హైదరాబాద్‌లో సల్మాన్ ఖాన్‌.. ఆ హోటల్‌లో కఠిన నిబంధనలు! | Salman Khan shoots Sikandar with 4 tier security in Hyderabad | Sakshi
Sakshi News home page

Salman Khan: ఆ హోటల్‌లో సల్మాన్ ఖాన్‌ షూటింగ్.. అతిథులను చెక్ చేయాల్సిందే!

Published Fri, Nov 8 2024 5:35 PM | Last Updated on Fri, Nov 8 2024 6:04 PM

Salman Khan shoots Sikandar with 4 tier security in Hyderabad

బాలీవుడ్ స్టార్ ‍హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికందర్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం సల్లు భాయ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. సిటీలో రాయల్‌ హోటల్‌గా గుర్తింపు ఉన్న ఫలక్‌నుమా ప్యాలెస్‌లోనూ షూటింగ్‌ నిర్వహిస్తున్నారు.

అయితే సల్మాన్ ఖాన్‌కు ఇటీవల వరుసగా బెదిరింపులు వస్తోన్న సంగతి తెలిసిందే. కృష్ణజింకల కేసు నుంచి ప్రముఖ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్ నుంచి ఆయనకు బెదిరింపులు వస్తున్నాయి. సల్మాన్‌ను చంపేస్తామంటూ కొందరి నుంచి కాల్స్‌ వస్తుండటంతో ఆయనకు కట్టుదిట్టమైన భద్రతను పెంచారు. అలా ఫుల్ సెక్యూరిటీ మధ్య ఆయన షూటింగ్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు ఏ‍ర్పడ్డాయి.

నాలుగంచెల భద్రత..

ఈ నేపథ్యంలో ఫలక్‌నుమా ప్యాలెస్ హోటల్‌లో నాలుగు అంచెల భద్రతలో సల్మాన్ ఖాన్‌ మూవీ షూటింగ్ నిర్వహించారు. ఆయన భద్రత విషయంలో రాజీ పడకూడకుండా నిర్మాతలు చర్యలు తీసుకున్నారు. ఎవరైనా అతిథులు షూటింగ్ జరుగుతున్న హోటల్‌ను బుక్ చేసుకుంటే రెండంచెల చెకింగ్‌ను వారు ఎదుర్కొవాల్సి ఉంటుంది. వాటిలో ఒకటి హోటల్ సెక్యూరిటీ సిబ్బంది.. మరొకటి సల్మాన్ ఖాన్‌ ప్రత్యేక భద్రత బృందం వారిని తనిఖీ చేయాలి. ఆ తర్వాతే వారిని హోటల్‌లోకి అనుమతించడం జరుగుతుంది.

ఐడీ ఉంటేనే అనుమతి...

మరోవైపు హోటల్ సిబ్బందికి ఐడీ కార్డులు ఉంటేనే లోపలికి ఎంట్రీ ఉంటుంది. ప్రతి రోజు సిబ్బంది ఐడీలను సైతం తనిఖీ చేస్తున్నారు. సల్మాన్ కోసం ఫలక్‌నుమా ప్యాలెస్‌ను పటిష్టమైన భద్రతా వలయంగా మార్చారు. ఆయన కోసం దాదాపు 50 నుంచి 70 వరకు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీని నియమించారు. వీరిలో మాజీ పారామిలటరీ సిబ్బంది కూడా ఉన్నారు. అయితే హైదరాబాద్‌లో షూటింగ్ షెడ్యూల్‌ను ముగించిన తర్వాత సల్మాన్ దుబాయ్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.

కాగా.. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ సికందర్‌ను సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్ శెట్టి, కాజల్ అగర్వాల్‌లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement