Indian Administrative Service
-
తెలంగాణకు చెందిన 10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన 10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా లభించింది. ఐఏఎస్ హోదా పొందిన వారిలో.. కాత్యాయని, చెక్కా ప్రియాంక నవీన్ నికోలస్, కోరం అశోక్ రెడ్డి, బడుగు చంద్రశేఖర్ రెడ్డి, వెంకటనరసింహ రెడ్డి, అరుణ శ్రీ, హరిత, కోటా శ్రీవాస్తవా, నిర్మల కాంతివేస్లీ ఉన్నారు. ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ మరోవైపు తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ పరిపాలన డీసీపీగా యోగేశ్ గౌతమ్, సీఐడీ ఎస్పీగా ఆర్ వెంకటేశ్వర్లు బదిలీ అయ్యారు. పీసీఎస్ ఎస్పీగా రంగారెడ్డి, జీఆర్పీ అడ్మిన్ డీసీపీగా రాఘవేందర్‌రెడ్డి, వరంగల్ పోలీస్ శిక్షణా కేంద్రం ఎస్పీగా పూజ, డీజీపీ కార్యాలయం న్యాయవిభాగం ఎస్పీగా సతీశ్, వరంగల్ నేర విభాగం డీసీపీగా మురళీధర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గత జనవరిలోనూ రాష్ట్రవ్యాప్తంగా 91 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. చదవండి: Telangana: ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్ డేట్స్ ఇవే! -
తెలుగు రాష్ట్రాలకు 16 మంది కొత్త ఐఏఎస్‌లు
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలకు 16 మంది కొత్త ఐఏఎస్‌లను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 9 మంది, తెలంగాణాకు 9 మందిని కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వూలు జారీ చేసింది. వీరంతా 2019 బ్యాచ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌లు కావడం గమనార్హం. -
ఏపీలో 11 మంది ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వేర్వేరు విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న 11 మంది ఐఏఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం బదిలీ చేసింది. వ్యవసాయ సహకార శాఖ ముఖ్యకార్యదర్శిగా బి. రాజశేఖర్ నియమిస్తూ రియల్‌టైం గవర్నెన్స్ ముఖ్యకార్యదర్శిగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా డి. వరప్రసాద్ నియమిస్తూ కార్మికశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా పి. లక్ష్మీనరసింహం, ఉపాధి, శిక్షణాశాఖ డైరెక్టర్‌గా కె. మాధవి లత, వికలాంగుల సంక్షేమం, వయోవృద్ధుల శాఖ డైరెక్టర్‌గా కిశోర్ కుమార్, సీసీఎల్ఏ సంయుక్త కార్యదర్శిగా లావణ్యవేణి, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా విజయ సునీత, విశాఖ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పి. శ్రీనివాసులు, ఏపీటీడీసీ సీఈవోగా కె. విజయలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
సివిల్స్ మెయిన్స్ ఫలితాల విడుదల
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ మెరుున్స్ పరీక్షల ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం ప్రకటించింది. విజేతలైన అభ్యర్థులను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)లతో పాటు గ్రూప్ ఏ, బీ కేంద్ర సర్వీసులకు ఎంపిక చేసేందుకు గాను ఇంటర్వ్యూలకు (పర్సనాలిటీ టెస్ట్) పిలువనుంది. విజేతలైన అభ్యర్థుల రోల్ నంబర్లను కమిషన్ వెబ్సైట్ ఠీఠీఠీ.ఠఞటఛి.జౌఠి.జీలో చూడవచ్చు. ఏప్రిల్ 7 నుంచి ఇంటర్వ్యూలు మొదలయ్యే అవకాశం ఉందని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఢి ల్లీలోని సర్వీస్ కమిషన్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతాయని, తేదీ, సమయం విజేతలైన అభ్యర్థులకు వ్యక్తిగతంగా తెలియజేస్తామని పేర్కొంది. అభ్యర్థులు తమ వయసు, విద్యార్హతలు, కులం, వైకల్యానికి (ఉంటే) సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను క్వశ్చనీర్, అటెస్టేషన్ ఫామ్, టీఏ వంటి ఇతర పత్రాలతో కలిపి సమర్పించాల్సి ఉంటుందని ప్రకటన వివరించింది. ఈ పత్రాలన్నిటికీ సంబంధించిన ఫార్మాట్లను యూపీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపింది. ఇంటర్వ్యూ తేదీ, సమయం మార్పుకు సంబంధించిన ఎలాంటి వినతులనూ పరిశీలించడం జరగదని స్పష్టం చేసింది. ఇంటర్వ్యూలకు అర్హత సాధించని అభ్యర్థుల మార్కుల జాబితాలను ఇంటర్వ్యూలు ముగిసిన 15 రోజుల్లోగా యూపీఎస్సీ వెబ్సైట్ పెట్టనున్నట్టు వివరించింది. గత ఏడాది డిసెంబర్లో యూపీఎస్సీ మెరుున్స్ రాతపరీక్షను నిర్వహించింది. -
పార్వతీపురం డివిజన్లో ఇద్దరు ఐఏఎస్‌లు
పార్వతీపురం, న్యూస్‌లైన్: ఎట్టకేలకు పార్వతీపురం డివిజన్లో ఇద్దరు ఐఏఎస్‌లు నియమితులయ్యారు. ఐటీడీఏ పీఓగా రంజిత్‌కుమార్‌సైనీ, సబ్ కలెక్టర్‌గా శ్వేతామహంతి నియమితులైనట్లు బుధవారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పీఓగా నియమితులైన రంజిత్‌కుమార్ ఇప్పటి వరకూ వెయిటింగ్లో ఉంటూ పార్వతీపురం ఐటీడీఏకు బదిలీ అయ్యారు. అలాగే సబ్‌కలెక్టర్‌గా నియమితులైన శ్వేతామహంతి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి కుమార్తె. ఈమె ఐఎఎస్ అధికారిగా శిక్షణ పూర్తిచేసుకుని తొలిసారిగా పార్వతీపురం సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక్కడ పీఓగా పనిచేస్తున్న బీఆర్ అంబేద్కర్ విశాఖపట్నం రాజీవ్ విద్యామిషన్ పీఓగా బదిలీ అయ్యారు. ఈయన పార్వతీపురం ఆర్డీఓగా పనిచేస్తూ 2012 జూలై 2న ఐటీడీఏ పీఓగా బాధ్యతలు చేపట్టి సుమారు ఏడాది పైగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్డీఓగా పనిచేస్తున్న జె వెంకటరావు 2012 జూలై 14న బాధ్యతలు చేపట్టి ఆయన కూడా సుమారు ఏడాది కాలం పైగానే పనిచేశారు. సుమారు దశాబ్ద కాలం తరువాత డివిజన్‌కు మళ్లీ ఇద్దరు ఐఏఎస్ అధికారులు నియమితులు కావడంతో మళ్లీ ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుందని ఈప్రాంతీయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
హర్యానాలో వాద్రా భూదందా
చండీగఢ్: కాంగ్రెస్ అధినేత్రి అల్లుడు రాబర్ట్ వాద్రాపై భూ కుంభకోణం ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చాయి. గతంలో వాటిని బయటపెట్టి సంచలనం సృష్టించిన హర్యానా క్యాడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా ఈసారి మరిన్ని బాంబులు పేల్చారు. హర్యానాలో గత ఎనిమిదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏకంగా రూ.3.5 లక్షల కోట్ల విలువైన భూ కుంభకోణాలు జరిగాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ‘‘2005 నుంచి 2012 మధ్య భూపీందర్‌సింగ్ హయాంలో 21,366 ఎకరాల విస్తీర్ణంలో వెలిసిన పలు కాలనీలకు లెసైన్సుల జారీ ముసుగులో ఈ బాగోతాలన్నీ చోటుచేసుకున్నాయి. ఈ కుంభకోణాల్లో భారీగా అనుచిత లబ్ధి పొందిన వారి జాబితాలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కూడా ఉన్నారు. తప్పుడు డాక్యుమెంట్లు, బూటకపు లావాదేవీల ఆధారంగా గుర్గావ్ జిల్లా శిఖోపూర్ గ్రామంలో 2.7 ఎకరాల అతి విలువైన భూమిని వాద్రా చేజిక్కించుకున్నారు. దానికి లెసైన్సును కూడా అదే మార్గంలో సంపాదించి భారీగా అనుచిత లబ్ధి పొందారు.’’ అని ఖేమ్కా వివరించారు. ఈ విషయంలో వాద్రాకు హర్యానా సర్కారు అన్నివిధాలా సహకరించిందని, పైగా అందుకోసం అన్ని నియమ నిబంధనలనూ తుంగలో తొక్కిందని కూడా పేర్కొన్నారు. ఈ మేరకు హర్యానా ప్రభుత్వానికి గత మే 21న ఖేమ్కా సమర్పించిన వివరణలోని అంశాలు తాజాగా వెల్లడై సంచలనం సృష్టిస్తున్నాయి. డీఎల్ఎఫ్తో వద్రా కంపెనీ కుదుర్చుకున్న రూ.58 కోట్ల విలువైన భూ ఒప్పందాన్ని 2012 అక్టోబర్‌లో ఖేమ్కా రద్దు చేయడం, దానిపై విచారణకు కూడా ఆదేశించడం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ ఉదంతం అంతిమంగా ఆయన బదిలీకి దారితీసింది. దీనిపై హర్యానా ప్రభుత్వం నియమించిన ముగ్గురు ఉన్నతాధికారుల కమిటీ ఖేమ్కా నిర్ణయాలను పూర్తిగా తప్పుబట్టింది. పైగా డీఎల్ఎఫ్-వాద్రా ఒప్పందంపై విచారణకు ఆదేశించి అధికారం కూడా ఆయనకు లేదని కూడా ఇటీవలే తేల్చింది. వాటిని సవాలు చేస్తూ ఖేమ్కా 100 పేజీల వివరణను కమిటీకి సమర్పించారు. భూ ఒప్పందానికి ఆధారాలుగా చెక్కుతో సహా వాద్రా సమర్పించిన డాక్యుమెంట్లన్నీ నకిలీవేనని అందులో స్పష్టం చేశారు. ‘‘వాటి ఆధారంగా వాద్రా చేజిక్కించుకున్న భూముల సగటు మార్కెట్ విలువే ఎకరాకు రూ.15.78 కోట్లు. ఆ లెక్కన గత ఎనిమిదేళ్లలో చోటుచేసుకున్న భూముల లెసైన్సింగ్ కుంభకోణం విలువ కనీసం రూ.3.5 లక్షల కోట్లుంటుంది. పోనీ ఎకరాకు హీనపక్షం రూ.కోటి లెక్కన చూసినా ఇది ఏకంగా రూ.20 వేల కోట్ల కుంభకోణం’’ అని వివరించారు. వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు తోడు దొంగలుగా మారి ప్రజా ధనాన్ని ఇలా భారీగా లూటీ చేశారంటూ దుమ్మెత్తిపోశారు. ‘‘ఆశ్రీత పెట్టుబడిదారులకు లబ్ధి చేకూర్చేందుకు ఇలా లెసైన్సుల అమ్మకమనే మార్గాన్ని ఎంచుకున్నారు. వాటిని వేలం వేస్తే ప్రతి కాలనీ లెసైన్సుకూ దక్కే గరిష్ట ప్రీమియం ధర ద్వారా ఖజానాకు భారీ ఆదాయం సమకూరేది. అలాకాకుండా వేలాది కోట్ల విలువ చేసే భూములను దొంగ రియల్టీ కంపెనీలకు కట్టబెట్టారు. ఈ కంపెనీలన్నీ సదరు భూములను బడా బాబులకు దోచిపెట్టేందుకు పుట్టుకొచ్చిన ముసుగులు మాత్రమే’’ అని ఖేమ్కా వివరించారు. వీటన్నింటిపై కిమ్రినల్ విచారణకు తాను చేసిన సిఫార్సులను రెవెన్యూ శాఖ తొక్కిపెట్టిందని ఆరోపించారు. ఖేమ్కా ఆరోపణలపై లోతుగా విచారణ జరిపించాలని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ డిమాండ్ చేశారు. అయితే వాటిని కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఎన్నికల వేళ ఈ వివాదం తెరపైకి రావడం వెనక బీజేపీ హస్తమే ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి మీమ్ అఫ్జల్ ప్రత్యారోపణలు చేశారు. సీఎం హుడా కూడా ఖేమ్కా ఆరోపణలను తోసిపుచ్చారు. తాము ఏ పార్టీకీ అనుచిత లబ్ధి చేకూర్చలేదన్నారు.