Security
-
భగవంతుడా... ఇదేమి ‘భద్రత’!
జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఆలయాల భద్రతను అధికారులు గాలికొదిలేశారు. క్షేత్రంలో అడుగడుగునా నిఘా, భద్రత లోపాలు కొట్టొచి్చనట్టు కనిపిస్తున్నాయి. ఇక్కడ చేపట్టాల్సిన భద్రతపై పోలీసు, ఆక్టోపస్ భద్రతా దళం, నిఘా వర్గాలు పలు నివేదికలు ఇచ్చినప్పటికీ, వాటిని అమలు పరచడంలో దేవస్థానం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఉద్యోగులు, భక్తులు అందరూ సెల్ఫోన్లతో, లగేజి బ్యాగులతో ఆలయంలోకి ప్రవేశించేస్తున్నారు. ఆలయంలోకి సెల్ఫోన్లు, ఇతర ఎల్రక్టానిక్ వస్తువులను అనుమతించకూడదని ఈవో ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ సినా, కొందరు అధికారులు వాటిని బుట్టదాఖలు చేశారు. –శ్రీశైలం టెంపుల్సెక్యూరిటీ బాధ్యతలు వదిలేసిన గార్డులు శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల దర్శనానికి సాధారణ రోజుల్లో రోజుకు 20 నుంచి 30వేల మంది, రద్దీ రోజుల్లో సుమారు 50 వేల మంది వస్తుంటారు. ఆలయంలో భద్రతకు సుమారు 40 మంది హోంగార్డులు, ఓ ఏజెన్సీ ద్వారా 180 మంది సెక్యూరిటీ గార్డులు, మరో రెండు ఏజెన్సీల ద్వారా 32 మంది సెక్యూరిటీ గార్డులు, ఐదుగురు సెక్యూరిటీ సూపర్వైజర్లు ఉన్నారు. హోంగార్డులు, ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు ఆలయంలో, క్షేత్రంలోని వివిధ ప్రదేశాలలో సెక్యూరిటæ విధుల్లో ఉండాలి. అలాగే క్యూలైన్ల ప్రవేశ ద్వారాల వద్ద భక్తులు సెల్ఫోన్లు, ఇతర ఎల్రక్టానిక్ పరికరాలు, పేలుడు పదార్థాలు తీసుకెళ్లకుండా తనిఖీలు చేయాలి. అయితే రూ.150, రూ.300 క్యూలైన్లు, ఆర్జితసేవల క్యూలైన్ వద్ద ఉండే సెక్యూరిటీ గార్డులు ఓ పర్యవేక్షకురాలి ఆదేశాలతో భద్రత విధులు వదిలేసి, టికెట్లు, ఆధార్ కార్డులు తనిఖీల్లో మునిగిపోతున్నారు. ఆ క్యూలైన్లలో పని చేసే హోంగార్డులు సైతం టికెట్ల తనిఖీలతోనే తలమునకలు అవుతున్నారు. ఈ వ్యవహారాన్ని ఇతర అధికారులెవరూ పట్టించుకోవడంలేదు. దీంతో భక్తులు, సిబ్బంది ఆలయంలోకి యథేచ్ఛగా సెల్ ఫోన్లు, లగేజితో ప్రవేశిస్తున్నారు. ఎక్కడా ఏ దశలోనూ అడిగేవాడు, తనిఖీ చేసే వాళ్లు కనిపించడంలేదు. నిరుపయోగంగా భద్రత పరికరాలు శ్రీశైల దేవస్థానం భక్తుల భద్రత దృష్ట్యా ఉచిత క్యూలైన్, ఆర్జిత సేవాకర్తల ప్రవేశ ద్వారం, శ్రీ కృష్ణదేవరాయ గోపురం, రూ.150 క్యూలైన్, రూ.300 క్యూలైన్, హరిహరరాయగోపురం, అమ్మవారి ఆలయం వెనుక తదితర చోట్ల డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, హ్యాండ్ డిటెక్టర్లను దేవస్థానం ఏర్పాటు చేసింది. ఆర్జిత సేవాకర్తల ప్రవేశ ద్వారం, శ్రీకృష్ణదేవరాయగోపురం వద్ద డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లను ఇటీవల తొలగించారు. మిగతా చోట్ల ఉన్నవీ పనిచేయక, అలంకారప్రాయంగా ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం లగేజ్ స్కానర్‌ను దేవస్థానం ఏర్పాటు చేసినప్పటికీ ఇంతవరకు వినియోగించిన దాఖాలాల్లేవు. ఇక ఆలయంలో సెల్‌ఫోన్ జామర్లు లేకపోవడం చూస్తే భద్రతను ఏ స్థాయిలో పర్యవేక్షిస్తున్నారో అర్థమవుతోంది.హెచ్చరికలు బేఖాతరు శ్రీశైలం ఆలయం భద్రతపై ఆక్టోపస్ బృందాలు పలుమార్లు మాక్‌డ్రిల్ నిర్వహించాయి. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో స్వీయ పర్యవేక్షణ చేపట్టి పలు భద్రతా చర్యలు చేపట్టాలని సూచిస్తూ దేవస్థానానికి నివేదికలు కూడా ఇచ్చారు. నిఘా విభాగాలు కూడా క్షేత్ర భద్రతపై పలుమార్లు హెచ్చరించినా ఆలయ అధికారుల తీరులో మార్పురాలేదు.స్క్రీనింగ్ చేస్తున్నాంశ్రీశైలం దేవస్థానంలోని ఉభయ దేవాలయాల్లోకి ప్రవేశించే భక్తులు ఎలాంటి సెల్ఫోన్లు, నిషేధిత వస్తువులు తీసుకెళ్లకుండా స్క్రీనింగ్ చేస్తున్నాం. ఇప్పటికే అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశాం. ఆలయంలో భద్రతను మరింత పటిష్టం చేస్తాం. – ఎం.శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి -
నేడు హోలీ.. రంజాన్ ప్రార్థనలు.. దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం
న్యూఢిల్లీ: నేడు ఒకవైపు హోలీ(Holi) మరోవైపు రంజాన్ శుక్రవారం ప్రార్థనల సందర్భంగా దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశరాజధాని ఢిల్లీలో శాంతిభద్రతలను కాపాడేందుకు పారామిలిటరీ(Paramilitary) దళాలతో పాటు 25,000 మందికి పైగా పోలీసులు పహారా కాస్తున్నారని పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఢిల్లీలో పోలీసులు 300కు పైగా సమస్యాత్మక ప్రదేశాలను గుర్తించి, డ్రోన్లు,సీసీటీవీ కెమెరాల సహాయంతో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. #WATCH | Delhi Police conducted a flag march in the Malviya Nagar area ahead of Holi celebrations and Jumma Namaz, which are due to be held tomorrow. pic.twitter.com/pNSUYB1Xc1— ANI (@ANI) March 13, 2025ఇక హోలీ వేడుకలు ఘనంగా జరిగే రాజస్థాన్ విషయానికొస్తే రాష్ట్రంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జైపూర్ అదనపు పోలీస్ కమిషనర్(Police Commissioner) (లా అండ్ ఆర్డర్) రామేశ్వర్ సింగ్ మాట్లాడుతూ పోలీసు విభాగానికి చెందిన 11 మంది అదనపు డిప్యూటీ కమిషనర్లు, 40 మందికి పైగా అసిస్టెంట్ కమిషనర్లు, 80 మంది సర్కిల్ ఆఫీసర్లు, దాదాపు 1500 మంది కానిస్టేబుళ్లు భద్రతా ఏర్పాట్లను చూసుకుంటారని తెలిపారు. అలాగే 300 మందికి పైగా మహిళా సిబ్బంది కూడా భద్రతా ఏర్పాట్లలో పాల్గొంటారన్నారు. హోలీ రోజున పెద్ద సంఖ్యలో పర్యాటకులు జైపూర్‌కు తరలివస్తారని తెలిపారు.#WATCH | Delhi Police conducted a bike rally in the Connaught Place area ahead of Holi celebrations and Jumma Namaz, which are due to be held tomorrow. pic.twitter.com/9yhAKsPs0I— ANI (@ANI) March 13, 2025శతాబ్దాల నాటి సనాతన ధర్మ సంప్రదాయాలను అనుసరించి, సామరస్యంగా హోలీ జరుపుకోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హోలీ సందర్భంగా ఎవరిపైన అయినా బలవంతంగా రంగులు వేయవద్దని ముఖ్యమంత్రి ప్రజలను కోరారు. పరస్పర గౌరవంతో జరుపుకునే పండుగలు మరింత ఆనందాన్ని ఇస్తాయన్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. హోలీ, రంజాన్ శుక్రవారం ప్రార్థనలు ఒకే రోజు ఉన్నందున ప్రతి జిల్లాలోని శాంతి కమిటీలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. హోలీ రోజున అణువణువునా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడంతో పాటు, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్, స్టంట్ బైకింగ్‌లపై నిఘా ఉంచడానికి ప్రత్యేక బృందాలను మోహరించామని యూపీ పోలీసు అధికారులు తెలిపారు. ఇదేవిధంగా వివిధ రాష్ట్రాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇది కూడా చదవండి: హోలీ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ -
ఉక్రెయిన్ భద్రత కోసం అవసరమైతే అణ్వాయుధాలు!
బ్రస్సెల్స్: ఉక్రెయిన్ భద్రత కోసం రష్యాను బెదిరించేందుకు అవసరమైతే తన అణ్వాయుధాలను నిరోధంగా వాడేందుకు సిద్ధమంటూ ఫ్రాన్స్ వివాదాస్పద ప్రతిపాదన చేసింది. గురువారం బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో యూరోపియన్ యూనియన్ దేశాల తాజా శిఖరాగ్ర సమావేశం ఇందుకు వేదికైంది. రష్యా బారినుంచి యూరప్‌కు రక్షణ కల్పించేందుకు ఫ్రాన్స్ అణుపాటవాన్ని ఆయుధంగా ఉపయోగించేందుకు సిద్ధమని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ సందర్భంగా ప్రకటించారు. సభ్య దేశాల నుంచి ఇందుకు భారీ స్పందన లభించింది. పోలండ్‌తో పాటు లిథువేనియా, లాతి్వయా వంటి పలు బాలి్టక్ దేశాలు ఈ ప్రతిపాదనను గట్టిగా సమరి్థంచాయి. యూరోపియన్ యూనియన్‌లో అణ్వాయుధ పాటమున్న దేశం ఫ్రాన్స్ ఒక్కటే కావడం విశేషం. ఫ్రాన్స్‌కున్న ఈ సానుకూలతను యూరప్ భద్రత కోసం ఉపయోగించేందుకు సిద్ధమని బుధవారం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కూడా మాక్రాన్ ప్రకటించారు. దీనిపై లోతుగా చర్చ జరగాలని ఈయూ భేటీలో ఆయన పునరుద్ఘాటించారు. దీనిపై రష్యా తీవ్రంగా స్పందించింది. మాక్రాన్ ప్రతిపాదన అత్యంత ప్రమాదకరమైనదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ అన్నారు. ‘‘శాంతి యత్నాలకు బదులు యుద్ధానికే ఫ్రాన్స్ మొగ్గుతోంది. ఉక్రెయిన్‌తో మా యుద్ధం కొనసాగాలనే ఆశిస్తోంది. మాక్రాన్ వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు రుజువు’’ అని ఆయన ఆరోపించారు. -
తెలంగాణలో కొనసాగుతున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
-
వైఎస్ జగన్ భద్రతలోనూ చంద్రబాబు కుట్ర
-
జగన్ కు ఏం జరగాలని చంద్రబాబు ఇంత నీచానికి దిగజారాడు
-
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతలో చంద్రబాబు ప్రభుత్వం కుట్ర... జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న నాయకుడి భద్రతపై ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం
-
జగన్ భద్రతలోనూ బాబు కుట్ర
సాక్షి, అమరావతి: జడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం కల్పిస్తున్న భద్రత కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. అత్యంత పటిష్టమైన భద్రత కల్పించాల్సిన వైఎస్ జగన్‌కు చంద్రబాబు ప్రభుత్వం ఆయనకు కనీస సమాచారం ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా భద్రత సిబ్బందిని కుదించేసింది. జగన్‌పై గతంతో రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గుర్తు తెలియని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. వీటిని కూడా చంద్రబాబు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. జగన్ నివాసం, పార్టీ ఆఫీసు వద్ద కూడా భద్రతను తొలగించడం ప్రభుత్వ కుతంత్రానికి నిదర్శనం. వైఎస్ జగన్ జిల్లా పర్యటనల్లోనూ కనీస భద్రత కూడా కల్పించడంలేదు. 2024 ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే చంద్రబాబు కుట్రకు తెరతీశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే జగన్ భద్రత కుదించాలంటూ పోలీసులకు మౌఖిక ఆదేశాలిచ్చారు. దాంతో పోలీసు ఉన్నతాధికారులు వైఎస్ జగన్‌కు 139 మందితో ఉన్న జడ్ ప్లస్ భద్రతను ఏకపక్షంగా ఉపసంహరించారు. పైకి 58 మందితో భద్రత కల్పిస్తున్నట్లు చెబుతూ ప్రజలను పక్కదారి పట్టిస్తోంది. వాస్తవానికి ఏ సమయంలో చూసినా ఆయన భద్రతకు కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లనే కేటాయిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.వైఎస్ జగన్ ఆఫీసు, నివాసం వద్ద భద్రతా సిబ్బందిని పూర్తిగా తొలగించింది. ఆయనపై ఎవరైనా దాడికి యతి్నస్తే వెంటనే ఆగంతకులపై ప్రతి దాడి చేసేందుకు ఉద్దేశించిన ఆక్టోపస్ కౌంటర్ అసాల్ట్ టీమ్‌లనూ ఉపసంహరించింది. టీడీపీ కూటమి ఎమ్మెల్యేల భద్రతకు నియోగించిన సిబ్బందికంటే వైఎస్ జగన్‌కు తక్కువ మంది సిబ్బందిని కేటాయించడం చంద్రబాబు కుట్రపూరిత విధానాలకు నిదర్శనం. కొనసాగుతున్న బెదిరింపులు వైఎస్ జగన్ లక్ష్యంగా రాష్ట్రంలో కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయన అంతు తేలుస్తామని 2024 ఎన్నికల ముందే టీడీపీ కూటమి నేతలు బహిరంగంగా ప్రకటించారు. ఎన్నికల అనంతరం టీడీపీ నేత, ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వైఎస్ జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు విభ్రాంతి కలిగించాయి. ‘వైఎస్ జగన్ ఎన్నికల్లో ఓడిపోయాడు గానీ చనిపోలేదు. చచ్చేంత వరకూ కొట్టాలి’ అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఎన్నికలకు ముందు, ఆ తరువాత కూడా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వైఎస్ జగన్ నివాసానికి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. అంటే ఆయన భద్రతకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందన్నది సుస్పష్టం. అడుగడుగునా భద్రతా వైఫల్యం చంద్రబాబు ప్రభుత్వ కుట్రపూరిత వైఖరి వైఎస్ జగన్ జిల్లా పర్యటనల్లో ప్రస్ఫుటంగా బయటపడుతూనే ఉంది. జగన్ జిల్లా పర్యటనల్లో అడుగడుగునా భద్రతా వైఫల్యం సర్వసాధారణంగా మారింది. వైఎస్సార్, తిరుపతి, కాకినాడ, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఆయన పర్యటనల్లో ప్రభుత్వం కనీస భద్రత కూడా కల్పించ లేదు. అందుకు కొన్ని తార్కాణాలు.. » గత ఏడాది పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్‌ను టీడీపీ గూండాలు హత్య చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వినుకొండ వెళ్లగా, ఆయనకు ప్రభుత్వం డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించడం విభ్రాంతి కలిగించింది. వాస్తవానికి జగన్ తన వ్యక్తిగత బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో పర్యటించేందుకు అనుమతి కోరగా పోలీసులు తిరస్కరించారు. దాంతో పోలీసులు సమకూర్చిన డొక్కు వాహనంలోనే ఆయన వినుకొండ బయల్దేరారు. కాసేపటికే అది మొరాయించడంతో జగన్ బుల్లెట్ ప్రూఫ్ లేని మరో ప్రైవేటు వాహనంలో వెళ్లాల్సి వచ్చింది. » వైఎస్సార్ జిల్లాలో జగన్ హెలికాప్టర్లో వెళ్లారు. అక్కడ పోలీసులు కనీస భద్రత ఏర్పాట్లు కూడా చేయలేదు. హెలికాప్టర్ ల్యాండ్ కాగానే వేలాదిమంది హెలికాప్టర్‌ను చుట్టుముట్టారు. జగన్ హెలికాప్టర్ నుంచి కిందకు దిగడమే కష్టమైంది. అభిమానుల ముసుగులో అసాంఘిక శక్తులు ఆ గుంపులో చేరితే పరిణామాలు ఎలా ఉండేవన్నది ఆందోళన కలిగిస్తోంది. » వైఎస్ జగన్ కాకినాడ జిల్లా పిఠాపురం పర్యటనలోనూ భద్రతా వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. కొందరు ఆగంతకులు ఏకంగా ఆయన కారుపైకి ఎక్కడం గమనార్హం. బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తుండగా ఓ ఆగంతకుడు వేగంగా ఆయనవైపు దూసుకొచ్చాడు. అక్కడున్న వారు అతన్ని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. » తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు దుర్మరణం చెందిన ప్రదేశాన్ని పరిశీలించేందుకు వాహనంలో వెళ్లేందుకు వైఎస్ జగన్‌కు పోలీసులు అనుమతించలేదు. దాంతో ఆయన నడుచుకుంటూనే వెళ్లారు. అయినా పోలీసులు అక్కడా కనీస భద్రత కల్పించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై ఎగబడేందుకు ప్రయత్నించారు. పార్టీ నేతలే ఎస్కార్టుగా మారి ఆయనకు భద్రత కల్పించాల్సి వచ్చింది.» మిర్చికి ధరలేక అవస్థలు పడుతున్న రైతులను పరామర్శించేందుకు జగన్ బుధవారం గుంటూరులో పర్యటించినప్పుడు కూడా పోలీసులు కనీస భద్రత కల్పించలేదు. వైఎస్సార్సీపీ నేతలే ఆయనకు ఇరువైపులా నిలబడి భద్రత కల్పించాల్సి వచ్చింది.వైఎస్ జగన్‌పై ఇప్పటికే రెండుసార్లు హత్యాయత్నాలు వైఎస్ జగన్ భద్రతకు ముప్పు ఉందన్న విషయం ప్రభుత్వానికి, పోలీసు శాఖకు తెలుసు. ఆయనపై గతంలో రెండుసార్లు హత్యాయత్నాలకు తెగబడ్డారు. ప్రతిపక్ష నేతగా ఉండగా 2018లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విశాఖపట్నం విమానాశ్రయంలోనే ఆయన మెడపై కత్తితో దాడి చేసి హత్య చేసేందుకు యత్నించిన విషయం తెలిసిందే. ఆ దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. భుజంపై తగిలిన తీవ్రమైన గాయానికి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచి్చంది. ఆయన్ని హత్య చేసే పన్నాగంతోనే ఈ దాడి చేశారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కూడా స్పష్టంగా చెప్పింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగానే 2024లో విజయవాడలో ఎన్నికల ర్యాలీలో ఓ ఆగంతకుడు ఆయన తలపైకి పదునైన గ్రానైట్ రాయి విసిరి హత్య చేసేందుకు యత్నించాడు. ఈ దాడి నుంచి కూడా ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఈ రెండు హత్యాయత్నాల కేసులు విచారణలో ఉన్నాయి. అయినప్పటికీ టీడీపీ ప్రభుత్వం వైఎస్ జగన్ భద్రతను పూర్తిగా కుదించడం వెనుక దురుద్దేశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.జడ్ ప్లస్ కేటగిరీలో 139 మందితో భద్రత ఉండేది ఇలా..జడ్ ప్లస్ కేటగిరీ నిబంధనల ప్రకారం వైఎస్ జగన్‌కు 139 మందితో భద్రత కల్పించాలి. ఇందులో భద్రతా అధికారులు, సిబ్బంది ఇలా ఉంటారు..» నివాసం వద్ద 6 + 24 విధానంలో సాయుధ భద్రతా సిబ్బంది : 30 మంది » వ్యక్తిగత భ్రదతా సిబ్బంది షిఫ్టుకు ఐదుగురు చొప్పున మూడు షిఫ్టుల్లో : 15 మంది » ఆఫీసు, నివాసం వద్ద షిఫ్టుకు ఆరుగురు చొప్పున : 18 మంది » షిఫ్టుకు ఆరుగురు చొప్పున మూడు షిఫ్టుల్లో ఆక్టోపస్ కౌంటర్ అసాల్ట్ టీమ్ : 18 మంది » 1+ 3 విధానంలో మూడు షిఫ్టుల్లో రెండు ఎస్కార్ట్ టీమ్‌లు : 24 మంది » వాచర్లు : ఐదుగురు » అదనపు ఎస్పీలు : ఇద్దరు ∙షిఫ్టుకు ఇద్దరు చొప్పున మూడు షిఫ్టుల్లో ఫ్రిష్కర్లు : ఆరుగురు» షిఫ్టుకు ఇద్దరు చొప్పున మూడు షిఫ్టుల్లో స్క్రీనర్లు : ఆరుగురు» షిఫ్టుకు ఐదుగురు చొప్పున మూడు షిఫ్టుల్లో ట్రెయిన్డ్ డ్రైవర్లు : 15 మంది 58 మందితో భద్రత ఇలా.. జడ్ ప్లస్ భద్రతా కేటగిరీలో ఉన్న జగన్‌కు 58 మందితో భద్రత కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇలా చూసినా ఆయనకు కల్పించాల్సిన భద్రత ఇలా ఉండాలి.. » నివాసం వద్ద 2 + 8 విధానంలో సాయుధ భద్రత సిబ్బంది: 10 మంది » వ్యక్తిగత భద్రతా సిబ్బంది షిఫ్టుకు ఇద్దరు చొప్పున మూడు షిఫ్టుల్లో: ఆరుగురు» 1+ 3 విధానంలో మూడు షిఫ్టుల్లో రెండు ఎస్కార్ట్ టీమ్‌లు : 24 మంది » వాచర్లు : ఐదుగురు » ఇద్దరు అదనపు ఎస్పీలను తొలగించారు. ఒక సీఐని కేటాయించారు » షిఫ్టుకు ఇద్దరు చొప్పున మూడు షిఫ్టుల్లో ఫ్రిష్కర్లు : ఆరుగురు » షిఫ్టుకు ఇద్దరు చొప్పున మూడు షిఫ్టుల్లో స్క్రీనర్లు : ఆరుగురు -
ఆ ట్రోలింగ్‌ను పవన్, బాబు ఖండించరా?
అనంతపురం, సాక్షి: వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతున్న ప్రజాదరణను ఓర్వలేక చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు దిగిందని, ఈ క్రమంలోనే భద్రతను కుదించిందని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి విమర్శించారు. వైఎస్ జగన్‌ను కలిసిన చిన్నారిని ట్రోల్ చేసిన అంశంపైనా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.వైఎస్ జగన్‌కు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) విఫలమవుతోంది. ఈ అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. జగన్ ప్రజల్లో తిరగకుండా చేసేందుకు భద్రత కుదించారు. ఇల్లీగల్ యాక్టివిటీస్‌కు భద్రత కల్పించలేమని చంద్రబాబు అంటున్నారు. రైతులను పరామర్శించడం చంద్రబాబు దృష్టిలో ఇల్లీగల్ యాక్టివిటీసా?. చంద్రబాబు అలా మాట్లాడడం దుర్మార్గం కాదా?.. ..కావాలనే వైఎస్ జగన్ భద్రత(YS Jagan Security)పై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. మిర్చి రైతులను జగన్ పరామర్శిస్తే తప్పేంటి?. వైఎస్ జగన్ పాలనలో 24 పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరలు కల్పించింది. కానీ, టీడీపీ కూటమి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించటంలో విఫలమైంది.రాజకీయ విలువల్లేవా?వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో ఫోటో దిగిన చిన్నారిపై సోషల్ మీడియాలో టీడీపీ సైకోలు దుష్ప్రచారం(TDP Trolling) చేస్తున్నారు. అమ్మ ఒడి వస్తోందో.. రాలేదో... నారాయణ, చైతన్య స్కూళ్ల వద్ద అడిగినా చెబుతారు. చిన్నారిపై ట్రోలింగ్ జరుగుతుంటే చంద్రబాబు, పవన్‌లు ఖండించరా?. వాళ్లకు అసలు రాజకీయ విలువలు లేవా? అని అనంత ప్రశ్నించారు. -
కేంద్రానికి వైఎస్సార్సీపీ లేఖ
-
వైఎస్ జగన్ కు ఉన్న ప్రజాదారణ చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు
-
వైఎస్ జగన్ భద్రతపై చంద్రబాబు వింత వ్యాఖ్యలు
సాక్షి,తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చియార్డులో మిర్చి రైతుల కన్నీళ్లు తుడవగానే సీఎం చంద్రబాబు,లోకేష్, ఎల్లో మీడియా కంట్లో కారం పడినట్లైంది. అందుకే వైఎస్ జగన్ రైతులను పరామర్శించడం ఇల్లీగల్ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగానే వైఎస్ జగన్ భద్రత తొలగించినట్టు అంగీకరించారు.వైఎస్ జగన్ పర్యటనలో ఏం జరిగిందంటే?అన్నదాతలను పరామర్శించి భరోసా కల్పించేందుకు గుంటూరు మిర్చి యార్డు వద్దకు వచ్చిన మాజీ సీఎం జగన్ భద్రత విషయంలో టీడీపీ కూటమి సర్కారు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆయన పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న మాజీ సీఎం పర్యటన విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు ప్రశ్నార్థకంగా మారింది.వైఎస్ జగన్ భద్రత విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ లోక్‌సభ పక్షనేత మిథున్ రెడ్డి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ కూడా రాశారు.చంద్రబాబు సన్నాయి నొక్కులుఈ క్రమంలో వైఎస్ జగన్ భద్రత విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మీడియా చంద్రబాబును ప్రశ్నించింది. వైఎస్ జగన్ భద్రతపై చంద్రబాబు వింత వ్యాఖ్యలు చేశారు. రైతులను పరామర్శించడం ఇల్లీగల్. ఎన్నికల కోడ్ అమల్లో ఉందంటూ ఉద్దేశ్యపూర్వకంగానే వైఎస్ జగన్‌కు భద్రత తొలగించినట్టు అంగీకరించారు. అది ఎన్నికల కమిషన్ నిర్ణయమంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.థమన్‌తో చంద్రబాబు కుటుంబం మ్యూజికల్ నైట్స్ఇటీవల విజయవాడలో చంద్రబాబు కుటుంబం థమన్ మ్యూజికల్ నైట్స్ నిర్వహించింది. దీన్ని ప్రస్తావిస్తూ మ్యూజికల్ నైట్స్ ఉన్న విలువ..రైతులకు లేదా..? అని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. చంద్రబాబు కుటుంబం గత, శనివారం సాయంత్రం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ‘యూఫోరియా మ్యూజికల్ నైట్’ (Euphoria Musical Night)నిర్వహించింది. ఇందులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్,హోమంత్రి అనిత, ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు ఇతర కుటమి నేతలు సైతం హాజరయ్యారు. దీని రాష్ట్ర పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మ్యూజికల్ నైట్స్ నిర్వహించేందుకు ఎన్నికల కోడ్ అడ్డంకి రాలేదా అని ప్రశ్నిస్తున్నారు.వైఎస్ జగన్‌పై కేసు నమోదు వైఎస్ జగన్ గుంటూరు పర్యటనను అడ్డుకోలేకపోయిన కూటమి ప్రభుత్వం.. మరో కుట్రకు తెరతీసింది. మిర్చి యార్డులో పర్యటించి రైతుల గోడు విన్నందుకుగానూ ఆయనపై కేసు(Case Against YS Jagan) పెట్టింది. ఎలాంటి సభ, మైక్ ప్రచారం నిర్వహించకపోయినా పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.మిర్చి రైతుల కష్టాలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బుధవారం గుంటూరుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనకుగానూ మాజీ సీఎం హోదాలో కూడా ఆయనకు ప్రభుత్వం ఎలాంటి భద్రత ఇవ్వలేదు. రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో పాటు భద్రతా వ్యవహారంపై ఆయన సీఎం చంద్రబాబును నిలదీశారు కూడా. అయితే వైఎస్ జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ టీడీపీ నేతలు కొందరు నల్లపాడు పీఎస్(Nallapadu Police Station)లో ఫిర్యాదు చేశారు. దీంతో వాళ్ల ఒత్తిడి మేరకు పోలీసులు జగన్‌పై కేసు నమోదు చేశారు. -
కూటమి ప్రభుత్వ దురుద్దేశాలు మాకు తెలుసు: బొత్స
విజయవాడ, సాక్షి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోంది. తాజాగా.. గుంటూరు పర్యటనలో ఆయనకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. ఈ వైఫల్యంపై వైఎస్సార్సీపీ నేతలు గురువారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) మీడియాతో మాట్లాడారు.‘‘మాజీ సీఎంగా వైఎస్ జగన్(YS Jagan Security) కు జెడ్ ఫస్ల్ సెక్యూరిటీ ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ భద్రత కల్పించాలి. కానీ గుంటూరు పర్యటనలో ఒక్క కానిస్టేబుల్ కూడా కనిపించలేదు. వైఎస్ జగన్ భద్రతపై మాకు ఆందోళన ఉంది. మా ఆందోళనను గవర్నర్‌కు తెలియజేశాం. ఆయనకు రక్షణ కల్పించాలని గవర్నర్‌ను కోరాం. మా ఫిర్యాదుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు. .. చట్టం తను పని తాను చేసుకునేలా చేయాలి. కానీ, కూటమి ప్రభుత్వ దురుద్దేశాలు మాకు తెలుసు. జగన్‌ను ఇబ్బందిట్టాలనే ఏకపక్షంగా భద్రత తగ్గిస్తున్నారు. మా హయాంలో ఎక్కడైనా భద్రత తగ్గించామా?’’ అని కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి బొత్స నిలదీశారు. ఎన్నికల కోడ్ల్లే భద్రతల్పించలేకపోయామన్న ప్రభుత్వ వాదనను బొత్స తప్పుబట్టారు. జెడ్ ఫ్లస్ కేటగిరీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి భద్రతకు ఎన్నికల కోడ్‌తో సంబంధం లేదని అన్నారాయన. ఒకవేళ, ఎన్నికల కోడ్ ఉంటే జడ్ ప్లస్ భద్రత కల్పించడం కుదరదు అని ముందుగా సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులకు లేదా?. ఇదే ఎన్నికల కోడ్ విజయవాడలో జరిగిన సంగీత విభావరీ సందర్బంగా ఎందుకు అమలు చేయలేదు? రైతులు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకు మిర్చియార్డ్ కు వైయస్ జగన్ వెడితే ఎన్నికల కోడ్ పేరుతో ఇబ్బందికర పరిస్థితిని కల్పించారు అని బొత్స మండిపడ్డారు. దయనీయంగా రాష్ట్ర రైతాంగంవైఎస్సార్సీపీ హయాంలో రైతులకు మేలు జరగలేదన్న కూటమి నేతల ఆరోపణలకు బొత్స కౌంటర్ ఇచ్చారు. దాదాపు రూ.20 వేలు ఉన్న క్వింటా మిర్చి నేడు రూ.10 వేల దిగువకు పడిపోయింది. రైతులకు అండగా ఉండేందుకు వెడితే దానిని రాజకీయం చేస్తారా?. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతుభరోసాను క్రమం తప్పకుండా ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అయ్యింది. రాష్ట్రం నుంచి ఇవ్వకపోగా, కేంద్రం నుంచి వచ్చింది కూడా రైతులకు ఇవ్వలేదు. ఆర్బీకేల ద్వారా మా హయంలో విత్తనం నుంచి విక్రయం దాకా అండగా ఉన్నాం. నేడు ఆ వ్యవస్థనే నిర్వీర్యం చేశారు. నేడు దళారీలు రైతులను దోచుకుంటున్నారు. ఎరువులు, విత్తనాల ధరలను ఎవరూ నియంత్రించే పరిస్థితి కనిపించడం లేదని.. వీటన్నింటి వల్ల రాష్ట్ర రైతాంగం పరిస్థితి దయనీయంగా మారిందని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.బాబు వక్రబుద్ధి బయటపడింది: మేకపాటివైఎస్ జగన్ భద్రతా వ్యవహారంపై మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పందించారు. ఈ విషయంలో చంద్రబాబు తన వక్ర బుద్దిని బయట పెడుతున్నారని మండిపడ్డారాయన. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము భద్రత ఇవ్వకపోయి ఉంటే.. అయన కనీసం బయట తిరిగే వారు కాదు. జెడ్ ఫ్లస్ కేటగిరి ఉన్న ప్రతిపక్ష నేతకి భద్రత కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలం అయ్యింది. జగన్ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా అయన క్రేజ్ తగ్గదు. దేశ రాజకీయాలను ప్రభావితం చెయ్యగల నేత జగన్. -
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం
-
Big Question: మేమే కార్య కర్తలం.. మేమే సేవకులం.. పోలీసులు లేకపోతే భయపడతారనుకున్నారు కానీ
-
అడుగడుగునా భద్రతా వైఫల్యం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: అన్నదాతలను పరామర్శించి భరోసా కల్పించేందుకు గుంటూరు మిర్చి యార్డు వద్దకు వచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రత విషయంలో టీడీపీ కూటమి సర్కారు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆయన పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న మాజీ సీఎం పర్యటన విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు ప్రశ్నార్థకంగా మారింది. బుధవారం గుంటూరు మిర్చి యార్డులో వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి ఆయన పీఏ కె.నాగేశ్వరరెడ్డి ఒక రోజు ముందుగానే గుంటూరు కలెక్టర్, డీజీపీ, విజయవాడ పోలీసు కమిషనర్, గుంటూరు ఎస్పీ, ఐజీ ఇంటెలిజెన్స్(సెక్యూరిటీ)లకు సమాచారమిచ్చారు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన మాజీ సీఎంకి అవసరమైన సెక్యూరిటీ, ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలని కోరారు. జగన్ పర్యటనను పట్టించుకోవద్దని గుంటూరు జిల్లా పోలీసులకు ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. నాయకులు, కార్యకర్తలే రోప్ పార్టీగా..గుంటూరులోకి రాగానే జగన్‌ను పలుకరించేందుకు ‘వై జంక్షన్’ నుంచి మిర్చి యార్డు వరకు మహిళలు, పార్టీ నేతలు, అభిమానులు రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున బారులు తీరారు. పలువురు నేతలు, కార్యకర్తలే రోప్ పార్టీగా మారి ముందుకు కదిలారు. జగన్ మిర్చి యార్డు వద్దకు వచ్చేదాకా ఇదే పరిస్థితి ఉంది. మాజీ సీఎం అక్కడ పర్యటిస్తున్నా ఒక్క పోలీసు కూడా పరిస్థితిని చక్కదిద్దకపోవడంతో తోపులాట జరిగింది. మరోవైపు జగన్ కార్యక్రమానికి అడ్డంకులు కల్పించేందుకు ఆయన మాట్లాడే సమయంలో పదే పదే మైక్‌లో అనౌన్స్మెంట్లు చేయించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సమావేశానికి అనుమతులు లేవంటూ ప్రకటనలు చేశారు. దీంతో మీడియాతో మాట్లాడే పరిస్థితి లేకపోవడంతో జగన్ తన వాహనంలో కొద్దిసేపు నిరీక్షించారు. అరగంట తర్వాత తన వాహనం వద్దకు చేరుకోగలిగిన కొందరు మీడియా ప్రతినిధులతో మాత్రమే మాట్లాడి వెళ్లాల్సి వచ్చింది. ప్రతిపక్ష నేతకు కనీస భద్రత లేదు: వైఎస్ జగన్ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే.. కనీస పోలీసు భద్రత కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. రేపు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత తీసేస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మీరు చేస్తున్నది సరైనదో కాదో ఆలోచన చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. -
జగన్ భద్రత గాలికి.. చంద్రబాబు కుట్ర అదేనా
-
వైఎస్ జగన్ పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గుంటూరు పర్యటనకు కూటమి ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కలిగించింది. ఈసీ అనుమతి లేదంటూ పోలీసులను ప్రయోగించడం మొదలు.. రైతులతో ఆయన్ని మాట్లాడనీయకుండా చివరిదాకా ప్రయత్నాలెన్నో చేసింది.బుధవారం వైఎస్ జగన్ గుంటూరు పర్యటన నేపథ్యంలో ఈ ఉదయం పోలీసులు చేసిన అతి అంతా ఇంతా కాదు. ఈసీ అనుమతి లేదని చెబుతూ పర్యటన అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే.. వైఎస్సార్సీపీ(YSRCP) నేతల వాదనలతో పోలీసులు దిగొచ్చారు. దీంతో జగన్ పర్యటనకు లైన్ క్లియర్ అయ్యింది. జగన్ భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తుందో ఇవాళ మరోసారి బయటపడింది. మాజీ ముఖ్యమంత్రి(Ex CM) హోదా, పైగా జెడ్‌ఫ్లస్ కేటగిరీ భద్రత ఉన్నా ఆయనకు పోలీసుల తరఫున కనీస భద్రత కూడా కల్పించలేదు. పర్యటన కొనసాగిన దారిలో ఎక్కడా పెద్దగా పోలీసులు ఎక్కడా కానరాలేదు. పైగా ఎక్కడా ట్రాఫిక్ క్లియర్ చేయలేదు. దీంతో జనసందోహం నడుమే నెమ్మదిగా ఆయన తన వాహనంలో మిర్చి యార్డు వద్దకు చేరుకున్నారు.ఇక పెద్దగా భద్రత లేకుండానే మిర్చి యార్డులో అడుగు పెట్టిన వైఎస్ జగన్(YS Jagan) .. రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ఆ టైంలోనూ లౌడ్ స్పీకర్లతో అధికారులు ప్రకటనలు చేస్తూ.. ఆయన్ని రైతులతో మాట్లాడకుండా అవాంతరాలు కలిగించబోయారు. కానీ ఆయన మాత్రం మిర్చి రైతుల గోడును ఓపికగా అడిగి తెలుసుకున్నారు. వాళ్ల నుంచి వినతి పత్రాలు సైతం స్వీకరించారు. సాధారణంగానే వైఎస్ జగన్ వస్తున్నారంటే అభిమానం ఎలా వెల్లువెత్తుతుందో తెలియంది కాదు. మిర్చి యార్డులో ఘాటును సైతం పట్టించుకోకుండా జగన్‌ను చూసేందుకు ఇవాళ ఇసుకేస్తే రాలని జనం వచ్చారు. అలాంటిది యార్డులో ఒక్క పోలీసుల కూడా ఉండకుండా చూసుకుంది కూటమి ప్రభుత్వం. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చేసినట్లు వైఎస్సార్సీపీ మండిపడుతోంది. -
నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఉద్రిక్తత..
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్‌పై కార్మికుల దాడి చేశారు. పోలీస్ వాహనాన్ని అడ్డుకుని మరి దాడికి పాల్పడ్డ కార్మికులు.. పసుపు దొంగతనం ఆరోపణలు నిరసిస్తూ పసుపు కాంటాలు నిలిపివేశారు. ఆందోళనకు దిగిన కార్మికులు.. మార్కెట్ ఛైర్మన్‌ను నిలదీశారు. పసుపు మార్కెట్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు.నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డులో కార్మికులు సమ్మెకు దిగారు. ర్యాలీగా వచ్చిన కార్మిక సంఘాలు.. చైర్మన్ కార్యాలయాన్ని ముట్టడించాయి. తమపై పసుపు దొంగతనం ఆరోపణలు చేస్తున్నారంటూ కార్మికులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కార్మికుల సమ్మెతో క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. దీంతో రైతులు ఆందోళన పడుతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి క్రయవిక్రయాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. -
రక్షణ, భద్రతలపై ఫలవంతమైన చర్చలు
వాషింగ్టన్: అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్జ్(Michael Waltz)తో ప్రధాని మోదీ(Narendra Modi) గురువారం భేటీ అయ్యారు. రక్షణ, సాంకేతికత, భద్రత వంటి అంశాలపై వారు చర్చించారు. మైఖేల్ వాల్ట్జ్తో ఫలవంతమైన చర్చ జరిగిందని ‘ఎక్స్’లో మోదీ పేర్కొన్నారు. భారత్‌కు ఆయన గొప్ప స్నేహితుడు అని కొనియాడారు. భారత్– అమెరికా సంబంధాల్లో రక్షణ, సాంకేతికత, భద్రత.. అత్యంత ముఖ్యమైన కోణాలని, వీటిపై తమ మధ్య ఫలప్రదమైన చర్చ జరిగిందని మోదీ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(Artificial Intelligence), సెమీకండక్టర్స్, అంతరిక్ష రంగంలో పరస్పర సహకారానికి ఎన్నో అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ భేటీలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సైతం పాల్గొన్నారు. ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న మోదీ స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 5.30 గంటలకు అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి.కి చేరుకున్నారు. ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం, మోదీ మోదీ అంటూ నినదించారు. చలి వణికిస్తున్నా, వర్షం పడుతున్నా లెక్కచేయకుండా మోదీకి స్వాగతం పలకడానికి తరలివచ్చారు. నగరం నడిబొడ్డున ఉన్న చరిత్రాత్మక బ్లెయిర్ హౌస్‌లో మోదీ బస చేశారు. రాజధానిలో అడుగుపెట్టిన తర్వాత మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. భారత్–అమెరికా మధ్య సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం కోసం ఆసక్తి ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. భారత్, అమెరికా ప్రయోజనాలు కాపాడడంతోపాటు మన భూగోళానికి మంచి జరిగేలా పని చేస్తామన్నారు.భారత్–అమెరికా బంధానికి మద్దతుదారు తులసి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ‘డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్’గా నియమితులైన హిందూ–అమెరికన్ తులసి గబార్డ్‌తో మోదీ సమావేశమయ్యారు. బ్లెయిర్ హౌస్‌లో ఈ భేటీ జరిగింది. భారత్–అమెరికా సంబంధాలపై వారు చర్చించారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, సైబర్ సెక్యూరిటీలో ఇంటెలిజెన్స్ సహకారం మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండు దేశాల మధ్య స్నేహం మరింత బలపడాలని తులసి గబార్డ్ కోరుకుంటున్నారని మోదీ చెప్పారు. భారత్–అమెరికా బంధానికి ఆమె గట్టి మద్దతుదారు అని పేర్కొన్నారు. ‘డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్’గా అత్యున్నత పదవి చేపట్టినందుకు తులసి గబార్డ్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ప్రధాని మోదీ రెండు రోజులపాటు అమెరికాలో పర్యటిస్తారు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆయన సమావేశమవుతారు. ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ట్రంప్ ‘అమెరికా ఫస్టు’ అనే విధానంతో ముందుకెళ్తూ అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది. ప్రధానంగా భారతీయ అక్రమ వలసదార్లపై కరుణ చూపేలా తన మిత్రుడైన ట్రంప్‌ను మోదీ ఒప్పిస్తారా? అనే చర్చ సాగుతోంది. భారత ఉత్పత్తులపై టారిఫ్‌లు పెంచక తప్పదని ట్రంప్ ఇప్పటికే సంకేతాలిచ్చారు. టారిఫ్‌ల మోత మోగించకుండా ఉపశమనం లభించేలా చూడడం ఇప్పుడు మోదీ ముందున్న కర్తవ్యం అని నిపుణులు చెబుతున్నారు.త్వరలో అమెరికా నుంచి మరో 487 మంది వలసదారులున్యూఢిల్లీ: మరో 487 మంది అక్రమ వలస దారులను అమెరికా ప్రభుత్వం వెనక్కి పంపించనుందని కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ట్రంప్ ప్రభు త్వం చేపట్టిన వలసదారుల ఏరివేతలో భాగంగా మొదటి విడతగా ఈ నెల 5న 104 మంది అక్రమ వలసదారులతో కూడిన అమెరికా వైమానిక దళ ప్రత్యేక విమానం అమృతసర్‌కు రావడం తెలిసిందే. భారతీ యులుగా భావిస్తున్న మరో 487 మందిని గుర్తించిన అమెరికా అధికారులు వెనక్కి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. మరికొంతమందికి సంబంధించిన సమాచారం అమెరికా అధికారులు వెల్లడించనందున అక్రమ వలసదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశా లున్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధికారులు పంపించిన 487 మంది వలసదారుల పేర్లు, ఇతర వివరాల జాబితాను పరిశీలిస్తున్నామని చెప్పారు. మొదటి విడతలో పంపించిన 104 మందిలో పంజాబ్, హరియాణాలకు చెందిన వారు అత్యధికులుండటం తెలిసిందే. తమను వెనక్కి పంపే సమయంలో అమె రికా అధికారులు విమానంలో సుదీర్ఘ ప్రయాణ సమయంలో నేరస్తుల మాదిరిగా చేతులు, కాళ్లకు బేడీలు వేసి ఉంచారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అమెరికా అమెరికాకు ఆందోళన తెలుపుతామన్నారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద పోలీసుల భద్రతా చర్యలు
తాడేపల్లిరూరల్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్( YS Jagan) నివాసం వద్ద కూటమి నేతలు తరచూ గొడవలు చేయడం, ఇటీవల ఆయన ఇంటిముందు పార్కుకు నిప్పుపెట్టడంతో పోలీసు ఉన్నతాధికారులు భద్రత(Police security) చర్యలు చేపట్టారు. ఆదివారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం(YSRCP central office) పరిసరాలను పరిశీలించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాసం ఉండే రోడ్డులో ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. రాకపోకలను పరిశీలించే విధంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రధాన గేటు వద్ద రెండు సీసీ కెమెరాలు, భరతమాత సెంటర్లో నాలుగు సీసీ కెమెరాలు, కుంచనపల్లి–ప్రాతూరు అండర్ పాస్ నుంచి బకింగ్‌హామ్ కెనాల్ మీదుగా వడ్డేశ్వరం వెళ్లే మార్గాల్లో రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవి నిత్యం తాడేపల్లి సీఐతోపాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. -
Delhi Assembly Election: అణువణువునా గస్తీ.. 35 వేల పోలీసులు మోహరింపు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో రేపు (ఫిబ్రవరి 5) మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. పొలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభంకానుంది. ఒక కోటీ 55 లక్షల మంది ఓటర్లు ఢిల్లీకి నూతన ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే పూర్తయ్యాయి. పోలీసులు, భద్రతా దళాలను ఢిల్లీ అంతటా మోహరించారు. ఢిల్లీ పోలీసులు ఆదివారం రాత్రంతా సున్నితమైన ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించారు. 35 వేలకు పైగా పోలీసులను ఎన్నికల విధుల్లో నియమించారు. 220 కంపెనీల కేంద్ర రిజర్వ్ దళాలను కూడా భద్రత కోసం రంగంలోకి దింపారు. 19 వేల మంది హోమ్ గార్డ్ సిబ్బంది కూడా ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. ఆదివారం సాయంత్రం ప్రచారం ముగిసిన తర్వాత బయటి వ్యక్తులు ఢిల్లీ విడిచి వెళ్లాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అక్రమంగా తిరుగుతున్న పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. 83.76 లక్షల మంది పురుషులు, 72.36 లక్షల మంది మహిళలు, 1,267 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఓటు వేయనున్నారు. దివ్యాంగ ఓటర్ల కోసం 733 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఢిల్లీలో గరిష్ట ఓటింగ్ జరిగేలా చూసేందుకు, ఎన్నికల సంఘం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ యాప్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ఓటర్లు తమ పోలింగ్ బూత్ వద్ద ఎంత జనసమూహం ఉందో సులభంగా తెలుసుకోవచ్చు.ఈసారి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. దీనికి తోడు కాంగ్రెస్‌కు ఇక్కడున్న బలమైన ఉనికి ఈ ఎన్నికలను త్రిముఖ పోరుగా మార్చింది. హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డాతో పాటు పలువురు ముఖ్యమంత్రులు బీజేపీ తరపున ప్రచారం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ సీఎం అతిషి నియోజకవర్గంలో మూడు ర్యాలీలు నిర్వహించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కల్కాజీ, కస్తూర్బా నగర్లలో రోడ్ షో చేశారు.ఇది కూడా చదవండి: 12న ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. ట్రంప్‌తో భేటీ? -
సెక్రటేరియట్లో విజిటర్లపై నిఘా..!
సాక్షి,హైదరాబాద్:తెలంగాణ సెక్రటేరియట్లో భద్రతను అధికారులు కట్టుదిటం చేశారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) ఆధ్వర్యంలో సెక్రటేరియట్ భద్రత మరింత పెంచనున్నారు. భద్రత 24 గంటల పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. 300 సీసీకెమెరాలతో సెక్రటేరియట్ బయట లోపలు నిరంతర నిఘా ఉంచనున్నారు.విజిటర్లు సెక్రటేరియట్‌లోకి ఎంట్రీ అయినప్పటి నుంచి ఎగ్జిట్ అయ్యేవరకు వారి కదలికలను పోలీసులు రికార్డు చేయనున్నారు. ఇటీవలే సెక్రటేరియట్లో నకిలీ ఐడీ కార్డుతో అధికారిగా చెలామణి అయిన ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే.దీంతో సెక్రటేరియట్లో ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించాలని ఎస్పీఎఫ్ నిర్ణయించింది. సెక్రటేరియట్లో రికార్డైన మొత్తం డేటాను 5 నెలలపాటు అందుబాటులో ఉంచేలా సర్వర్లను ఏర్పాటు చేశారు. సచివాలయంలో ప్రతిరోజు సీఎం సహా మంత్రులు ఐఏఎస్ అధికారులు విధులు నిర్వహిస్తుంటారు. వీరి భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. -
Mahakumbh-2025: తొక్కిసలాట అనంతరం భద్రత పెంపు
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళాకు భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివస్తున్నారు. మౌని అమావాస్య నాడు తొక్కిసలాట చోటుచేసుకున్న దరిమిలా యూపీ ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యింది. భక్తులకు మరింతగా భద్రత కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. తొక్కిసలాట ఘటన మహాకుంభ మేళాలో జరిగిన తొక్కిసలాటలో 30మంది వరకూ మరణించారని సమాచారం. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారు. ఈ నేపధ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం భక్తుల రద్దీని నియంత్రించేందుకు అధిక సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించడంతో పాటు భద్రతా చర్యలను మరింత కఠినతరం చేసింది.ప్రత్యేక రైళ్లు కుంభమేళాకు తరలివచ్చే భక్తుల ప్రయాణ సౌకర్యం కోసం భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇప్పుడు భక్తులకు సమర్థవంతమైన రవాణా సౌకర్యాలను అందించేందుకు తాజాగా మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.భద్రతా చర్యలు మహాకుంభ మేళాలో భక్తుల భద్రత విషయంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం, పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. సీసీటీవీ కెమెరాలు, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్స్ వంటి సహాయక వ్యవస్థలు ఏర్పాటు చేశారు.ఆరోగ్య సేవలు మహాకుంభ మేళాలో భక్తులకు అత్యవసర పరిస్థితుల్లో వైద్యసాయం అందించేందుకు పలు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వీటిలో వైద్యులు, నర్సులు, ఆంబులెన్సులు 24 గంటలూ అందుబాటులో ఉంటారు. భక్తులకు అవసరమైన అన్ని ఆరోగ్య సేవలు సమకూర్చేలా చర్యలు తీసుకుంటున్నారు.రవాణా- పార్కింగ్ ప్రయాగ్‌రాజ్‌లో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలను నియంత్రించేందుకు భక్తుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. రవాణా నియంత్రణలో భాగంగా మార్గాల సూచికల బోర్డులను ఏర్పాటు చేశారు.ఆహార సౌకర్యాలు భక్తుల ఆహార అవసరాలను తీర్చేందుకు పలు ఫుడ్ స్టాల్స్, తాగునీటి సరఫరా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రద్దీ ప్రదేశాలలో ఏర్పాటు చేసి స్టాల్స్ భక్తులకు సౌకర్యాన్ని అందించేలా రూపొందించారు.సోషల్ మీడియా ద్వారా సమాచారం భక్తులకు ఎప్పటికప్పుడు కుంభమేళాకు సంబంధించిన సమాచారం అందించేందుకు అధికారిక యంత్రాంగం సోషల్ మీడియా వేదికలను ఉపయోగించింది. ట్విట్టర్, ఫేస్బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో కుంభమేళాకు సంబంధించిన మార్గదర్శకాలు, పరిస్థితులపై అప్డేట్స్ అందిస్తున్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh 2025: ప్రభుత్వ చొరవతో తగ్గిన విమానయాన ఛార్జీలు -
Mahakumbh-2025: తొక్కిసలాట తర్వాత హెలికాప్టర్ నిఘా పెంపు
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా జరుతోంది. అయితే ఈరోజు(బుధవారం) మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట చోటుచేసుంది. ఈ నేపధ్యంలో సంగమతీరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.తొక్కిసలాట సద్దుమణిగిన దరిమిలా లక్షలాది మంది భక్తులు స్నానం చేయడానికి సంగమ తీరానికి తరలివస్తున్నారు. వీరిని పర్యవేక్షించేందుకు, మరింతగా భద్రత కల్పించేందుకు హెలికాప్టర్ నుండి నిఘా సారించారు. జనసమూహాన్ని నియంత్రించేందుకు పోలీసులు పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే జనం మరింతగా పెరిగిపోవడంతో పోలీసులు బారికేడ్లను తొలగించారు. భద్రతను మరింతగా పెంచేందుకు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని రంగంలోకి దించారు.కుంభమేళా పర్యవేక్షణ అధికారులు భద్రత విషయంలో ఇప్పుడు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం మహా కుంభలో పరిస్థితి అదుపులో ఉందని, భక్తుల పుణ్యస్నానాలు సజావుగా జరుగుతున్నయని అధికారులు తెలిపారు. తొక్కిసలాట ఘటన అనంతరం సీఎం యోగి స్పందిస్తూ వివిధ గంగా ఘాట్ల వద్ద స్నానాలు చేయాలని భక్తులకు సూచించారు. అధికారులు అందించే సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.ఇది కూడా చదవండి: అలాంటి దుస్తులతో రావొద్దు: ముంబై సిద్ధివినాయక ఆలయ ట్రస్ట్ -
ఏటా రూ.15 వేల కోట్లపైనే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా తెచ్చుకున్న అప్పుల తిరిగి చెల్లింపుపై రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) స్పష్టతనిచ్చింది. 2015 జనవరి 1వ తేదీ నుంచి 2025 జనవరి 15వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రం రూ.3,49,137 కోట్లను బాండ్ల వేలం ద్వారా తీసుకున్నట్టు వెల్లడించింది. గరిష్టంగా 45 ఏళ్ల కాలపరిమితితో ఈ నిధులు సమీకరించారని.. అంటే 2060 నాటికి ఈ అప్పులన్నింటినీ తీర్చాల్సి ఉంటుందని తాజాగా విడుదల చేసిన ‘ఔట్ స్టాండింగ్ స్టేట్ గవర్నమెంట్స్ సెక్యూరిటీస్’నివేదికలో తెలిపింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు చేసిన అప్పుల లెక్కలను అందులో వెల్లడించింది. తెలంగాణ వచ్చే నాలుగేళ్లలో రూ.60.947.18 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. ఈ ఏడాది రూ.17 వేల కోట్ల పైమాటే.. రాష్ట్రం బాండ్ల వేలం ద్వారా సేకరించిన రుణాలను ఏ సంవత్సరంలో ఎంత తీర్చాల్సి ఉంటుందో ఆర్బీఐ తాజా నివేదికలో వెల్లడించింది. దాని ప్రకారం 2025లో రూ.17,150 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంది. 2026లో రూ.20వేల కోట్లను అప్పులకు అసలు, వడ్డీ కింద చెల్లించాలి. మొత్తమ్మీద వచ్చే నాలుగేళ్లలో రూ.60 వేల కోట్లకు పైగా చెల్లించాలి. ఇవి రిజర్వు బ్యాంకు ద్వారా బహిరంగ మార్కెట్లో తీసుకున్న రుణాలకు అసలు, వడ్డీ మాత్రమేనని.. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం, ఇతర సంస్థలు, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపు అదనమని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. గడువు తీరిన నాటి నుంచి.. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక రూపాల్లో అప్పులు తీసుకుంటుంది. అందులో ప్రధానమైనవి ఆర్బీఐ ద్వారా సేకరించే రుణాలు. ఆర్థిక శాఖ వర్గాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉండే సెక్యూరిటీ బాండ్లను ఆర్బీఐ వేదికగా బహిరంగ మార్కెట్లో వేలానికి పెట్టి ఈ నిధులను సమకూర్చుకుంటుంది. ఇన్ని కోట్ల విలువైన బాండ్లను వేలం వేస్తున్నామని, ఇన్ని సంవత్సరాల కాలపరిమితిలో, ఇంత వడ్డీ చెల్లించి రుణం తీరుస్తామని ఆర్బీఐకి ఇండెంట్ పెడుతుంది. ఆర్బీఐ వేలంలో పాల్గొన్న సంస్థలు.. ఆ బాండ్లను స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు బాండ్ల కాలపరిమితి ముగిసిన కొద్దీ అసలు, వడ్డీ కలిపి చెల్లించి బాండ్లను విడిపించుకుంటాయి. మళ్లీ అవసరాన్ని బట్టి అవే బాండ్లను వేలానికి పెట్టి నిధులు తెచ్చుకుంటాయి. -
Delhi Election: 150 సరిహద్దుల మూసివేత.. పారా మిలటరీ దళాల మోహరింపు
న్యూఢిల్లీ: రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, గణతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని దేశ రాజధానిలోని 150 సరిహద్దులను మూసివేశారు. ఈ 150 సరిహద్దుల్లోని 162 ప్రదేశాలను ఢిల్లీ పోలీసులు దిగ్బంధించారు. ఈ ప్రాంతాల్లో పారామిలిటరీ దళాలతో పాటు, స్థానిక పోలీసులు 24 గంటలు పహారా కాస్తున్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాతే ఢిల్లీలోకి అనుమతిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయానికి చెందిన ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ ఢిల్లీ సరిహద్దుల్లో 162 చోట్ల దిగ్బంధనాలు ఏర్పాటు చేసి, 24 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేసిన తర్వాతే ఢిల్లీలోకి అనుమతిస్తున్నామని తెలిపారు. భద్రతా ఏర్పాట్ల కోసం పోలీసులు 175 కంపెనీల పారామిలిటరీ దళాలను మోహరించారు. హోం మంత్రిత్వ శాఖ నుండి 250 కంపెనీల పారామిలిటరీ దళాలు రంగంలోకి దిగనున్నాయి. నగదు, మద్యం అక్రమ రవాణాను నియంత్రించేందుకు ఢిల్లీలోని వివిధ ప్రదేశాలలో పికెట్లను ఏర్పాటు చేసి, తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఢిల్లీ పోలీస్ ఎలక్షన్ సెల్ తెలిపిన వివరాల ప్రకారం రాజకీయ పార్టీల ర్యాలీలు, బహిరంగ సమావేశాల విషయంలో ముందుగా వచ్చిన వారికి తొలుత అనుమతినిస్తున్నారు. ఏదైనా రాజకీయ పార్టీ అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహిస్తే వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: Delhi Elections-2025: 12 ఎస్సీ సీట్లు.. విజయానికి కీలకం -
Maha Kumbh-2025: అండర్ వాటర్ డ్రోన్లు.. ఏఐ కెమెరాలు.. ఫ్లోటింగ్ పోలీస్ పోస్టులతో నిఘా
ప్రయాగ్‌రాజ్: మహాకుంభమేళా.. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో సోమవారం ఉదయం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యింది. గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు.పటిష్టమైన భద్రతజనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరిగే ఈ మహా కుంభోత్సవం సుమారు 45 కోట్ల మందికి ఆతిథ్యం ఇస్తుందని అంచనాలున్నాయి. ఇది భారతదేశ సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలువనుంది. కుంభమేళా ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. మహా కుంభ్ సమయంలో జనానికి పటిష్టమైన భద్రతను కల్పించేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు నగరం చుట్టూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.అండర్‌వాటర్ డ్రోన్లుతొలిసారిగా త్రివేణి సంగమప్రాంతంలో 24 గంటలూ నిఘా సారించేందుకు నగరం అంతటా 100 మీటర్ల వరకు డైవ్ చేయగల నీటి అడుగున వినియోగించే డ్రోన్లను మోహరించినట్లు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదేవిధంగా 120 మీటర్ల ఎత్తు వరకూ వెళ్లగల టెథర్డ్ డ్రోన్లను కూడా మోహరించారు. ఇవి పెరుగుతున్న జనసమూహాన్ని గుర్తించేందుకు వైద్యసాయం లేదా భద్రతా సాయం అవసరమయ్యే ప్రాంతాలను గుర్తించేందుకు ఉపకరిస్తాయని భద్రతా అధికారులు తెలిపారు.2,700 ఏఐ కెమెరాలురియల్-టైమ్ పర్యవేక్షణ, ముఖ గుర్తింపు సాంకేతికతను అందించే కృత్రిమ మేధస్సు (ఏఐ) సామర్థ్యం కలిగిన 2,700 కెమెరాలను వివిధ ఎంట్రీ పాయింట్ల వద్ద ఉపయోగిస్తున్నారు. దీనితో పాటు 56 మంది సభ్యుల సైబర్ వారియర్ల బృందం ఆన్లైన్ బెదిరింపులను పర్యవేక్షిస్తుంది. దీనికితోడు నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. కాగా యాత్రికులకు వసతి కల్పించడానికి అధికారులు 1,50 వేల టెంట్లతో పాటు అదనపు టాయిలెట్లు, పారిశుద్ధ్య సౌకర్యాలను ఏర్పాటు చేశారు. 4,50 వేల నూతన విద్యుత్ కనెక్షన్లను ఏర్పాటు చేశారు. యాత్రికుల కోసం ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేశారు. భారతీయ రైల్వేలు కుంభమేళా సందర్భంగా 3,300 ట్రిప్పులు తిరిగే 98 ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టాయి. కుంభ్ సహాయాక్ చాట్‌బాట్ అనేది అత్యాధునిక ఏఐ సాధనం. ఇది మహా కుంభమేళాకు హాజరైన భక్తులకు అనేక విధాలుగా సహాయపడనుంది.ఫ్లోటింగ్ పోలీస్ పోస్టు #WATCH | Uttar Pradesh police built a special floating police chowki to help devotees as the 45-day #Mahakumbh2025 begins with the auspicious Paush Purnima, today pic.twitter.com/1JE2tzQ8mH— ANI (@ANI) January 13, 2025 కుంభమేళాలో పాల్గొనే భక్తులకు మరింతగా సహాయం అందించేందుకు ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఫ్లోటింగ్ పోలీస్ పోస్టు ఏర్పాటు చేశారు. ఇదేవిధంగా భక్తులు ప్రయాణించే వాహనాలు సజావుగా ముందుకు కదిలేందుకు ట్రాఫిక్ పోలీసు అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. త్రివేణీ సంగమానికి ప్రవేశ మార్గం జవహర్లాల్ నెహ్రూ మార్గ్ (బ్లాక్ రోడ్) ద్వారా ఉంటుంది. నిష్క్రమణ మార్గం త్రివేణి మార్గ్ గుండా ఉంటుంది. కాగా రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ మాట్లాడుతూ రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలపై ఎంతో శ్రద్ధ తీసుకున్నామని. సాధారణ రైళ్లతో సహా మొత్తం 13,000 రైళ్లను కుంభమేళా కోసం నడుపుతున్నామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాకు 45 కోట్లకు పైగా భక్తులు తరలి వస్తారనే అంచనాలున్నాయి. ఇది కూడా చదవండి: Mahakumbh 2025: ఇప్పటికే 85 లక్షలమంది పుణ్యస్నానాలు! -
గన్నవరం విమానాశ్రయానికి త్వరలో సీఐఎస్ఎఫ్ భద్రత
సాక్షి, అమరావతి: గన్నవరం విమానాశ్రయం భద్రతను త్వరలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) చేపట్టనుంది. ఈ మేరకు గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే ఆమోదించిన నిర్ణయాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తాజాగా ఖరారు చేసింది. దీనిని కేంద్ర విమానయాన శాఖ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. దాంతో గన్నవరం విమానాశ్రయం భద్రతపట్ల సందేహాలకు తెరపడనుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ చొరవ గన్నవరం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు పెరుగుతుండటంతో దేశంలోని ఇతర విమానాశ్రయాలతో సమాన స్థాయిలో సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సీఐఎస్ఎఫ్ బలగాలు నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ భద్రత విధులు నిర్వర్తిస్తాయి.బంగారం, ఇతర స్మగ్లింగ్ కార్యకలాపాలను అడ్డుకుంటాయి. అందుకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీఐఎస్ఎఫ్ భద్రత కోరింది. ఆ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో అంగీకరించింది. ఈ ఏడాది జూలై 2 నుంచి విమానాశ్రయం భద్రతను సీఐఎస్ఎఫ్కు అప్పగించనున్నట్లు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ప్రకటించింది. అడ్డుకున్న కూటమి ప్రభుత్వం కాగా, ఎన్నికల అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ విమానాశ్రయం భద్రత రాష్ట్ర పోలీసు పరిధిలోని ప్రత్యేక భద్రతా విభాగం (ఎస్పీఎఫ్) చేతుల్లోనే ఉండాలని భావించింది. దాంతో జూలై 2న గన్నవరం విమానాశ్రయం భద్రతను సీఐఎస్ఎఫ్’కు అప్పగించే కార్యక్రమాన్ని రద్దు చేశారు. సీఐఎస్ఎఫ్ భద్రత ఇలా..ప్రస్తుతం ఎస్పీఎఫ్కు చెందిన 250 మంది గన్నవరం విమానాశ్రయం భద్రత విధుల్లో ఉన్నారు. అయితే, వారిలో 70 మంది మాత్రమే ప్రధాన గేటు, పార్కింగ్, చెక్ ఇన్ పాయింట్లు, రన్‌వే భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సీఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తే ఏకంగా 350 మందిని కేటాయిస్తారు. వారిలో 150 మందిని ప్రత్యేకంగా ప్రధాన గేటు, పార్కింగ్, చెక్ ఇన్ పాయింట్లు, రన్ వే భద్రతకు నియోగిస్తారు. తద్వారా భద్రత మరింత పటిష్టమవుతుంది.బాంబు బెదిరింపులతో అప్రమత్తమైన కేంద్రం ఇటీవల విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. గన్నవరం విమానాశ్రయానికి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఏఏఐ అప్రమత్తమైంది. గతంలో ఆమోదించినట్టుగా గన్నవరం విమానాశ్రయానికి సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించాలని నిర్ణయిస్తూ కేంద్ర విమానయాన, హోం శాఖలకు ప్రతిపాదనలు పంపింది. దీంతో జూలై 2న విమానాశ్రయం భద్రతను సీఐఎస్ఎఫ్కు అప్పగించే కార్యక్రమాన్ని రద్దు చేయడానికి కారణాలను కేంద్ర హోం శాఖ వాకబు చేసింది. సీఐఎస్ఎఫ్ భద్రతను కల్పించాల్సిందేనని తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఎస్పీఎఫ్ బలగాలను వెనక్కి తీసుకోవాలని చెప్పింది. కాగా, వచ్చే జనవరిలోనే గన్నవరం విమానాశ్రయ భద్రత బాధ్యతలను సీఐఎస్ఎఫ్కు అప్పగించనున్నట్టు తెలిసింది. -
Year Ender 2024: రక్షణరంగంలో విజయాలు.. సరికొత్త రికార్డులు
మనం 2024కు వీడ్కోలు పలకబోతున్నాం. గడచిన ఈ ఏడాదిలో రక్షణ రంగంలో దేశం పలు విజయాలను సాధించింది. వీటిలో చైనాతో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ)వెంబడి దళాల ఉపసంహరణ, లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్సీఏ) తేజస్ ఎంకే 1ఏకు మొదటి టెస్ట్ ఫ్లైట్, హైపర్సోనిక్ క్షిపణి పరీక్ష మొదలైనవి ఉన్నాయి. భారతదేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసిన అంశాలను ఒకసారి గుర్తుచేసుకుందాం.1. చైనాతో సరిహద్దు వివాదం2024 అక్టోబరులో భారత్- చైనాలు దేప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాలలో పెట్రోలింగ్ ఏర్పాట్లపై దళాల తొలగింపు చివరి దశపై అంగీకారం తెలిపాయి. ఈ ఉత్తర లడఖ్ ప్రాంతంలో గతంలో పలు వివాదాలు ఉన్నాయి.2. మిషన్ దివ్యాస్త్రమార్చిలో భారత్.. అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి దివ్యస్త్రతో మల్టిపుల్ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్‌వి)ని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి ఏకకాలంలో పలు ఆయుధాలను మోసుకెళ్లగలదు.3. ప్రాజెక్ట్ జోరావర్జూలైలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ), లార్సెన్ అండ్ ట్రాబ్ (ఎల్ అండ్ టీ) లడఖ్‌లో చైనాకు చెందిన జేక్యూ-15ని ఎదుర్కొనేందుకు రూపొందించిన లైట్ ట్యాంక్‌ను అభివృద్ధి చేశాయి. ఈ ట్యాంక్ బరువు 25 టన్నులు. ఇది త్వరలోనే సైన్యంలో చేరనుంది.4. తేజస్ ఎంకే 1ఏ విమానంమార్చి 28న తేజస్ ఎంకే 1ఏకు చెందిన తొలి విమానం విజయవంతమైంది. భారత వైమానిక దళానికి చెందిన పాత విమానాల స్థానంలో దీనిని రూపొందించారు.5. ఐఎన్ఎస్ అరిఘాట్ ఆగస్టు 29న భారత్‌కు చెందిన రెండవ అరిహంత్-తరగతి అణు జలాంతర్గామి.. ఐఎన్ఎస్ అరిఘాట్‌ను ప్రారంభించింది. ఈ జలాంతర్గామి భారతదేశ భద్రతను మరింత పటిష్టం చేస్తుంది.6. అణు క్షిపణి పరీక్షఐఎన్ఎస్ అరిఘాట్‌ను ప్రారంభించిన కొన్ని నెలల తర్వాత, భారతదేశం కే-4 బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. ఇది 3,500 కి.మీ. రేంజ్ సామర్థ్యం కలిగివుంది.7. హైపర్సోనిక్ క్షిపణి పరీక్షనవంబర్లో భారత్ ఒడిశా తీరంలో సుదూర శ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.8. కొత్త నేవీ హెలికాప్టర్ల కమిషన్మార్చిలో భారత నౌకాదళం కొత్త ఎంహెచ్-60ఆర్ హెలికాప్టర్ల స్క్వాడ్రన్‌ను ప్రారంభించింది. యాంటీ సబ్‌మెరైన్ హెలికాప్టర్లలో ఇది ఒకటి.9. సీ295 ఎయిర్‌క్రాఫ్ట్ అక్టోబర్‌లో భారత్,, గుజరాత్లో సీ-295 రవాణా విమానాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇక్కడ అవ్రో-748 విమానాలను తయారు చేస్తారు.10. రుద్రం-II మేలో భారత్ ఎస్‌యూ-30ఎంకేఐ నుండి రేడియేషన్ నిరోధక క్షిపణి రుద్రమ్-IIను విజయవంతంగా పరీక్షించింది. ఇది శత్రు వాయు రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడానికి రూపొందించారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎనిమిది ఘటనలు.. రాజకీయాల్లో పెనుమార్పులు -
తిరుమల వెంకన్నస్వామికి ఘోర అపచారం
సాక్షి, తిరుపతి: కూటమి సర్కార్ పాలనలో తిరుమల వెంకన్న స్వామికి ఘోర అపచారం జరిగింది. శ్రీవారి ఆలయ నిబంధనలకు మంత్రి సవిత భద్రతా సిబ్బంది తూట్లు పొడిచారు. వెంకటేశ్వరస్వామి దర్శనానికి మంత్రి సవిత రాగా, ఆలయ ఆవరణలోకి ఆమె భద్రతా సిబ్బంది షూతో వచ్చారు. పాదరక్షలతో ఆలయం చుట్టూ చక్కర్లు కొట్టారు. మంత్రి సెక్యూరిటీపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ పర్యవేక్షణ లోపంపై కూడా భక్తులు మండిపడుతున్నారు.కాగా, అక్టోబర్ నెలలో తిరుమల అన్న ప్రసాదంలో జెర్రి రావడంతో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అన్న ప్రసాదంలో జెర్రి రావడంతో అది తింటున్న భక్తుడు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. మాధవ నిలయం-2 అన్న ప్రసాద కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై సదరు భక్తులు.. అధికారులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల అన్న ప్రసాదం విషయంలో ప్రభుత్వం, టీటీడీ నిర్లక్ష్యం బట్టబయలైంది.ఇదీ చదవండి: బీఆర్ నాయుడుపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు -
అమెరికాలో టిక్‌టాక్ భవితవ్యం ప్రశ్నార్థకం
అమెరికాలో టిక్‌టాక్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ ఆధ్వర్యంలోని టిక్‌టాక్‌ను 2025 జనవరి 19 నాటికి అమెరికాకు చెందిన ఓ కంపెనీకి విక్రయించాలనేలా గతంలో ఆంక్షలు విధించారు. లేదంటే ఈ యాప్‌పై నిషేధం విధించే అవకాశం ఉంది. ఈ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనేలా టిక్‌టాక్ అమెరికా ఉన్నత న్యాయస్థానాన్ని ఇటీవల అభ్యర్థించింది. దాంతో 2025 జనవరి 10న కంపెనీ వాదనలు వినడానికి న్యాయస్థానం అంగీకరించింది.అమెరికాలో జాతీయ భద్రతా ఆందోళనల కారణంగా ఈ యాప్‌పై చాలా విమర్శలొచ్చాయి. దాంతో అమెరికా ప్రభుత్వం ప్రాథమికంగా దర్యాప్తు జరిపింది. అమెరికా దేశ భద్రతకు భంగం వాటిల్లేలా స్థానికుల నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరించి దాన్ని చైనాలోని డేటా సెంటర్లలో స్టోర్ చేస్తున్నారని ప్రాథమికంగా నిర్ధారించింది.డేటా భద్రతలొకేషన్లు, ప్రైవేట్ సందేశాలతో సహా అమెరికన్ యూజర్ల నుంచి టిక్‌టాక్ పెద్దమొత్తంలో డేటా సేకరించి దేశ భద్రతకు భంగం కలిగించేలా డేటాను చైనా ప్రభుత్వం యాక్సెస్ చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.కంటెంట్ మానిప్యులేషన్అమెరికన్లు చూసే కంటెంట్‌ను తారుమారు చేయడానికి, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి టిక్‌టాక్‌ను వినియోగిస్తున్నారనే భయాలు ఉన్నాయి.ఇదీ చదవండి: స్వయంకృషితో ఎదిగిన తెలుగు వ్యాపారవేత్తలుఈ నేపథ్యంలో బైట్‌డ్యాన్స్ 2025 జనవరి 19 లోగా టిక్‌టాక్‌ను అమెరికా కంపెనీకి విక్రయించాలని లేదా నిషేధాన్ని ఎదుర్కోక తప్పదని 2024 ఏప్రిల్‌లో ఒక చట్టం ఆమోదించారు. ద్వైపాక్షిక మద్దతుతో ఈ చట్టాన్ని రూపొందించి జో బైడెన్ దానిపై సంతకం చేశారు. దాంతో కంపెనీ ఇటీవల దానిపై అమెరికా ఉన్నత న్యాయస్థానం ముందు తన వాదనలు వినిపించాలని నిర్ణయించుకుంది. దాంతో జనవరి 19 కంటే ముందే అంటే 10వ తేదీనే తన వాదనలు వినిపించనుంది. -
తొలి సైబర్ దాడి ఎప్పుడు జరిగింది?
జాతీయ కంప్యూటర్ భద్రతా దినోత్సవాన్ని ప్రతి ఏటా నవంబర్ 30న జరుపుకుంటారు. దీనిని ‘అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ డే’ అని కూడా అంటారు. సైబర్ బెదిరింపుల నుండి తమ కంప్యూటర్లు, వ్యక్తిగత డేటాను రక్షించుకోవడంపై అవగాహన కల్పించడమే కంప్యూటర్ భద్రతా దినోత్సవ లక్ష్యం. కంప్యూటర్ డే ఎందుకు జరుపుకుంటారు? దీని ప్రాముఖ్యత, చరిత్రకు సంబంధించిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఇంటర్నెట్, కంప్యూటర్ నెట్‌వర్క్‌లు అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన 1988లో కంప్యూటర్ సెక్యూరిటీ డే ప్రారంభమైంది. అదేసమయంలో సైబర్ దాడులు, డేటా చోరీ కేసులు వెలుగు చూశాయి. 1988, నవంబర్ 2న కార్నెల్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు కంప్యూటర్ సిస్టమ్‌లను ప్రభావితం చేసే రహస్య వైరస్‌ను గమనించారు. ఇది నాలుగు గంటల్లోనే పలు విశ్వవిద్యాలయ కంప్యూటర్ వ్యవస్థలను ప్రభావితం చేసింది. దీనికి 'మోరిస్ వార్మ్' అని పేరు పెట్టారు. అదే ఏడాది నవంబర్ 14న కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇన్స్టిట్యూట్ (ఎస్ఈఐ) కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ)ని ఏర్పాటు చేసింది. అలాగే కంప్యూటర్ భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నవంబర్ 30ని నేషనల్ కంప్యూటర్ సెక్యూరిటీ డేగా జరుపుకోవాలని నిర్ణయించారు.కంప్యూటర్ సెక్యూరిటీ డే మనకు సైబర్ భద్రతను సీరియస్‌గా పరిగణించాలని గుర్తు చేస్తుంది. ఆన్లైన్ డేటాను సురక్షితంగా ఉంచడం ప్రతి వ్యక్తి , సంస్థ బాధ్యత. కంప్యూటర్ సెక్యూరిటీ కోసం గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలుసురక్షిత పాస్వర్డ్లు: బలమైన, అసాధారణమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలివైరస్, మాల్వేర్ నుంచి రక్షణ: ఉత్తమ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలి. దానిని క్రమం తప్పకుండా నవీకరించాలి.డేటా బ్యాకప్: ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేయడం తప్పనిసరి.నెట్వర్క్ భద్రత: సురక్షిత నెట్వర్క్ కనెక్షన్, ఫైర్‌వాల్‌ని ఉపయోగించాలి.సాఫ్ట్వేర్ అప్డేట్: తాజా భద్రతా ప్యాచ్‌లతో అన్ని సాఫ్ట్వేర్లను అప్డేట్ చేస్తుండాలి. ఇది కూడా చదవండి: మహా కుంభమేళాకు ఐఆర్సీటీసీ ప్రత్యేక ఏర్పాట్లు.. టిక్కెట్ల బుకింగ్ షురూ -
పాట్నాలో పుష్ప-2 ఈవెంట్.. చరిత్రలోనే తొలిసారి అలా!
మరికొన్ని గంటల్లో పుష్ప రాజ్ సందడి చేయనున్నాడు. బిహార్‌లోని పాట్నాలో నిర్వహించే భారీ ఈవెంట్లో పుష్ప-2 ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. టాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నార్త్ స్టేట్‌లో ఇంత భారీఎత్తున ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి. నగరంలోని గాంధీ మైదానంలో ఈవెంట్ కోసం పెద్దఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు.అయితే ఈవెంట్‌ను అక్కడి ప్రభుత్వం సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ దృష్ట్యా భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. ఎప్పుడు లేని విధంగా ఏకంగా 900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీని కేటాయించింది. అయితే ఒక ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు బిహార్ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున భద్రత సిబ్బందిని కేటాయించడం ఇదే మొదటిసారి. దీన్ని బట్టి చూస్తే పాన్ ఇండియా స్టార్‌కు నార్త్‌లోనూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత క్రేజ్ ఉన్నట్లు తెలుస్తోంది. సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఇండియా ఈవెంట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. పాట్నా నగరంలో గాంధీ మైదానంలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను భారీస్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రబృంద సభ్యులు పాట్నా చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల మూడు నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల చేయనున్నారు. -
హైదరాబాద్‌లో సల్మాన్ ఖాన్.. ఆ హోటల్లో కఠిన నిబంధనలు!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికందర్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం సల్లు భాయ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. సిటీలో రాయల్ హోటల్‌గా గుర్తింపు ఉన్న ఫలక్‌నుమా ప్యాలెస్‌లోనూ షూటింగ్ నిర్వహిస్తున్నారు.అయితే సల్మాన్ ఖాన్‌కు ఇటీవల వరుసగా బెదిరింపులు వస్తోన్న సంగతి తెలిసిందే. కృష్ణజింకల కేసు నుంచి ప్రముఖ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ఆయనకు బెదిరింపులు వస్తున్నాయి. సల్మాన్‌ను చంపేస్తామంటూ కొందరి నుంచి కాల్స్ వస్తుండటంతో ఆయనకు కట్టుదిట్టమైన భద్రతను పెంచారు. అలా ఫుల్ సెక్యూరిటీ మధ్య ఆయన షూటింగ్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.నాలుగంచెల భద్రత..ఈ నేపథ్యంలో ఫలక్‌నుమా ప్యాలెస్ హోటల్లో నాలుగు అంచెల భద్రతలో సల్మాన్ ఖాన్ మూవీ షూటింగ్ నిర్వహించారు. ఆయన భద్రత విషయంలో రాజీ పడకూడకుండా నిర్మాతలు చర్యలు తీసుకున్నారు. ఎవరైనా అతిథులు షూటింగ్ జరుగుతున్న హోటల్‌ను బుక్ చేసుకుంటే రెండంచెల చెకింగ్‌ను వారు ఎదుర్కొవాల్సి ఉంటుంది. వాటిలో ఒకటి హోటల్ సెక్యూరిటీ సిబ్బంది.. మరొకటి సల్మాన్ ఖాన్ ప్రత్యేక భద్రత బృందం వారిని తనిఖీ చేయాలి. ఆ తర్వాతే వారిని హోటల్లోకి అనుమతించడం జరుగుతుంది.ఐడీ ఉంటేనే అనుమతి...మరోవైపు హోటల్ సిబ్బందికి ఐడీ కార్డులు ఉంటేనే లోపలికి ఎంట్రీ ఉంటుంది. ప్రతి రోజు సిబ్బంది ఐడీలను సైతం తనిఖీ చేస్తున్నారు. సల్మాన్ కోసం ఫలక్‌నుమా ప్యాలెస్‌ను పటిష్టమైన భద్రతా వలయంగా మార్చారు. ఆయన కోసం దాదాపు 50 నుంచి 70 వరకు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీని నియమించారు. వీరిలో మాజీ పారామిలటరీ సిబ్బంది కూడా ఉన్నారు. అయితే హైదరాబాద్‌లో షూటింగ్ షెడ్యూల్‌ను ముగించిన తర్వాత సల్మాన్ దుబాయ్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.కాగా.. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ సికందర్ను సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్ శెట్టి, కాజల్ అగర్వాల్‌లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. -
కెనడాలో కాన్సులర్ క్యాంప్‌లు రద్దు చేసిన భారత్
భారత్-కెనడా మధ్య దౌత్యపరమైన సంబంధాలు రోజురోజుకీ దెబ్బతింటున్నాయి. ఇటీవల కెనడాలో హిందూ ఆలయంపై దాడి జరగడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల రీత్యా ఆ దేశంలో కాన్సులర్ క్యాంప్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు టొరంటోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా గురువారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది.‘కెనడాలోని భారత కమ్యూనిటీ క్యాంప్ నిర్వహకులకు కనీస భద్రత కల్పించలేమని అక్కడి భద్రతా ఏజెన్సీలు తెలిపాయి. అందువల్ల ముందుజాగ్రత్త చర్యలో భాగంగా మా షెడ్యూల్ కాన్సులర్ క్యాంప్‌లను రద్దు చేయాలని నిర్ణయించాం’’ అని భారత రాయబార కార్యాలయం తెలిపింది.కాగా ఇటీవల కెనడాలో బ్రాంప్టన్‌లోని హిందూ సభ దేవాలయ ప్రాంగణంలో సిక్కు వేర్పాటువాదులు వీరంగం సృష్టించారు. భక్తులపై దాడులు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఖలిస్థానీ జెండాలు పట్టుకున్న వ్యక్తులు.. కర్రలతో హిందూ సభా మందిరం ప్రాంగణంలోని వ్యక్తులపై పిడిగుద్దులు కురిపిస్తున్న దృశ్యాలు ఈ వీడియోల్లో కనిపించాయి. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పిరికిపంద చర్యగా అభివర్ణించారు. -
సెక్రటేరియట్ సెక్యూరిటీ విధుల్లోకి టీజీఎస్పీఎఫ్ సిబ్బంది
సాక్షి, హైదరాబాద్: బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం భద్రత విధుల్లో తెలంగాణ స్పెష ల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (టీజీఎస్పీఎఫ్) శుక్రవారం చేరారు. తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో సెక్రటేరియట్ భద్రత విధుల నుంచి టీజీఎస్పీని తప్పించి టీజీఎస్పీఎఫ్‌కి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభు త్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.సచివాలయం భద్రత కోసం ప్రస్తుతం 212 మంది టీజీఎస్పీఎఫ్ సిబ్బందిని పోలీసు ఉన్నతాధి కారులు కేటాయించారు. శుక్రవారం బాధ్యతల సందర్భంగా టీజీఎస్పీఎఫ్ సిబ్బంది సచివాల యం ప్రాంగణంలోని అమ్మవారి గుడిలో పూజలు నిర్వహించి, కవాతు నిర్వహించారు. -
అస్మదీయులకు అడ్డదారిలో పోలీసు భద్రత
సాక్షి, అమరావతి: అస్మదీయులు, టీడీపీ నేతలకు అడ్డదారిలో పోలీసు భద్రత కల్పించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. ఓ వైపు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు కల్పించాల్సిన భద్రతను కుదిస్తూ... మరోవైపు తమ అనుయాయులైన ప్రైవేటు వ్యక్తులకు మాత్రం ప్రజాధనం వెచ్చించి మరీ పోలీసు భద్రత కల్పించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం కొత్త ఎత్తుగడకు తెరతీసింది. విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేసేవారికి పోలీసు భద్రత కల్పిస్తామని చెప్పుకొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి, ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్ల వ్యవహారాల్లో అవినీతిపై ఫిర్యాదు చేసేవారికి భద్రత కల్పిస్తామని ప్రకటించింది. భద్రతా అంశంపై నిర్ణయాన్ని రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌కు కట్టబెట్టింది. ఈమేరకు అదనపు డీజీ(ఇంటెలిజెన్స్) మహేశ్ చంద్ర లడ్హాను నోడల్ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే సీఎం ప్రత్యక్ష పర్యవేక్షణ పరిధిలోని వస్తారు. సీఎంకు కళ్లు, చెవులుగా వ్యవహరించడమే ఆయన బాధ్యత. అంటే సీఎం ఎవరికి చెబితే వారికి పోలీసు భద్రత కల్పిస్తారన్నది సుస్పష్టం. ఆ ముసుగులో రాష్ట్రంలోని టీడీపీ నేతలు, ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులైన ప్రైవేటు వ్యక్తులకు పోలీసు భద్రత కల్పించేందుకు ఎత్తుగడ వేశారు. ప్రజాధనం వెచ్చిస్తూ తమ అస్మదీయులకు పోలీసు భద్రత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అంతేకాదు... ఆ ముసుగులో టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించే సంఘ విద్రోహ శక్తులకు కూడా పోలీసు భద్రత కల్పించేందుకు ప్రణాళిక రచించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
TG: ఎస్పీఎఫ్ పహారాలోకి సెక్రటేరియట్
సాక్షి,హైదరాబాద్:తెలంగాణ సెక్రటేరియట్ భద్రతను శుక్రవారం(నవంబర్ 1) నుంచి ఎస్పీఎఫ్ పోలీసులు పర్యవేక్షించనున్నారు. కొత్త సెక్రటేరియట్ ప్రారంభం నుంచి విధులు నిర్వహిస్తున్న టీజీఎస్పీ బెటాలియన్ సిబ్బందిని మార్చి ఎస్పీఎఫ్కు బాధ్యతలు అప్పగించారు.ఇటీవల ఏక్ పోలీస్ నినాదంతో టీజీఎస్పీ బెటాలియన్ పోలీసులు ఆందోళనల బాట పట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.సెక్రటేరియట్ వీవీఐపీ జోన్లో ఉన్నందునే భద్రత నుంచి టీజీఎస్పీని ప్రభుత్వం తప్పించినట్లు తెలుస్తోంది. గతంలో చాలాకాలం పాటు సెక్రటేరియట్ భద్రతా వ్యవహారాలను చూసిన అనుభవం ఎస్పీఎఫ్కు ఉంది. భద్రతా విధుల్లో చేరిన తొలిరోజు శుక్రవారం సచివాలయం ప్రాంగణంలోని అమ్మవారి గుడిలో పూజలు చేసిన ఎస్పీఎఫ్ సిబ్బంది కవాతు నిర్వహించారు. ఇదీ చదవండి: రాజ్‌పాకాల విచారణలో కీలక విషయాలు వెల్లడి -
తెలంగాణ సెక్రెటరియేట్ లో సెక్యూరిటీని మార్చేసిన ప్రభుత్వం
-
మంత్రి ఆనం సంచలన వ్యాఖ్యలు
నెల్లూరు, సాక్షి: తన భద్రత విషయంలో రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పటికీ భద్రత సరిగా లేకపోవడంపై అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.‘‘సొంత సెక్యూరిటీ సిబ్బందితో నియోజకవర్గంలో తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడో ఏదో జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో లైసెన్సుడ్ వెపన్‌ను క్యారీ చెయ్యాలనుకుంటున్నా. అందరికీ సెక్యూరిటీ ఇచ్చినట్లే నాకు కూడా ఇచ్చారు. కానీ ఎక్కడో ఏదో జరుగుతుంది’ అని అనుమానం వ్యక్తం చేశారు.చదవండి: ‘చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు’ -
ఇంధన భద్రతకు సవాళ్లు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నానాటికీ పెచ్చరిల్లుతున్న ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనే గాక ఇంధన భద్రతపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వెలిబుచ్చారు. శుక్రవారం కౌటిల్య ఎకనమిక్ కాన్క్లేవ్ మూడో వార్షిక సదస్సులో ప్రధాని ప్రసంగించారు. పశ్చిమాసియా కల్లోలానికి తోడు రెండేళ్లకు పైగా సాగుతున్న ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ప్రస్తావించారు. భారత ఇంధన అవసరాలు 85 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. వీటిలో అధిక భాగం పశ్చిమాసియా నుంచే వస్తుంది.ఈ కల్లోల పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోందని మోదీ అన్నారు. అంతర్జాతీయ సమాజంలో మనకు పెరుగుతున్న ప్రతిష్టకు ఇది నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ‘‘సైన్స్, టెక్నాలజీ మొదలుకుని ఇన్నొవేషన్ల దాకా ఆకాశమే హద్దుగా భారత్ సాగుతోంది. రిఫామ్, పెర్ఫామ్, ట్రాన్స్ఫామ్ నినాదంతో దూసుకుపోతోంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఏకంగా రూ.15 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నాం. పథకాలు తీసుకొచ్చాం. ఎన్డీఏ పదేళ్ల పాలనలో భారత ఆర్థిక ముఖచిత్రాన్నే సమూలంగా మార్చేశాం. మన ఆర్థిక వృద్ధిపై ప్రపంచ నేతలంతా ఎంతగానో నమ్మకం పెట్టుకున్నారు’’ అని చెప్పుకొచ్చారు. 2047కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు అన్ని రంగాల్లోనూ సంస్కరణలను కొనసాగించేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్టు మోదీ స్పష్టం చేశారు. -
ఉగ్రదాడుల ముప్పు?.. ముంబై హైఅలర్ట్
ముంబై: మహారాష్ట్రలోని ముంబై మహానగరానికి ఉగ్రదాడుల ముప్పు పొంచివున్నదంటూ ఇంటెలిజెన్స్ విభాగానికి అందిన సమాచారం మేరకు హైఅలర్ట్ ప్రకటించారు. పండుగల సీజన్లో ముంబై ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ఉగ్రవాదులు దాడులకు తెగబడే ఛాన్స్ ఉందనే ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌తో నగరం అప్రమత్తమైంది.నగరంలోని రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసు భద్రతను పెంచారు. మతపరమైన ప్రదేశాలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. అలాగే పలుచోట్ల పోలీసులు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ముంబై నగర డీసీసీ భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. నగరంలో ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలను ఎవరైనా గుర్తిస్తే, ముందుజాగ్రత్త చర్యగా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. రద్దీగా ఉండే క్రాఫోర్డ్ మార్కెట్ ప్రాంతంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ ప్రాంతంలో రెండు ప్రసిద్ధ మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి. అయితే ఇది పండుగల సీజన్లో భద్రత కోసం చేస్తున్న కసరత్తు అని పోలీసు అధికారులు తెలిపారు.ఇటీవలే ముంబైలో 10 రోజుల గణేష్ ఉత్సవాలు జరిగాయి. ఇప్పుడు దుర్గాపూజ, దసరా, దీపావళికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పండుగల సమయంలో మార్కెట్లో రద్దీ అధికంగా ఉంటుంది. దేవాలయాలలో పూజలు చేసే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనికితోడు 288 మంది సభ్యుల మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: పాక్‌కు ఘాటుగా బదులిచ్చిన భారత్ -
ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద హైటెన్షన్
సాక్షి,హైదరాబాద్: కూకట్‌పల్లిలోని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి వద్ద ఆదివారం(సెప్టెంబర్15) పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. డీసీపీ, ఏసీపీలతో పాటు భారీగా పోలీసులు గాంధీ నివాసం వద్ద మోహరించారు. గాంధీ నివాసానికి రావాలని బీఆర్ఎస్ నాయకులు పార్టీ శ్రేణులకు ఫోన్లు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. గాంధీ ఇంటి వద్ద దాదాపు 300 మంది ఫోర్స్ ను అందుబాటులో ఉంచారు. బీఆర్ఎస్ నాయకులు ఒక్కసారిగా రావొచ్చని ఇంటెలిజెన్స్ సమాచారం మేరకే భద్రత పెంచినట్లు తెలుస్తోంది. గాంధీ నివాసం పరిసరాల్లో గత నాలుగు రోజులుగా పోలీసుల ఆంక్షలతో కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. గాంధీకి ఇంటి వెళ్లే దారిలో మొత్తం మూడు చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డితో సవాళ్లు, ప్రతిసవాళ్ల తర్వాత గాంధీ అనుచరులతో కలిసి కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడికి యత్నించిన విషయం తెలిసిందే. తర్వాత బీఆర్ఎస్ నేతలు గాంధీ ఇంట్లో భేటీ అవుతామని ప్రకటించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. దీంతో పరిస్థితి కాస్త సద్దుమణిగినట్టు అనిపించినప్పటికీ తాజాగా బీఆర్ఎస్ నాయకులు మళ్లీ గాంధీ ఇంటికి రావొచ్చనే సమాచారంతో పోలీసులు మళ్లీ అప్రమత్తమయ్యారు. ఇదీ చదవండి.. ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత -
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా పరిధిలోని ఓ మారుమూల గ్రామంలో ఎన్కౌంటర్ జరిగినట్లు సమాచారం అందుతోంది. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.ఆ తర్వాత సైనికులు ప్రతీ దాడి జరిపారు. ఇంటెలిజెన్స్ ఇన్పుట్ల మేరకు మెంధార్‌లోని పఠాన్ తీర్ ప్రాంతంలో పోలీసులు, సైన్యం సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు భద్రతా అధికారి తెలిపారు. దాక్కున్న ఉగ్రవాదులు సెర్చ్ పార్టీపై కాల్పులు జరిపారని, దీంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని ఆయన చెప్పారు.రెండు వైపుల నుంచి అడపాదడపా కాల్పులు జరుగుతున్నాయని, అదనపు బలగాలను ఆ ప్రాంతానికి పంపామని అధికారి తెలిపారు. బారాముల్లాలో 12 గంటలకు పైగా జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. దాదాపు 12 గంటలకు పైగా జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఇది కూడా చదవండి: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి -
జగన్ భద్రత విషయంలో మీ జోక్యం ఎందుకు?
సాక్షి, అమరావతి : తన భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో అవసరం లేకున్నా మూడో వ్యక్తి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయడంపై హైకోర్టు మండిపడింది. భద్రత కోసం బాధిత వ్యక్తే(జగన్మోహన్రెడ్డి) స్వయంగా పిటిషన్ దాఖలు చేసుకున్నప్పుడు, ఈ వ్యవహారంతో సంబంధం లేని వ్యక్తి ఇంప్లీడ్ పిటిషన్ ఎలా దాఖలు చేస్తారంటూ ఇంప్లీడ్ పిటిషనర్ అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ ఖాజావలిపై నిప్పులు చెరిగింది. జగన్‌కు భద్రత కల్పించాలని మీరెలా కోరుతారని నిలదీసింది. కోర్టును క్రీడా మైదానంగా, కామెడీ క్లబ్బుగా ఇంప్లీడ్ పిటిషనర్ ఖాజావలీ భావిస్తున్నారని వ్యాఖ్యానించింది. ఇంప్లీడ్ పిటిషన్లో రాసిన అంశాలపైనా కోర్టు అభ్యంతరం తెలిపింది. ఆ పిటిషన్లో ప్రతి అక్షరాన్ని చదివామన్న హైకోర్టు.. పిటిషన్లో ఉపయోగించిన పదజాలం దారుణంగా ఉందంది. ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదే లేదని.. పూర్తిస్థాయి విచారణ అనంతరం భారీ ఖర్చులు విధించి ఈ ఇంప్లీడ్ పిటిషన్‌ను కొట్టేస్తామని స్పష్టం చేసింది. జగన్ తరఫు న్యాయవాది చింతల సుమన్ సైతం ఈ ఇంప్లీడ్ పిటిషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. భద్రత విషయంలో ప్రభుత్వం దాఖలు చేసినకౌంటర్కు తిరుగు సమాధానం(రిప్లై) దాఖలు చేయాలని వైఎస్ జగన్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను 27కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. -
పూరీ జగన్నాథ ఆలయంలో కలకలం
పూరీ: ఒడిశాలోని పూరిలో గల జగన్నాథ ఆలయంలో కలకలం చెలరేగింది. ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఈ నేపధ్యంలో ఆలయంలో నిత్యం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అయితే తాజాగా జరిగిన ఒక ఉదంతం ఆలయ భద్రతపై పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆలయ భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఆలయ శిఖరంపైకి చేరుకున్నాడు. దీనిని చూసినవారంతా షాకయ్యారు. సాయంత్రం వేళ ఆలయంలోని స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేచి ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆలయ గోపురంపైకి ఎక్కిన వ్యక్తిని చూసిన ఆలయ సిబ్బందితో పాటు అక్కడున్న భక్తులంతా ఆశ్చర్యపోయారు.పూరీలోని శ్రీ మందిరం చుట్టూ గట్టి భద్రతా వలయం ఉంది. దీనిని తప్పించుకుని ఆ వ్యక్తి ఆలయంపైకి ఎలా ఎక్కగలిగాడనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది. కాగా శిఖరాన్ని అధిరోహించిన ఆ వ్యక్తి పైననే కొద్దిసేపు ఉన్నాడు. ఆలయ అధికారులు అతనిని కిందకు తీసుకువచ్చారు. తరువాత పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో ఆ వ్యక్తి తాను ఒడిశాలోని ఛత్రపూర్నకు చెందినవాడినని తెలిపాడు. 1988 నుంచి తాను ఆలయానికి వస్తున్నానని, తన కోరిక ఒకటి నెరవేరాక, ఆలయ శిఖరంపై ఉన్న నీలచక్రాన్ని తాకి, అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకున్నానని పేర్కొన్నాడు. ప్రస్తుతం పోలీసులు ఆ వ్యక్తిని విచారిస్తున్నారు.ఇది కూడా చదవండి: Karnataka: గణపతి నిమజ్జనంలో ఉద్రిక్తత -
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు సెక్యూరిటీ పెంపు
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ భద్రతను కేంద్ర ప్రభుత్వం మరింత పెంచింది. దీంతో ఆయనకు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు కల్పిస్తున్న తరహాలో భద్రత లభించనుంది.హోం మంత్రిత్వ శాఖ మోహన్ భగవత్ భద్రతను జెడ్ ప్లస్ నుంచి నుండి ఎఎస్ఎల్(అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్)స్థాయికి పెంచింది. ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు ఇంతవరకూ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉండేది. మోహన్ భగవత్‌కు క్పల్పించిన భద్రత సరిపోదని గుర్తించిన ప్రభుత్వం అతని కోసం క్తొత భద్రతా ప్రోటోకాల్ రూపొందించింది. పలు భారత వ్యతిరేక సంస్థలు ఆయనను టార్గెట్ చేస్తున్నాయనే నిఘావర్గాల సమాచారం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.నూతన భద్రతా ఏర్పాట్ల ప్రకారం మోహన్ భగవత్ సందర్శించే ప్రదేశంలో సీఐఎస్ఎఫ్ బృందాలు ఉంటాయి. ఆయనకు 2015, జూన్ లో జెడ్ ప్లస్ భద్రత కల్పించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయనకు జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని ఆదేశించింది. అయితే ఆ సమయంలో సిబ్బంది, వాహనాల కొరత కారణంగా జెడ్ ప్లస్ భద్రత కల్పించలేదు. ఈ తరహా భద్రతలో 55 మంది కమాండోలు మోహన్ భగవత్ కోసం 24 గంటలపాటు విధులు నిర్వహిస్తుంటారు.ఏఎస్ఎల్ కేటగిరీ భద్రతలో సంబంధిత జిల్లా పరిపాలన, పోలీసు, ఆరోగ్యం, ఇతర విభాగాలు వంటి స్థానిక ఏజెన్సీలు పాలుపంచుకుంటాయి. మోహన్ భగవత్ ఏదైనా కార్యక్రమానికి వెళ్లే సందర్భంలో ఆ స్థలాన్ని పరిశీలించడానికి అధికారుల బృందం వెళ్తుంది. వారు క్లాలిటీ ఇచ్చిన తరువాతనే మోహన్ భగవత్ ఆ కార్యక్రమానికి వెళతారు. -
హిందువులకు రక్షణ కల్పిస్తాం: యూనుస్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనారిటీలకు భద్రత కల్పిస్తామని, దాడుల నుంచి రక్షణ కల్పిస్తామని తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహమ్మద్ యూనుస్ భారత ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు. యూనుస్ శుక్రవారం మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాతి పరిణామాల్లో మోదీ, యూనుస్‌లు మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. ‘ప్రజాస్వామ్యయుత, సుస్థిర, శాంతికాముక, ప్రగతిశీల బంగ్లాదేశ్‌కు భారత్ మద్దతు ఎప్పుడూ ఉంటుందని పునరుద్ఘాటించాను’ అని మోదీ ఎక్స్‌లో వెల్లడించారు. ‘ప్రొఫెసర్ యూనుస్ కాల్ చేశారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మాట్లాడుకున్నాం. బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని, సురక్షితంగా చూసుకుంటామని హామీ ఇచ్చారు’ అని మోదీ తెలిపారు. వివిధ అభివృద్ధి పనుల్లో బంగ్లాదేశ్ ప్రజలకు సహాయపడటానికి కట్టుబడి ఉన్నామని యూనుస్‌కు తెలిపారు. అదే సమయంలో బంగ్లాదేశ్‌లోని హిందువులకు భద్రత కలి్పంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితి అదుపులోకి వచి్చందని, సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని మోదీకి స్పష్టంచేసినట్లు యూనుస్ ‘ఎక్స్’లో తెలిపారు. -
మాజీ సీఎం జగన్ భద్రతపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం
-
వైఎస్ జగన్ భద్రత గాలికి.. అడుగడుగునా చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం
సాక్షి, నంద్యాల జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతపై చంద్రబాబు ప్రభుత్వం అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నంద్యాల జిల్లా సీతారామపురం పర్యటనలో పోలీసుల వైఫల్యం బయటపడింది. వైఎస్ జగన్‌కి జెడ్‌ప్లస్ భద్రత ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు.చాపిరేవుల టోల్ గేట్ దగ్గర ఏకంగా వైఎస్ జగన్ కారుపైకెక్కి పడుకున్నాడు ఓ యువకుడు. మరో ఘటనలో అయిలూరు మెట్ట చందమామ ఫంక్షన్ హాలు దగ్గర వైఎస్ జగన్‌తో కరచాలనం కోసం బుల్లెట్ ప్రూఫ్ కారుపైకి ఎక్కాడు మరో యువకుడు. సీతారామపురం వద్ద వైఎస్ జగన్ కారు దిగే సమయంలో కూడా తోపులాట జరిగింది.వైఎస్ జగన్‌కు తగిన భదత్ర కల్పించాలని హైకోర్టు పేరొన్న సంగతి తెలిసిందే. కాగా, వైఎస్ జగన్‌కి భద్రతలో భాగంగా ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం లోపభూయిష్టమైనదన్న వాస్తవాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఎదుట పరోక్షంగా అంగీకరించింది. ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి మరమ్మతులు చేయించి పాడైపోయిన భాగాలను మార్చి తిరిగి వైఎస్ జగన్‌కు కేటాయిస్తామని హైకోర్టుకు నివేదించింది.ఈలోపు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఆయనకు కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలపగా.. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయినందున ఆయనకు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. -
జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి లోపాలు నిజమే
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్రెడ్డికి భద్రతలో భాగంగా ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం లోపభూయిష్టమైనదన్న వాస్తవాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఎదుట పరోక్షంగా అంగీకరించింది. ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి మరమ్మతులు చేయించి పాడైపోయిన భాగాలను మార్చి తిరిగి వైఎస్ జగన్‌కు కేటాయిస్తామని హైకోర్టుకు నివేదించింది. ఈలోపు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఆయనకు కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయినందున ఆయనకు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. తనకు గతంలో ఉన్న భద్రతను భారీగా కుదించడంపై వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై పూర్తి వివరాలతో రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని, కేంద్ర హోంశాఖను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం వారంలోపు ఆ కౌంటర్‌కు సమాధానం దాఖలు చేయాలని వైఎస్ జగన్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 28వతేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.మాజీ ప్రధానుల్లా ఎందుకు భద్రత కల్పించకూడదు...?వైఎస్ జగన్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ మాజీ సీఎంకు జెడ్ ప్లస్ కేటగిరీ అలాగే ఉన్నా భద్రతను మాత్రం భారీగా కుదించి వేశారని నివేదించారు. గతంలో 10 మంది పీఎస్ఓలు ఉంటే ఇప్పుడు ఇద్దరినే కేటాయించారన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా భద్రతను కుదించిందన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ మాజీ ముఖ్యమంత్రికి భద్రత విషయంలో ఓ నిర్దిష్ట విధానపరమైన నిర్ణయం ఎందుకు తీసుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాజీ ప్రధానులకు కల్పిస్తున్న రీతిలోనే మాజీ ముఖ్యమంత్రులకు కూడా భద్రత కల్పించడం సబబుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. గత మాజీ ముఖ్యమంత్రికి ఎలాంటి భద్రత కల్పించారని ప్రశ్నించారు. దీనికి దమ్మాలపాటి బదులిస్తూ తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో ఆయనకు ఎస్పీజీ భద్రత కల్పించారని చెప్పారు. మరి మిగిలిన మాజీ ముఖ్యమంత్రుల సంగతి ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించడంతో వారికి ‘వై’ కేటగిరీ భద్రతను ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎలాంటి భద్రత కల్పించాలన్నది వారికి ఉన్న ప్రాణహానిని బట్టి ఉంటుందని దమ్మాలపాటి చెప్పారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, ఆ తరువాత పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కోర్టును కోరారు.మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వకుంటే ఎలా..?ఈ సమయంలో శ్రీరామ్ స్పందిస్తూ అందుకు అభ్యంతరం లేదని, అప్పటి వరకు 3.6.24 నాటికి జగన్‌కున్న భద్రతను కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే దీనిని దమ్మాలపాటి వ్యతిరేకించారు. చట్ట ప్రకారం ముఖ్యమంత్రికే ఆ స్థాయి భద్రత ఉంటుందన్నారు. ఈ సమయంలో శ్రీరామ్ జోక్యం చేసుకుంటూ జగన్‌కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం పూర్తి లోపభూయిష్టంగా ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. కారు అద్దాలపై పగుళ్లు ఉన్నాయని, వెనుక డోరు తెరుచుకోవడం లేదని, అత్యవసర పరిస్థితుల్లో కారు నుంచి బయటకు వచ్చే అవకాశం ఏమాత్రం లేదని నివేదించారు. జామర్ సదుపాయం కూడా తొలగించారన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ మాజీ ముఖ్యమంత్రికి మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వకుంటే ఎలా? ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు. దీనిపై ఏం చేయబోతున్నారో తెలుసుకుని చెప్పాలని దమ్మాలపాటిని ఆదేశిస్తూ విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేశారు.ప్రాణహాని లేదనేందుకు ప్రభుత్వం వద్ద ఆధారాలు లేవు...తిరిగి మధ్యాహ్నం విచారణ మొదలు కాగానే దమ్మాలపాటి స్పందిస్తూ వైఎస్ జగన్‌కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం అద్దాలకు పగుళ్లు ఉన్నాయని అంగీకరించారు. ఆ అద్దాన్ని మారుస్తామని, ఆ వాహనం మొత్తానికి మరమ్మతులు చేయిస్తామన్నారు. అప్పటి వరకు వైఎస్ జగన్‌కు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయిస్తామని చెప్పారు. మరి జామర్ సంగతి ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించగా.. జగన్ ఏదైనా ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ రిమోట్ కంట్రోల్డ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఆర్‌సీఐఈడీ) ఉపయోగించే అవకాశాలు ఉంటే ఆ విషయాన్ని ఆయన భద్రతా సిబ్బందికి తెలియచేసి అప్పుడు మాత్రమే జామర్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. మిగిలిన అన్ని సమయాల్లో జామర్ ఇవ్వడం సాధ్యం కాదన్నారు. దీనిపై శ్రీరామ్ స్పందిస్తూ వైఎస్ జగన్‌కున్న ప్రాణహానిని ప్రభుత్వం సరిగా మదింపు చేయలేదని చెప్పారు. ప్రాణహాని లేదని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలను కోర్టు ముందుంచలేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ చెప్పిన వివరాలను న్యాయమూర్తి నమోదు చేశారు. -
జగన్ సెక్యూరిటీపై పచ్చ నేతలకు అంబటి మొట్టికాయలు..
-
లోకేష్ అసత్య ప్రచారం.. జగన్ భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసింది: అంబటి రాంబాబు
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత భద్రతపై టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, ఆయనపై చేస్తున్న ప్రచారం గర్హనీయమని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆయనకు ఏదైనా అనుకోనిది జరిగితే, అందుకు కూటమి ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని ఆయన తేల్చి చెప్పారు.కాగా, మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వ్యక్తిగత భద్రతపై టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడమే కాకుండా, మంత్రులు నారా లోకేష్, అనిత, అచ్చెన్నాయుడు చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. తాను సీఎం పదవికి రాజీనామా చేసే నాటికి ఉన్న భద్రతను కొనసాగించాలంటూ వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయిస్తే.. దానిపైనా మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ట్వీట్ చేస్తున్నారని గుర్తు చేశారు. వైఎస్ జగన్‌కు జడ్ ప్లస్ భద్రత కల్పించామని, అయితే గతంలో తనకు ఉన్న 986 మంది భద్రతా సిబ్బంది కావాలని ఆయన కోరుతున్నారని సీఎం చంద్రబాబుతో పాటు, హోం మంత్రి కూడా ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. గతంలో జగన్‌కు 986 మందితో భద్రత ఉందని, టీడీపీ కరపత్రంగా ఉన్న ఎల్లో మీడియాలో చెప్పడం.. దాన్నే చంద్రబాబు మొదలు మంత్రులంతా ప్రస్తావిస్తూ.. పచ్చి అబద్దాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. నిజానికి వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు సెక్యూరిటీగా ఉన్నది కేవలం 139 మంది మాత్రమే. అయినా అప్పుడు జగన్‌గారు మొత్తం 986 మందిని సెక్యూరిటీగా పెట్టుకున్నారని టీడీపీ కూటమి ప్రభుత్వం దారుణంగా ప్రచారం చేస్తోందని చెప్పారు. ఒక అబద్దాన్ని పదే పదే చెబితే ప్రజలు అదే నిజమని అనుకోవాలనేది వారి ఉద్దేశంగా ఉందని అన్నారు. ఇప్పుడు ఆయన సీఎం కాకపోయినా, వైఎస్ జగన్ అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడని.. తాను నెల్లూరు, పులివెందుల, వినుకొండ, విజయవాడ.. ఇలా ఎక్కడికి వెళ్ళినా ఆయన్ను చూడటానికి, కలవడానికి కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు ముందుకు తోసుకొస్తున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్ధితుల్లో వైఎస్ జగన్‌కు ఏ స్థాయిలో సెక్యూరిటీ ఉండాలనేది ఆలోచించాలని కోరారు.సీఎంగా వైఎస్ జగన్ రాజీనామా చేయగానే ఎస్ఆర్సీ రిపోర్ట్ రాకుండానే సెక్యూరిటీని విత్‌డ్రా చేశారని, ఆయన ఇంటి వద్ద సెక్యూరిటీని తీసేశారని, ఆ ఇంటికి వెళ్లే రూట్లలో ఉన్న చెక్‌పోస్టులు, పోలీస్ ఔట్‌పోస్టులను కూడా ఎత్తేశారని గుర్తు చేశారు. అంతే కాకుండా, ఇల్లు, క్యాంప్ ఆఫీస్ ఉన్న రోడ్‌ను మొత్తం ఓపెన్ చేసి, అందరినీ అనుమతించారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కూటమి పార్టీల కార్యకర్తలు కొందరిని జగన్ ఇంటి గేటు వద్దకు పంపించి, గొడవలు చేయించారని, వాటన్నింటినీ తమ అనుకూల మీడియాలో విపరీతంగా ప్రచారం చేసి, ఆయనను అప్రతిష్టపాల్జేసే ప్రయత్నం చేశారని ప్రస్తావించారు. ఇంకా ఇప్పుడు స్పీకర్‌గా ఉన్న నాయకుడు, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మాట్లాడుతూ.. ‘జగన్ చనిపోలేదు. ఓడిపోయాడు అంతే. ఆయన చనిపోతే తప్ప ఆ పార్టీ నాశనం కాదు’.. అని వ్యాఖ్యానించారని అంబటి రాంబాబు గుర్తు చేశారు. ఇవన్నీ చూసిన తర్వాతే తాము జగన్‌గారి భద్రత కోపం హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. మంత్రి నారా లోకేష్ ట్వీట్‌ను ప్రస్తావించిన అంబటి రాంబాబు.. ‘చంద్రబాబు కుమారుడివి నువ్వు. మంత్రివర్గ సభ్యుడివి. ఇంకా అబద్దాలు ఎందుకు చెబుతున్నారు?. లోకేష్ గారు మీకు బుర్ర ఇంకా వికసించలేదనిపిస్తుంది. జగన్‌గారి కాన్వాయ్‌లో ల్యాండ్ క్రూజర్లు ఉన్నాయా?. మాకు ఎక్కడా కనిపించడం లేదే!. బుల్లెట్ ప్రూఫ్ కార్లు అంటున్నావు!. కానీ ఇచ్చింది ఒకటి. అది లోపభూయిష్టమైంది. అది షెడ్లో ఉన్న కారు. నేను కూడా జగన్ తో కలిసి అందులో ప్రయాణించాను. వినుకొండ వెళ్ళేటప్పడు తాడేపల్లి దాటగానే ఏసీ పని చేయలేదు. వర్షం పడుతోంది. అద్దాలు మంచుతో ఉంటే దారి కనిపించక దిగి ప్రైవేట్ వాహనంలో వెళ్ళారు. ఈరోజు కోర్టులో మీ న్యాయవాదే ఆ కారు బాగాలేదని ఒప్పుకున్నది వాస్తవం కాదా?. అలాంటప్పుడు ఎందుకు అంత పచ్చి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు?’.‘పది మంది సాయుధ గార్డులతో భద్రత అంటున్నారు. ఆయన వెంట ఉంటున్నది ఇద్దరే. పది మంది కాదు. గార్డులు ఇంటి చుట్టూ ఉంటారు. కానీ ఆయన వెంట వెళ్ళేది ఇద్దరే గార్డులు. మీకు మాత్రం చాలా మంది కావాలి. మరి జగన్‌గారికి వద్దా?. చంద్రబాబుపై అలిపిరి వద్ద జరిగిన బ్లాస్ట్‌లో సేవ్ అయ్యారు. అప్పుడు సెక్యూరిటీ తెచ్చుకున్నారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. దానిపై ఎవరూ అభ్యంతరం చెప్పలేదే?. 2004లో చంద్రబాబు ఓటమి పాలైన తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా, రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయ్యారు. అయినా ఎవరూ చంద్రబాబు సెక్యూరిటీ తగ్గించమని కోరలేదు. అది అప్పటి నుంచి అలాగే కొనసాగుతోంది. అదే ఎన్ఎస్జీ సెక్యూరిటీని అడ్డు పెట్టుకుని, అంగళ్లలో చంద్రబాబు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఏకంగా పోలీసులపైనే దాడి చేయించారు. దాంతో ఒక కానిస్టేబుల్ కన్ను కూడా పోయింది.అసలు మీ భద్రత ఎప్పుడైనా తగ్గించారా?. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు కరకట్టపై ఎంత సెక్యురిటీ ఉంది. ఎన్ని సెక్యూరిటీ పోస్ట్‌లు ఉన్నాయి. గుర్తు చేసుకొండి. కానీ ఇప్పుడు మాత్రం జగన్ సెక్యూరిటీ తొలగించి ఏదో ఒకటి చేయాలని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇంకా ప్రజా సంకల్పయాత్ర జరుగుతున్నప్పుడు విశాఖ ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో జగన్‌పై హత్యాయత్నం జరిగితే, దాన్ని కోడి కత్తి అని వ్యంగ్యంగా మాట్లాడారని, తర్వాత సీఎంగా ఉన్నప్పుడు విజయవాడ ఎన్నికల ప్రచారంలో రాయి విసిరి దాడి చేస్తే, దాన్ని కూడా గులకరాయి అంటూ గో బెల్ ప్రచారం చేశారని గుర్తు చేశారు. వైఎస్ జగన్‌కు ఉన్న సెక్యూరిటీని ఎస్ఆర్సీ నిర్ణయం లేకుండా మార్చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆయన, నారా లోకేష్‌కు ఎంత సెక్యూరిటీ ఉందో చూడాలంటూ.. లోకేష్ మంత్రిగా, ఎమ్మెల్యేగా కాకుండా చంద్రబాబు కుమారుడిగా ఉన్న సమయంలో పెద్ద సంఖ్యతో కూడిన సెక్యూరిటీతో ఉన్న ఫోటో చూపించారు. రాజకీయాల్లో హుందాగా ప్రవర్తించాలన్న అంబటి రాంబాబు, ఎవరూ, ఎక్కడా శాశ్వతం కాదని.. ఎప్పుడు ఏదైనా జరగొచ్చని, బండ్లు ఓడలు అవుతాయని, ఓడలు బండ్లు అవుతాయని గుర్తు చేశారు. అందుకే తప్పుడు ప్రచారం చేసి జగన్‌ను పలుచన చేయాలని ప్రయత్నించవద్దని తేల్చి చెప్పారు.వైఎస్ జగన్ గురించి నేను ఈ మధ్య ఒక మాట విన్నాను. ఒక పత్రిక కోర్ కమిటీ సమావేశంలో జగన్ సెక్యూరిటీ తగ్గించాలి. ఆయన ఉంటే టీడీపీ బతకదు.. అని అన్నారని మాకు సమాచారం అందింది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. జామర్స్ విషయంలో కూడా కోర్టులో ప్రభుత్వం ఒకలా చెప్పింది. చంద్రబాబు ఇల్లు ఉన్న హైదరాబాద్‌లో ఆయన వీధిలో ఇప్పటికీ ఎవరినీ అనుమతించరు. చివరకు చంద్రబాబు మనవడు దేవాన్ష్‌కు కూడా ఆరుగురు గన్మ్యాన్లు ఉండచ్చు కానీ.. జగన్ డొక్కు బుల్లెట్‌ప్రూఫ్ కారు ఇస్తారా? అని నిలదీశారు. లోకేష్ నువ్వు ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్నావు. రెండు ల్యాండ్ క్రూజర్లు ఎక్కడున్నాయో చెప్పండి?. మీకు మాత్రం అంత మంది సెక్యూరిటీ కావాలి, మాజీ సీఎం విషయంలో మాత్రం అబద్దపు ప్రచారం చేస్తున్నారు’ అని చురకలంటించారు. -
నన్ను అంతమొందించడమే కూటమి లక్ష్యం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: గతంలో తనకున్న జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను కుదించడాన్ని సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనను అంతమొందించడమే ప్రస్తుత అధికార కూటమి ప్రధాన లక్ష్యమని, తనకున్న ప్రాణహానిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదంటూ ఆయన సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకున్న ప్రాణహానిని సరైన రీతిలో మదింపు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తన భద్రతను కుదించిందని, ఈ నేపథ్యంలో.. 3–6–2024 నాటికి తనకున్న భద్రతను పునరుద్ధరించేలా ఆదేశించాలని ఆయన తన పిటిషన్లో కోర్టును కోరారు. అంతేగాక.. పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు, కౌంటర్ అసాల్ట్ టీమ్స్, జామర్లను సైతం అందుబాటులో ఉంచేలా ఆదేశాలివ్వాలని అభ్యర్ధించారు. తన భద్రత కుదింపు విషయంలో చట్టం నిర్దేశించిన ప్రమాణాలకు, రాజ్యాంగ అధికరణలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని జగన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. వైఎస్ జగన్ తన పిటిషన్లో ఏం పేర్కొన్నారంటే.. నన్ను ప్రమాదంలోకి నెట్టేందుకే.. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకున్న జెడ్ ప్లస్ భద్రతను ఇప్పుడు కూడా కొనసాగించాలని కోరుతూ మా పార్టీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, నిర్ణయాలు అధికార కూటమి లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయి. నన్ను ప్రజల నుంచి దూరంగా ఉంచేందుకు, వ్యక్తిగతంగా నేను దాడులకు గురయ్యేలా చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. రాష్ట్రంలో గత రెండునెలలుగా యథేచ్ఛగా వ్యవస్థీకృత రాజకీయ హింస కొనసాగుతోంది. ఇంత జరుగుతున్నా పోలీసు పెద్దలు చోద్యం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. నాకున్న ప్రాణహానిని సరైన కోణంలో మదింపు చేయలేదు. ప్రజాసేవలు, రాజకీయ జీవితంలో, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి భద్రతను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని హైకోర్టు గతంలోనే స్పష్టమైన తీర్పునిచ్చింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అసాధారణ రీతిలో నా ఇంటి వద్ద, ఆఫీసు వద్ద భద్రతను ఉపసంహరించింది. నా భద్రతపై ఆందోళన వ్యక్తంచేస్తూ మా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా కూడా ఎలాంటి స్పందనలేదు. నా జీవితాన్ని, స్వేచ్ఛను ప్రమాదంలోకి నెట్టేందుకు ఈ అధికార కూటమి ప్రభుత్వం తన అధికారాన్ని వినియోగిస్తోంది. ఉన్నపళంగా, అకారణంగా, ఏకపక్షంగా నాకున్న భద్రతను కుదించింది. ఇటీవల నా భద్రతా వలయంలో ఉల్లంఘనలు జరిగినా కూడా పోలీసులు పట్టించుకోవడంలేదు. వారు కూటమి ప్రభుత్వ పెద్దల పల్లకీలు మోస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా తమ విధులను వారు విస్మరించడంవల్లే ఇటీవల కాలంలో మా పార్టీ కేడర్‌పై, ఆస్తులపై వ్యవస్థీకృత హింస పెరిగిపోయింది. దీనిపై మేం ఢిల్లీలో నిరసన కార్యక్రమం కూడా చేపట్టాం. నన్ను భౌతికంగా లేకుండా చేయడమే అధికార కూటమి లక్ష్యం. ఈ విషయంలో టీడీపీ సీనియర్ నేతల మధ్య సంభాషణ కూడా జరిగింది. ఆ సంభాషణ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చెందింది. నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న అయ్యన్నపాత్రుడు నా గురించి మాట్లాడుతూ.. ‘నేను ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయానని, ఇంకా బతికే ఉన్నానని’ ఆయన వ్యాఖ్యానించారు. అంతేగాక.. చచ్చేవరకు కొట్టాలని కూడా వారు మాట్లాడుకున్నారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా భద్రత కుదింపు.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే నాకు భద్రతను కుదించారు. అది కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా తగ్గించారు. నాకు భౌతిక హాని తలపెడతామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో పదేపదే చెప్పారు. అందులో భాగంగానే నాపై ఎన్నికల ప్రచార సమయంలో గులకరాయి దాడి జరిగింది. గతంలో నాపై కోడికత్తితో హత్యాయత్నం కూడా చేశారు. వీటన్నింటి దృష్ట్యా నాకు 3–6–2024 నాటికి ఉన్న భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీచేయండి. నాకు రక్షణగా ఇద్దరు అధికారులే ఉన్నారు..రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య వైరం ఉంది. అయితే, అధికార పార్టీ కూటమి నేతల రెచ్చగొట్టే ప్రసంగాలే మా పార్టీ కేడర్, నేతలపై దాడులు జరగడానికి పునాది. నా భద్రతను కుదించేందుకు అధికారుల వద్ద సహేతుక కారణాలుగానీ, ఆధారాలుగానీ ఏమీలేవు. అత్యున్నత భద్రత వ్యవస్థ అయిన జెడ్ ప్లస్ నుంచి నా భద్రతను కుదించారు. వాస్తవానికి జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను తొలగించనప్పటికీ, నా చుట్టూ ఉన్న భద్రత సిబ్బందిని మాత్రం బాగా కుదించారు. నాకు రక్షణగా ఇద్దరు భద్రతాధికారులు మాత్రమే ఉన్నారు. నా ఇంటి వద్ద, ఆఫీసు వద్ద భద్రతను పూర్తిగా తొలగించారు. అధికార పార్టీ నుంచి నిరంతరం నేను బహిరంగ బెదిరింపులు ఎదుర్కొంటున్నాను. అందువల్ల ప్రభుత్వం నాకు ఇంటి వద్ద, ఆఫీసు వద్ద భద్రతను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది. నాకు అత్యంత సమీపంలో ఉండే క్యాట్ ఆక్టోపస్ టీమ్స్‌ను ఈ ప్రభుత్వం ఉపసంహరించింది. దీంతో ప్రస్తుతం నా చుట్టూ ఇద్దరు భద్రతాధికారులు మాత్రమే ఉంటున్నారు. గతంలో ఇలా 10 మంది ఉండేవారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల వద్ద ఉన్న వ్యక్తిగత భద్రతాధికారుల కంటే నా వద్ద ఉన్న వ్యక్తిగత భద్రతాధికారుల సంఖ్యే తక్కువ. గతంలో ఇల్లు, ఆఫీసు వద్ద 11 మంది గార్డులు ఉండేవారు. ఇప్పుడు ఇద్దరే ఉన్నారు. ఇక నా భద్రత విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్‌గా ఉందన్న విషయం నాకు రక్షణగా ఇచ్చిన బుల్లెట్‌ప్రూఫ్ కారును చూస్తే అర్థమైపోతుంది. అద్దాలు పగుళ్లు వచ్చి ఉన్నాయి. వెనుక డోర్ తెరుచుకోవడంలేదు. అత్యవసర పరిస్థితుల్లో కారు నుంచి బయటకొచ్చే పరిస్థితిలేదు. మధ్యలో ఆగిపోతోంది. ఇటీవల ఓ పర్యటనకు వెళ్తుండగా మధ్యలో ఆగిపోవడంతో పర్యటనను అర్థాంతరంగా ముగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో.. నేను నా వ్యక్తిగత బుల్లెట్‌ప్రూఫ్ కారు వాడుకునేందుకు అనుమతి కోరగా అధికారులు అనుమతినివ్వలేదు. పైగా వాళ్లు ఇచ్చే కారునే వాడాలన్నారు. నేను ప్రజలను కలవకుండా ఇంటి వద్దనే ఉండాలన్న కారణంతోనే అలాంటి కారును ఇచ్చారు. -
సెక్యూరిటీ పిటిషన్
సాక్షి, తాడేపల్లి: వ్యక్తిగత భద్రత విషయంలో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గతంలో తనకు ఉన్న సెక్యూరిటీని కొనసాగించేలా కోర్టు ఆదేశాలు జారీ చేయాలని వైఎస్ జగన్ పిటిషన్లో కోరారు. అలాగే, కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా సెక్యూరిటీని తొలగించినట్టు ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.కాగా, తాజాగా ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో తనకు ఉన్న సెక్యూరిటీ కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో వైఎస్ జగన్ కోరారు. ఇదే సమయంలో ప్రభుత్వం ఏకపక్షంగా తనకు ఉన్న సెక్యూరిటీ తొలగించినట్టు తెలిపారు. తనను అంతమొందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, తనకు ఉన్న ప్రాణహాని ఉన్న అంశాన్ని పరిశీలించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిదని తెలిపారు. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా లేదని పిటిషన్లో పేర్కొన్నారు. -
ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు.. జమ్ముకశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం
జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దుచేసి నేటికి (ఆగస్టు 5) ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు భద్రతను మరింతగా పెంచారు. భద్రతా దళాలు అణువణువునా పహారా కాస్తున్నాయి.2019 ఆగస్టు 5న జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేసింది. దీనికితోడు జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను రద్దు చేసి, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చింది. ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు పూర్తయిన నేపధ్యంలో జమ్మూ జిల్లాలోని అఖ్నూర్లో భద్రతను మరింతగా పెంచారు. ఈ ప్రాంతంలో రాకపోకలు సాగిస్తున్న వాహనాలపై నిఘా సారిస్తున్నారు.ఈ సందర్భంగా దక్షిణ జమ్మూ ఎస్పీ అజయ్ శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాల దృష్ట్యా తాము మరింత అప్రమత్తంగా ఉన్నామన్నారు. కాగా దేశంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత జమ్ముకశ్మీర్‌లో పలు ఉగ్రదాడులు జరిగాయి. వీటిలో కథువాలో ఆర్మీ కాన్వాయ్‌పై దాడి, దోడా, ఉదంపూర్‌లలో భద్రతా బలగాలు- ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్ ప్రధానమైనవి. -
కుప్వారాలో ఎన్కౌంటర్.. ఒక జవాను వీరమరణం
జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో భారత సైన్యం, పాక్ సైన్యం మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఉత్తర కశ్మీర్‌లోని నియంత్రణ రేఖపై మచల్ (కుప్వారా) సెక్టార్లో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ (బీఏటీ) జరిపిన దాడిని భారత సైనికులు భగ్నం చేశారు. ఈ ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఐదుగురు భారత సైనికులు గాయపడ్డారు. వారిలో ఒక జవాను వీరమరణం పొందారు. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన కమాండోలతో పాటు, బాట్ టీమ్ స్క్వాడ్లలో అల్-బదర్, తెహ్రికుల్ ముజాహిదీన్, లష్కర్, జైష్ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ నేపధ్యంలోనే ఎన్కౌంటర్ జరిగింది.ప్రస్తుతం మచల్‌లో మిలటరీ ఆపరేషన్ కొనసాగుతోంది. శనివారం(నేడు) తెల్లవారుజామున మచల్ సెక్టార్‌లోని కుంకడి ఫార్వర్డ్ పోస్ట్‌లో ఉన్న సైనికులు అటుగా కొందరు(బ్యాట్ స్క్వాడ్) వెళ్లడాన్ని గమనించారు. వారిని లొంగిపోవాలని కోరారు. దీంతో బ్యాట్ స్క్వాడ్ కాల్పులు జరిపి, పరుగులు తీయడం ప్రారంభించింది. దీంతో భారత సైనికులు ఎదురుకాల్పులు జరిపారు. దాదాపు మూడు గంటల పాటు ఇరువైపులా కాల్పులు కొనసాగాయి. ఈ నేపధ్యంలో ఐదుగురు భారత జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఒక జవాను చికిత్స పొందుతూ వీరమరణం పొందారు. ఈ ఎన్కౌంటర్లో ఒక బ్యాట్ సభ్యుడు హతమయ్యాడు. అతని మృతదేహం పాక్ సైన్యానికి చెందిన డైరెక్ట్ ఫైరింగ్ రేంజ్లో పడి ఉంది. -
వైఎస్ జగన్ భద్రతపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం
-
వైఎస్ జగన్ భద్రతపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతపై చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వినుకొండ పర్యటన నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే వైఎస్ జగన్‌కు భద్రతను తగ్గించిన ప్రభుత్వం.. ఆయనకు పాత బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని కేటాయించింది.రిపేర్‌లో ఉన్న బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం ఇవ్వడంతో మార్గంలో పలుమార్లు వాహనం మొరాయించింది. దీంతో మధ్యలోనే బుల్లెట్ ఫ్రూప్ వాహనం నుంచి దిగిన వైఎస్ జగన్.. మరో వాహనంలో వినుకొండ వెళ్తున్నారు.మరోవైపు, వినుకొండ వెళుతున్న వైఎస్ జగన్ కాన్వాయ్‌పై పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్ వెంట పార్టీ నేతలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. వైఎస్ జగన్‌తో పాటు నేతలు వినుకొండ బయలుదేరారు. ఎక్కడికక్కడ నేతల కార్లను వైఎస్ జగన్ వెంట వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. వైఎస్ జగన్ పర్యటనను కవర్‌చేస్తున్న జర్నలిస్టులకు కూడా పోలీసులు తీవ్ర అడ్డంకులు సృష్టిస్తున్నారు. కాన్వాయ్‌లో జర్నలిస్టుల వాహనాలను నిలిపేశారు. పోలీసులు తీరుపై వైఎస్సార్సీపీ నేతలు పడుతున్నారు. -
పెద్దిరెడ్డికి భద్రత కల్పించండి
సాక్షి, అమరావతి: ప్రాణహాని నేపథ్యంలో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 2+2 భద్రత కలి్పంచాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి ఉత్తర్వులు జారీచేశారు. మంత్రిగా ఉన్నప్పుడు తనకు 5+5 భద్రత ఉండేదని, ఇప్పుడు 2+2 భద్రత సిబ్బందిని కూడా పంపడం లేదని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ పెద్దిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఈ వ్యాజ్యంపై జస్టిస్ చక్రవర్తి సోమవారం మరోసారి విచారించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి న్యాయవాది గుడిసేవ నరసింహారావు వాదనలు వినిపిస్తూ.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా గతంలో ఉన్న భద్రతను 1+1కు కుదిరించారని తెలిపారు. పిటిషనర్‌కు ఉన్న ప్రాణహానిని పరిగణనలోకి తీసుకోలేదన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు ఉన్న 5+5 భద్రతను కొనసాగించేలా ఆదేశాలివ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. పెద్దిరెడ్డికి ఎలాంటి ప్రాణహాని లేదని చెప్పారు.ఎస్పీ నివేదికలో సైతం ఇదే విషయాన్ని చెప్పారని తెలిపారు. ఎమ్మెల్యేగా ఆయన 1+1 భద్రతకు మాత్రమే అర్హుడని, అందువల్ల అదే భద్రతను ఇస్తున్నామని చెప్పారు. భద్రత కోసం పెద్దిరెడ్డి పెట్టుకున్న దరఖాస్తు భద్రత రివ్యూ కమిటీ (ఎస్ఆర్సీ) ముందు పెండింగ్‌లో ఉందన్నారు. ఎస్ఆర్సీ నిర్ణయం లేకుండా అదనపు భద్రతకు ఆదేశాలు ఇవ్వరాదని చెప్పారు. అలా చేస్తే మరింతమంది ఇదేరీతిలో అదనపు భద్రత కోసం పిటిషన్లు దాఖలు చేస్తారని తెలిపారు.ప్రాణహాని నేపథ్యంలో ప్రత్యేక కేసుగా పరిగణిస్తున్నాంఈ సమయంలో జస్టిస్ చక్రవర్తి స్పందిస్తూ.. ప్రాణహాని నేపథ్యంలో దీన్ని ప్రత్యేక కేసుగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా రాజ్యాంగబద్ధమైన పోస్టులో పెద్దిరెడ్డి కొనసాగుతున్నారని గుర్తుచేశారు. అందువల్ల మూడువారాల పాటు ఆయనకు 2+2 భద్రత కలి్పంచాలని ఆదేశించారు. ఈ సమయంలో దమ్మాలపాటి స్పందిస్తూ.. ఎస్ఆర్సీ నివేదిక వచ్చేవరకు ఈ భద్రతను కలి్పస్తామని చెప్పారు. అలా అయితే మూడువారాలు లేదా ఎస్ఆర్సీ నివేదిక వచ్చే వరకు 2+2 భద్రత కల్పించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. రెండువారాలకు వాయిదా వేశారు. అనంతరం 4+4 భద్రతను కొనసాగించాలంటూ ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యం కూడా విచారణకు వచ్చింది. ఏజీ దమ్మాలపాటి స్పందిస్తూ.. ఎంపీగా ఆయన 2+2కి అర్హుడని, ఆయనకు ఆదే కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈ వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి విచారణను రెండువారాలకు వాయిదా వేశారు. -
నాకు భద్రతను పునరుద్ధరించండి
సాక్షి, అమరావతి: తనకు ప్రాణహాని ఉందని.. కాబట్టి తనకు భద్రతను పునరుద్ధరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఇప్పటివరకు తనకున్న 4+4 గన్మెన్ల భద్రతను ఉపసంహరించడాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకున్న ప్రాణహాని దృష్ట్యా ఈ వ్యాజ్యం తేలేంతవరకు తనకు 4+4 భద్రతను కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి విచారణ జరిపారు. అంబటి తరఫున న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. భద్రతను కొనసాగించాలని పల్నాడు ఎస్పీ, డీజీపీకి వినతిపత్రాలు సమర్పించామని, అయినా ప్రయోజనం లేదన్నారు. పిటిషనర్‌కు ప్రాణహాని ఉందని, అందువల్ల భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ అంబటి రాంబాబు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారని ప్రశ్నించారు. గుంటూరులో ఉంటున్నారని సుమన్ సమాధానం ఇవ్వగా, మరి పల్నాడు ఎస్పీకి వినతి పత్రం ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏముంటుందన్నారు. పిటిషనర్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం పల్నాడు జిల్లా పరిధిలో ఉందని, అందువల్ల ఆ జిల్లా ఎస్పీకి వినతి పత్రం ఇచ్చామని సుమన్ తెలిపారు. ఇది పూర్తిగా సాంకేతికపరమైన అంశమని సుమన్ తెలిపారు.ప్రభుత్వ న్యాయవాది (జీపీ) కె.మురళీకృష్ణారెడ్డి జోక్యం చేసుకుంటూ.. ఇది తాజా వ్యాజ్యమని, గడువునిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. ప్రాణహాని దృష్ట్యా ఈలోపు భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని సుమన్ కోరారు. ఈ వ్యాజ్యానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు. -
రాజగురువు లేడు.. అయినను విషపు రాతలు రాయించవలె!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్నినాని తెలుగుదేశం మీడియాగా గుర్తింపు పొందిన ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర సంస్థలపై తీవ్రమైన విమర్శలు చేశారు. అవి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలుగా మారాయని అన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు తప్పుడు ,అబద్దపు వార్తలు ప్రచారం చేసిన ఈ మీడియా సంస్థలు తమ పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా అదే రీతిలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన చెప్పిన విషయాలన్నీ వాస్తవమే అని బోధ పడుతుంది. కారణం ఏమైనా ఈనాడు తదితర ఎల్లో మీడియా వైఎస్సార్సీపీపైన, మాజీ ముఖ్యమంత్రి జగన్ పైన ఆ స్థాయిలో కక్ష బూనాయి. ఆయనను ఇప్పుడు సైతం అడుగడుగునా అవమానించాలని, వేధించాలని ఆ మీడియా సంస్థలు కృతనిశ్చయంతో ఉన్నట్లు అర్థం అవుతుంది. లేకుంటే ఎన్నికల ఫలితాల తర్వాత కూడా తప్పుడు సమాచారంతో కధనాలు ఎందుకు వండి వార్చుతారు! దానికి పెద్ద ఉదాహరణ జగన్ భద్రతకు సంబంధించి వచ్చిన వార్త అని చెప్పవచ్చు. ఏకంగా 986 మందిని జగన్ రక్షణకు వినియోగించారని, ఇందువల్ల ప్రభుత్వానికి 286 కోట్ల వ్యయం అయిందంటూ ఒక వార్తను జనం మీదకు వదిలారు. ఎవరైనా చదివినవారికి ఇది డబ్బు దుర్వినియోగమే అన్న అభిప్రాయం కలిగేలా వారు తమ టీవీలలో,పత్రికలలో ప్రచారం చేశారు.తీరా చూస్తే అదంతా అబద్దపు వార్తగా తేలింది.ఆ వివరాలను పేర్నినాని మీడియాకుతెలియచేశారు.అయినా దానిని టీడీపీ మీడియా సక్రమంగా ఇవ్వదనుకోండి. అది వేరే విషయం కాని, కచ్చితంగా ఈ సంస్థలు ఎన్నికల తర్వాత కూడా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీని కొనసాగిస్తున్నాయన్న భావన కలుగుతుంది. అదే సంగతిని పేర్ని నాని ఆధారసహితంగా వివరించారు. జగన్‌కు భద్రత కల్పించింది మొత్తం 196 మందితోనే అని ఆయన తేల్చి చెప్పారు. అదే చంద్రబాబు విషయంలో అందుకు దాదాపు పదిరెట్ల భద్రత కల్పించారన్న అంశాన్ని కూడా బయటపెట్టారు. చంద్రబాబు మనుమడు దేవాంశ్ ఏడాది వయసులో ఉన్నప్పుడే ఫోర్ ఫ్లస్ పోర్ సెక్యూరిటీని పెట్టారని ఆయన వెల్లడించారు. చంద్రబాబుకు జడ్ ప్లస్ కాటగిరి,ఆయన సతీమణి, కుమారుడు ,కోడలికి కల్పించిన సెక్యూరిటీ వివరాలను తెలిపారు. చంద్రబాబుకు ,ఆయన కుటుంబానికి భద్రత కల్పించడాన్ని ఎక్కడా నాని తప్పు పట్టలేదు. జగన్ పై ఇలా దుర్మార్గపు రాతలురాయడాన్నే ఆక్షేపించారు. ఈనాడు,తదితర టీడీపీ మీడియా కేవలం జగన్‌కు కల్పించిన భద్రత గురించి కాకుండా చంద్రబాబుకు,అలాగే ఆయా రాష్ట్రాలలో సీఎం పదవిలో ఉన్నవారికి ఎలాంటి భద్రత ఇస్తున్నది విశ్లేషణాత్మక కధనాలను ఇస్తే తప్పు కాదు. అలాకాకుండా కేవలం జగన్ పై ద్వేషభావంతో తప్పుడు కధనాలు రాయడమే దురదృష్టకరం. విచిత్రమేమిటంటే జడ్ ప్లస్ కాటగిరితో సహా ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సైతం వందలమందితో భద్రత పొందిన,ఇప్పటికీ పొందుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా టీడీపీ మీడియాలో జగన్ పై వచ్చిన వార్తకు వంత పాడడం. ఎన్నికల తర్వాత కూడా జగన్ పై కసి,కక్ష తగ్గలేదన్నమాట. వచ్చే ఐదేళ్లు కూడా జగన్ వీటిని ఎదుర్కోక తప్పదు. ఎన్నికలకు ముందు లాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతోను, అనేక ఇతర అంశాలలో ఎన్ని పచ్చి అబద్దాలను ఈనాడు మీడియా ప్రచారం చేసింది అంతా చూశాం. అప్పట్లో ఈనాడు అధినేత రామోజీరావు జీవించే ఉన్నారు.దాంతో ఆయన ఆధ్వర్యంలోనే అబద్దపు ప్రచారం చేస్తున్నారని భావించారు. ఆయన మరణం తర్వాత కూడా అదే పంధాను ఈనాడు కొనసాగిస్తుండడం విచారకరం. రామోజీరావు ఒకప్పుడు మాబోటి వాళ్లతో అబద్దాలు రాయవద్దని చెబుతుండేవారు. అలాంటి వ్యక్తి ఇలా ఇంత దారుణమైన అబద్దాలు రాయిస్తున్నారేమిటా అని గత ఐదేళ్లు బాదపడ్డాం. ఆయన కాలం చేసిన తర్వాత కూడా అదే పద్దతి కొనసాగిస్తుండడంతో ఇక ఆ పత్రిక తీరు మారదు అనుకునే పరిస్థితి ఏర్పడింది.రామోజీ కుమారుడు కిరణ్ కూడా కేవలం రాజకీయ ట్రాప్ లో చిక్కుకుని ఈనాడు మీడియాను ప్రమాణరహితంగా చేయబోతున్నారా? అన్న సందేహం ఏర్పడుతోంది. అందరితో శభాష్ అనిపించుకోవలసిన రామోజీ ఒక రాజకీయ పార్టీ కొమ్ముకాసి అప్రతిష్టపాలయ్యారు. అందువల్లే ఏపీ ప్రభుత్వం రామోజీ సంతాప సభ ఏర్పాటు చేయడంపై కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నారు. రామోజీకి ఏపీ ఉపయోగపడింది కాని, ఆయన వల్ల ఏపీకి ఏమి మేలు జరిగిందని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. ఆయన కంపెనీలన్ని హైదరాబాద్ హెడ్ ఆఫీస్ గా ఉంచడం వల్ల ఏపీకి వచ్చే ఆదాయం ఏమీ లేదని, కాని ఏపీ ప్రజల వల్ల ఆయన సంస్థల ఉత్పత్తులకు గిరాకి దొరుకుతోందని సోషల్ మీడియాలో కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన అబద్దాలు రాయడం తెలుగుదేశంకు ఉపయోగపడింది కనుక ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది కనుక, ప్రజాధనం ఖర్చు చేసి సంస్మరణ సభ పెట్టారని కొందరు విమర్శిస్తున్నారు. కోట్ల రూపాయలు వ్యయం చేసి ప్రచార ప్రకటనలు కూడా ప్రభుత్వం ఇచ్చింది. చంద్రబాబు నాయుడు తన రాజగురువుకు ఈ రకంగా రుణం తీర్చుకంటున్నారని కామెంట్లు వస్తున్నాయి. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు కూడా ఇలా ప్రత్యేకంగా ప్రభుత్వపరంగా సంతాప సభ జరిపారో, లేదో అని వారు గుర్తు చేస్తున్నారు. భారత రాష్ట్రపతి అయిన నీలం సంజీవరెడ్డికి గాని, మాజీప్రధాని పీవీ నరసింహారావుకు కాని, ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారెవ్వరికి ప్రభుత్వపరంగా ఇంత భారీ వ్యయంతో సంస్మరణ సభలు నిర్వహించలేదు. భవిష్యత్తులో ఎవరైనా ప్రైవేటు ప్రముఖుడు పరమపదిస్తే,ఇలాగే ప్రభుత్వం సంతాప సభలనుఅధికారికంగా నిర్వహిస్తుంందా అన్న ప్రశ్నను వేస్తున్నారు. అవసరం లేని వివాదం అయినప్పటికీ ,ఈనాడు మీడియా దుర్మార్గపు వైఖరి వల్ల ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయి. పేర్ని నాని వేసిన ప్రశ్నలకు ఈనాడు ఎందుకు సమాధానం ఇవ్వలేకపోతోంది? ఒకప్పుడు అసత్యాలు అచ్చయినా, తప్పులు దొర్లినా వెంటనే క్షమాపణ కోరుతూ సవరణలు వేసేవారం.ఇప్పుడు ఈనాడు వంటి మీడియా అడ్డగోలు కధనాలు రాస్తూ జర్నలిజం ప్రమాణాలను అధమస్తాయికి తీసుకు వెళ్లడం దురదృష్టకరం. జగన్ బెంగుళూరు వెళితే కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేయడానికే అని ఎల్లో మీడియా దుష్ట ప్రచారం చేసింది. స్పీకర్ ఎన్నికలో ఎన్డీయేకి మద్దతు ఇస్తే బీజేపీ తో జత కలవడానికి తంటాలు పడుతోందని ఆరోపిస్తున్నారు.విచిత్రం ఏమిటంటే బీజేపీతో జట్టు కట్టడానికి చంద్రబాబు ఢిల్లీలో పడిగాపులు పడి టీడీపీ ఆత్మగౌరవాన్ని మంట కలిపినా ఈ మీడియాకి అది గొప్పగా కనిపించింది. టీడీపీ, బీజేపీతో కలపడానికి తాను చాలా చివాట్లు తిన్నానని పవన్ కల్యాణ్ చెప్పిన సంగతి మర్చిపోయినట్లు వీరు నటిస్తూ జగన్ పై ఉన్నవి,లేనివి కలిపి కల్పిత గాధలు రాస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్లి చేసిన ప్రసంగాలు భవిష్యత్తులో ప్రభుత్వం ఎలా ఉండబోతోందో తెలియచేసినట్లనిపిస్తుంది. 2014-19 మద్యలో ఏపీ పేద రాష్ట్రమని, ఎన్నో కష్టాలు,బాధలు పడుతున్నామని అంటుండేవారు. తాను ఎంతగా శ్రమపడుతున్నది నిత్యం చెబుతుండేవారు.జనం వాటిని వినలేక బోర్ ఫీల్ అవుతుండేవారు. మళ్లీ అదే ప్రకారం కుప్పంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర పరిస్థితులు ఆశాజనకంగా లేవని, ఖజానా ఖాళీగాఉందని, మోయలేనంత భారం ఉందని ఆయన చెబుతున్నారు. తనకు మనోధైర్యం ఉందని, కష్టాలు చూసి పారిపోయేవాడిని కానని సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారు. తాను ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాలను ఎగవేయడానికే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారన్న అనుమానం ప్రజలకు వస్తోంది.రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిపై ఎన్నికల ముందు ఇంతకన్నా ఎక్కువే విమర్శలు చేస్తూనే, సూపర్ సిక్స్ అంటూ అలవికాని హామీలను ఎందుకు ఇచ్చారో మాత్రం చంద్రబాబు చెప్పరు.అధికారం కోసం ఏమైనా చేయవచ్చని ఆయన శైలి పదే,పదే రుజువు చేస్తోంది. జగన్ ఐదేళ్ల పాలనలో అనేక స్కీములను అమలు చేసినా, ఎన్నడూ ఇలా తాను డబ్బుల కోసం శ్రమపడుతున్నానని, ఇరవైనాలుగు గంటలూ పాటు పడుతున్నానని కధలు చెప్పలేదు. ఆయన ఎన్నికల మానిఫెస్టోలో చెప్పింది చేయడానికి యత్నించారు. పేర్నినాని ఒక మాట అడిగారు. టీడీపీ కాని, చంద్రబాబు కుమారుడు లోకేష్ కాని మాట్లాడితే జగన్ వి పాలస్ లని అంటారే!అందువల్ల జగన్ ఇంటిని, చంద్రబాబు జూబ్లిహిల్స్ లో నిర్మించుకున్న రాజమహల్ ను మీడియాను పిలిచి చూపించి ఎవరివి పాలెస్ లో తేల్చడానికి సిద్దమా అని సవాల్ చేశారు. మరి దీనికి చంద్రబాబు లేదా లోకేష్ స్పందిస్తారా?. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
హైకోర్టులో పెద్దిరెడ్డి పిటిషన్..
-
బాబు భద్రత కోసం 1800 మంది సిబ్బందా..!
-
ఈ నెల 29 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో కలిగిన హిందువుల పుణ్యక్షేత్రం అమర్నాథ్ యాత్ర ఈ నెల 29 నుంచి మొదలు కానుంది.. యాత్రకు ముందురోజు అంటే శుక్రవారం మొదటి బ్యాచ్ బేస్ క్యాంప్ భగవతినగర్ జమ్మూ నుంచి బల్తాల్, పహల్గామ్ బయలుదేరి వెళ్లనున్నాయి. ఈ క్రమంలో బుధవారం జమ్మూలోని సరస్వతి ధామ్‌లో ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్ కోసం టోకెన్ల జారీ ప్రారంభమైంది.తొలిరోజు బల్తాల్, పహల్గాం నుంచి వెళ్లేందుకు సుమారు 1000 టోకెన్లు జారీ చేశారు. యాత్రికులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు భారీగా తరలివచారు. సరస్వతి ధామ్‌కు తెల్లవారుజామున 4 గంటల నుంచి యాత్రికులు చేరుకొని.. క్యూలైన్లలో బారులు తీరారు. భద్రతలో ఎలాంటి లోపం లేకుండా చూసేందుకు భద్రతా బలగాలు మార్క్ డ్రిల్ నిర్వహించి, ఏర్పాట్లను పరిశీలించాయి.అమర్నాథ్ యాత్రకు వెళ్లే వారంతా సాయంత్రం 7గంటల్లోగా భగవతినగర్‌లోని బేస్ క్యాంప్‌లోకి ప్రవేశించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారంతా ఇప్పటికే జమ్మూకు తరలివస్తున్నారు. యాత్రికుల కోసం తక్షణ రిజిస్ట్రేషన్ గురువారం ఉదయం వైష్ణవి ధామ్, పంచాయతీ భవన్, రైల్వే స్టేషన్ సమీపంలోని మహాజన్ హాల్.. అలాగే, పురాణి మండిలోని శ్రీరామ దేవాలయం, గీతా భవన్ (సాధుల కోసం) వద్ద మొదలు కానుంది.కాగా జమ్మూకశ్మీర్ ఉగ్రదాడులు పెరిగిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రయాణికుల వాహనంపై ఉగ్రదాడి జరిగింది. ఈ క్రమంలో భద్రతా బలగాలను భారీగా మోమరించారు. డ్రోన్లు, 365 డిగ్రీస్ యాంగిల్ సీసీ కెమెరాల సాయంతో వాహనాల రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు. జమ్మూ-శ్రీనగర్ హైవేపై ప్రతి 500 మీటర్లు, కిలోమీటరుకు సెక్యూరిటీ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ 24 గంటలూ సాయుధ సైనికులను మోహరించి తనిఖీలు చేయనున్నారు. -
Fact Check: భద్రతపైనా తప్పుడు రాతలా?
సాక్షి, అమరావతి: అవాస్తవాలు, అభూత కల్పనలే ఆసరాగా బతికేస్తున్న పచ్చ మీడియా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి బురద జల్లే ప్రయత్నం చేసింది. ఆయనకు కల్పిస్తున్న భద్రతపై ఈనాడు పత్రిక అభూత కల్పనలతో అసత్య కథనాన్ని అచ్చేసింది. ఆయనకు 983 మందితో భారీ భద్రత కల్పించినట్లు అబద్ధాలతో కథనాన్ని వండింది. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల భద్రత ఏర్పాట్లకు ఉన్నత స్థాయి సెక్యూరిటీ రివిజన్ కమిటీ అనే ప్రత్యేక వ్యవస్థ ఉంటుందని, ఆ కమిటీ నిర్ణయం మేరకే ఏర్పాట్లు జరుగుతాయన్న కనీస జ్ఞానం ఆ పత్రికకు లేకపోయింది. వాస్తవంగా వైఎస్ జగన్‌కు ఉన్న భద్రతా సిబ్బంది ఎందరు అన్న విషయాన్ని పరిశీలించాలన్న నైతిక విలువలకూ తిలోదకాలిచ్చి నోటికొచ్చిన సంఖ్యలతో ఉద్దేశపూర్వకంగా దు్రష్పచారం చేస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం వద్ద ఈనాడు చెప్పినట్లుగా 983 మంది భద్రతా సిబ్బంది లేరు. కాన్వాయ్ కాంపొనెంట్‌తో కలిపి కేవలం 196 మందే విధుల్లో ఉన్నారు. అదీ షిఫ్ట్లులవారీగా భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. సెక్యూరిటీ రివిజన్ కమిటీ సమావేశం కాకుండానే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల భద్రత ఏర్పాట్లను ఉన్నత స్థాయిలోని సెక్యూరిటీ రివిజన్ కమిటీ నిర్ణయిస్తుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఆ కమిటీ సూచనల మేరకే భద్రతా ఏర్పాట్లు కల్పించాల్సి ఉంటుంది. ఏ ముఖ్యమంత్రీ తనకు ఇంత భద్రత కావాలని అడగరు. సెక్యూరిటీ రివిజన్ కమిటీయే అన్ని అంశాలను విశ్లేíÙంచి ఎంత మేర భద్రత కల్పించాలన్నది ఖరారు చేస్తుంది. ముఖ్యమంత్రి నివాసం, పరిసర ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లు, మార్పులు, చేర్పులు తదితర అంశాలను కూడా ఈ కమిటీ ఆదేశాల మేరకే చేపడతారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లను సెక్యూరిటీ రివిజన్ కమిటీ నిర్ణయం మేరకే చేపట్టారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తరువాత సెక్యూరిటీ రివిజన్ కమిటీ ఇంకా సమావేశమవ్వనే లేదు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల భద్రత ఏర్పాట్లపై సమీక్షించనే లేదు. కానీ ఈనాడు పత్రిక మాత్రం దురుద్దేశపూరిత కథనం ప్రచురించడం ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నమే. నాడు బాబు మనవడికి కూడా భద్రత2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన మనవడు దేవాన్‡్షకు కూడా ప్రత్యేకంగా భద్రత కల్పించారనే వాస్తవాన్ని ఈనాడు ఉద్దేశపూర్వకంగా విస్మరించింది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్‡్షకు ప్రత్యేకంగా భద్రత కల్పించారు.ఉండవల్లిలోని చంద్రబాబు కరకట్ట నివాసంతోపాటు హైదరాబాద్‌లోని వారి నివాసం, చివరకు ఫామ్ హౌస్ వద్ద కూడా భారీ భద్రత కల్పించడం గమనార్హం. వైఎస్ జగన్మోహన్రెడ్డికి కల్పించిన భద్రతకంటే ఎన్నో రెట్లు అధికంగా భద్రత కల్పించారు. ఈ అధికార దురి్వనియోగంపై ఏనాడూ పట్టించుకోని ఈనాడు.. ఉన్నత స్థాయి కమిటీ సూచనల మేరకు నిబంధనల ప్రకారం వైఎస్ జగన్‌కు కల్పించిన భద్రతపై అభూత కల్పనలు ప్రచురించింది. వివిధ విభాగాల నుంచి విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వివరాలు సివిల్ పోలీసులు: సీఐ–1, ఎస్సైలు–4, హెడ్ కానిస్టేబుల్–1, కానిస్టేబుళ్లు –12 , మహిళా కానిస్టేబుల్ –1. ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు: ఆర్ఎస్సైలు – 2, ఏఆర్ఎస్సై –1, కానిస్టేబుళ్లు – 28 ఏపీఎస్పీ: డీఎస్పీ –1, ఆర్ఎస్సై – 3, ఏఆర్ఎస్సై–2, హెడ్ కానిస్టేబుళ్లు – 14, కానిస్టేబుళ్లు – 69 ఆక్టోపస్: ఆర్ఐ –1, ఆర్ఎస్సైలు –2, కానిస్టేబుళ్లు–10 మొత్తం: 152 మంది ఐసోలేషన్‌లో: అదనపు ఎస్సీ – 1, ఆర్ఐ – 2, ఆర్ఎస్సై – 3, కానిస్టేబుళ్లు – 17 మొత్తం: 23 మంది కాన్వాయ్ విభాగంలో: సీఐ – 1, ఎస్సై – 3, హెడ్ కానిస్టేబుల్ – 1, కానిస్టేబుళ్లు – 16 మొత్తం: 21 మంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జవాన్లు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఛత్తీస్‌గఢ్ సాయుధ దళాలకు చెందిన ఇద్దరు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మరో సైనికుడు, పికప్ వాహనం డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.ప్రాథమిక సమాచారం ప్రకారం ఛత్తీస్‌గఢ్ సాయుధ దళాల (సీఎఎఫ్) వాహనం బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన అర్థరాత్రి జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అర్థరాత్రి ప్రమాదం జరగడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వాహనంలో ఎంతమంది ఉన్నారనే సమాచారం ఇంకా తెలియరాలేదు. Chhattisgarh | Two Chhattisgarh Armed Force (CAF) security personnel died and one was injured after the vehicle they were travelling in overturned in the Balrampur district. The civil driver of the pick-up vehicle was also injured in the incident. Both the injured are under… pic.twitter.com/xVlVowxnop— ANI (@ANI) June 20, 2024 -
వైఎస్ జగన్‌కు చెడు జరగాలని కోరుకుంటున్నారా?
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సెక్యూరిటీని తెల్లారేసరికి తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి కె.రవిచంద్రారెడ్డి ప్రశ్నించారు. ఆయనకు చెడు జరగాలని కోరుకుంటున్నారా? లేక మీ స్పాన్సర్డ్ మీడియాను పంపి హడావుడి చేయిస్తారా? అని నిలదీశారు. ఆయన మంగళవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వీఐపీలు ఉండే రోడ్లలో చెక్‌పోస్ట్‌లు ఉండటం, ఐడీ కార్డు అడగడం ప్రతిచోటా ఉంటుందని చెప్పారు. తమ పార్టీ తరపున కేంద్రానికి అప్పీల్ చేస్తున్నామని, వైఎస్ జగన్‌కి వీలైనంత త్వరగా జెడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పించాలని కోరుతూ కేంద్రానికి రిప్రజెంటేషన్ కూడా ఇస్తామని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ప్రభుత్వ ఉద్యోగులు చాలా విలువను పొందుతున్నామని అనుకుంటున్నారేమోగానీ ఉద్యోగులపై అప్పుడే చంద్రబాబు వివక్ష మొదలైంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులను ఈనాడులో జలగన్నలంటూ రాశారు. అధికారులను అవమానిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ అధికారులను అదిరించి, బెదిరించి తన అజమాయిషీ చాటుకున్నారు. వారిని అనేక రకాలుగా అవమానించారు. మేం ఇంత త్వరగా రెస్పాండ్ కాకూడదని, ఈ ప్రభుత్వానికి 3 నెలలో, 6 నెలలో సమయం ఇవ్వాలని అనుకున్నాం. అప్పటివరకు ఆరోపణలు చేయకూడదనుకున్నాం. ప్రజలకిచ్చిన హామీలు అమలుచేయకపోతే నిలదీయాలనుకున్నాం. కానీ ప్రభుత్వ అధికారులను అవహేళన చేసేవిధంగా రాయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నాం. 2014 నుంచి 2019 వరకు డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులు రాజమౌళి ఐఏఎస్, కేవీవీ సత్యనారాయణ, వెంకయ్యచౌదరి, కల్నల్ అశోక్‌బాబు, సంధ్యారాణి (పోస్టల్ డిపార్ట్మెంట్), గురుమూర్తి (సెంట్రల్ సర్వీస్), శ్రీనివాస్ (సర్వశిక్షా అభియాన్), జాస్తి కృష్ణకిశోర్ (తాళాలన్నీ ఇతడికే ఇచ్చారు కదా), వెంకటేశం (సమాచార కమిషనర్), రమణారెడ్డి (రైల్వే శాఖ).. వీరందరికీ ఇలాంటి పేర్లు ఏం పెట్టాలి? వీరంతా అనకొండలా లేక కొండచిలువలా? మేం ప్రశ్నిస్తున్నది సదుద్దేశంతోనే. అంతేగానీ అవహేళన చేయడానికి కాదు. ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ దాడులు దేనికి నిదర్శనం? రాబోయే రోజుల్లో మీరే చింతించాలి. ప్రజలంతా గమనిస్తున్నారు. -
సముద్ర జలాల్లో శాంతి స్థాపనే లక్ష్యం
సాక్షి, విశాఖపట్నం: సముద్ర జలాల్లో శాంతి స్థాపనే తమ లక్ష్యమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సురక్షిత నౌకాయానం, రూల్–బేస్డ్ వరల్డ్ ఆర్డర్, యాంటీ పైరసీ, హిందూ మహా సముద్ర ప్రాంత(ఐవోఆర్) పరిధిలో శాంతి– స్థిరత్వం ప్రధాన ప్రాధాన్యతలుగా తీసుకుంటామని స్పష్టం చేశారు. రెండో సారి రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాజ్‌నాథ్‌సింగ్ తొలి పర్యటన విశాఖలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్ర భద్రతను మరింత పటిష్టం చేస్తామన్నారు. ఇండియన్ నేవీ ఉనికిని మరింత ప్రభావవంతంగా చేయడంపై దృష్టి సారిస్తానని చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్‌కు చెందిన స్నేహపూర్వక దేశాలు సురక్షితంగా ఉంటూ పరస్పర ప్రగతి పథంలో కలిసి ముందుకు సాగేలా ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. దేశ అభివృద్ధిలో నౌకాదళం కీలక పాత్ర పోషిస్తోందనీ.. అంతర్జాతీయ వేదికగా భారత నౌకాదళ ఖ్యాతి పెరుగుతోందని ప్రశంసించారు. ఆర్థిక, సైనిక శక్తి ఆధారంగా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఏ దేశం ప్రమాదంలో పడకుండా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి కలిగిన భారత నౌకాదళం భరోసానిస్తోందన్నారు. పాక్ పౌరుల్ని రక్షించి మానవత్వాన్ని ప్రపంచానికి చాటింది ఈ ఏడాది మార్చిలో అరేబియా సముద్రంలో 23 మంది పాకిస్తానీ పౌరులను సోమాలి సముద్రపు దొంగల బారి నుంచి విడిపించినప్పుడు నేవీ సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ తీరు ప్రశంసనీయమన్నారు. జాతీయత, శత్రుత్వంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేసేలా ఇండియన్ నేవీ సిబ్బంది వ్యవహరిస్తూ.. మానవత్వ విలువల్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారని కొనియాడారు. భారతదేశ వాణిజ్య ప్రయోజనాలు ఐవోఆర్తో ముడిపడి ఉన్నాయనీ, వి్రస్తృత జాతీయ లక్ష్యాలను సాధించేందుకు నౌకాదళం సముద్ర సరిహద్దులను సంరక్షించడంలో ముఖ్య భూమిక పోషిస్తోందన్నారు. పెరుగుతున్న పారిశ్రామిక మౌలిక సదుపాయాల ద్వారా భారత నౌకాదళం నిరంతరం బలపడుతోందన్నారు. షిప్‌యార్డ్‌లు విస్తరిస్తున్నాయనీ, విమాన వాహక నౌకలు బలోపేతమవుతున్నాయన్నారు. ఇండియన్ నేవీ కొత్త శక్తివంతమైన శక్తిగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఘన స్వాగతం తొలుత విశాఖలోని నేవల్ ఎయిర్ బేస్ ఐఎన్ఎస్ డేగాకు భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠితో కలిసి చేరుకున్న రక్షణ మంత్రికి ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున ఘన స్వాగతం పలికారు. 50 మందితో కూడిన గార్డ్ ఆఫ్ హానర్‌తో సాదర స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి తూర్పు నౌకాదళం ప్రధాన కేంద్రానికి చేరుకున్న ఆయన ఐఎన్ఎస్ జలాశ్వలో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ నౌకలు, జలాంతర్గాములు, నేవల్ కమాండ్ విమానాల ద్వారా డైనమిక్ కార్యకలాపాలను వీక్షించారు, తూర్పు సముద్ర తీరంలో భారత నౌకాదళం కార్యాచరణ సంసిద్ధతని రాజ్‌నాథ్‌సింగ్ సమీక్షించారు. ‘డే ఎట్ సీ’ ముగింపులో భాగంగా స¯Œరైజ్ ఫ్లీట్ సిబ్బందితో కలిసి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భోజనం చేశారు. గౌరవ వీడ్కోలు అనంతరం.. ఐఎన్ఎస్ డేగాకు చేరుకొని ఢిల్లీకి పయనమయ్యారు. -
రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలు
పెదకాకాని: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత అక్కడక్కడా జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలను కేటాయించినట్టు తెలిపారు. సున్నితమైన ప్రాంతాలను గుర్తించడంతో పాటు ఘర్షణలకు పాల్పడే అనుమానితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. కౌంటింగ్ రోజు డ్రై డేను ప్రకటిస్తున్నామని, 144 సెక్షన్ ఎంతవరకు అవసరమో అంతవరకు విధిస్తామన్నారు. జూన్ నాలుగో తేదీన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లను సోమవారం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్ డూడీలతో కలిసి మీనా పరిశీలించారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్, మీడియా సెంటర్‌ను పరిశీలించారు.ఏడు నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌లను, డైక్మెన్ హాల్లో ఏర్పాటు చేసిన టీవీలను పరిశీలించి.. హాజరైన అభ్యర్థులతో మాట్లాడారు. అభ్యర్థులు, వారి తరఫున ప్రతినిధులు కూడా ప్రత్యక్షంగా ఈవీఎంలు భద్రపర్చిన గదులను పరిశీలించుకోవచ్చని చెప్పారు. అభ్యర్థులుగానీ, వారి ప్రతినిధులు గాని రోజుకు రెండు సార్లు స్ట్రాంగ్ రూంలను ఫిజికల్‌గా పరిశీలించుకునేందుకు అవకాశం కలి్పంచామన్నారు. వారి వెంట వివిధ స్థాయిల అధికారులు ఉన్నారు. -
పార్లమెంట్ సెక్యూరిటీపై కేంద్రం కీలక నిర్ణయం
-
‘రక్షణ’కు ఒక దిగ్దర్శనం అవసరం!
బీజేపీ, కాంగ్రెస్ మేనిఫెస్టోలు జాతీయ భద్రతకు భిన్న మార్గాల్లో ప్రాధాన్యం ఇచ్చాయి. అయితే రెండూ కూడా అత్యాధునిక మిలటరీ ఆయుధాలను సమకూర్చుకోవటానికి ఏమంత ప్రాముఖ్యం ఇవ్వలేదు. దేశంలోని ఈ రెండు ప్రధాన జాతీయ పార్టీల మేనిఫెస్టోలు పరిశీలించిన తరువాత రక్షణ, భద్రత అంశాల విషయంలో కాంగ్రెస్ మేనిఫెస్టో కొంత మెరుగ్గా ఉన్నట్లు తోస్తోంది కానీ... త్రివిధ దళాల అధిపతులు, జాతీయ భద్రతా సలహాదారులు కలిసి ఉన్న డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ... జాతీయ భద్రత వ్యూహం ఒకదాన్ని రూపొందించే విషయం రెండు మేనిఫెస్టోల్లోనూ స్పష్టంగా లేదు. అంతేకాదు, మన రక్షణ రంగానికి ఇప్పుడు దిగ్దర్శనం చేసే ఒక ‘ప్రొఫెషనల్’ అవసరం కూడా ఎంతైనా ఉంది.బీజేపీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆత్మ నిర్భర్ భారత్’లో స్వావలంబనకు పెద్దపీట వేశారు కానీ... అత్యాధునిక మిలిటరీ ఆయుధాలను సమకూర్చుకోవడంపై మాత్రం దృష్టి పెట్టలేదు. జాతీయ భద్రత, రక్షణ వంటి విషయాల్లో భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో చాలా అంశాలను ప్రస్తావించింది కానీ... ఏవీ అంత సమగ్రంగా ఉన్నట్టు కనిపించవు. ‘మోదీకి గ్యారెంటీ ఫర్ సురక్షిత్ భారత్’ పేరుతో మోదీ ప్రభుత్వం తను సాధించిన విజయాలను వెల్లడించింది, భవిష్యత్తు కోసం కొన్ని హామీలను ఇచ్చింది. 2014 తరువాత దేశంలోని ఏ నగరంలోనూ ఉగ్రదాడి ఏదీ జరగలేదని బీజేపీ చెప్పుకుంటోంది. ఇందులో కీలకం ‘నగరం’ అన్న పదం. 2016లో పఠాన్‌కోట వైమానిక స్థావరం, యూరీలు; 2019లో పుల్వామా ఘటనల్లో ‘నగరాల’పై దాడులు జరగలేదు కాబట్టి తాము తప్పుగా ఏమీ చెప్పలేదని బీజేపీ సమర్థించుకోవచ్చు.దీంతోపాటే ఆర్టికల్ 370 రద్దు ప్రభావం జమ్మూ కశ్మీర్లో ఎలా ఉందో కూడా మేనిఫెస్టోలో ప్రస్తావించారు. వామపక్ష తీవ్రవాద సంబంధిత హింస 52 శాతం వరకూ తగ్గిందనీ, ఈశాన్య భారతదేశంలో చొరబాటుదారుల సమస్య 71 శాతం నెమ్మదించిందని కూడా ఇందులో వివరించారు. ఉగ్రవాదాన్ని అస్సలు సహించేది లేదని చెబుతూ మేనిఫెస్టోలో 2016 నాటి సర్జికల్ స్ట్రైక్స్, 2019 నాటి బాలాకోట్ దాడి గురించి చెప్పారు. చైనా, పాకిస్తాన్, మయన్మార్ సరిహద్దుల్లో అత్యాధునికమైన రీతిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామనీ, కార్యక్రమాలను వేగవంతం చేస్తామనీ, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో స్మార్ట్ ఫెన్సింగ్ వంటివి ఏర్పాటు చేస్తామని కూడా బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే.. మణిపుర్ కూడా మన దేశ సరిహద్దులో ఉన్నా దాని ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ‘మోదీకి గ్యారెంటీ ఫర్ గ్లోబల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్’ విభాగంలో రక్షణ రంగ ఉత్పత్తులను మరింత విస్తృత స్థాయిలో తయారు చేస్తామనీ, ‘మేడిన్ భారత్’ ఎగుమతులకు ఊతమిస్తామని కూడా చెప్పుకున్నారు. ఈ ప్రయత్నాల వల్ల వాయు, పదాతిదళాలకు అవసరమైన ఆయుధాలు, వ్యవస్థలను దేశీయంగానే తయారు చేసేందుకు ప్రోత్సాహం లభిస్తుందని వివరించారు. గత ఏడాది అంటే బీజేపీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు అయిన తరువాత ‘నేషన్ ఫస్ట్: ఫారిన్ పాలసీ అండ్ నేషనల్ సెక్యూరిటీ’ పేరుతో బీజేపీ ఒక బుక్లెట్ విడుదల చేసి. అందులో తాము సాధించిన ఘనతలను ప్రస్తావించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రక్షణ, అంతర్గత భద్రతను, బయటి నుంచి రాగల సవాళ్లను వేర్వేరుగా సమీక్షించారు. లద్దాఖ్ ప్రాంతంలో సుమారు రెండు వేల కిలోమీటర్ల వైశాల్యమున్న భారత భూభాగాన్ని, మొత్తం 65 పెట్రోలింగ్ పోస్టుల్లో 25 పోస్టులపై పట్టు కోల్పోయామన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రస్తావించింది. అధికారంలోకి వస్తే జాతీయ భద్రతా వ్యూహం (ఎన్ఎస్ఎస్) ఒకదాన్ని ఆవిష్కరిస్తామని ప్రకటించింది. అలాగే ఎప్పుడో 2009లో రక్షణ మంత్రి జారీ చేసిన ఆపరేషనల్ డైరెక్టివ్లను సమీక్షిస్తామనీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామక ప్రక్రియను పారదర్శకంగా, వ్యవస్థీకృతంగా చేస్తామని కూడా హామీలు ఇచ్చింది. రక్షణ శాఖకు తగినన్ని నిధులు కేటాయించడమే కాకుండా ఈ రంగంలో తిరోగమిస్తున్న అంశాలను మళ్లీ పట్టాలెక్కిస్తామని తెలిపింది. ‘అగ్నిపథ్’ పథకం రద్దుతో పాటుగా, జాతీయ భద్రతా కౌన్సిల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్లను పార్లమెంటు పర్యవేక్షణలో పనిచేసేలా మార్పులు చేస్తామనీ, వ్యూహాత్మక అవసరాలకు అంతర్జాతీయ స్థాయి సరుకు రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తామనీ ‘వన్ ర్యాంక్– వన్ పెన్షన్’ అమల్లోని లోపాలను సవరిస్తామనీ వివరించింది. వైకల్యం కారణంగా లభించే పెన్షన్‌పై పన్నులు రద్దు చేస్తామని కూడా చెప్పింది. అంతర్గత భద్రత విషయాలను ప్రస్తావిస్తూ ద్వేషపూరిత ప్రసంగాలు, హింసలకు తావు ఇవ్వమనీ, ఇతర మతాల నిరాదరణనూ సహించబోమనీ స్పష్టం చేసింది. ‘నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్’ను ఆచరణలోకి తేవడం, ఏడాది లోపు ‘నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్’ ఏర్పాటు తమ లక్ష్యాలని వివరించింది. దేశంలోని రెండు ప్రధాన జాతీయ పార్టీల మేనిఫెస్టోలు పరిశీలించిన తరువాత కాంగ్రెస్ మేనిఫెస్టో రక్షణ, భద్రత అంశాల విషయంలో కాస్త మెరుగ్గా ఉన్నట్లు తోస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... మన ప్రభుత్వం రక్షణ రంగానికి జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో రెండు శాతం కంటే తక్కువ నిధులు కేటాయిస్తూండటం! ఫలితంగా మన మిలటరీ సామర్థ్యాలను చైనాకు దీటుగా మార్చుకునే విషయంలో వెనుకబడిపోయాం. త్రివిధ దళాల ఆధునికీకరణకు మరిన్ని నిధుల కేటాయిస్తామని ప్రభుత్వం చెబుతున్నా అగ్నిపథ్ లాంటి పథకాల పుణ్యమా అని ఈ ఆధునికీకరణ మరో పదేళ్లకు కానీ పూర్తికాని పరిస్థితి ఏర్పడింది. వన్ ర్యాంక్– వన్ పెన్షన్ బకాయిలు 2002–23లో మిలటరీ ఆధునికీకరణకు కేటాయించిన నిధుల కంటే ఎక్కువ కావడం, మిలటరీ సిబ్బంది సంఖ్యను మదింపు చేయడం ద్వారా ఈ లోటును అధిగమిస్తామని బీజేపీ చెప్పడం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఈ చర్యల కారణంగా మన యుద్ధ సన్నద్ధత, సామర్థ్యం తగ్గిపోయాయి. 2022లో కేవలం ఒక్క ఆర్మీలోనే 1.18 లక్షల ఖాళీలు ఉన్నాయంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆత్మ నిర్భరత’ కార్యక్రమం కూడా స్వావలంబనపై ఎక్కువ దృష్టి పెట్టింది కానీ... అత్యాధునిక ఆయుధాలనూ, వ్యవస్థలనూ ఏర్పాటు చేసుకోవడంపై కాదు. ఈ విషయాన్ని దేశ తొలి సీడీఎస్, దివంగత జనరల్ బిపిన్ రావత్ గతంలోనే కచ్చితంగా అంచనా కట్టారు. తగినన్ని, నాణ్యమైన ఆయుధ వ్యవస్థలు లేకపోయేందుకు ప్రస్తుతం అవలబిస్తున్న ‘ఎల్1’ టెండర్ వ్యవస్థ కారణం. మిత్ర దేశాలకు లైన్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వడంతో రక్షణ రంగ ఎగుమతులు పెరిగాయి. ఈ దేశాలన్నీ ప్రాణాంతకమైనవి కాకుండా ఇతర పరికరాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. త్రివిధ దళాల అధిపతులు, జాతీయ భద్రతా సలహాదారులు కలిసి ఉన్న డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ జాతీయ భద్రత వ్యూహం ఒకదాన్ని ఇంకా రూపొందించాల్సి ఉంది. ముసాయిదా ఒకదాన్ని ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ 2021లోనే భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు ఇచ్చిన విషయం ప్రస్తావనార్హం. అప్పటి నుంచి ఇప్పటివరకూ దాన్ని అప్డేట్ చేస్తూనే ఉన్నారు.ఆర్మీ దళాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద, ముఖ్యమైన సమస్య వనరుల కొరత. దీంతోపాటే కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించక పోవటం కూడా. జాతీయ భద్రత విషయంలో 1980 మధ్య కాలం మిలటరీకి స్వర్ణయుగం అని చెప్పాలి. త్రివిధ దళాలు 15 ఏళ్ల రక్షణ ప్రణాళికను 1988లో పార్లమెంటులో ప్రస్తావించడం గమనార్హం. పదేళ్లలో బీజేపీ ఐదుగురు రక్షణ మంత్రులను నియమించింది. వీరిలో ఒకరు ఆర్థిక శాఖ మంత్రిగానూ పనిచేశారు. రెండుసార్లు రక్షణ మంత్రిత్వ శాఖను అదనపు బాధ్యతగా చేపట్టారు కూడా! మాజీ విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఎస్.జయశంకర్‌ను ఆ శాఖ మంత్రిగానూ నియమించింది ఈ ప్రభుత్వం. జయశంకర్ అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రభను వెలిగించారనడంలో సందేహం లేదు. అయితే దేశ రక్షణ రంగం కూడా ఇలాంటి ప్రొఫెషనల్ ఏర్పాటును కోరుకుంటోంది. రక్షణ మంత్రి లేదా ఆ శాఖ సహాయ మంత్రికైనా మిలటరీ విషయాలపై ఎంతో కొంత పట్టు ఉండాలి. దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడం సులువు అవుతుంది. పథకాల అమలు వేగవంతమవుతుంది. ఆత్మ నిర్భరత సాధ్యమవుతుంది.– వ్యాసకర్త మిలటరీ వ్యవహారాల వ్యాఖ్యాత- మేజర్ జనరల్ అశోక్ కె. మెహతా (రిటైర్డ్) -
ఈవీఎంల భద్రతపై సుప్రియా సూలే సంచలన ట్వీట్
ముంబై: లోక్‌సభ ఎన్నికల వేళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెసిన్(ఈవీఎం)ల భద్రతపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే సంచలన ఆరోపణలు చేశారు. తాను పోటీచేసిన బారామతి నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లో సీసీ కెమెరాలు సోమవారం ఉదయం 45 నిమిషాల పాటు నిలిచిపోయాయని తెలిపారు.దీనికి సంబంధించి ఆమె సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్టు చేశారు. సీసీటీవీ కెమెరాలు ఆగిపోవడం పూర్తి అనుమానాస్పద ఘటన అని సూలే పేర్కొన్నారు.‘బారామతి ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ సీసీ కెమెరాలు సోమవారం ఉదయం పనిచేయలేదు. ఇది పూర్తి భద్రతా ఉల్లంఘనా చర్య. దీనిపై ఎన్నికల అధికారులను సంప్రదిస్తే వారి నుంచి సంతృప్త సమాధానాలేవీ రాలేదు.దీనికి తోడు సీసీకెమెరాలు రిపేర్ చేసే టెక్నీషియన్ కూడా ఆ ప్రాంతంలో అందుబాటులో లేడు’అని సూలే తెలిపారు. -
‘సీఈసీ’ రాజీవ్‌కుమార్‌కు జెడ్ కేటగిరీ భద్రత.. కారణమిదే..
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించింది. ఎన్నికల వేళ ఆయనకు సంఘ విద్రోహ శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ఆధారంగానే భద్రత పెంచినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జెడ్ సెక్యూరిటీ భద్రతలో భాగంగా రాజీవ్ కుమార్ (సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్) సీఆర్పీఎఫ్ కమాండోల రక్షణలో 24 గంటలు ఉండనున్నారు. 40నుంచి45 మంది సీఆర్పీఎఫ్ కమాండోలు ఎల్లప్పడూ ఆయనకు భద్రత కల్పిస్తారని హోం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి.. మా అబ్బాయి ఓడిపోవాలి.. మాజీ కేంద్ర మంత్రి -
భక్తులకు భద్రత..
-
మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనకు ప్రాణ హాని ఉందని శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకు 4+4 గన్మెన్లను కేటాయించాలని పిటిషన్లో కోరారు. శ్రీనివాస్‌గౌడ్ వేసిన పిటిషన్ మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థునను హైకోర్టు నిరాకరించింది. ప్రతి ఒక్కరికి ఈ విధంగా కేటాయించడం సాధ్యం కాదని హైకోర్టు పేర్కొంది. శ్రీనివాస్ గౌడ్‌కు గన్మెన్లు అవసరమో? లేదో? తెలపాలని హైకోర్టు డీజీపీని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలనీ హైకోర్టు డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు.. మార్చి 19కి వాయిదా వేసింది. -
కలిసి నడుస్తోన్న భారత్!
భౌగోళిక రాజకీయ స్థిరత్వంపై భాగస్వామ్య ఆసక్తి దృష్ట్యా ఈ ప్రాంత భద్రత విషయంలో భారతదేశం పెద్ద పాత్రనే పోషిస్తోంది. గత సంవత్సరం యూఏఈతో, ఫ్రాన్స్ తో తన మొదటి త్రైపాక్షిక విన్యాసాలను భారత్ నిర్వహించింది. ప్రస్తుతం భారత నౌకాదళం వాయవ్య అరేబియా సముద్ర జలాల్లో అసాధారణంగా చురుకుగా ఉంది. హౌతీల హెచ్చరికలకు గురైన వాణిజ్య నౌకలకు రక్షణ కల్పిస్తోంది. అంతేకాదు, బహ్రెయిన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న అమెరికా నేతృత్వంలోని కంబైన్్డ టాస్క్ ఫోర్స్‌లో భారతదేశం పూర్తి స్థాయి సభ్యదేశంగా మారింది. పశ్చిమాసియాలో ఈ విధమైన భారతదేశ ప్రయత్నాలు.. దేశ భద్రత, ఆర్థిక ప్రయోజనాల రీత్యా ముఖ్యమైన వ్యూహాత్మక అవకాశాలకు దారితీశాయి. ఇటీవల భారతదేశ విదేశాంగ విధానం ఆసక్తికరమైన ఒక వైరుద్ధ్యాన్ని కనబరిచింది. కేంద్ర ప్రభుత్వం తూర్పు వైపు చూడటం, తూర్పు దేశాలతో వ్యవహ రించడం గురించి మాట్లాడుతోంది కానీ వాస్తవానికి అది పశ్చిమ దేశాలతోనే ఎక్కువగా ఉంది. ఆ వైరుద్ధ్యం ఎలాగున్నా ప్రధానమంత్రి మోదీ స్వయంగా పశ్చిమాసియా దేశాలను ఆకర్షించడంలో అపార మైన సమయాన్ని, కృషిని పెట్టుబడిగా పెట్టారు. ఈ కారణంగా.. ఇంధనం మీద, ప్రవాసులపైన ఆధారపడిన మన సంబంధాలు ఇప్పుడు రాజకీయ, ఆర్థిక, రక్షణపరమైన ప్రయోజనాలను పొందు తున్నాయి. వాస్తవానికి చైనా మాదిరిగా పశ్చిమాసియా ప్రాంతంలో పెట్టుబడులు పెట్టగల సామర్థ్యం భారతదేశానికి లేదు, అయితే ప్రవాస భారతీయులు, అమెరికా, ఇజ్రాయెల్,ఫ్రాన్స్ లతో భాగస్వామ్యం భారత్‌కి ఆ దిశగా ఇతర ప్రత్యామ్నాయ ఎంపికలను కల్పిస్తోంది. ఇజ్రాయెల్, ఇండియా–యూఏఈ, యు.ఎస్.లతో కూడిన ఐ2యూ2 గ్రూపింగ్లోనూ; ఇండియా, మధ్యప్రాచ్యం, యూరోప్ ఎకనామిక్ కారిడార్‌లోనూ భారతదేశ భాగస్వామ్యంలో ఈ చొరవ వ్యక్తమవుతోంది. మొదటిది ఇజ్రాయెల్, ఇండియా, యూఏఈ, అమె రికాలను కలుపుతూ ఒక రకమైన పాశ్చాత్య క్వాడ్‌గా పరిగణన పొందు తోంది. ఇక రెండోది యూఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్లనుంచి వెళుతున్న మల్టీమోడల్ ప్రాజెక్ట్ ద్వారా భారతదేశాన్ని యూర ప్తో అనుసంధానించడానికి అమెరికా ముందుకు తెచ్చిన ప్రతిష్ఠా త్మకమైన కనెక్టివిటీ వెంచర్. 2014లో అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ ఏడోసారి యూఏఈ పర్యటనకు ఈ నెల ప్రారంభంలో వెళ్లారు. అబుదాబీలో తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభించి, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై సంతకం చేశారు. ఆ తర్వాత ఆయన ఖతార్‌కు వెళ్లారు. గూఢచర్యం ఆరోపణతో అక్కడ ఖైదీలుగా ఉన్న ఎనిమిది మంది భారతీయులకు ఖతార్ రాజరికపు క్షమాపణనుపొందే క్రమంలో 2048 వరకు 78 బిలియన్ డాలర్ల విలువైన సహజ వాయువు దిగుమతి ఒప్పందాన్ని పొడిగించగలిగారు. ఈ ప్రాంతంలో ముఖ్యమైన ‘ప్లేయర్’ అయిన చైనా తన ఆటను జాగ్రత్తగా ఆడుతోంది. గల్ఫ్ దేశాలు, పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య భారతదేశం తన స్థానాన్ని నిర్దేశించుకునే ప్రయత్నం చేస్తున్న సమ యంలోనే... చైనా ఇజ్రాయెల్ నుండి పక్కకు తొలిగిపోయింది. పైగా తటస్థ, సంభావ్య శాంతికర్తగా తనను తాను ప్రదర్శించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈజిప్ట్, ఇరాన్ నుండి సౌదీ అరేబియా, ఒమన్ వరకు మొత్తం ప్రాంతాన్ని తన పెట్టుబడితో, ప్రాధాన్యంతో చుట్టు ముడుతున్న చైనాకు పోటీదారుగా ఉద్భవించడానికి భారతదేశం ఇప్పుడు పావులు కదుపుతోంది. ఇటీవలి కాలంలో యూఏఈ భారతదేశ రెండవ అతి పెద్ద ఎగు మతి మార్కెట్‌గా ఉద్భవించింది. 2022లో ఇరుపక్షాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. సంవత్సరంలో యూఏ ఈతో భారత వాణిజ్యం 16 శాతం పెరిగి 85 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారతదేశంతో ద్వైపాక్షిక మదుపు ఒప్పందం (బీఐటీ), స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) రెండింటిపై సంతకం చేసిన ఏకైక దేశం యూఏఈ. ఈ విధానంలో భాగంగా ఒక ప్రధాన ప్రయత్నం ఏమిటంటే, జెబెల్ అలీ ఫ్రీ ట్రేడ్ జోన్లో రిటైల్, వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ సౌకర్యాల సృష్టి ద్వారా భారతీయ ఎగుమతుల్ని ప్రోత్సహించడం. భారత్ మార్ట్ అనే జాయింట్ వెంచర్‌తో ఇది లాజిస్టిక్స్, పోర్ట్ కార్యకలాపాలు, సముద్ర సేవలలో ప్రత్యేకత కలిగిన డీపీ వరల్డ్ అనే యూఏఈ కంపెనీతో ముడిపడి ఉంది. భౌగోళిక రాజకీయ స్థిరత్వంపై భాగస్వామ్య ఆసక్తి దృష్ట్యా, ఈ ప్రాంత భద్రత విషయంలో భారతదేశం పెద్ద పాత్ర పోషిస్తోంది. గత సంవత్సరం యూఏఈతో, ఫ్రాన్స్‌తో తన మొదటి త్రైపాక్షిక విన్యా సాలను భారత్ నిర్వహించింది. ప్రస్తుతం భారత నౌకాదళం వాయవ్య అరేబియా సముద్రజలాల్లో అసాధారణంగా చురుకుగా ఉంది. హౌతీల హెచ్చరికలకు గురైన వాణిజ్య నౌకలకు రక్షణ కల్పిస్తోంది. బహ్రెయిన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న అమెరికా నేతృత్వంలోని కంబైన్్డ టాస్క్ ఫోర్స్‌లో భారత్ పూర్తి స్థాయి సభ్యదేశంగా మారింది. ఈ ప్రాంతంలో భారత్‌కు అవకాశాల కొరత లేదు. సౌదీ అరే బియా ప్రిన్్స మొహమ్మద్ బిన్ సల్మాన్ వంటి పాలకులు భారత్‌కు తలుపులు తెరిచేశారు. అంతర్జాతీయ గోల్ఫ్ నుండి ప్రీమియర్ సాకర్ వరకు, భవిష్యత్ కొత్త నగరం నుండి ప్రపంచ విమానయాన సంస్థను నిర్మించడం వరకు ప్రతిదానిలో పెట్టుబడి పెట్టడానికి లేదా పెట్టు బడిని ప్రతిపాదించడానికి వారు ముందుకొచ్చారు. యూఏఈకిచెందిన అతి పెద్ద సావరిన్ వెల్త్ ఫండ్ భారతీయ మౌలిక సదుపా యాల కోసం 75 బిలియన్ డాలర్లకు పైగా మదుపు చేయడానికి కట్టు బడింది. సౌదీ కంపెనీలు 100 బిలియన్ డాలర్లను ఆఫర్ చేశాయి. సంపన్న అరేబియా రాజ్యాలు రెండూ చమురును దాటి తమ ఆర్థిక ప్రణాళికల్ని ముందుకు తీసుకెళ్లే మార్గాల్ని భారత ఆర్థికవృద్ధిలో చూస్తున్నాయి. సౌదీ రాజు ‘విజన్ 2030’... రెండు ట్రిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను నిర్వహించడానికి, సౌదీ వెల్త్ ఫండ్ అయిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌కి పిలుపునిచ్చింది. అదిప్పుడు 718 బిలియన్ డాలర్ల వరకు చేరుకుంది. సౌదీలు తమ ఆర్థిక వ్యవస్థను మెరుగు పర చాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యంతో ఉన్నారు. సాంకేతికత బదిలీపై, అభివృద్ధిపై షరతులు విధించిన చైనా కంపెనీలు తిరిగి సౌదీలకు అపూర్వ మైన ఒప్పందాల్ని అందించడానికి చైనా ఆర్థిక సమస్యలే ఒప్పించాయి. ఈ పరిణామాలకు వెలుపలే మిగిలిన ఒక ప్రధాన దేశం ఇరాన్. అమెరికా ఆంక్షలే దీనికి కారణం. ఇష్టం ఉన్నా లేకున్నా పాకిస్తాన్, మధ్య ఆసియాకు సంబంధించి భారత్ లెక్కలలో ఇరాన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది భారతదేశానికి దగ్గరగా ఉన్న హైడ్రోకార్బన్ దేశం కూడా. చైనీయుల విషయానికొస్తే సౌదీ–ఇజ్రాయెల్‌కు సంబంధించి తమ ఇటీవలి ఎత్తుగడల విషయమై వారు పునరాలోచనలో పడినా, ఇప్పటికీ కొనసాగుతున్న సౌదీ–ఇరాన్ ఘర్షణ విషయమై మధ్యవర్తిత్వం నెరపటంలో వారు విజయవంతమయ్యారు. చైనా తన పెట్టుబడులను ఈ ప్రాంతం అంతటా విస్తరించినప్ప టికీ, ఇరాన్లో దాని వాగ్దానాలను అమలుపరచలేదు. యూఏఈ, సౌదీ అరేబియా (ఒక్కొక్కటి 8 బిలియన్ డాలర్లు), టుర్కీయే (5.8 బిలియన్ డాలర్లు) ఇరాక్ (4.3 బిలియన్ డాలర్లు) కంటే 2013–16 కాలంలో 16 బిలియన్ డాలర్ల విలువైన చైనీస్ పెట్టుబడితో దానిపెద్ద లబ్ధిదారుగా పాకిస్తాన్ నిలిచింది. ఇరాన్‌కు 0.35 బిలియన్ డాలర్లే లభించాయి. సాంకేతికత, ఆయుధాల ఎగుమతి దన్నుగా ఉన్న చైనాతో పాటుగా ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టగల సామర్థ్యం భారత దేశానికి లేదు. కానీ తనకున్న అపారమైన వలస నైపుణ్యాలతో పాటు అమెరికా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్‌లతో భాగస్వామ్యం ఇండియాకు ఇతర ప్రత్యామ్నాయాల ఎంపికలకు వీలు కల్పిస్తోంది. ప్రస్తుతానికి, పశ్చిమాసియా ప్రాంత భౌగోళిక రాజకీయ భవి ష్యత్తు ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంతో మసకబారిపోయి ఉంది. ఇజ్రాయెల్‌తో సంబంధాల్ని మామూలు స్థితికి తెచ్చే విధానం నుండి యూఏఈ వైదొలగనప్పటికీ, శాంతికై సౌదీలు ఇంకా వేచి చూస్తూనే ఉన్నారు. ఈలోగా ఇథియోపియా, ఇరాన్, ఈజిప్ట్‌లతో పాటు యూఏ ఈ, సౌదీ అరేబియా రెండూ విస్తరించిన బ్రిక్స్‌లో చేరిపోయాయి. పశ్చిమాసియాలో ఈ విధమైన భారతదేశ ప్రయత్నాలు... దేశా నికి భద్రత, ఆర్థిక ప్రయోజనాలలో ముఖ్యమైన వ్యూహాత్మక అవకా శాలను తెరవడానికి దారితీశాయి. అయితే ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదం, చైనా ప్రాంతీయ ఆకాంక్షలు రేపిన అల్లకల్లోలం మధ్య న్యూఢిల్లీ జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. - వ్యాసకర్త ‘డిస్టింగ్విష్డ్ ఫెలో’, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ - మనోజ్ జోషీ -
ఎయిర్‌పోర్టు భద్రతా వలయాన్ని దాటి.. టిక్కెట్ లేకుండా ఫ్లైట్ ఎక్కి..
అమెరికాలోని ఓ మహిళ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ కన్నుగప్పి టిక్కెట్ లేకుండా ఫ్లైట్ ఎక్కింది. ఈ నెల ప్రారంభంలో నాష్విల్లే విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ మహిళ ప్రతీ సెక్యూరిటీ చెక్‌పాయింట్‌ను దాటుకుని, బోర్డింగ్ పాస్, గుర్తింపు కార్డు లేకుండా లాస్ ఏంజెల్స్‌కు వెళ్లేందుకు అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఎక్కింది. ‘న్యూయార్క్ పోస్ట్’ అందించిన వివరాల ప్రకారం ఆ మహిళా ప్రయాణికురాలు నాష్విల్లే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (టీఎస్ఏ) స్క్రీనింగ్ లైన్‌లోని మానవరహిత ప్రాంతంలో అడ్డంకిని దాటారు. ఇక్కడ ప్రయాణీకులు తమ గుర్తింపును చూపించవలసి ఉంటుంది. దీనిపై విమానాశ్రయ అధికారులు విచారణ ప్రారంభించారు. ఫిబ్రవరి 7న నాష్విల్లే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్‌పాయింట్‌లో ఆ ప్రయాణికురాలితో పాటు ఆమె క్యారీ ఆన్ బ్యాగేజీని ఫ్లైట్ ఎక్కే ముందు చెక్ చేసినట్లు నిర్ధారణ అయ్యింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఈ ఉదంతంలో తమ పొరపాటును అంగీకరించింది. ఐదు గంటల తరువాత ఆమె టిక్కెట్ లేకుండా ప్రయాణించినట్లు గుర్తించింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్- 1393 ఫిబ్రవరి 7న లాస్ ఏంజిల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న వెంటనే ఆ మహిళా ప్రయాణీకురాలిని ఎఫ్‌బీఐ అదుపులోకి తీసుకుని, విచారణ మొదలుపెట్టింది. ఆమెపై ఇంకా కేసు నమోదు కాలేదని, విచారణ కొనసాగుతోందని ఏజెన్సీ తెలిపింది. -
సీఎం రేవంత్ సెక్యూరిటీలో లీక్ రాయుళ్లు!
హైదరాబాద్, సాక్షి: సీఎం రేవంత్ రెడ్డి భద్ర తలో ఉన్నతాధికారులు మార్పులు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ వద్ద పనిచేసి, ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి వద్ద కూడా కొనసాగుతున్న భద్రతా సిబ్బందిని పూర్తిగా మార్చేశారు. ముఖ్యమంత్రి కార్యకలాపాలకు సంబంధించిన ప్రతీ సమాచారం బయటకు పొక్కుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గత సీఎం వద్ద పనిచేసిన వారిలో ఇదివరకు కొద్ది మందిని మాత్రమే మార్చగా, ఇంకా చాలా మంది అదే సెక్యూరిటీ విధుల్లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎంకు సంబంధించిన కీలక సమావేశ వివరాలు బయటకు వెళ్లడం, ఆయన భద్రతకు, పరిపాలన, ప్రభుత్వానికి మంచిది కాదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిఘా విభాగం అధిపతి శివధర్‌రెడ్డి ఈ అంశాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెవెళ్లిన అనంతరం భద్రతా సిబ్బందిని మార్చాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సీఎం భద్రతను చూసేందుకు ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌ను ఏర్పాటు చేశారు. ల్యాండ్ క్రూయిజర్లతో కొత్త కాన్వాయ్.. భద్రతాధికారులు సీఎంకు కొత్త కాన్వాయ్‌ని కూడా సమకూర్చారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి నల్లరంగు కారులో వెళ్తే, ఆయన భద్రతా సిబ్బంది వాహనాలు వేరే రంగులో ఉండేవి. ఇలా సీఎం ప్రయా ణించే వాహనాన్ని సులభంగా గుర్తించడానికి వీలవడంతో.. ముప్పు ఉంటుందని నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో ఆయన కాన్వాయ్‌లోని వాహన శ్రేణిని మొత్తం నల్లరంగులోకి మార్చేశారు. మాజీ సీఎం కేసీఆర్ తెల్లరంగున్న వాహన శ్రేణని వినియోగించేవారు. గత ప్రభుత్వ హయాంలోనే సీఎం కోసం తెల్లరంగు ల్యాండ్ క్రూయిజర్ వాహనాలను కొనుగోలు చేశారు. వాటికి విజయవాడలో బుల్లెట్‌ప్రూఫ్ చేయించారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నల్లరంగు వాహనాలంటే ఇష్టం కావడంతో, వాటి కలర్‌ను అధికారులు మార్చేశారని తెలిసింది. -
మణిపూర్‌లో దుండగుల మెరుపుదాడి
ఇంఫాల్: మణిపూర్‌లోని మోరే పట్టణంలో బుధవారం తెల్లవారుజామున కాల్పుల మోత మోగింది. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దుండగులు రెండుసార్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో ఓ అధికారి ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది సైనికులు గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఎమా కొండోంగ్ లైరెంబి దేవి మందిర్ సమీపంలో భద్రతా బలగాలు నిద్రిస్తున్నాయి. ఈ క్రమంలో దుండగులు దాడులు జరిపారు. చికిమ్ విలేజ్ కొండపై నుండి కాల్పులు జరిపారు. ఈ ఘటనకు కేవలం 20 మీటర్ల దూరంలో ఉన్న అసోం రైఫిల్స్ రంగంలోకి దిగి ఎదురుకాల్పులు జరిపారు. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని గాలింపు చేపట్టారు. మళ్లీ గంట తర్వాత ఉదయం 5:10 నిమిషాలకు మరోసారి కాల్పులు జరిగాయి. ఎస్బీఐ బ్యాంక్ బిల్డింగ్ దేఖునాయ్ రిసార్ట్ వద్ద మోహరించిన భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని దుండగులు మరొక ఆకస్మిక దాడి చేశారు. రెండోసారి జరిపిన దాడిలో ఓ అధికారి మరణించారు. మరికొంతమంది సైనికులు గాయపడ్డారు. ఇదీ చదవండి: రిపబ్లిక్ డే వేళ ఢిల్లీలో గోడలపై ఖలిస్థానీ రాతల కలకలం -
‘నిర్భయ’కు 11 ఏళ్లు... మహిళల భద్రతకు భరోసా ఏది?
అది దేశరాజధాని ఢిల్లీ.. 2012, డిసెంబరు 16.. రాత్రివేళ ఓ ప్రైవేట్ బస్సులో చోటుచేసుకున్న దారుణ అత్యాచార ఘటన భారతదేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్నీ కుదిపేసింది. ఈ నేపధ్యంలో ఢిల్లీని అత్యాచారాల క్యాపిటల్‌గా అభివర్ణించారు. నాడు అత్యంత క్రూరంగా జరిగిన అత్యాచార ఘటన దేశంలోని ప్రతీఒక్కరినీ కంటతడి పెట్టించింది. డిసెంబరు నాటి వణికించే చలిలో పారామెడికల్ విద్యార్థిని నిర్భయ కామాంధుల చేతుల్లో చిగురుటాకులా వణికిపోయింది. ఈ నేపధ్యంలో బాధితురాలికి న్యాయం చేయాలంటూ దేశంలోని ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. ఈ దారుణ అత్యాచారం దరిమిలా దేశంలో మహిళల రక్షణ విషయంలో పెను మార్పులు వచ్చాయి. దేశవ్యాప్తంగా మహిళల భద్రత కోసం అనేక చర్యలు చేపట్టారు. నిర్భయ అత్యాచార ఘటన దర్యాప్తు అనంతరం జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ సిఫార్సులు అమలయ్యాయి. దేశంలోని ప్రతీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అత్యాచార బాధితుల కోసం వన్ స్టాప్ సెంటర్లు, హెల్ప్లైన్లు ప్రారంభించారు. నిర్భయ ఫండ్ విడుదల చేశారు. నిర్భయ స్క్వాడ్, నిర్భయ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఎనిమిదేళ్ల పాటు నిర్భయ కేసు విచారణ కొనసాగగా దోషులైన ముఖేష్, పవన్, అక్షయ్, వినయ్‌లను 2020, మార్చి లో ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరితీశారు. ఒక మైనర్‌కు విముక్తి లభించగా, మరో నిందితుడు రామ్ సింగ్ విచారణ సమయంలో జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్భయ ఘటన, కేసు దర్యాప్తు, దోషులకు శిక్ష అమలు తర్వాత దేశంలో అత్యాచార ఘటనలు తగ్గుముఖం పట్టివుంటాయని అందరూ భావించివుంటారు. అయితే దీనికి భిన్నమైన పరిస్థితులు దేశంలో తాండవిస్తున్నాయి. ప్రముఖ జాతీయ ఏజెన్సీ ఎన్సీఆర్బీ.. నిర్భయ ఘటన అనంతరం గత 11 ఏళ్లలో దేశంలో చోటుచేసుకున్న అత్యాచార గణాంకాల వివరాలను విడుదల చేసింది. ఇవి మరింత ఆందోళన కలిగించేలా ఉన్నాయని పలువురు అంటున్నారు. సంవత్సరం అత్యాచారం కేసులు 2022 31,516 2021 31,677 2020 28,046 2019 32,032 2018 33,356 2017 32,559 2016 38,947 2015 34,651 2014 36,735 2013 33,707 2012 24,923 నిర్భయ లాంటి హృదయ విదారక అత్యాచార ఘటనల తర్వాత కూడా దేశంలో మహిళల భద్రత విషయంలో ఆశించినంత మార్పు రాలేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల విడుదల చేసిన 2022 సంవత్సరానికి సంబంధించిన నివేదిక ప్రకారం.. గత ఏడాది దేశంలో మొత్తం 31,516 అత్యాచార కేసులు నమోదయ్యాయి. అంటే ప్రతిరోజూ దాదాపు 87 మంది , ప్రతి గంటకు మూడు నుంచి నలుగులు బాలికలు లేదా మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. ఈ నివేదిక ప్రకారం అత్యాచార ఘటనల విషయంలో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంది. గత ఏడాదిలో అత్యధికంగా 5,399 అత్యాచార కేసులు ఇక్కడ నమోదయ్యాయి. ఢిల్లీలో 1212 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఇది కూడా చదవండి: కరడుగట్టిన నియంత ఏడ్చిన వేళ.. -
కుక్కలు కూడా వారి వెంట పడవు
సాక్షి, హైదరాబాద్: ‘వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ అవసరం లేదు.. కుక్కలు కూడా వారి వెంట పడవు’అని శాసనమండలి సభ్యుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు తీవ్ర వ్యా ఖ్యలు చేశారు. శుక్రవారం అసెంబ్లీ ఉభయసభల సంయుక్త సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఇటీవలి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై శాసనసభ ఆవరణలో పిచ్చాపాటిగా మాట్లాడారు. ‘తొక్కుడు రాజకీయాలతోనే బీఆర్ఎస్ ఓటమి పాలైంది. అసలు విషయాలు అధిష్టానం వరకు చేరకుండా మధ్యలోనే కొందరు ఆపేశారు. జోకుడు బ్యాచ్‌కు మా పార్టీ అధిష్టానం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. వాస్తవాలు చెప్పేందుకు అధినేత అవకాశం ఇస్తే ఎవరైనా అసలు విషయం చెప్తారు. వాస్తవాలు చెప్పేవారు బయట, జోకుడుగాళ్లు లోపల ఉంటే వాస్తవాలు ఎలా తెలుస్తాయి. పార్టీ గెలుపుపై ఊహాగానాలు ఎక్కువై వాస్తవాలు మరిచిపోయారు. 2014, 2018 ఎన్నికల్లో ఇతర పార్టీల్లో గెలిచిన వారిని బీఆర్ఎస్లోకి లాగితే.. వచ్చిన వారు నిజమైన బీఆర్ఎస్ లీడర్లను అణచివేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతీసారి ఇతర పార్టీల్లో గెలిచిన వారిని బీఆర్ఎస్లోకి తెచ్చుకుంటే నేతలు గ్రూపులుగా విడిపో యారు. కొన్ని జిల్లాల్లో మా పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల్లో అసహనం పెరిగేలా చేశారు.. దానిని ఎలా మేనేజ్ చేయాలో పార్టీకి ప్రణాళిక లేకపోతే ఎలా గెలుస్తాం. ఆత్మగౌరవం ఎక్కువగా ఉండే వరంగల్ లాంటి జిల్లాల్లో ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్ లాంటి వారికి మంత్రి పదవులు ఇస్తే ఉద్యమకారులు బాధపడ్డారు. తెలంగాణవాదం, ఉద్యమం గురించి తెలియని వారికి మంత్రి పదవులు ఇస్తే ఎలా..పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓటమిని అక్కడి ఓటర్లు ఎప్పుడో నిర్ణయించారు. ఆయన జనాలకు చక్కిలిగింత పెట్టడం తప్ప ఎవరికీ రూపాయి సాయం చేయరు’అని రవీందర్రావు అన్నారు. ఆ ప్రచారాన్ని నమ్మొదు చిట్‌చాట్ పేరిట తాను అనని మాటలను అన్నట్టు గా ప్రచారం జరుగుతోందని శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీ రవీందర్రావు ఒక ప్రకటన విడుదల చేశారు. తాను వ్యాఖ్యలు చేసినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను ఏదైనా విషయం మాట్లాడాలని అనుకుంటే అధికారికంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్తానన్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌పై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని, ఆయన అప్పజెప్పిన అనేక బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేర్చినట్లు పేర్కొన్నారు. చిట్‌చాట్ పేరిట జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని తక్కెళ్లపల్లి కోరారు. -
TS:మాజీ సీఎం కేసీఆర్ భద్రత.. ప్రభుత్వ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు భద్రత కుదించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు జెడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న కేసీఆర్ భద్రతను వై కేటగిరీకి కుదించారు. 4+4 గన్మెన్లతో పాటు ఒక ఎస్కార్ట్ వాహనాన్ని మాత్రమే కేసీఆర్ భద్రత కోసం కేటాయించనున్నారు. ఇంటి ముందు సెంట్రీ పహారా ఉంచనున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులకు భద్రత తగ్గించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా మాజీ మంత్రులకు మాత్రం 2+2 గన్మెన్లను ఉంచి ఎమ్మెల్యేగా లేని వారికి గన్మెన్లను పూర్తిగా తొలగించారు. ఇక మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లకు ఉన్న గన్మెన్లను తొలగించారు. ఇదీచదవండి..ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు -
2001- 2023.. అదే డిసెంబరు 13.. పార్లమెంట్ దాడుల్లో తేడా ఏమిటి?
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతుండగా ఇద్దరు ఆగంతకులు లోక్‌సభలో విజిటర్ గ్యాలరీ నుంచి దూకి, వెల్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇది పార్లమెంటు భద్రతా లోపాన్ని ప్రశ్నించేదిగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 22 ఏళ్ల క్రితం డిసెంబరు 13న జరిగిన దాడికి.. ఇప్పుడు జరిగిన దాడికి తేడా ఏమిటి? ఈ రెండింటినీ ఒకే రకమైన దాడిగా పరిగణించవచ్చా? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. 2023, డిసెంబర్ 13.. బుధవారం.. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతుండగా ఇద్దరు ఆగంతకులు భద్రతా వలయాన్ని ఛేదించి, లోక్‌సభలోకి ప్రవేశించడంతో సభలో గందరగోళం నెలకొంది. అయితే వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుంది. పట్టుబడినవారిలో ఓ యువకుడు, ఓ యువతి ఉన్నారు. ఆ యువకుడు పొగను స్ప్రే చేయడంతో పాటు పలు నినాదాలు చేశాడు. యువకుడి వయసు 25 ఏళ్లు కాగా, మహిళ వయసు 42 ఏళ్లు. 2001లో కూడా డిసెంబర్ 13నే పార్లమెంటుపై దాడి జరిగింది. నాడు ఉగ్రవాదులు పాత పార్లమెంట్ మెయిన్ గేటును బద్దలు కొట్టి, లోపలికి ప్రవేశించారు. ఈ నేపధ్యంలో జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది సైనికులు వీరమరణం పొందారు. అనంతరం దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదులను పార్లమెంట్ వెలుపల భద్రతా సిబ్బంది హతమార్చారు. ఈ రెండు దాడుల మధ్య తేడా ఏమిటంటే, 2001లో పాత పార్లమెంట్లో దాడి జరగ్గా, ఈసారి కొత్త పార్లమెంట్లో భద్రతా వలయాన్ని ఛేదించారు. 2001లో జరిగిన దాడిలో పార్లమెంటు వెలుపలి నుంచే దాడి జరిగింది. ఈసారి జరిగిన దాడిలో ముందుగా పార్లమెంట్‌లోకి ప్రవేశించి వారిద్దరూ భద్రతా వలయాన్ని దాటారు. 2001లో జరిగిన దాడిలో ఐదుగురు ఉగ్రవాదులు ఆయుధాలతో దాడి చేయడాన్ని భద్రత పరమైన లోపంగా భావించారు. నాడు ఉగ్రవాదులు నేరుగా ఆయుధాలతో దాడి చేశారు. అయితే ఈసారి పార్లమెంట్ హౌస్‌లోకి ప్రవేశించిన యువకుడు స్ప్రే ఉపయోగించాడు. ఇది కూడా చదవండి: ఆ మాజీ సీఎంల పని ఏమిటి? జేపీ నడ్డా ఏమన్నారు? -
లోక్‌సభలో దాడి ఘటన.. పట్టుబడ్డ ఆగంతకుల నేపథ్యం ఇదే..!
లోకసభలోకి ఆరుగురు ఆగంతకులు చొరబడి సృష్టించిన అలజడి యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఒక్కసారిగా సరిగ్గా అదే రోజు (2001 డిసెంబర్ 13)22 ఏళ్ల క్రితం పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడికి యత్నించిన ఉదంతం కళ్లముందు మెదిలింది. అలాంటి ఉగ్రదాడేనా! అని అనుమానాలు లేవెనెత్తాయి. రెండు దశాబ్దాల కిందట జరిగిన దాడే మాయని మచ్చలా చాన్నాళ్లు వెంటాడింది. అది మరువక మునుపే కొత్తగా ఆధునాతన హంగులతో తీర్చిదిద్దిన పార్లమెంటు వద్ద మళ్లీ అలాంటి కల్లోలం అందర్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. పార్లమెంటు ప్రాంగణం లేదా బయట వైపు కాకుండా ఏకంగా దిగువసభలోకే ఆగంతకులు చొరబడటం పార్లమెంట్‌లోని భద్రతా వైఫల్యం గురించి అనుమానాలు లేవనెత్తింది . అదీగాక ప్రధాని నరేంద్ర మోదీ ఈ కొత్త పార్లమెంట్ తీర్చిదిద్దిన విధానం గురించి ఎంతలా ప్రచారం చేశారో కూడా తెలిసిందే. ఈ కొత్త పార్లమెంట్ ప్రారంభమైంది కూడా ఈ ఏడాది మేలోనే, ఇంతలోనే ఈ దాడి అందర్నీ తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. అయితే ఈ పార్లమెంట్‌లోకి చొరబడ్డ ఆ ఆగంతకుల్లో కొందరీ బ్యాగ్రౌండ్ మాములగా లేదు. వారి నేపథ్యం విని అధికారులే ఆశ్చర్యపోయారు. ఇంతటి ఉన్నత విద్యావంతులు ఇలాంటి దారుణానికి ఎందుకు దిగారంటే.. కట్టుదిట్టమైన బందోబస్తు ఉండే పార్లమెంటు మూడంచెల భద్రత వ్యవస్థను ఇద్దరు సామాన్యులు ఏమార్చారు. బూట్లలో పొగ గొట్టాలు దాచుకుని మరీ బుధవారం సాధారణ సందర్శకుల్లా దర్జాగా లోక్‌సభ గ్యాలరీలోకి ప్రవేశించారు. జీరో అవర్ కొనసాగుతుండగా గ్యాలరీలోంచి సభా ప్రాంగణంలోకి దూకి.. స్పీకర్ స్థానంకేసి దూసుకెళ్లి కలకలం రేపారు. ‘నిరంకుశత్వం నశించాలి, నల్ల చట్టాలు పోవాలని నినదిస్తూ, పొగ గొట్టాలను విసిరేశారు. వాటి నుంచి వచ్చిన పసుపు రంగు పొగతో ఎంపీలు భయాందోళనలకు లోనయ్యారు. చివరికి వారే చొరవ చేసి ఇద్దరినీ నిర్బంధించారు. అదే సమయంలో పార్లమెంటు ఆవరణ బయట కూడా ఇద్దరు వ్యక్తులు పొగ గొట్టాలు విసిరి కలకలం రేపారు. వారినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురికీ మరో ఇద్దరు కూడా సహకరించినట్టు దర్యాప్తులో తేలింది. వాళ్లెవరంటే..? పార్లమెంటు ఆవరణలో పొగ గొట్టాలు విసిరి పట్టుబడ్డ వారిని హరియాణాలోని హిస్సార్‌కు చెందిన నీలమ్ (42), మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన అమోల్ షిండే (25)గా గుర్తించారు. వీరికి, మనోరంజన్, సాగర్లకు లలిత్, విశాల్ అనే మరో ఇద్దరు కూడా సహకరించినట్టు ఢిల్లీ పోలీసులు తేల్చారు. విక్కీ శర్మను గురుగ్రాంలో పట్టుకున్నారు. ఐదుగురినీ లోతుగా విచారిస్తున్నారు. ఆరుగురూ గ్యాలరీలోకి వెళ్లాలనుకున్నా ఇద్దరికే పాస్ దొరికినట్టు సమాచారం. వీరందరికీ కనీసం నాలుగేళ్లుగా పరిచయముందని, సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉండేవారని చెబుతున్నారు. అంతాకొంతకాలంగా గురుగ్రాంలో విక్కీ శర్మ ఇంట్లో నే ఉంటున్నట్టు విచారణలో తెలిసింది. ఆగంతకుల బ్యాగ్రౌండ్... పట్టుబడ్డ నిందుతుల్లో నీలమ్ రీసెర్చ్ ప్రోగ్రాంలో ఎం.ఫిల్ పూర్తి చేసింది. అలాగే టీచింగ్ ఉద్యోగం కోసం నిర్వహించే సెంట్రల్ ఎగ్జామినేషన్‌లో కూడా పాసయ్యింది. కానీ ఉద్యోగం లేదు. ఉన్నత విద్యావంతురాలైనప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో నీలమ్ తీవ్ర డిప్రెషన్‌కి లోనయ్యినట్లు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇంత చదువుకున్నా.. సరైన ఉద్యోగం లేదు రోజుకు రెండుపూట్ల తిండి కూడా తినలేకపోతున్నానని ఆవేదన చెందేదని, తరుచుగా చనిపోతానని ఏడ్చేదని నీలమ్ తల్లి చెబుతోంది. ఆమె సోదరుడు రామ్నివాస్ నీలమ్‌కి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, కానీ ఆమె ఎందుకిలా చేసిందనేది కూడా మాకు తెలియదు. తమ బంధువులు ఫోన్ చేసి టీవి చూడమని చెప్పేంత వరకు తమకు దీని గురించి తెలియదని అన్నాడు. నీలమ్ పోటీపరీక్షలకు ప్రీపేర్ అయ్యేందకు హర్యానాలో జింద్‌కు వెళ్లినట్లు తెలిపారు. ఆమె బీఏ, ఎంఏ, ఎంఫిల్ పూర్తి చేసింది. పైగా నెట్లో కూడా మంచి ఉత్తీర్ణతతో పాసయ్యింది. ప్రస్తుతం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కు కూడా ప్రిపరవ్వుతుందని ఆమె కుటుంబసభ్యలు చెబుతున్నారు. కాగా నీలమ్ తరచూ నిరసనల్లో నిరుద్యోగ సమస్యను లేవనెత్తుతుండేదని, పైగా మూడు వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సమీపంలో ఏడాదిపాటు జరిగిన రైతుల నిరసనలో కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఇక మరో నిందితుడు మనోరంజన్(34) మైసూర్‌కి చెందినవాడు. కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్. అతడి తండ్రి దేవరాజేగౌడ మాట్లాడుతూ.. తన కొడుకు ఏదైనా తప్పు చేసి ఉంటే ఉరి తీయాలని అన్నారు. పార్లమెంటు మాది... మహాత్మా గాంధీ నుంచి జవహర్లాల్ నెహ్రూ వరకు చాలా మంది ఆ ఆలయాన్ని నిర్మించారు.. నా కొడుకు అయినా ఆ గుడి విషయంలో ఎవరైనా ఇలా ప్రవర్తించడం ఆమోదయోగ్యం కాదు అని నిందుతుడి తండ్రి పేర్కొనడం గమనార్హం. నీలం అజాద్‌తో కలసి పార్లమెంట్ వెలుపల పొగ గొట్టలు విసిరిన అమోల్ షిండే మహారాష్ట్రలోని లాతూర్ గ్రామానికి చెందిన వాడు. అతడి తల్లిదండ్రులు కూలీలు. పోలీసు, ఆర్మీ రిక్రూట్మెంట్ వంటి పోటీ పరీక్షల్లో చాలా సార్లు విఫలమయ్యాడని అతడి తల్లిదండ్రులు తెలిపారు. అతను పోలీస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌కి వెళ్తున్నట్లు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లినట్లు అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. అలాగే లక్నో నివాసి, సాగర్ శర్మ, అతనితో సహా అతని కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నారు. శర్మ జీవనోపాధి కోసం ఇ-రిక్షా కూడా నడుపుతున్నాడు. నిరసనలో పాల్గొనేందుకు రెండు రోజుల పాటు ఢిల్లీకి వెళతానని చెప్పినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. చివరిగా ఆ నిందితులకు ఇంట్లో ఆశ్రయం ఇచ్చిన విక్కీ శర్మ అతడి భార్య రేఖను కూడా అదుపులో తీసుకున్నారు. విక్కీ ఎగుమతుల కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వారందరిపై పోలీసులు ఉగ్రవాద నిరోధక చట్ట కింద కేసులు నమోదు చేశారు. ఆ ఆగంతుకులు ఒక్కొకరిది ఒక్కో నేపథ్యం. కానీ వారంతా ఎంతోకొంత చదువుకున్న వారు. సామాజిక అంశాల పట్ల అవగాహన ఉన్నవాళ్లు, ఏదీ మంచి ఏదీ చెడు తెలిసిన వివేకవంతులే. కానీ ఇలా తాము ఎదుర్కొన్న పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలతో తప్పుడు దోవ ఎంచుకున్నారో లేక మరేవరి ప్రమేయం లేదా ప్రభావం ఉందో తెలియదు గానీ చాలామంది యువత ఇలానే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తమ వాళ్లకు అన్యాయం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే అన్యాయమైపోయిన వాడు తనలా మరెవరు కాకుడదన్న మనస్తత్వంతో ఉండాలి. తనను నమ్ముకున్నవాళ్లు లేదా తనపై ఆధారపడిన వాళ్ల గురించి అయినా ఆలోచించాలి. ఇలాంటి మార్గంలో మాత్రం పయనించడు. దీన్ని యువత గుర్తించుకోవాలి. మన చుట్టు ఉన్నవాళ్లలో చాలామంది దారుణమైన పరిస్థితుల్లో పెరిగి నెగ్గుకొచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. అంతెందుకు మన రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ఎంతటి దారిద్యాన్ని అనుభవించాడో తెలిసిందే. ఆ రోజుల్లోనే అతను అందరికంటే ఉన్నత విద్యాను అభ్యసించాడు అయినా వెనుకబడి కులం వాడన్న ఒక్క కారణంతో హేళనలకు గురిచేశారు. అంటరానివాడని అవమానించారు. కనీసం సాటి మనిషిలా కూడా గౌరవం ఇవ్వకపోయినా తట్టుకుని నిలబడి ఛీత్కారంతో చూసిన వారిచేత శభాష్ అని సలాం కొట్టించుకున్నాడు. ఇలాంటి ఎందరో మహనీయుల మన మాతృభూమికి మంచి పేరుతెచ్చి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. దేశానికి యువత ఓ ఆయుధం. వారు దేశాన్ని అభివృద్ధిపథంలోకి నడిపించేలా ఉండాలి కానీ కానీ కళంకంలా ఉండకూడదు. కఠిన పరిస్థితులను తట్టుకుని రాటుదేలి.. మహనీయుడిలా మారాలే కానీ అలజడులు సృష్టించే ఉగ్రవాదులు లేదా నేరస్తులుగా మారకూడదు. (చదవండి: లోక్‌సభకు పొగ) -
‘26/11’ తరువాత కూడా నిర్లక్ష్యం వీడని ముంబై పోలీసులు..
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 2008, నవంబరు 26న జరిగిన ఉగ్ర దాడిని ఎవరూ మరచిపోలేరు. ఈ ఘటన దరిమిలా నగరానికి ఆనుకుని ఉన్న పలు బీచ్‌లలో గట్టి నిఘా ఏర్పాటు చేసేందుకు ముంబై పోలీసులు 46 స్పీడ్ బోట్లను కొనుగోలు చేశారు. అయితే వీటిలో ప్రస్తుతం ఎనిమిది మాత్రమే పనిచేస్తుడటం చూస్తే, ముంబై పోలీసుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం అవుతుంది. నాడు ముంబై పోలీసులు కొనుగోలు చేసిన బోట్లలో పసుపు, నీలి రంగులతో కూడిన ఒక బోటు అటు భూమి.. ఇటు సముద్రం.. రెండింటిలోనూ నావిగేట్ చేస్తుంది. ఇది ముంబై పోలీస్ లాంచ్ సెక్షన్‌లోని పేవర్-బ్లాక్ బ్యాక్‌యార్డ్‌లో ఉంది. ఇదే కార్యాలయం ముందు దాదాపు డజను స్పీడ్బోట్లు మురికిపట్టిన టార్పాలిన్ షీట్ కింద ఇనుప స్టాండ్లకు అతుక్కుని కనిపిస్తాయి. మహారాష్ట్రలో 2008లో జరిగిన ఉగ్రదాడుల తర్వాత ముంబై పోలీసులు కొనుగోలు చేసిన 46 బోట్లలో కొన్ని బోట్లు వృథాగా పడివున్నాయి. నగరంలోని 114 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతంపై నిఘా ఉంచడం కోసం ఈ బోట్లు కొనుగోలు చేశారు. వీటిలో ఎనిమిది బోట్లు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నాయి. 2008, నవంబరు 26న 10 మంది పాకిస్తానీ లష్కరే తోయిబా తీవ్రవాదులు కరాచీ నుండి అరేబియా సముద్రం దాటి పోర్ బందర్ మీదుగా వచ్చి, ఫిషింగ్ ట్రాలర్‌ను హైజాక్ చేసి, బుద్వార్ పార్క్ సమీపం నుంచి ముంబై తీరానికి చేరుకున్నారు. 26/11 తీవ్రవాద దాడులలో 160 మంది మరణించారు. 300 మందికి పైగా జనం గాయపడ్డారు. నాటి రోజుల్లో ముంబై పోలీసులకు సముద్రంలో పెట్రోలింగ్ చేయడానికి కేవలం నాలుగు ఫైబర్ గ్లాస్ బోట్లు మాత్రమే ఉండేవి. ముంబై దాడుల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం హైస్పీడ్ బోట్లను కొనుగోలు చేసే ప్రతిపాదనను ఆమోదించింది. దాడులు జరిగిన తరువాత మూడేళ్లలో డిపార్ట్మెంట్ మొత్తం 46 బోట్లను కొనుగోలు చేసింది. వీటిలో 23 స్పీడ్ బోట్లు, 19 ఉభయచర బోట్లు, నాలుగు అధునాతన ఉభయచర ‘సీలెగ్’ బోట్లు ఉన్నాయి. పోలీసుల నిఘా కార్యకలాపాలకు ఉపయోగపడే లక్ష్యంతో వీటిని కొనుగోలు చేశారు. ఈ బోట్లు సముద్రంతో పాటు భూభాగంలో అనుమానితులను ట్రాక్ చేయడంలో పోలీసులకు సహాయం అందించనున్నాయి. అయితే ప్రస్తుతం ఈ బోట్లలో ఎనిమిది స్పీడ్ బోట్లు మాత్రమే పని చేస్తున్నాయి. 19 ఉభయచర బోట్లు, నాలుగు ‘సీలెగ్’లు వృథాగా పడివున్నాయి. ఇకనైనా పోలీసులు మేల్కొని వృథాగా ఉన్న ఈ బోట్లను వినియోగంలోకి తెచ్చి, ముంబైకి ఉగ్రవాదుల ముప్పు నుంచి మరింత రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు. ఇది కూడా చదవండి: పైసా కూడా లేకుండా పోటీకి దిగిన అభ్యర్థులు వీరే! -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు భారీ భద్రత.. వేల మందితో బందోబస్తు
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 6,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నట్లు అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జీఎస్ మాలిక్ తెలిపారు. ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ గ్రాండ్ ఫినాలేకు హాజరయ్యే ముఖ్య వ్యక్తులలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధాని రిచర్డ్ మార్లెస్ ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇక్కడ విలేకరుల సమావేశంలో జీఎస్ మాలిక్ మాట్లాడుతూ మ్యాచ్ చూడటానికి లక్ష మందికి పైగా ప్రేక్షకులు, అనేక మంది ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో గుజరాత్ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ , హోంగార్డులు, ఇతర సిబ్బందితో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ‘ఈ మెగా ఈవెంట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగేలా చూసేందుకు 6,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరిస్తున్నాం. వీరిలో దాదాపు 3,000 మంది స్టేడియం లోపల ఉంటారు. మరికొందరు ఆటగాళ్లు, ప్రముఖులు బస చేస్తున్న హోటళ్లు, ఇతర కీలక ప్రదేశాలలో బందోబస్తు నిర్వహిస్తారు’ అని జీఎస్ మాలిక్ వివరించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఒక కంపెనీ స్టేడియం లోపల, మరొకటి స్టేడియం వెలుపల మోహరించి ఉంటుందని, నగర పోలీసుల ఆధ్వర్యంలో స్టేడియం లోపల తాత్కాలిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఐజీ, డీఐజీ ర్యాంకుకు చెందిన నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు 23 మంది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారులు మ్యాచ్ రోజు సిబ్బందిని పర్యవేక్షిస్తారని జీఎస్ మాలిక్ పేర్కొన్నారు. వీరికి 39 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 92 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లు సహాయం చేస్తారని వివరించారు. మ్యాచ్‌లో ఏదైనా రసాయన, జీవ, రేడియోలాజికల్, న్యూక్లియర్ (CBRN) అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే స్పందించడానికి, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాలను కూడా నగరంలో మోహరిస్తామని తెలిపారు. బాంబ్ డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్‌కు చెందిన 10 బృందాలతో పాటు రెండు బృందాలు చేతక్ కమాండోస్, ఒక ఎలైట్ యూనిట్‌ను స్టేడియం సమీపంలో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. బాంబ్ బెదిరింపులపై స్పందిస్తూ.. ఎక్కడో బయట దేశాల్లో కూర్చొని ఆకతాయిగా చేసే బెదిరింపులను మీడియా హైలైట్ చేయొద్దని జీఎస్ మాలిక్ కోరారు. -
చాలా బాధ కలిగింది, ప్రతీదీ నిజం కాదు..ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు!
Deeply Disturbed Zara Patel Reacts: నటి రష్మిక మందన్న వైరల్ డీప్‌ఫేక్ వీడియోకు సంబంధించిన ఒరిజినల్ వీడియో బ్రిటిష్-ఇండియన్ఇన్ఫ్లుయెన్సర్ జారా పటేల్‌దే. ఈ నేపథ్యంలో తన ఫేస్‌తో రష్మిక ముఖంతో ఏఐ ద్వారా క్రియేట్ చేసిన డీప్ ఫేక్ వీడియో వివాదంపై జారా పటేల్ స్పందించారు. ఈ సంఘటన తనను చాలా ఆవేదనకు గురిచేసిందన్నారు. ఈ సంఘటనతో ఇంటర్నెట్లో మహిళలు, అమ్మాయిల భద్రతపై మరింత ఆందోళన కలుగుతోందని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రముఖ నటి ముఖాన్ని ఉపయోగించి ఎవరో డీప్‌ఫేక్ వీడియోను రూపొందించినట్లు తన దృష్టికి వచ్చిందనీ, ఈ వీడియోతో తనకు ఎలాంటి ప్రమేయం లేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఈ ఫేక్ వీడియో చూసి చాలా ఆందోళన చెందాను అంటూ జారా పటేల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా రష్మికకు తను సానుభూతిని ప్రకటించారు. ఇకపై సోషల్ మీడియాలో యువతులు, మహిళలు ఏదైనా పోస్ట్ చేయాలంటేనే భయపడాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ఇంటర్నెట్లో వస్తున్న ప్రతీదీ నిజం కాదు. దయచేసి ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి అంటూ ఆమె నెటిజన్లుకు సూచించారు. (రష్మిక డీప్ ఫేక్ వీడియో: గాయని చిన్మయి శ్రీపాద ఫైర్) కాగా సంచలనం రేపిన టాలీవుడ్ నటి రష్మిక డీప్‌ఫేక్ వీడియో ఆధునిక టెక్నాలజీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మరో భయంకర కోణంపై ఆందోళన రాజేసింది. సోషల్ మీడియాలో బిగ్‌బీ, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సహా పలువురు ప్రముఖులు స్పందించారు. (రష్మిక డీప్ ఫేక్ వీడియో: కేంద్ర మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ) హీరోయిన్లు, సెలబ్రిటీ మహిళలతోపాటు, సాధారణ మహిళలు, టీనేజ్ అమ్మాయిల ఉనికికి ముప్పుగా మారుతోందంటూ ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. (రష్మిక డీప్ ఫేక్ వీడియో : ఎమ్మెల్సీ కవిత రియాక్షన్) -
ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఓటు వేసేలా!
నాగోజు సత్యనారాయణ: రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు పూర్తిస్థాయిలో భద్రత కట్టుదిట్టం చేస్తున్నట్టు టీఎస్ఎస్పీ(తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్) బెటాలియన్స్ అడిషనల్ డీజీ, కేంద్ర బలగాల భద్రత విధులకు సంబంధించి రాష్ట్ర నోడల్ అధికారి స్వాతి లక్రా వెల్లడించారు. స్థానిక శాంతిభద్రతల పరిస్థితుల ఆధారంగా సున్నితమైన, సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలిపారు. ఎన్నికల భద్రత విధుల్లో కేంద్ర సాయుధ పోలీస్ బలగాల మోహరింపు, ప్రధాన విధులకు సంబంధించిన అంశాలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో అడిషనల్ డీజీ స్వాతిలక్రా పంచుకున్నారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు ప్రధానంగా అప్పగించే ఎన్నికల విధులు...? ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరపడంలో అన్ని దశల్లోనూ కేంద్ర సాయుధ పోలీసు బలగాలు స్థానిక పోలీసులకు సహకారంగా ఉంటాయి. ప్రధానంగా వాహన తనిఖీలు, రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్‌పోస్టులు, ఇతర కీలక పాయింట్లలో పహారా, పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు..ఓటింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూంల వద్ద కీలకమైన భద్రత విధులు కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు అప్పగిస్తాం. ఎన్నికల విధుల్లో కేంద్ర బలగాల మోహరింపు ఏ ప్రాతిపదికన ఉంటుంది..? స్థానికంగా ఎన్ని పోలింగ్స్టేషన్లు ఉన్నాయి..అందులో ఎన్ని సమస్యాత్మకమైనవి, సున్నితమైనవి ఉన్నాయన్న నివేదిక ఆధారంగా కేంద్ర బలగాలను పంపుతున్నాం. ప్రస్తుతానికి వంద కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రవ్యాప్తంగా పంపించాం. స్థానికంగా వాళ్లకు వసతి సదుపాయానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పోలింగ్స్టేషన్లు,, గత ఎన్నికల్లో నమోదైన ఘటనల ఆధారంగా సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించిన పోలింగ్ కేంద్రాల వద్ద అవసరం మేరకు అదనపు బలగాలను కేటాయిస్తున్నాం. పూర్తి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. కేంద్ర బలగాలతో అన్ని ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించడానికి కారణం..? స్థానికంగా యూనిట్ ఆఫీసర్లు కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్‌లు చేస్తున్నారు. దీని ముఖ్యఉద్దేశం..మీ ప్రాంతంలో భద్రత కోసం పూర్తి సన్నద్ధంగా మేం ఉన్నాం అని పోలీసు నుంచి ప్రజలకు భరోసా ఇవ్వడమే. దీనివల్ల ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడం. అదే సమ యంలో సంఘ విద్రోహశక్తులకు ఒక్కింత హెచ్చరిక మాదిరిగా ఈ కవాతులు చేయడం సర్వసాధారణమే. కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు తోడు ఇతర రాష్ట్రాల పోలీసు సిబ్బంది బందోబస్తుకు వస్తారా..? ఇంకా కొన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికలు ఉన్నందున అందుకు అనుగుణంగా విడతల వారీగా కేంద్ర సాయుధ బలగాల సర్దుబాటు ఉంటుంది. ఒక్కో కంపెనీలో సరాసరిన 80 నుంచి 100 మంది వరకు సిబ్బంది ఉంటారు. ఈ లెక్కన కేంద్ర సాయుధ పోలీస్ బలగాల నుంచే 30 వేల మందికిపైగా ఎన్నికల విధుల్లో ఉంటారు. వీరికి అదనంగా ఎలక్షన్ పది రోజుల ముందు నుంచి పోలింగ్ తేదీన విధుల్లో ఇతర రాష్ట్రాల నుంచి సాయుధ పోలీసు బలగాల సిబ్బందితో పాటు హోంగార్డులు సైతం ఉంటారు. 2018 ఎన్నికల భద్రత విధుల్లో 279 కంపెనీల కేంద్ర బలగాలే ఉన్నాయి. ఈసారి ఆ సంఖ్య పెరిగిందా..? గతంలో 279 కంపెనీల కేంద్ర బలగాలు ఉండగా, ఈసారి ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మనం ఎక్కువ కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు కావాలని ప్రతిపాదనలు పంపించాం. ఈసారి మొత్తం 375 కంపెనీల బలగాలను మనం అడిగాం. ఇప్పటికే 100 కంపెనీలు వచ్చాయి. ఇంకో 275 కంపెనీలు వస్తాయి. -
ఎంపీపై దాడి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు భద్రత పెంపు
సాక్షి, సిద్దిపేట: దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రభుత్వం భద్రతను పెంచింది. 2+2 ఉన్న భద్రతను 4+4గా పెంచుతూ అన్ని జిల్లా అధికారులకు ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీ ఆదేశాలు జారీ చేశారు.పెంచిత భద్రత నిన్నటి నుంచి రిపోర్ట్ చేయాలని సర్కులర్ లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు భద్రత పెంపు పై విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమకు కూడా భద్రత పెంచాలని విపక్ష పార్టీల పలువురు ఎమ్మేల్యేలు, నాయకులు డీజీపీకి విజ్ఞప్తి చేసుకున్నారు. విపక్ష నేతల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోలేదని ఎన్నికల సంఘానికి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇదీ చదవండి: పార్టీల వైఖరిపై ప్రజలు చర్చ జరపాలి: సీఎం కేసీఆర్ -
చంద్రబాబు సెక్యూరిటీపై ఎప్పడికప్పుడు అప్రమత్తంగా ఉన్నాం
-
చంద్రబాబుకు జైల్లో పూర్తి భద్రత
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): చంద్రబాబుకు సెంట్రల్ జైల్లో పూర్తి భద్రత ఉందని, దీనిపై అవాస్తవ వార్తలను నమ్మొద్దని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్, ఎస్పీ జగదీష్ స్పష్టం చేశారు. చంద్రబాబు ఆరోగ్యం, ఆయనను చంపేస్తామంటూ మావోల పేరుతో వచ్చిన లేఖ, జైల్లో పెన్ కెమెరాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై సెంట్రల్ జైల్లో శుక్రవారం రాత్రి వారు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సెక్యూరిటీపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామని, 24 గంటలూ సెక్యూరిటీతో పాటు అడిషనల్ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్నామన్నారు. ఈ నెల 19న చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో ఆయనను బ్లూ జీన్ యాప్ ద్వారా న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టామని, అందులో చంద్రబాబు కొన్ని విషయాలను న్యాయమూర్తికి తెలిపారని, వాటిని లెటర్ రూపంలో తిరిగి ఆయన ఇస్తే దానిని తాము కోర్టుకు పంపామన్నారు. జైలు చుట్టూ ఐదు వాచ్‌టవర్స్ ఉన్నాయని, గంటకోసారి గార్డ్ సెర్చ్ జరుగుతోందని చెప్పారు. జైలు వాటర్ ట్యాంక్ వైపు డ్రోన్ తిరిగినట్టు నార్త్ ఈస్ట్ వాచ్‌టవర్ గార్డు నుంచి సమాచారం వచ్చిందని, అయితే ఆ డ్రోన్ క్లోజ్డ్ జైలు వైపు రాలేదని, దీనిపై సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, విచారణ జరుగుతోందన్నారు. మావోల పేరుతో వచ్చిన లేఖ నకిలీది.. చంద్రబాబును చంపేస్తామంటూ మావోల పేరుతో వచ్చిన లేఖ నకిలీదిగా గుర్తించినట్టు తెలిపారు. జైలు నుంచి చంద్రబాబు రాశారంటూ బయటకొచ్చిన లెటర్‌కు జైలు ముద్ర, సూపరింటెండెంట్ సంతకం లేదన్నారు. చంద్రబాబు ప్రింటెడ్ సంతకాన్ని తీసి దానిపై వేసి వైరల్ చేస్తున్నారని తెలిపారు. అలాగే జైల్లోకి వచ్చే ప్రతి ఖైదీని పూర్తిగా తనిఖీ చేశాకే లోపలికి అనుమతిస్తామన్నారు. శ్రీనివాస్ అనే ఖైదీ రిమాండ్‌కు వచ్చినప్పుడు అతని వద్ద ఒక బటన్ కెమెరా ఉన్నట్టు గుర్తించామన్నారు. జైలు లోపలికి అనుమతించే ముందు అతని దుస్తులు తనిఖీ చేస్తుంటే అది లభించిందని తెలిపారు. అందులో ఎలాంటి జైలు ఫుటేజీ లేదని, ఆ కెమెరాను స్వాదీనం చేసుకుని.. పోలీసులకు అప్పగించామని, ఆ కెమెరాను ఎందుకు తెచ్చారనే విషయంపై దర్యాప్తు జరుగుతోందన్నారు. చంద్రబాబు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు గంజాయి ప్యాకెట్లు జైల్లోకి విసిరారన్నది పూర్తి అవాస్తవమన్నారు. చంద్రబాబు కుడికంటి కేటరాక్ట్ ఆపరేషన్‌కు సంబంధించి రాజమండ్రి జీజీహెచ్ వైద్యులు పరీక్షలు చేశారని, కొంతకాలం తర్వాత అయినా ఆపరేషన్ చేయించుకోవచ్చని తెలిపారని వివరించారు. ఆయన ఆరోగ్యంపై తప్పుడు రిపోర్టులు విడుదల చేయడంలేదని, వాటిని ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిస్తున్నట్టు తెలిపారు. జైల్లో చంద్రబాబును తాము కలవాలన్నా ఏడుగురు అధికారులు కలిస్తేనే.. అది సాధ్యమన్నారు. చంద్రబాబు తనకున్న ఎలర్జీలపై గతంలో ప్రభుత్వ వైద్యులకు చెప్పారని, దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యులకు రెండు లెటర్లు కూడా రాశామన్నారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించి ఎలాంటి చికిత్స అవసరమో తెలపాలని ఆయన భార్య భువనేశ్వరికి, ఇదే విషయాన్ని కోర్టుకూ తెలియజేసినట్టు తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైలు బయట సైతం 24 గంటలూ డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో పకడ్బందీగా గస్తీ ఏర్పాటు చేసినట్టు రవికిరణ్, జగదీ‹Ù వివరించారు. -
భద్రతపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రత్యేక దృష్టి సారించాయి. విద్యుత్ భద్రతపై ఇప్పటికే అనేక సూచనలను ప్రజలకు ఇచ్చినప్పటికీ ఇంకా అక్కడక్కడా విద్యుత్ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సరైన భద్రతా ప్రమాణాలు పాటించని కారణంగా కొంతమంది విద్యుత్ సిబ్బందితోపాటు సామాన్యులు కూడా ప్రాణాలు కోల్పోవడం వల్ల వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు జరిగిన తరువాత సమీక్షించుకోవడం కాకుండా వాటిని అరికట్టేందుకు పటిష్ట చర్యల్ని అమలు చేయాలని డిస్కంలు నిర్ణయించాయి. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాయి. వినియోగదారులకు ప్రత్యేకంగా భద్రతా సూచనల్ని రూపొందించాయి. భవన నిర్మాణ కార్మికులు, కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల యజమానులు, రైతు కూలీలు, ట్రాన్స్పోర్ట్ వాహనాల డ్రైవర్లకు ప్రత్యేకంగా సూచనలను రూపొందించాయి. వీటిని అందరికీ తెలియజేసేందుకు ‘భద్రతా అవగాహనా రథం’ పేరుతో ప్రత్యేక ప్రచార వాహనాలను ప్రారంభిస్తున్నాయి. విద్యుత్ సిబ్బందికీ జాగ్రత్తలు లైన్ క్లియర్ (ఎల్సీ) సరిగ్గా లేకుండా ఏ లైన్ మీద పని చేయరాదు. సమీపంలో వేరే లైన్ ఉంటే దానికి కూడా ఎల్సీ తీసుకోవాలి. విద్యుత్ లైన్ల నిర్వహణ, బ్రేక్ డౌన్ ఆపరేషన్స్, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్ చేసే సమయంలో ఆపరేషన్స్, మెయింటెనెన్స్ సిబ్బంది తప్పనిసరిగా హెల్మెట్, రబ్బర్ గ్లవ్స్, గమ్ బూట్స్, సేఫ్టీ బెల్ట్స్ వంటి భద్రతా పరికరాలు వినియోగించాలి. అలాగే ఒక్కరే ఎప్పుడూ వెళ్లకూడదు. వేరొకరిని తోడు తీసుకువెళ్లాలి. పంట పొలాలకు అనధికార విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధం. అటువంటివి లేకుండా సిబ్బంది తరచూ తనిఖీలు చేపట్టాలి. సబ్ స్టేషన్ ఆవరణలో గొడుగు వేసుకుని వెళ్లకూడదు. కడ్డీలు, తీగలు వంటివి తగిన జాగ్రత్తలు లేకుండా తీసుకుపోకూడదు. కొత్త సర్విస్ ఇచ్చేటప్పుడు ఆ ఇల్లు విద్యుత్ లైన్ కింద ప్రమాదకరంగా ఉంటే ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ సెక్షన్ 48, క్లాజ్ 63 ఆఫ్ రెగ్యులేషన్స్ 2010 ప్రకారం సర్వీసును తిరస్కరించి లైన్ షిఫ్ట్ చేయాలి. భవన నిర్మాణ కార్మికులకు ఇవీ సూచనలు విద్యుత్ లైన్లు కింద ఎటువంటి నిర్మాణాలు చేయరాదు. విద్యుత్ స్తంభానికి సమీపంలో లేదా స్తంభానికి ఆనుకుని ఇల్లు, ఎలివేషన్, డూములు, మెట్లు నిర్మాణం చేయకూడదు. ఇనుప చువ్వలు, లోహ పరికరాలు విద్యుత్ లైన్లు కింద తప్పనిసరి పరిస్థితులలో ఎత్తినపుడు జాగ్రత్తగా చూసుకోవాలి. జేసీబీలు, క్రేన్లు ఉపయోగించేటప్పుడు, బోర్లు డ్రిల్ చేస్తున్నప్పుడు వాటి లోహపు తొట్టెలు, పైపులు విద్యుత్ లైన్లకు తగిలి ప్రాణాపాయం సంభవించవచ్చు. ధాన్యం, ప్రత్తి, గడ్డి, ఊక, కొబ్బరి చిప్పలు, కలప వంటి వాహనాలు అధిక లోడుతో విద్యుత్ లైన్లు కింద వెళ్లడం ప్రమాదకరం. సామాన్య ప్రజలకూ హెచ్చరికలు విద్యుత్ సిబ్బంది పర్యవేక్షణలో మాత్రమే లైన్ల కింద చెట్టు కొమ్మలు తొలగించాలి. తెగిపడి ఉన్న విద్యుత్ వైర్లను తాకకూడదు. ఇల్లు, షాపు మీటర్‌కి పోల్ నుంచి తీసుకొనే సర్విస్ వైరుకి ఎటువంటి అతుకులు లేకుండా చూసుకోవాలి. సర్వీస్ వైరుకి సపోర్ట్ వైరుగా రబ్బరు తొడుగు గల జీఐ తీగలను వాడాలి. ఇంటి ఆవరణలో ఎర్తింగ్ తప్పనిసరి. డాబాల మీద విద్యుత్ లైన్లకి దగ్గరగా బట్టలు ఆరవేయరాదు. తడి బట్టలతో, తడి చేతులతో విద్యుత్ పరికరాలను తాకకూడదు. వర్షం పడుతున్నప్పుడు విద్యుత్ స్తంభాన్ని,సపోర్ట్ వైర్లను ముట్టుకోకూడదు. అనధికారంగా విద్యుత్ స్తంభాలు ఎక్కడం, ఫ్యూజులు వేయడం చట్టవిరుద్ధమే కాదు ప్రాణాలకు ప్రమాదం. అధిక సామర్థ్యం గల ఫ్యూజు వైర్లను వాడరాదు. వాటివల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి గృహోపకరణాలు కాలిపోతాయి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు పక్కన, విద్యుత్ లైన్లు క్రింద తోపుడు బండ్లు, బడ్డీలు పెట్టడం ప్రమాదకరం. ప్రచార రథాన్ని అందుబాటులోకి తెచ్చాం ఏపీ ఈపీడీసీఎల్ ముందుగా ప్రచార రథాన్ని అందుబాటులోకి తీసుకొచి్చంది. భద్రత సూచనలకు సంబంధించిన ఆడియోలను తయారుచేసి సంస్థ పరిధిలోని అన్ని సెక్షన్ కార్యాలయాలకు ఇప్పటికే పంపించాం. ఇకనుంచి ప్రతినెలా 2వ తేదీన క్రమం తప్పకుండా విద్యుత్ భద్రతా అవగాహన కార్యక్రమాలను అన్ని జిల్లాల్లోని సెక్షన్ కార్యాలయాల్లో నిర్వహించాలని ఆదేశించాం. వినియోగదారులు అవసరమైతే టోల్ ఫ్రీ నంబరు 1912కు ఫోన్ చేసి సమస్యలను తెలియజేయవచ్చు. – ఐ.పృధ్వీతేజ్, సీఎండీ, ఏపీ ఈపీడీసీఎల్ -
‘అంతరిక్ష విత్తనాలు’ ఆదుకుంటాయా?
భూమ్మీద అధిక ఉష్ణం, కరువు పరిస్థితులను ఎదుర్కొని సజావుగా పంట దిగుబడులు పొందాలంటే అందుకు తగినంత జన్యు దృఢత్వం కలిగిన వైవిధ్య భరితమైన వంగడాలు అవసరం. కానీ గడ్డు పరిస్థితులను తట్టుకొనే జన్యు దృఢత్వం తేవడం ఎలా అన్నది ప్రశ్న? అయితే అంతరిక్షంలో వేగంగా ఉత్పరివర్తనాలకు గురైన విత్తనాలతో భూమ్మీద ప్రతికూలపరిస్థితులను తట్టుకొనే వంగడాల తయారీ సాధ్యమనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి ఇందులో నిజం ఎంత? ఈ నెల 4 నుంచి 10 వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల నేపథ్యంలో ఈ అంశంపై ప్రత్యేక కథనం. (సాక్షి, సాగుబడి డెస్క్) విత్తన జన్యువ్యవస్థను సంపూర్ణంగా ప్రభావితం చేసే స్పేస్ బ్రీడింగ్... జన్యుమార్పిడి/సవరణకన్నా మెరుగైన ఫలితాలను అందిస్తుందని కొందరు శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. 15 ఏళ్లుగా స్పేస్ బ్రీడింగ్ ద్వారా కొత్త వంగడాలు రూపొందిస్తూ బహుళ ప్రయోజనాలు పొందుతున్నట్లు చైనా చెబుతోంది. మరోవైపు తొలిసారిగా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ), ఐక్యరాజ్య సమితి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) సంయుక్తంగా స్పేస్ బ్రీడింగ్ ప్రాజెక్టుకు 2022 నవంబర్ 7న శ్రీకారం చుట్టాయి. ‘నాసా’కు చెందిన వాల్లప్స్ ఫ్లైట్ ఫెసిలిటీ రోదసీ నౌక ద్వారా భూమికి 175 మైళ్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తెల్లజొన్న విత్తనాలు, అరాబిడోప్సిస్ అనే ఆకుకూర విత్తనాలను అంతరిక్షంలోకి పంపాయి. కొన్ని విత్తనాలను అంతరిక్ష కేంద్రం లోపల భారరహిత స్థితిలో ఉంచగా మరికొన్నింటిని కేంద్రం బయట కాస్మిక్ రేడియేషన్‌కు గురిచేశాయి. ఆర్నెల్ల తర్వాత వాటిని 2022 ఏప్రిల్‌లో తిరిగి భూమిపైకి తీసుకొచ్చాయి. ఆ్రస్టియా రాజధాని వియన్నాలో ఏర్పాటైన ఐఏఈఏ, ఎఫ్ఏఓ ఉమ్మడి ప్రయోగశాలలోని పాలిహౌస్‌లో వాటిని ప్రయోగాత్మకంగా పెంచుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు కేరళకు చెందిన జన్యుశాస్త్ర నిపుణురాలు డా. శోభ శివశంకర్ సారథ్యం వహిస్తుండగా, మరో భారతీయ శాస్త్రవేత్త అనుపమ హింగనె ప్రయోగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అనేక సీజన్లపాటు సాగు చేసి వాటి జన్యుమార్పులను నిర్ధారించాక సరికొత్త వంగడాలను రైతులకు అందించనున్నాయి. చైనా పొలాల్లో 260 ‘అంతరిక్ష వంగడాలు’! అంతరిక్షంలోని రేడియేషన్‌లో కొన్నాళ్లు ఉంచి భూమిపైకి తెచి్చన విత్తనాల (స్పేస్ ఇండ్యూస్డ్ మ్యుటేషన్ బ్రీడింగ్ లేదా స్పేస్ బ్రీడింగ్)తో సరికొత్త వంగడాలను రూపొందిస్తూ చైనా కొన్ని దశాబ్దాలుగా ప్రయోజనం పొందుతోంది. చైనా వ్యవసాయ పరిశోధనా సంస్థ (సీఏఏఎస్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్, చైనా అణు వ్యవసాయ శా్రస్తాల సంస్థ అధ్యక్షుడు కూడా అయిన డా. లూక్సియాంగ్ లియు చెబుతున్న మాట ఇది. ‘ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్’ న్యూస్‌లెటర్ 2023 జనవరి సంచికలో స్పేస్ బ్రీడింగ్ ప్రయోజనాలను వివరిస్తూ ఆయన ఓ వ్యాసం రాశారు. వరి, గోధుమ, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, నువ్వు, క్యాప్సికం, టొమాటో తదితర పంటలకు చెందిన 260 వంగడాలను ఇప్పటివరకు విడుదల చేసినట్లు డా. లియు ఆ వ్యాసంలో వెల్లడించారు. 2011లో విడుదల చేసిన ‘లుయుయాన్ 502’ గోధుమ వంగడంతో 12% దిగుబడి పెరగడంతోపాటు కరువును, ప్రధాన తెగుళ్లను తట్టుకుంటోందని పేర్కొన్నారు. హెక్టారుకు 12.18 టన్నుల గోధుమ దిగుబడినిస్తున్నదని డా. లియు చెప్పారు. 2016 తర్వాత 21 గోధుమ, 15 వరి, 7 మొక్కజొన్న వంగడాలను అధికారికంగా విడుదల చేశామన్నారు. మెరుగైన వంగడాల అభివృద్ధికి అవసరమే! అంతరిక్షంలో ఉత్పరివర్తనాలు(మ్యుటేషన్లు) ఎక్కువ సంఖ్యలో వస్తాయి. కాస్మిక్ ఎనర్జీ వల్ల విత్తనాల్లోని డిఎన్ఎలో పెనుమార్పులు సంభవిస్తాయి. కాంబినేషన్లు మారిపోతాయి. కొత్త వేరియంట్స్ ఆవిష్కరణకు, విస్తృతమైన జీవ వైవిధ్యానికి ఇది అవసరం. 1960వ దశకంలో ఎక్స్‌రేస్, గామారేస్‌తో మ్యుటేషన్ బ్రీడింగ్‌పై విస్తృత పరిశోధనాలు జరిగాయి. వరిలో జగన్నాద్ రకం అలా వచ్చిందే. అయితే, ఆ మ్యుటేషన్ల ద్వారా మనుగడలోకి వచ్చిన వంగడాలు చాలా తక్కువ. స్పేస్ బ్రీడింగ్ వల్ల లక్షల్లో మ్యుటేషన్లు వస్తే వాటిని స్థిరీకరించిన తర్వాత కొన్నయినా ఉపయోగపడొచ్చు. మ్యుటెంట్ లైన్స్‌ను ఉపయోగించుకొని పలు వాతావరణ పరిస్థితులకు అనువైన వాటిని స్థిరీకరించిన తర్వాత మెరుగైన వంగడాలను తయారు చేసుకోవడానికి స్పేస్ బ్రీడింగ్ ఉపయోగపడుతుంది. – డా. రాఘవరెడ్డి, మాజీ కులపతి, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం. రైతుల సమస్యలు తీరతాయనుకోవటం భ్రమే! మొక్కలు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సహజంగానే మారుతూ ఉంటాయి. అంతరిక్షంలో గాలి, వత్తిడి ఉండదు. కాస్మిక్ కిరణాలు పడతాయి. అటువంటి అంతరిక్షంలోకి పంపిన విత్తనాల్లో వచ్చే పెను మార్పులు మంచివి కావొచ్చు, చెడువి కావొచ్చు. కొన్నిటిని మాత్రమే మనం గుర్తించగలం. గుర్తించలేని మార్పుల వల్ల ఎటువంటి పరిణామాలుంటాయో తెలియదు. మారిన దాని ప్రభావం వల్ల ఎలర్జీ రావచ్చు, ఇంకేదైనా సమస్య రావచ్చు. జన్యుమార్పిడి మాదిరిగానే మ్యూటేషన్ బ్రీడింగ్ వల్ల కూడా జీవ భద్రతకు ముప్పు ఉంటుంది. దీని వల్ల ఉపయోగం 0.0001% మాత్రమే. దానికి పెట్టే ఖర్చుకు, పొందే ప్రయోజనానికి పొంతన ఉండదు. ఈ హై టెక్నాలజీ ఫలితాలు అకడమిక్ పరిశోధనలకు పరిమితం. దీంతో రైతుల సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందనుకోవటం భ్రమ. 60 ఏళ్లుగా మ్యూటేషన్ బ్రీడింగ్ అనుభవాలు చెబుతున్నది ఇదే. భూమ్మీదే సుసంపన్నమైన పంటల జీవవైవిధ్యం ఉంది. ప్రకృతిసిద్ధమైన వాతావరణంలో రెగ్యులర్ సెలక్షన్ ద్వారా వంగడాల ఎంపికపై ఆధారపడటమే మేలు. అధిక ఉష్ణాన్ని తట్టుకునే టొమాటో మొక్క భూమ్మీద దొరుకుతుంది. చంద్రుడి మీద దొరకదు కదా! – డా. జీవీ రామాంజనేయులు, సుస్థిర వ్యవసాయ కేంద్రం, కృష్ణ సుధా అకాడమీ ఫర్ ఆగ్రోఎకాలజీ. -
లైక్ కొడితే రూ.50...కామెంట్ పెడితే రూ.100
కూర్చున్నచోటే రోజుకు రూ.వేల సంపాదన మీ సొంతం.. మీరు చేయాల్సిందల్లా మేం పంపే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను ఓపెన్ చేసి వాటిలోని వీడియోలు, ఫొటోలకు లైక్ కొట్టడమే.. అలా లైక్ కొట్టిన స్క్రీన్‌షాట్ మాకు పంపితే ఒక్కో అకౌంట్ స్క్రీన్‌షాట్‌కు రూ.100 చొప్పున మీ ఖాతాలో జమ చేస్తాం... మేం చెప్పిన యూట్యూబ్ వీడియోకు లైక్ కొడితే రూ.50... మేం చెప్పిన సినిమా రివ్యూకు ఐదు పాయింట్లు ఇస్తే.. మీ ఖాతాల్లో రూ.150 వేస్తాం.... ఏంటి ఇదంతా నిజం అనుకుంటున్నారా..? ఇదో సరికొత్త సైబర్ మోసం.. టెలిగ్రామ్ వేదికగా జరుగుతున్న ఈ తరహా మోసాలు ఇప్పుడు పెరిగాయని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. టాస్క్‌బేస్డ్ స్కాం అంటే.. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుకుతూనే ఉన్నారు. టెలిగ్రామ్ యూజర్లను టార్గెట్ చేసుకుని టాస్క్‌బేస్డ్ స్కాంలు చేస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. టెలిగ్రామ్ యూజర్లకు సైబర్ నేరగాళ్లు కొన్ని మెసేజ్‌లు పంపుతూ అందులో పేర్కొన్న టాస్క్పూర్తి చేస్తే డబ్బులు మీ ఖాతాలో వేస్తామని చెప్పే మోసాన్నే టాస్క్‌బేస్డ్ స్కాంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టాస్క్‌బేస్డ్ మోసాలు చూస్తే... ఈ ఖాతాలు ఫాలోకండి.. టెలిగ్రామ్ యూజర్లకు పంపే మెసేజ్‌లలో మేం పంపే లింక్ ఓపెన్ చేసి ఈ ఇన్స్టాగ్రామ్ ఖాతా లను ఫాలో అవుతూ, వాటిని ఓపెన్ చేసి స్క్రీన్‌షాట్ తీసి పంపితే డబ్బులు పంపుతామంటారు. రోజుకు 30 నుంచి 50 ఖాతాలు ఫాలో కావాలని చెబుతారు. యూ ట్యూబ్ వీడియోలకు లైక్‌లు..: సైబర్ మోసగాళ్లు పంపే మెసేజ్‌లలో కొన్ని యూట్యూబ్ వీడియోల లింక్‌లు పెడతారు. వాటిని ఓపెన్ చేసి ఆ వీడియోకు కాసేపు వాచ్ చేయడంతోపాటు లైక్ కొడితే మీ ఖాతాలో డబ్బులు వేస్తామని నమ్మబలుకుతారు. హోటళ్లు, రెస్టారెంట్లకు రేటింగ్ పేరిట..: ఫలానా హోటల్, లేదంటే ఒక ఏరియాలోని రెస్టారెంట్లో సదుపాయాలు చాలా బాగున్నాయని, ఫుడ్ ఐటమ్స్ బాగున్నాయని, ఆఫర్లు బాగున్నాయని..ఇలాంటి రివ్యూలు, రేటింగ్ ఇచ్చినందుకు డబ్బులు ఇస్తామని చెబుతుంటారు. సినిమా రివ్యూలకు రేటింగ్.. మేం పంపే లింక్ ఓపెన్ చేసి అందులోని వెబ్సైట్లో ఉన్న సినిమా రివ్యూలకు రేటింగ్ ఇవ్వాలని టాస్క్ ఇస్తారు..ఇలా ఒక్కో రివ్యూకు రేటింగ్ ఇస్తే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తామని టాస్క్ ఇస్తారు. మోసానికి తెరతీస్తారు ఇలా.. ముందుగా ఇచ్చిన టాస్క్పూర్తి చేసిన తర్వాత, మీ బ్యాంకు ఖాతాలోకి డబ్బులు జమ చేస్తామంటూ పేరు, వయస్సు, వృత్తి, వాట్సాప్ నంబర్, ఏ ప్రాంతంలో ఉంటారు..విద్యార్హతలు, బ్యాంకు ఖాతా నంబర్, బ్యాంకు పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఇలా పూర్తి వివరాలు సేకరిస్తారు. మొదట ఒకటి రెండు సార్లు మన బ్యాంకు ఖాతాలోకి చిన్నచిన్న మొత్తాలు జమ చేసి నమ్మకాన్ని పెంచుతారు. ఆ తర్వాత మన బ్యాంకు ఖాతాలోంచి ఆన్లైన్లో డబ్బులు కొల్లగొట్టే మోసానికి తెరతీస్తారు. మన పూర్తి వివరాలతోపాటు, మన ఫోన్, కంప్యూటర్ను వారి అ«దీనంలోకి తీసుకుని ఓటీపీలను సైతం తెలుసుకుని, మన బ్యాంకు ఖాతాలు లూటీ చేస్తారని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఇలాంటి మెసేజ్‌లు చూస్తే అనుమానించాల్సిందే.. ఆన్లైన్లో సైబర్ మోసాలు పెరుగుతున్నందున వీలైనంత వరకు అనుమానాస్పద మెసేజ్‌లలోని లింక్‌లపై ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. అడ్డగోలు లాభాలు ఇస్తామని ఊదరగొడుతున్నారంటే అది కచ్చితంగా సైబర్ మోసమని గ్రహించాలి. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు అడుగుతున్నట్టు గమనిస్తే జాగ్రత్తపడాలి. అపరిచిత వ్యక్తులు ఆన్లైన్లో మనకు పంపే మెసేజ్‌లను నమ్మవద్దు. -
ప్రధాని మోదీ భద్రతా వలయంలో కలకలం
లక్నో: వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా వలయంలో కలకలం రేగింది. ఉద్యోగం కావాలంటూ ఓ యువకుడు ప్రధాని మోదీ కాన్వాయ్ ముందు దూకాడు. ప్రధాని మోదీ కాన్వాయ్ లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయానికి వెళ్తుండగా రుద్రాక్ష సెంటర్ వెలుపల ఈ ఘటన జరిగింది. The man has been identified as a #BJP worker and has been held. He was just 10 feet away from the #PMModi's car after he jumped. Police and security officials immediately caught him. @AbshkMishra https://t.co/wvrQvG1N2V — IndiaToday (@IndiaToday) September 23, 2023 ప్రధాని నరేంద్ర మోదీ నిన్న వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి భూమిపూజ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం పూర్తి చేసుకుని తిరుగుప్రయాణంలో ఓ యువకుడు ప్రధాని మోదీ కాన్వాయ్ భద్రతా వలయాన్ని చీల్చుకుని లోపలికి వెళ్లాడు. ఉద్యోగం కావాలంటూ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టాడు. గుర్తించిన పోలీసులు.. అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని మోదీకి కేవలం 20 మీటర్ల దూరంలోనే ఉన్నాడని పోలీసులు చెప్పారు. నిందితున్ని ఘాజీపూర్‌కు చెందిన కృష్ణ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మానసికంగా ఇబ్బందుల్లో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. అయితే.. ప్రధాని మోదీ భూమి పూజ చేసిన క్రికెట్ స్టేడియా 2025 డిసెంబర్ నాటికి పూర్తికానుంది. యూపీలో కాన్సూర్, లక్నో తర్వాత వారణాసిలో నిర్మించేదానితో మూడో క్రికెట్ స్టేడియం కానుంది. ఇదీ చదవండి: అధికారంలోకి వస్తే బిల్లును సవరిస్తాం: ఖర్గే -
Babu In Jail: తొలి రోజు గడిచిందిలా..
సాక్షి, అమరావతి, సాక్షి, రాజమహేంద్రవరం: పొద్దున్నే యోగా.. కాసేపు పత్రికల పఠనం... ప్రత్యేకంగా తెప్పించిన ఆహారం... రెండు సార్లు వైద్య పరీక్షలు.. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయి భద్రత నడుమ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా తొలిరోజు గడిపారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టై రిమాండ్ ఖైదీ 7691గా ఉన్న ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా, పూర్తి భద్రతతో కూడిన ప్రత్యేక గదిలో ఉంటున్నారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేచారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ప్రత్యేకంగా సహాయకుడు.. వంటకు ప్యాంట్రీ కార్ న్యాయస్థానం ఆదేశాలతో జైలు అధికారులు చంద్రబాబుకు స్నేహ బ్యారక్‌లో ప్రత్యేక గదిని ఆదివారం రాత్రే కేటాయించారు. అందులో వెస్ట్రన్ మోడల్ టాయిలెట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు ప్రత్యేకంగా ఓ సహాయకుడిని అందుబాటులో ఉంచారు. చంద్రబాబు జిల్లాల పర్యటనల్లో ఆయన కాన్వాయ్‌లో ఉండే ప్రత్యేక ప్యాంట్రీ కార్‌ను జైలుకు సమీపంలో ఉంచారు. నారా లోకేష్ రాజమహేంద్రవరంలోనే ఓ టీడీపీ నేత ఇంటి వద్ద మకాం వేసి చంద్రబాబుకు అవసరమైనవన్నీ సమకూరుస్తున్నారు. ఉదయం అల్పాహారంగా ఫ్రూట్ సలాడ్‌తో పాటు వేడినీళ్లు, బ్లాక్ కాఫీని పంపారు. మధ్యాహ్న భోజనంలో 100 గ్రాముల బ్రౌన్ రైస్, బెండకాయ వేపుడు, పన్నీర్ కూర, పెరుగు పంపించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో టీ తాగేందుకు వేడినీళ్లు అందజేసినట్లు తెలిసింది. ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం, మధ్యాహ్న భోజనం అనంతరం చంద్రబాబుకు రెండు సార్లు వైద్య పరీక్షలు చేశారు. ఆయన ఉంటున్న స్నేహ బ్యారక్‌కు ఎదురుగానే జైలుకు సంబంధించిన ఆస్పత్రి ఉండటంతో అక్కడ వైద్య పరీక్షలు చేపట్టారు. రాత్రి కూడా ప్యాంట్రీ కార్ నుంచే పుల్కాలు, పెరుగు తెప్పించి ఆహారాన్ని అందించారు. నిరంతరం 1 + 4 భద్రత జైలు అధికారులు చంద్రబాబు భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయన ఉన్న జైలు గది వద్ద 24 గంటలపాటు విధులు నిర్వహించేలా 1 + 4 భద్రతను వినియోగించారు. జైలు లోపల, చుట్టుపక్కల పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు కల్పించారు. కట్టుదిట్టమైన భద్రతతోపాటు జైలులో ఉన్న సీసీ కెమెరాల ద్వారా భద్రతను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో పూర్తిస్థాయి భద్రత నడుమ ఉన్నారు. తొలిరోజు ములాఖత్‌లు లేవు సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును తొలిరోజు ఎవరూ కలవలేదు. జైలు నిబంధనల ప్రకారం వారానికి రెండు ములాఖత్‌లను అనుమతిస్తారు. సోమవారం ములాఖత్ కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, కుమారుడు లోకేష్ మంగళవారం ఆయన్ను ములాఖత్‌లో కలిసేందుకు జైలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. -
చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషాన్ పై ముగిసిన వాదనలు
-
విజయభేరికి భద్రత కల్పించండి
సాక్షి, హైదరాబాద్: ఈనెల 17న తుక్కుగూడలో నిర్వహించనున్న ‘విజయభేరి’ సభకు భద్రత కల్పించాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు డీజీపీ అంజనీకుమార్‌ను కోరారు. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్ర వారం డీజీపీ కార్యాలయంలో అంజనీకుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సభకు ఏఐ సీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తదితర కాంగ్రెస్ అతిరథ మహా రథులు, లక్షలాది మంది ప్రజలు హాజరవుతున్న నేపథ్యంలో తగిన భద్రత కల్పించాలని ఈ వినతి పత్రంలో పేర్కొన్నారు. డీజీపీని కలిసిన వారిలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు, కాంగ్రెస్ నేతలు అంజన్‌కుమార్ యాదవ్, బలరాం నాయక్, మల్లు రవి తదితరులున్నారు. రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జీతాలు రాక ఆత్మహత్య చేసుకున్న రవీందర్ ఘటన గురించి డీజీపీ అంజనీకుమార్‌తో మాట్లాడామని, ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్య కాబట్టి సీఎం కేసీఆర్‌పై హత్యానేరం నమోదు చేయాలని కోరినట్టు చెప్పారు. ఈనెల 16,17 తేదీల్లో తాజ్‌కృష్ణ హోటల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు జరుగుతాయని, 17న విజయభేరి సభ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాలకు భద్రత కల్పించాలని, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడాలని డీజీపీని కోరినట్టు చెప్పారు. తన హయాంలోనే పార్టీకి ప్రాధాన్యత తాను పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రాధాన్యత పెరిగిందని రేవంత్‌రెడ్డి చెప్పారు. అధిష్టానంతో కొట్లాడి రాష్ట్ర నాయకులకు పదవులు తెస్తున్నానని, గతంలో ఎన్నడూ జరగని కార్య క్రమాలు ఈ రెండేళ్లలో జరిగాయన్నారు. శుక్ర వారం గాంధీభవన్‌లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోతే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికలు జరిగే ఇతర రాష్ట్రాల్లో సీడబ్ల్యూసీ సమావేశాలు పెట్టకుండా ఇక్కడ పెడుతున్నారంటేనే తెలంగాణకు కాంగ్రెస్ ఎంతటి ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. రవీందర్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: సీఎం కేసీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ రెండునెలలుగా జీతాలు లేక హోంగార్డు రవీందర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అది ముమ్మాటి కీ ప్రభుత్వం చేసిన హత్యేనని టీపీసీసీ అధ్యక్షు డు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు రేవంత్ శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. కనీసం రవీందర్ ఆత్మహత్యపై ఒక్క మంత్రి, ఒక్క అధికారి కూడా స్పందించకపో వడం దారుణమని, తెలంగాణ ప్రభుత్వ నిర్వా కం కారణంగానే హోంగార్డులు మనోవేదనను అనుభ విస్తున్నారని తెలిపారు. వారి ఉద్యోగా లను క్రమబద్ధీకరిస్తామని 2017లో అసెంబ్లీ సాక్షిగా సీఎం ఇచ్చిన హామీకే ఇప్పటివరకు దిక్కు లేకుండా పోయిందని విమర్శించారు. వెంటనే హోంగార్డుల సర్వీసులను రెగ్యులరైజ్ చేయా లని, ఆత్మహత్యకు పాల్పడిన రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవా లని, రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని కేసీఆర్‌కు రాసిన లేఖలో రేవంత్‌రెడ్డి కోరారు. -
అందరి చూపు బైడెన్ వైపే..ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారు
-
కాంగ్రెస్ కార్యకర్తలే నాకు సెక్యూరిటీ: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రజల కోసం పనిచేసే అధికారులపై తనకెప్పుడూ గౌరవం ఉంటుందని, అయితే ప్రభుత్వ అధికారులుగా ఉంటూ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తారని అంటున్న వాళ్ల విషయంలో సైలెంట్ గా ఎలా ఉంటామని కాంగ్రెస్ ఎంపీ, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అసలు అధికారులకు రాజకీయాలతో ఏం సంబంధమని నిలదీస్తున్నారాయన. శుక్రవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన.. కోర్టు చెప్పినా బీఆర్ఎస్ ప్రభుత్వం తనకు సెక్యూరిటీ ఇవ్వడం లేదన్నారు. ఎంపీగా ఉన్నాను, జాతీయపార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నాకు సెక్యూరిటీ తొలగిస్తారా?. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కి కావాల్సినంత సెక్యూరిటీ ఇచ్చాం. అయినా నేను ప్రజల మనిషిని నాకు సెక్యూరిటితో పనిలేదు. నేను సెక్యూరిటీ లేకుండ ఎక్కడికైనా వస్తాను. సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు కేసీఆర్ రాగలరా? అని ప్రశ్నించారు. తనని ఓడించడానికే కేసీఆర్ పోలీసులను వాడుకుంటున్నారని ఆరోపించిన రేవంత్‌రెడ్డి.. సెక్యూరిటీ విషయంలో భయపెట్టాలని చూస్తే భయపడేవాడ్ని కాదన్నారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు తన సైన్యమని, వాళ్లే తన సెక్యూరిటీ అని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ అలా చెప్పగలదా? కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ మైనార్టీ అనే తేడా ఉండదు. కాంగ్రెస్ పార్టీలో మైనార్టీలు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ మైనార్టీల కోసం ఏం చేయలేదు. డబుల్ బెడ్ రూం ఇండ్లలో ఒక్క పర్సెంట్ మైనార్టీలకు కూడా దక్కలేదు. ఇక్కడ కారు బయల్దేరి ఢిల్లీకి చేరే వరకు అది కమలంగా మారిపోతోంది. బీఆర్ఎస్ కి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే. కేసీఆర్ మైనార్టీ ఓట్లను బీజేపీకి అమ్ముకుంటున్నారు. మైనార్టీలందరూ కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. బీజేపీ తెచ్చిన ప్రతి ప్రజా వ్యతిరేక బిల్లుకి కేసీఆర్ మద్దతు ఇచ్చారు. బీజేపీ బీఆర్ఎస్ వేర్వేరు కాదు. బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పడానికి ఎక్కడికైనా వస్తాం. బీజేపీ కి వ్యతిరేకంగా పోరాడుతున్నామని గుడి, మసీదు, చర్చి ఎక్కడికైనా వచ్చి చెప్తాం. బీఆర్ఎస్ వాళ్ళు అలా చెప్పగలరా? అలాంటి వాళ్లనే అనేది.. అన్ని డిపార్ట్మెంట్లలో కొందరు అధికారులు ప్రభుత్వ తాబేదార్లుగా ఉంటారు. ప్రభుత్వానికి తొత్తులుగా పని చేసే అధికారుల పేర్లను తప్పకుండా రెడ్ బుక్ లో రాస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం కోసం కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టే వాళ్ళని వదిలిపెట్టం. ప్రభాకర్ రావు, రాధ కిషన్ రావు, భుజంగ రావు, నర్సింగ్ రావు లాంటి అధికారులనే నేను అనేది. రియల్ బూమ్ నాటకం పది సంవత్సరాల్లో చేయనిది రెండు నెలల్లో ఎలా చేస్తారు? అని బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ మండిపడ్డారు. ఒక్క ఎకరానికి వంద కోట్లు పెట్టగలిగేలా బీఆర్ఎస్ నేతలు ఎదిగారు. పేద ప్రజలు మాత్రం పేదలుగానే ఉంటున్నారు. కోకాపేట, బుద్వేల్ లో భూములు కొన్న సంస్థల పేర్లు ఎందుకు చెప్పడం లేదు. కోకాపేట, బుద్వెల్ లో భూములు కొన్నది బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ బీనామీలే. ఆర్టిఫీషియల్ బూమ్ క్రియేట్ చేసెందుకు బీఆర్ఎస్ నాయకులు అద్భుతమైన నాటకం ఆడారు అని విమర్శలు గుప్పించారు రేవంత్. నేనైనా అప్లై చేసుకోవాల్సిందే! ఎన్నికల సమయం వచ్చినప్పుడు పొత్తుల గూర్చి ఏఐసీసీ చూసుకుంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాల్సిందే. అది నేనైనా సరే అప్లై చేసుకోవాల్సిందే. ఒకరు ఒకటి కన్నా ఎక్కువ అఫ్లికేషన్లు పెట్టుకోవచ్చు అని రేవంత్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: రాయదుర్గం మెట్రో భూమి తాకట్టు -
సీసీటీవీ కెమెరాలతో మెరుగైన భద్రత
సాక్షి, అమరావతి : నేరాల నియంత్రణ, మెరుగైన భద్రతకు సీసీటీవీ కెమెరాలు అత్యావశ్యకమని దేశంలోని పట్టణ ప్రాంత ప్రజలు గాఢంగా విశ్వసిస్తున్నారు. అందుకే దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల ప్రజలు తమ నివాస ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు మొగ్గుచూపుతున్నారు. కాలనీలు, అపార్ట్మెంట్లు, ఇతర నివాస ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవడం ఐదేళ్లుగా భారీగా పెరుగుతోందని ఫోర్బ్స్ సంస్థ ‘పోలీసింగ్ ఇన్ ఇండియా–2023’ నివేదిక వెల్లడించింది. ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం విస్తతితో భద్రత, వ్యక్తిగత ప్రైవసీ అనే రెండింటిలో ఎటువైపు మొగ్గుచూపాలి అనే అంశంపై ఐదేళ్ల క్రితం వరకు దేశ ప్రజల్లో ఓ సందిగ్థత ఉండేదని ఆ నివేదిక పేర్కొంది. కాలనీలు, నివాస ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడం తమ వ్యక్తిగత గోప్యతకు భంగకరమని భావించేవారు. బహిరంగ ప్రదేశాల్లో పోలీసు, మున్సిపల్ శాఖలు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నారు. కాబట్టి తమ నివాస ప్రాంతాల్లో ఇవి వద్దనే భావన ఉండేది. కానీ, నగర, పట్టణ ప్రాంత ప్రజల్లో ఆలోచనా దృక్పథం ఐదేళ్లలో మారిందని ఆ నివేదిక వెల్లడించింది. ప్రజలు తమ నివాసాలకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసుకుంటున్నారని తెలిపింది. నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ.. దేశంలో నగరాలు, ప్రధాన పట్టణ ప్రాంతాల్లో 51 శాతం మంది ప్రజలు తమ నివాస ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసుకున్నారు. నగరాల్లో 61 శాతం, ప్రధాన పట్టణాల్లో 46 శాతం ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి. నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని కాలనీల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో కర్ణాటక మొదటిస్థానంలో ఉండగా రెండు, మూడు స్థానాల్లో హరియాణా, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. కర్ణాటకలో 68శాతం, హరియాణాలో 67శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 33శాతం ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేసుకున్నారు. ప్రభుత్వం అత్యధికంగా ఈ కెమెరాలు ఏర్పాటుచేసిన వాటిలో ఢిల్లీ మొదటిస్థానంలో ఉంది. ఇక్కడ 54 శాతం ప్రాంతాల్లో ప్రభుత్వమే వీటిని ఏర్పాటుచేసింది. అలాగే, అత్యధిక ఆదాయ వర్గాల ప్రాంతాల్లో 73 శాతం, ఎగువ మధ్యతరగతి వర్గాల ప్రాంతాల్లో 63 శాతం, మధ్య తరగతి వర్గాలుండే చోట 45 శాతం, అంతకంటే తక్కువ ఆదాయ వర్గాల ప్రాంతాల్లో 28శాతం వరకు ఈ కెమెరాలు ఉన్నాయి. సీసీటీవీ కెమెరాలతో ‘ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ (ఎఫ్‌ఆర్‌టీ) పోలీసులకు అందుబాటులోకి వస్తోంది. దాంతో నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు మరింత సమర్థంగా నిర్వర్తించేందుకు ఆ శాఖకు ఇది ఉపయోగపడుతోంది. ఈ కెమెరాలు లేని ప్రాంతాల్లో కంటే ఉన్న ప్రాంతాల్లో నేరాలు 30 శాతం తగ్గినట్లు.. కేసుల ఛేదన 28 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. -
టీ తోట నుంచి చైతన్యం
పోష్ (ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ సెక్సువల్ హెరాస్మెంట్) యాక్ట్ 2013 ప్రకారం వ్యవస్థీకృతమైన రంగాల్లో మహిళల పట్ల లైంగిక వేధింపులను నివారించడానికి ఇంటర్నల్ సెల్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. కానీ అసంఘటిత రంగాల్లో పని చేసే మహిళలకు ఇలాంటి ఒక చట్టం ఉందనే సంగతి కూడా తెలియదు. ఇలాంటి స్థితిలో అస్సాంలోని టీ తోటల్లో పని చేసే మహిళలు సంఘటితమై తమ హక్కును కాపాడుకోవడానికి ఉద్యమించారు. ఒకరికొకరు అండగా మనదేశంలో వ్యవసాయరంగం తర్వాత మహిళలు అతిపెద్ద సంఖ్యలో పని చేస్తున్నది టీ తోటల్లోనే. ఈ తోటల్లో పని చేసే కార్మికుల్లో ఎనభైశాతం మహిళలే. అస్సాం, వెస్ట్‌బెంగాల్, కేరళ, తమిళనాడులన్నీ కలిపి దేశంలో 350కి పైగా టీ తోటలున్నాయి. దాదాపుగా ఒక్కో తోటలో వెయ్యికి పైగా మహిళలు పనిచేస్తుంటారు. దేశవ్యాప్తంగా మూడు లక్షల అరవైవేలకు పైగా మహిళలు టీ తోటల్లో పని చేస్తున్నారు. ఈ మహిళల పరిస్థితి ఒకప్పుడు అత్యంత దయనీయంగా ఉండేది. వాళ్ల మాటకు ఇంట్లో విలువ ఉండేది కాదు, పని చేసే చోట లైంగిక వేధింపులు, వివక్ష తప్పేది కాదు. ఒకరి కష్టాన్ని మరొకరికి చెప్పుకుని ఓదార్పు పొందడమే తప్ప, ఆ కష్టాల నుంచి బయటపడవచ్చని తెలియని రోజులవి. ఒకసారి తెలిసిన తరవాత ఇక వాళ్లు ఆలస్యం చేయలేదు. ఉమెన్స్ సేఫ్టీ యాక్సెలరేటర్ ఫండ్ (డబ్లు్యఎస్ఏఎఫ్) స్వచ్ఛంద సంస్థ అండతో ముందుకురికారు. అస్సాం నుంచి కేరళ వరకు తమకు భద్రత కల్పించడానికి పోష్ అనే చట్టం ఉందని తెలిసిన తర్వాత ఆ చట్టం ద్వారా ఎన్ని రకాలుగా రక్షణకవచంగా ఉపయోగించుకోవచ్చనే వివరాలు కూడా తెలుసుకున్నారు. ‘సమాజ్’ పేరుతో వాళ్లలో వాళ్లు కమిటీలుగా ఏర్పడ్డారు. బృందంగా వెళ్లి ప్రభుత్వ అధికారులను కలుస్తూ... ప్రతి తోటలో ఇంటర్నల్ సెల్ ఏర్పాటయ్యే వరకు తమ ఉద్యమాన్ని ఆపలేదు. లైంగిక వేధింపులకు గురయినప్పుడు ఎలా ప్రతిఘటించాలో, ఎలాంటి ఆధారాలతో ఇంటర్నల్ సెల్‌కు ఎలా తెలియచేయాలో కళ్లకు కడుతూ చిన్నచిన్న నాటికలు ప్రదర్శించారు. అస్సాం, బెంగాల్ నుంచి కొంతమంది చురుకైన మహిళలు కేరళ, తమిళనాడులకు వచ్చి ఇక్కడి వారిని చైతన్యవంతం చేసే పని మొదలుపెట్టారు. ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఒక్క ఫోన్ కాల్ చాలు! పోష్ చట్టం ప్రకారం సెక్సువల్ హెరాస్మెంట్ రిడ్రసల్ కమిటీలు భవన నిర్మాణ రంగంలో కూడా ఉండాలి. అయితే టీ తోటల్లో మహిళల్లాగ భవన నిర్మాణంలో పని చేసే మహిళలు సంఘటితం అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఎక్కువ కాలం ఒకే చోట నివసిస్తున్న వాళ్లు మాత్రమే వేధింపులకు గురవుతున్న విషయాన్ని ఒకరితో ఒకరు పంచుకోగలుగుతారు. వాళ్లలో వాళ్లు మాట్లాడుకుని కలిసికట్టుగా పోరాటానికి సిద్ధమవుతారు. టీ తోటల్లో పని చేసే వాళ్లు సుదీర్ఘకాలం ఒకే చోట నివసిస్తూ, అదే తోటల్లో కలిసి పనిచేస్తూ ఉంటారు. భవన నిర్మాణ కార్మికులు అలా కాదు. ఒక భవనం పూర్తి కాగానే మరోభవనం కోసం వెళ్లిపోతుంటారు. తమ సమస్యకు పరిష్కారం కోసం సంఘటితం కాగలిగినంత సమయం కూడా ఒకేచోట ఉండరు. కాబట్టి పని చేసే ప్రదేశంలో కంప్లయింట్ ఇవ్వాల్సిన వివరాలతోపాటు ఫోన్ నంబరు రాయడమే వారిలో చైతన్యాన్ని కలిగిస్తుంది. అలాగే రైతుబజార్లు, కూరగాయల మార్కెట్లలో కూడా మహిళలు ఎక్కువగా ఉంటారు. అధికారులు సమావేశం ఏర్పాటు చేసి లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు కంప్లయింట్ ఇవ్వవచ్చని తెలియచేయాలి. కంప్లయింట్ విభాగానికి చెందిన ఫోన్ నంబర్‌ను ఆ మార్కెట్లో కూరగాయల ధరల పట్టిక కనిపించినట్లు బాగా కనిపించేటట్లు రాయాలని సూచించారు మహిళల హక్కుల యాక్టివిస్టు కొండవీటి సత్యవతి. ఒక నోడల్ పాయింట్ లైంగిక వివక్ష, వేధింపు, హింస, బాల్య వివాహాలు, అక్రమ రవాణా, ప్రసవ సమయంలో మరణాలు దేశంలో అస్సాం మొదటిస్థానంలో ఉంటుంది. అస్సాం, బెంగాల్లో మహిళల కోసం ప్రాతినిధ్యం వహించేవాళ్లు లేరు. టీ ఎస్టేట్లలో పనిచేసే బాలికలు, మహిళల భద్రత, హింస నిరోధం కోసం ఏర్పడిన కన్షార్షియం డబ్లు్యఎస్ఏఎఫ్... మహిళలను చైతన్యవంతం చేయడంతోపాటు లీగల్ సర్వీసెస్ అథారిటీ, హెల్త్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు, పోలీస్, గ్రామీణ ఉపాధి కార్యక్రమాలన్నింటినీ ఒక గొడుగు కిందకు తీసుకువచ్చింది. ఆ ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది. అస్సాం టీ తోటల్లో పని చేసే మహిళలు దేశానికి దిక్సూచి అయ్యారు. – వాకా మంజులారెడ్డి చట్టం... కమిటీలే కాదు... ప్రభుత్వం ఇంకా చేయాలి! వ్యవస్థీకృత రంగంలో పనిచేసే మహిళల కోసం ఇంటర్నల్ కమిటీలున్నట్లే అసంఘటితరంగంలో కూడా కమిటీలుండాలి. ఇళ్లలో పని చేయడం, వీధుల్లో తిరుగుతూ కూరగాయలు, పండ్లు అమ్ముకోవడం వంటి ఇతర పనుల్లో ఉండే మహిళల కోసం లోకల్ కంప్లయింట్స్ కమిటీలుండాలి. కమిటీలు వేయడంతో సమస్య పరిష్కారం కాదు. ఇలాంటి కమిటీలున్నాయనే విషయం మహిళలకు తెలియాలి. లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు ఆయా కమిటీలకు కంప్లయింట్ ఎలా ఇవ్వాలో తెలియచేయాలి. ఫోన్ నంబర్ లేదా హెల్ప్‌లైన్ నంబర్లను పని ప్రదేశంలోనూ ఇతర కమ్యూనిటీ సెంటర్లలోనూ బాగా కనిపించేటట్లు బోర్డు మీద రాయాలి. అందుకు ప్రభుత్వమే పూనుకోవాలి. చట్టం చేసి తన బాధ్యత అయిపోయిందనుకుంటే సరిపోదు. చట్టాన్ని అమలు చేయడం, అమలయ్యే పరిస్థితులు కల్పించడం, చట్టం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, తమ హక్కుల ఉల్లంఘన కలిగినప్పుడు గళమెత్తగలిగేటట్లు భరోసా కల్పించడం కూడా ప్రభుత్వం నిర్వర్తించాల్సిన బాధ్యతలే. – కొండవీటి సత్యవతి,భూమిక ఉమెన్స్ కలెక్టివ్, మెంబర్, లోకల్ కంప్లయింట్ కమిటీ, రంగారెడ్డి జిల్లా -
సూపర్ పవర్‌గా భారత్!
ఇటీవలి కాలంలో భారతదేశానికి చైనా ప్రధాన భద్రతా ముప్పుగా పరిణమించింది. చైనా.. పాకిస్తాన్‌తో జతకట్టి, భారత్‌కు ఆందోళనకరంగా మారింది. చైనా తన సరిహద్దుల్లో భారత్‌తో తలపడుతున్న ఘర్షణల ఫలితంగా ఈ రెండు దేశాలు ప్రత్యర్థులుగా మారాయి. అయితే యునైటెడ్ స్టేట్స్- భారత్ మధ్య వ్యూహాత్మక ప్రయోజనాల కలయిక భారత్‌కు మరింత శక్తిని అందించనుంది. ఇటీవల భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు ముందు అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాట్లాడుతూ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను నియంత అని అభివర్ణించారు. సైనిక, సాంకేతిక, ఆర్థిక రంగంలో యూఎస్ భాగస్వామ్యం ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో అటు బైడెన్ లేదా ఇటు మోదీ తమ భాగస్వామ్యం ప్రధానంగా చైనా సవాళ్లను ఎదుర్కోవడం గురించేనని ఎక్కడా బహిరంగంగా చెప్పలేదు. కానీ ఈ భాగస్వామ్యం ఇందుకేనని నిపుణులు అంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన భారత్.. అగ్రరాజ్యం అమెరికా తమ సంబంధాలను బలపరు కోవడం చూస్తుంటే ఇది భారత్‌కు చైనాను ఎదుర్కొనేందుకు కలసివచ్చే అంశంలా కనిపిస్తున్నదని నిపుణులు చెబుతున్నారు. ఆమధ్య భారత జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ పర్యటన చైనా గురించి కాదని, అయితే సైనిక, సాంకేతిక, ఆర్థిక రంగంలో చైనా పాత్రకు గురించిన ప్రస్తావన ఎజెండాలో ఉన్నదన్నారు. భారత్- అమెరికా మధ్య కుదిరిన ప్రధాన ఒప్పందాలలో భారతదేశంలో జనరల్ ఎలక్ట్రిక్ ఫైటర్-జెట్ ఇంజిన్ల తయారీ, జనరల్ అటామిక్స్ సాయుధ డ్రోన్ల కొనుగోలు ప్రముఖంగా ఉన్నాయి. వీటి సాయంతో భారత్ చైనా సైన్యం ఎత్తుగడలను గుర్తించి, వాటిని సమర్థవంతంగా ఎదుర్కోనుంది. ఇది కూడా చదవండి: ‘నా కల సాకారమైన వేళ..’ అరబిందో స్ఫూర్తిదాయక సందేశం! రాబోయే 30 ఏళ్లలో.. భారత్- అమెరికాల బిలియన్-డాలర్ల జీఈ డీల్‌లో అత్యాధునిక జెట్ ఇంజన్ టెక్నాలజీ ఒకటి. ఈ భాగస్వామ్యం రాబోయే సంవత్సరాల్లో ఇరు దేశాల రక్షణ పరిశ్రమల సామర్థ్యాన్ని మరింత పెంపొందించనుంది. యుఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పీస్ సీనియర్ నిపుణుడు సమీర్ లాల్వానీ మాట్లాడుతూ ‘ఇది ప్రతిష్టాత్మక సున్నితమైన సాంకేతికత అని, దాదాపు రెండు దశాబ్దాలుగా భారత్ డిమాండ్ చేస్తోందని అన్నారు. ఇది భవిష్యత్తులో అనేక తరాల జెట్ ఇంజిన్ల తయారీకి దారి తీస్తుందన్నారు. రాబోయే 30 సంవత్సరాలలో భారతదేశ రక్షణ రంగం, ఆవిష్కరణ అభివృద్ధిలో ఈ భాగస్వామ్యం కీలకం కానున్నదని పేర్కొన్నారు. టెక్ స్టార్టప్‌లు పుష్ చేసే దిశగా భారత్ కొన్ని దశాబ్దాలుగా సైనిక ఆధునికీకరణలో నిమగ్నమై ఉన్న చైనాతో పోటీ పడాలంటే, భారత్‌లోని టెక్ స్టార్టప్‌లను ఎలా పుష్ చేయాలో, తద్వారా సైనిక స్థాయిలో ఎలా సాంకేతికతలను రూపొందించాలనే దానిని మోదీ ప్రభుత్వం గుర్తించిందని యుఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పీస్ ఒక కథనంలో పేర్కొంది. సాంకేతికత, రక్షణ సహకారానికి ఉన్న అడ్డంకులను తొలగించడమనేది ప్రధాని మోదీ పర్యటనలో చోటుచేసుకున్న ప్రధాన అంశమని ఆ కథనంలో పేర్కొన్నారు. వివరాలు వెల్లడించిన వాషింగ్టన్ పోస్ట్ కరోనావైరస్ మహమ్మారి సమయంలో సుమారు మూడు సంవత్సరాలు ప్రపంచం నుండి తనను తాను వేరుచేసుకున్న చైనా తిరిగి ఇప్పుడు తన పరిస్థితులను చక్కదిద్దుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాగా 2014 నుండి 2018 వరకు మోదీకి ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్న అరవింద్ సుబ్రమణియన్ మీడియాతో మాట్లాడుతూ సైనిక పరికరాల కోసం రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించే దీర్ఘకాల ప్రయత్నంలో భాగంగానే భారత్.. అమెరికాతో జీఈ ఒప్పందం చేసుకున్నదన్నారు. ప్రస్తుతం బ్రౌన్ యూనివర్శిటీలో సీనియర్ ఫెలోగా ఉన్న సుబ్రమణ్యం చేసిన వ్యాఖ్యలను ది వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. అమెరికాతో కుదిరిన చిప్ ప్లాంట్, డిఫెన్స్ ఒప్పందాలు రక్షణ రంగంలో తయారీలను పునరుద్ధరించే లక్ష్యాన్ని పూర్తి చేయనున్నాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కొన్నేళ్ల క్రితమే రాయితీలను కల్పించే భారీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మహమ్మారి సమయంలో పెట్టుబడిదారులకు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ కనిపించిందని విశ్లేషకులు అంటున్నారు. హిమాలయ సరిహద్దుల్లో ఘర్షణలు అమెరికా పరిపాలన అధికారులు భారతదేశం తమకు ప్రధాన ఆర్థిక, సైనిక భాగస్వామిగా చేరడంపై సంతృప్తిగా ఉన్నారు. ఇది చైనాకు వ్యతిరేకంగా ఇండో-పసిఫిక్‌లో పోషించగల వ్యూహాత్మక పాత్రను స్పష్టం చేస్తున్నదంటున్నారు. కాగా గత దశాబ్దం కాలంగా భారతదేశానికి చైనా ముప్పుగా పరిణమించింది. 2020 నుండి ఇరు దేశాలు తమ హిమాలయ సరిహద్దుల గురించి ఘర్షణపడుతున్నాయి. ఈ ఘర్షణల్లో 20 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. 1962 యుద్ధం తర్వాత చైనాపై భారతదేశవాసుల అభిప్రాయంలో మార్పు వచ్చింది. చైనాను వ్యతిరేకించేవారి సంఖ్య పెరిగింది. కేంద్ర ప్రభుత్వం 100కి పైగా చైనీస్ యాప్‌లతో పాటు ఆ దేశానికి చెందిన టిక్‌టాక్‌ను కూడా నిషేధించింది. చైనాను అధిగమించి.. మీడియాతో మాట్లాడిన భారత జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ భారత్- అమెరికాల భాగస్వామ్యం రక్షణ రంగంలో నిర్మాణాత్మక పాత్రను పోషిస్తుందన్నారు. భారతదేశం తన స్వయంప్రతిపత్తిని సంరక్షించుకుంటూనే, అదే సమయంలో యునైటెడ్ స్టేట్స్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపేతం చేసుకుంటున్నదన్నారు. పరిస్థితులన్నింటినీ గమనిస్తే భారత్ రాబోయే కాలంలో చైనాను అధిగమించి సూపర్ పవర్ కానున్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది కూడా చదవండి: సెప్టెంబర్‌లో ఆదిత్య–ఎల్1 ప్రయోగం! -
ఒంటరి మహిళా ప్రయాణికుల కోసం ‘ఆపరేషన్ మేరీ సహేలి’
సాక్షి, హైదరాబాద్: మహిళా ప్రయాణికుల భద్రతపై దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేకించి ఒంటరిగా ప్రయాణం చేసే మహిళల రక్షణ కోసం ‘ఆపరేషన్ మేరీ సహేలీ’పేరిట ప్రత్యేక రక్షణ బృందాలను ఏర్పాటు చేసింది. దక్షిణమధ్య రైల్వేలోని 20 ప్రధాన స్టేషన్లలో ఈ బృందాలను రంగంలోకి దించింది. –సాధారణంగా మహిళలు ఒంటరిగా దూరప్రయాణాలు చేయవలసి వచ్చి నప్పుడు కొంత అభద్రతాభావానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి వారికి అన్ని విధాలుగా అండగా ఉండి వారి ప్రయాణం పూర్తయ్యే వరకు రక్షణ కల్పి0చే లక్ష్యంతో మేరీ సహేలీ మహిళా భద్రతా సిబ్బంది ప్రయాణికులతో పాటు రైళ్లలో ప్రయాణం చేస్తారు. ఇందుకోసం మహిళా సిబ్బందికి వివిధ అంశాలలో శిక్షణనిచ్చినట్లు ఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. మహిళా ప్రయాణికులు రైలు ఎక్కేందుకు, దిగేందుకు సహకరిస్తారు. స్టేషన్ లేఅవుట్పైన అవగాహన కల్పి స్తారు. ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పరిష్కరించేందుకు సహాయం చేస్తారు. ఏయే స్టేషన్లలో ఈ సేవలంటే... సికింద్రాబాద్ డివిజన్లో 5 స్టేషన్లు, హైదరాబాద్ డివిజన్లో 2, విజయవాడలో 4, గుంతకల్‌లో 4, గుంటూరులో ఒక స్టేషన్, నాందేడ్‌లో 4 స్టేషన్లలో సహేలీ బృందాలు పని చేస్తున్నట్లు చెప్పారు. 2 నుంచి 24 మంది సభ్యుల బృందానికిమహిళా సబ్ ఇన్స్పెక్టర్ నాయకత్వం వహిస్తారు. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన 15 రైళ్లతో పాటు, ఇతర జోన్లకు చెందిన మరో 35 రైళ్లలో సహేలీ బృందాలు పని చేస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సహేలీ సేవలను ప్రశంసించారు. -
ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కులాలు, మతాలకతీతంగా నిర్వహించుకునే నెల్లూరు రొట్టెల పండుగ శనివారం ఘనంగా ప్రారంభమైంది. కోర్కెలు తీరిన భక్తులు రొట్టెలు వదిలేందుకు... కొత్త కోర్కెలతో రొట్టెలు తీసుకునేందుకు వచ్చిన భక్తులతో బారాషహీద్ దర్గా ప్రాంగణం తొలి రోజు కిటకిటలాడింది. వరాల రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువు భక్తులతో నిండిపోయింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలవారు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరయ్యారు. ఐదు రోజులపాటు నిర్వహించనున్న రొట్టెల పండుగలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్, జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్, అసిస్టెంట్ కలెక్టర్ విద్యాధరి ఏర్పాట్లు పర్యవేక్షించారు. అంచనాకు మించి రెట్టింపు స్థాయిలో భక్తులు వచ్చినా ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో, వివిధ ప్రైవేటు హాస్పిటల్స్ వారు స్వచ్ఛందంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. నిఘా నీడలో... రొట్టెల పండుగ సందర్భంగా దర్గా ఆవరణతోపాటు స్వర్ణాల చెరువు, పార్కింగ్ ప్రదేశాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆయా ప్రాంతాల్లో 50 సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తప్పిపోయిన చిన్నారులు, వృద్ధుల సమాచారాన్ని పోలీస్ కమాండ్ కంట్రోల్ విభాగం ద్వారా తెలియజేసి వారి కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగిస్తున్నారు. స్వర్ణాల చెరువు తీరం వెంబడి చిన్నారులు లోతుగా వెళ్లకుండా పటిష్టమైన నిఘా పెట్టారు. ముఖ్యంగా మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. -
పోలీసుల అదుపులో చికోటి ప్రవీణ్ ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది
-
ఈటల, అర్వింద్‌కు భద్రత పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: తెలంగాణలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు కేంద్రం భద్రతను పెంచింది. హుజురాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌లకు ఇకపై కేంద్ర బలగాలు భద్రత కల్పించనున్నాయి. ఈటల రాజేందర్‌కు కేంద్రం వై ప్లస్, అర్వింద్‌కు వై కేటగిరి సెక్యూరిటీ కేటాయించింది. ఇద్దరికీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో కూడా భద్రత కల్పించింది. ఈటలకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్తో పాటు 11 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బలగాలు సెక్యూరిటీ కల్పించనున్నారు. ఇక అర్వింద్‌కు 8 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బలగాలు రక్షణ కల్పించనున్నాయి. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసానికి సీఆర్పీఎఫ్ అధికారులు చేరుకున్నారు. కేంద్రం భద్రత పెంపుపై అర్వింద్ స్పందిస్తూ.. వై కేటగిరీ సెక్యురిటీ కేటాయింపుపై సంతృప్తిగా ఉన్నానని తెలిపారు. తనకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. తనపైపై పదే పదే దాడులు జరిగిన తర్వాత రిటైర్డ్ ఎన్ఎస్జీతో ప్రైవేట్ సెక్యురిటీ పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. భద్రత లోపలపై అధికారులు తన వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. కాగా ఇప్పటికే ఈటల రాజేందర్‌కు తెలంగాణ సర్కార్ వై ప్లస్ భద్రత కల్పించిన విషయం తెలిసిందే ఈటల ప్రాణాలకు ముప్పు ఉందని, ఆయన హత్యకు ప్లాన్ జరుగుతోందంటూ వస్తున్న ప్రచారాల నేపథ్యంలో ఎమ్మెల్యేకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ సహా 16 మంది సెక్యూరిటీని కేటాయించింది. చదవండి: ఆ ఫలితం నమ్మితే మోదీ భ్రమపడ్డట్టే! కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసే ‘బండి’ తొలగింపు ఎందుకు? -
వరంగల్ పర్యటన: మోదీ సభా వేదికపై ఎనిమిది మందే.. ఎవరెవరంటే?
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రధాని మోదీ పర్యటన కోసం కాకతీయల గడ్డ ఓరుగల్లు ముస్తాబైంది. సుమారు 30 ఏళ్ల తర్వాత దేశ ప్రధాని తొలిసారిగా వరంగల్‌కు వస్తుండటం గమనార్హం. ప్రధాని అధికారిక కార్యక్రమాల కోసం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సభా వేదికపైకి ప్రధాని మోదీ సహా ఎనిమిది మందికే అవకాశం ఉంటుందని పీఎంఓ కార్యాలయ డిప్యూటీ సెక్రటరీ బిప్లవ్ కేఆర్ రాయ్ టూర్ షెడ్యూల్లో స్పష్టం చేశారు. ఇందులో మోదీతోపాటు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, పసునూరి దయాకర్ ఉన్నారు. అయితే ప్రధాని మోదీ పర్యటనను బహిష్కరిస్తున్నామని, తమ ప్రజాప్రతినిధులెవరూ పాల్గొనబోరని బీఆర్ఎస్ ప్రకటించిన నేపథ్యంలో.. సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ దయాకర్ పాల్గొనే అవకాశం లేదని, ఆ సీట్లు ఖాళీగానే ఉండే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. పోలీసు వలయంలో వరంగల్ ప్రధాని పర్యటన సందర్భంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు అడిషనల్ డీజీపీల పర్యవేక్షణలో సుమారు పది వేల మందిని మోహరించారు. మోదీ వెళ్లే ప్రాంతాలు, సభా ప్రాంగణాన్ని డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాగా శుక్రవారం రాత్రి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తరుణ్‌ఛుగ్, బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే ఆరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి తదితరులు ప్రధాని సభ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాని పర్యటన షెడ్యూల్ ఇదీ.. టూర్ షెడ్యూల్ ప్రకారం.. ప్రధాని మోదీ శనివారం ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ శివార్లలోని హాకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 10.15 గంటలకు మామునూరు మినీ ఎయిర్‌పోర్టుకు వస్తారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. 11 గంటల సమయంలో కాకతీయ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. వివిధ అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. రైల్వే, నేషనల్ హైవే అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను తిలకిస్తారు. 11.45 గంటలకు అక్కడే ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభా వేదిక వద్దకు చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. -
విశాఖలో భద్రతా చర్యలపై పొలిసు విభాగం ప్రత్యేక దృష్టి
-
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈటలకు భద్రత పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు వై ప్లస్ భద్రత కల్పించింది. ఈటల ప్రాణాలకు ముప్పు ఉందని వస్తున్న ప్రచారాల నేపథ్యంలో ఎమ్మెల్యేకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ సహా 16 మంది సెక్యూరిటీని కేటాయించింది. ఈ మేరకు ఈటలకు భద్రత పెంచుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం నుంచి ఈటలకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించనుంది. కాగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు ప్లాన్ జరిగిందంటూ ఈటల జమున తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల భద్రతపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈటల రాజేందర్ భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న ఈటల వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌కు ఫోన్ చేసి ఎమ్మెల్యే భద్రతపై సీనియర్ ఐపీఎస్‌తో వెరిఫై చేయాలని సూచించారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్ నివాసానికి గురువారం డీసీసీ సందీప్ రావు చేరుకొని ఆయన భద్రత అంశంపై చర్చించారు. అనంతరం ఎమ్మెలయే భద్రతపై డీసీపీ సందీప్ రావు.. డీజీపీ అంజనీకుమార్‌కు నివేదిక ఇచ్చారు. అయితే ఈటలకు కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెంపు వార్తల నేపథ్యంలో తాజాగా ప్రభుత్వమే వై ప్లస్ భద్రత కల్పిస్తున్నట్లు ప్రకటించింది. చదవండి: కేటీఆర్‌కు నిరసన సెగ.. ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన మంత్రి -
ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్ తో వెరిఫై చేయించాలని సూచన
-
పెద్దాస్పత్రిలో దొంగల భయం!
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం జిల్లా జనరల్ ఆస్పత్రిలో రక్షణ కరువైంది. ఆస్పత్రికి సంబంధించిన విలువైన వస్తువులు తరచూ మాయమవుతున్నాయి. అంతే కాకుండా రోగులు, వారికి సహాయంగా వచ్చే వారి సెల్ ఫోన్ల చోరీ పరిపాటిగా మారింది. ఇంత జరుగుతున్నా అధికారులు, సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో ఆస్పత్రికి వచ్చే వారు మండిపడుతున్నారు. పెరిగిన తాకిడి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఇటీవల మెడికల్ కళాశాలగా మార్పు చెందింది. దీంతో నిత్యం వెయ్యి నుండి 1,500 మంది వరకు వైద్యసేవలకు వస్తుంటారు. అలాగే రోగుల సహాయకులతో నిత్యం ఆస్పత్రి కిటకిటలాడుతెఓంది. ఇదే అదనుగా కొందరు చోరీలకు పాల్పడుతున్నారు. రోగుల బెడ్ల వద్ద ఉండే ఫోన్లు, చార్జింగ్ పెట్టిన ఫోన్లు చోరీ చేస్తుండగా.. ఇటీవల ఆర్ఎంఓకు వరుస ఫిర్యాదులు అందుతున్నా ఎలాంటి చర్యలు లేదు. మరోపక్క ఆస్పత్రిలోని వస్తువులు కూడా తస్కరణకు గురవుతున్నాయి. తాజాగా ఆక్సిజన్ సిలిండర్లకు వినియోగించే మ్యాన్ హోల్డ్‌లు చోరీకి గురయ్యాయి. ఆక్సిజన్ సిలిండర్ల నుండి పైప్‌లైన్‌కు లింక్ కలిపేందుకు మ్యాన్ హోల్డ్స్ వినియోగిస్తారు. వీటిని చాలా వరకు దొంగలు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి పూట ముసుగు వేసుకొచ్చి వీటిని చోరీ చేస్తున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయినా పట్టించుకోవడం లేదు. సెక్యూరిటీ ఉన్నట్టా.. లేనట్లా? పెద్దాస్పత్రిలో సెక్యూరిటీ, పేషంట్ కేర్, స్వీపర్ల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వ ఓ ఏజెన్సీకి కట్టబెట్టింది. ఆస్పత్రిలో 575 బెడ్లు ప్రాతిపదికగా బెడ్‌కు రూ.7,500 సదరు కాంట్రాక్టర్‌కు చెల్లిస్తోంది. ఈమేరకు 259 మంది సెక్యూరిటీ, పేషంట్ కేర్, స్వీపర్లను నియమించారు. ఇంత వరకు బాగానే ఉన్నా వారిని ఆస్పత్రి రక్షణకు వినియోగించట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిలో అవసరం మేరకు సిబ్బంది లేకపోవడంతో వీరిని ఇతర పనులకు కేటాయిస్తున్నారని.. మరికొందరిని అధికారులు, ఉద్యోగులు వారి ఇళ్లలో పని చేయించుకుంటున్నారని సమాచారం. ఫలితంగా సెక్యూరిటీ గార్డుల కొరతతో చోరీలు సర్వసాధారణమయ్యాయి. ఇంత జరుగుతున్నా విషయం బయటకు పొక్కకుండా, పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అధికారులు మిన్నకుంటున్నట్లు సమాచారం. గట్టి నిఘా ఏర్పాటు చేస్తాం ఆస్పత్రిలో చోరీలు జరగకుండా గట్టి నిఘా ఏర్పాటుచేస్తాం. సెల్ఫోన్లు చోరీకి గురైన విషయమై ఫిర్యాదులు అందాయి. అలాగే సిలిండర్లకు బిగించే మ్యాన్ హోల్ద్స్ కూడా దొంగిలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసి పకడ్బందీ రక్షణ చర్యలు తీసుకుంటాం. – బి.శ్రీనివాసరావు, ఆర్ఎంఓ -
నాడు భయం భయం.. నేడు భద్రతకు భరోసా
సాక్షి, అమరావతి: ఆధునిక సాంకేతికతతో బలోపేతమైన పోలీసు వ్యవస్థ.. పెరిగిన భద్రత.. తగ్గిన నేరాలు.. నేరస్తులకు సత్వర శిక్షలు.. వెరసి ప్రజలకు పూర్తి భరోసా.. ఇదీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పు. శాంతిభద్రతలకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ప్రజల భద్రత కోసం ప్రభుత్వం చేపడుతున్న వినూత్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. దిశ యాప్ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించి ఇతర రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేస్తోంది. రాష్ట్రంలో నేరాలు తగ్గాయని, భద్రత పెరిగిందని జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్సీఆర్బీ) నివేదికలు వెల్లడిస్తున్నాయి. జాతీయ స్థాయిలో 36 అవార్డులు సాధించడం రాష్ట్ర పోలీసుల సమర్థ పనితీరుకు నిదర్శనం. పూర్తి భద్రతతో ప్రజలు సంతోషంగా ఉండటం మాత్రం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తోంది. టీడీపీకి కొమ్ముకాసే పచ్చ పత్రికలకూ కంటగింపుగా మారింది. అందుకే రాష్ట్రంలో భద్రతపై దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. విశాఖపట్నంలో ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ను గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించి కిడ్నాపర్లను అరెస్టు చేయడం పట్ల అంతటా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కానీ పచ్చ మీడియా మాత్రం వక్రీకరణలతో అక్కసు వెళ్లగక్కుతుండటం దిగజారుడు పాత్రికేయ విలువలకు అద్దం పడుతోంది. కానీ ఎన్సీఆర్బీ నివేదికలు, ప్రజల సంతృప్తికర స్థాయి అసలు వాస్తవాలను వెల్లడిస్తున్నాయి. శాంతిభద్రతలు భేష్ గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతిభద్రతలను పూర్తిగా గాలికొదిలేసింది. రాష్ట్ర స్థాయి నుంచి పోలీస్ స్టేషన్ స్థాయి వరకు ఎక్కడా సరైన పర్యవేక్షణ, జవాబుదారీతనం ఉండేవి కావు. దాంతో 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో అల్లరి మూకలు, రౌడీ గ్యాంగ్‌లు, కరడుగట్టిన నేరస్తులు చెలరేగిపోయారు. నేరాల రేటు పెరుగుతున్నా సరే నియంత్రణ చర్యలే లేకుండా పోయాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. నేరాల కట్టడికి పోలీసు యంత్రాంగాన్ని వ్యవస్థాగతంగా బలోపేతం చేసింది. తత్ఫలితంగా రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంతో పోలిస్తే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో అన్ని రకాల నేరాలు గణనీయంగా తగ్గాయి. అందుకు ఎన్సీఆర్బీ గణాంకాలే నిదర్శనం. మహిళా భద్రతకు దిశా నిర్దేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో పోలీసు శాఖ ప్రవేశపెట్టిన దిశ యాప్, దిశ వ్యవస్థ మహిళా భద్రతకు పూర్తి భరోసానిస్తున్నాయి. దిశ యాప్ ద్వారా ఎవరైనా సంప్రదించిన 5–10 నిమిషాల్లోనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ కల్పిస్తున్నారు. ఈ యాప్ ద్వారా ఇప్పటి వరకు 1.24 లక్షల ఎస్‌వోఎస్ కాల్స్ వచ్చాయి. కొత్తగా యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు పరీక్షించడానికి ఒకటి రెండుసార్లు ఎస్‌వోఎస్ బటన్ నొక్కి చూస్తారు. అటువంటివి కాకుండా పోలీసులు చర్యలు తీసుకోదగ్గ 28,585 కాల్స్ వచ్చాయి. వీటికి పోలీసులు స్పందించి తగు చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆపదలో ఉన్న 2,300 మంది మహిళలకు తక్షణం భద్రత కల్పించారు. 423 మందిని వారి ఇంటికి సురక్షితంగా చేర్చారు. దిశ యాప్ ద్వారా సగటున రోజూ 250 కాల్స్ రావడం ఈ వ్యవస్థ పట్ల మహిళల్లో ఏర్పడిన భరోసాకు నిదర్శనం. -
భద్రతా చర్యలను కచ్చితంగా పాటించాలి
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): ప్రయాణికుల అంచనాలకు తగిన విధంగా అన్ని శాఖల అధికారులు రైల్వేశాఖ నిర్దేశించిన విధంగా రైళ్ల కార్యకలాపాల్లో భద్రత చర్యలను కచ్చితంగా పాటించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ సూచించారు. గురువారం సత్యనారాయణపురంలోని ఈటీటీసీ సెంటర్లో విజయవాడ డివిజన్లోని పలు శాఖల అధికారులు, సిబ్బందితో రైళ్ల కార్యకలాపాల్లో భద్రత చర్యలు అనే అంశంపై డీఆర్ఎం షివేంద్రమోహన్, ఏడీఆర్ఎం ఎం.శ్రీకాంత్‌తో కలసి జీఎం అరుణ్‌కుమార్ జైన్ సెమినార్ నిర్వహించారు. సుమారు 200 మంది అధికారులు, సిబ్బంది ఈ సెమినార్లో పాల్గొన్నారు. ముందుగా ఏడీఆర్ఎం శ్రీకాంత్ ప్రమాదాలు, అవాంఛనీయ ఘటనలు జరుగకుండా డిపార్ట్మెంట్ వారీగా చేపడుతున్న భద్రత చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జీఎం అరుణ్‌కుమార్ జైన్ మాట్లాడుతూ భధ్రత నిర్వహణలో ప్లాన్–బి లేదని, పరిపాలనశాఖ నిర్దేశించిన నియమ, నిబంధనలను కచ్చితంగా పాటించాలని సిబ్బందికి సూచించారు. రోలింగ్ బ్లాక్ ప్రోగ్రామ్ ఎంతో విలువైనదని, దాన్ని అమలు చేయాలన్నారు. డీఆర్ఎంతో కలసి లోకో పైలట్లు, సీఎల్ఐ, టీఆర్డీ అండ్ ఎలక్ట్రికల్ సిబ్బందితో సమీక్షించి ఫీల్డ్‌స్థాయిలో వారి ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఆర్ఎం కార్యాలయంలో సెక్షన్ కంట్రోలర్స్‌తో సమావేశం నిర్వహించారు. విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నితీశ్ కుమార్ వైపు దూసుకొచ్చిన బైక్.. అప్రమత్తమై పుట్‌పాత్ పైకి దూకడంతో..
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భద్రతలో భారీ వైఫల్యం చోటు చేసుకుంది. సీఎం ఎప్పటిలానే తన ఇంటి నుంచి వాకింగ్ కోసమని బైటకు వచ్చారు. అంతలో అటుగా వస్తున్న ఓ బైకర్ సీఎం సెక్యూరిటీ బలగాలను దాటుకుని నితీశ్ వైపుకు దూసుకొచ్చాడు. చూస్తుండగానే సీఎంకు అత్యంత సమీపానికి వచ్చేశాడు. దీంతో అప్రమత్తమైన నితీశ్ వెంటనే రోడ్డుపై నుంచి పుట్పాతవైపు దూకాల్సి వచ్చింది. సీఎం తన నివాసం నుంచి సర్క్యులర్ రోడ్డులోని వాకింగ్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం బైకర్‌ను సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ కమాండెంట్, పాట్నా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నరు. ప్రస్తుతం అధికారులు దీనిపై లోతుగా విచారణ జరుపుతున్నారు. కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: ‘నీట్’ని క్రాక్ చేసిన కాశీ పురోహితుని కుమారుడు.. రోజూ గంగా హారతి ఇస్తూ.. -
అక్రమంగా ప్రవేశిస్తే.. మట్టుపెట్టేలా
సాక్షి, విశాఖపట్నం: శత్రుదేశాల కుయుక్తులను తిప్పికొట్టేందుకు భారత నౌకాదళం ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తోంది. ఇందులో భాగంగా యాంటీ డ్రోన్ సిస్టమ్‌తో పాటు నేవీ ఎయిర్‌ఫీల్డ్‌ను మరింత పక్కాగా నిర్వహించే వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొచ్చింది. శత్రుదేశాల డ్రోన్లను మట్టుపెట్టేలా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన నేవల్ యాంటీ డ్రోన్ సిస్టమ్(ఎన్ఏడీఎస్)ను ఐఎన్ఎస్ డేగాలో సోమవారం తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్‌గుప్తా ప్రారంభించారు. భారీ డ్రోన్ల నుంచి తూనీగల పరిమాణంలో ఉన్న మైక్రో డ్రోన్ల వరకు దేనినైనా సరే.. లేజర్ ఆధారిత కిల్ మెకానిజం సహాయంతో గుర్తించి వెంటనే మట్టుపెట్టేలా ఈ వ్యవస్థను రూపొందించారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) సహకారంతో దీనిని తయారు చేశారు. 360 డిగ్రీల కోణంలో.. 10 కిలోమీటర్ల పరిధిలో ఏ డ్రోన్ ఉన్నా.. దాన్ని జూమ్ చేసి.. వివరాలు సేకరించేలా ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు అమర్చారు. రేడియో ఫ్రీక్వెన్సీ, డిటెక్టర్ల సహకారంతో ఆ డ్రోన్లను గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా ఎవరు ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నారనే సమాచారాన్ని క్షణాల్లో సేకరిస్తుంది. సమాచారం వచ్చిన వెంటనే శత్రు డ్రోన్ల సిగ్నల్స్‌ను జామ్ చేసి.. దాన్ని నాశనం చేసేలా ఎన్ఏడీఎస్ పనిచేస్తుంది. యుద్ధ నౌకల్లో ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు భారత నౌకాదళం చర్యలు చేపట్టింది. నేవీ ఎయిర్స్టేషన్లకు రక్షణ కవచం పఠాన్‌కోట్ తరహా ఉగ్రదాడులు పునరావృతం కాకుండా ప్రత్యేక వ్యవస్థను కవచంలా ఏర్పాటు చేసుకోవాలని భారత రక్షణ శాఖ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నేవల్ ఎయిర్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్(ఎన్ఏఐఎస్ఎస్)ను అభివృద్ధి చేశారు. నౌకాదళం ఎయిర్‌స్టేషన్ల పరిధిలోని భద్రతా వ్యవస్థను పూర్తిగా అప్‌గ్రేడ్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో మల్టీ లేయర్ సెక్యూరిటీ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. దేశవ్యాప్తంగా మొత్తం 6 నేవీ ఎయిర్స్టేషన్లలో ఈ ఎన్ఏఐఎస్ఎస్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గోవాలోని ఐఎన్ఎస్ హన్సా, ముంబైలోని ఐఎన్ఎస్ షిక్రా, అరక్కోణంలోని ఐఎన్ఎస్ రజాలీ, విశాఖలోని ఐఎన్ఎస్ డేగా, పోర్టుబ్లెయిర్‌లోని ఐఎన్ఎస్ ఉత్క్రోష్, కొచ్చిలోని ఐఎన్ఎస్ గరుడను ఎంపిక చేశారు. సోమవారం విశాఖలోని ఐఎన్ఎస్ డేగాలో ఈ కొత్త భద్రతా వ్యవస్థను ప్రారంభించారు. ఈ ఎయిర్‌స్టేషన్‌లో స్మార్ట్ ఫెన్స్‌ను అమర్చారు. దీనిని సీసీ కెమెరాలకు అనుసంధానం చేశారు. ఈ స్మార్ట్ ఫెన్స్ లోపలికి ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్‌తో సహా ఏది ప్రవేశించినా.. వెంటనే కంట్రోల్ రూమ్‌ను అప్రమత్తం చేస్తుంది. సెకన్ల వ్యవధిలో మొత్తం వ్యవస్థకు సమాచారం అందజేస్తుంది. అనుమతి లేకుండా అక్రమంగా లోపలికి ఎవరు ప్రవేశించాలని భావించినా వారిని మట్టుపెట్టేలా యాంటీ పెనిట్రేషన్, థర్మల్ సెన్సార్లతో పాటు డ్రోన్ల పర్యవేక్షణతో పహారా ఏర్పాటు చేశారు. ఎయిర్‌స్టేషన్‌కు దాదాపు 2 కిలోమీటర్ల వరకు ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ వ్యాపింపజేసి.. శత్రువుల చొరబాట్లను సులువుగా పసిగట్టవచ్చు. చదవండి: బస్సంతా మహిళలే.. మరి మా పరిస్థితి ఏంటి..? -
ఆధునిక టెక్నాలజీతో తిరుమలలో పటిష్ట భద్రత: హరీష్ కుమార్ గుప్తా
తిరుమల: ఆధునిక టెక్నాలజీ సాయంతో తిరుమలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు రాష్ట్ర హోం శాఖ ప్రధాన కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1 వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమలలో 2 రోజుల పాటు భద్రతాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. సీసీటీవీ కంట్రోల్ రూంలో కృత్రిమ మేధను ఎలా వినియోగించాలి, ఎలాంటి సాఫ్ట్వేర్లను వాడాలనే అంశాలపై అధ్యయనం చేస్తామన్నారు. యాంటీ డ్రోన్ టెక్నాలజీ, బాడీ స్కానర్స్ వినియోగంపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని తెలిపారు. డీఐజీ అమ్మిరెడ్డి మాట్లాడుతూ..భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపడానికి ఎస్పీ లేదా ఏఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో 7 కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కమిటీల్లోని అధికారులు 15 రోజుల పాటు పరిశీలన జరిపి నివేదిక ఇస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తర్వాత కమిటీలు చేసిన సూచనలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తామన్నారు. భద్రతాంశాల పరిశీలన.. అంతకుముందు శ్రీవారి ఆలయం, కొత్త పరకామణి భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1, కమాండ్ కంట్రోల్ రూం తదితర ప్రాంతాలను పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ రూంలో తిరుమలలో సీసీ కెమెరాల ద్వారా నేరస్తులను గుర్తించే విధానాన్ని పరిశీలించారు. తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్, ఇంటెలిజె¯Œన్స్ ఎస్పీ సుమిత్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, ఆక్టోపస్, బాంబుస్కా్వడ్, ఎస్పీఎఫ్, జిల్లా పోలీస్, అటవీ, అగి్నమాపక, ఇతర విభాగాలకు చెందిన అధికారులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: బ్యాంకును బురిడీ కొట్టించిన టీడీపీ నేత -
తిరుమల భద్రతపై టీటీడీ ప్రత్యేక దృష్టి
సాక్షి, తిరుపతి: తిరుమల భద్రతపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక దృష్టి సారించింది. ఇటివల జరిగిన ఘటనల నేపథ్యంలో భద్రతను మరింత బలోపేతం చెయ్యాలని టీటీడీ నిర్ణయించుకుంది. అందుకోసం ప్రత్యేక చర్యలను తీసుకోనుంది. ఈ క్రమంలో అన్నమయ్య భవన్లో టీటీడీ అధికారులు, పోలిసులు కేంద్ర ఐబీ, ఇంటెలిజెన్స్ అధికారులతో సమావేశం జరపనుంది. ఈ సమావేశంలో టీటీడీ భద్రతా ఏర్పాట్లు పై భధ్రతాధికారులు, పోలిసులు విడివిడిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెయ్యనున్నారు. తిరుమల భద్రత మెరుగుపరచడానికి టీటీడీ భద్రత అధికారుల సూచనలను కోరింది. ఈ నేపథ్యంలో వారు తిరుమలలో భద్రతను పరిశీలించి 15 రోజుల్లో నివేదికను టీటీడికి సమర్పించనున్నారు. చదవండి: ‘మా భర్తలను సొంత జిల్లాలకు బదిలీ చేయండి’ -
G20 Meet: శ్రీనగర్‌లో కట్టుదిట్టమైన భద్రత..భారీగా బలగాలు మోహరింపు
సాక్షి, శ్రీనగర్: భారత్ జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగరలో సోమవారం జీ 20 దేశాల మూడో పర్యాటక కార్యవర్గ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వననున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. కేంద్రం జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను రద్దు చేసిన తదనంతరం ఈ ప్రాంతంలో ఇలాంటి అంతర్జాతీయ కార్యక్రమం జరగడం ఇదే తొలిసారి. జీ20లో ప్రెసిడెన్సీలో భారత్ సగానికి చేరుకుందని, ఇప్పటి వరకు 118 సమావేశాలు జరిగాయని జీ20 చీఫ్ కోఆర్టినేటర్ హర్షవర్ధన్ షింఘూ తెలిపారు. అంతేగాదు టూరిజంపై గతంలో జరిగిన రెండు సమావేశాలతో పోల్చితే శ్రీనగర్ సమావేశానికి అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారని అన్నారు. ఈ జీ20 సదస్సు కోసం సభ్య దేశాల నుంచి దాదాపు 60 మంది ప్రతినిధులు హాజరవనున్నారుని చెప్పారు. శ్రీనగర్‌లో జరగుతున్న ఈ సమావేశానికి అత్యధిక సంఖ్యలో సింగపూర్ నుంచి ప్రతినిధులు విచ్చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతేగాదు ప్రత్యేక ఆహ్వానిత అతిథి దేశాల ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారని తెలిపారు. అక్కడ నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తున్న చైనా.. కాశ్మీర్లో జీ20 సమావేశాన్ని నిర్వహించడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పైగా ఈ ఈవెంట్ కోసం సౌదీ అరెబీయా నమోదు చేసుకోలేదు. టర్కీ కూడా ఈ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. వివాదాస్పద ప్రాంతాల్లో జీ20 సమావేశాలను ఏ రూపంలోనైనా నిర్వహించడాన్ని చైనా తప్పుపడుతోంది. అలాంటి సమావేశాలకు చైనా హాజరుకాదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ తెలిపారు. అంతతేగాదు భారత్ తన సొంత భూభాగాల్లో ఇలాంటివి నిర్వహించుకోవడం ఉత్తమం అంటూ ఓ ఉచిత సలహ కూడా ఇచ్చింది. ఇదిలా ఉండగా, ఈ జీ20 కార్యక్రమం కోసం శ్రీనగర్‌లో చాలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. మెరైన్ కమాండోలు, జాతీయ భద్రతా గార్డులు, నేల నుచి గగనతలం వరకు భారీగా మోహరించారు. యాంటీ డ్రోన్లతో గస్తీ, ఆర్మీ బోర్డర్(బీఎస్ఎఫ్). సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్), సశాస్త్ర సీమాబల్(ఎస్ఎస్బీ) జమ్ము కాశ్మీర్ పోలీసులతో సహా వేలాది మంది సైనికులు గట్టిగా పర్యవేక్షిస్తున్నారు. అలాగే జీ20 ప్రతినిధులు ఉపయోగించే మార్గంలో ట్రాఫిక్ కదలికలపై ఆంక్షలు కూడా విధించారు. కాగా, సందర్శనా కార్యక్రమంలో భాగంగా G20 ప్రతినిధులు శ్రీనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పోస్ట్‌కార్డ్‌గా మారిన పోలోవ్యూ మార్కెట్‌ను కూడా సందర్శిస్తారు. అంతేగాదు త్వరలో జరగనున్న జి-20 దేశాల పర్యాటక కార్యవర్గ సమావేశం విజయవంతమైతే జమ్మూ కాశ్మీర్లో పర్యాటకుల ప్రవాహం, పెట్టుబడులు పెరుగుతాయని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారు. CRPF Commandos, Marcos, and Black cat Commandos all geared up for the upcoming G20 summit in Srinagar pic.twitter.com/sMja7GHlX2 — The Asian News Hub (@AsianNewsHub) May 20, 2023 (చదవండి: 'నితీష్ జీ ప్రధాని కావాలనే పగటి కల'ను కనడం మానేయండి!) -
రాజు చుట్టూ ని‘బంధనాలు’.. ప్రతి రోజూ రాజభోగాలే అనుకుంటే పొరపాటే!
బ్రిటన్ రాజుగా చార్లెస్ 3 పట్టాభిషిక్తుడయ్యాడు. ఒక దేశానికి రాజుగా కిరీటధారణ జరిగితే ఇక ప్రతి రోజూ రాజభోగాలు అనుభవించడమే అనుకుంటే పొరపాటే. విందు వినోదాలు, చుట్టూ వందిమాగధులు, ఏ చిన్న పనికైనా జీ హుజూర్ అనే సేవకులు ఇవన్నీ ఉన్నప్పటికీ మరిన్ని ఆంక్షల చట్రంలో బతకాల్సి ఉంటుంది. రాజు ప్రాణం ప్రజలకు ఎంతో విలువైనది. అందుకే భద్రతా కారణాలు, తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలతో కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పా టించాలి. ఒక రకంగా బంగారు పంజరంలో బంధించినట్టుగా స్వేచ్ఛను కోల్పోవలసి ఉంటుంది. 70 ఏళ్ల క్రితం రాణి ఎలిజæబెత్ నాటి నిబంధనలే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. కింగ్ చార్లెస్ అవి ఇష్టం ఉన్నా లేకపోయినా పాటించి తీరవలసిందే. కానుకల స్వీకరణ తప్పనిసరి బ్రిటన్ రాజ సంప్రదాయం ప్రకారం వారికొచ్చే కానుకల్ని తప్పనిసరిగా స్వీకరించాలి. దేశంలో వివిధ ప్రాంతాలు సందర్శించినప్పుడు ఇతర దేశాల పర్యటనలకి వెళ్లినప్పుడు రాజుపై గౌరవంతో చాలా మంది రకరకాల కానుకలు ఇస్తారు. వాటిని రాజు తప్పకుండా తీసుకోవాలి. ఒకవేళ ఆ కానుకలు ఏదైనా ప్రత్యుపకారం పొందడం కోసం ఇస్తూ ఉంటే మాత్రం రాజకుటుంబం వారు కానుకల్ని తిరస్కరించే అవకాశం కూడా ఉంది. ఆ సమయంలో వారి మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవాలి. విలియంతో ప్రయాణించలేరు బ్రిటన్ రాజుతో పాటు వారసుడు కూడా ము ఖ్యమే. కింగ్ చార్లెస్ తర్వాత సింçహాసనం అధిష్టించే వారసత్వపు హక్కు కలిగిన ప్రిన్స్ విలి యమ్‌తో కలిసి ఆయన ఎక్కడికీ ప్రయాణించకూడదు. ఇద్దరూ వేర్వేరు విమానాలు, వాహనాల్లోనే వెళ్లాలి. ఎందుకంటే ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఇద్దరి ప్రాణాలకు ముప్పు ఉండకూడదన్న భావనతో ఈ నిబంధన తీసుకువచ్చారు. వస్త్రధారణ రాజు ధరించే వస్త్రధారణకి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. దౌత్యపరంగా అనుకూలంగా ఉండే డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. రాజు ఏ దేశానికి వెళితే ఆ దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే దుస్తులే ధరిస్తారు. ఇక రాజు తనతో పాటు ఎప్పుడూ నలుపు రంగు వస్త్రాలు తీసుకువెళతారు. ఎక్కడికైనా వెళ్లినప్పుడు అనుకోని పరిస్థితుల్లో అంత్యక్రియలకి హాజరుకావాల్సి వస్తే అప్పుడు వేసుకోవడం కోసం నల్ల బట్టలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. షెల్ ఫిష్ తినలేరు రాజుతో సహా బ్రిటన్ రాచకుటుంబీలు అందరూ షెల్ఫిష్కు దూరంగా ఉండాలి. ఫుడ్ పాయిజనింగ్‌కి అవకాశం ఉన్న తినకూడదన్న నిబంధనలైతే ఉన్నాయి. ఇక రాజు భద్రతే అత్యంత కీలకం కాబట్టి అపరిచితులు ఇచ్చే ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. ఓటుకి దూరం బ్రిటన్ రాజు ఎప్పుడూ రాజకీయాల్లో తటస్థ వైఖరి అవలంబించాలి. ఏ పార్టీకి అనుకూలంగా కానీ, వ్యతిరేకంగా కానీ మాట్లాడకూడదు. అయితే పలు సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించవచ్చు. రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు ఉన్నప్పటికీ రాచ కుటుంబ సంప్రదాయాల ప్రకారం ఓటింగ్‌కి కూడా దూరంగా ఉంటారు. డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదు ఎన్ని రకాల ఆంక్షలున్నా బ్రిటన్ రాజు ఒక్కరికే ఉన్న సదుపాయం ఒకటుంది. అదే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం. కారు డ్రైవ్ చేయాలని అనుకుంటే ఆయనకు లైసెన్స్ అక్కర్లేదు. పాస్‌పోర్ట్ లేకుండా ఏ దేశానికైనా ప్రయాణించవచ్చు. సెల్ఫీలు ఆటోగ్రాఫ్‌లు ఉండవు ప్రజలెవరైనా రాజుతో కలిసి సెల్ఫీ దిగాలని ముచ్చట పడితే అది కుదిరేపని కాదు. ఎవరికీ ఆటోగ్రాఫ్‌లు ఇవ్వకూడదు. అలా ఇస్తే రాజు సంతకం ఫోర్జరీ చేస్తారన్న భయం ఉంది. సెల్ఫీలు దిగకూడదు. రాజు కుటుంబ సభ్యులందరికీ ఇదే వర్తిస్తుంది. అయితే ప్రోటోకాల్స్‌లో ఈ నిబంధనని అధికారికంగా ఇంకా చేర్చలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐసీయూలో తల్లి .. ఆకలితో చిన్నారి
(హైదరాబాద్, గాందీఆస్పత్రి): చావుబతుకుల మధ్య తల్లిప్రాణం కొట్టుకుంటుంది.. ఆరుబయట చిన్నారి ఆకలితో అల్లాడుతున్నాడు. నేనున్నాను అనే భరోసా ఇవ్వాల్సిన వ్యక్తి తనకేమి పట్టనట్లు ఇద్దరినీ అలాగే వదిలేసి వెల్లిపోయాడు. ఆకలితో పాటు అమ్మకోసం ఏడుస్తున్న చిన్నారిని చేరదీసి, ఆకలి తీర్చి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న తల్లిని చూపించి మానవత్వం చాటుకున్నారు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ సలూరాకేంపు ప్రాంతానికి చెందిన గంగాధర్, మాధవి భార్యాభర్తలు. వీరికి ఆరేళ్ల బాబు సాతి్వక్ ఉన్నాడు. రెండవ కాన్పు కోసం ఈ నెల 1న మాధవి గాంధీ ఆస్పత్రిలో చేరింది. అదే రోజు ఆడశిశువు పుట్టిన వెంటనే చనిపోయింది. తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాపాయస్థితి చేరిన మాధవికి మెటరీ్నటీ ఇన్సెంటివ్ కేర్ యూనిట్ (ఎంఐసీయూ) లో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. జాడలేని భర్త ఆచూకీ.. కారణం తెలియదు కానీ మాధవి భర్త గంగాధర్ ఈనెల 2వ తేదీన కుమారుడు సాతి్వక్‌ను గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో వదిలేసి వెల్లిపోయాడు. ఆకలితో అల్లాడుతూ అమ్మ కోసం రోధిస్తున్న చిన్నారిని గాంధీ సెక్యూరిటీ సిబ్బంది గమనించి అన్నం పెట్టి బుజ్జగించి ఆరా తీశారు. పలు వార్డులను తిప్పుగా వెంటిలేటర్‌పై అపస్మారకస్థితిలో ఉన్న అమ్మను చిన్నారి సాతి్వక్ గుర్తించాడు. కేస్ ట్లో ఉన్న గంగాధర్ సెల్‌ఫోన్ నంబరుకు కాల్ చేయగా స్విచ్చాఫ్ వస్తోంది. గాంధీ సెక్యూరిటీ సూపర్వైజర్ శివాజీ నేతృత్వంలో సిబ్బంది ఆంజనేయులు, శ్రీకాంత్, నర్సింహా, కళ్యాణ్, నాగరాజు, శివకుమార్, వరలక్ష్మీ, లావణ్య, అనురాధలు గత మూడు రోజులుగా చిన్నారి సాతి్వక్‌ను షిఫ్ట్డ్యూటీ ప్రకారం వంతుల వారీగా చేరదీసి అన్నం పెట్టి ఆకలి తీర్చి అమ్మను మరిపిస్తున్నారు. ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్న మాధవికి రోగి సహాయకులు లేకపోవడంతో మెడికో లీగల్ కేసు (ఎంఎల్సీ)గా పరిగణించి వైద్యసేవలు అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. మాధవి కుటుంబసభ్యులకు సమాచారం అందించేందుకు ఆధారంగా ఉన్న ఫోన్ నంబరు కాల్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తోందన్నారు. చిన్నారిని చేరదీసి మానవత్వం చాటుకున్న సెక్యూరిటీ సిబ్బందిని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, జీడీఎక్స్ సెక్యూరిటీ సంస్థ ప్రతినిధి రవికుమార్‌లతోపాటు పలువురు వైద్యులు, రోగి సహాయకులు అభినందిస్తున్నారు. -
సెక్యూరిటీకి ఢోకా లేని కొత్త ఫీచర్లు: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని సరికొత్త ఫీచర్లను తీసు కొచ్చింది. ఎప్పటికపుడు కొత్త ఫీచర్లను అందిస్తున్న సంస్థ తాజాగా మూడు సెక్యూరిటీ ఫీచర్లను పరిచయం చేసింది. వాట్సాప్‌ను వాడుతున్నది నిజంగా మీరేనా కాదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునేందుకు కొత్త సెక్యూరిటీ ఫీచర్లు ఉపయోగపడతాయి. మూడు సెక్యూరిటీ ఫీచర్లు అకౌంట్ ప్రొటెక్ట్ (Account Protect), డివైజ్ వెరిఫికేషన్ (Device Verification), ఆటోమేటిక్ సెక్యూరిటీ కోడ్స్ (Automatic Security Codes) అని పిలిచే ఈ మూడు ఫీచర్లు ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి రానున్నాయి. తద్వారా యూజర్ల ప్రైవసీ, భద్రత మరింత మెరుగు పడుతందని కంపెనీ వెల్లడించింది. (27వేల మంది తొలగింపు: అమెజాన్ సీఈవో కీలక వ్యాఖ్యలు) అకౌంట్ ప్రొటెక్ట్ పాత స్మార్ట్‌ఫోన్ నుంచి కొత్త ఫోన్‌కు వాట్సాప్ అకౌంట్‌ను మార్చేటప్పుడు యూజర్లకు ఓల్డ్ అకౌంట్లో ఎలాంటి హెచ్చరికలు కనిపించవు దీంతో రియల్ యూజర్ స్థానంలో మరొకరు ఎవరైనా ప్రవేశించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రొటెక్ట్ ఫీచర్ తీసుకొచ్చింది. దీని ప్రకారం వెరిఫై చేస్తే గానీ కొత్త మొబైల్లో సంబంధిత నంబర్‌తో వాట్సాప్ అకౌంట్‌కి లాగిన్ చేయడం కుదరదు. ఆటోమేటిక్ సెక్యూరిటీ కోడ్స్ వినియోగదారులు తాము మెసేజ్‌లు పంపుతున్న అవతల వ్యక్తికి సురక్షితమైన కనెక్షన్ ఉందో లేదో నిర్ధారించుకునే అవకాశం ఈ ఫీచర్ ద్వారా దొరుకుతుంది.'ఆటోమేటిక్ సెక్యూరిటీ కోడ్లు' కింద, కంపెనీ "కీ ట్రాన్స్పరెన్సీ" అనే ప్రక్రియపై ఆధారపడి వినియోగదారులు తమ సంభాషణ సురక్షితంగా ఉందని ఆటోమేటిక్‌గా వెరిఫై చేయడానికి ఆటోమేటిక్ సెక్యూరిటీ కోడ్స్ తోడ్పడతాయి. ఎన్క్రిప్షన్ ట్యాబ్‌లో, చాట్ సురక్షితంగా ఉన్నదీ, లేనిదీ వెరిఫై చేసుకోవచ్చు. (టాటా, బిర్లా సక్సెస్ సీక్రెట్ ఇదే? అనంత్, రాధికా మర్చంట్ అడోరబుల్ వీడియో వైరల్) డివైజ్ వెరిఫికేషన్ ఇక మూడవది డివైజ్ వెరిఫికేషన్. యూజర్ల ప్రైవసీ,సెక్యూరిటీ ప్రమాదంలో పడకుండా రక్షించే అదనపు భద్రతా ఫీచర్ ఇది. యూజర్ల అకౌంట్‌ను అథెంటికేట్ చేయడానికి, డివైజ్‌లోకి మాల్వేర్ చొరబడితే అకౌంట్‌ను రక్షించడానికి అదనపు భద్రతా చర్యలను వాట్సాప్ పరిచయం చేసింది. తద్వారా యూజర్లతో సంబంధం లేకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో తమంతటమాల్వేర్జాడలను చెక్ చేస్తుంది. ఇందుకోసం వాట్సాప్ తన వినియోగదారులు టూ స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకోవాలని కూడా సూచించింది. (అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) -
పాక్ ప్రధాని ఇంట్లోకి చొరబడ్డ అఫ్ఘాన్ వ్యక్తి.. భద్రతపై విమర్శల వెల్లువ
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధికారిక నివాసంలోకి ఓ వ్యక్తి చొరబడ్డాడు. ఎలా వచ్చాడో గానీ ప్రధాని ఇంట్లోకి చొరబడి భద్రతా ఉల్లంఘనలకు పాల్పడ్డాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు అతన్ని అరెస్టు చేశారు. నిందితుడు అఫ్ఘాన్ వాసిగా పేర్కొన్నారు అధికారులు. అతను మూడు వేర్వేరు మార్గాల గుండా ప్రధాని నివాసంలోకి చొరబడినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన సీసీఫుటేజ్‌లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అత్యంత భద్రతతో కూడిన ప్రధాని అధికారిక నివాసంలోకి ఎలా చొరబడ్డాడు అనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని విచారణ నిమిత్తం ఉగ్రవాద నిరోధక విభాగానికి అప్పగించినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: గర్భంలో ఉండగానే కరోనా సోకిన పసికందులకు దెబ్బతిన్న మెదడు) -
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్‌తో అప్రమత్తం.. ఎంసెట్‌కు బ్లాక్‌చైన్ టెక్నాలజీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మే 7 నుంచి జరిగే ఎంసెట్ ప్రశ్నపత్రాలకు పటిష్టమైన సాంకేతిక భద్రత అవసరమని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వి స్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో ఈ తరహా అభిప్రాయానికొచ్చారు. దీనికోసం అత్యంత పటిష్టమైన బ్లాక్‌చైన్ టెక్నాలజీ భద్రత వ్యవస్థను కల్పించే యోచనలో ఉన్నారు. దీనితోపాటే ఎంసెట్ పేపర్ రూపకల్పన, వాటిని కంప్యూటర్లు, సర్వర్లలో నిక్షిప్తం చేసిన విధానాలపై నిపుణులతో కలిసి అధికారులు లోతైన సమీక్షకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటి వరకూ పేపర్ తయారీలో ముఖ్యపాత్ర పోషించిన వ్యక్తులు, సాంకేతిక నిపుణుల వివరాలను క్రోడీకరిస్తున్నారు. ఇదే కోణంలో పేపర్లను భద్రత పరిచిన తర్వాత సంబంధిత సర్వర్లు, కంప్యూటర్లను ఎవరైనా వినియోగించారా? అనే కోణంలో సమాచార సేకరణకు సిద్ధమవుతున్నారు. ఎంసెట్‌కు ప్రశ్నపత్రాల సర్వర్లకు సంబంధించిన ప్రతీ ఐపీ అడ్రస్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, నివేదిక రూపొందించే పనిలో ఉన్నారు. ఎలాంటి తప్పిదాలు జరగకూడదు ఇతర రాష్ట్రాలతో సహా రాష్ట్రానికి చెందిన మొత్తం 2.50 లక్షల మంది ఎంసెట్ పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం ఉన్నత విద్యా మండలికి స్పష్టం చేసినట్టు తెలిసింది. మేఘాలయాలో జరుగుతున్న అఖిల భారత విశ్వవిద్యాలయాల సమావేశంలో ఉన్న రాష్ట్ర ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఎంసెట్ నిర్వహిస్తున్న జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి ఎంసెట్ భద్రతపై సాయంత్రం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించినట్టు తెలిసింది. ముట్టుకున్నా ‘బ్లాక్’అలారం.. ఎంసెట్ పేపర్ల భద్రతకు వాడబోతున్న బ్లాక్ చైన్ టెక్నాలజీ అత్యంత శక్తివంతమైందని నిపుణులు చెబుతున్నారు. ఒకసారి దీన్ని సర్వర్లకు, కీలకమైన కంప్యూటర్ డివైస్‌కు అనుసంధానం చేస్తే ఏ ఇతర వ్యక్తి ముట్టుకున్నా తక్షణమే కీలకమైన వ్యక్తులకు సంకేతాలిస్తుంది. ఇప్పటి వరకూ డివైజ్‌లోకి ఎవరెవరు? ఏ ఐపీ అడ్రస్‌తో వెళ్ళారనే రహస్య సమాచారం అందిస్తుంది. కంప్యూటర్ సైన్స్‌లో క్రిప్టోగ్రఫీ విధానంలో పనిచేసే బ్లాక్‌చైన్ టెక్నాలజీని ఇప్పటికే అనేక దేశాలు వాడుతున్నట్టు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎంసెట్ పేపర్లకు బాధ్యులెవరు? ఏయే సమయాల్లో వాళ్ళు డివైజ్‌లోకి వెళ్ళాలి? అనేదానిపై ముందే స్పష్టత ఉంటుంది. ఇది బ్లాక్‌చైన్ టెక్నాలజీ మెమోరీలో నిక్షిప్తమై ఉంటుంది. ఆయా సమయాల్లో ఆయా వ్యక్తులు ప్రవేశించినా, అందుకు భిన్నంగా వెళ్ళినా తేలికగా ముందే గుర్తించడం ఈ సాంకేతికత ప్రత్యేకగా చెబుతున్నారు. అత్యంత రహస్యమైన వ్యవస్థను అంతకంటే రహస్యంగా భద్రతపర్చడమే కాకుండా, హ్యాక్ చేసే ప్రయత్నాలను అడ్డుకునే విధానం ఇందులో ఉందని చెబుతున్నారు. దీన్ని పక్కాగా నిర్వహించగల నమ్మకమైన వ్యక్తుల గురించి అధికారులు జల్లెడ పడుతున్నారు. అంతే కాకుండా పాస్వర్డ్స్, సమాచార ప్రవేశం ఎవరెవరికి ఏ మేర ఇవ్వాలనే విషయాలపై స్పష్టతకు రావాలనే ఆలోచనలో ఉన్నారు. దీనివల్లే ఏం జరిగినా వారినే బాధ్యులను చేయవచ్చని చెబుతున్నారు. ప్రత్యేక భద్రతపై పరిశీలిస్తున్నాం ఎంసెట్ ప్రశ్నపత్రాలకు పూర్తి భద్రత కల్పించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ఉన్నత విద్యా మండలితో కలిసి ఈ విషయంలో చర్చలు జరుపుతాం. మేఘాలయ వీసీల సమావేశంలో ఉన్నప్పటికీ కీలకమైన ఈ అంశంపై దృష్టి పెట్టాం. ఎలాంటి భద్రత చర్యలు తీసుకున్నదీ త్వరలో వివరిస్తాం. - ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి (వీసీ జేఎన్టీయూహెచ్) ఎన్క్రిప్షన్ కూడా అవసరమే ఎంసెట్ వంటి కీలకమైన ప్రశ్నపత్రాలకు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో భద్రత మంచిదే. దీంతోపాటే, ఎన్క్రిప్షన్ విధానం అత్యంత ముఖ్యం. దీనివల్ల ప్రశ్నపత్రం ఎవరికైనా చిక్కినా ఏమీ అర్ధంకాని భాషలో ఉంటుంది. దీన్ని కేవలం వ్యాల్యూడ్ యూజర్ మాత్రమే డీకోడ్ చేయడం సాధ్యం. క్రిప్టోగ్రఫీ భాషా విధానంతో దీన్ని రూపొందించారు. విశ్వసనీయమైన వ్యక్తులకు అధికారం ఇచ్చిన ఈ టెక్నాలజీని వాడుకుంటే పేపర్ లీక్ వంటి ఘటనలకు ఆస్కారమే ఉండదు. - ప్రొఫెసర్ ఎస్ రామచంద్రన్ (వీసీ, అనురాగ్ యూనివర్సిటీ, సైబర్‌క్రైం ఫ్యాకల్టీ నిపుణులు) -
భారత్ దెబ్బకు.. దిగొచ్చిన బ్రిటీష్ సెక్యూరిటీ
లండన్: భారత్ దెబ్బకు యూకే అధికారులు దిగొచ్చారు. లండన్‌లోని భారత హైకమిషన్ వద్ద భద్రతను బుధవారం సాయంత్రం కట్టుదిట్టం చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందినీ నియమించారు. అదే సమయంలో ఖలీస్తానీ సానుభూతిపరులు కొందరు అక్కడికి చేరుకున్నారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన పరిణామాల వెంటనే యూకే అధికారులు ఈ చర్యలకు పూనుకోవడం గమనార్హం. ఆదివారం లండన్‌లోని భారత హైకమిషన్ వద్ద ఖలీస్తానీ సానుభూతిపరులు సృష్టించిన వీరంగం గురించి తెలిసిందే. ఈ తరుణంలో అక్కడ స్థానిక భద్రతా సిబ్బంది లేకపోవడంపై భారత్ తీవ్ర అసంతృప్తి వెల్లగక్కింది. అయితే భారత హైకమిషన్ వద్ద సెక్యూరిటీ పర్యవేక్షణతో తమకు సంబంధం లేదని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్‌గా బుధవారం నాడు.. ఢిల్లీలోని యూకే హైకమిషన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లు తొలగించడంతో పాటు భద్రత కోసం కేటాయించిన స్థానిక పోలీసు సిబ్బందిని గణనీయంగా తగ్గించింది. ఈ పరిణామంతో యూకే వెంటనే స్పందించింది. లండన్ భారత హైకమిషన్ వద్ద భద్రతను పెంచింది. సమీప వీధుల్లో గస్తీని పెంచింది. ఇక.. ఆ భద్రతా సిబ్బందిని చూసి నిరసనకారులు.. కాస్త వెనక్కి తగ్గడం గమనార్హం. ఈ ఆదివారం.. ఖలీస్తానీ సానుభూతిపరులు భారత హైకమిషన్‌పై దాడికి యత్నించడం, భారత త్రివర్ణ పతాకాన్ని అవమానించేందుకు యత్నించడం.. ఘటనను భారత్ తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు బ్రిటీష్ సెక్యూరిటీ లేకపోవడం దాడియత్నానికి ఒక కారణంగా పేర్కొంది. #WATCH | London, UK | Anti-India protests by Khalistanis behind Police barricade. Metropolitan Police on guard at Indian High Commission. pic.twitter.com/YDYKX39Bit — ANI (@ANI) March 22, 2023 ఇదీ చదవండి: వామ్మో అంతనా?.. ట్రీట్మెంట్ బిల్లు చూసి సూసైడ్ -
నిఘా లేదు.. సర్వర్ లేదు! కీలకమైన టీఎస్పీఎస్సీలో ‘సెక్యూరిటీ’ లోపాలు
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)లో ఉన్న అనేక సెక్యూరిటీ లోపాలను గుర్తించారు. దీనిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమరి్పంచాలని నిర్ణయించారు. పరీక్ష పేపర్లను దొంగిలించిన టీఎస్పీఎస్సీ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడు పి.ప్రవీణ్‌కుమార్ వాటిని తన పెన్‌డ్రైవ్‌లో సేవ్ చేసుకున్నాడు. అందరికీ దాని యాక్సెస్ లేకుండా చేయడానికి డేటా లాక్ చేసి ఉంచాడు. దీన్నిబట్టి చూస్తే టీఎస్పీఎస్సీ తన డేటా రక్షణ కోసం ఈ మాత్రం చర్యలు కూడా తీసుకోలేదని స్పష్టమవుతోంది. కార్యాలయంలో నిఘా వ్యవస్థ, కంప్యూటర్లకు సర్వర్ లేకపోవడం విస్మయపరుస్తోంది. గేటు వద్దనే యాక్సెస్ కంట్రోల్.. టీఎస్పీఎస్సీలోనికి వెళ్లే వారిని కేవలం గేటు వద్ద, ఆ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఆపి ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ రెండు ప్రాంతాలు దాటి ముందుకు వెళ్లిన వ్యక్తి.. ఎక్కడకు వెళ్తున్నాడు? ఎవరిని కలుస్తున్నాడు? తదితరాలు పరిశీలించే అవకాశం కమిషన్‌లో లేదని పోలీసులు గుర్తించారు. కమిషన్ ప్రాంగణంలోని అనేక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నా వాటిలో కొన్ని సరిగ్గా పని చేయట్లేదు. పరీక్ష పత్రాలు ఉండే కాన్ఫిడెన్షియల్ సెక్షన్ రెండో అంతస్తులో ఉంది. అయితే అక్కడ ఒక్క కెమెరా కూడా లేదు. దీంతో సెక్షన్లోకి ఎవరు వచ్చారు? ఎందుకు వచ్చారు? ఎవరిని కలిసారు? అనేది సాంకేతికంగా గుర్తించే అవకాశం లేకుండా పోయింది. సర్వర్ లేకపోవడంతో నిఘా కరువు.. లక్షల మంది జీవితాలను ప్రభావితం చేసే పరీక్షలు నిర్వహించే టీఎస్పీఎస్సీలో దాదాపు 130 వరకు కంప్యూటర్లు ఉన్నాయి. వీటికి ఇంటర్నెట్ కనెక్షన్‌తో పాటు పెన్‌డ్రైవ్ యాక్సెస్ కూడా ఉంది. సాధారణంగా ఇలాంటి విభాగాల్లో కంపూటర్లను ల్యాన్ ద్వారా కనెక్ట్ చేయరు. పెన్‌డ్రైవ్ యాక్సెస్ కూడా ఇవ్వకుండా సర్వర్ ఏర్పాటు చేసుకుని దాని ఆధారంగానే నెట్వర్క్ నిర్వహిస్తారు. ఇలా చేస్తే ఎవరు ఏ కంప్యూటర్ ద్వారా ఎలాంటి పనులు చేస్తున్నారు అనేది తేలిగ్గా గుర్తించవచ్చు. కమిషన్‌లో ఇలాంటి వ్యవస్థ లేకపోవడం లీకు వీరులకు కలిసి వచి్చంది. మరోపక్క సైబర్ దాడులు, కంప్యూటర్ సేఫ్టీ, పాస్వర్డ్స్, యూజర్ ఐడీల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఇలా ఏ అంశం పైనా సిబ్బందికి కనీస అవగాహన కూడా లేకపోవడం గమనార్హం. సైబర్ ఆడిటింగ్ ఉన్నట్లా..? లేనట్లా..? టీఎస్పీఎస్సీ లాంటి కీలక సంస్థలకు అనునిత్యం సైబర్ ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సరీ్వసెస్ (టీఎస్టీఎస్) ఆ«దీనంలోని నిపుణులు క్రమం తప్పకుండా దీన్ని నిర్వహించాలి. అక్కడి కంప్యూటర్లు, సర్వర్లు, ఫైర్ వాల్స్ తదితరాలను పరీక్షించి సమకాలీన సైబర్ దాడులు తట్టుకోవడానికి అవి సిద్ధంగా ఉన్నాయా? లేదా అన్నది తేల్చి నివేదిక ఇవ్వడంతో పాటు అవసరమైన సిఫారసులు కూడా చేయాల్సి ఉంది. అయితే ఈ ఆడిట్ జరుగుతోందా? సిఫారసులు చేస్తున్నారా? చేస్తే కమిషన్ పట్టించుకుంటోందా? తదితర అంశాలు జవాబులేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఫోరెన్సిక్ నివేదిక వస్తేనే లీకేజీలపై స్పష్టత వచ్చే పరిస్థితి నెలకొంది. చదవండి: మరో సంచలనం.. గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన ప్రవీణ్.. ఆ పేపర్ కూడా లీక్ అయ్యిందా? -
స్మార్ట్ ఫోనుల్లో చాలా మంది చేసే తప్పులు ఇవే.. మరి ఏం చేయాలి?
గీతిక (పేరుమార్చడమైనది) డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. ఈ మధ్య తన క్లాస్మేట్ (నందు) చేసే మెసేజ్‌లు ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. తను ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా అందుకు సంబంధించిన సమాచారాన్ని తిరిగి తనకే పోస్ట్ చేస్తున్నాడు. ఎవరికైనా చెబుదామంటే ఎవరూ నమ్మరు. పైగా తననే నిందిస్తారు. తను ఊళ్లో లేకపోయినా తనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ తిరిగి తనకే పంపిస్తున్నాడు. ఏమైనా అంటే, నాకు అన్నీ తెలుసు.. అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. ఇది ఇబ్బందికరంగా ఉండటమే కాదు భయంగానూ ఉంటోంది. గీతిక లాగే చాలా మంది ఇబ్బందులకు లోనయ్యే సమస్య ఇది. తమ ఫోన్ హ్యాక్ అయిందనే విషయాన్ని ఏ మాత్రం పసిగట్టలేరు. అంత స్మార్ట్‌గా మన చేతుల్లో ఉండే స్మార్ట్ ఫోనుల్లో దొంగలు దూరుతున్నారు జాగ్రత్త. స్మార్ట్ ఫోన్లలో చాలా మంది చేసే కొన్ని తప్పులు ఏంటంటే.. ♦ మనం ఏం చేస్తున్నామో మిగతా అంతా చూసేలా చేయడం. ♦ అలెక్సా వంటి టూల్స్ వాటంతట అవే రన్ అయ్యేలా చేయడం ♦ ఎప్పుడూ యాప్స్ సైన్ ఇన్లోనే ఉండటం ♦ స్మార్ట్ ఫోన్ యాక్సెస్ ఏదైనా ఓకే చేయడం. వెంటనే తెలుసుకోవాలంటే... ♦ ఆండ్రాయిడ్ వినియోగదారులు అయితే.. సెట్టింగ్స్–యాప్స్, నోటిఫికేషన్లు (ఏదైనా తెలియని యాప్‌లో స్పై, మానిటర్, ట్రాక్ ట్రోజన్ .. మొదలైన పేర్లు ఉన్నాయేమో చెక్ చేయండి. ఒకవేళ అలాంటివి కనిపిస్తే వెంటనే వాటిని తీసేయండి. ఇది తెలుసుకోవడానికి సెట్టింగ్స్, ప్లేస్ – గూగుల్ ప్లే, ప్రొటెక్షన్ స్కాన్ చేయండి. ♦ ఐవోఎస్ వినియోగదారులు అయితే.. అన్ని పాస్‌వర్డ్‌లను మార్చాలి. నెట్వర్క్ సెట్టింగ్స్‌ను రీసెట్ చేయాలి. ఐఓఎస్ రీసెంట్ వెర్షన్‌ను అప్డేట్ చేయాలి. స్మార్ట్‌ఫోన్‌లో స్నూపింగ్‌కి అనుమతించేవి... ♦ పిల్లలు వాడుతున్న స్మార్ట్ ఫోన్ల ద్వారా వారు ఏ ప్రాంతంలో ఉన్నారో తెలుసుకోవడానికి ట్రాక్ చేయగల యాప్స్ ఉంటాయి. ♦ కంపెనీ గ్యాడ్జెట్లలో ఇన్స్టాల్ చేయబడిన మానిటరింగ్ సాఫ్ట్వేర్, వాటిని కంపెనీ ప్రయోజనాల కోసమే ఉపయోగించాలి కాబట్టి ఈ హక్కును రిజర్వ్ చేసుకోవచ్చు. ♦ ఆర్డర్ డెలివరీని ట్రాక్ చేయడం, డెలివరీని పర్యవేక్షించడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి నిఘా అవసరం కావచ్చు. కొన్ని రకాల సమస్యలు ♦ హాని కలిగించే యాప్స్, స్పై వేర్, పబ్లిక్ వైఫై, ఉపయోగించని యాప్స్, ఫిషింగ్, పాస్వర్డ్ సెక్యూరిటీ లేనివి .. వంటి వాటి వల్ల సమస్యలు కలగవచ్చు. ముఖ్యమైన పోర్టల్స్ ♦ మీ ఫోన్ IMEI నెంబర్ని https://www.imei.info/ చెక్ చేయండి. ♦ మీ పేరుపై ఎన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయో చెక్ చేసుకోవడానికి https://tafcop.dgtelecom.gov.in సైబర్ టాక్ ఎలా చెక్ చేయాలి? ♦ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే సెట్టింగ్స్–యాప్స్, నోటిఫికేషన్స్– కెమెరా/ మైక్రోఫోన్ (ఏదైనా తెలియని యాప్‌కి యాక్సెస్ ఉందో లేదో తనిఖీ చేయండి) ♦ యాపిల్ ఫోన్ అయితే సెట్టింగ్స్– ప్రైవసీ–కెమెరా/మైక్రోఫోన్ (ఏదైనా తెలియని యాప్‌కి యాక్సెస్ ఉందో లేదో చెక్ చేయాలి) తెలుసుకోవడం ఎలా..? ♦ ఫోన్ చాలా స్లో అవుతుంది. ఫోన్ త్వరగా వేడెక్కుతుంది. ♦ డేటా వినియోగం బాగా పెరుగుతుంది. ♦ యూ ట్యూబ్ లేదా ఆన్లైన్ వీడియోలు బఫర్ అవ్వవు. ♦వెబ్ పేజీలు లోడ్ అవడానికి టైమ్ పడుతుంది. ♦ ప్రోగ్రామ్స్, యాప్స్ క్రాష్ అవుతాయి. ♦ గాడ్జెట్ సడెన్‌గా రీస్టార్ట్ అవుతుంది. ♦ చిత్రమైన, ఊహించని మెసేజీలు వస్తుంటాయి. ఏం చేయాలి? ♦ మీ ఫోన్ పరిమితులను మీకు మీరుగా నిర్దేశించుకోండి. ♦ ఐఓఎస్ యాప్స్‌ని వెంటనే అప్డేట్ చేయండి. ♦ ఉపయోగంలో లేనప్పుడు మీ గ్యాడ్జెట్స్‌ను లాక్ చేసి ఉంచండి. ♦ వైఫై, బ్లూ టూత్ వాడకంలో జాగ్రత్తలు పాటించండి. ♦ బ్యాంకింగ్, సామాజిక మాధ్యమాల కోసం రెండురకాలప్రామాణీకరణలను పాటించండి. ♦ డేటాను తరచూ బ్యాకప్ చేయండి. ♦ సెక్యూరిటీ యాంటీవైరస్, మాల్వేర్ అప్లికేషన్లను ఉపయోగించండి ♦ మీరు ఇన్స్టాల్ చేసే యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి మాత్రమే ఎంచుకోండి. - ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
హాస్టళ్లలో భద్రత కట్టుదిట్టం చేయాలి
గచ్చిబౌలి: ఐటీ కారిడార్‌లో కొనసాగుతున్న వర్కింగ్ పీజీ హాస్టళ్లలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హాస్టళ్ల నిర్వాహకులు, పోలీసులకు సూచించారు. శనివారం గచ్చిబౌలిలోని టీసీఎస్ క్యాంపస్‌లో నిర్వహించిన ‘ప్రాజెక్ట్ సేఫ్ స్టే’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీజీ హాస్టల్స్‌లో ఉంటున్న వారికి భద్రత కల్పించడం నిర్వాహకుల బాధ్యత అన్నారు. 24 గంటలు పని చేసేలా హాస్టల్ ఎగ్జిట్, ఎంట్రీలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. కాంపౌండ్ వాల్ ఐదు అడుగులు ఉండాలని, వాచ్మెన్లను నియమించాలన్నారు. విజిటర్స్ వివరాలపై రిజిస్టర్ నమోదు చేయాలన్నారు. ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటించాలని, నోటీసు బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సజేషన్స్ బాక్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్, వ్యక్తిగత లాకర్ల సదుపాయం ఉండాలన్నారు. స్టాఫ్ ఐడీ ప్రూఫ్‌లతో పాటు కొత్తగా వచ్చే వారి ఐడీ ప్రూఫ్‌లు తీసుకోవాలన్నారు. హాస్టళ్లలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే రూ.ఐదు వేల జరిమానా లేదా సీజ్ చేస్తామన్నారు. అనంతరం ప్రాజెక్ట్ సేఫ్ స్టే పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీసీపీలు కవిత, శిల్పవల్లీ, ఎస్సీఎస్సీ సెక్రటరీ కృష్ణ ఏదుల, మహిళా ఫోరం జాయింట్ సెక్రటరీ ప్రత్యూష, ట్రాఫిక్ ఫోరం కార్యదర్శి శ్రీనివాస్, ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ అధ్యక్షులు పి.అమరనాథ్ రెడ్డి, ప్రదాన కార్యదర్శి కరుణాకర్, కోశాధికారి రఘు నాయుడు, గౌరవ అధ్యక్షులు చంద్ర శేఖర్, సంజయ్ చౌదరీ పాల్గొన్నారు. -
ఉద్యోగాల కోతలు.. మార్క్ జూకర్బర్గ్ కు సెక్యూరిటీ పెంపు
-
Kangana Ranaut: భారంగా కంగనా బృందం
నటి కంగనారనౌత్ పేరే ఒక సంచలనం. అంతకు మించి వివాదాస్పదం. సమస్యలకు, విమర్శలకు కేరాఫ్. అయితే ఈమెలో ఒక దర్శకురాలు, నిర్మాత ఉన్నారు. అందుకే కాస్త పొగరు అని కూడా అంటారు. 2021లో జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన తలైవి చిత్రంలో కంగనా టైటిల్ రోల్ పోషించిన విషయం తెలిసిందే. తాజాగా చంద్రముఖి–2లో నటిస్తున్నారు. రజనీకాంత్ కథానాయకుడిగా వచ్చిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోంది. దర్శకుడు పి.వాసు దర్శకత్వంలో రజనీకాంత్ పాత్రలో లారెన్స్ నటిస్తున్నారు. కాదీన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక్కడి వరకూ బాగానే ఉంది. కంగనా రనౌత్‌తో ఉండే బృందంతోనే ఇప్పుడు చిక్కంతా. ఈమె వెంట పెద్ద పర్సనల్ మేకప్‌మెన్, బౌన్సర్లు, వ్యక్తిగత సిబ్బందితో పాటు నలుగురు సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ ఉన్నారట. వాళ్ల ఖర్చులన్నీ నిర్మాతలే భరించాల్సి వస్తోందట. దీంతో నిత్యం ఏదో సమస్య వస్తూనే ఉంటోందట. ఎదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కంగనారనౌత్ సీఆర్పీఎఫ్ బృందాన్ని రక్షణగా ఏర్పాటు చేసుకుందనే ప్రచారం ఒకటి ఉంది. కాగా వీరితోనే చిత్ర యూనిట్‌కు భారంగా మారుతోందని గగ్గోలు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వాటిని ఎదుర్కొంటూ దర్శకుడు పి.వాసు చంద్రముఖి 2 చిత్రాన్ని త్వరగా పూర్తి చేయగలరా? అనే ప్రశ్న తలెత్తుతోంది. -
మాజీ ఎంపీ పొంగులేటికి షాకిచ్చిన కేసీఆర్ సర్కార్..! భద్రత తగ్గింపు
ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయనకు ప్రస్తుతమున్న 3+3 పోలీసు భద్రతను 2+2కు తగ్గించింది. దీంతో పాటు ఆయనకు ఎస్కార్ట్‌ను, ఇంటి ముందు ఉండే గన్మెన్లను కూడా తొలగించింది. ఈ విషయం ఖమ్మం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పొంగులేటి గత కొంతకాలంగా సొంతపార్టీ అయిన బీఆర్ఎస్పై పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికల్లో తనతో పాటు తన అనుచరులు కూడా పోటీ చేస్తారని ప్రకటించారు. పొంగులేటి తీరుపై బీఆర్ఎస్ అధిష్ఠానం గుస్సా అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన భద్రత తగ్గించడం ఖమ్మం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చదవండి: ఖమ్మం పాలిటిక్స్‌లో కలకలం -
మాజీ ఎంపీ పొంగులేటికి సెక్యూరిటీ తగ్గింపు
-
ఈ నిర్ణయం ఘోర తప్పిదం...రిషి సునాక్‌పై విమర్శలు!
లండన్: బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ ఉన్నప్పుడూ హోం సెక్రటరీగా ఉన్న సుయోల్లా బ్రేవర్ మాన్ భద్రతా ఉల్లంఘనల విషయమై పదవి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. బ్రేవర్ మాన్ రాజీనామ చేసిన కొద్దిరోజుల్లోనే లిజ్ ట్రస్ కూడా అనుహ్యాంగా ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐతే ఇప్పుడు బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ మళ్లీ సుయోల్లా బ్రేవర్‌మాన్‌ని తిరిగి హోమంత్రిగా నియమించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని సునాక్ తీసుకున్న అతిపెద్ద తప్పుడు నిర్ణయంగా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. భద్రతా నియమావళిని ఉల్లంఘించిన ఒక మంత్రి మళ్లీ తిరిగి నియమించడం బాధ్యతారహితమైన నిర్ణయం అంటూ రిషిపై వ్యతిరేకత వెల్లువెత్తింది. మరోవైపు లేబర్ నాయకుడు కైర్ స్టార్మర్, కూపర్లు కూడా ఆమెని తొలగించాలని పట్టుపట్టారు. బ్రేవర్ మాన్ అత్యంత మితవాద టోరీ ఎంపీలకు ప్రాతినిథ్యం వహిస్తుందంటూ ఆరోపణలు చేశారు. ఆమె యూకేకు అక్రమంగా వచ్చిన వలసదారులను రువాండ్కు పంపించేందుకు మద్దతు ఇచ్చిందంటూ ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అదీగాక ఆమె ఒక ప్రైవేట్ ఇ-మెయిల్‌కు సెన్సిటివ్ డాక్యుమెంట్‌ని పంపించిన వివాదాన్ని ఎదుర్కొంటోంది. అలాంటి ఆమెను దేశీయ భద్రతా సమస్యలకు బాధ్యత వహించే ప్రముఖ స్థానానికి మళ్లీ తిరిగి నియమించడంపై బ్రిటన్ అంతటా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు రిషి సునాక్ కూడా ఆ వివాదానికి పూర్తి బాధ్యత వహించాల్సిందేనని అంటున్నారు. (చదవండి: బ్రిటన్ మాజీ ప్రధాని ఫోన్ హ్యాక్ చేసిన పుతిన్ ఏజెంట్లు.. రష్యా చేతికి కీలక రహస్యాలు!) -
రక్షణ ‘ఫిక్స్డ్’.. రాబడి కాదు!
ఫిక్స్డ్ డిపాజిట్ ఎంతో సురక్షితం. ఎక్కువ మంది ఇలానే భావిస్తుంటారు. రాబడి తక్కువే అయినా, భద్రత పాళ్లు ఎక్కువ కదా అన్న భరోసా వారిది. అందుకే ఇప్పటికీ సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. గతంలో మాదిరి ఇప్పుడు బ్యాంకు శాఖకు వెళ్లి డిపాజిట్ చేయాల్సిన అవసరం కూడా తప్పింది. ఉన్నచోట నుంచే నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ డిపాజిట్ చేసుకోవడం, ఆన్లైన్లోనే రద్దు చేసుకోవడం అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఎఫ్డీ మరింత సౌకర్యవంతంగా మారిందని చెప్పుకోవాలి. ఒకవేళ బ్యాంకు సంక్షోభం పాలైనా.. రూ.5 లక్షల వరకు తిరిగి చెల్లించే ఆర్బీఐ ‘డిపాజిట్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్’ ఉంది. కానీ, ఇవన్నీ నాణేనికి అనుకూల ముఖమే. రెండో వైపు తిప్పి చూస్తే.. అసలు ఫిక్స్డ్ డిపాజిట్లో రాబడి వస్తుందా..? ద్రవ్యోల్బణం, పన్ను పోను మిగిలేది ఎంత? అసలు ఇది మెరుగైన పెట్టుబడి సాధనమేనా..? ఈ అంశాలన్నీ చర్చించే కథనమే ఇది. ఇటీవలి కాలంలో ఇన్వెస్టర్లు ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) నుంచి తమ పెట్టుబడులను ఇతర సాధనాల వైపు మళ్లిస్తుండడాన్ని పరిశీలించొచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ వైపు వారు అడుగులు వేస్తున్నారు. ఇక్కడ రెండు అంశాలను గమనించాలి. ఇలా ఫిక్స్డ్ డిపాజిట్లకు దూరంగా వెళ్లడానికి కారణాలను చూస్తే.. ఒకటి వడ్డీ రేట్లు తక్కువగా ఉండడం, రెండోది ఇన్వెస్టర్లలో వివిధ సాధనాలు, వాటిల్లోని రిస్క్, రాబడుల పట్ల పెరుగుతున్న అవగాహనే. ఫిక్స్డ్ డిపాజిట్ ఎన్నో తరాల నుంచి నమ్మకమైన పెట్టుబడి సాధనంగా ఉంటూ వస్తోంది. కానీ, టెక్నాలజీ అందుబాటు, పెట్టుబడులకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు ఇన్వెస్టర్లలో అవగాహనను పెంచుతున్నాయి. దీంతో పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. ఫిక్స్డ్ డిపాజిట్లను మ్యూచువల్ ఫండ్స్ రాబడులతో పోల్చి చూసుకునే వారు పెరుగుతున్నారు. అందుకే ఇతర సాధనాలతో పోలిస్తే నేడు ఎఫ్డీలు అంత ఆకర్షణీయమైనవిగా ఇన్వెస్టర్లకు అనిపించడం లేదు. నికర రాబడి సున్నా.. ఏ రాబడికి అయినా ముందు చూడాల్సింది ద్రవ్యోల్బణమే. ఇది పోను మిగులు రాబడి ఎంత అన్నదే ఇన్వెస్టర్‌కు ప్రామాణికం అవుతుంది. ప్రస్తుతం బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు వివిధ కాల వ్యవధుల ఆధారంగా 2.50 శాతం నుంచి గరిష్టంగా 7 శాతం వరకు ఉన్నాయి. కానీ, సెప్టెంబర్ నెలకు సంబంధించి వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (రిటైల్) 7.3 శాతంగా ఉంది. అంటే ఇంతకుమించి వడ్డీ రేటు ఉంటేనే అసలు రాబడి వచ్చినట్టు అర్థం చేసుకోవాలి. అంతెందుకు 2022–23 ఆర్థిక సంవత్సరానికి సగటు ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఇలా చూసినా 7 శాతం వడ్డీనిచ్చే ఎఫ్డీపై నికర రాబడి 0.3 శాతమే అవుతుంది. మరింత వివరంగా చూస్తే.. ఏడాది ఎఫ్డీపై ఎస్బీఐ ఆఫర్ చేస్తున్న రేటు 5.65 శాతమే. అంటే ద్రవ్యోల్బణం కంటే ఒక శాతం తక్కువ. కెనరా బ్యాంకు, పీఎన్బీ బ్యాంకులు సైతం 5.5 శాతం రేటును ఇస్తున్నాయి. ప్రైవేటు రంగ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులోనూ ఏడాది కాల ఎఫ్డీపై రేటు 5.75 శాతానికి మించి లేదు. రెండేళ్ల కాల వ్యవధికి చూసినా.. కెనరా బ్యాంకు 5.60 శాతం, యూనియన్ బ్యాంకు 5.45 శాతం, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు 6.50 శాతం చొప్పున ఆఫర్ చేస్తున్నాయి. మూడేళ్ల ఎఫ్డీలపై ఎస్బీఐ ఇస్తున్న రేటు 5.60 శాతం. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు 6.50 శాతం, యాక్సిస్ బ్యాంకు 5.70 శాతం చొప్పున ఆఫర్ చేస్తున్నాయి. ఇక ఐదేళ్ల కాల ఎఫ్డీలపై ఎస్బీఐలో రేటు 5.65 శాతం ఉంటే, యాక్సిస్ బ్యాంకు, కెనరా బ్యాంకులో 5.75 శాతం చొప్పున ఉంది. అంటే ఐదేళ్ల వరకు ఎఫ్డీలపై వడ్డీ రేట్లు, ఆర్బీఐ అంచనా వేస్తున్న ద్రవ్యోల్బణ రేటు 6.7 శాతం కంటే తక్కువే ఉన్నాయి. అంటే ఈ మేరకు ఎఫ్డీపై నష్టపోతున్నట్టు అర్థం చేసుకోవాలి. ఇక పన్ను పరిధిలో ఉన్న వారికి ఎఫ్డీలతో మరింత నష్టమే అని చెప్పుకోవాలి. 30 శాతం పన్ను పరిధిలో ఉంటే 7 శాతం ఎఫ్డీ రేటు రాబడి నుంచి పన్ను చెల్లించగా మిగిలే నికర రాబడి 4.9 శాతమే. ద్రవ్యోల్బణం 6.7 శాతం ఉండడంతో నికరంగా 2 శాతం నష్టాన్ని ఎఫ్డీ రూపంలో తెచ్చుకున్నట్టు అవుతుంది. రక్షణ ఒక్కటే కాదు.. నిజానికి పెట్టుబడి ఏదైనా రక్షణ పాళ్లు ఎంతన్నది చూడాలి. కానీ, అదే సమయంలో రాబడి కూడా చూడాలి. అసలు రాబడి లేకుండా, రక్షణ ఉన్న సాధనం వల్ల ఒరిగేదేమి ఉంటుంది? ఎఫ్డీలు లిక్విడ్ సాధనం. అవసరమైనప్పుడు వేగంగా రద్దు చేసుకుని నగదుగా మార్చుకోవచ్చు. స్వల్పకాల అవసరం ఏర్పడితే అదే ఎఫ్డీపై రుణం (లోన్ ఎగైనెస్ట్ డిపాజిట్/ఓవర్‌డ్రాఫ్ట్) తీసుకోవచ్చు. అదే సమయంలో ఎఫ్డీలు ఒక్కటే లిక్విడ్ సాధనం అనుకోవడానికి లేదు. డెట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా లిక్విడ్ సాధనాలే. మూడు రోజుల వ్యవధిలో నగదుగా మార్చుకోవచ్చు. డెట్ సాధనా ల్లో ద్రవ్యోల్బణం మించి రాబడి అందుకోవచ్చు. మూడేళ్ల పాటు కొనసాగితే ద్రవ్యోల్బణ ప్రభావం పోను మిగిలిన రాబడిపైనే పన్ను పడుతుంది. ఫండ్స్‌లో వైవిధ్యానికి చోటు కల్పించుకోవచ్చు. లక్ష్యానికి అనుగుణంగానే.. కాల వ్యవధికి అనుకూలమైన సాధనం ఎంపిక చేసుకోవడం పెట్టుబడికి కీలకం అవుతుంది. వ్యవధి మూడేళ్లకు మించి లేనప్పుడు ఈక్విటీలను ఎంపిక చేసుకోకపోవడమే సరైనది. 3–5 ఏళ్ల కాలానికి హైబ్రిడ్ పథకాలు, డైనమిక్ అస్సెట్ అలోకేషన్ పథకాలు అనుకూలం. 5–10 ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలానికి లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాలు, ఈటీఎఫ్‌లు, ఈఎల్ఎస్ఎస్లు, 10 ఏళ్లకు మించిన దీర్ఘకాలం కోసం స్మాల్‌క్యాప్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. మూడేళ్లలోపు అయితే రాబడి పెద్దగా లేకపోయినా డెట్ సాధనాలకే పరిమితం కావాలి. ఇక అత్యవసర నిధి అయితే ఎఫ్డీలు, లిక్విడ్ ఫండ్స్, లో డ్యురేషన్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయాలు ఎఫ్డీలకు ప్రత్యామ్నాయాలు చాలానే ఉన్నాయి. దీనికంటే ముందు ఎఫ్‌డీల్లో పెడుతున్న మొత్తం దేనికి ఉద్దేశించినది? అని ప్రశ్నించుకోవాలి. అత్యవసర నిధి అయితే ఎఫ్డీలలో పెట్టుకోవడం సరైనదే అవుతుంది. అత్యవసరం చెప్పి రాదు. ఏ సమయంలో అయినా వెంటనే వెనక్కి తీసుకోవడానికి వెసులుబాటుతో ఉండాలి. ఇక్కడ రాబడి ప్రామాణికం కాదు. కనుక ఎమర్జెన్సీ ఫండ్‌ను ఎఫ్డీలలో పెట్టుకోవచ్చు. అలాగే, ఏడాది కాలం కోసం కూడా ఎఫ్డీలను పరిశీలించొచ్చు. ఏడాదికి మించిన కాలవ్యవధి కోసం ఇన్వెస్ట్ చేసుకునేందుకు.. భిన్న కాలాలతో కూడిన వైవిధ్యమైన డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్, డెట్ ఈక్విటీ కలగలిసిన హైబ్రిడ్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు ఇలా ఎన్నో అందుబాటులో ఉన్నాయి. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ ఇవి ఏడాది నుంచి మూడేళ్ల కాల మనీ మార్కెట్, డెట్ ఇనుస్ట్రుమెంట్లలో పెట్టుబడులు పెడుతుంటాయి. వీటిల్లో సగటు వార్షిక రాబడి 7 శాతం స్థాయిలో ఉంటుందని ఆశించొచ్చు. ఇంతకంటే మెరుగైన రాబడులు, తక్కువ రాబడులకు అవకాశం లేకపోలేదు. ఎంపిక చేసుకునే పథకాల పనితీరు ఆధారంగా రాబడి ఉంటుందని మర్చిపోవద్దు. రెండు నుంచి మూడేళ్ల కాలానికి వీటిని ఎంపిక చేసుకోవచ్చు. మీడియం టు లాంగ్ డ్యురేషన్ నాలుగు నుంచి ఏడేళ్ల కాల వ్యవధి కలిగి సాధనాల్లో పెట్టుబడులు పెడతాయి. వీటిల్లోనూ రాబడులు ఇంచుమించుగా మీడియం డ్యురేషన్ ఫండ్స్ స్థాయిలోనే ఉంటాయి. లాంగ్ డ్యురేషన్ ఫండ్స్ ఏడేళ్లకు మించిన సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. చారిత్రక రాబడులు 6 శాతం నుంచి 18 శాతం మధ్య ఉన్నాయి. ఇవి గుర్తు పెట్టుకోవాలి.. డెట్ ఫండ్స్‌లో పెట్టుబడి, రాబడికి గ్యారంటీ ఉండదు. దీన్నే క్రెడిట్ రిస్క్ అంటారు. అంటే ఫండ్స్ తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేయగా, ఆయా పత్రాలకు సంబంధించి తిరిగి చెల్లింపులు జరగకపోవడం. ఆర్థిక సంక్షోభ సమయాల్లో, అస్థితరల్లో వడ్డీ రేట్ల రిస్క్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో లిక్విడిటీ రిస్క్ కూడా ఎదురుకావచ్చు. నాణ్యమైన డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే పథకాల్లో లిక్విడిటీ రిస్క్ దాదాపుగా ఉండదనే చెప్పుకోవచ్చు. కానీ, రాబడి కోసం రిస్క్ తీసుకుని డెట్‌లో పెట్టుబడులు పెట్టడం కంటే.. ఈక్విటీలను ఆశ్రయించడం మెరుగైన మార్గం అవుతుంది. ఎందుకంటే ఎలానూ రిస్క్‌కు సిద్ధ పడ్డాం కనుక, ఈక్విటీల్లో మెరుగైన రాబడిని సొంతం చేసుకోవచ్చు. ఆయా విషయాల్లో నిపుణుల సలహాలను తీసుకొని నడచుకోవడం వల్ల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కార్పొరేట్/ఎన్బీఎఫ్సీ డిపాజిట్లు కార్పొరేట్, ఎన్బీఎఫ్సీ సంస్థల డిపాజిట్లను కూడా పరిశీలించొచ్చు. కంపెనీలు, ఎన్బీఎఫ్సీలు తమ వ్యాపార కార్యకలాపాల కోసం సెక్యూరిటీల జారీ ద్వారా నిధులు సమీకరిస్తుంటాయి. వీటిపై 7.5–8.5% మధ్య రాబడులు ఆశించొచ్చు. ఏఏఏ రేటెడ్ కలిగిన బాండ్లనే ఎంపిక చేసుకోవాలి. లేదంటే రాబడి మాటేమో కానీ, పెట్టుబడి కూడా సంక్షోభంలో పడిపోతుంది. మీడియం డ్యురేషన్ ఫండ్స్ ఇవి మూడు నుంచి ఐదేళ్ల కాల వ్యవధితో ఉండే డెట్ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. ఎంపిక చేసుకునే పథకాల ఆధారంగా ఈ విభాగంలో మూడేళ్ల కాలానికి వార్షిక సగటు కనిష్ట రాబడి 3 శాతంగాను, గరిష్ట రాబడి 17 శాతం వరకు ఉంది. కనుక ఎంపిక చేసుకునే పథకం ఇక్కడ ప్రామాణికం అవుతుంది. ఏడు శాతానికి పైనే రాబడి ఆశించొచ్చు. పీపీఎఫ్ అసంఘటిత రంగంలోని వారు, 15–20 ఏళ్ల కాల లక్ష్యాలకు పీపీఎఫ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో చేసే పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చే రాబడులపైనా పన్ను ఉండదు. అన్ని విధాలుగా పన్ను ప్రయో జనం కలిగిన సాధనం. ప్రస్తుతం వడ్డీ రేటు 7.1%గా ఉంది. వీపీఎఫ్ ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో కింద భవిష్యనిధి స్కీమ్ ఉంటుంది. దీనికి అదనంగా స్వచ్ఛంద ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్) పేరుతో అదనపు పెట్టుబడి చేసుకోవచ్చు. పీఎఫ్‌కు అమలయ్యే వడ్డీ రేటే వీపీఎఫ్ పెట్టబడులకూ వర్తిస్తుంది. గత ఆర్థిక సంవత్సరానికి పీపీఎఫ్ బ్యాలన్స్‌పై 8.10 శాతం వడ్డీ రేటును కేంద్రం ప్రకటించింది. కాకపోతే వీపీఎఫ్‌లో పెట్టుబడులకు ఐదేళ్ల లాకిన్ ఉంటుంది. అంటే ఐదేళ్ల తర్వాతే ఉపసంహరించుకోగలరు. ఒకవేళ ఉద్యోగానికి రాజీనామా చేసినా, రిటైర్ అయినా అటువంటి సందర్భాల్లో ఈపీఎఫ్‌తోపాటు వీపీఎఫ్ కూడా తీసేసుకోవచ్చు. డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ లేదా బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్‌తో ఒక సానుకూలత ఉంది. మార్కెట్ పరిస్థితులకు తగ్గట్టు డెట్ నుంచి ఈక్విటీకి, ఈక్విటీ నుంచి డెట్‌కు పెట్టుబడులను బదలాయిస్తుంటాయి. తద్వారా రిస్క్ తగ్గించి, అధిక రాబడులను ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటాయి. 9–18 శాతం మధ్య దీర్ఘకాలంలో వార్షిక రాబడులను వీటి నుంచి ఆశించొచ్చు. హైబ్రిడ్ ఫండ్స్ ఐదేళ్లు అంతకుమించిన కాలానికి హైబ్రిడ్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ మెరుగైనవి. ద్రవ్యోల్బణం, పన్ను బాధ్యతలు తీసేసి చూసినా.. ఈక్విటీ ఫండ్స్‌లో రాబడి మెరుగ్గానే ఉంటుందని అందుబాటులోని గణాంకాలు తెలియజేస్తున్నాయి. కన్జర్వేటివ్ హబ్రిడ్ ఫండ్స్, అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ అని రెండు రకాలు ఉన్నాయి. ఈక్విటీల్లో 65 శాతం నుంచి 80 శాతం వరకు ఇన్వెస్ట్ చేసేవి అగ్రెస్సివ్ హైబ్రిడ్ పథకాలు. నూరు శాతం ఈక్విటీ రిస్క్ వద్దనుకునే వారు, ఈక్విటీ డెట్ కలయిక కోరుకునే వారికి ఇవి అనుకూలం. వీటిల్లో వార్షిక రాబడి దీర్ఘకాలంలో 12–18 శాతం మధ్య ఆశించొచ్చు. వీటికి ఈక్విటీ పథకాలకు మాదిరే పన్ను విధానం వర్తిస్తుంది. లాభాలు స్వల్పకాల, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను కిందకు వస్తాయి. కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఈక్విటీలకు 10–25% మధ్య కేటాయింపులు చేస్తాయి. వీటిల్లో రాబడులకు డెట్ ఫండ్స్ పన్ను విధానం వర్తిస్తుంది. రిస్క్ తక్కువ తీసుకునే వారికి ఇవి అనుకూలం. కొంత భాగం ఈక్విటీలకు కేటాయించడం వల్ల దీర్ఘకాలంలో వార్షిక రాబడి 9–12% మధ్య ఉంటుంది. ఇక బ్యాలన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్ అన్నవి ఈక్విటీలు, డెట్‌కు సమానంగా కేటాయింపులు చేస్తుంటాయి. లార్జ్‌క్యాప్/మిడ్‌క్యాప్/స్మాల్‌క్యాప్ లార్జ్‌క్యాప్ కంపెనీలు ఎలాంటి మార్కెట్ పరిస్థితులను అయినా, ఆర్థిక సంక్షోభాలను అయినా తట్టుకోగలవు. ఎందుకంటే ఆయా రంగాల్లో అవి పెద్ద స్థాయికి చేరినవి కనుక. రిస్క్ తక్కువగా ఉండాలని భావించే వారు ఐదేళ్లు అంతకుమించిన కాలానికి లార్జ్‌క్యాప్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. సగటు వార్షిక రాబడులు 12–18 శాతం మధ్య ఉంటాయి. మోస్తరు రిస్క్ తీసుకునే వారు మిడ్‌క్యాప్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో దీర్ఘకాలంలో రాబడులు 12–22 శాతం మధ్య ఉంటాయి. స్మాల్‌క్యాప్ పథకాలను పదేళ్లు అంతకుమించిన కాలానికి, అధిక రిస్క్ ఉన్నా ఫర్వాలేదు అధిక రాబడులు కోరుకునే వారు పరిశీలించొచ్చు. వీటిల్లో రాబడులను 18 శాతానికి పైన ఆశించొచ్చు. -
ఇండిగో విమానంలో బాంబు కలకలం... కొద్దినిమిషాల్లో టేక్ ఆఫ్ అవుతుందనంగా..
ముంబై: ఇండిగో విమానం టేక్ ఆఫ్ అవుతుందనగా విమానంలో బాంబు ఉందంటూ వార్నింగ్ మెసేజ్ వచ్చింది. దెబ్బకు సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా హైఅలర్ట్ విధించి తనిఖీలు నిర్వహించారు. ఈ ఘటన ముంబైలోని చత్రపతి శివాజి మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. అయితే సిబ్బంది అప్రమత్తమై హుటాహుటినా తనిఖీలు నిర్వహించగా... అలాంటిదేమీ జరగలేదని అధికారులు తెలిపారు. కరక్ట్‌గా ఫ్లైట్ టేక్ఆఫ్ అయ్యే సమయానికి శనివారం రాత్రి ఈ గాలి వార్త వచ్చింది. దీంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే విమానాన్ని ఆపీ తనిఖీలు చేశారు. దీంతో ఫ్లైట్ ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చింది. ఆ ఇండిగో విమానం ముంబై ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవాల్సిన విమానం. అయితే ఆ ఈమెయిల్ మెసేజ్‌లో ఇండోగో విమానం ఫలాన ఫ్లైట్ నెంబర్లో బాంబు ఉందని చాలా క్లియర్‌గా సందేశం పంపిచడంతో అధికారులు సీరియస్‌గా తీసుకుని వెంటనే తనిఖీలు నిర్వహించామని తెలిపారు. అసలు ఎక్కడ నుంచి ఈ గాలి వార్త వచ్చిందని పోలీసులు దర్యాప్త చేయడం ప్రారంభించారు. (చదవండి: విషాదంలో ఎంత ఘోరం.. రీల్స్ తీస్తుండగా..) -
పాస్వర్డ్ మేనేజర్ సంస్థకే హ్యాకర్ల షాక్:మూడు కోట్ల యూజర్ల భద్రత గోవిందేనా?
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఉపయోగించే పాస్వర్డ్ మేనేజర్, లాస్ట్‌పాస్‌కు హ్యాకర్లు భారీ షాకిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 33మిలియన్లకు పైగా ప్రజలు ఉపయోగించే పాస్వర్డ్ మేనేజర్ లాస్ట్‌పాస్‌కు సేబర్ కేటుగాళ్లు హ్యాక్ చేశారు. ఇటీవల సంస్థ సిస్టమ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి సోర్స్ కోడ్, యాజమాన్య సమాచారాన్ని దొంగిలించారని తెలుస్తోంది. అయితే దీని ప్రభావాన్ని అంచనా వేయడానికి కొంత సమయం పడుతుందని, కానీ తమ కస్టమర్ల భద్రతకు ఢోకా లేదని తెలిపింది. ఈ మేరకు సంస్థ ట్విటర్ ద్వారా సమాచారాన్ని వెల్లడించింది. అయితే తమ ఖాదారులు పాస్ట్వరర్డ్స్కు వచ్చిన ప్రమాదమేమీ లేదని స్పష్టం చేసింది.ప్రస్తుతానికి వారుఎలాంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. లాస్ట్‌పాస్ నిర్వహణకు ఉద్యోగులు ఉపయోగించే సాఫ్ట్వేర్ డెవలపర్ లోకి "అనధికారిక పార్టీ" ప్రవేశించిందని తన పరిశోధనలో తేలిందని తెలిపింది. నేరస్థులు ఒక్క డెవలపర్ అకౌంట్‌కి మాత్రమే యాక్సెస్ పొందారని పేర్కొంది. అయితే సైబర్ సెక్యూరిటీ వెబ్సైట్ బ్లీపింగ్ కంప్యూటర్ రెండు వారాల క్రితమే ఉల్లంఘన గురించి లాస్ట్‌పాస్ అడిగిందని నివేదించింది. మరోవైపు లాస్ట్‌పాస్ తక్షణమే స్పందించి సమాచారం అందించడంపై కంప్యూటర్ సైబర్ సెక్యూరిటీ విశ్లేషకుడు అలెన్ లిస్కా సంతోషం వ్యక్తంచేశారు. అయితే చాలామందికి రెండు వారాలు చాలా ఎక్కువ సమయం అనిపించినప్పటికీ, పరిస్థితిని పూర్తిగా అంచనా వేయడానికి టీమ్స్‌కి కొంత సమయం పట్టొచ్చన్నారు. కానీ కస్టమర్ పాస్‌వర్డ్‌లను యాక్సెస్ చేసే అవకాశం లేదని లిస్కా చెప్పారు. ఇది ఇలా ఉంటే సోర్స్‌కోడ్, ప్రొప్రయిటరీ సమాచారాన్ని దొంగిలించిన హ్యాకర్లకు,కస్టమర్ల డేటా చోరీ చేయడంపెద్ద కష్టం కాదని, పాస్వర్డ్ వాల్ట్‌ల కీలను యాక్సెస్ చేసేసి ఉంటారని సోషల్ మీడియాలో ఊహాగానాలు జోరుగా వ్యాపించాయి. అయితే ఈ అంచనాలపై లాస్ట్సాప్ స్పందిస్తుందో వేచి చూడాలి. కాగా మాన్యువల్‌గా ఆధారాలను నమోదు చేయాల్సిన అవసరం లేకుండానే తన యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ లేదా జీమెయిల్ లాంటి బహుళ ఖాతాల కోసం హార్డ్-టు-క్రాక్, ఆటోమేటెడ్ జనరేటెడ్ పాస్‌వర్డ్‌లను అందిస్తుంది లాస్ట్‌పాస్. We recently detected unusual activity within portions of the LastPass development environment and have initiated an investigation and deployed containment measures. We have no evidence that this involved any access to customer data. More info: https://t.co/cV8atRsv6d pic.twitter.com/HtPLvK0uEC — LastPass (@LastPass) August 25, 2022 -
ప్రధాని మోదీ భద్రతా వైఫల్యం.. ఆయన వల్లే!
న్యూఢిల్లీ: ఈ ఏడాది మొదట్లో పంజాబ్ పర్యటన సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోదీకి చేదు అనుభవం ఎదురైంది. రైతుల నిరసనలతో కొద్దిసేపు ఆయన కాన్వాయ్ నిలిచిపోవడం తీవ్ర దుమారం చెలరేగింది. విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ ఘటనపై సుప్రీం కోర్టు ఓ కమిటీని నియమించగా.. ఆ కమిటీ నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. ఆ రిపోర్ట్‌ను ఇవాళ(గురువారం) సుప్రీం ధర్మాసనం బయటపెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా వైఫల్యం వ్యవహారానికి సంబంధించి.. ఫెరోజ్‌పూర్(ఫిరోజ్‌పూర్) ఎస్ఎస్పీ(సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్) నిర్లక్ష్యమే కారణమని నివేదిక వెల్లడించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి ఇందూ మల్హోత్రా నేతృత్వంలోని కమిటీ సుప్రీం కోర్టుకు ఒక నివేదిక సమర్పించింది. కమిటీ నివేదికను చదివి వినిపించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన బెంచ్.. సరిపడా సిబ్బంది ఉన్నా ఫెరోజ్‌పూర్ ఎస్ఎస్పీ విధి నిర్వహణలో విఫలం అయ్యారని, అదీగాక ప్రధాని మోదీ పర్యటన గురించి రెండు గంటల ముందే ఆయనకు(ఫెరోజ్‌పూర్ ఎస్ఎస్పీ) సమాచారం ఉన్నా సరైన చర్యలు చేపట్టలేకపోయారని కమిటీ నివేదిక పేర్కొందని తెలిపారు. ఇది సెంట్రల్ ఏజెన్సీల వైఫల్యం ఎంత మాత్రంకాదని, కేవలం పంజాబ్ పోలీస్ అధికారి వైఫల్యమని తమ దర్యాప్తులో స్పష్టంగా తేలిందని ఆ నివేదిక పేర్కొంది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని, తద్వారా సంబంధిత చర్యలు ఉంటాయని అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం తెలిపింది. ఇదిలా ఉంటే.. జనవరి 5వ తేదీ, 2022 పంజాబ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ కాన్వాయ్.. రైతుల నిరసనలతో ఫెరోజ్‌పూర్-మోగా మార్గంలో పియారియానా రోడ్డు ఓవర్‌బ్రిడ్జిపై సుమారు 20 నిమిషాలపాటు ఆగిపోయింది. ఊహించని ఈ ఘటనపై ప్రధాని మోదీ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధానికి ఇలాంటి అనుభవం ఎదురుకావడంతో భద్రతపై ఆందోళన వ్యక్తం అయ్యింది. విమర్శలు వెల్లువెత్తడంతో అప్పటి సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రభుత్వం రిటైర్డ్ జడ్జితో ఓ కమిటీని నియమించగా.. అందుకు సంబంధించిన నివేదికను కూడా సీల్డ్ కవర్లో తమకు సమర్పించాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇదీ చదవండి: గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు -
పారిశ్రామికవేత్త అదానీకి జెడ్ కేటగిరి భద్రత
న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరి భద్రత కల్పించింది. వీఐపీలకు ఇచ్చే భద్రత కింద సీఆర్పీఎఫ్ కమాండోలు ఆయనకు భద్రత కల్పిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఖర్చుని అదానీయే భరిస్తారు. నెలకి రూ.15–20 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా. 33 మంది కమాండోలు ఆయనకు కాపలాగా ఉంటారు. ఇదీ చదవండి: 75 వేలకోట్ల పెట్టుబడులు, 24వేల జాబ్స్ , బిగ్ ఇన్వెస్టర్‌గా అదానీ -
సరిహద్దుల కాపలాలో సైన్యం సత్తా
భారత్‌పై మోపిన యుద్ధాలు, ఘర్షణలు... అవి భౌగోళిక, రాజకీయ పరిణామాలను మార్చిన వైనం గురించి పరామర్శించుకోవడానికి భారత 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం చక్కటి సందర్భం. ఈ ఘర్షణలన్నింటిలో ప్రత్యేకంగా నిలిచేది ఏమిటంటే, భారత సాయుధ బలగాలు నిర్వహించిన అసాధారణ పాత్ర. భారత సరిహద్దులను కాపాడటంలో, పొరుగుదేశాల సవాళ్లకు ఎదురు నిలవడంలో మన సాయుధ బలగాలకు ఎక్కువ ఘనత లభించాల్సి ఉంది. ఒక వాస్తవం తరచుగా విస్మరణకు గురవుతోంది. స్వాతంత్య్రం తర్వాత భారత బలగాలు ఒక్క భూభాగాన్ని కూడా కోల్పోలేదు. చొరబాట్ల నిరోధానికి సైనిక బలగాలను పంపడానికి ముందు శత్రుబలగాలు ఆక్రమించిన భూభాగాలు మాత్రమే మనం కోల్పోయింది! ► నాటి జమ్మూ కశ్మీర్ మహారాజు పాకిస్తాన్లో కశ్మీర్ విలీనం కావడాన్ని ఇష్టపడకపోవడం చూసిన తర్వాత, పాకిస్తాన్ రాజకీయ కులీన వర్గం 1947 అక్టోబర్‌లో కశ్మీర్ దురాక్రమణను ప్రారంభించిందనే ప్రబలమైన ఆవగాహన ఇంతకాలం కొనసాగుతూ వచ్చింది. దీనికి భిన్నంగా ఒక కొత్త కథనం ఇప్పుడు ఉనికిలోకి వచ్చింది. ఇక్బాల్ మల్హోత్రా రాసిన ‘డార్క్ సీక్రెట్స్: పాలిటిక్స్, ఇంట్రిగ్యూ అండ్ ప్రాక్సీ వార్స్ ఇన్ కశ్మీర్’ (2022) పుస్తకం చక్కటి పరిశోధనాత్మక వివరాలను వెల్లడిస్తోంది. కశ్మీర్‌పై రెండు భాగాల్లో దాడులు ప్రారంభించాలంటూ పాకిస్తాన్ సైన్యాన్ని బ్రిటిష్ పాలనా వ్యవస్థ ప్రోత్సహించిందంటూ ఈ పుస్తకం సంచలన వివరాలు బయటపెడుతోంది. ఆ రెండు భాగాలు ఏమి టంటే, కశ్మీర్ లోయను స్వాధీనపర్చుకోవడానికి ఆపరేషన్ గుల్మార్గ్ మొదలుపెట్టడం; గిల్గిత్–బాల్టిస్తాన్ స్వాధీనం కోసం ఆపరేషన్ దత్తా ఖేల్‌ను ప్రారంభించడం. ► దీంతో 1947 అక్టోబర్ నుంచి 1948 వేసవి కాలం వరకు కశ్మీర్‌ను కాపాడుకుందాం అనే దీర్ఘకాలిక పథక రచనలో భారత వాయుసేన, భారతీయ సైన్యం మునిగిపోయాయి. మన బలగాలు అపారమైన సంకల్పంతో ఈ పథకాన్ని పూర్తి చేశాయి. కానీ బ్రిటిష్ నాయకత్వం అంతటితో వదలిపెట్టలేదు. గిల్గిట్‌పై పాకిస్తాన్ పతాకం ఎగిరేలా వారు పావులు కదిపారు. అదే సమయంలో ఈ వ్యవహారాన్ని ఐక్యరాజ్య సమితిలో చర్చించడానికి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూను లార్డ్ మౌంట్ బాటన్ ఒప్పించారు. కశ్మీర్ సమస్యకు ప్లెబిసైట్ (ప్రజాభిప్రాయ సేకరణ)ను ఉత్తమ పరిష్కా రంగా నెహ్రూ ఆమోదించేలా చేశారు. ఇది కాల్పుల విరమణకు దారితీసింది. ఈ ‘కాల్పుల విరమణ రేఖ’ జమ్మూ కశ్మీర్లో భారత్– పాక్ వాస్తవిక సరిహద్దుగా మారింది. ► అయితే, చైనాతో అపరిష్కృతంగా ఉన్న హిమాలయాల సరిహ ద్దులు స్వాతంత్య్రం తర్వాత భారత్ ముందుకు రెండో కీలకమైన ఘర్షణను తెచ్చిపెట్టాయి. 1962లో చైనా, భారత్ మధ్య ఘర్షణ అనేక కారణాల ఫలితం అని చెప్పాలి. టిబెట్ పోరాటానికి సహాయం అందించే లక్ష్యంతో భారత్‌లో అమెరికా అడుగుజాడలు పెరగడం కూడా ఒక కారణం. 1954లో భారత్ ప్రచురించిన మ్యాపులు అక్సాయ్ చిన్ను లద్దాఖ్‌లో భాగంగా చూపాయి. అంటే అది భార త్లో భాగమేనని చెప్పాయి. ► అలాగే మ్యాప్ ఉన్నా లేకపోయినా మెక్ మెహన్ రేఖ మాత్రమే చైనాతో భారత ఈశాన్య సరిహద్దుగా ఉంటుం దని నెహ్రూ దృఢ వైఖరిని ప్రకటిస్తూ వచ్చారు. ఇది చైనా నాయ కత్వాన్ని రగిలించింది. అందుకే నెహ్రూకు గుణపాఠం చెప్పాలని మావో నిర్ణయించుకున్నాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో చైనాకు రష్యా ఆయుధాలు ఇవ్వడమే కాకుండా, చైనాను పోత్సహిం చిన విషయం మరుగున పడిపోయింది. 1950లలో కొరియన్ యుద్ధంలో తొలిసారి చైనాకు రష్యా మద్దతుగా నిలిచింది. తర్వాత అమెరికా శిబిరంలో భారత్ ఉన్నట్లు కనిపించింది కాబట్టి, భారత్‌పై చైనా దాడిని కూడా రష్యా బలపర్చింది. 1962 అక్టోబర్ 20 నుంచి నవంబర్ 19 వరకు క్యూబా క్షిపణి సంక్షోభంలో ప్రపంచం కూరుకు పోయిన రోజు ల్లోనే సోవియట్ నాయకుడు నికితా కృశ్చేవ్ భారత్‌పై దాడి చేయవచ్చని పంపిన సిగ్నల్‌ను నాటి చైనా నాయకత్వం అందుకుంది. ► చైనా దాడి రెండు భ్రమలను పటాపంచలు చేసింది. ప్రపంచ రాజనీతిజ్ఞుడిగా నెహ్రూ పాత్ర, ఆసియాలో భారత్ వైఖరికి సంబం ధించిన భ్రమలు చెల్లాచెదురైపోయాయి. అదే సమయంలో న్యూఢిల్లీలో భారతీయ సైనిక కమాండర్లు విషాదకరంగా పౌర నాయకత్వ ఆజ్ఞలకు లోబడిపోయారు. ప్రత్యేకించి నెహ్రూ, కృష్ణ మీనన్, బీఎన్ మలిక్ చైనా దాడి సంకేతాల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించారు. అందువల్లే 1962 అక్టోబర్‌లో చైనా వాస్తవంగా దాడి ప్రారంభించినప్పుడు సరైన శిక్షణ, తగిన ఆయుధ సంపత్తి లేని భారతీయ దళాలు అత్యంత ఎత్తయిన హిమాలయాల్లో చైనా దురాక్ర మణతో పోరాడాల్సి వచ్చింది. ఇరు సైన్యాల మధ్య భారీ అసమా నతలు ఉన్నప్పటికీ, లదాఖ్, ‘నెఫా’ (ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్)... రెండు ప్రాంతాల్లోనూ భారతీయ దళాలు గణనీయ పోరాట పటిమను ప్రదర్శించాయి. ► మన బలగాల పోరాట చేవను ఈ వ్యాస రచయిత రాసిన ‘కంటెస్టెడ్ ల్యాండ్స్: ఇండియా, చైనా అండ్ ద బౌండరీ డిస్ప్యూట్’ (2021) పుస్తకం పొందుపర్చింది. 1962 సైనిక ఘర్షణను జాతీయ ఓటమిగా పిలుస్తున్నారు కానీ, వాస్తవానికి భారతీయ సైన్యంలో, వాయుసేనలో చాలా భాగాన్ని ఈ యుద్ధంలో ఉపయో గించలేదని గమనించాలి. ఎక్కువ బలాన్ని ఉపయోగిస్తే చైనాను మరింత రెచ్చగొట్టినట్లవుతుందనే భయం దీనికి కారణం కావచ్చు. భారత్ బలగాలను అధిక సంఖ్యలో ఉపయోగించి ఉంటే కథ మరొకలా ఉండేది. ► 1962లో భారత్ పరాజయం, అమెరికా కేంద్ర యుద్ధ పథకం కారణంగా పాకిస్తాన్లో కొత్త ఆశలు చిగురించాయి. అప్పటికే అమె రికా ఆయుధాలు పాకిస్తాన్ పొంది ఉంది. చైనా దాడితో భారత్ సైన్యపు నైతిక బలం క్షీణించిందనీ, 1947 మాదిరిగా రెండు భాగాల్లో తలపెట్టినట్లుగా కాకుండా, సుశిక్షితమైన అర్ధ గెరిల్లా దాడిని మొదలె డితే ఈసారి కశ్మీర్‌ను తాను ఆక్రమించవచ్చనీ పాక్ భావించిందంటే ఆశ్చర్యం లేదు. భారత వాయుసేన, భారత సైన్య సంయుక్త ప్రతి స్పందనతో పాక్ కుట్రలు మరోసారి భగ్నమయ్యాయి. మన బలగాల ప్రతి దాడి సమర్థత ఏ స్థాయిలో సాగిందంటే, దురాక్రమణ సైన్యాన్ని తరుముకుంటూ పోయిన భారత్ బలగాలు లాహోర్, సియాల్ కోట్ గేట్ల వద్దకు పోయి నిలిచాయి. దీంతో లాహోర్‌ను కాపాడుకునేందుకు పాక్ జనరల్ అయూబ్ ఖాన్ తన బలగాలతో లొంగిపోయారు. ► మరోవైపున కాల్పుల విరమణ పిలుపు కోసం వేచి చూస్తూ భారత బలగాలు ఈ రెండు నగరాల ప్రవేశ ద్వారాల వద్ద తిష్ట వేశాయి. అయితే 1965 నాటి ఆ యుద్ధంలో తమదే విజయం అని పాక్ ప్రక టించుకుందనుకోండి. ఎందుకంటే విజయం మనదే అని ప్రకటించు కోవడానికి భారత రాజకీయ నాయకత్వం కాస్త సిగ్గుపడింది మరి! అయితే 1971 నాటి ఇండో–పాక్ యుద్ధం పూర్తిగా విభిన్నమైంది. మొదటిసారి భారత త్రివిధ బలగాలు పాల్గొన్నాయి. పైగా అది కశ్మీర్ కోసం జరిగిన యుద్ధం కాదు. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం. అయితే ఈ యుద్ధానంతరం కుదిరిన ఒప్పందం జమ్మూ కశ్మీర్ భవిష్యత్తుకు సంబంధించినదే. ► సిమ్లా ఒడంబడికలో ముఖ్యమైన ఫలితం ఏమిటంటే, కాల్పుల విరమణ రేఖను నియంత్రణా రేఖ (ఎల్ఓసీ)గా మార్చుకోవడమే. అంటే ఇది రెండు దేశాల మధ్య రాజకీయ, సైనిక సరిహద్దుగా ఉంటుందన్నమాట. కార్గిల్‌లో మరోసారి భంగపాటుకు గురై నాటి పాకిస్తాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ అమెరికాకు పరుగెత్తినప్పుడు, అమెరికా సైతం ‘ఎల్ఓసీ’నే గౌరవించమని పాకిస్తాన్‌ను కోరింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 1999లో జనరల్ ముషారఫ్ దురాక్రమణ బలగాలు ఎల్ఓసీని దాటి భారత్‌లోకి చొచ్చుకొచ్చిన ప్రధాన ఉద్దేశం, దాని మాన్యతను సవాలు చేయడమే. ► అయితే భారత్ బలమైన సైనిక ప్రతిస్పందన కారణంగా నాటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ సైతం అదే ఎల్ఓసీని గుర్తించడం వల్ల పాకిస్తాన్‌కు మరోసారి భంగపాటు కలిగింది. భారత సరిహద్దులను కాపాడటంలోని సవాళ్లకు ఎదురు నిలవడంలో మన సాయుధ బలగాలకే ఎక్కువ ఘనత లభించాల్సి ఉంది. అయితే ఒక వాస్తవం తరచుగా విస్మరణకు గురవుతోంది. స్వాతంత్య్రం తర్వాత భారత బలగాలు ఒక్క భూభా గాన్ని కూడా కోల్పోలేదు. మనం కోల్పోయినదల్లా... 1947, 1962 సంవత్సరాల్లో చొరబాట్ల నిరోధానికి భారత బలగాలను పంపడానికి ముందు శత్రుబలగాలు ఆక్రమించిన మన భూభాగాలను మాత్రమే. మరూఫ్ రజా, వ్యాసకర్త మాజీ సైనికాధికారి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
టెక్నాలజీ వినియోగంతో మరింత భద్రత
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు భద్రత కల్పించేందుకు రాష్ట్ర పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని, అదే విధంగా సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడం వల్ల మరింత పటిష్టంగా భద్రతా చర్యలు చేపట్టడానికి వీలవుతుందని డీజీపీ మహేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం ఉబెర్ యాప్ సంస్థతో కలసి లైవ్ లింక్ షేర్ టూల్‌ను ఆయన పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు. కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవడం వల్ల రియల్ టైమ్ లొకేషన్‌తో పాటు యూజర్ వివరాలు త్వరితగతిన తెలుస్తాయని, దీని వల్ల ప్రమాదాల్లో ఉన్న వారిని రక్షించడం సులభమవుతుందన్నారు. భద్రత కోసమే: ఉబెర్ ఆపరేషన్స్ డైరెక్టర్ శైలేంద్రన్ ప్రజలకు మరింత భద్రత కల్పించేందుకు తాము సేఫ్టీ టూల్ కిట్ ద్వారా లైవ్ లొకేషన్ పోలీస్ విభాగానికి చేరేలా ప్రత్యేక వ్యవస్థ రూపొందించామని ఉబెర్ సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ శైలేంద్రన్ వెల్లడించారు. ఇప్పటికే తమ యాప్‌లో అనేక భద్రతా అంశాలున్నాయని పేర్కొన్నారు. ఈ లైవ్ లింక్ టూల్ కిట్ సోమవారం నుంచి పోలీస్ శాఖకు లింకు అవుతుందని తెలిపారు. మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న స్వాతిలక్రా తదితరులు సేఫ్టీ టూల్ కిట్ పని ఇలా.. డ్రైవర్ భద్రతతో పాటు ప్రయాణికుల సేఫ్టీకి ఉబెర్ సంస్థ యాప్ లైవ్ లొకేషన్, పోలీస్ కంట్రోల్ సెంటర్, డయల్ 100కి చేరిపోయేలా ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉబెర్ యాప్‌లోని సేఫ్టీ టూల్ కిట్‌లో బ్లూ షీల్డ్ క్లిక్ చేయగానే వాహనం నంబర్, డ్రైవర్ పేరుతో పాటు ప్రతీ నాలుగు సెకండ్లకు ఒకసారి వాహనం లైవ్ లొకేషన్ పోలీస్ విభాగానికి చేరిపోతుంది. ప్రయాణికులు సైతం ఈ లింక్‌తో షేర్ ఆప్షన్ క్లిక్ చేయవచ్చు. ఒకవేళ షేర్ వద్దనుకుంటే ఉబెర్ యాప్‌లోని ఎస్ఓఎస్ ఉపయోగించుకోవచ్చు. ప్రమాద సమయంలో ఎస్ఓఎస్ వల్ల పోలీస్ కంట్రోల్ రూమ్‌కు క్షణాల్లో కాల్ వెళ్తుంది. దీని వల్ల అటు ప్రయాణికులు, ఇటు వాహన డ్రైవర్లకు ఎలాంటి ప్రమాదం ఉన్నా దగ్గరలోని పెట్రోలింగ్ వాహనం సంఘటన స్థలికి చేరుకుంటుంది. -
పాక్‌పై నమ్మకం లేదు.. అందుకే ఇలా: ఈసీబీ
పాకిస్తాన్లో క్రికెట్ ఆడేందుకు చాలా దేశాలు నిరాకరించడానికి ప్రధాన కారణం అక్కడి అభద్రతా భావం. ఏ క్షణానా ఏం జరుగుతుందోనని భయపడే సంఘటనలు చాలానే ఉన్నాయి. 2009లో పాకిస్తాన్ లంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై తీవ్రవాదులు దాడి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ ఉదంతం ద్వారా పాక్ గడ్డపై క్రికెట్ ఆడేందుకు చాలా దేశాలు విముఖత వ్యక్తం చేశాయి. ఇక భారత్ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదిలా ఉంటే దాదాపు పది సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ గడ్డపై మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంక ఒప్పుకుంది. మూడు వన్డేలు.. మూడు టి20 మ్యాచ్‌లు లాహోర్ వేదికగా నిర్వహించారు. అలా పాక్‌లో మొదలైన క్రికెట్ సందడిని ఆ తర్వాత ఆస్ట్రేలియా కంటిన్యూ చేసింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగానే మసీదులో బాంబు పేలడం ఆశ్చర్యపరిచినప్పటికి.. సెక్యూరిటీ భద్రత మధ్య మ్యాచ్‌లను నిర్వహించారు. ఈ విషయంలో పాకిస్తాన్ భద్రతా చర్యలను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రశంసించింది. ఇక ఈ ఏడాది ఇంగ్లండ్ జట్టు సెప్టెంబర్-అక్టోబర్ లో పాకిస్తాన్ పర్యటనకు రానుంది. అయితే అంతకముందే ఈసీబీ పాక్‌లో భద్రతా ఏ మేరకు ఉందో తెలుసుకోవాలని ఐదుగురితో కూడిన బృందాన్ని జూలై 17న పాకిస్తాన్‌కు పంపనున్నారు. ఆటగాళ్ల కంటే ముందే వెళ్లనున్న బృందం అక్కడ ఏర్పాట్లను పరిశీలించనున్నది. ఈ మేరకు పాకిస్తాన్ లో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి..? భద్రతా లోపాలు తలెత్తకుండా పాకిస్తాన్ ఏ చర్యలు తీసుకుంది..? టీమ్ హోటల్స్ వంటి తదితర విషయాలను ఈసీబీ బృందం పరిశీలించనుంది. జులై 17న రానున్న బృందంలో ఇద్దరు క్రికెట్ ఆపరేషన్స్ అధికారులు, ఇద్దరు సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, ఒక అధికార ప్రతినిధి ఉంటారు. వీళ్లు కరాచీ, ముల్తాన్, రావాల్పిండి, లాహోర్ (మ్యాచుల వేదికలు) లలో ఏర్పాట్లను పరిశీలిస్తారు. దీంతో ఈసీబీ బృందం ఇచ్చే నివేదికపై పాకిస్తాన్-ఇంగ్లండ్ సిరీస్ ఆధారపడి ఉంది. ఇక దాదాపు ఏడేండ్లు(2015) తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ జట్టు తొలిసారి పాకిస్తాన్ పర్యటనకు వస్తున్నది. ఈ పర్యటనలో ఏడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌తో పాటు మూడు టెస్టులు ఆడనుంది. షెడ్యూల్ ప్రకారం ఇంగ్లండ్ గతేడాదే పాకిస్తాన్ పర్యటనకు రావాల్సి ఉంది. కానీ గతేడాది సెప్టెంబర్ లో న్యూజిలాండ్ జట్టు రావల్పిండిలో జరగాల్సి ఉన్న వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు తమ పర్యటనను రద్దు చేసుకుని కివీస్ కు వెళ్లిపోయింది. భద్రతా కారణాలను చూపి కివీస్ ఆ పర్యటనను రద్దు చేసుకుంది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ కూడా షాకిచ్చింది. తమ ఆటగాళ్ల మానసిక ఆరోగ్యం తమకు ముఖ్యమని చెప్పిన ఈసీబీ.. ఈ సిరీస్ ను అర్థాంతరంగా రద్దు చేసుకుంది. కానీ తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రతినిధులు ఈసీబీని ఒప్పించి.. పర్యటనకు రావాలని మెప్పించారు. ప్రస్తుతం ఇంగ్లండ్ భారత్‌తో వన్డే సిరీస్ ఆడుతుండగా.. పాకిస్తాన్ శ్రీలంకతో రెండు టెస్టులు ఆడేందుకు లంకకు వెళ్లింది. ఆసియాకప్-2022 ముగిసిన తర్వాత పాకిస్తాన్-ఇంగ్లండ్ సిరీస్ ఆరంభం కానుంది. చదవండి: Sachin Tendulkar: అపూర్వ కలయిక.. దిగ్గజ క్రికెటర్‌తో మరో దిగ్గజం Ind Vs Eng: బ్యాజ్‌బాల్‌పై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు -
షింజే అబే మృతిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఉన్నతాధికారి
Shinzo Abe's Security Had Flaws: జపాన్ మాజీ ప్రదాని షింజే అబే దారుణ హత్యకు సంబంధించి స్థానిక పోలీస్ ఉన్నతాధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భద్రతా విషయాలకు సంబంధించి కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. ఈ మేరకు జపాన్ పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ.....మాజీ ప్రధాని షింజో అబే భద్రతకు సంబంధించి కాదనలేని లోపాలు ఉన్నాయని అన్నారు. ఒక దుండగుడు ఆయనకు సమీపంలోకి వచ్చి మరీ కాల్పులు జరపగలిగాడంటే ఆయనకు ఎటువంటి పటిష్టమైన భద్రత ఉందో తెలుస్తోందని చెప్పారు. హింసాత్మక నేరాలు తక్కువ సంఖ్యలో నమోదయ్యే జపాన్‌లో ఇలాంటి హత్య జరిగిందంటే నమ్మశక్యంగా లేదన్నారు. పైగా కఠినమైన తుపాకి చట్టాలు ఉన్న జపాన్ దేశంలో ఈ ఘటన చోటుచేసుకోవడం బాధకరం అన్నారు. అంతేకాదు జపాన్‌లో స్థానిక ప్రచార కార్యక్రమాల్లో భద్రత సాపేక్షంగా సడలించబడుతుందని చెప్పారు. ఏదీ ఏమైన ఆయనకు పటిష్టమైన భద్రత లేదని స్పష్టమవుతోందని అన్నారు. తన 27 ఏళ్ల కెరియర్లో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొలేదని, ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తానని చెప్పారు. అంతేకాదు మాజీ ప్రధాని అబే రక్షణకు సంబంధించి భద్రతా చర్యల్లో చాలా లోపాలు ఉన్నాయని, ఇది కాదనలేని వాస్తవమని జపాన్ పోలీస్ ఉన్నతాధికారి టోమోకి ఒనిజుకా భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. ఈ దురదృష్టకరమైన ఘటన చోటుచేసుకున్న ప్రాంతంలో కఠినమైన చర్యలు తీసుకోవడమే గాక పూర్తి స్తాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. (చదవండి: మత గురువును చంపాలనుకుని.. అబేపై కాల్పులు!) -
ఎక్కడికక్కడ అప్రమత్తం .. భద్రత కట్టుదిట్టం
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా కీలక నేతలు హైదరాబాద్‌లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరుకానున్న నేపథ్యంలో.. భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సమావేశాలు జరిగే మాదాపూర్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ఐసీసీ)తోపాటు నోవాటెల్, రాజ్‌భవన్, బేగంపేట.. మోదీసభ జరిగే పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో పెద్దయెత్తున భద్రతాబలగాలు మోహరిస్తున్నాయి. స్పెష ల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ), కేంద్ర బలగాలతో కలిసి నాలుగంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. మొత్తం 15 వేల మంది భద్రత, బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. ఎస్పీజీ, ఎన్ఎస్జీ, ఆక్టోపస్, శాంతిభద్రతల విభాగంతో పాటు టాస్క్‌ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, సీఏఆర్ విభాగాలు రంగంలోకి దిగుతున్నాయి. నగరవ్యాప్తంగా నిఘా, తనిఖీతోపాటు భారీగా మఫ్టీ పోలీసులను ఏర్పాటు చేశారు. ప్రధాని తిరిగే మార్గాల్లో రూట్పార్టీలు ఉంటాయి. దుర్భేద్యంగా హెచ్ఐసీసీ జాగిలాలతో హెచ్ఐసీసీ, నోవాటెల్ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఎత్తైన భవనాల పైనుంచి రూఫ్‌టాప్ వాచ్ చేస్తున్నారు. పాస్ ఉన్న వాహనాలు, వ్యక్తులను మాత్రమే హెచ్ఐసీసీ లోపలికి అనుమతిస్తున్నారు. హైటెక్స్ లోపలికి వచ్చే ప్రతి ఒక్క వాహనాన్నీ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. పాస్‌లేని పోలీస్ వాహనాలను సైతం తిప్పి పంపి స్తున్నారు. హెచ్ఐసీసీ వద్ద ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్ కేంద్రాలలో కరోనా పరీక్షలు నిర్వహించాకే లోపలికి అను మతి ఇస్తున్నారు. ఈ నెల 4వ తేదీ వరకు సైబరాబాద్ కమి షనరేట్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. ఐదుగురి కంటే ఎక్కువమంది గుమిగూడితే అరెస్టు చేస్తామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. శుక్రవా రం పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్లిన హైదరా బాద్ కొత్వాల్ సీవీ ఆనంద్ అధికారులతో బందోబస్తు, భద్రత ఏర్పాట్లు సమీక్షించారు. మరోపక్క బేగంపేట విమానాశ్రయం నుం చి పరేడ్ గ్రౌండ్స్‌కు, అక్కడ నుంచి రాజ్‌భవన్ వరకు సెక్యూరిటీ, కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించారు. గ్రౌండ్స్ ను శనివారం ఎస్పీజీ అ«ధీనంలోకి తీసుకోనుంది. శుక్రవా రం నుంచే బేగంపేట విమానాశ్రయం, పరేడ్ గ్రౌండ్స్, బాంబు నిర్వీర్యబృందాలతో తనిఖీ చేస్తున్నారు. ముందస్తు అరెస్టులు.. ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మొదలైన నిరసనలు విధ్వంసానికి దారితీయడం, ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వటంతో ప్రధాని పర్యటన నేపథ్యంలో అకస్మాత్తుగా ఆందోళనలు చేపట్టే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎమ్మార్పీఎస్ శనివారం సడక్‌బంద్‌కు పిలుపు ఇవ్వటంతో అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా సైబరాబాద్ పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. నేరచరితులు, రౌడీషీటర్లకు బైండోవర్లు విధిం చా రు. శంషాబాద్ మున్సిపాలిటి పరిధిలో ఎమ్మార్పీఎస్ పార్టీ కన్వీనర్ రాచమల్ల రాజును పోలీసులు అరెస్టు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు.. హెచ్ఐసీసీ, నోవాటెల్ హోటల్ పరిసర ప్రాంతాలలో శని, ఆదివారాల్లో పలు మార్గాలలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. జేఎన్టీయూ నుంచి సైబర్ టవర్స్, మియాపూర్ నుంచి కొత్తగూడ, కావూరి హిల్స్ నుంచి కొత్తగూడ, బయోడైవర్సిటీ నుంచి జేఎన్టీయూ, నారాయణమ్మ కాలేజ్ నుంచి గచ్చిబౌలి మార్గాలలో భారీ వాహనాలకు ప్రవేశం లేదు. ట్రాఫిక్ మళ్లింపు మార్గాలివే.. ►నీరూస్ జంక్షన్ నుంచి కొత్తగూడ జంక్షన్, గచ్చిబౌలి వైపు వచ్చే వాహనాలను దుర్గం చెరువు – ఇనార్బిట్ – ఐటీసీ కోహినూర్ – ఐకియా – బయోడైవర్సిటీ – గచ్చి బౌలి మీదుగా సీవోడీ జంక్షన్‌కు మళ్లిస్తారు. సైబర్ టవర్స్, హైటెక్స్ జంక్షన్ల మీదుగా ప్రవేశం లేదు. ►మియాపూర్, కొత్తగూడ, హఫీజ్‌పేట మీదుగా హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, జూబ్లీహిల్స్ వైపు వచ్చే వాహనాలు రోలింగ్ హిల్స్ – ఏఐజీ హాస్పిటల్ – ఐకియా – ఇన్నార్బిట్ – దుర్గం చెరువు రోడ్ మీదుగా వెళ్లాలి. ►ఆర్సీపురం, చందానగర్ మీదుగా మాదాపూర్, గచ్చిబౌలి వైపునకు వచ్చే వాహనాలు బీహెచ్ఈఎల్ – నల్లగండ్ల – హెచ్‌సీయూ – ఐఐఐటీ – గచ్చిబౌలి రోడ్డు మీదుగా వెళ్లాలి. అల్విన్, కొండాపూర్ రోడ్లో వాహనాలకు ప్రవేశం లేదు. -
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన.. టెన్షన్.. అటెన్షన్!
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసుల్లో టెన్షన్ నెలకొంది. జులై 2, 3వ తేదీల్లో మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరు కానున్న మోదీ.. 3న సాయంత్రం 4 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే విజయ సంకల్ప సభలోనూ ప్రసంగించనున్నారు. నగరంలో 28 నుంచి 30 గంటల పాటు గడపనున్న ప్రధాని పర్యటనను విజయవంతంగా పూర్తి చేసేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. మోదీతో పాటు సుమారు 35– 40 మంది కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల ముఖ్య మంత్రులు పాల్గొననున్నారు. వీరంతా నగరానికి వచ్చి తిరిగి వెళ్లే వరకూ పోలీసులకు టెన్షన్ తప్పదు. ఏ చిన్న పొరపాటు దొర్లినా అది పెను వివాదానికి దారి తీస్తుంది. దీంతో భద్రత ఏర్పాట్లలో ప్రతి అంశాన్ని పోలీసులు నిశితంగా సమీక్షిస్తున్నారు. ముందస్తు అరెస్ట్‌లు.. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మొదలైన నిరసనలు విధ్వంసానికి దారితీయడం, ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వటంతో ప్రధాని పర్యటన నేపథ్యంలో అకస్మాత్తుగా ఆందోళనలు చేపట్టే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ) దాడులకు నిరసనగా, ప్రవక్తపై సస్పెండ్ అయిన బీజేపీ నేత నుపుర్ శర్మ వ్యాఖ్యలపై వివాదం నేపథ్యంలో.. అసాంఘిక శక్తులు, నిరసనకారులు మోదీ పర్యటనను అవకాశంగా తీసుకున్న ప్రయత్నాలు జరుగుతాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలాంటివన్నింటినీ ముందస్తుగా గుర్తించేందుకు సోషల్ మీడియా మాధ్యమాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఏమాత్రం తేడా అనిపించినా ముందస్తు అరెస్ట్‌లకు సిద్ధమవుతున్నారు. గుమిగూడితే అరెస్టులే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి సైబరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల 1 నుంచి 4 వ తేదీ వరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అయిదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. విధుల్లో ఉన్న పోలీసులు, సైనిక సిబ్బంది, హోమ్ గార్డ్స్లతో పాటు అంత్యక్రియలకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు. నింబంధనలు ఉల్లంఘించిన వారిపై 144 సెక్షన్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హెచ్ఐసీసీని పరిశీలించిన సీపీ గచ్చిబౌలి: నగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర బుధవారం మాదాపూర్‌లోని హెచ్ఐసీసీని పరిశీలించారు. సమావేశాలకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్య మంత్రులు రానుండటంతో హెచ్ఐసీసీని ఇప్పటికే పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. పోలీసులు అధికారులతో సమావేశమైన అనంతరం హెచ్ఐసీసీలోని సభా ప్రాంగణం, హెలిప్యాడ్, అతిథులు బస చేసే నోవాటెల్ హోటల్‌ను పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసే పనిలో సైబరాబాద్ పోలీసు అధికారులు నిమగ్నమయ్యారు. పలువురు ఐపీఎస్ అధికారులతో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, ఆర్డీవో చంద్రకళ, తహసీల్దార్ వంశీ మోహన్ తదితరులు ఉన్నారు. బుధవారం బీజేపీ నాయకులు సైతం హెచ్ఐసీసీలో ఏర్పాట్లను పరిశీలించారు. వీరిలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కూన శ్రీశైలం గౌడ్ తదితరులు ఉన్నారు. కదలికలపై డేగకన్ను.. ఇప్పటికే హెచ్ఐసీసీ, నోవాటెల్ హోటల్స్‌లో ఉన్న సీసీ కెమెరాలకు అదనంగా, హైటెక్స్ ప్రాంగణంలోకి ఎంట్రీ నుంచి నోవాటెల్ హోటల్ వరకు దారి పొడవునా పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని హెచ్ఐసీసీ ప్రాంగణంలో తాత్కాలిక కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానిస్తున్నారు. వీటిని సైబరాబాద్ కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వీటిని వీక్షించనున్నారు. హైటెక్స్ ప్రాంగణంలోకి ఎంట్రీ అయిన వ్యక్తి ప్రతి కదలికలను గుర్తిస్తారు. ఏ మాత్రం అనుమానాస్పదంగా అనిపించినా.. వెంటనే క్షేత్ర స్థాయిలో ఉన్న పోలీసులను అలర్ట్ చేస్తారు. ఎయిర్‌పోర్టులో స్వాగత సన్నాహాలు శంషాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేంందుకు కమలనాథులు భాగ్యనగరం బాట పట్టారు. వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలతో పాటు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర అధ్యక్షులు బుధవారం ఉదయం నుంచే హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. బీజేపీ నేతలకు స్వాగతం పలికేందుకు శంషాబాద్ విమానాశ్రయంలోని అరైవల్ లాంజ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించే విధంగా గోల్కొండ కోట, ఓరుగల్లు కోటలతో పాటు పుణ్యక్షేత్రాల చిత్రపటాలతో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మరోవైపు శంషాబాద్ ఎయిర్‌పోర్టుతో పాటు పరిసర ప్రాంతాల్లో సైబరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు కొనసాగుతోంది. పెద్ద ఎత్తున పోలీసులు బలగాలను మోహరించారు. చదవండి: ‘సాలు దొర’.. ‘సంపకు మోదీ’ -
గున్న ఏనుగు చుట్టూ బాడీగార్డులు.. ఓ లుక్కేయండి
వైరల్: బాడీగార్డులు అంటే.. పెద్ద పెద్ద కండలు వేసుకుని.. అరడుగుల పైన ఉండి టైట్ టీ షర్టులు, హాఫ్షర్టులు వేసుకునే ఉండాలా?. సెక్యూరిటీ అంటే తుపాకులతో, కర్రలతో కాపలాగా ఉండాలా??. ఒక చిన్ని గున్న ఏనుగు.. జెడ్ ఫ్లస్ ఫ్లస్ ఫ్లస్ రేంజ్ భద్రత నడుమ వెళ్తుండడం ఎప్పుడైనా చూశారా?. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నంద అప్లోడ్ చేసిన సరదా వీడియో ఇప్పుడు అలాగే అనిపిస్తోంది. కోయంబత్తూర్ సత్యమంగళం అడవుల్లో అప్పుడే పుట్టిన ఓ ఏనుగు గున్నకు ఇలా ఏనుగులు ఎస్కార్టుల్లాగా వెళ్లాయి. రెప్పార్పకుండా కింది వీడియోను చూసేయండి మరి!. No body on earth can provide better security than an elephant herd to the cute new born baby. It’s Z+++. Said to be from Sathyamangalam Coimbatore road. pic.twitter.com/iLuhIsHNXp — Susanta Nanda IFS (@susantananda3) June 22, 2022 చదవండి: తిండిబోతు ఏనుగులు.. వదిలేస్తే రోజులో 18 గంటలు తింటూనే.. -
బండి సంజయ్‌కి తొలిసారి పోలీసు భద్రత
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కి మొదటిసారి పోలీసు భద్రత కల్పించారు. హైదరాబాద్ నగర పరిధిలో ఆయ నకు వన్ ప్లస్ ఫైవ్ భద్రత (ఒక హెడ్ కానిస్టేబుల్, ఐదుగురు కానిస్టేబుళ్లు)తో పాటు రోప్ పార్టీ ఏర్పా టుచేశారు. దీనితో పాటు అదనంగా ఒక ఎస్కార్ట్ వాహనాన్ని సైతం ఏర్పాటు చేశారు. బీజేపీ జాతీ య కార్యవర్గ సమావేశాల సందర్భంగా జూలై 3న పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే ప్రధాని బహిరంగ సభ ఏర్పాట్లను మంగళవారం సమీక్షించిన సందర్భంగా సంజయ్‌కు ఈ భద్రత కల్పించారు. ఇటీవల కరీంనగర్లో ఒక కార్యక్రమం సందర్భంగా సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు ముప్పు ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించింది. దీంతో పాటు ‘అగ్నిపథ్’పై నిరసనలు, వచ్చే నెల 2,3 తేదీల్లో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయకార్యవర్గ భేటీ, ప్రధాని సభ వంటి కార్యక్రమాలు ఉన్నందున సంజయ్‌కు భద్రత కల్పించాలని నిర్ణ యం తీసుకున్నట్టు తెలుస్తోంది. -
ఇంతకీ నూపుర్ శర్మ ఇప్పుడు ఎక్కడ?
ఓ టీవీ షో డిబేట్లో ముహమ్మద్ ప్రవక్తపై కామెంట్లు చేసి తీవ్ర దుమారం రేపారు నూపుర్ శర్మ. దేశంలోనే కాదు.. ఇస్లాం దేశాల నుంచి ఆమె వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది.. అవుతోంది కూడా. ఈ వ్యాఖ్యలతో రాజకీయంగానూ బీజేపీ కాస్త ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంది. వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత.. బీజేపీ ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది. అంతేకాదు తన వ్యాఖ్యల పట్ల ఆమె క్షమాపణలు కూడా తెలియజేసింది. అయినా వివాదం చల్లారడంలేదు. నూపుర్ శర్మ పేరు ప్రతీరోజూ వార్తల్లో వినిపిస్తూనే ఉంది. ఆమెపై చర్యలు తీసుకోవాలని, అరెస్ట్ చేయాలనే డిమాండ్ వినిపిస్తూనే ఉంది. మరి.. వివాదానికి కేంద్రబిందువుగా ఉన్న ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. ప్రవక్తపై కామెంట్ల తర్వాత.. చంపేస్తామంటూ బెదిరింపులు, వేధింపులు ఆమెకు ఎదురయ్యాయి. దీంతో కుటుంబంతో సహా ఆమె పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు కొన్ని ఉగ్రసంస్థలు సైతం ఆమెపై బెదిరింపు ప్రకటనలు చేశాయి. ఈ తరుణంలో.. ఢిల్లీ పోలీసులు ఆమెకు భారీ భద్రతను అందించారు. కుటుంబంతో పాటు నూపుర్ బలమైన సెక్యూరిటీ నడుమ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మే 26వ తేదీన జ్ఞానవాపి మసీద్ వ్యవహారంపై టీవీ చర్చ సందర్భంగా ఆమె.. ప్రవక్త వ్యక్తిగత జీవితంపై కామెంట్లు చేశారు. ఆ వ్యాఖ్యలపై ఇస్లాం వర్గాల అభ్యంతరాలతో దుమారం చెలరేగింది. అప్పటి నుంచి ఆమె ఇంటి నుంచి అడుగు బయటపెట్టడం లేదు. బీజేపీ అగ్రశ్రేణి నేతలకు వివరణ ఇచ్చేందుకు యత్నించినా.. సానుకూల స్పందన లభించలేదు. దీంతో ఆమె కొంతమంది నేతలతో ఫోన్ ద్వారా ఆమె మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆపై మీడియాకు సైతం అంతగా అందుబాటులోకి రాని నూపుర్.. సోషల్ మీడియా ద్వారానూ సదరు వ్యాఖ్యలపై స్పందించేందుకు ఇష్టపడడం లేదు. కానీ, సోషల్ మీడియా అకౌంట్లలో మాత్రం యాక్టివ్గానే ఉంటూ.. పోస్టులు చేస్తున్నారు. దాడులు జరిగే అవకాశం ఉన్నందునా.. ఢిల్లీ పోలీసులు ఇప్పుడు నూపుర్ కుటుంబ భద్రతను సవాల్‌గా తీసుకుంటున్నారు. నూపుర్ శర్మ(37) ఢిల్లీలోని పుట్టి, పెరిగారు. సివిల్స్ సర్వెంట్స్ నేపథ్యం ఉన్న కుటుంబం ఆమెది. బీఏ, ఎల్ఎల్బీ, లండన్ యూనివర్సిటీలో మాస్టర్ లా చేశారామె. ఏబీవీపీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న ఆమె(ప్రెసిడెంట్‌గానూ 8 ఏళ్లు పని చేశారు).. విద్యార్థి దశలోనే టీవీ డిబేట్ల ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసినా ఆశించిన ఫలితం రాలేదు. చివరకు.. బీజేపీ నేతగా ఉన్న టైంలోనే టీవీ డిబేట్ ద్వారానే ఆమె వివాదంలోనూ చిక్కుకోవడం గమనార్హం. అయితే ఈ కష్టకాలంలో బీజేపీ ఆమెకు అండగా నిలబడడం లేదంటూ.. #ShameOnBJP #IsupportNupurSharma హ్యాష్ట్యాగులూ ఈమధ్యకాలంలో ట్రెండ్ అవుతుండడం విశేషం. మరోవైపు కొన్ని ఇస్లాం సంఘాలు ఈ వివాదాన్ని ఇంతటితో ఆపేయాలంటూ పిలుపు ఇస్తున్నా.. మరికొన్ని వర్గాలు మాత్రం చల్లారడం లేదు. -
క్రిప్టోలు ‘సముద్ర దొంగల ప్రపంచమే’!
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలపై కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంతనాగేశ్వరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టోలపై నియంత్రణల లోపిస్తే లేదా కేంద్రీకృత నియంత్రణ యంత్రాంగం లేకపోతే అది కరీబియన్ సముద్రపు దొంగల ప్రపంచం మాదిరే తయారయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. ప్రభుత్వం గడిచిన నాలుగు సంవత్సరాల్లో వృద్ధి, ద్రవ్యోల్బణం, రూపాయి స్థిరత్వం పరంగా వచ్చిన లాభాలు దెబ్బతినకుండా ఎంతో తటస్థంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. గత నెలలో టెర్రా–లూనా క్రిప్టోకరెన్సీ భారీ పతనం గురించి ప్రస్తావిస్తూ.. ఇది ఎంతో ముఖ్యమైన హెచ్చరికగా పేర్కొన్నారు. ‘‘క్రిప్టో కరెన్సీలను చూసి నేను ఉద్వేగం చెందను. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో బలీయమైన శక్తుల ప్రభావాన్ని మనం తెలుసుకోలేకపోవచ్చు. అందుకే నేను ఫిన్‌టెక్ ఆధారిత ఈ తరహా ఆవిష్కరణలైన డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ (డెఫి), క్రిప్టోలను ఆహ్వానించే విషయంలో రక్షణాత్మకంగా వ్యవహరించాను. ఈ విషయంలో నేను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి రవిశంకర్ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. ప్రస్తుతానికి క్రిప్టో కరెన్సీలు, డెఫీలను అచ్చమైన ఫైనాన్షియల్ ఆవిష్కరణలుగా చూడడం కంటే.. నియంత్రణపరమైన మధ్యవర్తిత్వం అవసరమని రవిశంకర్ చెప్పారు. అవి మరింత వికేంద్రీకృతమైతే, నియంత్రణ లేకపోతే.. అది కరీబియన్ సముద్రపు దొంగల ప్రపంచం లేదా అందరి దగ్గర ఉన్నవి ఎవరో ఒకరు లాగేసుకునే ప్రపంచంగా మారిపోవచ్చు’’అని నాగేశ్వరన్ క్రిప్టోలపై తన అభిప్రాయాలను, నియంత్రణ అవసరాన్ని తెలియజేశారు. క్రిప్టోలను చట్టబద్ధం చేయవద్దని ఆర్బీఐ కేంద్రానికి బలంగా సూచించడం తెలిసిందే. దీంతో క్రిప్టో లాభాలపై పన్ను విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ సొంతంగా డిజిటల్ రూపీని ఆవిష్కరించే కార్యక్రమంలో ఉండడం తెలిసిందే. చదవండి: Bloodbath In Crypto Markets: మార్కెట్ క్యాప్ ఢమాల్!