
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే(Deepika Padukone) ప్రస్తుతం మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది. తాజాగా భర్తతో రణ్‌వీర్‌తో కలిసి విమానాశ్రయంలో తళుక్కున మెరిసింది. ఈ సందర్బంగా లవబుల్ కపుల్ ఇద్దరూ మ్యాచింగ్ డ్రెస్‌లో ఫ్యాన్స్‌ను మురిపించారు. ఎప్పటిలాగానే నవ్వుతూ మీడియాకు ఫోజులిచ్చారు.
కుమార్తె దువాకు జన్మనిచ్చిన తరువాత తల్లిదండ్రులుగా జంటగా కనిపించారు. ట్రెండింగ్ వైడ్ లెగ్ జీన్స్, పాప్లిన్ స్లిట్ షర్ట్‌లో చాలా సింపుల్‌గా కనిపించింది. కానీ ఈ డ్రెస్ ధర ఎంతో తెలుసా?
ఎయిర్‌పోర్ట్‌లో నల్ల చారల చొక్కా, ప్యాంట్ చాలా సింపుల్‌గా కంఫర్టబుల్‌గా చిక్ స్టైల్‌తో మెప్పించింది గ్లోబల్ ఐకాన్. లీ మిల్ కలెక్షన్‌కు చెందిన ఈ డ్రెస్ ధర 79,100. దీనికి జతగా సిటిజన్స్ ఆఫ్ హ్యుమానిటీ హై రైజ్ వైడ్ లెగ్ జీన్స్‌ను ధరించింది. దీని ధర సుమారు రూ. 39వేలే. (యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!)
అంతేనా లగ్జరీ ఎలిమెంట్‌ను జోడిస్తూ లూయిస్ విట్టన్ సన్ గ్లాసెస్‌తో తన లుక్‌కి మోడ్రన్ టచ్ ఇచ్చింది. ఇంకా అద్భుతమైన కార్టియర్ శాంటాస్ డి కార్టియర్ వాచ్‌తో రూపాన్ని పూర్తి చేసింది, దీని ధర రూ.3,080,000.
ఇదీ చదవండి: పార్కింగ్ స్థలంలో కంపెనీ : కట్ చేస్తే..యూకే ప్రధానికంటే మూడువేల రెట్లు ఎక్కువ జీతం
Power couple Ranveer Singh and Deepika Padukone turn heads at the Mumbai airport with their effortless style and charm 💕#RanveerSingh #DeepikaPadukone #deepveer #Bollywood #iwmbuzz @RanveerOfficial @deepikapadukone pic.twitter.com/TE2Al4PK7J
— IWMBuzz (@iwmbuzz) January 7, 2025
ఇక రణవీర్ సింగ్ తన జుట్టును పోనీ టైల్‌లో కట్టి, తన క్యాజువల్ బెస్ట్ డ్రెస్‌లో అందరికీ హాయ్ చెప్పాడు. దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ కూతురు దువాతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. ఇటీవల దీపిక 39వ పుట్టినరోజు (జనవరి,5)కు ఈ జంట మాల్దీవుల్లో సెల్రబేషన్స్ ముగించుకొని తిరిగి ముంబై చేరుకున్నారు.
కాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas)తో కలిసి దీపికా కల్కి( Kalki ) సినిమాలో నటించింది. గర్భంతో ఉన్న మహిళగా నటనతో విమర్శకులను సైతం మెప్పించింది. ప్రెగ్నెంట్‌గా ఉన్నపుడే ఈ సినిమాలో నటించడం మాత్రమే కాదు, నిండు గర్భంతో ప్రమోషన్స్‌లో పాల్గొని అందర్నీ మెస్మరైజ్ చేసింది.
ఈ ప్రమోషన్స్‌లో రూ.1.14 లక్షల విలువైన బ్లాక్ డ్రెస్‌తో ఆకట్టుకుంది. Magda రూ.41.500 విలువైన Butrym బ్రాండ్ స్టైలీష్ చెప్పులు ధరించింది. కోటి రూపాయల విలువచేసే బ్రేస్ లేట్ కూడా ధరించిన విషయం తెలిసిందే.