ias transfers
-
కేంద్రంలో చంద్రబాబు పరపతి బండారం ఇది!
‘ఐఏఎస్ అధికారులను పంపండి మహాప్రభో!’. డిప్యుటేషన్‌పై ఇవ్వాలని పదేపదే రాష్ట్ర ప్రభుత్వం వినతులు. అధికారుల కొరత ఉందని రెండుసార్లు లేఖలు రాసిన సీఎం చంద్రబాబు.. అయినా స్పందించని కేంద్రం.. ఇది కొన్నాళ్ల క్రితం తెలుగుదేశం అధికార మీడియా ‘ఈనాడు’లో ప్రముఖంగా వచ్చిన వార్త.‘ఏపీ కేడర్‌పై కక్ష.. నాన్ ఏపీ కేడర్‌పై ఆపేక్ష’.. ఐదుగురు ఐఎఎస్, తొమ్మిది మంది ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇవ్వని కూటమి ప్రభుత్వం.. ఇది సాక్షి దినపత్రికలో వచ్చిన కథనం.ఈ రెండు వార్తలు చదివితే ఏం అర్థమవుతోంది?. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వద్ద ఉన్న సీనియర్ అధికారులను వాడుకోకపోగా.. కొత్తగా అధికారులను కేటాయించాలని కేంద్రాన్ని అడుగుతున్నారూ అని!. అంతేకాదు.. కేంద్రంలో కాని, ఆయా రాష్ట్రాలలో కాని పని చేస్తున్న నాన్ కేడర్ అంటే అఖిల భారత సర్వీస్ కానీ తమ వాళ్లను ఏపీకి తీసుకురావాలని ప్రయత్నించడమే కదా! ఇందులో మతలబు ఏమిటి? ఐఏఎస్, ఐపీఎస్‌లు ఏ ప్రభుత్వం ఉన్నా, విధానాలకు అనుగుణంగా పని చేయవలసి ఉంటుంది. నిబంధనలు, రాజ్యాంగంలోని అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది.అయితే, ఏపీలో ఎనిమిది నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం భారత రాజ్యాంగానికి బదులు సొంత రెడ్ బుక్ అమలుకే ప్రాధాన్యత ఇస్తోంది. తమపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేసిన అధికారులపై కక్ష తీర్చు కోవడం, ఇష్టం లేని అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధించడం చేస్తోంది. ఒక వైపు ఉన్న అధికారులను వాడుకోకపోగా మరోవైపు కేంద్రం తమకు కావల్సిన అధికారులను ఇవ్వడం లేదని వార్తలు రాయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 239 మంది ఉన్నతాధికారులు అవసరమైతే ప్రస్తుతం 191 మందే ఉన్నారని ఈనాడు కథనం. నలుగురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్, నలుగురు ఐఆర్ఎస్లు కలిపి పది మందిని డిప్యుటేషన్‌పై పంపాలని చంద్రబాబు ఇప్పటికీ రెండుసార్లు లేఖలు రాసినా కేంద్రం నుంచి జవాబు రాలేదట. చిత్రం ఏమిటంటే ఏదైనా అనుకూల నిర్ణయం జరిగితే అదంతా చంద్రబాబు విజయం, గొప్పదనం అని డబ్బా కొట్టే ఈనాడు, కేంద్రం డిప్యుటేషన్‌పై అధికారులను పంపకపోవడాన్ని మాత్రం ఉన్నతాధికారుల వైఫల్యమని చెబుతోంది.ఉన్నతాధికారులను కేటాయించగల స్థాయి ఉన్న వారి వద్దకు అధికారుల కంటే ముఖ్యమంత్రే వెళ్లగలరన్నది అందరికీ తెలిసిన విషయం. అయినా సరే తమ బాబును వెనకేసుకొచ్చేందుకు ఈనాడు ఈ రకమైన కథనాలు రాస్తూంటుంది. నైపుణ్యమున్న అధికారుల కొరత ఉందని ముఖ్యమంత్రి తన లేఖలో పేర్కొన్నారు. ఈ నైపుణ్యం తమ సామాజిక వర్గం వారు లేదా రాజకీయంగా తమకు ఉపయోగపడగలిగే వారు అని సీఎం అర్థం?. ఈ నియామకాలు ప్రతిభ ఆధారంగా జరుగుతాయా అని ప్రశ్నిస్తే.. ఎక్కువ సందర్భాలలో వ్యక్తిగత ఇష్టాఇష్టాలపైనే జరుగుతుంటాయన్నది వాస్తవం.ఏపీలో కూటమి సర్కార్ తీరు మరీ ఘోరం. గత టర్మ్‌లో ఆదాయపన్ను శాఖలో పనిచేసే ఒక అధికారిని డిప్యుటేషన్‌పై తెచ్చుకుని ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డులో నియమించుకున్నారు. దానికి కారణం ఆయనలో ఉన్న నైపుణ్యం కంటే, ఐటి శాఖలో ఉన్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌ను ఇబ్బంది పెట్టే నివేదికలు తయారు చేశారన్న అభిమానమే కారణమని అప్పట్లో చెప్పుకునేవారు. అలాగే ఇదే సంస్థలో ఒక మాజీ ఐఏఎస్ అధికారి కుమార్తెను కూడా భారీ జీతానికి నియమించుకున్నారని వార్తలు వచ్చాయి. ఇది 2014 టర్మ్‌లో జరిగిన సంగతి. తాజాగా జరిగిన ఒక డిప్యుటేషన్‌ను పరిశీలిద్దాం.గత టర్మ్‌లో డిప్యుటేషన్‌పై వచ్చి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసిన వెంకయ్య చౌదరి అనే అధికారిని ఈసారి ప్రభుత్వం రావడంతోనే టీటీడీ అదనపు ఈవోగా నియమించారు. గనుల శాఖ నైపుణ్యానికి, టీటీడీలో అవసరమైన నైపుణ్యానికి సంబంధం ఉంటుందా అంటే ఎవరూ చెప్పలేరు. జగన్ ప్రభుత్వం ధర్మారెడ్డి అనే రక్షణ శాఖ అధికారిని డిప్యుటేషన్‌పై టీటీడీకి తెచ్చి నియమిస్తే ఇదే తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు చేసేది. మరి ఇప్పుడు వెంకన్న చౌదరిని ఎందుకు పెట్టుకున్నారు? తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి సుబ్బరాయుడును తిరుపతి జిల్లా ఎస్పీగా చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన ఘటన నేపథ్యంలో వీరిద్దరిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. సుబ్బరాయుడిని మాత్రం బదిలీ చేసినట్లు చేసి, తిరిగి తిరుపతిలోనే ఎర్ర చందనం టాస్క్‌ఫోర్స్ అధికారిగా నియమించారు. ఈయనను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరో సిట్‌లో కూడా సభ్యుడిని చేశారు.అంటే ప్రభుత్వ పెద్దలు కోరినట్లుగా రెడ్ బుక్ అమలు బాధ్యతను పెడుతున్నారన్నమాట. తిరుమలలో పెత్తనం చేయడానికి వెంకయ్యకు పోస్టింగ్ ఇచ్చారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. యూపీ కేడర్ ఐఏఎస్ అధికారి రాజమౌళిని తెచ్చుకుని సీఎంవోలో పెట్టుకున్నారట. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే ఏపీలో శ్రీలక్ష్మి, మురళీధర్ రెడ్డి, ముత్యాల రాజు, నీలకంఠా రెడ్డి, మాధవీలత వంటి ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లే ఇవ్వకపోవడం. ఇష్టం లేని అధికారులు అనుకుంటే వారికి ప్రాధాన్యంలేని పోస్టులు ఇస్తుంటారు. వీరికి మాత్రం ఏ పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. అలాగే ఐపీఎస్ అధికారులు నలుగురిని కొన్ని పిచ్చి కేసులలో సస్పెండ్ చేశారు. స్కిల్ స్కామ్ కేసు, మార్గదర్శి డిపాజిట్లు, ఇతర అక్రమాల కేసులను దర్యాప్తు చేసి పలు అంశాలను వెలుగులోకి తెచ్చారన్న కోపంతో మరికొందరు ఐపీఎస్‌లకు పోస్టింగ్స్ ఇవ్వలేదు.వీరిలో కొల్లి రఘురామిరెడ్డి, రిషాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, సునీల్ కుమార్, జాషువా అనేవారు ఉన్నారు. అక్కడితో ఆగలేదు. ఈ ఐపీఎస్‌లు రోజూ డీజీపీ ఆఫీస్‌కు వెళ్లి అటెండెన్స్ వేసుకుని, సాయంత్రం వరకు అక్కడే ఖాళీగా కూర్చోవాలట. బహుశా గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం ఇంత అధ్వాన్నంగా పాలన నడపలేదు. ఒకవైపు ఇలా సీనియర్ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా, లేదా వారిపై స్పష్టమైన అభియోగాలు మోపకుండా చేస్తున్న తీరు సహజంగానే కేంద్రం దృష్టికి కూడా వెళ్లే అవకాశం ఉంది. మరి అడ్డగోలుగా రాజకీయ పాలనే కేంద్ర ప్రభుత్వంలో కూడా జరుగుతున్న సందర్భాలలో చంద్రబాబు వంటివారు ఏం అడిగితే అది ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాకాకుండా నిబంధనల ప్రకారం రాష్ట్రంలో పాలన ఉంటే ఎలాంటి లేఖలు వచ్చినా స్పందించకుండా ఉంటారా?.అయినా కేంద్రంలో తమ పార్టీ ఎంపీల సంఖ్యతోనే చక్రం తిప్పుతున్నామని టీడీపీ చెబుతుంది. చంద్రబాబుకు ఉన్న పరపతిపై ఈనాడు మీడియా హోరెత్తిస్తుంటుంది. అయినా చంద్రబాబు రెండు లేఖలు రాసినా ఆయన కోరిన విధంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేంద్రం పంపించలేదంటే, డిప్యుటేషన్లు ఇవ్వలేదంటే ఏమనుకోవాలి?. చంద్రబాబు ప్రభుత్వం మరీ అధ్వాన్నంగా పాలన సాగిస్తుందని పరోక్షంగా చెప్పడమే అవుతుంది!. అయినా ఏదో రకంగా ప్రధాని మోదీనో, హోం మంత్రి అమిత్ షానో పట్టుకుని తమకు కావాల్సిన వారిని ఏపీకి తెచ్చుకుంటారేమో చూడాలి. కానీ, ఉన్న అధికారులను వాడుకోకుండా వేరే వారిని పంపించాలని అనడంలో హేతుబద్దత ఏమిటో తెలియదు. అదీకాక ఇప్పుడు రెడ్ బుక్ అంటూ సీనియర్ అధికారులను వేటాడుతున్న తీరు ఐఏఎస్, ఐపీఎస్ సర్కిల్స్‌లో తెలియకుండా ఉండదు.గత ప్రభుత్వంలో పని చేసిన కొంతమంది తిరిగి డిప్యుటేషన్‌ను రద్దు చేసుకుని వెళ్లిపోతామంటే కూడా ఏదో రకంగా కూటమి ప్రభుత్వం అడ్డుపడుతోంది. ఎవరైనా డిప్యుటేషన్ పూర్తి చేసుకుని వెళ్లిపోతుంటే వారిపై కూడా కక్ష పూరితంగా ఆటంకాలు సృష్టిస్తోందట. అదే సమయంలో పలు అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై ఒక పోలీసు అధికారిని జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేస్తే, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆయనకు ఒక కార్పొరేషన్ పదవి కూడా కట్టబెట్టింది. మరోవైపు తమ అవినీతి కేసులలో తప్పుడు సాక్ష్యాలు ఇవ్వకపోతే రెడ్ బుక్ ప్రయోగిస్తామన్న హెచ్చరికలు పంపిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇంకో మాట చెప్పాలి. కూటమి ప్రభుత్వం రావడంతోనే ఈనాడు, ఆంధ్రజ్యోతి మరింతగా చెలరేగిపోతూ అధికారులు అందరిపై తమదే పెత్తనం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. వారు ఎవరి మీద ఆరోపణలు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలట.తెలుగుదేశం ప్రభుత్వం కక్షతో పాటు ఈ మీడియా కక్ష కూడా అధికంగానే ఉంటున్నట్లుగా కనిపిస్తుంది. ఈనాడు పెత్తనం ఏ స్థాయికి వెళ్లిదంటే చివరికి ఒక జిల్లా కలెక్టర్, ఒక ఎస్పీనే ఈనాడు విలేకరిపై మండిపడాల్సినంతగా పరిస్థితి ఏర్పడింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఈనాడు ఏదో కథనం వండి వార్చుతోంది. దానిపై ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఒక కమిటీని నియమించుకుంది. ఆ కమిటీ అధికారులు విచారణకు వెళితే ఈనాడు విలేకరి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారులకు చికాకు తెప్పించారు. దానిపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తే, తెల్లవారేసరికల్లా ఆ కలెక్టర్, ఎస్పీలపై మొదటి పేజీలో పెద్ద వార్త రాసేశారు. ఒకప్పుడు మీడియాకు స్వీయ నియంత్రణ ఉండేది. ఇప్పుడేమో స్వీయ బ్లాక్ మెయిలింగ్తో మీడియా అధికార యంత్రాంగాన్ని తానే నడపాలని ప్రయత్నిస్తోంది. ఎంతో సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వం ఎంత అధ్వాన్నంగా పాలన సాగిస్తున్నది చెప్పడానికి ఇవన్ని ఉదాహరణలే అవుతాయి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏపీ లో పలువురు IASల బదిలీలు
-
ఐఏఎస్‌ల విభజన వివాదానికి తెర
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పదేళ్లుగా కొనసాగుతున్న ఐఏఎస్ అధికారుల విభజన వివాదానికి నాటకీయ పరిణామాల మధ్య తెరపడింది. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్), హైకోర్టులో కేసులపై బుధవారం స్పష్టత వచ్చింది. ఐఏఎస్ అధికారులు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలన్న..‘కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (డీవోపీటీ)’ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు తెలంగాణ నుంచి ఐదుగురు ఐఏఎస్‌లు ఏపీకి రిలీవ్‌కాగా.. ఏపీ నుంచి ముగ్గురు తెలంగాణలో రిపోర్టు చేశారు. ఇక ఐపీఎస్‌లకు సంబంధించిన కేడర్ ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. రిలీవ్.. ఇతర అధికారులకు బాధ్యతలు ఇరు రాష్ట్రాల మధ్య అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారుల తుది కేటాయింపుల్లో భాగంగా ‘కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (డీవోపీటీ)’.. తెలంగాణలో పనిచేస్తున్న ఐదుగురు ఐఏఎస్‌లను ఏపీ కేడర్‌కు కేటాయిస్తూ ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై, క్యాట్ ఆదేశాలపై ఐఏఎస్‌లు హైకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్లను కొట్టివేసింది. మరోవైపు బుధవారంలోపే ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని డీవోపీటీ ఆదేశాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులను వెంటనే రిలీవ్ చేసింది. రిలీవైన అధికారుల్లో ఇంధన శాఖ కార్యదర్శి/జెన్కో, ట్రాన్స్‌కో సంస్థల ఇన్చార్జి సీఎండీ రోనాల్డ్ రోస్, జీహెచ్ఎంసీ కమిషనర్ కాట ఆమ్రపాలి, స్త్రీ/శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, యువజన, పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖ ముఖ్యకార్యదర్శి వాణి ప్రసాద్, ఆయుష్ డైరెక్టర్ మల్లెల ప్రశాంతి ఉన్నారు. ఇక రిలీవైన అధికారుల స్థానంలో ఇతర అధికారులకు ఇన్చార్జులుగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. భారీగా ఐఏఎస్‌ల బదిలీలకు చాన్స్! మొత్తంగా ఐదుగురు ఐఏఎస్‌లు తెలంగాణ నుంచి వెళ్తుండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఐఏఎస్‌లు ఇక్కడికి వస్తున్నారు. వచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. వెళ్లినవారి శాఖల్లో పూర్తిస్థాయిలో నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రాష్ట్ర పాలన యంత్రాంగంలో మరోసారి భారీగా మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు తెలంగాణలో ఉన్న డీజీ స్థాయి అధికారులు అంజనీకుమార్, అభిలాష్ భిష్త్లు కూడా డీవోపీటీ ఆదేశాల మేరకు ఏపీకి వెళ్లాల్సి ఉండనుంది. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు రావొచ్చని అంటున్నారు. ప్రత్యూష్ సిన్హా సిఫార్సులే ఫైనల్ రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫారసుల ఆధారంగా ఐఏఎస్ అధికారులు సోమేశ్‌కుమార్, కాటా ఆమ్రపాలి, జి.అనంతరాము, ఎం.ప్రశాంతి, వాకాటి కరుణ, ఎ.వాణిప్రసాద్, రోనాల్డ్ రోస్, ఎస్ఎస్ రావత్‌లను ఏపీ కేడర్‌కు.. హరికిరణ్, జి.సృజన, శివశంకర్ లహోటిలను తెలంగాణ కేడర్‌కు కేంద్రం కేటాయించింది. ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష్ బిష్త్, అభిషేక్ మహంతిలను ఏపీకి కేటాయించారు. అయితే ఈ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించగా.. ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలను కొట్టివేస్తూ 2017లో తీర్పు ఇచ్చింది. దానిపై కేంద్రం తెలంగాణ హైకోర్టులో అప్పీల్ చేయగా.. సోమేశ్‌కుమార్‌ను తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. సోమేశ్‌కుమార్ తక్షణమే ఏపీలో రిపోర్టు చేయాలంటూ 2023 జనవరి 10న తీర్పు ఇచ్చింది. అంతేగాకుండా ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫార్సులను హైకోర్టు సమర్థించింది. దీంతో సోమేశ్‌కుమార్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టును కోల్పోవాల్సి వచ్చింది. ఈ తీర్పును ఇతర అధికారులకు కూడా వర్తింపజేయాలంటూ కేంద్రం దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ ఏడాది జనవరి 3న తీర్పునిచ్చింది. 10 మంది ఐఏఎస్‌లు, ముగ్గురు ఐపీఎస్‌ల కేటాయింపుపై క్యాట్ ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. ఆ అధికారుల ప్రస్తుత, మిగిలిన సర్వీసు, వ్యక్తిగత అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని.. గతంలో జరిపిన తుది కేటాయింపులను పునఃసమీక్షించే బాధ్యతను డీవోపీటీకి అప్పగించింది. ఈ మేరకు డీవోపీటీ మాజీ సెక్రెటరీ దీపక్ ఖండేకర్‌తో ఏర్పాటైన ఏకసభ్య కమిటీ.. కేడర్ కేటాయింపుపై ఆయా అధికారుల విజ్ఞప్తులను తిరస్కరించింది. ఈ కమిటీ చేసిన సిఫార్సు ఆధారంగా.. ఐఏఎస్‌లు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని డీవోపీటీ ఆదేశించింది. సందీప్‌కు మళ్లీ ఇంధనశాఖ బాధ్యతలు ప్రభుత్వం కీలకమైన ఇంధనశాఖ కార్యదర్శి/ట్రాన్స్‌కో, జెన్కోల ఇన్చార్జి సీఎండీగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాకు అదనపు బాధ్యతలను అప్పగించింది. గతంలో ఆయనకు పలుమార్లు ఈ పోస్టుల అదనపు బాధ్యతలను నిర్వహించిన అనుభవం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక రవాణా శాఖ కమిషనర్ టి.ఇలంబర్తికి జీహెచ్ఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యతగా అప్పగించింది. మరోవైపు ఏపీకి రిలీవైన రోనాల్డ్ రోస్ సతీమణి, ఇండియన్ పోస్టల్ సర్వీస్ అధికారిణి విశాలాచ్చి ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓగా డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. ఆమె సైతం తెలంగాణ నుంచి బుధవారం రిలీవ్ అయ్యారు. ఆమె స్థానంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓగా ఆర్వీ కర్ణన్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏపీ నుంచి తెలంగాణలో రిపోర్టు చేసిన ముగ్గురు ఐఏఎస్‌లు డీవోపీటీ ఆదేశాల మేరకు ఏపీ నుంచి రిలీవైన ఐఏఎస్ అధికారులు శివశంకర్ లోతేటి, శ్రీజన, సి.హరికిరణ్ బుధవారం తెలంగాణలో రిపోర్టు చేశారు. ఈ మేరకు సచివాలయంలో సీఎస్ శాంతికుమారిని కలిశారు. మరోవైపు తుది కేటాయింపుల్లో భాగంగా తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాల్సి ఉన్న ఐపీఎస్ అధికారులపై సందిగ్ధం కొనసాగుతోంది. రోడ్ సేఫ్టీ అథారిటీ డీజీ అంజనీకుమార్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ భిస్త్ను తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ ఇంకా ఉత్తర్వులు రాలేదని తెలిసింది. -
తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా కోట శ్రీవాత్సవ, మూసీ రివర్ డెవలప్మెంట్ ఎండీగా దాన కిషోర్, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌గా చాహత్ బాజ్‌పేయ్ బదిలీ అయ్యారు.ఆమ్రపాలి నుంచి హెచ్ఎండీఏ జాయింట్ డైరెక్టర్, మూసి రివర్ డెవలప్మెంట్ బాధ్యతలను ప్రభుత్వం తొలగించింది. మూసి రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అదనపు బాధ్యతలు దాన కిషోర్‌కు అప్పగించింది. హెచ్ఎండిఏ పూర్తిస్థాయి బాధ్యతలను సర్ఫరాజ్ అహ్మద్‌కు అప్పగించింది. ఆయనకు హెచ్‌జీసీఎంల్ అదనపు భాద్యతలను కూడా అప్పగించింది. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా కోటా శ్రీనివాస్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మయాంక్ విట్టల్‌ను సర్కార్ బదిలీ చేసింది. -
TG: ఎనిమిది మంది ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) శనివారం(ఆగస్టు3) ఉత్తర్వులు జారీ చేసింది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టి.కె. శ్రీదేవిని ఎస్సీ డెవలప్మెంట్ కమిషనర్‌గా బదిలీ చేశారు. వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌గా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. విపత్తుల నిర్వహణ విభాగం సంయుక్త కార్యదర్శి ఎస్.హరీశ్‌ను రవాణా, రోడ్లు భవనాలు సంయుక్త కార్యదర్శిగా నియమించారు. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా ఉదయ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. పురపాలక శాఖ ఉప కార్యదర్శిగా ప్రియాంక, హాకా ఎండీగా చంద్రశేఖర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ ఎండీగా శ్రీనివాస్‌రెడ్డిని నియమించారు. రవాణా, రోడ్లు భవనాలు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్‌రాజ్ బదిలీ అయ్యారు. -
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..
సాక్షి, అమరావతి: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు, నియామకాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో 62 మంది ఐఏఎస్‌లు ఏకకాలంలో బదిలీ అయ్యారు. ఈ క్రమంలో సెర్ప్ సీఈవోగా వీరపాండియ్యన్, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా సీహెచ్ శ్రీధర్ బదిలీ అయ్యారు.తాజా బదిలీల ప్రకారం.. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కమిషనర్‌గా రేఖారాణి. సెర్ప్ సీఈవోగా వీరపాండియ్యన్మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా సీహెచ్ శ్రీధర్. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్‌గా సీహెచ్ హరికిరణ్సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్‌గా శ్రీకేష్ బాలాజీరావు. పట్టణాభివృద్ధిశాఖ డైరెక్టర్‌గా హరినారాయణన్ బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా మల్లికార్జున ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా కృతికాశుక్లా. APSWREIS సెక్రటరీగా ప్రసన్న వెంకటేష్ఏపీఎంఎస్ఐడీసీ ఎండీగా లక్ష్మీషా. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా ఎంవీ శేషగిరిబాబు. పౌర సరఫరాల కార్పొరేషన్ వీసీఎండీగా గిరీష. స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా రాజబాబు. వ్యవసాయ, మార్కెటింగ్ డైరెక్టర్‌గా విజయసునీత. సోషల్ వెల్ఫర్ డైరెక్టర్‌గా లావణ్యవేణిఏపీ ట్రాన్స్‌కో జేఎండీగా కీర్తి చేకూరి. గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా బి. నవ్య. బదిలీల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వికాస్ రాజ్ బదిలీ అయ్యారు. బదిలీల ప్రకారం.. స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వికాస్ రాజ్. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా మహేష్‌దత్. ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా డాక్టర్ శరత్. రెవెన్యూ స్పెషల్ సెక్రటరీగా హరీష్. స్పోర్ట్స్ డైరెక్టర్‌గా కొర్రా లక్ష్మీ. మేడ్చల్ మల్కాజ్గిరి అదనపు కలెక్టర్‌గా రాధికా గుప్తా. -
ఏపీలో 19 మంది ఐఏఎస్‌లు బదిలీ
సాక్షి, అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐఏఎస్‌ల బదిలీలు చోటుచేసుకున్నాయి. తాజాగా 19 మంది ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. బదిలీల ప్రకారం..- భూ పరిపాలన చీఫ్ కమిషనర్‌గా జయలక్ష్మీ. - అటవీశాఖ స్పెషల్ సీఎస్‌గా అనంతరాము. - రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కాంతీలాల్. - ల్యాండ్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ సీఎస్‌గా రామ్ ప్రకాష్ సిసోడియా. - పెట్టుబడులు మౌలిక వసతులు కార్యదర్శిగా సురేష్ కుమార్- గ్రామ వార్డు సచివాలయ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగింత- ఐటీ శాఖ కార్యదర్శిగా శౌరబ్ గౌర్‌కి అదనపు బాధ్యతలు- పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శిగా ఎన్.యువరాజ్- మైనారిటీ వెల్ఫేర్ కార్యదర్శిగా హర్షవర్థన్- సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా కన్నబాబు బదిలీ- గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా కన్నబాబుకి అదనపు బాధ్యతలు- క్రీడలు యువజన సర్వీసుల శాఖ కార్యదర్శిగా వివేక్ యాదవ్- మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఏ సూర్యకుమారి- పరిశ్రమలు శాఖ డైరెక్టర్‌గా సి. శ్రీధర్- ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శిగా జే నివాస్- పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా వి.విజయరామరాజు- సమాచారశాఖ డైరెక్టర్‌గా హిమాన్షు శుక్లా- వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా ఎస్.ఢిల్లీ రావు బదిలీ అయిన అధికారుల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
AP: 21 మంది ఐఏఎస్‌లు బదిలీ..
సాక్షి, అమరావతి: ఏపీలో 21 మంది ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. శ్రీకాకుళం కలెక్టర్ బాలాజీరావు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఈ క్రమంలో నంద్యాల కలెక్టర్ మంజీర్ జిలానీ శ్రీకాకుళం కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఇక, తిరుపతి కలెక్టర్‌గా లక్ష్మి షా బదిలీ అయ్యారు. బదిలీలు ఇలా.. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా తిరుపతి కలెక్టర్ వెంకట్రమణారెడ్డి. నంద్యాల కలెక్టర్‌గా ప్రకాశం జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా అభిషిక్త్ కిశోర్ శ్రీకాకుళం కమిషనర్‌గా తమీమ్ అన్సారియా పార్వతీపురం జాయింట్ కలెక్టర్‌గా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్‌గా రోనంకి కూర్మనాథ్ విశాఖ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్‌గా కేఎస్ విశ్వనాథం విశాఖ జాయింట్ కలెక్టర్‌గా మయూర్ అశోక్ ప్రకాశం జాయింట్ కలెక్టర్‌గా గోపాలకృష్ణ రోనంకి కాకినాడ జాయింట్ కలెక్టర్‌గా ప్రవీణ్ ఆధిత్య పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్‌గా ఐలేఖ్య. సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ అడిషనల్ డైరెక్టర్‌గా గోవిందరావు. విజయనగరం జాయింట్ కలెక్టర్‌గా కార్తిక్ అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా భావన ఏపీయూఎఫ్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా హరిత. ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఆదర్శ్ రాజేంద్రన్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా అదితి సింగ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజస్ డిపార్ట్మెంట్ కార్యదర్శిగా రేఖారాణి. ఐఏఎస్‌లు బదిలీ -
బిహార్ పాలిటిక్స్.. నితీశ్ సర్కారు కీలక నిర్ణయం
పాట్నా: బిహార్‌లో రాజకీయం రసవత్తరంగా మారిన వేళ నితీశ్‌కుమార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 100 మంది ఆల్ ఇండియా సర్వీసు అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామంతో రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పు రాబోతోందని స్పష్టమైన సంకేతాలిచ్చినట్లయింది. రాష్ట్రంలో మొత్తం 22 మంది ఐఏఎస్, 79 మంది ఐపీఎస్, 45 మంది గ్రూప్ 1 స్థాయి అధికారులను నితీశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో అయిదుగురు జిల్లా కలెక్టర్లుండగా 17 మంది జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ)లు ఉన్నారు. పాట్నా డీఎం చంద్రశేఖర్ సింగ్‌ను సీఎంవో స్పెషల్ సెక్రటరీగా నియమించారు. కాగా, జనతాదళ్ యునైటెడ్ చీఫ్, సీఎం నితీశ్‌కుమార్ ఆర్జేడీని వదిలి బీజేపీతో కలిసి కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. నితీశ్ తన సీఎం పదవికి రాజీనామా చేసి బీజేపీతో కూటమి కట్టి తిరిగి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా ఉన్నతాధికారుల బదిలీలు జరగడం నితీశ్ కూటమి మార్చడం ఖాయమన్న వాదనకు ఊతమిస్తోంది. ఇదీచదవండి.. నితీశ్ కొత్త అవతారం -
కొత్త సర్కార్ ప్లాన్!.. కేంద్ర సర్వీసులకు స్మితా.. రాష్ట్రానికి ఆమ్రపాలి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రభుత్వంలో కొత్త టీమ్‌పై ఫోకస్ పెట్టారు. సీఎం ఆఫీసులో పనిచేసే అధికారుల ఎంపికపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇక, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారులకు స్థానచలనం మొదలైంది. కాగా, తెలంగాణలో త్వరలోనే ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్‌లో మూడు కమిషనరేట్ల పరిధిలో కమిషనర్లు బదిలీ అయ్యారు. ఇక, ఆయా శాఖల్లో పలువురు అధికారుల జాబితా కూడా సిద్దమైనట్టు తెలుస్తోంది. శాఖల సమీక్షలు పూర్తి కాగానే బదిలీలు ఉంటాయన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకే స్థానంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న అధికారులకు స్థాన చలనం ఉంటుందనే చర్చ మొదలైంది. మరోవైపు.. సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సెంట్రల్ సర్వీసుల్లోకి వెళ్లేందుకు స్మితా సబర్వాల్ దరఖాస్తు పెట్టుకున్నట్టు సమాచారం. కాగా, ప్రస్తుతం ఆమె.. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. మరోవైపు.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్మితా సబర్వాల్ ఏ సమీక్షకు హాజరు కాకపోవడం గమనార్హం. అంతకుముందు మాజీ సీఎం కేసీఆర్.. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సామర్థ్యాన్ని మెచ్చుకుని ఆమెను కార్యదర్శిగా నియమించారు. సీఎంవో ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ పనులు కూడా స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు. తాజాగా స్మితా సబర్వాల్ ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన 23 ఏళ్ల కేరీర్ గురించి ప్రస్తావిస్తూ ఆమె ఫొటోను షేర్ చేశారు. కొత్త ఛాలెంజ్‌కు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. Some pics remind us how far we have come.. through the valleys and the summits. 23 years to this pic… a driven young lady who always walked her will! Thanks to all your love ♥️, ever ready for a new challenge. pic.twitter.com/xahFAszBYv — Smita Sabharwal (@SmitaSabharwal) December 13, 2023 ఇదిలా ఉండగా.. స్మితా సబర్వాల్, ఆమ్రపాలి.. మహిళా ఐఏఎస్ అధికారుల పేర్లు మాత్రం ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకరు సీఎం ఆఫీసుకు గుడ్ బై చెప్పాలనుకుంటే మరొకరు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. స్మితా సబర్వాల్ సెంట్రల్ సర్వీసుల్లోకి వెళ్లాలని చూస్తుండగా.. ఇటు కేంద్ర సర్వీసులో ఉన్న మరో ఐఏఎస్ ఆమ్రపాలి.. రేవంత్ రెడ్డి టీమ్‌లో జాయిన్ కానున్నారు అనే చర్చ జరుగుతోంది. దీంతో, ఈ ఐఏఎస్‌ల అంశం ఆసక్తికరంగా మారింది. -
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. సీఎంఓ స్పెషల్ సీఎస్‌గా పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్‌గాగా మధుసూదన రెడ్డిలను నియమించింది. పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్, ఆర్ అండ్ బి సెక్రటరీగా ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ కమిషనరుగా రాహుల్ పాండే, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా మహ్మద్ దివాన్లను బదిలీ చేసింది. ప్రస్తుతం సీఎంఓ స్పెషల్ సీఎస్‌గా బాధ్యతలు చేపడుతున్న కెఎస్ జవహర్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఆ కొద్ది సేపటికే ఐఏఎస్‌ల బదిలీలపై ఉత్తర్వులు ఇచ్చింది. ఇదీ చదవండి: ఏపీ నూతన సీఎస్‌గా కె.ఎస్ జవహర్ రెడ్డి.. ఉత్తర్వులు జారీ -
ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీలు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సెర్ఫ్ సీఈవోగా ఎం.గౌతమి, అదనపు సీసీఎల్ఏ కం సెక్రటరీగా ఇంతియాజ్, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ ఎండీగా బాబు.ఏ బదిలీ అయ్యారు. చదవండి: కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా: దరఖాస్తు ఎలా చేసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో -
ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఐటీ కార్యదర్శిగా సౌరవ్‌గౌర్, బీసీ సంక్షేమశాఖ కార్యదర్శిగా జయలక్ష్మీ, కార్మికశాఖ కార్యదర్శిగా జి. అనంతరాము బదిలీ అయ్యారు. -
ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ
-
తగ్గుముఖం పట్టిన కరోనా రక్కసి
సాక్షి, బెంగళూరు: కరోనా రక్కసి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1,806 మందికి పాజిటివ్‌గా నిర్ధారించగా 2,748 మంది కోలుకున్నారు. 42 మంది చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 28,80,370కు పెరిగింది. 28,12,869 మంది కోలుకున్నారు. 36,079 మంది మరణించారు. ప్రస్తుతం 31,339 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. పాజిటివిటీ రేటు 1.18 శాతంగా ఉంది. ఇక బెంగళూరు నగరంలో 411 కేసులు నమోదుకాగా 549 మంది డిశ్చార్జి అయ్యారు. 10 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 12,21,371కు పెరగ్గా 11,93,213 మంది కోలుకున్నారు. 15,781 మంది మరణించారు. ప్రస్తుతం 12,376 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,52,908 నమూనాలు పరీక్షించారు. 1,88,908 మందికి కరోనా టీకా పంపిణీ చేశారు. దీంతో కరోనా టీకా పొందిన వారి సంఖ్య 2,68,06,999కు పెరిగిందని రాష్ట్ర ఆరోగ్య – కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. 8 మంది ఐఏఎస్‌ల బదిలీ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. రాహుల్ రత్నంపాండే–అసిస్టెంట్ కమిషనర్, కుమట ఉప విభాగ, ఉత్తరకన్నడ జిల్లా, వర్నిత్‌నేగి– అసిస్టెంట్ కమిషనర్ హణసూరు ఉపవిభాగ, మైసూరుజిల్లా, రాహుల్ శరణప్ప శంకనూరు– అసిస్టెంట్ కమిషనర్, లింగసూరు ఉప విభాగ, రాయచూరు, డాక్టర్ ఆకాశ్ ఎస్, అసిస్టెంట్ కమిషనర్, బళ్లారి ఉప విభాగ బళ్లారి, ఆనంద్‌ప్రకాష్ మీనా–అసిస్టెంట్ కమిషనర్, కోలారు ఉపవిభాగ, కోలారుజిల్లా, ప్రీతిక్ బయాల్–అసిస్టెంట్ కమిషనర్, సకలేశపుర, ఉప విభాగ, హాసన్ జిల్లా, మోనారోట్– అసిస్టెంట్ కమిషనర్, కలబురిగి ఉప విభాగ, కలబురిగి జిల్లా, అశ్విజ బీవీ– అసిస్టెంట్ కమిషనర్, సేడం ఉప విభాగ గుల్బర్గా. వర్షాలపై కేంద్ర మంత్రి సమీక్ష యశవంతపుర: మలెనాడు, కోస్తా ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా కేంద్రమంత్రి శోభా కరంద్లాజె ఉడిపి, చిక్కమగళూరు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకృతి వికోపం, కరోనా నిర్వహణ, మూడోవేవ్, నివారణకు సిద్ధతలు, కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఆమె అధికారులతో చర్చించారు. అభివృద్ధిపై చర్చించటానికే ఢిల్లీకి.. సీఎం యడియూరప్ప నీటిపారుదల ప్రాజక్టులపై చర్చించటానికి ఢిల్లీ వెళ్లినట్లు మంత్రి ఆర్ అశోక్ తెలిపారు. శుక్రవారం బెంగళూరులో విలేకర్లతో మాట్లాడారు ఇందులో ఎలాంటి రాజకీయ భేటీలు లేవన్నారు. -
కొత్త జట్టుపై ప్రభుత్వం కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరగబోతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లడంతో రాష్ట్రంలో ప్రారంభమైన ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు పరంపరకు తాజాగా ముగిసిన జెడ్పీ ఎన్నికలతో తెరపడింది. వరుసగా రాష్ట్రంలో శాసనసభ, పంచాయతీ, లోక్ సభ, శాసనమండలి, జిల్లా పరిషత్ ఎన్నికలు జరగడంతో 9 నెలలుగా పాలనా వ్యవహారాల్లో స్తబ్దత నెలకొంది. ఎట్టకేలకు ఎన్నికల ప్రవర్తన నియ మావళి అమలు శనివారంతో ముగిసింది. దీంతో ఇప్పుడిప్పుడే పరిపాలనా వ్యవహారాల్లో కదలిక ప్రారంభమైంది. గత డిసెంబర్లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో విజయఢంకా మోగించి రెండో పర్యాయం పాలనా పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో ‘కొత్త జట్టు’రూపకల్పనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టిసారించారు. జిల్లా స్థాయిలో పనిచేసే కలెక్టర్లు, ఎస్పీల నుంచి రాష్ట్ర స్థాయిలో పనిచేసే సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లకు భారీ ఎత్తున స్థానచలనం కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ అవసరాలు, ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టు కుని కొత్త జట్టు కూర్పును తయారు చేస్తున్నారు. తమ మాట వినే అధికారులను తమ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలుగా నియమించాలని పలువురు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. బదిలీల కసరత్తు పూర్తైనట్లు తెలిసింది. 18 జిల్లాల కలెక్టర్లతోపాటు వివిధ శాఖల ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల హోదా లో పనిచేస్తున్న సుమారు 20 మంది ఐఏఎస్‌లను బదిలీ చేయనున్నట్లు సమాచారం. కొన్ని శాఖల్లో సీనియర్ ఐఏఎస్‌లు దీర్ఘ కాలంగా పనిచేస్తున్నారు. వీరందరిని కొత్త స్థానాలకు బదిలీ చేయనున్నారు. పలు జిల్లాల ఎస్పీలతో పాటు డీఐజీ, ఐజీ హోదా గల మరో 20 మంది వరకు ఐపీఎస్‌లకు స్థానచలనం కలిగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలపై సీఎం కేసీఆర్ గత ఆదివారమే కసరత్తు చేశారు. శాసనసభ ఎన్నికలకు ముందు సిరిసిల్ల కలెక్టర్‌గా కృష్ణభాస్కర్, సిద్దిపేట కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి ఉండేవారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా అప్పట్లో వీరిని బదిలీ చేశారు. తాజాగా వీరిద్దరినీ పూర్వ స్థానాలకు బదిలీ చేస్తూ గత ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మిగిలిన ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీల విషయంలో ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశాలున్నాయి. -
ఏపీలో 11 మంది ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వేర్వేరు విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న 11 మంది ఐఏఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం బదిలీ చేసింది. వ్యవసాయ సహకార శాఖ ముఖ్యకార్యదర్శిగా బి. రాజశేఖర్ నియమిస్తూ రియల్‌టైం గవర్నెన్స్ ముఖ్యకార్యదర్శిగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా డి. వరప్రసాద్ నియమిస్తూ కార్మికశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా పి. లక్ష్మీనరసింహం, ఉపాధి, శిక్షణాశాఖ డైరెక్టర్‌గా కె. మాధవి లత, వికలాంగుల సంక్షేమం, వయోవృద్ధుల శాఖ డైరెక్టర్‌గా కిశోర్ కుమార్, సీసీఎల్ఏ సంయుక్త కార్యదర్శిగా లావణ్యవేణి, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా విజయ సునీత, విశాఖ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పి. శ్రీనివాసులు, ఏపీటీడీసీ సీఈవోగా కె. విజయలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
11 మంది ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. 5 రోజుల క్రితం ముగ్గురిని బదిలీ చేసిన ప్రభుత్వం మంగళవారం మరో 11 మంది ఐఏఎస్‌లకు స్థానచలనం కల్పించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా సిద్ధిపేట కలెక్టర్‌గా పని చేస్తున్న పి.వెంకట్రామిరెడ్డి.. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్య జిల్లా రాజన్నసిరిసిల్ల కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా పని చేస్తున్న డి.కృష్ణభాస్కర్‌ను సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలిని బదిలీ చేసిన ప్రభుత్వం కొత్తగా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావును హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా నియమించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణాకు ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. భూ పరిపాలన(సీసీఎల్ఏ) డైరెక్టర్ వాకాటి కరుణ ప్రస్తుతం అదనపు బాధ్యతలో ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. వాకాటి కరుణకు మరో అదనపు బాధ్యతగా ఉన్న రిజిస్ట్రేషన్, స్టాంప్స్ కమిషనర్ పోస్టులో సైతం ప్రభుత్వం ఇటీవలే పూర్తి స్థాయి అధికారిని నియమించింది. ఆగస్టు 31లోపు మరికొందరు ఐఎస్‌ఎస్‌ల బదిలీలు ఉంటాయని తెలుస్తోంది. మరికొంత మంది కలెక్టర్లతోపాటు, వివిధ శాఖల కమిషనర్లు, ముఖ్యకార్యదర్శుల పేర్లు తదుపరి బదిలీల జాబితాలో ఉండనున్నాయి. ఎన్నికల ప్రక్రియ వల్లే... 2019 సాధారణ ఎన్నికల ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలోనే కలెక్టర్ల బదిలీలు అనివార్యమయ్యాయి. సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్రియ చేపట్టింది. సెప్టెంబర్ 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించనుంది. అనంతరం అభ్యంతరాలు, ప్రతిపాదనల స్వీకరణ, పరిష్కారాల ప్రక్రియ ఉంటుంది. సాధారణంగా జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. ఓటర్ల జాబితా అభ్యంతరాలు, స్వీకరణ ప్రక్రియలో నిమగ్నమైన అధికారులను సెప్టెంబర్ 1 తర్వాత బదిలీ చేయడం కుదరదు. తప్పనిసరి పరిస్థితుల్లో బదిలీ చేయాలంటే కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను బదిలీ చేసినట్లు తెలిసింది. -
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ
-
భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. అలాగే వెయిటింగ్లో ఉన్న పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్, విజయనగరం జిల్లాలకు కొత్త కలెక్టర్లు నియమితులయ్యారు. వైఎస్సార్ జిల్లా కలెక్టర్‌గా చేవూరు హరికిరణ్, విజయనగరం జిల్లాకలెక్టర్గా ఎం.హరి జవహర్లాల్ నియ మితులయ్యారు. ప్రస్తుతం వైఎస్సార్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న టి.బాబూరావు నాయు డును గిరిజన కో–ఆపరేటివ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. విజయనగరం జిల్లా కలెక్టర్‌గా ప్రస్తుతం పనిచేస్తున్న వివేక్ యాదవ్‌ను ఎస్సీ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. -
ఐఏఎస్‌ల మార్పు.. యోగి అనూహ్య నిర్ణయం
సాక్షి, లక్నో : ఉత్తరప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌లను బదిలీలు చేశారు. గోరఖ్‌పూర్ జిల్లా మేజిస్ట్రేట్‌కు మాత్రం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమోషన్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలయిన నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ బదిలీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మొత్తం 37మంది ఐఏఎస్ అధికారులను, 16 మంది జిల్లా మేజిస్ట్రేట్లను బదిలీ చేసినట్లు అధికారులు శనివారం తెలిపారు. అయితే, గోరఖ్‌పూర్‌లో మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న రాజీవ్ రౌతెలాకు మాత్రం ప్రమోషన్ ఇచ్చి దేవిపఠాన్కు డివిజనల్ కమిషనర్‌గా చేశారు. ఈయన లోక్‌సభ ఉప ఎన్నికల వివరాలు బయటకు రానివ్వకుండా చేసేందుకు మీడియాపై కౌంటింగ్ సెంటర్ల వద్ద నిషేధం ప్రకటించి వివాదాస్పదమయ్యారు. దీంతో ఆయనకు ప్రమోషన్ ఇవ్వడంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం శుక్రవారం అర్థరాత్రి నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. -
బదిలీల కుదుపు..?
జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్, జేసీకి కూడా వీరి స్థానంలో తిరుపతి నుంచి వినయ్చందా.. ఎన్నికల టీమ్ కోసం ‘బాబు’ కసరత్తు సాక్షి ప్రతిని«ధి, కాకినాడ : రెండేళ్లలో రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం జిల్లా పరిపాలనపై పట్టు సాధించేందుకు చంద్రబాబు సొంత టీమ్‌ను ఏర్పాటు చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా రా ష్ట్రంలో పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరి కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను మార్పు చేయాలనే నిర్ణయానికి వచ్చా రు. రాష్ట్రంలో పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసేం దుకు సీఎం కసరత్తు చేస్తున్నారని జిల్లా కలెక్టరేట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఎవరిని ఏ జిల్లాకు బదిలీ చేయాలనే అంశంపై రూ పొందించిన జాబితాలో జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ పేర్లు ఉన్నాయని జిల్లా కేంద్రానికి అందిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఇద్దరు ప్రమోటీ ఐఏఎస్‌లే. ఈ కారణంగా ఈ సారి బదిలీల్లో ప్రమోటీలకు కాకుండా డైరెక్ట్ ఐఏఎస్‌లనే ఇక్కడ నియమించాలనే ఆలోచనతో ఉన్నారని తెలిసింది. కలెక్టర్, జేసీ ఇద్దరూ జిల్లాకు వచ్చి రెండేళ్లు దాటిపోయింది. ఈ క్రమంలో ఇద్దరికీ బదిలీ తప్పదంటున్నారు. అయితే జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ కలెక్టర్‌గా పదోన్నతి పొందనుండటంతో ఏదో ఒక జిల్లాకు కలెక్టర్‌గా బదిలీ అవుతారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కలెక్టర్, జేసీ ఇద్దరినీ ఒకేసారి బదిలీచేస్తే జిల్లా పరిపాలనా వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తే జేసీ బదిలీకి మరికొంత సమయం పడుతుంది. లేదంటే ఇద్దరూ బదిలీ ఖాయమనే అంటున్నారు. గతంలో కూడా బదిలీ ఊపు... కలెక్టర్ అరుణ్ కుమార్ బదిలీపై జిల్లా యంత్రాంగంలో ఆసక్తితోపాటు ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఒకే జిల్లాలో రెండేళ్లు పనిచేసిన కలెక్టర్ ఎవరినైనా సహజంగానే మరో జిల్లాకు బదిలీ చేస్తుంటారు. అందులో భాగంగా గతంలో రెండు పర్యాయాలు కలెక్టర్ బదిలీ అవుతారని ప్రచారం జరిగినప్పటికీ చివరి నిమిషంలో బదిలీ నిలిచిపోయిందనే వారు. క¯ŒSఫర్మ్‌డ్ ఐఏఎస్ అయిన అరుణ్ కుమార్‌కు కలెక్టర్‌గా జిల్లా తొలి పోస్టింగ్. గతంలో ఇదే జిల్లాలో ఆర్డీఓ, బీసీ కార్పొరేష¯ŒS ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేష¯ŒS కమిషనర్‌గా పని చేశారు. 2015 జనవరి నెలలో జిల్లాకు వచ్చిన అరుణ్ కుమార్ రెండు సంవత్సరాలు పైబడే ఇక్కడి జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. పుష్కర తొక్కిసలాటతో వాయిదా... అరుణ్‌కుమార్ బదిలీపై గత ఏడాది ఇదేరకంగా విస్తృతమైన ప్రచారం జరిగింది. అయినప్పటికీ ఆయన బదిలీ జరగ లేదు. పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరంలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఆ సంఘటన జరిగినప్పుడు జిల్లా కలెక్టర్‌గా అరుణ్‌కుమార్ ఇక్కడే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సీఎం, కుటుంబ సభ్యులు వీఐపీ ఘాట్‌లో కాకుండా సా«ధారణ యాత్రికులు స్నానమాచరించే ఘాట్‌లో ఉండటం, తరలివచ్చిన జనంతో సీఎం పూజలు చేసే ప్రక్రియను ఘనంగా చిత్రీకరించి అంతర్జాతీయ మీడియా ద్వారా విస్తృతమైన ప్రచారం పొందాలనే అత్యుత్సాహమే తొక్కిసలాటకు దారితీసిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ప్రభుత్వం ఏకసభ్య కమిష¯ŒSను విచారణకు ఆదేశించింది. ఆ కమిష¯ŒS విచారణ గడువు పొడిగిస్తూ పోతున్నారు తప్పించి ఇప్పటికీ కొలిక్కి రాలేదు. కేవలం ఈ కారణాలతోనే జిల్లా కలెక్టర్ బదిలీ రెండు పర్యాయాలు నిలిచిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఈసారి బదిలీల జాబితాలో అరుణ్‌కుమార్ పేరు ఖాయమైందని కలెక్టరేట్ వర్గాల సమాచారం. రాజమహేంద్రవరం కార్పొరేష¯ŒS కమిషనర్‌కు పదోన్నతితో... తొలి విడతలో కలెక్టర్, జేసీలకు బదిలీలుంటాయంటున్నారు. ఈ మేరకు ఒకటి, రెండు రోజుల్లో జాబితా ఖరారు కానుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. రెండో విడత బదిలీల్లో రాజమహేంద్రవరం కార్పొరేష¯ŒS కమిషనర్ వేగేశ్న విజయరామరాజు, సబ్ కలెక్టర్ విజయ్‌కృష్ణ¯ŒS జాయింట్ కలెక్టర్లుగా పదోన్నతి ఇవ్వాల్సి ఉంటుందంటున్నారు. ఆ క్రమంలోనే మలి విడత బదిలీల జాబితాలో వీరిద్దరికీ కూడా బదిలీ ఉంటుందంటున్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేష¯ŒS కమిషనర్‌కు అవకాశం...? బదిలీ అయ్యే అరుణ్‌కుమార్ సెర్్ఫకు తిరిగి వెళ్లే ఆలోచనతో ఉన్నారంటున్నారు. ఈసారి డైరెక్ట్ ఐఏఎస్‌లను మాత్రమే జిల్లా కలెక్టర్లుగా నియమించాలని సీఎం నిర్ణయించిన నేపథ్యంలో పలువురు జిల్లా కలెక్టర్‌గా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అధికార వర్గాల ద్వారా తెలియవచ్చింది. బదిలీపై రావాలనుకుంటున్న వారి జాబితాలో తిరుపతి మున్సిపల్ కార్పొరేష¯ŒS కమిషనర్ వాడ్రేవు వినయ్‌చంద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వినయ్‌చంద్‌తోపాటు టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు కూడా జిల్లాకు రావడానికి గత కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. వీరిద్దరిలో వినయ్‌చంద్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. వీరితోపాటు వుడా వీసీ టి. బాబూరావు నాయుడు, సీఎంఓ కార్యాలయంలో ఉన్న ప్రద్యుమ్న పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. -
ఏపీలో నలుగురు ఐఏఎస్‌ల బదిలీ
-
ఏపీలో నలుగురు ఐఏఎస్‌ల బదిలీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో నలుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్డీఏ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీకాంత్‌ను సాధారణ పరిపాలన విభాగం పొలిటికల్ సెక్రటరీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో గుంటూరు జాయింట్ కలెక్టర్‌గా పని చేసిన జేసీ శ్రీధర్ సీఆర్డీఏ కమిషనర్‌గా నియమించారు. విజయనగరం జిల్లా కలెక్టర్ ఎంఎం నాయక్‌ను విశాఖ ఈపీడీసీఎల్ సీఎండీగా బాధ్యతలు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లా సంయుక్త కలెక్టర్ వివేక్ యాదవ్‌ను విజయనగరం కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. -
ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్ : ఏపీలో పలువురు ఐఏఎస్‌లను ప్రభుత్వం మంగళవారం బదిలీ చేసింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా బి.రాజశేఖర్‌ను నియమిం చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఆయన వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న జి. జయలక్ష్మి మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ కాగా, ఈ శాఖ ముఖ్య కార్యదర్శిగా పూనం మాలకొండయ్య కొనసాగుతారు. పశుసంవర్థక శాఖలో ఉన్న జె.మురళి సహకార సొసైటీల స్పెషల్ కమిషనర్, రిజిస్ట్రారుగా బదిలీ అయ్యారు. ఉత్తర్వులు జారీ అయ్యే వరకూ ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తారు. సహకార సొసైటీల స్పెషల్ కమిషనర్, రిజిస్ట్రారుగా ఉన్న ఎంవీ శేషగిరి బాబుకు సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ
హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవిన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ప్రదీప్ చంద్రను నియమించగా, పంచాయతీరాజ్ జాయింట్ సెక్రటరీగా ధర్ నియమితులయ్యారు. అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా బీఆర్ మీనా, ఐక్యాడ్ సెక్రటరీగా వికాస్‌రాజ్, సెర్ప్ సీఈవోగా పౌసమి బసు, కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా దేవసేనను నియమించారు. -
ఆరుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ
హైదరాబాద్: తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల పేర్లు, బదిలీ స్థానాల వివరాలు పేర్కొంది. ఐఏఎస్ ఆఫీసర్ బదిలీ స్థానం శృతి ఓజా వికారాబాద్ సబ్ కలెక్టర్ అలుగు వర్షిణి మెదక్ జడ్పీ సీఈవో కృష్ణ భాస్కర్ కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ హనుమంతు ఐటీడీఏ భద్రాచలం పీఓ ఆద్వైత్కుమార్ సింగ్ ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ కె.శశాంక్ జగిత్యాల సబ్ కలెక్టర్ -
జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌పై వేటు
♦ జీహెచ్ఎంసీ నుంచి గిరిజన శాఖకు బదిలీ ♦ భారీగా ఐఏఎస్‌ల బదిలీలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 21 మంది ఐఏఎస్‌లను, ఒక ఐఆర్ఎస్ అధికారిని బదిలీ చేస్తూ శుక్రవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పనితీరుపై ఫిర్యాదులు, ఆరోపణలున్న అధికారులను అప్రధాన శాఖలకు పంపిన సీఎం కేసీఆర్, పనితీరు బాగున్న వారికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు కసరత్తును గురువారం రాత్రే ఆయన పూర్తి చేశారు. తాజా బదిలీలు అధికార వర్గాల్లో చర్చనీయంగా మారాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌ను అక్కణ్నుంచి తప్పించి గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేయటం సంచలనం రేపింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డెరైక్టర్‌గా ఉన్న బి.జనార్దన్రెడ్డిను సోమేశ్ స్థానంలో జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్‌గా నియమించారు. సీఎంకు సన్నిహితునిగా అధికార పార్టీ శ్రేణులకు, మిగతా రాజకీయ పార్టీల నేతలకూ మింగుడు పడని అధికారిగా సోమేశ్ ఇటీవల వివాదస్పదమయ్యారు. అధికార పార్టీకి కొమ్ముకాసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్షలాది ఓట్లను తొలగించిన ఆరోపణలూ ఆయన్ను చుట్టుముట్టడం తెలిసిందే. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. వాటిపై ఈసీ స్పందించడంతో పాటు దీనిపై విచారణకు ప్రత్యేక బృందం హైదరాబాద్‌కు రానుంది. ఈ సమయంలోనే సోమేశ్‌పై వేటు వేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరు రాష్ట్రాల మధ్య ఐఏఎస్‌ల విభజనలో సోమేశ్‌ను ఏపీకి కేటాయించగా దాన్ని ఆయన క్యాట్‌లో సవాలు చేసి తెలంగాణలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇతర మార్పుల్లో, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్‌కు భూ పరిపాలనా విభాగం ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సీసీఎల్ఏ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ విభాగంలో ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న ప్రిన్సిపల్ కమిషనర్ అధర్‌సిన్హాను జీఏడీకి బదిలీ చేశారు. ఎస్పీ సింగ్‌కు ఈసారి కీలకమైన పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. మంత్రితో విభేదించిన వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందాను పశు సంవర్ధక శాఖకు పంపారు. హెచ్ఎండీఏ కమిషనర్ శాలినీ మిశ్రాను ఆర్నెల్లు తిరక్కుండానే బదిలీ చేయటం గమనార్హం. జీహెచ్ఎంసీలో సుదీర్ఘ కాలం స్పెషల్ కమిషనర్‌గా చేసిన నవీన్ మిట్టల్‌ను సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌గా పంపారు. -
ఏపీపీఎస్సీ కార్యదర్శిగా గిరిధర్
ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన ఐఏఎస్ అధికారులు కొందరిని బదిలీ చేశారు. పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.గిరిధర్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కార్యదర్శిగా బదిలీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మాస్టర్ ప్లాన్ తయారీ వ్యవహారంలో మంత్రి నారాయణ వైఖరితో గిరిధర్ తీవ్రంగా విభేదించారు. రాజమండ్రిలో రాజధాని సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ అందజేసినప్పుడు ఆ కార్యక్రమానికి ఉన్నతాధికారులు అందరూ హాజరైనా.. గిరిధర్ మాత్రం గైర్హాజరయ్యారు. ఇదే అసంతృప్తి కారణంగా ఆయన 20 రోజులుగా సెలవులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆయనను అత్యంత కీలకమైన పట్టణాభివృద్ధి శాఖ నుంచి అంత ప్రాధాన్యం లేని ఏపీపీఎస్సీకి పంపడం గమనార్హం. బదిలీల్లో భాగంగా కరికాల వల్లవన్కు పౌరసరఫరాల శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్‌గా పి.గిరీషను నియమించారు. -
హెచ్ఎండీఏను వీడని గ్రహణం !
సాక్షి, సిటీబ్యూరో: విశ్వ నగరానికి విధి విధానాలు రూపొందించాల్సిన హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు పూర్తిస్థాయి బాధ్యత వహించే నాథుడు కరవయ్యాడు. పది నెలలుగా ఈ సంస్థ తల లేని మొండెంలా తయారైంది. తాజాగా ఆదివారం జరిగిన ఐఏఎస్‌ల బదిలీల్లో హెచ్ఎండీఏకు పూర్తిస్థాయి కమిషనర్‌ను ప్రభుత్వం నియమించక పోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. హెచ్ఎండీఏ పాలనా పగ్గాలను మళ్లీ ఎఫ్ఏసీకే పరిమితం చేయడం ప్రభుత్వ పెద్దల వైఖరికి అద్దంపడుతోందని కొందరు సిబ్బంది బాహాటంగా విమర్శిస్తున్నారు. ప్రజలకు సత్వర సేవలందించడంలో కృషి చేసే అధికారిగా పేరున్న బి. జనార్దన్‌రెడ్డినే హెచ్ఎండీఏకు పూర్తిస్థాయి కమిషనర్‌గా నియమించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి కమిషనర్ అండ్ డెరైక్టర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న జనార్దన్‌రెడ్డి నిత్యం సవాలక్ష పనులతో బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు హెచ్ఎండీఏ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించడం వల్ల అత్యవసర ఫైళ్లను క్లియర్ చేయడానికే సమయం సరిపోతుందని, ఇక పాలసీ నిర్ణయాలు తీసుకొనేందుకు ఆయనకు టైం ఉండకపోచ్చని సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవలి వరకు హెచ్ఎండీఏ ఇన్చార్జి కమిషనర్‌గా బాధ్యతలు వహించిన ప్రదీప్ చంద్ర కూడా తగిన సమయం దొరక్క చాలావరకు సచివాలయానికే తెప్పించుకునేవారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురవతుందన్న వాదనలు విన్పిస్తున్నాయి. పూర్తిస్థాయి కమిషనర్‌ను నియమించడం వల్ల నగరాభివృద్ధికి సంబంధించి భవిష్యత్ ప్రణాళికలు రూపొందించి వాటికి ప్రభుత్వం నుంచి ఆమోదం పొందేందుకు గట్టిగా కృషి చేస్తారని, తద్వారా సంస్థకు పూర్వవైభవం వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసులో కమిషనర్ ఉంటేనే.. సిబ్బందిలో అటెన్షన్ ఉంటుందని, వివిధ పనుల కోసం వచ్చే ప్రజలకు కూడా భరోసా ఉంటుందని రియల్టర్లు, బిల్డర్లు పేర్కొంటున్నారు. వెంటాడుతోన్న శాపం.. గతంలో హెచ్ఎండీఏ కమిషనర్‌గా నీరభ్ కుమార్ ప్రసాద్ పనిచేసిన సమయంలో అనేక అవకతవకలు, అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందడంతో సీఎం కేసీఆర్ వెంటనే చర్యలు తీసుకుని ఆయన్ని బదిలీ చేశారు. ఆయన నిర్వాకాలే సంస్థకు శాపంగా మారాయని సిబ్బంది వాపోతున్నారు. ఆ తర్వాత ఈ సంస్థలో పలువురు అధికారులు, కిందిస్థాయి సిబ్బందిపై కూడా ఇలాంటి ఫిర్యాదులే రావడంతో సీఎం హెచ్ఎండీఏపై ఏహ్య భావంతో ఉన్నారన్న పుకార్లు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో హెచ్ఎండీఏను సంస్కరించేందుకు ఉన్నతాధికారి ప్రదీప్ చంద్రను ఇన్చార్జిగా నియమించారు. అయితే, ఆయన హెచ్ఎండీఏకు సమయం కేటాయించకపోవడంతో అక్రమాలు యథావిధిగానే కొనసాగుతున్నట్లు విజిలెన్స్ నివేదికలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఏసీబీ దాడులు చేసి అక్రమార్కులను ఏరివేయండంతో కొంత అలజడి నెలకొంది. ఈ తరుణంలో బి.జనార్దన్‌రెడ్డిని ప్రభుత్వం హెచ్ఎండీఏ ఇన్చార్జి కమిషనర్‌గా పగ్గాలు అప్పగించడం చర్చనీయాంశమైంది. -
ఏపీలో ఏడుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ఏడుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా బదిలీ అయిన ఐఏఎస్ అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.. ► వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా టి. విజయ్ కుమార్ ► ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ఎంవీ సత్యనారాయణ ► ప్రకాశం జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ బదిలీ.. మార్క్ ఫెడ్ ఎండీగా విజయ్ కుమార్ నియామకం ► సీఆర్ డీఏ అడిషనల్ కమిషనర్ గా సుజాత శర్మ ► స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీగా మురళీధర్ రెడ్డి ► నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ చక్రధర్ బదిలీ.. రంపచోడవరం ఐటీడీఏ పీవోగా నియామకం ► కందుకూరు సబ్ కలెక్టర్ మల్లికార్జున్ బదిలీ.. మదనపల్లి సబ్ కలెక్టర్ గా నియామకం. -
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
-
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
* వెయిటింగ్‌లోని 18 మందికి పోస్టింగ్‌లు * మంగళవారం అర్ధరాత్రి జీవో జారీ సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం ఐఏఎస్‌లను భారీస్థాయిలో బదిలీ చేయడంతో పాటు వెయిటింగ్లో ఉన్న అధికారులకు పోస్టింగులు ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, విజయవాడలో బుధవారం రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇంతమంది అధికారులను బదిలీ చేయడం గమనార్హం. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న జేఎస్వీ ప్రసాద్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. జేఎస్వీ ప్రసాద్ పనితీరు పట్ల ముఖ్యమంత్రి అసంతృప్తి ఆయన బదిలీకి కారణమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ముక్కు సూటిగా, నిబంధనల మేరకు, ఒత్తిడిలకు లొంగకుండా పనిచేసే వ్యక్తిగా పేరున్న 2004 బ్యాచ్‌కు చెందిన పీఎస్ ప్రద్యుమ్నను సీఎం సంయుక్త కార్యదర్శిగా నియమించారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా ఎ.బాబును, శ్రీకాకుళం కలెక్టర్‌గా పి. లక్ష్మీనరసింహంను నియమించారు. వివరాలు.. -
ఐఏఎస్‌ల బదిలీలు
కొరుక్కుపేట: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పని చేస్తున్న ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాబితాను ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె.జ్ఞానదేశికన్ విడుదల చేశారు. కో ఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రారర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆర్.కిర్లోష్ కుమార్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టరుగా బదిలీ అయ్యారు. తిరుచిరాపల్లి జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న జయశ్రీ మురళీధరన్ కో ఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రారర్‌గా బదిలీ అయ్యారు. తేనిజిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్న డాక్టర్ కేఎస్పళనిస్వామి తిరుచిరాపల్లి జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. దిండుగల్‌జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎన్.వెంకటాచలం తేని జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. విరుదునగర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న టిఎన్ హరిహరన్నున దిండుకల్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. శివగంగై జిల్లా కలెక్టర్ వి.రాజారామన్ విరుదునగర్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. నాగపట్టణం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న టి.మునుసామిని శివగంగై జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. స్కూలు ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ ప్రభుత్వ డెప్యూటీ సెక్రటరీ ఎస్.పళనిస్వామిని నాగపట్టణం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు.