2024 మరికొద్ది గంటల్లో ముగియనుంది. వెంటనే 2025 ఆవిష్కృతం కానుంది. గడచిన 2024 ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్, పోలీస్ సర్వీస్‌లకు ప్రత్యేకంగా నిలిచింది. 2024లో దేశవ్యాప్తంగా 180 మంది ఐఏఎస్‌లు, 200 మంది ఐపీఎస్‌లు ఎంపికయ్యారు.
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ ఆల్ ఇండియా ర్యాంక్ వన్ సాధించారు. అనిమేష్ ప్రధాన్ రెండో ర్యాంక్, అనన్యారెడ్డి మూడో ర్యాంకు దక్కించుకున్నారు. వీరంతా యూపీఎస్‌సీ పరీక్షలో విజయం సాధించేందుకు ఎంతో కష్టపడ్డారు. నిబద్ధతతో చదువుకుంటూ, ఉత్తీర్ణులై అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌లో స్థానం సంపాదించారు.
2024 యూపీఎస్‌సీ ఫలితాల్లో ఉత్తీర్ణులైనవారిలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌కు చెందిన అభ్యర్థులు అత్యధికంగా ఉన్నారు. యూపీ నుంచి గరిష్టంగా 27 మంది ఐఎఎస్ అధికారులు ఎంపికయ్యారు. రెండో స్థానంలో రాజస్థాన్‌కు చెందిన 23 మంది అభ్యర్థులు ఐఏఎస్‌లుగా ఎంపికయ్యారు. బీహార్ నుంచి 11 మంది, మధ్యప్రదేశ్ నుంచి 7 మంది అభ్యర్థులు అధికారులుగా ఎన్నికయ్యారు.
ఈ ఏడాది టాప్ 5 ర్యాంకుల్లో ఉన్న ముగ్గురు అభ్యర్థులు ఇప్పటికే ఐపీఎస్ అధికారులు. వన్ ర్యాంక్ సాధించిన ఆదిత్య శ్రీవాస్తవ, నాల్గవ ర్యాంక్ సాధించి పీకే సిద్ధార్థ్ రామ్‌కుమార్, ఐదవ ర్యాంక్ సాధించిన రౌహానీలు ఇప్పటికే హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. గత 11 ఏళ్లుగా సర్వీస్‌లో ఉంటున్న ఒక అధికారి యూపీఎస్‌సీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ వన్ సాధించడం ఇదే తొలిసారి. అంతకుముందు 2013లో ఐపీఎస్ అధికారి గౌరవ్ అగర్వాల్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ వన్ సాధించారు.
ఐఎఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, ఐఆర్‌ఎస్ ఉద్యోగాల నియామకం కోసం యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ పరీక్షను నిర్వహిస్తుంటుంది. ఈ పరీక్షను ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ప్రక్రియతో సహా మూడు దశల్లో నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం సుమారు తొమ్మిది లక్షల నుండి 10 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతుంటారు.
ఇది కూడా చదవండి: Year Ender 2024: జమ్ముకశ్మీర్‌కు మరింత ప్రత్యేకం.. 2025కు ఇలా స్వాగతం
Comments
Please login to add a commentAdd a comment