Mumbai airport
-
విమానంలో 322 మంది.. 8 గంటల జర్నీ తర్వాత వెనక్కి!
న్యూఢిల్లీ, సాక్షి: ముంబై-న్యూయార్క్ ఎయిరిండియా విమానం. ఎనిమిది గంటల ప్రయాణం తర్వాత.. ఎలా వెళ్లిందో అలాగే తిరిగి వెనక్కి వచ్చేసింది. దీంతో ప్రయాణికులంతా కంగారు పడ్డారు. మరోవైపు అధికారులు హడావిడిగా వాళ్లందరినీ దించేసి.. బాంబు స్క్వాడ్‌ను పిలిపించి తనిఖీలు చేయించారు. చివరకు తమకు వచ్చిన సమాచారంగా తేల్చారు. 303 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బంది ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 777 విమానం గత అర్ధరాత్రి 2గం. ముంబై నుంచి న్యూయార్క్‌కు బయల్దేరింది. సుమారు 15 గంటల తర్వాత జాన్ ఎఫ్ కెనడీ ఎయిర్‌పోర్టుకు అది చేరుకోవాల్సి ఉంది. అయితే విమానంలో బాంబు ఉందనే సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో అజర్బైజాన్ దాకా వెళ్లిన విమానానికి.. వెనక్కి రప్పించారు.#AirIndia pic.twitter.com/kZ7cEau7sI— NDTV (@ndtv) March 10, 2025ముంబైలో ఈ ఉదయం 10.20 గం. ప్రాంతంలో ఎయిరిండియా విమానం దిగగానే.. ప్రయాణికులను దించేసి బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేయించారు. చివరకు బెదిరింపు కాల్‌గా నిర్ధారించుకున్నారు. రద్దైన విమానం మంగళవారం ఉదయం 5గం. రీషెడ్యూల్ చేసినట్లు ప్రకటించింది. అసౌకర్యానికి ప్రయాణికులకు క్షమాపణ చెప్పిన ఎయిరిండియా.. వాళ్ల భద్రతే తమకు ముఖ్యమని తెలిపింది. ఈ ప్రయాణంలో వాళ్లకు అన్ని రకాల వసతులు కల్పిస్తామని తెలిపింది. మరోవైపు.. ఈ ఘటనపై ఎయిరిండియా ఫిర్యాదుతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
దీపికా స్టైలిష్ డ్రెస్, చూడ్డానికి చాలా సింపుల్ : కానీ ధర తెలిస్తే షాక్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే(Deepika Padukone) ప్రస్తుతం మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది. తాజాగా భర్తతో రణ్వీర్తో కలిసి విమానాశ్రయంలో తళుక్కున మెరిసింది. ఈ సందర్బంగా లవబుల్ కపుల్ ఇద్దరూ మ్యాచింగ్ డ్రెస్‌లో ఫ్యాన్స్‌ను మురిపించారు. ఎప్పటిలాగానే నవ్వుతూ మీడియాకు ఫోజులిచ్చారు.కుమార్తె దువాకు జన్మనిచ్చిన తరువాత తల్లిదండ్రులుగా జంటగా కనిపించారు. ట్రెండింగ్ వైడ్ లెగ్ జీన్స్, పాప్లిన్ స్లిట్ షర్ట్‌లో చాలా సింపుల్‌గా కనిపించింది. కానీ ఈ డ్రెస్ ధర ఎంతో తెలుసా?ఎయిర్‌పోర్ట్‌లో నల్ల చారల చొక్కా, ప్యాంట్ చాలా సింపుల్‌గా కంఫర్టబుల్‌గా చిక్ స్టైల్‌తో మెప్పించింది గ్లోబల్ ఐకాన్. లీ మిల్ కలెక్షన్‌కు చెందిన ఈ డ్రెస్ ధర 79,100. దీనికి జతగా సిటిజన్స్ ఆఫ్ హ్యుమానిటీ హై రైజ్ వైడ్ లెగ్ జీన్స్‌ను ధరించింది. దీని ధర సుమారు రూ. 39వేలే. (యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!)అంతేనా లగ్జరీ ఎలిమెంట్‌ను జోడిస్తూ లూయిస్ విట్టన్ సన్ గ్లాసెస్‌తో తన లుక్‌కి మోడ్రన్ టచ్ ఇచ్చింది. ఇంకా అద్భుతమైన కార్టియర్ శాంటాస్ డి కార్టియర్ వాచ్‌తో రూపాన్ని పూర్తి చేసింది, దీని ధర రూ.3,080,000. ఇదీ చదవండి: పార్కింగ్ స్థలంలో కంపెనీ : కట్ చేస్తే..యూకే ప్రధానికంటే మూడువేల రెట్లు ఎక్కువ జీతం Power couple Ranveer Singh and Deepika Padukone turn heads at the Mumbai airport with their effortless style and charm 💕#RanveerSingh #DeepikaPadukone #deepveer #Bollywood #iwmbuzz @RanveerOfficial @deepikapadukone pic.twitter.com/TE2Al4PK7J— IWMBuzz (@iwmbuzz) January 7, 2025 ఇక రణవీర్ సింగ్ తన జుట్టును పోనీ టైల్లో కట్టి, తన క్యాజువల్ బెస్ట్ డ్రెస్‌లో అందరికీ హాయ్ చెప్పాడు. దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ కూతురు దువాతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. ఇటీవల దీపిక 39వ పుట్టినరోజు (జనవరి,5)కు ఈ జంట మాల్దీవుల్లో సెల్రబేషన్స్ ముగించుకొని తిరిగి ముంబై చేరుకున్నారు. కాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas)తో కలిసి దీపికా కల్కి( Kalki ) సినిమాలో నటించింది. గర్భంతో ఉన్న మహిళగా నటనతో విమర్శకులను సైతం మెప్పించింది. ప్రెగ్నెంట్‌గా ఉన్నపుడే ఈ సినిమాలో నటించడం మాత్రమే కాదు, నిండు గర్భంతో ప్రమోషన్స్‌లో పాల్గొని అందర్నీ మెస్మరైజ్ చేసింది.ఈ ప్రమోషన్స్‌లో రూ.1.14 లక్షల విలువైన బ్లాక్ డ్రెస్‌తో ఆకట్టుకుంది. Magda రూ.41.500 విలువైన Butrym బ్రాండ్ స్టైలీష్ చెప్పులు ధరించింది. కోటి రూపాయల విలువచేసే బ్రేస్ లేట్ కూడా ధరించిన విషయం తెలిసిందే. -
ముంబై ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు
ముంబై: మహారాష్ట్రలోని ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ఎయిర్‌పోర్టును బాంబులో పేల్చివేసేందుకు కుట్ర జరుగుతోందని గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తెలిపాడు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసిన ఆ వ్యక్తి.. ముంబయి నుంచి అజర్‌బైజాన్‌కు వెళ్తున్న విమానంలో పేలుడు పదార్థాలు ఉన్నాయని చెప్పాడు. దీంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే సహార్ పోలీసులను అప్రమత్తం చేసింది. ప్రయాణికుల భద్రత కోసం.. ఎయిర్పోర్ట్ ఆవరణంలో పోలీసులు, అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవటం గమనార్హం. మరోవైపు.. నాగ్‌పూర్-కోల్‌కతా విమానానికి సైతం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో రాయ్‌పూర్ విమానాశ్రయంలో పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి చేశారు. ఇక.. విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. -
Independence Day- 2024: త్రివర్ణాలతో వెలిగిపోతున్న ముంబై ఎయిర్ పోర్టు
దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా పలు నగరాలు అందంగా ముస్తాబయ్యాయి. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. ఈ నేపధ్యంలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఒక అద్భుతమైన వీడియో షేర్ చేశారు. త్రివర్ఱాలతో వెలిగిపోతున్న ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో షేర్ చేశారు.స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విమానాశ్రయాన్ని ఎలా అలంకరించారో ఈ వీడియోలో చూడవచ్చు. విమానాశ్రయం అంతా త్రివర్ణ పతాకాలతో మెరిసిపోతోంది. టెర్మినల్ వెలుపల, లాబీ, లైట్ హౌస్ మొదలైనవన్నీ వెలుగులమయంగా మారాయి.మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గౌతమ్ అదానీ సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో.. ‘మన విమానాశ్రయ టెర్మినల్స్ త్రివర్ణాలతో సగర్వంగా నిలబడి ఉన్నాయి. ఇవి కేవలం తలుపులు మాత్రమే కాదు.. మన దేశ ప్రగతికి ప్రతీకలు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దృఢంగా నిలుస్తామని చెప్పేందుకు, ఉజ్వల భవిష్యత్తుపై ఆశతో కొనసాగేందుకు ఇవి ప్రతీకగా నిలుస్తాయి’ అని పేర్కొన్నారు. విమానాశ్రయంలో పలు స్తంభాలను ఎంత వైభవంగా అలంకరించారో గౌతమ్ అదానీ షేర్ చేసిన వీడియోలలో చూడవచ్చు. ఢిల్లీ తర్వాత దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం ముంబై విమానాశ్రయం. ప్రయాణీకులకు అందించే సౌకర్యాల పరంగా ఈ విమానాశ్రయానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. As our nation celebrates 77 years of freedom, our airport terminals stand tall, wrapped in the proud Tricolour! Far more than just gateways, they symbolise our nation's soaring spirit, resilience and the optimism for a brighter future. @CSMIA_Official pic.twitter.com/66g0DqGYdD— Gautam Adani (@gautam_adani) August 14, 2024 -
నిరుద్యోగంలో రికార్డ్ బ్రేక్: ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల ఉద్యోగాలు సృష్టించామని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. బుధవారం ‘ఎక్స్’ వేదికగా తూర్పార బట్టారు. మంగళవారం ఉదయం ముంబై విమానాశ్రయంలో సరకుల లోడింగ్ కేంద్రం వద్ద చిరు ఉద్యోగాల కోసం వేలాది మంది నిరుద్యోగ యువత క్యూ వరసల్లో నిల్చుని తొక్కిసలాట వంటి పరిస్థితి తలెత్తిన ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రియాంక గుర్తుచేశారు. ‘‘ కొద్దిరోజుల క్రితం ముంబైలో మోదీ మాట్లాడు తూ మేం కోట్లాది మందికి ఉపాధి కల్పించి రికార్డ్‌లు బ్రేక్ చేశామని ఢంకా బజాయించారు. కానీ అదే ముంబైలో చిన్నపాటి ఉద్యోగాల కోసం వేలాదిగా యువత ఆశతో ఎగబడటం మనందరం చూశాం. ఇదే ఏడాది గుజరాత్లో 25 ఉద్యోగాల కోసం ఏకంగా లక్షలాది మంది నిరుద్యోగులు తండోపతండాలుగా తరలిరావడమూ మనందరికీ తెల్సిందే. ఇవన్నీ చూస్తుంటే రికార్డ్‌లు బ్రేక్ అయినట్లు తెలుస్తూనే ఉంది. కానీ ఆ రికార్డ్‌లు నమోదైంది ఉద్యోగాల్లో కాదు నిరుద్యోగంలో. దేశాన్ని తీవ్ర నిరుద్యోగ సమస్య పట్టిపీడిస్తోంది. ఇప్పటికైనా మోదీ ఉత్తమాటలు చెప్పడం మానేసి ఉపాధి అవకాశాలపై దృష్టిపెట్టాలి’’ అని ప్రియాంక నిలదీశారు. -
20వేల జీతం.. జాబ్ కోసం పోటెత్తిన 25వేల మంది నిరుద్యోగులు.. తొక్కిసలాట
ముంబై : ముంబై ఎయిర్ పోర్ట్‌కు నిరుద్యోగులు పోటెత్తారు. 600 ఉద్యోగాలకు అప్లయ్ చేసుకునేందుకు 25 వేల మంది నిరుద్యోగులు తరలివచ్చారు. దీంతో ముంబై ఎయిర్పోర్ట్ నిరుద్యోగులతో కిక్కిరిసిపోయింది. ప్రముఖ ఏవియేషన్ దిగ్గజం ఎయిరిండియా మంగళవారం నిర్వహించిన రిక్రూట్మెంట్ డ్రైవ్ తొక్కిసలాటకు దారితీసింది. ఎయిరిండియాకు మొత్తం 2,200 మంది ఎయిర్ లోడర్లు అవసరం. ప్రస్తుతం 600 మంది ఎయిర్పోర్ట్ లోడర్ల (హ్యాండీమ్యాన్) కోసం ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలకు సుమారు 25వేలమందికి కంటే ఎక్కువ మంది హాజరయ్యారు. అయితే అభ్యర్ధుల్ని ఎంపిక, ఫారమ్‌ల ధరఖాస్తు స్వీకరణలో తీవ్ర ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. జాబ్ అప్లికేషన్ కోసం అభ్యర్ధులు ఎగబడడంతో వారిని కంట్రోల్ చేయలేకపోయినట్లు సమాచారం. దరఖాస్తుదారులు ఆహారం, నీరు లేకుండా గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని, ఫలితంగా వారిలో చాలా మంది అస్వస్థతకు గురైనట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. జీతం రూ.25వేలుఎయిర్పోర్ట్ లోడర్ల జీతం నెలకు రూ.20,000 నుండి రూ.25,000 వరకు ఉంటుంది.అయితే చాలా మంది ఓవర్‌టైమ్ అలవెన్సుల తర్వాత రూ. 30,000 కంటే ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది. ఇక ఈ ఉద్యోగం పొందాలంటే కనీస అర్హతలు తప్పని సరి. శారీరకంగా బలంగా ఉంటే సరిపోతుంది.500 కిలోమీటర్ల దూరం నుంచి ఇక 25వేల మంది అభ్యర్ధుల్లో ఒకరైన బీబీఏ రెండో సంవత్సరం చదువుతున్న ప్రథమేశ్వర్ ఈ ఇంటర్వ్యూ కోసం 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుల్దానా జిల్లాకు నుంచి ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ప్రథమేశ్వర్ మాట్లాడుతూ.. నేను ఎయిర్పోర్ట్ లోడర్ జాబ్‌కు అప్లయ్ చేయడానికి వచ్చాను. ఈ ఉద్యోగానికి రూ.22,500 మాత్రమే ఇస్తారంట అని నిట్టూర్చాడు.ఈ ఉద్యోగం వస్తే చదువు మానేస్తారా అని ప్రశ్నించగా.. ‘ఏం చేస్తాం.. ఇంత నిరుద్యోగం ఉంది.. మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను’ అని బదులిచ్చారు. ప్రస్తుతం నిరుద్యోగులతో కిక్కిరిసిపోయిన ముంబై ఎయిర్ పోర్ట్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
అభిమానం అత్యుత్సాహం
సెలబ్రిటీలకు ఒక్కోసారి అనూహ్య సంఘటనలు ఎదురవుతుంటాయి. అందులో కొన్ని ఆనందాన్ని కలిగిస్తే, మరికొన్ని అసౌకర్యాన్ని కలిగిస్తుంటాయి. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలను నటీనటులు ఎదుర్కొంటుంటారు. అసౌకర్య సంఘటలకు కొందరు నటీనటులు ఆగ్రహానికి గురవడం, అభిమానులపై దురుసుగా ప్రవర్తించడం జరుగుతుంటుంది. మరికొందరైతే అసౌకర్యం అనిపించినా, పైకి మాత్రం చిరునవ్వులు చిందిస్తూ అక్కడ నుంచి త్వరగా బయటపడతారు. సరిగ్గా అలాంటి సంఘటననే నటి రష్మిక మందన్న ఎదుర్కొన్నారు. అసలే ఈ బ్యూటీ నేషనల్ క్రష్ కావడంతో అభిమానుల కంటపడితే ఊరుకుంటారా? చుట్టుముట్టేయరూ.. తాజాగా ఈ భామ విషయంలో అదే జరిగింది. రష్మిక మందన్న తెలుగు, తమిళం, హిందీ అంటూ కాళ్లకు బలపాలు కట్టుకుని విమానాల్లో తిరిగేస్తున్నారు. ఈమె హిందీలో సల్మాన్‌ఖాన్‌కు జంటగా నటిస్తున్న తాజా చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఈ చిత్రం షూటింగ్లో పాల్గొనడానికి ముంబయికి వెళ్లారు. అక్కడ విమానాశ్రయంలో దిగగానే పలువురు అభిమానులు రష్మికను చుట్టు ముట్టారు. వారంతా ఉత్సాహంతో ఆమెతో సెల్ఫీలు తీసుకునే పనిలోపడ్డారు. అందు లో ఒక అభిమాని మాత్రం అత్యుత్సాహంతో రష్మిక మందన్న చేతిని పట్టుకుని సెల్ఫి దిగే ప్రయత్నం చేశాడు. దీంతో ఒక్క క్షణం షాక్‌కు గురైన రష్మికమందన్నా అసహనానికి గురయ్యారు. అయితే దాన్ని బయటకు తెలియకుండా పైకి చిరునవ్వులు చిందిస్తూ అక్కడి నుంచి బయట పడ్డా రు. ఆ వీడియో ఇప్పుడు సా మాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజ న్లు మహానటి కదా అంటూ కాంమెంట్స్ చేస్తున్నారు. -
ఒకే రన్‌వేపై రెండు విమానాలకు అనుమతి ఉందా?
ఎయిర్పోర్ట్ రన్‌వేపై దాదాపు నిమిషంలోపు రెండు విమానాలు ప్రయాణించడం సాధ్యమవుతుందా అంటే అవుననే సమాధానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాతావరణంలో ఎలాంటి విజిబిలిటీ సమస్యలు లేవని నిర్ధారించుకుని షరతులకు లోబడి ఇది సాధ్యపడుతుందని నిబంధనలు చెబుతున్నాయి.ఒకే రన్‌వేపై రెండు విమానాలు ప్రయాణించేలా అనుమతులివ్వాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. ‘ఏటీసీ నియమాల ప్రకారం..వాతావరణంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు లేవని నిర్ధారించుకోవాలి. విజిబిలిటీ సమస్యలు ఉండకూడదు. ప్రత్యేక షరతులకు లోబడి, ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించి మూడు నిమిషాలలోపు రెండు విమాన టేకాఫ్‌లు, రెండు ల్యాండింగ్లకు అనుమతించవచ్చు’అని పీటీఐ తెలిపింది.ముంబై ఎయిర్‌పోర్ట్‌లో..జూన్ 8న 6ఈ 6053 అనే ఇండిగో విమానం ఇందోర్ నుంచి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగాల్సి ఉంది. దాంతో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)ను ల్యాండింగ్ క్లియరెన్స్ కోసం అనుమతించాలని కోరారు. ఏటీసీ సూచనలను అనుసరించి ఇండిగో విమానం ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. ఇదిలాఉండగా, ఎయిర్ఇండియాకు చెందిన ఏఐ657 అనే విమానం అదే సమయంలో ముంబై నుంచి తిరువనంతపురం వెళ్లేందుకు ఏటీసీ టేకాఫ్‌కోసం అనుమతించారు. దాంతో రెండు విమానాలు నిమిషం తేడాతో రన్‌వేపై ప్రయాణించాయి. ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన క్షణాల్లో ఇండిగో విమానం అదే రన్‌వేపై ల్యాండ్ అయింది. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే రెండు విమానాల ప్రయాణికులకు తీవ్ర నష్టం జరిగేదని తోటి ప్యాసింజర్లు తెలిపారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)ని విధుల్లో నుంచి తొలగించి విచారణ జరుపుతోంది.ఇదీ చదవండి: రూ.83 వార్షికవేతనం తీసుకున్న స్టీవ్‌జాబ్స్..!ఇదిలాఉండగా, విమానాశ్రయాల్లో అధిక జనసాంద్రత ఉన్నపుడు ఏటీసీలపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని కొందరు అధికారులు తెలిపారు. ఏటీసీ, సంబంధిత పైలట్లు ఘటనకు సంబంధించి సరైన నిబంధనలు అనుసరించారా లేదా అనే అంశంపై డీజీసీఏ విచారణ జరుగుతుందని చెప్పారు. అధిక జనసాంద్రత కలిగిన విమానాశ్రయాల్లో ముంబై ఎయిర్పోర్ట్ ఒకటి. అక్కడ విమానాలరాకపోకలు ఎక్కువగా ఉంటాయి. విమానాశ్రయంలోని ఆర్డబ్ల్యూ27 అనే రన్‌వేపై గంటకు 46 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయని తెలిసింది.Serious security concern at @CSMIA_Official Mumbai Airport yesterday putting 100s of life at riskWhile @airindia ✈️ was in the process of take off, another 🛬 from @IndiGo6E was allowed to land on same runway@DGCAIndia takes action against #Mumbai ATC official responsible pic.twitter.com/nsJvHZrWTZ— Nikhil Lakhwani (@nikhil_lakhwani) June 9, 2024 -
ముంబైలో తప్పిన విమానాల ఢీ
ముంబై:ఎప్పుడూ రద్దీగా ఉండే ముంబై ఛత్రపతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం తప్పింది. శనివారం విమానాశ్రయంలోని ఓ రన్‌వే పై ఓ వైపు ఎయిర్ఇండియాకు చెందిన విమానం అవుతుండగానే అదే రన్‌వేపై వెనుక ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండ్ అయింది. టేక్ఆఫ్ అవుతున్న విమానం గాల్లోకి ఎగరడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అసలు ఈ ఘటన జరగడానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) కమ్యూనికేషన్ లోపమే కారణమని వెల్లడైంది. ఇండోర్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి పొరపాటున ల్యాండింగ్‌కు అనుమతిచ్చినట్లు తేలింది.ఇండిగో విమానం ల్యాండింగ్‌కు కొన్ని సెకన్ల ముందు ఇదే రన్‌వేపై తిరువనంతపురం వెళ్లాల్సిన ఎయిర్ఇండియా విమానం టేకాఫ్ అయింది. ఎయిర్ఇండియా విమానం గాల్లోకి లేవడం సెకన్లు ఆలస్యమైనా భారీగా ప్రాణ నష్టం జరిగేది. ఈ ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణ ప్రారంభించింది. ఇండిగో విమానం ల్యాండ్ అయ్యేందుకు క్లియరెన్స్ ఇచ్చిన ఏటీసీ ఉద్యోగిని ఇప్పటికే తొలగించారు. -
25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్‌లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
News about Hardeep Singh Nijjar, murder and S Jaishankarభారత్‌లోని అఫ్గనిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్దక్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనపై వ్యక్తిగత దాడులు, నిరంతర పరువునష్టం తన రాజీనామాకు కారణమని ఆమె పేర్కొన్నారు. మహిళా ప్రతినిధిని లక్ష్యంగా చేసుకొని తనపై దాడులు జరిగాయని వార్దక్ అన్నారు.ముంబైలో ఆఫ్ఘనిస్తాన్ కాన్సుల్ జనరల్‌గా ఉండటంతో పాటు న్యూఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్ తాత్కాలిక రాయబారి బాధ్యతలను కూడా జకియా వార్దక్ నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆమె ముంబై విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. దాదాపు రూ 18 కోట్ల విలువైన బంగారాన్ని ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నారు.దుబాయ్ నుంచి భారత్‌కు తన వస్త్రాల్లో తరలించారని, ముమ్మర తనిఖీలు చేయగా ఈ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడిందని అధికారులు పేర్కొన్నారు. ముంబయిలో ఏప్రిల్ 25న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జకియా వార్ధక్ శనివారం తెలిపారు.కాగా వార్ధక్ బంగారాన్నిఅక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు విమానాశ్రయంలో సిబ్బందిని మోహరించారు. ఏప్రిల్ 25న ఆమె తన కుమారుడితో కలిసి ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ నుంచి ముంబయికి చేరుకున్నారు. విమానం దిగిన తర్వాత గ్రీన్ ఛానల్ నుంచి ఎయిర్‌పోర్టు బయటకు వచ్చారు. దౌత్యవేత్త కావడంతో ఆమెును తనిఖీలు చేయలేదు. అయితే, ఎయిర్‌పోర్టు ఎగ్జిట్ వద్ద డీఆర్ఐ అధికారులు ఆమెను అడ్డుకున్నారు. తొలుత స్మగ్లింగ్ ఆరోపణల గురించి ప్రశ్నించగా.. ఆమె వాటిని తోసిపుచ్చారు. అనంతరం ఆమెను గదిలోకి తీసుకెళ్లి మహిళా అధికారులతో తనిఖీలు చేయించగా... ఆమె దుస్తుల్లో ఏకంగా 25 బంగారు కడ్డీలు బయటపడ్డాయి. ఒక్కో కడ్డీ బరువు కేజీ వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బంగారానికి సంబంధించి సరైన పత్రాలను ఆమె సమర్పించకపోవడంతో అధికారులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు.అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. సాధారణంగా ఇలాంటి స్మగ్లింగ్ కేసుల్లో అనుమానితులను వెంటనే అరెస్టు చేస్తారు. అయితే వార్ధక్‌కు దౌత్యపరమైన రక్షణ ఉండటంతో ఆమెను అదుపులోకి తీసుకోలేదు.News about Hardeep Singh Nijjar, murder and S Jaishanka -
25 కిలోల బంగారం స్మగ్లింగ్.. అఫ్గాన్ రాయబారి జకియా రాజీనామా
న్యూఢిల్లీ: రూ.18.6 కోట్ల విలువైన 25 కిలోల బంగారాన్ని దుబాయ్ నుంచి అక్రమ రవాణా చేస్తూ ముంబై ఎయిర్‌పోర్టులో దొరికిపోయిన అఫ్గానిస్తాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్దక్ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె తొలుత ముంబైలో అఫ్గాన్ కాన్సూల్ జనరల్‌గా రెండేళ్లు పనిచేశారు. గత ఏడాది ఇండియాలో అఫ్గాన్ రాయబారిగా బాధ్యతలు చేపట్టారు. గత నెల 25వ తేదీన ముంబై ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు జకియా వార్దక్ నుంచి 25 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆమె బంగారాన్ని దుబాయి నుంచి చట్టవిరుద్ధంగా తరలిస్తూ దొరికిపోయినట్లు వార్తలొచ్చాయి. దౌత్యవేత్త కావడంతో ఈ కేసులో అరెస్టు కాకుండా ఆమె మినహాయింపు పొందారు. అయితే, తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు జకియా వార్దక్ తాజాగా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. తనపై వ్యక్తిగతంగా విమర్శల దాడి జరుగుతోందని, దీనివల్ల విధులు సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నానని, అందుకే రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. -
ముంబై ఎయిర్‌పోర్టులో 12 కోట్ల విలువైన బంగారం, ఐఫోన్లు సీజ్
ముంబై: లోక్‌సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. మొత్తం 20 కేసుల్లో 12.74 కిలోల బంగారాన్ని ముంబై కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారంతోపాటు ఖరీదైన నాలుగు ఐఫోన్లను (15 ప్రో ఫోన్లను) కూడా స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని లోదుస్తులు, వాటర్ బాటిల్స్, బట్టలు, ముడి అభరణాలు, బంగారు కడ్డీలు, శరీరంపై దొంగచాటుగా దాచి తరలిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన బంగారం, ఐఫోన్ల విలువ సుమారు రూ.8.37 కోట్లకుపైమాటే ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు.. ఐదుగురు ప్రయాణికుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.Officials of Mumbai Customs at Chhatrapati Shivaji Maharaj International Airport have seized goods worth a total of Rs 8.37 crores including 12.74 Kg Gold across 20 cases. Gold was found concealed in various forms like gold dust in wax and gold layered cloths, crude jewellery and… pic.twitter.com/4OQlYsATIE— ANI (@ANI) May 4, 2024 -
నూడుల్స్‌లో డైమండ్స్ : ఏం తెలివితేటలు రా అయ్యా!
బంగారం, విలువైన వజ్రాలను అక్రమంగా రవాణా చేసేందుకు కేటుగాళ్లు అనుసరిస్తున్న పద్దతులు అధికారులను సైతం విస్మయపరుస్తున్నాయి. కానీ చివరకుఅధికారుల తనిఖీల్లో అడ్డంగా దొరికి పోతున్నారు. తాజాగా ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ డిపార్ట్మెంట్ కోట్లరూపాయల విలువైన వజ్రాలను, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ముఖ్యంగా నూడుల్స్ ప్యాకెట్లలో డైమండ్స్ దాచిన తీరు హాట్ టాపిక్‌గా నిలిచింది. ముంబైనుంచి బ్యాంకాక్‌కు వెళ్తున్న భారతీయుడు ట్రాలీ బ్యాగ్‌లో నూడుల్స్ ప్యాకెట్లో డైమండ్లను తరలిస్తూ గుట్టుగా అధికారుల కన్నుగప్పాలని చేశాడు. కానీ తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యాడు. రూ.2.02 కోట్ల విలువైన 254.71 క్యారెట్ల నేచురల్ లూజ్ డైమండ్, 977.98 క్యారెట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ లభ్యమయ్యాయి.మరో ఘటనలో కొలంబో నుండి ముంబైకి ప్రయాణిస్తున్న ఒక విదేశీ మహిళను తనిఖీ చేయగా ఆమె లోదుస్తుల లోపల దాచిన 24 క్యారెట్ల గోల్డ్ బిస్కట్లు కనుగొన్నారు. వీటి మొత్తం బరువు 321గ్రాములు. మరో వైపు ఫేస్ మాస్క్‌లోనూ డైమండ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు. దుబాయ్ నుంచి ఇద్దరు, అబుదాబి ఇద్దరు, బహ్రెయిన్ ఇద్దరు, దోహానుఎంచి ఇద్దరు రియాద్ ఇద్దరు మస్కట్ బ్యాంకాక్ ,సింగపూర్ నుంచి ఒక్కొక్కరు చొప్పున 10 మంది అనుమానితులను తనిఖీ చేయగా, రెక్టమ్, ఇతర శరీర భాగాల్లో దాచిన రూ.4.04 కోట్ల విలువైన 6.199 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం గా 13 వేర్వేరు కేసుల్లో రూ.6.46 కోట్ల విలువైన అక్రమ రవాణా బంగారం, డైమండ్స్,తదితరాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు.During 19-21 April, 2024, Airport Commissionerate, Mumbai Customs Zone-III seized over 6.815 Kg Gold valued at Rs. 4.44 Cr & Diamonds valued at Rs. 2.02 Cr total amounting to Rs. 6.46 Cr across 13 cases. Diamonds were found concealed in noodle packets. Four pax were arrested. pic.twitter.com/j5wAPV5jAk— Mumbai Customs-III (@mumbaicus3) April 22, 2024#WATCH | Maharashtra: During 19-21 April, 2024, Mumbai Customs seized over 6.815 Kg of gold valued at Rs 4.44 crores and diamonds valued at Rs 2.02 crores, total amounting to Rs 6.46 crores across 13 cases. Diamonds were found concealed in noodle packets. Four Passengers were… pic.twitter.com/02LzDS1aDZ— ANI (@ANI) April 22, 2024 -
Tamannaah Bhatia: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో మిల్కీ బ్యూటీ (ఫొటోలు)
-
చైనా-పాక్ మధ్య అణు సరుకు రవాణా! వయా భారత్?
ముంబై: భారత సరిహద్దులో ‘అణు’ కలకలం రేగింది. చైనా నుంచి కరాచీ(పాకిస్థాన్) వెళ్తున్న ఓ నౌకను ముంబయి పోర్టులో భారత భద్రతా సిబ్బంది అడ్డుకుంది. అణు కార్యక్రమంలో వినియోగించే సరకును అందులో తరలిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారం మేరకే నౌకను నిలిపివేసినట్లు సమాచారం. జనవరిలోనే ఈ ఘటన జరిగినప్పటికీ.. ఈ వివరాలను శనివారం మీడియాకు వెల్లడించారు కస్టమ్స్ అధికారులు. నౌకను నిలిపివేసిన తర్వాత.. డీఆర్డీవో(Defence Research and Development Organisation) క్షుణ్ణంగా పరిశీలించింది. అందులో ఇటలీలో తయారైన కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ మెషిన్(CNC)ని గుర్తించారు. పొరుగుదేశం తన అణు కార్యక్రమంలో దీనిని వినియోగించే అవకాశాలను తోసిపుచ్చలేమని ఈ సందర్భంగా డీఆర్డీవో వెల్లడించింది. సీఎన్‌సీని కంప్యూటర్ ద్వారా నియంత్రించొచ్చు. అది అత్యంత కచ్చితత్వంతో ఫలితాన్ని ఇస్తుంది. దానిని ద్వంద్వ ప్రయోజనాలకు వినియోగిస్తారు అంటూ డీఆర్డీవో ప్రకటిచింది. గతంలో ఉత్తర కొరియా కూడా తన అణు కార్యక్రమంలో సీఎన్‌సీని ఉపయోగించిందని ఈ సందర్భంగా అధికారులు గుర్తు చేస్తున్నారు. ఇక చైనా నుంచి పాక్‌కు రవాణా అవుతున్న ఇలాంటి మిలిటరీ గ్రేడ్ పరికరాలను స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. 2022లోను ఈతరహా సీజ్ చోటుచేసుకుంది. -
ఐదు గంటలపాటు విమానంలోనే..
ముంబై: సాంకేతిక సమస్యతో ముంబై ఎయిర్‌పోర్టులో నిలిచిపోయిన ఎయిర్ మారిషస్ విమానంలో సుమారు 200 మంది ప్రయాణికులు ఐదు గంటల పాటు బందీలుగా మారారు. చివరికి ఆ విమానాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎయిర్ మారిషస్‌కు చెందిన ఎంకే 749 విమానం శనివారం ఉదయం 4.30 గంటలకు ముంబై విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకోవాల్సి ఉంది. బయలుదేరాల్సిన సమయానికి విమానంలో సమస్య గుర్తించారు. నిపుణులొచ్చి లోపాన్ని సరిచేసినా, ఫలితం లేకపోయింది. చివరికి ఉదయం 10 గంటల సమయంలో సర్వీసును రద్దు చేస్తున్నట్లు పైలట్ ప్రకటించారని బాధిత ప్రయాణికులు చెప్పారు. ఐదు గంటలపాటు తమను కిందికి కూడా దిగనివ్వలేదన్నారు. ఏసీ సరిగ్గా పనిచేయక ఆరోగ్య సమస్యలున్న వారు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని చెప్పారు. ఈ ఘటనపై ఎయిర్ మారిషస్ స్పందించలేదు. -
మానవత్వం.. మంటగలిసిన వేళ, ఎయిరిండియాపై తీవ్ర విమర్శలు
మానవత్వం మంటగలిసింది. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా పరోక్షంగా ఓ ప్రయాణికుడు ప్రాణం పోయేందుకు కారణమైనట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. అమెరికా న్యూయార్క్ నుంచి ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఓ 80 ఏళ్ల ప్రయాణికుడు కుప్పకూలాడు. ఆపై ప్రాణాలొదిలాడు. అయితే ఈ విషాదానికి ముందు ఎయిరిండియా విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ ప్రదేశం నుంచి టెర్మినల్ వరకు సుమారు.1.5 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వచ్చాడు సదరు ప్రయాణికుడు. వయో భారం దృష్ట్యా ల్యాండింగ్ తర్వాత ఎయిరిండియా సిబ్బందిని తనకు వీల్ చైర్ ఇవ్వాలని కోరాడు. కానీ వీల్ చైర్ కొరత ఉండడంతో తాము ఇవ్వలేమని తిరస్కరించారు. చేసేది లేక కిలోమీటర్ దూరం నడుచుకుంటూ టెర్మినల్‌కు చేరుకున్న ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదంతో ప్రయాణికుల పట్ల ఎయిరిండియా సిబ్బంది వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఎయిరిండియా యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అప్పటికే తాము బాధితుడి భార్యకు వీల్ ఛైర్ కేటాయించామని, తనకూ మరో వీల్ ఛైర్ కావాలని కోరడంతో.. ప్రయాణికుల రద్ది కారణంగా వీల్ ఛైర్ ఇచ్చేందుకు కొద్ది సమయం పడుతుందని, అప్పటి వరకు వేచి చూడాలని కోరినట్లు తెలిపింది. కానీ ప్రయాణికుడు మాత్రం తన భార్యతో కలిసి నడుచుకుంటూ టెర్మినల్‌లోకి వచ్చినట్లు వెల్లడించింది. ప్రయాణికుడు టెర్మినల్‌లో స్పృహ కోల్పోయిన వెంటనే ఎయిర్‌పోర్ట్‌కి చెందిన మెడికల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని, నిమిషాల వ్యవధిలో స్థానిక ఆస్పత్రికి తరలిచారు. అప్పటికే ప్రయాణికుడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని ఎయిరిండియా యాజమాన్యం వివరణ ఇచ్చింది. చదవండి👉 : ఎయిరిండియాకు ఏమైంది? ‘వెజ్ మీల్స్‌లో చికెన్ ముక్కలు’! -
ఇండిగో, ముంబై ఎయిర్‌పోర్ట్‌లకు జరిమానా
ముంబై: విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు రన్‌వే పక్కనే నేలపై కూర్చుని భోజనంచేసిన ఘటనలో ఇండిగో విమానయాన సంస్థ, ముంబై ఎయిర్‌పోర్ట్‌పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) ఆగ్రహం వ్యక్తంచేసి జరిమానా విధించాయి. ప్రయాణికుల అసౌకర్యానికి కారణమైన ఇండిగో సంస్థపై రూ.1.5 కోట్ల జరిమానా, ముంబై ఎయిర్‌పోర్ట్‌పై రూ.90 లక్షల జరిమానా విధించాయి. ఒక పౌరవిమానయాన సంస్థపై ఇంతటి భారీ జరిమానా పడటం ఇటీవలికాలంలో ఇదే తొలిసారికావడం గమనార్హం. జనవరి 15వ తేదీన గోవా నుంచి బయల్దేరిన విమానం ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పొగమంచు కారణంగా ఢిల్లీకి బదులు ముంబైలో దిగింది. చాలాసేపు విమానంలోనే వేచి ఉన్న ప్రయాణికులు విసిగిపోయి కిందకు దిగొచ్చి రన్‌వే పక్కనే కూర్చుని భోజనాలు చేశారు. ఈ ఘటనను పౌరవిమానయాన శాఖ సీరియస్‌గా తీసుకుంది. బీసీఏఎస్ అడిగేదాకా ఈ విషయంలో ఇండిగో వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. రన్‌వేపై ప్రయాణికుల కదలికలను నియంత్రించకుండా ముంబై ఎయిర్పోర్ట్ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహించారని డీజీసీఏ ఆక్షేపించింది. -
ముంబై ఎయిర్ పోర్టు, ఇండిగోపై జరిమానా విధింపు
ముంబై విమానాశ్రయానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) రూ.30లక్షలు, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS)రూ.60లక్షల చొప్పున మొత్తం రూ. 90 లక్షల జరిమానా విధించింది. అదేవిధంగా ఇండిగో ఎయిర్ లైన్స్‌పై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(BCAS)రూ.1.20కోట్లు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA)రూ.30లక్షలు మొత్తం 1.50కోట్ల భారీ జరిమానా విధించినట్లు ఒక ప్రకటనలో అధికారులు తెలిపారు. విమానం ఆలస్యంతో ప్రయాణికులు రన్‌వేపై కూర్చుని భోజనం చేసిన ఘటనపై ముంబయి విమానాశ్రయం, ఇండిగో రెండూ బాధ్యులుగా చేస్తూ.. ఈ జరిమానా విధించినట్లు అధికారులు పేర్కొన్నారు. Video of passengers eating on the tarmac at Mumbai Airport | A total of Rs 90 Lakhs fine imposed on MIAL - Rs 60 lakhs by Bureau of Civil Aviation Security (BCAS) and Rs 30 lakhs by DGCA. A total of Rs 1.50 Crores on IndiGo - Rs 1.20 Crores by BCAS and Rs 30 Lakhs by DGCA. https://t.co/vhanRbcC9d — ANI (@ANI) January 17, 2024 ఇటీవల పొగమంచు కారణంగా ముంబై విమానాశ్రయంలో ఇండిగో విమానం ఆలస్యం అయింది. దీంతో ప్రయాణికులు రన్‌వేపైనే వేచి ఉన్నారు. అక్కడే భోజనం కూడా చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. విమానాశ్రయంలో విశ్రాంతి గదులు, రిఫ్రెష్మెంట్లు వంటి ప్రాథమిక సౌకర్యాలను పొందే అవకాశం ఉన్నప్పటికీ ప్రయాణికులను రన్‌వేపైనే ఉంచడంపై కేంద్రం మంత్రిత్వ శాఖ అధికారులు నోటీసులు కూడా జారీ చేసిన సంగతి విదితమే. చదవండి: కాంగ్రెస్ గూటికి ఒడిషా మాజీ సీఎం గమాంగ్ -
రన్‌వేపైనే భోజనం.. ఇండిగోకు నోటీసులు
ముంబయి: ఇండిగో, ముంబయి విమానాశ్రయానికి కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. విమానం ఆలస్యంతో ప్రయాణికులు రన్‌వైపై కూర్చుని భోజనం చేసిన వీడియో వైరల్ కావడంతో అధికారులు స్పందించారు. ఈ ఘటనకు ముంబయి విమానాశ్రయం, ఇండిగో రెండూ బాధ్యులుగా ఉన్నాయని నోటీసులో పేర్కొంది. విమానాశ్రయంలో అవకాశం ఉన్నప్పటికీ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించలేదని మండిపడింది. passengers of IndiGo Goa-Delhi who after 12 hours delayed flight got diverted to Mumbai having dinner just next to indigo plane pic.twitter.com/jGL3N82LNS — JΛYΣƧΉ (@baldwhiner) January 15, 2024 పొగమంచు కారణంగా ముంబయి విమానాశ్రయంలో ఇండిగో విమానం ఆలస్యం అయింది. దీంతో ప్రయాణిికులు రన్‌వేపైనే వేచి ఉన్నారు. అక్కడే భోజనం కూడా చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానాశ్రయంలో విశ్రాంతి గదులు, రిఫ్రెష్మెంట్లు వంటి ప్రాథమిక సౌకర్యాలను పొందే అవకాశం ఉన్నప్పటికీ ప్రయాణికులను రన్‌వేపైనే ఉంచడంపై కేంద్రం మంత్రిత్వ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. విమానం ఆలస్యం కావడంపై ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో కెప్టెన్‌పై ఓ ప్రయాణికుడు చేయిచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర విమానయాన శాఖా మంత్రి సింథియా స్పందించారు. ప్రయాణికులు ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని కోరారు. మంత్రిత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి, విమానాల ఆలస్యంపై ప్రత్యేక నిబంధనలను విడుదల చేశారు. ఆ తర్వాత ముంబయి విమానాశ్రయంలో ప్రయాణికులు రన్‌వేపైనే కూర్చుని భోజనం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: కృష్ణ జన్మభూమి కేసు: మసీదు సర్వేపై సుప్రీంకోర్టు స్టే -
అది ‘డంకీ’ విమానమేనా?.. ఆ పాతిక మంది పరిస్థితి ఏంటో?
ముంబై, సాక్షి: ఎట్టకేలకు.. ఉత్కంఠకు తెరపడింది. భారతీయులతో ఉన్న విమానం స్వదేశానికే తిరిగి చేరుకుంది. మానవ అక్రమ రవాణా అనుమానాల నేపథ్యంలో రొమేనియన్ ఎయిర్సర్వీస్కు చెందిన ఈ విమానాన్ని ఫ్రాన్స్‌లో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే నాలుగు రోజులపాటు విచారణ తర్వాత క్లియరెన్స్ లభించడంతో.. మంగళవారం వేకువ ఝామున ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది ఆ విమానం. ఉదయం 4గం. సమయంలో విమానం ముంబై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంది. మొత్తం ప్రయాణికుల్లో.. 276 మంది స్వదేశానికి చేరారు. అయితే.. పాతిక మంది ఫ్రాన్స్‌లోనే ఉండిపోయారు. ఇందులో 20 మంది పెద్దలు, ఐదుగురు మైనర్లు ఉన్నట్లు సమాచారం. వాళ్ల పౌరసత్వ గుర్తింపు తేలకపోవడంతోనే నిలిపివేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. వీళ్లను శరణార్థులుగా పరిగణిస్తామని.. ఫ్రాన్స్ అంతర్జాతీయ చట్టాల ప్రకారం వాళ్లను వెనక్కి పంపడం కుదరని చెబుతున్నారు వాళ్లు. Maharashtra | Visuals of the passengers who arrived in Mumbai today, after the plane they were travelling in was grounded in France for four days over suspected human trafficking pic.twitter.com/IKOKiJUeYN — ANI (@ANI) December 26, 2023 అది డంకీ విమానమేనా? ఏదైనా సరిహద్దులను అక్రమంగా దాటేందుకు ప్రయత్నించే వారిని డంకీ అని పిలుస్తారు. ఈమధ్యే షారూఖ్ ఖాన్ డంకీ సినిమా అదే కాన్సెప్ట్‌తో వచ్చింది. ప్రస్తుతం ఆ పదం ట్రెండింగ్‌లో ఉండడంతో.. ఆ విమానం డంకీ విమానమేనంటూ చర్చ నడుస్తోంది. వాళ్ల పరిస్థితి ఏంటి? ఫ్రాన్స్ మీడియా చానెల్స్ కథనం ప్రకారం.. మొత్తం 303 భారతీయ ప్రయాణికుల్లో 11 మంది మైనర్లు ఎవరి సాయం లేకుండానే ప్రయాణిస్తున్నట్లు అక్కడి అధికారులు గుర్తించారట. వీళ్లలో భారతీయ పౌరసత్వం గుర్తింపు ఉన్నవాళ్లను మాత్రమే వెనక్కి పంపినట్లు తెలుస్తోంది. వీళ్లను తరలిస్తున్న ఇద్దరు ప్రధాన నిందితుల్ని సైతం అక్కడి దర్యాప్తు ఏజెన్సీలు విచారిస్తున్నాయి. ఈ ఘటనపై అటు ఫ్రాన్స్.. ఇటు భారత అధికార వర్గాలు స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. #WATCH | Maharashtra | Plane with Indian passengers that was grounded in France for four days over suspected human trafficking arrived in Mumbai, earlier today (Outside visuals from Chhatrapati Shivaji Maharaj International Airport) pic.twitter.com/OIMPO0c4Hx — ANI (@ANI) December 26, 2023 ఏం జరిగిందంటే.. రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్‌లైన్స్ ఏ340 ఛార్టర్ విమానం 303 మంది ప్రయాణికులతో డిసెంబర్ 23వ తేదీన యూఏఈ(దుబాయ్) నుంచి నికరాగువాకు బయల్దేరింది. ఇంధనం కోసం ప్యారిస్‌కు 160 కిలోమీటర్ల దూరంలో ఉండే వ్యాట్రి(Vatry) ఎయిర్‌పోర్ట్‌లో ఆగింది. అయితే అప్పటికే మనుషుల్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం అందడంతో.. ఫ్రాన్స్ పోలీసులు రంగంలోకి దిగారు. విమానాన్ని ఎయిర్‌పోర్టులోనే ఆపేసి.. ఇద్దరి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారించారు. మరోవైపు భారత అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఇంకోవైపు ఈ నాలుగు రోజులపాటు ప్రయాణికులందరికీ అక్కడే బస ఏర్పాట్లు చేశారు. ఈ తరలింపు వెనుక.. మనుషుల్ని అక్రమంగా పలు దేశాలకు పంపించే కరడుగట్టిన ముఠా హస్తం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఫ్రాన్స్ నేర పరిశోధన నిఘా సంస్థ జునాల్కో దర్యాప్తు చేస్తోంది. భారత్ నుంచి వీళ్ల ప్రయాణం అసలు ఎలా మొదలైంది? ఎలా దుబాయ్‌కి చేరారు? అనే విషయాలపైనా స్పష్టత రావాల్సి ఉంది. ఫ్రాన్స్ చట్టాల ప్రకారం.. నేరం గనుక రుజువు అయితే 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడుతుంది. ఇన్నిరోజులు అదుపులోనా? ఫ్రాన్స్ చట్టాల ప్రకారం.. అక్కడి నేలపై అడుగుపెట్టిన ఒక విదేశీయుడ్ని ఏమైనా అనుమానాలు ఉంటే అక్కడి భద్రతా బలగాలు నాలుగు రోజుల పాటు తమ అదుపులో ఉంచుకోవచ్చు. అక్కడి కోర్టులు గనుక అనుమతిస్తే.. మరో ఎనిమిది రోజులు, అసాధారణ పరిస్థితుల్లో ఇంకో ఎనిమిది రోజులు.. గరిష్టంగా 26 రోజులపాటు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టవచ్చు. అక్రమంగా వెళ్లే క్రమంలో? అక్రమంగా దేశాల్ని తరలించే ఉద్దేశంతోనే వీళ్లను తీసుకెళ్తున్నారా? అనే కోణం ఈ కేసులో బలపడుతోంది. తొలుత వీళ్లను మధ్య అమెరికాకు చేర్చి.. అక్కడి నుంచి అమెరికా లేదంటే కెనడాకు అక్రమంగా ప్రవేశిస్తారేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ప్రయాణికుల్లో భారతీయులు ఎంతమంది అనేదానిపై కూడా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆందోళన కలిగించే అంశమే! ఇదసలు అక్రమంగా మనుషుల్ని తరలించడమేనా?. ఒకవైపు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోకి అక్రమ చొరబాట్లు.. శరణార్థుల సంఖ్య పెరిగిపోతున్న వేళ ఈ విమానం మధ్య అమెరికా దేశం నికరాగువాకు వెళ్తుండడం ఆ అనుమానాల్ని బలపరుస్తోంది. అమెరికా కస్టమ్స్ & బార్డర్ ప్యాట్రోల్(CBP) గణాంకాల ప్రకారం.. అమెరికాలోకి అక్రమంగా చొరబడుతున్న భారతీయుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. 2023 సంవత్సరానికిగానూ ఆ సంఖ్య 96,917 మందిగా నమోదు అయ్యింది. గతేడాదితో పోలిస్తే ఇది 52 శాతం పెరుగుదల కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. -
జోరు వానలో ల్యాండింగ్.. ముంబైలో విమాన ప్రమాదం
సాక్షి, ముంబై: నగరంలోని ఎయిర్‌పోర్ట్‌లో గురువారం ఓ ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదానికి గురైంది. భారీ వర్షంలో ల్యాండింగ్ కోసం ప్రయత్నించగా.. అది రన్‌వే నుంచి జారి పక్కకు ఒరిగింది. ఈ ప్రమాదంలో విమానంలోని ముగ్గురు గాయపడగా.. ఆస్పత్రికి తరలించారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వే 27పై ఈ ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ సమయంలో విమానంలో మొత్తం ఎనిమిది మంది(ఇద్దరు సిబ్బందిసహా) ఉన్నారని సమాచారం. వాళ్లలో గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించినట్లు అత్యవసర సేవల విభాగం వెల్లడించింది. అయితే వాళ్లకు ఏ తీవ్రత మేర గాయాలు అయిన విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ప్రమాదానికి గురైన విమానం.. బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ వీఎస్ఆర్ వెంచర్స్‌కు చెందిన లియర్‌జెట్45 విమానంగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి విమానం ముంబైకి చేరుకున్న క్రమంలోనే ప్రమాదానికి గురైనట్లు విమానాశ్రయం అధికారులు తెలిపారు. కెనడాకు చెందిన బాంబార్డియర్ ఏవియేషన్ సంస్థ తొమ్మిది సీట్ల కెపాసిటీ ఉన్న లియర్‌జెట్ విమానాలను ఉత్పత్తి చేస్తోంది. Breaking! A private plane skidded off the runway and crashed while landing at #MumbaiAirport amid #heavyrain. Efforts have been started to rescue the people trapped in the plane. I pray for their safety.#Emergency #MumbaiRains #Mumbai #PAKvSL #ElvishYadav #TeJran pic.twitter.com/oglq2JuHOH — Lokesh (@Lokesh_2020V) September 14, 2023 -
Cyclone Biparjoy: రాకాసి అలలు.. అంతటా హైఅలర్ట్
ముంబై/ అహ్మదాబాద్: తీవ్ర తుపాను కాస్త అతితీవ్ర తుపాన్‌గా మారే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అరేబియా సముద్రంలో మొదలైన బిపర్జోయ్ తుపాను మహోగ్ర రూపం దాల్చి దిశ మార్చుకుంటోంది. గుజరాత్ వైపు దూసుకెళ్తోంది తుపాను. అయితే తుపాను ప్రభావంతో తీరంలో అలలు ఎగసిపడుతుండగా.. భారీగా ఈదురు గాలులు, వర్షం ముంబై నగరాన్ని ముంచెత్తుత్తోంది. ముంబై ఎయిర్‌పోర్టులో ఆదివారం సాయంత్రం నుంచి ఆందోళన వాతావరణం కనిపిస్తోంది. ప్రతికూల పరిస్థితుల కారణంగా విమానాల రాకపోకలకు అవాంతరం ఏర్పడుతోంది. ప్రయాణికులు గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు విమానలు రద్దు అయినట్లు తెలుస్తోంది. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉరుములు.. మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక బిపర్జాయ్ తుపాన్ గుజరాత్ వైపు వేగంగా వెళ్తోంది. జూన్ 15వ తేదీన గుజరాత్ తీరాన్ని తాకనుంది. గుజరాత్ తో పాటు కర్ణాటక, గోవాల్లోనూ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోనూ వర్షాలుండ్చొని అంచనా వేస్తోంది. సముద్రమంతా అల్లకల్లోలంగా మారింది. ద్వారక వద్ద రాకాసి అలలు భయపెడుతున్నాయి. జూన్ 15వ తేదీ వరకూ మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఐఎండీ, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు హెచ్చరించాయి. గుజరాత్ లోని మాండవి- పాకిస్థాన్ లోని కరాచీల మధ్య బిపోర్ జాయ్ తీరందాటనున్న నేపథ్యంలో సమీప ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. తీరాన్ని తాకే సమయంలో తీరంవెంబడి 125 నుండి 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటిదాకా అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాన్లలో ఇది రెండవ బలమైన తుపానుగా పేర్కొంది. మరోవైపు బిపర్జోయ్ ఎఫెక్ట్‌తో బీచ్‌లో సముద్రం ముందుకు దూసుకొచ్చిన వీడియో ఒకటి వైరల్ అవుతుండగా.. అది అధికారికంగా బిపర్జోయ్దేనా ధృవీకరణ కావాల్సి ఉంది. Cyclone Biporjoy in Gujarat: દરિયાકિનારે પ્રિ-તોફાન શરુ, લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી... | Gujarat Tak https://t.co/gF6v28jDIA — Gujarat Tak (@GujaratTak) June 12, 2023 As the #CycloneBiparjoy is frowning to hit on Gujarat coast on 15th June, let's know the name of cyclones to thwack impending. https://t.co/AeOQBtWG3t#CycloneBiparjoy#Cyclone #CycloneAlert #CycloneBiporjoy #CycloneBiparjoyUpdate #scicomm #Cyclones #tropicalcyclones pic.twitter.com/AwLMcMpZ4z — TUHIN SAJJAD SK (@TUHINSAJJADSK1) June 12, 2023 🚨 This video depicts Ganpatipule Beach in Ratnagiri during the occurrence of Cyclone Biparjoy. The intensity of the sea waves is extremely High.#CycloneBiperjoy #viral2023 pic.twitter.com/tfWGQABUzK — Top Notch Journal (@topnotchjournal) June 11, 2023 -
వేకేషన్ నుంచి తిరిగొచ్చిన ఐకాన్ స్టార్.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ అల్లు అర్జున్ - స్నేహారెడ్డి జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంట ఎక్కడికెళ్లినా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో టచ్‌లో ఉంటారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాస్త విరామం దొరికితే చాలు విదేశాల్లో వాలిపోతుంటారు. ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్ వెళ్లిన బన్నీ తాజాగా ఇండియాకు తిరిగొచ్చారు. తన భార్య స్నేహా రెడ్డితో కలిసి ముంబయి విమానాశ్రయంలో కనిపించారు. (ఇది చదవండి: నాలుగున్నరేళ్లుగా నటుడితో సహజీవనం.. మీరిక పెళ్లి చేసుకోరా?) టాలీవుడ్ జంట ఎయిర్‌పోర్ట్‌లో స్పెషల్ లుక్‌లో కనిపించారు. వీరిద్దరిని చూసిన నెటిజన్స్ స్టైలిష్ కపుల్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న పుష్ప- 2: ది రూల్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తోంది. పుష్ప పార్ట్ 1 సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రంలో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే పుష్ప-2 షూటింగ్లో బన్నీ జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: ఎన్టీఆర్ కోసం ఎవరూ ఊహించని హీరోయిన్!) ICON star @alluarjun and #AlluSnehaReddy at Mumbai airport Bunny boy looks 😎😍#Pushpa2TheRule pic.twitter.com/YoPTySfKyx — Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) June 7, 2023 #TFNExclusive: AA slays in Black🖤 Icon Star @alluarjun along with his wife #AlluSnehaReddy get papped at Mumbai airport!!😎#AlluArjun #Pushpa2TheRule #TeluguFilmNagar pic.twitter.com/rkVKbbpj4A — Telugu FilmNagar (@telugufilmnagar) June 7, 2023 -
కొత్త అవతారం లో హీరో ధనుష్ దాని కొససామేనా..!
-
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో ధనుష్.. షాకింగ్ లుక్
వైవిధ్యభరితమైన సినిమాలతో, విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో ధనుష్. కోలీవుడ్ హీరో అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఆయనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. రీసెంట్ సార్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న ధనుష్ ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ కోసం డిఫరెంట్ మేకోవర్‌లో కనిపించనున్న ధనుష్ ఇందుకోసం తన లుక్‌ని పూర్తిగా మార్చేశాడు. కొత్త గెటప్‌లో కనిపించి అందరినీ షాక్‌కి గురిచేశాడు. ముంబై ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమైన ధనుష్ పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో గుర్తుపట్టలేకుండా మారిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ధనుష్ లుక్‌ని పలువురు బాబా రామ్‌దేవ్‌తో పోలుస్తున్నారు. అచ్చం ఆయనలాగే ఉన్నారని, ధనుష్ అని గుర్తుపట్టడం కూడా కష్టంగా మారిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ముంబై ఎయిర్ పోర్ట్ లో సినీ నటి తమన్నా భాటియా
-
ముంబై ఎయిర్ పోర్ట్‌లో శోభిత ధూళిపాళ సందడి
-
ముంబై ఎయిర్ పోర్ట్‌లో రష్మిక, బెల్లంకొండ శ్రీనివాస్ సందడి
-
చాలా రోజుల తర్వాత జంటగా కనిపించిన పూరి జగన్నాథ్-ఛార్మీ
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మీ పేర్లు లైగర్ సినిమా ప్రమోషన్స్ సమయంలో పాన్ ఇండియా రేంజ్లో వినిపించాయి. కానీ ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. ఛార్మీ అయితే కొన్నాళ్ల పాటు సోషల్ మీడియా నుంచి కూడా దూరంగా ఉంది. ఇప్పటికీ ఆమె నెట్టింట అంతగా యాక్టివ్‌గా కనిపించడం లేదు. లైగర్ రిలీజై సుమారు 6-7 నెలలు అయినా నిమా ఫంక్షన్లు, పార్టీలు ఇలా బయట కూడా వీరు అంతగా కనిపించలేదు. అలాంటిది తాజాగా ఛార్మీ-పూరీలు ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా లైగర్ అనంతరం విజయ్‌తో అనౌన్స్ చేసిన ‘జనగణమన’ ప్రాజెక్ట్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పూరి జగన్నాథ్ కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. మరి త్వరలోనే ఏదైనా ప్రాజెక్ట్ గురించి కబురు చెబుతారేమో చూడాలి మరి. -
వలపు వలలో చిక్కి రూ.28 కోట్ల కొకైన్ స్మగ్లింగ్.. చివరకు..
ముంబై: ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఓ భారీ స్మగ్లింగ్‌ను నిలువరించారు. ఓ వ్యక్తి నుంచి రూ.28 కోట్లు విలువ చేసే కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతను బ్యాగులో దీన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. బ్యాగును చింపి కొకైన్‌ను బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. #WATCH | Mumbai Airport Customs y'day arrested an Indian pax carrying 2.81 Kg cocaine worth Rs 28.10 Cr, concealed in a duffle bag. Probe shows that pax was lured to carry drugs by persons whom he met only over social media. He was honey trapped to indulge in smuggling: Customs pic.twitter.com/oCxBG5F2CP — ANI (@ANI) January 10, 2023 ఈ వ్యక్తి బ్యాగులో మొత్తం 2.81కిలోల కొకైన్ దొరికింది. దీని విలురు రూ.28.10 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఈ వ్యక్తి ఓ మహిళ వలపు వలలో చిక్కుకునే స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో పరిచయమైన మహిళ, ఇతడ్ని కొకైన్ ఢిల్లీకి తీసుకెళ్లి మరో వ్యక్తికి ఇవ్వమని చెప్పిందని పేర్కొన్నారు. ఆమె మాయలో పడిన ఇతడు స్మగ్లింగ్ చేసేందుకు సిద్ధమైనట్లు వివరించారు. గతవారం కూడా ముంబై విమానాశ్రయంలో రూ.47 కోట్లు విలువ చేసే కొకైన్, హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి 4.47 కేజీల హెరాయిన్, 1.6 కిలోల కొకైన్‌ను పట్టుకున్నారు. చదవండి: ఆటోను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి -
Video: బాప్రే..! డ్రెస్ బటన్లలో కొకైన్.. రూ. 47 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
ముంబై విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రెండు వేర్వేరు కేసుల్లో ఏకంగా 47 కోట్ల విలువైన మత్తుపదార్థాలను అధికారులు సీజ్ చేశారు.. ఈ కేసులోని ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. ముంబై ఎయిర్‌పోర్టు కస్టమ్స్ జోనల్ యూనిట్ అధికారులు శుక్రవారం విమనాశ్రయంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ. 31.29 కోట్ల విలువగల 4.47 కిలోల హెరాయిన్.. అలాగే 15.96 కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేస్తున్నారు. ఇద్దరు ప్రయాణికుల నుంచి ఈ మొత్తం పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నుంచి కెన్యాలోని నైరోబీ మీదుగా ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఓ వ్యక్తిని చెక్ చేయగా.. 4.47 కిలోగ్రాముల హెరాయిన్‌తో పట్టుబడినట్లు తెలిపారు. పాలిథిన్ కవర్లలో ప్యాక్ చేసిన హెరాయిన్‌ను 12 డాక్యుమెంట్ ఫోల్డర్ల కవర్లలో చాకచక్యంగా దాచిపెట్టి తీసుకొచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. పట్టుబడిన డ్రగ్స్ మార్కెట్ విలువ దాదాపు రూ.31.29 కోట్లుగా అంచనా వేస్తున్నారు మరో కేసులో.. ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో వచ్చిన ఓ వ్యక్తి లగేజ్ స్కాన్ చేయడంతో అనుమానాస్పద బటన్లు కనిపించాయి. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని తనిఖీలు చేపట్టగా.. కుర్తా బటన్లు పక్కపక్కనే ఉండి ఎక్కవ సంఖ్యలో ఉన్నట్లు గుర్తించారు. బట్లను తీసి పరిశీలించగా 1.59 కిలోగ్రాముల కొకైన్ లభించింది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టంలో ప్రకారం ఇద్దరిపై కేసు నమోదు చేశారు. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. చదవండి: ఇన్‌స్టాలో మైనర్‌తో పరిచయం.. యువకుడిపై దాడి.. ట్విస్ట్ ఏంటంటే! #Mumbai customs department has arrested an Indian passenger at #Mumbaiairport while smuggling #Cocaine worth ₹16crore from Addis Ababa to Mumbai. The drugs were ingeniously concealed in the buttons of ladies kurtas, bags by creating false cavities@mumbaicus3 @htTweets @HTMumbai pic.twitter.com/bCTYqOL2Lm — Vijay Kumar Yadav (@vijaykumar1927) January 6, 2023 -
గోవా వీడియో లీక్ తర్వాత తొలిసారి కనిపించిన తమన్నా- విజయ్
హీరోయిన్ తమన్నా ప్రేమ వ్యవహారం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇన్నేళ్ల సినీ కెరీర్లో ఇంతవరకు తమన్నాపై ఎలాంటి రూమర్స్ లేవు. అలాంటిది నటుడు విజయ్ వర్మను ముద్దుపెట్టుకుంటున్న వీడియో బయటకు రావడంతో అది టాక్ ఆఫ్ టౌన్‌గా మారింది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా గోవాలో ముద్దు పెట్టుకుంటూ కెమెరాలకు చిక్కారు. దీంతో ఆ వీడియో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇప్పటివరకు ఈ పుకార్లపై విజయ్, తమన్నాలు స్పందించలేదు. ఇదిలా ఉంటే న్యూఇయర్ సెలబ్రేషన్స అనంతరం వీరిద్దరూ ముంబైకి చేరుకున్నారు. మొదటగా ఎయిర్‌పోర్టుకు తమన్నా రాగా, ఆ వెంటనే విజయ్ కూడా కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
చాయ్, సమోసా రూ.490.. షాకవుతున్న నెటిజన్లు..!
వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరికీ టీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమందికి ఉదయం లేవగానే టీ తాగాల్సిందే లేదంటే ఏం తోచదు. ఇంట్లో అయినా, బయట అయినా రోజుకు నాలుగు కప్పుల టీ అయినా లాగించేస్తుంటారు. ఇక చాయ్, సమోసా ఆ కాంబినేషనే వేరు. చాలా మంది టీ తాగిన తర్వాత స్నాక్స్‌లా సమోసా తింటుంటారు. సాధారణంగా వీటి ధర కూడా ఎంతనుకున్న రూ. 50కు మించదు. అయితే ముంబై ఎయిర్‌పోర్ట్‌లో మాత్రం ధరలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ముంబై ఎయిర్‌పోర్టులో రెండు సమోసా, ఒక చాయ్, ఒక వాటర్ బాటిల్ కొనుగోలు చేసినందుకు రూ. 499 బిల్ వేశారు.. ఈ విషయాన్ని ప్రముఖ జర్నలిస్టు ఫరా ఖాన్ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. డిసెంబర్ 28న రెండు ఫోటోలను షేర్ చేస్తూ.. ముంబై చత్రపతి శివాజి మహారాజ్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టులో రెండు సమోసాలు, ఒక కప్ టీ, ఒక వాటర్ బాటిల్ ధర 490’ గా పేర్కొంది. దీనికి ‘మంచి రోజులు వచ్చాయి’ అనే క్యాప్షన్ పెట్టింది. అయితే 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో 'అచ్ఛే దిన్ ఆనే వాలే హై' (మంచి రోజులు రాబోతున్నాయి' అని మోదీ చేసిన నినాదాన్ని గుర్తు చూస్తూ వ్యంగ్యంగా జర్నలిస్ట్ ఈ విధంగా క్యాప్షన్ జోడించింది. Two samosas, one chai and one water bottle for 490 Rs at Mumbai airport!! Kafi ache din aa gae hain. #Vikas pic.twitter.com/aaEkAD9pmb — Farah khan (@farah17khan) December 28, 2022 ఇందులో ఇందులో సాధారణ సైజ్ కలిగిన రెండు సమోసాలు ఒక చాయ్ కప్పు కనిపిస్తోంది. చాయ్ సమోసాపై చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిలియన్ వ్యూస్ రావడమే కాకుండా వేలల్లో లైక్‌లు వచ్చి చేరుతున్నాయి. అయితే ఈ పోస్టు చూసిన నెటిజన్లు ‘ముంబై కండివాలీ రైల్వే స్టేషన్లో 52 రూపాయలకు రెండు సమోసాలు, ఒక చాయ్, ఒక వాటర్ బాటిల్ దొరుకుతుంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరొకొందరు ‘ఏంటి విమానశ్రయంలో రెండు సమోసా, ఒక చాయ్, ఒక వాటర్ బాటిల్ రూ.490నా’ అంటూ షాక్ అవుతున్నారు. చదవండి: ‘ముంబై మహారాష్ట్రదే.. ఎవడబ్బ సొత్తు కాదు’ -
హైదరాబాద్ నుంచి బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం..
ముంబై: శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ బయలుదేరిన ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం తలెత్తటంతో విమానాన్ని అత్యవసరంగా ముంబైలో ల్యాండింగ్ చేశారు అధికారులు. విమానంలోని యెల్లో హైడ్రాలిక్ సిస్టమ్ పని చేయకపోవడంతో ముంబైకి మళ్లించినట్లు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్(డీజీసీఏ) అంధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి దుబాయికి శనివారం సాయంత్రం 143 మంది ప్రయాణికులతో బయలుదేరింది ఎయిరిండియా ఏ320 వీటీ-ఈఎక్స్‌వీ విమానం. సాంకేతిక సమస్యను గుర్తించి ముంబైకి మళ్లించారు. ముంబై విమానాశ్రయంలో సుపరక్షితంగా ల్యాండ్ అయినట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. విమానంలో ఏర్పడిన సమస్యను సంబంధిత సిబ్బంది పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. అయితే, సాంకేతిక సమస్యల కారణంగా విమానాలు దారి మళ్లించడం కొత్తేమీ కాదు. డిసెంబర్ 2వ తేదీన కన్నూర్ నుంచి దోహా వెళ్తున్న ఇండో విమానం 6ఈ-1715ని ముంబైకి మళ్లించారు. ప్రయాణికులను మరో విమానంలో గమ్యం చేర్చినట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: మధుమేహం పెరుగుదలలో చైనా, భారత్ పోటాపోటీ -
Mumbai: సర్వర్ క్రాష్.. చుక్కలు చూసిన ప్రయాణికులు
ముంబై: విమానాశ్రయంలో సర్వర్ క్రాష్.. ప్రయాణికులకు చుక్కలు చూపించింది. కంప్యూటర్లు పని చేయకపోవడంతో.. మ్యానువల్‌గా చెక్ఇన్లను చేయడంతో భారీగా ప్రయాణికులు క్యూ కట్టారు. దీంతో.. ఫ్లైట్ టేకాఫ్ షెడ్యూల్లో మార్పులు కనిపించాయి. బుధవారం ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని రెండవ టెర్మినల్స్ నుంచి విదేశీ విమానాలు ఆలస్యం అయ్యాయి. కంప్యూటర్ సిస్టమ్ క్రాష్ కావడంతో.. చెక్ఇన్ ప్రాసెస్ మ్యానువల్‌గా జరిగింది. దీంతో 40 నిమిషాలపాటు ఈ అంతరాయం నెలకొన్నట్లు తెలుస్తోంది. క్యూలో నిలబడిన కొందరు.. సోషల్ మీడియాలో అక్కడి పరిస్థితులను అప్డేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ టెర్మినల్ నుంచి విదేశీ విమానాలే కాదు.. స్వదేశీ విమానాలు కూడా సర్వీసులు నడిపిస్తుంటాయి. System crash at #MumbaiAirport @airindiain #allairlines Crazy crowd and long queues. Expect delayed flights and more… pic.twitter.com/3ImGgmjUYy — Kiwi (@kiwitwees) December 1, 2022 The sheer timing of you placing your bag for check in and all systems going down at that exact moment at Mumbai Airport @CSMIA_Official! 😶 Complete standstill and this is how we begin the weekend! — Ritu Mittal Mukherjee (@ritu__mukherjee) December 1, 2022 ఇదిలా ఉంటే.. ఎయిర్ ఇండియా ఈ పరిస్థితిపై ట్వీట్ చేసింది. అంతరాయాన్ని తగ్గించేందుకు తమ బృందం ప్రయత్నిస్తోందంటూ పేర్కొంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ తర్వాత ముంబై విమానాశ్రయం దేశంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయం. ప్రస్తుతం అక్కడ సేవలు పునరుద్ధరణ అయినట్లు తెలుస్తోంది. We understand that delays are certainly uncomfortable. Our team is working diligently to minimize the inconvenience. They'll be in touch with you for further updates. — Air India (@airindiain) December 1, 2022 #UPDATE | Normal services have resumed at Mumbai International Airport. The operations were disturbed for about 40 minutes due to server failure. — ANI (@ANI) December 1, 2022 ఇదీ చదవండి: ఒక్క ఓటర్ కోసం.. 8 మంది సిబ్బంది -
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో 61కిలోల గోల్డ్ సీజ్.. కస్టమ్స్ చరిత్రలోనే రికార్డ్
ముంబై: విదేశాల నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న ముఠాల గుట్టురట్టు చేశారు ముంబై కస్టమ్స్ అధికారులు. ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ స్థాయిలో బంగారం పట్టుకున్నారు. రెండు వేరు వేరు సంఘటనల్లో మొత్తం 61 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. దాని విలువ సుమారు రూ.32 కోట్లు ఉంటుందని తెలిపారు. ముంబై ఎయిర్పోర్ట్ కస్టమ్స్ విభాగం చరిత్రలో ఒక్కరోజులో సీజ్ చేసిన విలువలో ఇదే అత్యధికమని తెలిపారు. ఈ సంఘటన గత శుక్రవారం జరిగినట్లు అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మొదటి ఆపరేషన్‌లో టాంజానియా నుంచి వచ్చిన నలుగురు భారతీయులను తనిఖీ చేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన బెల్టుల్లో 1 కేజీ బంగారం బిస్కెట్లను దాచి తీసుకొచ్చారు. మొత్తం రూ.28.17 కోట్లు విలువైన యూఏఈ తయారీ గోల్డ్ బార్స్ 53 లభ్యమయ్యాయి. నలుగురిని అరెస్ట్ చేసి జుడీషియల్ కస్టడీకి తరలించారు. మరో ఆపరేషన్‌లో 8 కిలోలు సుమారు రూ.3.28 కోట్ల విలువైన బంగారం సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల వద్ద తనిఖీలు చేయగా ఈ బంగారం బయటపడింది. ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి కలిసి బంగారాన్ని మైనం రూపంలో చేసి తీసుకొస్తున్నట్లు గుర్తించారు. దానిని జీన్స్‌లో పెట్టి తీసుకొస్తున్నారని తెలిపారు. ఇదీ చదవండి: Prashant Kishor: ఎన్నికల్లో పోటీపై ప్రశాంత్ కిషోర్ క్లారిటీ.. ఏమన్నారంటే? -
ఎయిర్‌పోర్ట్‌లో షారూక్‌ను అడ్డుకున్న అధికారులు.. ఆ తర్వాతే బయటకు..!
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ముంబై విమానాశ్రయంలో బాలీవుడ్ స్టార్‌ను కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. అయన వద్ద నుంచి అత్యంత ఖరీదైన వాచీలను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి తిరిగి వస్తుండగా భద్రతా సిబ్బంది షారూక్‌ను నిలువరించారు. రూ.18 లక్షల లగ్జరీ వాచీలు షారూక్ ఖాన్ బ్యాగ్‌లో ఉండగా విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఆరా తీశారు. అయితే ఆ తర్వాత వాటిపై కస్టమ్ డ్యూటీ మొత్తం రూ.6.83 లక్షలను బాలీవుడ్ హీరో చెల్లించారు. కస్టమ్స్ డ్యూటీ చెల్లించాక షారూక్ ఖాన్ విమానాశ్రయం నుంచి పంపించివేశారు. అయితే షారూక్‌ను ఎయిర్‌పోర్ట్‌లో అడ్డుకోవడం ఇదేం మొదటిసారి కాదు. 2011లో విదేశీ వస్తువులను తీసుకురావడంతో కస్టమ్స్ అధికారులు రూ1.5 కోట్ల జరిమానా విధించారు. ప్రస్తుతం ఎస్ఆర్కే స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ పఠాన్‌లో నటిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె, జాన్ అబ్రహం నటిస్తున్న ఈ చిత్రం జనవరి 25, 2023న విడుదల కానుంది. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ 'టైగర్ 3'లో అతిథి పాత్రతో పాటు 'జవాన్', 'డుంకీ' కూడా కనిపించనున్నారు. దుబాయ్‌లోని షార్జాలో జరిగిన ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్- 2022లో పాల్గొన్న షారూక్ తిరిగి ముంబై చేరుకున్నారు. -
బూట్లు, పట్టు చీరల్లో నోట్ల కట్టలు.. పోలీసులు షాక్
ముంబై: అక్రమంగా విదేశీ కరెన్సీ రవాణా చేస్తున్న ఓ కుటుంబం.. ముంబై పోలీసులను షాక్‌కి గురి చేసింది. ఏకంగా దాదాపు ఐదు లక్షల డాలర్ల నగదును గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేసే ప్రయత్నం చేసింది. అయితే.. ముందుగా సమాచారం అందుకున్న పోలీసులు అనుమానంతో వెతకగా.. ఆ కుటుంబం నుంచి నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఈ ఘటన చోటు చేసుకోగా.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. విదేశీ కరెన్సీ అక్రమ రవాణా గురించి ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్(AIU)కు ముందుగానే సమాచారం అందింది. దీంతో బుధవారం అర్ధరాత్రి నుంచే ముంబై ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు, ఏఐయూ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. గురువారం ఉదయం ముంబై ఛత్రపది శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ కుటుంబం కదలికలపై అధికారులకు అనుమానం వచ్చింది. ఇద్దరు వృద్ధులతో సహా ముగ్గురు ఉన్న ఆ కుటుంబం లగేజీని అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాళ్ల సూట్‌కేసులో ఉన్న షూస్ లోపల, పట్టుచీరల మధ్య అమెరికన్ డాలర్లు ప్రత్యక్షం కావడంతో కంగుతిన్నారు. మొత్తం అమెరికన్ డాలర్ కరెన్సీ విలువ 4,97,000 డాలర్లుకాగా, మన కరెన్సీలో దాని విలువ రూ.4.10 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా.. 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించారు జడ్జి. ఇంత డబ్బు ఎక్కడిది? ఎలా చేతులు మారింది? అనే విషయాన్ని తేల్చే పనిలో ఉన్నారు అధికారులు. #WATCH | In a targeted op by AIU, Mumbai Airport Customs, a family of 3 Indian pax going to Dubai were intercepted. The baggage examination of the 3 led to seizure of foreign currency worth 4,97,000 USD (approx Rs 4.1 Cr). All 3 passengers were arrested: Customs (Source:Customs) pic.twitter.com/TdQVZd4wox — ANI (@ANI) November 3, 2022 -
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా హెరాయిన్ పట్టివేత..రూ.100 కోట్లకు పైగా
ముంబై: ముంబై విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి నిషేధిత మత్తుపదార్థం హెరాయిన్‌ను భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. మహిళతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను అధికారులు అరెస్టు చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆఫ్రికా దేశమైన మలాయ్ నుంచి వయా ఖత్తర్ దేశం మీదుగా ముంబైకి వస్తున్న ఓ ప్రయాణికుడు భారీ ఎత్తున హెరాయిన్‌ను తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో డీఆర్ఐ అధికారులు మంగళవారం విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ఓ ప్రయాణికుడి లగేజీలో సుమారు 16 కేజీల హెరాయిన్ బయటపడింది. అధికారులు దానిని స్వాధీనం చేసుకోవడంతో పాటు అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా విచారణ నిమిత్తం అతడిని డీఆర్ఐ కస్టడీకి అనుమతినిచ్చింది. కాగా, తనిఖీల్లో పట్టుబడ్డ హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.100 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ మాదకద్రవ్యాన్ని డెలివరీ తీసుకునేందుకు ఢిల్లీలోని హోటల్ నుంచి వచ్చిన ఓ మహిళను కూడా అధికారులు అరెస్టు చేశారు. కాగా, ఈమెను ఘనాకు చెందిన మహిళగా గుర్తించారు. ఈ కేసులో సంబంధం ఉన్న మరో వ్యక్తిని కూడా డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. చదవండి: గేదెలు ఢీకొట్టడంతో దెబ్బతిన్న వందే భారత్ రైలు.. 24 గంటల్లోనే.. -
మాల్దీవులకు చెక్కేసిన విజయ్, రష్మిక? ఫోటోలు వైరల్
విజయ్ దేవరకొండ-రష్మిల డేటింగ్లో ఉన్నట్లు చాలకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై ఇప్పటికే ఈ జంట క్లారిటీ ఇచ్చినా డేటింగ్ రూమర్స్ ఆగడం లేదు. తాజాగా విజయ్, రష్మిక ఒకేసారి ఎయిర్‌పోర్టులో దర్శనం ఇవ్వడంతో మరోసారి ఈ జంట లవ్టాపిక్ హాట్‌టాపిక్‌గా మారింది. అంతేకాకుండా ఇద్దరూ ఒకే కలర్ డ్రెస్‌లో కనిపించడం మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఎయిర్‌పోర్టుకు విజయ్ వచ్చిన కాసేపటికే రష్మిక కూడా నవ్వుతూ లోపలికి వెళ్లింది. దీంతో ఇద్దరూ కలిసే వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లినట్లు టాక్ వినిపిస్తుంది. కాగా గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించిన విజయ్-రష్మికల కెమిస్ట్రీకి ఎంతో మంది అభిమానులున్న సంగతి తెలిసిందే. #VijayDevarakonda and #RashmikaMandanna keep it cool and casual as they jet off to Maldives for vacation 🛫✈️#pair ❤️ #virosh 😘🔥 @TheDeverakonda @iamRashmika VC: @pinkvilla pic.twitter.com/dpYSk9mOYj — Revanth (@AtmakuriRevanth) October 7, 2022 -
KRK Arrest: నటుడు, క్రిటిక్ కేఆర్కే అరెస్ట్.. ఆ ట్వీట్‌తో వివాదం
బాలీవుడ్ సినీ విమర్శకుడిగా పొరేందిన కమల్ ఆర్ ఖాన్(కేఆర్కే)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై ఎయిర్‌పోర్టులో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈరోజు(మంగళవారం) కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. కాగా కేఆర్కే హిందీ బిగ్‌బాస్-3లో పాల్గొన్నారు. పలు హిందీ సినిమాల్లో నటించినా ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. అయితే నటీనటులపై తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో కేఆర్కే వెలుగులోకి వచ్చారు. తనను తాను సినీ క్రిటిక్‌గా చెప్పుకునే రషీద్ ఖాన్.. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, అమిర్ ఖాన్, షారుక్ ఖాన్ సమా టాప్ హీరోల మీద ఎప్పుడూ విమర్శలు చేస్తూ పాపులారిటీ దక్కించుకున్నారు. బాలీవుడ్ స్టార్స్‌పై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించే కేఆర్కే చుట్టూ నిత్యం వివాదాలు అల్లుకునే ఉంటాయి. 2020లోఆయన చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. 'కొంతమంది ప్రముఖులను తీసుకెళ్లకుండా కరోనా వెళ్లదు. ఆ సమయంలో నేను పేర్లు చెప్పలేదు. కానీ నాకు తెలుసు.. ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ లాంటి వాళ్లు చనిపోతారని. అంతేకాకుండా తర్వాత పైకి పోయేది ఎవరో కూడా నాకు తెలుసు' అంటే కేఆర్కే చేసిన ట్వీట్ తీవ్ర దుమారాన్ని రేపింది. దీనిపై కేసు నమోదవగా తాజాగా కేఆర్కేను పోలీసులు అరెస్ట్ చేశారు. KRK arrested for below tweets done in 2020 pic.twitter.com/WklfVN8Lzi — Gabbbar (@GabbbarSingh) August 30, 2022 -
ముంబైలో రూ.5 కోట్ల కొకైన్ పట్టివేత
ముంబై: ఆఫ్రికా దేశం సియర్రాలియోన్‌కు చెందిన ఓ మహిళ నుంచి ముంబై విమానాశ్రయం అధికారులు రూ.5 కోట్ల విలువ చేసే 500 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సియర్రాలియోన్‌కు చెందిన ఈ మహిళ ఆడిస్‌అబాబా నుంచి ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో శుక్రవారం ముంబైకి చేరుకుంది. తనిఖీల్లో ఆమె పర్సులో దాచిన కొకైన్ బయటపడటంతో అరెస్ట్ చేసి, విచారణ జరుపుతున్నట్లు కస్టమ్స్ విభాగం అధికారులు చెప్పారు. చదవండి: యువతిపై గ్యాంగ్ రేప్.. ఆపై వ్యభిచార ముఠాకు విక్రయం -
విజయ్‌కి షాకింగ్ ఇన్సిడెంట్, ‘చీజ్’ అంటూ కామెంట్.. ‘రౌడీ’ రియాక్షన్ చూశారా?
ప్రస్తుతం నార్త్‌లో లైగర్ హవా మామూలుగా లేదు. లైగర్ ఎక్కడికి వెళ్లిన ఆ ప్రాంతం జనసంద్రంలా మారిపోతుంది. దీంతో విజయ్ క్రేజ్ చూస్తుంటే సౌత్ ఆడియన్స్‌కి మతిపోతోంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’. బాక్సింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రంగా రూపొందించిన ఈ మూవీ ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రం బృందం ప్రమోషన్స్ జోరు పెంచేసింది. ఈ క్రమంలో లైగర్ టీం ఇటీవల ముంబై, పుణే, పాట్నాలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే బాలీవుడ్ ప్రముఖ టాక్ షో కాఫీ విత్ కరణ్ షోతో లైగర్ ప్రమోషన్ షూరు చేశారు. ఈ నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండేలు ఈ షోలో పాల్గొని పలు ఆసక్తిర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా హోస్ట్ కరణ్ జోహార్ నీకు చీజ్ ఇష్టమా? అని విజయ్‌ని ఆటపట్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయమై విజయ్‌కి ఎయిర్‌పోర్ట్‌లో ఆసక్తికర సంఘటన ఎదురైంది. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఈ ‘లైగర్’ మీడియా పర్సన్ విజయ్ అన్న విజయ్ అన్న పిలుస్తూ ‘ఇతనికి కూడా చీజ్ కావాలంటా?’ అంటూ కామెంట్ చేశాడు. అది విన్న విజయ్ అతని వంక కాస్తా అసహనంగా చూశాడు. ఇక మనసులోనే ఏదో అనుకుంటూ ముందుకు కదిలాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. విజయ్ రియాక్షన్ చూసిన నెటిజన్లు ‘ఇకపై చీజ్ పేరు వింటే విజయ్ కోపంతో రగిలిపోతాడేమో’, ‘కాఫీ విత్ కరణ్ షో ఎంతపని చేసింది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ టాక్ షో తొలి ఎపిసోడ్లో పాల్గొన్న సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్లను డేటింగ్ చేయాలంటే ఏ హీరోను ఎంచుకుంటారని అడగ్గా ఇద్దరు విజయ్ దేవరకొండ అని సమాధానం చెప్పారు. ఈ ఆన్సర్పై జాన్వీని అంటే నువ్వు విజయ్‌ని ఇష్టపడుతున్నావా? అని సారా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. వారి సమాధానం విన్న కరణ్ జోహార్ ఇద్దరు ఒక వ్యక్తితోనే డేటింగ్ చేస్తారా! అంటూ విజయ్‌ని చిజ్తో పోల్చాడు. View this post on Instagram A post shared by Sneh Zala (@snehzala) -
సమంత ఇంకా డిప్రెషన్లోనే ఉందా? చేతిలో ఆ బుక్
స్టార్ హీరోయిన్ సమంత నాగ చైతన్యతో విడాకుల అనంతరం ఈమధ్య తరుచూ వార్తల్లో నిలుస్తుంది. వీరు విడిపోయి దాదాపు పది నెలలు కావొస్తున్నా ఇంకా వీరి బ్రేకప్ న్యూస్ నెట్టింట హాట్‌టాపిక్‌గానే ఉంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు విడిపోయారన్నదానిపై ఇంత వరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇద్దరూ తమ తమ కెరీర్ పరంగానూ దూసుకెళ్తున్నారు. లాల్ సింగ్ చద్దా సినిమాతో చై బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా, సమంత సైతం హిందీలో వరుస సినిమాలకు సైన్ చేస్తుంది. తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించిన సమంత ఫోటోలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. లూయిస్ హే రాసిన 'యూ కెన్ హీల్ యువర్ లైఫ్'అనే బుక్ సామ్ చేతిలో కనిపించేసరికి సామ్ డిప్రెషన్లో ఉందని, చై జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు ఇలాంటి పుస్తకాలు చదువుతుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం సామ్ ఖుషీ, యశోద, శాకుంతలం సినిమాల్లో నటిస్తుంది. -
ఇండియాకు వచ్చిన విల్‌స్మిత్.. అతని కోసమేనా ? ఫొటోలు వైరల్..
Will Smith In India And Spotted At Mumbai Airport After Slap Controversy: హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ అంటే సినీ ప్రియులకు తప్ప ఇంకేవరికి పెద్దగా పరిచయం లేదు. కానీ ఇటీవల నిర్వహించిన ఆస్కార్ వేడుకల్లో హోస్ట్, కమెడియన్ క్రిస్‌రాక్‌పై విల్ స్మిత్ చేయి చేసుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఈ సంఘటన తర్వాత విల్ ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మోషన్ పిక్చర్ అకాడమీ విల్‌స్మిత్‌పై 10 ఏళ్ల నిషేధం కూడా విధించింది. ఇదిలా ఉంటే విల్ స్మిత్ తాజాగా ఇండియా బాట పట్టాడు. శనివారం (ఏప్రిల్ 23) ముంబై విమానాశ్రయం వద్ద విల్ స్మిత్ దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. చెంపదెబ్బ ఘటన తర్వాత విల్ కెమెరాలకు చిక్కడం ఇదే తొలిసారి. విల్ స్మిత్ జుహులోని జెడబ్ల్యూ మారియట్హోటల్లో బస చేస్తున్నట్లు సమాచారం. అయితే విల్ స్మిత్ ఇండియాకు రావడానికి కారణం ఏంటని తీవ్రంగా చర్చ నడుస్తోంది. అందులోనూ ఇలాంటి సమయంలో రావడం హాట్ టాపిక్‌గా మారింది. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ను కలిసేందుకే విల్ స్మిత్ వచ్చినట్లు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. చెంపదెబ్బ ఘటనతో విల్ కొద్ది రోజులుగా విచారంగా ఉన్నాడట. దీంతో సద్గురు వద్ద కొంత సమయం గడిపేందుకు వచ్చాడని సమాచారం. ఈ విషయంపై ఎలాంటి అదికారిక ప్రకటన మాత్రం ఇంతవరకు వెలువడలేదు. గతంలో విల్ స్మిత్ సద్గురుకు తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. 2019లో కూడా విల్ స్మిత్ భారతదేశాన్ని సందర్శించాడు. అప్పుడు పలువురు బాలీవుడ్ ప్రముఖులను కలిసి ముచ్చటించాడు. మరీ ఈసారి ఎవర్నైనా కలుస్తాడా ? లేదో ? చూడాలి. చదవండి: విల్ స్మిత్‌పై 10 ఏళ్లు నిషేధం, స్పందించిన హీరో చెంపదెబ్బ ఎఫెక్ట్.. ఆగిపోయిన విల్ స్మిత్ సినిమాలు ! -
దీపిక డ్రెస్సింగ్‌పై ట్రోల్స్.. 'రణ్వీర్ డిజైన్ చేసాడేమో'..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె డ్రెస్సింగ్‌పై ఈ మధ్యకాలంలో ట్రోలింగ్ ఎక్కువవుతుంది. తాజాగా తన తర్వాతి సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు ముంబై ఎయిర్‌పోర్టుకు వచ్చిన దీపిక బిగుతైన రెడ్ కలర్ డ్రెస్‌లో కనిపించింది. క్యాప్, హ్యాండ్‌బ్యాగ్ కూడా ఎరుపు రంగులో ఉన్నాయి. దీనికి తోడు హై హీల్స్ వేసుకుంది. అవి కూడా రెడ్ కలర్లోనే ఉండటం విశేషం. దీంతో నెటిజన్లు దీపికాను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. అచ్చం జొమాటో డెలివరీ గర్ల్‌లా ఉందని, ఎప్పటిలాగే ఆమె డ్రెస్సింగ్ స్టైల్లో విఫలమైందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో రణ్వీర్ సింగ్ వింత ఫ్యాషన్ దీపిక పాటిస్తుందని, ఈ డ్రెస్ కూడా రణ్వీర్ డిజైన్ చేసి ఉండొచ్చని ట్రోల్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. రీసెంట్గా గెహ్రియాన్తో హిట్ అందుకున్న దీపిక ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన 'ప్రాజెక్ట్ కే' లో నటిస్తుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
జాన్వీ తీరుకు ఫ్యాన్స్ ఫిదా, హంబుల్, స్వీట్ అంటూ ప్రశంసలు
Janhvi Kapoor Cuts Birthday Cake At Mumbai Airport: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తన తీరుతో ఒక్కసారిగా అందరి ఆకట్టుకుంటోంది. ఆమె నిరాండబరత చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇంతకి జాన్వి ఇలా అందరి మన్ననలు పొందడానికి కారణం ముంబై ఎయిర్‌పోర్టు మీడియా పట్ల ఆమె చూపించిన వినయం. ఇంతకి ఏం జరిగిందంటే.. రేపు(ఫిబ్రవరి 6) జాన్వి బర్త్‌డే. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం ఆమె ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించింది. దీంతో అక్కడ ఆమె చూసిన మీడియా జర్నలిస్టులు జాన్వికి అడ్వాన్స్‌గా బర్త్‌డే విషెస్ తెలిపారు. అంతేకాదు ఆమె కోసం బర్త్‌డే కేక్ కూడా తీసుకువచ్చారు. చదవండి: నన్ను నమ్మినందుకు థ్యాంక్స్, నాకింకా గుర్తుంది.. అది 2012: సమంత వారు అభిమానాన్ని తిరస్కరించకుండా జాన్వి కేక్ కట్ చేసింది. ఇలా అడ్వాన్స్‌గా మీడియాతో కలిసి ఆము పుట్టిన రోజును జరుపుకోవడం చూసి నెటిజనట్లు ఆమె వినయం, విధేయతకు మెచ్చుకోకుండ ఉండలేకపోతున్నారు. ‘హంబుల్, స్వీట్’ అంటూ జాన్వీని ప్రశంసిస్తున్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా దివంగత నటి శ్రీదేవి తనయగా పరిశ్రమలో అడుగు పెట్టింది. తన తొలి చిత్రం థడక్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వి తన నటన, ప్రతిభ, డ్యాన్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె గుడ్ లఖ్ జెర్రీ మూవీలో నటిస్తోంది. ఇది తమిళ ఫిలిం కొలమావు కోకిల మూవీకి రీమేక్. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
విద్యార్థులకు స్వాగతం పలికిన కేంద్రమంత్రి సింధియా
-
ఉక్రెయిన్: ముంబై ఎయిర్‌పోర్టులో ఉద్విగ్న క్షణాలు
ముంబై: రష్యా సైనిక దాడులతో ఉక్రెయిన్ దేశంలో భయం గుప్పిట్లో గడిపిన భారతీయ విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో రుమేనియా నుంచి బయల్దేరిన ఎయిరిండియా తొలి విమానం ముంబై చేరుకుంది. ఈ విమానంలో 219 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. శనివారం బుకారెస్ట్ నుంచి బయల్దేరిన ఎయిరిండియా తొలి విమానంలో ఇండియాకు వచ్చిన విద్యార్థులకు కేంద్ర మంత్రులు ఎస్.జయశంకర్, పీయూష్ గోయల్ ముంబై ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. విద్యార్థులను స్వస్థలాకు తరలించేందుకు అధికారులు ముమ్మర ఏర్పట్లు చేస్తున్నారు. 219 భారతీయుల్లో ఐదుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ఉన్నారు. తెలుగు విద్యార్థులు.. పోతుల వెంకట లక్ష్మీధర్‌రెడ్డి, తెన్నేటీ వెంకట సుమ, అర్ఫాన్ అహ్మద్, అమ్రితాంష్, శ్వేతశ్రీలు తొలి విమానంలో భారత్‌కు సురక్షితంగా చేరుకున్నారు. #WATCH | Union Minister Piyush Goyal welcomes the Indian nationals safely evacuated from Ukraine at Mumbai airport pic.twitter.com/JGKReJE1ct — ANI (@ANI) February 26, 2022 Union Minister Piyush Goyal welcomes Indian students evacuated from Ukraine at Mumbai Airport pic.twitter.com/eqUfOuViyw — ANI (@ANI) February 26, 2022 -
సీఎం కేసీఆర్ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం
-
ఎయిర్ పోర్టులో డ్రగ్స్ కలకలం.. జింబాబ్వే మహిళ వద్ద రూ. 60 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
సాక్షి, ముంబై: దేశంలో మరోసారి భారీ స్థాయిలో మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. మహిళా ప్రయాణికురాలి వద్ద దొరికిన దాదాపు రూ. 60 కోట్ల విలువైన డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు డ్రగ్స్ తరలిస్తున్నట్టు సమాచారం అందింది. దీంతో విమానాశ్రయంలో వారు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా జింబాబ్వేకు చెందిన ఓ ప్రయాణికురాలి వద్ద మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సదరు ప్రయాణికుడు డ్రగ్స్ ను ట్రాలీ బ్యాగ్‌తో పాటు రెండు ఫైల్ ఫోల్డర్లలో దాచిపెట్టి తరలిస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ దాదాపుగా రూ. 60 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. -
ఎయిర్‌పోర్ట్‌లో రష్మిక అలా కనిపించేసరికి.. ఆడేసుకుంటున్న నెటిజన్లు
Rashmika Mandanna Spotted In Airport, Fans Trolls On Her Dress Sense: ఛలో సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ భావ రష్మిక మందన్నా. ఆ తర్వాత గీత గోవిందంతో గుర్తింపు పొందిన ఈ భామ సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. రీసెంట్గా వచ్చిన పుష్పతో మరో బ్లాక్ బస్టర్‌ని తన ఖాతాలో వేసుకొని సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తుంది. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. ఇదిలా ఉండగా తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించింది. అయితే ఆమె వేసుకున్న డెనిమ్ షార్ట్ మరీ పొట్టిగా ఉండటంతో నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. రష్మిక డ్రెస్సింగ్ మరీ ఓవర్‌గా ఉందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను వైరల్ చేస్తూ.. ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా? ఇంక నువ్వు బట్టలు వేసుకోవడం దేనికి అంటూ ఈ అమ్మడిపై ఫైర్ అవుతున్నారు.స్కిన్ షో చేయొచ్చు కానీ, ఇది టూ మచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. #RashmikaMandanna #DilKoKaraarAaya 💕🤩🔥#Rashmika #Rash #Mumbai #Srivalli #cutenessoverloaded pic.twitter.com/EEo9koiIPE — team_rashmika_mandanna (@MandannaTeam) January 24, 2022 -
ఫ్లైట్ ఎక్కేముందు కరోనా నెగెటివ్.. దిగాక పాజిటివ్!!
భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి భారత్‌లో నిర్వహిస్తున్న కరోనా టెస్టులపై చేసిన ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఎదురైన అనుభవం దృష్ట్యా.. కరోనా టెస్టులు, ఐసోలేషన్‌లో ఉంచడం.. ఇదంతా పెద్ద స్కామ్ అంటూ వీడియోలో వ్యాఖ్యానించాడా వ్యక్తి. ప్రస్తుతం ఈ వీడియో ఫేస్బుక్ ద్వారా వైరల్ అవుతోంది. మనోజ్ లాద్వా యూకేలో సెటిల్ అయిన వ్యక్తి. తన మామ అంత్యక్రియల కోసం భార్యతో పాటు లండన్ ‘హీథ్రో ఎయిర్పోర్ట్’ నుంచి విమానంలో వచ్చాడు. విమానం ఎక్కే ముందు ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. డిసెంబర్ 30న వర్జిన్ అట్లాంటిక్ ఫ్లయిట్లో ముంబై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారు. అక్కడ ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అనుమానం వ్యక్తం చేసిన అయిన.. మరోసారి పరీక్ష నిర్వహించాలని ఎయిర్పోర్ట్ సిబ్బందిని కోరారు. అయితే అందుకు నిరాకరించిన సిబ్బంది.. ఆయన్ని ప్రభుత్వం నిర్వహించే ఓ క్వారంటైన్ సెంటర్‌కు షిఫ్ట్ చేశారు. దీంతో ఆయన అంత్యక్రియలకు హాజరుకాలేకపోయాడు. ఈ అనుభవంపై ఫేస్బుక్ లైవ్‌లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను అప్లోడ్ చేశాడు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అంతా మాయగా ఉంది. విమానంలో గట్టిగా పదిహేను మంది కంటే ఎక్కువమంది లేం. దిగగానే.. అదీ గంటల వ్యవధిలో పాజిటివ్ ఎలా నిర్ధారణ అవుతుంది? లండన్ ఎయిర్‌పోర్టులు రిపోర్టులు చూపించినా నమ్మకపోతే ఎలా? ఇండిపెండెంట్ పరీక్షలకు అంగీకరించకపోవడంలో ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదు. ఇదో పెద్ద కుంభకోణంలా ఉంది అంటూ ఆరోపించాడాయన. నాతో పాటు మరికొందరు ప్రయాణికులు గట్టిగా సిబ్బందిని నిలదీశాం.ఇక్కడి మార్గదర్శకాలు ఇష్టం లేకపోతే.. బయట డబ్బులు కట్టి అయినా క్వారంటైన్ సెంటర్లో ఉండాలంటూ బీఎంసీ అధికారులు(Brihanmumbai Municipal Corporation) బెదిరిస్తున్నారు’’ అంటూ మనోజ్ లాద్వా ఆరోపించారు. ఇదిలా ఉంటే లాద్వా వీడియో తీసిన టైంలో.. వెనకాల మరికొంతమంది ప్రయాణికులు సెంటర్ నిర్వాహకులతో గొడవ పడుతున్నట్లు వాయిస్ వినిపించింది. అయితే ఎయిపోర్ట్ సిబ్బంది మాత్రం తాము అంతా పక్కాగా రూల్స్ ప్రకారమే ముందుకు పోతున్నట్లు చెబుతున్నారు. చదవండి: కరోనాకు రెడ్ కార్పెట్ వేసి మరీ ఘన స్వాగతం?? ఎక్కడంటే.. -
మనీలాండరింగ్ కేసు: జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు స్వల్ప ఊరట
ముంబై: మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు స్వల్ప ఊరట లభించింది. ఆమె దేశంవిడిచి వెళ్ళేందుకు ఈడీ అనుమతిచ్చింది. 200కోట్లకు సంబంధించిన ఓ మనీ లాండరింగ్ కేసును విచారిస్తోన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ప్రధాన నిందితుడిగా సుకేశ్ చంద్రశేఖర్ అనే వ్యక్తి పేరును ఛార్జిషీటులో పేర్కొంది. అందులో బాలీవుడ్ నటి, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తోపాటు నోరా ఫతే పేర్లను కూడా చేర్చింది. చదవండి: బాలీవుడ్ భామకి గిఫ్ట్‌గా రూ.52 లక్షల గుర్రం, రూ.9 లక్షల పిల్లి ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఇప్పటికే ఈడీ పలుమార్లు ప్రశ్నించింది. అయితే, రూ.10కోట్ల విలువైన బహుమతులు తీసుకున్న ఆరోపణలపై జాక్వెలిన్‌కు ఈమధ్యే మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. దీనిపై ఆమె నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఈడీ అధికారులు ఆమెపై లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇదే సయమంలో ఆమె దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ముంబయి విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. -
Hardik Pandya: అవన్నీ ఉత్త పుకార్లే.. 5 కోట్లు కాదు.. ఆ వాచీ ధర కోటిన్నర మాత్రమే
Hardik Pandya Clarifies on 2 Luxury Wrist Watches Price After Customs Row: ‘‘సోమవారం.. నవంబరు 15 ఉదయం నేను నా లగేజీతో దుబాయ్ నుంచి ఇండియాకు చేరుకోగానే... ముంబై ఎయిర్‌పోర్టు కస్టమ్స్ కౌంటర్ దగ్గరకు వెళ్లి.. నేను కొన్న వస్తువుల గురించి తెలియజేశాను. కస్టమ్స్ డ్యూటీ చెల్లించాను కూడా. కానీ.. నాకు సంబంధించిన వస్తువులను సీజ్ చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారమవుతున్నాయి. అందుకే.. అసలు విషయం గురించి స్పష్టతనివ్వాలని భావించాను’’ అంటూ తన గురించి ప్రచారమవుతున్న కథనాలపై టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. కాగా సరైన పత్రాలు చూపని కారణంగా పాండ్యాకు చెందిన సుమారు 5 కోట్ల విలువైన వాచీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారన్న వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా పాండ్యా క్లారిటీ నోట్ షేర్ చేశాడు. ‘‘నాకు నేనుగా.. స్వయంగా కస్టమ్స్ అధికారుల వద్దకు వెళ్లాను. దుబాయ్‌లో నేను చట్టబద్ధంగా ఖరీదు చేసిన వస్తువులకు పన్ను చెల్లించాను. వాళ్లు అడిగిన పత్రాలు అన్నీ కూడా సమర్పించాను. వస్తువులకు సంబంధించి ఎంత డ్యూటీ చెల్లించాల్సి వస్తుందో వాళ్లు నాకు చెప్పారు. నిజానికి ఆ వాచ్ వాస్తవ ధర ఇంచు మించు కోటిన్నర. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నట్లుగా రూ. 5 కోట్లు కాదు’’ అని పాండ్యా పేర్కొన్నాడు. పాండ్యా గతంలో షేర్ చేసిన ఫొటోలు నేను చట్టాన్ని గౌరవిస్తాను ‘‘ప్రభుత్వ సంస్థలను నేను గౌరవిస్తాను. చట్టాన్ని పాటించే దేశ పౌరుడిని నేను. ముంబై కస్టమ్స్ డిపార్టుమెంటు అడిగిన విధంగా నేను అన్ని వివరాలు అందించాను. చట్టబద్ధమైన డాక్యుమెంట్లు చూపించాను. దీంతో వాళ్లు కూడా నాకు సహకరించారు. నేను చట్టాన్ని అతిక్రమించాననే వార్తలు అన్నీ కూడా నకిలీవే’’ అని హార్దిక్ పాండ్యా తన సుదీర్ఘ పోస్టులో రాసుకొచ్చాడు. ఈ క్రమంలో అభిమానులు పాండ్యాకు అండగా నిలుస్తుండగా.. కొంతమంది హేటర్స్ మాత్రం.. ‘‘ఏంటి.. కోటిన్నర వాచ్ పెట్టుకుంటేనే సిక్స్ కొడతావా లేదంటే.. ఆడటం చేతకాదా? విలాసాలపై కాదు.. ఆటపై దృష్టి పెట్టు ముందు’’ అని ట్రోల్ చేస్తున్నారు. చదవండి: Shoaib Akhtar: ఏంటది అసహ్యంగా.. అసలు విషయం తెలీదా.. లేదంటే సెమీస్‌లో పాక్‌ను ఓడించినందుకేనా అక్కసు! pic.twitter.com/k9Qv0UnmyS — hardik pandya (@hardikpandya7) November 16, 2021 -
కంగనా..సెలబ్రిటీలకు రూల్స్ వర్తించవా?
Kangana Ranaut Ignores No Mask, No Entry Sign: కంగనా రనౌత్ తాజాగా ముంబై విమానాశ్రయాంలో దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో కెమెరాలకు ఫోజులిస్తూ లోపలికి కదిలింది. అయితే నో మాస్క్, నో ఎంట్రీ అనే బోర్డు ఉన్నా కంగనా ఏమాత్రం పట్టించుకోలేదు. మాస్క్ లేకుండానే ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టాయి. చదవండి: ఆస్పత్రి పాలైన నటి.. త్వరగా కోలుకోవాలంటూ మాజీ భర్త పోస్ట్ ఈ విషయంపై ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ స్పందిస్తూ.. కంగానాకు అతి దగ్గర్లోనే ‘నో మాస్క్, నో ఎంట్రీ’బోర్డు ఉంది. అయినా నిర్లక్ష్యంగా మాస్క్ లేకుండానే వెళ్లిపోయింది. ఎన్నికల తర్వాత ఎలా అయితే రాజకీయ నాయకులు ఓటర్లను పట్టించుకోరో, కంగనా కూడా నియమాలను విస్మరించింది అంటూ దుయ్యబట్టారు. మాస్క్ లేకపోతే లోపలికి ప్రవేశం లేదు అనే నియమం సెలబ్రిటీలకు మాత్రం వర్తించవా అంటూ మరో యూజర్ ప్రశ్నించారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవలె కంగనా తలైవి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. సినీ నటి, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అరెరె.. కత్రినా కైఫ్‌కు జిరాక్స్ కాపీలా ఉందే.. View this post on Instagram A post shared by Bollywood Pap (@bollywoodpap) -
ముంబై ఎయిర్‌పోర్టులో కరీనాకు చేదు అనుభవం
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌కు చేదు అనుభవం ఎదురైంది. కటుంబంతో కలిసి పర్యాటనకు వెళ్తున్న ఆమెను ముంబై ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారులు అడ్డుకుని వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతొంది. ఇటీవల బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్‌ను సైతం సీఐఎస్ఎఫ్ సెక్యూరిటి అధికారి అడ్డుకుని పాస్‌పోర్ట్ అడిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా బుధవారం కరీనా కటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో భర్త సైఫ్ అలీ ఖాన్, కుమారులు తైమూర్, జహంగీర్‌తో కలిసి ఆమె ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. చదవండి: అమ్మతో ఉన్న ఫొటో షేర్ చేసిన హృతిక్... తడి గోడను పట్టేసిన నెటిజన్ అక్కడ సైఫ్, తైమూర్లు ఎటువంటి ఇబ్బందీ లేకుండా నేరుగా విమానాశ్రయంలోకి వెళ్లిపోయారు. అయితే జహంగీర్ కేర్ టేకర్, కరీనాలు వారి వెనకాలే ఉన్నారు. అక్కడ ఉన్న సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ ఆఫిసర్లు కేర్ టేకర్‌ను అడ్డుకుని పాస్‌పార్ట్ అడిగారు. వారితో మాట్లాడేందుకు ముందుకు వచ్చిన కరీనాను సైతం వారు పాస్‌పోర్ట్ అడగడంతో ఆమె చూపించింది. వారు చెక్ చేస్తుండగా తన వెనకాలే ఉన్న వారి మేనేజర్‌కు పాస్‌పోర్ట్ ఇచ్చి ఆమె లోపలికి వెళ్లిపోయింది. ఈ సమయంలో అప్పటికే విమానాశ్రయంలోకి వెళ్లిన సైఫ్ వెనక్కు వచ్చి కరీనా కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. ఇది చూసి నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సెలబ్రెటీ అని కూడా చూడకుండా తమ బాధ్యతను నిర్వర్తించిన సదరు సెక్యూరిటీ ఆఫీసర్లపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చదవండి: ట్రోలింగ్‌పై కరీనా మండిపాటు View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
నీ కూతురి చేయి ఎప్పుడు వదులుతావు?
ఐశ్వర్యరాయ్‌కు ఆరాధ్య ఒక్కతే కూతురు ప్రస్తుతానికి. ఐశ్వర్యరాయ్‌కు ఆరాధ్యే కూతురు. ఐశ్వర్యారాయ్ ఆరాధ్యను అనుక్షణం తన కూతురు అనుకుంటూ ఉంటుంది. ఏమిటి.. చెప్పిందే చెప్తున్నాం అనుకుంటున్నారా? ఐశ్వర్యరాయ్ బయట ఎక్కడ కనిపించినా కూతురి చేయి పట్టుకోకుండా కనిపించదు. లేదా కూతురి చేతిని వదలకుండా పట్టుకుని ఉంటుంది. దీని మీద ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో కూడా కూతురి చేతిని పట్టుకునే కనిపించింది. ‘నీ కూతురి చేతిని నువ్వెప్పుడు వదిలిపెడతావ్?’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏం జరిగిందంటే మణిరత్నం సినిమా కోసం గత మూడు నాలుగు వారాలుగా ఐశ్వర్యా రాయ్ తన భర్త, కూతురుతో చెన్నైలో ఉంది. షూటింగ్ పని అయ్యాక రెండు రోజుల క్రితం ముంబై ఎయిర్పోర్ట్ చేరుకుంది. బయటికొచ్చే సమయంలో యధావిధిగా కూతురి చేతిని పట్టుకుని ఉంది. ఎయిర్‌పోర్టులో నుంచి బయటకు వచ్చి కారు ఎక్కే వరకు ఆరాధ్య చేతిని ఆమె వదల్లేదు. వారిద్దరి వెనుక అభిషేక్ బచ్చన్ నడుస్తూ కనిపించాడు. ఆరాధ్యకు ఇప్పుడు 9 ఏళ్లు. తొమ్మిదేళ్ల అమ్మాయి తనకు తానుగా ఆడొచ్చు. పరిగెత్తుకుంటూ వచ్చి కార్ ఎక్కవచ్చు. లేదా అటూ ఇటూ దిక్కులు చూస్తూ నడవొచ్చు. కాని ఐశ్వర్య ఇవేమి అలౌ చేయదు. కూతురి చేయి తన చేతిలో ఉండాల్సిందే. ఇప్పుడే కాదు. ఆరాధ్య తో ఆమె ఎప్పుడు బయటకు వచ్చినా, ఆరాధ్య స్కూల్‌కు ఆరాధ్యతో వెళ్లినా ఐశ్వర్య తన కూతురి చేతిని విడువదు. దీనిపై నెటిజన్లు కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ‘ఐశ్వర్య చాలా పొసెసివ్’ అని ఒకరంటే ‘ఐశ్వర్య చాలా ప్రొటెక్టివ్’ అని ఒకరన్నారు. ‘అయ్యో... ఆ అమ్మాయి చేయి వదలొచ్చు కదా’ అని ఒకరంటే ‘కూతురికి ఎన్నేళ్లు వస్తే ఆమె చేయి వదులుతుందో’ అని మరొకరన్నారు. పిల్లల పెంపకంలో చేయి పట్టుకుని నడిపించడం ఉంటుంది.. చేయి వదిలి నేర్పించడం ఉంటుంది... ఐశ్వర్య ఈ దారిని ఎందుకు ఎంచుకుందో అనేవారు ఉంటారు. మరోవైపు ఆరాధ్య ఎప్పుడు బయటకు వచ్చినా పాపరాజిలు తమ కెమెరాలతో వెంటబడుతుంటారు. ఆమె చేయి వదిలితే వారు పలకరిస్తే ఏం మాట బయటకు వస్తుందో అదెక్కడికి దారి తీస్తుందోనని ఆమె అనుకుంటూ ఉండొచ్చా? లేదా భద్రత రీత్యా పాప చేయి వదలదా? ఏమో. కాని ఆమెలా అనునిత్యం పిల్లల చేయి పట్టుకుని కనిపించే బాలీవుడ్ సెలబ్రిటీలు లేరు. -
అరెస్ట్ వార్తలపై స్పందించిన సుసానే ఖాన్
మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ముంబై విమానాశ్రయం సమీపంలోని డ్రాగన్ ఫ్లై క్లబ్లో దాడి జరిపి, కోవిడ్ నియమాలు ఉల్లంఘించినందుకు గాను ముంబై పోలీసులు 34 మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిలో సురేశ్ రైనా, గురు రంధావా, సుసానే ఖాన్ సహా పలువురు సెలిబ్రిటీలు కూడా ఉన్నారు. బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో మునిసిపాలిటీల పరిధిలో జనవరి 5 వరకు రాత్రి కర్ఫ్యూను విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారమే ఆదేశాలు జారీచేసింది. వాటి ప్రకారం నైట్ క్లబ్‌లు, పబ్‌లు రాత్రి 11.30 గంటలకల్లా మూసివేయాలి. అయితే అందుకు విరుద్ధంగా అర్ధరాత్రి తర్వాత కూడా క్లబ్‌ను తెరిచి ఉంచినందుకు నిర్వాహకులను, కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకుగాను అక్కడ ఉన్నా 34 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 27 మంది కస్టమర్లు ఉండగా.. ఏడుగురు సిబ్బంది ఉన్నారు. ఈ నేపథ్యంలో సుసానే ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారనే వార్తలు వచ్చాయి. వీటిపై ఆమె స్పందించారు. తనను అరెస్ట్ చేశారంటూ మీడియాలో వస్తోన్న వార్తలు పూర్తిగా అవాస్తవం అన్నారు సుసానే ఖాన్. దీని గురించి తమను లేదా క్లబ్ యాజమాన్యాన్ని సంప్రదించకుండా ఊహాగానాలు ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. తమ నుంచి ప్రకటన వచ్చే వరకు ఆగరు.. స్వయంగా వారే ఎంక్వైరీ చేయ్యరు. ఏది తోస్తే అది రాస్తారు.. ఇలాంటి అవాస్తవాలు ఎందుకు ప్రచారం చేస్తారో తనకు అర్థం కావడం లేదన్నారు సుసానే ఖాన్. ఇక దీని గురించి తానే స్వయంగా వివరణ ఇవ్వాలని భావించానని వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ లేఖ విడుదల చేశారు సుసానే ఖాన్. దీనిలో ఆమె ‘గత రాత్రి క్లోజ్ ఫ్రెండ్ బర్త్‌డే పార్టీలో భాగంగా సహార్ జేడబ్ల్యూ మారియట్‌లోని డ్రాగన్ ఫ్లై క్లబ్‌కి వెళ్లాం. పార్టీ టైం కాస్త ఎక్స్టెండ్ అయ్యింది. ఉదయం 2.30గంటల సమయంలో అధికారులు క్లబ్‌లోకి వచ్చారు. యాజమాన్యాన్ని పిలిచి కొత్త కర్ఫ్యూ నియమాలు గురించి చెప్పి.. ఇంతసేపు ఎందుకు ఒపెన్ చేసి ఉంచారనే తదితర విషయాల గురించి ఎంక్వైరీ చేశారు. అక్కడ ఉన్న వారందరని మరో మూడు గంటల పాటు వెయిట్ చేయాల్సిందిగా కోరారు. ఉదయం 6 గంటలకి మమ్మల్ని బయటకు పంపిచారు. ఇది వాస్తవంగా జరిగింది. ఇక మీడియాలో నేను అరెస్ట్ అయ్యానంటూ వస్తున్న వార్తలు పూర్తిగా బాద్యతారహితమైనవి.. అవాస్తవాలు’ అని పేర్కొన్నారు సుసానే. (చదవండి: రైనా, టాప్ హీరో మాజీ భార్య అరెస్ట్) View this post on Instagram A post shared by Sussanne Khan (@suzkr) ఇక ఇందుకు సంబంధించి గురు రంధావా కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. గత రాత్రి జరిగిన సంఘటనకు తాను ఎంతో బాధపడుతున్నానని... కొత్త కర్ఫ్యూ నియమాల గురించి తనకు తెలియదని.. ఇక మీదట ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని దానిలో వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తానని తెలిపారు. -
రైనా, టాప్ హీరో మాజీ భార్య అరెస్ట్
ముంబై : టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముంబై విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ముంబై డ్రాగన్‌ఫ్లై క్లబ్లో జరిగిన దాడుల్లో రైనాతో పాటు గాయకుడు గురు రాంధవాతో అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసాన్నే ఖాన్ సహా మరికొందరు సెలబ్రిటీలు ఉన్నారు. అయితే వెంటనే వారిని బెయిల్‌పై విడుదల చేశారు. కరోనా నిబంధనలకు విరుద్ధంగా పబ్ నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో రైడ్స్ నిర్వహించారు. ఈ దాడిలో ముంబై క్లబ్‌కు చెందిన ఏడుగురు సిబ్బందితో సహా మొత్తం 34 మందిని అరెస్టు చేశారు.(చదవండి : ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ఇంటికి వచ్చి) కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు అరెస్టు చేసి కేసు నమోదు చేశామని.. వారిలో గాయకుడు గురు రాంధవా, క్రికెటర్ సురేష్ రైనా కూడా ఉన్నారని సహార్ పోలీస్ స్టేషన్ తెలిపింది. అనంతరం నిందితులను బెయిల్‌పై విడుదల చేశారు. క్రికెటర్ సురేష్ రైనాతో పాటు 34 మందిపై ఐపిసి సెక్షన్ 188, 269, 34, ఎన్ఎండిఎ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. కరోనా నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంతో పాటు ముంబైలో డిసెంబర్ 22 నుండి జనవరి 5 వరకు ప్రజా కార్యకలాపాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. (చదవండి : బ్రాడ్‌మన్ క్యాప్‌కు అరుదైన గౌరవం) -
దుబాయ్ బంగారం: కృనాల్ పాండ్యాకు షాక్
సాక్షి, ముంబై : టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 2020 క్రికెట్ సంబరం ముగిసిన అనంతరం భారత్‌కు తిరిగి వస్తుండగా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో పాండ్యాకు ఎదురుదెబ్బ తగిలింది. దుబాయ్ నుంచి బంగారంతోపాటు ఇతర విలువైన వస్తువులను అక్రమంగా తీసుకొస్తున్నారనే ఆరోపణలతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వర్గాలు అతడిని అడ్డుకున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకువచ్చాడనే ఆరోపణలతో క్రునాల్ పాండ్యాను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నామని డీఆర్ఐ వర్గాలు తెలిపాయి. దీనిపై నిర్దిష్ట సమాచారాన్ని వెల్లడించలేదు. కానీ పరిమితి కంటే ఎక్కువ బంగారం దీనితో పాటు మరికొన్ని విలువైన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. హార్దిక్ పాండ్య సోదరుడైన కృనాల్ ఎడమచేతి వాటం బ్యాట్స్ మాన్, బౌలర్‌గా రాణిస్తున్నారు. పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా పాండ్యా ప్రాతినిధ్యం వహించిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2020 టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. Cricketer Krunal Pandya stopped by Directorate of Revenue Intelligence (DRI) at the Mumbai International Airport over suspicion of being in possession of undisclosed gold and other valuables, while returning from UAE: DRI sources pic.twitter.com/9Yk82coBgz — ANI (@ANI) November 12, 2020 -
అదానీ–జీవీకే ఎయిర్పోర్ట్ ఒప్పందానికి సీఐఐ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్‌కు ఉన్న మెజారిటీ వాటాలను (50.50 శాతం) అదానీ గ్రూప్ కొనుగోలు చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇతరుల ప్రయోజనాలకు ఎటువంటి భంగం కలగకుండా కొన్ని షరతులకు లోబడి (గ్రీన్ చానెల్) ఇరు సంస్థల మధ్య ఈ ఒప్పందానికి మార్గం సుగమం అయ్యింది. ముంబై విమానాశ్రయంలో మెజారిటీ వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు ఆగస్టులో అదానీ గ్రూప్ తెలిపింది. ప్రస్తుత ప్రమోటరు జీవీకే సంస్థకు ఇందులో ఉన్న రుణభారాన్ని కొనుగోలు చేసి, ఈక్విటీ కింద మార్చుకోవడంతో పాటు ఇతర మైనారిటీ షేర్‌హోల్డర్ల వాటాలను కూడా దక్కించుకోనున్నట్లు వెల్లడించింది. దీని ప్రకారం జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ సంస్థ అయిన జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్ (జీవీకే ఏడీఎల్) రుణాన్ని అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్(ఏఏహెచ్) బ్యాంకర్ల నుంచి కొనుగోలు చేయనుంది. స్టాక్ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఎంఐఏఎల్)లో జీవీకే ఏడీఎల్‌కు ఉన్న 50:50% వాటాతో పాటు ఎయిర్‌పోర్ట్స్ కంపెనీ ఆఫ్ సౌతాఫ్రికా (ఏసీఎస్ఏ), బిడ్వెస్ట్ గ్రూప్ సంస్థలకు ఉన్న 23.5# వాటాలను కూడా (మొత్తం 74%) అదానీ కొనుగోలు చేయనుంది. తద్వారా దేశీయంగా విమానాశ్రయాల నిర్వహణ లో అతి పెద్ద ప్రైవేట్ సంస్థగా ఆవిర్భవించనుంది. -
ఆర్థిక వృద్ధికి ఎయిర్‌పోర్టుల ఊతం
న్యూఢిల్లీ: స్థానిక ఆర్థిక అభివృద్ధికి విమానాశ్రయాలు శక్తిమంతమైన చోదకాలుగా పనిచేస్తాయని అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ పేర్కొన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను పెద్ద నగరాలకు అనుసంధానం చేయడంలో కీలకపాత్ర పోషించగలవని ఆయన చెప్పారు. ముంబై విమానాశ్రయంలో మెజారిటీ వాటాల కొనుగోలు అనంతరం తమ ఎయిర్‌పోర్ట్‌ల వ్యాపార విభాగం మరింతగా విస్తరిస్తుందని అదానీ తెలిపారు. గ్రూప్‌లోని ఇతర వ్యాపారాలకు కూడా ఇది వ్యూహాత్మక అవకాశాలు సృష్టించగలదని ఆయన వివరించారు. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఎంఐఏఎల్)లో జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్‌కు చెందిన 50.50 శాతం వాటాలతో పాటు మైనారిటీ షేర్‌హోల్డర్ల వాటాలను కూడా కొనుగోలు చేస్తున్నట్లు అదానీ ఎయిర్‌పోర్ట్స్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నిస్సందేహంగా అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌పోర్టు. దీనితో పాటు నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మా ఆరు విమానాశ్రయాల పోర్ట్‌ఫోలియోకు తోడవుతుంది. ఈ పరిణామం మా ఇతర వ్యాపారాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకునేందుకు కూడా ఉపయోగపడగలదు‘ అని అదానీ ఒక ప్రకటనలో వివరించారు. 21 శతాబ్దంలోని టాప్ 5 అంతర్జాతీయ మెట్రోపాలిటన్ నగరాల్లో ఒకటిగా ముంబై మారనున్న నేపథ్యంలో దేశీయంగా ఇది ప్రధాన ఎయిర్‌పోర్ట్‌గా మార్చగలదని ఆయన పేర్కొన్నారు. విమాన ప్రయాణికుల సంఖ్య అయిదు రెట్లు పెరుగుతుందన్న అంచనాలతో దేశీయంగా 200 పైచిలుకు ఎయిర్‌పోర్టులు అదనంగా నిర్మించే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. టాప్ 30లోని ఒక్కో నగరానికి రెండు విమానాశ్రయాలు అవసరమవుతాయని అదానీ తెలిపారు. ఇందుకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేసేందుకు అదానీ ఎయిర్‌పోర్ట్స్ సర్వసన్నద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. -
అదానీ చేతికి ముంబై ఎయిర్పోర్ట్
న్యూఢిల్లీ: ముంబై విమానాశ్రయంలో మెజారిటీ వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు అదానీ గ్రూప్ తెలిపింది. ప్రస్తుత ప్రమోటరు జీవీకే సంస్థకు ఇందులో ఉన్న రుణభారాన్ని కొనుగోలు చేసి, ఈక్విటీ కింద మార్చుకోవడంతో పాటు ఇతర మైనారిటీ షేర్‌హోల్డర్ల వాటాలను కూడా దక్కించుకోనున్నట్లు వెల్లడించింది. అదానీ గ్రూప్, జీవీకే గ్రూప్ ఈ మేరకు స్టాక్ ఎక్సే్ఛంజీలకు వేర్వేరుగా తెలియజేశాయి. దీని ప్రకారం జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ సంస్థ అయిన జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్ (జీవీకే ఏడీఎల్) రుణాన్ని అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ (ఏఏహెచ్) బ్యాంకర్ల నుంచి కొనుగోలు చేయనుంది. అయితే, అదానీ గ్రూప్‌నకు ఎంత రుణం బదిలీ కానుంది, ఈక్విటీ కింద మార్చుకోవడానికి సంబంధించిన షరతులు మొదలైన వివరాలు వెల్లడి కాలేదు. ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఎంఐఏఎల్)లో జీవీకే ఏడీఎల్‌కు ఉన్న 50.50% వాటాతో పాటు ఎయిర్‌పోర్ట్స్ కంపెనీ ఆఫ్ సౌతాఫ్రికా(ఏసీఎస్ఏ), బిడ్వెస్ట్ గ్రూప్ సంస్థలకు ఉన్న 23.5% వాటాలనూ (మొత్తం 74%) అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది. తద్వారా దేశీయంగా విమానాశ్రయాల నిర్వహణలో అతి పెద్ద ప్రైవేట్ సంస్థగా ఆవిర్భవించనుంది. అదానీ గ్రూప్ ఇటీవలే ఆరు నాన్–మెట్రో ఎయిర్‌పోర్టుల నిర్వహణ కాంట్రాక్టులు దక్కించుకున్న సంగతి తెలిసిందే. కరోనా ప్రభావం .. ఓవైపు కరోనా వైరస్ దెబ్బతో ఏవియేషన్ రంగం కుదేలవడం, మరోవైపు నిధుల మళ్లింపు ఆరోపణలపై జీవీకే గ్రూప్‌పై సీబీఐ కేసు నమోదు చేయడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ డీల్ ప్రాధాన్యం సంతరించుకుంది. ‘విమానయాన రంగంపై కరోనా వైరస్ తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. అనేక సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయినట్లయింది. ఎంఐఏఎల్ ఆర్థిక పరిస్థితిపైనా ప్రతికూల ప్రభావం పడింది. కాబట్టి సాధ్యమైనంత తక్కువ సమయంలో ఆర్థికంగా పటిష్టంగా ఉన్న ఇన్వెస్టరును తీసుకురావడం తప్పనిసరైంది‘ అని జీవీకే చైర్మన్ జీవీకే రెడ్డి తెలిపారు. మరోవైపు, ‘ప్రపంచంలోనే అత్యంత ప్రధానమైన మెట్రోపోలిస్‌లలో ఒకటైన ముంబై విమానాశ్రయం ద్వారా విమాన ప్రయాణికులకు సేవలు అందించే అవకాశం లభించడం అదృష్టం‘ అని అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు. అదానీ స్టాక్స్ డౌన్..: సోమవారం అదానీ గ్రూప్ స్టాక్స్ దాదాపు 5.3% దాకా నష్టాల్లో ముగిశాయి. జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రా షేరు 4.89% పెరిగి రూ.3.35 అప్పర్ సర్క్యూట్ తాకింది. ఏడీఐఏతో ఒప్పందం రద్దు.. తాజా డీల్ నేపథ్యంలో గతంలో అబుధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ), కెనడాకు చెందిన పబ్లిక్ సెక్టార్ పెన్షన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్, ప్రభుత్వ రంగ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్)తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు జీవీకే తెలిపింది. జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్‌లో 79 శాతం వాటాలను విక్రయించేందుకు గతేడాది అక్టోబర్‌లో ఈ సంస్థలతో జీవీకే గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ రూ. 7,614 కోట్లు. -
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ‘అదానీ’ ల్యాండింగ్!
న్యూఢిల్లీ: రుణ భారంతో పాటు ఆర్థిక అవకతవకలపై సీబీఐ విచారణతో సతమతమవుతున్న ఇన్ఫ్రా దిగ్గజం జీవీకే గ్రూప్ తాజాగా ప్రతిష్టాత్మక ముంబై విమానాశ్రయ ప్రాజెక్టు నుంచి నిష్క్రమించనున్నట్లు తెలుస్తోంది. పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (ఎంఐఏఎల్)లో మెజారిటీ వాటాలను కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎంఐఏఎల్‌లో జీవీకే గ్రూప్‌నకు ఉన్న 50.5 శాతం వాటాలతో పాటు మైనారిటీ భాగస్వాములైన ఎయిర్‌పోర్ట్స్ కంపెనీ సౌతాఫ్రికా (ఏసీఎస్ఏ), బిడ్వెస్ట్ గ్రూప్ నుంచి మరో 23.5 శాతం వాటాలను అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించి జీవీకే, అదానీ గ్రూప్‌ల మధ్య ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిగినట్లు, అంతిమంగా ముంబై ఎయిర్పోర్ట్ నుంచి జీవీకే నిష్క్రమించే అవకాశాలే ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్‌పై పలు టీమ్‌లు కసరత్తు చేస్తున్నాయని, మరికొద్ది వారాల వ్యవధిలోనే ప్రాథమిక వివరాలను ప్రకటించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. సుమారు రూ. 705 కోట్లు నిధులు పక్కదారి పట్టించిందన్న ఆరోపణల మీద జీవీకే గ్రూప్‌పై సీబీఐ విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఈ డీల్ వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గతేడాది నుంచే అదానీ కసరత్తు .. ఎంఐఏఎల్‌లో జీవీకే గ్రూప్‌నకు 50.5 శాతం, బిడ్ సర్వీసెస్ డివిజన్ మారిషస్ (బిడ్వెస్ట్)కు 13.5 శాతం, ఎయిర్‌పోర్ట్స్ కంపెనీ సౌతాఫ్రికాకు 10 శాతం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు (ఏఏఐ)కు 26 శాతం వాటాలు ఉన్నాయి. బిడ్వెస్ట్ వాటాలను అదానీ గ్రూప్ గతేడాది మార్చిలో రూ. 1,248 కోట్లకు కొనుగోలు చేయాలని ప్రయత్నించింది. అయితే, ఈ విషయంలో ముందుగా తమకే అధికారం ఉంటుందంటూ జీవీకే గ్రూప్ ఈ డీల్‌ను అడ్డుకుంది. కానీ, బిడ్వెస్ట్ వాటా కొనుగోలు చేసేంత స్థాయిలో నిధులను సమకూర్చుకోలేకపోయింది. దీంతో వివాదం కోర్టుకు చేరింది. ప్రస్తుతం జీవీకే గ్రూప్ ఆర్థిక పరిస్థితులు గణనీయంగా దిగజారడంతో అదానీ గ్రూప్‌నకు తన వాటా కూడా అమ్మేసి వైదొలిగే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పోర్టుల నుంచి ఎయిర్‌పోర్టుల వరకూ.. నౌకాశ్రయాల నుంచి విమానాశ్రయాల దాకా అదానీ గ్రూప్ భారీ స్థాయిలో కార్యకలాపాలు విస్తరిస్తోంది. లక్నో, జైపూర్, గువాహటి, అహ్మదాబాద్, తిరువనంతపురం, మంగళూరులో ఎయిర్పోర్ట్ అథారిటీ నిర్మించిన 6 నాన్–మెట్రో ఎయిర్‌పోర్టుల నిర్వహణ కాంట్రాక్టులను దక్కించుకుంది. ఇక ఎంఐఏఎల్‌ను కూడా దక్కించుకుంటే ప్రభుత్వ రంగ ఏఏఐ మినహా ప్రైవేట్ రంగంలో అతిపెద్ద విమానాశ్రయాల ఆపరేటర్‌గా అదానీ నిలవనుంది. అంతర్జాతీయ స్థాయి ఇన్ఫ్రాతో విమానశ్రయాలను అభివృద్ధి చేయడం ద్వారా దేశంలోనే అతి పెద్ద ఎయిర్పోర్ట్ డెవలపర్‌గా ఎదగాలని భారీ లక్ష్యం నిర్దేశించుకున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ ఇటీవలే తన వార్షిక నివేదికలో వెల్లడించింది. తాజా డీల్ ఆ లక్ష్య సాధనకు తోడ్పడనుంది. గట్టెక్కేందుకు జీవీకే ప్రయత్నాలు.. రుణభారంతో సతమతమవుతున్న జీవీకే గ్రూప్ తమ జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్‌లో 79 శాతం వాటాలను విక్రయించేందుకు గతేడాది అక్టోబర్‌లో అబు దాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ), కెనడాకు చెందిన పబ్లిక్ సెక్టార్ పెన్షన్ (పీఎస్పీ) ఇన్వెస్ట్మెంట్స్, ప్రభుత్వ రంగ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 7,614 కోట్లు. ఈ నిధులను హోల్డింగ్ కంపెనీల రుణభారాన్ని తగ్గించుకునేందుకు వినియోగించుకోవాలని జీవీకే గ్రూప్ భావించింది. అయితే, ఈ డీల్ పూర్తయిందా లేదా అనేది ఇప్పటికీ వెల్లడి కాలేదు. ప్రస్తుతం మాత్రం ఎంఐఏఎల్‌లో వాటాలను అమ్ముకునేందుకు జీవీకే ప్రమోటర్లకు కాస్త వెసులుబాటు ఇచ్చేందుకు ఎన్ఐఐఎఫ్, ఏడీఐఏ, పీఎస్పీ ఇన్వెస్ట్మెంట్స్ అంగీకరించినట్లు సమాచారం. ఎంఐఏఎల్ ఖాతాల ఆడిట్ .. జీవీకే హోల్డింగ్స్‌పై సీబీఐ విచారణ నేపథ్యంలో ఎంఏఐఎల్‌కు చెందిన గడిచిన 10 సంవత్సరాల ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ నిర్ణయించింది. ఇందుకోసం డెలాయిట్ సంస్థను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. కంపెనీకి రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్షియానికి ఎస్బీఐ సారథ్యం వహిస్తోంది. చట్టప్రకారం మోసం ఆరోపణలపై ఎస్బీఐ కూడా విచారణ జరపాల్సి ఉంటుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. -
జీవీకే గ్రూప్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొరడా
-
జీవీకే స్కాం.. ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: ముంబై ఎయిర్‌పోర్టు స్కాం కేసులో ప్రముఖ పారిశ్రామిక వేత్త జీవీకే ఇళ్లు, కార్యాలయాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. మంగళవారం ముంబై, హైదరాబాద్‌లో ఈడీ తనిఖీలు నిర్వహిస్తుంది. మొత్తం మూడు చోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. నిధుల అవకతవకలకు పాల్పడినట్లు జీవీకే గ్రూప్‌పై ఆరోపణలు నేపథ్యంలో ఈ నెల 2న జీవీకే గ్రూప్ ప్రమోటర్లు జీవీరెడ్డి, సంజయ్‌రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది. బోగస్ బిల్లులు, షెల్ కంపెనీల్లోకి నిధులు మళ్లించినట్లు గుర్తించిన సీబీఐ ఇప్పటికే జీవీకే పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వెయ్యి కోట్ల నిధుల గోల్‌మాల్‌కు సంబంధించి ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. (జీవీకే గ్రూప్‌పై ఈడీ కొరడా) దేశంలో విమానాశ్రయల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, నిర్వహణ, అభివృద్ధి బాధ్యతలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చూస్తుంది. ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు జీవీకే గ్రూప్ ప్రమోటర్‌గా ఉన్న జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్, మరికొన్ని విదేశీ సంస్థలు (పీపీపీ పద్ధతిలో) సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందుకోసం ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఏఎల్) పేరిట జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేశాయి. 2006 ఏప్రిల్‌లో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), ఎంఐఏఎల్‌తో జీవీకే ఆపరేషన్, మేనేజ్మెంట్, డెవలప్మెంట్ అగ్రిమెంట్ (ఓఎండీఏ) ప్రకారం ఎయిర్‌పోర్టు అభివృద్ధి, నిర్వహణ పనులను మొదలు పెట్టింది. ఈ ఒప్పందం ప్రకారం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎంఐఏఎల్ తొలుత ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి, మిగిలిన నిధులను ఎయిర్‌పోర్టు అభివృద్ధి, నిర్వహణకు వినియోగించాలి. అయితే ఎయిర్‌పోర్టు అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను ఎంఐఏఎల్ వివిధ అభివృద్ధి పనుల పేరిట ఐశ్వర్యగిరి కన్స్టక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్, సుభాష్ ఇన్ఫ్రా ఇంజనీర్స్ ప్రైవేటు లిమిటెడ్, అక్వా టెక్‌సొల్యూషన్స్‌తోపాటు మరికొన్ని కంపెనీలతో బోగస్ కాంట్రాక్టు పనులు సృష్టించి రూ. 705 కోట్ల వరకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి నష్టం కలిగించినట్లు సీబీఐ అభియోగం మోపింది. 2017–18లో బోగస్ కాంట్రాక్టుల ద్వారా రూ. 310 కోట్ల మేర, సొంత సంస్థలకు రుణాల పేరిట రూ. 395 కోట్ల మేర జీవీకే నిధులు మళ్లించిందని సీబీఐ తెలిపింది. ఇందుకు కొందరు ఏఏఐ ఉద్యోగులు సహకరించారని సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొనడం గమనార్హం. -
ముంబై ఎయిర్‌పోర్టు పనుల్లో జీవీకే స్కాం!
సాక్షి, హైదరాబాద్: ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (ఎంఐఏఎల్)కు చెందిన రూ. 705 కోట్ల నిధులను దుర్వినియోగం చేసి కేంద్ర ప్రభుత్వానికి నష్టం చేకూర్చారన్న ఆరోపణలపై ప్రముఖ కార్పొరేట్ సంస్థ జీవీకే గ్రూప్‌తోపాటు మరికొన్ని కంపెనీలు, వ్యక్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ముంబై విభాగం కేసులు నమోదు చేసింది. లెక్కల్లో అధిక వ్యయం, తక్కువ ఆదాయం చూపడంతోపాటు రికార్డులను తారుమారు చేశారన్న అభియోగాలపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి నట్లు అధికారులు తెలిపారు. జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్ లిమిటెడ్, ముంబై ఎయిర్‌పోర్టు లిమి టెడ్, జీవీకే గ్రూప్ చైర్మన్ జీవీ కృష్ణారెడ్డి, ఎంఐ ఏఎల్ ఎండీ జీవీ సంజయ్‌రెడ్డి, ఐశ్వర్యగిరి కన్స్ట్ర క్షన్స్, కోటా ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, మరికొన్ని కంపెనీలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులపై ఫ్రాడ్, చీటింగ్, ఫోర్జరీ అభియోగాలతోపాటు ఐపీసీ 120బీ, 420, 467, 468, 471, పీసీ యాక్ట్ 1988 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ముంబై, హైదరాబాద్‌లలోని జీవీకే కార్యాలయాల్లో సీబీఐ అధికారులు బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు జరిపారు. ఏం జరిగింది? దేశంలో విమానాశ్రయల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, నిర్వహణ, అభివృద్ధి బాధ్యతలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చూస్తుంది. ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు జీవీకే గ్రూప్ ప్రమోటర్‌గా ఉన్న జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్, మరికొన్ని విదేశీ సంస్థలు (పీపీపీ పద్ధతిలో) సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందుకోసం ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఏఎల్) పేరిట జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేశాయి. 2006 ఏప్రిల్‌లో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), ఎంఐఏఎల్‌తో జీవీకే ఆపరేషన్, మేనేజ్మెంట్, డెవలప్మెంట్ అగ్రిమెంట్ (ఓఎండీఏ) ప్రకారం ఎయిర్‌పోర్టు అభివృద్ధి, నిర్వహణ పనులను మొదలు పెట్టింది. ఈ ఒప్పందం ప్రకారం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎంఐఏఎల్ తొలుత ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి, మిగిలిన నిధులను ఎయిర్‌పోర్టు అభివృద్ధి, నిర్వహణకు వినియోగించాలి. అయితే ఎయిర్‌పోర్టు అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను ఎంఐఏఎల్ వివిధ అభివృద్ధి పనుల పేరిట ఐశ్వర్యగిరి కన్స్టక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్, సుభాష్ ఇన్ఫ్రా ఇంజనీర్స్ ప్రైవేటు లిమిటెడ్, అక్వా టెక్‌సొల్యూషన్స్‌తోపాటు మరికొన్ని కంపెనీలతో బోగస్ కాంట్రాక్టు పనులు సృష్టించి రూ. 705 కోట్ల వరకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి నష్టం కలిగించినట్లు సీబీఐ అభియోగం మోపింది. 2017–18లో బోగస్ కాంట్రాక్టుల ద్వారా రూ. 310 కోట్ల మేర, సొంత సంస్థలకు రుణాల పేరిట రూ. 395 కోట్ల మేర జీవీకే నిధులు మళ్లించిందని సీబీఐ తెలిపింది. ఇందుకు కొందరు ఏఏఐ ఉద్యోగులు సహకరించారని సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొనడం గమనార్హం. -
విమానాన్ని ఢీకొన్న నిచ్చెన : ధ్వంసమైన రెక్కలు
ముంబై : బలమైన ఈదురు గాలులు ముంబై విమానాశ్రమయంలో బీభత్సం సృష్టించాయి. వేగంగా వీచిన ఈదురుగాలుల కారణంగా ముంబై విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానం నిచ్చెన.. అక్కడే ఆగిఉన్న ఇండిగో విమానాన్ని ఢీకొట్టింది. దీంతొ ఇండిగో విమానం రెక్కలు, ఇంజిన్‌ను కప్పిఉంచే భాగం ధ్వంసమైంది. శనివారం వీచిన ఈదురుగాలులు, అధిక వర్షపాతంతో ముంబై నగరం జలమయమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బలమైన గాలుల కారణంగా నిచ్చెన ఉన్న ప్రాంతం నుంచి వెనక్కి రావడంతో ఇండిగో విమానం రెక్కకి తగిలి విరిగిపోయినట్లు మీడియాల్లో వచ్చిన ఫొటోల ద్వారా తెలుస్తోంది. ఆ సమయంలో రెండు విమానాలు కూడా విమానాశ్రయంలోనే నిలిపివున్నాయని స్పైస్ జెట్ తెలిపింది.‘ఈ ప్రమాదం ముంబై విమానాశ్రయంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. స్పైస్ జెట్‌కు చెందిన విమానం మెట్ల నిచ్చెన దాని ఆపి ఉంచిన స్థానం నుండి వేరుచేయబడి ఇండిగోకు చెందిన విమానాన్ని బలంగా తాకింది. ఈ ప్రమాదంలో ఇండిగో విమాన రెక్కలు ధ్వంసమైయ్యాయి. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు’ అని స్పైస్ జెట్ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. -
7,614 కోట్లు సమీకరించిన జీవీకే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగంలో ఉన్న జీవీకే గ్రూప్ రుణ భారం తగ్గించుకునే పనిలో ఉంది. ఇందులో భాగంగా జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్‌లో 79.1 శాతం వాటాను విక్రయించింది. తద్వారా రూ.7,614 కోట్లు సమీకరించింది. అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ), పబ్లిక్ సెక్టార్ పెన్షన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ (పీఎస్పీ ఇన్వెస్ట్మెంట్స్), నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌తో (ఎన్ఐఐఎఫ్) ఈ మేరకు జీవీకే పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ కంపెనీలైన జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్, జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ మధ్య ఆదివారం ఒక ఒప్పందం కుదిరింది. డీల్ తదనంతరం జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్‌లో జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్, ఏడీఐఏ, పీఎస్పీ ఇన్వెస్ట్మెంట్స్, ఎన్ఐఐఎఫ్ వాటాదారులుగా ఉంటాయి. జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్‌లో జీవీకే గ్రూప్ వాటా 20.9 శాతానికి పరిమితం అవుతుంది. డీల్‌లో భాగంగా ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్, నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను రూ.9,608 కోట్లుగా విలువ కట్టారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో.. డీల్ ద్వారా వచ్చిన నిధులను ప్రాథమికంగా హోల్డింగ్ కంపెనీల్లో సుమారు రూ.5,500 కోట్ల రుణ భారం తగ్గించుకోవడానికి వినియోగించనున్నారు. అలాగే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్‌లో (ఎంఐఏఎల్) జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ తన వాటాను పెంచుకోనుంది. ఇందుకోసం ఎంఐఏఎల్‌లో దక్షిణాఫ్రికా సంస్థలు అయిన బిడ్వెస్ట్, ఎయిర్‌పోర్ట్స్ కంపెనీ సౌత్ ఆఫ్రికాలకు (ఏసీఎస్ఏ) ఉన్న వాటాను కొనుగోలు చేయనుంది. ఎంఐఏఎల్‌లో బిడ్‌వెస్ట్‌కు 13.5 శాతం, ఏసీఎస్ఏకు 10 శాతం వాటా ఉంది. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీవీకే గ్రూప్ కంపెనీ అయిన ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఇక కొత్తగా నిర్మితమవుతున్న నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి ప్రాజెక్టును ఎంఐఏఎల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో (ఎన్ఎంఐఏ) ఎంఐఏఎల్‌కు 74 శాతం వాటా ఉంది. నిష్క్రమణ కోసం.. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్‌లో (ఎంఐఏఎల్) వాటాదారులైన బిడ్వెస్ట్, ఏసీఎస్ఏ ఎప్పటి నుంచో తప్పుకోవాలని చూస్తున్నాయి. ఈ రెండు సంస్థలకు ఉన్న 23.5 శాతం వాటాను అదానీ కొనుగోలు చేయాలని భావించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో అదానీ ప్రయత్నానికి అడ్డుకట్ట పడ్డట్టే. ఎంఐఏఎల్‌లో జీవీకే గ్రూప్‌నకు 50.5 శాతం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 26 శాతం వాటా ఉంది. బిడ్వెస్ట్, ఏసీఎస్ఏల నుంచి 23.5 శాతం వాటా దక్కించుకోవడం ద్వారా.. జీవీకే గ్రూప్ వాటా 74 శాతానికి చేరనుంది. అయితే రైట్ ఆఫ్ ఫస్ట్ రెఫ్యూజల్ కింద ఈ ఏడాది ప్రారంభంలో బిడ్వెస్ట్ తన 13.5 శాతం వాటాను విక్రయించనున్నట్టు జీవీకేకు తెలిపింది. అందుకు జీవీకే అంగీకరించింది. వాటా కింద ఇవ్వాల్సిన రూ.1,248 కోట్ల చెల్లింపు ఆలస్యం కావడంతో ఢిల్లీ హైకోర్టును బిడ్వెస్ట్ ఆశ్రయించింది. హైకోర్టు సూచన మేరకు వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌ను బిడ్వెస్ట్ ఆశ్రయించింది. అక్టోబరు 31లోగా ఈ చెల్లింపు పూర్తి చేయాలని జీవీకేను ట్రిబ్యునల్ ఆదేశించింది. జీవీకే నిర్వహణలోనే.. వాటా విక్రయం తర్వాత ఎయిర్పోర్ట్ వ్యాపార నిర్వహణ, బ్రాండింగ్ అంతా జీవీకే గ్రూప్ కిందనే ఉంటాయని సంస్థ తెలిపింది. గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టర్లు వెనుక ఉండడం ఎంఐఏఎల్, ఎన్ఎంఐఏ విస్తరణకు కలిసి వస్తుందని వివరించింది. ఎయిర్‌పోర్టుల వ్యాపారం మరింత బలంగా ఎదిగేందుకు దోహద పడుతుందని తెలిపింది. ఎంఐఏఎల్, నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా జీవీకే రెడ్డి, ఎండీగా జీవీ సంజయ్ రెడ్డి కొనసాగనున్నారు. వాస్తవానికి ఎయిర్పోర్ట్ వ్యాపారంలో 49 శాతం వాటాను ఏడీఐఏ, ఎన్ఐఐఎఫ్లకు విక్రయించాలన్న ప్రతిపాదనపై ఏప్రిల్‌లో సంతకాలు జరిగాయి. -
నవీ ముంబై ఎయిర్‌పోర్ట్‌కు రూ.8,500 కోట్లు
హైదరాబాద్: నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు తొలి దశకు జీవీకే గ్రూప్ రూ.8,500 కోట్లు వెచ్చించనుంది. తొలి దశ పూర్తి అయితే ఏటా ఒక కోటి మంది ప్రయాణికులకు సేవలు అందించే వీలవుతుంది. బుధవారం ఇక్కడ జరిగిన జీవీకే పవర్, ఇన్ఫ్రా వార్షిక సాధారణ సమావేశం సందర్భంగా వాటాదారులకు జీవీకే గ్రూప్ చైర్మన్ జి.వి.కె.రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. మరో రూ.2,500–3,000 కోట్లు వ్యయం చేయడం ద్వారా సామర్థ్యం రెట్టింపు అవుతుందని చెప్పారు. మొత్తం 1,160 ఎకరాల్లో ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి అయితే ఏటా 6 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించొచ్చు. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో మరో భాగస్వామి అయిన బిడ్వెస్ట్ నుంచి 13.5 శాతం వాటాను కొనుగోలు చేయాలని జీవీకే నిర్ణయించింది. కాగా, పంజాబ్‌లో 540 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు తాలూకు రూ.3,510 కోట్ల రుణాల బదిలీకి డాయిష్ బ్యాంకుతో చర్చిస్తోంది. -
బాంబే అంటే బాంబు అనుకుని..
ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబై పేరు గతంలో బాంబే కాగా ఆ పేరులో భయోత్పాతం కలిగించే శబ్ధం ఉండటంతో ఎవరు ఆ పేరును పిలిచినా ఉలిక్కిపడుతున్నారు. ఉద్యోగావకాశాల కోసం ఓ యువకుడు బొంబాయి విమానాశ్రయానికి ఫోన్ చేసి ఇది బాంబే ఎయిర్‌పోర్టేనా అని అడగటంతో కాల్ రిసీవ్ చేసుకున్న కంట్రోల్ రూం సిబ్బందికి ‘బాంబ్ హై’ అని వినిపించడంతో విమానాశ్రయంలో కలకలం రేగింది. భద్రతా సిబ్బంది అప్రమత్తమై రెండు గంటల పాటు హడావిడి సాగింది. చివరికి విషయం తెలియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. గత ఏడాది సైతం ఇలాంటి ఘటనే జరగడం గమనార్హం. ఓ కాలర్ బాంబే=ఢిల్లీ విమానం గురించి అడుగతూ బామ్-డెల్ ఫ్లైట్ అనగానే రిసీవర్‌కు బాంబ్ హై అని వినపడటంతో భద్రతా సిబ్బంది బాంబు కోసం ఎయిర్‌పోర్ట్‌ను జల్లెడ పట్టాల్సి వచ్చింది. కాల్ చేసిన వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు. నకిలీ కాల్‌తో బెంబేలెత్తించాడనే అనుమానంతో అతడ్ని పలు ప్రశ్నతలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. బాంబే-ఢిల్లీ విమానాన్ని ఏవియేషన్ కోడ్స్‌లో బామ్-డెల్గా వ్యవహరిస్తారని తాను అలాగే ఉచ్ఛరించానని కాల్ చేసిన వ్యక్తి నింపాదిగా చెప్పుకొచ్చారు. -
మీకు నా ఐడీ కావాలా : హీరోయిన్
ముంబై : బాలీవుడ్ స్టార్ దీపికా పదుకోన్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తండ్రి ప్రకాష్ పదుకోన్‌తో ముంబై ఏయిర్‌పోర్ట్‌కి వెళ్లిన దీపికాకు వింత పరిస్థితి ఎదురైంది. బాలీవుడ్లో అంతపెద్ద సెలబ్రిటీని ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది ఐడీ కార్డ్ చూపించాలని అడగటం అందర్నీ ఆశ్యర్యపరిచింది. అయితే ఈ ఘటనలో దీపికా వ్యవహరించిన తీరుకు ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. ఎయిర్పోర్ట్ ఎంట్రీ వద్ద భద్రతా సిబ్బంది దీపికాను ఐడీ కార్డు చూపించాలని అడిగారు. దీనికి ఆమె ఏమాత్రం చిరాకుపడకుండా, సెలబ్రెటీ అని అహం చూపకుండా మీకు ‘నా ఐడీ కావాలా’? అని.. తన ఐడీ కార్డును చూపించిన విదానానికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో భద్రతా సిబ్బంది తన విధులను సరిగ్గా నిర్వర్తించినందుకు కూడా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మేఘనా గుల్జార్ దర్శకత్వంలోని చపాక్ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్న దీపికా.. త్వరలో 83 సినిమాలో నటించబోతుంది. ఈ సినిమాలో ఆమె భర్త రణ్వీర్ సింగ్ జోడిగా నటిస్తున్నారు. వివాహం తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటించబోయే మొదటి సినిమా ఇదే. -
ఇషా కొప్పికర్ బ్యాగ్ ఖరీదు తెలిస్తే షాక్..
ముంబై : తమ స్టేటస్ చాటుకునేందుకు బాలీవుడ్ భామలు ఎంతైనా ఖర్చుచేస్తున్నారు. ఖరీదైన వస్తువులను ప్రదర్శిస్తూ స్టైల్ స్టేట్మెంట్లో ఒకర్ని ఒకరు మించిపోతున్నారు. తాజాగా నటి ఇషా కొప్పికర్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేశారు. ఎరుపు రంగు దుస్తులు, యాక్సెసరీస్‌తో ఆకట్టుకున్న ఇషా కొప్పికర్ ఖరీదైన వస్తువులతో రాజసం ప్రదర్శించారు. పొడవాటి రెడ్ గౌన్ ధరించిన ఇషా కొప్పికర్ తన క్రేజీ బ్యాగ్‌తో కెమెరాలకు ఫోజులిచ్చారు. ఈ బ్యాగ్ ధర భారత కరెన్సీలో రూ 14,54,849 మాత్రమే. కాగా, ఇషా డ్రెస్ ఆమెకు పెద్దగా నప్పలేదని, భారీ బ్యాగ్‌పైనే అందరి దృష్టి కేంద్రకృతమైందని అక్కడి వారు గుసగుసలాడటం వినిపించింది. -
ఆమె బ్యాగ్ ధరతో ఆర్నెల్లు బతికేయొచ్చు..
ముంబై : బాలీవుడ్ నటులు, సెలబ్రిటీలు తమ హోదాను చాటుకోవడానికో, స్టైల్ స్టేట్మెంట్ కోసమో ఖరీదైన వస్తువులు వాడుతుంటారు. తాజాగా బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కాస్ట్లీ లుక్‌తో హల్చల్ చేశారు. బేబీ పింక్ కలర్ షర్ట్, అదే రంగు జీన్స్ ధరించిన మనీషా సింపుల్‌గా కనిపించినా, ఆమె హ్యాండ్‌బ్యాగ్ మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. మనీషా చేతిలో కనిపించిన హ్యాండ్ బ్యాగ్ ధర భారత కరెన్సీలో రూ 1.7 లక్షలు. ఇక రూ 50 వేల ఖరీదైన షూ ధరించిన మనీషా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో తన ప్రత్యేకతను నిలుపుకునేందుకు బ్రాండెడ్ కలెక్షన్‌ను బాగానే డిస్ప్లే చేశారు. అయితే మనీషా బ్యాగ్ ధరతో ఓ సామాన్య కుటుంబం ఆర్నెల్ల పాటు హాయిగా బతికేయవచ్చు. -
దళిత ప్రొఫెసర్ ఆనంద్ అరెస్టు అక్రమం
పుణే: దళిత ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డే అరెస్ట్‌పై పుణే కోర్టు పోలీసులను తప్పుబట్టింది. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. గోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డే శనివారం తెల్లవారు జామున కేరళ నుంచి విమానంలో ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే పుణే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2017లో ఎల్గార్ పరిషత్‌లో జరిగిన సమావేశానికి మావోయిస్టులు మద్దతు తెలిపారనీ, ఆ సమావేశంలో వివిధ నేతల రెచ్చగొట్టే ప్రసంగాల కారణంగానే కోరేగావ్–భీమా యుద్ధం స్మారకం వద్ద హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయనేది పోలీసుల ఆరోపణ. తెల్తుంబ్డే మావోయిస్టుల మధ్య సాగిన ఉత్తరప్రత్యుత్తరాల వివరాలు కూడా తమ వద్ద ఉన్నాయంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసు అక్రమమంటూ తెల్తుంబ్డే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు కొట్టివేసేందుకు నిరాకరించిన న్యాయస్థానం.. ఈ నెల 11వ తేదీ వరకు ఆయన్ను అరెస్టు చేయరాదంటూ పోలీసులను ఆదేశించింది. ఆలోగా న్యాయస్థానం నుంచి బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అయితే, పుణే పోలీసులు ఈలోగానే అరెస్టు చేయడం అక్రమమని అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి కిశోర్ వదానే పేర్కొన్నారు. -
ఎయిర్‌పోర్ట్‌లో మెరిసిన కంగనా
ముంబై : స్టన్నింగ్ ఎయిర్పోర్ట్ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంటున్న బాలీవుడ్ భామల సరసన క్వీన్ బ్యూటీ కంగనా రనౌత్ చేరారు. కంగనా ఇటీవల ముంబై ఎయిర్‌పోర్ట్‌లో బ్లాక్ పవర్ సూట్ ధరించి స్టైలిష్ యాక్సెసరీస్‌తో మెరిసిపోయారు. బ్లాక్ సూట్‌పై వైట్ టీ షర్ట్, లెనాన్ గ్లాసెస్‌తో అల్ట్రా మోడ్రన్ లుక్‌తో దర్శనమిచ్చారు. కంగనా ఎయిర్పోర్ట్ లుక్‌లో హ్యాండ్ బ్యాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కంగనా చేపట్టిన బ్లాక్ వింటేజ్ టోటె బ్యాగ్ 6022 అమెరికన్ డాలర్లు కాగా మన కరెన్సీలో రూ 4,23,136. కంగనా రనౌత్ త్వరలో మణికర్ణికగా స్క్రీన్‌పై సందడి చేయనున్నారు. -
మలైకా బ్యాగ్ ఖరీదు ఎంతంటే..
ముంబై : బాలీవుడ్ భామల ఎయిర్పోర్ట్ లుక్ అందరినీ ఆకర్షిస్తున్న క్రమలో తాజాగా నటి మలైకా అరోరా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అందరి దృష్టినీ ఆకర్షించారు.స్టన్నింగ్ లుక్‌తో పాటు స్టైలిష్ యాక్సెసరీస్‌తో ఆకట్టుకున్నారు. గ్రే కలర్ డ్రెస్‌పై అదే కలర్ జాకెట్, బ్లాక్ గాగుల్స్‌తో కట్టిపడేశారు. ఇక ఆమె ధరించిన డ్రెస్, యాక్సెసరీస్‌లో హ్యాండ్‌బ్యాగ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ బ్యాగ్ ఖరీదు జస్ట్ 2900 అమెరికన్ డాలర్లు. అయితే భారత కరెన్సీలో దీని విలువ అక్షరాలా రూ 2.3 లక్షలపైచిలుకే. -
మద్యం కావాలంటూ మహిళ వీరంగం
సాక్షి, హైదరాబాద్: లండన్ నుంచి ముంబై వస్తోన్న ఎయిరిండియా విమానంలో ఓ మహిళ వీరంగం సృష్టించింది. తనకు మరింత మద్యం కావాలంటూ క్యాబిన్ సిబ్బందితో గొడవకు దిగింది. విమానంలో నానా హంగామా సృష్టించడంతో సిబ్బంది ఈ విషయాన్ని ముంబై ఎయిర్‌పోర్టు అధికారులకు తెలియజేశారు. ముంబై రాగానే ఆ యువతిని పోలీసులకు అప్పగించారు. విమానంలో హంగామా చేసిన ఆ యువతి ఐర్లాండ్ దేశస్తురాలిగా గుర్తించారు. -
మెరుపు సమ్మె.. విమానాలు ఆలస్యం
సాక్షి, ముంబై: ఎయిర్ ఇండియా కాంట్రాక్టు ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగడంతో ముంబై విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. చాలా విమానాలు ఆలస్యమయ్యాయి. ఇటీవల ఉద్యోగం నుంచి తొలగించిన తమ సహచరుడిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్న డిమాండ్‌తో బుధవారం రాత్రి నుంచి కిందిస్థాయి కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మె చేపట్టారు. ‘ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ (ఏఐఏటీఎస్) ఉద్యోగులు ఒక్కసారిగా సమ్మెకు దిగడంతో కొన్ని విమానాలు ఆలస్యమయ్యాయి. పరిస్థితిని అంచనా వేస్తున్నాం. విమాన రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నామ’ని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. అయితే సమ్మె కారణంగా ఎన్ని విమానాలకు ఆటంకం కలిగిందనేది స్పష్టంగా వెల్లడి కాలేదు. పరిస్థితిని చక్కదిద్దేందుకు విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిపోయిన ఎయిర్ ఇండియా ఉద్యోగులను మళ్లీ వెనక్కి పిలిచినట్టు తెలుస్తోంది. మరోవైపు విమానాల ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
అలియా బ్యాగ్‌పైనే అందరి చూపు..
సాక్షి, ముంబై : సెలబ్రిటీలు వాడే దుస్తులు, బ్యాగులు, యాక్సెసరీలు ఏమైనా అందరి చూపులూ వాటిపైనే కేంద్రీకృతమవుతుంటాయి. బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ ఇటీవల ముంబై విమానాశ్రయంలో బ్లూకలర్ బెల్ట్ బ్యాగ్‌తో సందడి చేశారు. అత్యంత ఖరీదైన ఈ బ్యాగ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. స్కైబ్లూ టీ షర్ట్‌పై అదే రంగు డెనిమ్స్ ధరించిన అలియా భట్ సింపుల్‌గా కనిపించినా, ట్రెండీ లుక్ మెయింటెయిన్ చేసింది.1890 అమెరికన్ డాలర్ల ఖరీదైన ఈ బ్యాగ్ మన కరెన్సీలో రూ 1,39,170లు పలుకుతుంది. బ్యాగ్ సైతం నీలం రంగులో ఉండేలా చూసుకున్న అలియా ఆల్ బ్లూ కలర్లో స్టన్నింగ్ ఎయిర్పోర్ట్ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంది. -
విమానం నుంచి కిందపడిన ఎయిర్ హోస్టెస్
-
విమానంలోంచి కిందపడిన ఫ్లైట్ అటెండెంట్
ముంబై: ముంబై ఎయిర్‌పోర్టులో ఓ 53 ఏళ్ల మహిళా ఫ్లైట్ అటెండెంట్ ఎయిరిండియా విమానం డోర్‌ను మూసే క్రమంలో అదుపు తప్పి కిందపడిపోయారు. దాంతో ఆ మహిళకు తీవ్రగాయాలైనట్లు ఎయిర్‌లైన్స్, ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ముంబై నుంచి న్యూఢిల్లీ వెళ్లేందుకు రన్‌వేపై సిద్ధంగా ఉన్న బోయింగ్–777 విమానం డోరును మూస్తూ ఫ్లైట్ అటెండెంట్ హర్షా లోబో అదుపుతప్పారు. దీంతో డోర్‌కు మెట్ల నిచ్చెనకు మధ్య ఖాళీలోంచి 20 అడుగుల కింద ఉన్న రన్‌వేపై పడ్డారు. ఆమె కాళ్ల ఎముకలు విరిగాయని.. నానావతి ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. -
అలియా బ్యాగ్ ఖరీదు ఎంతంటే..
ముంబై : బ్రాండెడ్ ఐటెమ్స్‌ను ప్రదర్శించడంలో బాలీవుడ్ నటులు ఎప్పుడూ ముందుంటారు. ఇక క్రేజీ హీరోయిన్ల విషయం ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ బల్గేరియా నుంచి ముంబైకి వస్తూ ఎయిర్‌పోర్ట్‌లో తళుక్కున మెరిశారు. దుస్తుల నుంచి యాక్సెసరీస్ వరకూ బ్లాక్ కలర్‌ను ఎంపిక చేసుకున్న అలియా రెడ్ బ్యాగ్‌ను ధరించి ఆకట్టుకున్నారు. స్పానిష్ లగ్జీరీ బ్రాండ్ బలెన్సియగకు చెందిన రెడ్ నైలాన్ బెల్ట్ ప్యాక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ బ్యాగ్ ఖరీదు 660 డాలర్లు కాగా భారత కరెన్సీలో రూ 45,000. అలియా భట్ మొత్తానికి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రెడ్ బ్యాగ్‌తో ఆల్ ఇన్ బ్లాక్ అంటూ స్టన్నింగ్ లుక్‌లో దర్శనమిచ్చారు. -
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం
సాక్షి, ముంబై: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. ముంబై ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో కంప్యూటర్ వ్యవస్థ స్థంభించడంతో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమాన రాకపోకలకు దాదాపు గంట ఆలస్యం కావచ్చని భావిస్తున్నారు. దీంతో విమాన ప్రయాణీకులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కంప్యూటర్ సేవల్లో వైఫల్యంగా కారణంగా దేశీయంగా, అంతర్జాతీయంగా అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన ముంబై ఎయిర్ పోర్ట్‌లో చెక్-ఇన్ సేవలకు బాగా ఆలస్యం మవుతోంది. కార్యక్రమాలను, సేవలను మాన్యువల్‌గా నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. #9Wupdate: Due to a LAN Network failure at #Mumbai International airport, check-in systems are impacted for all airlines and departure delays up to 1 hour are expected at Mumbai airport. — Jet Airways (@jetairways) July 31, 2018 -
జాన్వీ షూ ఖరీదెంతో తెలుసా?
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెరంగేట్రం చేసిన 'ధడక్' సినిమా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దీంతో జాన్వీతో పాటు కపూర్ ఫ్యామిలీ పట్టరానంత సంతోషంతో ఉంది. ఆమె ఈ మధ్య ఎక్కడ కనిపించినా.. సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది. తాజాగా జాన్వీ, సింగపూర్ నుంచి వస్తూ.. ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు. ఇక ఫోటోగ్రాఫర్లు వదిలిపెడతారా..? ఆమెను ఫోటోల మీద ఫోటోలు తీసి, మీడియా మాధ్యమాల్లో ప్రచురించాయి. అయితే ఈ ఫోటోల్లో ఆమె వేసుకున్న టీ-షర్ట్, షూ ఖరీదు వింటే నోళ్లు వెళ్లబెట్టాల్సిందే. ఆమె వేసుకున్న క్రీమ్ కలర్ కాటన్ జెర్సీ ఖరీదు రూ.33 వేలట. ఇది చిన్న స్లీవ్‌తో ఉన్న సెయింట్ లారెంట్ బాయ్‌ఫ్రెండ్ టీ-షర్టు. జాన్వీ టీ-షర్ట్‌తో పాటు ఆమె వేసుకున్న షూ కూడా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. తెలుపు రంగుల్లో పింక్, బ్లూ రంగులో లెదర్‌ను కలిగి ఉన్న ఈ షూస్, దాదాపు 1.37 లక్షల రూపాయలట. జాన్వీ వేసుకున్న ఈ టీ-షర్ట్‌ను, షూను రెండింటినీ కూడా స్పెయిన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ హౌజ్ బ్యాలెంసీగా నుంచి తెప్పించినవట. ఈ బ్రాండ్ ఫ్రెంచ్ మల్టినేషనల్ కంపెనీ కెరింగ్కు చెందినది. కాగ, ధడక్ మూవీ ప్రమోషన్స్ నుంచి ఆమె, స్టయిల్ లుక్స్‌లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. మరాఠి సినిమా సైరత్‌కు రీమేక్‌గా ధడక్ మూవీ బాలీవుడ్ బాక్సాఫీసును బద్దలు కొడుతోంది. -
ఆమె బ్యాగ్ ఖరీదుతో ఓ కారు కొనచ్చు...
ముంబై : ఒకప్పుడు భారత్‌లోనే అందరు నటీమణులకన్నా ఎక్కువ రెమ్యునరేషన్ అందుకునే నటి ఎవరైనా ఉన్నారా అంటే ఆమెనే కరిష్మా కపూర్. 1991 నుంచి 2004 వరకు సినీరంగంలో ఎంతో యాక్టివ్‌గా ఉన్న కరిష్మా, గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. ప్రతి జనరేషన్‌కు కరిష్మా కపూర్ స్టయిల్ ఐకాన్‌గానే నిలుస్తున్నారడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పట్లోనే అందమైన కథానాయికగా పేరు తెచ్చుకున్న ఈమె, ఇప్పటికీ ఏ మాత్రం తన బ్యూటీని తగ్గించుకోలేదు. 1990 ఏళ్లకి, ఇప్పటికీ ఏ మాత్రం తేడా కనిపించకుండా.. ఆమె తన లుక్‌ను మెయిన్టైన్ చేస్తున్నారు. తాజాగా కరిష్మా ఓ స్టన్నింగ్ లుక్‌తో ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రస్, బ్లాక్ హ్యాండ్‌బ్యాగ్, బ్లాక్ గ్లాసస్.. రెడ్ లిప్స్, రెడ్ షూతో అదుర్స్ అనిపించేలా ఫోటోగ్రాఫర్ల కంటపడ్డారు. తన జుట్టును సైడ్‌కు దువ్వుకుని వదిలిపెట్టుకోవడం మరింత ఆకట్టుకుంటోంది. అయితే ఆమె చేతులో ఉన్న ఆ బ్యాగ్, వేసుకున్న టీ-షర్ట్ ఖరీదు వింటే మీరు ఆశ్చర్యపోవాల్సిందేనట. సాదాసీదాగా కనిపించేలా ఆమె వేసుకున్న ఆ బ్లాక్ టీ-షర్ట్ పర్సియన్ బ్రాండ్ శాండ్రోకు చెందిందట. దాని ధర 6,184 రూపాయలని తెలిసింది. ఇక కరిష్మా చేతిలో టోట్ బ్యాగ్, ఫ్రెంచ్ హై-ఫ్యాషన్ లగ్జరీ గూడ్స్ తయారీదారి హీర్మేస్‌కు చెందిందట. దీని ధర 8,650 డాలర్లు అంటే సుమారు ఆరు లక్షల రూపాయలని తెలిసింది. అంటే ఈమె బ్యాగ్ ఖరీదుతో ఓ కారునే కొనుక్కోవచ్చట. ఇంత కాస్ట్లీ లుక్‌తో ఆమె ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు. కాగ, ఇటీవల కరిష్మా, రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలను కరిష్మా తండ్రి రణ్‌ధీర్ కొట్టిపారేశారు. పిల్లలే తన ప్రపంచమని ఆయన చెప్పారు. -
ఈ ప్రముఖ నటి ఎవరో గుర్తుపట్టగలరా?
ఆదివారం సందడిగా ఉన్న ముంబై ఎయిర్‌పోర్టులో ఉన్నట్టుండి ఫ్లాష్‌బల్బులు అన్ని ఒక్కసారిగా మరింత ప్రకాశవంతంగా వెలిగాయి. అక్కడ ఉన్నట్టుండి ఒక తార కనిపించింది. బ్లూ టాప్, బ్లాక్ జెగ్గింగ్ ధరించిన ఓ అందమైన యువతి అలా నడుచుకుంటూ వస్తోంది. కెమరా కన్ను కూడా ముందు ఆమెను గుర్తుపట్ట లేదు. ఓ నిమిషం తర్వాత అరె..! ఈమె తనా.. రెండేళ్లలో ఎంత మార్పు అంటూ ఆశ్చర్యపోయింది. ఇంతకు ఎవరామె అని ఆలోచిస్తున్నారా. ఆమె 2005లో ‘ఆషిఖ్ బనయా ఆప్నే’తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన నటి. ఇప్పటికైనా గుర్తుకోచ్చారా.. అవును ఆమె తనుశ్రీ దత్తా. రెండేళ్ల తర్వాత అమెరికా నుంచి ముంబై వచ్చారు తనుశ్రీ దత్తా. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో విక్టరి సింబల్‌ను చూసిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. 2003లో ‘మిస్ ఇండియా’గా నిలిచిన తనుశ్రీ ‘ఆషిఖ్ బనయా ఆప్నే’తో బాలీవుడ్లో ప్రవేశించి, ఆపై వరుసగా ‘చాకోలేట్’, ‘రఖీబ్’, ‘ధోల్’, ‘రిస్క్’, ‘గుడ్ బాయ్, బ్యాడ్ బాయ్’ వంటి హింది చిత్రాలోనే కాక తెలుగులో ‘వీరభద్ర’ సినిమాలో బాలయ్యతో జత కట్టారు. 2010లో వచ్చిన ‘అపార్ట్మెంట్’ తనుశ్రీకి హిందీలో చివరి సినిమా. రెండేళ్ల క్రితం ఈ నటి అమెరికా వెళ్లిపోయారు. అమెరికా నుంచి ముంబై వస్తుండగా విమానంలో తీసిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ ‘రెండేళ్ల తర్వాత ముంబై వస్తున్నాను. చాలా సంతోషంగా, మరికాస్తా ఆందోళనగా ఉందంటూ’ పోస్టు చేశారు. తనుశ్రీ ముంబై వచ్చిందని తెలిసిన ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మళ్లీ ఆమెను సినిమాల్లో నటించమని కోరుతున్నారు. ‘మీరు నటించిన ఆషిఖ్ బనయా ఆప్నే సీక్వెల్లో నటిస్తే చూడాలని ఉంటంటూ’ ఓ అభిమాని కోరాడు. తనుశ్రీ దత్తా (పాత చిత్రం) -
విమానం 6 గంటల ఆలస్యం.. రచ్చరచ్చ
ముంబై : ఎయిరిండియా విమానయాన సంస్థ మరోసారి ప్రయాణికుల ఆగ్రహనికి బలైంది. ఎయిరిండియాకు చెందిన ఏఐ 625 విమానం సుమారు ఆరు గంటల పాటు ఆలస్యం కావడంతో, ముంబై అంతర్జాతీయ విమానశ్రయంలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో లక్నోలో ఉదయం 10.30 గంటలకు దిగాల్సిన ప్రయాణికులు, సాయంత్రం 5 గంటలకు చేరుకున్నారు. విమాన రాకకు ఆలస్యంపై ఎయిరిండియా అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతో, బోర్డింగ్‌కు వేచిచూసిన ప్రయాణికులు తీవ్ర అసహనం పాలయ్యారు. మరోవైపు వారికి ఆహారం కానీ, మంచి నీళ్లు కానీ ఎలాంటి సౌకర్యాలను ఎయిరిండియా అధికారులు కల్పించలేదు. ఎందుకు విమానం ఆలస్యం అవుతుందో కూడా సమాధానం చెప్పకపోవడంతో ప్రయాణికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎయిరిండియాకు చెందిన ఏఐ 625 అసలు ఉదయం 8 గంటలకు బయలుదేరాల్సి ఉంది. ముంబై అంతర్జాతీయ విమానశ్రయం నుంచి 8 గంటలకు బయలుదేరి, లక్నోకు ఉదయం 10.30కు చేరుకోవాలి. కానీ మధ్యాహ్నం 2.30 అయినా విమానం టేకాఫ్ కాలేక పోయింది. విమానం కోసం వేచిచూస్తున్న ప్రయాణికులకు ఏమైందో కూడా తెలియలేదు. ఎయిరిండియా అధికారులను అడిగినా వారు కూడా సరిగ్గా స్పందించలేదు. సమాధానం చెప్పకపోగా.. తమల్ని తప్పించుకుంటూ తిరిగారని ప్రయాణికుడు వివేక్ భల్లా చెప్పాడు. ఇక గ్రౌండ్ స్టాఫ్ అయితే తమతో చాలా అమర్యాదగా వ్యవహరించినట్టు పేర్కొన్నాడు. తమల్ని బెదిరించినట్టు కూడా తెలిపాడు. సీఐఎస్ఎఫ్ అధికారులు మధ్యలో కల్పించుకుని, తమల్ని వారి బారి నుంచి కాపాడినట్టు పేర్కొన్నాడు. ఎయిరిండియా అధికారులు ఎప్పుడూ ప్రయాణికులతో అమర్యాదగానే వ్యవహరిస్తారని భల్లా చెప్పాడు. ప్రతి ఒక్కరూ నరకయాతన అనుభవించినట్టు చెప్పాడు. లక్నోలో తమ బంధువు చనిపోతే, కడసారి చూపుకు వెళ్తున్న ఓ ప్రయాణికులకు అది నెరవేరకుండా చేశారని మండిపడ్డాడు. విమాన టిక్కెట్లపై తాము భారీ మొత్తంలో వెచ్చిస్తామని, కానీ వారు తీరిగ్గా గంటల కొద్దీ విమానాన్ని ఆలస్యం చేస్తారని ఎద్దేవా చేశాడు. విమానం ఆలస్యం, సరిగ్గా స్పందించలేకపోవడంపై పైలెట్, విమానంలో ప్రయాణికులను క్షమాపణ కోరాడు. సిబ్బందితో హైదరాబాద్ నుంచి వస్తున్న విమానం టెక్నికల్ సమస్యతో ఆలస్యమైందని, తమ మొత్తం ప్రొగ్రామ్‌లను రీషెడ్యూల్ చేసి, కొత్త విమానం, సిబ్బందిని నియమించినట్టు పేర్కొన్నాడు. -
ముంబైకి విమానంలో వెళ్లేవారికి గమనిక
ముంబై: విమానంలో ముంబై నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి, ఇతర ప్రాంతాల నుంచి ముంబైకి వచ్చే వారికి ముఖ్య గమనిక. ఏప్రిల్ 9, 10 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య చత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వచ్చే విమానాలు రద్దయ్యాయి. రన్‌వేపై ఉన్న రబ్బర్ డిపాజిట్స్‌ను తొలగించడంలో భాగంగా ఈ సమయాల్లో విమానాల అనుమతిని నిలిపేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. పూర్తిగా కార్యకలాపాలు నిలిపేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. విమానాశ్రయ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంతో పలు విమానయాన సంస్థలు విమాన సర్వీసులను రద్దు చేసి రీషెడ్యూల్ చేశాయి. ఈ రెండు తేదీల్లో విమానయాణం చేసే ప్రయాణికులు సమయ మార్పుల గురించి తమ ఎయిర్‌లైన్స్ వెబ్సైట్లలో తెలుసుకోవాలని సూచించారు. చత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు గతంలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఇండియా(ఏఏఐ) ఆధీనంలో ఉండేది. 2006 నుంచి పీపీపీ పద్ధతిలో ముంబై ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టు ప్రైవేటు లిమిటెడ్, జీవీకే-లెడ్ కన్సార్టియం, ఏఏఐలు కలిసి ఎయిర్‌పోర్టును నిర్వహణను చూస్తున్నాయి. 75 ఏళ్ల క్రితం సింగిల్ ఇంజిన్ కలిగిన ఒకే విమానంతో ఎయిర్‌పోర్టు ప్రారంభమైంది. ప్రస్తుతం 867 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. సంవత్సరానికి 4.52 కోట్ల మంది ఈ ఎయిర్‌పోర్టు ద్వారా ప్రయాణం చేస్తున్నారు. సింగిల్ రన్‌వే పై ఒకే రోజు 935 విమానాలు రాకపోకలు సాగించడం చత్రపత్రి శివాజీ ఇంటర్నేషనల్ సాధించిన ప్రపంచ రికార్డు. -
ట్యాక్సీ డ్రైవర్‌తో గుంజీలు.. వైరల్ వీడియో
సాక్షి, ముంబై: టాక్సీ డ్రైవర్లు కచ్చితంగా వారి బ్యాడ్జీ ధరించాలని పోలీసులు, అధికారులు సూచిస్తుంటారు. కానీ ముంబైకి చెందిన ఓ ట్యాక్సీ డ్రైవర్ అనధికారికంగా డ్రైవింగ్ చేసినందుకు మూల్యం చెల్లించుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన నేత ఆ ట్యాక్సీ డ్రైవర్ యూనిఫాం ధరించలేదని, కనీసం అతడికి డ్రైవింగ్ బ్యాడ్జీ లేదని అతడితో గుంజీలు తీయించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) నేత నితిన్ నంద్‌గోకర్ స్పందించారు. ముంబై ఎయిర్‌పోర్టులో ఓ డ్రైవర్‌ను గమనించాను. అతడి వద్ద డ్రైవింగ్‌కు సంబంధించిన బ్యాడ్జీలేదు. అతడు డ్రైవింగ్ యూనిఫాం కూడా ధరించకుండా కనిపించాడు. సక్రమంగా బ్యాడ్జీ నెంబర్ తీసుకోవాలని, యూనిఫాం ధరించి డ్రైవింగ్ చేసుకోవాలని సూచించిన తర్వాత అతడు చేసిన తప్పును గుర్తించాలని డ్రైవర్‌తో గుంజీలు తీయించినట్లు వెల్లడించారు. మరోసారి ఇలా బ్యాడ్జీ, యూనిఫాం లేకుండా డ్రైవింగ్ చేయవద్దని సూచించినట్లు తెలిపారు. డ్రైవర్‌తో గుంజలీ తీయించిన వీడియో నంద్‌గోకర్ తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ట్యాక్సీ డ్రైవర్ భారీ మూల్యం చెల్లించుకున్నాడంటూ నెటిజన్లు కొందరు కామెంట్ చేయగా, ఎంఎన్ఎస్ నేత తీరును మరికొందరు తప్పుపడుతున్నారు. -
ట్యాక్సీ డ్రైవర్ యూనిఫాం ధరించలేదని..
-
24 గంటల్లో 980 విమానాలు
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన ఘనత సాధించింది. 24 గంటల్లో 980 విమానాల రాకపోకలతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సింగిల్ రన్‌వే విమానాశ్రయంగా రెండో ఏడాది కూడా రికార్డుల్లోకెక్కింది. జనవరి 20న ఈ విమానాశ్రయం ఈ ఘనత సాధించినట్లు ఎయిర్పోర్ట్ అధికార ప్రతినిధి తెలిపారు. గతేడాది డిసెంబర్ 6న 24 గంటల్లో 974 విమానాల రాకపోకలతో తన పేరిట ఉన్న రికార్డును ముంబై ఎయిర్పోర్ట్ బద్దలు కొట్టిందన్నారు. గత మార్చిలో ఒక్క రోజు వ్యవధిలో 837 విమానాల రాకపోకలతో ముంబై విమానాశ్రయం లండన్‌లోని గట్విక్ ఎయిర్పోర్ట్ (757 విమానాల రాకపోకలు)ను వెనక్కు నెట్టిందని వెల్లడించారు. ముంబై విమానాశ్రయం 24 గంటల పాటు పనిచేస్తే, ప్రభుత్వ నిషేధం కారణంగా గట్విక్ ఎయిర్పోర్ట్ ఉదయం 5 నుంచి రాత్రి 12 గంటల వరకే పనిచేస్తుందన్నారు. అయినప్పటికీ ఈ విమానాశ్రయానికి 2018లో రోజుకు 870 ఫ్లైట్ల రాకపోకల సామర్థ్యం ఉందన్నారు. రద్దీ సమయాల్లో ముంబై విమానాశ్రయంలో గంటకు 52 విమానాల రాకపోకలు జరిగితే, గట్విక్లో ఇది 55గా ఉంటుందన్నారు. విమానాలు నిలిపేందుకు ఎక్కువ చోటు లేకపోవడం, మౌలికవసతుల కొరత ముంబై ఎయిర్‌పోర్టుకు సమస్యగా మారిందన్నారు. -
బుద్ధుందా బ్రో?
గోవా ఫ్లయిట్ క్యాచ్ చెయ్యడానికి ఆదాశర్మ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఉంది. ఫ్యాన్స్ ఆమెను గుర్తు పట్టగానే అక్కడో చిన్న గుంపు తయారైంది. ‘కొద్దిగా దూరం జరగండి.. ప్లీజ్’ అన్నాడు ఆదా మేనేజర్. ఫ్లయిట్‌కి కొంచెం టైమ్ ఉంది కాబట్టి, ఫ్యాన్స్‌కి వాళ్ల కోరికపై ఆదాతో చిన్న ఇటరాక్షన్ కూడా పెట్టించాడు. మధ్యలో ఒక మిడిల్ ఏజ్డ్, మ్యారీడ్ గై.. చెయ్యెత్తాడు. ‘‘నాకో కిస్ ఇస్తావా మిస్’’ అని. ఆదాకు మతి పోయింది! ‘నో’ అంది. ‘‘నేను మీ బ్రదర్నో, ఫాదర్నో అనుకుని ముద్దివ్వొచ్చు కదా.. నా చెంపల మీద’’ అన్నాడు. ఆదాకు అతడి చెంప పగల గొట్టాలనిపించింది. చిరునవ్వుతో మళ్లీ ‘నో.. నో..’ అన్నట్లు తల ఊపింది. ‘కమాండో 2’ లో ముద్దు పెట్టుకున్నావు! ‘హార్ట్ ఎటాక్‌లో’ నిమిషం నలభై ఐదు సెకన్లు ఒకే కిస్ మీద ఉన్నావు. నాకు ఇవ్వడానికి ఏమైంది బేబీ’ అన్నాడు. ‘ఓరి దరిద్రుడా.. అది సినిమారా. అందులో ముద్దు పెట్టింది నేను కాదు. నా క్యారెక్టర్’ అని అనాలనుకుంది కానీ అనలేకపోయిందట ఆదా. ఫ్యాన్స్ మూడ్ పాడు చేసి, తన మూడ్ పాడు చేసుకోవడం ఎందుకని. తర్వాత తన బాధను ట్విట్టర్లో పెట్టింది. ‘‘సినిమాలో నా మోకాళ్లు కనిపించవచ్చు. నా మోచేతులు కనిపించవచ్చు. నా వెన్ను, నా భుజాలు కూడా. దానర్థం నేను వాంఛతో రగిలిపోతున్నానని కాదు కదా’’ అని. ఎంతో బాధగా, కోపంగా. దీనిపై ఇప్పుడు పెద్ద డిబేట్ నడుస్తోంది. సినిమా హీరోయిన్లు పబ్లిక్ ఫిగర్స్ అయినంత మాత్రాన పబ్లిక్ ప్రాపర్టీ అయిపోతారా? మైండ్ సెట్ మార్చుకోండి బ్రో. -
పైలెట్ లేక 250 మంది 7 గంటలు నిరీక్షణ.!
-
పైలెట్ లేక 250 మంది ప్రయాణీకుల నిరీక్షణ.!
ముంబై : పైలెట్ గైర్హాజరుతో 250 మంది ప్రయాణీకులు చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానశ్రయంలో సుమారు 7 గంటలు నిరీక్షించారు. ముంబై నుంచి అహ్మదాబాద్ వెళ్లాల్సిన ఏయిర్ ఇండియా విమానం ఉదయం 1.30 బయలుదేరాల్సి ఉండగా చివరి నిమిషంలో గంట ఆలస్యం అవుతుందని ప్రకటించారు. అనంతరం మరో 7 గంటల వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో ప్రయాణీకులంతా ఆగ్రహానికి గురయ్యారు. తిండి, నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు ఉదయం 9 గంటల సమయంలో పైలట్ రావడంతో విమానం బయలు దేరింది. ఈ విషయంపై ఏయిర్ ఇండియా అధికారులను వివరణ కోరగా.. స్పెషల్ ట్రైన్డ్ పైలెట్ గైర్హాజరుతో ఈ సమస్య ఎదురైందని, వేరే పైలెట్‌ను సద్దుబాటు చేసి 8.30 విమానం టేకాఫ్ అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. -
ప్రపంచ రికార్డు సృష్టించిన ముంబై ఎయిర్‌పోర్టు
సాక్షి, ముంబై: ముంబైలోని సహార్ ప్రాంతంలో ఉన్న ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ప్రపంచ రికార్డు సృష్టించింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు ఇలా 24 గంటల్లో ఒకే రన్ వే పై ఏకంగా 969 విమానాల (టేకాఫ్, ల్యాండింగ్) రద్దీని నియంత్రించి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అందుకు ప్రధాన కారణం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సిబ్బంది సమన్వయం, ఒక ప్రణాళిక బద్దంగా పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని ఎయిర్ పోర్టు అథారిటీ వర్గాలు తెలిపాయి. 2006 వరకు ముంబై విమానాశ్రయంలో గంటకు 30 విమానాల రాకపోకలు (టేకాఫ్, ల్యాండింగ్) ఏటీసీ సిబ్బంది నియంత్రించేవారు. ఆ తరువాత రెండేళ్లలో ప్రధాన రన్ వేలో మార్పులు, ఆధునిక రాడార్, ఇతర సాంకేతిక పరికరాలవల్ల ఈ సంఖ్య 52కు చేరింది. ఇదివరకు 24 గంటల్లో 852 విమనాలు రాకపోకలు సాగించినట్లు రికార్డులు ఉన్నాయి. ప్రతీరోజు రాకపోకలు సాగించే విమానాలకు తోడుగా ఎప్పుడైన అదనంగా విమానాల సంఖ్య పెరిగితే వాటిని నియంత్రించే సామర్ధ్యం తమ సిబ్బందికి ఉందని ఏటీసీ జనరల్ మేనేజరు ఆర్.కే.సక్సేనా పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి మొదలుకుని శనివారం రాత్రి వరకు ఇలా 24 గంటల్లో మొత్తం 969 విమానాలను నియంత్రించినట్లు ఆయన చెప్పారు. అయితే ఏ సమయంలో ఎక్కువ విమానాలు టేకప్, ల్యాండింగ్ అయ్యాయనేది చెప్పడం కష్టమని తెలిపారు. కాగా నిర్వాహణ పనుల కోసం ప్రతీరోజు రన్ వే ను ఒక గంటసేపు మూసి ఉంచాలనేది నియమాలున్నాయి. ఆ ప్రకారం 23 గంటల్లోనే 969 విమనాలను నియంత్రించి రికార్డు సృష్టించినట్లు స్పష్టమైతోందని ఆయన అన్నారు. ఇదిలాఉండగా ముంబై విమానాశ్రయంలో ప్రధాన రన్ వేపై ఏ–380 లాంటి భారీ విమానాలు టేకాప్, ల్యాండింగ్ చేసే సామర్థ్యం ఉంది. దీంతో ఈ రన్ వే కు క్యాట్–3 గ్రేడ్ లభించింది. సాధ్యమైనంత వరకు రన్ వే ను ఖాళీ చేస్తే వెనక వచ్చే విమనాలకు అవకాశం లభిస్తుంది. పూర్వం ఒక్కో విమానం ల్యాండింగ్ లేదా టేకప్ చేయడానానికి 60 సెకండ్లకు పైగా సమయం పట్టేది. ఇప్పుడు 47–48 సెకండ్లు మాత్రమే సమయం పడుతుంది. దీంతో విమానాలు రన్ వే మీదుగా టేకప్ లేదా ల్యాండింగ్ ఎక్కువ సంఖ్యలో చేయడానికి వీలుపడుతుందని సక్సేనా అన్నారు. -
డమ్మీ విమానానికి సీఐఐ అవార్డు
ముంబై: వ్యర్థాలతో తయారై పునర్వినియోగానికి అనుకూలమైన డమ్మీ విమానం ఏకంగా సీఐఐ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. మాక్ డ్రిల్‌లో భాగంగా దీనిని ఇటీవల ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (ఎంఏఐఎల్)లో దహనం చేశారు. సీఐఐ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో ఇది 30వ రెనోవేటివ్ కైజెన్ కాన్ఫరెన్స్ అండ్ కాంపిటిషన్ అవార్డును దక్కించుకుంది. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతి రెండున్నరేళ్లకోసారి నిర్వహించే అత్యవసర డ్రిల్‌కోసం వాడివదిలేసిన విమానాన్ని కాకుండా ఓ డమ్మీ విమానాన్ని సిద్ధం చేయాలని ఎంఏఐఎల్‌కు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ రెస్క్యూ అండ్ ఫైర్‌ఫైటింగ్ బృందం ఆలోచించింది. ఈ విషయమై ఎంఏఐఎల్ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ ‘డమ్మీ విమానానికి నిప్పంటించి అనంతరం డ్రిల్ నిర్వహించాలనే మా ఆలోచన కార్యరూపం దాల్చింది. ఇది అంతర్జాతీయంగా అనూహ్యరీతిలో అందరి మెప్పు పొందింది. దీంతోఅవార్డు కోసం దరఖాస్తు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఈ డమ్మీ విమానం తయారీకి రెండు నెలల సమయం పట్టింది. మాక్‌డ్రిల్ అనంతరం కూడా వినియోగించేలా ఎయిర్‌క్రాఫ్ట్ రెస్క్యూ అండ్ ఫైర్‌ఫైటింగ్ బృందం దీనిని రూపొందించింది. -
ముంబై ఎయిర్‌పోర్టు చాలా రద్దీ గురూ..
► ప్రపంచంలో అత్యంత రద్దీ విమానాశ్రయం ► ప్రతి 65 సెకండ్లకో విమానం ముంబై: ప్రపంచంలో అత్యంత రద్దీ ఎయిర్‌పోర్టుగా ముంబై పేరు పొందింది. ప్రపంచంలో రద్దీ విమానాశ్రయాల్లో లండన్, గట్విక్లను దాటి మొదటి స్థానానికి వచ్చింది. ముంబై విమానాశ్రయంలో ఒకే ఒక రన్‌వే ఉంది. ఇక్కడ ప్రతి 65 సెకండ్లకు ఓ విమానం ఎగరడమో, దిగటమో జరుగుతోంది. కార్గో విమానాలకు, ప్రయాణ విమానాలకు ఒకే రన్‌వే ఉండటంతో అత్యంత రద్దీ విమానాశ్రయంగా పేరుపొందింది. ప్రపంచంలోని పెద్ద విమానాశ్రయాలు ఢిల్లీ, దుబాయి, సింగపూర్, సిడ్నీ, లండన్, న్యూయార్క్‌ల్లో టేకాఫ్ ఒక రన్‌వే, లాండింగ్‌కు మరో రన్వేలు ఉన్నాయి. కానీ ముంబైలో ఒకే రన్‌వే గుండా టేకాఫ్, లాండింగ్ చేయాల్సి ఉంది. అందులో ఒకటి 927 మీటర్లు ఉన్న ప్రధాన రన్‌వే.. ఎప్పుడైన ఇది మరమ్మత్తులకు గురైతే రెండో 1432 మీటర్లు పొడవున్న రన్‌వేను ఉపయోగిస్తారు. ఆర్థిక సంవత్సరం ముగింపు 2017 మార్చి 31 నాటికి ముంబై ఎయిర్పోర్టుగుండా 45.2 మిలియన్ల మంది ప్రయాణించారు. రోజుకు సుమారు 837 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. సగటున అత్యంత రద్దీ విమానాశ్రయం గట్విక్ (757) తో పోలిస్తే సుమారు 80విమానాలు ఎక్కువగా ఉన్నాయని సీనియర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్ తెలిపారు. ప్రతి రెండు అరైవల్స్(ఆగమనం)కి 130 సెకండ్ల టైంను కేటాయిస్తున్నారు. వీటి మధ్యలో ఒక డిపార్చర్ ను ఇస్తున్నామని ఆయన అన్నారు. -
డస్ట్‌బిన్‌లో అంత బంగారం దొరికిందా..?
ముంబై: విమానాశ్రయాల్లో బంగారం పట్టుబడటం కొత్తేం కాదు. కాకపోతే ఈసారీ డస్టబిన్లో దొరికింది. ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డస్ట్‌బిన్‌లో పెద్ద మొత్తంలో బంగారం లభ్యమయింది. సాధారణ తనిఖీల్లో భాగంగా ఎయిర్‌పోర్టు కస్టమ్స్ ఇంటలిజెన్స్ విభాగం అధికారులు సోదాలు చేపట్టారు. పురుషుల టాయిలెట్‌లోని డస్ట్‌బిన్‌లో సుమారు 2.3కిలోల బంగారు ఆభరణాలు, కడ్డీలను అధికారులు గుర్తించారు. వీటి విలువ రూ.70లక్షల వరకు ఉంటుందని చెప్తున్నారు. వీటిని అక్రమంగా దేశంలోకి తీసుకువచ్చేందుకు గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నించి ఉంటారని, అది వీలుకాకపోవడంతో అక్కడే వదిలేసి ఉంటారని భావిస్తున్నారు. సీసీ ఫుటేజిలను పరిశీలించిన అనంతరం కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
పాదాలకు పసిడి బిస్కెట్లు అతికించుకుని..
ముంబై: బంగారం అక్రమ రవాణాకు స్మగ్గర్లు వినూత్న పద్ధతులు అవలంభిస్తున్నారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారం తీసుకువచ్చేందుకు రకారకాలుగా ప్రయత్నిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుడొకరు 12 బంగారపు బిస్కెట్లతో ముంబై విమానాశ్రయంలో ఏఐయూ అధికారులకు పట్టుబడ్డాడు. ఒక్కొక్కటి 100 గ్రాముల బరువున్న వీటి ధర రూ. 36,45,600గా అధికారులు అంచనా వేశారు. వీటిని తరలించేందుకు నిందితుడు అనుసరించిన విధానం చూసి అధికారులు అవాక్కయ్యారు. 12 బంగారపు బిస్కెట్లను రెండు కాళ్ల పాదాలకు అతికించుకుని ఏమీ ఎరగనట్టు విమానం దిగాడు. ఒక్కో పాదానికి ఆరేసి బిస్కెట్లు అంతికించాడు. అధికారులకు అనుమానం వచ్చి క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో బండారం బట్టబయలైంది. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
చెత్తకుండీలో రెండు కిలోల బంగారం
ముంబై: చెత్తకుండీలో కిలోల బంగారం లభ్యమవడం ముంబై ఎయిర్ పోర్టులో కలకలం రేపింది. ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల పక్కనే ఉన్న టాయ్‌లెట్ లోకి ఓ గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించాడు. బయటకు వచ్చిన తర్వాత అతడి కదలకలపై అనుమానం వచ్చిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. టాయ్లెట్లో కిలో బరువైన రెండు బంగారు బిస్కట్లను దాచినట్లు నిందితుడు పోలీసుల విచారణంలో వెల్లడించాడు. వెంటనే ఎయిర్ పోర్ట్ సిబ్బంది చెత్తకుండీలో ఉన్న రెండు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇదిగో... దీన్ని కూడా కాస్త సర్దుతావా!
భారత ఆటగాళ్లు ఎప్పుడైనా ఇలా సూట్‌కేసులు మోయడం చూశారా..! విమానాశ్రయమైనా, హోటల్ అయినా ఎలాంటి లగేజీ బాధ్యతలు లేకుండా వారంతా చెవులకు హెడ్‌ఫోన్‌తో దర్జాగా నడుచుకుంటూ వెళ్లిపోయే దృశ్యాలే మన కళ్ల ముందు కదులుతాయి. కానీ ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాత్రం భారత్‌లో దిగీ దిగగానే ఇలా సూట్‌కేసులు సర్దే పనిలోకి దిగిపోయారు. ఆటపరంగా అగ్రశ్రేణి జట్టు, వ్యక్తిగతంగా స్టార్ హోదా ఉన్నా సరే, వారంతా దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ‘శ్రమైక జీవన సౌందర్యం’ అంటూ కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ వార్నర్ ఇలా డీసీఎం వ్యాన్‌లోకి తమ బ్యాగేజీ తరలించడం చూసేవారందరికీ ఆశ్చర్యం కలిగించింది. ‘ఇదేమీ మాకు నామోషీగా అనిపించడం లేదు. ఇదంతా టీమ్ వర్క్లాంటిది. ఇంకా చెప్పాలంటే ఇలా మా అంతట మేం చేసుకుంటేనే పని తొందరగా అవుతుంది’ అని ఆస్ట్రేలియా జట్టు ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. మరో వైపు తాము కూలీలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కూడా ఆసీస్ క్రికెటర్లు తామే లగేజీ ఎత్తేందుకు ఆసక్తి చూపించారని బీసీసీఐ అధికారి ఒకరు వివరణ ఇచ్చారు. వారు ఎంత సిద్ధమైనా అతిథిగా వచ్చిన జట్టును ఇలా వదిలేయడం మాత్రం ఏ రకంగా చూసినా అభిలషణీయం కాదు. ఆటతో, మాటతో కూడా మనకు బలమైన ప్రత్యర్థే అయినా... భేషజాలు లేని ఆస్ట్రేలియా ఆటగాళ్లను అభినందించకుండా ఉండలేం! -
ముంబై చేరుకున్న ‘భారీ మహిళ’
క్రేన్ సాయంతో విమానాశ్రయం నుంచి ఆస్పత్రికి తరలింపు ముంబై: ప్రపంచంలోనే అత్యధిక బరువున్న మహిళల్లో ఒకరైన ఈజిప్ట్ కు చెందిన ఎమాన్ అహ్మద్(500 కేజీలు) బరువు తగ్గే ఆపరేషన్ కోసం శనివారం ముంబైకి చేరుకుంది. ఈజిప్ట్ ఎయిర్‌లైన్స్ కు చెందిన విమానంలో ప్రత్యేక బెడ్‌పై తీసుకొచ్చిన ఆమెను... ముంబై విమానాశ్రయం నుంచి సైఫీ ఆస్పత్రికి తరలించేందుకు క్రేన్ సాయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రక్‌లోకి క్రేన్ యంతో ఆమెను ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. ఆ ట్రక్‌ను అంబులెన్సు, పోలీస్ వాహనాలు అనుసరించాయి. కాగా, ఆస్పత్రిలో ఎమాన్ సం ప్రత్యేకంగా ఒక గదిని నిర్మించినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అధిక బరువు కారణంగా ఎమాన్ గత 25 ఏళ్లుగా కైరోలోని తన ఇంటి నుంచి కాలు బయటపెట్టలేదని చెప్పారు. నెలరోజుల పాటు పరిశీలనలో ఉంచి, అనంతరం ఆమెకు శస్త్రచికిత్స చేస్తామన్నారు. గత 25 ఏళ్లుగా ఎక్కడికీ కదలకపోవడం, పల్మొనరీ ఎంబాలిజంతో తీవ్రంగా బాధపడుతుండటంతో ఎమాన్ తరలించడం కోసం శ్రమించాల్సి వచ్చిందని వైద్యులు చెప్పారు. ఆమెను ఇంటి నుంచి బయటికి తీసుకురావడానికి గది గోడలను బద్దలుకొట్టారు. ఈజిప్ట్ కు చెందిన విమానంలో బెడ్ ఏర్పాటు చేయడంతో పాటు అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే తగిన చికిత్స అందించేందుకు వెంటిలేటర్, ఆక్సిజన్ సిలిండర్లు, మందులు తదితరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎమాన్ ప్రస్తుతం సర్జరీ నిఫుణుల పర్యవేక్షణలో ఉంది. -
రెడీమేడ్ గార్మెంట్స్‌లో చక్కగా చుట్టి ...
ముంబయి : నిన్న మొన్నటి వరకూ లగేజ్లోనో, బట్టల్లోనో, అండర్ గార్మెంట్స్లోనే బంగారాన్ని అక్రమంగా తరలించి విమానాశ్రయాల్లో పట్టుబడిన వార్తలు చూశాం. తాజాగా పెద్దనోట్ల రద్దు ఎఫెక్ట్‌తో కొత్తనోట్లను తరలించేందుకు అక్రమార్కులు కొత్తపంథాను ఎంచుకున్నారు. కొత్త రెడీమేడ్ దుస్తుల మాటున కొత్తనోట్ల కట్టలను చక్కగా ప్యాక్ చేసి తరలించేందుకు యత్నించారు. అయితే అనుమానం వచ్చిన అధికారులు ఆ రెడిమేడ్ గార్మెంట్‌ను తెరిచి చూసి ఆశ్చర్యపోయారు. బట్టలు నలిగిపోకుండా, సపోర్టుగా ఉంచే అట్టముక్కల మధ్యలో కొత్త 2వేల నోట్లు కవర్లలో ఉంచి ప్యాక్ చేశారు. ఒక్కో దానిలో నోట్ల కవర్లు నాలుగు ఉండటం విశేషం. ఈ ఘటన ముంబయి విమానాశ్రయంలో చోటుచేసుకుంది. కాగా ముంబయి నుంచి దుబాయి వెళుతున్న ప్రయాణికుల నుంచి లక్షల విలువైన రెండువేల నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నిందితుల వివరాలు తెలియరాలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ముంబాయి ఎయిర్‌పోర్టులో భారీ నగదు సీజ్
ముంబాయి ఎయిర్‌పోర్టులో భారీగా కొత్త కరెన్సీ నోట్లు పట్టుబడ్డాయి. దుబాయ్‌కి వెళ్తున్న ఓ ప్రయాణికుడి వద్ద నుంచి దాదాపు రూ.25 లక్షల విలువైన రూ.2000 కరెన్సీ నోట్లను కస్టమ్స్ ఎయిర్ ఇంటిలిజెన్స్ యూనిట్ బుధవారం సీజ్ చేసింది. భారత పాస్‌పోర్టు కలిగి ఉన్న ఆరిఫ్ కోయంటే అనే వ్యక్తి దుబాయ్‌కి వెళ్లడానికి స్పైస్ జెట్ విమానం ఎస్జీ 013 ఎక్కడానికి బయలుదేరాడు. అతని మధ్యలోనే ఆపిన కస్టమ్స్ ఎయిర్ ఇంటిలిజెన్స్ యూనిట్ ఆరిఫ్ బ్యాగులన్నీ చెక్ చేసింది. ఈ తనిఖీల్లో 52 ఎన్విలాప్ల్లో దాచుకున్న రూ.25 లక్షల కొత్త కరెన్సీని అధికారులు రికవరీ చేసుకున్నారు. కరెన్సీని దాచుకున్న ఈ 52 ఎన్విలాపులను రెడిమేడ్ గార్మెంట్స్‌లో చక్కగా చుట్టి దాచిపెట్టినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రయాణికుడిపై కేసు నమోదుచేసి, అరెస్టుచేశారు. పెద్ద నోట్లు రద్దు చేసినప్పటి నుంచి అక్రమార్కులు ఎయిర్‌పోర్టుల ద్వారా భారీ మొత్తంలో కొత్త, పాత కరెన్సీని తరలిస్తూ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. కోట్లకు కోట్ల కరెన్సీ, భారీగా బంగారం ఎయిర్‌పోర్టుల తనిఖీల్లో వెలుగులోకి వస్తున్నాయి. -
ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్లకు 'మహారాజ' హోదా
మహారాష్ట్ర రాజధాని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి, అక్కడి సీఎస్టీ స్టేషన్‌కు 'మహారాజ' హోదా లభిస్తోంది. ఇక మీదట ఆ విమానాశ్రయాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం అని పిలుస్తారు. చరిత్రాత్మక సీఎస్టీ రైల్వే స్టేషన్‌ను ఇకపై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ అంటారు. ఈ రెండు సంస్థలకు పేర్లు మార్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరాఠా వీరుడైన శివాజీకి మరింత గౌరవం ఇవ్వాలని, అందుకే కేవలం ఛత్రపతి శివాజీ అని వదిలేయకుండా మహారాజ అని తగలించాలని నిర్ణయించింది. మరో నెల రోజుల్లో బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పేర్ల మార్పు నిర్ణయాన్ని తీసుకోవడం గమనార్హం. -
ట్రాలీ బ్యాగ్‌లో బంగారం బిస్కెట్లు..
ముంబయి: అధికారులు ఎంత నిఘా పెట్టినా...అక్రమార్కులు మాత్రం వివిధ మార్గాల ద్వారా బంగారాన్ని తరలిస్తూనే ఉన్నారు. తాజాగా ముంబయిలోని ఛత్రపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా రూ.38 లక్షల విలువైన 12 గోల్డ్ బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. ట్రాలీ బ్యాగ్‌లో తరలిస్తున్న 12 బంగారు బిస్కెట్లను సీజ్ చేసిన అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గత నెలలో కూడా దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 19 లక్షల విలువైన బంగారాన్ని పట్టుకున్నారు. మరోవైపు బీఎస్ఎఫ్ జవాన్లు గురువారం ఓ బంగ్లాదేశీ పౌరుడు వద్ద సుమారు కేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. -
డ్రోన్ ఎగరేశారని.. ముగ్గురి అరెస్టు
దేశ ఆర్థిక రాజధాని ముంబై విమానాశ్రయం సమీపంలో డ్రోన్లు ఎగరేసినందుకు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలా డ్రోన్ ఎగరేయడాన్ని ఇండిగో ఎయిర్‌లైన్స్ పైలట్ గుర్తించారు. ఈ కేసులో రాహుల్ రాజ్‌కుమార్ జైస్వాల్ (24), రాణా సుభాష్ సింగ్ (25), విధిచంద్ జైస్వాల్ (45)అను క్రైంబ్రాంచి పోలీసులు అరెస్టుచేశారు. డెహ్రాడూన్ నుంచి ముంబై వచ్చిన ఇండిగో విమాన పైలట్.. తాను తన విమానానికి సుమారు 100 మీటర్ల దిగువన ఒక డ్రోన్ చూశానని అధికారులకు తెలిపాడు. రాత్రి 7.30 గంటల సమయంలో ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయంలో ఈ డ్రోన్ కనిపించిందన్నాడు. అయితే.. సినిమా షూటింగ్ కోసం ఆ డ్రోన్ కెమెరాను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. ముంబై శివార్లలోని చార్కోప్ ప్రాంతంలో ఈ సినిమా ప్రోమో షూటింగ్ జరిగింది. సినిమా పూర్తిస్థాయి షూటింగ్ తర్వాత షెడ్యూలు చేశారు. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి అధికారులకు సమాచారం చెప్పడంతో.. అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. నిందితుల నుంచి డ్రోన్ కెమెరాను, ఒక ఐప్యాడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాహుల్, రామ్ కెమెరాను హ్యాండిల్ చేస్తుండగా.. విధిచంద్ డ్రోన్లను అద్దెకు ఇచ్చే వ్యాపారం చేస్తుంటాడని పోలీసులు చెప్పారు. ముంబై గగనతలంలో డ్రోన్లను ఉపయోగించడం నిషిద్ధం. అయినా ఎగరేసినందుకు వీళ్లపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి కేసు విచారిస్తున్నారు. -
విమానాశ్రయంలో భారీగా పట్టుబడ్డ బంగారం
ముంబై: ముంబై విమానాశ్రయంలో భారీ ఎత్తున బంగారం బిస్కట్లు పట్టుబడ్డాయి. ఒక మహిళా ప్రయాణికురాలు అక్రమంగా రవాణా చేస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. తనిఖీల్లో భాగంగా సుమారు 64 లక్షల విలువ చేసే బంగారం బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అధిక సంఖ్కలో గోల్డ్ బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నామని, వీటివిలువ సుమారు 64, 38,960 విలువ వుంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి, ఆ మహిళను ప్రశ్నిస్తున్నామన్నారు. -
విమానం నుంచి మహిళను దించేశారు
ముంబై: సెలబ్రిటీలా ఫోజు కొడుతూ తోటి ప్రయాణికులు, విమాన సిబ్బందిపై దాడి చేసి దుర్బాషలాడిన మహిళను గో ఎయిర్ విమానం నుంచి దించివేసిన ఘటన ముంబై ఎయిర్ పోర్టులో గురువారం చోటు చేసుకుంది. ముంబై-లక్నో జీ8 387 విమానంలో బిజినెస్ క్లాస్ టికెట్ తీసుకున్న ఓ మహిళ ఏరోబ్రిడ్జి మీదుగా విమానం ఎక్కుతున్నప్పుడు తన హ్యాండ్ బ్యాగ్ ను తోటి ప్రయాణికులపై విసిరికొట్టింది. అంతేకాకుండా తన ముందు నిలుచున్న ప్రయాణికులను తోసేసి విమానంలోకి దూసుకొచ్చింది. ఆమె గురించి ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో విమాన సిబ్బంది జోక్యం చేసుకున్నారు. ఆమెకు సర్ది చెప్పేందుకు గో ఎయిర్ సిబ్బంది ప్రయత్నించగాపై వారిని నోటికొచ్చినట్టు తిట్టింది. విమాన ప్రయాణం నిబంధనలు ఉల్లఘించినందుకు ఆమెను కిందకు దించేశారు. ఈ ఘటన గురించి సీఐఎస్ఎఫ్ కు తెలిపినట్టు గో ఎయిర్ వెల్లడించింది. -
అనుష్కకు కోహ్లీ బై.. బై..!
క్రికెట్ - బాలీవుడ్ ప్రేమజంట విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ విడిపోయారా, కలిసున్నారా అనే ప్రశ్న ఎప్పటికీ వస్తూనే ఉంటుంది. తాజాగా బుడాపెస్ట్ వెళ్తున్న అనుష్కను కోహ్లీ దగ్గరుండి సాగనంపాడట. సల్మాన్‌ఖాన్ సరసన అనుష్క నటిస్తున్న సుల్తాన్ సినిమా తదుపరి షూటింగ్ బుడాపెస్ట్‌లో జరగాల్సి ఉంది. అందుకోసం ఆమె వెళ్తుంటే.. ముంబై విమానాశ్రయం వద్ద విరాట్ కోహ్లీ ఆమెను దగ్గరుండి సాగనంపాడు. వాళ్లిద్దరూ కలిసుండగా ఫొటోగ్రాఫర్లకు దొరికారు. ఒక కారులో ఇద్దరూ మాట్లాడుకుంటున్న ఫొటో దొరకడంతో అదిప్పుడు సోషల్ మీడియా జనాలకు మళ్లీ హాట్ హాట్ కబురుగా మారింది. రెండు వారాల వ్యవధిలో వీళ్లిద్దరూ ఇలా కలిసి కనిపించడం ఇది రెండోసారి. దాంతో ఇద్దరూ కలిసిపోయినట్లేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో విరాట్ - అనుష్కలు ముంబై రెస్టారెంటులో డిన్నర్ చేస్తుండగా ఫొటోగ్రాఫర్లకు దొరికారు. కొన్ని నెలల క్రితం తాము విడిపోయినట్లు ప్రకటించిన తర్వాత ఇద్దరూ కలిసి కనిపించడం అదే మొదటిసారి. 2013 నుంచి వీళ్లు డేటింగ్లో ఉన్నారు. తర్వాత ఈ సంవత్సరమే విడిపోయినట్లు సింబాలిక్‌గా చెప్పారు. కోహ్లీ ట్విట్టర్లో అనుష్కను అన్ ఫాలో కావడంతో పాటు 'గుండె పగిలింది' అనే కేప్షన్‌తో ఓ ఫొటో కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు. ఇప్పుడు మళ్లీ ఇద్దరినీ కలపడంలో బాలీవుడ్ సీనియర్ బ్రహ్మచారి సల్మాన్ ఖాన్ కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. -
మీడియాపై స్టార్ హీరోయిన్ ఎదురుదాడి..!
ముంబై: బాలీవుడ్ ప్రేమపక్షులు ఎప్పుడు ఏం చేస్తాయో, ఏం మాట్లాడతాయో చెప్పలేం. వ్యవహారం కాస్త బెడిసికొడితే చాలు బ్రేకప్ చెప్పేస్తారు. అలాంటి జంటల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బాలీవుడ్ క్యూట్ పెయిర్ కత్రినా కైఫ్, రణబీర్ కపూర్. వీరి ప్రేమ వ్యవహారంపై అప్పట్లో ఏదో ఒక వార్త ప్రచారంలో ఉండేది. బ్రేకప్ చెప్పాక కూడా ఎవరు ఎవరితో ఎలా మూవ్ అవుతున్నారన్న దానిపై చర్చ జరిగింది. బ్రేకప్ తర్వాత ముద్దుగుమ్మ కత్రినా చిర్రుబుర్రు లాడుతోందట. మీడియా కనిపిస్తే చాలు ఆమెకు పట్టరాని ఆగ్రహం వచ్చేస్తోంది. కెరీర్ లో ఎంతో ఎత్తుకు ఎదిగిన కత్రినా ముఖంపై చిరునవ్వు మాయపై చాలా రోజులైనట్లు కనిపిస్తోంది. తాజాగా ఏదో మూవీ సినిమా షూటింగ్ నిమిత్తం మొరాకో వెళ్లిన కత్రినా నిన్న ముంబై ఎయిర్ పోర్టులో కనిపించింది. ఇండియాకు వచ్చిందన్న వార్త తెలిసిన మీడియా ఆమెను కలిసేందుకు వెళ్లింది. అతి కష్టం మీద ఆమెను కలిశారు. కారులో ఎక్కే సమయంలో అక్కడికి వచ్చి.. మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు. ఏమైనా సమాచారం చెబుతారా అని ఓ విలేఖరి అడిగాడు. దీంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారంటూ వారిపై ఒక్కసారిగా మండిపడింది. అసలు విషయం ఏంటంటే.. మాజీ బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ తో కలిసి లేటెస్ట్ మూవీ 'జగ్గా జాసూస్'లో మళ్లీ జతకట్టనున్నారు. రణబీర్ విషయంపై అడుగుతారేమోనని భావించిన కత్రినా తానే మీడియాపై ఎదురుదాడికి దిగిందని బాలీవుడ్ లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. -
అమ్మ ఒప్పుకుందా?
బాలీవుడ్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి చాలాకాలంగా రకరకాల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రొమేనియా తార లులియా వంటూర్తో ప్రేమాయణం సాగిస్తున్నాడని, త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోనున్నారని బీటౌన్ టాక్. ఆ రూమర్లకు బలం చేకూరుస్తూ వీరిద్దరు సన్నిహితంగా ఉన్న కొన్ని ఫొటోలు ఆన్ లైన్ లో చక్కర్లు కొట్టాయి కూడా. తాజాగా లులియా సల్మాన్ ఫ్యామిలీతో కలిసి మరోసారి మీడియా కంటబడింది. బుధవారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్టులో సల్మాన్ తల్లి సల్మాకు ఆసరాగా ఆమె చెయ్యి పట్టుకుని నడుస్తూ కనబడింది లులియా. వారితో సల్మాన్, ఆయన సోదరి కూడా ఉండటం విశేషం. దీంతో సల్మాన్ ఖాన్దాన్.. లులియాతో పెళ్లికి అంగీకారం తెలిపినట్టేనంటూ సోషల్ మీడియాలో వారి ఫొటోలతో సహా పెళ్లి వార్తలు ఊపందుకున్నాయి. అమ్మ ఒప్పేసుకుంది కాబట్టి త్వరలోనే సల్మాన్ పెళ్లి చూస్తామంటూ అభిమానులు ఖుషీ అవుతున్నారు. సల్మాన్ చండీగఢ్‌లో సుల్తాన్ షూటింగ్ ముగించుకున్న తర్వాత వారంతా ముంబై తిరిగి వస్తున్నట్లు సమాచారం. -
వాషింగ్ మెషిన్లో 2 కిలోల బంగారం...
ముంబై: రెండు కిలోల బంగారం బిస్కట్ల స్మగ్లింగ్ ను అధికారులు అడ్డుకున్నారు. బంగారు బిస్కట్లను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తితో పాటు మరో వ్యక్తిని ముంబై ఎయిర్ పోర్టు నిఘా విభాగం(ఏఐయూ) అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 19 బంగారు బిస్కట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం... మహమ్మద్ అస్లాం షేక్ అనే వ్యక్తి రియాద్ నుంచి భారత్ కు వచ్చాడు. ముంబై విమానాశ్రయంలో అధికారులు రియాద్ నుంచి వచ్చిన ప్రయాణికుడి లగేజీని తనిఖీలు చేస్తుండగా అతని వద్ద ఉన్న వాషింగ్ మెషిన్ లో ఏదో అనుమానిత వస్తువులు ఉన్నట్లు గమనించారు. వాషింగ్ మేషిన్ ను పరిశీలించి చూడగా ఒక్కొక్కటిగా 19 గోల్డ్ బిస్కట్లు ఉన్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. వీటి బరువు రెండు కిలోలకు పైగా ఉందని, విలువ దాదాపు అరవై లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బంగారు బిస్కట్లను మరో వ్యక్తిని తాను అప్పగించాల్సి ఉందని, అతని పేరు సల్మాన్ ఖాన్ అని చెప్పాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అస్లాం షేక్ కోసం ఎయిర్ పోర్టులో ఎదురుచూస్తున్న సల్మాన్ ను కూడా అరెస్ట్ చేశారు. ఈ స్మగ్లింగ్ కేసులో ఇంకా ఎంత మంది ప్రమేయం ఉంది అన్న కోణంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టమామని ఎయిర్ పోర్టు నిఘా విభాగం అధికారులు వివరించారు. -
ఎయిర్ హోస్టెస్‌ను అసభ్యంగా వీడియో తీస్తూ..
ముంబయి: ముంబయి ఎయిర్ పోర్ట్ లో నలుగురు ప్రయాణీకులు అసభ్యంగా ప్రవర్తించారు. ఎయిర్ హోస్టెస్‌తో తప్పుగా ప్రవర్తించడమే కాకుండా వారిని అసభ్యకరంగా చిత్రీకరిస్తూ వీడియో తీసే ప్రయత్నం చేశారు. దీంతో వారిలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో వ్యక్తి తప్పించుకున్నాడు. కోల్ కతా నుంచి ముంబయి మధ్య ప్రయాణించే ఇండిగో విమానానికి చెందిన ఎయిర్ హోస్టేస్ తో వారు ఇలా ప్రవర్తించారు. -
పేలిన ఎయిరిండియా విమానం టైరు
ఎయిరిండియా విమానం ల్యాండ్ అవుతుండగా దాని టైరు పేలింది. ఆ సమయానికి విమానంలో 150 మంది ప్రయాణికులున్నారు. అయితే వారంతా సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటన మంగళవారం రాత్రి ముంబై విమానాశ్రయంలో చోటుచేసుకుంది. నాగ్‌పూర్ నుంచి వచ్చిన ఎయిర్‌బస్ ఎ320 విమానం దిగుతుండగా దాని టైరు పేలిపోయింది. దాంతో విమానాన్ని టాక్సీవే వద్దకు తీసుకెళ్లి, అక్కడ ఎమర్జెన్సీ చ్యూట్స్ ద్వారా ప్రయాణికులందరినీ దించేసినట్లు ఎయిరిండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ఈ క్రమంలో కొంతమంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రయాణికులందరినీ దించేసిన తర్వాత విమానాన్ని టాక్సీవే లోకి తరలించారు. అయితే ఈ ఘటన కారణంగా ముంబై ఎయిర్‌పోర్టులోని ప్రధాన రన్‌వేను మూసేసినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. -
విమానం దిగుతుండగా.. గేర్ ఫెయిలైంది!
ముంబై: 127 మంది ప్రయాణికులతో బయలుదేరిన జెట్ ఎయిర్వేస్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ముంబైలో గురువారం విమానం దిగుతుండగా.. ఒక్కసారిగా ల్యాండింగ్ గేర్ బద్దలైంది. దీంతో ముంబై విమానాశ్రయంలోని ప్రధాన రన్‌వే పూర్తిగా బ్లాక్ అయింది. అదృష్టంకొద్దీ ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి హాని జరుగలేదు. ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దింపినట్టు జెట్ ఎయిర్వేస్ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. న్యూఢిల్లీ నుంచి వచ్చిన విమానం ముంబైలోని ప్రధాన రన్‌వేపై దిగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో విమానాశ్రయ అధికారులు సెంకడరీ రన్‌వే మీదుగా ఫ్లయిట్ ఆపరేషన్స్ చేపట్టారు. బోయింగ్ 737 విమానమైన 9డబ్ల్యూ 354లో సాంకేతిక లోపం తలెత్తిందని, ఈ లోపాన్ని సరిచేయడానికి ఇంజినీర్ల బృందం తనిఖీలు జరుపుతున్నదని జెట్ ఎయిర్వేస్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధాన రన్‌వేపై ఆగిపోయిన విమానాన్ని తరలించేందుకు అవసరమైన చర్యలను ఇంజినీర్ బృందం తీసుకుంటున్నదని గురువారం నాటి ప్రకటనలో పేర్కొంది. విమానం ల్యాండింగ్ గేర్ చెడిపోయినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని, దానిని సరిచేసి.. విమానాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. -
వినోదం కోసం ఎమర్జెన్సీ తలుపు తీశాడు!!
ముంబై: జెట్ ఎయిర్వేస్ విమానాయాన సంస్థకు ప్రయాణికుల నుంచి చిత్రమైన చిక్కులు ఎదురవుతున్నాయి. విచిత్రమైన కారణాలతో ఇద్దరు ప్రయాణికులు విమానంలో నిబంధనలు ఉల్లంఘించడంతో వారిపై జెట్ ఎయిర్వేస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జర్మనీకి చెందిన స్టీవ్ టిట్ష్లెర్ ఆదివారం అబుధాబి నుంచి జెట్ ఎయిర్వేస్ (9 డబ్యూ 585) విమానం ఎక్కి ముంబై వచ్చాడు. ముంబై విమానాశ్రయంలో విమానం పార్క్ చేసి ఉండగా అతడు ఉన్నట్టుండి ఎమర్జెన్సీ తలుపు తీశాడు. దీనిని చూసి ఆందోళన చెందిన విమాన సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఎందుకు తలుపు తీశావని ఆయనను అడిగారు. స్టీవ్ చెప్పిన సమాధానం విని వారు బిత్తరపోయారు. కేవలం వినోదం కోసం తాను ఎమర్జెన్సీ తలుపు తీసినట్టు ఆయన చెప్పుకొచ్చాడు. దీంతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఆయనను అరెస్టుచేసి సహర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. జెట్ ఎయిర్వేస్లో ఆయన ఢిల్లీలోకి వెళ్లాల్సి ఉన్నా అందుకు అనుమతించలేదు. ఆయనపై విమానాయాన చట్టం 1937లోని సెక్షన్ 29, ఐపీసీ సెక్షన్ 336 ప్రకారం కేసు నమోదుచేశారు. వాష్‌రూమ్‌లో స్మోకింగ్! రవి ధాంకర్ ఆదివారం సింగపూర్ నుంచి ముంబై వచ్చాడు. జెట్ ఎయిర్వేస్ (9డబ్ల్యూ 09) విమానంలో వచ్చిన అతను విమానంలోని వాష్‌రూమ్‌లో సిగరెట్ తాగుతూ దొరికిపోయాడు. ఆయన బాగా మద్యం మత్తులో ఉన్నట్టు కనిపించాడని, విమానం బాత్రూమ్ వద్ద అతను పొగ తాగుతుండగా సహచర ప్రయాణికులు గుర్తించి సిబ్బందికి తెలిపారని విమానాయాన సంస్థ అధికారులు తెలిపారు. విమానం ముంబైలో దిగగానే అతనిని సహర్ పోలీసు స్టేషన్‌కు తరలించి.. కేసులు నమోదుచేశారు. -
న్యూఇయర్ విహారానికి కోహ్లి-అనుష్క!
ముంబై: నూతన సంవత్సరం రానున్న సందర్భంగా భారత క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ బ్యూటీ అనుష్కశర్మ కలిసి విదేశీ విహారానికి బయలుదేరి వెళ్లారు. ఈ జంట బ్యాగు, సూట్‌కేసు సర్దుకొని ముంబై ఎయిర్‌పోర్టులో దనర్శమిచ్చింది. ప్రేమికులైన కోహ్లి, అనుష్క తీరిక దొరికినప్పుడల్లా కలిసి విహరించడం తెలిసిందే. నిన్నమొన్నటివరకు ఇటు క్రికెట్ మ్యాచులు, అటు సినిమా షుటింగ్‌లతో కోహ్లి, అనుష్క బిజీబిజీగా గడిపారు. కొత్త సంవత్సరం రానున్న సందర్భంగా ఈ బిజీ షెడ్యూళ్ల నుంచి ఇద్దరికీ కాసింత తీరిక దొరకడంతో జంటగా విదేశాల్లో విహరించడానికి.. వీరు బయలుదేరి వెళ్లినట్టు తెలుస్తున్నది. అయితే వారు ఏ దేశానికి వెళ్లిందనేది తెలియకపోయినా.. విదేశాల్లోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోబోతున్నట్లు సమాచారం. -
విమానం ఇంజన్లో ఇరుక్కుని ఉద్యోగి మృతి
పార్కింగ్ చేసి ఉన్న విమానం ఇంజన్లో ఇరుక్కుని ఎయిరిండియా గ్రౌండ్ క్రూ సభ్యుడు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన ముంబై విమానాశ్రయంలో జరిగింది. ముంబై నుంచి విమానం హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉంది. విమానం కో-పైలట్ ఒక సిగ్నల్‌ను తప్పుగా అర్థం చేసుకుని ఇంజన్ స్టార్ట్ చేయడంతో అప్పటికి దాని వద్ద ఉన్న రవి సుబ్రమణియన్ అనే ఉద్యోగిని ఇంజన్ ఫ్యాన్లు లోపలకు లాగేశాయి. లోపల ఇరుక్కుపోయిన రవి.. అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన ఛత్రపతి శివాజీ డొమెస్టిక్ ఎయిర్‌పోర్టులోని 28వ బే వద్ద జరిగింది. విమాన సిబ్బంది సాధారణంగా విమానం ఇంజన్లు ఆఫ్ చేసి ఉన్నప్పుడే వాటి నిర్వహణ పనులు చూస్తుంటారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఎయిరిండియా సీఎండీ అశ్వనీ లోహానీ ఓ ప్రకటనలో తెలిపారు. ముంబై విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన పట్ల తాము తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని, మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియస్తున్నామని అన్నారు. -
‘గోల్డ్’ మ్యాన్
సాక్షి, హైదరాబాద్: దుబాయ్, మస్కట్ సహా అనేక దేశాల నుంచి గత ఏడాది దేశంలోకి అక్రమ బంగారం భారీగా వచ్చి చేరింది. ఈ నేపథ్యంలోనే అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనూ కస్టమ్స్ విభాగం అత్యంత అప్రమత్తత ప్రకటించింది. వరుస తనిఖీలు చేపట్టిన అధికారులు భారీగా అక్రమ బంగారం స్వాధీనం చేసుకున్నారు. ముంబై విమానాశ్రయ కస్టమ్స్ విభాగం రికార్డు స్థాయిలో దేశంలోనే అత్యధికంగా 1010 కేజీల బంగారం రికవరీ చేసింది. ఈ టీమ్‌ను లీడ్ చేసింది తెలుగు తేజం... డాక్టర్ కర్లపు కిరణ్‌కుమార్. 2010 బ్యాచ్ ఐఆర్ఎస్ (ఇండియన్ రెవెన్యూ సర్వీస్) అధికారి అయిన కిరణ్‌కుమార్ స్వస్థలం విశాఖపట్నం. ప్రస్తుతం కస్టమ్స్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేస్తున్న ఆయన ఫోన్ ద్వారా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు... ఏపీలోని వైజాగ్‌కు చెందిన కిరణ్‌కుమార్ తండ్రి కేడీఆర్ ఆచార్య రిటైర్ట్ ప్రభుత్వ ఉద్యోగి. తల్లి సునిత ఇప్పటికీ సర్వీసులో కొనసాగుతున్నారు. విద్యాభ్యాసం మొత్తం విశాఖపట్నం లోనే చేసిన కిరణ్ ఆంధ్రా మెడికల్ కాలే జీ నుంచి ఎంబీ బీఎస్ పూర్తి చేశారు. 2010లో సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఐఆర్ఎస్కు ఎంపికై కస్టమ్స్ విభాగంలో ఉన్నారు. 2012 నుంచి ముంబైలో విధులు నిర్వర్తిస్తున్న ఆయన రెండేళ్ళుగా ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేస్తున్నారు. ఆల్‌టైమ్ రికార్డు... భారత్‌లో బంగారం అక్రమ రవాణా 1970ల్లోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విమానాశ్రయం అధికారులూ పట్టుకోని విధంగా గతేడాది ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఏకంగా 1010 కేజీల అక్రమ బంగారం చిక్కింది. ఢిల్లీ విమానాశ్రయంలో 600 కేజీలు, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 150 కేజీలు స్వాధీనమైంది. ముంబైలో చిక్కిన టన్నుకు పైగా బంగారాన్ని కిరణ్‌కుమార్ నేతృత్వంలోని బృందమే పట్టుకోవడం విశేషం. ఈ టీమ్ ఈ ఏడాది ఇప్పటి వరకు 350 కేజీలు స్వాధీనం చేసుకుంది. ఇది కూడా మిగతా ఎయిర్‌పోర్టుల్లో చిక్కిన దాని కంటే ఎక్కువే. ఒకే దఫా రెండు ఫై్లట్లలో మస్కట్ నుంచి వచ్చిన 25 కేజీల బంగారం స్వాధీనం ఈ టీమ్ పట్టుకున్న వాటిలో పెద్దమొత్తం. ముంబై ద్వారా అక్రమ రవాణా చేసే ముఠాలకు విమానం క్రూతో పాటు ఎయిర్పోర్ట్ సిబ్బంది సహకరిస్తున్నారు. స్మగ్లర్ తమ వెంట తెచ్చిన బంగారాన్ని విమానాశ్రయంలో క్రూకో, ఎయిర్పోర్ట్ సిబ్బందికో అప్పగించి బయటకు వచ్చేస్తారు. వీరికి చెకింగ్ ఉండకపోవడంతో పాటు ఏ మార్గంలోనైనా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిపై కన్నేసిన కిరణ్ టీమ్ గతేడాది ఎయిర్పోర్ట్ మేనేజర్ జగదీష్‌బాబుతో పాటు ఇద్దరు క్రూ సిబ్బందిని అరెస్టు చేశారు. స్మగ్లర్లతో పాటు వారి వెనుక వ్యవస్థీకృతంగా కథ నడిపే ఆర్గనైజర్లు, రిసీవర్లను పట్టుకున్నారు. ‘మేము తీసుకున్న చర్యలతో పాటు గతేడాది నవంబర్‌లో మారిన ఇంపోర్ట్ రెగ్యులేషన్స్‌తో ముంబై కేంద్రంగా జరిగే బంగారం అక్రమ రవాణా గణనీయంగా తగ్గింది’ అని కిరణ్‌కుమార్ అన్నారు. -
భారీగా తగ్గిన జీవీకే నష్టాలు
రూ. 281 కోట్ల నుంచి రూ. 124 కోట్లకు తగ్గిన నష్టాలు ఆదాయం రూ. 713 కోట్ల నుంచి రూ. 999 కోట్లకు వృద్ధి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఇన్ఫ్రా ఇబ్బందులు నెమ్మదిగా తొలుగుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. గత కొంతకాలంగా భారీ నష్టాలను ప్రకటించిన కంపెనీలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. తొలి త్రైమాసికంలో జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రా నష్టాలు 56 శాతం తగ్గడమే దీనికి నిదర్శనం. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో జీవీకే ఇన్ఫ్రా నికర నష్టాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే రూ. 281 కోట్ల నుంచి రూ. 124 కోట్లకు తగ్గింది. ఇదే సమయంలో ఆదాయం 40% పెరిగి రూ. 713 కోట్ల నుంచి రూ. 999 కోట్లకు పెరిగింది. బెంగళూరు ఎయిర్‌పోర్టు లాభాల్లోకి రావడం ముంబై ఎయిర్‌పోర్టు నష్టాలు భారీగా తగ్గడం సానుకూల అంశాలయ్యాయి. -
విమానానికి తప్పిన పెను ముప్పు: 194 మంది సురక్షితం
ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానానికి ముంబై ఎయిర్‌పోర్టులో పెను ప్రమాదం తప్పింది. మంగుళూరు నుంచి వచ్చిన ఈ విమానం ముంబైలో ల్యాండ్ అవుతున్న సమయంలో వెనుక భాగం నేలను ఢీకొట్టడంతో ఇటు ప్రయాణికులతోపాటు అటు సిబ్బంది కూడా ఒక్కసారిగా హతాశులయ్యారు. అయితే అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదం జరుగలేదు. ఇందులో ప్రయాణిస్తున్న 194 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఆదివారం జరిగిన ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరు పైలట్లను విధుల నుంచి తొలిగిస్తున్నట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. పాక్‌్-భారత్ క్రికెట్ మ్యాచ్ చేసేందుకు అడిలైడ్ బయలుదేని క్రీడాభిమానులకు కూడా ఎయిర్ ఇండియా ఇలాంటి షాకే ఇచ్చింది. విమానం దాదాపు 10 గంటలు ఆలస్యమవ్వడంతో మ్యాచ్ ముగిసిన తర్వాతగానీ సదరు క్రీడాభిమానులు స్టేడియానికి చేరుకోలేకపోయారట! ఇలా నిర్వహణలో కనీస ప్రమాణాలు పాటించడంలేదనే అపవాదులు మూటగట్టుకున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఇమేజ్ తాజా ఘటనతో మరింత దిగజారింది. -
విమానాశ్రయంలో రూ.36 లక్షల విలువైన బంగారం స్వాధీనం
సాక్షి, ముంబై: ముంబై విమానాశ్రయంలో ఇద్దరు ప్రయాణికుల నుండి రూ. 36 లక్షల విలువ చేసే బంగారం కడ్డీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేశ విదేశాలకు వస్తువులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులు, తమ కంప్యూటర్ సీపీయూ, వంట చేసే పాన్‌లో బంగారాన్ని దాచి తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుండి వచ్చిన హిరేన్ చౌహ న్ సామగ్రిని స్క్రీనింగ్ చేయగా, అతని కంప్యూటర్ సీపీయూలో 10 బంగారు కడ్డీలు బైట పడ్డాయని, ఒక్కొక్కటి 116 గ్రాముల బరువుందని, వాటి మొత్తం విలువ రూ.27.88 లక్షలుంటుందని కస్టమ్స్ కమిషనరు ఏపీఎస్ సూరి చెప్పారు. రహస్యంగా దాచిన బంగారాన్ని గుర్తించడానికి ముంబై విమానాశ్రయంలో అత్యాధునిక లైన్ స్క్రీనింగ్ పరికరాన్ని ఉపయోగిస్తున్నామన్నారు. షార్జా నుంచి వచ్చిన సఫియా షరీఫ్ మొహమ్మద్ అనే మహిళా ప్రయాణికురాలినుంచి రూ.8.74 లక్షల విలువ చేసే 350 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని మరో కస్టమ్స్ అధికారి మిలింద్ లాంగేవర్ తెలిపారు. -
26న ఎయిర్‌పోర్టుపై దాడి!
సాక్షి, ముంబై: ముంబై విమానాశ్రయంపై దాడి చేస్తామంటూ మరోసారి హెచ్చరికలు వచ్చాయి. ఈసారి లేఖ రూపంలో కాకుండా ముంబై విమానాశ్రయంలోని ఓ టాయిలెట్ (మూత్రశాల) గోడపై ఈ హెచ్చరికను రాశారు. ఐఎస్ఐఎస్ పేరుతో గోడపై రాసిన సందేశంలో గణతంత్ర దినోత్సవం 26వ తేదీన దాడి చేస్తామని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో దాడులు చేయనున్నామంటూ గత కొన్ని రోజులుగా ఉగ్రవాద సంస్థల పేర్లతో అనేక హెచ్చరికలు వస్తున్నాయి. అలాంటిదే ముంబై విమానాశ్రయం టాయిలెట్ గోడపై అనే సందేశం కన్పించింది. ఇది ఎవరు రాశారో తెలియరాలేదు. ఇంతకుముందు కూడా ఈ నెల 7న ముంబై విమానాశ్రయంలో ఓ టాయిలెట్ గోడపై ‘అటాక్ బై ఐఎస్ఐఎస్ 10.01.15’ అని హెచ్చరికలు రాశారు. కానీ 10వ తేదీన ఎలాంటి ఘటన జరగలేదు. దీంతో తాజాగా హెచ్చరికను కూడా పెద్దగా పరిగణించాల్సిన అవసరం లేదని కొందరు వాదిస్తున్నారు. అయినప్పటికీ ముంబైలో పోలీసులను అప్రమత్తం చేశారు. -
'విమానాశ్రయంపై దాడి చేస్తాం'
ముంబై : గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న దాడులకు తెగబడతామని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ మరోసారి హెచ్చరించింది. ముంబయిలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయంపై దాడి చేస్తామని ఉగ్రవాద సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ముంబయి ఎయిర్‌పోర్టులోని స్నానాల గదిలో ఈ లేఖలు కనిపించాయి. రిపబ్లిక్ డే రోజు దాడులు చేస్తామని ఐఎస్ఎస్ లేఖల్లో ఆ సంస్థ పేర్కొంది. దాంతో అప్రమత్తమైన విమానాశ్రయంలో అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. మరోవైపు ఈ సమాచారంపై కేంద్ర హోంశాఖ ...పోలీసు శాఖను ఎలర్ట్ చేసింది. ఈ నెల 10న దాడి చేస్తామని ...ఇదే తరహాలో ఏడో తేదీన వాష్ రూమ్ లో రాతలు కనిపించిన విషయం తెలిసిందే. -
అభిమానం అంటే అదే!
అభిమానులు లేనిదే హీరోలు లేదులే అంటూ హీరో వెంకటేష్ ఒక పాటలో అంటారు. అందుకే వాళ్లను ప్రేక్షక దేవుళ్లగా నటీనటులు భావి స్తారు. అభిమానం అనేది వెలకట్టలేనిది. కొందరి అభిమానం మధురంగా మనసు మీటుతుంది. ఇలియానా అనూహ్యంగా ఇలాంటి అనుభూతినే పొందారు. ఇంతకుముందు తెలుగు చిత్ర పరిశ్రమను తన అందచందాలతో ఊపేసిన ఇలియానా, ప్రస్తుతం తన సౌందర్య సంపదతో బాలీవుడ్ ప్రేక్షకులను రంజింప చేస్తున్నారు. అక్కడ హీరోయిన్గా ఆమె పరిస్థితి ఎలా వున్నా తన ముగ్ధ మనోహర రూపానికి చాలామంది అభిమానులు ఫ్లాట్ అయిపోతున్నారు. ఇటీవల జరిగిన ఒక సంఘటన ఇందుకు ఉదాహరణ. మెరుపుతీగ ఇలియానా ముంబయి విమానాశ్రయంలో ప్రత్యక్షమయ్యారు. దీంతో ఈమెను చూడటానికి అభిమానగణం చుట్టుముట్టారు. అలాంటి కలకల వాతావరణంలో ఒక అభిమాని ఇలియానా ముందుకు దూసుకొచ్చి ఒక చీటి ముక్కను ఆమె చేతిలో పెట్టి కొంచెం సేపు తరువాత చదవమని వెళ్లిపోయాడు. అందులో ఏమి రాశాడు అంటూ అక్కడి వారడిగిన ప్రశ్నలకు అప్పుడు ఇలియానా బదులివ్వలేదు. ఆ అభిమాని చీటిలోని సారాంశాన్ని ఇలియానా తన ట్విట్టర్లో పోస్ట్ చేసి ముచ్చటపడ్డారు. ‘‘హే ఇలియానా తెరపైనా అయినా నేరుగా అయినా చూడటానికి అందంగా ఉంటారు. మీరు నటించిన బర్ఫీ చిత్రం నాకు చాలా బాగా నచ్చింది. అందులో మీ నటన ప్రశంసనీయంగా ఉంది. సినీ రంగంలో మీరు పయనించాల్సిన దూరం చాలా ఉంది.’’అని ఆ అభిమాని చీటి ముక్కలో పేర్కొన్న విషయం. ఇందులో అంత గొప్పగా అభినందించిందేముంది అని అడిగితే, అయితే ఆ అభిమాని చిన్న చీటి ముక్కలో తన స్వహస్తాలతో అభినందిస్తూ రాయడం తనకు బాగా నచ్చిందని ఏదేమైనా ఆ చీటి తన మనసు లోతుల్ని హాయిగా తాకిందని ఇలియానా పేర్కొన్నారు. నిజమైన అభిమానికి సరైన నిర్వచనం ఇదేనేమో. -
అబ్బురపరుస్తున్న జివికె ముంబాయ్ టెర్నినల్-2
-
ఇండియా అంతా ఇక్కడే
అద్భుత చిత్రాలు, కళాకృతులతో ఎయిర్‌పోర్టు రూ.5,200 కోట్లతో జీవీకే ముంబై టెర్మినల్ నేడు ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం త్వరలో కొంత వాటా విక్రయిస్తాం: జీవీకే చైర్మన్ జీవీ కృష్ణారెడ్డి ముంబై నుంచి ఎం. రమణమూర్తి బయట దృఢంగా రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండా... జాతీయ పక్షి నెమలికి నీరాజనం పడుతున్నట్లుగా నెమలి కన్నును తలపించే ప్రతి అడుగూ, ప్రతి ఆకృతీ!. జయహే... అంటూ భారతదేశంలోని ప్రతి రాష్ట్ర సంసృ్కతినీ, కళనూ కళ్లకు కట్టే నిలువెత్తు చిత్రాలు, కళాకృతులు. జాతీయ పుష్పం కమలాన్ని తలపిస్తూ... విరిసీ విరియని వివిధ రకాల్లో షాండ్లియర్లు... సరిగమలు పలికే జలతారలు. మొత్తంగా నిలువెత్తు భారతీయతకు ప్రతిరూపంలా నిలుస్తున్న ముంబై విమానాశ్రయం టెర్మినల్-2ను... మన రాష్ట్ర కంపెనీ నిర్మించటమే అన్నిటికన్నా అద్భుతం. ఏడు నక్షత్రాల హోటల్‌లా... ఒక మ్యూజియంలా... దీన్ని ఆవిష్కరించడానికి... తన కుమారుడు సంజయ్ పట్టుదలే కారణమని గురువారం ‘సాక్షి’ ప్రతినిధిలో చెప్పారు జీవీకే సంస్థల అధిపతి జి.వి.కృష్ణారెడ్డి. ‘‘మొత్తం భారతీయ కళలన్నీ ప్రతిబింబించేలా ఎయిర్‌పోర్టును తీర్చిదిద్దుతానని మా అబ్బాయి చెప్పినపుడు అంత ఖర్చు ఎందుకని నేనే వద్దన్నాను. కానీ తను నన్ను ఒప్పించి ముందుకెళ్లాడు. ఇప్పుడు చూశాక నాకే అనిపిస్తోంది. తనకు ఎంతో ఇష్టం లేకపోతే తప్ప ఇది సాధ్యమై ఉండేది కాదని. ఏదేమైనా ఒక అత్యుత్తమ ఎయిర్పోర్ట్ టెర్మినల్‌ను నిర్మించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా తరవాత కూడా ఇది చిరస్థాయిగా ఉంటుంది’’ అన్నారాయన. శుక్రవారం దీన్ని ప్రధాని మన్మోహన్ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తారు. మరో 3-4 వారాల్లో అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా గురువారం విమానాశ్రయాన్ని విలేకరులకు చూపిస్తూ జీవీకే ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్ఓఎం కంపెనీ డిజైన్‌తో... ఈ ఎయిర్‌పోర్టును ప్రపంచ అగ్రగాముల్లో ఒకటైన న్యూయార్క్ సంస్థ ‘స్కిడ్మోర్, ఓయింగ్స్ అండ్ మెరిల్ (ఎస్ఓఎం)’ డిజైన్ చేసింది. ‘‘డిజైన్ చేయడానికి ఎస్ఓఎం ప్రతినిధులు ఇక్కడికి వచ్చారు. కొన్ని డి జైన్లు చూపించారు. కానీ అవేవీ ఓకే చేయకుండా వాళ్లను ఓ నెలరోజులు ఇండియా మొత్తం తిరిగి రమ్మన్నాం. వాళ్లు అన్ని రాష్ట్రాల సంసృ్కతులూ, కళాకృతులూ చూసి వచ్చాక మాత్రమే పని ప్రారంభించమన్నాం. అలాగే చేశారు. అందుకే ఈ అద్భుతం సాధ్యమైంది. ఇప్పుడు ఎవరైనా ఇండియా మొత్తం చూడాలనుకుంటే ఇక్కడికి రావాలి’’ అని జీవీకే వివరించారు. ముంబయి విమానాశ్రయం మొత్తానికి 2000 ఎకరాలు కేటాయించినా... దాన్లో 600 ఎకరాలు ఇప్పటికీ మురికివాడలతోను, ఇతర ఆక్రమణలతోను నిండి ఉంది. కొద్ది స్థలంలోనే, గరిష్టంగా ఉపయోగపడేట్లుగా ఈ టెర్మినల్‌ను డిజైన్ చేశారు. కింద కార్పెట్ నుంచి పైకప్పు వరకు ప్రతిచోటా నెమలికన్ను డిజైన్ ఉండటం దీనికి అదనపు ఆకర్షణ. పోటీ పడి మన సత్తా చూపించాం... చిన్న పట్టణం నుంచి వచ్చిన తాము ముంబయి లాంటి సిటీలో, అక్కడి దిగ్గజాలను ఢీకొట్టి ఎయిర్‌పోర్టును నిర్మించగలిగామని జీవీకే చెప్పారు. ‘‘హోటళ్లే కాదు. జేగురుపాడు విద్యుత్ ప్రాజెక్టును చూసినా, జైపూర్ రోడ్డు ప్రాజెక్టును చూసినా మా ప్రత్యేకత ఏంటో తెలుస్తుంది. అలాగే ఎయిర్‌పోర్టులోనూ వైవిధ్యం చూపించాలనుకున్నాం. అందుకే కొత్త టెర్మినల్ నిర్మాణమనేది ఒప్పందంలో లేకపోయినా... ఆక్రమణలకు తగిన పరిహారమిస్తూ, వేరేచోట నిర్మాణాలు చేస్తూ ముందుకెళ్లాం. చాలా సవాళ్లు వచ్చినా అధిగమించాం. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టులో మెజారిటీ వాటా మాకే ఉంది. భవిష్యత్తులో అప్పులు తీర్చడానికి కొంత వాటా విక్రయించే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికోసం రూ.2,500 కోట్లు అప్పు తెచ్చాం. దాన్ని తీర్చడానికి కొంత వాటా అమ్మినా అధిక వాటా మాకే ఉండేలా చూసుకుంటాం. టెర్మినల్ నిర్మాణానంతరం మాకు 10 శాతం స్థలం వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకోవటానికి చేతికొచ్చింది. దాని లీజుకోసం ఇప్పటికే బిడ్లు పిలిచాం. ఇప్పటిదాకా దేశంలోకి రాని అంతర్జాతీయ బ్రాండ్లు కూడా కొన్ని ఈ టెర్మినల్‌లో తమ శాఖలు ఏర్పాటు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి. ప్రకటనలు, స్టోర్లు... ఇలా ఆదాయం బాగానే ఉంటుందని భావిస్తున్నాం’’ అని వివరించారు. టెర్మినల్-2 ప్రత్యేకతలు... ఎయర్పోర్టు అభివృద్ధి వ్యయం: 12,500 కోట్లు టెర్మినల్-2 నిర్మాణానికైన ఖర్చు: రూ.5,200 కోట్లు మొత్తం విస్తీర్ణం: 45 లక్షల చ.అడుగులు ప్రయాణికుల సామర్థ్యం: ఏడాదికి 4 కోట్ల మంది లిఫ్ట్‌లు: 72; ఎలివేటర్లు: 48; ట్రావెలేటర్లు: 37 మల్టీలెవల్ పార్కింగ్ సామర్థ ్యం: 5,200 కార్లు -
ముంబై విమానాశ్రయంలో మెరిసిన సోనాలి బింద్రే
నువ్వు .. నువ్వు .. నువ్వే .. నువ్వు.. నా చెక్కిలి పైనా నువ్వు. చెలి గుండెలపైనా నువ్వు.. అంటూ సాగే ఆ బాణి విన్నప్పుడల్లా బాలీవుడ్ భామ సోనాలి బింద్రే గుర్తు రాక మానదు. పెళ్లైన తర్వాత నటనకు దూరమైనా ఆమె గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. భర్తతో కలిసి ముంబై ఎయిర్ పోర్టులో కనిపించిన సోనాలి బింద్రేను కెమెరాలు క్లిక్కుమనిపించిన చిత్రాలివి. -
హైదరాబాద్ విమానానికి తప్పిన ప్రమాదం
ముంబై విమానాశ్రయంలో హైదరాబాద్ విమానానికి భారీ ప్రమాదం తప్పిందని ప్రయాణికుడొకరు 'సాక్షి'కి తెలిపారు. 6E 254 నంబరు గల ఇండిగో విమానంకు ప్రమాదం తప్పింది. రన్‌వేపై టేకాఫ్ అవుతుండగా మరో విమానం దూసుకొచ్చింది. ప్రమాదాన్ని పసిగట్టిన పైలెట్ వెంటనే విమానాన్ని పక్కకు తప్పించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో ఇండిగో విమానంలో 95 మంది ప్రయాణికులున్నారు. నావిగేషన్‌లో సమస్యలు తలెత్తడం వల్లే రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చాయని గుర్తించారు. మరొక విమానం ద్వారా ప్రయాణికుల తరలింపునకు ఏర్పాట్లు చేశారు.