సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వేర్వేరు విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న 11 మంది ఐఏఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం బదిలీ చేసింది. వ్యవసాయ సహకార శాఖ ముఖ్యకార్యదర్శిగా బి. రాజశేఖర్ నియమిస్తూ రియల్‌టైం గవర్నెన్స్ ముఖ్యకార్యదర్శిగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా డి. వరప్రసాద్ నియమిస్తూ కార్మికశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా పి. లక్ష్మీనరసింహం, ఉపాధి, శిక్షణాశాఖ డైరెక్టర్‌గా కె. మాధవి లత, వికలాంగుల సంక్షేమం, వయోవృద్ధుల శాఖ డైరెక్టర్‌గా కిశోర్ కుమార్, సీసీఎల్‌ఏ సంయుక్త కార్యదర్శిగా లావణ్యవేణి, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా విజయ సునీత, విశాఖ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పి. శ్రీనివాసులు, ఏపీటీడీసీ సీఈవోగా కె. విజయలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment