
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికందర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఉగాది కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్, సల్మాన్ ఫిల్మ్ ఖాన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై సాజిద్ నదియావాలా నిర్మించారు.
అయితే జవాన్ మూవీతో సూపర్ హిట్ కొట్టి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో సల్మాన్ ఖాన్ చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. ఈ మూవీ ఆలస్యం కావడంపై ఆయన స్పందించారు.
ఈ సినిమా బడ్జెట్‌పై అంచనాలు మరోసారి రూపొందిస్తున్నారని సల్మాన్ ఖాన్ వెల్లడించారు. అదే ఈ సినిమా ఆలస్యానికి ప్రధాన కారణమని తెలిపారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభించాలని నిర్ణయించినా బడ్జెట్ విషయంలో సమస్యలు రావడంతో వాయిదా పడిందని సల్మాన్ పేర్కొన్నారు. ఈ మూవీని ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరెకెక్కించనున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ అభిమానులు ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
షారూఖ్ ఖాన్ జవాన్ తర్వాత అట్లీ చేస్తున్న రెండో హిందీ చిత్రం ఇదే కావడం విశేషం. రూ. 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన జవాన్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 1,150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 2023లో విడుదలైన జవాన్ మూవీలో నయనతార, దీపికా పదుకొనే, విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.