Lulia vantur
-
తండ్రిని కాలేక పోయాను: సల్మాన్
ముంబై : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నిన్ననే 54వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. సల్లూ భాయ్ బర్త్‌డే విషేస్‌తో సోషల్ మీడియా హోరెత్తింది. ఇక సల్మాన్ పుట్టిన రోజునే సోదరి అర్పితా ఖాన్ రెండో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. బర్త్‌డే రోజున అన్నయ్యకు చెల్లెలు అర్పితా కోడలిని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ క్రమంలో సోదరి కూతరు అయత్‌ను చూడటానికి సల్మాన్ కుటుంబ సమేతంగా.. తల్లిదండ్రులు సలీమ్-సల్మా. సోదరుడు సోహైల్ ఖాన్‌తోకలిసి ముంబైలోని హిందుజా హస్పిటల్‌కు వెళ్లారు. ఈ ప్రయాణంలో సల్మాన్‌తో పాటు గర్ల్‌ఫ్రెండ్ లులియా వంతూర్ సైతం ఉన్నారు. కాగా సల్మాన్ మాజీ ప్రియురాలు సంగీత బిజ్లానీ సైతం అర్పితాఖాన్ కూతురిని చూడటానికి రావడం విశేషం. దీనికి ముందు సల్లూ భాయ్ మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి మామయ్యను అయ్యానని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఏడాది పుట్టినరోజున గొప్ప బహుమతి అందుకున్నానని.. ఇది తనకెంతో ఎంతో ప్రత్యేకమైనదన్నారు. అయత్ పేరు పెట్టడానికి కారణం అడగ్గా.. కుటుంబంలో అందరి పేర్లు ఎస్ లేదా ఏ తోనే మొదలయ్యాయని అందుకే అయత్ పేరు పెట్టామని అన్నారు. ‘మరోసారి మామయ్యను అయ్యాను కానీ తండ్రిని మాత్రం కాలేకపోయాను’ అని నవ్వుతూ అన్నారు. కాగా, ప్రభుదేవా దర్శకత్వం వహించిన దబాంగ్-3 సల్మాన్ పుట్టిన రోజునే వంద కోట్ల క్లబ్లో చేరింది. బాలీవుడ్లో వంద కోట్ల క్లబ్లో చేరిన అత్యధిక సినిమాలు సల్మాన్ ఖాతాలోనే ఉన్నాయి. -
సల్మాన్‌కు ప్రేమతో...
ప్రేమను కొన్నిసార్లు సందర్భానుసారం బహుమతుల రూపంలో వ్యక్తపరచాల్సి ఉంటుంది. లూలియా వంటూర్కి కూడా అలాంటి సందర్భం మొన్నొచ్చింది. ఇంతకీ లూలియా వంటూర్ ఎవరబ్బా? అనుకోకండి. సల్మాన్ ఖాన్ (భాయ్) ఫ్యాన్స్ అంతా ప్రస్తుతం బాబీ బాబీ (వదిన) అని పిలుచుకుంటున్న భామ లూలియా వంటూర్. ఈ రొమేనియన్ బ్యూటీ కోసం భాయ్ రోమియో అయిపోయారని బాలీవుడ్ టాక్. గురువారం సల్మాన్ ఖాన్ బర్త్‌డే. ఈ బర్త్‌డేకు గిఫ్ట్‌గా క్రాస్లాకెట్ (ఏసు క్రీస్తు బొమ్మ ఉన్న శిలువ) ఉన్న గోల్డ్ చైన్‌ను ప్రజెంట్ చేశారు లూలియా. అంతేకాదు ఫామ్‌హౌస్‌లో సల్మాన్ హోస్ట్ చేసిన పార్టీలో ఆయన పక్కనే ఉంటూ గెస్ట్‌లను రిసీవ్ చేసుకున్నారట. ఇప్పుడైతే ప్రియ నేస్తానికి లాకెట్ ఇచ్చారు. మరి.. పెళ్లితో ఈ ఇద్దరూ ఎప్పుడు లాక్ అవుతారో చూడాలి. -
ఇప్పుడు వంటూర్ వంతు
సల్మాన్ ఖాన్ మనసుకు నచ్చాలే కానీ అవకాశాలకు కొదవ ఉండదు అంటుంటారు ముంబై మీడియా. అంతలా ప్రోత్సహిస్తుంటారు తన మనసుకి దగ్గరైనవారిని. కత్రినా కైఫ్, జాక్వెలిన్, జరీన్ ఖాన్.. ఇలా సల్మాన్ ఎంకరేజ్ చేసిన తారల లిస్ట్ పెద్దగానే ఉంది. రీసెంట్గా సూరజ్ పాంచోలీ, తన బామ్మరిది ఆయుష్ శర్మను కూడా తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా హీరోలుగా పరిచయం చేశారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి భాయ్ మనసుని దోచేసుకున్న లూలియా వంటూర్ కూడా జాయిన్ అయ్యారని సమాచారం. ఈ రొమేనియన్ యాక్టర్ సల్మాన్ మనసు దోచేసుకున్నారనే టాక్ ఎప్పటినుంచో ఉంది. ఆల్రెడీ సల్మాన్ ‘రేస్ 3’ సినిమాలో సల్మాన్ రాసిన ‘సెల్ఫిష్’ సాంగ్‌ను పాడారు లూలియా. దర్శకుడు ప్రేమ్ సోనీ రూపొందించబోయే లేటెస్ట్ సినిమాలో లూలియా వంటూర్ను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారట సల్మాన్. రణ్‌దీప్ హుడా హీరోగా నటించనున్న ఈ సినిమాను సల్మాన్ ఖాన్ సొంత బ్యానర్‌పై నిర్మించాలనుకుంటున్నారని సమాచారం. సో.. సల్మాన్ పరిచయం చేసిన నాయికలలాగే లూలియా వంటూర్ కూడా పెద్ద సక్సెస్‌ను అందుకుంటారో లేదో వేచి చూడాలి. -
నాకు అమ్మాయి దొరికింది : సల్మాన్
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఓ ఆసక్తికర మైన ట్వీట్ తో అభిమానులకు షాక్ ఇచ్చాడు. 50 ఏళ్లుదాటినా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఉన్న సల్మాన్.. తనకు అమ్మాయి దొరికిందంటూ ట్వీట్ చేశాడు. అయితే సల్మాన్ చేసిన ఈ ట్వీట్ తన పెళ్లికి సంబంధించినదేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొంత కాలంగా లులియా వాంటూర్ తో సన్నిహితంగా ఉంటున్న సల్మాన్ ఇటీవల ఆమెకు దూరమైనట్టుగా వార్తలు వినిపించాయి. లులియా కూడా సల్మాన్ తనకు మంచి స్నేహితుడు మాత్రమే అంటూ కామెంట్ చేయటంతో వారిద్దరు దూరమయ్యారని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. ఇప్పుడు సల్మాన్ ట్వీట్ తో మరోసారి సల్మాన్ పెళ్లి వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల టైగర్ జిందాహై సినిమాతో ఘనవిజయం సాదించిన సల్లూభాయ్ ప్రస్తుతం రేస్ 3 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో జాక్వలిన్ ఫెర్నాండెజ్, డైసీ షాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. Mujhe ladki mil gayi — Salman Khan (@BeingSalmanKhan) 6 February 2018 -
షాక్ ఇచ్చిన సల్మాన్ గర్ల్ ఫ్రెండ్
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కొంత కాలంగా లులియా వాంతూర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరు ప్రేమ వ్యవహారాన్ని బహిరంగంగా ప్రకటించకపోయినా.. పలు వేదికల మీద ఇద్దరు కలిసి సందడిచేశారు. అంతేకాదు సల్మాన్ ఇంట్లో జరిగే వేడుకల్లోనూ లూలియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న టాక్ బలంగా వినిపించింది. అయితే ఈ విషయంపై తాజాగా స్పందించిన లులియా, సల్మాన్ అంటే నాకు గౌరవం మాత్రమే మా మధ్య ఏమీ లేదంటూ షాక్ ఇచ్చారు. అంతేకాదు నా పై వస్తున్న రూమర్స్ గురించి తెలిసింది. కానీ అవి ఎవరో పుట్టించిన రూమర్స్. వాటిని నేను ఆపలేను. నా జీవితం నన్ను ఎక్కడికి తీసుకువెళ్తుందో నాకు తెలియడం లేదు. మూడు సంవత్సరాల క్రితం నేను నా జీవితం గురించి ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాను అంటూ వేదాంత ధోరణిలో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. త్వరలో ఈ భామ మనీశ్ పాల్ జంటగా ‘హర్ జై’ అనే వీడియోతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. -
వెంకీ విత్ సల్మాన్ గాళ్‌ఫ్రెండ్
టాలీవుడ్ సీనియర్ హీరో , విక్టరీ వెంకటేష్ బాలీవుడ్ ప్రవేశంపై మరోసారి ఊహాగానాలు చెలరేగాయి. ఎప్పుడు గాసిప్స్‌కు దూరంగావుండే ఈ నటుడు, సల్మాన్ గాళ్‌ఫ్రెండ్ లులియా వాంటర్‌తో కలిసి ఒకే కారులో కనిపించడం టాక్ ఆప్ టౌన్ అయ్యింది. దీంతో ఆయన బాలీవుడ్ ఎంట్రీపై పుకార్లకు తెరలేచింది. ముంబైలో డిన్నర్‌కు వెళ్లిన సందర్భంగా వీరిద్దరూ ఇలా కెమెరాకు చిక్కారు. దీంతో బాలీవుడ్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన వెంకటేష్ పునః ప్రవేశం గురించి చర్చించడానికే వెళ్లారా? అనే పుకార్లు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అయిన ఈ ఫోటోలతో వెంకటేష్ బాలీవుడ్లో తిరిగి నటించనున్నారనే వార్తలకు ఈ మరింత బలం వచ్చింది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇటీవల ఓ పార్టీలో సల్మాన్, లులియాతో వెంకీ సమావేశమయ్యారని, దీనికి పార్టీలో పలువురు బాలీవుడ్ స్టార్లు కూడా హాజరయ్యారని తెలుస్తోంది. అయితే సమయం, సందర్భం ఏంటన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు. అంతేకాదు మరో పుకారు కూడా షికారు చేస్తోంది. టాలీవుడ్ లోకి లూలియా వంతూర్ ప్రవేశం చేయనుందా అనేది ప్రజెంట్ టాక్ ఆఫ్‌ది టౌన్‌గా వుంది. అయితే ఇరువర్గాలనుంచి విశ్వసనీయ సమాచారం వచ్చే వరకు వేచి చూడాల్సిందే. సల్మాన్ ఖాన్, వెంకటేష్ మధ్య సాన్నిహిత్యం తెలిసిన విషయమే. -
సల్మాన్ సినిమాలో ప్రియురాలి పాట?
బాలీవుడ్ ముదురు బ్రహ్మచారి సల్మాన్ ఖాన్ ఈమధ్య కాలంలో లులియా వాంటూర్‌తో కలిసి తిరుగుతున్నాడనేది బహిరంగ రహస్యమే. తన ప్రియురాలిని బాలీవుడ్‌లోకి కూడా తీసుకురావాలని భావించిన సల్లూభాయ్... తన సినిమాతోనే ఆ అవకాశం కల్పించాలని అనుకుంటున్నాడట. ట్యూబ్‌లైట్ సినిమా షూటింగులో తరచు సల్మాన్‌తో కలిసి కనిపిస్తున్న లులియాతో ఆ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ పాడించాలని భావిస్తున్నట్లు టాక్. ఈ సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. రొమేనియాకు చెందిన ఈ సుందరి.. ఇటీవలే హిమేష్ రేషమ్మియా సంగీత దర్శకత్వంలో ఒక సింగిల్ ఆల్బం విడుదల చేసింది. ఇప్పుడు తన కొత్త పాటతో బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని ఉత్సాహంగా కనిపిస్తోంది. ఎక్కడో రొమేనియా నుంచి వచ్చినా, హిందీ బ్రహ్మాండంగా మాట్లాడుతోందని బాలీవుడ్ జనాలు ప్రశంసిస్తున్నారు. ఆమె గొంతు, శ్రుతి రెండూ కూడా చాలా బాగున్నాయని, ఫైనల్ ట్రాక్ రికార్డింగ్ మాత్రం మిగిలి ఉందని చెబుతున్నారు. సుల్తాన్ సినిమాలోని 'బేబీకో బేస్ పసంద్ హై' పాటను లులియా ఇంతకుముందు రీమిక్స్ చేసింది. ఇప్పుడు డైరెక్ట్ పాట ఇవ్వడం ద్వారా ఆమెను మరో మెట్టు పైకి ఎక్కించాలని సల్మాన్ భావిస్తున్నాడు. -
సల్మాన్‌కు ఆమె ఎందుకు కటీఫ్ చెప్పింది?
దేశంలో అత్యంత ముదురు బ్రహ్మచారి ఎవరంటే.. మొట్టమొదటి వినిపించే పేరు సల్మాన్ ఖాన్. ఎప్పటికప్పుడు సరికొత్తగా ప్రియురాళ్ల పేర్లు మార్చేస్తూ ఉండే సల్లూభాయ్.. గత కొంత కాలంగా మాత్రం ఒకే పేరు వినిపిస్తోంది. ఆమే రొమేనియా మోడల్ లులియా వాంటూర్. పార్టీలు, సినిమా ఫంక్షన్లు, చివరకు ఇంట్లో జరిగిన కార్యక్రమాల సమయంలోనూ వీళ్లిద్దరూ కలిసి కనిపించడంతో ఇక సల్లూభాయ్ బ్రహ్మచర్య వ్రతం ముగిసిపోయినట్లేనని, లులియాతో కలిసి జీవితాంతం సుఖంగా గడుపుతాడని అంతా అనుకున్నారు. అంతలోనే.. వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఇద్దరికీ చెడిపోయిందని, వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడం లేదని సల్మాన్ సన్నిహిత వర్గాలు చెప్పాయి. అందుకు కారణాలేంటో కూడా ఎవరికీ తెలియలేదు. ఇటీవలే లులియా తన సొంత దేశానికి వెళ్లిపోయింది కూడా. అంతేకాదు, రొమేనియాలో అత్యంత విజయవంతమైన మహిళగా ఓ అవార్డు కూడా తీసుకుంది. సల్మాన్ గురించి ఆ అవార్డు తీసుకునే సమయంలో పెదవి విప్పని లులియా.. ఆ తర్వాత ఒక రొమేనియా పత్రికకు మాత్రం అన్నీ చెప్పిందట. ''సల్మాన్‌కు, నాకు ప్రేమ ఏమీ లేదు. ఇప్పుడంతా బాగానే ఉంది. సల్మాన్‌కు చాలామంది బాడీగార్డులు ఉన్నారు గానీ, నాకు రొమేనియాలోనే సురక్షితంగా ఉంది. నాకు ఇక్కడ బాడీగార్డులు అక్కర్లేదు'' అని ఆమె చెప్పారు. ఇంకా.. ''నాకు ఇంతకుముందే పెళ్లయింది. గతంలోనే నా భర్తను వదిలేశాను. కానీ, భారతదేశంలో మాత్రం నేను ఎవరినీ పెళ్లి చేసుకోలేదు, ఎవ్వరినీ వదిలేయలేదు'' అని కూడా ఆమె కుండ బద్దలు కొట్టింది. అయితే సల్మాన్‌తో ప్రేమ వ్యవహారం గురించి మాత్రం ఏమీ చెప్పలేదు. భారతీయ సంస్కృతికి అలవాటు పడటం ఎంత కష్టమో కూడా ఆమె తెలిపింది. తాను అక్కడ చాలా కాలం కష్టపడి పనిచేసినా, ఎక్కువగా తన వ్యక్తిగత జీవితం గురించే చర్చలు సాగాయన్నారు. గతంలో తాను ఆరునెలల పాటు భారతదేశంలో ఉన్నప్పుడు తాను చర్చించదలచుకోని చాలా అంశాలు జరిగాయని తెలిపారు. భారతీయ సంస్కృతి, ప్రజలు, వాళ్ల ఆలోచనా తీరు అన్నీ భిన్నంగా ఉంటాయన్నారు. అక్కడ మనకు ఎక్కువ వ్యక్తిగతం అంటూ ఉండదని, ఒకే ఇంట్లో ఎక్కువ మందితో కలిసి ఉండాలని చెప్పారు. వీధుల్లో వెళ్లేటప్పుడు ఫలానా పద్ధతిలోనే దుస్తులు వేసుకోవాలన్న విషయం కూడా తనకు అర్థం కాలేదని తెలిపారు. తన దుస్తులు చాలా కురచగా ఉన్నాయన్న విషయం ఆ తర్వాత అర్థమైందన్నారు. -
అమ్మ ఒప్పుకుందా?
