హబ్బీతో బేబీమూన్‌కు : భార్య అంటే ఎంత ప్రేమో! వైరల్‌ వీడియో | Deepika Padukone And Ranveer Singh Holding Hands and Jet Off To London For Babymoon | Sakshi
Sakshi News home page

హబ్బీతో బేబీమూన్‌కు : భార్య అంటే ఎంత ప్రేమో! వైరల్‌ వీడియో

Published Thu, Jun 20 2024 1:37 PM | Last Updated on Thu, Jun 20 2024 4:31 PM

Deepika Padukone And Ranveer Singh Holding Hands and Jet Off To London For Babymoon

త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న  బాలీవుడ్‌ హీరో రణవీర్‌ సింగ్‌,  బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే బేబీమూన్‌కోసం లండన్‌కు పయనమయ్యారు. ఇద్దరూ బ్లాక్‌ అండ్‌ వైట్‌ డ్రెస్సులో అందంగా మెరిసారు. విమానాశ్రయంలో దర్శన మిచ్చిన ఈ జంట వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ లవ్‌బర్డ్స్‌ ఇద్దరూ చేతిలో చేయివేసుకుని మరీ కనిపించడం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. అలాగే కారు దిగిన వెంటనే దీపికా వైపు పరుగెత్తుతూ వాహనం నుండి బయటకు వచ్చేందుకు సాయం చేస్తూ, తన భార్యను అపురూపంగా, జాగ్రత్తగా చూసుకుంటున్న తమ అభిమాన హీరోను చూసి ఫ్యాన్స్‌ మురిసి పోతున్నారు.

కాగా తన అప్‌కమింగ్‌ మూవీ  ‘కల్కి 2898 AD’కి సంబంధించిన ముంబైలో జరిగిన  ప్రమోషన్‌ కార్యక్రమంలో దీపికా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ  ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దీపికా పదుకొనే ఫోటోలు కూడా వైరల్‌గా మారాయి.  ప్రభాస్‌ సరసన తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. రానా హోస్ట్ చేసిన ఈ ఈవెంట్‌లో ప్రభాస్‌తోపాటు బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌,నిర్మాత అశ్వినీదత్‌ పాల్గొన్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement