌతిక, జీవశాస్త్ర ప్రయోగశాలలు, ఇంగ్లిష్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్‌లను పరిశీలించి ఉపాధ్యాయులను ప్రశంసించారు. ఐబీకి చెందిన మరో ప్రతినిధి ఆశిష్ రెండు రోజులు విద్యాశాఖ అధికారులతో సమావేశమై పాఠశాలల్లో ఐటీ, ఆన్లైన్ సేవలను తెలుసుకున్నారు. ఏపీ విద్యా విధానాలు ఐబీకి దాదాపు దగ్గరగా ఉన్నాయని పేర్కొనడం గమనార్హం. వచ్చే ఏడాది ఒకటో తరగతి నుంచి.. ఐబీ అమలుపై 2024–25 విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖ సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు. ఉపాధ్యాయులతోపాటు మండల, జిల్లా విద్యాధికారులు, ఎస్సీఈఆర్టీ, డైట్ సిబ్బంది, ఎస్సెస్సీ, ఇంటర్ బోర్డు సిబ్బంది వీరిలో ఉంటారు. వీరికి దశలవారీగా ‘ఐబీ’పై అవగాహన, నైపుణ్యం, సామర్థ్యాల పెంపుపై శిక్షణ ఇచ్చి ఐబీ సర్టిఫికెట్లు అందచేస్తారు. దీంతో వీరంతా ప్రతిష్టాత్మక ఐబీ గ్లోబల్ టీచర్ నెట్‌వర్క్‌లో భాగమవుతారు. అనంతరం 2025 జూన్‌లో ప్రారంభమయ్యే 2025–26 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతితో ఐబీ విద్యాబోధన ప్రారంభం అవుతుంది. ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ వెళతారు. విద్యార్థులు 2035 నాటికి పదో తరగతి, 2037లో ప్లస్ 2లో ఐబీ సిలబస్‌లో పరీక్షలు రాస్తారు. విద్యార్థులకు ఐబీ, ఏపీ ఎస్సీఈఆర్టీ కలిసి అందించే జాయింట్ సర్టిఫికేషన్‌కు అంతర్జాతీయ గుర్తింపు ఉంటుంది. రూ.73 వేల కోట్లతో సంస్కరణలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పేద పిల్లలు అధికంగా చదువుకునే పాఠశాల విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. విద్యార్థులు ఉన్నతంగా ఎదిగి ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రాథమిక స్థాయి నుంచి ప్రణాళికలు అమలు చేస్తోంది. జగనన్న అమ్మఒడి, విద్యాకానుక, గోరుముద్ద తదితర విప్లవాత్మక కార్యక్రమాలను ప్రవేశపెట్టి విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసింది. 2019 జూన్ నుంచి 2024 జనవరి వరకు విద్యా రంగ సంస్కరణల కోసం ఏకంగా రూ.73,293.68 కోట్లు వెచ్చించింది. ఇప్పుడు ఐబీ బోధనను సైతం ప్రభుత్వ స్కూళ్లలో అందుబాటులోకి తెస్తోంది. అత్యధిక ఐబీ స్కూళ్లు ఏపీలోనే.. ప్రాథమిక విద్యా బోధనలో ప్రపంచంలోనే అత్యుత్తమ విధానాలను ఫిన్‌ల్యాండ్ అమలు చేస్తోంది. పాలనలో పారదర్శకత, మానవ వనరుల వినియోగం, ప్రణాళికలో ఎప్పుడూ ముందు వరుసలో నిలుస్తోంది. ప్రస్తుతం ఐబీ బోర్డు డైరెక్టర్ జనరల్‌గా ఉన్న ఓలి పెక్కా హీనోనెన్ ఫిన్‌ల్యాండ్ జాతీయ విద్యాశాఖకు డైరెక్టర్ జనరల్‌గా సేవలందించారు. ఆయనే స్వయంగా ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ విధానాలను పర్యవేక్షిస్తుండడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 వేల వరకు ఐబీ స్కూళ్లు ఉండగా 2025 జూన్‌లో ప్రపంచంలోనే అత్యధిక ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలువనుంది. ఏపీలో దాదాపు 45 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ (ప్రాథమిక, ప్రాథమికోన్నత) స్కూళ్లు 39 వేల వరకు ఉన్నాయి. ఈ స్కూళ్లలో 2025 జూన్‌లో ఒకటో తరగతితో ఐబీ బోధన ప్రారంభం కానుంది. అంతర్జాతీయంగా పేరున్న ఐబీ బోర్డుకు ప్రపంచంలోనే అతి పెద్ద నెట్వర్క్ మన రాష్ట్రంలోనే ఉండడం విశేషం. -
తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర సంస్థ ఏర్పాటుకు ఆమోదం
కేంద్రం పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. అందుకు అనువుగా కేంద్రం తాజాగా సికింద్రాబాద్, తిరుపతి నగరాల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(నీలిట్) కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆమోదించింది. ఈ సెంటర్లను తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీకి, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు చెప్పారు. ఈ కేంద్రాల్లో రానున్న రోజుల్లో ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఐఈసీటీ)కు సంబంధించిన వివిధ రకాల కోర్సులపై అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇవ్వనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఈ రెండు కేంద్రాలు నీలిట్-చెన్నై ఆధ్వర్యంలో పనిచేయనున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: రూ.కోటి ప్యాకేజీతో ఉద్యోగం! ఈ సంస్థల్లో శిక్షణ తీసుకున్న అభ్యర్థులతో టెక్నాలజీ కంపెనీలకు మానవ వనరుల కొరత తీరనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. రాబోయే 3 ఏళ్లలో ఒక్కో కేంద్రం ద్వారా కనీసం 5,000 మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. -
నెలాఖరుకల్లా ఎన్నికల శిక్షణ పూర్తి చేయాలి
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ త్వరలో ప్రకటించనున్నందున అన్ని రకాల బృందాల శిక్షణను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఆయన శనివారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఎన్నికల సంసిద్ధత, ఓటర్ల జాబితా నవీకరణపై సమీక్షించారు. ఈ సందర్బంగా మీనా మాట్లాడుతూ.. షెడ్యూలు ప్రకటించిన వెంటనే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని చెప్పారు. దాని ప్రకారం ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సెరై్వలెన్స్, వీడియో వ్యూయింగ్, ఎలక్షన్ ఎక్సె్పండిచర్ మేనేజ్మెంట్ టీమ్‌లు, ఇతర బృందాల కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు. అందువల్ల ఆ బృందాలకు వారి విధులపై సమగ్ర అవగాహన ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్‌లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి శిక్షణను మార్చి నెలలో ఇవ్వవచ్చని చెప్పారు. విధుల్లో చేరకపోతే చర్యలు తప్పవు అన్ని జిల్లాల్లో ఆర్వోలు, ఏఆర్వోలు, ఈఆర్వోలు, ఏఈఆర్వోల నియామకం జరిగిందని, వారిలో ఇప్పటికీ విధుల్లో చేరని వారి వివరాలను వెంటనే తెలియజేయాలని ఆదేశించారు. వారి సమాచారాన్ని ప్రభుత్వానికి పంపి, తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు సౌకర్యాలు కల్పించే బృందాలు, హోమ్ ఓటింగ్ బృందాల్లో తగినంత మందిని సమకూర్చుకోవాలని సూచించారు. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులకు ఇంటి వద్దే ఓటింగ్‌కు అవకాశం ఉన్నందున రెవెన్యూ అధికారులు, సిబ్బందితో హోం ఓటింగ్ బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ సిబ్బంది డేటాను సంబంధిత పోర్టల్‌లో వెంటనే ఫీడ్ చేయాలన్నారు. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టంను పటిష్టంగా అమలు పర్చేందుకు రెగ్యులేటరీ అథారిటీలతో సమన్వయం చేసుకోవాలని, ప్రతి అథారిటీ నుండి తప్పనిసరిగా ఒక నోడల్ అధికారి ఉండాలని అన్నారు. ఈవీఎంలను తరలించే వాహనాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఇతర బృందాల వాహనాలకు తప్పనిసరిగా జీపీఎస్ ఉండాలని చెప్పారు. జిల్లా కేంద్రం నుండి బ్లాక్ స్థాయి వరకు అందరు అధికారులతో పటిష్టమైన కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని మీనా ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు అన్నింటికీ తప్పనిసరిగా మైక్రో అబ్జర్వర్లను నియమించాలని, వెబ్ కాస్టింగ్, మీడియో కవరేజిల్లో పోలింగ్ కేంద్రాల పరిసరాలను కూడా చిత్రీకరించాలని చెప్పారు. అందుకు అవసరమైన వీడియోగ్రాఫర్లను, జిల్లా స్థాయిలోనే సమకూర్చుకోవాలన్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈవోలు పి. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
భారత్‌లో మైక్రోసాఫ్ట్ సీడబ్ల్యూబీ ప్రోగ్రాం..
బెంగళూరు: మైక్రోసాఫ్ట్ తమ ‘కోడ్ వితౌట్ బ్యారియర్స్’ (సీడబ్ల్యూబీ) ప్రోగ్రాంను భారత్‌లోనూ ప్రవేశపెట్టింది. దీని కింద ఈ ఏడాది 75,000 మంది మహిళా డెవలపర్లకు శిక్షణ కలి్పంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ చీఫ్ సత్య నాదెళ్ల తెలిపారు. క్లౌడ్, కృత్రిమ మేధ, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో లింగ అసమానతలను తొలగించడంలో తోడ్పడే ఉద్దేశంతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని తొమ్మిది దేశాల్లో 2021లో ఈ ప్రోగ్రాంను ఆవిష్కరించినట్లు ఆయన చెప్పారు. దీని కింద మహిళా డెవలపర్లు, కోడర్స్‌కు శిక్షణ, నెట్వర్కింగ్ అవకాశాలు కల్పిస్తున్నట్లు సత్య నాదెళ్ల వివరించారు. మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు చెప్పారు. మరోవైపు శిక్షణ ఫౌండేషన్, మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న శిక్షా కోపైలట్ ప్రోగ్రాం.. ప్రధానంగా ఉపాధ్యాయులకు సాధికారత కలి్పంచేందుకు ఉద్దేశించినదని సత్య నాదెళ్ల తెలిపారు. అజూర్ ఓపెన్ఏఐ మోడల్ తోడ్పాటుతో పాఠ్యాంశాలను విద్యార్థులు మరింత సులభంగా అర్థం చేసుకునేలా పాఠ్యప్రణాళికలను రూపొందించేందుకు శిక్షా కోపైలట్ ప్రోగ్రాం ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుతం బెంగళూరులోని 30 గ్రామీణ, పట్టణ పాఠశాలల్లో ఉపయోగిస్తున్న ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు సత్య నాదెళ్ల వివరించారు. -
కొత్త సవాళ్లకు సిద్ధం
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట (పీవీ) సింధు ప్రస్తుతం ఫామ్ కోల్పోయి తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. గత 18 నెలలుగా అటు టోర్నీల్లో వైఫల్యంతోపాటు గాయాలు కూడా ఆమెను వెంటాడాయి. 2023లో ఆమె ఒక్క టోర్నీ కూడా గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలో కొంత విరామం తర్వాత సింధు మళ్లీ బరిలోకి దిగుతోంది. పారిస్ ఒలింపిక్స్ సన్నద్ధత కోణంలో చూస్తే ఈ ఏడాది సింధుకు కీలక ఏడాది కానుంది. ఈ నెల 13 నుంచి మలేసియాలో జరిగే ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో సింధు పాల్గొంటోంది. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్‌కు తనకు పెద్ద సవాల్‌గా కనిపిస్తున్నాయని, ఈసారి మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని సింధు అభిప్రాయపడింది. గత కొంత కాలంగా సింధు బెంగళూరులో దిగ్గజ ఆటగాడు ప్రకాశ్ పడుకోన్ , ఇండోనేసియా కోచ్ అగుస్ ద్వి సాంతోసో వద్ద శిక్షణ తీసుకుంటోంది. ప్రకాశ్‌తో పాటు ఆమె ఇతర కోచింగ్ బృందంలో కూడా మార్పులు జరిగాయి. దీంతో మంచి ఫలితాలు రాబట్టగలనని ఆమె విశ్వాసంతో ఉంది. పలు అంశాలపై సింధు అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... | ♦ గత రెండు ఒలింపిక్స్‌లతో పోలిస్తే ఈసారి జరగబోయే పోటీలు నాకు భిన్నమైన అనుభవాన్ని ఇవ్వబోతున్నాయి. 2016, 2020 ఒలింపిక్స్‌లతో పోలిస్తే నాకు పారిస్‌లో పెద్ద సవాల్ ఎదురు కానుంది. అయితే నాకు అనుభవం కూడా పెరిగింది. మరింత జాగ్రత్తగా, తెలివిగా ఆడాల్సి ఉంటుంది. ♦ మహిళల సర్క్యూట్లో టాప్ 10–15 షట్లర్లు బాగా బలమైనవారు. వారిని ఎదుర్కొనేందుకు భిన్న వ్యూహాలు అనుసరించాలి. ప్లాన్ ‘ఎ’ పని చేయకపోతే ప్లాన్ ‘బి’ కోసం సిద్ధంగా ఉండాలి. ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండే మానసిక దృఢత్వం కూడా అవసరం. ♦ ప్రకాశ్ సర్ లాంటి గొప్ప ఆటగాడితో కలిసి పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన ఆలోచనలు, శిక్షణా పద్ధతులు నాకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. కొత్త ట్రెయినర్, ఫిజియో, న్యూట్రిషనిస్ట్, కోచ్, మెంటార్... ఇలా అందరూ మారారు. వీరంతా నాకు ఎంతో సహకరిస్తున్నారు. దీని వల్ల నా ఆటలో వచ్చిన మార్పులు మున్ముందు కనిపిస్తాయి. పూర్తి ఫిట్‌గా నేను ఆసియా టీమ్ చాంపియన్‌షిప్ కోసం సిద్ధమయ్యాను. ♦ గాయం నుంచి కోలుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఆటలో వేగం అందుకునేందుకు కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం నేను అదే స్థితిలో ఉన్నాను. గతంలో ఇలాంటి కఠిన పరిస్థితులను అధిగమించాను. 2015లో కూడా నేను గాయాలతో బాధపడుతూనే ఆరు నెలల పాటు ఆడాను. అయితే కోలుకొని రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించగలిగాను. నా మీద నాకున్న నమ్మకంతో పోరాడి రజతం గెలిచాను. నాలుగేళ్ల తర్వాత మరిన్ని అంచనాలతో టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగి సెమీస్‌లో ఓడటం చాలా బాధించింది. ఫైనల్ చేరకపోవడంతో ఏడ్చేశాను. కానీ నాలుగో స్థానానికి, కాంస్య పతకానికి తేడా చాలా ఉంటుందని నా కోచ్ ప్రోత్సహించడంతో మూడో స్థానం కోసం మ్యాచ్‌లో సత్తా చాటి గెలిచాను. ఈ కాంస్యం కోసం నేను ఎంతో కష్టపడ్డానని అనిపించింది. -
డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ ఇచ్చేందుకు ఇస్రో అనుబంధ ‘నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)’తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ (టీఎస్‌ఏఏ) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్‌ల సమక్షంలో టీఎస్‌ఏఏ సీఈవో ఎస్ఎన్ రెడ్డి, ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ ప్రకాశ్ చౌహాన్లు దీనిపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ఎన్ఆర్ఎస్సీ శాస్త్రవేత్తలు డ్రోన్ పైలటింగ్, డ్రోన్ డేటా మేనేజ్మెంట్, డేటా అనాలసిస్, ప్రాసెసింగ్, మ్యాపింగ్‌లపై ఏవియేషన్ అకాడమీలో శిక్షణ పొందుతున్న డ్రోన్ పైలట్లకు 15 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వ అధికారులకు కూడా శిక్షణ: సీఎం అన్ని రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగిందని, పొలాల్లో ఎరువులు, పురుగుమందులు చల్లేందుకు రైతులు డ్రోన్లను వినియోగిస్తున్నారని ఈ భేటీలో అధికారులు వివరించారు. కొన్నిచోట్ల స్వయం సహాయక సంఘాలు డ్రోన్లను ఉపాధి మార్గంగా ఎంచుకున్నాయని తెలిపారు. దీంతో ఉన్నతస్థాయి నుంచి తహసీల్దార్ల వరకు ప్రభుత్వ అధికారులకు కూడా డ్రోన్లపై అవగాహన కలిగేలా శిక్షణను ఇవ్వాలని రేవంత్ సూచించారు. ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ.. దేశంలోనే వినూత్నంగా తెలంగాణలో డ్రోన్లపై శిక్షణ కోర్సు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. శాటిలైట్, రిమోట్ సెన్సింగ్, అంతరిక్ష వ్యవహారాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఎన్ఆర్ఎస్సీ.. డ్రోన్ టెక్నాలజీని సాంకేతికపరంగా మరింత పకడ్బందీగా వినియోగించుకునేందుకు శిక్షణలో భాగస్వామ్యం అవుతోందని వివరించారు. దేశంలో 12సార్లు బెస్ట్ ఏవియేషన్ అవార్డు అందుకున్న తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సేవలను కొనియాడారు. శిక్షణకు స్థలం కేటాయించండి ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌లోనే డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇస్తున్నామని, అక్కడ నెలకొన్న రద్దీ దృష్ట్యా హైదరాబాద్ పరిసరాల్లో ప్రత్యేకంగా డ్రోన్ పైలట్ల శిక్షణ కోసం స్థలం కేటాయించాలని ఏవియేషన్ అకాడమీ అధికారులు సీఎం రేవంత్‌ను కోరారు. దీనిపై స్పందించిన సీఎం.. డ్రోన్ పోర్టు ఏర్పాటుకు ఎంత స్థలం అవసరం? ఏమేం నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందనే వివరాలు తెలుసుకున్నారు. పైలట్ల శిక్షణతోపాటు డ్రోన్ తయారీ కంపెనీలు ట్రయల్స్ నిర్వహించుకునేందుకు డ్రోన్ పోర్టు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. డ్రోన్ పోర్టుకు అవసరమైన 20 ఎకరాలను ఫార్మాసిటీ వైపు అన్వేíÙంచాలని అధికారులను ఆదేశించారు. ఏవియేషన్ నిబంధనల ప్రకారం అభ్యంతరం లేని ప్రాంతంలో ఈ స్థలం కేటాయించాలని సూచించారు. వరంగల్ ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ వరంగల్ ఎయిర్పోర్ట్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని.. పాడైన పాత రన్‌వేలను కొత్తగా నిర్మించాలని అధికారులను సీఎం ఆదేశించారు. వరంగల్ ఎయిర్‌పోర్టు నుంచి వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని.. ఏవైనా అడ్డంకులు ఉంటే పరిష్కరించాలని సూచించారు. కొత్తగూడెం, భద్రాచలం పరిసర ప్రాంతంలోనూ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు అనువుగా ఉంటుందని, అక్కడున్న అవకాశాలను పరిశీలించి ఎయిర్‌పోర్టు అథారిటీతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. సీఎంతో నెదర్లాండ్స్ రాయబారి భేటీ సాక్షి, హైదరాబాద్: భారత్‌లో నెదర్లాండ్స్ రాయబారి మెరిసా గెరార్డ్స్ బుధవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఇరుదేశాల సంబంధాలపై మాట్లాడుకున్న ఇద్దరూ తెలంగాణలో అభివృద్ధికి ఉన్న అవకాశాలపై చర్చించారని సీఎంవో వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో వ్యవసాయ రంగాభివృద్ధికి అపార అవకాశాలు, అగ్రికల్చర్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటు, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో నెదర్లాండ్స్ భాగస్వామ్యం తదితర అంశాలు వీరిద్దరి భేటీలో చర్చకు వచ్చాయి. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
AP: ESMSపై కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమం
సాక్షి, విజయవాడ: ఎన్నికల నిర్బంధ నిర్వహణ వ్యవస్థ వినియోగంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు ఇస్తున్న శిక్షణా కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రేరేపిత రహిత ఎన్నికల పర్యవేక్షణను పెంపొందించేందుకు భారత ఎన్నికల సంఘం ఈ ‘ఎన్నికల నిర్బంధ నిర్వహణ వ్యవస్థ’ను (Election Seizure Management System - ESMS) రూపొందించింది. దీని వినియోగంపై ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. 2023 డిసెంబర్లో చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్. తెలంగాణ రాష్ట్రాలకు జరిగిన సాధారణ ఎన్నికల్లో తొలిసారి ఈ వ్యవస్థను విజయవంతంగా వినియోగించారు. ఆ అనుభవంతో త్వరలో ఎన్నికలు జరుగునున్న రాష్ట్రాల్లో కూడా ఈ విధానాన్ని అమలుపరిచేందుకు భారతీయ ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది అనేక రకాల రాష్ట్ర, కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల ద్వారా ఫీల్డ్ నుంచి వచ్చే సీజర్లపై (నిర్బంధములపై ) నిజ-సమయ నవీకరణల కోసం ఉపయోగించే ఒక సాంకేతిక వేదిక. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల మధ్య అంతరాయం లేని సమన్వయం, గూఢచార భాగస్వామ్యాన్ని నిర్ధారించడం ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. భారతీయ ఎన్నికల సంఘం నుంచి వచ్చిన అధికారుల బృందం కర్ణాటక రాష్ట్రంలో ఇస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని వెబ్ లింకు ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల నోడల్ అధికారులు. పరిశీలిస్తున్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, అదనపు సీఈవో పి. కోటేశ్వరరావు తదితరులతో పాటు పోలీస్, ఎక్సైజ్, ఇన్కమ్ టాక్స్, వాణిజ్య, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తదితర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల అధికారులు పాల్గొన్నారు. -
ఏఐలో ఉచిత శిక్షణ కావాలా?...
చాట్ జీపీటీ, బింగ్, బార్డ్ వంటి స్మార్ట్ చాట్బాట్లకు మూలాధారమైన కృత్రిమ మేధ (ఏఐ)కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది. అందుకు అనువుగా ఎన్నో కార్పొరేట్ కంపెనీలు పరిశోధనలు సాగిస్తున్నాయి. ఏఐకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చే లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్(ఎల్ఎల్ఎం) నిపుణులకు గిరాకీ పెరుగుతోంది. ఆసక్తి ఉన్న టెకీల చదువు, పూర్వ పని అనుభవంతో సంబంధం లేకుండా కంపెనీలు అవకాశాలు ఇస్తున్నాయి. కొన్ని సంస్థలు ఏఐలో పని చేయాలనుకునే వారికి శిక్షణతోపాటు గుర్తింపు ఇస్తున్నాయి. దాంతో భవిష్యత్తులో వారు ఏదైనా ఇంటర్వ్యూకు హాజరైతే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఏఐ ఒడిస్సీ ప్రోగ్రామ్‌తో దేశవ్యాప్తంగా దాదాపు లక్ష మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ ప్రోగ్రామ్ నెల రోజుల పాటు జరుగుతుంది. ఇందులో భాగంగా మొదటిదశలో అజూర్ ఏఐ సర్వీస్‌లకు సంబంధించిన మెలకువలు నేర్పుతారు. కృత్రిమ మేధ ద్వారా పరిష్కారాలు ఎలా సాధించాలో, నేర్చుకున్న మెలకువలను ఎలా ఉపయోగించాలో చెబుతారు. రెండోదశలో నైపుణ్యాలను ప్రాక్టికల్‌గా అమలు చేయాల్సి ఉంటుంది. ఇంటరాక్టివ్ ల్యాబ్ టాస్క్‌లతో ఆన్లైన్ అసెస్మెంట్ను పూర్తి చేయాలి. విజయవంతంగా ప్రోగ్రామ్ పూర్తి చేసిన వారు మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలోని ఏఐ రియల్‌టైమ్ సమస్యలపై పనిచేసేందుకు వీలుంటుంది. దాంతోపాటు ఫిబ్రవరి 8న బెంగళూరులో జరగబోయే మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్‌కు వెళ్లే అవకాశం కల్పిస్తున్నారు. ఈ టూర్లో జనరేటివ్ ఏఐకు సంబంధించి అత్యాధునిక ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. ఏఐ ఒడిస్సీకు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.. aka.ms/AIOdyssey లింక్‌పై క్లిక్ చేయాలి. అవసరమైన వివరాలను అందులో నమోదు చేసి సబ్మిట్ చేయాలి. నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత లెర్నింగ్ మాడ్యూల్స్‌కు యాక్సెస్ పొందుతారు. అందులో లాగిన్ అవ్వాలి. ప్రోగ్రామ్ మొదటి దశలో అజూర్ ఏఐ సర్వీస్‌లను ఎలా ఉపయోగించాలో ఉంటుంది. రెండో దశలో ఆన్లైన్ అసెస్మెంట్ ద్వారా ఏఐ నైపుణ్యాలను పరీక్షించుకోవాలి. -
1.5 లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్న ప్రభుత్వం..
ముంబై: టెలికం రంగంలో మానవ వనరుల కొరత తగ్గించాలన్న లక్ష్యంతో టెలికం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ (టీఎస్ఎస్సీ) వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల మంది అభ్యర్థులకు టెలికం, సంబంధిత అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో శిక్షణ, ఉద్యోగావకాశాలను కల్పించాలని యోచిస్తోంది. సాంకేతిక రంగం ముఖ్యంగా 5జీ ప్రారంభంతో టెలికం పరిశ్రమలో నిపుణులు, నైపుణ్యం లేని, తిరిగి నైపుణ్యం కలిగిన వారికి అధిక డిమాండ్‌ని కలిగి ఉంది. టెలికంలో పెరుగుతున్న ఈ డిమాండ్‌ను మనం చూస్తున్నందున ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు డిజిటల్, కీలక టెలికం, సాంకేతిక నైపుణ్యాలతో సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు టీఎస్ఎస్సీ సీఈవో అరవింద్ బాలి తెలిపారు. భారత్‌లో మూడవ అతిపెద్ద పరిశ్రమ అయిన టెలికం రంగం మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రవాహంలో దాదాపు 6.5 శాతం వాటా కలిగి ఉంది. 2027 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం 5జీ చందాదార్లలో భారత్ 11 శాతం వాటా కైవసం చేసుకుంటుందని అంచనా వేస్తున్నట్లు బాలి చెప్పారు. టెలికం రంగంలో నియామకాలను సులభతరం చేయడానికి ఉద్ధేశించిన టెక్కోజాబ్స్ వేదికగా 2.5 లక్షల మంది అభ్యర్థులు, 2,300 కంపెనీలు నమోదు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. -
అమెజాన్‌తో వాణిజ్య శాఖ ఒప్పందం
న్యూఢిల్లీ: దేశీయంగా 20 జిల్లాల్లోని చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) శిక్షణ కలి్పంచే దిశగా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. దీని ప్రకారం ఈ–కామర్స్ మాధ్యమం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించే దిశగా ఇమేజింగ్, డిజిటల్ క్యాటలాగ్‌లను రూపొందించడం, పన్నుల సంబంధమైన అంశాలను తెలుసుకోవడం మొదలైన వాటికి ఈ శిక్షణ ఉపయోగపడగలదని పేర్కొంది. ఎగుమతుల హబ్‌లుగా గుర్తించిన జిల్లాల్లో అమెజాన్, డీజీఎఫ్టీ కలిసి శిక్షణ, వర్క్‌షాప్‌లను నిర్వహిస్తాయి. ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహా కార్యక్రమాల కోసం ఫ్లిప్‌కార్ట్, ఈబే, రివెక్సా, షిప్‌రాకెట్, షాప్‌క్లూస్ వంటి వివిధ ఈ–కామర్స్ సంస్థలతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) చర్చలు జరుపుతున్నట్లు వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో వివరించింది. ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా దేశీ సంస్థలు అంతర్జాతీయంగా మరిన్ని ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ ఒప్పందాలు ఉపయోగపడతాయి. 2030 నాటికి ఈ–కామర్స్ ద్వారా 350 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను ఎగుమతి చేయాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకోవాలని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీíÙయేటివ్ (జీటీఆర్ఐ) ఇటీవల ఒక నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఇవి 2 బిలియన్ డాలర్లుగా మాత్రమే ఉన్నాయి. ఎగుమతులను సరళతరం చేయడం, 2025 నాటికి ఈ–కామర్స్ ఎగుమతులను 20 బిలియన్ డాలర్లకు చేర్చడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు అమెజాన్ ఇండియా డైరెక్టర్ భూపేన్ వాకంకర్ తెలిపారు. -
అవును... ఆయన వద్దే శిక్షణ సాగుతోంది
హైదరాబాద్: ఈ సీజన్ ఆసాంతం నిరాశపరిచిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కొత్త సీజన్ కోసం కసరత్తు ప్రారంభించింది. భారత దిగ్గజం, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ మాజీ చాంపియన్ ప్రకాశ్ పడుకోన్ వద్ద గత ఆగస్టు నుంచి ఆమె శిక్షణ తీసుకుంటోంది. ఈ విషయాన్ని ఆమె నిర్ధారించింది. ‘ప్రకాశ్ సర్ మార్గదర్శనంలో నేను ట్రెయినింగ్ మొదలుపెట్టాను. ఆగస్టులోనే నా శిక్షణ ప్రారంభమైంది. నిజం చెప్పాలంటే ఆయన నాకు కోచింగ్ గురువు కంటే ఎక్కువ. మెంటార్‌గా, మంచి గైడ్‌గా... అంతకుమించి నా నిజమైన శ్రేయోభిలాషిగా ఆయన నా ఆటతీరుకు మెరుగులు దిద్దుతున్నారు. నాలోని పూర్తిస్థాయి నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఆయన ఎంతగానో శ్రమిస్తున్నారు. జపాన్‌లో ఉండగా కేవలం ఒక ఫోన్కాల్కే ఆయన స్పందించడం... ఇంతలా వ్యక్తిగత శ్రద్ధ కనబరచడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అందుకు ఆయనకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని సింధు వివరించింది. -
ఏరోస్పేస్ శిక్షణకు 25 మంది డిప్లొమా విద్యార్థుల ఎంపిక
మురళీనగర్ (విశాఖ ఉత్తర): పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు చేసిన ప్రతి విద్యార్థికి అత్యున్నత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) డాక్టర్ ఎంఏవీ రామకృష్ణ చెప్పారు. ఏరోస్పేస్ రంగంలో పారిశ్రామిక శిక్షణకు విద్యార్థుల ఎంపిక ప్రక్రియను ఆయన ఆధ్వర్యంలో విశాఖ కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో శుక్రవారం నిర్వహించారు. ఏరోస్పేస్ రంగంలో విశాఖ అభివృద్ధి చెందుతున్నందున ఇక్కడ నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఎంపిక చేశామన్నారు. గ్లోబల్ ఏరోస్పేస్ కంపెనీ బోయింగ్, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ సహకారంతో మెకానికల్ డిప్లొమా విద్యార్థులకు 6 నెలల పారిశ్రామిక శిక్షణకు గాను రెండో బ్యాచ్ ఎంపిక ప్రక్రియ నిర్వహించినట్లు చెప్పారు. ఈ ప్రక్రియలో 134 మంది పాల్గొనగా రాత, మౌఖిక పరీక్ష ద్వారా 25 మందిని ఏరోస్పేస్లో శిక్షణకు ఎంపిక చేసినట్లు చెప్పారు. వీరిలో 12 మంది బాలురు, 13 మంది బాలికలున్నట్లు చెప్పారు. వీరికి అచ్యుతాపురంలోని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కేంద్రంలో శిక్షణనిస్తారని, శిక్షణ కాలంలో బోయింగ్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్‌కు నిధులు అందిస్తుందని తెలిపారు. లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ సంస్థ ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్లో శిక్షణ తీసుకునే విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.35,000 కోర్సు ఫీజుతోపాటు నెలకు రూ.3,000 ఉపకార వేతనం చెల్లిస్తుందన్నారు. -
ప్రభుత్వాల చెలగాటం...‘న్యాక్’కు నిధుల సంకటం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక పరమైన అంశాల్లో నెలకొన్న వివాదాలు ఇప్పుడు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌కు అడ్డంకిగా మారాయి. ఈ వివాదం వల్ల న్యాక్‌కు నిధులు రావటం నిలిచిపోవటంతో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహణ ఇబ్బందిలో పడింది. ఏడాదిగా నిధుల కోసం నానాతిప్పలు పడుతున్న నాక్ యంత్రాంగం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద బడా సంస్థల వద్దకు వెళ్లి నిధులు సమీకరించుకుని కార్యక్రమాలు కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు కార్పొరేట్ సంస్థలతో పాటు, నాబార్డ్ చేసిన ఆర్థిక సాయంతో కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మరిన్ని సంస్థలు ముందుకొచ్చి సాయం చేస్తే, కొత్త బ్యాచ్‌లను ఏర్పాటు చేసి మరిన్ని బ్యాచ్‌లకు శిక్షణ ఇవ్వాలని యత్నిస్తున్నారు. గతంలో విదేశీ యువతకు కూడా శిక్షణ ఇచ్చి అంతర్జాతీయంగానూ ఖ్యాతి పొందిన న్యాక్‌కు.. ప్రభుత్వ విభాగాలు ఆర్థిక క్రమశిక్షణ తప్పటంతో నిధుల కోసం రోడ్డున పడాల్సిన దుస్థితి దాపురించింది. నిధుల వ్యయంపై అభిప్రాయభేదాలు.. న్యాక్ కోర్సులకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తోంది. ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు ఇస్తోంది. ఇది 70:30 దామాషాగా విడుదలవుతున్నాయి. తాను ఇస్తున్న నిధులకు సంబంధించి యుటిలైజేషన్ సరి్టఫికెట్లు సరిగా దాఖలు కావటం లేదని, కొన్ని నిధులు ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారని కేంద్రం సందేహాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ విషయంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ విభాగాల మధ్య అభిప్రాయభేదాలు నెలకొన్నాయి. అవి రానురాను పెద్దవి కావటంతో ఏడాది క్రితం కేంద్రం నిధుల విడుదలను ఆపేసినట్టు తెలిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా నిలిచిపోయి, న్యాక్‌కు నిధుల సమస్య ఉత్పన్నమైంది. మూడు నెలల కోర్సులను బ్యాచ్‌ల వారీగా నిర్వహిస్తున్న న్యాక్ వద్ద పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పోగయ్యాయి. ఈ తరుణంలో చేతిలో నిధులు లేకుండా పోయాయి. దీంతో న్యాక్ ఉన్నతాధికారులు కార్పొరేట్ కంపెనీలను సంప్రదించటం ప్రారంభించారు. అలా తొలుత తాన్లా ప్లాట్‌ఫామ్స్, జీఐపీఎల్ సంస్థలు 350 మంది శిక్షణకు కావాల్సిన నిధులు అందించాయి. ఒక్కో అభ్యర్థికి రూ. లక్ష వరకు ఫీజు ఉండే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్సు, క్వాంటిటీ సర్వే కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లాంటి పీజీ కోర్సులు కూడా వాటితో నిర్వహిస్తుండటం విశేషం. ఇక మరో 200 మంది అభ్యర్థులతో కూడిన బ్యాచ్‌ల శిక్షణకు కావాల్సిన నిధులను నాబార్డు సమకూర్చింది. వీటితో ఇప్పటి వరకు శిక్షణ నిర్వహిస్తున్నారు. మరిన్ని సంస్థలు ముందుకొస్తే విస్తరిస్తాం... ‘‘సీఎస్ఆర్ నిధులతో శిక్షణ కార్యక్రమాలు విస్తరించాలని నిర్ణయించాం. ఇప్పటికి తాన్లా ప్లాట్‌ఫామ్స్, జీఐపీఎల్, నాబార్డు నిధులు అందించాయి. ఈ డిసెంబరులో కేంద్ర ప్రభుత్వ నిధులు కొన్ని రాబోతున్నాయి. వాటికి అదనంగా సీఎస్ఆర్ కింద కార్పొరేట్ కంపెనీలు సాయం అందిస్తే న్యాక్ మరింత ఉన్నతంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుంది’అని న్యాక్ డీజీ బిక్షపతి పేర్కొన్నారు. పెద్దపెద్ద నిర్మాణ సంస్థలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి న్యాక్ శిక్షణార్థులను ఎంపిక చేసుకుంటున్నందున కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ నిధులతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని న్యాక్ ప్లేస్మెంట్ డైరక్టర్ శాంతిశ్రీ కోరారు. ఇదీ పరిస్థితి.. ఉన్నత విద్య చదువుకోలేని పరిస్థితిలో చదువు మానేసిన ఎంతోమంది యువతీయువకులకు భవన నిర్మాణ రంగానికి సంబంధించిన వివిధ విభాగాల్లో న్యాక్ శిక్షణ ఇస్తోంది. ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, ఫాల్స్ సీలింగ్, భవన నిర్మాణ సూపర్వైజింగ్, వెల్డింగ్, కన్స్ట్రక్షన్ సర్వే అంశాల్లో తర్పి దు పొందుతున్న అభ్యర్థులకు దేశవిదేశాల్లోని నిర్మాణ సంస్థల్లో ఉపాధి దొరుకుతోంది. గతంలో కేవలం భవన నిర్మాణంలోని వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చిన న్యాక్.. ఆ తర్వాత పీజీ కోర్సులను కూడా ప్రారంభించింది. బీటెక్ సివిల్ అభ్యర్థులు, ఇంజినీర్లకు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్సు, క్వాంటిటీ సర్వే కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లాంటి కోర్సులు నిర్వహిస్తోంది. ఇలాంటి తరుణంలో నిధుల సమస్య ఉత్పన్నమై న్యాక్‌ను గందరగోళంలో పడేసింది. -
సాఫ్ట్వేర్ నిపుణులకు ‘పార్ట్‌టైమ్’ ఆఫర్!
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ కొలువులిస్తామంటూ ఇంజినీరింగ్ కాలేజీల వెంటపడే ఐటీ కంపెనీలు కామన్! కట్ చేస్తే... పాఠాలు చెప్పాలంటూ సాఫ్ట్ వేర్ నిపుణుల కోసం వేట మొదలెట్టాయి కాలేజీలు. ఫ్యాకల్టీగా చేరాలని.. కనీసం పార్ట్‌టైమ్‌గా అయినా విద్యార్థులకు బోధించాలంటూ ఇంజనీరింగ్ కాలేజీలు వారిని ఆహ్వానిస్తున్నాయి. ఆన్లైన్లోనైనా శిక్షణ ఇవ్వాలని కోరుతున్నాయి. మంచి వేతనాలివ్వడానికీ సిద్ధపడుతున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది కంప్యూటర్ కోర్సుల్లో 14 వేల సీట్లు పెరిగాయి. మరోపక్క సివిల్, మెకానికల్ బ్రాంచీల్లో సీట్లు తగ్గాయి. విద్యార్థుల నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులను డిమాండ్ పెరగడమే దీనికి కారణం. అయితే, వీటిని బోధించే ఫ్యాకల్టీకి మాత్రం తీవ్రంగా కొరత నెలకొంది. ఈ విభాగాల్లో ఎంఎస్ చేసిన వాళ్లు కూడా బోధన వైపు ఆసక్తి చూ పడం లేదు. దీంతో ఇప్పటివరకూ సీఎస్సీ బోధించే వారితోనే పాఠాలు చెప్పిస్తున్నారు. దీనివల్ల నాణ్య త పెరగడం లేదని అఖిల భారత సాంకేతిక విద్య మండలి (ఏఐసీటీఈ) గుర్తించింది. సాఫ్ట్వేర్ రంగం లో నిపుణులతో బోధించే ఏర్పాటు చేయాలని సూ చించింది. ఈ తరహా బోధన ఉంటే తప్ప వచ్చే ఏ డాది నుంచి కంప్యూటర్ కోర్సులకు అనుమతించవ ద్దని రాష్ట్రాల కౌన్సిళ్లకు తెలిపింది. దీంతో సాఫ్ట్వేర్ నిపుణులకు గాలంవేసే పనిలోపడ్డాయి కాలేజీలు. వాళ్లెవరో చెప్పాల్సిందే... రాష్ట్రంలోని 174 కాలేజీల్లో కంప్యూటర్ కొత్త కోర్సులను బోధించే వారి జాబితాను గుర్తింపు ఇచ్చే యూనివర్శిటీకి విధిగా సమర్పించాల్సి ఉంటుంది. ఆయా ఫ్యాకల్టీ అర్హతలను యూనివర్సిటీ కమిటీలు పరిశీలిస్తాయి. ఏఐ, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీకి ఆయా రంగాల్లో నిష్ణాతులను నియమించాలని ఏఐసీటీఈ సూచించింది. అయితే, వాళ్ల అర్హతలేంటనేది స్పష్టం చేయలేదు. దీని స్థానంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రొఫెషనల్స్‌తో బోధన చేయించాలని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 58 శాతం కంప్యూటర్ కోర్సులున్నాయి. ప్రతీ కాలేజీలోనూ ఒక ఏఐ బ్రాంచీ ఉంటోంది. ఈ లెక్కన ఈ ఏడాది ప్రతీ కాలేజీ ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ ఇతర కోర్సుల కోసం కనీసం ఐదుగురి చొప్పున ప్రొఫెషనల్స్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీన్నిబట్టి రాష్ట్రంలో దాదాపు 250 మంది సాఫ్ట్వేర్ నిపుణులకు అవకాశాలు దక్కే వీలుంది. ఆన్లైన్ క్లాసులు... ఫుల్‌టైమ్ ఫ్యాకల్టీ కొరత నేపథ్యంలో... ఆన్లైన్ ద్వారా కొత్త కోర్సులను బోధించేందుకు యూనివర్సిటీలు, ఏఐసీటీఈ, రాష్ట్ర ఉన్నత విద్యా మండళ్లు అనుమతిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు వివిధ దేశాల్లో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న వారిని బోధనకు ఒప్పించేందుకు కాలేజీలు కృషి చేస్తున్నాయి. వారానికి కనీసం 10 క్లాసులు చెప్పించే ఏర్పాటు చేస్తున్నామని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ప్రైవేటు కాలేజీలు కూడా ఇదే బాట పడుతున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వారికి శని, ఆదివారాల్లో సెలవులుంటాయి. అయితే, కోవిడ్ తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగులను కంపెనీలు తిరిగి ఆఫీసులకు రప్పిస్తున్నాయి. ఈ కారణంగా వారాంతపు సెలవుల్లో బోధనకు నిపుణులు సిద్ధపడటం లేదని ఓ ప్రైవేటు కాలేజీ నిర్వాహకుడు తెలిపాడు. దీంతో అమెరికాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ నిపుణుడిని ఏఐ కోసం నియమించినట్టు తెలిపారు. సాధారణ ఫ్యాకల్టీకి ఇచ్చే వేతనం కన్నా పార్ట్‌టైమ్ పనిచేసే నిపుణులు రెండింతలు డిమాండ్ చేస్తున్నారని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. -
యద్ధానికి ముందే హమాస్‌కు ఇరాన్ శిక్షణ: ఇజ్రాయెల్ ఆరోపణ
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం జరుగున్న తరుణంలో ఇరాన్‌పై ఇజ్రాయెల్ సంచలన ఆరోపణలు చేసింది. ఈ యుద్ధానికి ముందుగానే హమాస్ మిలటెంట్లకు ఇరాన్ శిక్షణ ఇచ్చిందంటూ ఇజ్రాయెల్ పేర్కొంది. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి జరగక ముందే ఇరాన్.. హమాస్ మిలటెంట్లకు శిక్షణ అందించడంతోపాటు డబ్బు, ఆయుధాలను కూడా ఇచ్చిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఆరోపించింది. పాలస్తీనా మిటటెంట్లు జరిపిన దాడిలో ఇరాన్ హస్తం కూడా ఉందని ఇజ్రాయెల్ పేర్కొంది. ఐడీఎఫ్ ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి మాట్లాడుతూ ‘ఈ యుద్ధానికి ముందుగానే ఇరాన్.. హమాస్ మిలటెంట్లకు శిక్షణ, ఆయుధాలు, నిధులు, సాంకేతికత సహాయాన్ని అందించిందని అన్నారు. హమాస్‌కు ఆర్థికసాయం, శిక్షణ, ఆయుధాలు అందిస్తున్నట్లు ఇరాన్ అంగీకరించినప్పటికీ, ఇజ్రాయెల్ దాడిలో తమ పాత్ర లేదని పేర్కొంది. ది జెరూసలేం పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం గాజాపై దండెత్తడానికి దక్షిణ సరిహద్దులో తమ గ్రౌండ్ ట్రూప్‌లు సిద్ధంగా ఉన్నాయని ఐడీఎఫ్ పేర్కొంది. ఐడిఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి మాట్లాడుతూ ‘హమాస్‌పై దాడి చేయడానికి మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని’ పేర్కొన్నారు. గాజాలో భూ ఉపరితంపై దాడి చేయడానికి కచ్చితమైన సమయం నిర్ణయించే ప్రక్రియలో దేశ రాజకీయ నాయకత్వంతో ఐడీఎఫ్ కలసి పని చేస్తుందని ఆయన అన్నారు. కాగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యహూ మాట్లాడుతూ ‘ఇప్పుడు ఇజ్రాయెల్ ముందున్న ఏకైక లక్ష్యం హమాస్‌ను పూర్తిగా అణిచివేయడమేనని, ఈ లక్ష్యం సాధించే వరకు వెనక్కి తగ్గేది లేదని ఆయన అన్నారు. ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్‌పై గాజా ఉద్రిక్తతల ప్రభావం? ఉన్నతాధికారుల అత్యవసర సమావేశం 🚨BREAKING: HAMAS TRAINED IN IRAN BEFORE OCTOBER 7 ATTACK 500 Hamas fighters got 'specialized combat' training in Iran prior to Oct 7 The exercises were led by officers of the Quds Force, arm of Iran's IRGC. Israeli Military Chief Spokesman: “Before the war, Iran directly… pic.twitter.com/sPl7m1Wrfe — Mario Nawfal (@MarioNawfal) October 25, 2023 -
గ్రామీణ పేదలకు ‘ఉన్నతి’
సాక్షి, అమరావతి:గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం పనులపై ఎక్కువగా ఆధారపడే పేద కుటుంబాల్లో యువతకు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ‘ఉన్నతి’ పేరుతో వివిధ రకాల ఉపాధి, వృత్తి కోర్సుల్లో శిక్షణ ఇచ్చి శాశ్వత జీవనోపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ద్విచక్ర వాహనాలు, ఏసీ మెషిన్లు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రిపేర్ అండ్ సర్వీసింగ్, ఇంటర్నెట్ సేవలకు సంబంధించి టెక్నికల్ సర్వీస్ తదితర 192 రకాల ఉపాధి, వృత్తి విద్య కోర్సుల్లో పేద కుటుంబాల్లోని దాదాపు 25 వేల మంది యువతకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యంగా నిర్ధేశించుకుంది. నిబంధనల ప్రకారం.. ఉపాధి హామీ పథకం కింద ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి గరిష్టంగా వంద రోజులపాటు పనులు కల్పిస్తున్నారు. ఉదాహరణకు ఒక కుటుంబంలో ముగ్గురు పనిచేసే వ్యక్తులు ఉండి.. ఆ ముగ్గురు ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకోవాలనుకుంటే.. ఒక్కొక్కరికి గరిష్టంగా 33 పని దినాల చొప్పున కేటాయిస్తున్నారు. ఉపాధి కూలీల కుటుంబాలు గరిష్ట వంద రోజుల పరిమితి వినియోగించుకున్న అనంతరం కూడా ఆ కుటుంబం ఏ పనిలేక ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా.. ఉన్నతి పథకం కింద శిక్షణ ఇస్తారు. ఏడాదిలో వంద రోజుల పనులు పూర్తి చేసుకున్న కుటుంబాలను గుర్తించి ఆయా కుటుంబాల్లో యువతకు శిక్షణ కార్యక్రమాలు అందజేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో గరిష్టంగా 18–45 ఏళ్ల మధ్య, ఇతర సామాజిక వర్గాల్లో 18–35 ఏళ్ల మధ్య వయసు గలవారు ఈ శిక్షణ కార్యక్రమాలకు అర్హులుగా నిర్థారించారు. ఉచిత శిక్షణతోపాటు రోజూ కూలి జమ శిక్షణ కార్యక్రమాలను పూర్తి ఉచితంగా అందజేయడంతో పాటు శిక్షణకు హాజరయ్యే యువతకు రోజు వారీ కూలి డబ్బులను స్టైఫండ్ రూపంలో ప్రభుత్వం అందజేస్తుంది. గరిష్టంగా వంద రోజులు పాటు స్టైఫండ్ అందజేస్తారు. సంబంధిత యువత శిక్షణ కాలంలో కనీసం 75 శాతం హాజరు ఉండాలనే నిబంధన కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. గరిష్టంగా వంద రోజుల పాటు ఉపాధి హామీ పనులకు వెళ్లిన కుటుంబాల్లో యువత ఉన్న కుటుంబాలు 4,75,327 ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఎస్ఈఈడీఏపీ (సీడాప్), ఆర్ఎస్ఈటీఐ, కేవీకే సంస్థల ద్వారా ప్రభుత్వం శిక్షణ ఇప్పించేందుకు నిర్ణయించారు. ఆయా సంస్థలు క్షేత్రస్థాయిలో పనిచేసే ఉపాధి హామీ పథకం సిబ్బంది సాయంతో సంబంధిత కుటుంబాలను ప్రత్యక్షంగా సందర్శించి శిక్షణ పొందేందుకు ఆసక్తి గల యువత పేర్లను నమోదు చేసుకుంటారు. ఆ తర్వాత అర్హులైన వారికి శిక్షణ అందజేస్తారు. -
‘గ్రాంట్’ ముసుగు..‘కైండ్’ మిస్టరీ!
సాక్షి, అమరావతి: యువత శిక్షణ కోసం భారీగా ఆర్థిక సహాయం అందిస్తామని అప్పటిదాకా నమ్మబలికిన ప్రైవేట్ కంపెనీ ప్లేటు ఫిరాయించింది! భారీ లాభాన్ని వేసుకుని మరీ ప్రాజెక్టును దక్కించుకుని ప్రజాదనాన్ని కాజేసింది. రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో తవ్వేకొద్దీ కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత జీవోలు, ఒప్పందాల్లో ఉన్న ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్ (ఆర్థిక సహకారం) అనే పదం స్థానంలో తరువాత ‘గ్రాంట్ ఇన్ కైండ్ (వస్తు సహకారం) చేరింది. చివరకు ‘గ్రాంట్ ఇన్ కైండ్’ సైతం అదృశ్యమైంది. ఈ మాయాజాలంతో చివరకు టెండర్ల ప్రక్రియ అనేదే లేకుండా పోయింది. తద్వారా డిజైన్‌టెక్‌కు ఏకపక్షంగా కట్టబెట్టేసి రూ.371 కోట్లు చెల్లించేశారు. అందులో రూ.241 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బాబు గూటికి చేరవేశారు. 34.88 శాతం లాభంతో.. ఏపీ ఎస్ఎస్డీసీ ప్రాజెక్టు ముసుగులో నిధులను కొల్లగొట్టాలని ముందుగానే నిర్ణయించుకున్న మాజీ సీఎం చంద్రబాబు ఆరు క్లస్టర్లుగా అంచనా వ్యయం నివేదికను రూపొందించాలని ఆదేశించారు. వివిధ అంశాలను ప్రాతిపదికగా చేసుకుని అధికారులు ఏడు నివేదికలు రూపొందించారు. వాటిల్లో ప్రాజెక్టు కనిష్ట వ్యయం రూ.214 కోట్లు కాగా గరిష్ట వ్యయం రూ.282 కోట్లుగా మాత్రమే ఉంది. బినామీ సంస్థ డిజైన్ టెక్ లాభం 34.88 శాతాన్ని కూడా కలిపి ఒక్కో క్లస్టర్‌కు రూ.55 కోట్లు చొప్పున మొత్తం ఆరు క్లస్టర్లకు రూ.330 కోట్లు అవుతుందని నివేదిక రూపొందించారు. అందులో 90 శాతం సీమెన్స్–డిజైన్ టెక్ భరిస్తాయని, మిగతా 10 శాతం నిధులను ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అసలు ఈ ప్రాజెక్టు గురించే సీమెన్స్ కంపెనీకి తెలియదు. ఆ కంపెనీ 90 శాతం నిధులను సమకూర్చదని చంద్రబాబుకు స్పష్టంగా తెలుసు. 34.88 శాతం అంటే భారీ లాభమే. మరి లాభం ప్రస్తావన ఉన్న ప్రాజెక్టుకు ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ ఎలా వస్తుందనే ప్రాథమిక అంశాన్ని కూడా చంద్రబాబు పరిగణలోకి తీసుకోలేదు. ప్రజల్ని మభ్యపెట్టేందుకే ఆ కంపెనీ పేరును వాడుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం రూ.330 కోట్లు వ్యయం అవుతుంది అని రూపొందించిన నివేదిక.. కానీ ప్రాజెక్ట్ వ్యయాన్ని ఏకంగా రూ.3,300 కోట్లకు పెంచేసి ప్రజాధనం కొల్లగొట్టారు అంచనాలు పెంచి వాటా నిధులు స్వాహా ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా పెంచేస్తే అందులో ప్రభుత్వం వాటా 10 శాతం కింద వెచ్చించాల్సిన నిధులు కూడా ఆ మేరకు పెరుగుతాయి. తద్వారా ఆ నిధులను షెల్ కంపెనీల ద్వారా అక్రమంగా మళ్లించేలా చంద్రబాబు పథకం వేశారు. అందుకే ఆరు క్లస్టర్లకు కలిపి రూ.330 కోట్లుగా ఉన్న ప్రాజెక్ట్‌ను ఏకంగా రూ.3,300 కోట్లకు అమాంతం అంచనాలు పెంచేసి ఖరారు చేశారు. సిమెన్స్ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే ప్రభుత్వ వాటా 10 శాతం కింద జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా చెల్లించేశారు. చంద్రబాబు ఆదేశాలతోనే నిధులు చెల్లించినట్లు ఆర్థిక శాఖ అధికారులు వాంగ్మూలం కూడా ఇచ్చారు. అందులో షెల్ కంపెనీల ద్వారా రూ.241 కోట్లు చంద్రబాబు గూటికి చేరాయి. అదే విషయం సీఐడీ దర్యాప్తులో ఆధారాలతో సహా వెల్లడైంది. ఎయిడ్ లేదు.. కైండ్ అంత కంటే లేదు ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టు వ్యయంలో 90 శాతం నిధులను సీమెన్స్ కంపెనీ ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’గా సమకూరుస్తుందని టీడీపీ సర్కారు జీవోలో పేర్కొంది. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ గురించి సీమెన్స్ కంపెనీకి ఏమాత్రం తెలియదు. ఢిల్లీలో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్ ద్వారా చంద్రబాబు ముఠా గూడుపుఠాణి నడిపించింది. జీవో జారీ చేసిన తరువాత డిజైన్ టెక్ కంపెనీని రంగంలోకి తెచ్చారు. సీమెన్స్–డిజైన్ టెక్ కంపెనీలు ప్రాజెక్ట్ వ్యయంలో 90 శాతాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా సమకూరుస్తాయంటూ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారు. అసలు కథ ఇక్కడే మొదలైంది.సీమెన్స్ కంపెనీకి తెలియకుండా సుమన్ బోస్ నడిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో (నేరుగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు లేఖలు రాశారు) గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే పదం ఎక్కడా లేదు. ఆ స్థానంలో ‘గ్రాంట్ ఇన్ కైండ్’ అని పేర్కొన్నారు. పోనీ ఆ విధంగానైనా సాఫ్ట్వేర్, ఇతర మౌలిక సదుపాయాలు ఉచితంగా అందించారా? అంటే అదీ లేదు. ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90 శాతం కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆర్థిక సహకారంగానీ వస్తు సహాయాన్ని గానీ అందించ లేదు. చంద్రబాబు వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ వాటా 10 శాతం కింద జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను డిజైన్‌టెక్‌కు చేరవేశారు. అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ లేదు! గ్రాంట్ ఇన్ కైండ్ అంత కంటే లేదు! చివరికి చంద్రబాబు దోపిడీ మాత్రమే మిగిలిందని స్పష్టమైంది. టెండర్లు లేకుండా కట్టబెట్టడానికే... సుమన్ బోస్ నాటి సీఎం చంద్రబాబుతో సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ అనే పదాన్ని ఎక్కడా వాడలేదు. చంద్రబాబు మాత్రం సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలు 90 శాతం నిధులను ఆర్థిక సహాయంగా సమకూరుస్తాయని ఎందుకు చెబుతూ వచ్చారన్నది కీలకంగా మారింది. ఎందుకంటే...? గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని ఉంటే టెండర్లు పిలవాల్సిన అవసరం లేదు. ఓ ప్రాజెక్టులో ప్రైవేటు కంపెనీలు లాభం తీసుకుంటే నిబంధనల ప్రకారం టెండర్లు పిలవాలి. టెండర్లు పిలిస్తే అర్హత ఉన్న ఎన్నో కంపెనీలు పోటీ పడతాయి. ప్రాజెక్ట్‌ను యధాతథంగా అమలు చేయాల్సి ఉంటుంది. అందుకే టెండర్ల ప్రక్రియ లేకుండా ఏకపక్షంగా నామినేషన్ విధానంలో డిజైన్‌టెక్‌కు ఈ ప్రాజెక్టు కట్టబెట్టడానికే చంద్రబాబు ఈ పథకం వేశారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే ముసుగులో డిజైన్ టెక్కు కట్టబెట్టేశారు. తరువాత నిబంధనలకు విరుద్ధంగా ఆ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేశారు. కమీషన్లు పోనూ అందులో రూ.241 కోట్లను హైదరాబాద్‌లోని తన బంగ్లాకు తరలించారు. -
ఏఐ టెక్నాలజీపై 50వేల మందికి శిక్షణ.. ఎక్కడంటే?
న్యూఢిల్లీ: ఎన్విడియా ఏఐ టెక్నాలజీలో తమ కంపెనీకి చెందిన 50,000 మంది ఉద్యోగులకు శిక్షణ, సర్టిఫికేషన్ ఇవ్వాలని ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ యోచిస్తోంది. ఇందుకోసం ఎన్విడియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత సర్వీసులను కస్టమర్లకు అందించే దిశగా ఇన్ఫీ, చిప్సెట్ కంపెనీ ఎన్విడియా చేతులు కలిపిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఒప్పందం ప్రకారం తమ వ్యాపార కార్యకలాపాలకు అవసరమయ్యే ఏఐ అప్లికేషన్స్‌ను తయారు చేసుకోవడంలో కస్టమర్లకు సహాయపడే దిశగా హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ సహా ఎన్విడియా జనరేటివ్ ఏఐ ప్లాట్‌ఫామ్‌ను ఇన్ఫోసిస్ వినియోగించుకుంటుంది. వ్యాపార సంస్థలు ఏఐ వైపు మళ్లడంలో తమ ఏఐ సొల్యూషన్స్ ఉపయోగపడగలవని ఇన్ఫీ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ నందన్ నీలేకని తెలిపారు. -
‘స్కిల్’ కాదు డొల్లే
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముసుగులో మాజీ సీఎం చంద్రబాబు చేసిన మోసాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2.50 లక్షల మందికి నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడం ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించినట్లు ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారంలో డొల్లతనం బయటపడింది. ఎనిమిదో తరగతి చదివే పిల్లలకు సైతం నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చినట్లు కాగితాలపై చూపారు. పాఠశాల విద్యార్థులను విజ్ఞాన యాత్రల పేరిట సీమెన్స్‌కు తెలియకుండా ఆ కంపెనీ పేరిట ఏర్పాటు చేసిన సెంటర్లకు తరలించారు. బీసీ వెల్ఫేర్ పాఠశాలలకు చెందిన తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు కంప్యూటర్–ఐటీ ఫండమెంటల్స్, ఎల్రక్టానిక్స్ ఆఫీస్, ఎలక్ట్రికల్ హోమ్ లాంటి కోర్సుల్లో వొకేషనల్ ట్రైనింగ్ ఇచ్చినట్లు రికార్డుల్లో చూపించారు. చంద్రబాబు ప్రభుత్వం వైదొలగేలోపు మొత్తం 1,21,654 మంది నైపుణ్య శిక్షణ తీసుకున్నట్లు పేర్కొన్నారు. వీరిలో 70,000 మంది బీసీ వెల్ఫేర్ పాఠశాలలకు చెందిన విద్యార్థులే కావడం గమనార్హం. విహారయాత్రకు వచ్చిన ఒక్కో విద్యార్థికి రూ.200 ఇచ్చినట్లు సంతకాలు పెట్టించారు. వాటిని చూపిస్తూ వారందరికి అత్యున్నత నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లు రికార్డులు తయారు చేశారు. ఇలా శిక్షణ పొందిన విద్యార్థులకు అధిక జీతాలు చెల్లించి తీసుకున్న కంపెనీలు ఏమిటో చంద్రబాబుకు బాకా ఊదుతున్న ఎల్లో మీడియానే చెప్పాలి!! ల్యాబ్‌లూ లేవు.. సీమెన్స్ పేరును తెరపైకి తీసుకొచ్చి రూ.3,300 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు ఘనంగా చెప్పుకున్నా వాస్తవంగా రూ.70 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్న విషయం ఫోరెన్సిక్ ఆడిట్లో బహిర్గతమయ్యింది. ఆరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు, వాటికి అనుబంధంగా 34 టీఎస్‌డీఐలు (టెక్నికల్ స్కిల్స్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్స్) ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు కాగితాల్లో చూపించారు. పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్లు చూపించే ఫోటోలన్నీ ఉత్తిత్తి ల్యాబుల్లో తీసినవే. సీఎన్సీ మెకానిక్, టూ వీలర్, ఫోర్ వీలర్ ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, మెకానికల్ సర్వీస్ సెక్టార్, క్యాడ్ రామ్, ఐసీటీ, అగ్రి ఫార్మ్ మెకనైజేషన్ లాంటి కోర్సుల గురించి విద్యార్థులకు కంప్యూటర్ స్క్రీన్‌పై చూపించి శిక్షణ ముగించారు. ఒక్కో సీవోఈలో 15 ల్యాబ్‌లు, టీఎస్‌డీఐలో 10 ల్యాబ్‌లు ఏర్పాటు చేసినట్లు రికార్డులో చూపించారు. రాష్ట్రం వాటాగా తరలించిన రూ.371 కోట్లను కాజేసిన కేటుగాళ్లు ఒప్పందం ప్రకారం ల్యాబ్‌లను ఏర్పాటు చేయలేదు. ఈ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం 2021లో ఫోరెన్సిక్ ఆడిటింగ్‌కు ఆదేశించిన వెంటనే ఆగమేఘాలపై కొన్ని ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం గమనార్హం. -
'ప్రతిభ ప్రతిబింబించేలా'.. సైన్స్ ప్రయోగాలకు బీజం!
జగిత్యాల: విద్యార్థి దశ నుంచి సైన్స్‌పై ఆసక్తి కలిగించడం, శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో భారతీయుల కృషి తెలియజేసే ఉద్దేశమే విద్యార్థి విజ్ఞాన్ మంథన్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ), విజ్ఞాన భారతి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం సంయుక్తంగా విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పేరుతో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి ఏటా ఆన్లైన్ వేదికగా ప్రతిభ పరీక్ష నిర్వహిస్తోంది. పరిశోధన సంస్థల సందర్శన.. ► పలు జాతీయ ప్రయోగశాలల సందర్శనతో పాటు నగదు ప్రోత్సాహకాలు అందుకునే అరుదైన అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తోంది. ► ఇందులో డీఆర్డీవో, బార్క్, సీఎస్ఐఆర్ వంటి ప్రఖ్యాత పరిశోధన సంస్థలున్నాయి. వాటిని సందర్శించే అవకాశంతో పాటు మూడు వారాలు ఇంటర్న్‌షిప్ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పరీక్ష నిర్వహిస్తోంది. ► ఇందులో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆ ప్రయోగశాలల సందర్శనతో కొత్త స్ఫూర్తి పొందే అవకాశముంది. 2024 సంవత్సరానికి సంబంధించి జాతీయస్థాయి పరీక్ష మే 18, 19న నిర్వహించనున్నారు. ► నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ), విజ్ఞాన భారతి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 6 నుంచి 11వ తరగతి (ఇంటర్ ప్రథమ సంవత్సరం) విద్యార్థులకు ఆన్లైన్ వేదికగా ఈ పరీక్ష నిర్వహిస్తారు. ► 6 నుంచి 8వ తరగతి వరకు జూనియర్లుగా, 9 నుంచి 11 వరకు సీనియర్లుగా పరిగణిస్తారు. ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, రాష్ట్ర బోర్డు విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులు. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష.. అక్టోబరు 1న నమూనా పరీక్ష ఉంటుంది. అదే నెల 29 లేదా 30న జిల్లాస్థాయిలో పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. సీనియర్, జూనియర్ విభాగంలో 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. గణితం, సామాన్య శాస్త్ర పాఠ్య పుస్తకాల నుంచి 50 శాతం, విజ్ఞానశాస్త్రం రంగంలో దేశ కృషిపై 20 శాతం, లాజిక్ రీజనింగ్‌కు 10 శాతం, శాస్త్రవేత్త బీర్బల్ సహానీ జీవిత చరిత్రకు 20 శాతం బహుళైచ్చిక ప్రశ్నలు ఉంటాయి. జిల్లాస్థాయిలో ఇలా.. జిల్లాలో ఆరో తరగతి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం వరకు ప్రతి తరగతిలో ప్రతిభచూపిన మొ దటి ముగ్గురు చొప్పున మొత్తం 18 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలను ఆన్లైన్లో అందిస్తారు. రాష్ట్రస్థాయిలో.. పాఠశాల స్థాయి ప్రాథమిక పరీక్ష రాసిన విద్యార్థుల్లో తరగతుల వారీగా ప్రతిభచూపిన మొదటి 20 మంది విద్యార్థులను ఎంపిక చేసి మొత్తం 120 మందిని రాష్ట్రస్థాయికి పంపుతారు. అత్యంత ప్రతిభకనభర్చిన 18 మందిని రాష్ట్రస్థాయి విజేతగా ప్రకటిస్తారు. వారిలో మొదటి ముగ్గురికి రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేల చొప్పున నగదు ప్రోత్సహకాలిస్తారు. జాతీయ స్థాయిలో.. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనభర్చినవారి నుంచి 18 మందిని జాతీయ స్థాయి ప్రతిభావంతులుగా గుర్తిస్తారు. వీరిని హిమాలయన్స్ అంటారు. వారికి రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు నగదు ప్రోత్సాహకాలు ఇస్తారు. వీటితో పాటు నెలకు రూ.2 వేల చొప్పున ఏడాది పాటు ఉపకారవేతనం అందిస్తారు. దరఖాస్తు ఇలా.. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్ ద్వారా విద్యార్ధి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పరీక్ష నిర్వహించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోటీలు పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో నిర్వహిస్తారు. www. vvm. org. in వెబ్సైట్లో రూ.200 ఫీజు ఆన్లైన్లో చెల్లించి ఈనెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబరు 1న నమూనా పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు, హిందీ, ఆంగ్లం విభాగాల్లో పరీక్ష ఉంటుంది. విద్యార్థులకు మంచి అవకాశం.. విద్యార్థుల విజ్ఞానానికి మంచి అవకాశం. పరీక్షను విద్యార్థులు వ్యక్తిగతంగా, పాఠశాల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సైన్స్ ప్రయోగాలకు బీజం పాఠశాల స్థాయి నుంచే కలగాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏటా దీన్ని నిర్వహిస్తోంది. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి, అభిరుచి కలిగించడం, వారిలోని నైపుణ్యాలు, సృజనాత్మకతను వెలికితీయడం ఈ పరీక్ష ఉద్దేశం. వీవీఎం పరీక్షలో విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. – బి.రవినందన్‌రావు, జిల్లా సైన్స్ అధికారి, పెద్దపల్లి -
స్కిల్ యూనివర్స్ పేరుతో డాష్ బోర్డు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్వహించే నైపుణ్య శిక్షణ కోర్సులు, ఉపాధి కల్పన వంటి వివరాలు 24గంటలు అందుబాటులో ఉండేవిధంగా ‘స్కిల్ యూనివర్స్’ పేరుతో డ్యాష్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేక పోర్టల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) త్వరలో అందుబాటులోకి తీసుకువస్తుందని చెప్పారు. విజయవాడ ఆటోనగర్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి బుగ్గన శుక్రవారం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.ట్రైనింగ్, ప్లేస్మెంట్లకు సంబంధించిన సమగ్ర సమాచారం యువతకు ఎప్పటికప్పుడు తెలిసేలా డాష్ బోర్డును తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి తెలిపారు. ఏపీఎస్ఎస్డీసీ, సీడ్యాప్, న్యాక్, పీఏడీఏ వంటి వివిధ సంస్థలకు చెందిన శిక్షణ వివరాలు పోర్టల్‌లో నమోదు చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్ర యువతి, యువకులు నైపుణ్య శిక్షణ కోసం నమోదు చేసుకునేవారు, శిక్షణ దశలో ఉన్నవారు, శిక్షణ పూర్తి చేసుకున్నవారు, ఉద్యోగాల్లో చేరినవారు... ఇలా సమగ్ర సమాచారం ఆన్లైన్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే విధంగా డ్యాష్‌బోర్డును అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.కేతిక, నైపుణ్య విద్యను అభ్యసించే యువతి, యువకులకు అధ్యాపకుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నూతన పోర్టల్‌లో అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలతో కరిక్యులమ్(రెజ్యూమ్) తయారు చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్ తెలిపారు. వాటర్ మేనేజ్మెంట్, ప్లంబింగ్ స్కిల్ కౌన్సిల్లో ఏపీఎస్ఎస్డీసీ సాధించిన అవార్డును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిశీలించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ కార్యదర్శులు, ఎండీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను మంత్రి అభినందించారు. ఈ సమావేశంలో సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ నాగరాణి, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ డాక్టర్ వినోద్‌కుమార్, ఈడీ దినేష్‌కుమార్, ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ నవ్య, సీడ్యాప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. -
నిర్మాణ రంగంలో డ్రోన్ నైపుణ్యాల శిక్షణ.. ప్రముఖ సంస్థల ఎంఓయూ
గౌహతి: నిర్మాణ రంగంలో డ్రోన్ నైపుణ్యాలను పెంపొందించేందుకు భారతదేశంలోని ప్రముఖ డ్రోన్ పైలట్ శిక్షణా సంస్థ ఇండియా డ్రోన్ అకాడమీ (IDA), నిర్మాణ పరిశ్రమ నైపుణ్యాభివృద్ధి సంస్థ కన్స్ట్రక్షన్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (CSDCI) అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. శుక్రవారం (ఆగస్ట్ 11) గౌహతిలో జరిగిన కార్యక్రమంలో ఐడీఏ సీఈవో దేవిరెడ్డి వేణు, సీఎస్‌డీసీఐ సీఈవో నరేంద్ర దేశ్‌పాండే ఎంవోయూ పత్రాలను మార్చుకున్నారు. నేషనల్ ఆక్యుపేషనల్ స్టాండర్డ్స్ (NOS), నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ (NSQF) స్థాయిల ప్రకారం నిర్మాణ కార్మికులు, నిపుణులకు నాణ్యమైన డ్రోన్ శిక్షణ అందించడం ఈ ఎంఓయూ లక్ష్యం. కన్స్ట్రక్షన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ), బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ), నేషనల్ హైవేస్ బిల్డర్స్ ఫెడరేషన్ (ఎన్‌హెచ్‌బీఎఫ్), కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ద్వారా ప్రమోట్ చేసిన సీఎస్డీసీఐతో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని దేవిరెడ్డి అన్నారు. సీఎస్‌డీసీఐ, ఐడీఏ ద్వారా దేశవ్యాప్తంగా 3500 మంది పైలట్లకు శిక్షణ ఇవ్వబోతోందని, డ్రోన్ పైలట్ శిక్షణా కార్యక్రమాల కోసం పౌర విమానయాన శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి గుర్తింపు పొందినట్లు ఆయన చెప్పారు. దేశంలోనే అతిపెద్ద ఉపాధి కల్పనలో ఒకటైన నిర్మాణ పరిశ్రమలో నైపుణ్యాల అభివృద్ధికి సీఎస్‌డీసీఐ కట్టుబడి ఉందని సీఈవో నరేంద్ర దేశ్‌పాండే తెలిపారు. నిర్మాణ ప్రాజెక్టుల సామర్థ్యం, భద్రత, నాణ్యతను మెరుగుపరచడానికి డ్రోన్లకు అపారమైన సామర్థ్యం ఉందని, నిర్మాణ కార్మికులకు డ్రోన్ నైపుణ్యాలను అందించడానికి సీఎస్‌డీసీఐ ఐడీఏతో చేతులు కలపడం సంతోషంగా ఉందన్నారు. డ్రోన్ శిక్షణా కోర్సులను అందించడానికి, అసెస్మెంట్లు, సర్టిఫికేషన్లను నిర్వహించడానికి, ట్రైనీలకు ప్లేస్మెంట్ సహాయం అందించడానికి రెండు సంస్థలు పరస్పరం కలిసి పని చేసేందుకు ఈ ఎంఓయూ అనుమతిస్తుంది. రెండు సంస్థల మధ్య అవగాహన, వనరుల మార్పిడిని కూడా సులభతరం చేస్తుంది. ఏరియల్ సర్వే, ఇన్స్పెక్షన్, మ్యాపింగ్, మానిటరింగ్, డాక్యుమెంటేషన్ వంటి వివిధ పనులను చేయగల నైపుణ్యం కలిగిన డ్రోన్ పైలట్ల సమూహాన్ని సృష్టించడం ద్వారా ఈ ఎంఓయూ నిర్మాణ రంగానికి ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. -
ప్రకృతి సాగుకు ప్రాధాన్యం
రైతుల్ని నూరు శాతం ప్రకృతి సాగుబాట పట్టించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తొలి దశలో జిల్లాకు ఒక మండలాన్ని ప్రకృతి సాగులో ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మండలాల్లో రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగించే సన్న, చిన్నకారు రైతులను సంఘటితం చేసి వారికి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా సాగుచేస్తే కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తారు. కావాల్సిన ఇన్పుట్స్ తయారీలో రైతులకు శిక్షణ కూడా ఇవ్వడంతోపాటు సాగులో మెళకువలు నేర్పుతూ అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తారు. దశలవారీగా మండలంలో ప్రతి ఒక్కరూ ప్రకృతి సాగు చేపట్టేలా చర్యలు తీసుకుంటారు. మార్కెటింగ్, హెల్త్ అండ్ న్యూట్రిషన్, సైన్స్, పరివర్తన, యాజమాన్యం, సర్టీఫికేషన్, స్థానిక విలువ జోడింపు, వ్యవస్థాగత పరిశ్రమలు ఇలా అన్ని విభాగాలలో ఆ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతారు. ఆదర్శ మండలాల్లో పౌష్టికాహారం అవసరమయ్యే వారందరికీ నూటికి నూరు శాతం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ప్రతి గ్రామంలో ప్రకృతి ఉత్పత్తులను అందుబాటులో ఉంచడం ద్వారా పౌష్టికాహార లోపంతో బాధపడే వారి ఆహారంలో వాటిని భాగమయ్యేలా చూస్తారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అధ్యయనం చేస్తారు. మార్కెటింగ్ శాఖ ద్వారా రైతులు పండించిన ప్రకృతి ఉత్పత్తులను స్థానికంగా అమ్ముకునేలా చర్యలు తీసుకుంటారు. తొలుత గ్రామస్తులకు మంచి ఆహార ఉత్పత్తులు అందించేలా ప్రోత్సహిస్తారు. – సాక్షి, అమరావతి జిల్లాకో మండలం చొప్పున ఎంపిక 100% ప్రకృతి సాగుతో ఆదర్శ మండలంగా అభివృద్ధిఏడాది పొడవునా ఆదాయంవచ్చేలా పంటల ప్రణాళిక పాయింట్ పర్సన్లుగా సెర్ప్ఏపీఎంలు, సీసీలు రైతులే విక్రయించుకునేలా.. దళారుల పాత్ర లేకుండా రైతులే స్వయంగా పంట ఉత్పత్తులను రాష్ట్ర, జాతీయస్థాయి మార్కెట్లలో నేరుగా విక్రయించుకునేలా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తారు. వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రైతులు పంట ఉత్పత్తుల్ని విక్రయించుకుని అదనపు ఆదాయం పొందేలా చూస్తారు. ఇటీవల కాలంలో అనంతపురం జిల్లాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసే పలువురు రైతులు ఏడాది పొడవునా పంటల సాగు ద్వారా ప్రతినెలా క్రమం తప్పకుండా ఆదాయం వచ్చేలా ఏటీఎం (ఎనీ టైం మనీ) తరహా మోడల్‌ను అభివృద్ధి చేశారు. ఇదే మోడల్‌ను రాష్ట్రమంతా విస్తరించే దిశగా చర్యలు చేపట్టారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు బాధ్యతలు ఇందుకు సంబంధించిన కీలక బాధ్యతలను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)కు ప్రభుత్వం అప్పగించింది. సెర్ప్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ (ఏపీఎం), కమ్యూనిటీ కో–ఆర్డినేటర్ సీసీలు ఈ ప్రాజెక్టులో పాయింట్ పర్సన్‌గా వ్యవహరిస్తారు. వీరి సమన్వయంతో రైతు సాధికార సంస్థ సిబ్బంది ఎంపిక చేసిన మండలాల్లో సన్న, చిన్నకారు రైతులను గుర్తించి వారిని ప్రకృతి సాగు వైపు మళ్లించేందుకు అవసరమైన చేయూత ఇస్తారు. పాయింట్ పర్సన్స్‌గా ఎంపికైన ఏపీఎం, సీసీలకు రాష్ట్ర స్థాయిలో రెండ్రోజుల శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంపికైన మండలాలివీ.. ఈ ప్రాజెక్ట్ కోసం పాతపట్నం (శ్రీకాకుళం), జీఎల్ పురం (పార్వతీపురం మన్యం), వేపాడ (విజయనగరం), పద్మనాభం (విశాఖపట్నం), చీడికాడ (అనకాపల్లి), పాడేరు (అల్లూరి), ప్రత్తిపాడు (కాకినాడ), ఐ.పోలవరం (కోనసీమ), గోకవరం (తూర్పు గోదావరి), పాలకొల్లు (పశ్చిమ గోదావరి), జీలుగుమిల్లి (ఏలూరు), బాపులపాడు (కృష్ణా), రెడ్డిగూడెం (ఎన్టీఆర్ ), కొల్లిపర (గుంటూరు), బెల్లంకొండ (పల్నాడు), మార్టూరు (బాపట్ల), కొత్తపట్నం (ప్రకాశం), దగదర్తి (నెల్లూరు), రామచంద్రపురం (తిరుపతి), శాంతిపురం (చిత్తూరు), చిన్నమందెం (అన్నమయ్య), పెండ్లిమర్రి (వైఎస్సార్), మడకశిర (శ్రీ సత్యసాయి), రాప్తాడు (అనంతపురం), ఓర్వకల్లు (కర్నూలు), ప్యాపిలి (నంద్యాల) మండలాలను ఎంపిక చేశారు. ప్రకృతి సాగులో ఆదర్శం జిల్లాకో మండలాన్ని ఎంపిక చేసి ప్రకృతి సాగులో ఆదర్శంగా తీర్చిదిద్దేలా కార్యాచరణ సిద్ధం చేశాం. సెర్ప్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టబోతున్నాం. తొలుత సిబ్బందికి, ఆ తర్వాత రైతులకు శిక్షణ ఇస్తాం. సాగులో అవసరమైన చేయూత అందిస్తాం. – బీవీ రామారావు, సీఈవో, రైతు సాధికార సంస్థ -
మగ్గానికి మహర్దశ.. సొంత మగ్గం ఉన్న కుటుంబానికి ఏటా రూ.24 వేలు
సాక్షి, అమరావతి: మగ్గానికి మహర్దశ వ చ్చింది. పోగు పోగుగా సంక్షేమం అందుతోంది. నేతన్నల నరాలు సత్తువ పుంజుకున్నాయి. మొత్తంగా చేనేత రంగం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చూపిన ప్రత్యేక శ్రద్ధతో సంక్షేమాన్ని అద్దుకుంది. స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత రంగానికి ప్రముఖ పాత్ర ఉంది. అందుకే 1905లో ప్రారంభించిన స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాం. దేశవ్యాప్తంగా చూస్తే ఇతర రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ చేనేత రంగం తన ప్రాభవాన్ని కోల్పోయి శిథిలావస్థకు చేరుకుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మగ్గానికి మహర్దశ పట్టింది. సీఎం వైఎస్ జగన్ అందించిన ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ చేనేత కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచింది. మగ్గాల ఆధునికీకరణతోపాటు చేనేత సామగ్రి కొనుగోలుకు ఊతమి చ్చింది. ఆధునిక డిజైన్లు, పోటీ మార్కెట్‌కు అనుగుణంగా నాణ్యమైన వ్రస్తాల తయారీలో ప్రభుత్వం ఇస్తున్న శిక్షణ చేనేతకు కొత్త హంగులు అందిస్తోంది. ప్రత్యేకంగా క్లస్టర్ ట్రైనింగ్ సెంటర్లు పెట్టి శిక్షణ అనంతరం ఆధునిక యంత్రాలను సబ్సిడీపై అందించే కార్యక్రమం చేనేతల తలరాతలను మారుస్తోంది. ‘నేతన్న నేస్తం’తో రూ.969.77 కోట్లు చేనేత కుటుంబాలకు భరోసా ఇచ్చేలా ప్రభుత్వం వరుసగా ఐదేళ్లు ‘నేతన్న నేస్తం’ ద్వారా రూ.969.77 కోట్లు అందించింది. సొంత మగ్గం కలిగిన ప్రతి నేతన్నకూ ఏడాదికి రూ.24 వేల చొప్పున ఒక్కొక్కరికి రూ.1.20 లక్షల చొప్పున అందించింది. ఈ పథకం అమలు తర్వాత చేనేత కారి్మకులు తమ మగ్గాలను డబుల్ జాకార్డ్, జాకార్డ్ లిఫ్టింగ్ మెషిన్ తదితర ఆధునిక పరికరాలతో అప్‌గ్రేడ్ చేసి కొత్త డిజైన్లతో నాణ్యమైన వ్రస్తాలను ఉత్పత్తి చేస్తూ జీవితాలను మెరుగుపర్చుకున్నారు. దీంతోపాటు నేతన్నల పెన్షన్ కోసం రూ.1,396.45 కోట్లు ఇ చ్చింది. చేనేత రంగానికి ఊతమిచ్చేలా ఆప్కోకు రూ.468.84 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో కలిపి) చెల్లించింది. నేతన్న నేస్తం, నేతన్న పెన్షన్, ఆప్కోకు మూడు పథకాల ద్వారానే నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.2,835.06 కోట్లు వ్యయం చేసింది. గత ప్రభుత్వం నేతన్నల కోసం ఐదేళ్లలో కేవలం రూ.442 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా.. వైఎస్ జగన్ ప్రభుత్వం కేవలం నాలుగేళ్లలోనే నవరత్నాలు తదితర సంక్షేమ పథకాల ద్వారా రూ.3,706 కోట్లు ఖర్చు చేయడం విశేషం. చేనేత వారోత్సవాల నిర్వహణకు ఆదేశాలు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నుంచి వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో జవహర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. చేనేత రంగాన్ని, క్లిష్టమైన బట్టలను నేయడానికి అంకితమైన కళాకారులను, ప్రోత్సహించేలా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారానికి ఒక రోజు చేనేత వ్రస్తాలు ధరించాలని 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు ఇ చ్చిందని గుర్తు చేసిన జవహర్‌రెడ్డి అదే స్ఫూర్తితో యువతరం సైతం చేనేత వ్రస్తాలు ధరించేలా ప్రోత్సహించాలన్నారు. ప్రతి కలెక్టరేట్, ఎమ్మార్వో కార్యాలయాల ఆవరణలో చేనేత వస్త్రాల ప్రదర్శన, విక్రయాలు నిర్వహించేలా స్టాల్స్ ఏర్పాటుకు స్థలాలు కేటాయించాలని ఆదేశించారు. ఆగస్టు 7న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేనేత వ్రస్తాలు (చీర, ధోతీ) ధరించి వాక్‌థాన్ నిర్వహించాలన్నారు. ఇకపై ప్రతి శనివారం స్వచ్ఛందంగా చేనేత వ్రస్తాలు ధరించాలని ఉద్యోగులను కోరారు. -
మణిపూర్ అల్లర్లలో దొరికిన ఆణిముత్యం
-
ఆంగ్లంలో సుశిక్షిత సైన్యం
విశాఖ విద్య: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లిష్ మీడియం చదువులకు ప్రాధాన్యం ఇస్తోంది. 2023–24 విద్యా సంవత్సరానికి మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న ఫార్మటివ్ పరీక్షలతో అదనంగా ఇంగ్లిష్ లో విద్యార్థుల నైపుణ్యాన్ని తెలుసుకునేందుకు ‘టోఫెల్’ పరీక్షను సైతం నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు మేలు చేయాలనే ఉన్నతాశయంతో ఇలాంటి ప్రయోగాలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుండగా.. వీటిని క్షేత్రస్థాయిలో విజయవంతం చేసేందుకు విశాఖ జిల్లా అధికారులు సైతం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. దీనిలో భాగంగానే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి 10వ తరగతి వరకు బోధించే ఇంగ్లిష్ సబ్జెక్టు టీచర్లకు రోజుకు 50 మంది చొప్పున జిల్లాలోని మొత్తం 500 మందికి శిక్షణ ఇప్పించేలా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ఐడియల్ లెర్కింగ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. జిల్లా విద్యాశాఖాధికారుల ప్రతిపాదనలకు కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున సానుకూలంగా స్పందించి, శిక్షణకు అయ్యే మొత్తాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) కింద చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఈ నెల 28న ప్రారంభమైన శిక్షణ మూడు నెలల పాటు కొనసాగనుంది. విదేశాలకు వెళ్లి చదువుకుంటామనే పేద విద్యార్థులకు తోడ్పాటుగా నిలిచేలా జగనన్న విదేశీ విద్యా కానుక అందజేస్తోంది. అయితే విదేశాల్లో చదువులకు జీఆర్ఈ, కాట్, ఐల్ట్సŠ, క్లాట్, టోపెల్, సాట్ వంటి అంతర్జాతీయ స్థాయి ఎంట్రన్స్ పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు ఇలాంటి పోటీ పరీక్షలపై అవగాహనలేక వెనుకబడిపోతున్నారు. ఉపాధ్యాయులకు ఇలాంటి శిక్షణతో ఆ లోటు భర్తీ కానుంది. పట్టుసాధించేలా ఇంగ్లిష్ మీడియం చదువులకు ప్రాధాన్యం పెరిగింది. ఉపాధ్యాయులకూ సబ్జెక్టుపై పట్టుండాలి. కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున సహకారంతో విశాఖ జిల్లాలో తొలిసారిగా ఇలాంటి శిక్షణ ఇస్తున్నాం. – బి.శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష, ఏపీసీ, విశాఖపట్నం మెలకువలు నేర్పుతున్నాం.. ఇంగ్లిష్ భాషలో మెలకువలు తెలిస్తే.. విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో బోధించవచ్చు. అలాంటి మెలకువలనే వారికి నేర్పుతున్నాం. ప్రతి ఉపాధ్యాయుడు కనీసం 30 గంటలైనా శిక్షణలో పాల్గొంటే మంచి ఫలితాలొస్తాయి. విద్యాశాఖాధికారులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. – ఫిలిప్, ట్రైనర్,ఐడియల్ లెర్కింగ్ సంస్థ, విశాఖపట్నం ఉపయోగకరంగా ఉంది.. నా 23 ఏళ్ల సరీ్వసులో ఇలాంటి శిక్షణ ఇదే తొలిసారి. ఇంగ్లిష్ మీడియం బోధన అమలు చేస్తున్నందున ఇలాంటి శిక్షణ ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉంటుంది. – రామలక్ష్మి, ఉపాధ్యాయురాలు, జెడ్పీ హైస్కూల్, గిరిజాల, విశాఖపట్నం అలా ఉంటేనే మెరుగైన ఫలితాలు విద్యార్థులకు పాఠాలు చెప్పే మేము, మళ్లీ విద్యార్ది గా మారి శిక్షణకు హాజరవుతున్నాం. ఉపాధ్యాయుడైనా నిత్య విద్యార్ది గా ఉంటేనే ఉత్తమ ఫలితాలు వస్తాయి. నిరంతరం నేర్చుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన రీత్యా శిక్షణ ఎంతో మేలు చేస్తుంది. – ఆర్.విజేత, జీవీఎంసీ హైస్కూల్, మల్కాపురం, విశాఖపట్నం -
సాధారణ మెకానిక్‌లు ఇప్పుడు ఈవీ టెక్నీషియన్లు..
వారంతా ఒకప్పుడు సాధారణ మెకానిక్‌లు. ఇప్పుడు ఈవీ టెక్నీషియన్స్‌గా మారారు. ఆటోమోటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ASDC) ఎలక్ట్రానిక్ వెహికల్ పరిశ్రమలో టెక్నీషియన్లుగా పనిచేయడానికి 300 మంది సాధారణ టూ వీలర్, త్రీ వీలర్ మెకానిక్‌లకు శిక్షణ ఇచ్చింది. లివ్‌గార్డ్ బ్యాటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఈవీ పరిశ్రమకు నైపుణ్యత కలిగిన వర్క్‌ఫోర్స్‌ను అందించడం ఈ చొరవ లక్ష్యం. 2022 డిసెంబర్ 1న ప్రారంభమైన పైలట్ ప్రాజెక్ట్ ఇప్పుడు విజయవంతంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్‌లోని ఆగ్రాలో అభ్యర్థులకు పది రోజులపాటు రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్ విధానం ద్వారా శిక్షణ ఇచ్చారు. ఈవీ పరిశ్రమలో అభ్యర్థుల నైపుణ్యాలను మెరుగుపర్చడం, కొత్త టెక్నాలజీపై అవగాహన కల్పించడం, రిపేర్ టెక్నిక్లను మెరుగుపర్చుకోవడంపై ఈ శిక్షణలో తర్ఫీదు ఇచ్చారు. ప్రపంచంలో అతిపెద్ద మోటార్‌సైకిల్ మార్కెట్ అయిన భారత్‌లో మోటార్‌సైకిల్ పరిశ్రమ నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరతను ఎదుర్కొంటోందని టోమోటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ సీఈవో అరిందమ్ లహిరి పేర్కొన్నారు. యువతకు మెరుగైన శిక్షణ అందించడం ద్వారా నైపుణ్య కొరతను తగ్గించవచ్చని, పరిశ్రమ డిమాండ్లను తీర్చవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదీ చదవండి ➤ GST on EV Charging: ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్‌పై జీఎస్టీ! పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో వర్తింపు శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం నుంచి సర్టిఫికేట్, వేతన ఆధారిత ప్రోత్సాహకాలు, టూల్ కిట్, ఒక సంవత్సరం ప్రమాద బీమా కవరేజీని అందించారు. ఈ సర్టిఫికెట్, టూల్ కిట్లు, ప్రోత్సాహకాలు అభ్యర్థులకు పరిశ్రమలో ఉపాధిని పొందేందుకు, బ్యాంకు రుణాల సహాయంతో సొంతంగా పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తాయని వివరించారు. -
ప్రపంచవ్యాప్తంగా నైపుణ్య యువతకు డిమాండ్
-
డ్రోన్లతో వెదసాగు సక్సెస్
సాక్షి ప్రతినిధి, గుంటూరు: వరిసాగులో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టడంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ ముందుకు సాగుతోంది. దేశంలోనే మొదటిసారిగా వ్యవసాయ డ్రోన్ల వినియోగంపై రైతులకు, గ్రామీణ యువతకు అవగాహన కల్పిస్తూ, వ్యవసాయంలో రాష్ట్ర ప్రభుత్వ ముందుచూపును నిజం చేస్తోంది. ఇప్పటివరకు 10 ప్రధాన పంటల్లో డ్రోన్లతో పురుగుమందులు చల్లడానికి ప్రామాణికాలను తయారుచేసి, శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా వెదపద్ధతి(విత్తనాలు వెదజల్లడం)లో విత్తనాలు చల్లే ప్రక్రియకి శ్రీకారం చుట్టింది. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వర్షాలు సకాలంలో పడకపోవడంతో రైతులు సకాలంలో వరినాట్లు వేయలేకపోతున్నారు. ఖరీఫ్ సాగు ఆలస్యం అవుతోంది. దీంతో రైతులు వెదసాగు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వరిసాగులో 21 శాతం వరకు వెదపద్ధతిలోనే జరుగుతున్నట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. వెదపద్ధతిలో గత ఏడాది 100 ఎకరాల్లో వరి, మినుము, పచ్చి రొట్ట సాగుచేశారు. దుక్కి దున్నిన తరువాత నుంచి అన్ని పంటల్లో డ్రోన్లతో అన్ని రకాల పనులు చేసుకోవచ్చని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఆధునిక సాంకేతికతను జోడించి డ్రోన్లతో వరి విత్తనాలను వెదజల్లించాలని వర్సిటీ శాస్త్రవేత్తలు నిర్ణయించారు. సమయం, డబ్బు ఆదా డ్రోన్లతో వెదపద్ధతిలో తక్కువ విత్తనాలు సరిపోతాయి. సమయం, డబ్బు ఆదా అవుతాయి. మొదటి ఏడాది ఫలితాలను విశే్లషించిన తర్వాత వెదపద్ధతిలో విత్తనాలను నాటడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని గుర్తించారు. రెండో సంవత్సరం ఫలితాలు ఆశాజనకంగా వస్తే దుక్కి నుంచి కోత వరకు డ్రోన్లను ఉపయోగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ట్రాక్టర్లు, చేతితో చల్లే పద్ధతిలో ఎకరానికి 16 నుంచి 30 కిలోల వరకు విత్తనాలు వినియోగిస్తున్నారు. అదే డ్రోన్ ద్వారా చల్లితే 8 నుంచి 12 కిలోల విత్తనాలు సరిపోతాయి. గత ఏడాదిగా డ్రోన్ల సాయంతో విత్తనాలు చల్లడం, ఎరువులు (యూరియా, డీఏపీ) వేయడం, పురుగుమందుల పిచికారీలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఎకరం పొలంలో మూడు నిమిషాల్లో విత్తనాలు చల్లవచ్చు. 50 కిలోల రసాయనిక ఎరువును ఎనిమిది నిమిషాల్లో చల్లవచ్చు. ఎకరా విత్తనాలు విత్తుకునేందుకు రూ.400 నుంచి రూ.500 ఖర్చవుతుంది. విత్తనాల్లో 25 శాతం ఆదా అవుతాయి. పురుగుమందుల వ్యయం 25 శాతం తగ్గడమేగాక చల్లే ఖర్చులో రూ.400 ఆదా అవుతాయి. గత ఏడాది వెదపద్ధతిలో చేసిన సాగు ఆశాజనకమైన ఫలితాలను ఇవ్వడంతో ఈ విధానంపై పరిశోధనలను ముమ్మరం చేసింది. డీజీసీఏ అనుమతితో శిక్షణ దేశంలో ఎక్కడా లేనివిధంగా డ్రోన్లను వినియోగించడంతోపాటు డీజీసీఏ అనుమతి తీసు కుని వ్యవసాయ డ్రోన్ పైలట్లకు వ్యవసాయ విశ్వవిద్యాలయం శిక్షణ ఇస్తోంది. వర్సిటీలోని శిక్షణ కేంద్రంలో ఇప్పటివరకు 217 మంది రైతులు, గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి సరి్టఫికెట్లు అందజేసింది. మరో వందమంది వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా శిక్షణ ఇచ్చింది. తిరుపతి, పులివెందులలో డ్రో¯Œ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. రైతులకు అధునాతన సాంకేతికత ఆధునిక వ్యవసాయ విధానాలను రైతులకు అందించేందుకు దేశంలోనే మొదటిసారిగా డ్రోన్ల ద్వారా వ్యవసాయాన్ని ప్రయోగాత్మంగా చేపట్టి మంచి ఫలితాలను సాధించాం. వెదపద్ధతిలో వరిసాగు, పురుగుమందులు, ఎరువుల పిచికారీలో మంచి ఫలితాలు వచ్చాయి. మరికొంత సాంకేతికతను రైతులకు అందించేందుకు రోబో టెక్నాలజీపై ప్రయోగాలు చేపట్టాం. అధునాతన సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తెస్తున్నాం. – డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి, వీసీ, ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ -
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డిజిటల్ శిక్షణ
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలకు శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 40 లక్షల మంది పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ విద్యా సంవత్సరం (2023–24) నుంచి డిజిటల్ బోధనను ప్రవేశపెట్టింది. ఇప్పటికే నాడు–నేడు: మనబడి కింద పాఠశాల భవనాలు, తరగతి గదులు, డబుల్ డెస్క్ బెంచీలు, విద్యార్థులకు ద్విభాషా పాఠ్యపుస్తకాలతో పాటు బైజూస్ కంటెంట్ ఉన్న ట్యాబ్‌లను ఉచితంగా అందించింది. నాడు–నేడు పనులు పూర్తయిన 15,713 పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ప్లస్ 2 వరకు బోధించే 6,731 స్కూళ్లలో అత్యాధునిక టెక్నాలజీ గల 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను ఏర్పాటు చేసింది. ఇలాంటి ప్యానెళ్లు దేశవ్యాప్తంగా సుమారు 25 వేలు మాత్రమే ఉండగా.. మనరాష్ట్రంలో 30 వేలకు పైగా అందుబాటులోకి తెచ్చింది. వీటి ద్వారా విద్యార్థులకు మెరుగైన బోధన అందించడంపై 1,34,281 మంది ఉపాధ్యాయులకు శిక్షణనిస్తున్నారు. ఈ నెల 4 నుంచి ప్రారంభమైన డిజిటల్ శిక్షణ ఇప్పటికే లక్ష మందికిపైగా పూర్తయింది. మిగిలిన వారికి ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతుంది. 11,455 పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు శిక్షణ రెండో దశ నాడు–నేడు పనులు 22 వేల పాఠశాలల్లో జరుగుతున్నాయి. వీటిలో దాదాపు పనులు పూర్తయినవి మొత్తం 11,455 పాఠశాలలు ఉన్నాయి. వీటి నుంచి 1,34,281 మంది ఉపాధ్యాయులను శిక్షణకు ఎంపిక చేశారు. వీరికి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల వినియోగంపై ఇంజనీరింగ్ కాలేజీల్లో నిపుణులతో తర్ఫీదునిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 144 ఇంజనీరింగ్ కాలేజీల్లో 40 మంది చొప్పున ఒక బ్యాచ్‌గా చేసి శిక్షణ క్యాంపులు నిర్వహిస్తున్నారు. గతంలో శిక్షణ పొందిన దాదాపు 600 మంది మాస్టర్ ట్రైనర్లతో రెండు లేదా మూడు మండలాలకు చెందిన సబ్జెక్టు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు రెండు రోజుల చొప్పున శిక్షణ అందిస్తున్నారు. కాగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో గణితం, భౌతిక, జీవ, రసాయన శాస్త్రాలతో పాటు ఇంగ్లిష్ బోధించే 35 వేల మంది సబ్జెక్టు ఉపాధ్యాయులకు అక్టోబర్ నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) ప్రొఫెసర్లతో శిక్షణ ఇవ్వనున్నారు. నిధులు చెల్లించిన ప్రభుత్వం ఉపాధ్యాయుల శిక్షణకు, ప్యానెళ్లు బిగించేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం గత నెలలోనే విడుదల చేసింది. 1,34,281 మంది టీచర్లకు రూ.5,79,12,000.. ఐఎఫ్‌పీ స్క్రీన్లు తరలింపు, శిక్షణ కేంద్రాల్లో బిగించేందుకు రూ.7.20 లక్షల నిధులను ప్రభుత్వం గత నెలలోనే చెల్లించింది. దీంతో పాటు ఐఎఫ్‌పీ స్క్రీన్లు మంజూరైన పాఠశాలల్లో వాటిని బిగించేందుకు, వైరింగ్, రంగులు వేసేందుకు కూడా నిధులను ఇచ్చింది. పద్యాలను బాగా నేర్పించొచ్చు గతంలో విద్యార్థులకు తెలుగు పద్యాలను నేర్పించేందుకు ఫోన్ ను ఉపయోగించేవాళ్లం. అయితే ఇలా ఎక్కువమంది పిల్లలకు చేరేది కాదు. ఇప్పుడు ఐఎఫ్‌పీల ద్వారా తెరపై అందరికీ వినిపించేలా చెప్పొచ్చు. చెప్పిన ప్రతి అంశాన్ని మరోసారి పునశ్చరణ చేసేందుకు వీలుంది. ఇంత మంచి శిక్షణ ప్రతి టీచర్‌కు అవసరం. – పి.రాణి, తెలుగు టీచర్, కొండపల్లి బాలికల హైసూ్కల్, ఎన్టీఆర్ జిల్లా శిక్షణ గొప్ప అవకాశం ఏ రంగంలోనైనా కాలానుగుణంగా మారకుంటే వెనుకబడిపోతాం, బోధనలో కూడా అంతే. ఉపాధ్యాయుడిగా నాకు 27 ఏళ్ల అనుభవం ఉంది. ఇన్నేళ్ల బోధన ఒక ఎత్తయితే.. డిజిటల్ బోధన మరో ఎత్తు. బ్లాక్ బోర్డుపై చెప్పే దానికన్నా ఐఎఫ్‌పీలపై 3డీలో విద్యార్థికి మరింత సమర్థవంతంగా చదువు చెప్పొచ్చు. బోధనా సామర్థ్యాలు పెంచుకోవడానికి ఇదో గొప్ప అవకాశం. – కె.హరిశరణ్, జెడ్పీ స్కూల్ హెచ్ఎం, సూరంపల్లి, కృష్ణా జిల్లా ప్రభుత్వ బడిలో ఇదో విప్లవం వేగంగా మారుతున్న ప్రపంచంలో కార్పొరేట్ స్కూళ్లు కూడా అందుకోలేని డిజిటల్ బోధనను ప్రభుత్వ స్కూళ్లల్లో అందుబాటులోకి తేవడం ఓ ఎత్తయితే.. ఉపాధ్యాయులకు వేగంగా శిక్షణనివ్వడం మరో ఎత్తు. ఈ శిక్షణలో ఉపాధ్యాయులు కొత్త టెక్నాలజీని నేర్చుకునేందుకు నూరుశాతం ఆసక్తి చూపించారు. పిల్లలకు మెరుగైన విద్యాబోధన అందించేందుకు ఇదో గొప్ప అవకాశం. ప్యానెళ్లను ఎలా వినియోగించాలి?, నోట్స్ సేవింగ్, 3డీ పాఠాలు ఎలా చెప్పాలి? వంటి సాంకేతిక అంశాలపై శిక్షణనిచ్చాం. – డాక్టర్ కె.శ్రీనివాసరావు (మాస్టర్ ట్రైనర్), బి.శ్రీనివాస్ (పెదపారుపూడి ఎంఈవో) బోధనా సమయం ఆదా బయాలజీ టీచర్‌గా బ్లాక్ బోర్డుపై విద్యార్థికి పాఠాలు అర్థమయ్యేలా చెప్పడం ఒక సవాల్. ఇప్పుడు ఐఎఫ్‌పీలపై తక్కువ సమయంలోనే ఎక్కువ ఉదాహరణలతో అర్థమయ్యేలా బోధించవచ్చు. స్క్రీన్‌పై 3డీ చిత్రాలతో ప్రతి అంశాన్ని విశదీకరించి చెప్పొచ్చు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. అంతేకాకుండా స్క్రీన్‌పైనే నోట్స్ రాసి సేవ్ చేయడంతో పాటు ఎక్కువ అంశాలను నేర్పించవచ్చు. – వి.అరుణశ్రీ, బయాలజీ టీచర్, పెనమలూరు జెడ్పీ స్కూల్, కృష్ణా జిల్లా -
గ్రామీణ యువతకు శిక్షణ, ఉపాధిలో ఏపీ స్పీడ్
-
AP: సర్కారు బడిలో ‘టోఫెల్’ ట్రైనింగ్
మనం ఏ కార్యక్రమం తలపెట్టినా పేద వర్గాలను దృష్టిలో పెట్టుకోవాలి. వారి పట్ల సహృదయంతో పని చేయాలి. వారి జీవితాల్లో మార్పు తేవడం దేవుడి దృష్టిలో గొప్ప సేవ చేసినట్లే. ఇదొక సవాల్‌తో కూడుకున్న కార్యక్రమం. టోఫెల్ శిక్షణను కేవలం జూనియర్ స్థాయికే పరిమితం చేయకుండా ప్లస్ వన్, ప్లస్ టూ (ఇంటర్) వరకూ విస్తరించాలి. 11, 12వ తరగతులు పూర్తి చేసిన తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్తుంటారు. అందుకే జూనియర్ లెవెల్‌తో ఆపేయకుండా సీనియర్ లెవెల్ వరకూ విస్తరించాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు ప్రపంచ స్థాయికి ఎదిగేలా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. విద్యారంగంలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులను చేపట్టిన నేపథ్యంలో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ‘టోఫెల్’ పరీక్షకు సన్నద్ధం చేస్తూ ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్విసెస్ (ఈటీఎస్)తో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఒప్పందం చేసుకుంది. సీఎం జగన్ సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో ‘ఈటీఎస్’ ఇండియా చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ లెజో సామ్ ఊమెన్, సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ నిధి మీనా, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి, ఈటీఎస్ అసెస్మెంట్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ రుయి ఫెరీరా, డేనియల్, యూఫిఎస్ లెర్నింగ్ సహ వ్యవస్థాపకుడు అమిత్ కపూర్, చీఫ్ గ్రోత్ ఆఫీసర్ కపిల్, వైస్ ప్రెసిడెంట్ డిజిటల్ సేల్స్ ఇండియా కే–12 రాజీవ్ రజ్దాన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అట్టడుగు వర్గాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులను చేపడుతోందని తెలిపారు. రాష్ట్రంలోప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యారంగంలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను పరిశీలించాలని ఈటీఎస్ బృందాన్ని ఆహ్వానించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. డిసెంబరు 21న మళ్లీ ట్యాబ్‌లు రాష్ట్రంలో 6వ తరగతి, ఆపై తరగతులకు సంబంధించి మొత్తం 63 వేల తరగతి గదులకు గాను 30,230 క్లాస్ రూమ్‌లు అంటే 50 శాతం జూలై చివరి నాటికి డిజిటలైజ్ చేస్తున్నాం. మిగిలిన వాటిని డిసెంబరు నాటికి సిద్ధం చేస్తాం. 8వ తరగతిలోకి అడుగు పెడుతున్న ప్రతి విద్యార్థి కి ట్యాబ్‌లు పంపిణీ చేశాం. ఈ ఏడాది డిసెంబరు 21న మళ్లీ ట్యాబ్‌ల పంపిణీ చేపడతాం. బైజూస్ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం విద్యార్థులకు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా కంటెంట్‌ను అందుబాటులో ఉంచుతున్నాం. 1 నుంచి 9వ తరగతి వరకు ద్విభాషా (బైలింగ్యువల్) పాఠ్యపుస్తకాలను సరఫరా చేశాం. వచ్చే ఏడాది 10వ తరగతికి కూడా ద్విభాషా పుస్తకాలను అందిస్తాం. టెన్త్ విద్యార్థులు 2025లో సీబీఎస్ఈ పరీక్షలకు ఇంగ్లిష్ మీడియంలో హాజరవుతారు. మానవ వనరులపై పెట్టుబడి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నాం. దాదాపు 45 వేల ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాడు – నేడు ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. తొలిదశలో ఇప్పటికే 15,750కిపైగా స్కూళ్లను అభివృద్ధి చేయగా డిసెంబరు నాటికి మరో 16 వేలకు పైగా స్కూళ్లలో రెండో దశ పనులు కూడా పూర్తవుతాయి. వచ్చే ఏడాది మిగిలిన స్కూళ్లలో పనులు చేపడతాం. విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలో ప్రతి విద్యార్థికి ఆక్స్ఫర్డ్ డిక్షనరీని ఉచితంగా అందిస్తున్నాం. వీటికి అదనంగా ఇప్పుడు టోఫెల్ ప్రైమరీ, టోఫెల్ జూనియర్, టోఫెల్ సీనియర్ పరీక్షలను కూడా ప్రవేశపెడుతున్నాం. ఇది మంచి మార్పులకు దారితీస్తుంది. ఇదంతా మానవ వనరులపై పెడుతున్న పెట్టుబడిగా భావిస్తున్నాం. కచ్చితంగా ఈ కార్యక్రమం ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుంది. ఒప్పందంలో ముఖ్యాంశాలు.. ♦ టోఫెల్ పరీక్షలు నిర్వహించే అంతర్జాతీయ సంస్థ ఈటీఎస్‌తో ఒక రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఒప్పందం చేసుకోవడం ఇదే ప్రథమం. ♦ ఈ ఒప్పందం ద్వారా అమెరికన్, యూరోపియన్ ఉచ్ఛారణలో పిల్లల నైపుణ్యాలను పెంపొందిస్తారు. ♦ విదేశీ యాసను అర్థం చేసుకోవడమే కాకుండా విద్యార్థులు చక్కగా మాట్లాడేలా శిక్షణ ఇస్తారు. ♦ 3, 4వ తరగతి పిల్లలకు విద్యా సంవత్సరం చివరలో మార్చిలో సర్టిఫైడ్ సన్నాహక పరీక్ష నిర్వహిస్తారు. ♦ 5వ తరగతి పిల్లలకు అక్టోబరులో మరో సన్నాహక పరీక్ష అనంతరం మార్చిలో తుది పరీక్ష టోఫెల్ ప్రైమరీని నిర్వహిస్తారు. ♦ 6 – 8వ తరగతి విద్యార్థులకు విద్యా సంవత్సరం చివరిలో సర్టిఫైడ్ సన్నాహక పరీక్ష ఉంటుంది. ♦ 9వ తరగతి విద్యార్థులకు అక్టోబరులో మరో సర్టిఫైడ్ సన్నాహక పరీక్ష నిర్వహిస్తారు. తుది పరీక్ష టోఫెల్ జూనియర్ విద్యా సంవత్సరం చివరిలో జరుగుతుంది. ♦ 10వ తరగతి విద్యార్థులకు టోఫెల్ జూనియర్ స్పీకింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ♦పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడంలో భాగంగా 3 – 5 తరగతుల వారికి వారానికి మూడుసార్లు గంట సేపు స్మార్ట్ టీవీల ద్వారా ఆడియో, వీడియో కంటెంట్‌ను వినిపిస్తారు. ♦ 6 – 10వ తరగతి పిల్లలకు ఐఎఫ్‌పీల ద్వారా వారానికి మూడుసార్లు వీడియోలు ప్రదర్శిస్తారు. ♦ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతారు. ♦ అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులు చదివే స్కూళ్లలో ఇంగ్లిష్ టీచర్లను మెరుగైన శిక్షణ, అవగాహన కోసం అమెరికాలోని ప్రిన్స్టన్కు మూడు రోజులపాటు పంపిస్తారు. ♦ ఒప్పందంలో భాగంగా టోఫెల్ పరీక్షలను సీనియర్ లెవెల్‌కూ (ప్లస్ –1, ప్లస్ –2) విస్తరించాలని సీఎం ఆదేశించారు. ఏపీ విద్యార్థులకు మంచి అవకాశాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనిక నాయకత్వంలోని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈటీఎస్‌తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం విద్యలో నాణ్యత పెంచేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. తద్వారా ప్రపంచంలోని ఏ ప్రాంతంతోనైనా విద్యార్థులు సులభంగా అనుసంధానం అవుతారు. విద్యాపరంగా, వృత్తిపరంగా ఏపీ విద్యార్థులకు మంచి అవకాశాలు దక్కుతాయి. నా తల్లిదండ్రులు ఫ్రాన్స్‌కు చెందినవారు కావడంతో ఇద్దరికీ ఇంగ్లిష్ రాదు. నేను ఆంగ్ల భాష నేర్చుకుని అమెరికాలో స్థిరపడి పౌరసత్వం పొందా. ఈటీఎస్ 75 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తోంది. మాది ప్రపంచంలోనే అతిపెద్ద ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సంస్థ. 180 దేశాల్లో 9 వేల ప్రాంతాల్లో ఇప్పటికే 50 మిలియన్లకు పైగా పరీక్షలు నిర్వహించాం. రాష్ట్ర ప్రభుత్వం ఏటా 52 మంది టీచర్లను అమెరికాలోని ప్రిన్స్టన్కు పంపనుంది. వారికి అత్యుత్తమ శిక్షణ అందిస్తాం. – అలైన్ డౌమాస్, ఈటీఎస్ సీనియర్ డైరెక్టర్ -
డ్రోన్ పైలట్ అవుతారా? శిక్షణ కోర్సులు అందించనున్న ఎయిర్‌బస్
ముంబై: యూరోపియన్ ఏవియేషన్ దిగ్గజం ఎయిర్‌బస్ భారత్‌లో డ్రోన్ పైలట్ల శిక్షణ కోర్సులను అందించనున్నట్లు వెల్లడించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆమోదం పొందిన ఈ సర్టిఫికెట్ కోర్సులు అయిదు రోజుల పాటు ఉంటాయి. సూక్ష్మ, చిన్న కేటగిరీ డ్రోన్ల కోసం ఉద్దేశించిన కోర్సులు బెంగళూరులోని ఎయిర్‌బస్ ట్రైనింగ్ సెంటర్లో జూన్ 26 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. డ్రోన్ల నిబంధనలు, ఫ్లయిట్ ప్రాథమిక సూత్రాలు, నిర్వహణ మొదలైన వాటిపై డీజీసీఏ ఆమోదించిన ఇన్స్ట్రక్టర్లు శిక్షణనిస్తారని పేర్కొంది. సిమ్యులేటర్ శిక్షణతో పాటు ప్రాక్టికల్ ఫ్లయింగ్ పాఠాలు కూడా ఉంటాయని వివరించింది. 10వ తరగతి పూర్తి చేసిన, 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇందు కోసం దరఖాస్తు చేసుకునేవారికి తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ ఉండాలి. అలాగే శిక్షణ పొందేందుకు, డ్రోన్లను ఆపరేట్ చేయడానికి ఫిట్నెస్ను ధ్రువీకరించే మెడికల్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: Palm Payment: ఇదేదో బాగుందే.. వట్టి చేతులు చాలు! పేమెంట్ ఈజీ -
కూలిన ఐఏఎఫ్ శిక్షణ విమానం.. పైలట్లకు గాయాలు
సాక్షి, బెంగళూరు: భారత వైమానిక దళాని (ఐఏఎఫ్)కి చెందిన విమానం కుప్పకూలిన ఘట నలో ఇద్దరు పైలట్లు గాయపడ్డారు. కర్ణాటకలోని చామరాజనగర జిల్లా భోగాపుర వద్ద గురువారం ఈ ఘటన జరిగింది. వింగ్ కమాండర్ తేజ్‌పాల్, కో పైలట్ భూమిక బెంగళూరు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి సూర్యకిరణ్ రకం చిన్న శిక్షణ విమానంలో బయలుదేరారు. తిరిగి వస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తి విమానం కుప్పకూలింది. ఇంధనం అంటుకుని కాలిపోయింది. తేజ్‌పాల్, భూమిక ప్యారాచూట్ల సాయంతో దూకి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. తేజ్‌పాల్ వెన్నెముకకు గాయమైంది. విమానం బహిరంగ ప్రదేశంలో కూలడంతో ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. సంఘటన ప్రాంతానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న ప్రజలను నియంత్రించేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. రెండు రోజుల క్రితం బెళగావి జిల్లా సాంబ్రా ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన రెడ్‌బర్డ్ శిక్షణ విమానం వ్యవసాయ క్షేత్రంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అందులోని ఇద్దరు పైలట్లు గాయాలతో బయటపడ్డారు. -
శిక్షణ విమానం క్రాష్ ల్యాండింగ్
కర్ణాటక: సాంకేతిక లోపం కారణంగా శిక్షణ విమానం అత్యవసరంగా దిగింది. ఈ సంఘటన బెళగావిలో జరిగింది. ఇద్దరు పైలట్లతో కలిసి బెళగావి సాంబ్రా విమానాశ్రయం నుంచి రెడ్‌బర్డ్ ఫ్లయింగ్ అకాడమీకి చెందిన చిన్నపాటి శిక్షణ విమానం మంగళవారం ఉదయం 9:30 గంటలకు టేకాఫ్ అయ్యింది. 7 కిలోమీటర్ల దూరం ప్రయాణించాక మారిహళ సమీపంలో సాంకేతి లోపం తలెత్తింది. వెంటనే హొన్నిహళ సమీపంలోని రోడ్డు పక్కనున్న పొలంలో క్రాష్ ల్యాండింగ్ చేశారు. విమానం వేగంగా నేలను తాకడం వల్ల ముందు చక్రాలు, రెక్కలు ధ్వంసమయ్యాయి. ఓ పైలట్‌కు మాత్రం చిన్న గాయాలయ్యాయి. పైలట్‌ను వాయుసేన ఆస్పత్రిలో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు. మారిహళ పోలీసులు, పెద్దసంఖ్యలో జనం విమానం వద్దకు చేరుకున్నారు. -
చల్ చల్ గుర్రం!
పిఠాపురం: గుర్రపు స్వారీ అనేది ఆటవిడుపు, సాహస క్రీడ. ప్రస్తుతం ఇది ట్రెండ్‌గా మారింది. యువతతో పాటు చిన్న పిల్లలు కూడా గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు హార్స్ రైడింగ్‌లో శిక్షణ ఇప్పించి.. వారు గుర్రాలపై స్వారీ చేస్తుంటే.. చూసి ముచ్చటపడుతున్నారు. యువత, చిన్నారుల తల్లిదండ్రుల ఆసక్తికి అనుగుణంగా హార్స్ రైడింగ్ ట్రైనింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 100 మంది 250 గుర్రాల వరకూ పెంచుతున్నారంటే.. గుర్రపు స్వారీపై యువత ఆసక్తి ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రాలు వెలిశాయి. గతంలో గుర్రపు స్వారీ నేర్చుకోవాలంటే పెద్ద పెద్ద నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఓ మోస్తరు పట్టణాల్లోనూ శిక్షణ కేంద్రాలు వెలుస్తున్నాయి. వేసవి కావడంతో యువతతో పాటు చిన్నారులు కూడా గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మానసిక వికాసానికి, శారీరక ఆరోగ్యానికి మేలు గుర్రపు స్వారీ అనేది పలు మానసిక, శారీరక సమస్యలకు సంజీవనిలా పనిచేస్తుంది. పోలియో, పక్షవాతం, మెదడు, వెన్నెముక సమస్యలు, వినికిడి లోపాలు, భావవ్యక్తీకరణ, స్థిమితం కోల్పోవడం వంటి వాటికి చక్కటి చికిత్సగా పనిచేస్తుంది. ముఖ్యంగా మానసిక వికాసం లోపించిన పిల్లలకు మంచి ఫలితాలనిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు గుర్రపు స్వారీ చేయడం వల్ల వారి ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. గుర్రం కళ్లెం పట్టుకోవడం, నిటారుగా కూర్చోవడం, ఆశ్వాన్ని దూమికించడం, ఒకే లయలో ముందుకుసాగడం వంటి చర్యల వల్ల మెదడుకి, శరీరానికి మధ్య సమన్వయం ఏర్పడి మానసిక ఉత్తేజం కలుగుతుందని.. ఫలితంగా అనేక రుగ్మతలు వాటంతట అవే తగ్గిపోతాయని చెబుతున్నారు. గుర్రపు స్వారీకి అనువైన ప్రాంతంగా తీరం గుర్రపు స్వారీ అనేది సాహస క్రీడ. ప్రమాదాలకు ఎక్కువ అవకాశాలున్నాయి. అందుకే ఎలాంటి ప్రమాదాలు జరిగినా రైడర్‌కు ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. గట్టి నేలల్లో ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉండటంతో ఇసుల నేలల్లోనే నేర్పాల్సి ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగా ఇసుకను తెచ్చి వేస్తుంటారు. అలాంటి పరిస్థితి లేకుండా తీర ప్రాంతాల్లో ఉన్న ఇసుక మేటలు గుర్రపు స్వారీలకు అనుకూలంగా ఉండటంతో కాకినాడ తీరం ప్రాంతంలో ఉన్న ఇసుక నేలల్లో గత నెల రోజులుగా గుర్రపు స్వారీ శిక్షణ ఇస్తున్నాము. రోజూ ఉదయం, సాయంత్రం రెండేసి గంటల చొప్పున నేర్పుతున్నాము. – కె.అనిల్‌రెడ్డి, గర్రపు స్వారీ శిక్షకుడు, కాకినాడ చాలా సరదాగా ఉంది.. మా నాన్న ఆడుకునేందుకు నాకు గుర్రపు బొమ్మ కొనిచ్చాడు. ఇది వద్దు.. నిజంగా గుర్రం మీద స్వారీ చేయాలని అడిగేవాడిని. అది ఇప్పుడు నిజమైంది. గుర్రంపై సవారీ చేయడం చాలా సరదాగా ఉంది. ముందు భయమేసినా రానురాను అలవాటైపోయింది. ఇప్పుడు ఏ భయం లేకుండా గుర్రంపై స్వారీ చేస్తున్నా. – ఆరుష్వర్మ, కాకినాడ చిన్ననాటి కల నేరవేరిందిలా.. ఎప్పటి నుంచో గుర్రపు స్వారీ చేయాలన్న కోరిక ఉండేది. శిక్షణ కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటి వరకూ కుదరలేదు. కాకినాడ తీరంలో గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ఆ కోరిక ఇలా తీరింది. గుర్రపు స్వారీ చేయడం చాలా ఆనందంగా ఉంది. శిక్షణ పొందిన గుర్రాలు కావడంతో ఎలాంటి ప్రమాదం లేకుండా నేర్చుకుంటున్నాను. – అభిషేక్, కాకినాడ -
నిఖత్ జరీన్‌కు రూ.2 కోట్లు.. ‘ఒలింపిక్స్’ శిక్షణ కోసం సీఎం కేసీఆర్ సాయం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణపతకాన్ని సాధించి తెలంగాణతోపాటు భారత దేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. నిఖత్ జరీన్‌కు రాబోయే ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. గురువారం సచివాలయంలో నిఖత్ జరీన్, సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు అవసరమైన శిక్షణ, ప్రయాణ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం ముఖ్యమంత్రి రూ.2 కోట్లను ప్రకటించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బాల్క సుమన్, విఠల్ రెడ్డి, సీఎంవో కార్యదర్శి భూపాల్ రెడ్డి, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నిఖత్ జరీన్‌ను సందీప్ కుమార్ సుల్తానియా సచివాలయంలోని తన చాంబర్లో నిఖత్‌కు శాలువా కప్పి సత్కరించారు. చదవండి: లకారం ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్ విగ్రహం.. హైకోర్టు స్టే.. కీలక మార్పులు! -
కర్ర తీసాము అంటే..
పిఠాపురం: కనుమరుగైపోతున్నాయి అనుకుంటున్న కర్రసాము, కత్తిసాము (శిలంభం) అనే ప్రాచీన యుద్ధ కళలు మళ్లీ జీవం పోసుకుంటున్నాయి. పూర్వం యుద్ధాల్లో ఆయుధంగా వాడిన కర్ర, కత్తి.. ఆ తర్వాత వచ్చి న ఆధునిక ఆయుధాలతో యుద్ధ క్షేత్రం నుంచి కనుమరుగయ్యాయి. అయితే కళగానూ ప్రాచుర్యం పొందిన కర్రసాము, కత్తిసాములను గ్రామీణ ప్రాంతాల్లో యువకులు అభ్యసించేవారు. పెళ్లిళ్లు, పండుగలు, ఊరేగింపులు లాంటి సందర్భాల్లో విన్యాసాలు చేస్తుండేవారు. వీటి సాధనకు గ్రామంలో వ్యాయామ శాలలు (తాలింఖానాలు) ఉండేవి. గ్రామీణ ప్రాంతాల్లో కర్ర, కత్తి సాము పోటీలు కూడా నిర్వహించేవారు. రానురాను ఈ కళను నేర్చుకునేవారు తక్కువయ్యారు. అయితే ఇటీవల ఈ కళ పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెరిగింది. కర్ర, కత్తిసాములపై గ్రామ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అంబాజీపేట, అమలాపురం, పిఠాపురం తదితర ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. సుమారు 300 మంది వీటిల్లో శిక్షణ పొందుతున్నారు. కర్రసాములో రకాలు కర్రసాములో ఒంటిబాణా, ఓడిబాణా అనే కర్రలను తిప్పుతూ ఉంటారు. ఇద్దరు పరస్పరం గురిచూసి తిప్పుతూ ఒకరిపై ఒకరు దాడికి యత్నిస్తుంటే దెబ్బ తగలకుండా తప్పించుకోవడం ఇందులో నైపుణ్యం. ఈ సమయంలో వివిధ వాయిద్యాలకు అనుగుణంగా ఈ విద్యను ప్రదర్శిస్తారు. అలాగే కర్రకు నూనెలో తడిపిన గుడ్డ చుట్టి వెలిగించి ఆ మంటలతో కర్రసాము చేస్తూ అబ్బురపరుస్తుంటారు. ఇదే మాదిరిగా కత్తులతోనూ చేసే విన్యాసాలు, ఈ పోరాటాలలో ఎత్తుకు పైఎత్తు వేస్తూ కత్తిని ఎదుటి వారిపై ప్రయోగించడానికి చేసే ప్రయత్నాలు, తప్పించుకుంటూ ప్రత్యర్థిని ఎదుర్కొనే వ్యూహాలు గగుర్పాటు కలిగిస్తాయి. కత్తిసాములో కత్తి, డాలు ధరించి రకరకాలుగా తిప్పుతూ విన్యాసాలు చేస్తారు. ఒక మనిషిÙని కింద పడుకోబెట్టి అతని శరీరంపై వివిధ పళ్లు, కూరగాయలు ఉంచి నరుకుతుంటే చూస్తూ విస్తుపోవాల్సిందే. మనిషి పొట్టభాగంపై తమలపాకు ఉంచి, దానిపై ఓ పలుచని వస్త్రం వేసి ఆ వస్త్రం చిరగకుండా తమలపాకు రెండు ముక్కలయ్యేలా కత్తితో నరకడం అద్భుతంగా ఉంటుంది. పోటీలు ఇలా.. జాతీయ స్థాయిలో కర్రసాము, కత్తిసాము పోటీల్లో పాల్గొంటూ స్థానిక రాష్ట్ర యువకులు పతకాలు సాధిస్తున్నారు. కర్రసాము పోటీలను సింగిల్ స్టిక్, డబుల్ స్టిక్, స్వార్డ్, బల్లెం, సురులు, ఫైట్ అనే ఆరు విభాగాలుగా నిర్వహిస్తున్నారు. జిల్లాల్లో ఈపోటీలను నిర్వహిస్తూ రాష్ట్ర స్థాయి క్రీడాకారులను ఎంపిక చేస్తున్నారు. వీరు జాతీయ స్థాయి పోటీలకు వెళుతున్నారు. విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది కర్రసామును క్రీడగా నేర్చుకోవడానికి విద్యార్థులు ముందుకు వస్తున్నారు. వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొనడానికి ఏపీ టీంను తయారు చేసి మంచి శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటికే చాలా మంది ప్రత్యేక శిక్షణ పొంది జాతీయస్థాయిలో విజేతలయ్యారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లోనూ పోటీలు నిర్వహిస్తున్నాం. విజేతలను జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తాం. – టి అబ్బులు, కర్రసాము శిక్షకుడు, పిఠాపురం రాష్ట్ర స్థాయి స్వర్ణం సాధించాను పిఠాపురంఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాను. చిన్నప్పుడు దేవుడి సంబరాల్లో కర్రసాము చేయడం చూసేదానిని. దానిని నేర్చుకోవాలని ఆసక్తి ఏర్పడి నేర్చుకున్నాను. గతంలో కర్రసాములో రాష్ట్ర స్థాయి స్వర్ణ పతకం సాధించాను. మానసికంగా, శారీరకంగా ఎంతో ఉల్లాసాన్నిచ్చే ఈకళను నేర్చుకోవడం ఆనందంగా ఉంది. – పి నిర్మల, కొండెవరం ఆత్మరక్షణకు ఈ కళను నేర్చుకున్నా నేను ఏడో తరగతి చదువుతున్నాను. ఆత్మ రక్షణలో మెళకువల కోసం కర్రసాము నేర్చుకున్నా. రాష్ట్ర, జిల్లా స్థాయి పోటీలలో పాల్గొన్నాను. కొండెవరంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో రజత పతకం సాధించాను. ఎక్కడ పోటీలు జరిగినా వెళ్లి పతకం సాధించడానికి ప్రయత్నం చేస్తుంటాను. – షేక్ అమీద, పిఠాపురం -
మూడు దఫలుగా హైదరాబాద్ మాడ్యూల్ ప్లాన్
-
అనంతగిరి గుట్టలో షాకింగ్ విషయాలు
-
మైక్రోసాఫ్ట్ గుడ్ న్యూస్: సైబర్ సెక్యూరిటీలో వారికి ప్రత్యేక శిక్షణ
ప్రపంచంలోనే అతి పెద్దఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ మహిళలకు శుభవార్త అందించింది. లక్షమందికి సైబర్ సెక్యూరిటీ శిక్షణను అందించేందుకు ముందుకొచ్చింది. 2025లో ప్రపంచవ్యాప్తంగా 3.5 మిలియన్ల సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలు భర్తీ కావచ్చన్న అంచనాల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానంగా Ready4Cybersecurity ప్రోగ్రామ్, దాని గ్లోబల్ సైబర్‌సెక్యూరిటీ స్కిల్లింగ్ ఇనిషియేటివ్‌లో ఈ శిక్షణను ఇవ్వనుంది. రానున్న ఎనిమిదేళ్లలో సైబర్ సెక్యూరిటీ నిపుణుల డిమాండ్ 350 శాతం పెరగనుంది. దీంతో యువతుల్లో సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలను పెంచేందుకు ప్రయత్నిస్తోంది మైక్రోసాఫ్ట్. శిక్షణ అనంతరం వారికి సర్టిఫికేట్లను ప్రదానం చేయనుంది. సైబర్ సెక్యూరిటీలో ఉపాధి అవకాశాలను పెంపొందించడం, నైపుణ్య విషయంలో అంతరాల్ని పూరించడం, విభిన్న సైబర్ సెక్యూరిటీ వర్క్‌ఫోర్స్‌ను నిర్మించడమే తమ లక్క్ష్యమని సంస్థ పేర్కొంది. (ఇదీ చదవండి: నెలకు రూ.7లక్షలు స్టైఫెండ్: టెక్ సీఈవోలు, ఐపీఎల్ ఆటగాళ్లను మించి .!) మైక్రోసాఫ్ట్ డిజిటల్ డిఫెన్స్ రిపోర్ట్ ప్రకారం, 2022లో పాస్వర్డ్ ఎటాక్ ఘటనలు ప్రతి సెకనుకు 921కు పెరిగింది. కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే ఇది 74శాతం పెరిగింది. తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న సైబర్ దాడులనష్టం 4.35 మిలియన్ల డాలర్లుగా ఉంది. మరోవైపు గ్లోబల్‌గా సైబర్ సెక్యూరిటీ వర్క్‌ఫోర్స్‌లో మహిళలు కేవలం 25 శాతం మాత్రమే ఉన్నందున, వీరిని ప్రోత్సహించేందుకు సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. (Vanisha Mittal Amit Bhatia Love Story: వనీషా...అమిత్ లవ్ స్టోరీ తెలుసా? ఈ లవ్ బర్డ్స్ పెళ్లి ఒక రికార్డ్ )