బాలీవుడ్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి చాలాకాలంగా రకరకాల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రొమేనియా తార లులియా వంటూర్తో ప్రేమాయణం సాగిస్తున్నాడని, త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోనున్నారని బీటౌన్ టాక్. ఆ రూమర్లకు బలం చేకూరుస్తూ వీరిద్దరు సన్నిహితంగా ఉన్న కొన్ని ఫొటోలు ఆన్ లైన్ లో చక్కర్లు కొట్టాయి కూడా. తాజాగా లులియా సల్మాన్ ఫ్యామిలీతో కలిసి మరోసారి మీడియా కంటబడింది. బుధవారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్టులో సల్మాన్ తల్లి సల్మాకు ఆసరాగా ఆమె చెయ్యి పట్టుకుని నడుస్తూ కనబడింది లులియా. వారితో సల్మాన్, ఆయన సోదరి కూడా ఉండటం విశేషం. దీంతో సల్మాన్ ఖాన్దాన్.. లులియాతో పెళ్లికి అంగీకారం తెలిపినట్టేనంటూ సోషల్ మీడియాలో వారి ఫొటోలతో సహా పెళ్లి వార్తలు ఊపందుకున్నాయి. అమ్మ ఒప్పేసుకుంది కాబట్టి త్వరలోనే సల్మాన్ పెళ్లి చూస్తామంటూ అభిమానులు ఖుషీ అవుతున్నారు. సల్మాన్ చండీగఢ్‌లో సుల్తాన్ షూటింగ్ ముగించుకున్న తర్వాత వారంతా ముంబై తిరిగి వస్తున్నట్లు సమాచారం. -
ఎక్స్‘ప్లస్’!
‘బోల్డ్’గా ఉండే సల్మాన్‌ఖాన్ చుట్టూ బోల్డన్ని కబుర్లుంటాయి ఎప్పుడూ! ముఖ్యంగా మనోడు సినిమాలతో ఎంత ఫేమస్సో... చుట్టూ గాళ్‌ఫ్రెండ్స్‌తో అంతే పాపులర్. థియేటర్లలో అతగాడి పిక్చర్ ఏదీ ఆడకపోతున్నా... డేటింగ్ అప్డేట్స్తో న్యూస్‌లో కనిపిస్తూనే ఉంటాడు. లేటెస్ట్గా ఓ సన్సేషన్... సల్లూ భాయ్ తొలినాళ్ల ప్రేయసి సంగీతా బిజ్లానీ... ప్రస్తుత ప్రియురాలు లులియా వంట్యూర్ ఒకే పార్టీలో కలసి ఎంజాయ్ చేశారట! అక్కడే ఉన్న కండల వీరుడు తన లైఫ్‌లోకొచ్చిన మాజీ ప్రియురాళ్లందరి గురించి వారితో షేర్ చేసుకున్నాడనేది ఓ వెబ్సైట్ కథనం. అయితే ఒక్క ఐశ్వర్యారాయ్ పేరు మాత్రం ప్రస్తావించలేదట! మిగిలిన అందరితో తాను ఎంతో ఆనందంగా గడిపానని... వారి సాన్నిహిత్యాన్ని ప్రతి క్షణం ఆస్వాదించానని చెప్పుకొచ్చాడట. అంటే ఐశ్వర్యతో ఆ హ్యాపినెస్ దొరకలేదా మనోడికి అన్నది బీటౌన్ గుసగుస! -
ఉంబక్కుం పాటలో మెరిసిన సల్లూభాయ్ ఫియాన్సీ
బాలీవుడ్ ముదురు బ్రహ్మచారి సల్మాన్‌ఖాన్ ఎట్టకేలకు పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు అర్జున్ కపూర్, స్నేహా ఉల్లాల్, కత్రినా కైఫ్, జరైన్ ఖాన్.. ఇలా అనేకమందిని బాలీవుడ్ ప్రజలకు పరిచయం చేసిన సల్లూభాయ్.. తాను పెళ్లాడబోతున్న రుమేనియా అమ్మడు లులియా వాంటర్ని కూడా తెరమీదకు తీసుకొస్తున్నాడట. అతుల్ అగ్నిహోత్రి తీస్తున్న 'ఓ తేరీ' చిత్రంలో లులియా వాంటర్ ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. 'ఉంబక్కుం' అంటూ మొదలయ్యే ఈ పాట ఇప్పటికే యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో పులకిత్ సామ్రాట్, బిలాల్ అమ్రోహి, సారా జేన్ డయాస్, సారా లోరెన్ తదితరులున్నారు. ఉంబక్కుం పాటను ప్రముఖ పంజాబీ గాయకుడు మికా సింగ్ పాడాడు. సల్లూభాయ్ నటించిన 'జైహో' చిత్రం షూటింగ్ సమయంలో సెట్ల వద్ద చాలాసార్లు రుమేనియా పాప కనిపించిందట. ఇక ఉంబక్కుం పాట చిత్రీకరణ విషయంలో సహజంగానే సల్మాన్ ఖాన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. పాట పూర్తిగా విడుదల అవ్వడానికి ముందు కూడా ఓసారి దాన్ని ప్లే చేయించుకుని చూశాడు.