Year Ender 2024: రక్షణరంగంలో విజయాలు.. సరికొత్త రికార్డులు | Year Ender 2024, Here's The List Of Top 10 Milestones Of India Achieved In Defence Sector | Sakshi
Sakshi News home page

Year Ender 2024: రక్షణరంగంలో విజయాలు.. సరికొత్త రికార్డులు

Published Tue, Dec 31 2024 9:19 AM | Last Updated on Tue, Dec 31 2024 10:32 AM

Year Ender 2024 India Achieved many Milestones in Defence Sector

మనం 2024కు వీడ్కోలు పలకబోతున్నాం. గడచిన ఈ ఏడాదిలో రక్షణ రంగంలో దేశం పలు విజయాలను సాధించింది. వీటిలో చైనాతో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసీ)వెంబడి దళాల ఉపసంహరణ, లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సీఏ) తేజస్ ఎంకే 1ఏకు మొదటి టెస్ట్ ఫ్లైట్, హైపర్‌సోనిక్ క్షిపణి పరీక్ష మొదలైనవి ఉన్నాయి. భారతదేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసిన అంశాలను ఒకసారి గుర్తుచేసుకుందాం.

1. చైనాతో సరిహద్దు వివాదం
2024 అక్టోబరులో భారత్‌- చైనాలు దేప్సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాలలో పెట్రోలింగ్ ఏర్పాట్లపై దళాల తొలగింపు చివరి దశపై అంగీకారం తెలిపాయి. ఈ ఉత్తర లడఖ్ ప్రాంతంలో గతంలో పలు వివాదాలు ఉన్నాయి.

2. మిషన్ దివ్యాస్త్ర
మార్చిలో భారత్‌.. అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి దివ్యస్త్రతో మల్టిపుల్ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్‌వి)ని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి ఏకకాలంలో పలు ఆయుధాలను మోసుకెళ్లగలదు.

3. ప్రాజెక్ట్ జోరావర్
జూలైలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ), లార్సెన్ అండ్‌ ట్రాబ్ (ఎల్‌ అండ్‌ టీ) లడఖ్‌లో చైనాకు చెందిన జేక్యూ-15ని ఎదుర్కొనేందుకు రూపొందించిన లైట్ ట్యాంక్‌ను అభివృద్ధి చేశాయి. ఈ ట్యాంక్ బరువు 25 టన్నులు. ఇది త్వరలోనే సైన్యంలో చేరనుంది.

4. తేజస్ ఎంకే 1ఏ విమానం
మార్చి 28న తేజస్ ఎంకే 1ఏకు చెందిన తొలి విమానం విజయవంతమైంది. భారత వైమానిక దళానికి చెందిన పాత విమానాల స్థానంలో దీనిని రూపొందించారు.

5. ఐఎన్‌ఎస్‌ అరిఘాట్ 
ఆగస్టు 29న భారత్‌కు చెందిన రెండవ అరిహంత్-తరగతి అణు జలాంతర్గామి.. ఐఎన్‌ఎస్‌ అరిఘాట్‌ను ప్రారంభించింది. ఈ జలాంతర్గామి భారతదేశ భద్రతను మరింత పటిష్టం చేస్తుంది.

6. అణు క్షిపణి పరీక్ష
ఐఎన్‌ఎస్‌ అరిఘాట్‌ను ప్రారంభించిన కొన్ని నెలల తర్వాత, భారతదేశం కే-4 బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. ఇది 3,500 కి.మీ. రేంజ్‌ సామర్థ్యం కలిగివుంది.

7. హైపర్సోనిక్ క్షిపణి పరీక్ష
నవంబర్‌లో భారత్ ఒడిశా తీరంలో సుదూర శ్రేణి హైపర్‌సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.

8. కొత్త నేవీ హెలికాప్టర్ల కమిషన్
మార్చిలో భారత నౌకాదళం కొత్త ఎంహెచ్‌-60ఆర్‌ హెలికాప్టర్ల స్క్వాడ్రన్‌ను ప్రారంభించింది. యాంటీ సబ్‌మెరైన్ హెలికాప్టర్లలో ఇది ఒకటి.

9. సీ295 ఎయిర్‌క్రాఫ్ట్ 
అక్టోబర్‌లో భారత్‌,, గుజరాత్‌లో సీ-295 రవాణా విమానాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇక్కడ అవ్రో-748 విమానాలను తయారు చేస్తారు.

10. రుద్రం-II 
మేలో భారత్‌ ఎస్‌యూ-30ఎంకేఐ నుండి రేడియేషన్ నిరోధక క్షిపణి రుద్రమ్-IIను విజయవంతంగా పరీక్షించింది. ఇది శత్రు వాయు రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడానికి రూపొందించారు.

ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎనిమిది ఘటనలు.. రాజకీయాల్లో పెనుమార్పులు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement