
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) శనివారం(ఆగస్టు3) ఉత్తర్వులు జారీ చేసింది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టి.కె. శ్రీదేవిని ఎస్సీ డెవలప్‌మెంట్ కమిషనర్‌గా బదిలీ చేశారు.
వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌గా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. విపత్తుల నిర్వహణ విభాగం సంయుక్త కార్యదర్శి ఎస్.హరీశ్‌ను రవాణా, రోడ్లు భవనాలు సంయుక్త కార్యదర్శిగా నియమించారు.
మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా ఉదయ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. పురపాలక శాఖ ఉప కార్యదర్శిగా ప్రియాంక, హాకా ఎండీగా చంద్రశేఖర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ ఎండీగా శ్రీనివాస్‌రెడ్డిని నియమించారు. రవాణా, రోడ్లు భవనాలు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్‌రాజ్ బదిలీ అయ్యారు.