‘శ్రీ రాముడి’ కోసం రణ్‌బీర్‌ దిమ్మదిరిగే వర్కవుట్‌..వైరల్‌ వీడియో | Ranbir Kapoor Engages In Countryside Fitness Training For Ramayana | Sakshi
Sakshi News home page

‘శ్రీ రాముడి’ కోసం రణ్‌బీర్‌ దిమ్మదిరిగే వర్కవుట్‌.. వైరల్‌ వీడియో

Apr 9 2024 12:45 PM | Updated on Apr 9 2024 2:53 PM

Ranbir Kapoor Engages In Countryside Fitness Training For Ramayana - Sakshi

చాక్లెట్‌ బాయ్‌గా  బాలీవుడ్‌లో  అడుగుపెట్టి.. నటుడుగా తానేంటో నిరూపించుకున్నాడు హీరో రణ్‌బీర్‌ కపూర్‌. ‘యానిమల్‌​‍ మూవీతో టాలెండెట్‌ హీరోగా తెలుగు ఆడియెన్స్‌కు దగ్గరయ్యాడు. తాజాగా రానున్న మరో  ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ ‘రామాయణం’  కోసం  రణ్‌బీర్‌ కపూర్‌ తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. శ్రీరాముడి పాత్ర కోసం జిమ్‌లో తెగ కష్టపడుతున్నాడు.   దీనికి సంబంధించిన  వీడియో ఒకటి ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది. 

రణ్‌బీర్‌  పెర్సనల్‌ ట్రైనర్‌ నామ్  వర్కౌట్ వీడియోను షేర్‌ చేశాడు. స్విమ్మింగ్‌  రన్నింగ్‌, బైక్‌ రైడింగ్‌.. జిమ్ బాల్, కెటిల్‌బెల్స్, జిమ్ రోప్‌లతో వర్క్‌అవుట్లు ఈ వీడియోలో చూడొచ్చు. ప్రశాంతంగా  గ్రామీణ ప్రాంతంలో ట్రెక్కింగ్‌, బైక్‌ రైడింగ్‌, బరువులు ఎత్తడం లాంటి కీలకమైన ఎక్సర్‌సైజ్‌లు చేస్తుండటం గమనార్హం. రణ్‌బీర్‌ సతీమణి, హీరోయిన్‌ అలియా భట్‌,  కూతురు రాహా కూడా  ఉందంటూ ఫ్యాన్స్‌ కమెంట్‌ చేశారు.   

ఏ ప్రాతకోసమైనా పాత్రకు తగ్గట్టు ఒదిగిపోయేలా తీవ్ర కసరత్తులు చేయడం రణబీర్‌కు అలవాటు.  అలా ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులకు మరింత  దగ్గర య్యాడు. తాజా ఆయన వర్కవుట్స్‌ చూసి ఆయనఅంకితభావం అలాంటిది అంటూ ఫ్యాన్స్‌ తెగ పొగిడేస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంతో రానున్న 'రామాయణం' మూవీలో రణబీర్ కపూర్‌ రాముడిగా అలరించ నున్నాడు.  గత ఏడాది రికార్డు కలెక్షన్స్‌ రాబట్టిన యానిమల్‌ మూవీ కోసం కూడా రణ్‌బీర్‌ భారీగా కండలు పెండిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement