సాక్షి, హైదరాబాద్: ఈనెల 17న తుక్కుగూడలో నిర్వహించనున్న ‘విజయభేరి’ సభకు భద్రత కల్పించాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు డీజీపీ అంజనీకుమార్‌ను కోరారు. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్ర వారం డీజీపీ కార్యాలయంలో అంజనీకుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సభకు ఏఐ సీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తదితర కాంగ్రెస్ అతిరథ మహా రథులు, లక్షలాది మంది ప్రజలు హాజరవుతున్న నేపథ్యంలో తగిన భద్రత కల్పించాలని ఈ వినతి పత్రంలో పేర్కొన్నారు.
డీజీపీని కలిసిన వారిలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు, కాంగ్రెస్ నేతలు అంజన్‌కుమార్ యాదవ్, బలరాం నాయక్, మల్లు రవి తదితరులున్నారు. రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జీతాలు రాక ఆత్మహత్య చేసుకున్న రవీందర్ ఘటన గురించి డీజీపీ అంజనీకుమార్‌తో మాట్లాడామని, ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్య కాబట్టి సీఎం కేసీఆర్‌పై హత్యానేరం నమోదు చేయాలని కోరినట్టు చెప్పారు.
ఈనెల 16,17 తేదీల్లో తాజ్‌కృష్ణ హోటల్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు జరుగుతాయని, 17న విజయభేరి సభ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాలకు భద్రత కల్పించాలని, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడాలని డీజీపీని కోరినట్టు చెప్పారు.
తన హయాంలోనే పార్టీకి ప్రాధాన్యత
తాను పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రాధాన్యత పెరిగిందని రేవంత్‌రెడ్డి చెప్పారు. అధిష్టానంతో కొట్లాడి రాష్ట్ర నాయకులకు పదవులు తెస్తున్నానని, గతంలో ఎన్నడూ జరగని కార్య క్రమాలు ఈ రెండేళ్లలో జరిగాయన్నారు.
శుక్ర వారం గాంధీభవన్‌లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోతే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికలు జరిగే ఇతర రాష్ట్రాల్లో సీడబ్ల్యూసీ సమావేశాలు పెట్టకుండా ఇక్కడ పెడుతున్నారంటేనే తెలంగాణకు కాంగ్రెస్ ఎంతటి ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు.
రవీందర్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: సీఎం కేసీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ
రెండునెలలుగా జీతాలు లేక హోంగార్డు రవీందర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అది ముమ్మాటి కీ ప్రభుత్వం చేసిన హత్యేనని టీపీసీసీ అధ్యక్షు డు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు రేవంత్ శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. కనీసం రవీందర్ ఆత్మహత్యపై ఒక్క మంత్రి, ఒక్క అధికారి కూడా స్పందించకపో వడం దారుణమని, తెలంగాణ ప్రభుత్వ నిర్వా కం కారణంగానే హోంగార్డులు మనోవేదనను అనుభ విస్తున్నారని తెలిపారు.
వారి ఉద్యోగా లను క్రమబద్ధీకరిస్తామని 2017లో అసెంబ్లీ సాక్షిగా సీఎం ఇచ్చిన హామీకే ఇప్పటివరకు దిక్కు లేకుండా పోయిందని విమర్శించారు. వెంటనే హోంగార్డుల సర్వీసులను రెగ్యులరైజ్ చేయా లని, ఆత్మహత్యకు పాల్పడిన రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవా లని, రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని కేసీఆర్‌కు రాసిన లేఖలో రేవంత్‌రెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment