అమ్మ ఒప్పుకుందా? | Iulia Vantur spotted with Salman Khan and his mother Salma | Sakshi
Sakshi News home page

అమ్మ ఒప్పుకుందా?

Published Thu, May 12 2016 4:25 PM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM

అమ్మ ఒప్పుకుందా?

అమ్మ ఒప్పుకుందా?

బాలీవుడ్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి చాలాకాలంగా రకరకాల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రొమేనియా తార లులియా వంటూర్తో ప్రేమాయణం సాగిస్తున్నాడని, త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోనున్నారని బీటౌన్ టాక్. ఆ రూమర్లకు బలం చేకూరుస్తూ వీరిద్దరు సన్నిహితంగా ఉన్న కొన్ని ఫొటోలు ఆన్ లైన్ లో చక్కర్లు కొట్టాయి కూడా.

తాజాగా లులియా సల్మాన్ ఫ్యామిలీతో కలిసి మరోసారి మీడియా కంటబడింది. బుధవారం రాత్రి ముంబై ఎయిర్పోర్టులో సల్మాన్ తల్లి సల్మాకు ఆసరాగా ఆమె చెయ్యి పట్టుకుని నడుస్తూ కనబడింది లులియా. వారితో సల్మాన్, ఆయన సోదరి కూడా ఉండటం విశేషం. దీంతో సల్మాన్ ఖాన్దాన్.. లులియాతో పెళ్లికి అంగీకారం తెలిపినట్టేనంటూ సోషల్ మీడియాలో వారి ఫొటోలతో సహా పెళ్లి వార్తలు ఊపందుకున్నాయి. అమ్మ ఒప్పేసుకుంది కాబట్టి త్వరలోనే సల్మాన్ పెళ్లి చూస్తామంటూ అభిమానులు ఖుషీ అవుతున్నారు. సల్మాన్ చండీగఢ్‌లో సుల్తాన్ షూటింగ్ ముగించుకున్న తర్వాత వారంతా ముంబై తిరిగి వస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement