ఉంబక్కుం పాటలో మెరిసిన సల్లూభాయ్ ఫియాన్సీ | salman khan fiance sizzles in item song | Sakshi
Sakshi News home page

ఉంబక్కుం పాటలో మెరిసిన సల్లూభాయ్ ఫియాన్సీ

Published Tue, Mar 11 2014 10:01 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఉంబక్కుం పాటలో మెరిసిన సల్లూభాయ్ ఫియాన్సీ - Sakshi

ఉంబక్కుం పాటలో మెరిసిన సల్లూభాయ్ ఫియాన్సీ

బాలీవుడ్ ముదురు బ్రహ్మచారి సల్మాన్ఖాన్ ఎట్టకేలకు పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు అర్జున్ కపూర్, స్నేహా ఉల్లాల్, కత్రినా కైఫ్, జరైన్ ఖాన్.. ఇలా అనేకమందిని బాలీవుడ్ ప్రజలకు పరిచయం చేసిన సల్లూభాయ్.. తాను పెళ్లాడబోతున్న రుమేనియా అమ్మడు లులియా వాంటర్ని కూడా తెరమీదకు తీసుకొస్తున్నాడట. అతుల్ అగ్నిహోత్రి తీస్తున్న 'ఓ తేరీ' చిత్రంలో లులియా వాంటర్ ఓ స్పెషల్ సాంగ్లో మెరిసింది. 'ఉంబక్కుం' అంటూ మొదలయ్యే ఈ పాట ఇప్పటికే యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో పులకిత్ సామ్రాట్, బిలాల్ అమ్రోహి, సారా జేన్ డయాస్, సారా లోరెన్ తదితరులున్నారు. ఉంబక్కుం పాటను ప్రముఖ పంజాబీ గాయకుడు మికా సింగ్ పాడాడు.

సల్లూభాయ్ నటించిన 'జైహో' చిత్రం షూటింగ్ సమయంలో సెట్ల వద్ద చాలాసార్లు రుమేనియా పాప కనిపించిందట. ఇక ఉంబక్కుం పాట చిత్రీకరణ విషయంలో సహజంగానే సల్మాన్ ఖాన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. పాట పూర్తిగా విడుదల అవ్వడానికి ముందు కూడా ఓసారి దాన్ని ప్లే చేయించుకుని చూశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement