Lookback Politics
-
Year Ender 2024: రక్షణరంగంలో విజయాలు.. సరికొత్త రికార్డులు
మనం 2024కు వీడ్కోలు పలకబోతున్నాం. గడచిన ఈ ఏడాదిలో రక్షణ రంగంలో దేశం పలు విజయాలను సాధించింది. వీటిలో చైనాతో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ)వెంబడి దళాల ఉపసంహరణ, లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్సీఏ) తేజస్ ఎంకే 1ఏకు మొదటి టెస్ట్ ఫ్లైట్, హైపర్సోనిక్ క్షిపణి పరీక్ష మొదలైనవి ఉన్నాయి. భారతదేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసిన అంశాలను ఒకసారి గుర్తుచేసుకుందాం.1. చైనాతో సరిహద్దు వివాదం2024 అక్టోబరులో భారత్- చైనాలు దేప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాలలో పెట్రోలింగ్ ఏర్పాట్లపై దళాల తొలగింపు చివరి దశపై అంగీకారం తెలిపాయి. ఈ ఉత్తర లడఖ్ ప్రాంతంలో గతంలో పలు వివాదాలు ఉన్నాయి.2. మిషన్ దివ్యాస్త్రమార్చిలో భారత్.. అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి దివ్యస్త్రతో మల్టిపుల్ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్‌వి)ని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి ఏకకాలంలో పలు ఆయుధాలను మోసుకెళ్లగలదు.3. ప్రాజెక్ట్ జోరావర్జూలైలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ), లార్సెన్ అండ్ ట్రాబ్ (ఎల్ అండ్ టీ) లడఖ్‌లో చైనాకు చెందిన జేక్యూ-15ని ఎదుర్కొనేందుకు రూపొందించిన లైట్ ట్యాంక్‌ను అభివృద్ధి చేశాయి. ఈ ట్యాంక్ బరువు 25 టన్నులు. ఇది త్వరలోనే సైన్యంలో చేరనుంది.4. తేజస్ ఎంకే 1ఏ విమానంమార్చి 28న తేజస్ ఎంకే 1ఏకు చెందిన తొలి విమానం విజయవంతమైంది. భారత వైమానిక దళానికి చెందిన పాత విమానాల స్థానంలో దీనిని రూపొందించారు.5. ఐఎన్ఎస్ అరిఘాట్ ఆగస్టు 29న భారత్‌కు చెందిన రెండవ అరిహంత్-తరగతి అణు జలాంతర్గామి.. ఐఎన్ఎస్ అరిఘాట్‌ను ప్రారంభించింది. ఈ జలాంతర్గామి భారతదేశ భద్రతను మరింత పటిష్టం చేస్తుంది.6. అణు క్షిపణి పరీక్షఐఎన్ఎస్ అరిఘాట్‌ను ప్రారంభించిన కొన్ని నెలల తర్వాత, భారతదేశం కే-4 బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. ఇది 3,500 కి.మీ. రేంజ్ సామర్థ్యం కలిగివుంది.7. హైపర్సోనిక్ క్షిపణి పరీక్షనవంబర్లో భారత్ ఒడిశా తీరంలో సుదూర శ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.8. కొత్త నేవీ హెలికాప్టర్ల కమిషన్మార్చిలో భారత నౌకాదళం కొత్త ఎంహెచ్-60ఆర్ హెలికాప్టర్ల స్క్వాడ్రన్‌ను ప్రారంభించింది. యాంటీ సబ్‌మెరైన్ హెలికాప్టర్లలో ఇది ఒకటి.9. సీ295 ఎయిర్‌క్రాఫ్ట్ అక్టోబర్‌లో భారత్,, గుజరాత్లో సీ-295 రవాణా విమానాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇక్కడ అవ్రో-748 విమానాలను తయారు చేస్తారు.10. రుద్రం-II మేలో భారత్ ఎస్‌యూ-30ఎంకేఐ నుండి రేడియేషన్ నిరోధక క్షిపణి రుద్రమ్-IIను విజయవంతంగా పరీక్షించింది. ఇది శత్రు వాయు రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడానికి రూపొందించారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎనిమిది ఘటనలు.. రాజకీయాల్లో పెనుమార్పులు -
Year Ender 2024: ఎనిమిది ఘటనలు.. రాజకీయాల్లో పెనుమార్పులు
ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా నూతన సంవత్సరం-2025 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని గంటల్లోనే 2024 ముగియనుంది. తరువాత జనం నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోనున్నారు. కొత్త సంవత్సరంలో కొత్త విషయాలు చోటుచేసుకోబోతున్నప్పటికీ, భారత రాజకీయాలకు 2024 ప్రధానమైనదిగా నిలిచింది. 2024లో ప్రధాని మోదీ వరుసగా మూడోసారి ప్రధాని కావడం, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలుకెళ్లడం, 24 ఏళ్లు ఒడిశా సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ ఎన్నికల్లో ఓడిపోవడం వంటి ఘటనలు ఎప్పటికీ మరచిపోలేనివిగా నిలిచాయి.లోక్‌సభ ఎన్నికలు- 20242024 సార్వత్రిక ఎన్నికలకు(General Elections) ఓటింగ్ ఏప్రిల్ 19- జూన్ ఒకటి మధ్య ఏడు దశల్లో జరిగింది. ఈసారి ఎన్నికల ఫలితాలు పలు రాజకీయ పార్టీలకు షాకింగ్‌గా నిలిచాయి. కేంద్రంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. భారత మొదటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడవసారి ప్రధానమంత్రి అయిన ఘనత ప్రధాని మోదీ దక్కించుకున్నారు.అయోధ్యలో బీజేపీ ఓటమి2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడ్డాయి. 400 ఫిగర్ దాటుతుందనే నినాదం అందుకున్న బీజేపీ 240 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. ఉత్తరప్రదేశ్‌లోని 80 సీట్లకు గాను బీజేపీకి 37 సీట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ మిత్రపక్షమైన ఆర్ఎల్డీకి రెండు సీట్లు, అప్నాదళ్కి ఒక సీటు లభించాయి. దేశంలోనే అత్యంత హాట్ సీటుగా నిలిచిన అయోధ్య లోక్‌సభ స్థానంలో బీజేపీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.జైలుకెళ్లిన కేజ్రీవాల్ఎక్సైజ్ పాలసీ ‘స్కామ్’కు సంబంధించిన అవినీతి కేసులో అప్పటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్‌ను మద్యం కుంభకోణంలో 2024, మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసును ఈడీ, సీబీఐ రెండూ విచారించాయి. ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు జూలై 12న సుప్రీంకోర్టు నుంచి బెయిల్ లభించింది. జైలు నుంచి బయటకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ తాను ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేజ్రీవాల్ సెప్టెంబర్ 17న రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం చెలరేగింది.హేమంత్ సోరెన్ జైలు జీవితం2024లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) నేత, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అవినీతి కుంభకోణంలో జనవరిలో జైలుకు వెళ్లారు. ఆ తర్వాత చంపై సోరెన్ జార్ఖండ్ సీఎం అయ్యారు. అయితే ఆ తర్వాత బెయిల్ పొందిన హేమంత్ సోరెన్ తిరిగి సీఎం పదవిని చేపట్టారు. ఈఘటనల దరిమిలా చంపై సోరెన్ జెంఎంఎంను వీడి, భారతీయ జనతా పార్టీలో చేరారు. అయితే ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం మరోసారి విజయం సాధించి, హేమంత్ సోరెన్ జార్ఖండ్ సీఎం అయ్యారు.నవీన్ పట్నాయక్ ఓటమిఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలతో పాటు ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఒడిశా రాజకీయాల్లో తిరుగులేని నేతగా పేరొందిన నవీన్ పట్నాయక్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి 51 సీట్లకు తగ్గగా, బీజేపీకి 78 సీట్లు రావడంతో పట్నాయక్ 24 ఏళ్ల పాలనకు తెరపడింది.ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రంనెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra) ఈ ఏడాది రాజకీయాల్లో క్రియాశీలక అరంగేట్రం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్ లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న రాహుల్ గాంధీ.. వయనాడ్ స్థానాన్ని వదిలి రాయ్‌బరేలీ స్థానానికి ఎంపీగా కొనసాగారు. వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా ప్రియాంక గాంధీని వయనాడ్ స్థానం నుండి బరిలోకి దింపింది. ఈ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ 64.99శాతం ఓట్లతో విజయం సాధించి తొలిసారి పార్లమెంటుకు చేరుకున్నారు.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలుఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మహాయుతి కూటమికి నిరాశే ఎదురైంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి మహారాష్ట్ర ప్రజలు మద్దతు పలికారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి 288 స్థానాలకు గానూ 230 స్థానాల్లో విజయం సాధించింది. మహాకూటమిలో భాగమైన బీజేపీ 132 సీట్లు, శివసేన 57 సీట్లు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 41 సీట్లు గెలుచుకున్నాయి. మరోవైపు ఎంవీఏ ఘోర పరాజయాన్ని చవిచూసింది. మొత్తం మీద 46 సీట్లు మాత్రమే గెలుచుకుంది. దాదాపు 48 ఏళ్లుగా మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం విశేషం.ఢిల్లీ సీఎంగా అతిశీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో ఢిల్లీ సీఎం ఎవరనేదానిపైనే చర్చ జరిగింది. మనీష్ సిసోడియాకు ఢిల్లీ సీఎం పదవి ఇవ్వవచ్చని అంతా భావించారు. అయితే అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు మనీష్ సిసోడియా కూడా అన్ని పదవులకు రాజీనామా చేశారు. దీంతో పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఢిల్లీ సీఎం పదవికి అతిశీ పేరును ప్రతిపాదించారు. అందరి అంగీకారంతో అతిశీ ఢిల్లీ సీఎం అయ్యారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: 180 ఐఏఎస్‌లు, 200 ఐపీఎస్‌ల ఎంపిక.. టాప్‌లో ఏ రాష్ట్రం? -
Year Ender 2024: 180 ఐఏఎస్‌లు, 200 ఐపీఎస్‌ల ఎంపిక.. టాప్‌లో ఏ రాష్ట్రం?
2024 మరికొద్ది గంటల్లో ముగియనుంది. వెంటనే 2025 ఆవిష్కృతం కానుంది. గడచిన 2024 ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్, పోలీస్ సర్వీస్‌లకు ప్రత్యేకంగా నిలిచింది. 2024లో దేశవ్యాప్తంగా 180 మంది ఐఏఎస్‌లు, 200 మంది ఐపీఎస్‌లు ఎంపికయ్యారు.ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ ఆల్ ఇండియా ర్యాంక్ వన్ సాధించారు. అనిమేష్ ప్రధాన్ రెండో ర్యాంక్, అనన్యారెడ్డి మూడో ర్యాంకు దక్కించుకున్నారు. వీరంతా యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించేందుకు ఎంతో కష్టపడ్డారు. నిబద్ధతతో చదువుకుంటూ, ఉత్తీర్ణులై అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌లో స్థానం సంపాదించారు.2024 యూపీఎస్సీ ఫలితాల్లో ఉత్తీర్ణులైనవారిలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌కు చెందిన అభ్యర్థులు అత్యధికంగా ఉన్నారు. యూపీ నుంచి గరిష్టంగా 27 మంది ఐఎఎస్ అధికారులు ఎంపికయ్యారు. రెండో స్థానంలో రాజస్థాన్‌కు చెందిన 23 మంది అభ్యర్థులు ఐఏఎస్‌లుగా ఎంపికయ్యారు. బీహార్ నుంచి 11 మంది, మధ్యప్రదేశ్ నుంచి 7 మంది అభ్యర్థులు అధికారులుగా ఎన్నికయ్యారు.ఈ ఏడాది టాప్ 5 ర్యాంకుల్లో ఉన్న ముగ్గురు అభ్యర్థులు ఇప్పటికే ఐపీఎస్ అధికారులు. వన్ ర్యాంక్ సాధించిన ఆదిత్య శ్రీవాస్తవ, నాల్గవ ర్యాంక్ సాధించి పీకే సిద్ధార్థ్ రామ్‌కుమార్, ఐదవ ర్యాంక్ సాధించిన రౌహానీలు ఇప్పటికే హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. గత 11 ఏళ్లుగా సర్వీస్‌లో ఉంటున్న ఒక అధికారి యూపీఎస్సీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ వన్ సాధించడం ఇదే తొలిసారి. అంతకుముందు 2013లో ఐపీఎస్ అధికారి గౌరవ్ అగర్వాల్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ వన్ సాధించారు.ఐఎఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఉద్యోగాల నియామకం కోసం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షను నిర్వహిస్తుంటుంది. ఈ పరీక్షను ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ప్రక్రియతో సహా మూడు దశల్లో నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం సుమారు తొమ్మిది లక్షల నుండి 10 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతుంటారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: జమ్ముకశ్మీర్‌కు మరింత ప్రత్యేకం.. 2025కు ఇలా స్వాగతం -
Year Ender 2024: జమ్ముకశ్మీర్‌కు మరింత ప్రత్యేకం.. 2025కు ఇలా స్వాగతం
2024 కొద్ది గంటల్లో ముగియనుంది. 2025 మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మధ్యకాలంలో మనం గడచిన ఏడాది మిగిల్చిన గురుతులను ఒకసారి నెమరువేసుకుందాం. ముఖ్యంగా 2024 ఎంతో ప్రత్యేకంగా నిలిచిన జమ్ముకశ్మీర్ గురించి చర్చిద్దాం.2024 అక్టోబర్ 8న జమ్ముకశ్మీర్‌లో తొలిసారిగా కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం ఏర్పాటయ్యింది. నేషనల్ కాన్ఫరెన్స్ అధికార హోదాను దక్కించుకుంది. ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) అత్యధిక మెజారిటీతో కొత్త అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అయితే పూర్తి రాష్ట్ర హోదా లేని కారణంగా ఈ ప్రభుత్వానికి మునుపటిలా అత్యధిక అధికారాలు లేవు. దీంతో పరిమిత అధికారాలతో ప్రభుత్వాన్ని నడపడం ఒమర్ అబ్దుల్లాకు సవాల్‌గా మారింది. అయితే ఈసారి జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం విలసిల్లింది.జమ్ముకశ్మీర్‌లో ఐదు లోక్‌సభ స్థానాలున్నాయి. 2024లో ఇక్కడ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో(General election) గత 35 ఏళ్ల రికార్డు బద్దలయ్యింది. 58.46 శాతం ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగి, 63.5 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి వేర్పాటువాదులు, జమాత్-ఎ-ఇస్లామీతో సంబంధం ఉన్నవారు కూడా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జమాత్-ఎ-ఇస్లామీ నిషేధానికి గురైనా, దానికి మద్దతు పలికిన అభ్యర్థులు 10 స్థానాల్లో పోటీకి దిగారు. వీరిలో చాలామంది తమ డిపాజిట్లను కూడా కాపాడుకోలేకపోయారు. 2019లో పుల్వామా దాడి తర్వాత జమాత్‌పై నిషేధం విధించారు.మరోవైపు జమ్ము డివిజన్లోని రియాసి, దోడా, కిష్త్వార్, ఉధంపూర్లలో పాకిస్తానీ ఉగ్రవాదులు(Pakistani terrorists) దాడులకు పాల్పడటం భారత భద్రతా ఏజన్సీల ఆందోళనను పెంచింది. జూన్ 9న రియాసిలో ఏడుగురు యాత్రికులు శివ్ ఖోరీ తీర్థయాత్ర నుండి బస్సులో తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు వారిని లక్ష్యంగా చేసుకున్నారు. అదేవిధంగా ఉధంపూర్, కిష్త్వార్లలో ముగ్గురు గ్రామ రక్షణ గార్డులు మృతిచెందారు. వేర్వేరు ఉగ్రవాద ఘటనల్లో 18 మంది భద్రతా దళాల సిబ్బంది అమరులయ్యారు.రాబోయే 2025లో జమ్ముకశ్మీర్‌లో శాంతియుత పరిస్థితులు కొనసాగేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. భద్రతా సంస్థలు మరింత ఉత్సాహంగా పాక్ చొరబాటు ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రణాళికలను రచిస్తున్నాయి. 2019కి ముందున్న కాశ్మీర్ అందాలను కాపాడుతూ, ఇక్కడ అల్లరి మూకల హింసాకాండ చెలరేగకుండా భద్రతా సంస్థలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. కాగా కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని వాగ్దానం చేసింది. సుప్రీంకోర్టు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.ఇది కూడా చదవండి: 100 శాతం ఫలితాలతో క్యాన్సర్ ఔషధం.. త్వరలో అందుబాటులోకి.. -
Year Ender 2024: ఐదు ఘటనలు.. రాజధానిలో సంచలనం
2024 ముగింపు దశకు వచ్చింది. 2024లో దేశంలోని రాజకీయాలతో పాటు సామాన్యుల జీవితాలను కూడా కుదిపేసే పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైలుకు వెళ్లడం, విమానాలకు బాంబు బెదిరింపులు, పలుచోట్ల కాల్పులు వంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఇవి జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపడంతో ఆందోళన కలిగించాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం..1. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు జైలుఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి జైలుకు వెళ్లడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను 2024, మార్చి 21న అరెస్టు చేశారు. కేజ్రీవాల్‌తో పాటు ఆయన పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా ఈ కేసులో జైలుకు వెళ్లారు. ఈ కేసును సీబీఐ, ఈడీ విచారించాయి. అయితే సెప్టెంబర్ 13న సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు దర్యాప్తులో ఉంది.2. కోచింగ్ సెంటర్లో ప్రమాదం2024, జూలై 27న ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్లో యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఇక్కడి రావు కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోని లైబ్రరీలో 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. భారీ వర్షాల కారణంగా బేస్మెంట్లోకి నీరు ప్రవేశించింది. ముగ్గురు విద్యార్థులు ఆ నీటిలో మునిగి మృతిచెందారు. ఈ దుర్ఘటన అనంతరం పలువురు విద్యార్థులు కోచింగ్ సెంటర్ ముందు నిరసనకు దిగారు. ప్రమాదానికి కారణమైన కోచింగ్ సెంటర్ భవన యజమానులతో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ ఫైర్ డిపార్ట్మెంట్కు చెందిన ఇద్దరు అధికారులు ఈ లైబ్రరీకి సంబంధించిన సమాచారాన్ని దాచినందుకు వారిని సస్పెండ్ చేశారు.3. ఓట్ల లెక్కింపుపై నిషేధంఈ ఏడాదిలో జరిగిన ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ (డియుఎస్‌యు) ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును హైకోర్టు నిషేధించింది. ఎన్నికల సమయంలో యూనివర్శిటీ క్యాంపస్‌లో అపరిశుభ్రతతో పాటు అరాచకాలు చోటుచేసుకోవడంతో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. యూనివర్శిటీ క్యాంపస్ మొత్తాన్ని విద్యార్థి నాయకులు శుభ్రం చేయాలని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాతే ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కోర్టు అనుమతించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థి నేతలను కోర్టు హెచ్చరించింది.4. తరచూ ఫేక్ బాంబ్ కాల్స్దేశ రాజధాని ఢిల్లీలో 2024 మే నుండి ఫేక్ కాల్స్, మెయిల్ల ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇవి డిసెంబరు వరకూ కొనసాగాయి. మేలో తొలిసారిగా ఢిల్లీలోని 200 పాఠశాలలు, విద్యాసంస్థలకు నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆ తరువాత ఆస్పత్రులు, పాఠశాలలు, విమానాశ్రయాలకు వివిధ సమయాల్లో బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇటువంటి సందర్భాల్లో పోలీసులు అప్రమత్తమై ముమ్మర తనిఖీలు జరిపారు.5. కాల్పులు, దోపిడీలుఈ ఏడాది ఢిల్లీలో పలు నేర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఇవి చోటుచేసుకున్నాయి. పలుచోట్ల బహిరంగంగా కాల్పులు జరిగాయి. ఇటువంటి ఘటనల్లో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. జైలుకెళ్లిన పేరుమోసిన గ్యాంగ్స్టర్ల పేరుతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో కాల్పులు, దోపిడీ ఘటనలు జరిగాయి.ఇది కూడా చదవండి: Year Ender 2024: చిన్న పొరపాట్లు.. పెను ప్రమాదాలు -
Year Ender 2024: ఎన్నటికీ మరువలేని ఐదు విషాదాలు
కొత్త ఏడాది(2025)లోకి మనమంతా అడుగుపెట్టేందుకు ఇక కొద్దిరోజులే మిగిలున్నాయి. ఈ తరుణంలో మన మదినిండా కొత్త ఆశలు చిగురిస్తాయి. అదేసమయంలో పాత ఊసులు కూడా మదిలో మెదులుతుంటాయి. 2024లో దేశంలో పలు విషాదకర ఉదంతాలు చోటుచేసుకున్నాయి. వాటిలోని ముఖ్యమైన ఐదు ఉదంతాలను మనం ఎప్పటికీ మరువలేం. వాటిని ఒకసారి గుర్తుచేసుకుందాం. రాజ్‌కోట్ గేమింగ్ జోన్ 2024, మే 25న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని గేమింగ్ జోన్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 24 మంది మృతిచెందారు. మృతుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారు. ఇది సౌరాష్ట్రలోనే అతిపెద్ద గేమింగ్ జోన్‌గా పేరొందింది. ఈ ఘటన దరిమిలా పోలీసులు గేమింగ్ జోన్ యజమాని యువరాజ్ సింగ్ సోలంకితో పాటు మేనేజర్‌ను అరెస్టు చేశారు. అగ్నిమాపక శాఖ నుండి ఎన్ఓసీ లేకుండా ఈ గేమింగ్ జోన్ నిర్వహిస్తున్నారని, ఇదే ప్రమాదానికి ప్రధాన కారణమని తేలింది.హత్రాస్ తొక్కిసలాటయూపీలోని హత్రాస్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట పెను విషాదానికి దారితీసింది. సింకదారావులోని ఒక మైదానం.. సత్సంగం సందర్భంగా శ్మశాన వాటికలా మారింది. 2024, జూలై 2న హత్రాస్‌లోని పుల్రాయి గ్రామంలో సత్సంగం నిర్వహించారు. అనంతరం భోలే బాబా తన కారులో ఆశ్రమానికి తిరుగుపయనమయ్యారు. అదే సమయంలో బాబా పాదాలను తాకేందుకు జనం ప్రయత్నించారు. ఈ సందర్బంగా తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 121 మంది మృతిచెందారు. ఈ కేసులో ప్రధాన నిందితునిగా దేవ్ ప్రకాష్ మధుకర్‌తో సహా తొమ్మదిమందిని చేర్చారు. అయితే భోలే బాబా అలియాస్ సూరజ్‌పాల్‌ను ఈ కేసులో నిందితునిగా పేర్కొనకపోవడం విశేషం.వయనాడ్ విలయం2024, జూలై 30వ తేదీ రాత్రి కేరళలోని వయనాడ్‌లో ఘోర విపత్తు చోటుచేసుకుంది. ఇది యావత్‌దేశాన్ని కుదిపేసింది. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో వందలాది మంది మృతిచెందారు. 180 మంది గల్లంతయ్యారు. వారం రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించింది.ఝాన్సీ ఆస్పత్రిలో మంటలు2024, నవంబర్ 15న ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో 18 మంది నవజాత శిశువులు మృతి చెందారు. 16 మంది గాయపడ్డారు. కొందరు శిశువులను వారి తల్లిదండ్రులు కళ్లారా చూసుకోకముందే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదం వెనుక ఆస్పత్రి పాలకవర్గ నిర్లక్ష్యం ఉన్నట్లు స్పష్టమయ్యింది. షార్ట్ సర్క్యూట్ల విషయంలో శ్రద్ధ చూపకపోవడం, సకాలంలో పిల్లలను ప్రమాదం బారి నుంచి తప్పించకపోవడం లాంటివి పెను ప్రమాదానికి దారితీశాయి. ఈ ఘటన దరిమిలా ఝాన్సీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌ను విధుల నుంచి తొలగించగా, మరో ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేశారు.జైపూర్ ట్యాంకర్ రాజస్థాన్‌లోని జైపూర్‌లో 2024, డిసెంబర్ 20న అజ్మీర్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటచేసుకుంది. కంటైనర్ లారీ, ఎల్పీజీ ట్యాంకర్ ఢీకొన్నాయి. వెంటనే ఎల్పిజి ట్యాంకర్‌కున్న అవుట్లెట్ నాజిల్ విరిగిపోయి, గాలిలోకి విష వాయువు వ్యాపించింది. చిన్నపాటి స్పార్క్ ఇంతటి భారీ ప్రమాదానికి కారణమయ్యింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి దాదాపు 40 వాహనాలు దగ్ధమయ్యాయి. కంటైనర్ డ్రైవర్ అజాగ్రత్త కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు విచారణలో తేలింది.ఇది కూడా చదవండి: నాలుగు రాష్ట్రాల్లో ‘మహిళా పథకాలు’.. ప్రయోజనాల్లో తేడాలివే -
Year Ender 2024: కొత్తగా ప్రారంభించిన పథకాలు.. ప్రయోజనాలు ఇవే..
మనమంతా కొద్దిరోజుల్లో 2025లోకి ప్రవేశించబోతున్నాం. ఈ ముగియబోతున్న 2024 కొన్ని రంగాల్లో భారత్‌కు దిశానిర్దేశం చేసింది. ఈ సంవత్సరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కొత్త పథకాలను అమలుచేశాయి. ఇవి అభివృద్ధి చెందుతున్న భారతదేశ కలలను కలలను సాకారం చేసేందుకు దోహదపడనున్నాయి.ఈ సంవత్సరం భారత ప్రభుత్వం దేశంలోని యువతను విద్యా రంగంలో ముందుకు తీసుకెళ్లడానికి పీఎం విద్యాలక్ష్మి లాంటి పథకాలను ప్రవేశపెట్టింది. 2024లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాలతో దేశంలోని అన్నివర్గాలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ క్రమంలో 2024లో కేంద్ర ప్రబుత్వం ఏయే పథకాలను ప్రారంభించిందో తెలుసుకుందాం.పీఎం విద్యా లక్ష్మీ యోజనప్రధాన మంత్రి విద్యా లక్ష్మి యోజన కింద ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందే విద్యార్థులు ఫీజులు, ఇతర ఖర్చులకు హామీ లేకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి రుణాలు పొందుతారు. నవంబర్ 6న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ పథకానికి ఆమోదముద్ర వేశారు.ఈ పథకం కింద విద్యార్థులు ఎటువంటి హామీ లేకుండా రూ.10 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. అదే సమయంలో రూ. 7.5 లక్షల వరకు రుణాలపై, విద్యార్థులు ప్రభుత్వం నుండి 75 శాతం వరకు క్రెడిట్ గ్యారెంటీని పొందుతారు. ఈ పథకం కింద కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 4.5 లక్షలు ఉన్న విద్యార్థులకు వడ్డీపై పూర్తి సబ్సిడీ లభిస్తుంది. ఇదేకాకుండా వార్షిక ఆదాయం రూ. 8 లక్షలున్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు రూ. 10 లక్షల వరకు రుణాలపై మూడు శాతం వడ్డీ రాయితీని ఇస్తారు.బీమా సఖీ పథకంఈ పథకం లక్ష్యం ఆర్థికంగా మహిళలను బలోపేతం చేయడం. పదో తరగతి ఉత్తీర్ణులైన 18 నుండి 70 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన మహిళలు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎల్ఐసీ అందించే బీమా సఖీ పథకం నుంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ పథకం కింద మహిళలను బీమా ఏజెంట్లుగా తీర్చిదిద్దనున్నారు. అలాగే మూడేళ్ల పాటు మహిళలకు ప్రత్యేక శిక్షణ, గౌరవ వేతనం అందించనున్నారు.పీఎం సోలార్ హోమ్ స్కీమ్ప్రధాని నరేంద్ర మోదీ 2024, ఫిబ్రవరి 15న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద దేశంలోని ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకునేందుకు సబ్సిడీని అందిస్తారు.సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్ దేశంలో 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఈ పథకాన్ని మరింతకాలం పెంచారు. ఈ ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశంలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ రూ.5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ అందించనున్నారు. ఇది కూడా చదవండి: 20 Years of Tsunami: రాకాసి అలలను దాటి.. విషసర్పాల కారడవిలో శిశువుకు జన్మనిచ్చి.. -
లోక్‌సభ ఎన్నికల్లో.. సత్తా చాటిన బీజేపీ.. పత్తాలేని బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో లోక్‌సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో జాతీయస్థాయిలో హేమాహేమీలైన పలువురు నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ కోసం ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాం«దీలు సైతం గ్రేటర్లో ప్రచార షోలు నిర్వహించారు. మహా నగర పరిధిలోని నాలుగింట మూడు స్థానాల్లో గెలిచి బీజేపీ తన హవా చాటుకుంది. హైదరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన మాధవీలత పాతబస్తీలో ప్రచారంతో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందారు. ఎప్పటిలాగే హైదరాబాద్ ఎంపీగా ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ (ఐదోసారి) గెలవగా, సికింద్రాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి జి.కిషన్‌రెడ్డి సిట్టింగ్ సీటును నిలుపుకున్నారు. మరోమారు కేంద్రమంత్రి అయ్యారు. దేశంలోనే అత్యధిక ఓట్లున్న మల్కాజిగిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ గెలుపొందారు. చేవెళ్ల నుంచి అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపొందారు. రిక్త ‘హస్తం’ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి సిట్టింగ్ స్థానాన్ని తిరిగి గెలవలేకపోయింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన ఆ నియోజకవర్గంలో తిరిగి కాంగ్రెస్ జెండా ఎగరలేదు. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ల నుంచి పోటీ చేసిన ఆపార్టీ అభ్యర్థులు గడ్డం రంజిత్‌రెడ్డి, సునీతా మహేందర్‌రెడ్డి, దానం నాగేందర్‌లు సైతం ఓటమి పాలయ్యారు. వాడిన గులాబీ.. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటును కూడా దక్కించుకోలేకపోయింది. సికింద్రాబాద్ స్థానానికి సీనియర్ ఎమ్మెల్యే పద్మారావును బరిలో దింపినా ఫలితం లేకుండా పోయింది. మల్కాజిగిరి నుంచి పోటీ చేసిన రాగిడి లక్ష్మారెడ్డి, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యేలుగానే మిగిలారు.. కిషన్‌రెడ్డిని ఎదుర్కొనేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలను బరిలో దింపినా బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు సికింద్రాబాద్‌లో గెలవలేకపోయాయి. పార్టీ మారి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన దానం నాగేందర్, బీఆర్ఎస్ నుంచి నిలబడ్డ పద్మారావులు గెలవలేకపోయారు. కాంగ్రెస్ ఖాతాలో కంటోన్మెంట్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ నుంచి ఆమె సోదరి నివేదిత, బీజేపీ నుంచి బరిలో నిలిచిన వంశీ తిలక్ గెలవలేకపోయారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన శ్రీగణేశ్ గెలిచారు. -
Year Ender 2024: వణికించిన విమాన ప్రమాదాలు
2024 ముగియడానికి ఇక కొద్దిరోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇంతలోనే కజకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 38 మంది ప్రయాణికులు మృతిచెందారు. ఈ ఏడాది అధికంగానే విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.జపాన్ విమాన ప్రమాదం2024 జనవరి 2న జపాన్‌లోని టోక్యోలోని హనెడా విమానాశ్రయంలో జపాన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 516- జపాన్ కోస్ట్ గార్డ్ విమానం పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం 367 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది సురక్షితంగానే ఉన్నారు. అయితే కోస్ట్ గార్డ్ విమానంలోని ఆరుగురు సభ్యులలో ఐదుగురు మృతిచెందారు.బెల్గోరోడ్ ఓబ్లాస్ట్ విమాన ప్రమాదం2024, జనవరి 24న బెల్గోరోడ్ ఒబ్లాస్ట్‌లో రష్యన్ వైమానిక దళానికి చెందిన ఇల్యుషిన్ ఐఎల్ 76 సైనిక రవాణా విమానం కూలిపోయింది. ఈ విమానంలో 65 మంది ఉక్రేనియన్ యుద్ధ ఖైదీలతో పాటు తొమ్మిదిమంది సిబ్బంది ఉన్నారు. వీరంతా మృతిచెందారు.రష్యా విమాన ప్రమాదం2024, మార్చి 12న రష్యాలోని ఇవానోవో ఒబ్లాస్ట్‌లో ఇల్యుషిన్ ఐఎల్76 కార్గో విమానం కూలిపోయింది. దీంతో ఆ విమానంలోని మొత్తం 15 మంది మృతిచెందారు.ఇరాన్ విమాన ప్రమాదం2024, మే 19న ఇరాన్‌లోని తూర్పు అజర్బైజాన్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో సహా మొత్తం తొమ్మిది మంది మృతిచెందారు.మలావి విమాన ప్రమాదం2024, జూన్ 10న మలావీ వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ చిలిమా, ఇతర ప్రముఖులతో ప్రయాణిస్తున్న మలావీ డిఫెన్స్ ఫోర్స్ డోర్నియర్- 228 విమానం కూలిపోవడంతో అందులోని తొమ్మిది మంది మృతిచెందారు.నేపాల్ విమాన ప్రమాదం2024, జూలై 24న నేపాల్‌లోని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన సౌర్య ఎయిర్‌లైన్స్ విమానం కొద్దిసేపటికే కుప్పకూలింది. అందులో ఉన్న 19 మందిలో 18 మంది మృతిచెందారు.విన్హాడో విమాన ప్రమాదం2024, ఆగస్ట్ 9న బ్రెజిల్‌లోని సావోపాలోలోని విన్హెడోలో ఫ్లైట్- 2283 క్రాష్ అయ్యింది. అందులో మొత్తం 62 మంది ప్రయాణికులు మృతిచెందారు. ఇది బ్రెజిల్లో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాలలో ఒకటిగా నిలిచింది.బ్రెజిల్ విమాన ప్రమాదం2024, డిసెంబర్ 22న బ్రెజిల్‌లోని కెనెలా విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైపర్ పీఏ42 చెయెన్నే విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది ప్రయాణికులు మృతిచెందారు. 17 మంది గాయపడ్డారు.కజకిస్తాన్ విమాన ప్రమాదం2024, డిసెంబర్ 25న అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ కజకిస్తాన్‌లోని అక్టౌ సమీపంలో కూలిపోయింది. క్రిస్మస్ రోజున జరిగిన ఈ విమాన ప్రమాదంలో 38 మంది మృతి చెందగా, పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: దుమ్మురేపిన 100 మంది డిజిటల్ స్టార్స్.. -
World Year Ender 2024: హద్దులు దాటిన విమర్శలు.. వివాదాల్లో రాజకీయ ప్రముఖులు
2024కు త్వరలో వీడ్కోలు చెప్పబోతున్నాం. 2025ను స్వాగతించేందుకు సిద్ధమవుతున్నాం. ఈ 2024లో మనకు కొన్ని మంచి అనుభవాలతోపాటు చేదు రుచులు కూడా ఎదురయ్యాయి. అదే సమయంలో కొందరు రాజకీయ ప్రముఖలు తమ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఆ వివాదాస్పద వ్యాఖ్యలేమిటో, ఆ ప్రముఖులెవరో ఇప్పుడు తెలుసుకుందాం.మల్లికార్జున్ ఖర్గేఈఏడాది కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపాయి. ఆయన తన విమర్శల్లో ప్రధాని మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్లను టార్గెట్‌గా చేసుకున్నారు. ‘భారత్‌లో రాజకీయంగా అత్యంత ప్రమాదకరమైనది ఏదైనా ఉందంటే అది బీజేపీ, ఆర్ఎస్ఎస్’ అంటూ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సాంగ్లీలో జరిగిన బహిరంగ సభలో ఖర్గే వ్యాఖ్యానించారు. ‘అవి విషం లాంటివి. ఆ పాము కాటేస్తే మనిషి చనిపోతాడు. అలాంటి విష సర్పాలను చంపేయాలి’ అని కూడా అన్నారు. ఇదేవిధంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీని టార్గెట్ చేసిన ఖర్గే ఆయనను తైమూర్ లాంగ్‌తో పోల్చారు. 400 సీట్లు ఖాయమనే నినాదం అందుకున్న మోదీ ప్రభుత్వం అటు జేడీయూ, ఇటు టీడీపీల అండదండలపైనే ఆధారపడిందని ఖర్గే విమర్శించారు. అలాగే ప్రధాని మోదీని అబద్ధాల నేత అని కూడా ఖర్గే వ్యాఖ్యానించారు. ఇవి రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి.లాలూ ప్రసాద్రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన విమర్శలతో ఈ ఏడాది హెడ్‌లైన్స్‌లో నిలిచారు. ఆయన బీహార్ సీఎం నితీష్ కుమార్ చేపట్టిన మహిళా సంవాద్ యాత్రపై విరుచుకుపడ్డారు. దీనిపై జేడీయూ, బీజేపీలు లాలూపై ప్రతివిమర్శలకు దిగాయి. ‘ఇంతకుముందు లాలూజీ శారీరకంగా మాత్రమే అనారోగ్యంతో ఉన్నారని, ఇప్పుడు మానసికంగా కూడా అస్వస్థతకు గురయ్యారని బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి విమర్శించారు. నితీష్ కుమార్‌కు వ్యతిరేకంగా లాలూ చేసిన వ్యాఖ్యానాలు చాలా అసహ్యకరమైనవి, అవమానకరమైనవని సామ్రాట్ చౌదరి పేర్కొన్నారు.రాహుల్ గాంధీరాహుల్ తన విదేశీ పర్యటనల సందర్భంగా భారత్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టించే ప్రకటనలు చేశారు. వాషింగ్టన్లో రాహుల్ మాట్లాడుతూ భారత్‌లో మతస్వేచ్ఛ తగ్గుతోందని వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు లభించినప్పుడే రిజర్వేషన్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నదని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి భారతదేశంలో లేదని రాహుల్ మరో కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఇవి పెను రాజకీయ దుమారాన్ని రేపాయి.గిరిరాజ్ సింగ్కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఛత్ పండుగ రోజున స్వచ్ఛత గురించి మాట్లాడుతూ సిమ్లాలోని ఒక మసీదు వివాదంపై వ్యాఖ్యానించారు. ఇవి తీవ్ర దుమారాన్ని రేపాయి. మనం ఐక్యంగా ఉంటే మహ్మద్ ఘోరీ, మొఘల్ లాంటివారెవరూ మనల్ని ఓడించలేరని కూడా గిరిరాజ్ సింగ్ అన్నారు.ఇల్తిజా ముఫ్తీఇల్తిజా ముఫ్తీ పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె. ఆమె ‘హిందుత్వం’ను ఒక వ్యాధిగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇల్తిజా ముఫ్తీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక వీడియోను పోస్ట్ చేసి, ఈ వివాదానికి తెరలేపారు.సామ్ పిట్రోడాలోక్సభ ఎన్నికల సందర్భంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఉత్తర భారత్‌లోని ప్రజలు తెల్లగా కనిపిస్తారని, తూర్పు భారత్‌లోని వారు చైనీయులుగా కనిపిస్తారని శామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు. అలాగే దక్షిణ భారత్ ప్రజలు ఆఫ్రికన్ల మాదిరిగా కనిపిస్తారని, పశ్చిమ భారతదేశ ప్రజలు అరబ్బుల మాదిరిగా కనిపిస్తారన్నారు. సామ్ ప్రకటనపై దుమారం రేగడాన్ని చూసిన కాంగ్రెస్ వీటికి దూరంగా ఉంది. ఈ వ్యాఖ్యలు అతని వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొంది.భాయ్ జగ్తాప్కాంగ్రెస్ నేత భాయ్ జగ్తాప్ గతంలో ఎన్నికల కమిషన్‌ను టార్గెట్ చేస్తూ ‘ఎన్నికల కమిషన్ ఒక కుక్క.. ప్రధాని మోదీ బంగ్లా బయట కూర్చుని కాపలా కాస్తుంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఏర్పాటైన ఏజెన్సీలన్నీ ఇప్పుడు కీలుబొమ్మలుగా మారాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఉద్దేశించిన ఈ ఏజెన్సీలు దుర్వినియోగమవుతున్నాయి. వ్యవస్థను ఎలా తారుమారు చేస్తున్నారో దేశవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు తెలియజేస్తున్నాయని’ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఇది కూడా చదవండి: World Year Ender 2024: నిత్యం వెంటాడిన మూడో ప్రపంచ యుద్ధ భయం -
World Year Ender 2024: నిత్యం వెంటాడిన మూడో ప్రపంచ యుద్ధ భయం
2024.. ప్రపంచమంతటినీ యుద్ధ భయం వెంటాడింది. ఒకవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాలు మూడో ప్రపంచ యుద్ధానికి నాందిగా నిలిచాయి. దీనికితోడు భీకర విధ్వంసాన్ని సృష్టించే అణ్వాయుధాల ముప్పు కూడా తొంగిచూసింది. 2024లో ప్రపంచాన్ని అనునిత్యం భయానికి గురిచేసిన యుద్ధాలివే..రష్యా-ఉక్రెయిన్ 2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 2024లో మరింత తీవ్ర స్థాయికి చేరింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌కు రష్యా అంతర్భాగంలో యూఎస్ఏ ఆయుధాలను ఉపయోగించడానికి అనుమతించడం ద్వారా మూడవ ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనదిగా భావించే హైపర్సోనిక్ ఐసీబీఎం క్షిపణిని ఉక్రెయిన్‌పై ప్రయోగించడం ద్వారా రష్యా అవసరమైతే అణుదాడికి కూడా వెనుకాడబోదన్న సందేశాన్ని వెల్లడించింది. ఉక్రెయిన్‌కు సహాయం చేస్తున్న నాటో, అమెరికా, బ్రిటన్లపై దాడి చేస్తామని రష్యా పలుమార్లు హెచ్చరించింది. ఇది మూడో ప్రపంచ యుద్ధ భయాన్ని మరింతగా పెంచింది.ఇజ్రాయెల్-హమాస్ 2023 అక్టోబర్ 7న ప్రారంభమైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం క్రమంగా లెబనాన్, యెమెన్, ఇరాన్, సిరియాలను చుట్టుముట్టింది. గాజాలో ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా యెమెన్ హౌతీలు.. ఏడెన్ గల్ఫ్‌లోని ఓడలను లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో ఇజ్రాయెల్ హమాస్‌తో పాటు హౌతీలతోనూ పోరాడాల్సి వచ్చింది. హౌతీల దాడులను అరికట్టేందుకు అమెరికా, బ్రిటన్ కలిసి యెమెన్‌పై పలుమార్లు భారీ వైమానిక దాడులు నిర్వహించి, హౌతీల కీలక స్థావరాలను ధ్వంసం చేశాయి. ఇజ్రాయెల్ కూడా హౌతీలపై బలమైన ప్రతీకార దాడులను చేపట్టింది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, యాహ్యా సిన్వార్‌లను హతమార్చడం ద్వారా ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మనోధైర్యాన్ని దెబ్బతీసింది. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటివరకు 45 వేల మందికి పైగా జనం మృతిచెందారు.ఇజ్రాయెల్-హెజ్బొల్లా ఇజ్రాయెల్ దళాలు హమాస్ నేతలను హతమార్చిన దరిమిలా ఇజ్రాయెల్ సైన్యం హెజ్బొల్లా స్థావరాలపై వైమానిక దాడి చేపట్టింది. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఈ వైమానిక దాడిలో మరణించాడు. దీని తరువాత, కొత్త చీఫ్ సఫీద్దీన్ కూడా ఇజ్రాయెల్ సైన్యం చేతుల్లో హతమయ్యాడు. తరువాత గాజా తరహాలో ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లో భూ ఆక్రమణకు పాల్పడింది. పేజర్లు, బ్యాటరీ బ్లాస్ట్లను ఉపయోగించి వేలాది మంది హెజ్బొల్లా యోధులను ఇజ్రాయెల్ అంతమొందించింది. ప్రస్తుతం ఇజ్రాయెల్- హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోంది.ఇజ్రాయెల్-ఇరాన్ ఇజ్రాయెల్- హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణకు ముందు హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, యాహ్యా సిన్వార్, హిజ్బుల్లా చీఫ్‌లు హసన్ నస్రల్లా, హషీమ్ సఫీద్దీన్లను అంతమొందించడంతో ఇరాన్ షాక్‌నకు గురయ్యింది. 2024 అక్టోబర్‌లో ఇరాన్ అకస్మాత్తుగా 180 క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఇది ప్రపంచమంతటినీ కలవరానికి గురిచేసింది. ఈ దాడి తరువాత, ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య నెలకొన్న ప్రత్యక్ష యుద్ధం ముప్పు మధ్యప్రాచ్యాన్ని మరింత ఆందోళనలోకి నెట్టేసింది. ఇప్పటికే యూరప్‌లో జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధ ప్రమాద ముప్పును మరింత పెంచింది. ఈ తరుణంలోనే ఇజ్రాయెల్.. ఇరాన్‌పై వైమానిక దాడులతో ప్రతీకారం తీర్చుకుంది. ఇరాన్ సైనిక స్థావరాలను నాశనం చేసింది.సూడాన్- బంగ్లాదేశ్2024లో సూడాన్- బంగ్లాదేశ్‌లలో జరిగిన తిరుగుబాట్లు చరిత్రలో నిలిచిపోతాయి. ఏప్రిల్ 2023 నుంచి సూడాన్ భీకర అంతర్యుద్ధంలో మునిగితేలుతోంది. జుంటా సైన్యం తిరుగుబాటు దరిమిలా సూడాన్ పారామిలిటరీ దళాలు రంగంలోకి దిగాయి. ఈ రెండింటి మధ్య సంవత్సరాల తరబడి భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు వేలాది మంది సైనికులు, ప్రజలు మరణించారు. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం సూడాన్‌లో జరిగిన ఈ అంతర్యుద్ధంలో 27 వేల మందికి పైగా జనం మరణించారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమం కారణంగా ప్రధాని షేక్ హసీనా అధికారం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి మొహమ్మద్ యూనస్ సారధ్యం వహిస్తున్నారు. అదిమొదలు బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగాయి.సిరియాలో.. సిరియాలో సాయుధ తిరుగుబాటుదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. వారు సిరియా రాజధాని డమాస్కస్‌తో సహా అనేక స్థావరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపధ్యంలో సిరియా అధ్యక్షుడు బషర్-అల్-అసద్ దేశం నుండి పారిపోవాల్సి వచ్చింది. ఈ పరిణామాల నేపధ్యంలో రష్యా అసద్‌కు ఆశ్రయం ఇచ్చింది. అనంతరం ఇజ్రాయెల్ సిరియాలోని పలు ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి, ఆ దేశంలోని బఫర్ జోన్‌ను స్వాధీనం చేసుకుంది.ఇది కూడా చదవండి: Year Ender 2024: భారతీయులు అలెక్సాను అడిగిన ప్రశ్నలివే.. జాబితా షేర్ చేసిన అమెజాన్ -
Year Ender 2024: ఈ 10 అంశాలపైనే అంతటా చర్చ
మనమంతా ప్రస్తుతం 2024 చివరి వారంలో ఉన్నాం. ఈ ఏడాది మనదేశంతో పాటు ప్రపంచంలో అనేక ముఖ్యమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా పేరొందిన భారత్‌లో ఎన్నికలు జరగగా, మరోవైపు ప్రపంచంలోని పలు దేశాల్లో యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. 2024లో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచిన 10 అంశాలను ఒకసారి గుర్తుచేసుకుందాం.ఇజ్రాయెల్- ఇరాన్ పోరు2024లో మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. సిరియాలోని డమాస్కస్‌లో దేశ కాన్సులేట్‌పై దాడికి ప్రతిగా ఇరాన్ ఏప్రిల్ 14న ఇజ్రాయెల్‌పై వందల కొద్దీ డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. అనంతరం అక్టోబర్ ఒకటిన ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్‌పై 200కు పైగా క్షిపణులను ప్రయోగించింది. ఆ దరిమిలా ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. మరోవైపు హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి చెందారు. హమాస్ తదుపరి అధినేత యాహ్యా సిన్వార్‌ను గాజాలో ఇజ్రాయెల్ మట్టుబెట్టింది.భారత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ విజయంభారతదేశంలో 2024 ఏప్రిల్, జూన్ 2024 మధ్య లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. 543 స్థానాలకు 7 దశల్లో జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4 న విడుదలయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమి 292 సీట్లు గెలుచుకుని, మెజారిటీ సాధించింది. అదే సమయంలో విపక్ష పార్టీల ఇండియా కూటమి 234 సీట్లు గెలుచుకుంది. ఇతర పార్టీలకు 17 సీట్లు వచ్చాయి. అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీల విషయానికొస్తే బీజేపీ 240, కాంగ్రెస్ 99, సమాజ్ వాదీ 37, తృణమూల్ కాంగ్రెస్ 29, డీఎంకే 22, టీడీపీ 16, జేడీయూ 12 సీట్లు గెలుచుకున్నాయి. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.క్షీణించిన భారత్- కెనడా సంబంధాలు2024 అక్టోబరు మధ్య కాలంలో భారత్- కెనడా మధ్య దౌత్యపరమైన వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్యంతో సహా అనేక రంగాలపై కొంతమేరకు ప్రభావం చూపింది. ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించింది. కెనడా నుండి భారత హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తలను వెనక్కి పిలిచింది.ఎమర్జెన్సీ రోజులకు 50 ఏళ్లు2024, జూన్ 25 నాటికి భారతదేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయ్యింది. ఈ అంశంపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. దేశంలో ఎమర్జెన్సీ కాలం 1975 నుండి 1977 వరకు కొనసాగింది. ఈ సమయంలో దేశంలో పౌర హక్కులు నిలిపివేశారు. పత్రికా స్వేచ్ఛను పరిమితం చేశారు. సామూహిక అరెస్టులు జరిగాయి. ఎన్నికలను వాయిదా వేశారు. ఎమర్జెన్సీ విధించేందుకు నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగంలోని ప్రత్యేక నిబంధనలను చూపించింది.వయనాడ్‌లో విలయం2024, జూలైలో కేరళలోని వయనాడ్‌లో భారీ కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మేప్పాడి, ముండక్కై తదితర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.ఆర్జీ కార్ హత్యాచార ఘటన2024 ఆగస్టులో కోల్‌కతాలోని ఆర్జీ కార్ ఆస్పత్రి ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి, హత్య చేసిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆస్పత్రిలోని సెమినార్ హాల్లో జూనియర్ డాక్టర్ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన దరిమిలా కోల్‌కతాతో సహా దేశంలోని వివిధ ప్రాంతాలలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ ఘటన అనతరం మహిళలపై లైంగిక వేధింపుల అంశం మరోసారి చర్చకు వచ్చింది. బంగ్లాదేశ్‌లో కుప్పకూలిన షేక్ హసీనా ప్రభుత్వం2024 ఆగష్టులో బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరతకు లోనయ్యింది. పలు హింసాత్మక నిరసనల దరిమిలా బంగ్లాదేశ్‌లోని షేక్ హసీనా ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయింది. అనంతరం షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలి భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో హిందువులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి ముహమ్మద్ యూనస్ సారధ్యం వహిస్తున్నారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం2024, నవంబర్ 5న అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చరిత్రాత్మక విజయం సాధించారు. డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌పై ఆయన భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు 312 ఎలక్టోరల్ ఓట్లు రాగా, కమలా హారిస్‌కు 226 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. సెనేట్‌లో కూడా రిపబ్లికన్ పార్టీ మెజారిటీ సాధించింది.సిరియాలో తిరుగుబాటుసిరియాలో చాలాకాలంగా మౌనంగా ఉన్న రెబల్ గ్రూపులు బలాన్ని కూడగట్టుకుని సిరియాలో అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. ఫలితంగా 2000 నుంచి సిరియాను పాలిస్తున్న బషర్ అల్ అసద్ అధికారానికి తెరపడింది. అసద్ సిరియా వదిలి రష్యాలో ఆశ్రయం పొందారు. తిరుగుబాటు గ్రూపు హయత్ తహ్రీర్ అల్-షామ్ సిరియా పరిపాలనను చేపట్టింది.ఇది కూడా చదవండి: Year Ender 2024: 999 బెదిరింపులు.. రెండు కంపెనీల మూసివేత.. ఎయిర్‌లైన్స్ పరిణామాలు -
Year Ender 2024: మారిన ప్రభుత్వాలు.. చేజారిన అధికారాలు
న్యూఢిల్లీ: 2024ను ఎన్నికల సంవత్సరంగా అభివర్ణించారు. ప్రపంచంలోని పలుదేశాల్లో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఈ జాబితాలో బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, పాకిస్తాన్, రష్యా, యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి. ఇదేవిధంగా 2024 జూన్‌లో యూరోపియన్ పార్లమెంటుకు ఎన్నికలను నిర్వహించారు.ఎన్నికల పరంగా 2024 పలు రాజకీయ పార్టీలకు కష్టతరమైన సంవత్సరంగా నిలిచింది. పలు దేశాల్లోని ఓటర్లు ప్రభుత్వ మార్పు కోసం ఓటు వేశారు. ఈ నేపధ్యంలో కొన్ని దేశాల్లో అధికార పార్టీ మెజారిటీ కోల్పోయింది. 2024లో ఓటింగ్ ద్వారా అధికారంలో మార్పులు చోటుచేసుకున్న దేశాల జాబితాలోకి వెళితే..అమెరికా ఈ ఏడాది డెమొక్రాట్లు అమెరికా అధ్యక్ష పదవిని కోల్పోయారు. రిపబ్లికన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ను ఓడించారు. కాంగ్రెస్ ఉభయ సభల్లోనూ రిపబ్లికన్లు మెజారిటీ సాధించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోవడం ఇది వరుసగా మూడోసారి.యునైటెడ్ కింగ్డమ్ 2024, జూలై 4న జరిగిన సాధారణ ఎన్నికల్లో రాజకీయ అధికారం వామపక్షాల చేతుల్లోకి వెళ్లింది. లేబర్ పార్టీ అత్యధిక పార్లమెంటరీ మెజారిటీని సాధించింది. కన్జర్వేటివ్ పార్టీ 14 ఏళ్ల పాలనకు ముగింపు పలికింది.బోట్స్వానా ఈ దక్షిణాఫ్రికా దేశంలో 2024, అక్టొబర్ 30న జరిగిన సాధారణ ఎన్నికలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. బోట్స్వానాలోని డెమోక్రటిక్ పార్టీ దాదాపు 60 ఏళ్ల తర్వాత తొలిసారి అధికారాన్ని కోల్పోయింది. 1966లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశ రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించిన బీడీపీ.. సెంటర్-లెఫ్ట్ ప్రతిపక్షం అంబరిల్లా ఫర్ డెమోక్రటిక్ చేంజ్ (యూడీసీ) చేతిలో ఓడిపోయింది. ఓటర్లు ప్రత్యర్థి పార్టీల వైపు ఎక్కువగా మొగ్గు చూపడంతో బీడీపీ నాలుగో స్థానానికి చేరుకుంది.దక్షిణ కొరియా 2024 ఏప్రిల్‌లో దక్షిణ కొరియా ఓటర్లు నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష డెమొక్రాటిక్ పార్టీకి మెజారిటీ సీట్లు ఇచ్చారు. దీంతో పీపుల్స్ పవర్ పార్టీ అధ్యక్షుడు యున్ సుక్ యోల్ అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. 2024 డిసెంబరు ప్రారంభంలో అధ్యక్షుడు యున్ మార్షల్ లా విధించారు. డెమోక్రటిక్ పార్టీ నేతలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. దీని తరువాత జాతీయ అసెంబ్లీ కూడా యున్‌పై అభిశంసన తీర్మానాన్ని ఆమోదించింది. దీంతో యున్ అధికారం నుంచి దిగిపోవల్సి వచ్చింది. ప్రధాన మంత్రి హన్ దుక్-సూ తాత్కాలిక అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు.ఘనాఘనాలో కొత్త అధ్యక్షునితో పాటు 275 మంది పార్లమెంటు సభ్యులను ఎన్నుకునేందుకు 2024, డిసెంబర్ 7న సాధారణ ఎన్నికలు జరిగాయి. నేషనల్ డెమోక్రటిక్ కాంగ్రెస్ (ఎన్డీసీ) అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు జాన్ మహామా మొదటి రౌండ్లో మెజారిటీ సాధించారు. రీకౌంటింగ్ లేకుండానే గెలిచారు. అధికార న్యూ పేట్రియాటిక్ పార్టీ (ఎన్పీపీ)అభ్యర్థి మహముదు బవుమియా ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. పార్లమెంటరీ ఎన్నికల్లో ఎన్డీసీ 276 స్థానాలకు గాను 185 స్థానాలను గెలుచుకుంది. ఎన్పీపీ 87 స్థానాలను గెలుచుకుంది. స్వతంత్ర అభ్యర్థులు నాలుగు స్థానాల్లో విజయం సాధించి ఎన్డీసీకి పార్లమెంటులో మద్దతు పలికారు.మెజారిటీ కోల్పోయిన అధికార పార్టీల జాబితాలో..దక్షిణాఫ్రికా 2024, మే 29న దక్షిణాఫ్రికాలో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ)కి మెజారిటీ గణనీయంగా తగ్గింది. ఎఎన్సీ అతిపెద్ద పార్టీగా నిలిచినా, పార్లమెంటరీ మెజారిటీని కోల్పోయింది. వర్ణవివక్ష శకం ముగిసిన తర్వాత ఏఎన్సీ మెజారిటీని కోల్పోవడం ఇదే తొలిసారి.జపాన్ఈ ఏడాది జరిగిన జపాన్ సార్వత్రిక ఎన్నికలు చర్చనీయాంశమయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత దేశాన్ని చాలాకాలం పాటు పరిపాలించిన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, దాని సంకీర్ణ భాగస్వామి కొమెయిటో పార్లమెంటులో మెజారిటీని కోల్పోయారు.భారతదేశంఅతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన భారత్‌లో 2024లో జరిగిన సాధారణ ఎన్నికలు ఈ ఏడాది టాప్‌లో నిలిచాయి. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ మూడోసారి ఎన్నికల్లో విజయం సాధించించింది. అయితే అధికార పార్టీ అంచనాలకు భిన్నంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేదు. ఇతర పార్టీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ఎన్నికల్లో విజయం సాధించారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: లీకుల నామ సంవత్సరం -
Year Ender 2024: ప్రధాని మోదీ పర్యటించిన దేశాలివే.. మీరూ ట్రిప్‌కు ప్లాన్ చేసుకోవచ్చు
2024కు వీడ్కోలు పలుకుతూ కొద్దిరోజుల్లో కొత్త ఏడాది 2025ను స్వాగతించబోతున్నాం. ఈ నేపధ్యంలో 2024లో జరిగిన ముఖ్యమైన ఘట్టాలను ఒకసారి నెమరువేసుకుందాం. వాటిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలు ఒకటి. ఈ ప్రాంతాలకు సామాన్యులు కూడా తక్కువ బడ్జెట్‌తో వెళ్లిరావచ్చు.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ అరబ్ దేశంలోని బీఏపీఎస్ హిందూ దేవాలయాన్ని ప్రారంభించారు. భారత్- యూఏఈ మధ్య పలు ఒప్పందాలు కుదుర్చుకునేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను ప్రధాని మోదీ సందర్శించారు. టూరిజంరంగంలో యుఎఈ మరింతగా విస్తరిస్తోంది. దీంతో విదేశాల్లో పర్యటించాలనుకునేవారికి యూఏఈ మొదటి ఎంపికగా మారింది. ఈ దేశంలోని దుబాయ్ నగరాన్ని దర్శించాలని చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. ప్రతి ఏటా భారత్‌తో పాటు పలు దేశాలకు చెందిన పర్యాటకులు యూఏఈని చూసేందుకు తరలివస్తుంటారు.భూటాన్భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే ఆహ్వానం మేరకు ఈ ఏడాది నరేంద్ర మోదీ భూటాన్‌లో పర్యటించారు. భూటాన్ భారత్‌కు పక్కనేవున్న పర్యాటక దేశంగా గుర్తింపు పొందింది. తక్కువ బడ్జెట్లో విదేశాలకు వెళ్లాలనుకునేవారికి భూటాన్ సందర్శన ఉత్తమ ఎంపిక. వీసా లేకుండా భూటాన్‌లో 14 రోజుల పాటు ఉండేందుకు భారతీయులకు అనుమతి ఉంది. భూటాన్ వెళ్లేవారు అక్కడి అందమైన అడవులను, దేవాలయాలను సందర్శించవచ్చు.ఇటలీ50వ జీ7 సదస్సు కోసం ప్రధాని మోదీ ఈ ఏడాది ఇటలీలో పర్యటించారు. ఐరోపాలోని ఇటలీ అందమైన దేశంగా పేరొందింది. సినీతారలు ఇటలీని తరచూ సందర్శిస్తుంటారు. అలాగే ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు ఇటలీకి తరలివస్తుంటారు. చాలామంది జీవితంలో ఒక్కసారైనా ఇటలీని సంద్శించాలని భావిస్తుంటారు. ఇటలీలోని రోమ్, ఫ్లోరెన్స్, వెనిస్, అమాల్ఫీ కోస్ట్ మొదలైనవి చూడదగిన ప్రాంతాలు. రష్యా22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఇందుకోసం ప్రధాని ఈ ఏడాది రష్యాలో పర్యటించారు. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఈ దేశాన్ని సందర్శించడానికి వస్తుంటారు. భారీ పర్వతాలు, ఎడారులు, అందమైన బీచ్‌లు, వారసత్వ ప్రదేశాలు, రాజభవనాలు, మంచుతో నిండిన సరస్సులను ఈ దేశంలో చూడవచ్చు. ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన దేశాలలో రష్యా ఒకటి. ఇక్కడి మాస్కో, వ్లాడివోస్టాక్ ప్రాంతాలు పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తాయి.సింగపూర్ఈ ఏడాది ప్రధాని మోదీ సింగపూర్‌లో పర్యటించారు. సింగపూర్ సంపన్న దేశంగా పేరొందింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు సంగపూర్ సందర్శనకు వస్తుంటారు. ఇక్కడి అందమైన మ్యూజియం, జురాంగ్ బర్డ్ పార్క్, రెప్టైల్ పార్క్, జూలాజికల్ గార్డెన్, సైన్స్ సెంటర్ సెంటోసా ఐలాండ్, పార్లమెంట్ హౌస్, హిందూ, చైనీస్, బౌద్ధ దేవాలయాలు, చైనీస్, జపనీస్ గార్డెన్లు చూడదగిన ప్రదేశాలు. విదేశాలను సందర్శించాలనుకునేవారికి సింగపూర్ ఉత్తమ ఎంపిక అని చెప్పుకోవచ్చు.ఇది కూడా చదవండి: ఐదేళ్లకు జాతర.. లక్షల జీవాలకు పాతర.. నేపాల్‌లో ఘోరం -
Year Ender 2024: ఎప్పటికీ గుర్తుండే 10 రాజకీయ ఘటనలు
కొద్దిరోజుల్లో 2025ను స్వాగతించేందుకు ప్రపంచం సిద్ధమవుతోంది. ఈ డిసెంబర్ 31తో 2024 ముగియనుంది. 2024లో దేశంలో అనేక చెడు, మంచి ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా దేశ రాజకీయాల్లో పలు పరిణామాలు సంభవించాయి. అవి ప్రజల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి.లోక్‌సభ ఎన్నికలు 2024 దేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ఏప్రిల్ 19- జూన్ 1 మధ్య ఏడు దశల్లో జరిగింది. ఈ ఎన్నికల ఫలితాలు చర్చనీయాంశంగా మారాయి. 400 సీట్ల టార్గెట్‌తో ఎన్డీఏ ఎన్నికల పోరులోకి దిగగా, దానిని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. అయితే ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ 400 సీట్లను చేరుకోలేకపోయింది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు.అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేజ్రీవాల్ రాజీనామాతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఢిల్లీ ప్రజలు తనకు క్లీన్ చిట్ ఇస్తేనే సీఎం పదవి స్వీకరిస్తానని అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తున్న సమయంలో పేర్కొన్నారు.మహారాష్ట్ర ఎన్నికలు ఈ ఏడాది మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మహాయుతి కూటమికి నిరాశే ఎదురైతే, అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి మద్దతు లభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి అత్యధిక మెజారిటీ సాధించి, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గతంలో ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర సీఎంగా ఉండగా, ఈ ఎన్నికల తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం అయ్యారు.హేమంత్ సోరెన్‌కు జైలు శిక్ష జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు 2024 అనేక ఒడిదుడుకులను అందించింది. ఒక కేసులో ఆయన 2024 జనవరిలో జైలులో ఉన్నారు. ఆ తర్వాత చంపై సోరెన్ జార్ఖండ్ సీఎం అయ్యారు. అయితే ఆ తర్వాత హేమంత్ సోరెన్ బెయిల్ పొంది తిరిగి జార్ఖండ్ సీఎం పదవిని చేపట్టారు. ఈ సమయంలో చంపై సోరెన్ జేఎంఎంను వదిలి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం మరోసారి విజయం సాధించింది. తిరిగి హేమంత్ సోరెన్ జార్ఖండ్ సీఎం అయ్యారు.జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జమ్ముకశ్మీర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు చారిత్రాత్మకంగా నిలిచాయి. దశాబ్దకాలం తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ నేపధ్యంలో అందరి దృష్టి ఈ ఎన్నికలపైనే నిలిచింది. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ అద్భుత విజయం సాధించింది. ఒమర్ అబ్దుల్లా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.యూపీకి రాహుల్ గాంధీ పునరాగమనం 2024 లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ప్రత్యేకంగా నిలిచాయి. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ లోక్‌సభ స్థానం నుండి ఓటమిని ఎదుర్కొన్నారు. అయితే ఆ సమయంలో రాహుల్ కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ యూపీలోని రాయ్‌బరేలీ, కేరళలోని వయనాడ్‌లలో పోటీ చేసి, రెండు చోట్లా గెలుపొందారు. ఈ నేపధ్యంలో ఆయన వయనాడ్ లోక్‌సభ స్థానాన్ని వదులుకుని రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగుతున్నారు.నవీన్ పట్నాయక్ ఓటమి ఈ ఏడాది ఒడిశాలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఒడిశా రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన నవీన్ పట్నాయక్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించి, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే దశాబ్దాలుగా అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ అధికారం నుంచి వైదొలగవలసి వచ్చింది.ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రం నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక గాంధీ వాద్రా ఈ సంవత్సరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ విజయం సాధించారు. ఆమె 64.99% ఓట్లతో విజయం సాధించి, తొలిసారి పార్లమెంటుకు చేరుకున్నారు.సిక్కిం అసెంబ్లీలో ప్రతిపక్షం అంతం ప్రభుత్వ పనితీరుపై నిఘా ఉంచడానికి ప్రతిపక్షం అవసరం. అయితే సిక్కింలో ఒక్క ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా లేని విచిత్ర పరిస్థితి నెలకొంది. 32 సీట్ల సిక్కిం అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా ఒకే పార్టీకి చెందినవారు. ఇటీవల రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార సిక్కిం క్రాంతికారీ మోర్చా (ఎస్కేఎం) అభ్యర్థులు ఏకపక్షంగా విజయం సాధించారు.ఢిల్లీ సీఎంగా అతిషి తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ నేపధ్యంలో తొలుత ఢిల్లీ సీఎంగా మనీష్ సిసోడియాకు అవకాశం దక్కనుందని అంతా భావించారు. అయితే అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు మనీష్ సిసోడియా కూడా అన్ని పదవులకు రాజీనామా చేశారు. ఈ పరిణామాల దరిమిలా కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి అతిషిని ఎన్నిక చేశారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: గుండెపోటు.. కార్డియాక్ అరెస్ట్.. నిత్యం ఇవే వార్తలు