Roads and Buildings Department
-
రోడ్డెక్కిన ‘ఉత్తర రింగు’
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు నిర్మాణం దిశగా కీలక ముందడుగు పడింది. ఈ రోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) టెండర్లను ఆహా్వనించింది. 161.518 కిలోమీటర్ల నిడివి ఉన్న ఈ భాగాన్ని ఐదు ప్యాకేజీలుగా విభజించి విడివిడిగా టెండర్లు పిలిచింది. టెండర్ల దాఖలుకు ఫిబ్రవరి 14వ తేదీని తుది గడువుగా నిర్ధారించింది. ఆలోపు ఫైనాన్షియల్, టెక్నికల్ బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 17న టెండర్లను తెరవనుంది. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ రెండేళ్లలో రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుందని టెండర్ డాక్యుమెంట్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. నిర్మాణం పూర్తయిన తర్వాత ఐదేళ్లపాటు ఈ రహదారి నిర్వహణ బాధ్యతలను కూడా చూసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈపీసీ పద్ధతిలో నిర్మాణ పనులు.. రీజినల్ ఉత్తర భాగాన్ని ఇంజనీరింగ్, ప్రొక్యూ ర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. తొలుత బీఓటీ (బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్), హామ్ వంటి విధానాలను పరిశీలించినా.. ఈ రోడ్డుపై వాహన ట్రాఫిక్ ప్రస్తుతానికి తక్కువగా ఉంటుందన్న అంచనాతో ఈపీసీ వైపు మొగ్గు చూపింది. మిగతా రెండు పద్ధతుల్లో నిర్మాణ సంస్థ తొలుత నిర్మాణ ఖర్చు మొత్తాన్ని భరించి, టోల్ రూపంలో వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మార్గంలో ప్రస్తుతం టోల్ ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండే అవకాశం లేదని, నిర్మాణ సంస్థలు ముందుకురాకపోవచ్చని భావనకు వచ్చింది. దీంతో నిర్మాణ వ్యయాన్ని కేంద్రమే భరించేలా ఈపీసీ వైపు మొగ్గు చూపింది. నిర్మాణం పూర్తయ్యాక టోల్‌ను ఎన్హెచ్ఏఐ సొంతంగా వసూలు చేసుకుంటుంది. మొత్తం వ్యయం రూ.17,080 కోట్లు నెల రోజుల క్రితం కన్సల్టెన్సీ సంస్థ టెండర్ డాక్యుమెంటును సిద్ధం చేసి ఎన్హెచ్ఏఐకి సమర్పించింది. ఆ వెంటనే ఎన్హెచ్ఏఐ రీజనల్ ఉత్తర భాగం డీపీఆర్‌ను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖకు సమర్పించింది. రీజనల్ ఉత్తర భాగం నిర్మాణ వ్యయం రూ.17,080 కోట్లుగా (రాష్ట్ర ప్రభుత్వ వాటా సహా) ప్రతిపాదించింది. ఇందులో రోడ్డు నిర్మాణ వ్యయం రూ.8,500 కోట్లు, భూసేకరణ వ్యయంలో కేంద్రం వాటా రూ.2,580 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,580 కోట్లు, ఇతర వ్యయం రూ.3,420 కోట్లుగా పేర్కొంది. మొత్తంగా ఎనిమిది లేన్లతో ఈ రోడ్డును ప్రతిపాదించారు. అందుకు సరిపడా భూసేకరణ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం నాలుగు లేన్ల రోడ్డును నిర్మించి, భవిష్యత్తులో మిగతా నాలుగు లేన్లను నిర్మించనున్నారు. రెండింతలు అయిన వ్యయం రీజనల్ రింగురోడ్డును ప్రతిపాదించిన సమయంలో ఉత్తర భాగానికి రూ.9 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రతిపాదించిన ఏడేళ్ల తర్వాత డీపీఆర్ సిద్ధమైంది. ప్రస్తుత ధరలు, పరిస్థితుల మేరకు అంచనా వ్యయం సుమారు రెండింతలై ఏకంగా రూ.17 వేల కోట్లు దాటింది. రోడ్డు నిర్మాణం పూర్తయ్యే నాటికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తం ఐదు ప్యాకేజీలు ఇవే.. రీజనల్ రింగ్‌రోడ్డు ఉత్తర భాగాన్ని ఐదు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. ప్యాకేజీ–1: సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ గ్రామం నుంచి రెడ్డిపల్లి వరకు 34.518 కిలోమీటర్లు. దీని నిర్మాణ వ్యయ అంచనా రూ.1,529.19 కోట్లు. ప్యాకేజీ–2: రెడ్డిపల్లి నుంచి ఇస్లాంపూర్ గ్రామం వరకు 26 కిలోమీటర్లు. అంచనా వ్యయం రూ.1114.80 కోట్లు. ప్యాకేజీ–3: ఇస్లాంపూర్ నుంచి రాజీవ్ రహదారి మీద ఉన్న ప్రజ్ఞాపూర్ వరకు 23 కిలోమీటర్లు. అంచనా వ్యయం రూ.1,184.81 కోట్లు. ప్యాకేజీ–4: ప్రజ్ఞాపూర్ నుంచి హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి మీద ఉన్న రాయగిరి గ్రామం వరకు 43 కిలోమీటర్లు. నిర్మాణ వ్యయం రూ.1,728.22 కోట్లు. ప్యాకేజీ–5: రాయగిరి నుంచి చౌటుప్పల్ సమీపంలోని తంగడపల్లి గ్రామం వరకు 35 కిలోమీటర్లు. వ్యయ అంచనా రూ.1,547.04 కోట్లు. 11 చోట్ల భారీ ఇంటర్చేంజ్ కూడళ్లు రీజనల్ ఉత్తర భాగంలో 11 చోట్ల భారీ ఇంటర్ చేంజ్ కూడళ్లను నిర్మించనున్నారు. జాతీయ/రాష్ట్ర రహదారులను ఈ రోడ్డు దాటే ప్రాంతాల్లో ఇవి ఉంటాయి. మొదటి కూడలి: సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్.. ఇక్కడ ఎక్సె్టండెడ్ డంబెల్ ఆకృతిలో భారీ ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్చర్ ఉంటుంది. దీని నిడివి 3 కిలోమీటర్లు ఉంటుంది. 150 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తారు. రెండో కూడలి: సంగారెడ్డి తర్వాత వచ్చే రెండో కూడలి 161 జాతీయ రహదారిని క్రాస్ చేసే శివంపేట వద్ద నిర్మిస్తారు. ఇక్కడ డబుల్ డంబెల్ డిజైన్‌లో ఉంటుంది. మూడో కూడలి: నర్సాపూర్–మెదక్ రోడ్డుపై నర్సాపూర్ వద్ద నిర్మిస్తారు. అక్కడ డంబెల్ మోడల్‌ను ఎంపిక చేశారు. నాలుగో కూడలి: హైదరాబాద్–నాగ్‌పూర్ రహదారిపై తూప్రాన్ వద్ద. ఇక్కడ క్లీవర్ లీఫ్ డిజైన్ ఎంపిక చేశారు. ఐదో కూడలి: తూప్రాన్–గజ్వేల్ దారిలో మజీద్‌పల్లి వద్ద. ఇక్కడ రోటరీ డిజైన్‌ను ఖరారు చేశారు. ఆరో కూడలి: రాజీవ్ రహదారిపై ప్రజ్ఞాపూర్ సమీపంలో ఉంటుంది. ఇక్కడ పాక్షిక క్లీవర్ లీఫ్ (మూడు లూప్‌లు మాత్రమే) డిజైన్ ఎంపిక చేశారు. ఏడో కూడలి: జగదేవ్‌పూర్–తుర్కపల్లి మధ్య పీర్లపల్లి వద్ద నిర్మిస్తారు. ఇక్కడ రోటరీ డిజైన్‌ను ఎంపిక చేశారు. ఎనిమిదో కూడలి: తుర్కపల్లి–యాదగిరిగుట్ట రోడ్డుపై తుర్కపల్లి వద్ద ఉంటుంది. ఇక్కడ రోటరీ డిజైన్‌లో నిర్మిస్తారు. తొమ్మిదో కూడలి: హైదరాబాద్–వరంగల్ హైవేపై రాయగిరి వద్ద.. డబుల్ ట్రంపెట్ డిజైన్‌లో నిర్మించనున్నారు. పదో కూడలి: భువనగిరి–వలిగొండ రోడ్డుపై వలిగొండ వద్ద ఉంటుంది. ఇక్కడ రోటరీ డిజైన్‌ను ఖరారు చేశారు. 11వ కూడలి: చౌటుప్పల్ సమీపంలో నిర్మిస్తారు. ఎది ఎక్స్టెండెడ్ డంబెల్ నమూనాలో 150 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. దక్షిణ భాగం డీపీఆర్ కన్సల్టెన్సీ టెండర్లకు కానరాని స్పందన మరోవైపు రీజనల్ రింగురోడ్డు దక్షిణ భాగాన్ని కేంద్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టడంతో.. ఈ భాగాన్ని సొంతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల క్రితం నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రాథమిక అలైన్‌మెంట్‌ను రూపొందించింది. తుది అలైన్మెంట్ తయారీ కోసం అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. డీపీఆర్ తయారీ కోసం కన్సల్టెన్సీ సంస్థను ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచింది. దాన్ని రోడ్లు భవనాల శాఖ అధికారులు శనివారం తెరిచారు. అయితే ఒక్క సంస్థ కూడా బిడ్లు దాఖలు చేయలేదని తెలిసింది. మరోవైపు రోడ్డు నిర్మాణాన్ని తొలుత ప్రతిపాదించిన మేరకు ఎన్హెచ్ఏఐతోనే చేపట్టాలని కోరుతూ ఇటీవల రోడ్లు భవనాల శాఖ కేంద్రానికి లేఖ రాసింది. దీంతో ఆ రోడ్డు నిర్మాణంపై సందిగ్ధత చోటు చేసుకుంది. -
TG: ఎనిమిది మంది ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) శనివారం(ఆగస్టు3) ఉత్తర్వులు జారీ చేసింది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టి.కె. శ్రీదేవిని ఎస్సీ డెవలప్మెంట్ కమిషనర్‌గా బదిలీ చేశారు. వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌గా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. విపత్తుల నిర్వహణ విభాగం సంయుక్త కార్యదర్శి ఎస్.హరీశ్‌ను రవాణా, రోడ్లు భవనాలు సంయుక్త కార్యదర్శిగా నియమించారు. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా ఉదయ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. పురపాలక శాఖ ఉప కార్యదర్శిగా ప్రియాంక, హాకా ఎండీగా చంద్రశేఖర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ ఎండీగా శ్రీనివాస్‌రెడ్డిని నియమించారు. రవాణా, రోడ్లు భవనాలు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్‌రాజ్ బదిలీ అయ్యారు. -
పల్లెబాటల్లో ప్రగతి వేగం.. హర్షం వ్యక్తం చేస్తున్న పల్లె ప్రజలు!
కర్నూలు(అర్బన్): దశాబ్దాల తరబడి గుంతలు పడిపోయి, కనీసం నడిచేందుకు కూడా వీలు లేని గ్రామీణ రోడ్లు అభివృద్ధి చెందుతున్నాయి. ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన పల్లె రోడ్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. నాబార్డు నిధులు రూ.189.29 కోట్లతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 39 పనులు చేపట్టారు. ఈ పనులు పూర్తయితే రెండు జిల్లాల్లో 257.79 కిలోమీటర్ల మేర రోడ్లు అభివృద్ధి చెందనున్నాయి. కోడుమూరు మండలం క్రిష్ణాపురం రోడ్డు పనులను పరిశీలిస్తున్న అధికారులు రహదారులు అభివృద్ధి చెందుతుండటంతో పల్లె ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అందిన ప్రత్యేక ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో 11, నంద్యాల జిల్లాలో 28 రోడ్లను బాగు చేసున్తన్నారు. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.187.27 కోట్లతో పాలనా అనుమతులు కూడా మంజూరు చేసింది. దీంతో ఆయా పనులను ప్రారంభించి వేగంగా పూర్తి చేసేందుకు పీఆర్ ఇంజినీర్లు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వేగంగా జరుగుతున్న పనుల్లో కొన్ని ... ► పత్తికొండ నియోజకవర్గం మండల కేంద్రమైన మద్దికెర నుంచి మొలగవెల్లి మీదుగా ఆలూరు వరకు రూ.8.15 కోట్లతో 14.90 కిలోమీటర్లు అభివృద్ధి చేస్తున్నారు. ► కోడుమూరు మండలం కర్నూలు – బళ్లారి ప్రధాన రహదారి నుంచి క్రిష్ణాపురం వరకు రూ.2.97 కోట్లతో 4.10 కిలోమీటర్ల మేర రోడ్డును అభివృద్ధి చేస్తున్నారు. ► కోడుమూరు మండలం వర్కూరు నుంచి మెరుగుదొడ్డి వరకు రూ.4.50 కోట్లతో 12.05 కిలోమీటర్ల మేర రోడ్డును వేస్తున్నారు. ► దేవనకొండ మండలం కర్నూలు – బళ్లారి మెయిన్ రోడ్డు నుంచి కొత్తపేట మీదుగా పుల్లాపురం వరకు రూ.3 కోట్లతో 5.8 కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు వేస్తున్నారు. నిరంతర పర్యవేక్షణ ప్రాధాన్యత రోడ్ల పనుల్లో భాగంగా చేపట్టిన పనులు పూర్తయితే దాదాపు వంద గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ పనులు కొనసాగుతున్నాయి. వీటిని పూర్తి నాణ్యతతో నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేందుకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖకు చెందిన అధికారులు పర్యవేక్షిస్తున్నారు. గతంలో మద్దికెర – ఆలూరు రోడ్డు ప్రస్తుతం మద్దికెర – ఆలూరు రోడ్డు పనులు ఏఈ స్థాయి నుంచి డీఈఈ, ఈఈ, ఎస్ఈ వరకు వారంలో ఎవరో ఒక అధికారి ఈ పనులను పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు చేస్తున్నారు. దీంతో పనుల్లో వేగం పెరుగుతోంది. దశల వారీగా నాణ్యతను సంబంధిత అధికారులు పరీక్షించిన తర్వాత మరో దశ పనులు చేపడుతున్నారు. నిధుల కొరత లేదు ప్రభుత్వం ఆమోదించిన రోడ్ల పనులకు ఎలాంటి నిధుల కొరత లేదు. ఈ పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి నాణ్యతతో పూర్తి చేయనున్నాం. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో మొత్తం 39 రోడ్ల పనులు ప్రారంభం అయ్యాయి. ఈ రోడ్ల పనులు పూర్తయితే రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. ఆయా నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు కూడా ఈ పనులను వేగంగా పూర్తి చేయించేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. – కే సుబ్రమణ్యం, పీఆర్ ఎస్ఈ -
తెలంగాణను దేశంలోనే రోల్ మోడల్ చేస్తా..
-
4 నెలల్లో 3,500 కి.మీ.రోడ్లు
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో రహదారుల పునరుద్ధరణను మరింత వేగవంతం చేసింది. కొత్తగా 3,500 కిలోమీటర్ల 437 రోడ్ల పనుల కోసం రూ.1,122 కోట్లు కేటాయించింది. ఆగస్టుకి టెండర్ల ప్రక్రియ చేపట్టి డిసెంబర్‌కి ఆ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. దీంతో టెండర్ల ప్రక్రియకు రోడ్లు, భవనాల (ఆర్ అండ్ బి) శాఖ చర్యలు చేపట్టింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికే నాలుగేళ్లలో రెండు దశల్లో రూ.4,492.99 కోట్లు వెచ్చించి 12,894 కి.మీ. రోడ్లు నిర్మించింది. ఇప్పుడు మూడో దశ పనులకు నిధులు కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా పునరుద్ధరించాల్సిన రోడ్లను శాస్త్రీయంగా ఎంపిక చేశారు. ఆర్ అండ్ బి శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి అత్యధిక రద్దీ ఉన్న రోడ్లను ఎంపిక చేశారు. వీరిచ్చిన నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. జిల్లా కేంద్రాలను అనుసంధానించే రోడ్లు, మండల కేంద్రాలను జిల్లా కేంద్రంతో అనుంధానించే 437 రోడ్లను తగిన నిష్పత్తిలో నిర్ణయించారు. వాటిలో 1,289.80 కి.మీ. మేర 132 రాష్ట్ర రహదారులు ఉన్నాయి. వీటిని రూ.490.80 కోట్లతో పునరుద్ధరించనున్నారు. కొత్త జిల్లా కేంద్రాలకు మండల కేంద్రాలతో అనుసంధానించే రోడ్లకు ప్రాధాన్యమిచ్చారు. అందుకే జిల్లా ప్రధాన రహదారుల కేటగిరీలోని 2,210.20 కి.మీ. మేర 305 రోడ్లను రూ.631.20 కోట్లతో పునరుద్ధరించనున్నారు. ప్రాధాన్యక్రమంలో బిల్లుల చెల్లింపు రోడ్ల పునరుద్ధరణ పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు కోసం ఆర్ అండ్ బి అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇటీవల రూ.500 కోట్ల బిల్లులను చెల్లించారు. మిగిలిన బిల్లుల చెల్లింపును వేగవంతం చేశారు. ఇక మూడో దశ కింద చేపట్టనున్న రోడ్ల పనుల బిల్లుల చెల్లింపునకు కూడా ముందస్తు ప్రణాళిక రూపొందిస్తున్నారు. పనులు పూర్తి చేసి బిల్లులు అప్లోడ్ చేసిన వెంటనే ప్రాధాన్యక్రమంలో చెల్లించే విధానాన్ని రూపొందించారు. దీనిపై కాంట్రాక్టర్లకు అవగాహన కల్పిస్తున్నారు. -
రోడ్లకు వాన దెబ్బ.. గాలికొదిలేసిన ప్రభుత్వం
గత రెండు మూడేళ్లుగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. భారీ, అతి భారీ వానలతో వరద పోటెత్తడంతో చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న చోట పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నా ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లు చేయలేదు. పలుచోట్ల నామ్కేవాస్తేగా పైపైన సాధారణ మరమ్మతులు చేసినా.. ఇటీవలి వర్షాలకు మరింతగా పాడయ్యాయి. చాలా చోట్ల గతుకులు, గుంతలు పడ్డాయి. కొన్నిచోట్ల పైన తారు కొట్టుకుపోయి.. మట్టిరోడ్లలా మారిపోయాయి. దీనితో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా కనిపిస్తోంది. మరో నెల రోజుల్లో వానాకాలం ముంచుకొస్తుండగా.. ఇప్పటికీ రోడ్ల మరమ్మతు అంశం కొలిక్కి రాలేదు. రోడ్ల పీరియాడికల్ రెన్యువల్స్‌కు సంబంధించి నిర్ధారించుకున్న నిడివిలో కేవలం 20 శాతమే పూర్తయింది. వానాకాలం మొదలైతే పనులు ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. రోడ్ల పీరియాడికల్ రెన్యువల్స్ తీరు ఇదీ.. మొత్తం ఎంపిక చేసిన రోడ్ల నిడివి: 6,617 కి.మీ. ఇందుకు మంజూరు చేసిన నిధులు: రూ.2,852 కోట్లు ఇప్పటివరకు పూర్తయిన రెన్యువల్: 1,400 కి.మీ. ఇంకా పనులు జరుగుతున్న రోడ్లు: 1,350 కి.మీ. పనులు ప్రారంభం కావాల్సిన నిడివి: 2,263 కి.మీ. టెండర్లు కూడా ఖరారు కాని రోడ్లు: 1,190 కి.మీ. భారీ వర్షాలు పడితే ఇబ్బందే.. గత రెండు వానాకాలాల్లో కలిపి దాదాపు రూ.2 వేల కోట్ల మేర రోడ్లకు నష్టం జరిగినట్టు అంచనా. ఎప్పటికప్పుడే రోడ్లను మెరుగుపరిస్తే.. తదుపరి వరదకు అంతగా నష్టం ఉండదు. అదే మరమ్మతులు చేయని పక్షంలో.. మళ్లీ వరద పోటెత్తితే ఆ రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు రోడ్లను పూర్తిగా పునరుద్ధరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఖర్చు భారీగా పెరుగుతుంది. రాష్ట్రంలో గత రెండేళ్లుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గుంతలు, దెబ్బతిన్న రోడ్ల కారణంగా ప్రమాదాలు జరుగుతాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులు మొదలుపెట్టినా.. 2021 వానాకాలంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు దాదాపు రూ.800 కోట్లు అవసరమని అంచనా వేశారు. గతేడాది భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు రూ.1,200 కోట్లు అవసరమని నిర్ధారించారు. 2021లో దెబ్బతిన్న రోడ్లను సకాలంలో బాగు చేయకపోవటంతో.. వాటి పటుత్వం తగ్గి 2022లో మరింతగా దెబ్బతిన్నాయి. అయినా సకాలంలో పునరుద్ధరణ చేపట్టలేదు. గతేడాది చివరలో రోడ్ల పీరియాడికల్ రెన్యూవల్స్ చేపట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. రూ.2,852 కోట్లను మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేసరికి ఫిబ్రవరి వచ్చేసింది. ఏప్రిల్ రెండో వారం నాటికి 20 శాతం పనులు పూర్తి చేశారు. కానీ అప్పటి నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో పనులు నిలిచిపోయాయి. పదేళ్ల తర్వాత రెన్యూవల్స్.. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం.. ప్రతి ఐదేళ్లకోసారి రోడ్లకు రెన్యూవల్స్ జరగాలి. అంటే పైన దెబ్బతిన్న తారు పూతను పూర్తిగా తొలగించి కొత్తగా వేయాలి. దీనికి భారీగా వ్యయం అవనున్నందున.. ఐదేళ్లకు బదులు కనీసం ఏడేళ్లకోసారి కొత్తగా వేసినా సరిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. కానీ తెలంగాణ ఏర్పడ్డాక అసలు పీరియాడికల్ రెన్యూవల్స్ చేపట్టలేదు. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి ఇప్పుడు పనులకు శ్రీకారం చుట్టారు. 6,617 కిలోమీటర్ల మేర రోడ్లను పునరుద్ధరించాలని నిర్ణయించి.. వరదలతో దెబ్బతిన్న రోడ్లను ఇందులో చేర్చి పనులు ప్రారంభించారు. కానీ అనుమతులు, నిధుల విడుదలలో జాప్యంతో పనులు ఆలస్యంగా చేపట్టారు. మరో నెలలో వానాకాలం మొదలవుతుండటంతో.. గతంలో రోడ్లు మరింతగా పాడైపోయే పరిస్థితి నెలకొందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జడ్చర్ల–వనపర్తి మధ్య బిజినేపల్లి ప్రాంతంలో రోడ్డు కనీస మరమ్మతులు కూడా లేక వానలకు దెబ్బతిని ఇలా గోతులమయంగా మారింది. ఈ మార్గంలో పెద్ద సంఖ్యలో టిప్పర్లు తిరుగుతుండటంతో గోతులు మరింత పెరిగి వాహన దారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గతంలో బిజినేపల్లి–జడ్చర్ల మధ్య ప్రయాణ సమయం అరగంట అయితే... ఇప్పుడు గోతుల వల్ల గంటకుపైగా పడుతోంది. బిజినేపల్లి సమీపంలోని నల్లవాగుపై నిర్మిస్తున్న వంతెనపై రోడ్డుమీద రెండు చిన్న వంతెనల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పక్కన నిర్మించిన తాత్కాలిక రోడ్డు వానలకు పాడైపోయింది. ఇటీవల ఈ రోడ్డుమీద అదుపుతప్పిన ఓ టిప్పర్ కరెంటు స్తంభాన్ని ఢీకొంది. తెగిన కరెంటు వైరు ఆ పక్కగా వస్తున్న ఆర్టీసీ బస్సుపై పడింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసి ఉండటంతో.. బస్సులో ఉన్న 70 మంది పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. నల్గొండ జిల్లా యాద్గార్పల్లి– కేశవాపురం మధ్య ఉన్న సింగిల్ రోడ్డు కాస్తా భారీ వర్షాలకు ధ్వంసమైంది. వరదలతో దెబ్బతిన్న రోడ్లను బాగుచేసే క్రమంలో ఇలా పునరుద్ధరించారు. ఇప్పుడు ప్రయాణాలు సాఫీగా సాగుతున్నాయి. -
యూత్ పవర్ అంటే ఇదే, త్వరలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
సమీప భవిష్యత్తు అంతా భారతదేశానిదే ‘ఈ దశాబ్దం చివరికల్లా (2029–30) ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరిస్తుంది. దేశంలోని కార్మికులు, కర్షకులు ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు,’ అన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖడ్ మాటలు నిజమవుతాయని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ సంస్థలు సైతం ధ్రువీకరిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలకు ప్రభుత్వం నుంచి ప్రయోజనాలను వారి ముంగిట్లోనే అందజేస్తున్నారని అంటూ భారత్ సాధించే విశేష ప్రగతిపై విశ్వాసం వ్యక్తం చేశారు ధంఖడ్. ఉపరాష్ట్రపతి అభిప్రాయాలతో ఏకీభవించే విధంగా ప్రఖ్యాత గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ డాయిష్ బ్యాంక్ కూడా ఇండియాపై తన అంచనాలు ప్రకటించింది. ‘ప్రస్తుత భారత వార్షిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 3.5 లక్షల కోట్ల డాలర్ల నుంచి 7 లక్షల కోట్ల డాలర్లకు 2030 నాటికి పెరుగుతుంది. ఇంతటి ఆర్థికాభివృద్ధిని మధ్యకాలంలో నిలకడగా సాధించాలంటే–తరచు చెప్పే అధిక జనాభా లేదా వస్తు వినియోగం మాత్రమే సరిపోదు. ఈ రెండూ ఇండియాకు ఆర్థికంగా సత్తువ ఇచ్చే కీలకాంశాలు,’ అని డాయిష్ బ్యాంక్ వ్యాఖ్యానించింది. తన అంచనాకు కారణాలు వివరిస్తూ, ‘ప్రస్తుత దశాబ్దంలో భారత్ మంచి ప్రగతి సాధించడానికి ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. దేశంలో గణనీయ సంఖ్యలో ఉన్న యువత జనాభా ఆర్థిక అభివృద్ధికి ప్రధాన కారణం కాగా, ప్రభుత్వ విధానాలు దీనికి తోడవుతున్నాయి,’ అని ఈ సంస్థ వివరించింది. అయితే, భారత ఆర్థిక వ్యవస్థ 2025 కల్లా ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర మంత్రులు విశ్వాసం వ్యక్తం చేస్తుండగా, 2027 నాటికి భారతదేశం ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవరిస్తుందని ప్రపంచ దేశాల ఆర్థిక గమనాన్ని నిరంతరం విశ్లేషించే అంతర్జాతీయ ఆర్థిక సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఇటీవల అంచనా వేసింది. డిజిటలైజేషన్, ఫైనాన్షియలైజేషన్ తో ఆర్థిక వ్యవస్థ దూకుడు నగదు వాడకం స్థానంలో డిజిటలైజేషన్ ప్రవేశపెట్టడంతో ఉత్పాదకత పెరిగింది. ఫైనాన్షియలైజేషన్ (మార్కెట్లు వంటి ఫైనాన్షియల్ సంస్థల సైజు, ప్రభావం పెరగడం) వల్ల సమాంతర ఆర్థిక వ్యవస్థ తగ్గిపోయింది. పరిశుభ్రమైన ఇంథన వినియోగం వల్ల కూడా వ్యవస్థలో సామర్ధ్యం పెరుగుతుందని డాయిష్ బ్యాంక్ అభిప్రాయపడింది. మరో ప్రోత్సాహకర అంశం ఏమంటే–ఇండియాలో పనిచేసే వయసున్న జనాభా సైజు విస్తరించడం. ప్రస్తుతం ఇలాంటి యువత సంఖ్య 2007లో చైనాలో ఉన్న స్థాయిలో ఇండియాలో ఉంది. భారత సమగ్ర జీడీపీ, తలసరి స్థూల దేశీయ ఉత్పత్తి ఇదే విధంగా చైనాను పోలి ఉన్నాయి. వచ్చే పదేళ్లలో దేశంలో పనిచేసే యువతరం సంఖ్యకు అదనంగా 9 కోట్ల 80 లక్షల మంది తోడవుతారు. ప్రపంచంలో పనిచేసే జనాభా సంఖ్యలో పెరుగుదల ఒక్క ఇండియాలోనే 22 శాతంగా ఉంటుందని కూడా ఈ జర్మన్ సంస్థ అంచనావేసింది. సంతృప్తికర కొనుగోలు శక్తి ఉండే భారత మధ్య తరగతి ప్రపంచంలోనే అతిపెద్దది. ప్రస్తుతం 37 కోట్ల 10 లక్షల మంది మధ్య తరగతి (మిడిల్ క్లాస్) దేశంలో వస్తు వినిమయం పెరగడానికి దోహదం చేస్తోంది. వచ్చే దశాబ్దాల్లో కూడా వినియోగం పెరగడానికి భారత మధ్య తరగతి ప్రజానీకం కారణమౌతారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంస్కరణల ఫలితంగా గ్రామీణ ప్రాంతాల మహిళలు కేవలం ఇంటి పనులకు పరిమితం కాకుండా ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. భారత అభివృద్ధికి మరో కీలకాంశం ఏమంటే జేఏఎం (జన్ ధన్ అకౌంట్, ఆధార్ నంబర్, మొబైల్ ఫోన్) అనే మూడు ఆయుధాలు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పక్కదారులు పట్టకుండా కాపాడుతున్నాయి. జేఏఎం ద్వారా నగదు బదిలీ వేగంగా, సునాయాసంగా జరుగుతున్న కారణంగా కోట్లాది మంది సామాన్య ప్రజానీకానికి మేలు చేకూరుతోంది. మౌలిక సందుపాయాల్లో అత్యంత ప్రధానమైన రహదారుల అభివృద్ధి, విస్తరణ మున్నెన్నడూ లేని విధంగా ముందుకుసాగుతున్నాయి. రహదారుల వ్యవస్థకు ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యం వల్ల ఇప్పుడు దేశంలో రోజుకు సగటున 36 కిలోమీటర్ల పొడవైన రోడ్డు మార్గాలు నిర్మిస్తున్నారు. గడచిన పది సంవత్సరాల్లో ఇండియాలో మొత్తం 73,000 కిలోమీటర్ల పొడవు గల రహదారులు నిర్మించారు. ఇటీవల కాలంలో దేశంలో విద్చుచ్ఛక్తి సరఫరా, శుభ్రమైన వంట పద్ధతులు అమలు చేయడంలో సాధించిన ప్రగతి కూడా దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టడానికి పురికొల్పుతోంది. విజయసాయిరెడ్డి, వైఎస్సార్సిపి, రాజ్యసభ సభ్యులు -
Ap Budget 2023-24: పరిశ్రమలు, వాణిజ్యానికి రూ. 2,602 కోట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: పరిశ్రమలు, మౌలిక సదుపాయల అభివృద్ధి ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపడమే కాక, వివిధ రంగాలలో ఉత్పాదక సామర్థ్యాలను వెలికితీస్తూ, ఉపాధి కల్పనను ప్రోత్సహిస్తుంది. ఇటీవల విశాఖపట్టణంలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు అద్భుతమైన స్పందన వచ్చి, ఆకర్షణీయమైన ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ రాష్ట్రం పటిష్టతను ఈ సదస్సు నిరూపించింది. 8,000 మందికి పైగా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్, జిందాల్ స్టీల్ అండ్ వపర్, భారత్ బయోటెక్, జీఎంఆర్ గ్రూప్, దాల్మియా గ్రూప్, రెన్యూ పవర్, బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్, సెంచురీ ఫ్లైబోర్డ్స్, శ్రీ సిమెంట్, రామ్‌కో సిమెంట్స్, అపోలో హాస్పిటల్స్‌తోపాటు అనేక ఇతరప్రముఖ పారిశ్రామిక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదించాయి. ఈ సదస్సులో 48 దేశాల నుంచి రాయబారులు, దౌత్యవేత్తలు, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇజ్రాయెల్, పోలాండ్, డెన్మార్క్,న ఆర్వే, నెదర్లాండ్స్, సింగపూర్, జపాన్ల నుంచి ఏడు అంతర్జాతీయ వ్యాపార ప్రతినిధుల బృందాలు ఏపీ పారిశ్రామిక సామర్థ్యాలపై ఎంతో ఆసక్తిని కనబరిచాయి. ఈ అవకాశాలను అన్వేషించడానికి యూఏఈ, నెదర్లాండ్స్, వియత్నాం, పశ్చిమ ఆస్ట్రేలియా దేశాలతో నాలుగు సమావేశాలు జరిగాయి. 13.42 లక్షల కోట్ల రూపాయల అంచనా పెట్టుబడితో ఏపీలో 6 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించే అవకాశంతో, 378 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడంతో ఈ సదస్సు ముగియడం ఎంతో గర్వించదగ్గ విషయం. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నుంచి వచ్చిన ఈ విశేష, స్పందన, అనుకూలమైన ప్రభుత్వ పారిశ్రామిక అభివృద్ధి విధానానికి, విశ్వసనీయతకు నిదర్శనం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. పెట్టుబడిదారుల అన్ని అవసరాల కోసం సింగిల్ డెస్క్ పోర్టల్ సర్వర్లు వన్ స్టాప్ షాప్‌గా ఉంటాయి. దీనిలో భాగంగా ఏప్రిల్ 2019, నుంచి 36,972 దరఖాస్తులు స్వీకరించండి. వాటిలో 36,049 దరఖాస్తులు ఆమోదించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31, 2022 వరకు, 13 పెద్ద, భారీ ప్రాజెక్ట్‌లు 15,099 కోట్ల రూపాయల పెట్టుబడి, 12,490 మందికి ఉపాధిని కల్పించి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాయి. అదే విధంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎమ్ఎస్ఎమ్ఈ) రంగంలో 7,742 కోట్ల రూపాయల పెట్టుబడితో 54,430 యూనిట్లు 2,11,219 మందికి ఉపాధి కల్పనతో ఉత్పత్తిలోకి ప్రవేశించాయి. చదవండి: AP Budget 2023-24: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 15,873 కోట్ల డిసెంబర్ 2022 వరకు, పారిశ్రామిక ప్రోత్సాహకాల క్రింద జనరల్ కేటగిరీలోని 902 సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా (ఎం.ఎస్.ఎం.ఈ.) యూనిట్లకు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన 448 యూనిట్లకు, షెడ్యూలు కులాలకు చెందిన 3,748 యూనిట్లకు షెడ్యూలు తెగలకు చెందిన 602 యూనిట్లకు మొత్తం 482 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. అలాగే ఈ ప్రభుత్వం క్లస్టర్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు-క్లస్టర్ అభివృద్ధి (ఎమ్ఎస్ఈసీడీపీ) ప్రాజెక్టుల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీ ప్రభుత్వం ఐదు క్లస్టర్ల నిర్మాణానికి అనుమతిని పొందింది. అంతే కాకుండా మన రాష్ట్రం జాతీయ పారిశ్రామిక వాడల అభివృద్ధి సంస్థ విశాఖపట్నం నోట్లోని నక్కపల్లి క్లస్టర్, శ్రీకాళహస్తి-ఏర్పేడు నోడ్లోని చిత్తూరు సౌత్ క్లస్టర్, విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ) కింద కడప నోడ్ కొప్పర్తి క్లస్టర్ ఈ మూడు పారిశ్రామిక వాడల అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఆమోదం తెల్పింది. 3,155 ఎకరాలలో కొప్పర్తి సమీపంలో వైఎస్సార్ జగనన్న భారీ పారిశ్రామిక వాడను అభివృద్ధి చేస్తోంది. ఈ పారిశ్రామిక వాడ బహుళ ఉత్పత్తుల భారీ పారిశ్రామిక పార్క్ గా 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 75,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. భారీ పారిశ్రామిక వాడకు ఆనుకుని వైఎస్సార్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది దీని ద్వారా సుమారు 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలని 25,000 మందికి ఉపాధిని కల్పించే అవకాశం ఉంటుంది. జిందాల్ స్టీల్ వర్క్స్ కంపెనీ 3,300 కోట్ల రూపాయల పెట్టుబడితో, సంవత్సరానికి రెండు మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయగల సామర్ధ్యంతో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కడప ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నది. దీని మొదటి దశలో 1000 ఉద్యోగాల వరకు ప్రత్యక్ష ఉపాధిని, రెండవ దశలో ప్రత్యక్షంగా 2,500 ఉద్యోగాలను, పరోక్షంగా 10,000 మందికి ఉపాధిని కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టు కడప ప్రాంత ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. ► 2023-24 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలు మరియు వాణిజ్యం కోసం 2,602 కోట్ల రూపాయల కేటాయించింది. రవాణా, రహదారుల మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో దాదాపు 32,725 కి.మీ. ప్రధాన జిల్లా రహదారులు, జిల్లాల్లోని ఇతర రోడ్ల నిర్వహణతోపాటు 4,000 కి.మీ పొడవున ఉన్న బి.టి. రోడ్లను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవడమైంది. రూ. 400 కోట్ల రూపాయలతో దెబ్బతిన్న రోడ్ల నిర్వహణ, అత్యవసర మరమ్మతులను ప్రభుత్వం చేపట్టింది. 2,205 కోట్ల రూపాయలతో 8,268 కి.మీ. రాష్ట్ర రహదారుల, జిల్లా ప్రధాన రహదారుల అభివృద్ధిని సాధించింది. 'రహదారుల అనుసంధాన ప్రాజెక్ట్' క్రింద కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు 437.59 కి.మీ. పొడవుగల రోడ్లకు సంబంధించి 391 కోట్ల రూపాయలతో 46 పనులను మంజూరు చేయడమైనది. డిసెంబర్ 2022 నాటికి 383.66 కి.మీ. పొడవు మేర రహదారి పనులు పూర్తయ్యాయి. ► 2023-24 ఆర్థిక సంవత్సరానికి రవాణా, రహదారుల మరియు భవనాల శాఖకు 9,118 కోట్ల రూపాయల కేటాయించింది. -
గ్రామాలను పట్టణాలకు కలుపుతూ మరో 976 కి.మీ. రోడ్లు
సాక్షి, అమరావతి: గ్రామాలను సమీప పట్టణాలకు కలుపుతూ రాష్ట్రంలో మరో 976 కిలోమీటర్ల పొడవున కొత్త రోడ్ల నిర్మాణం జరగనుంది. పీఎంజీఎస్వైలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 40:60 నిష్పత్తిన మొత్తం రూ.1,110.1 కోట్లు వెచ్చించనున్నాయి. దీన్లో రూ.607.87 కోట్లతో 976 కిలోమీటర్ల రోడ్లు నిర్మించనుండగా, రూ.502.23 కోట్లతో 76 బ్రిడ్జిలు నిర్మిస్తారు. జిల్లాల వారీగా కొత్తగా నిర్మించే రోడ్ల వివరాలతో రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు. దీనికి తుది ఆమోదం కోసం ఉగాది పండుగ రోజు (ఈ నెల 22న) కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల సమావేశం జరగనుంది. ఈ సమావేశం లాంఛనమేనని, రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలన్నింటికీ కేంద్రం ఇప్పటికే సూత్రపాత్రయంగా అంగీకారం తెలిపిందని రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు పీఎంజీఎస్‌వై ద్వారా రాష్ట్రంలో 1,291 కిలోమీటర్ల పొడవున 268 కొత్త రోడ్ల నిర్మాణం పూర్తిచేసినట్టు తెలిపారు. వాటికి సంబందించి జనవరి నెలాఖరు వరకు బిల్లులను కూడా ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించిందని చెప్పారు. -
కథ కంచికి.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఎన్నో దశాబ్దాల పాటు ‘పేదింటి’కి పెన్నిధిగా నిలిచిన గృహనిర్మాణ శాఖ కథ కంచికి చేరింది. వేల కుటుంబాలకు నీడను కల్పించిన ఆ శాఖ ఇప్పుడు రోడ్లు–భవనాల శాఖలో విలీనమైంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విలీనానికి సంబంధించి కొన్నిరోజుల కింద జరిగిన కేబినెట్ భేటీలోనే తీర్మానించినా శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. గృహనిర్మాణ శాఖలో అంతర్భాగమైన హౌసింగ్ కార్పొరేషన్ (గృహనిర్మాణ సంస్థ), హౌసింగ్ బోర్డు (గృహ నిర్మాణ మండలి), రాజీవ్ స్వగృహ కార్పొరేషన్, హౌసింగ్‌బోర్డుకు అనుబంధంగా ఏర్పాటైన డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (డీఐఎల్) తదితర విభాగాలన్నీ రోడ్లు–భవనాల శాఖ పరిధిలోకి వెళ్లిపోయాయి. రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్లకు పనిలేకుండా పోయింది. పేదల ఇళ్లకు సంబంధించి డబుల్ బెడ్రూం పథకాన్ని తొలుత హౌసింగ్ కార్పొరేషన్ పర్యవేక్షించినా.. దాని ఆధ్వర్యంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. సీఎం కేసీఆర్ దీనిపై ఏసీబీతో విచారణకు ఆదేశించి, ఆ శాఖలోని ఉద్యోగులను ఇతర కార్పొరేషన్లు, శాఖల పరిధిలోకి మార్చారు. దీంతో హౌసింగ్ కార్పొరేషన్ నామమాత్రంగా మారింది. డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం అమలును జిల్లా కలెక్టర్లకు అప్పగించటంతో.. రుణాలు తీసుకోవడానికే ఇది పరిమితమైంది. ఒకప్పుడు వందలాది ఉద్యోగులతో కళకళలాడిన ఈ సంస్థలో ప్రస్తుతం 50 మందే ఉన్నారు. వీరికీ లెక్కలు క్రోడీకరించడం మినహా పనిలేకుండా పోయింది. ఇప్పుడు వీరు ఆర్ అండ్ బీ పరిధిలోకి వెళ్తున్నారు. హౌసింగ్ బోర్డు, ‘స్వగృహ’ కథ కంచికే! అల్పాదాయ, మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాలకు ఇళ్లు నిర్మించి ఇచి్చన హౌసింగ్ బోర్డు.. పేదలకు చవకగా ఇళ్లు కట్టించేందుకు 2007లో ప్రారంభమైన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ల పరిస్థితీ ఇంతే. రాష్ట్ర ఏర్పాటు తర్వాత గృహ నిర్మాణ కార్యకలాపాలు చేపట్టకపోవడంతో వీటికి ఎలాంటి పని లేకుండా పోయింది. అప్పట్లోనే కట్టి అసంపూర్తిగా మిగిలిన వాటిని ఉన్నవి ఉన్నట్టుగా అమ్ముకోవటానికే స్వగృహ కార్పొరేషన్ పరిమితమైంది. ఇక ఈ రెండు విభాగాల కథ కంచికి చేరినట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేదల గృహ నిర్మాణం అన్నది ఎన్నికల ప్రధాన హామీల్లో ఒకటి కావడంతో హౌజింగ్ కార్పొరేషన్ మాత్రం కొనసాగే వీలుందని అంటున్నారు. ఇక పోలీసు సిబ్బందికి ఇళ్లు నిర్మించే పోలీసు హౌసింగ్ కార్పొరేషన్, వైద్యారోగ్య సిబ్బందికి ఇళ్లు నిర్మించి ఇచ్చే సంస్థలను కూడా ఆర్అండ్బీ శాఖ పరిధిలోకి తీసుకురానున్నట్టు సమాచారం. పూర్తికాని ఆస్తుల పంపకం రాష్ట్రం విడిపోయాక హౌసింగ్‌బోర్డు ఆస్తుల పంపకం వివాదంగా మారింది. దీనిని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 9వ షెడ్యూల్లో చేర్చారు. రాజీవ్ స్వగృహ ఆస్తులను మాత్రం ఎక్కడివి అక్కడే పద్ధతిలో రెండు రాష్ట్రాల మధ్య పంచారు. దాని అప్పులను కూడా పంచగా.. తెలంగాణకు రూ.900 కోట్ల రుణాలు వచ్చాయి. ప్రస్తుతం సర్కారు స్వగృహ ఆస్తులను క్రమంగా వేలం వేస్తోంది. మూసీ వరదలతో తెరపైకి ‘హౌజింగ్ బోర్డు’! గృహనిర్మాణ శాఖలో ప్రధాన విభాగంగా ఉన్న హౌసింగ్ కార్పొరేషన్ కంటే కొన్ని దశాబ్దాల ముందే హౌసింగ్ బోర్డుకు బీజం పడింది. 1908లో మూసీ వరదలతో దెబ్బతిన్న హైదరాబాద్ నగరాన్ని పునరుద్ధరించటంతోపాటు విశాలమైన రహదారుల నిర్మాణం, మెరుగైన పారిశుధ్య వ్యవస్థ ఏర్పాటు, వరదలతో నిరాశ్రయులైన వారికి ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్.. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ‘సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు’ను ప్రారంభించారు. మూసీ వరదలతో దెబ్బతిన్న నగరాన్ని ఆ బోర్డు ఆధ్వర్యంలోనే పునరుద్ధరించారు. వేల సంఖ్యలో ఇళ్లను నిర్మించి ఇచ్చారు. తర్వాత సికింద్రాబాద్ ప్రాంతంలో మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు 1931లో ‘టౌన్ ఇంప్రూవ్మెంట్ ట్రస్టు’ను ఏర్పాటు చేశారు. 1956లో ఈ రెండింటినీ విలీనం చేస్తూ గృహనిర్మాణ మండలి (హౌజింగ్ బోర్డు)ను ఏర్పాటు చేశారు. ఆసియాలోనే అతిపెద్ద హౌజింగ్ కాలనీ కూకట్పల్లి హౌజింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) కాలనీ.. ఒకప్పుడు ఆసియాలోనే మారుమోగిన పేరు. ఇక్కడ ఏడు ఫేజ్‌లలో అల్పాదాయ, మధ్య ఆదాయ, ఎగువ మధ్య ఆదాయ వర్గాలకు ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ పేర్లతో హౌజింగ్ బోర్డు దాదాపు 9 వేల ఇళ్లను నిర్మించింది. అప్పట్లో ఆసియాలోనే ఇది అతిపెద్ద హౌజింగ్ కాలనీ. అంతకుముందు హైదరాబాద్‌లో తొలి హౌసింగ్ బోర్డు కాలనీగా విజయనగర్ కాలనీని నిర్మించారు. తర్వాత మౌలాలి, ఎస్సార్ నగర్, వెంగళరావునగర్ కాలనీలను కట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రధాన పట్టాణాల్లోనూ కాలనీలు నిర్మించారు. ప్రభుత్వం నుంచి నిధులు లేకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతిలో ఇది కొనసాగింది. అయితే 1980 దశకం చివరికి వచ్చేసరికి ప్రైవేటు బిల్డర్ల హవా మొదలై.. హౌజింగ్ బోర్డు ప్రాభవం తగ్గుతూ వచి్చంది. అడపాదడపా కొన్ని కాలనీల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టినా సింగపూర్ టౌన్షిప్, మలేíÙయా టౌన్‌షిప్‌లు మినహా పెద్దగా గుర్తుండిపోయే ప్రాజెక్టులు లేవు. చివరిగా ఉమ్మడి రాష్ట్రంలో ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలోని రావిర్యాలలో ఇళ్లను నిర్మించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏ ప్రాజెక్టూ చేపట్టలేదు. మొత్తంగా తెలంగాణ పరిధిలో 20వేలకుపైగా ఇళ్లను బోర్డు స్వయంగా నిర్మించింది. వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్‌తో.. చెన్నారెడ్డి సీఎంగా ఉండగా హౌజింగ్ బోర్డుకు చైర్మన్‌గా వ్యవహరించిన ధర్మారెడ్డి దీనికి భారీగా ల్యాండ్ బ్యాంకు సిద్ధం చేశారు. కూకట్పల్లి నుంచి మాదాపూర్ వరకు ఏకంగా 6 వేల ఎకరాల భూమిని సమీకరించారు. తర్వాత ప్రైవేటు సంస్థలతో కలిసి ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రత్యేకంగా డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (డీఐఎల్)ను ప్రారంభించి... కొన్ని వేల ఎకరాలను దానికి బదలాయించారు. కానీ కొన్ని బడా సంస్థలు వందల ఎకరాల భూమిని తీసుకుని బోర్డుకు పూర్తి డబ్బులు చెల్లించకుండా ఎగ్గొట్టి నష్టపర్చాయి. ఇప్పటికీ ఆ వివాదాలు కొనసాగుతున్నాయి. జేఎన్టీయూ సమీపంలో హౌజింగ్ బోర్డు ఉద్యోగులకు 1978లో కాలనీని నిర్మించారు. దానికి ధర్మారెడ్డి పేరే పెట్టుకున్నారు. అప్పట్లో ఉద్యోగులకు రూ.5.80కు గజం చొప్పున స్థలాన్ని కేటాయించటం గమనార్హం. పీజేఆర్ టు కేసీఆర్.. పేదలకు ఇళ్లను నిర్మించి ఇచ్చే పథకం తొలుత సంక్షేమశాఖ అ«దీనంలో ఉండేది. 1990లలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న పి.జనార్దన్‌రెడ్డి ప్రత్యేకంగా గృహనిర్మాణ శాఖను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి అంగీకరించడంతో ప్రత్యేక శాఖగా ఏర్పాటైంది. నాటి నుంచి వివిధ విభాగాలు, కార్పొరేషన్లతో విస్తరించి.. పేదలు, మధ్యతరగతి ఇళ్లు కట్టించిన గృహనిర్మాణ శాఖ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కాలగర్భంలోకి వెళ్లిపోయింది. వైఎస్సార్ హయాంలో చరిత్ర సృష్టించి.. పేదల కోసం నిరంతరం తపించిన వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదల గృహ నిర్మాణ పథకానికి కొత్త నిర్వచనం చెప్పారు. పాదయాత్ర సమయంలో జనం బాధలను ప్రత్యక్షంగా చూసిన ఆయన.. ప్రతి పేద కుటుంబానికి సొంతింటిని అందించాలన్న లక్ష్యంతో ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రాంతంలోనే ఏకంగా 18 లక్షల ఇళ్లను మంజూరు చేశారు. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. దానిని చాలా రాష్ట్రాలు అనుసరించాయి. వైఎస్సార్ కన్నుమూసిన తర్వాత ఆ పథకం క్రమంగా నీరుగారుతూ వచ్చింది. దివిసీమ ఉప్పెన నిరాశ్రయులకు ఇళ్ల నిర్మాణంతో మొదలు.. 1977లో కృష్ణా–గుంటూరు ప్రాంతాలను కుదిపేసిన దివిసీమ ఉప్పెనలో నిరాశ్రయులైన పేదలకు గూడు కల్పించేందుకు నాటి చెన్నారెడ్డి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమే.. క్రమంగా గృహనిర్మాణ సంస్థ ఆవిర్భావానికి దారితీసింది. 1979లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం గృహనిర్మాణ పథకాన్ని చేపట్టి.. ప్రత్యేకంగా దివిసీమలో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. తర్వాత ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు.. ఈ కార్యక్రమాన్ని మొత్తంగా ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు కట్టించే పథకంగా మార్చారు. ఏటా లక్షన్నర చొప్పున ఇళ్లు నిర్మించేలా పంచవర్ష ప్రణాళికను చేపట్టారు. -
రోడ్ల కోతకు ‘ఎఫ్డీఆర్’తో చెక్
సాక్షి, అమరావతి: నదీపరివాహక ప్రాంతాల్లో దశాబ్దాలుగా వేధిస్తున్న రోడ్ల కోతకు రాష్ట్ర ప్రభుత్వం ముగింపు పలకనుంది. అందుకోసం ఫుల్ డెప్త్ రిక్లమేషన్ (ఎఫ్డీఆర్) టెక్నాలజీతో రోడ్లు నిర్మించాలని నిర్ణయించింది. మెత్తటి నేలల్లో రోడ్లు నిర్మిస్తున్నా.. వర్షాలు పడినా, వరదలు వచ్చినా నదీతీర ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురవుతున్నాయి. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దశాబ్దాలుగా ఈ సమస్య వేధిస్తోంది. ఈ జిల్లాల్లో నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉండటమే అందుకు కారణం. ఈ సమస్యను గుర్తించినప్పటికీ గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. సాధారణ పరిజ్ఞానంతో రోడ్లు నిర్మిస్తూ తమ అనుయాయులైన కాంట్రాక్టర్లకు ప్రయోజనం కల్పించింది. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం మెత్తటి నేలల్లో కూడా పటిష్టమైన రోడ్లు నిర్మించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ (ఆర్డీసీ) రాష్ట్రంలో మొదటిదశ కింద చేపట్టిన రోడ్ల పునరుద్ధరణ పనుల్లో ఎఫ్డీఆర్ సాంకేతికతతో రోడ్లు నిర్మించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా తూర్పు గోదావరి జిల్లాలోని గోపాలపురం నియోజకవర్గంలో గజ్జరం నుంచి హుకుంపేట వరకు 7.50 కిలోమీటర్ల మేర ఎఫ్డీఆర్ టెక్నాలజీతో రోడ్డు నిర్మించారు. ఆ రోడ్డును పరిశీలించిన సీఐఆర్ నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు. వెయ్యి కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎఫ్డీఆర్ టెక్నాలజీతో వెయ్యి కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. అందులో ఆర్ అండ్ బి శాఖకు చెందిన 500 కిలోమీటర్ల రోడ్లు, పంచాయతీరాజ్ శాఖకు చెందిన 500 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. కిలోమీటరుకు సింగిల్ లైన్ అయితే రూ.80 లక్షలు, డబుల్ లైన్ అయితే రూ.1.40 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. యాన్యుటీ విధానంలో ఈ రోడ్లు నిర్మిస్తారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ చేపట్టి నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎఫ్డీఆర్ టెక్నాలజీ అంటే.. మెత్తటి నేలలపై ఉన్న పాత రోడ్లను 300 మిల్లీమీటర్ల లోతువరకు తొలగిస్తారు. సిమెంట్, ఎమ్యల్షన్ అనే ప్రత్యేక ఎడెటివ్ రసాయనంతో చేసిన మిశ్రమాన్ని రోడ్డు, గ్రానైట్ వ్యర్థాల మిక్స్‌లతో కలిపి రోడ్లు నిర్మిస్తారు. ఈ రోడ్లు 15 ఏళ్లపాటు నాణ్యతతో ఉంటాయి. దీంతోపాటు ఎఫ్డీఆర్ టెక్నాలజీ పర్యావరణ హితమైనదని కూడా కావడం విశేషం. -
Telangana: రూ.3 వేల కోట్లు.. 4 వేల కిలోమీటర్లు
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో రోడ్లను మెరుగుపరిచే నిర్వహణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. కనీసం నాలుగు వేల కిలోమీటర్ల మేర రోడ్లను పూర్తిస్థాయిలో మరమ్మతు చేసి మెరుగుపరచాలని రోడ్లు, భవనాల శాఖ నిర్ణయించింది. అలాగే గత రెండేళ్లలో కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా దెబ్బతిని వాహనదారులకు నరకాన్ని చూపుతున్న రోడ్లను కూడా బాగు చేయనున్నారు. ఇందుకు రూ.3 వేల కోట్లు ఖర్చు కానున్నట్టు రోడ్లు, భవనాల శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రోడ్లను అద్దాల్లా మెరిసేలా చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ కదలిక వచ్చింది. గతంలోనూ నిధుల కోసం పలుమార్లు ప్రతిపాదనలు రూపొందించి వాటి విడుదల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో, ఈసారి స్వయంగా ముఖ్యమంత్రే ఆదేశించిన నేపథ్యంలో నిధులు వెంటనే మంజూరయ్యే అవకాశం ఉందని అంటున్నారు. బడ్జెట్ కేటాయింపుల పరిమితితో సంబంధం లేకుండా ఈ నిధులు విడుదల కానున్నాయి. ఏడో వంతు మాత్రమే.. రాష్ట్ర రహదారుల విభాగం పరిధిలో 28 వేల కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ ఉంది. ఇందులో ఇప్పుడు 4 వేల కి.మీ. పరిధిలో మాత్రమే పనులు జరగనున్నాయి. అంటే ఏడో వంతు మాత్రమే. ప్రతిరోడ్డుకు ఐదేళ్లకోసారి రెన్యూవల్ పనులు జరగాలని ఇండియన్ రోడ్ కాంగ్రెస్ చెప్తోంది. అయితే అది ఖర్చు తో కూడుకున్న వ్యవహారం అయినందున కనీసం ఏడేళ్లకోసారి అయినా మరమ్మతు జరగాలన్నది నిపుణుల మాట. రాష్ట్రంలో 28 వేల కి.మీ. రాష్ట్ర రహదారులున్నందున ప్రతియేటా 4వేల కి.మీ. రోడ్లకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో పెద్ద ఎత్తున డబుల్ రోడ్ల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు ఈ రోడ్ల పనులు చేపట్టారు. ఇందులో కొన్నింటిని పూర్తి చేశారు. వీటి నిర్మాణం వల్ల ఆయా ప్రాంతాల్లో ఏర్పడ్డ కొత్త రోడ్లనే రెన్యువల్స్‌గా భావిస్తున్నారు. అవి తప్ప విడిగా రోడ్డు రెన్యువల్ పనులు చేపట్టలేదు. ఫలితంగా చాలా రోడ్లు బలహీనపడ్డాయి. గత మూడేళ్లుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. పునరుద్ధరణ పనులకు నిధులులేక.. బాగా దెబ్బతిన్న ప్రాంతాల్లో వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. రోడ్ల దుస్థితిపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో ఇటీవల ముఖ్యమంత్రి సమీక్షించి వాటిని మెరుగు పరిచేందుకు ఆదేశాలివ్వటంతో సుదీర్ఘ విరామం తర్వాత వాటికి మంచిరోజులు రాబోతున్నాయి. రూ.3 వేల కోట్లలో దాదాపు రూ.700 కోట్లు వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు కేటాయించారు. -
AP: రూ.1,700 కోట్లు.. 6,150 కిలో మీటర్లు.. మరింత వేగవంతం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్ల పునరుద్ధరణ పనులను మరింత వేగవంతం చేసేందుకు ఆర్ అండ్ బి శాఖ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు రూ.1,700 కోట్లతో 6,150 కి.మీ.మేర రహదారుల పునరుద్ధరణ ప్రణాళికను ఖరారు చేసింది. గతంలో టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటి పునరుద్ధరణకు తీసుకున్న రూ.3వేల కోట్ల రుణాన్ని కూడా ఎన్నికల ముందు పసుపు–కుంకుమ పథకానికి మళ్లించడంతో పరిస్థితి మరింత దిగజారింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రోడ్ల పునరుద్ధరణపై దృష్టిసారించింది. ఇందుకోసం తీసుకున్న రుణాన్ని ప్రత్యేక బ్యాంకు ఖాతా ద్వారా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తోంది. దీంతో నిధులను ఇతర అవసరాలకు మళ్లించకుండా ప్రభుత్వం సరైన విధానాన్ని ఏర్పర్చింది. మొదటి దశ కింద రూ.2,205 కోట్లతో రాష్ట్రంలో 6,500 కి.మీ. మేర రోడ్ల పునరుద్ధరణ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఇప్పటికే 85శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. మిగిలిన 15శాతం పనులు డిసెంబర్ చివరి నాటికి పూర్తిచేయనుంది. దాంతో రెండో దశ కింద రాష్ట్రంలో రోడ్ల పునరుద్ధరణ పనులపై ఆర్ అండ్ బి శాఖ జిల్లాల నుంచి ప్రతిపాదనలను తెప్పించుకుంది. ఆ ప్రతిపాదనలతో రెండో దశ ప్రణాళికను రూపొందించింది. రూ.1,700 కోట్లతో ప్రణాళిక ఇలా.. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో మొత్తం 953 రోడ్లను రెండో దశలో పునరుద్ధరించాలని నిర్ణయించింది. వాటిలో రాష్ట్ర ప్రధాన రహదారులు 292, జిల్లా ప్రధాన రహదారులు 661 ఉన్నాయి. తద్వారా మొత్తం 6,150 కి.మీ. మేర రోడ్లను పునరుద్ధరిస్తారు. ఇందుకోసం రూ.1,700 కోట్లతో ప్రణాళికను ఖరారుచేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర ప్రధాన రహదారులకు రూ.673 కోట్లు, జిల్లా ప్రధాన రహదారులకు రూ.1,027 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. దీనికి ఆమోదముద్ర లభించిన తరువాత టెండర్ల ప్రక్రియ చేపడతారు. అనంతరం ఏడాదిలోగా పనులు పూర్తిచేయాలన్నది ఆర్ అండ్ బి శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. -
అద్దాల్లా రోడ్లు..! నిరంతరం పర్యవేక్షణ, మరమ్మతులు
సాక్షి, హైదరాబాద్: ‘‘ఇంజనీర్లు సంప్రదాయ పద్ధతిలో కాకుండా చైతన్యవంతంగా, విభిన్నంగా ఆలోచన చేయాలి. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని నిరంతరం సమీక్షించాలి. వానలు, వరదలకు పాడైన రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలి. రోడ్లు చెక్కు చెదరకుండా అద్దాల్లా ఉండేందుకు నిరంతర పర్యవేక్షణ, నిర్వహణ చేపట్టాల్సిన బాధ్యత ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖలదే..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు టెండర్లు పిలిచి వారంలో కార్యాచరణ ప్రారంభించాలని.. వచ్చేనెల రెండో వారంలోగా టెండర్లు పూర్తి కావాలని ఆదేశించారు. వానలు, వరదల కారణంగా దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖలపై కేసీఆర్ గురువారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖ తరహాలోనే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించుకుని రోడ్ల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. రోడ్లు ఎక్కడెక్కడ, ఏమూలన పాడయ్యాయో సంబంధించిన క్షేత్రస్థాయి ఇంజనీర్ల వద్ద పూర్తి వివరాలు ఉండాలని చెప్పారు. ఆర్అండ్బీ శాఖ పునర్వ్యవస్థీకరణ రాష్ట్రంలో గుణాత్మక ప్రగతికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో కావాల్సినంత సిబ్బందిని నియమించుకుని, బాధ్యతల వికేంద్రీకరణ దిశగా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇతర శాఖల తరహాలోనే ఆర్‌అండ్‌బీలో సైతం ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ)ల విధానాన్ని తీసుకురావాలన్నారు. ఐదారు ఆసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ఈఎన్సీ ఉండాలని, టెరిటోరియల్ సీఈలను కూడా నియమించాలని సూచించారు. సమర్థవంతంగా పనిచేయడానికి ఎస్ఈలు, ఈఈలు ఎంత మంది ఉండాలో ఆలోచన చేయాలన్నారు. సమర్థవంతంగా పర్యవేక్షణ ఉండేలా పని విభజన జరగాలని.. ఆ దిశగా సమీక్ష జరిపి తుది నివేదిక ఇస్తే తదుపరి మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదించేందుకు వీలుంటుందని తెలిపారు. ఇక ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలపైనా సమావేశంలో చర్చించారు. ‘బాధ్యతల పునర్విభజన; వానలు, వరదలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, నిర్వహణ; మరమ్మతులు, ఇతర పనులపై సత్వర నిర్ణయం; వెంటనే పనులు చేపట్టేదిశగా కిందిస్థాయి ఇంజనీర్లకు నిధుల కేటాయింపు..’ వంటి వ్యూహాలను అవలంబించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇంజనీర్లు ఎక్కడికక్కడ రోడ్లను విభజించుకుని పని విభజన చేసుకోవాలన్నారు. కేజ్ వీల్స్‌పై ఇక కఠినంగా.. గ్రామాల్లో ట్రాక్టర్లను కేజ్ వీల్స్‌తో నడుపుతుండడంతో రోడ్లు పాడవుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఇలా చేయకుండా రైతులు, ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లను చైతన్యవంతం చేయాలని, అవసరమైతే కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. అటవీ భూములు అడ్డం రావడంతో రోడ్ల నిర్మాణం ఆగిపోతే.. ఆ శాఖతో సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరించాలని సూచించారు. రోడ్ల నిర్మాణానికి వినియోగించే మెటీరియల్‌ను హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తి చేసుకోవాలని, తద్వారా సమయం ఆదా చేయడంతోపాటు, నాణ్యతను కాపాడుకోవచ్చని చెప్పారు. క్షేత్రస్థాయి ఇంజనీర్లకు స్వీయ విచక్షణ నిధులు నీటి పారుదల శాఖ తరహాలోనే రోడ్ల మరమ్మతుల కోసం ఆర్అండ్బీ శాఖకు కూడా మెయింటెనెన్స్ నిధులు పెంచినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. క్షేత్రస్థాయి ఇంజనీర్లు ప్రతి చిన్నపనికి హైదరాబాద్‌కు వచ్చి సమయం వృథా చేసుకోవద్దని.. వారి స్థాయిని బట్టి స్వీయ విచక్షణతో ఖర్చు చేసేలా నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందని చెప్పారు. స్వీయ విచక్షణతో ఖర్చు చేసేందుకు డీఈఈ, ఈఈ, ఎస్ఈ స్థాయి అధికారులకు ఎన్ని నిధులు కేటాయించాలో సిఫార్సు చేయాలని సీఎం సూచించారు. రోడ్ల నిర్వహణ సమర్థవంతంగా జరగాలంటే ఏ స్థాయి ఇంజనీర్లకు బాధ్యతలు అప్పగించాలో తేల్చాలని కోరారు. పటిష్టంగా కొత్త ఆస్పత్రుల నిర్మాణం రాష్ట్రంలో కొత్త సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను పటిష్టంగా నిర్మించాలని ఆర్అండ్బీ శాఖను సీఎం ఆదేశించారు. వరంగల్, హైదరాబాద్‌లలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఈఎన్టీ, డెంటల్, ఆప్తాల్మాలజీ విభాగాలకు ఒక అంతస్తును కేటాయించాలని సూచించారు. ఈ మేరకు ఆయా ఆస్పత్రుల డిజైన్లను పరిశీలించి పలు మార్పులను సూచించారు. అన్ని విభాగాలకు ప్రత్యేక వసతులతో ఎత్తైన భవనాలను నిర్మించాలని కోరారు. వైద్య విద్యార్థులు, ప్రజలకు సౌకర్యవంతంగా ఆస్పత్రులు ఉండాలన్నారు. కార్పొరేట్‌కు ధీటుగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఉండాలన్నారు. అయితే సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర ప్రభుత్వ శాఖల పనితీరుపై సీఎం కేసీఆర్ సమీక్ష జరపడం గమనార్హం. ఇదీ చదవండి: బుల్లెట్ ప్రూఫ్‌తో సీఎం ఛాంబర్.. అత్యాధునిక హంగులతో నూతన సచివాలయం -
భళా బూడిద..!
సాక్షి, అమరావతి: బూడిద అనగానే ఎందుకూ పనికిరాదని తేలిగ్గా తీసేస్తాం. కానీ, అలా తీసిపడేసిన బూడిదతోనే కంకర తయారు చేసి పటిష్టంగా రహదారులు, భవనాలను నిర్మించవచ్చు. అది కూడా సిమెంటు అవసరం లేకుండానే. ఈ మేరకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) లిమిటెడ్ చేసిన ప్రయోగం ఫలించింది. దీనివల్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వచ్చే బూడిదతో ఇబ్బందులు తొలగి జీవరాశులకు, పర్యావరణానికి మేలు కలుగనుంది. రోడ్లు, భవనాల నిర్మాణంలో ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. బూడిద విక్రయాల వల్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఆదాయమూ పెరగనుంది. ఫలించిన పరిశోధనలు థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే వ్యర్థాల్లో బూడిద (ఫ్లై యాష్) ప్రధానమైంది. దేశంలో బొగ్గుతో నడిచే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఏటా సుమారు 258 మిలియన్ మెట్రిక్ టన్నుల బూడిద ఉత్పత్తి అవుతోంది. ఇందులో 78 శాతం బూడిదను సిమెంట్, సిరామిక్ వంటి పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. బూడిద స్వభావాన్ని బట్టి వేరుచేసి టన్ను రూ.80 చొప్పున విక్రయిస్తారు. మిగిలినది యాష్ పాండ్లలో మిగిలిపోతుంది. అది గాలి, నీరులో కలిసి వాటిని కలుషితం చేస్తోంది. ఫలితంగా వాతావరణం దెబ్బతిని, దాని ప్రభావం జీవరాశులపై పడుతోంది. ఈ నేపథ్యంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని తగ్గించాలని ఓ వైపు ప్రయత్నాలు కొనసాగుతుండగా, మరోవైపు ప్రస్తుతం వస్తున్న బూడిద వినియోగంపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) లిమిటెడ్... బూడిదను ఉపయోగించి జియో పాలిమర్ ముతక కంకరను అభివృద్ధి చేసింది. ఈ కంకర జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్ (ఎన్‌సీసీబీఎం) ధ్రువీకరించింది. ఇది సహజ కంకరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. ఏటా దేశంలో 2వేల మిలియన్ మెట్రిక్ టన్నుల కంకరకు డిమాండ్ ఉంటుంది. థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడిన బూడిదతో చేసిన కంకర ఈ డిమాండ్‌ను చాలావరకు తీర్చే అవకాశం ఉంది. రాతి కంకర కోసం కొండలు, భూమిని తవ్వడం వల్ల ఏర్పడే పర్యావరణ అసమతౌల్యాన్ని కూడా తగ్గిస్తుంది. ఖర్చు తగ్గుతుంది జియో పాలిమర్ కంకర ఉపయోగించినప్పుడు సిమెంట్ అవసరం లేదు. థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే బూడిద ఆధారిత జియోపాలిమర్ కంకరే బైండింగ్ ఏజెంటుగా పని చేస్తుంది. ఈ కంకర కర్బన ఉద్గారాలను తగ్గించడంలోనూ తోడ్పడుతుంది. నీటి వినియోగాన్ని కూడా తగ్గిస్తుంది. మరోవైపు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించి థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయిన బూడిదను మూడేళ్లలో వంద శాతం వినియోగించాలి. అందువల్ల త్వరలోనే జియో పాలిమర్ కంకర అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. -
పైసలు రావు పనులు కావు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త రోడ్ల నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది. గతంలో ప్రారంభించిన.. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు రెండు వరసల రహదారుల నిర్మాణం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. చివరకు నిర్వహణ పనుల్లో భాగంగా క్రమం తప్పకుండా జరగాల్సిన పునరుద్ధరణ (రెన్యువల్స్) పనులు చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. తెలంగాణ వచ్చిన కొత్తలో దేశంలో మరే రాష్ట్రంలో లేనట్టుగా ఏకంగా రూ.15,470 కోట్లతో రోడ్ల పనులు చేపట్టారు. కానీ ప్రస్తుతం రోడ్లపై పడ్డ గుంతలను పూడ్చడం తప్ప రోడ్ల నిర్మాణం మచ్చుకైనా కనిపించటం లేదు. దీంతో రోడ్లు భవనాల శాఖలో రాష్ట్ర రహదారుల విభాగానికి చేసేందుకు పని లేని పరిస్థితి ఎదురైంది. కేటాయింపు కష్టమై.. ►తెలంగాణ ఏర్పడక పూర్వం రాష్ట్రవ్యాప్తంగా డబుల్ రోడ్లు నామమాత్రంగానే ఉండేవి. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు, కొన్ని ప్రధాన పట్టణాల మధ్య తప్ప అన్నీ సింగిల్ రోడ్లే. 2014 నాటికి రాష్ట్రప్రభుత్వ అధీనంలోని రోడ్ల నిడివి 24,245 కి.మీ. కాగా, అందులో కేవలం 27.9% మాత్రమే డబుల్ రోడ్లు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రోడ్లపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్, అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు డబుల్ రోడ్లు ఉండాలని నిర్ణయించి ఏకంగా రూ.15,470 కోట్లతో 9,578 కి.మీ. నిడివిగల రహదారులను డబుల్ రోడ్లుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ పనులు అధిక ప్రాధాన్యంతో సాగటంతో 2018 నాటికే సింహభాగం పూర్తయ్యాయి. ప్రస్తుతం 7,540 కి.మీ. పనులు పూర్తయ్యాయి. మిగతావి మాత్రం మూడేళ్లుగా నిలిచిపోయాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా చివరలో ఏర్పడ్డ కొత్త మండలాలకు డబుల్ రోడ్ల భాగ్యం దక్కలేదు. తొలుత 145 మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు రోడ్లకు సంబంధించి 1,835 కి.మీ. పనులు ప్రతిపాదించగా 1,651 కి.మీ పనులు పూర్తయ్యాయి. మిగతావి పెండింగులోపడ్డాయి. కొత్త మండలాలకు సంబంధించి 450 కి.మీ. పనులు చేయాల్సి ఉంది. ఇందుకు రూ.1,000 కోట్లు కావాలని అంచనా వేశారు. వీటితోపాటు పాత పనులకు ఇంకా రూ.3 వేల కోట్లు కావాల్సి ఉంది. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో అన్ని నిధులు కేటాయించటం కష్టంగా మారటంతో పనులు దాదాపుగా నిలిపివేశారు. బకాయిలు చెల్లిస్తేనే పనులు.. ►ఇటీవల రోడ్ల రెన్యువల్స్ పనుల కోసం టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. రెండుసార్లు టెండర్లు పిలిచి స్పందన లేక అధికారులు మిన్నకుండిపోయారు. పనులు చేస్తే బిల్లులు వస్తాయన్న నమ్మకం లేకనే కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ప్రస్తుతం వారికి రూ.700 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఇవి గతంలో రూ.1,200 కోట్లుగా ఉండగా, అడపాదడపా కొన్ని చొప్పున చెల్లిస్తూ రావడంతో ఈ మాత్రానికి తగ్గాయి. ఇవి దాదాపు రెండేళ్లుగా పేరుకుపోయి ఉండటంతో, కాంట్రాక్టర్లు స్టేట్ రోడ్ల పనులంటేనే వెనకడుగు వేస్తున్నారు. ఏడున్నరేళ్లలో ఇలా ►తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 7,180 కి.మీ రెండు వరసల రోడ్లను నిర్మించారు. ►321 కి.మీ. మేర నాలుగు వరసల రోడ్ల నిర్మాణం జరిగింది. ►39 కి.మీ. మేర ఆరు వరసల రోడ్లు రూపొందాయి. ►430 వంతెనలు కొత్తగాఏర్పడ్డాయి ఆ రోడ్లతో బంతాట.. పంచాయతీరాజ్ శాఖ ఆధీనంలో ఉన్న కొన్ని రోడ్లు అభివృద్ధి చేసే క్రమంలో గతంలో రోడ్లు, భవనాల శాఖకు బదిలీ అయ్యాయి. అలా విడతల వారీగా 6 వేల కి.మీ. రోడ్లను అప్పగించారు. ఈ రోడ్లను రాష్ట్ర రహదారుల స్థాయికి తేవాలంటే రూ.5 వేల కోట్లు కావాలని లెక్కలేశారు. చేపట్టిన పనులే పూర్తి చేసే పరిస్థితి లేకపోవటంతో, ఈ రోడ్లను ఇక ముట్టుకునేందుకు కూడా జంకుతున్నారు. వీలైతే తిరిగి పంచాయతీరాజ్ శాఖకు అప్పగించేందుకు రోడ్లు భవనాల శాఖ సిద్ధంగా ఉంది. పేరుకే స్టేట్ రోడ్లు.. జాతీయ రహదారుల తర్వాత రాష్ట్ర రహదారులు విశాలంగా, అనువుగా ఉంటాయి. అలా రాష్ట్ర రహదారుల జాబితాలో ఉండి కూడా కనీసం కంకర రాయి కూడా పడని కచ్చా మట్టి రోడ్లు ఏకంగా 719 కి.మీ. మేర ఉండటం పరిస్థితిని స్పష్టం చేస్తోంది. వీటిపై తొలుత కంకరపరిచి మెటల్ రోడ్లుగా మార్చాలి. ఆ తర్వాత తారు రోడ్ల స్థాయికి తేవాలి. ఇక కంకర పరిచి తారు కోసం ఎదురుచూస్తున్న రోడ్ల నిడివి 615 కి.మీ మేర ఉంది. వెరసి స్టేట్ రోడ్ల జాబితాలో ఉన్నప్పటికీ ఇంకా 1,330 కి.మీ మేర కచ్చా రోడ్లే ఉండటం గమనార్హం. -
ఆటంకాలున్నా.. అభివృద్ధి బాటే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, పునరుద్ధరణ, మరమ్మతుల పనులను సత్వరమే పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన వంతెనలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులను ప్రాధాన్యతగా చేపట్టి వేగంగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు. జూలై 15వతేదీ కల్లా మునిసిపాలిటీల్లో రహదారులపై గుంతలు పూడ్చి ఆ వెంటనే జూలై 20 నాటికి అన్ని చోట్లా ఫొటో గ్యాలరీలు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్లే రెండు లేన్ల రహదారుల పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గత సర్కారు హయాంలో రోడ్ల మరమ్మతుల కోసం ఐదేళ్లలో రూ.1,300 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు మూడేళ్లలోనే రూ.2,400 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఆగిపోవాలని ఏకైక అజెండాతో ప్రతిపక్షాలు పని చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్ని ఆటంకాలు కల్పిస్తున్నా సడలని సంకల్పంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపేలా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఆర్అండ్బీ.. పంచాయతీరాజ్, పురపాలక, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలో జరుగుతున్న రహదారుల పనులపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఆ వివరాలివీ... సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తేడా కచ్చితంగా కనిపించాలి రాష్ట్రవ్యాప్తంగా రహదారుల మరమ్మతుల పనులు చురుగ్గా సాగుతున్నాయి. నాడు – నేడు ద్వారా చేపట్టిన పనుల్లో మంచి పురోగతి కనిపిస్తోంది. గతంలో పనులు ప్రారంభమై ఆసంపూర్తిగా ఉన్న రోడ్లు, వంతెనలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్లను పూర్తి చేసేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలి. వీటికి అత్యంత ప్రాధాన్యమిచ్చి ఎక్కడా పెండింగ్‌లో లేకుండా చూడాలి. వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి. ఫలితాలు కచ్చితంగా కనిపించాలి. అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తి చేయడమే కాకుండా గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దాలి. నివర్ తుపాను కారణంగా కొట్టుకుపోయిన ప్రాంతాల్లో కొత్త వంతెనల నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలి. తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాల్లో పనులు వెంటనే చేపట్టాలి. రూ.2,205 కోట్లతో మరమ్మతులు ఆర్ అండ్ బీ పరిధిలో రోడ్ల మరమ్మతులు, ప్రత్యేక పనుల కింద 7,804 కి.మీ. మేర 1,168 పనులు చేపట్టాం. వాటి కోసం ప్రభుత్వం రూ.2,205 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇప్పటికే 675 పనులు పూర్తి కాగా మరో 491 కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 62.09 శాతం పనులను రూ.1369 కోట్లతో ప్రభుత్వం పూర్తి చేసింది. మిగిలిన పనులు వీలైనంత త్వరగా పూర్తి కావాలి. నాబార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ (నిడా–1) కింద చేపట్టిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. రూ.2,479.61 కోట్లతో 233 పనులు చేపట్టాం. ఇప్పటికే రూ.1,321.08 కోట్ల విలువైనవి పూర్తి చేశాం. మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలి. వ్యత్యాసాన్ని వెల్లడించేలా ఫొటో గ్యాలరీలు రోడ్ల నిర్మాణమే కాకుండా క్రమం తప్పకుండా నిర్వహణ, మరమ్మతులపై పంచాయతీరాజ్ శాఖ కార్యాచరణ సిద్ధం చేయాలి. 1,843 రోడ్ల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రూ.1,072.92 కోట్లు ఖర్చు చేస్తోంది. తద్వారా 4,635 కి.మీ. మేర రహదారులు మెరుగుపడనున్నాయి. గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై దృష్టిపెట్టి ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలి. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో చురుగ్గా మరమ్మతులు చేపట్టాలి. మునిసిపాలిటీల్లో జూలై 15 కల్లా గుంతలు పూడ్చాలి. జూలై 20న నాడు – నేడు ద్వారా వ్యత్యాసాన్ని తెలియచేసేలా అన్ని చోట్లా ఫొటో గ్యాలరీలు ఏర్పాటు చేయాలి. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి) బూడి ముత్యాలనాయుడు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆర్ అండ్ బీ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌దండే, పురపాలక శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు రాష్ట్రంలో అభివృద్ధి పనులను ముందుకు సాగనివ్వకుండా కొందరు రకరకాల కుట్రలు పన్నుతున్నారు. కేసులు వేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు ఇవ్వకూడదని, కేంద్రం నుంచి డబ్బులు రాకూడదని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధి పనులు ఆగిపోవాలనే ఏకైక అజెండాతో ప్రతిపక్షాలు పని చేస్తున్నాయి. అయినప్పటికీ సడలని సంకల్పంతో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాం. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో అభివృద్ధి పనులకు ఎక్కడా నిధుల లోటు రాకుండా, చెల్లింపుల సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలను పూర్తి చేస్తున్నాం. -
రూ.903 కోట్లతో రోడ్ల అభివృద్ధి
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో రూ.903.21 కోట్లతో వివిధ రహదారుల అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు తెలిపారు. ఇందులో ఇప్పటికే కొన్ని రోడ్ల పనులు పూర్తి అయి ప్రజలకు అందుబాటులోకి కూడా వచ్చాయన్నారు. ఈ విషయం తెలుసుకోకుండా కొన్ని పత్రికలు రహదారులపై తప్పుడు కథనాలు ప్రచురితం చేయడంతో వాస్తవాలు వెల్లడిస్తున్నట్లు చెప్పారు. రోడ్లకు సంబంధించి ఎంతో పురోగతి ఉన్నప్పటికీ చెప్పుకోలేకపోతున్నామని, ఇక నుంచి ప్రతి సోమవారం రహదారుల నిర్మాణాలపై సమీక్ష నిర్వహిస్తామని, ‘స్పందన’ కార్యక్రమంలో పూర్తయిన రహదారుల వివరాలను నాడు–నేడు కింద ప్రదర్శించనున్నట్లు చెప్పారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపిన వివరాలు.. జిల్లాలో ఆర్అండ్బీ ఆధ్వర్యంలో మొత్తం 1,887 కిలోమీటర్ల రహదారులు ఉన్నాయి. ఇందులో 243 కిలోమీటర్లకు సంబంధించి ఎలాంటి మరమ్మతులు అవసరం లేదు. మిగిలిన 791 కిలోమీటర్ల రోడ్లకు మరమ్మతులు, విస్తరణ పనులు చేయాల్సి ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం రూ. 517 కోట్లను మంజూరు చేసింది. మొత్తం 134 పనులు మంజూరు కాగా ఇప్పటి వరకు 55 పనులు పూర్తయ్యాయి. ఇందులో 42 పనులు జరుగుతున్నాయి. మరో 37 పనులను జూలై మొదటి వారంలోపు ప్రారంభిస్తారు. సెప్టెంబర్ నాటికి అన్నీ పనులు పూర్తి చేస్తారు. పంచాయతీరాజ్ విభాగంలో జూలై 1 నుంచి రూ.25.49 కోట్లతో 216.03 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణాలు ప్రారంభిస్తారు. ఈ పనులకు సంబంధించి ఈనెల 20న టెండర్లు ఫైనల్ అవుతాయి. మూడు నెలల వ్యవధిలో పనులు పూర్తి అయ్యేలా ప్రణాళిక రూపొందించారు. అలాగే పీఆర్ విభాగంలో రెండో విడత కింద రూ.133.69 కోట్లతో 577.18 కిలోమీటర్ల మేర రోడ్లు వేసేందుకు ప్రభుత్వానికి జిల్లా అధికారులు నివేదించారు. ఈనెల 22వ తేదీ తరువాత ఆ పనులు చేపట్టేందుకు పాలన పరమైన అనుమతులు వస్తాయి. 85 గ్రామాలకు మెయిన్ రోడ్డుకు కనెక్టివిటీ 250 మంది జనాభా కలిగి ఇప్పటి వరకు మెయిన్ రోడ్డుకు కనెక్టివిటీ లేని 85 గ్రామాలకు రోడ్లు వేసేందుకు చర్యలు తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ రూరల్ రోడ్స్ ప్రాజెక్ట్ కింద రూ.189.11 కోట్లతో 190 కిలోమీటర్ల రహదారుల పనులు జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటికే 30.82 కిలోమీటర్ల పొడవున పనులు పూర్తి కాగా, అక్టోబర్ 22 నాటికి మిగిలిన 160 కిలోమీటర్ల పనులు పూర్తి చేస్తారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 8 పనులకు సంబంధించి రూ.27.03 కోట్లతో 91.07 కిలోమీటర్ల రహదారుల పనులు జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటికే 7 పనులు పూర్తి కాగా, మంత్రాలయం నియోజకవర్గంలో శాతనూరు నుంచి దొడ్డి వరకు జరుగుతున్న రహదారి పనిని జూలై 15వ తేదీలోపు పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఇన్సెంటివ్స్ కింద జిల్లాకు 24 రహదారుల మంజూరయ్యాయి. ఇందులో రూ.10 కోట్లతో 77 కిలోమీటర్ల మేర పనులను చేపట్టగా 18 రహదారుల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. మిగిలిన 6 రోడ్లు జూలై ఆఖరులోపు పూర్తి అవుతాయి. రహదారులు వేస్తున్నా దుష్ప్రచారం చేస్తున్నారు: కాటసాని జిల్లాలో దాదాపు రూ.900 కోట్ల విలువైన రహదారుల పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నా.. లేదని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలా చేయడం సరికాదని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. ఓర్వకల్లు మండలం హుసేనాపురానికి చెందిన మహబూబ్‌బాషా అసలు కాంట్రాక్టరే కాదని, అతను ఆత్మహత్య చేసుకుంటే కొన్ని పత్రికలు పనిగట్టుకొని రూ.80 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నట్లు రాయడం అన్యాయమన్నారు. ఆయన లేబర్ కాంట్రాక్టరని, కాంట్రాక్టర్‌కు లేబర్ కాంట్రాక్టర్‌కు తేడా లేదా అని ప్రశ్నించారు. రహదారుల నిర్మాణాల్లో క్వాలిటీ లేకపోతే కాంట్రాక్టర్లకు పైసా కూడా బిల్లులు చెల్లించమన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత బస్తిపాడు–నాగలాపురం, మార్కాపురం– పెద్దపాడు, నన్నూరు బ్రిడ్జి, కృష్ణానగర్ ఫ్లై ఓవర్లను ఏడాదిలోపే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసినట్లు చెప్పారు. రహదారులకు సంబంధించి ఈ ఏడాది ఎన్నో పనులు చేపట్టామని, అయినా, ఇంకా కావాలని ముఖ్యమంత్రి వెఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. తాను తప్పు చేసినా..తన ప్రభుత్వం తప్పు చేసినా మీడియా ఎత్తి చూపవచ్చని, అయితే కొన్ని మీడియా సంస్థలు అదే పనిగా ప్రభుత్వంపై బురద జల్లడం సరికాదన్నారు. -
ముమ్మరంగా రహదారుల పనులు
తుని: రాష్ట్రంలో అత్యంత నాణ్యతా ప్రమాణాలతో, పారదర్శక విధానాలతో రహదారుల అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతుంటే ఓ వర్గం మీడియా పని గట్టుకొని పాత ఫొటోలు చూపించి దుష్ప్రచారం చేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. శనివారం కాకినాడ జిల్లా తుని మున్సిపల్ కార్యాలయంలో ఆయన ఆర్అండ్బీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రహదారులు దెబ్బ తిన్నాయని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుందన్నారు. ఈ సమావేశంలో మంత్రి ఇంకా ఏమన్నారంటే.. ► ఓ వర్గం మీడియా పని గట్టుకొని పాత ఫొటోలు చూపించి దుష్ప్రచారం చేస్తోంది. చంద్రబాబు చర్యలతో పాడైన ఒక్కో వ్యవస్థను కచ్చితమైన ప్రణాళికతో సరిదిద్దుతున్నాం. ► రాష్ట్రంలో సీఎం జగన్ పాలనకు మెచ్చి.. కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితన్ గడ్కరీ ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని జాతీయ రహదారుల ప్రాజెక్టులను మన రాష్ట్రానికి మంజూరు చేశారు. ► 8,268 కిలోమీటర్ల మేర రాష్ట్ర హైవేలు, జిల్లా రహదారుల అభివృద్ధికి సంబంధించి 1,167 మేజర్ పనులు చేపట్టేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.2,205 కోట్ల రుణం తీసుకున్నాం. ఇందులో 438 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నాం. ► పూర్తి చేసిన 2,756 కిలోమీటర్లు పనులకు రూ.700 కోట్ల మేర కాంట్రాక్టర్లకు చెల్లించాం. గత ప్రభుత్వ హయాంలో మంజూరై ఆగి పోయిన 233 పనులు చేపట్టేందుకు ఎన్ఐడిఏ పథకం కింద నాబార్డు రూ.1,558 కోట్లు రుణం ఇచ్చింది. వీటిలో 182 పనులు పూర్తి కాగా, 51 పనులు ఈ నెలఖారుకు పూర్తవుతాయి. ► 2021–22లో గుంతలు పూడ్చడానికి రూ.86 కోట్లు మంజూరు చేశాం. èఒకప్పుడు రహదారులు ఏలా ఉండేవి? ప్రస్తుతం అభివృద్ధి చేసిన రోడ్లు ఎలా ఉన్నాయి? అనే విషయాలను ప్రజలకు తెలియజేసేందుకు నాడు–నేడు ఫొటో ప్రదర్శన రాష్ట్రంలోని కలెక్టరేట్లలో ఏర్పాటు చేశాం. -
రూ.వెయ్యి కోట్లతో గ్రామీణ రోడ్లకు రిపేర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధీనంలోని 6,425.88 కి.మీ. పొడవైన గ్రామీణ లింకు రోడ్లకు రూ.1,072.92 కోట్లతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టనుంది. దెబ్బతిన్న రోడ్లవారీగా మరమ్మతులకు సంబంధించి అంచనాల తయారీ ప్రక్రియ ఇప్పటికే పూర్తైందని, ఈ నెల 19వతేదీ నుంచి కాంట్రాక్టర్లు ఆన్లైన్లో టెండర్ దాఖలుకు వీలు కల్పించామని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు వెల్లడించారు. 3 విభాగాలు... అత్యంత నాణ్యంగా పనులు రాష్ట్రవ్యాప్తంగా 157 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,845 రోడ్లలో 193.98 కిలోమీటర్ల మేర గుంతలు పూడ్చుతారు. మరో 1,972.26 కిలోమీటర్ల పొడవున గుంతలు పూడ్చడంతో పాటు ఆ రోడ్డు మొత్తం పొడవునా పై వరుస తారు లేయర్ కొత్తగా వేస్తారు. రోడ్డు బాగా దెబ్బతిన్న 2,468.65 కిలోమీటర్ల పొడవున ముందుగా పాత రోడ్డును పూర్తి స్థాయిలో బలోపేతం చేసి తర్వాత తారు లేయర్ వేస్తారు. మరమ్మతుల పనులే అయినప్పటికీ పూర్తి నాణ్యతతో జరిగేలా తారు, కంకరను కలిపే హాట్ మిక్సింగ్ యూనిట్లతో పనులు చేపడతారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ పనులను ప్యాకేజీలుగా వర్గీకరించారు. మరమ్మతులు రూ.ఐదు కోట్లు లోపు ఉంటే ఒక ప్యాకేజీగా వర్గీకరించారు. రూ.5 కోట్లకు మించితే పనుల విలువ ఆధారంగా రెండు మూడు ప్యాకేజీలుగా వర్గీకరించారు. రాష్ట్రంలో మొత్తం 1,845 పనులను 272 ప్యాకేజీలుగా విభజించారు. అత్యధికంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 146 పనులను 29 ప్యాకేజీలుగా వర్గీకరించారు. పనులను పదికి పైగా ప్యాకేజీలుగా వర్గీకరించిన జిల్లాలు.. అనకాపల్లి (15), చిత్తూరు (12), తూర్పుగోదావరి (10), ఏలూరు (17), కాకినాడ (12), కోనసీమ (11), కృష్ణా (12), పల్నాడు (11), ప్రకాశం (11), శ్రీకాకుళం (11), తిరుపతి (12), విజయనగరం (14), పశ్చిమ గోదావరి (11) -
సీపోర్టు టు ఎయిర్‌పోర్టు 'సువిశాల రహదారి'
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో సుందర సాగర తీరాన్ని ఆనుకుని ఆరులేన్ల సువిశాల రహదారి రానుంది. విశాఖపట్నం నుంచి భీమిలి మీదుగా భోగాపురం వరకు బీచ్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. అలాగే విశాఖపట్నం పోర్ట్ టెర్మినల్ నుంచి నాలుగు లేన్ల జాతీయ రహదారిని నిర్మించి దానిని బీచ్ కారిడార్‌కు అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దాదాపు రూ. 3 వేల కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టనున్న ఈ ప్రాజెక్టుతో పర్యాటక, పారిశ్రామిక అభివృద్ధికి రాచబాట పరచుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ విశాఖపట్నం బీచ్ కారిడార్ నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించే ప్రక్రియ చేపట్టింది. రెండు దశలుగా బీచ్ కారిడార్.. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు సన్నద్ధమైంది. దానిలో భాగంగా విశాఖపట్నం బీచ్‌కారిడార్‌ను నిర్మించనుంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఇప్పటికే పలు దఫాలుగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రెండు దశలుగా బీచ్‌కారిడార్‌ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అందులో మొదటిగా విశాఖపట్నం నుంచి భీమిలి మీదుగా భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును అనుసంధానిస్తూ బీచ్‌కారిడార్‌ను 20.20 కి.మీ. మేర ఆరు లేన్లుగా నిర్మిస్తారు. విశాఖపట్నంలో రుషికొండ, ఎండాడ, భీమిలి ప్రాంతాలు పర్యాటక, ఐటీ రంగాలకు కేంద్రస్థానంగా మలచాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం ఈ బీచ్‌కారిడార్ నిర్మాణం ఎంతగానో ఉపకరించనుంది. ఈ బీచ్ కారిడార్ వెంబడి పర్యాటక ప్రాజెక్టులు, దిగ్గజ ఐటీ, కార్పొరేట్ సంస్థలు కొలువు దీరేందుకు సౌకర్యంగా ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధికి ఈ బీచ్ కారిడార్ చోదక శక్తిగా పనిచేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆరులేన్ల బీచ్ కారిడార్ నిర్మాణానికి సుముఖత తెలిపిన కేంద్ర ప్రభుత్వం.. డీపీఆర్ రూపొందించే ప్రక్రియ చేపట్టింది. ఇక ఈ బీచ్ కారిడార్ కోసం దాదాపు 346 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించనుంది. అందుకు దాదాపు రూ. 1,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. పోర్ట్‌ను అనుసంధానిస్తూ నాలుగు లేన్ల రహదారి... ఇక ఈ ప్రాజెక్టులో రెండో దశ కింద బీచ్ కారిడార్‌ను విశాఖపట్నం పోర్టుతో అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. విశాఖపట్నం పోర్టు టెర్మినల్‌ను జాతీయ రహదారితో అనుసంధానిస్తూ నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తారు. ఆ రహదారిని విశాఖపట్నం–భోగాపురం బీచ్‌కారిడార్‌కు అనుసంధానిస్తారు. అంటే పోర్ట్ టెర్మినల్ నుంచి బీచ్ కారిడార్ ప్రారంభం వరకు నాలుగు లేన్ల రహదారి.. అక్కడ నుంచి తీరాన్ని ఆనుకుని విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు ఆరు లేన్ల రహదారి నిర్మించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆరు లేన్ల బీచ్ కారిడార్, నాలుగు లేన్ల విశాఖపట్నం పోర్ట్ టెర్మినల్ రహదారికి కలిపి దాదాపు రూ. 2 వేల కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టుతో ప్రధానంగా విశాఖపట్నం పోర్ట్‌ను భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానించడం సాధ్యమవుతుంది. దాంతో సరుకు రవాణాకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని, విశాఖపట్నం లాజిస్టిక్ హబ్‌గా అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విశాఖపట్నం పోర్ట్ టెర్మినల్ నుంచి బీచ్ కారిడార్ వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణంపై కూడా జాతీయ రహదారుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ త్వరలో డీపీఆర్ ప్రక్రియ చేపడుతుందని ఎన్హెచ్ఏఐ వర్గాలు చెప్పాయి. -
రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలకు చెక్
సాక్షి, అమరావతి: రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలను నివారించేందుకు రోడ్లు, భవనాల శాఖ సన్నద్ధమైంది. రాష్ట్రంలో కొత్తగా ఆరు రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ)లు నిర్మించనుంది. రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలను అరికట్టేందుకు పెద్ద సంఖ్యలో ఆర్వోబీల నిర్మాణంపై కార్యాచరణను వేగవంతం చేసింది. ఇప్పటికే 22 ఆర్వోబీలు నిర్మాణంలో ఉన్నాయి. 2022–23లో రూ.724 కోట్లతో మరో ఆరు ఆర్వోబీల నిర్మాణాలకు ఆర్ అండ్ బీ శాఖ ఆమోదం తెలిపింది. ప్రధానంగా విజయవాడ – నరసాపురం – నిడదవోలు మార్గంలో ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద ఆర్వోబీల నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఎందుకంటే ఇప్పటికే విజయవాడ–మచిలీపట్నం మధ్య డబ్లింగ్ పనులు పూర్తి చేశారు. ఇక మచిలీపట్నం – నరసాపురం – నిడదవోలు మార్గంలో డబ్లింగ్ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. దీంతో ఆ మార్గంలో రైళ్లు, గూడ్సు రైళ్ల తాకిడి పెరగనుంది. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఆర్వోబీల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చారు. కేంద్ర ఉపరితల, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ఖరారు చేసిన వార్షిక ప్రణాళికలో భాగంగా సేతుభారతం ప్రాజెక్టు కింద వీటిని నిర్మిస్తారు. వాటికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు రూపొందించే ప్రక్రియను ఆర్ అండ్ బీ శాఖ చేపట్టింది. అనంతరం భూసేకరణ చేసి టెండర్లు పిలవనుంది. రెండు లేన్లుగా ఆర్వోబీలు ఈ ఆరు ఆర్వోబీలను రెండు లేన్లుగా నిర్మించనున్నారు. విజయవాడ–భీమవరం సెక్షన్లో గుడివాడ వద్ద రూ.110 కోట్లతో 4.7 కి.మీ, కైకలూరు వద్ద రూ.125 కోట్లతో 1.3 కి.మీ, పాలకొల్లు వద్ద రూ.65 కోట్లతో 1.9 కి.మీ.భీమవరం–నరసాపురం సెక్షన్లో పెన్నాడ అగ్రహారం–శృంగవృక్షం రైల్వేస్టేషన్ల మధ్య రూ.150 కోట్లతో 1.5 కి.మీ. భీమవరం–ఉండి రైల్వేస్టేషన్ల మధ్య రూ.200 కోట్లతో 1.90 కి.మీ, అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలో రూ.74 కోట్లతో 1.5 కి.మీలలో ఆర్వోబీలను నిర్మించనున్నారు. -
పల్లెవించిన నాగరికత.. మారిన గ్రామీణ రోడ్లు
ఇది ఓబుళదేవరచెరువు మండలం ఇనగలూరు పంచాయతీలోని గొల్లపల్లె రహదారి. ఒకప్పుడు ఈ ఊరికి మట్టిరోడ్డే గతి. అడుగడుగునా కంకర తేలి, గుంతలమయంగా దర్శనమిచ్చేది. ప్రయాణానికి ఏమాత్రం అనువుగా ఉండేది కాదు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరినైనా ఆస్పత్రులకు తరలించాలన్నా సాధ్యం కాని పరిస్థితి. చివరకు ఈ ఊరి యువకులకు పిల్లనిచ్చేందుకూ ఎవరూ ఆసక్తి చూపే వారు కాదు. అయితే, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది. రూ.1.50 కోట్లతో 3.9 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. ఇది నల్లమాడ మండలం చారుపల్లి నుంచి సి.రెడ్డివారిపల్లి వరకు వెళ్లే రహదారి. దశాబ్దాలుగా ఈ రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. కొత్త ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజులకే రూ.1.10 కోట్లతో కిలోమీటర్ మేర సిమెంట్ రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం గ్రామ ప్రజలు హాయిగా ప్రయాణం సాగిస్తున్నారు. చుట్టుపక్కల పల్లెలతో రవాణా అనుసంధానమూ పెరిగింది. సాక్షి, పుట్టపర్తి/ అనంతపురం సిటీ: నాగరికతకు రహదారులను చిహ్నాలుగా భావిస్తారు. రోడ్లు బాగుంటే ఒక ప్రాంతానికి, మరో ప్రాంతానికి మధ్య అనుసంధానం పెరుగుతుంది. రవాణా సౌకర్యాలు మెరుగవడంతో అభివృద్ధి కూడా వేగంగా సాగుతుంది. ఈ విషయాలన్నింటికీ అధిక ప్రాధాన్యమిచ్చిన వైఎస్సార్సీపీ సర్కారు రహదారులకు మహర్దశ తీసుకొచ్చింది. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంత రహదారులపై దృష్టి సారించి దశాబ్దాలుగా రాళ్లురప్పలతో అధ్వానంగా దర్శనిమిచ్చిన దారులను సుందరంగా మార్చేసింది. శ్రీసత్యసాయి జిల్లాలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో 170 గ్రామీణ రహదారులు నిర్మించారు. మొత్తం 591.41 కిలోమీటర్ల మేర రోడ్లు కొత్తగా వేసి సౌకర్యాలు మెరుగుపరిచారు. దీంతో పాటు మరో 52 ప్రధాన రహదారుల్లో మరమ్మతుల కోసం రూ. 70 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే రూ. 30 కోట్లు ఖర్చు చేసి 39 చోట్ల పనులు పూర్తి చేశారు. మరో 11 రహదారులకు సంబంధించి పనులు టెండర్ దశలో ఉన్నట్లు అధికారులు వివరించారు. టీడీపీ హయాంలో జనం మొత్తుకున్నా వినలేదు.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రహదారుల్లో గుంతలు ఏర్పడి ప్రయాణం నరకంగా ఉండేది. రోడ్లను అభివృద్ధి చేయాలని గ్రామీణులు అనేక సార్లు విన్నవించినా అప్పట్లో నేతలు పట్టించుకోలేదు. కొన్ని చోట్లయితే తూతూమంత్రంగా శంకుస్థాపనలు చేసి ఆ తర్వాత మర్చిపోయారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఎన్నో ఏళ్ల సమస్యలకు పరిష్కారం దొరకడంతో గ్రామీణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కల నెరవేరింది దాదాపు 50 ఏళ్లు మోకాళ్లలోతు గుంతలు, రాళ్లు తేలిన మట్టిరోడ్డుతో చాలా ఇబ్బంది పడేవాళ్లం. టీడీపీ హయాంలో పలుసార్లు శంకుస్థాపనలు చేశారే తప్ప రోడ్డు నిర్మించలేదు. చారుపల్లి నుంచి సీ రెడ్డివారిపల్లికి సీసీ రోడ్డు నిర్మించడంతో మా దశాబ్దాల కల నెరవేరింది. చౌటతండా మీదుగా కొండమనాయునిపాలెం వరకు తారురోడ్డు నిర్మిస్తే రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుంది. – మధుసూదన్‌రెడ్డి, సీ రెడ్డివారిపల్లి, నల్లమాడ మండలం చాలా సంతోషంగా ఉంది మా పల్లెకు సీసీ రోడ్డు వేయడం చాలా సంతోషంగా ఉంది. గతంలో రోడ్డు చాలా అధ్వానంగా ఉండేది. ఎన్నోసార్లు అధికారులు, నాయకులకు విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. సీసీ రోడ్డు నిర్మాణంతో రవాణా ఇబ్బందులు తొలగిపోయాయి. ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని సీసీ రోడ్డు వేయించినందుకు కృతజ్ఞతలు. – అశ్వర్థనారాయణ, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్, సీ రెడ్డివారిపల్లి త్వరితగతిన పనులు రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాం. దశాబ్దాల నుంచి అధ్వానంగా ఉన్న గ్రామీణ దారులకు ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు ప్రణాళిక రూపొందించి పనులు చేపడుతున్నాం. త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో సాగుతున్నాం. – ఓబుళరెడ్డి, ఎస్ఈ, రోడ్లు, భవనాల శాఖ -
దారి.. అద్దంలా మారి..
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: చాన్నాళ్లుగా ప్రజలకు నరకం చూపిస్తున్న రహదారులు బాగుపడుతున్నాయి. పాఠశాలల తరహాలోనే ‘నాడు–నేడు’ పథకం కింద రహదారుల తీరుతెన్నులనూ మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏనాడూ రోడ్ల బాగుకు తట్ట మట్టి వేసిన దాఖలా లేదు. దీంతో రోడ్లలో అత్యధికం అధ్వాన స్థితికి చేరుకున్నాయి. కరోనా పరిస్థితులు సద్దుమణగడంతో ప్రభుత్వం వీటి రూపురేఖలు ఆధునీకరించేందుకు గట్టిగా పూనుకుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు తొలి విడతలో ప్రత్యేక మరమ్మతులకు రూ.196 కోట్లు కేటాయించింది. జూన్ నెలాంతానికి పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో రోడ్లు, భవనాల శాఖాధికారులు రెండు నెలలుగా యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. రెండు నెలల క్రితం మరమ్మతుకు టెండర్లు పిలిచినా ఒక్కరూ ముందుకు రాలేదు. తర్వాత టెండర్లను ఆహ్వానిస్తే జిల్లాలో 97 రహదారుల ఆధునీకరణకు కాంట్రాక్టర్లు ఉత్సాహంగా దాఖలు చేశారు. వర్షా కాలం రాకుండా పనులన్నింటినీ పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. అంతకంటే నెల రోజులు ముందుగానే ఆధునీకరణ పనులను పూర్తి చేయాలని ఆర్అండ్బీ అధికారులు గట్టి సంకల్పంతో కదులుతున్నారు. అమలాపురం–బొబ్బర్లకం రోడ్డుపై ప్రయాణమంటేనే వెనకడుగు వేసే పరిస్థితి. కోనసీమ జిల్లా వాసులకు రాజమహేంద్రవరం వెళ్లాలంటే ఇదే ప్రధాన రహదారి. ఈ రోడ్డుపై నిలువెత్తు గోతులుండేవి. వాహనం వెళ్లాలంటేనే గుండెలు జారిపోయేవి. అటువంటి అధ్వాన రహదారిపై రెండు నెలలుగా దృష్టి పెట్టి రూ.రూ.7.70 కోట్లతో ఆధునీకరించారు మే నెలాఖరుకు పూర్తి చేస్తాం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే 30 రోడ్ల ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. మిగిలిన రహదారుల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మే నెలాఖరు నాటికి అన్ని రోడ్లనూ ఆధునీకరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. రోజూ పనులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నాం. – ఎ.హరిప్రసాద్‌బాబు,ఎస్ఈ, ఆర్అండ్బీ గతుకుల సమస్య తీరింది నిత్యం కాకినాడ వెళ్లేందుకు కొత్తూరు మీదుగా ప్రయాణించేవాళ్లం. యు.కొత్తపల్లి వెళ్లాలన్నా పండూరు నుంచి దగ్గర. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ రిపేర్లలో భాగంగా ఆర్అండ్బీ రహదారి నిర్మాణం చేపట్టింది. దీంతో రహదారుల ఇబ్బందులు తప్పాయి. క్షేమంగా రాకపోకలు సాగిస్తున్నాం. – వెల్లంకి భాస్కరరమేష్, పెనుమర్తి, కాకినాడరూరల్ ప్రయాణం సాఫీగా సాగుతోంది చాలా ఏళ్ల నుంచి అమలాపురం–బొబ్బర్లంక రహదారి మరమ్మతులు జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా్నం. ఇప్పుడు కొత్తగా రహదారి ఆధునీకరణతో ప్రయాణం సాఫీగా సాగుతోంది. – నందుల ఆదినారాయణ, పుల్లేటికుర్రు -
AP: ప్రగతి బాటలుగా ప్రధాన రహదారులు
ప్రధాన రహదారులు ప్రగతి బాటలుగా మారుతున్నాయి. జిల్లా కేంద్రాలకు అనుసంధానంగా ఉండే రోడ్లు కళకళలాడుతున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులు, నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రభుత్వం మూడు డివిజన్ల పరిధిలో రూ.207.55 కోట్లను కేటాయించగా పనులు ముమ్మరంగా జరిగేలా అధికారులు పటిష్ట కార్యాచరణ అమలు చేస్తున్నారు. – సాక్షిప్రతినిధి, ఏలూరు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో ఎన్నడూలేని విధంగా ఏకకాలంలో వందల కోట్లతో రహదారుల అభివృద్ధి, మరమ్మతుల పనులు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి రూ.2 వేల కోట్లను వెచ్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా ఉమ్మడి జిల్లాలో 71 పనులకు రూ.207.55 కోట్లు కేటాయించారు. ఏలూరు, కొవ్వూరు, భీమవరం ఆర్అండ్బీ డివిజన్ల వారీగా పనులు జరుగుతున్నాయి. మూడు డివిజన్ల పరిధిలో 3,219 కిలోమీటర్ల రోడ్లు విస్తరించి ఉన్నాయి. దీనిలో 44 కిలోమీటర్ల మేర నాలుగు లైన్లు, 792 కిలోమీటర్ల మేర డబుల్ లైన్, 2,383 కిలోమీటర్ల మేర సింగిల్ లైన్ రహదారులు ఉన్నాయి. అనుసంధాన రహదారులపై ప్రత్యేక దృష్టి జిల్లా రోడ్లపై ముందుగా దృష్టి కేంద్రీకరించిన అధికారులు జిల్లా కేంద్రాలకు అనుసంధానంగా ఉన్న రోడ్ల మరమ్మతులు పూర్తిచేశారు. అనంతరం పూర్తిస్థాయిలో నిర్మాణాలకు చర్యలు తీసుకున్నారు. ప్రధాన పట్టణాలకు అనుసంధానంగా ఉండే జంగారెడ్డిగూడెం–ఏలూరు, చింతలపూడి–ఏలూరు, ఏలూరు–భీమవరం, భీమవరం–తాడేపల్లిగూడెం, నరసాపురం–భీమవరం, నిడదవోలు–కొవ్వూరు ఇలా ప్రతి పట్టణానికి అనుసంధానంగా ఉండే రహదారుల నిర్మాణాలను పూర్తిచేస్తున్నారు. ఇప్పటికే జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ౖMðకలూరు, భీమవరంలో రోడ్ల పనులు పూర్తికాగా మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. ఎన్డీబీ నిధులతో.. నేషనల్ డెవలప్మెంట్ బ్యాంకు నిధుల ద్వారా ఫేజ్–1లో 11 రోడ్ల పరిధిలో 74 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తున్నారు. ఫేజ్–2లో 13 రోడ్ల పరిధిలో 108 కిలోమీటర్ల మేర అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. సీఆర్ఐఎఫ్ పథకం ద్వారా 29 కిలోమీటర్ల మేర 3 రోడ్ల పనులను చేయనున్నారు. రాష్ట్ర రహదారులపై గోతులు పూడ్చి, మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. హై లెవిల్ బ్రిడ్జిలకు నిధులు ఉమ్మడి జిల్లాలో రూ.29.50 కోట్లతో 3 హైలెవిల్ బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వంతెనల మరమ్మతులకు సైతం సన్నాహాలు చేస్తున్నారు. డివిజన్ల వారీగా.. ఏలూరు డివిజన్ పరిధిలో రూ.9 కోట్లతో 5 పనులను పూర్తిచేయగా.. రూ.76 కోట్లతో 21 పనులు జరుగుతున్నాయి. కొవ్వూరు డివిజన్ రూ.5.41 కోట్లతో 3 పనులను పూర్తిచేయగా.. రూ.74.43 కోట్లతో 21 పనులు పలు దశల్లో ఉన్నాయి. రూ.11 లక్షలతో ఐదు రో డ్లు పూర్తిచేయగా.. రూ.30 లక్షలతో 15 పనులు పలు దశల్లో ఉన్నాయి. -
చరిత్రలో సరికొత్త ‘బాట’
సాక్షి, అమరావతి: చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ముమ్మరంగా రోడ్ల మరమ్మతులు, నిర్వహణ, పునరుద్ధరణ, విస్తరణ, కొత్త హైవే ప్రాజెక్టులను చేపడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. 8 వేల కిలోమీటర్ల నిడివి ఉన్న రోడ్ల మెయింటెనెన్స్ పనులు రూ.2,500 కోట్లతో ముమ్మరంగా జరుగుతుండగా ఇప్పటికే రూ.800 కోట్ల బిల్లులు చెల్లించామన్నారు. ‘నిడా’ (నాబార్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్) ద్వారా రూ.1,158 కోట్లు వెచ్చించి 720 కి.మీ. రహదారులను వెడల్పు చేస్తున్నామన్నారు. ఇప్పటికే రూ.700 కోట్లు బిల్లులు చెల్లించామని, జూన్ నాటికి ఈ పనులు పూర్తవుతాయని తెలిపారు. స్పందనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మంగళవారం దీనిపై సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. మే నెలలో పనులు ప్రారంభం సుమారు రూ.6,400 కోట్లతో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు సహాయంతో మండల కేంద్రాల నుంచి ఉమ్మడి జిల్లా కేంద్రాలకు రోడ్లు వెడల్పు చేస్తున్నాం. మే నెలలో ఈ పనులు ప్రారంభం అవుతాయి. రెండో విడత పనులు డిసెంబరులో మొదలవుతాయి. రూ.1,017 కోట్లతో సుమారు 5 వేల కిలోమీటర్ల పంచాయితీరాజ్ రోడ్ల పనులను వచ్చే నెలలో ప్రారంభిస్తాం. జాతీయ రహదారుల కింద 99 ప్రాజెక్టులకు సంబంధించి సుమారు 3,079 కిలోమీటర్ల మేర పనులు చేçపడుతున్నాం. దీనికోసం దాదాపు రూ.29,249 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మరో 45 ప్రాజెక్టుల కింద సుమారు మరో 3 వేల కిలోమీటర్ల పనులు డీపీఆర్ దశ దాటాయి. ఇందుకు దాదాపు రూ.29 వేల కోట్లు వ్యయం కానుంది. ఇవికాకుండా ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ కింద ఆరు ప్రాజెక్టులకుగానూ నాలుగు ప్రాజెక్టుల టెండర్లు పూర్తయ్యాయి. పనులు కూడా ప్రారంభం అవుతున్నాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు పనులు డిసెంబరులో ప్రారంభం అవుతాయి. జాతీయ రహదారులు, ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ కోసం మొత్తం రూ.90 వేల కోట్ల విలువైన పనులను రాష్ట్రంలో చేపడుతున్నాం. ఉపాధి అవకాశాలు విస్తృతం.. ఈ ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగాలంటే భూ సేకరణ సకాలంలో పూర్తి కావాలి. దీనిపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. వీటివల్ల ఉపాధి మెరుగుపడుతుంది. పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. భూ సేకరణలో ఎలాంటి జాప్యం ఉండకూడదు. దీనికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంత డబ్బు ఇదే తొలిసారి.. పనులు పూర్తి చేసిన రోడ్లను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్లు పరిశీలించాలి. దీనివల్ల నాణ్యతపై పర్యవేక్షణ ఉంటుంది. చరిత్రలో ఇంత డబ్బు ఎప్పుడూ రోడ్ల కోసం ఖర్చు చేయలేదు. మరమ్మతులు, విస్తరణ, కనెక్టివిటీ... ఇలా పలు రూపాల్లో జరుగుతున్న పనులను ప్రజలకు తెలియచేయాలి. విద్య, ఆరోగ్యంపై రూ.32 వేల కోట్ల వ్యయం నాడు – నేడు పనుల కోసం భారీగా ఖర్చు చేస్తున్నాం. ఆరోగ్య రంగంపై దాదాపు రూ.16 వేల కోట్లు, విద్యారంగంలో మరో రూ.16 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. నాడు –నేడు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. మొత్తం 1,125 పీహెచ్‌సీల్లో 977 చోట్ల నాడు– నేడు కింద పనులు చేపట్టగా 628 ఆస్పత్రుల్లో పూర్తయ్యాయి. మిగిలిన చోట్ల వేగవంతం చేయాలి. మరో 148 చోట్ల కొత్తవాటి నిర్మాణం చేపడుతున్నాం. 168 సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో కూడా పనులను వేగవంతం చేయాలి. మే 15 కల్లా అన్ని కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలు ప్రారంభం కావాలి. వచ్చే సమీక్ష నాటికి అన్ని బోధనాసుపత్రుల పనులు ప్రారంభం కావాలి. లేదంటే కలెక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. 26,451 స్కూళ్లలో నాడు–నేడు రెండో దశ నాడు–నేడు రెండో దశ పనులను 26,451 స్కూళ్లలో చేపడుతున్నాం. దాదాపు రూ.8 వేల కోట్లకుపైగా నిధులను వెచ్చిస్తున్నాం. మే 2 నుంచి ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి నాడు– నేడు పనులు పూర్తైన దాదాపు 15 వేల స్కూళ్లను ప్రారంభిస్తారు. దీంతోపాటు రెండో దశ పనులను ప్రారంభిస్తారు. ఇందులో కలెక్టర్లు పాలుపంచుకోవాలి. పనులను చేపట్టే స్కూలు కమిటీలకు తోడుగా నిలవాలి. కొత్తగా 28 వేల తరగతి గదులను కూడా నిర్మిస్తాం. ఆస్పత్రులైనా, స్కూళ్లైనా నిర్వహణ బాగుండాలి. దీనిపై ప్రోటోకాల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎం ముఖ్యసలహాదారు అజేయ కల్లం, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయిప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, గృహ నిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పాల్గొన్నారు. -
రహదారుల అభివృద్ధిలో ముందడుగు
రహదారులకు మహర్దశ పట్టింది.. జాతీయ రహదారుల నిర్మాణంతో కొత్త జిల్లాల రూపురేఖలు మారనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి ఫలితంగా రాష్ట్రంలో హైవేల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా.. పశ్చిమగోదావరి జిల్లాలో రెండు ప్రాజెక్టులు మంజూరయ్యాయి. వీటి నిర్మాణానికి కేంద్రం రూ.1,490 కోట్లు విడుదల చేసింది. ఎన్‌హెచ్–216, ఎన్‌హెచ్–165 విస్తరణ పనులు జరుగనున్నాయి. నరసాపురం: కోనసీమ, కోస్తా ప్రాంతాలను అనుసంధానం చేస్తూ జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా నరసాపురంలో వశిష్ట గోదావరిపై వంతెన నిర్మించాలని కూడా నిర్ణయించారు. బ్రిటిష్ కాలం నుంచి ఉన్న వశిష్ట వారధి డిమాండ్ ఇన్నాళ్లకు తీరనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వ యంగా రంగంలోకి దిగి జాతీయ రహదారుల కో సం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో జరిపిన సంప్ర దింపులు సత్ఫలితాలను ఇచ్చాయి. దీనిలో భాగంగా భీమవరం కేంద్రంగా ఏర్పడిన పశ్చిమగోదావరి జిల్లా కు రూ.1,490 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కొత్త జిల్లాలో నాలుగు లైన్ల రహదారు లు అందుబాటులోకి రా నున్నాయి. దశాబ్దాల కల సాకారం కాకినాడ జిల్లాలోని కత్తిపూడి నుంచి ఒంగోలుకు వెళ్లే 216 జాతీయరహదారి అభివృద్ధి పనుల్లో భాగంగా కోనసీమ, కోస్తా ప్రాంతాలను కలుపుతూ బైపాస్ ని ర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ రూ.490 కోట్ల నిధులు కేటాయించింది. కోనసీమ జిల్లాలోని దిండి నుంచి పశ్చిమగోదావరి జిల్లా నర సాపురం మండలంలోని సీతారాంపురం వరకు బై పాస్‌ను నిర్మించనున్నారు. దీంతో జిల్లావాసులు ఎదురుచూస్తున్న నరసాపురంలో వశిష్ట గోదావరిపై వారధి నిర్మాణం కల సాకారం కానుంది. వంతెన నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లతో స్థల సేకరణ పూర్తిచేసింది. ఫలించిన ప్రయత్నం : ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు జిల్లాలో హైవేల నిర్మాణంపై సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. ఎన్‌హెచ్ 216కు బైపాస్, ఎన్‌హెచ్ 165 నాలుగు లైన్ల విస్తరణ విషయాలపై సీఎం ద్వారా కేంద్ర మంత్రికి లేఖ ఇప్పించారు. రూపురేఖలు మారనున్నాయి సీఎం వైఎస్ జగన్ కృషితోనే నిధులు మంజూర య్యాయి. కొత్త జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.1,490 కోట్లను కేంద్రం కేటాయించడం రికార్డు. ఇంత పెద్ద స్థాయిలో నిధుల కేటాయింపు ఎన్నడూ లేదు. వశిష్ట వంతెన నిర్మాణం కూడా పూర్తవుతుంది. రానున్న ఐదేళ్లలో జిల్లా రూపురేఖలు మారనున్నాయి. నరసాపురం, భీమవరం నుంచి విజయవాడకు ప్రయాణ సౌలభ్యం మెరుగుపడుతుంది. – ముదునూరి ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్‌విప్ పనులు ఇలా.. ఎన్‌హెచ్ 216 బైపాస్ రూ. 490 కోట్లు కోనసీమ జిల్లా దిండి నుంచి మలికిపురం, టేకిశెట్టిపాలెం, సఖినేటిపల్లి మీదుగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలోని రాజుల్లంక నుంచి సీతారాంపురం వరకు ఎన్‌హెచ్ 165 1,000 కోట్లు పాలకొల్లు మండలం దిగమర్రు నుంచి ఆకివీడు వరకు 40 కిలోమీటర్ల మేర నాలుగు లైన్లుగా జాతీయ రహదారి విస్తరణ నాలుగు లైన్లుగా విస్తరణ జాతీయరహదారి 165 పాలకొల్లు మండలం దిగమర్రు నుంచి కృష్ణా జిల్లా పామర్రు వరకు 107 కిలోమీటర్ల మేర ఉంది. దిగమర్రు నుంచి ఆకివీడు వరకు నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయడానికి రూ.1,000 కోట్లు మంజూరు చేశారు. ఆకివీడు నుంచి పామర్రు వరకు నాలుగు లైన్ల పనులు ఏడాది క్రితమే ప్రారంభమయ్యాయి. ఎన్‌హెచ్–165ను దిగమర్రు జంక్షన్ నుంచి ఎన్‌హెచ్–216కి అనుసంధానం చేస్తున్నారు. ఈ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. తాజాగా విధులైన నిధులతో దిగమర్రు నుంచి ఆకివీడు వరకు పనులు మొదలు కానున్నాయి. ఈ నిర్మాణంతో భీమవరంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. -
రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
తాళ్లపూడి: రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. మండలంలోని ప్రక్కిలంక నుంచి చిట్యాల వరకూ ఆర్అండ్బీ రోడ్డుకు ప్రక్కిలంకలో ఆదివారం ఆమె శంకుస్థాపన చేశారు. రూ.3.40 కోట్లతో ఎనిమిది కిలోమేటర్ల మేర ఈ బీటీ రోడ్డు పనులు చేపడుతున్నారు. శంకుస్థాపన అనంతరం తాళ్లపూడిలోని అబుబాకర్ మసీదులో జరిగిన ఇఫ్తార్ విందులో మంత్రి వనిత పాల్గొన్నారు. ముస్లింల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని అన్నారు. మసీదు కమిటీ ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ పోశిన శ్రీలేఖ, ఎంపీపీ జొన్నకూటి పోసిరాజు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ కాకర్ల వెంకటేశ్వరరావు, ఆర్అండ్బీ డీఈ హరికృష్ణ, ఏఈ సమీర్, సర్పంచులు యాళ్ల స్వప్న, కొమ్మిరెడ్డి పరశురామారావు, ఎల్లిన శివ, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. -
రోడ్ల పునరుద్ధరణ పనులు వేగవంతం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్ల పునరుద్ధరణ పనులను ప్రభుత్వం వేగవంతం చేసిందని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) చెప్పారు. నాబార్డు నిధులతో రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఆర్ అండ్ బీ శాఖ మంత్రిగా ఆయన సచివాలయంలో తన కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కృష్ణా జిల్లాలో ఏటిమొగ–ఎదురుమొండి ఐల్యాండ్‌ను అనుసంధానించే వంతెన, జగ్గయ్యపేట–సత్తెనపల్లి మధ్య మరో వంతెన నిర్మాణానికి ఆమోదం తెలిపే ఫైళ్లపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాబార్డు నిధులు రూ.1,158 కోట్లతో తొలి దశ పనులు చేపట్టామని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంతోనే రాష్ట్రంలో రోడ్లు దెబ్బతిన్నాయని ఆయన విమర్శించారు. 2019 ఎన్నికల ముందు రోడ్ల పునరుద్ధరణ కోసం కేంద్రం నుంచి తెచ్చిన రూ.3 వేల కోట్లను ఎన్నికల తాయిలాల కోసం టీడీపీ ప్రభుత్వం మళ్లించిందని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రోడ్లకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతోందన్నారు. నిర్ణీత కాలంలో రోడ్ల పునరుద్ధరణ పనులను పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. -
AP: రాష్ట్ర చరిత్రలో ఇంత డబ్బు ఎప్పుడూ ఇవ్వలేదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రోడ్లు, భవనాల శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త రోడ్ల నిర్మాణం, పాత రోడ్ల మరమ్మత్తులకు సంబంధించి సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. గతంలో ఎప్పుడూ లేని విధంగా రూ.2205 కోట్లు రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు ఇచ్చిన సందర్భం ఎప్పుడూ లేదన్నారు. ఇప్పటివరకూ 83 శాతం రోడ్డు పనులకు టెండర్లు పూర్తి చేశామని అధికారులు తెలపగా, నెలఖరు నాటికి 100 శాతం టెండర్లు పూర్తవుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే.. గత ప్రభుత్వం హయాంలో రహదారుల నిర్వహణను పట్టించుకోలేదన్న సీఎం తర్వాత వర్షాలు బాగాపడ్డంతో రోడ్లు మరింతగా దెబ్బతిన్నాయన్న సీఎం. ఈ ప్రభుత్వం హయాంలోనే రోడ్లన్నీ పాడైపోయినట్టుగా వక్రీకరించి, ఒక ముద్రవేసి విష ప్రచారం చేస్తున్నారు: సీఎం గతంలో ఎప్పుడూ లేని విధంగా రూ.2205 కోట్లు రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు ఇచ్చిన సందర్భం ఎప్పుడూ లేదు: సీఎం ఒక ఏడాదిలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంత డబ్బు ఇవ్వలేదు, ఖర్చు చేయలేదు: సీఎం మే చివరి నాటికి దాదాపుగా రోడ్లు నిర్మాణం, మరమ్మతుపనులు పూర్తిచేస్తామన్న అధికారులు. 33 ఆర్వోబీలు చాలా కాలంగా పెడింగ్‌లో ఉన్నాయన్న అ«ధికారులు. ఈ ప్రభుత్వం హయాంలోనే ఇవి పూర్తికాలేదన్న రీతిలో కథనాలు ఇస్తున్నారు: సీఎం వీటిని పూర్తిచేయడానికి సుమారు రూ.571.3 కోట్లు ఖర్చు చేస్తున్నాం: సీఎం విశాఖ బీచ్‌కారిడార్ రోడ్డుపై సీఎం సమీక్ష విశాఖపట్నం పోర్టు నుంచి భీమిలి – భోగాపురం – తిరిగి ఎన్‌హెచ్–16కు అనుసంధానం అయ్యే బీచ్‌కారిడార్ రోడ్డు నిర్మాణం కోసం తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించిన అధికారులు. రోడ్డు నిర్మాణరీతుల(డిజైన్)పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం. ఈ బీచ్ కారిడార్ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా నిలవాలన్న ముఖ్యమంత్రి: సీఎం విశాఖ నగరం నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు వీలైనంత త్వరగా చేరుకోవాలి, అలాగే ఎయిర్ పోర్టు నుంచి కూడా నగరానికి వీలైనంత త్వరగా రావాలి: సీఎం దీంతోపాటు ఈ రహదారిని అనుకుని టూరిజం ప్రాజెక్టులు వస్తాయి: సీఎం ఈనేపథ్యంలో ఈ రోడ్డుకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది: సీఎం ఇప్పుడున్న విమానాశ్రయంలో పౌరవిమానాలు రాకపోకలపై నిరంతరం ఆంక్షలు ఉంటున్నాయి: సీఎం రాత్రి పూట ల్యాండింగ్ కూడా నేవీ ఆంక్షలు కారణంగా కష్టం అవుతోంది: సీఎం ఇలాంటి నేపథ్యంలో బీచ్ కారిడార్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది:సీఎం ఈ సమీక్షా సమావేశంలో రహదారులు, భవనాల శాఖ మంత్రి ఎం శంకర నారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, రవాణాశాఖ కమిషనర్ పి సీతారామాంజనేయలు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: AP: రాష్ట్రానికి మరో ఎక్స్‌ప్రెస్ హైవే -
AP: రాష్ట్రంలో రహదారులకు మహర్దశ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రహదారులు శరవేగంతో అభివృద్ధి చెందనున్నాయి. మొత్తం రూ.10,401 కోట్లతో 741 కిలోమీటర్ల మేర నిర్మించనున్న 31 రహదారులకు ఈ నెల 17న కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రూ.11,157 కోట్లతో ఇప్పటికే నిర్మించిన 20 రహదారులను ప్రారంభించబోతున్నారు. మొత్తంగా రాష్ట్రంలోని 51 రహదారులకు మహర్దశ పడుతోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 17న విజయవాడ రానున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధిపై ఆయనతో చర్చించిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా రాష్ట్రంలోని పోర్టులు, పర్యాటక ప్రదేశాలు, వెనుకబడిన ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ రహదారులను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. తద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక, పర్యాటక అభివృద్ధి వీలవుతుందని గడ్కరీ దృష్టికి తెచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి కోసం భారీగా నిధులు కేటాయించారు. వాటిలో కొన్ని నిర్మాణాలు ఇప్పటికే పూర్తవ్వగా, మరికొన్నింటిని నిర్మించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో ఒకేసారి రహదారులకు ప్రారంభోత్సవం, కొత్తగా నిర్మించనున్న వాటికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావించింది. నితిన్ గడ్కరీ పర్యటన నేపథ్యంలో ఈ మేరకు షెడ్యూల్ రూపొందించింది. ఈ నెల 17న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో గడ్కరీ, సీఎం వైఎస్ జగన్ తదితరులు పాల్గొననున్నారు. ఇందుకోసం ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేసింది. భూమి పూజ చేయనున్న ప్రాజెక్టులివీ.. ► రాష్ట్రంలో కొత్తగా 31 జాతీయ రహదారుల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. రూ.10,401 కోట్లతో 741 కిలోమీటర్ల మేర వీటిని నిర్మించనున్నారు. వీటిలో కేంద్ర రోడ్డు, రవాణా శాఖ రూ.5,740 కోట్లతో 571 కిలోమీటర్ల మేర 24 ప్రాజెక్టులు నిర్మించనుంది. ఇక జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) రూ.4,661 కోట్లతో 170 కిలోమీటర్ల మేర ఏడు ప్రాజెక్టులు నిర్మిస్తోంది. -
జిల్లా రహదారులకు మహర్దశ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని జిల్లా, మండల ప్రధాన రహదారుల నిర్మాణం వేగం పుంజుకోనుంది. దాదాపు రూ.6,400 కోట్లతో ఆమోదించిన 2,512 కి.మీ. మేర రోడ్ల నిర్మాణానికి బాలారిష్టాలు తొలగిపోయాయి. ఇప్పటికే మొదటి దశ పనులు మొదలు పెట్టిన ఆర్‌అండ్‌బీశాఖ ఇక రెండో దశ టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు ఉద్యుక్తమవుతోంది. కాంట్రాక్టర్లకు తక్షణం బిల్లుల చెల్లింపు.. జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణం వేగవంతం చేయడం కోసం ప్రభుత్వం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ నిధులను పూర్తిగా రోడ్ల నిర్మాణానికే వెచ్చించేందుకు కేంద్రం సూచించిన విధంగా ప్రత్యేక ఫండ్ అకౌంట్ ఏర్పాటు చేసింది. అందుకోసం కేంద్ర ఆర్థిక శాఖలోని డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ (డీఈఏ) నుంచి అనుమతి పొంది ప్రత్యేక ఖాతాను తెరిచింది. దాంతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు మరింత వేగవంతం కానుంది. పనులు పూర్తి చేసి బిల్లులు అప్లోడ్ చేయగానే ఆ ప్రత్యేక ఖాతాల నుంచి నేరుగా కాంట్రాక్టర్లకు బిల్లులు మొత్తం చెల్లిస్తారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్మాణానికి తీసుకొచ్చిన రూ.3 వేల కోట్లను ఇతర అవసరాలకు మళ్లించారు. దాంతో రోడ్ల నిర్వహణ అధ్వానంగా తయారైంది. దీనికి పరిష్కారంగా ప్రత్యేక ఖాతాల్లో నిధులు జమ చేసి.. నేరుగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే పారదర్శక విధానాన్ని అవలంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.6,400 కోట్లతో రెండు దశల్లో 2,512 కి.మీ. మేర జిల్లా, మండల ప్రధాన రహదారులను నిర్మించనున్నారు. మొదటి దశలో రూ.3,014 కోట్లతో 1,244 కి.మీ. రోడ్ల నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే 60 కి.మీ. పనులు పూర్తి చేశారు. ఇక రెండో దశలో రూ.3,386 కోట్లతో 1,268 కి.మీ. మేర రహదారులను ఏప్రిల్‌నాటికి నిర్మిస్తారు. అందుకోసం ఆర్అండ్బీ శాఖ త్వరలోనే టెండర్ల ప్రక్రియ చేపట్టనుంది. -
AP: 1,200 కి.మీ. రోడ్లకు గులాబ్ దెబ్బ
సాక్షి, అమరావతి: గులాబ్ తుపాను రాష్ట్రంలో రోడ్లను దెబ్బకొట్టింది. తుపాను తీవ్రతకు రాష్ట్రంలో 5 జిల్లాల్లో దాదాపు 1,200 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్టు రహదారులు, భవనాలశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ శాఖ అధికారుల బృందాలు తుపానుకు దెబ్బతిన్న రోడ్లను రెండు రోజులుగా పరిశీలిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 306 కిలోమీటర్లు, విజయనగరం జిల్లాలో 122, విశాఖపట్నం జిల్లాలో 355, పశ్చిమ గోదావరి జిల్లాలో 280, కృష్ణాజిల్లాలో 130 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. దీంతోపాటు ఈ జిల్లాల్లో 100 వరకు కల్వర్టులు, మోరీలు దెబ్బతిన్నాయి. ఆర్ అండ్ బీ శాఖ అధికారులు రెవెన్యూ, పోలీసు శాఖలతో కలిసి ప్రస్తుతానికి రోడ్లపై రాకపోకలను పునరుద్ధరించారు. రోడ్ల తక్షణ మరమ్మతుల కోసం రూ.50 కోట్లు అవసరమని, పూర్తిస్థాయిలో మరమ్మతులకు మరో రూ.300 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. అధికారుల బృందాలు రెండు రోజుల్లో తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన వెంటనే రోడ్లకు తక్షణ మరమ్మతులు చేపడతారు. అనంతరం పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టనున్నారు. వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు తక్షణం మరమ్మత్తులు: మంత్రి పెద్దిరెడ్డి వర్షాల కారణంగా దెబ్బతిన్న గ్రామీణ రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం సచివాలయంలో పంచాయతీరాజ్ రహదారులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే రహదారులపై ప్రత్యేక దృష్టిసారించాలని ఇప్పటికే సీఎం జగన్ ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో.. నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన పనులపై నివేదికలను తక్షణం సిద్ధం చేయాలని సూచించారు. మండలాల్లో అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాల్సిన రోడ్లను గుర్తించాలని, గతంలో ప్రారంభించి అసంపూర్తిగా ఉండిపోయిన రహదారులను పూర్తిచేయాలని సూచించారు. తాజాగా తుపాను ప్రభావిత జిల్లాల్లో రహదారులకు ఆర్థిక చేయూత కోరేందుకు కేంద్ర ప్రభుత్వానికి నష్టం తీవ్రతను తెలిపే నివేదికలను పంపాలని ఆదేశించారు. తాజాగా చేపట్టబోయే రహదారుల నిర్మాణం, మరమ్మతుల్లో నాణ్యత విషయంలో రాజీపడకూడదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఈఎన్సీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
రూ. 500 కోట్లతో పట్టణ రోడ్లకు మరమ్మతులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా నగరాలు, పట్టణాల్లోని రోడ్లకు మరమ్మతులు చేపట్టేందుకు మునిసిపల్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభించేందుకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. గత ప్రభుత్వం మునిసిపాలిటీల్లో అసంపూర్తిగా నిర్వహించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కాలువలు, ఇతర పనుల వల్ల చిన్నపాటి వర్షాలకే రోడ్లు దెబ్బతింటున్నాయి. దీనికి తోడు గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులు దెబ్బతిని పట్టణ ప్రాంత ప్రజలు అవస్థలు పడ్డారు. 1,500 కి.మీ. మేర మరమ్మతులు రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభు త్వం రూ.500 కోట్లు వెచ్చించనుంది. దీన్లో విజ యవాడ, గుంటూరు, విశాఖపట్నంసహా 17 నగరపాలక సంస్థల్లో చేపట్టే పనులకు రూ.350 కోట్లు వెచ్చిస్తారు. మిగిలిన 106 స్పెషల్, సెలక్షన్, ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్ మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు రూ.150 కోట్లు కేటాయించారు. మొత్తంగా 1,500 కిలోమీటర్ల మేర రహదారులకు మరమ్మతులు చేపట్టేందుకు మునిసిపల్ ప్రజారోగ్య ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి ప్రతిపాదనల్ని సిద్ధం చేసి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. వర్షాలు తగ్గిన వెంటనే చేపడతాం నగరాలు, పట్టణాల్లో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టడానికి సిద్ధమవుతున్నాం. ఈ నెలాఖరు నాటికి సాంకేతికపరమైన కార్యక్రమాలు పూర్తి చేసి.. వచ్చే నెలలో వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. – డాక్టర్ వి.చంద్రయ్య, ఈఎన్సీ, ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం -
రయ్.. రయ్ రహదారులు
సాక్షి, అమరావతి: రహదారుల అభివృద్ధికి భారీ కార్యాచరణ ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి చేరుకునేందుకు ఇరుకు రహదారులపై అవస్థలతో కూడిన ప్రయాణానికి ఇక తెర పడనుంది. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, ఒక మండల కేంద్రం నుంచి మరో మండల కేంద్రానికి రెండు లేన్ల రహదారుల అభివృద్ధి ప్రణాళికను ప్రభుత్వం ఖరారు చేసింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్(ఎన్డీబీ) నుంచి రూ.6,400 కోట్ల రుణంతో రాష్ట్రంలో రెండు దశల్లో 2,500 కి.మీ.మేర రోడ్లు నిర్మించనున్నారు. ఇందుకోసం తొలిసారిగా ‘ప్రత్యేక ఫండ్ అకౌంట్’ తెరవాలని నిర్ణయించడం విశేషం. రోడ్ల కోసం ‘ప్రత్యేక ఫండ్ అకౌంట్’ రాష్ట్రంలో రహదారులకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్బీడీ బ్యాంకు రుణంతో జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణం శరవేగంగా చేపట్టేందుకు ప్రత్యేక ఫండ్ అకౌంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు ఆర్ అండ్ బి శాఖ ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో జిల్లా ప్రధాన రహదారుల అభివృద్ధికి ఎన్డీబీతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి దశలో రూ.3,014 కోట్లతో 1,244 కి.మీ. మేర రోడ్లు నిర్మించనున్నారు. రెండో దశలో రూ.3,386 కోట్లతో 1,268 కి.మీ. మేర రహదారులు నిర్మిస్తారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థలు పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు ‘ప్రత్యేక ఫండ్ అకౌంట్’ను తెరవాలని తాజాగా నిర్ణయించారు. ఎన్డీబీ రుణ మొత్తాన్ని ఆ ఖాతాలో జమ చేస్తారు. బిల్లుల చెల్లింపులో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటారు. టీడీపీ హయాంలో 2018లో రోడ్ల నిర్మాణం కోసం తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాన్ని ఎన్నికల ప్రయోజనాల కోసం ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లించారు. ఫలితంగా చాలా చోట్ల రహదారులు అధ్వాన్నంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎన్డీబీ నిధులను పూర్తిగా రోడ్ల నిర్మాణానికే వ్యయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకోసం కేంద్ర ఆర్థిక శాఖలోని డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్(డీఈఏ) అనుమతి కోరనుంది. ఆ వెంటనే ప్రత్యేక ఫండ్ అకౌంట్‌ను తెరుస్తారు. తొలిదశలో రూ.3,014 కోట్లతో 1,244 కి.మీ. రోడ్లు ఎన్డీబీ నిధులతో మొదటి దశలో రాష్ట్రంలో మండల కేంద్రాలను జిల్లా కేంద్రంతోనూ, సమీపంలోని మండల కేంద్రంతోనూ అనుసంధానిస్తూ 1,244 కి.మీ. మేర రెండు లేన్ల రోడ్లు నిర్మిస్తారు. అందుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇవ్వడంతో రూ.3,014 కోట్లతో మొత్తం 124 పనులకు టెండర్లు కూడా ఖరారు చేసి పనులు ప్రారంభించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.85.43కోట్ల ప్రజాధనాన్ని కూడా ఆదా చేశారు. వర్షాలు తగ్గిన వెంటనే ఈ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బి శాఖ నిర్ణయించింది. రెండో దశలో రూ.3,386 కోట్లతో 1,268 కి.మీ. రోడ్లు ఎన్డీబీ నిధులతో రెండోదశలో 1,268 కి.మీ. మేర జిల్లా ప్రధాన రహదారులను నిర్మిస్తారు. రూ.3,386 కోట్లతో నిర్మించే ఈ రోడ్ల కోసం డీపీఆర్ రూపొందిస్తున్నారు. అక్టోబరులో టెండర్ల ప్రక్రియ నిర్వహించి డిసెంబరులో పనులు ప్రారంభించి వేసవికి పూర్తి చేయాలన్నది ఆర్ అండ్ బి శాఖ ప్రణాళిక. జిల్లా కేంద్రాలకు మెరుగైన రవాణా వసతి రూ.6,400 కోట్లతో జిల్లా ప్రధాన రహదారులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక ఖరారు చేసింది. ఈ పనులకు ప్రత్యేక ఫండ్ అకౌంట్ తెరవాలని నిర్ణయించింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు మెరుగైన రోడ్ కనెక్టివిటీ కల్పిస్తాం. –కె.వేణుగోపాల్‌రెడ్డి, ఈఎన్సీ, ఆర్ అండ్ బి ఏపీలో జాతీయ రహదారులను అభివృద్ధి చేయండి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులు అభివృద్ధి చేయాలని కేంద్ర జాతీయ రహదారులు, రహదారి రవాణా కార్యదర్శి గిరిధర్ అరిమానేను రాష్ట్ర మంత్రి శంకరనారాయణ కోరారు. మంగళవారం వైఎస్సార్సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తదితరులతో కలిసి కేంద్ర కార్యదర్శితో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న జాతీయ రహదారుల పనులు, నూతనంగా మంజూరు కావాల్సిన రహదారులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి చర్చించారు. కేంద్ర హైవేల శాఖ కార్యదర్శి గిరిధర్ అరిమానేతో రాష్ట్ర మంత్రి శంకరనారాయణ తదితరులు అనంతరం మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ.. బెంగళూరు విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ రహదారి నిర్మాణ పనులు వీలైనంత త్వరగా చేపట్టాలని కోరామన్నారు. విశాఖబీచ్ రోడ్డు–పోర్టు కనెక్టివిటీ, విజయవాడ ఈస్ట్రన్ బైపాస్ పనులు, విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద పనుల పురోగతి వివరించి త్వరగా పూర్తి చేయాలని కోరామన్నారు. బుగ్గ–గిద్దలూరు నాలుగు లేన్ల రహదారి ప్రతిపాదన, గతంలో జాతీయ రహదారులుగా ప్రకటించాలని కోరిన హిందూపురం–ముద్దనూరు, పావగడ–బుక్కపట్నం, రాజంపేట–కదిరి పనుల గురించి గిరిధర్‌తో చర్చించామన్నారు. ప్యాపిలి–బనగానపల్లి, గుత్తి నుంచి కర్ణాటక సరిహద్దు, దామాజిపల్లి నుంచి ధర్మవరం మీదుగా ఎన్‌హెచ్544డీ కనెక్షన్ రోడ్డు, మడకశిర–బుక్కపట్నం రోడ్డు తదితర పది రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని కోరామన్నారు. -
రోడ్లన్నింటినీ బాగు చేస్తాం
సాక్షి, అమరావతి: మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లన్నింటినీ బాగు చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అక్టోబర్‌లో వర్షాలు తగ్గుముఖం పట్టగానే పనులు ప్రారంభిస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రోడ్లపై ప్రత్యేక దృష్టిపెట్టారన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో రోడ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో వేసిన రోడ్ల కంటే వైఎస్ జగన్ పాలనలో వేసిన రోడ్లే అధికమన్నారు. రోడ్లపై ప్రతిపక్ష నేతల ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. సీఎం క్యాంపు కార్యాలయంలోని మీడియా పాయింట్ వద్ద సోమవారం మంత్రి పెద్దిరెడ్డి.. రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక దేవుడి దయ వల్ల ఏటా మంచి వర్షాలు పడుతున్నాయన్నారు. దీంతో రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. మరోవైపు వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. రోడ్ల పనులకు రూ.6 వేల కోట్ల విలువైన టెండర్లు పిలిచామని చెప్పారు. గత ప్రభుత్వం కంటే అధికంగా పంచాయతీరాజ్ రోడ్లు వేశామన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 330 కిలోమీటర్లు మాత్రమే రోడ్లు వేశారని గుర్తు చేశారు. తాము 3,185 కిలోమీటర్ల రోడ్ల పనులకు టెండర్లు పిలిచి 970 కిలోమీటర్లు పూర్తి చేశామన్నారు. జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడకుండా ఏదైనా చిన్న తప్పు కనిపిస్తే దాన్ని భూతద్దంలో చూపించడం టీడీపీ, దాని తోక పార్టీ జనసేనకు బాగా అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. అక్రమ మైనింగ్ అంతా చంద్రబాబు హయాంలోనే జరిగిందన్నారు. విజిలెన్స్ కమిటీలు ద్వారా అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేశామన్నారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. టీడీపీ రోడ్లను గాలికొదిలేసింది: మంత్రి శంకర్ నారాయణ గత టీడీపీ ప్రభుత్వం రోడ్లను అభివృద్ధి చేయకుండా గాలికొదిలేసిందని మంత్రి శంకర్ నారాయణ ధ్వజమెత్తారు. కొడికొండ చెక్‌పోస్టు మీదుగా విజయవాడ – బెంగళూరు రహదారిని ఫాస్ట్‌ట్రాక్ విధానంలో చేపడుతున్నామన్నారు. విశాఖపట్నంలో షీలానగర్ – సబ్బవరం జాతీయ రహదారిపైనా దృష్టిపెట్టామని తెలిపారు. -
రూ.460 కోట్లు.. 23 నైపుణ్యాభివృద్ధి కాలేజీలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఒక్కొక్కటి చొప్పున నైపుణ్యాభివృద్ధి శిక్షణ కళాశాలలను ఏడాదిలోగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ‘వైఎస్సార్ సెంటర్స్’ పేరుతో రూ.460 కోట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) రాష్ట్ర వ్యాప్తంగా 23 నైపుణ్య కళాశాలలను నిర్మిస్తోంది. వీటిని నిర్మించే బాధ్యతలను ప్రభుత్వరంగ సంస్థలైన ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ), ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, రోడ్లు–భవనాల శాఖలకు అప్పగించినట్టు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ ఎన్.బంగార్రాజు ‘సాక్షి’కి తెలిపారు. ఇందులో ఆర్ అండ్ బీకి 10, ఏపీఐఐసీకి 6, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు 7 కళాశాలల నిర్మాణ పనులు అప్పగించినట్టు వివరించారు. మరో రెండు కళాశాలలను కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ నిర్మిస్తుందన్నారు. ఈ కాలేజీలకు సంబంధించి అభివృద్ధి చేసిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక, ఆకృతులను వాటికి అప్పగించామని, సెప్టెంబర్‌లోపు టెండర్లు పిలిచి అక్టోబర్ నాటికి పనులు మొదలుపెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వీటి నిర్మాణాలను 8 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తర్వాత రెండు నెలల్లో ల్యాబ్ నిర్మాణం పూర్తిచేసి ఏడాదిలోగా ఈ కళాశాలల్లో కోర్సులను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఏయే నియోజకవర్గాల్లో ఏ సంస్థ నిర్మిస్తుందంటే.. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖకు కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, ఏలూరు, నరసాపురం, కర్నూలు, కడప, రాజంపేట, అనంతపురం, హిందూపురం కాలేజీల నిర్మాణ బాధ్యతలను ఏపీఎస్‌ఎస్‌ఓడీసీ అప్పగించింది. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, ఒంగోలు నైపుణ్య కేంద్రాలను ఏపీఐఐసీకి, విశాఖ, అనకాపల్లి, అరకు, శ్రీకాకుళం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు కేంద్రాలను ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించింది. ఈ మేరకు ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి. విజయనగరం, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాల స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలను కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ నిర్మిస్తుంది. 1,920 మంది శిక్షణా సామర్థ్యంతో కాలేజీల నిర్మాణం ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.20 కోట్ల అంచనా వ్యయంతో నైపుణ్య శిక్షణా కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నారు. 4,520 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఈ కేంద్రాల్లో ఆరు క్లాస్ రూములు, రెండు ల్యాబ్‌లు, రెండు వర్క్‌షాపులు, ఒక స్టార్టప్ ల్యాబ్, అడ్మిన్, స్టాఫ్ గదులు ఉండే విధంగా డిజైన్ చేశారు. అంతే కాకుండా 126 మంది అక్కడే ఉండి శిక్షణ తీసుకునే విధంగా హాస్టల్స్‌ను కూడా నిర్మించనున్నారు. అదే విధంగా ప్రతి కాలేజీలో ఆయా ప్రాంత అవసరాలకు అనుగుణంగా రెండు ప్రాధాన్యత కోర్సులను కూడా ప్రభుత్వం ఎంపిక చేసింది. రంగాలను బట్టి కోర్సు కాల వ్యవధి 3 నెలల నుంచి 6 నెలల వరకు ఉంటుంది. వీటిని బట్టి కనీసం ఏడాదికి ఒక్కో శిక్షణ కేంద్రం నుంచి 1,920 మందికి శిక్షణ ఇవ్వడంతోపాటు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. -
Govt Of Andhra Pradesh: రోడ్లపై ప్రత్యేక శ్రద్ధ
సాక్షి, అమరావతి: నగరాలు, మునిసిపాలిటీల్లో రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం రోడ్లు భవనాల శాఖతో సమన్వయం చేసుకుని కార్యాచరణ రూపొందించాలని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యకలాపాలు, ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్)’ కార్యక్రమంపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగరాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం వచ్చే నెల నుంచి క్లాప్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా రోడ్లు, వీధులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున రోడ్ల మరమ్మతులకు వీలుండదని, వర్షాకాలం ముగియగానే ఎక్కడికక్కడ రోడ్ల మరమ్మతులను ప్రాధాన్యతగా చేపట్టాలని స్పష్టం చేశారు. పరిశుభ్రత నెలకొల్పడంలో భాగంగా నగరాలు, పట్టణాల్లో కన్స్ట్రక్షన్, డిమాలిషన్ వేస్ట్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాలని చెప్పారు. విశాఖ, విజయవాడ, తిరుపతిల్లో ఇప్పటికే ప్లాంట్లు ఉన్నాయని.. రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురంలో కూడా ఇలాంటి ప్రాజెక్టులు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, పరిశుభ్రత విషయంలో గ్రామ, వార్డు సచివాలయాలను భాగస్వాములు చేయాలని సీఎం సూచించారు. ప్రజలకు చేరువలో రిజిస్ట్రేషన్ సేవలు గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనివల్ల ప్రతి 2 వేల జనాభాకు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసు వస్తుందని, తద్వారా ప్రజలకు అత్యంత చేరువలో సేవలు లభిస్తాయని చెప్పారు. ఆ గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో భూములపై తగిన పర్యవేక్షణ ఉంటుందని.. ఆక్రమణలు, అన్యాక్రాంతాలకు ఆస్కారం ఉండదని అన్నారు. విశాఖపట్నంలో బీచ్ కారిడార్, మల్టీలెవల్ కార్ పార్కింగ్, నేచురల్ హిస్టరీ పార్క్, మ్యూజియం, తదితర ప్రాజెక్టులపై సమీక్షించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యకలాపాలు, క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమంపై ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అర్హత ఉన్న వారందరికీ ఇంటి స్థలం ►అర్హులైన పేదలందరికీ 90 రోజుల్లో ఇంటి స్థలాలను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. పేద కుటుంబాలు ఇంటి స్థలం కోసం మధ్యవర్తులు, ఇతరులు, ఇతర మార్గాల మీద ఆధార పడాల్సిన అవసరంలేని పరిస్థితిని తీసుకొచ్చాం. ►ఉల్లంఘనలు, ఆక్రమిత ప్రాంతాల్లో కనీస సదుపాయాలులేని పరిస్థితి ఉండకూడదని భారీ ఎత్తున 30 లక్షలకుపైగా ఇళ్ల స్థలాలు మంజూరు చేశాం. తొలి దశలో 15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని ప్రాంరభించాం. దీనికోసం పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాం. ►అర్హులైన వారు రాజమార్గంలో పట్టా తీసుకునే పరిస్థితిని సృష్టించాం. ఆక్రమిత ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకునే వారిని నెట్టివేసే పరిస్థితులను పూర్తిగా తీసివేశాం. పేదవాడికి ఇంటి స్థలం లేదని మన దగ్గరకు వచ్చినప్పుడు అర్హుడైతే చాలు 90 రోజుల్లోగా వెంటనే ఇంటి పట్టాను మంజూరు చేస్తున్నాం. ►ఈ సమీక్షా సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. వేగంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ►గత ప్రభుత్వం విజయవాడ, గుంటూరు, నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను అసంపూర్తిగా విడిచి పెట్టింది. ఈ పనులను పూర్తి చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయాలి. వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్ నిర్మాణం కూడా సకాలంలో పూర్తి చేయాలి. ►మంగళగిరి– తాడేపల్లి, మాచర్ల, కర్నూలులో ట్రీట్మెంట్ ప్లాంట్లకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సిఫార్సులు చేసిన నేపథ్యంలో ప్లాంట్ల ఏర్పాటు ప్రతిపాదనలను ఆమోదిస్తున్నాం. ఆ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలి. షెడ్యూలు ప్రకారం టిడ్కో ఇళ్లు నిర్దేశించుకున్న షెడ్యూలు ప్రకారం టిడ్కో ఇళ్లు పూర్తి కావాలని సీఎం జగన్ ఆదేశించారు. అదే సమయంలో మౌలిక సదుపాయాల కల్పనపైనా దృష్టి పెట్టాలని చెప్పారు. మొదటి విడతలో భాగంగా చేపట్టిన 38 లొకేషన్లలోని 85,888 ఇళ్లలో సుమారు 45 వేలకుపైగా ఇళ్లను మూడు నెలల్లో, మిగిలిన ఇళ్లు డిసెంబర్‌లోగా అప్పగిస్తామని అధికారులు తెలిపారు. లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించేటప్పుడు అన్ని రకాల వసతులతో ఇవ్వాలని, మౌలిక సదుపాయాల విషయంలో రాజీ పడొద్దని సీఎం ఆదేశించారు. మహిళా మార్ట్ నిర్వహణ అభినందనీయం పులివెందులలో పైలట్ ప్రాజెక్టుగా మహిళా సంఘాల సహాయంతో మార్ట్ నిర్వహణ పట్ల సీఎం జగన్ అభినందనలు తెలిపారు. తక్కువ ధరలకు సరుకులు అందిస్తుండటం మంచి పరిణామం అన్నారు. ఒక్కో మహిళ నుంచి రూ.150 చొప్పున 8 వేల మంది మహిళా సంఘాల సభ్యుల నుంచి సేకరించిన డబ్బుతో మార్టు పెట్టామని అధికారులు వివరించారు. మెప్మా దీనిపై పర్యేవేక్షణ చేస్తుందని, మెప్మా ఉత్పత్తులు కూడా ఈ మార్ట్‌లో ఉంచామని తెలిపారు. మార్ట్ పనితీరుపై అధ్యయనం చేసి.. మిగతా చోట్ల కూడా అలాంటి ప్రయత్నాలు చేయాలని సీఎం సూచించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) నిర్వహణ ఇలా.. ►నగరాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 124 మునిసిపాల్టీలు, నగర పాలక సంస్థల్లో 1.2 కోట్ల డస్ట్ బిన్లు (చెత్త బుట్టలు) ఏర్పాటు. 40 లక్షల ఇళ్లకు ఇంటికి మూడు చొప్పున గ్రీన్, బ్లూ, రెడ్ కలర్స్‌లో బిన్లు. ►వ్యర్థాల సేకరణకు 4,868 వాహనాలు. ఇందులో 1,771 ఎలక్ట్రిక్ వాహనాలు. మొదటి దశలో 3,097 వాహనాల ఏర్పాటు. ►225 గార్బేజ్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్లు. సేకరించిన వ్యర్థాలను వివిధ విధానాల్లో ట్రీట్ చేసేలా ఏర్పాట్లు. సేకరించిన వ్యర్థాల్లో 55 నుంచి 60 శాతం వరకు తడిచెత్త ఉంటుంది. దీన్ని బయోడిగ్రేడ్ విధానంలో ట్రీట్ చేస్తారు. 35 నుంచి 38 శాతం వరకు ఉన్న పొడిచెత్తను రీసైకిల్ చేస్తారు. మిగిలిన దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలిస్తారు. ఇసుక రూపంలో ఉన్న దానిని ఫిల్లింగ్‌కు వాడతారు. ►72 పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు. ఆగస్టు 15 నాటికి టెండర్ల ప్రక్రియ, 2022 జూలై నాటికి ఏర్పాటుకు కార్యాచరణ. -
రూ.2,205 కోట్లతో రోడ్లకు మరమ్మతులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రూ.2,205 కోట్లతో 8,970 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్వహణ, మరమ్మతులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుమతులు మంజూరు చేసినట్లు రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు వెల్లడించారు. విజయవాడలోని ఆర్ అండ్ బీ భవనంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రోడ్ల నిర్వహణ నిమిత్తం మొత్తం 1,140 పనులకు గానూ ఇప్పటికే 403 పనులకు టెండర్లు పూర్తయ్యాయన్నారు. వర్షాకాలం కావడంతో పనులు ఆలస్యమయ్యాయని, ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి మొత్తం పనులను పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. దీనికితోడు పనులను వేగవంతం చేసేందుకు, కాంట్రాక్టర్లలో ఉత్సాహాన్ని నింపేందుకు బ్యాంకుల నుంచి నేరుగా వారి ఖాతాల్లోకే బిల్లులను జమచేసేలా సీఎం ఆదేశించారని ఆయన చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. రాజకీయ లబ్ధికే విపక్షాల నిరసన వర్షాకాలం తర్వాత ఎటూ రోడ్లన్నీ మరమ్మతులు చేసి బాగుచేస్తారని అందరికీ తెలిసిందే. కానీ.. ప్రతిపక్షాలు ఏదో రకంగా రాజకీయ లబ్ధిపొందడానికి రోడ్ల మరమ్మతుల మీద నిరసనలు చేస్తున్నాయి. మరమ్మతులు చేసిన తర్వాత.. తమ నిరసనలవల్లే ప్రభుత్వం చేసిందని చెప్పుకోవడానికి అవి ఆరాటపడుతున్నాయి. రోడ్ల నిర్వహణ ఫండ్ నుంచి నిధులిచ్చి దెబ్బతిన్న రోడ్లన్నిటికీ మరమ్మతులు చేస్తాం. గత ప్రభుత్వం రోడ్ల నిర్వహణకు తగిన నిధులు కేటాయించకపోవడంవల్లే ప్రస్తుత పరిస్థితి నెలకొంది. అలాగే.. – గతేడాది రాష్ట్ర బడ్జెట్లో రూ.220 కోట్లు కేటాయించినప్పటికీ.. వర్షాల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లకు అత్యవసర మరమ్మతుల కోసం రూ.932 కోట్లతో పనులు చేపట్టాం. ఇందులో రూ.417 కోట్లతో స్టేట్ హైవేస్, రూ.515 కోట్లతో మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ల అభివృద్ధి జరిగింది. ఇందుకు సంబంధించి రూ.600 కోట్ల బిల్లులకు గానూ రూ.380 కోట్లు చెల్లించాం. జనవరిలో చేసిన పనుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి కూడా రెండు మూడు వారాల్లో విడతల వారీగా విడుదలకు చర్యలు తీసుకుంటున్నాం. నిధులు విడుదల చేయాలని ఆర్థికశాఖను కూడా కోరాం. – రాష్ట్రానికి పెట్రోల్, డీజిల్ ద్వారా వచ్చే సెస్‌ను ఏపీ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు మళ్లించి వాటిని రోడ్ల అభివృద్ధికి వినియోగిస్తాం. రుణాల కోసం ఐదు జాతీయ బ్యాంకులతో సంప్రదింపులు జరిపాం. మూడు బ్యాంకుల్లో లోన్ ప్రాసెసింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెలాఖరుకు రుణం మంజూరవుతుందని ఆశిస్తున్నాం. – 2021–22 బడ్జెట్లో రోడ్ల నిర్వహణకు రూ.410 కోట్లు కేటాయించగా ఇప్పటికే రూ.160 కోట్లతో చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రస్తుత రోడ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు, ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి చేసేందుకు ప్రతి రెండు జిల్లాలకు ఒక చీఫ్ ఇంజినీర్‌ను నోడల్ అధికారిగా నియమించాం. – ప్రస్తుతం రూ.155 కోట్ల ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్ల నిధులతో రోడ్ల మరమ్మతులు జరుగుతున్నాయి. – రూ.1,158.53 కోట్ల నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ నిధులతో 99 రాష్ట్ర రహదారులు, 134 మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ల విస్తరణ చేపట్టాం. ఇందులో మొదటి విడతగా రూ.408 కోట్లు విడుదల చేయగా రూ.399.68 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించాం. మిగిలిన పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం. – ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మేజర్ ప్రాజెక్టుగా అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలను కలుపుతూ రెండు లైన్ల రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. రూ.6,400 కోట్ల పనుల్లో భాగంగా ఫేజ్–1 కింద రూ.2,970 కోట్ల పనులను కాంట్రాక్టర్లకు అప్పగించాం. నెలరోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. రెండేళ్లలో అన్ని పనుల పూర్తికి సన్నాహాలు చేస్తున్నాం. -
సకాలంలో రహదారుల నిర్మాణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల మరమ్మతుల పనుల కోసం పిలిచిన టెండర్లను జూలై 15 నాటికి ఖరారు చేసి పనులు ప్రారంభించాలని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి శంకర్ నారాయణ అధికారులను ఆదేశించారు. ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులతో విజయవాడలో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్ అండ్ బీ శాఖలో వివిధ పథకాల కింద చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఎన్టీబీ మొదటి దశ, రెండో దశ కింద చేపట్టాల్సిన పనులకు వెంటనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాడు–నేడు కింద ప్రాథమిక ఆసుపత్రులు, ఇతర ఆసుపత్రుల భవనాల మరమ్మతులు, ఆధునికీకరణ పనులను వేగవంతం చేయాలని చెప్పారు. జాతీయ రహదారుల ప్రాజెక్టుల కోసం పనుల ఒప్పందాలను త్వరిత గతిన ఖరారు చేయాలన్నారు. రహదారుల పనుల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఈఎన్సీలు వేణుగోపాల్‌రెడ్డి, ఇనయతుల్లా, పలువురు చీఫ్ ఇంజనీర్లు, అన్ని జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు. -
రోడ్డు లేని పల్లెలకు రాచబాట
విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలంలో 220 మంది జనాభా నివాసం ఉండే పశువులబండ గ్రామానికి వెళ్లడానికి నిన్నటి వరకు సరైన రోడ్డు సౌకర్యం లేదు. అదే దారిలో మరో మూడు గ్రామాలదీ ఇదే పరిస్థితి. రెండు నెలల కిత్రమే ప్రభుత్వం రూ.2.12 కోట్లు ఖర్చు చేసి 5.67 కిలోమీటర్ల పొడువున అదే మండంలోని చెరుకుంపాకాల రోడ్డు నుంచి నాలుగు ఊర్లకు కొత్తగా తారు రోడ్డును నిర్మించింది. 857 మంది జనాభా ఉండే బైలుకింజంగి, 259 మంది జనాభా ఉండే సత్యవరం, 44 మంది నివాసం ఉండే గుర్రగూడెం గ్రామాలకు వర్షాకాలంలో ఎటువంటి ఆటంకం లేకుండా వెళ్లేందుకు కొత్తగా రోడ్డు సదుపాయం అందుబాటులోకి వచ్చింది. కొండలు, పచ్చని చెట్లు, పొలాల మధ్య కొత్తగా నిర్మించిన ఆ తారు రోడ్డే ఇది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమంతో పాటే అభివృద్ధీ సమాంతరంగా పరుగులు పెడుతోంది. ఇప్పటి వరకు మంచి రోడ్డు వసతి కూడా లేని వందల గ్రామాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా రహదారులను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత ఆర్థిక సంవత్సరం 616 గ్రామాలకు కొత్తగా రోడ్డు సదుపాయం కల్పిస్తే.. ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్, మే నెలల్లోనే మరో 52 గ్రామాలకు కొత్తగా రోడ్డు అందుబాటులోకి వచ్చింది. గత ఆర్థిక ఏడాదిలో దాదాపు సగం రోజులు లాక్డౌన్, తీవ్ర కరోనా భయందోళనలే నెలకొని ఉన్నప్పటికీ.. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో రూ.648.97 కోట్లతో 1,550.81 కిలోమీటర్ల పొడవున కొత్తగా గ్రామీణ తారు రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేసింది. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలోనూ ఏప్రిల్, మే నెలల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావమే ఉంది. అయినా ఈ రెండు నెలల్లోనూ 127.28 కోట్ల ఖర్చుతో 266.91 కిలోమీటర్ల పొడవున కొత్తగా గ్రామీణ తారు రోడ్ల నిర్మాణం పూర్తి చేసింది. గ్రామానికి, మరో గ్రామానికి మధ్య చిన్నపాటి గ్రామీణ లింకు రోడ్లను పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం చేపడుతుండగా, పెద్ద పెద్ద రహదారులను రోడ్లు, భవనాల శాఖ నిర్మిస్తోంది. ప్రస్తుతం పేర్కొన్నవన్నీ కేవలం పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో నిర్మాణం జరిగినవి మాత్రమే. పనుల్లోనూ వేగం.. కేవలం 2 నెలల్లోనే పూర్తి చేసినవి.. గ్రామీణ తారు రోడ్ల నిర్మాణ పనులు మునుపెన్నడూ లేనంత వేగంగా కొనసాగుతున్నాయి. విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండల కేంద్రం నుంచి పామురాయి గ్రామానికి నాలుగున్నర కిలోమీటర్ల పొడవున ప్రభుత్వం కొత్తగా రోడ్డును మంజూరు చేసింది. ఈ రోడ్డు నిర్మాణానికి ఈ ఏడాది మార్చిలో అధికారులు సంబంధిత కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకోగా, కేవలం రెండు నెలల వ్యవధిలో ఆ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు. 2012, 2013 సంవత్సరాల్లో మంజూరు చేసిన పలు రోడ్లను అప్పటి ప్రభుత్వాలు నిర్మాణం పూర్తి చేయలేని పరిస్థితి ఉండగా, అలాంటి రోడ్లను సైతం అన్ని రకాల అడ్డంకులను అధిగమించి పూర్తి చేసిన ఉదంతాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. నిర్మాణంలో ఉన్నవి పూర్తయితే మరో 1,376 గ్రామాలకు కూడా.. రాష్ట్ర వ్యాప్తంగా 500 లోపు జనాభా నివాసం ఉండే చిన్న గ్రామాలు వర్షాకాలంలో ఉపయోగపడే స్థాయిలో రోడ్డు సదుపాయానికి నోచుకోలేదు. చిన్నవి పెద్దవి కలిపి రాష్ట్రంలో 18 వేలకు పైగా గ్రామాలుండగా, అందులో రెండు వేల వరకు గ్రామాలకు ఇలాంటి పరిస్థితి నెలకొని ఉన్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. శ్రీకాకుళం, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఇలాంటి గ్రామాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. గత ఆర్థిక ఏడాది, ఈ ఏడాదిలో కేవలం రెండు నెలల కాలంలో మొత్తం 668 గ్రామాలకు కొత్తగా రోడ్ల వసతి కల్పించగా.. మిగిలిన గ్రామాలకు రోడ్లు వేసేందుకు మరో 5,042 కిలో మీటర్ల పొడవున తారు రోడ్డు నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నట్టు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఆయా రోడ్ల నిర్మాణం పూర్తయితే కొత్తగా మరో 1,376 మారుమూల గ్రామాలకు రోడ్డు సదుపాయం ఏర్పడుతుందని అధికారులు వివరించారు. లక్ష్యాలు పెట్టుకొని పనిచేస్తున్నాం.. ఇప్పటిదాకా రోడ్డు సదుపాయం లేని గ్రామాలకు ప్రభుత్వం కొత్తగా రోడ్లను మంజూరు చేసింది. వాటిని పూర్తి చేయడానికి ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకొని పనులు చేపడుతున్నాం. కరోనా ఇబ్బందులు ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణ పనులను యధావిధిగానే కొనసాగిస్తున్నాం. రోడ్డు నిర్మాణాలతో గ్రామీణ ప్రాంతాల్లో పలువురు పేదలకు పనులు దొరుకుతున్నాయి. – సుబ్బారెడ్డి, ఈఎన్సీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం -
ఏపీ బడ్జెట్: రోడ్లకు దండిగా నిధులు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్లు, రవాణా రంగం అభివృద్ధి, రహదారి భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2021–22 వార్షిక బడ్జెట్లో రోడ్లు, భవనాలు, రవాణా శాఖకు రూ.7,594.06 కోట్లు కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే రూ.1,005.48 కోట్లను అధికంగా కేటాయింపులు చేసింది. గ్రామీణ రహదారులను పటిష్టపర్చడం, కచ్చా రోడ్లను బీటీ రోడ్లుగా అభివృద్ధి చేయడం, మండల కేంద్రాలను అనుసంధానించే రోడ్లను రెండు లేన్లుగా అభివృద్ధి చేయడం తమ కార్యాచరణలో భాగమని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు నాబార్డ్, ఆర్ ఆర్ ప్లాన్, ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఈ, ఈఏపీ పథకాల కింద రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపడతామన్నారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రెండు ప్రాజెక్టుల కోసం రూ.6,400 కోట్లు రుణాన్ని సేకరించినట్టు ఆయన తెలిపారు. కేంద్రంతో కలిసి కొత్త రైల్వే లైన్ల అభివృద్ధికి బడ్జెట్లో ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. కోర్ నెట్వర్క్ రోడ్లు, రాష్ట్ర ప్రధాన రోడ్లు, జిల్లా ప్రధాన రోడ్ల విస్తరణకు అధిక నిధులు కేటాయించింది. ఐఆర్సీ ప్రమాణాల మేరకు రోడ్ల నాణ్యత ఉండాలని లక్ష్యంగా నిర్ణయించారు. రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్యను కనీసం 5 శాతం తగ్గించేలా రహదారి భద్రతకు ప్రాధాన్యమిచ్చింది. చదవండి: AP Budget 2021:పారిశ్రామికాభివృద్ధితో భారీ ఉపాధి కల్పన ప్రధాన కేటాయింపులు ఇలా.. ► రాష్ట్రంలో 100 కి.మీ. మేర కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.200 కోట్లు కేటాయించింది. ►రోడ్ల విస్తరణకు మొత్తం రూ.883.57కోట్లు కేటాయించారు. వాటిలో కోర్ రోడ్ నెట్వర్క్ పరిధిలోని రోడ్లు 340 కి.మీ., జిల్లా ప్రధాన రహదారులు 400కి.మీ., రాష్ట్ర ప్రధాన రహదారులు 15 కి.మీ., ఎస్టీ సబ్‌ప్లాన్ రహదారులు 50 కి.మీ., ఎస్సీ సబ్ ప్లాన్ రహదారులు 20 కి.మీ. ఉన్నాయి. ► రాష్ట్రంలో 10వేల కి.మీ. జిల్లా ప్రధాన రహదారులు, 900 కి.మీ. ఇతర రోడ్ల మరమ్మతులకు మొత్తం రూ.481 కోట్లు కేటాయించారు. ►మండల కేంద్రాలను అనుసంధానించే 100 కి.మీ. మేర రోడ్లను డబుల్ లేన్ రహదారులుగా విస్తరించేందుకు రూ.175.46కోట్లు, 100 కి.మీ. మేర రోడ్లు/బ్రిడ్జిలు రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్‌కు రూ.175.46 కోట్లు కేటాయించారు. ►మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి రూ.123 కోట్లు, గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించారు. ►రాయలసీమను అమరావతితో అనుసంధానించే 335 కి.మీ. ‘అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే’ను రూ.18,055 కోట్లతో నిర్మించాలని గతంలోనే నిర్ణయించారు. అందులో భాగంగా 250 కి.మీ. మేర భూసేకరణ కోసం రూ.100 కోట్లు కేటాయించారు. ► సీఆర్ఐఎఫ్ పథకం కింద 700 కి.మీ. రోడ్ల అభివృద్ధి పనులకు రూ.400 కోట్లు కేటాయించారు. 7 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిల కోసం భూసేకరణకు రూ.100 కోట్లు కేటాయించారు. ►రోడ్డు భద్రత కార్యకలాపాలకు రూ.150 కోట్లు కేటాయించారు. -
ఆరెకరాల్లో 500 పడకల కోవిడ్ ఆస్పత్రి
తాడిపత్రి రూరల్: అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్జాస్ స్టీల్ ప్లాంట్ సమీపంలో అతి పెద్ద కోవిడ్ ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ తెలిపారు. ఆస్పత్రి ఏర్పాటుకు సంబంధించి అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు కలెక్టర్ గంధం చంద్రుడు, ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో కలిసి శనివారం ఆయన తాడిపత్రి–కడప ప్రధాన రహదారి పక్కనే తాడిపత్రి క్రీస్తురాజు చర్చికి సంబంధించిన ఆరు ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. అనంతరం స్టీల్‌ప్లాంట్‌లో ఉన్న ఐనోక్స్ ఆక్సిజన్ ప్లాంట్‌ను పరిశీలించారు. ఆస్పత్రి ఏర్పాటు చేయనున్న ప్రాంతానికి నేరుగా ప్లాంట్ నుంచి ఆక్సిజన్ సరఫరా సాధ్యాసాధ్యాలపై చర్చించారు. సానుకూలత వ్యక్తం కావడంతో స్థలానికి సంబంధించి చర్చి ఫాదర్ డేవిడ్ అర్లప్ప, చర్చి స్కూల్ కరస్పాండెంట్ సిస్టర్ సెలిన్తో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, కలెక్టర్ గంధం చంద్రుడు చర్చించారు. మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ.. కోవిడ్ రోగులకు నాణ్యమైన చికిత్సలు అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతటి ఖర్చుకైనా వెనుకాడడం లేదన్నారు. ఇందులో భాగంగానే అనంతపురంతో పాటు పొరుగున ఉన్న కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల ప్రజలకు లబ్ధి చేకూరేలా ఆరు ఎకరాల విస్తీర్ణంలో 500 పడకలతో తాత్కాలిక కోవిడ్ ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో షెడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. -
రహదారులకు మహర్దశ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారులకు ఇక మహర్దశ పట్టనుంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గుంతలమయంగా, అస్తవ్యస్తంగా మారిన రోడ్ల రూపురేఖలను మార్చడానికి సర్కార్ నడుంబిగించింది. ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రోడ్లు, భవనాల శాఖ మూడంచెల కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. టీడీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు బకాయిపెట్టిన రూ.500 కోట్ల బిల్లుల చెల్లింపు.. రాష్ట్రంలో 45 వేల కి.మీ. మేర రోడ్లపై పడిన గుంతలను పూడ్చటంతోపాటు రూ.2,205 కోట్లతో 7,969 కి.మీ. మేర రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారులను పూర్తిగా ‘రెన్యువల్ లేయర్’ వేసి అద్భుతంగా తీర్చిదిద్దనుంది. ఈ ప్రణాళికకు ఆమోదం తెలిపిన సీఎం వైఎస్ జగన్ పనుల్లో నాణ్యతకు కాంట్రాక్టర్లను పూర్తి జవాబుదారీ చేయాలని, వారికి సకాలంలో బిల్లులు చెల్లించడానికి ప్రత్యేక అనుమతులు జారీ చేశారు. ఈ స్థాయిలో ఇదే తొలిసారి.. రోడ్ల మరమ్మతుల కోసం చేసిన రూ.3 వేల కోట్ల రుణాన్ని గత టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లించింది. దీంతో రాష్ట్రంలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి వర్షాకాలం మొదలయ్యేనాటికి రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 7,969 కి.మీ. మేర రహదారులకు రెన్యువల్ లేయర్ వేస్తారు. వాటిలో 2,726 కి.మీ. మేర రాష్ట్ర ప్రధాన రహదారులకు రూ.923 కోట్లు, 5,243 కి.మీ. మేర జిల్లా ప్రధాన రహదారులకు రూ.1,282 కోట్లు ఖర్చు చేస్తారు. ఇంధన వనరులపై రూ.1 చొప్పున వసూలు చేస్తున్న రోడ్ సెస్ నిధులను ఇందుకు వినియోగిస్తారు. ఈ నిధుల్లో 50 శాతాన్ని హామీగా చూపుతూ బ్యాంకులు/ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డీసీ) రూ.2 వేల కోట్ల రుణాన్ని సేకరిస్తుంది. అలాగే గుంతలు పూడ్చే 45 వేల కి.మీ.లలో 13 వేల కి.మీ. మేర రాష్ట్ర రహదారులకు రూ.160 కోట్లు, 32 వేల కి.మీ.మేర జిల్లా రహదారులకు రూ.220 కోట్లు కేటాయించారు. సకాలంలో బిల్లుల చెల్లింపు బ్యాంకులు/ఆర్థిక సంస్థల నుంచి రుణసేకరణకు ఏపీఆర్డీసీకి ఆర్అండ్బీ శాఖ సహకరిస్తుంది. క్షేత్రస్థాయిలో అధికారులు పనులు చేపట్టి కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా బిల్లులు మంజూరు చేస్తారు. ఆ బిల్లులను ఆడిట్ నిర్వహించి సక్రమంగా ఉన్నాయని నిర్ధారిస్తే వాటిని ఏపీఆర్డీసీ ఎండీకి పంపిస్తారు. ఆ బిల్లులను ప్రతి 15 రోజులకుగానీ, నెల రోజులకుగానీ చెల్లింపుల కోసం బ్యాంకుకు నివేదిస్తారు. రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారుల మరమ్మతులపై సీఎం జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. రూ.2,205 కోట్లతో రోడ్ల మరమ్మతులు చేపట్టడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. నాణ్యతతో పనులు చేస్తే కాంట్రాక్టర్లకు నేరుగా బ్యాంకుల నుంచే బిల్లులు చెల్లిస్తాం. వర్షాకాలం ప్రారంభమయ్యేనాటికి రోడ్ల మరమ్మతులు పూర్తి చేస్తాం. – ఎం.టి.కృష్ణబాబు,ముఖ్య కార్యదర్శి, ఆర్ అండ్ బీ శాఖ -
రోడ్ల మరమ్మతులకు రూ.2,205 కోట్లు మంజూరు
సాక్షి, అమరావతి: రహదారుల మరమ్మతులకు నిధుల కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రూ.2,205 కోట్లతో రాష్ట్రంలో 7,969 కి.మీ. మేర రహదారులకు ప్రత్యేక మరమ్మతులు చేపట్టేందుకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. మరమ్మతులు మళ్లీ మళ్లీ చేయకుండా రోడ్లపై రెన్యువల్ లేయర్ వేసేందుకు ఆర్అండ్బీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో వీటికి ఆమోదం తెలుపుతూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఒకే ఏడాదిలో ఆర్అండ్బీ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం ఇదే మొదటి సారి. ఆర్‌అండ్‌బీలో 13,500 కి.మీ. మేర రాష్ట్ర రహదారులు, 32,725 కి.మీ. మేర జిల్లా ప్రధాన రహదారులున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ గత ప్రభుత్వ హయాంలో నిర్ణీత కాలంలో రోడ్లకు మరమ్మతులు చేయని కారణంగా, ఈ ఆర్థికఏడాదిలో కురిసిన భారీ వర్షాలు, తుపాన్లకు రహదారులు బాగా దెబ్బతిన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని రూ.500 కోట్ల నిధులను వెంటనే విడుదల చేసింది. అదనంగా మరమ్మతులు చేపట్టేందుకు మరో రూ.500 కోట్లు కేటాయించింది. మొత్తం రూ.వెయ్యి కోట్లతో మరమ్మతులు చేపట్టడంతో రహదారులు ప్రయాణానికి అనుకూలంగా మారాయి. అయితే ఈ మరమ్మతులు మళ్లీ రాకుండా రెన్యువల్ లేయర్ వేసేందుకు రూ.2,205 కోట్లు మంజూరు చేశారు. మొత్తం 7,969 కి.మీ. ప్రత్యేక మరమ్మతులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో ఎన్నడూ లేని విధంగా 13 జిల్లాల పరిధిలోని 2,726 కి.మీ. రాష్ట్ర రహదారులకు రూ.923 కోట్లు, 5,243 కి.మీ. జిల్లా ప్రధాన రహదారులకు రూ.1,282 కోట్లు కేటాయించారు. ఏడాదిలోగా రోడ్ల ప్రత్యేక మరమ్మతులు పూర్తి చేయాలని ఆర్అండ్బీ మంత్రి శంకర్ నారాయణ అధికారులను ఆదేశించారు. మొత్తం 1,123 పనులు చేపట్టనున్నారు. పసుపు–కుంకుమ పేరిట గత టీడీపీ సర్కార్ దోపిడీ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి డీజిల్/పెట్రోల్‌పై రూపాయి వంతున రోడ్ సెస్ వసూలు చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గతేడాది జరిపిన ఆర్అండ్బీ సమీక్షలో దిశానిర్దేశం చేశారు. వసూలు చేసిన నిధుల్ని రోడ్ల మరమ్మతులకు కేటాయించాలని నిర్ణయించారు. రోజుకు 7 వేల ప్యాసింజర్ కార్ యూనిట్ల ట్రాఫిక్ ఉండే రోడ్లకు మరమ్మతులు త్వరితగతిన పూర్తవుతాయి. గత టీడీపీ ప్రభుత్వం రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డీసీ)ని తనఖా పెట్టి రూ.3 వేల కోట్ల రుణం తీసుకుంది. ఆ నిధుల్ని ఎన్నికలకు ముందు పసుపు–కుంకుమ పేరిట దారి మళ్లించింది. రోడ్ల మరమ్మతులు చేసిన కాంట్రాక్టర్లకు రూ.450 కోట్ల బకాయిలు పెట్టడంతో వీటిని ఇటీవలే మా ప్రభుత్వం చెల్లించింది. మళ్లీ ఇప్పుడు రూ.2,205 కోట్లతో ప్రత్యేక మరమ్మతులకు పరిపాలన అనుమతులు మంజూరు చేశాం. – శంకర్‌నారాయణ, ఆర్అండ్బీ శాఖ మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న రహదారి పనులు, కేటాయించిన నిధులు.. చదవండి: (నాటి నుంచి నేటి వరకు.. ప్రజాపథమే అజెండా) (రూ.731కోట్లతో జగనన్న విద్యా కానుక) -
జాతీయ రహదారుల నిర్మాణం రయ్.. రయ్..
రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలను శరవేగంగా రూపొందించనున్నారు. మొత్తం 383.60 కిలోమీటర్ల మేర కొత్త ఎన్‌హెచ్ (నేషనల్ హైవే)ల నిర్మాణానికి, అభివృద్ధికి కేంద్రం అనుమతిచ్చింది. డీపీఆర్‌ల తయారీ కోసం కన్సల్టెన్సీ సర్వీసులకు గాను కేంద్రం రూ.17 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.6 కోట్ల నిధులతో కొత్తగా 200 కిలోమీటర్ల మేర ఎన్‌హెచ్‌ల నిర్మాణానికి డీపీఆర్‌లు రూపొందిస్తారు. డీపీఆర్‌ల రూపకల్పనలో కీలక రహదారి ప్రాజెక్టులున్నాయి. సాక్షి, అమరావతి: ఎన్‌హెచ్–516–ఈ నిర్మాణంలో భాగంగా అరకు నుంచి బౌదార వరకు (పూర్తిగా కొండ ప్రాంతం) 42.40 కి.మీ.వరకు రూ.3 కోట్లతో డీపీఆర్ ఈ నెలాఖరుకు సిద్ధం చేయనున్నారు. రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు ఏజెన్సీ ప్రాంతం మీదుగా జాతీయ రహదారి 516 నిర్మాణాన్ని ఆరు ప్యాకేజీలుగా విభజించారు. రాజమండ్రి–రంపచోడవరం, రంపచోడవరం –కొయ్యూరు, కొయ్యూరు –లంబసింగి, లంబసింగి–పాడేరు, పాడేరు–అరకు, అరకు – బౌదార మీదుగా శృంగవరపుకోట, విజయనగరం వరకు ఆరు ప్యాకేజీలుగా మొత్తం 406 కిలోమీటర్ల మేర రెండు వరుసల జాతీయ రహదారి నిర్మాణం జరగనుంది. అరకు–బౌదార ఘాట్ రోడ్డు డీపీఆర్ పూర్తైతే వచ్చే వార్షిక ప్రణాళికలో కేంద్రం నిధులు కేటాయించనుంది. ఏజెన్సీ ప్రాంతం చింతూరు–మోటు 8 కి.మీ.ల రోడ్డు అభివృద్ధికి డీపీఆర్ తయారు చేయనున్నారు. వైఎస్సార్ జిల్లాలో కడప–రాయచోటి సెక్షన్లో ఐదు కి.మీ. టన్నెల్ నిర్మాణానికి డీపీఆర్ రూపొందించనున్నారు. మూడు ఎన్‌హెచ్‌ల బలోపేతానికి రూ.115.92 కోట్లు రాష్ట్రంలో మూడు జాతీయ రహదారుల బలోపేతానికి కేంద్రం ఈ వార్షిక ప్రణాళికలో నిధులు కేటాయించింది. దేవరపల్లి–జంగారెడ్డిగూడెం, అనంతపురం–గుంటూరు, రేణిగుంట–కడప–ముద్దనూరు జాతీయ రహదారులకు మొత్తం 38.62 కి.మీ.మేర రోడ్ల బలోపేతానికి రూ.115 కోట్లు కేటాయించింది. -
రహదారుల విస్తరణకు ఒప్పందాలు పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం, న్యూడెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) సంయుక్త నిధులు రూ.1,860 కోట్లతో చేపట్టే రహదారుల అభివృద్ధి పనులకు ఒప్పందాలు పూర్తయ్యాయి. రెండేళ్లలో రహదారుల విస్తరణ పనులను పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం 12 కాంట్రాక్టు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇవి ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో 13 జిల్లాల్లో 1,200 కి.మీ. మేర రోడ్ల విస్తరణ చేపట్టనున్నాయి. 13 జిల్లాల్లో మూడు ప్యాకేజీల కింద ఎన్డీబీ టెండర్లను గతేడాది నవంబర్‌లో పూర్తి చేశారు. రివర్స్ టెండర్లు నిర్వహించగా.. రూ.81.58 కోట్లు ఆదా అయిన సంగతి తెలిసిందే. ఏటా 11.8 శాతం ట్రాఫిక్ వృద్ధి ఏపీలో ఏటా 11.8 శాతం ట్రాఫిక్ వృద్ధి చెందుతోందని ఎన్డీబీ సర్వేలో వెల్లడైంది. ఇందుకు తగ్గట్టుగా రోడ్ల విస్తరణ, వంతెనల పునర్నిర్మాణ పనులకు రుణ సాయం అందించేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. విడతలవారీగా రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీబీ మొత్తం రూ.6,400 కోట్లను రహదారుల విస్తరణ పనులకు కేటాయించనున్నాయి. రాష్ట్రంలో ఏపీ మండల కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు (ఏపీఎంసీఆర్‌సీఐపీ), ఏపీ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ రీ కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టు (ఏపీఆర్‌బీఆర్‌పీ)లకు ఎన్డీబీ రుణ సాయం అందించనుంది. రెండో విడత రహదారి విస్తరణ పనుల కోసం త్వరలో టెండర్లను నిర్వహించనున్నారు. 145 ఎకరాల భూమి అవసరం 13 జిల్లాల్లో తొలి విడతలో చేపట్టే రహదారుల అభివృద్ధికి 145 ఎకరాల భూమి అవసరం. దీనికోసం ఇప్పటికే అన్ని జిల్లాల్లోని రెవెన్యూ యంత్రాంగానికి ఆర్అండ్బీ ఎస్ఈలు లేఖ రాశారు. భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి అప్పగిస్తే ఏప్రిల్‌లో రోడ్ల విస్తరణ పనులు ప్రారంభించనున్నట్లు వివరించారు. కాగా, భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30.88 కోట్లను కేటాయించింది. రెండేళ్లలో పనులు పూర్తి చేయాల్సిందే.. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు నిబంధనల ప్రకారం రోడ్ల విస్తరణ పనులను 2023 కల్లా పూర్తి చేయాల్సిందే. ఏప్రిల్‌లో పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టు సంస్థలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ మేరకు కాంట్రాక్టు సంస్థలతో ఒప్పందాలు పూర్తయ్యాయి. భూసేకరణకు రెవెన్యూ యంత్రాంగం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. – వేణుగోపాలరెడ్డి, ఆర్అండ్బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ -
మరో రెండింటిని ఎన్‌హెచ్‌లుగా గుర్తించాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏడు స్టేట్ హైవేలను నేషనల్ హైవేస్‌గా మార్చేందుకు కేంద్రం సూత్రప్రాయ ఆమోదం తెలపడంతో మరో రెండు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని ఏపీ ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండ్ హైవేస్‌కు లేఖ రాసింది. రాయలసీమ జిల్లాల్లో వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురంలలో రెండు రహదారులపై ట్రాఫిక్ పెరిగినందున ఎన్‌హెచ్‌లుగా గుర్తింపు ఇవ్వాలని లేఖలో కోరింది. జమ్మలమడుగు–నంద్యాల, కొడికొండ చెక్‌పోస్టు–ముద్దనూరు–కదిరి రాష్ట్ర రహదారులను ఎన్‌హెచ్‌లుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా లేఖ రాసింది. ఈ రహదారులపై నిత్యం ఏడు వేల ప్యాసింజర్ కార్ యూనిట్లు (పీసీయూ) వెళ్తున్నందున ట్రాఫిక్ పెరిగిందని రహదారుల అభివృద్ధి సంస్థ నివేదించింది. గెజిట్ నోటిఫికేషన్ ఇప్పటికే మూడు రాష్ట్ర రహదారులకు జాతీయ రహదారుల నంబర్లను కేటాయించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ, ఏపీలను కలిపే విధంగా మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల మధ్య ఎన్‌హెచ్–67 జంక్షన్ వద్ద నాగర్‌కర్నూల్, కోలాపూర్, రామాపూర్, మండుగల, శివాపురం, కరివెన, నంద్యాల వరకు (ఎన్‌హెచ్–40 సమీపంలో) ఉన్న 94 కి.మీ. రోడ్డును ‘ఎన్‌హెచ్–167కే’గా గుర్తించింది. అనంతపురం జిల్లా పరిధిలోని ఎన్‌హెచ్–44పై కోడూరు నుంచి ముదిగుబ్బ (ఎన్‌హెచ్–42) వయా పుట్టపర్తి మీదుగా వెళ్లే 79 కి.మీ. రాష్ట్ర రహదారికి ఎన్‌హెచ్–342 కేటాయించారు. వైఎస్సార్ కడప జిల్లా పరిధిలోనూ రాయచోటి–వేంపల్లె–యర్రగుంట్ల–ప్రొద్దుటూరు–చాగలమర్రి వరకు ఉన్న 130.50 కి.మీ. రోడ్డును తాజాగా ఎన్‌హెచ్‌గా గుర్తించారు. ఈ రోడ్డుకు ఎన్‌హెచ్–440 నంబర్ కేటాయించారు. -
ఏపీలో ఎన్‌హెచ్ అభివృద్ధి నిధుల పెంపు
సాక్షి, అమరావతి: జాతీయ రహదారుల (ఎన్‌హెచ్) అభివృద్ధి కింద రాష్ట్రానికి కేటాయించిన నిధులను పెంచుతూ జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. వార్షిక ప్రణాళిక కేటాయింపు కింద ఇస్తున్న రూ.1,408 కోట్ల నుంచి రూ.2,707.92 కోట్లకు పెంచుతూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో ఏపీలో ఎన్‌హెచ్‌ల అభివృద్ధి పరుగులు తీయనుంది. రాష్ట్ర రోడ్డులుగా ఉన్న పలు రోడ్లను హైవేలుగా మార్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇప్పటికే 3 రాష్ట్ర రహదారులకు జాతీయ రహదారుల నెంబర్లను కేటాయించి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. తెలంగాణ, ఏపీలను కలిపే విధంగా మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల మధ్య ఎన్‌హెచ్–67 జంక్షన్ వద్ద నాగర్ కర్నూల్, కోలాపూర్, రామాపూర్, మండుగల, శివాపురం, కరివెన, నంద్యాల వరకు (ఎన్‌హెచ్–40 సమీపంలో) ఉన్న 94 కి.మీ. రోడ్డును ‘ఎన్‌హెచ్–167కే’ గుర్తించింది. అనంతపురం జిల్లా పరిధిలోని ఎన్‌హెచ్–44పై కోడూరు నుంచి ముదిగుబ్బ (ఎన్‌హెచ్–42) వయా పుట్టపర్తి మీదుగా వెళ్లే 79 కి.మీ. రాష్ట్ర రహదారికి ఎన్‌హెచ్–342 కేటాయించారు. వైఎస్సార్ కడప జిల్లా పరిధిలోనూ రాయచోటి–వేంపల్లె–యర్రగుంట్ల–ప్రొద్దుటూరు–చాగలమర్రి వరకు ఉన్న 130.50 కి.మీ. రోడ్డును తాజాగా ఎన్‌హెచ్‌గా గుర్తించారు. దీనికి ఎన్‌హెచ్–440 నంబరు కేటాయించారు. గతం కంటే ఎక్కువగా నిధులు మంజూరు రోడ్ల అభివృద్ధికి గతం కంటే ఈ ఏడాది కేంద్ర రోడ్డు నిధి కింద కేటాయింపులు పెరిగాయి. ఈ ఆర్ధిక ఏడాదిలో 616.36 కి.మీ. మేర రోడ్లను అభివృద్ధి చేసేందుకు 43 పనులకు గాను రూ.880.70 కోట్ల్లను కేటాయించారు. మరో 289.94 కి.మీ. రోడ్ల అభివృద్ధికి ఈ ఏడాదిలోనే రూ.441.90 కోట్లతో అదనపు పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. 2017–18లో 50.52 కి.మీ. రోడ్ల అభివృద్ధికి రూ.72.90 కోట్లే కేటాయించగా ఇప్పుడు రూ.880.70 కోట్లను కేటాయించడం గమనార్హం. -
ఎన్హెచ్ఏఐకు ప్రధాన రోడ్డు ప్రాజెక్టుల డీపీఆర్ బాధ్యత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రధానంగా చేపట్టే రోడ్డు ప్రాజెక్టులకు సవివర నివేదికల (డీపీఆర్) తయారీ బాధ్యతను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)కు అప్పగించారు. కన్సల్టెన్సీల ఎంపిక మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండ్ హైవేస్ (మోర్త్ – రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ) నిర్వహించనుంది. సాధారణంగా రాష్ట్రంలో చేపట్టే రహదారి ప్రాజెక్టుకు డీపీఆర్, కన్సల్టెన్సీ బాధ్యతలు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చూస్తుంది. రోడ్డులో వెళ్లే ట్రాఫిక్ వాహనాల సంఖ్య, ప్యాసింజర్ కార్ యూనిట్ల వివరాలపై నివేదిక రూపొందించి మోర్త్‌కు రాష్ట్ర ప్రభుత్వం సమర్పిస్తుంది. అయితే కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసిన బెంగుళూరు–విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే, విశాఖ పోర్టు నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు నిర్మించే రహదారుల ప్రాజెక్టులతో పాటు అనంతపురం–గుంటూరు రహదారి నిర్మాణానికి డీపీఆర్‌లను ఎన్హెచ్ఏఐ తయారు చేయనుంది. టెండర్ల ద్వారా కన్సల్టెన్సీలను ఎంపిక చేసి, రహదారుల ప్రాజెక్టులకయ్యే అంచనా వ్యయం, అలైన్‌మెంట్‌ను ఖరారు చేయనున్నారు. ► రాష్ట్ర ఆర్అండ్బీ మంత్రి శంకర్ నారాయణ ఇటీవల.. కేంద్ర మంత్రి గడ్కరీని కలిసినప్పుడు బెంగుళూరు–విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే అలైన్‌మెంట్‌ను ఖరారు చేయాలని విన్నవించారు. ► కొడికొండ చెక్‌పోస్టు, పులివెందుల, ముద్దనూరు, మైదుకూరు మీదుగా ఎక్స్‌ప్రెస్ వే నిర్మించాలని ఆర్అండ్బీ ప్రతిపాదన సమర్పించింది. అయితే మైదుకూరు నుంచి విజయవాడకు పూర్తిగా గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే (అటవీ ప్రాంతం మీదుగా) నిర్మించాలని ప్రతిపాదించారు. ► విశాఖ పోర్టు నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు నిర్మించే రహదారి ప్రాజెక్టుకు ఏపీఐఐసీ రూ.1,500 కోట్లతో డీపీఆర్‌ను రూపొందించింది. అయితే ఈ డీపీఆర్‌పై ఎన్హెచ్ఏఐ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఎన్హెచ్ఏఐ ఇంజనీర్లు డీపీఆర్ తయారు చేయడంతో పాటు కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నారు. ► అనంతపురం – గుంటూరు రహదారి నిర్మాణం కేంద్రమే చేపట్టనుంది. అనంతపురం, బుగ్గ, కొలిమిగుండ్ల, బనగానపల్లె, గిద్దలూరు, కంభం, వినుకొండ, గుంటూరు వరకు రహదారి నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ డీపీఆర్‌ను రూపొందించనుంది. -
నోటు కొట్టి... నాటుకోండి
సాక్షి, హైదరాబాద్: మీకు చెట్టు నాటేంత ఖాళీ స్థలం ఉందా.. అయితే ఏకంగా దశాబ్దాల వయసున్న చెట్టు అక్కడ ప్రత్యక్షం అయ్యేందుకు సిద్ధం. మొక్క తెచ్చి పెంచాలంటే ఎన్నో ఏళ్ల సమయం పడుతుంది. అదే ఏళ్ల వయసున్న చెట్టును నాటుకుంటే.. వింటుంటే కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ రోడ్లు, భవనాల శాఖ అధికారులు ఒకటి, రెండు కాదు దాదాపు వంద చెట్లను ఇలా ట్రాన్స్‌లొకేషన్‌కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే వేరేచోటికి తరలించి బతికించాల్సిన చెట్లకు ‘ధర’కట్టాలనడమే విడ్డూరంగా ఉంది. ఆసక్తి ఉంటే తీసుకెళ్లండి.. కొత్త సచివాలయం నిర్మిస్తున్న ప్రాంగణంలో వందల సంఖ్యలో చెట్లు ఉన్నాయి. నిర్మాణానికి అడ్డుగా వేప, రావి, మర్రి, పొగడ, మరికొన్ని వృక్షాలు ఉన్నాయి. వాటిని కొట్టేయటం కంటే ట్రాన్స్ లొకేషన్ ద్వారా వేరే చోట నాటించి పెం చాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే 40 చెట్లను తరలించారు. మరో వంద చెట్లను ఆసక్తి ఉన్నవారు ట్రాన్స్‌లొకేషన్ చేయడానికి తీసుకెళ్లవచ్చంటూ అధికారులు ప్రకటన విడుదల చేశారు. మరో 250 వరకు కొట్టేసేందుకు మార్క్ చేసినట్టు తెలిసింది. సంరక్షించాల్సిన చెట్ల ట్రాన్స్‌లొకేషన్‌కు అవకాశం కల్పిస్తున్నారు. ధర చెల్లించాల్సిందే.. ట్రాన్స్‌లొకేషన్‌కు నిర్ధారించిన చెట్లే కాకుండా ఇతర చెట్లను సంరక్షి స్తామని తీసుకెళ్లి అమ్మేసుకుంటారన్న అనుమానాలను కూడా అధికారులు వ్యక్తం చేస్తున్నారు. దీన్ని నివారించేందుకే వాటికి ధర నిర్ధారించామని చెబుతున్నారు. చెట్టు ఆకృతిని బట్టి ధరలున్నాయి. దీనివల్ల నిజంగా పెంచుకోవాలనుకునే వారే ట్రాన్స్‌లొకేషన్‌కు ముందుకొస్తారని అధికారులు చెబుతున్నారు. ప్రకృతి ప్రేమి కులకు మాత్రం ట్రాన్స్‌లోకేషన్ చెట్లకు ధరను నిర్ణయించడం రుచించడం లేదు. పెంచుకుంటామని అండర్‌టేకింగ్ ఇస్తే ఉచితంగానే ఇస్తామంటున్నారు. ఓ సంస్థ ఆరోపణలతో వివాదం తొలుత ఓ సంస్థ చెట్ల ట్రాన్స్‌లొకేషన్‌కు ముందుకొచ్చింది. 18 చెట్లను తీసుకెళ్లి శంషాబాద్ పరిసరాల్లో నాటింది. కొట్టేసేందుకు ఖరారు చేసిన చెట్లను కూడా ట్రాన్స్‌లొకేట్ చేసేందుకు ఆసక్తి చూపింది. ఇక్కడే వివాదం మొదలైంది. ఒక్కో చెట్టుకు రూ.8 వేల చొప్పున చెల్లించాలని అధికారులు అడిగారని, చెట్లను సంరక్షించేందుకు ముందుకొస్తే ధర అడగటమేమిటని ప్రశ్నిస్తే... అధికారులు దురుసుగా ప్రవర్తించారని, దీంతో ట్రాన్స్‌లొకేషన్ ప్రక్రియ నుంచి తప్పుకున్నట్టు ఆ సంస్థ పేర్కొంది. దీంతో ఈ ప్రక్రియపై విమర్శలు వచ్చాయి. ఆ సంస్థను కాదని అధికారులు ఇతరులను ఆహ్వానిస్తూ ప్రకటన ఇచ్చారు. ఆ మేరకు మరో రెండు సంస్థలు 40 చెట్లను ట్రాన్స్‌లొకేట్ చేశాయని అధికారులు పేర్కొంటున్నారు. అయితే తాము రూ.8 వేల చొప్పున కోరలేదని, చెట్లను తీసుకెళ్లి పెంచకపోతే తాము విమర్శల పాలు కావాల్సి వస్తుందని, అందుకే కొంత రుసుము ఖరారు చేశామని చెప్పారు. -
రహదారుల అభివృద్దికి 6400 కోట్లు
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో రహదారుల అభివృద్దికి 6400 కోట్లు కేటాయించామని రోడ్లు,భవనాల శాఖా మంత్రి శంకర్ నారాయణ అన్నారు. ఈ మేరకు న్యూ డెవలప్ మెంట్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. రివర్స్ టెండరింగ్ విధానంలో 85కోట్లు ఆదా అయ్యాయని, ఇప్పటికే టెండర్లు ఖరారు చేశామన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీ ద్వారా రుణం తీసుకున్న 3 వేల కోట్లని పక్కదారి పట్టించింని మండిపడ్డారు. 450 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిందని ఆరోపించారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తులకి ప్రభుత్వం ఇప్పటికే 550 కోట్లని కేటాయించిందని, నీడా ద్వారా 1158 కోట్లని రోడ్ల అభివృద్ది కోసం సమీకరిస్తున్నామని పేర్కొన్నారు. మొదటి ప్రాధాన్యతగా జిల్లాల నుంచి మొదలుకొని తర్వాత మండలస్ధాయిలో కూడా రోడ్లని అభివృద్ది చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. -
యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు
సాక్షి, అమరావతి: ఈ నెల 10వ తేదీ నుంచి 45 రోజుల పాటు యుద్ధ ప్రాతిపదికన రహదారుల మరమ్మతులు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రూ.560 కోట్లతో రహదారుల మరమ్మతులకు సంబంధించి ఈ నెల 10వ తేదీలోగా టెండర్లు పూర్తి చేస్తామని, ఈ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం ఆయన స్పందన కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు సంబంధించి తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో చివరి రెండేళ్లు రహదారుల మరమ్మతుల గురించి పట్టించుకోలేదని, మనం అధికారంలోకి వచ్చాక భారీ వర్షాల వల్ల రోడ్లు దెబ్బ తిన్నాయని తెలిపారు. ఈ ఏడాది అంతా రోడ్ల మరమ్మతులపైనే దృష్టి పెడుతున్నామని స్పష్టం చేశారు. మరో రూ.2 వేల కోట్లతో కూడా రహదారుల మరమ్మతులపై దృష్టి పెడుతున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించి రుణం మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమీక్షలో వివిధ అంశాలపై సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. రూ.12 వేల కోట్లతో కొత్త రహదారులు ► ఆర్ అండ్ బీకి సంబంధించి 31 ఎన్‌హెచ్ (నేషనల్ హైవే) ప్రాజెక్టులు ఉన్నాయి. రూ.9,571 కోట్ల ఖర్చుతో 915 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మిస్తున్నారు. వీలైనంత త్వరగా ఇందుకు సంబంధించి భూ సేకరణ పూర్తి చేయాలి. ► సుమారు రూ.12 వేల కోట్లతో కొత్త రోడ్ల పనులు మంజూరయ్యాయి. వీటికి సంబంధించి కూడా భూ సేకరణపై దృష్టి పెట్టాలి. నిర్ణయించిన తేదీ నుంచి 270 రోజుల్లోపు భూములను కాంట్రాక్టర్‌కు అప్పగించకపోతే కాంట్రాక్టరు డీస్కోపింగ్ (రేటు పెంచండని)కు అడిగే అవకాశం ఉంటుంది. ప్రాధాన్యతగా ఉపాధి పనులు ► గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూ – భారీ పరిమాణంలో పాలను శీతలీకరణలో ఉంచే కేంద్రాలు), అంగన్వాడీ సెంటర్లు, విలేజ్ క్లినిక్స్ పనులను గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రాధాన్యతగా పూర్తి చేయాలి. ► ఒక మనిషికి లేదా ఒక ఏజెన్సీకి ఒక పని మాత్రమే అప్పగించాలి. ఎక్కువ పనులు అప్పగిస్తే ఒక పని అయిపోయే వరకు రెండో పని మొదలు పెట్టడం లేదు. దీనికి అనుగుణంగా వెంటనే మార్పులు చేయాలి. మార్చి 31లోగా అనుకున్న పనులన్నీ పూర్తి చేయాలి. ► ఇందుకు సూక్ష్మ స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. గ్రామాల వారీగా ప్లాన్ ఉండాలి. ఈ పనులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలి. అప్పుడే పూర్తి స్థాయిలో నిధులను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. నిర్మాణాల్లో వేగం పెరగాలి ► గ్రామ సచివాలయాల నిర్మాణాలను వేగవంతం చేయాలి. గ్రామాల వారీగా పనులను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని నిర్మాణాల ప్రగతిని సమీక్షించాలి. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ప్రణాళిక వేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. విలేజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. ► మన బడి నాడు–నేడు కింద స్కూళ్లలో చేపట్టిన మొత్తం పనులన్నీ వచ్చే నెలాఖరు నాటికి పూర్తి కావాలి. ప్రతి బిల్డింగును ఒక యూనిట్‌గా తీసుకుని జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్లు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి. ► ప్రొక్యూర్‌మెంట్‌కు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఈడబ్ల్యూఐడీసీ)తో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలి. క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలి. అంగన్ వాడీ కేంద్రాలు ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్పు ► అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం పెండింగులో ఉన్న వాటికి వెంటనే స్థలాలను సేకరించాలి. అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చబోతున్నాం. ఈ కేంద్రాలకు కావాల్సిన స్థలాలను పూర్తి స్థాయిలో గుర్తించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ను అభినందిస్తున్నా. ► ఆరేళ్ల లోపు పిల్లల్లో 85 శాతం మెదడు అభివృద్ధి చెంది ఉంటుంది. అందువల్ల వారి పట్ల అత్యంత శ్రద్ధ చూపిస్తున్నాం. మంచి విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దడానికి ఈ పనులన్నీ చేస్తున్నాం. ఇంగ్లిష్ సహా వారికి అన్నీ నేర్పిస్తాం. ఎంపీఎఫ్‌సీల నిర్మాణానికి భూముల గుర్తింపు ► బహుళ ప్రయోజన సౌకర్యాల కేంద్రాల (ఎంపీఎఫ్సీ – మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్స్) కోసం ఆర్బీకేల సమీపంలో అర ఎకరా నుంచి ఒక ఎకరం వరకు స్థలం కావాలి. గోదాములు, శీతల గిడ్డంగులు, వ్యవసాయ ఉత్పత్తులను ఆరబెట్టడానికి అవసరమైన వేదిక (డ్రైయింగ్ ప్లాట్‌ఫాం), వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు (కలెక్షన్ సెంటర్లు), ప్రాథమికంగా శుద్ధిచేసే పరికరాలు (ప్రైమరీ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్), అసైయింగ్ ఎక్విప్మెంట్ (పరీక్షించే పరికరాలు), సేకరణ పరికరాలు (ప్రొక్యూర్మెంట్ అక్విప్‌మెంట్) తదితర సదుపాయాల కోసం భూములు కావాలి. ► ట్రక్కులు వెళ్లేలా ఈ భూములు ఉండాలి. జనవరి 31 నాటికల్లా ఈ భూముల గుర్తింపు పూర్తి కావాలి. గ్రామాల్లోనే జనతా బజార్ల కోసం 5 సెంట్లు కావాలి. గ్రామం మధ్యలోనే ఉండేలా చూడాలి. వచ్చే ఏడాదిలో గ్రామ స్వరూపంలో పూర్తి మార్పు వస్తుంది. ► ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, ఆర్బీకే, విలేజ్ క్లినిక్, ప్రీప్రైమరీ స్కూల్, జనతాబజార్లతో మొత్తం గ్రామాల స్వరూపం మారుతుంది. ఆర్బీకేల పక్కనే ఎంపీఎఫ్‌సీలు వస్తాయి. దాదాపు రూ.10,235 కోట్ల ఆర్థిక వనరుల సమీకరణకు అనుసంధానం కూడా పూర్తవుతుంది. ► జనవరిలో పంట కోత ప్రయోగాలు (క్రాప్ కటింగ్ ఎక్స్పర్మెంట్స్) పూర్తయితే, ఫిబ్రవరిలో ప్లానింగ్ నివేదిక ఆధారంగా ఏప్రిల్ నాటికి రైతులకు ఇన్సూరెన్స్ అందించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. జనవరి 11న అమ్మ ఒడి జనవరి 9న రెండో శనివారం, బ్యాంకులకు సెలవు కావడంతో జనవరి 11న అమ్మ ఒడి నిర్వహిస్తున్నాం. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో డిసెంబర్ 21 నుంచి లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించాం. జనవరి 7 వరకు ఆ జాబితాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయి. స్కూళ్లకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఆ రోజు ప్రకటిస్తాం. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు ప్రకటిస్తాం. ఇంటింటికీ రేషన్ బియ్యం రేషన్ సరుకులను లబ్ధిదారుల ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు ఈ నెల 20వ తేదీన 9,257 వాహనాలను ప్రారంభిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా అవకాశం ఇస్తూ వారికి వాహనాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టాం. బియ్యం అందించే బ్యాగులను కూడా అదే రోజు ఆవిష్కరిస్తాం. రేషన్ సరఫరాలో భాగంగా స్వర్ణ రకం బియ్యం అందిస్తాం. విజయవాడలో మూడు జిల్లాలకు సంబంధించిన వాహనాలు ప్రారంభిస్తాం. మిగిలిన జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 1 నుంచి లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యాన్ని వారి ఇళ్ల వద్దే అందజేస్తాం. -
ఎన్డీబీ రీ టెండర్లలో 12 బిడ్లు
సాక్షి, అమరావతి: న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) సాయంతో రాష్ట్రంలో రహదార్లు, వంతెనల పునర్నిర్మాణ పనులకు సంబంధించి గత నెలలో పిలిచిన రీ టెండర్లలో 10 కాంట్రాక్టు సంస్థలు 12 బిడ్లు దాఖలు చేశాయి. తొలిదశలో నాలుగు జిల్లాల్లో పిలిచిన రీ టెండర్ల టెక్నికల్ బిడ్లను ఆర్అండ్బీ అధికారులు సోమవారం తెరిచారు. ఒక్కో జిల్లాలో మూడు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. గతంలో మాదిరిగా 13 జిల్లాలకు ఒకేసారి టెండర్లు పిలవకుండా నాలుగు జిల్లాలకు మాత్రమే రీ టెండర్లు పిలిచారు. మొత్తం రూ.6,400 కోట్లతో చేపట్టే రహదారుల నిర్మాణానికి సంబంధించి.. తొలిదశలో రూ.1,860 కోట్లతో 13 ప్యాకేజీలకు మొదట ఈ–టెండర్లు పిలవగా 14 సంస్థల నుంచి 25 బిడ్లు మాత్రమే వచ్చాయి. దీనిపై ఆర్అండ్బీ ముఖ్య అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పోటీతత్వం పెంచేందుకు ఆ టెండర్లను రద్దుచేసి మళ్లీ పిలవాలని ఆదేశించడంతో అవి రద్దయిన సంగతి తెలిసిందే. రీ టెండర్లకు తొలివిడతగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, విశాఖపట్టణం జిల్లాలను ఎంపికచేసిన అధికారులు జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీచేశారు. రెండు నిబంధనల్ని సవరించి, నాలుగు జిల్లాల్లో రూ.682.16 కోట్ల పనులకు సంబంధించి ఈ టెండర్లను పిలిచారు. సోమవారం ఈ టెక్నికల్ బిడ్లు తెరిచిన అధికారులు వాటిని పరిశీలించి అర్హత సాధించిన సంస్థల వివరాలు ప్రకటిస్తారు. అనంతరం రివర్స్ టెండర్లు నిర్వహించనున్నారు. -
గుంతల్లేని రహదారుల కోసం రూ.303 కోట్లు
సాక్షి, అమరావతి: గుంతల్లేని రహదారుల కోసం ఏపీలో రూ.303 కోట్లు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3 వేల కి.మీ. మేర రహదారులపై గుంతల్ని పూడ్చనున్నారు. ఇందులో 2,060 కి.మీ మేర జిల్లా రహదారులకు రూ.197 కోట్లు, 940 కి.మీ. మేర రాష్ట్ర రహదారులకు రూ.106 కోట్లు కేటాయించనున్నారు. ప్రాధాన్యత క్రమంలో ట్రాఫిక్ అధికంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టనున్నారు. రోజుకు 6 వేల వాహనాలు వెళ్లే రోడ్లపై గుంతల్లేకుండా చేయనున్నారు. వర్షాకాలం సీజన్ ముగియడంతో వెంటనే పనులు చేపట్టేందుకు ఆర్అండ్బీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరమ్మతులకు టెండర్లు పిలిచి పనులు కేటాయించనున్నారు. రూ.2,168 కోట్లతో 7,116 కి.మీ మేర రోడ్లు, వంతెనల మరమ్మతులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. ► ఏపీలో రహదారులపై గుంతల కారణంగా గతేడాది జరిగిన 96 రోడ్డు ప్రమాదాల్లో 32 మంది మృతి చెందగా, 149 మంది గాయపడ్డారు. ► మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండ్ హైవేస్ గణాంకాల ప్రకారం వంతెనలపై ప్రమాదాల కారణంగా 268 మంది మరణించగా, కల్వర్టుల వద్ద 121 మంది మృత్యువాత పడ్డారు. ► దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా రహదారులపై గుంతల కారణంగా రోడ్డు ప్రమాదాలు, తద్వారా మరణాలు చోటు చేసుకున్నాయి. 2,122 ప్రమాదాల్లో 1,034 మంది మరణించారు. ► ఏపీలో 1,100 వరకు బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. వీటిని సరిచేసేందుకు రవాణా, పోలీస్, ఆర్అండ్బీ శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్, స్పీడ్ బ్రేకర్లు, ప్రమాద సూచికలు ఏర్పాటు చేస్తున్నారు. ► ఎన్‌హెచ్–65 (విజయవాడ–హైదరాబాద్)పై ముఖ్య కూడళ్లు ప్రమాదకరంగా ఉన్నాయి. ఎన్‌హెచ్–44పై అనంతపురం జిల్లా పరిధిలో తపోవనం జంక్షన్ ప్రమాదకరంగా ఉంది. ఈ రహదారిపై పెన్నార్ భవన్ జంక్షన్, పంగల్ రోడ్, రుద్రంపేట ఫ్లై ఓవర్లపై ప్రమాదాలు జరుగుతున్నాయి. ► ఎన్‌హెచ్–16 (చెన్నై–కోల్‌కతా రహదారి)పై అధికంగా రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్నాయి. ఏలూరు ఆశ్రం ఆస్పత్రి, విజయవాడ–విశాఖ మధ్య ప్రమాదకర మలుపులు, జంక్షన్లు ఉన్నాయి. ఈ మేరకు ఇటీవలే రవాణా శాఖ.. రహదారి భద్రతపై ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు కమిటీకి నివేదిక సమర్పించింది. -
రోడ్లు, భవనాల శాఖతో సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: రహదారుల నిర్వహణ పక్కాగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వెంటనే అన్ని చోట్ల అవసరమైన మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు. రోడ్లు, భవనాల శాఖతో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ, ఆర్అండ్బీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబుతో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వాహనాల రద్దీని బట్టి ప్రాధాన్యత ఇస్తూ రహదారులను బాగు చేయాలని పేర్కొన్నారు. వంతెనలు, అప్రోచ్ రహదారులు, ఆర్ఓబీలు వెంటనే పూర్తి చేయాలన్నారు. వీలైనంత త్వరగా ఆయా రహదారులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. (చదవండి: దసరా ఉత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం) మున్సిపాలిటీలలో కూడా రహదారుల విస్తరణ చేపట్టాలని, రాష్ట్ర రహదారులు, జిల్లాలలో ముఖ్య రహదారుల మరమ్మతు పనులకు అవసరమైన నిధులు 2168 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆర్థిక శాఖను సీఎం జగన్ ఆదేశించారు. రహదారులపై రాకపోకలు సజావుగా సాగేలా, గుంతలు వెంటనే పూడ్చి, ప్యాచ్ వర్క్‌లు చేపట్టాలన్నారు. ఆ మేరకు దాదాపు 3 వేల కిమీ రహదారుల ప్యాచ్ వర్క్ కోసం దాదాపు రూ. 300 కోట్లు అవసరమవుతాయని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. ఈ సందర్భంగా వెంటనే ఆ నిధులు కూడా మంజూరు చేసి పనులు మొదలయ్యేలా చూడాలని సీఎంను కోరారు. ఎన్డీబీ ఆర్థిక సహాయంతో చేపడుతున్న రహదారుల నిర్మాణానికి రెండు నెలల్లో రీటెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. (చదవండి: ‘స్వగ్రామం నుంచే సాఫ్ట్వేర్’ మోడల్‌గా ఏపీ) -
ఆర్ అండ్ బీ టెండర్లపై అపోహలొద్దు
సాక్షి, అమరావతి: రహదారులు, భవనాల శాఖ టెండర్లను సాంకేతిక మదింపు కమిటీ అనుమతించి, ఫైనాన్స్ బిడ్లు తెరిచాక ఏ ఫిర్యాదులొచ్చినా, అనుమానాలున్నా చర్యలు తీసుకుంటామని ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. విజయవాడలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) సహకారంతో రాష్ట్రంలో చేపడుతున్న రహదారులు, వంతెనల అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ డాక్యుమెంట్లను జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదించాక ఆధారాల్లేకుండా వార్తలు ప్రచురిస్తే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని పత్రికలు దురుద్దేశంతో అసత్య కథనాలు ప్రచురిస్తున్నాయని, ప్రభుత్వంపై అపోహలు కలిగేలా వార్తలు రాస్తున్నాయన్నారు. ఇంకా ఏమన్నారంటే.. ► ఆర్అండ్బీ టెండర్లను డివిజన్ల వారీగా చేపట్టేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్‌కు, రుణం అందిస్తున్న ఎన్డీబీకి ప్రతిపాదనలు పంపాం. ఇందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్, ఎన్డీబీ అంగీకరించలేదు. జిల్లాల వారీగా ప్యాకేజీలుగా అనుమతిస్తే సులభంగా ఉంటుందని భావించాయి. ► ఏపీ, తెలంగాణ రవాణా ముఖ్య కార్యదర్శులు మంగళవారం హైదరాబాద్‌లో భేటీ అయ్యి అంతర్రాష్ట్ర ఒప్పందంపై చర్చిస్తారు. ఒప్పందం ఆలస్యమవుతున్నందున 72 వేల కి.మీ బస్సులు తిప్పేందుకు ప్రతిపాదించాం. -
పనికిరాని ప్లాస్టిక్‌తో లక్ష కి.మీ రోడ్లు
సాక్షి, న్యూఢిల్లీ: పనికిరాని ప్లాస్టిక్ వ్యర్థాలతో కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష కిలోమీటర్ల రహదారిని పూర్తి చేసింది. రీసైక్లింగ్ కుదరని ప్లాస్టిక్‌ను ఇందుకోసం వాడింది. ఫలితంగా కొన్ని వందల కోట్ల రూపాయలు ఆదా చేసింది. దీంతో భారత ప్రభుత్వం మరో లక్ష కిలోమీటర్ల మేర దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ రోడ్లు వేయాలని నిర్ణయించుకుంది. (చైనా మొబైల్ కంపెనీ డీల్‌ను వదులుకున్న హీరో!) ఒక కిలోమీటరు రహదారిని వేయడానికి తొమ్మిది టన్నుల తారు, ఒక టన్ను ప్లాస్టిక్ వ్యర్ధాలను వాడింది. మామూలు రోడ్లలో కిలోమీటరుకు పది టన్నుల తారును వాడతారు. ఒక టన్ను తారుకు సరాసరి 30 వేల రూపాయల వరకూ ఖర్చు అవుతుంది. కిలోమీటరుకు ఒక టన్ను ప్లాస్టిక్ వ్యర్ధాలను ఉపయోగించడం వల్ల, లక్ష కిలోమీటర్లకు వందల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ప్లాస్టిక్ రోడ్లలో సహజంగా ఆరు నుంచి ఎనిమిది శాతం ప్లాస్టిక్, 92 నుంచి 94 శాతం తారు ఉంటాయి. (నాపెళ్లి ఆపండి.. ఓ అమ్మాయి ఫోన్!) గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ తొలిసారిగా 2018లో తారు రోడ్లలో ప్లాస్టిక్ వ్యర్ధాలను వాడటం మొదలుపెట్టంది. ప్రస్తుతం అక్కడ తారురోడ్లలో ప్లాస్టిక్‌ను వాడటం తప్పనిసరి.జమ్మూకాశ్మీర్ జాతీయ రహదారిలో 270 కిలోమీటర్ల దూరానికి ప్లాస్టిక్ వ్యర్ధాలు కలిపి రోడ్డు వేశారు. ఢిల్లీ–మీరట్ జాతీయ రహదారిలో కూడా 1.6 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్‌ను వాడారు. ధౌలా కువాన్ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వేసిన రోడ్డులోనూ ప్లాస్టిక్‌ను వాడారు. భారత్‌లో రోజూ 25,940 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు తయారవుతున్నాయి. ఇది 4300 ఏనుగుల బరువుతో సమానం. ఇందులో 60 శాతంపైగా రీసైక్లింగ్ అవుతోంది. మిగిలిన దాని మూలంగా వాతావరణం కాలుష్యం అవుతోంది. -
రహదార్ల మరమ్మతులకు రూ.450 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రహదారుల మరమ్మతులకు రూ.450 కోట్లు మంజూరయ్యాయి. రాష్ట్ర రహదారులు (స్టేట్ హైవేస్), జిల్లా ప్రధాన రహదారుల (ఎండీఆర్)పై అన్ని రకాల మరమ్మతులకు కలిపి రూ.625 కోట్లతో రహదారులు, భవనాల శాఖ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. అయితే రూ.450 కోట్లు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అందులో రాష్ట్ర రహదారులకు రూ.250 కోట్ల, జిల్లా ప్రధాన రహదారులకు రూ.200 కోట్లు కేటాయించారు. ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాల్లో రహదార్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో స్టేట్ హైవేస్ పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీగా ట్రాఫిక్ ఉండే పాలకొల్లు–పూలపల్లి, నర్సాపూర్–అశ్వారావుపేట, బూర్గంపాడు–అశ్వారావుపేట, మార్టేరు–ప్రక్కిలంక రహదార్లు అధ్వానంగా ఉన్నాయి. తూర్పుగోదావరిలో సోమేశ్వరం–రాజానగరం, కాట్రేనికోన–చల్లపల్లి, కరప–చింతపల్లి, రాజమండ్రి–చినకొండేపూడి తదితర రహదార్లను వెంటనే మరమ్మతులు చేసేందుకు నిధుల్ని ఖర్చు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోనూ రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో వీటి మరమ్మతులకు, ట్రాఫిక్, జనసాంద్రత ఎక్కువగా ఉండే రహదారులపై గుంతల్ని సరిజేయడానికి నిధుల్ని ఖర్చు చేయనున్నారు. కాగా గతంలో చేసిన జాతీయ రహదార్ల మరమ్మతుల పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులున్నాయి. వీటికోసం రూ.27 కోట్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మొత్తం రూ.293 కోట్ల వరకు పెండింగ్ బిల్లులుండగా క్లియర్ చేసేందుకు ఆర్ అండ్ బీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. రహదార్ల రెన్యువల్‌కు రూ.700 కోట్లు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో దీర్ఘకాలిక పనితీరు ఆధారిత నిర్వహణ కాంట్రాక్టు కింద రెండు వేల కిలోమీటర్ల రహదారులను బాగు చేయనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్ అండ్ బీ అధికారులకు ఆదేశాలు జారీఅయ్యాయి. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.700 కోట్లకు అనుమతులొచ్చాయి. సాధారణంగా ప్రతి ఏడాది రహదార్లను రెన్యువల్ (దెబ్బతిన్న మేర కొత్తగా లేయర్ వేయడం) చేస్తారు. -
ఇసుక కొరత తాత్కాలికమే
సాక్షి, అమరావతి: ఇసుక కొరత తాత్కాలికమేనని, నవంబర్ ఆఖరు నాటికి పూర్తిగా సమస్య తీరుతుందని భావిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వరద తగ్గగానే ఇసుక సరఫరా బాగా పెరుగుతుందని, ప్రాధాన్యతా రంగాలకు ఇసుక ఇవ్వడానికి వెంటనే ప్రత్యేక స్టాక్ యార్డులు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో రహదారులు – భవనాల శాఖ సమీక్ష సందర్భంగా ఇసుక లభ్యత గురించి మాట్లాడారు. గత 90 రోజులుగా ఊహించని రీతిలో వరద వస్తోందని, 267 రీచ్‌ల్లో కేవలం 61 మాత్రమే పని చేస్తున్నాయని, మిగతావన్నీ వరద నీటిలో ఉన్నాయన్నారు. వరద నీటిలో ఉన్న రీచ్‌ల నుంచి ఇసుక తీయడం కష్టంగా ఉందని, లారీలు, ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి చివరకు పెన్నా నదిలో కూడా 90 రోజులుగా వరద వస్తోందని, ఇలా నీళ్లు రావడం రైతులకు, పంటలకు, భూగర్భ జలాలకు మంచిదేనని, కాకపోతే నిరంతరం వరద వల్ల ఇసుక సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా ఇసుక మాఫియా నడిచిందని, పొక్లెయిన్లు, భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు సాగించి భారీగా దోపిడీ చేశారని.. ఇప్పుడు మాన్యువల్‌గా చేస్తున్నామనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఇప్పుడు మీరు ప్రకాశం బ్యారేజీకి వెళ్లి చూసినా.. గేట్లు ఎత్తే ఉన్నాయని, వరద నీరు ప్రవహిస్తూనే ఉందని చెప్పారు. గత ఐదేళ్లలో పేరుకే ఇసుక ఉచితం అని చెబుతూ.. వాస్తవానికి మాఫియా నడిపారని సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పుడు తాము చాలా పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తున్నామని, ప్రజలకు, పేదలకు మేలు చేసేలా మార్గదర్శకాలు రూపొందించామని, కిలోమీటర్‌కు రూ.4.90కి ఎవరైతే రవాణా చేస్తారో వారిని రమ్మన్నామని సీఎం తెలిపారు. -
రహదారులకు మహర్దశ
ప్రభుత్వంలో జరిగే ప్రతి పనికీ రివర్స్ టెండర్లు పిలుస్తున్నాం. రివర్స్ టెండర్లు పిలిచిన ప్రతిసారి తక్కువకు టెండర్లు ఖరారవుతున్నాయి. రోడ్ల నిర్మాణంలో కూడా అదే పద్ధతి పాటించండి. అంచనాల్లో వాస్తవికతతో వ్యవహరించాలి. సింగిల్ లేన్ రోడ్లు అనే విధానాన్ని విడిచిపెడితే మంచిది. ఏ రోడ్డయినా రెండు లేన్లుగా విస్తరిస్తేనే బాగుంటుంది. – అధికారులతో సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) అందించే రుణ సాయంతో రాష్ట్రంలో రహదారుల రూపు రేఖలు మార్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఎన్డీబీ అందిస్తున్న రుణ సాయం రూ.6,400 కోట్ల నుంచి రూ.8,800 కోట్లకు పెంచేలా కోరాలని నిర్ణయించామన్నారు. సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో రహదారులు, భవనాల శాఖపై సమీక్ష నిర్వహించారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ఇస్తున్న రూ.6,400 కోట్లతో సుమారు 3,100 కిలోమీటర్లకు పైగా ఉన్న రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు అవసరమైన చోట కొత్త బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టులో జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకున్న రోడ్లకు ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలని, ఒకవేళ ఇప్పుడున్న రోడ్లు బాగుంటే.. మండల కేంద్రం నుంచి మరో మండల కేంద్రానికి వెళ్లే రోడ్లపై దృష్టి పెట్టాలన్నారు. అవసానదశలో ఉన్న 676 బ్రిడ్జిలను ఎన్డీబీ ప్రాజెక్టులో పెట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే గుర్తించి, రూ.625 కోట్లతో సత్వర మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. త్వరితగతిన భూసేకరణ అనంతపురం – అమరావతి ఎక్స్‌ప్రెస్ వేను చిలకలూరిపేట బైపాస్కు అనుసంధానం చేసే ప్రతిపాదనకు సీఎం వైఎస్ జగన్ అంగీకారం తెలిపారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే భూసేకరణపై ప్రధానంగా దృష్టి పెట్టి పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని ఆదేశించారు. ప్రాథమికంగా నాలుగు లేన్ల రోడ్డు, భవిష్యత్తు కోసం 8 లేన్ల రహదారికి భూ సేకరణ చేస్తున్నామని ఆర్అండ్బీ అధికారులు సీఎంకు వివరించారు. ఎక్స్‌ప్రెస్ వే లో భాగంగా నిర్మించే టన్నెల్స్ నాలుగు లేన్లా.. లేక ఆరు లేన్లా అన్నది చర్చ జరుగుతుందన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆరు లేన్లకు సరిపడా టన్నెల్స్ ఉండాలని సీఎం సూచించారు. రోడ్ల నిర్మాణంలో ఎం–శాండ్ వినియోగంపై దృష్టి పెట్టాలన్నారు. ఏపీఆర్డీసీ బలోపేతం ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డీసీ) బలోపేతానికి అధికారులు చేసిన ప్రతిపాదనలకు సీఎం సానుకూలంగా స్పందించి చట్టంలో సపరణలకు అంగీకరించారు. కార్పొరేషన్ స్వావలంబనతో నడవడానికి, రోడ్ల నిర్మాణం, నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు ఉండేలా కార్పొరేషన్ ఉండాలని సీఎం సూచించారు. ఆర్టీసీకి సంబంధించిన 12 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన 3,600కు పైగా బస్సులను వెంటనే రీప్లేస్ చేయాలని సూచించారు. అప్పుడే ప్రయాణికుల భద్రతకు సరైన ప్రమాణాలు పాటించినట్లవుతుందన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు ప్రణాళికలు వేసుకుని వాటిని అమలు చేయడానికి కార్పొరేషన్ దృష్టి పెట్టాలన్నారు. రోడ్ల నిర్మాణం, నిర్వహణ కోసం ప్రత్యేక నిధి ఏపీఆర్డీసీ ద్వారా ఏర్పాటు కావాలన్న అధికారుల ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలలో అమలవుతున్న విధానాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమావేశంలో ఆర్అండ్బీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఎన్హెచ్ఏఐ ఆర్వో అనిల్ దీక్షిత్, ఆర్అండ్బీ చీఫ్ ఇంజనీర్లు మనోహర్ రెడ్డి, రాజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేగంగా జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ గుండుగొలను – కలపర్రు– గొల్లపూడి – మంగళగిరి బైపాస్ హైవేపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఎక్కడ సమస్యలు వచ్చినా వెంటనే జోక్యం చేసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. విజయవాడ నగరాన్ని ట్రాఫిక్ సమస్య నుంచి తప్పించేందుకు ఇదొక పరిష్కారం అవుతుందని సీఎం అన్నారు. అనకాపల్లి – ఆనందపురం రోడ్డు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తవుతోందని ఎన్హెచ్ఏఐ అధికారులు సీఎంకు వివరించారు. ఒంగోలు– కత్తిపూడి జాతీయ రహదారికి సంబంధించి అక్కడక్కడ చిన్న స్థాయిలో పనులు మిగిలిపోయాయని, వాటిని త్వరలో పూర్తి చేస్తామని వారు చెప్పారు. రేణిగుంట నుంచి కడప, రేణిగుంట నుంచి నాయుడుపేట, నెల్లూరు నుంచి తడ వరకు ఆరు లేన్ల రహదారి.. తదితర ప్రాజెక్టుల గురించి వారు సీఎంకు వివరించారు. వైఎస్సార్ జిల్లా ముద్దనూరు నుంచి బెంగళూరు హైవేలోని కొడికొండ చెక్‌పోస్టు వరకు 150 కిలోమీటర్ల రహదారిని రూ.350 కోట్ల ఎన్డీబీ నిధులతో పది మీటర్ల మేర విస్తరించాలని సీఎం ఆదేశించారు. వశిష్ట గోదావరి పాయమీద సెకినేటిపల్లి వద్ద చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న బ్రిడ్జిని రూ.100 కోట్లతో పూర్తి చేయాలన్నారు. అనంతపురం జిల్లా కదిరి బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని ఈ ఏడాది ప్రణాళికలోనే పెట్టాలని అధికారులకు సూచించారు. రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్ వినియోగం పర్యావరణ పరిరక్షణలో భాగంగా రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నామని ఎన్హెచ్ఏఐ అధికారులు సీఎంకు వివరించారు. నగరాలు, పట్టణాల్లో సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఎన్హెచ్ఏఐకు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీనికోసం ఒక విధానాన్ని రూపొందించాలన్నారు. రేషన్ పంపిణీలో భాగంగా బియ్యాన్ని ప్యాక్ చేసేందుకు ఇస్తున్న సంచులను తిరిగి సేకరించి వాటిని పునర్ వినియోగించడం లేదా రోడ్ల నిర్మాణంలో ఉపయోగించేందుకు ఇవ్వాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాల సరఫరాపై ఎంఓయూకు సిద్ధంగా ఉన్నామని ఎన్హెచ్ఏఐ అధికారులు చెప్పారు. -
రోడ్లు, భవనాల శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
ఏపీలో రోడ్లకు మహర్దశ..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే గుర్తించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం రోడ్లు, భవనాల శాఖపై సీఎం సమీక్షించారు. విజయవాడ కనకదుర్గ వారధిని సత్వరమే పూర్తి చేయాలన్నారు. దుర్గగుడికి వచ్చే యాత్రికుల వల్ల పనులు నిలుపుదల చేస్తున్నామని, జనవరి నెలాఖారుకు పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు వివరణ ఇచ్చారు. బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్‌కు ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్లనూ కూడా పూర్తిచేయాలని సీఎం కోరాగా, డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఆర్అండ్బి శాఖలో ఉన్న ఖాళీలను గుర్తించాలని, జనవరిలో భర్తీ కోసం క్యాలెండర్‌ను విడుదల చేయనున్నట్లు సీఎం తెలిపారు. అంచనాలలో వాస్తవికత ఉండాలి.. రోడ్ల నిర్మాణం అంచనాల విషయంలో వాస్తవికత ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. మనం ప్రతి పనికి రివర్స్ టెండర్లు పిలుస్తున్నామని.. రివర్స్ టెండర్లు పిలిచిన ప్రతిసారి తక్కువ టెండర్లు ఖారారవుతున్నాయని వెల్లడించారు. రోడ్ల నిర్మాణంలో కూడా ఇదే పద్దతిని పాటించాలని సూచించారు. ఇక్కడ కూడా రివర్స్ టెండర్లు విజయవంతం అవుతాయని పేర్కొన్నారు. సింగిల్ లైన్ రోడ్లు అనే విధానాన్ని విడిచిపెడితే మంచిందని.. చేసే రోడ్ల విస్తరణ ఏదైనా రెండు లైన్ల రోడ్లుగా విస్తరిస్తేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రతిపాదనలకు సీఎం అంగీకారం.. అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ వేపై సమావేశంలో చర్చ జరిగింది. భూ సేకరణపై ప్రధానంగా దృష్టిపెట్టి పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని సీఎం సూచించారు. ఇనీషియల్‌గా నాలుగు లైన్ల రోడ్డు, భవిష్యత్తు కోసం 8 లైన్ల రోడ్డు వరుకూ భూ సేకరణ చేస్తున్నామని అధికారులు తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆరు లైన్లకు సరిపడా టన్నెల్స్ ఉండేలా చూడాలని సీఎం సూచించారు. అమరావతి- అనంతపురం ఎక్స్‌ప్రెస్ వేను చిలకలూరి పేట బైపాస్కు అనుసంధానం చేసే ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలిపారు. రోడ్లకు మహర్దశ న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ఇస్తున్న రూ. 6,400 కోట్లతో సుమారు 3,100 కిలోమీటర్లకు పైగా ఉన్న రోడ్ల అభివృద్ధి, అవసరమైన చోట కొత్త బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలన్నారు. ప్రస్తుతం ఉన్న రుణ సహాయం రూ.6,400 కోట్లనుంచి రూ.8,800 కోట్లకు పెంచేందుకు సీఎం నిర్ణయించారు. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకున్న రోడ్లకు ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అవసాన దశలో ఉన్న 676 బ్రిడ్జిలను ఎన్డీబీ ప్రాజెక్టులో పెట్టాలని సీఎం ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ బలోపేతానికి అధికారులు చేసిన ప్రతిపాదనలకు సీఎం సానుకూలంగా స్పందించారు. జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ సమీక్షలో నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా తరపున పాల్గొన్న రీజనల్ అధికారి అనిల్ దీక్షిత్.. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులను సీఎంకు వివరించారు. గుండుగొలను-గొల్లపూడి, కలపర్రు-మంగళగిరి బైపాస్ హైవేపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. పనుల్లో ఎక్కడ సమస్యలు వచ్చినా వెంటే జోక్యం చేసుకుని వెంటనే పరిష్కరించాలని సూచించారు. విజయవాడ నగరాన్ని ట్రాఫిక్ నుంచి విముక్తి చేసేందుకు ఇదొక పరిష్కారం అవుతుందని సీఎం అన్నారు. అనకాపల్లి – ఆనందపురం రోడ్డు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తవుతోందని ఎన్హెచ్ఏఐ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఒంగోలు–కత్తిపూడి జాతీయ రహదారికి సంబంధించి కూడా అక్కడక్కడ చిన్నస్థాయిలో పనులు మిగిలిపోయాయని, వాటినికూడా పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. మరికొన్ని కొత్త ప్రాజెక్టులను సీఎంకు వివరించారు. రేణిగుంట నుంచి కడప, రేణిగుంట నుంచి నాయుడుపేట, నెల్లూరు నుంచి తడ వరకూ ఆరులైన్ల రహదారి తదితర ప్రాజెక్టులను వివరించారు. రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్ వినియోగం పర్యావరణ పరిరక్షణలో భాగంగా రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నామని ఎన్హెచ్ఏఐ అధికారులు సీఎంకు వివరించారు. పట్టణాలు, నగరాల్లోని సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఎన్హెచ్ఏఐకు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీనికోసం ఒక విధానాన్ని రూపొందించాలన్నారు. అలాగే రేషన్ పంపిణీలో భాగంగా బియ్యాన్ని ప్యాక్ చేసేందుకు ఇస్తున్న సంచులను తిరిగి సేకరించి వాటిని పునర్ వినియోగించడం లేదా, రోడ్ల నిర్మాణంలో ఉపయోగించేందుకు ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్లాస్టిక్ వ్యర్థాల సరఫరాపై ఎంఓయూకు సిద్ధంగా ఉన్నామని ఎన్హెచ్ఏఐ అధికారులు చెప్పారు. సమీక్షా సమావేశంలో మంత్రి ధర్మాన కృష్ణదాసు, ముఖ్య కార్యదర్శి తిరుమల కృష్ణబాబు, నేషనల్ హైవేస్, రోడ్లు భవనాల శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఇసుక కొరత తాత్కాలిక సమస్య
-
రోడ్లు, భవనాల శాఖపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి : నదుల్లో వరద తగ్గగానే ఇసుక సరఫరా బాగా పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సోమవారం సీఎం వైఎస్ జగన్ రోడ్లు, భవనాల శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇసుక కొరత అనేది తాత్కాలిక సమస్య అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. నదులకు 90 రోజులుగా ఊహించని రీతిలో వరద వస్తోందని.. 265పైగా ఇసుక రీచ్‌ల్లో ప్రస్తుతం 61 మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు. మిగతా రీచ్‌లన్నీ వరదనీటిలోనే ఉన్నాయని వెల్లడించారు. వరద దృష్ట్యా ఇసుక తీయడం కష్టంగా ఉందని పేర్కొన్నారు. లారీలు, ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. 90 రోజులుగా కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి, పెన్నా నదులకు వరద కొనసాగుతుందని సీఎం వైఎస్ జగన్ గుర్తుచేశారు. నిరంతరం వరదల వల్ల ఇసుక సమస్య వస్తోందన్నారు. గత ఐదేళ్లుగా ఇసుక మాఫియా నడిచిందని విమర్శించారు. ఈ నెలాఖరు నాటికి ఇసుక సమస్య తీరుతుందని తెలిపారు. తాము అవినీతికి ఆస్కారం లేకుండా ఇసుక సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. పేదలకు మేలు చేసేలా మార్గదర్శకాలు రూపొందించి.. కి.మీకు రూ. 4.90కు ఎవరైతే ఇసుక రవాణా చేస్తారో వారినే రమ్మన్నామని వివరించారు. ప్రాధాన్యతా రంగాలకు ఇసుక ఇవ్వడానికి వెంటనే ప్రత్యేక స్టాక్ యార్డులు కూడా ఇస్తామన్నారు. ఇసుక అనేది తాత్కాలిక సమస్య మాత్రమేనని సీఎం మరోసారి స్పష్టం చేశారు. -
ఏజెన్సీలకు రహదారుల నిర్వహణ బాధ్యతలు
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ రహదారుల నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించనుంది. కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ (సీఆర్ఎం) పేరుతో త్వరలోనే వీటికి టెండర్లు పిలవనుంది. నగర రోడ్ల దుస్థితిని మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం జీహెచ్ఎంసీలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ ఈ మేరకు వెల్లడించారు. మొత్తం 709 కిలోమీటర్ల రోడ్లను 7 యూనిట్లుగా విభజించి ఐదేళ్ల కాలానికి దీర్ఘకాలిక టెండర్లు పిలవనున్నారు. రోడ్ల నిర్వహణతో పాటు ఫుట్‌పాత్‌ల నిర్మాణం, నిర్వహణ, క్లీనింగ్ అండ్ గ్రీనరీ పనులు కూడా కాంట్రాక్టు ఏజెన్సీనే నిర్వర్తించనుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ రోడ్ల నిర్వహణ, రీకార్పెటింగ్, గుంతల పూడ్చివేత తదితర పనులకు వేర్వేరుగా టెండర్లు పిలుస్తోంది. ఒక్కో పనిని ఒక్కో ఏజెన్సీ చేస్తుండడంతో సమన్వయం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా దెబ్బతిన్న రోడ్ల గుర్తింపు, మరమ్మతులకు అంచనాల రూపకల్పన, టెండర్లు పిలవడం తదితర ప్రక్రియలకు ఎంతో సమయం పడుతోంది. సీఆర్‌ఎంతో ఈ ఇబ్బందులుండవు. అదే విధంగా ట్రాన్స్‌కో, జలమండలి, ప్రైవేట్ సంస్థలు, మాస్టర్ ప్లాన్ విస్తరణ తదితర అవసరాలకు రోడ్లు తవ్వేందుకు కాంట్రాక్ట్ ఏజెన్సీలే సహకరిస్తాయి. ఇందుకుగాను రోడ్ల కటింగ్‌లు అవసరమైన సంస్థలు తమ భవిష్యత్తు ప్రణాళికలను కనీసం 6 నెలల ముందుగానే తెలియజేయాల్సి ఉంటుంది. ఇలా తవ్విన రోడ్లను వెంటనే పూడ్చి, తిరిగి యాథాతధ స్థితికి తెచ్చేందుకు ప్రస్తుతం వివిధ శాఖల మధ్యనున్న సమన్వయం లోపం, ఆలస్యం ఉండదు. ఐదేళ్ల పాటు నిర్వహణ బాధ్యతల వల్ల పనులు నాణ్యతగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఈ పనులకు సంబంధించి టెండర్లను పిలవనున్న నేపథ్యంలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా జోన్లలోని ప్రధాన రోడ్లను గుర్తించి సీఆర్ఎం కింద నిర్వహణకు టెండర్లు పిలవనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. రోడ్ల నిర్వహణతో పాటు ఇతర అంశాల్లోనూ ఉన్నత ప్రమాణాలు నిర్దేశించినట్లు మంత్రికి వివరించారు. కాంట్రాక్టు పొందిన ఏజెన్సీలు చేసే పనుల నాణ్యతపైనా నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్ంఎసీ కమిషనర్ లోకేశ్‌కూమార్, జోనల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
రాజధానిలో ‘రోడ్డు దోపిడీ’ నిజమే
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారుల నిర్మాణం పేరుతో టీడీపీ అధికారంలో ఉండగా పాల్పడిన అక్రమాలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో బహిర్గతమయ్యాయి. ఏ పనులు ఎవరికి కేటాయించాలో ముందుగానే నిర్ణయించి అంచనాలను భారీగా పెంచేశారని, ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అధిక ధరలకు పనులు అప్పగించారని పేర్కొంది. రూ.4,057.95 కోట్ల విలువైన నాలుగు రహదారుల నిర్మాణ పనుల్లో రూ.751 కోట్లకు పైగా దోపిడీకి పథక రచన జరిగినట్లు విజిలెన్స్ విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల నివేదిక సమర్పించింది. నాలుగు రహదారులు... మూడు సంస్థల కుమ్మక్కు అమరావతిలో నాలుగు రహదారుల నిర్మాణాలకు సంబంధించి ప్రతి అంశంలోనూ అంచనాలను ఎలా పెంచాలనే లక్ష్యంతోనే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహరించిందని విజిలెన్స్ నివేదిక స్పష్టం చేసింది. రాజధానిలో 11వ ప్యాకేజీ రహదారి నిర్మాణంలో అంచనాలను రూ.190.86 కోట్ల మేర పెంచేసినట్లు విజిలెన్స్ తేల్చింది. 12వ ప్యాకేజీ రహదారి అంచనాలను రూ.106.42 కోట్లు, 13వ ప్యాకేజీ రహదారి అంచనాలను రూ.195.88 కోట్లు, 14వ ప్యాకేజీ రహదారి అంచనాలను రూ.157.74 కోట్ల మేర పెంచేసినట్లు విజిలెన్స్ విచారణ నిగ్గు తేల్చింది. ఈ నాలుగు రహదారుల పనులను మూడు కాంట్రాక్టు సంస్థలు కుమ్మకై దక్కించుకున్నాయని, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ సంస్థలకు అనుకూలంగా టెండర్ నిబంధనలను రూపొందించిందని, ఎక్కువ మంది పాల్గొనేందుకు అవకాశం లేకుండా నిబంధనలు విధించిందని విజిలెన్స్ నివేదిక స్పష్టం చేసింది. విజిలెన్స్ తేల్చిన వాస్తవాలు – కేవలం అంచనాలను పెంచడం ద్వారానే నాలుగు రహదారుల నిర్మాణ పనుల్లో రూ.651 కోట్ల మేర దోపిడీ జరిగింది. – ఇక అధిక ధరలకు అప్పగించడం ద్వారా మరో రూ.100 కోట్ల మేర కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చారు. – ఇప్పటివరకు చేసిన పనుల్లో నిబంధనలను తుంగలోకి తొక్కారు. చేయని పనులకు కూడా అక్రమంగా బిల్లులు చెల్లించారు. – రాజధాని ప్రాంతం మూడు పంటలు పండే మాగాణి భూమి కాగా రాతి నేల అంటూ లేని పనులను చూపిస్తూ అంచనాలను పెంచేశారు. – రహదారులకు పక్కన గ్రీనరీ పేరుతో లేని పనులను చూపిస్తూ అంచనాలను పెంచేశారు. – గ్రీనరీ కోసం మట్టి ఇతర ప్రాంతాల నుంచి తరలించి చూపిస్తూ అంచనాలను పెంచేశారు. – పక్కనే అనంతవరంలో క్వారీలు ఉండగా పేరేచర్ల నుంచి గ్రావెల్ తెచ్చినట్లు చూపిస్తూ అంచనాలను పెంచేశారు. – పక్కనే కృష్ణా నదిలో ఇసుక ఉంటే మరోచోట నుంచి తరలించినట్లు చూపిస్తూ అంచనాలను పెంచేశారు. – వరద నీరు, డ్రైనేజీ పనుల పరిమాణం పెంచేసినట్లు చూపిస్తూ అంచనాలను పెంచేశారు. – పవర్ యుటిలిటీ డక్ట్ పనుల పరిమాణం పెంచేసినట్లు చూపిస్తూ అంచనాలను పెంచేశారు. -
3,285 కిలో మీటర్లు
సాక్షి, అమరావతి: ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై)లో కేంద్ర– రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 3,285 కిలో మీటర్ల పొడవున కొత్తగా గ్రామీణ లింకు రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అయ్యే వ్యయంలో 60 శాతం కేంద్ర ప్రభుత్వం, మిగిలిన 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. పీఎంజీఎస్‌వై మూడో దశ అమలులో భాగంగా కేంద్రం దేశవ్యాప్తంగా లక్షా 25 వేల కిలోమీటర్ల గ్రామీణ లింకు రోడ్ల నిర్మాణానికి ముందుకొచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి 3,285 కిలోమీటర్ల పొడవు రోడ్లను మంజూరు చేసింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ జిల్లాల వారీగా పనులు గుర్తించే ప్రక్రియ మొదలైందని ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ సుబ్బారెడ్డి చెప్పారు. పనుల గుర్తింపు ప్రక్రియతో పాటు ఆయా పనుల నిర్మాణానికి అయ్యే అంచనాలను కూడా సిద్దం చేయాలని జిల్లా ఎస్ఈలను ఆదేశించినట్టు తెలిపారు. 13 జిల్లాల్లో దాదాపు 650 కొత్త రోడ్లు ఈ కార్యక్రమంలో చేపట్టే అవకాశం ఉందన్నారు. మొత్తం రూ.1,971 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేస్తున్నామని.. ఇందులో రూ.1,314 కోట్లు కేంద్రం మంజూరు చేసే అవకాశం ఉందన్నారు. అక్టోబరు 15 కల్లా పనుల అంచనాలతో కూడిన ప్రతిపాదనలను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ కేంద్రానికి పంపనుంది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మరో 535 కిలోమీటర్ల పనులు రాష్ట్రంలో తీవ్రవాద ప్రభావిత జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో మరో 535 కిలోమీటర్ల రోడ్డు పనులు కూడా మంజూరయ్యాయి. ఈ ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా 4 జిల్లాల్లో 62 రోడ్డు పనులు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ కొత్తగా చేపడుతుంది. ఇందులో విశాఖ జిల్లాకే 44 పనులు మంజూరయ్యాయి. రూ.320 కోట్లు ఖర్చు అవుతుందని పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ఇందులో రూ.192 కోట్లు కేంద్రం రాష్ట్రానికి నిధులిస్తోంది. -
రూ.వేయి కోట్లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ఈ బడ్జెట్లో రూ.వేయి కోట్లు కేటాయించాలని ఆర్టీసీ ప్రభుత్వాన్ని కోరింది. కొత్త బస్సులు కొనుగోలు చేసి చాలా కాలం గడిచిపోయినందున, సత్వరం బస్సుల కొనుగోలుకు నిధులు ఇవ్వాలని కోరింది. బస్‌పాస్‌ల రాయితీకి సంబంధించి రీయింబర్స్‌మెంటు కోసం రూ.600 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుతో తీసుకున్న బ్యాంకు రుణం తిరిగి చెల్లింపునకు సంబంధించి రూ.200 కోట్లు, కొత్త బస్సుల కొనుగోలు కోసం రూ.150 కోట్లు, ఇతర ఖర్చులు కలిపి మొత్తం రూ.వేయి కోట్లు కేటాయించాలని ఆర్టీసీ ఆర్థిక శాఖకు ప్రతిపాదించింది. గత ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్లో ప్రభుత్వం ఆర్టీసీకి రూ.525 కోట్లు ప్రకటించింది. కానీ ఇప్పటివరకు రూ.30 కోట్లు మించి అదనంగా విడుదల చేయలేదని సమాచారం. గడచిన రెండు నెలలుగా వేతనాలు చెల్లించేందుకు ఆర్టీసీ వద్ద నిధులు లేకపోవటంతో ప్రభుత్వం బకాయిపడ్డ బస్‌పాస్ రాయితీ రీయింబర్స్‌మెంటు నిధుల నుంచి రూ.200 కోట్లు విడుదల చేసింది. గతేడాది సాధారణ బడ్జెట్లో రూ.960 కోట్లు కేటాయించినా, మొత్తం నిధులు మాత్రం ఆర్టీసీకి అందలేదు. ఈసారి ప్రకటించిన నిధులతోపాటు పాత బకాయిలు కూడా ఇవ్వాలని కోరింది. కొత్త మంత్రికి కొత్త ఛాంబర్.. కొత్త సచివాలయ నిర్మాణానికి ప్రస్తుత సచివాలయ భవనాలను ఖాళీ చేయటంతో మంత్రులకు వివిధ ప్రాంతాల్లో కార్యాలయాలు కేటాయించిన విషయం తెలిసిందే. రోడ్లు భవనాల శాఖతోపాటు రవాణా శాఖను పర్యవేక్షించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఎర్రమంజిల్‌లోని రోడ్లు భవనాల శాఖ ఈఎ న్సీ కార్యాలయంలో ఛాంబర్ ఇచ్చారు. తాజా విస్తరణలో రవాణా శాఖను అజయ్‌కుమార్‌కు కేటాయించటంతో రవాణా శాఖ కార్యాలయంతోపాటు బస్‌భవన్‌లో కొత్త ఛాంబర్ ఏర్పాటును అధికారులు పరిశీలిస్తున్నారు. -
గ్రహణం వీడేనా..?
సాక్షి, పాల్వంచ : కిన్నెరసాని అభయారణ్యం పరిధిలో డబుల్ రోడ్డు నిర్మాణానికి వైల్డ్‌లైఫ్ శాఖాధికారులు అనుమతి నిరాకరించారు. అభయారణ్యాల పరిధిలో ప్రస్తుతం ఉన్న రహదారుల కంటే ఒక్క ఇంచు కూడా ఎక్కువ విస్తీర్ణంలో వేయడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో రెండేళ్ల క్రితం మంజూరైన డబుల్ రోడ్డు పనులకు మంగళం పాడారు. ఇక్కడ సింగిల్ రోడ్డు నిర్మాణానికి కసరత్తు చేస్తున్నా.. అందులోనూ జాప్యం జరుగుతోంది. కిన్నెరసాని అభయారణ్యం పరిధిలో పాల్వంచ మండలం రాజాపురం నుంచి ఉల్వనూరు, చండ్రాలగూడెం మీదుగా కొత్తగూడెం మండలంలోని మైలారం నుంచి కొత్తగూడెం క్రాస్ రోడ్డు వరకు రూ.62 కోట్ల వ్యయంతో 2016లో డబుల్ రోడ్డు మంజూరైంది. అయితే 51 కిలోమీటర్ల ఆర్అండ్బీ రహదారి విస్తరణ పనులకు వైల్డ్‌లైఫ్ శాఖ ద్వారా అనుమతులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. అభయారణ్యంలో రోడ్డు విస్తరణకు ఆ శాఖ అనుమతి నిరాకరించింది. దీంతో రాజాపురం నుంచి ఉల్వనూరు వరకు రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ రాజాపురం నుంచి రోడ్డు విస్తరణ పనులు చేపడుతుండగా గత ఏడాది మే లో వైల్డ్‌లైఫ్ శాఖా అధికారులు నిలిపివేశారు. ప్రమాదకరంగా కల్వర్టులు... రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా రహదారి పొడవునా కల్వర్టులు కూడా నిర్మించారు. అయితే రోడ్డుకు కల్వర్టులు ఎత్తుగా ఉండడంతో వర్షాకాలంలో రాకపోకలకు ప్రమాదకరంగా మారాయని వాహనదారులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఉల్వనూరు గ్రామ సమీపంలో, మల్లారం క్రాస్ రోడ్డు నుంచి రోడ్డుపై కంకర తేలి గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా తయారైంది. రోడ్డు నిర్మాణ పనులు గత జూలైలో నిలిచిపోగా.. విస్తరణ అనుమతులు కోసం ఆర్అండ్బీ అధికారులు కేంద్రం అనుమతి కోసం ఢిల్లీకి ప్రతిపాదనలు పంపారు. సంబంధిత అధికారులతో పలుమార్లు చర్చలు కూడా జరిపారు. అయినా విస్తరణ పనులకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. దీంతో చండ్రాలగూడెం నుంచి మైలారం వరకు వైల్డ్‌లైఫ్ పరిధిలో లేని ప్రాంతంలో 8 కిలోమీటర్ల వరకు మాత్రమే రోడ్డు నిర్మించారు. 30 కిలోమీటర్ల మేర పనులు నిలిపివేశారు. అయితే పాత రోడ్డుకు కూడా తమ అనుమతులు లేవని వైల్డ్‌లైఫ్ శాఖ అధికారులు అంటున్నారు. మరి అప్పుడు అనుమతి లేకుండా రహదారి నిర్మాణం ఎలా చేపట్టారనేది చర్చనీయాంశంగా మారింది. సింగిల్ రోడ్డు నిర్మిస్తాం మండల పరిధిలోని రాజాపురం నుంచి ఉల్వనూరు వరకు, చండ్రాలగూడెం నుంచి మైలారం వరకు 51కిలోమీటర్లు వైల్డ్‌లైఫ్ శాఖ పరిధిలో నిర్మించాల్సిన డబుల్ తారు రోడ్డు విస్తరణ పనులకు అనుమతులు ఇవ్వడం లేదు. దీంతో రెండు సంవత్సరాలుగా పనులు నిలిచిన మాట వాస్తవమే. అనేక సార్లు ఢిల్లీకి వెళ్లి వైల్డ్‌లైఫ్ శాఖ అధికారులతో మాట్లాడినా, ప్రభు త్వం ద్వారా ప్రతిపాదనలు పంపినా వారు అనుమతి ఇవ్వడానికి నిరాక రించారు. చివరికి పాత సింగిల్ రోడ్డును పునరుద్ధరించాలనే ఆలోచనలో ఉన్నాం. అందుకోసం ఎస్ఈకి ప్రతిపాదనలు పంపాం. అక్కడి నుంచి అనుమతి వచ్చాక, వర్షాలు తగ్గిన తర్వాత రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిస్తాం. – రాజేశ్వరరెడ్డి, ఆర్అండ్బీ ఈఈ -
కాంక్రీట్ నుంచి ఇసుక!
సాక్షి, హైదరాబాద్: పది భారీ బ్లాకులతో కూడిన సచివాలయ పాత భవనాలను కూలిస్తే వందల టన్నుల్లో కాంక్రీట్ వ్యర్థాలు ఉత్పన్నం కాబోతున్నాయి. వాటిని ఏం చేస్తారు? కొత్త సచివాలయ నిర్మాణానికి భారీ స్థాయిలో ఇసుక అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఇసుక కొరత తీవ్రమవుతున్న నేపథ్యంలో దానిని ఎక్కడ నుంచి తెస్తారు? ఆ వ్యర్థాలనే ఇసుకగా మార్చి ఉపయోగిస్తే.. రెండు సమస్యలూ పరిష్కారమవుతాయి కదా? ఇప్పుడు ఆ దిశగానే అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. కొత్త సచివాలయ నమూనా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఆకృతిలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆది నుంచి ఇష్టపడే అరబ్ నిర్మాణ శైలిలో కనిపించే గుమ్మటం డిజైన్‌తో అది ఉంటుందని దాదాపుగా స్పష్టమైంది. 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితం కాబోయే కొత్త సచివాలయ భవన సముదాయం ఆధునిక హంగులతో ఉండనుంది. భవనంలో ఆధునికత ఉండటంతోపాటు నిర్మాణంలో కూడా ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించబోతున్నారు. ఇందులో భాగంగా పాత భవనాలను కూచ్చివేయగా వచ్చే వ్యర్థాలను పునర్వినియోగించాలని యోచిస్తున్నారు. వ్యర్థాలను పొడి చేసి... ప్రపంచవ్యాప్తంగా ఇసుకకు కొరత ఏర్పడుతోంది. కాంక్రీట్ నిర్మాణాలు శరవేగంగా తీవ్ర మవుతుంటంతో ఇసుక వాడకం బాగా పెరిగింది. ఇష్టం వచ్చినట్టు ఇసుకను తోడేస్తుండటంతో నదీగర్భం దెబ్బతిని నదుల ఉనికికే ప్రమాదం ఏర్పడుతోంది. అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే ఇసుకకు ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తీసుకురాగా, మనదేశంలో ఇప్పటివరకు ఆ దిశగా పూర్తిస్థాయి ప్రయత్నాలు మొదలుకాలేదు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొన్ని నగరాల్లో మాత్రం ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి కొన్ని ప్రత్యామ్నాయ పద్ధతులు అనుసరిస్తున్నారు. భవనాలను కూల్చివేసినప్పుడు వచ్చే కాంక్రీట్ వ్యర్థాలను ఇసుకగా మార్చడం వీటిలో ఒకటి. ఈ వ్యర్థాలను ఇసుకలాగా పొడి చేస్తారు. కొత్త నిర్మాణాల్లో దానినే ఇసుకగా వినియోగిస్తారు. అయితే పూర్తిగా దాన్నే ఇసుక బదులు వాడితే నిర్మాణాలు అంత పటుత్వంగా ఉండవన్న అభిప్రాయాలున్నాయి. దీంతో 15 శాతం నుంచి 20 శాతం వరకు అసలు ఇసుకను తగ్గించి ఈ పొడిని వాడొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణ ఇసుకలో అంత పరిమాణం మేర ఈ వ్యర్థాల పొడిని కలిపి నిర్మాణాల్లో వినియోగిస్తున్నారు. కొత్త సచివాలయ నిర్మాణంలో కూడా ఈ విధానాన్ని అనుసరించాలని అధికారులు యోచిస్తున్నారు. ఫ్లోరింగ్ పనులకు పూర్తిగా వినియోగం.. ప్రధాన నిర్మాణంలో 20 శాతానికి మించకుండా పాత కాంక్రీట్ వ్యర్ధాల పొడిని ఇసుకలో కలిపి వాడుతున్నా, ఇతర పనులకు మాత్రం వంద శాతం ఆ వ్యర్ధాల పొడినే ఉపయోగిస్తున్నారు. ఫ్లోరింగ్, టైల్స్ వేసేచోట, ఫుట్‌పాత్‌లు, కాంపౌండ్ వాల్ సహా బయటి గోడల నిర్మాణం తదితర పనుల్లో ఈ పొడినే వాడుతున్నారు. దీనివల్ల మొత్తం నిర్మాణ వ్యయంలో దాదాపు 40 శాతం వరకు ఇసుక వాడకం తగ్గుతుంది. అంతమేర ఖర్చు ఆదా కావడంతోపాటు నదులకు కూడా రక్షణ ఏర్పడుతుంది. కొత్త సచివాలయ నిర్మాణంలో కూడా ఈ పద్ధతిని అనుసరిస్తే ఈ రెండు లాభాలు కలగనున్నాయి. ప్రస్తుతం పాత సచివాలయంలో పది భారీ భవనాలున్నాయి. వాటిని కూలి్చవేస్తే వందల టన్నుల కాంక్రీట్ వ్యర్థాలు వస్తాయి. అంత భారీ మొత్తంలో వచ్చే వ్యర్థాలను ఏమీ చేయలేమని, వాటితో నగర శివార్లలో ఉన్న భారీ క్వారీ గుంతలను పూడుస్తామని గతంలో ఓ అధికారి వివరించారు. కానీ కొంతకాలంగా హైదరాబాద్‌లో కూడా భవన వ్యర్థాలను పునర్వినియోగించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు ప్రారంభించింది. అందుకు సంబంధించి కొన్ని యూనిట్లను కూడా మొదలుపెట్టింది. చెన్నై, బెంగళూరు, కొచ్చి వంటి దక్షిణ భారతదేశంలోని నగరాలతోపాటు ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, పుణె, అహ్మదాబాద్, గాందీనగర్, వడోదర వంటి చోట్ల భవనాల వ్యర్థాల రీసైక్లింగ్ ముమ్మరంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణంలోనూ ఈ విధానం అవలంబించాలని యోచిస్తున్నారు. ఈ మేరకు రోడ్లు భవనాల శాఖ సమాయత్తమవుతోంది. జీహెచ్ఎంసీతో కలిసి ఈ దిశగా ఏర్పాట్లు చేయనున్నట్టు సమాచారం. -
నడవాలంటే నరకమే..!
సాక్షి,మేడ్చల్‌జిల్లా: జిల్లాలో కొత్తగా ఏర్పడిన నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపాలిటీలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. మౌళిక సదుపాయాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు .గ్రామ పంచాయతీల నుంచి పట్టణాలుగా అప్‌గ్రేడ్ అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధి పథకాలు చేపట్టలేదు. అస్తవ్యçస్తమైనరోడ్లు, డ్రైనేజీలతో వర్షం వస్తే రహదారులు బురదమయంగా మారుతున్నాయి. డ్రైనేజీల పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. ఇంకా కొన్ని మున్సిపాలిటీల్లో మట్టి రోడ్లే దర్శనమిస్తున్నాయి. దీంతో పట్టణ ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, పాలక వర్గాలు ఏర్పాటు కాకపోవడంతో స్థానిక అధికారులు ఆడిందే ఆట ..పాడిందే పాట అన్నట్లుగా మారింది . కార్పొరేషన్లలోనూ అదే తీరు మేజర్ గ్రామపంచాయతీల విలీనంతో మున్సిపల్ కార్పొరేషన్లుగా మారిన బోడుప్పల్, పీర్జాదిగూడ ప్రాంతాల్లోనూ çసమస్యలు యథాతథంగా ఉన్నాయి. శివారు కార్పోరేషన్లకు దాదాపు ఐదేళ్లకు పైగా పాలకవర్గం లేక పోవటంతో అధికారులు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పీర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధి లో మేడిపల్లి, పర్వాతాపూర్, పీర్జాదిగూడ ప్రాంతాలు ఉండగా, బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో చెంగిచర్ల, బోడుప్పల్ ప్రాంతాలు ఉన్నాయి. నిజాంపేట్, జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దాదాపు ఐదు లక్షలపైగా ప్రజలు నివాసం ఉంటున్న ఆయా మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రజల నుంచి పన్నుల రూపేణా ఏటా రూ.130 కోట్లు వసూలు చేస్తున్న అధికారులు వసతులు కల్పించటంలో ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. దీంతో వాటి పరిస్థితి గ్రామానికి ఎక్కువ, పట్టణానికి తక్కువ అన్న చందంగా మారింది. పారిశుద్ధ్యం, చెట్ల పొదలు, దోమల బెడదతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పీర్జాదిగూడ, బోడుప్పల్ పరిధిలో మూసీ కాలువ కారణంగా దోమల బెడద తీవ్రంగా ఉంది. జవహర్‌నగర్‌కు ‘మిషన్ భగీరథ’ పథకం కింద ఇంటింటికి తాగునీరు సరఫరా చేస్తామని పాలకులు ఇచ్చిన హామీలు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. పలు కాలనీల్లో పైప్లైన్లు వేసినా ఇప్పటి వరకు చుక్కనీరు పంపిణీ చేయలేదు. యాప్రాల్ నుంచి దమ్మాయిగూడ, నాగారం వెళ్లే ప్రధాన రహదారిలో విద్యుత్ దీపాలు లేక నిత్యం అంధకారం అలుముకుంటోంది. జవహర్‌నగర్ ప్రధాన రహదారిని వెడల్పు చేసి సెంట్రల్ లైటింగ్‌ను ఏర్పాటు చేస్తామన్న ప్రజాప్రతినిధుల హామీ అమలుకు నోచుకోలేదు. బాలాజీనగర్, అంబేద్కర్‌నగర్ రోడ్డు ఇరుగ్గా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధ్వానంగా మున్సిపాలిటీలు మేడ్చల్ çమున్సిపాలిటీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో రహదారులు చిత్తడిగా మారుతున్నాయి. వర్షపు నీరు ఇళ్ల మధ్యన ఖాళీ స్థలాల్లోకి చేరుతుండటంతో మురికి కూపాలుగా మారుతున్నాయి. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. పారిశుధ్య నిర్వహణ లేకపోవడంతో గతవారం 20 మంది భవన నిర్మాణ రంగకార్మికులు అస్వస్థతకు గురయ్యారు. తూంకుంట మున్సిపాలిటీలోనూ ఎటు చూసినా గుంతలే కనిపిస్తున్నాయి. ఘట్కేసర్ మున్సిపాలిటీలో ఓఆర్ఆర్ జంక్షన్ వద్ద సర్వీస్ రోడ్డు, జాతీయ రహదారిపై ఘట్కేసర్ అండర్‌పాస్ నుంచి ఎన్‌ఎఫ్‌సీనగర్ రైల్వేవంతెన వరకు సర్వీస్ రోడ్డు నిర్మించాల్సిఉంది. జాతీయ రాహదారిపై ఘట్కేసర్ బైపాస్ రోడ్డు చౌరస్తా నుంచి ఎన్‌ఎఫ్‌సీనగర్ వంతెన వరకు సెంట్రల్ లైటింగ్ లేకపోవటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోచారం మున్సిపాలిటీలోనూ ఇంకా మట్టి రోడ్లే దర్శనమిస్తున్నాయి. నారపల్లి, ఇస్మాయిల్‌ఖాన్‌గూడ, అన్నోజిగూడ, పోచారం తదితర ప్రాంతాల్లోని కొత్త కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టలేదు. ïడ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీటి వసతి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు కారణ ంగా ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్‌గూడ, కుందన్‌పల్లి, రాంపల్లి గ్రామాల ప్రజలు తరచూ అస్వస్థతకు గురవుతున్నారు. అన్నీ మట్టి రోడ్లే పోచారం మున్సిపాలిటీ పరిధిలో చాలా వరకు మట్టి రోడ్లే ఉన్నాయి. నారపల్లి, ఇస్మాయిల్‌ఖాన్‌గూడ, అన్నోజిగూడ, పోచారంలో కొత్త కాలనీల్లో సీసీ రోడ్లు నిర్మించాలి. వీటితో పాటు డ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీటి వసతి కల్పించాలి. – వెంకన్న, ఎల్ఐజీ, పోచారం పారిశుధ్యంపై శ్రద్ధ చూపాలి మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణ, అంతర్గత రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కాలనీల్లో మట్టి రోడ్ల కారణంగా వర్షం పడితే ఇళ్ళ నుండి ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. – మహిపాల్‌రెడ్డి నడవలేక పోతున్నాం చిన్నపాటి వర్షానికే నడవలేని పరిస్ధితి నెలకొంది. కార్పొరేషన్‌గా అభివృద్ధి చేసినా ఇప్పటి వరకు ఒక్క రోడ్డు కూడా వేయలేదు. – కొత్తకొండ వేణు, జవహర్‌నగర్ -
ముహూర్తం.. శ్రావణం!
సాక్షి, హైదరాబాద్: శ్రావణ మాసం... శుభకార్యాలకు మంచి తరుణంగా భావిస్తారు. మరో వారం రోజుల్లో మొదలుకానున్న ఈ మాసంలో కొత్త సచివాలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు శ్రావణ మాసంలోనే కొత్త సచివాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. అయితే నెల రోజుల్లో పనులు ప్రారంభించడం అంత సులభం కానప్పటికీ, మంచి రోజులు కావటంతో ఏదో ఒక పనితో సచివాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. మరో నెల రోజుల్లో ప్రస్తుత సచివాలయం పూర్తిగా ఖాళీ కానుంది. ఎక్కువ కార్యాలయాలకు తాత్కాలిక నెలవు కానున్న బూర్గుల రామకృష్ణారావు భవనం దాదాపు ఖాళీ అయింది. ఇందులోకి సచివాలయం తరలాల్సి ఉన్నందున, అందుకు తగ్గట్లుగా రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో మరమ్మతులు ప్రారంభించారు. మిగతా కార్యాలయాలు కూడా ఖాళీ అయ్యాక భవనానికి రంగులు వేసి ఈ పనులు పూర్తి కాగానే సచివాలయ కార్యాలయాలను తరలించనున్నారు. శ్రావణమాసం ప్రారంభంలోనే ఈ తరలింపు మొదలుపెట్టి వీలైనంత తొందరగా పూర్తి చేసి కొత్త సచివాలయ భవన నిర్మాణ పనులు మొదలుపెట్టాలని నిర్ణయించారు. సచివాలయ భవనం ఎలా ఉండాలన్నది మరో 15 రోజుల్లో తేలుతుంది. -
కొత్త సచివాలయానికి 8 నమూనాలు
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయ భవనం కోసం అధికారులు ఎనిమిది నమూనాలతో కుస్తీ పడుతున్నారు. తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా డిజైన్లు కావాలంటూ రోడ్లు భవనాలశాఖ ఇటీవలే దేశవ్యాప్తంగా పేరున్న 20 మంది ఆర్కిటెక్ట్‌లకు లేఖలు రాయడం తెలిసిందే. వారి నుంచి వచ్చిన నమూనాలను సచివాలయం, అసెంబ్లీ భవన నిర్మాణాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ పరిశీలిస్తోంది. గతంలో తమిళనాడుకు చెందిన ఓ ఆర్కిటెక్ట్ స్వచ్ఛందంగా పంపిన నమూనా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆకట్టుకుంది. గుమ్మటాలతో ఉన్న ఆ నమూనాకు దగ్గరగా ఉండే డిజైన్‌ను సిద్ధం చేయాలని అప్పట్లోనే ఆయన అధికారులను ఆదేశించారు. ఆ నమూనాను జతచేస్తూ ఆ తరహాలో నూతన సచివాలయ డిజైన్ ఉండాలని అధికారులు అర్కిటెక్ట్‌లకు లేఖలు పంపారు. గతంలో ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ సచివాలయానికి సంబంధించి మూడు నమూనాలు పంపారు. అందులో రెండు ప్రస్తుతం సచివాలయం ఉన్న చోటే నిర్మించాలని భావించినప్పుడు వేసినవి కాగా, మరొకటి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పక్కనున్న బైసన్ పోలో గ్రౌండ్లో నిర్మించాలని యోచించినప్పుడు వేసింది. ఈ మూడు కూడా బాగానే ఉన్నాయని ముఖ్యమంత్రి అప్పట్లో పేర్కొన్నారు. ఇప్పుడు వీటికి కొన్ని మార్పుచేర్పులు సూచిస్తూ ఆయన మరో డిజైన్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ నమూనాల్లో మెరుగ్గా ఉన్న కొన్నింటిని ఎంపిక చేసి టెక్నికల్ కమిటీ మంత్రివర్గ ఉపసంఘానికి నివేదించనుంది. వాటిని మంత్రులు పరిశీలించి మళ్లీ మార్పుచేర్పులు అవసరమైతే చేసి ముఖ్యమంత్రికి అందివ్వనున్నారు. ఆయన చెప్పే సలహాల ఆధారంగా మార్పులు అవసరమనుకుంటే చేసి తుది నమూనా ప్రకారం టెండర్లు పిలవనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుత సచివాలయ భవనాల పటుత్వం ఎలా ఉందన్న అంశాన్ని టెక్నికల్ కమిటీ ఇటీవలే పరిశీలించింది. ఆ భవనాలు పరిశీలించిన నిట్ డైరక్టర్ వాటి పటుత్వంపై ‘అంచనా’వేశారు. అగ్నిప్రమాదాల సమయంలో ఆ భవనాలు ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు పేర్కొనగా తాజా పరిశీలనలో అధికారులు గుర్తించిన వివరాలతో నివేదిక రూపొందించి మంత్రివర్గ ఉపసంఘానికి అందివ్వనున్నారు. -
రోడ్ల ఉపరితల నిర్మాణంలో నవశకం
సాక్షి, హైదరాబాద్: రోడ్ల ఉపరితల నిర్మాణ డిజైన్లలో అనుసరించాల్సిన నూతన పద్ధతులతోపాటు ఉపరితల నాణ్యతను కచ్చితంగా అంచనా వేసే విధానాన్ని ఐఐటీ హైదరాబాద్ పరిశోధక బృందం రూపొందించింది. సాంప్రదాయక రోడ్డు నిర్మాణ పద్ధతులతో వీటిని సరిపోల్చిన పరిశోధకులు నూతన విధానం ఆచరణ సాధ్యమని వెల్లడించారు. వీరి పరిశోధన ఫలితాలను ‘జర్నల్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్’అనే అంతర్జాతీయ జర్నల్ ప్రచురించింది. 2022 నాటికి దేశంలో 65 వేల కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులను నిర్మించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ నేపథ్యంలో ఐఐటీ (హెచ్) పరిశోధక బృందం రూపొందించిన నూతన నమూనా రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులకు ప్రయోజనకారిగా ఉంటుందని భావిస్తున్నారు. అమెరికా తర్వాత ప్రపంచంలో అత్యంత పొడవైన రోడ్ నెట్వర్క్ గల రెండో దేశంగా భారత్‌కు ప్రత్యేక స్థానం ఉంది. గణాంకాల పరంగా ప్రస్తుతం భారత్‌లో ప్రతీ వేయి మంది పౌరులకు సగటున 4.37 కిలోమీటర్ల పొడవైన రహదారులున్నాయి. వీటిలో జాతీయ, గ్రామీణ, అంతర్గత రహదారుల పేరిట అనేక రకాలైన రోడ్డు మార్గాలు ఉన్నాయి. 2 దశాబ్దాలుగా భారత్‌లో రహదారుల నిర్మాణం ఊపందుకోగా 2016 నుంచి 62.5 శాతం రహదారులకు సాంకేతిక పద్ధతిలో ఉపరితలం నిర్మించారు. ఉపరితల డిజైన్ కీలకం.. రోడ్ల నిర్మాణంలో ఉపరితల డిజైన్ అత్యంత సంక్లిష్లమైన ప్రక్రియ కాగా.. ట్రాఫిక్ రద్దీ, స్థానికంగా సహజంగా లభించే నిర్మాణ సామగ్రిని దృష్టిలో పెట్టుకుని డిజైన్ రూపొందించాల్సి ఉంటుంది. సుఖమయమైన ప్రయాణానికి వీలుగా అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఉపరితల నిర్మాణ డిజైన్‌ను ఇంజనీర్లు రూపొందిస్తారు. జారుడు స్వభావం లేకుండా, రాత్రివేళల్లో వాహనాల లైట్ల వెలుతురు పరావర్తనం చెందకుండా, శబ్ద కాలుష్యం తక్కువగా ఉండేలా రోడ్ల ఉపరితల నిర్మాణంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఎక్కువ కాలం మన్నేలా నాణ్యత కలిగిన రోడ్డు ఉపరితల నిర్మాణంతోపాటు, ఉపరితల నాణ్యతను కచ్చితంగా అంచనా వేసే విధానాలను రూపొందించడంపై ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు ముందడుగు వేశారు. పొరలతో కూడిన ఉపరితలం.. అనుసరణీయం నేలపై వివిధ రకాల నిర్మాణ సామగ్రితో నిర్మించే పొరలపై రహదారి ఉపరితల నాణ్యత ఆధారపడి ఉంటుందని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ శిరీష్ సారిడే నేతృత్వంలోని పరిశోధక బృందం గుర్తించింది. సంక్లిష్టమైన పొరలతో నిర్మించే రోడ్డు ఉపరితలం నాణ్యతను నేల స్వభావం, నిర్మాణ సామగ్రి, స్థానిక పర్యావరణ, వాతావరణ పరిస్థితులు, వాహన రద్దీ తదితర అంశాలు ప్రభావితం చేస్తాయని తేల్చారు. వీటన్నింటినీ అధిగమించి రోడ్డు ఉపరితలం వాహన భారాన్ని తట్టుకునేలా డిజైన్ చేయాల్సి ఉంటుంది. నాలుగు రకాల పొరలతో కూడిన రహదారి నిర్మాణంపై ఉపరితల నాణ్యత ఆధారపడి ఉంటుందని పరిశోధనలో తేల్చారు. సాధారణంగా రోడ్లను సబ్గ్రేడ్, గ్రాన్యులార్ సబ్ బేస్, బేస్, బిటుమినస్ అనే 4 రకాలైన పొరలతో నిర్మిస్తారు. వీటిలో బిటుమినస్ లేయర్ మందం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునే బేస్ లేయర్‌పైనే ఉపరితల నాణ్యత ఆధారపడి ఉంటుందని పరిశోధక బృందం గుర్తించింది. మరమ్మతులు కూడా సులభం అత్యంత దృఢమైన కాంక్రీట్‌తో నిర్మించే రహదారులు వాహన భారాన్ని నేరుగా మోయగలిగినా.. నిర్మాణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. పొరలతో కూడిన రహదారుల నిర్మాణంలో స్థానికంగా లభించే నిర్మాణ సామగ్రిని వినియోగించే వీలుండటంతోపాటు, దశలవారీగా పనులు చేసే వీలుంటుంది. మరమ్మతులు చేయడం కూడా సులభమని పరిశోధకులు తేల్చారు. తాము రూపొందించిన నూతన రోడ్డు డిజైన్‌ను ‘రిలయబిలిటీ బేస్డ్ డిజైన్ ఆప్టిమైజేషన్ (ఆర్‌బీడీవో)’గా వ్యవహరిస్తున్న పరిశోధక బృందం.. తమ పరిశోధన ఫలితాలను రహదారుల ఉపరితల డిజైన్లకు మార్గదర్శిగా భావించే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ హైవేస్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అఫీషియల్స్ (ఆష్తో) ప్రమాణాలతో పోల్చి చూశారు. ఆష్తో ప్రమాణాలతో పోలిస్తే తాము రూపొందించిన నూతన విధానం 10 నుంచి 40 శాతం మేర మెరుగ్గా ఉందని పరిశోధక బృందం సభ్యులు డాక్టర్ మునావర్ బాషా, పీఆర్టీ ప్రణవ్ వెల్లడించారు. -
రోడ్లకు తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: రోడ్లు, భవనాల శాఖ అద్భుతమైన పనితీరు చూపుతున్నా నిధులలేమితో ఈ ఏడాదంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరింత దిగజారేలా కనిపిస్తోంది. గతేడాది రూ.5,575 కోట్లు కేటాయించి ఈసారి రూ.2218.73 కోట్లతో సరిపెట్టింది. గతేడాది కాంట్రాక్టర్లకు చేసిన పనులకే బిల్లులు చెల్లించలేనంతగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. గత బడ్జెట్ లో రూ.5,575 కోట్లు కేటాయించినా వాస్తవానికి రూ.2,177 కోట్లు (ఇందులో రూ.1000 కోట్ల మేర అప్పులు) విడుదల చేసింది. మిగిలిన వాటికి అప్పు తెచ్చుకోమని చెప్పింది. మొత్తానికి ఈసారీ ఆర్ అండ్ బీకి అప్పులవేట తప్పేలా లేదు. ఈ నిధులపై ఆర్ అండ్ బీకి మరింత కష్టాలు తప్పవని శాఖ ఉద్యోగులూ వాపోతున్నారు. అద్దంలాంటి రోడ్లు ఉండాలన్న సీఎం నినాదం ఈ నిధులతో ఎలా సాకారమవుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్ర అవతరణ తర్వాత 3,155 కి.మీ.ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇందులో 1,388 కి.మీల మేర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించింది. మిగిలిన 1,767 కి.మీ.ల మేర రోడ్ల గుర్తింపును ఖరారు చేయాల్సి ఉంది. -
ఆర్ అండ్ బీకి కొత్త రుణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మళ్లీ అప్పులవేట ప్రారంభించింది. గతేడాది మొదలైన రూ.మూడు వేల కోట్ల అప్పుల కష్టాలు ఇంకా కొలిక్కిరాలేదు. ఆర్ అండ్ బీ తాజాగా మరో రూ.వెయ్యి కోట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 2018–19 ఆర్థిక ఏడాదిలో దాదాపు రూ.3 వేల కోట్ల అప్పు కోసం నానా తంటాలు పడిన ఆర్ అండ్ బీ కేవలం రూ.వెయ్యి కోట్ల వరకు అప్పు తెచ్చుకోగలిగింది. ప్రభుత్వ రద్దుతో మిగిలిన రూ.2 వేల కోట్ల రుణాలు సందిగ్ధంలో పడ్డాయి. ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడంతో అధికారులు రుణం కోసం తిరిగి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈసారి బ్యాంకులు కూడా ఆర్ అండ్ బీ కి రుణం ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. గతంలో రూ.వెయ్యి కోట్లు మంజూరు! ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్అండ్ బీకి కేటాయించిన రూ.5,600 కోట్లను పూర్తి స్థాయిలో విడుదల చేయలేదు. ఆర్ అండ్ బీ పరిధిలో ఈ ఏడాది రూ.20 వేల కోట్లకుపైగా విలువైన పనులను కాంట్రాక్టర్లు చేపట్టారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోగా.. రూ.మూడు వేల కోట్లు బ్యాంకు రుణం కోసం ప్రయత్నించాలని, పూచీకత్తు ఇస్తానని ప్రభుత్వం సలహా ఇచ్చింది. దీంతో అధికారులు బ్యాంకు రుణాల కోసం తిరిగారు. ఆంధ్రాబ్యాంకు నేతృత్వం లోని 4 బ్యాంకులు కన్సార్టియంగా ఏర్పడ్డా యి. ఆంధ్రాబ్యాంకు దాదాపు రూ.వెయ్యి కోట్లు, మిగిలిన బ్యాంకులు రూ.2 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించాయి. ఆంధ్రాబ్యాంకు రూ.750 కోట్లు, విజయ బ్యాంకు రూ. 250 కోట్లు రుణం మంజూరు చేశాయి. ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో మిగిలిన రుణం మంజూరు విషయంలో బ్యాంకులు వెనుకంజ వేశాయి. అదేసమయం లో కాంట్రాక్టర్ల బకాయిలు పెరిగిపోసాగాయి. దీంతో అక్టోబర్ మొదటివారంలో తెలంగాణ బిల్డర్ల అసోసియేషన్ పనులు నిలిపివేసింది. దీంతో చర్చలకు పిలిచిన ప్రభుత్వం వారికి తొలివిడతగా రూ.5,600 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో కాంట్రాక్టర్లు తిరిగి పనులు మొదలుపెట్టారు. నవంబర్ వచ్చినా వారికి ఆ నిధులు అందలేదు. దీంతో రెండోసారి సమ్మె యోచన చేశారు కాంట్రాక్ట ర్లు. చివరికి ఇటీవల సీఎస్ రూ.10 కోట్లు మంజూరు చేసి, రూ.10 లక్షల్లోపు బిల్లులకు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె ఆలోచనను విరమించుకున్నారు. ఫిబ్ర వరి వచ్చినా కాంట్రాక్టర్ల బకాయిలు చెల్లింపుల్లో పెద్దగా మార్పు రాలేదు. తాజాగా వీరికి అప్పు ఇచ్చేందుకు ఆంధ్రాబ్యాంకు అధికారులు ప్రధాన శాఖకు అనుమతి కోసం లేఖ రాశారని తెలిపారు. ఈ లేఖకు ఆంధ్రాబ్యాంకు ప్రధాన కార్యాలయం ఆమోదం తెలపగానే వీరికి రూ.వెయ్యి కోట్లు విడుదలవుతాయని ఆర్ అండ్ బీ అధికారులు వివరించారు. నెలాఖరుకు నిధులు: ఆర్ అండ్ బీ శాఖకు ఇంకా మంత్రిని నియమించలేదు. నెలాఖరున ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక విభాగం వీరికి నిధులు మంజూరు చేసే పనిని పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
కాసులు లేక..కదలని రోడ్ల పనులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్లు భవనాల శాఖకు నిధుల సమస్య తలెత్తుతోంది. ప్రస్తుతం తక్షణావసరంగా ఆర్ అండ్ బీకి కనీసం రూ.2000 కోట్లయినా అవసరమని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం పాత బకాయిలను చెల్లించకుండానే ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో కాంట్రాక్టర్లు గందరగోళంలో పడ్డారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక అయినా తమకు నిధుల కొరత తీరుతుందని అటు అధికారులు, ఇటు కాంట్రాక్టర్లు భావించారు. అయితే వాటిపై ఎలాంటి కదలికా లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు కాంట్రాక్టర్లు బ్యాంకర్ల నుంచి తెచ్చిన అప్పుల కోసం నోటీసులు వస్తున్నాయని బెంబేలెత్తున్నారు. ఈ కారణంగా వారు పలు చోట్ల రోడ్డు పనులను నిలిపేస్తున్నారు. తమ వద్ద తారు కొనుగోలుకు కూడా డబ్బులు లేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వీరి పెండింగు బిల్లుల విషయంలో రోడ్లు భవనాల శాఖ అధికారులు నోరు విప్పలేని పరిస్థితిలో ఉన్నారు. సకాలంలో డబ్బులు కట్టకపోతే టిప్పర్లు, లారీలు ఇతర సామగ్రిని సైతం సీజ్ చేసి తీసుకెళతామని బ్యాంకు అధికారులు తమను హెచ్చరిస్తున్నారని కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. రుణానికి ప్రభుత్వమే పూచీకత్తు.. వాస్తవానికి 2018–19 బడ్జెట్లో ఆర్ అండ్ బీకి వాస్తవానికి రూ.5,600 కోట్లు కేటాయించింది. ఆ మేరకు నిధులు విడుదల జరగలేదు. సంక్షేమ పథకాల నిర్వహణకు ఆ శాఖ నిధులను ప్రభుత్వం మళ్లించిందని సమాచారం. మరోవైపు దాదాపు ఈ శాఖ పరిధిలో దాదాపు రూ.20వేల కోట్లకుపైగా పనులను వివిధ కాంట్రాక్టర్లకు అప్పగించింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయక పోవడంతో వీరికి బిల్లులు విడుదల జరగలేదు. దీంతో ఒక దశలో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. దీంతో రూ.3000 కోట్లు అప్పు తీసుకోమని ప్రభుత్వం సూచించింది. తానే పూచీకత్తు ఇస్తానని కూడా చెప్పింది. దీనికోసం పలు బ్యాంకుల చుట్టూ తిరిగిన ఆర్ అండ్ అధికారులు ఎట్టకేలకు ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంను ప్రసన్నం చేసుకోగలిగారు. మొత్తానికి రూ.వెయ్యి కోట్లు వచ్చాయి. కానీ, ప్రభుత్వ రద్దుతో ఆ రూ.2000 కోట్లు సందిగ్ధంలో పడ్డాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా..రోడ్లు భవనాల శాఖ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో అప్పుపై బ్యాంకు లు మీమాంసలో పడ్డాయని సమాచారం. తక్షణం రూ.2వేల కోట్లు అవసరం... ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. అప్పు పుడుతుందనుకున్న అధికారుల ఆశలపై బ్యాంకులు నీళ్లు చల్లాయి. శాఖ ఆర్థిక పరిస్థితి అంతగా ఆశాజనకంగా లేకపోవడంతో అప్పు ఇచ్చేందుకు వెనకాముందు ఆడుతున్నట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం నుంచి రూ.1000 కోట్లు విడుదల చేస్తే కానీ, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొందని అధికారులు అంటున్నారు. మరోవైపు బ్యాంకులు కనీసం వెయ్యి కోట్లు విడుదల చేస్తేనే పనులు ముందుకు కదులుతాయని స్పష్టంచేస్తున్నారు. గతంలో నూ పలుమార్లు చర్చలు జరిపినా.. గతంలో ప్రభుత్వం తరఫున అప్పటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కేటీఆర్ పలుమార్లు కాంట్రాక్టర్లతో చర్చలు జరిపారు. వారికి నిధులు విడుదల చేస్తామని ప్రతీసారి హామీలైతే ఇవ్వగలిగారు గానీ, అవి అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం రోడ్లు భవనాల శాఖకు మంత్రి కూడా లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇటు అధికారులు, అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికైనా బిల్లులు విడుదల చేయాలని కోరుతున్నారు. -
రోడ్డు లేదు..గ్రిడ్డూ లేదు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారులు దారుణ స్థితిలో ఉన్నాయి. వాస్తవానికి టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో రోడ్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అయితే ఇప్పుడు రహదార్ల అనుసంధానానికి రూ.6,500 కోట్లు కేటాయిస్తున్నామని హడావుడి చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఒక్క ప్రతిష్టాత్మక రోడ్డు ప్రాజెక్టునూ చేపట్టలేదు. రాజధాని అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం నుంచి అనంత–అమరావతి ఎక్స్‌ప్రెస్ వే వరకు అన్నీ ప్రకటనలుగానే మిగిలిపోయాయి. నెలకోమారు సమీక్షలు నిర్వహించడం మినహా ఇంతవరకు ఒక్క అంగుళం కూడా ముందుకు పడలేదు. రహదార్ల విస్తరణను పట్టించుకోకుండా మద్యం ఆదాయం కోసం ఏకంగా వాటి స్థాయిని తగ్గించడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏటా వచ్చే సెంట్రల్ రోడ్ ఫండ్ (సీఆర్ఎఫ్) దక్కడం లేదు. కృష్ణా, గోదావరి పుష్కరాలప్పుడు రోడ్ల నిర్మాణ పనులంటూ రూ.2 వేల కోట్ల వరకు కేటాయించారు. అయితే ఈ నిధులు అధిక శాతం అధికార పార్టీ నేతల జేబుల్లోకే వెళ్లాయి. నాసిరకంగా రోడ్లు వేయడంతో నెలల వ్యవధిలోనే పూర్తిగా పాడయ్యాయి. దీనిపై ఆర్‌అండ్‌బీలో క్వాలిటీ కంట్రోల్ విభాగం పనిచేస్తోందా? లేదా? అనే అనుమానాలు ఆర్అండ్బీ వర్గాలే వ్యక్తం చేశాయి. టెండర్లు లేకుండా.. వివిధ నియోజకవర్గాల్లో సీఎం చంద్రబాబు పర్యటించినప్పుడు ఇచ్చిన రోడ్ల మరమ్మతులు, విస్తరణ హామీల పనుల విలువ రూ.1,250 కోట్ల వరకు ఉందని ఆర్అండ్బీ అంచనా వేసింది. టెండర్ విధానం ద్వారా కాకుండా నామినేషన్ విధానంలో పనుల్ని అప్పగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రహదార్ల నిర్వహణ, మరమ్మతుల పనులు విభజించి మొదటి విడతగా రూ.250 కోట్లను సర్కార్ కేటాయించింది. నిబంధనల ప్రకారం.. రూ.కోట్ల విలువైన పనుల్ని నామినేషన్ విధానంలో అప్పగించకూడదు. దీంతో రూ.10 లక్షల చొప్పున మరమ్మతుల పనులు విభజించి అయినవారికి అప్పగించేందుకు నిర్ణయించారు. తొలి విడతలో కేటాయించిన రూ.250 కోట్లను అనంతపురం, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలకు మంజూరు చేయాలని ఉన్నత స్థాయిలో ఆదేశాలు జారీ చేశారు. గోదావరి పుష్కరాలప్పుడు కూడా ఇదేవిధంగా నామినేషన్ విధానంలో రూ.700 కోట్ల రోడ్ల విస్తరణ, మరమ్మత్తుల పనులను తమవారికి అప్పగించారు. ముందుగానే తెలుసుకుని.. ప్రకాశం జిల్లాలో కనిగిరి–పొదిలి రహదారి విస్తరణకు 2016లో రాష్ట్ర ప్రభుత్వం రూ.13 కోట్లు ఇచ్చింది. ఈ రహదారిని జాతీయ రహదారిగా విస్తరిస్తారని ముందుగానే తెలుసుకుని అప్పటి ఆర్అండ్బీ మంత్రి శిద్ధా రాఘవరావు నిధులు విడుదల చేయించుకున్నారని ఆరోపణలున్నాయి. తూతూమంత్రంగా ఈ రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేసిన వెంటనే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. జాతీయ రహదారి– 565ని ప్రకటించింది. ఈ రహదారి తెలంగాణ పరిధిలోని నకిరేకిల్ (ఎన్‌హెచ్–65) నుంచి నల్గొండ, ఏపీలోని మాచర్ల, కనిగిరి, వెంకటగిరి మీదుగా ఏర్పేడు రోడ్డు వరకు వెళుతుంది. ఎన్‌హెచ్–565 ప్రకటించిన తర్వాత రూ.13 కోట్లతో విస్తరించిన కనిగిరి–పొదిలి రహదారిని పగులగొట్టి పది మీటర్ల వెడల్పుతో జాతీయ రహదారి ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించారు. దీంతో ఈ రహదారి విస్తరణకు వెచ్చించిన రూ.13 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది. అదేవిధంగా ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి పామూరు మీదుగా వైఎస్సార్ జిల్లా కడప, బద్వేలుకు వెళ్లే కందుకూరు–వలేటివారిపాలెం రోడ్డు విస్తరణకు మంత్రి శిద్ధా నిధులు మంజూరు చేయించుకున్నారు. 18 కిలోమీటర్ల రహదారి విస్తరణకు రూ.20 కోట్ల నిధులు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం.. వైఎస్సార్ జిల్లా మైదుకూరు నుంచి ప్రకాశం జిల్లా సింగరాయకొండ వరకు ఉన్న రహదారిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేసేందుకు దాన్ని ఎన్‌హెచ్–167బిగా గుర్తించింది. దీంతో మైదుకూరు నుంచి టేకూరుపేట, కోవిలంపాడు, పామూరు, వలేటివారిపాలెం, బడేవారిపాలెం, కందుకూరు, ఓగూరుల మీదుగా సింగరాయకొండ (ఎన్‌హెచ్–16) వద్ద ఈ రహదారి కలుస్తుంది. ఈ జాతీయ రహదారిని కేంద్ర ప్రభుత్వమే పది మీటర్ల వెడల్పుతో అభివృద్ధి చేసింది. రాష్ట్రప్రభుత్వం హడావుడిగా రూ.20 కోట్లతో చేపట్టిన పనుల నాణ్యత తీసికట్టులా తయారైంది. పైన తారు పూత.. లోపల కాసుల వేట రాష్ట్రంలో రహదార్ల మరమ్మతుల్లోనూ మతలబులు చోటు చేసుకున్నాయి. పై పైన తారు పూతతోనే కాంట్రాక్టర్లు రూ.కోట్లు దండుకున్నారు. నాలుగేళ్లలో రూ.1,422 కోట్లు ఖర్చు చేసి 16,280 కిలోమీటర్ల రహదార్లను మరమ్మతులు చేసినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. రోడ్ల మరమ్మతులకు ఆర్అండ్బీ ఏటా రూ.350 కోట్లకు పైగా వెచ్చిస్తోంది. వీటికి టెండర్లు నిర్వహించి కాంట్రాక్టు సంస్థలకు అప్పగిస్తోంది. అయితే మరమ్మతులు చేసిన రోజుల వ్యవధిలోనే రహదార్లపై మళ్లీ గుంతలు ఏర్పడుతున్నాయి. రూ.6,500 కోట్ల ప్రాజెక్టుపైనా కన్ను ఆర్ అండ్ బీ శాఖ ఇటీవలే 2 ప్రాజెక్టులకు ప్రతిపాదనలు రూపొందించింది. ఏపీ మండల కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు, ఏపీ రోడ్లు, వంతెనల రీ కనస్ట్రక్షన్ ప్రాజెక్టు (ఏపీఆర్‌బీఆర్‌పీ)లకు రూ.6,500 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఈ పనులపైనా కన్నేసిన సర్కారు పెద్దలు అస్మదీయులకు ఎన్నికల తాయిలాలుగా ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారు. తమ నియోజకవర్గాల్లో రోడ్ల మరమ్మతులు, విస్తరణ పనులకు కనీసం రూ.50 కోట్లు చొప్పున ప్రభుత్వం కేటాయించాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రోడ్ గ్రిడ్ అంటే.. రోడ్ గ్రిడ్ అంటే.. గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి జాతీయ రహదార్లకు అనుసంధానం పెంచడం. రోడ్ గ్రిడ్ ప్రాజెక్టుకు రూ.3,184 కోట్లు కేటాయిస్తున్నామని 2016లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే అప్పట్నుంచీ పైసా కూడా కేటాయించకుండా ఇప్పుడు రూ.6,500 కోట్లు అంటూ కొత్త పల్లవి అందుకుంది. అతీగతీ లేని ఔటర్‌రింగ్ రోడ్డు నూతన రాజధాని ప్రాంతం చుట్టూ ఔటర్‌రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్మాణం అంటూ ప్రభుత్వం భారీ ఎత్తున ప్రకటనలు గుప్పించింది. రూ.20 వేల కోట్ల ప్రాజెక్టు వ్యయంతో 189 కిలోమీటర్ల మేర కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ ఓఆర్ఆర్కు నాలుగేళ్ల క్రితమే ప్రతిపాదనలు రూపొందించినా నేటికీ అతీగతీ లేదు. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 84 గ్రామాల్లో 8,510 ఎకరాలు సేకరిస్తున్నామని హడావుడి చేయడం మినహా ఒక్క అంగుళం ముందుకు పడలేదు. -
రైతుబంధు..ఆర్ అండ్ బీకి నిధులు బందు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ (ఆర్అండ్బీ) నిధుల కటకటతో సతమతమవుతోంది. ఈ ప్రభావం వివిధ అభివృద్ధి పనులపై పడుతోంది.ఆర్అండ్ బీ నిధులను ‘రైతుబంధు’పథకానికి మళ్లించడంతోనే ఈ పరిస్థితులు తలెత్తాయని తెలుస్తోంది. ఆ విషయాన్ని సూటిగా చెప్పని ప్రభుత్వం రోడ్లు భవనాల శాఖను నిధుల కోసం బ్యాంకుల వద్ద అప్పు తీసుకోమని సూచించింది. ఆ యత్నానికి ముందస్తు ఎన్నికలు బ్రేకులు వేయడంతో ఆర్ అండ్ బీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కాంట్రాక్టర్లకు చెల్లింపులు ఆగడంతో వారు అధికారులపై ఒత్తిళ్లు పెంచుతున్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని వారి చుట్టూ తిరుగుతున్నారు. కొత్త పనులు ప్రారంభించినా... ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్అండ్ బీకి కేటాయించిన రూ.5,600 కోట్ల నిధులు సకాలంలోనే వస్తాయని భావించిన ఆ శాఖ అధికారులు ఏప్రిల్‌లో ఆర్థిక సంవత్సరం మొదలవగానే.. పాత బిల్లులతోపాటు కొత్త పనుల అప్పగింతకు ముందుకెళ్లారు. ఇలా ఈ ఏడాది దాదాపుగా రూ.20వేల కోట్లకుపైగా విలువైన పనులను కాంట్రాక్టర్లు చేపట్టారు. అదే సమయంలో ఆర్అండ్ బీకి ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం.. ఆర్‌అండ్‌బీకి నిధులురావని, రూ.3000 కోట్లు బ్యాంకుల నుంచి రుణం కోసం ప్రయత్నించమని అధికారులకు సలహా ఇచ్చింది. దీనికోసం అధికారులు ప్రయత్నిస్తే... ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలోని 4 బ్యాంకులు కన్సార్షియంగా ఏర్పడ్డాయి. ఈలోగా ముందస్తు ఎన్నికల వార్తల నేపథ్యంలో రుణం మంజూరుకు బ్యాంకులు వెనకంజవేశాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు ఇబ్బందుల్లో పడ్డారు. దీంతో అక్టోబరు తొలి వారంలోనే తెలంగాణ బిల్డర్ల అసోసియేషన్ పనులు నిలిపివేసింది. వారిని చర్చలకు పిలిచిన ప్రభుత్వం రూ.5,600 కోట్లు మంజూరుకు హామీ ఇచ్చింది. ఆ మేరకు వారు పనులు మొదలు పెట్టినా, నవంబరు ఆరంభం వరకూ నిధులు అందలేదు. ఈ విషయమై వారు పలుమార్లు సీఎస్, మంత్రి తుమ్మల, కేటీఆర్‌ల వద్ద చర్చలు జరిపినా పురోగతి రాలేదు. దీంతో వారు రెండోసారి సమ్మె యోచన చేశారు. చివరికి ఇటీవల సీఎస్ రూ.10 కోట్లు మంజూరు చేసి, రూ.10 లక్షల్లోపు బిల్లులకు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె వాయిదా వేశారు. సీఎం పేషీ నుంచే ఆదేశాలు..! వాస్తవానికి అక్టోబరులో ఆర్ అండ్ బీ అధికారులు ప్రభుత్వంతో పలుమార్లు సమావేశమయ్యారు. బ్యాంకులు రుణం ఇవ్వడం లేదని, ప్రభుత్వమూ నిధులు ఇవ్వకపోతే.. పరిస్థితి ఇబ్బందికరమని తేల్చిచెప్పారు. దీంతో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం నిధుల మంజూరుకు హామీ ఇచ్చింది. చివరికి నవంబరు తొలి వారంలో నిధులు రావడం లేదంటూ సీఎం పేషీ నుంచి ఆర్ అండ్ బీ అధికారుల నెత్తిన పిడుగులాంటి వార్త వచ్చి పడింది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆర్ అండ్ బీ శాఖకు రావాల్సిన నిధులను ‘రైతు బంధు ’పథకానికి బదిలీ చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ఇలా రోడ్లుభవనాల శాఖ చెల్లింపులకు చేతులెత్తేయాల్సిన పరిస్థితిలో పడింది. ఆశ్రయించిన బ్యాంకులూ ఎన్నికల నేపథ్యంలో వెనుకడుగు వేశాయి. ప్రస్తుతం ఈ ప్రభావం వివిధ అభివృద్ధిపనులపై ప్రభావం చూపుతోంది.పనులు చేసిన కాంట్రాక్టర్లూ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. -
నవంబరొచ్చినా.. నిధులు రాలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖను నిధుల కొరత వేధిస్తోంది. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టడంతో వారంతా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ప్రభుత్వ హామీతో కనీసం నవంబర్‌లోనైనా పరిస్థితి మారుతుందని ఆశించిన కాంట్రాక్టర్లకు మరోసారి నిరాశే మిగిలింది. దీంతో వారంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 20 వేల కోట్ల పనులను చేపట్టిన కాంట్రాక్టర్లకు తొలిదశలో రూ.6,500 కోట్లు చెల్లించాలని తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ మొదటివారంలో పనులు నిలిపివేసి తమ నిరసన తెలిపింది. ఈ నెలపై గంపెడాశలు.. గత నెల కాంట్రాక్టర్ల సమ్మెతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాంట్రాక్టర్ల అసోసియేషన్‌తో చర్చలు జరిపారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతోనూ చర్చలు జరిగాయి. అపుడు కాంట్రాక్టర్లకు స్పష్టమైన హామీ రాకపోయినా.. రూ.6,500 కోట్లు తొలి విడతగా బకాయిలు విడుదల చేస్తామని చెప్పడంతో నమ్మకంతో తిరిగి పనులు చేపట్టారు. అక్టోబర్ చివరి వారంలోనూ కాంట్రాక్టర్లు మంత్రి కేటీఆర్‌ను కలసి తమ సమస్యలను విన్నవించారు. అయినా పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు. బ్యాంకుల్లో, ప్రైవేటుగా కోట్ల రూపాయల మేర అప్పులు తెచ్చి మరీ తాము పనులు చేపట్టామని.. తీసుకున్న అప్పులకు వడ్డీలు కూడా కట్టలేకపోతున్నామని కాంట్రాక్టర్లు ఆవేదన చెందుతున్నారు. అప్పులిచ్చిన పలు ప్రైవేటు బ్యాంకులు నోటీసులు పంపుతున్నాయని వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే.. తమకు ఆత్మహత్యే శరణ్యమంటున్నారు. మరోసారి సమ్మె దిశగా... నవంబర్లోనూ నిధుల విడుదలపై స్పష్టత లేకపోవడంతో కాంట్రాక్టర్లు డైలమాలో పడ్డారు. అక్టోబర్ మొదటి వారంలో పనులు నిలిపివేసి నిరసన తెలిపిన కాంట్రాక్టర్లు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నారని సమాచారం. తమపై ఆర్థిక భారం పెరిగిపోతుండటంతో పనులు నిలిపి వేసే దిశగా కాంట్రాక్టర్లు యోచిస్తున్నట్లు తెలిసింది. అప్పుపై తేల్చని కన్సార్టియం.. ఈ ఏడాది రోడ్లు, భవనాల శాఖకు బడ్జెట్లో దాదాపుగా రూ.5,600 కోట్లు కేటాయించినా.. సరిగా విడుదల కాలేదు. దాదాపు రూ.3 వేల కోట్లు అప్పు తెచ్చుకోవాలని ప్రభుత్వమే ఆర్ అండ్ బీకి సలహా ఇవ్వడంతో అధికారులు అప్పుల వేటకు సిద్ధమయ్యారు. అంత పెద్ద మొత్తాన్ని ఒకే బ్యాంకు సర్దుబాటు చేయలేదు కాబట్టి అధికారుల వినతితో ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలో బ్యాంకుల కన్సార్టియం ఏర్పడింది. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంకుతోపాటు మరో రెండు బ్యాంకులు ఉన్నాయి. మే నెలలో ఈ కన్సార్టియం వీరికి అప్పులు ఇవ్వాలా? లేదా అన్న విషయంపై యోచనలో పడింది. కానీ, ఇప్పటికీ రుణం మంజూరు చేయలేదు. ఈలోపు ఇటు శాసనసభ రద్దు కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. -
రోడ్ల విస్తరణ నిధులు దారిమళ్లింపు..
సాక్షి, అమరావతి: ఏపీలో రోడ్ సెక్టార్ ప్రాజెక్టు కింద చేపట్టిన రోడ్ల విస్తరణ పనుల నిమిత్తం మంజూరు చేసిన నిధులు దారి మళ్లడంపై ప్రపంచ బ్యాంకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ ప్రభుత్వ పనితీరుపై ప్రపంచ బ్యాంకు కితాబిచ్చిందని ఆర్భాటంగా చెప్పుకునే చంద్రబాబు సర్కారుకు ఇది చెంప పెట్టులాంటిదే. ఈ విషయమై ప్రంపంచ బ్యాంకు ఇండియా ప్రతినిధి జార్జ్ ఏ కొరాసా ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఘాటుగా లేఖ రాశారు. ఏపీలో ఆరు ప్యాకేజీల కింద రోడ్ల విస్తరణ పనులు రోడ్ సెక్టార్ ప్రాజెక్టు కింద ఏపీలో ఆరు ప్యాకేజీలుగా చిత్తూరు–పుత్తూరు, మైదుకూరు–జమ్మలమడుగు, కర్నూలు–దేవనకొండ, పెడన–నూజివీడు–విస్సన్నపేట, కాకినాడ–రాజమండ్రి రోడ్ల విస్తరణ పనుల్ని దీర్ఘకాలంగా నిర్వహించాల్సిన కాంట్రాక్టులుగా (లాంగ్ టర్మ్ బేస్డ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్సు)పరిగణించి ప్రపంచ బ్యాంకు ఎనిమిదేళ్ల క్రితం రూ.1,400 కోట్లను రుణంగా మంజూరు చేసింది. 2015వ సంవత్సరం నాటికి ప్రాజెక్టు గడువు ముగించాలని సూచించింది. అయితే 2015నాటికి కేవలం చిత్తూరు–పుత్తూరు, మైదుకూరు–జమ్మలమడుగు ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యాయి. ఆరు ప్యాకేజీల్లో రెండు ప్యాకేజీలు పూర్తవగా, మిగిలిన నాలుగు ప్యాకేజీల పనులపై ప్రతిష్టంభన నెలకొంది. కాకినాడ–రాజమండ్రి రోడ్డు విస్తరణ పనుల నుంచి ఒప్పంద కాంట్రాక్టరు తప్పుకోవడంతో ప్రభుత్వం మళ్లీ ఈ పనిని ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచింది. పెడన–నూజివీడు–విస్సన్నపేట రోడ్డు విస్తరణలో జాప్యం జరుగుతోంది. ఈ రెండు ప్రాజెక్టు పనులు ఇంకా 20 శాతం కూడా పూర్తి కాలేదు. చివరగా ప్రపంచ బ్యాంకు ఈ ఏడాది డిసెంబరు 31ను ప్రాజెక్టు తుది గడువుగా నిర్ణయించింది. రూ.183.72 కోట్ల పనుల ఖర్చుపై తీవ్ర అభ్యంతరం ఈ రోడ్ల విస్తరణ పనుల్లో రూ.183.72 కోట్లను దారిమళ్లించారని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి సీఎస్‌కు రాసిన లేఖలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం సమర్పించిన లెక్కలు సరిగా లేవని అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతర్గత ఆడిట్ సరిగా లేదని, 2015 నుంచి చేసిన ఖర్చుపై వివరాలు పంపకపోవడాన్ని బట్టి చూస్తే ఏం సంకేతం ఇస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధి 2017–18 ఆర్థిక ఏడాదిలో ఈ రోడ్ల విస్తరణ పనులపై ‘కాగ్’ చేసిన ఆక్షేపణను తన లేఖలో ప్రస్తావించడం గమనార్హం. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద ఇచ్చిన రూ.57.87 కోట్లను ప్రాజెక్టు గడువు తీరేలోగా తిరిగి చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. భూ సేకరణ, పునరావాసం, పునర్నిర్మాణంపై అసంతృప్తి రోడ్ల ప్రాజెక్టుకు చేపట్టే భూ సేకరణ వల్ల నిర్వాసితులయ్యే వారికి పునరావాస, పునర్నిర్మాణ పనులపైనా ప్రపంచ బ్యాంకు అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండేళ్లుగా రోడ్ల విస్తరణ వల్ల నిర్వాసితులైన 800 కుటుంబాలకు పరిహారం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. కాకినాడ–రాజమండ్రి రహదారి విస్తరణ వల్ల 300 కుటుంబాలకు ఇంకా పరిహారం చెల్లించలేదు. ఇటీవలే ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం ఏపీలో రోడ్ల ప్రాజెక్టులను పరిశీలించింది. ఇప్పుడు సీఎస్‌కు ప్రపంచ బ్యాంకు ప్రతినిధి ఘాటుగా లేఖ రాయడం ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపుతోంది. -
ఆసియా బ్యాంకు అప్పుతో ఆరగింపు సేవ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పట్టపగలే ‘దారి’ దోపిడీ కొనసాగుతుంది. రూ.వేల కోట్ల విలువైన రోడ్ల నిర్మాణం పనుల టెండర్లను ప్రభుత్వ పెద్దలు తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకే కట్టబెట్టి, అంచనా వ్యయాలు పెంచేసి, భారీ ఎత్తున కమీషన్లు కొల్లగొడుతున్నారు. కేవలం రూ.50 లక్షల విలువైన పనికి కూడా రూ.40 కోట్ల విలువైన రోడ్ల పనులు చేసిన అనుభవం ఉండాలంటూ టెండర్ నిబంధనలు విధించడం వెనుక లోగుట్టు ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పిలిచే టెండర్లలో ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే 5 శాతానికి మించి(ఎక్సెస్) ధరను కోట్ చేసే అవకాశం కాంట్రాక్టర్‌కు ఉండదు. ప్రభుత్వ పెద్దలు స్వలాభం కోసం ఈ నిబంధనను పక్కనపెట్టారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎంతైనా అధికంగా కోట్ చేసుకోవచ్చంటూ అస్మదీయ కాంట్రాక్టర్లకు వెసులుబాటు ఇచ్చేశారు. రాష్ట్ర ఖజానాపై రూ.వందల కోట్ల అదనపు భారం మోపుతున్నారు. 15 నుంచి 30 శాతం ఎక్సెస్‌కు టెండర్లు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు(ఏఐఐబీ) నుంచి రూ.4,234 కోట్ల అప్పు తీసుకొస్తోంది. తొలుత రూ.3,575 కోట్ల విలువైన రహదారుల నిర్మాణం పనులకు టెండర్లు పిలిచారు. దాదాపు రూ.2,000 కోట్ల విలువైన పనులకు సింగిల్ టెండర్లు దాఖలయ్యాయి. ప్రభుత్వం నిర్ధారించిన ధర కంటే ఎంతైనా ఎక్సెస్ కోట్ చేయొచ్చంటూ వెసులుబాటు కల్పించడంతో కాంట్రాక్టర్లు పండగ చేసుకున్నారు. 15 నుంచి 30 శాతం అధిక ధరలను కోట్ చేశారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై దాదాపు రూ.500 కోట్ల అదనపు భారం పడుతోంది. ఈ సొమ్మంతా చివరకు ఎవరి జేబుల్లోకి చేరుతుందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. ప్యాకేజీల మాయ ఒక్కొక్క పనికి వేర్వేరుగా టెండర్లు పిలవాల్సి ఉండగా, ప్రభుత్వ పెద్దలు మాత్రం 200–300 పనులను కలిపి ఒక ప్యాకేజీగా మార్చేశారు. మొత్తం 2,440 పనులను 50 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. శ్రీకాకుళం జిల్లాలో రూ.360 కోట్లతో 493 కిలోమీటర్ల మేర 315 రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. మొత్తం 315 పనులను 4 ప్యాకేజీలుగా వర్గీకరించారు. విజయనగరం జిల్లాలో 156 పనులను 4 ప్యాకేజీలుగా, విశాఖ జిల్లాలో 73 పనులను 3 ప్యాకేజీలుగా, తూర్పు గోదావరి జిల్లాలో 109 పనులను 3 ప్యాకేజీలుగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 57 పనులను 3 ప్యాకేజీలుగా, కృష్ణా జిల్లాలో 58 పనులు 2 ప్యాకేజీలుగా, గుంటూరు జిల్లాలో 71 పనులు 2 ప్యాకేజీలుగా, ప్రకాశం జిల్లాలో 203 పనులను 4 ప్యాకేజీలుగా, నెల్లూరు జిల్లాలో 196 పనులను 3 ప్యాకేజీలుగా, చిత్తూరు జిల్లాలో 585 పనులను 8 ప్యాకేజీలుగా, వైఎస్సార్ జిల్లాలో 144 పనులను 3 ప్యాకేజీలుగా, కర్నూలు జిల్లాలో 139 పనులను 5 ప్యాకేజీలుగా, అనంతపురం జిల్లాలో 334 పనులను 6 ప్యాకేజీలుగా విభజించి, టెండర్లు పిలిచారు. ఈ టెండర్లను పది రోజుల క్రితం అధికారులు తెరిచారు. ఇందులో 18 ప్యాకేజీలకు మాత్రమే ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లు పోటీ పడ్డారని, 24 ప్యాకేజీలకు సింగిల్ టెండర్లు, 8 ప్యాకేజీలకు అసలు టెండర్లు దాఖలు కాలేదని అధికారులు చెబుతున్నారు. కేవలం ఒక్క ప్యాకేజీ మాత్రమే గరిష్టంగా ఐదు టెండర్లు దాఖలయ్యాయి. మొత్తంగా 47 మంది కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేసినట్లు సమాచారం. ఇప్పటిదాకా కేవలం టెక్నికల్ బిడ్లను మాత్రమే తెరిచారు. ప్రైస్ బిడ్లను తెరవాల్సి ఉంది. ముందే బహిర్గతం చేసిన ‘సాక్షి’ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ చేపట్టడానికి ముందే ఈ దోపిడీ తంతును ‘సాక్షి’ బట్టబయలు చేసింది. ‘అసియా బ్యాంకు అప్పు ఆరగింపునకే’ శీర్షికన ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అయినా అదంతా అబద్ధమని ప్రభుత్వ పెద్దలు బుకాయించారు. అధికారులతో ఖండన ప్రకటనలు ఇప్పించారు. ఈ పనులను ప్యాకేజీలుగా కాకుండా ఒక్కొక్క పనికి వేర్వేరుగా టెండర్లు నిర్వహించాలని కాంట్రాక్టర్లు కోరినా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. రూ.63 లక్షల పనిలో రూ.20 లక్షల కమీషన్లు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోని బంటుపల్లి మండలం నారాయణపురం గ్రామం నుంచి అక్కడికి సమీపంలో ఆర్అండ్బీ రహదారి వరకు 600 మీటర్ల పొడవున రూ.63 లక్షలతో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సాధారణంగా ఈ పని చేయడానికి పంచాయతీరాజ్ శాఖలో కాంట్రాక్టరుగా నమోదు చేసుకున్న వారందరికీ అర ్హత ఉంటుంది. కానీ, ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలంటే కాంట్రాక్టర్‌కు ఒక ఏడాదిలో రూ.40 కోట్ల విలువైన పని చేసిన అనుభవం ఉండాలని ప్రభుత్వం టెండర్ నిబంధనల్లో పేర్కొంది. దాంతో కేవలం ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లకే ఈ పని చేసేందుకు అర్హత దక్కింది. ఈ రోడ్డు నిర్మాణం పనికి అర్హత సాధించిన ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును ఉపయోగించుకుని 30 శాతం దాకా అధిక ధరను కోట్ చేశారు. అంటే రూ.63 లక్షల అంచనా వ్యయాన్ని రూ.80 లక్షల నుంచి 85 లక్షల దాకా పెంచేయనున్నారు. పెంచేసిన అంచనా వ్యయం రూ.20 లక్షలు ముఖ్యనేత, స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు కమీషన్లుగా దక్కనున్నాయి. -
నాలుగు ‘హారాల’కు ఓకే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హరితహారం కారణంగా ఆర్అండ్బీ శాఖ అధికారులు–జాతీయ రహదారుల నిర్వాహకుల (కన్షెషనర్ల) మధ్య నెలకొన్న వివాదం ముగిసింది. రవాణాశాఖ కమిషనర్ సునీల్‌శర్మ జోక్యంతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరింది. మొదట ఆర్అండ్బీ చెప్పినట్లుగా రోడ్డుకు ఇరువైపులా ఆరు వరుస (3+3)ల్లో కాకుండా.. చివరికి నాలుగు వరుస (2+2)ల్లో మొక్కలు నాటేందుకు కన్షెషనర్లు ముందుకు వచ్చారు. శుక్రవారం సచివాలయంలో సునీల్‌శర్మ వారితో మాట్లాడారు. అసలేం జరిగింది? రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారాన్ని తమ పరిధిలోని రోడ్లకు ఇరువైపులా విజయవంతంగా నిర్వహించాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. దీంతో రోడ్లు భవనాల శాఖ ఇందుకోసం దాదాపు రూ.20 కోట్ల నిధులను కేటాయించింది. జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్క లు నాటే విషయంలో కన్షెషనర్లు–ఆర్అండ్బీ అధికారుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. రహదారులకు ఇరువైపులా ఆరు వరుసల్లో మొక్కలు నాటేందుకు రోడ్లు భవనాల శాఖ సిద్ధమైంది. రెండు వరుసల వరకైతే తమకు అభ్యంతరం లేదని కన్షెషనర్లు చెప్పారు. దీనిపై మంత్రి తుమ్మల అసంతృప్తి వ్యక్తం చేశారు. కన్షెషనర్లపై కేంద్రమంత్రికి ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. సాధ్యం కాదన్న ఎన్హెచ్ఐఏ అధికారులు.. ఈ విషయంలో ఇరు వర్గాల మధ్య సమాచార మార్పిడి లోపంతోనే వివాదం చెలరేగింది. చివరికి ఈ విషయం మంత్రి తుమ్మల దాకా వెళ్లింది. ఈ విషయంపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఐఏ) ప్రతినిధులు ‘సాక్షి’కి స్పష్టతనిచ్చారు. నేషనల్ గ్రీన్ హైవేస్ పాలసీ–2015 నిబంధనల ప్రకారం.. ఆరు వరుసల్లో మొక్కలు నాటడం కుదరదని తెలిపారు. ఎందుకంటే తెలంగాణలో ఉన్న జాతీయ రహదారుల వెడల్పు 60 మీటర్లు, ఇందులో డివైడర్ 5 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇక మిగిలిన రెండువైపులా 27.5 మీటర్ల స్థలం ఎన్హెచ్ఐఏ ఆధీనంలో ఉంటుంది. ఇందులో 22 మీటర్లు బీటీ రోడ్డు పోగా మిగిలిన 5 మీటర్ల ఖాళీ స్థలం భవిష్యత్తు అవసరాల కోసం ఉంచుతారు. ఇపుడు అందుబాటులో ఉన్న స్థలం ప్రకారం.. ఒక వరుస చెట్లను ఇప్పటికే నాటారు. మరో వరసకు అతికష్టమ్మీద మొక్కలు నాటే వీలుంది. ఇక మూడో వరసకు చోటే లేదన్నది కన్షెషనర్ల వాదన. ఒక వేళ నాటినా.. రోడ్డు విస్తరణ సమయంలో వాటి కొట్టేయడానికి అనేక అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 31 నాటికి పూర్తి.. ఎక్కడైనా మొక్కలు ఎండిపోయినా, చనిపోయినా వాటిస్థానంలో కొత్తవి నాటుతామని, మొత్తం మీద ఆగస్టు 31 నాటికి హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల చెప్పారు. మరోవైపు జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి హరితహారంలో భాగంగా నాటిన అనేక మొక్కలను మిషన్ భగీరథ కోసం పెకిలించివేశారని ఎన్హెచ్ఏఐ అధికారులు వాపోయారు. మేం చిన్న మొక్క పెకిలించాలన్నా.. అభ్యంతరాలు వ్యక్తం చేసే అటవీశాఖ అధికారులు మిషన్ భగీరథ కోసం వేలాది మొక్కలు పెకిలించినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. -
భారత్–నేపాల్–చైనాల మధ్య ఆర్థిక కారిడార్
బీజింగ్: హిమాలయ దేశమైన నేపాల్‌పై మరింత పట్టు బిగించేందుకు చైనా చురుగ్గా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా చైనా–నేపాల్–భారత్‌ల మధ్య కొత్త ఆర్థిక కారిడార్ నిర్మాణాన్ని డ్రాగన్ దేశం ప్రతిపాదించింది. నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యావలి చైనాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆ దేశం ఈ మేరకు స్పందించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో చర్చల అనంతరం కుమార్ బుధవారం సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘నేపాల్–చైనాలు బహుళార్థక ప్రయోజనాలున్న హిమాలయ అనుసంధాన వ్యవస్థ ఏర్పాటుకు అంగీకరించాయి’ అని చెప్పారు. అనంతరం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ స్పందిస్తూ.. నేపాల్ ఇప్పటికే వన్‌బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరిందన్నారు. ఇందులో భాగంగా నేపాల్‌లో రైలు, రోడ్డు మార్గాలు, విమానాశ్రయాలు, విద్యుత్, సమాచారం వంటి సౌకర్యాలను అభివృద్ధి చేస్తామన్నారు. దీనివల్ల చైనా–నేపాల్–భారత్‌లను అనుసంధానిస్తూ ఆర్థిక కారిడార్‌ను నిర్మించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. నేపాల్ అభివృద్ధికి భారత్, చైనాలు సాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ధర్మశాలలో ఉన్న బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామాను కలుసుకునేందుకు టిబెట్ శరణార్థులు తమ దేశం గుండా వెళ్లకుండా చర్యలు తీసుకునేందుకు నేపాల్ ఒప్పుకుందన్నారు. -
చదవాలంటే.. నడవాల్సిందే!
రాజాపూర్ : ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి బాటలో పయనింపజేసేందుకు రూ.కోట్లు వెచ్చించి బీటీ రోడ్లు, అన్ని సౌకర్యాలు కల్పిస్తుండగా.. మరోవైపు బీటీ రోడ్డు సౌకర్యం ఉన్నా కూడా ఆర్టీసీ బస్సు సర్వీస్‌లు గ్రామాలకు కొనసాగకపోవడంతో ప్రజలు నిత్యం అవస్థలు ఎదుర్కొంటున్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు ఇటీవల బీటీ రోడ్లు వేయించారు. అయినా కూడా బస్సులు నడవకపోవడంతో విద్యార్థులు ఉన్నత చదవులు నిమిత్తం ఎండనకా.. వాననకా రోజూ కిలోమీటర్ల పొడవునా కాలినడకన నడవాల్సి వస్తుంది. ఉన్నత చదువులకు నడవాల్సిందే.. ఒకప్పుడు గ్రామాలకు రోడ్డు సౌకర్యం సరిగా లేదనే ఆరోపణతో ఆర్టీసీ అధికారులు గ్రామాలకు బస్సులను నడిపేవారు కాదు. కానీ, ప్రస్తుతం అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు ఉన్నా నేటికీ ఆర్టీసీ బస్సు సర్వీస్‌లు మాత్రం కొనసాగడంలేదు. దీంతో రవాణా సౌకర్యం లేక రైతులు విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని తిర్మలాపూర్,కల్లేపల్లి, ఈద్గాన్‌పల్లి, రాయపల్లి, నందిగామ, చెన్నవెల్లి, కుచ్చర్కల్, దోండ్లపల్లి, కుత్నేపల్లి, చొక్కంపేట్ తదితర గ్రామాలకు చక్కటి బీటీ రోడ్లు ఉన్నా ఇక్కడ ప్రాథమిక విద్య మాత్రమే అందుబాటులో ఉంది. పై చదువుల కోసం రాజాపూర్, రంగారెడ్డిగూడ, తిర్మలాపూర్లలోని ఉన్నత పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ విద్య కోసం షాద్‌నగర్, జడ్చర్ల పట్టణాలకు వెళ్లాల్సి వస్తుంది. అయితే, బస్సు సౌకర్యం లేకపోవడంతో నిత్యం గ్రామం నుంచి జాతీయ రహదారి వరకు నాలుగైదు కిలోమీటర్లు విద్యార్థులు నడవాల్సి వస్తుంది. అటు నుంచి ప్రైవేట్ వాహనాల్లో పాఠశాలలు, కళాశాలలకు చేరుకుంటున్నారు. బస్సులే లేవు.. ఇక పాసులెందుకు? ఇదిలాఉండగా, విద్యార్థులకు ఆర్టీసి సంస్థ బస్సుల్లో ప్రయాణించేందుకు ఉచిత బస్సు పాసులు ఇస్తుంది.కానీ, బస్సులు లేకపోతే బస్సు పాసులెందుకని వారు ప్రశ్నిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఆటోలలో తమ పిల్లలను పక్క గ్రామాలకు చదువుకునేందుకు తప్పని పరీస్థితుల్లో పంపిస్తున్నారు. అంతేకాకుండ ప్రయివేటు వాహనాలను ఆశ్రయించడంతో ఒక్కోసారి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రతి పల్లెకు ఆర్టీసీ బస్సు సర్వీస్ నడిపించాలని విద్యార్థులు, ప్రజలు కోరుతున్నారు. 6 కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది ప్రతి రోజు పై చదువుల కోసం గ్రామం నుంచి జాతీయ రహదారి వరకు ఉదయం, సాయంత్రం నడుచుకుంటూ వెళ్లి వస్తాం. రోజూ 6 కిలోమీటర్లు నడక తప్పదు. ఎండాకాలం అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఆర్టీసీ వారు విద్యార్థులకు బస్సుపాసులు ఇస్తున్నారు. బస్సులే లేనప్పుడు ఇక పాసులెందుకు. తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నాం. -
మంత్రులకు ‘నిధుల’ రోడ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంత్రులకు ప్రభుత్వం ‘రోడ్ల’నజరానా ప్రకటించింది. వారు కావాలనుకున్న చోట రహదారుల నిర్మాణానికి వీలుగా ఒక్కొక్కరికి రూ. 30 కోట్ల మేర ప్రత్యేక నిధుల కేటాయింపునకు పచ్చజెండా ఊపింది. తెలంగాణ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ నుంచి ఈ నిధులు అందిస్తారు. కార్పొరేషన్ ఈ నిధులను బ్యాంకుల నుంచి రుణంగా తీసుకుంటుంది. ప్రస్తుతానికి రూ.450 కోట్లు ఈ రూపంలో మంజూరు చేసేందుకు ప్రభు త్వం అంగీకరించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం నిర్వహించిన సమీక్షలో దీనిపై చర్చించారు. నేతల ఒత్తిళ్లతో..: రాష్ట్రంలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ రోడ్లు సరిగా లేవు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రోడ్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. దీంతో గ్రామాల్లోని రోడ్ల దుస్థితిపై ప్రజలు నేతలను నిలదీస్తున్నారు. ఆయా రోడ్ల అభివృద్ధిపై దృష్టి సారించాల్సిందిగా నేతల నుంచి సీఎంపై ఒత్తిడి పెరుగుతుండటంతో ప్రస్తుతానికి మంత్రుల నియోజకవర్గాల పరిధిలో రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించేందుకు సీఎం సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలిసింది. త్వరలోనే టెండర్లు..: మంత్రులు తాము కావాలనుకున్న రహదారులను ఎంపిక చేసి రోడ్లు భవనాల శాఖకు ప్రతి పాదనలు పంపుతారు. అధికారులు వాటిని పరిశీలించి డీపీఆర్‌లు రూపొందిస్తారు. తర్వాత మంత్రులకు ప్రత్యేకిం చిన నిధుల కింద టెండర్లు పిలిచి పనులు చేపడతారు. ఇక కొత్త కలెక్టరేట్ భవనాలు, ఎమ్మెల్యేల నివాస భవన సముదాయాల నిర్మాణం, జాతీయ రహదారుల విస్తరణ, ఎన్హెచ్ఏఐకి కేటాయించిన ఆరు రోడ్ల నిర్మాణంలో జాప్యం తదితర అంశాలపైనా తుమ్మల సమీక్షించారు. -
త్వరలో ‘ఆర్ అండ్ బీ’లో ఖాళీల భర్తీ
► మంత్రి తుమ్మల వెల్లడి సాక్షి, హైదరాబాద్: రోడ్లు, భవనాల శాఖలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ప్రభుత్వ పరంగా చేపట్టే పలు భారీ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను రోడ్లు, భవనాల శాఖకే అప్పగించినందున సిబ్బంది అవసరం ఉందని, ఇప్పటికే 106 ఏఈ పోస్టుల భర్తీకి సీఎం అనుమతించారన్నారు. శనివారం రోడ్లు, భవనాల శాఖ ప్రధాన కార్యాలయంలో ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్రావు, సీఈ చంద్రశేఖర్‌రెడ్డితో సమీక్షించారు. జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, ఎమ్మెల్యే క్వార్టర్లు, ఆడిటోరియం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తదితర పనులు పూర్తి చేయాల్సి ఉన్నందున అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. -
చీఫ్ ఇంజనీర్ ఆస్తులు 100 కోట్లకు పైనే!
-
చీఫ్ ఇంజనీర్ ఆస్తులు 100 కోట్లకు పైనే!
విశాఖపట్నం: ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ ఇంటిపై ఏసీబీ అధికారులు శనివారం దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో భారీగా ఆస్తులు బయటపడుతున్నాయి. ఏపీ ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ ఎం. గంగాధర్‌తో పాటు రోడ్డు కాంట్రాక్టర్ నాగభూషణంపై గత కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తుండటంతో.. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. వీరిద్దరి ఇళ్లతో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. విశాఖ, నెల్లూరు, కడప, గుంటూరు, చిత్తూరు, విజయవాడ, హైదరాబాద్‌ల్లో సుమారు 20 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 11 చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. కూకట్పల్లి రాంకీ టవర్స్‌లో రూ. 8 కోట్ల విల్లా, కూకట్పల్లి వివేకానందనగర్‌లో ఓ ఇళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కూకట్పల్లి నివాసంలో రూ. 40 లక్షల నగదును అధికారులు సీజ్ చేశారు. ఇప్పటి వరకు వివిధ చోట్ల సోదాల్లో 50 లక్షల విలువైన బంగారం, 5 బ్యాంకు లాకర్లను అధికారులు గుర్తించారు. డాక్యుమెంట్ల ప్రకారం 8 కోట్ల ఆస్తులను కనుగొన్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ. 100 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ వెల్లడించారు. విజయవాడలోని కాంట్రాక్టర్ నగభూషనం ఇంట్లో సైతం రూ. 40 లక్షలు సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. చిత్తూరు జిల్లా పీలేరులోని గంగాధరం బంధువుల ఇళ్లలో జరిపిన సోదాల్లో 19 ఎకరాల వ్యవసాయ భూమిని అధికారులు గుర్తించారు. -
ఆంధ్రా బ్యాంక్ లాకర్లో 39 లక్షలు సీజ్
విశాఖ: విశాఖపట్నం ఆర్అండ్బీ డీఈఈ సురేష్ చంద్ర పాత్రో ఇళ్లపై ఏసీబీ అధికారులు నిర్వహిస్తున్న సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. సోదాల్లో భాగంగా సోమవారం నగరంలోని విశాలాక్షి నగర్ ఆంధ్రాబ్యాంక్ లాకర్ తెరిచి చూడగా అందులో రూ. 39 లక్షల నగదు లభ్యమైంది. దీంతో ఏసీబీ అధికారులు నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆదాయనికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలపై డీఈఈ ఇంట్లో ఏసీబీ అధికారులు శనివారం దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో కోట్ల రూపాయల విలువైన స్థలాలు, ఫ్లాట్లు, బంగారం, వెండి వస్తువులు బయటపడ్డాయి. వీటి విలువ రూ.4.08 కోట్లకు పైగా ఉంటాయని సమాచారం. మరోవైపు పాత్రోను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కోర్టులో హాజరు పరచగా, ఆయనకు న్యాయస్థానం జనవరి 5వ తేదీ వరకూ రిమాండ్ విధించింది. కాగా ఏసీ రైలులో ప్రయాణించినప్పుడు బోగిలో అందించే దుప్పట్లను సైతం డీఈఈ విడిచిపెట్టలేదు. దొంగతనంగా తీసుకొచ్చిన ఆ దుప్పట్లను చూసి సోదాల సందర్భంగా ఏసీబీ అధికారులు కూడా విస్తుపోయారు. 2015, 2016 సంవత్సరానికి సంబంధించి సుమారు 65 దుప్పట్లు పాత్రో ఇంట్లో బయటపడ్డాయి. -
ఏసీబీ వలలో మరో పెద్ద చేప
విశాఖపట్నం: రోడ్లు, భవనాల శాఖ డిప్యూటీ ఈఈ పాత్రో ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఏకకాలంలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, హైదరాబాద్ లోని పాత్రోకు సంబంధించిన ఇళ్లల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని బుర్జాలో పాత్రో బంధువుల ఇటిలో సోదాలు కొనసాగాయి. విజయనగరం జిల్లా కురుపాం మండలం మొండెంకల్లోనూ ఏసీబీ తనిఖీలు చేశారు. ఏసీబీ అధికారుల తనిఖీల్లో సుమారు. రూ.4.08 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు గుర్తించారు. 15 ఇళ్ల స్థలాలు, 1.5 లక్షల నగదు, 29 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉండగా, అలాగే 600 గ్రాముల బంగారం, కారు, బైక్ ను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆర్అండ్బీ అధికారి ఇళ్లపై ఏసీబీ ఆకస్మిక దాడులు
-
ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టలేరు: తుమ్మల
సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల వాగ్దా నాలు నిలబెట్టుకుని మళ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యే దిశగా ముందుకు సాగుతున్నా మని, ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఎవరి తరం కాదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రెండున్నరేళ్ల టీఆర్ఎస్ పాలన పూర్తరుున నేపథ్యంలో గురు వారం రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ కార్యాలయం లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మరో ఏడు జాతీయ రహదారులకు అనుమతి కేంద్రం కొత్తగా ఏడు జాతీయ రహదారులకు అనుమతినిచ్చిందని మంత్రి తుమ్మల చెప్పారు. వాటి వివరాలను విడుదల చేశారు. మన్నెగూడ- కొడంగల్-కర్ణాటక సరిహద్దు వరకు 72 కి.మీ. రోడ్డుకు రూ.359.27 కోట్లు, కల్వకుర్తి-మల్లేపల్లి సెక్షన్, 47 కి.మీ., రూ.319.23 కోట్లు, జడ్చర్ల కల్వ కుర్తి సెక్షన్, 47.35 కి.మీ., రూ.314.53 కోట్లు, జనగామ- తిరుమలగిరి సెక్షన్, 39.18 కి.మీ., రూ.196.51 కోట్లు, తిరుమలగిరి- సూర్యాపేట సెక్షన్, 43.78 కి.మీ., రూ.244.54 కోట్లు, నకిరే కల్-తానంచెర్ల 71.6 కి.మీ., రూ.615.02 కోట్లు, హగ్గరి-జడ్చర్ల రోడ్డులో మరికల్ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రూ.218 కోట్లు, ఎన్‌హెచ్ 63లో జైపుర్ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రూ.228 కోట్లు, మహబూబ్‌నగర్ పట్టణ పరిధిలో డ్రెరుున్‌స ఏర్పాటుకు రూ.31 కోట్లు. -
హార్లీ డేవిడ్ సన్ నుంచి 2 కొత్త బైకులు
ధర శ్రేణి రూ.9.7 లక్షలు-32.81 లక్షలు న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రీమియం బైక్స్ తయారీ కంపెనీ ‘హార్లీ డేవిడ్సన్’ తాజాగా రెండు కొత్త మోటార్‌సైకిళ్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ‘రోడ్‌స్టర్,’ ‘రోడ్ గ్లిడ్ స్పెషల్’ అనే ఈ బైక్స్ ధర వరుసగా రూ.9.7 లక్షలుగా, రూ.32.81 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. భారత్‌లో కస్టమర్లను ఆకర్షించడానికి ప్రపంచస్థారుు ఉత్పత్తులను ఆవిష్కరించామని హార్లీ డేవిడ్సన్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ విక్రమ్ పవహ్ తెలిపారు. అలాగే హార్లీ డేవిడ్సన్.. ఏబీఎస్ ఫీచర్‌తో కూడిన స్ట్రీట్ 750 మోటార్‌సైకిల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర రూ.4.91 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. అలాగే 2017 ఎడిషన్ మోడళ్లన్నీ కూడా ఇకపై యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్)తో రానున్నారుు. రోడ్‌స్టర్: ఇందులో వి-ట్విన్ 1,200 సీసీ ఎరుుర్ కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ టార్క్ 96ఎన్ఎం-4,000ఆర్‌పీఎంగా ఉంది. స్పీడ్, ఆర్పీఎం, టైమ్, ట్రిప్ మీటర్, గేర్ ఇండికేటర్లను చూపించడానికి 4 అంగుళాల డిజిటల్ ఉపకరణాన్ని చేర్చారు. రోడ్ గ్లిడ్ స్పెషల్: ఈ బైక్‌లో మిల్వాకీ-8 107 సింగిల్ కమ్ వి-ట్విన్ 1,745 సీసీ ఇంజిన్‌ను అమర్చారు. ఇందులోనూ 6.5 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. -
రోడ్ల నిర్మాణానికి పటిష్ట నిబంధనలు
బ్యాచ్ మిక్స్ ప్లాంట్ల ఏర్పాటు తప్పనిసరి - పగ్ మిల్స్, పేవర్లతోనే నిర్మాణం - రూ.11 వేల కోట్లతో పనులు - ప్రయోగాత్మకంగా సీఎం ఫామ్‌హౌస్ రోడ్డు నిర్మాణం - ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సర్కార్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రోడ్ల పటుత్వం కోసం రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన నిబంధనలను రూపొందించింది. క్వాలిటీ కంట్రోల్ దృష్టి సారించింది. ఇటీవలి భారీ వర్షాలకు రాష్ట్రం లో దాదాపు 1500 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. వరదల ధాటికి ఇలా చెదిరిపోవటం సర్వసాధారణమే అయినా, రోడ్ల నిర్మాణంలో నాణ్యత అంతగా లేకపోవటం కూడా దీనికి మరో ప్రధాన కారణం. దాదాపు రూ.11 వేల కోట్లతో ఎన్నడూలేని స్థాయిలో భారీ ఎత్తున రోడ్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం ఇప్పుడు నాణ్యతపై దృష్టి సారించింది. అధికారులు కొత్త నిబంధనలను రూపొందించి ప్రయోగాత్మకంగా ఇటీవల ముఖ్యమంత్రి ఫామ్‌హౌస్ రోడ్డును నిర్మించారు. మధ్యలో ఎత్తుగా, రెండు వైపులా వాలుగా రోడ్లు ఉండాలనేది సాధారణ నిబంధన. కానీ, మధ్యలో వంపుగా నిర్మిస్తూ నీళ్లు నిలిచే పరిస్థితిని మన కాంట్రాక్టర్లు కల్పిస్తున్నారు. దీనికి చెక్ పెడుతూ కొత్త నిబంధనలను రూపొందించారు. డ్రమ్ మిక్సింగ్ యూనిట్లతో తారు, కంకర కలుపుతూ కాంట్రాక్టర్లు ఇప్పటివరకు రోడ్లను నిర్మిస్తున్నారు. దీంతో వాటి పాళ్లు సరిగా లేక నాణ్యత దెబ్బతింటోంది. ఇక నుంచి రూ.5 కోట్లను మించిన రోడ్ల నిర్మాణంలో కచ్చితంగా బ్యాచ్ మిక్స్ ప్లాంట్లను వాడాల్సిందేనని నిబంధన విధించారు. అంటే లోడ్ సెన్సార్ల సాయంతో తారు, స్టోన్ డస్ట్, చిన్న కంకర సమ పాళ్లలో మిక్స్ అవుతుంది. ఇది ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. రోడ్డు నిర్మాణంలో మిక్సర్ సాంద్రతను బట్టే పటుత్వం ఉంటుంది. ఇందుకోసం కాంట్రాక్టర్లు కచ్చితంగా పగ్మిల్ యంత్రం వాడాలని ప్రభుత్వం ఆదేశించింది. మిక్సర్‌ను పేవర్లతో మాత్రమే చదును చేయాలనే నిబంధనా విధించింది. ఎప్పటికప్పుడు తనిఖీ..ఫొటోలతో డాక్యుమెంటేషన్ నిబంధనలకు అనుగుణంగా యంత్రాలు ఉన్నాయని కాంట్రాక్టర్లు డాక్యుమెంట్లు దాఖ లు చేసి టెండర్లు దక్కించుకోవాల్సి ఉంటుంది. క్వాలిటీ కంట్రోల్ విభాగం యంత్రాలను పర్యవేక్షించి ఫొటోలతో సహా ఆధారాలు సమర్పిస్తేనే పనులకు తుది అనుమతి లభిస్తుంది. పనులు మొదలయ్యాక నేలను చదును చేయటం, కంకర రోడ్డు నిర్మాణం, ఆ తర్వాత తారు వరస వేయటం... ఇలా పలు దఫాల్లో కూడా తనిఖీలు జరిపి ప్రతి దాన్ని ఫొటోల సాయంతో డాక్యుమెంటేషన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే బిల్లులు విడుదలవుతాయి. మంచి ఫలితాలుంటాయి ‘కొత్త నిబంధన విషయంలో ప్రభుత్వం కచ్చితంగా వ్యవహరిస్తుండటంతో రాష్ట్రంలో 35 పెద్ద సంస్థలు సొంతంగా బ్యాచ్ మిక్స్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నారు. పగ్ మిల్స్, పేవర్లను కూడా సమకూర్చుకుంటున్నారు. కచ్చితంగా రోడ్లు 10 సంవత్సరాల పాటు మన్నేలా చేయటం ఈ విధానాల ఉద్దేశం. త్వరత్వరగా రోడ్లు చెడిపోతే ప్రజా ధనం వృథా కావటమే కాకుండా, కంకర కోసం గుట్టల రూపంలోని విలువైన ప్రకృతి సంపద నాశనమవుతుంది. దాన్ని ఇప్పుడు అరికట్టే అవకాశం లభించింది’ - భిక్షపతి, ఈఎన్సీ క్వాలిటీ విభాగం, రోడ్లు భవనాల శాఖ -
సత్యపాల్‌రెడ్డి ఆదర్శప్రాయుడు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి జనగామ : కమ్యూనిస్టు నేత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు గంగసాని సత్యపాల్ రెడ్డి ఆదర్శప్రాయుడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని వైష్ణవి ఫంక్షన్ హాలులో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి అధ్యక్షతన జరిగిన సత్యపాల్‌రెడ్డి సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ ఆయన నమ్ముకున్న సిద్ధాంతం కోసం త్యాగాలు చేయడానికి సైతం వెనకాడని కుటుంబమని చెప్పారు. విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు నాయకుడిగా ఎగిదిన సత్యపాల్‌రెడ్డి అకుంఠిత దీక్షతో జనసేవాదళ్ స్థాపించి పార్టీకి పటిష్టమైన సైన్యాన్ని అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. క్రమశిక్షణకు మారు పేరైన ఆయన హైదరాబాద్‌లోని మగ్దుం భవనానికి తన జీవితాన్ని ధారపోశాడన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం పేరు వింటేనే జగనామ గుర్తు కు వస్తుందని అన్నారు. ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పళ్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర సమరంలో పాల్గొని, తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజల పక్షాన నిలిచిన సత్యపాల్‌రెడ్డి అందరి హృదయాల్లో నిలిచి పోతాడని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చిరుపల్లి సీతారాములు, సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, నాయకులు జి.రాములు, ఆముదాల మల్లారెడ్డి, కనకయ్య, తొర్రం సత్యం, బర్ల శ్రీరాములు, మంగళ్లపల్లి జనార్దన్ , ఎండ్రు వైకుంఠం, సుద్దాల యాదగిరి పాల్గొనానరు. -
రోడ్లకు కావాలి రూ.866 కోట్లు
వర్షాల నష్టం అంచనా రూపొందించిన రోడ్లు భవనాల శాఖ సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 1,170 కి.మీ. మేర రోడ్లు దెబ్బతిన్నట్టు రోడ్లు భవనాల శాఖ గుర్తించింది. నష్టం దాదాపు రూ.866 కోట్లుగా తేల్చింది. ఈ మేరకు తుది నివేదికను సిద్ధం చేసి రాష్ట్రప్రభుత్వానికి పంపాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రోడ్లు భవనాల శాఖ అధికారులతో బుధవారం చర్చించారు. వెంటనే నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు. -
రోడ్డు సైడ్ దుకాణాలపై ఐటీ రైడ్స్
ముంబాయి : మోదీ ప్రభుత్వ పన్ను జాబితాలో తర్వాతి టార్గెట్ ఎవరో తెలుసా? రోడ్డు పక్కనున్న వడాపావ్ దుకాణాలు, దోసా సెల్లర్స్ అట. పన్ను ఎగవేతదారులపై కొరడా ఝళిపించేందుకు సిద్దమైన ప్రభుత్వం, చిన్న చిన్న బిజినెస్‌లను సైతం వదలడం లేదు. చిన్న వ్యాపారస్తులు, రోడ్డు పక్కన దుకాణాలపై ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్వహిస్తోంది. బ్లాక్ మనీని నిరోధించడానికి తీసుకొచ్చిన ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ కింద ఆదాయ వివరాలను తెలుపాలని అధికారులు ఆదేశాలు జారీచేస్తున్నారు. ఒక్క ముంబాయిలోనే ఈ రైడ్స్ 50కి పైగా జరిగాయి. థానేలోని ప్రముఖ వడాపావ్ సెంటర్, ఘట్కోపూర్లోని దోసా సెంటర్, అంథేరిలోని శాండ్ విచ్ షాపులపై ఈ దాడులు నిర్వహించారు. అదేవిధంగా అహ్మదాబాద్‌లోనూ 100కు పైగా దుకాణాలపై కూడా ఆదాయపు పన్ను శాఖ కొరడా ఝళించింది.. న్యూఢిల్లీ, కోల్‌కత్తాలోని ప్రముఖ దుకాణాలపై ఈ దాడులను చేపడుతున్నారు. గత ఆరు నెలలుగా ఆదాయపు పన్ను శాఖ సేకరించిన సమాచారం మేరకు అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు లక్ష వరకు చిన్న వ్యాపారులను, షాప్ కీపర్లను పన్ను ఎగవేతదారులుగా గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. ప్రతి పట్టణాన్ని టార్గెట్‌గా చేసుకుని ప్రభుత్వం ఈ దాడులు నిర్వహిస్తోంది. తన 25 ఏళ్ల అనుభవంలో ఎప్పుడూ ఇలాంటి రైడ్స్‌ను ఎరుగనని, అసలు పన్ను డీల్సే తెలియని వారికి మొదటిసారి అధికారులు చుక్కలు చూపిస్తున్నారని ముంబాయిలోని ఓ చార్టెడ్ అకౌంటెంట్ చెప్పారు. బ్లాక్‌మనీ నిరోధించడానికి మోదీ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. తాజాగా ముంబాయిలో పన్ను అధికారులు చేస్తున్న ఈ రైడ్స్ ద్వారా ఇప్పటికే రూ.2 కోట్లను సీజ్ చేసినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. సెప్టెంబర్ 30 లోపు దేశవ్యాప్తంగా ఇలాంటి రైడ్స్ వేయి వరకు జరుగుతాయని అధికారులు హెచ్చరించారు. ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్‌కు ఇంకా 10 రోజులే మిగిలి ఉండటంతో ఈ రైడ్స్ మరింత ఊపందుకున్నాయి. సెప్టెంబర్ 30ను ఆదాయపు రిటర్న్స్‌కు ప్రభుత్వం తుది గడువుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు ఎక్కువ విలువ కలిగిన లావాదేవీలను, వ్యక్తులను, షాపింగ్ బిల్లుల టార్గెట్‌గా చేసుకుని ప్రభుత్వం ఈ దాడులు చేసింది. గడువు సమీపిస్తున్నందున్న పన్ను ఎగవేసిన చిన్న వ్యాపారులను సైతం వదిలేది లేదని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంటోంది. -
సీసీరోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
కోదాడఅర్బన్: కోదాడ పట్టణంలోని 5వ వార్డులో 14వ ఆర్థిక సంఘం నిధులతో నూతనంగా నిర్మించే సీసీ రోడ్డు, డ్రైనేజీ, కల్వర్టుల నిర్మాణ పనులకు గురువారం మున్సిపల్ చైర్పర్సన్ వంటిపులి శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సౌకర్యం కోసం పట్టణంలోని అన్ని వార్డుల్లో డ్రైనేజీలు, సీసీరోడ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, మున్సిపల్ కమిషనర్ అమరేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు పార సీతయ్య, ఎస్కె నయీం, షఫీ, ఖాజాగౌడ్, నాయకులు కుక్కడపు బాబు, కమదన చందర్రావు, కందరబోయిన వేలాద్రి, మున్సిపల్ డీఈ లక్ష్మానాయక్, శెట్టి భాస్కర్, వంటిపులి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఇక వేలాడే వంతెనలు!
- గోదావరి, కృష్ణాలపై కొత్త తరహా నిర్మాణానికి యోచన - ఎక్స్ట్రా డోస్డ్ కేబుల్ నమూనాకు సర్కారు ఓకే - జల రవాణా మార్గానికి తోడ్పడేలా నిర్మాణం - ప్రయోగాత్మకంగా రెండు చోట్ల చేపట్టేందుకు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా నదులపై ఇక ముందు వేలాడే తరహా వంతెనలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఎక్స్ట్రా డోస్డ్ కేబుల్ (బలమైన ఉక్కు తీగల సహాయంతో వేలాడే వంతెన)’ నమూనాలో తొలుత రెండు వంతెనలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఖమ్మం జిల్లా మణుగూరు-పర్ణశాల మధ్య గోదావరి నదిపై ఒక దానిని, కరీంనగర్-మానకొండూరు మధ్య మానేరుపై రెండో వంతెనను నిర్మించనుంది. దీనికి సంబంధించి రోడ్లు భవనాల శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి డీపీఆర్‌లు పంపింది. మణుగూరు వద్ద వంతెనకు రూ.188 కోట్లు, కరీంనగర్ వంతెనకు రూ.122 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. వంతెనల నమూనాలను కూడా సిద్ధం చేశారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వస్తే త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందం, సౌకర్యం కూడా.. ఇప్పటి వరకు ఈ తరహా వంతెనలను మన రాష్ట్రంలో నిర్మించలేదు. ‘ఎక్స్ట్రా డోస్డ్ కేబుల్’ విధానంలో నది మధ్యలో ఎత్తుగా నిర్మించే స్తంభాలకు బలమైన ఉక్కు తీగలు ఏర్పాటు చేసి వంతెనను అనుసంధానిస్తారు. భవిష్యత్తులో గోదావరి, కృష్ణా నదుల్లో జల రవాణా మార్గాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించినందున... నావలు తిరిగేప్పుడు ఇబ్బంది కలుగకుండా ఈ తరహా వంతెనలు నిర్మించనున్నారు. ఇంతకుముందు కూడా దేశంలో జల రవాణా మార్గాలున్న చోట ఈ తరహా వంతెనలు నిర్మించారు. అందులో కోల్‌కతాలో హౌరా వంతెన, ముంబైలో సముద్రంపై నిర్మించిన కొత్త వంతెన పేరుపొందాయి. ఈ తరహా వంతెనలు చూడడానికి అందంగా ఉంటాయి కూడా. ఖమ్మం జిల్లా పర్ణశాల పర్యాటక కేంద్రం. ఇక్కడికి నిరంతరం పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు. ఇక ఈ ప్రాంతం నుంచి మణుగూరును అనుసంధానిస్తూ గోదావరిపై దాదాపు 1,600 మీటర్ల పొడవుతో భారీ వంతెన నిర్మించాలని గతంలోనే నిర్ణయించారు. అయితే మహారాష్ట్ర మీదుగా తెలంగాణ, ఏపీలను జలరవాణాతో అనుసంధానించాలని కేంద్రం నిర్ణయించినందున.. గోదావరిపై నిర్మించే వంతెనలన్నీ అందుకు వీలుగా ఉండేలా చూడాలని ఇప్పటికే ఆదేశించింది. దీంతో మణుగూరు వంతెనను కొత్త తరహాలో చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. పర్ణశాలకు వచ్చే పర్యాటకులకు ఈ వంతెన కూడా చూడదగ్గ ప్రాం తంగా మారుతుందని భావిస్తున్నారు. కరీంనగర్ సమీపంలో మరొకటి.. కరీంనగర్ నుంచి మానకొండూరు మీదుగా సాగే వరంగల్ రహదారిపై మరో వంతెన రూపొందనుంది. ఇప్పటికే ఈ మార్గంలో కరీంనగర్ పట్టణానికి చేరువగా నాలుగు వరసలతో ఓ వంతెన ఉంది. పురాతన రెండు వరసల వంతెననే పటిష్ట పరుస్తూ నాలుగు లేన్లకు విస్తరించారు. ఇప్పుడు దీనికి రెండున్నర కిలోమీటర్ల దిగువన సదాశివపల్లె వద్ద కేబుల్ డిజైన్‌తో రెండో వంతెనను నిర్మించాలని రోడ్లు భవనాల శాఖ నిర్ణయించింది. దాదాపు 800 మీటర్ల పొడవుతో నాలుగు లేన్లుగా ఉండే ఈ వంతెన నిర్మాణానికి రూ.122 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. భవిష్యత్తులో మానేరు ప్రాంతాన్ని పర్యాటకపరంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నందున.. ఈ వంతెన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు. -
ఉద్యమస్ఫూర్తితో మెుక్కలు నాటాలి
రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యం అభివృద్ధిని ఓర్వలేకనే విపక్షాల విమర్శలు ఆర్అండ్బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కోల్‌బెల్ట్ : హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలని రో డ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రా వు అన్నారు. భూపాలపల్లి నగర పంచాయతీ పరిధిలోని మంజూర్‌నగర్ సింగరేణి ఆసుపత్రి ఆవరణలో గురువారం ఆయన మెుక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేం దుకే సీఎం కేసీఆర్ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. మిషన్ కాకతీయ, భగీరథ పనులపై అవగాహన లేని నాయకులు అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు అవుతున్నారని, ఇది చూసి ఓర్వలేని ప్ర తిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ రాష్ట్రాన్ని కరువు రహిత ప్రాంతం గా మార్చేందుకే కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. సింగరేణి సహకారంతో భూపాలపల్లి ప్రాంతంలో అత్యధికంగా మొక్కలను నాటామన్నారు. అనంతరం సింగరే ణి అధికారి కర్ణ అధికారులతో పర్యావరణ ప్రతి జ్ఞ చేయించారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఏరియా జీఎం పాలకుర్తి సత్తయ్య, నగర పంచాయతి చైర్పర్సన్ బండారి సంపూర్ణరవి, టీబీజీ కేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బడితెల సమ్మయ్య, పర్సనల్ మేనేజర్ రేవు సీతారాం, ఎస్ఓటుజీ ఎం సయ్యద్ హబీబ్ హుస్సేన్, ఏజంట్లు బళ్లా రి శ్రీనివాసరావు, మనోహర్, ఏజీఎం అప్పారావు, పర్సనల్ మేనేజర్లు శ్యాంసుందర్, తిరుపతి, నాయకులు కొక్కుల తిరుపతి, కటకం స్వామి, పైడిపల్లి రమేష్, ఐలయ్య పాల్గొన్నారు. హరితహారంపై నిర్వహించిన క్విజ్ పోటీల విజేతలకు ఆసుపత్రి సిబ్బంది స్వర్ణలత, సంజయ్ బహుమతులందజేశారు. -
ఇక ‘హరిత’ రహదారులు
* అన్ని ప్రధాన రోడ్లకూ ఇరువైపులా లక్షల సంఖ్యలో మొక్కలు * వాటి సంరక్షణ బాధ్యత అన్ని ప్రధాన విభాగాలకు కేటాయింపు * ప్రతి రెండు, మూడు నెలలకోమారు సంరక్షణపై సమీక్షలు * ప్రణాళిక సిద్ధం చేసిన రోడ్లు భవనాల శాఖ సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారులు పచ్చదనంతో కళకళలాడనున్నాయి. ఇందుకోసం రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ఇతర విభాగాలతో కలసి రోడ్లకు ఇరువైపులా లక్షల సంఖ్యలో మొక్కలను పెంచాలని నిర్ణయించింది. తొందరగా పెరగాలన్న ఉద్దేశంతో ఏదో ఒక మొక్క నాటే పద్ధతి కాకుండా నీడనిచ్చే, ఫలాలు అందించే, సీజన్ ప్రకారం రకరకాల పూలతో అందంగా కనిపించే వాటిని మాత్రమే నాటాలని నిర్ణయించింది. భవిష్యత్తులో మళ్లీ రోడ్లను విస్తరిస్తే చెట్లు కోల్పోయే పరిస్థితి దాపురించకుండా రోడ్లకు కాస్త దూరంగా మొక్కలు నాటనున్నారు. హైదరాబాద్-విజయవాడ మార్గంలో తెలంగాణ సరిహద్దు ముగిసే 160 కిలోమీటర్ల నిడివిలో ఏకంగా లక్షన్నర మొక్కలు నాటబోతున్నారు. ఇక హైదరాబాద్-రామగుండం రాజీవ్ రహదారిలో విస్తరణ కోసం వేల సంఖ్యలో భారీ వృక్షాలను తొలగించినందున దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈ మార్గంలో మొక్కలు నాటి పెంచేందుకు అవసరమైన స్థలం అందుబాటులో లేకపోవటంతో రైతులు, ప్రైవేటు స్థల యజమానులతో చర్చించి వారి స్థలాల్లో మొక్కలు నాటాలని నిర్ణయించారు. సంరక్షణ బాధ్యతల అప్పగింత.. ఐదు కిలోమీటర్ల చొప్పున నిడివిని విభజించి ఒక్కో భాగాన్ని ఒక్కో విభాగానికి అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. ఆ నిడివిలో మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించే బాధ్యత కూడా ఆ విభాగానిదే. ప్రతి రెండు మూడు నెలలకోమారు ఆ మొక్కల సంరక్షణపై సమీక్ష నిర్వహించి ప్రభుత్వానికి నివేదికలు అప్పగించాలి. ఒక్కో మొక్కకు రూ.5 చొప్పున నిధులను ఆ విభాగానికి ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ సంవత్సరానికిగానూ ఇందుకు రూ.46 కోట్లను కేటాయించింది. ఇక రోడ్లను ఆనుకుని ఉండే పొలాల గట్ల వెంట కూడా మొక్కలు నాటి సంరక్షించేలా రైతుల్లో అవగాహన తేనున్నారు. వారికి ఉచితంగా మొక్కలు అందజేసి వాటిని సంరక్షించేలా రైతులను ప్రోత్సహించాలని రోడ్లు భవనాల శాఖ నిర్ణయించింది. ఇక్కడ రైతులు కోరే మొక్కలనే అందిస్తారు. అడవుల పెంపకానికి ప్రాధాన్యం: మంత్రి తుమ్మల ‘‘భవిష్యత్తుపై ముందుచూపు కొరవడి గతంలో అత్యంత విలువైన వృక్ష సంపదను కోల్పోయాం. ఈ తప్పు తెలంగాణలో ఇక జరగొద్దు. అభివృద్ధి పేరుతో కోల్పోతున్న వృక్షాలను మళ్లీ పొందాల్సి ఉంది. గత 15 ఏళ్లలో అత్యంత వేగంగా అడవులు కోల్పోయిన జిల్లాగా ఖమ్మం నిలిచింది. అందుకే రోడ్లకిరువైపులా మొక్కలు నాటి పెంచాలని నిర్ణయించాం. 26 వేల కి.మీ. మేర మొక్కలు నాటబోతున్నాం. ఇందులో అన్ని ప్రభుత్వ విభాగాలతోపాటు రైతులనూ భాగస్వాములను చేస్తాం. నాటిన ప్రతి మొక్కా వృక్షం కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతాం’’ -
హైవేల కోసం రాష్ట్ర భూసేకరణ విధానం!
కేంద్రానికి ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం - కేంద్ర విధానం వల్ల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని ఫిర్యాదు - పరిహారం పెరిగితే ఆ మొత్తాన్ని కేంద్రమే భరించాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారుల నిర్మాణంలో స్పీడు పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల భూసేకరణలో జాప్యం ఏర్పడుతోందని అభిప్రాయపడుతోంది. వాటికి బదులుగా రాష్ట్ర నిబంధనలను రూపొంది స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రెండు వేల కిలోమీటర్ల మేర కొత్త జాతీయ రహదారులకు అనుమతులు పొందిన విషయం తెలిసిందే. హైవేలను వేగంగా నిర్మించేవిధంగా రూపొందించిన రాష్ట్రప్రభుత్వ భూసేకరణ నిబంధనలకు అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్రానికి లేఖ రాసింది. కేంద్ర విధానాలను అనుసరిస్తే జాతీయ రహదారుల నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదని పేర్కొంది. కొత్త భూసేకరణ విధానం వల్ల పరిహారం చెల్లింపు పెరిగితే దాన్ని కేంద్రమే భరించాలని కోరడం కొసమెరుపు. ఆ రోడ్డును చూడండి... హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిని 4 వరసలుగా మార్చే పని ఏళ్ల క్రితం మొదలైంది. అతి కష్టమ్మీద హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట రోడ్డు కలిసే వరకు ఈ పనులు పూర్తయ్యాయి. అక్కడి నుంచి వరంగల్ వరకు పనులు జరగాల్సి ఉంది. ఏడాది క్రితమే టెండర్లు పిలిచి ఎల్ అండ్ టీకి పనులు అప్పగించారు. గత ఫిబ్రవరిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వచ్చి శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటి వరకు నిర్మాణ సంస్థతో అగ్రిమెంటు కూడా జరగలేదు. ఈ రోడ్డు విస్తరణకు భారీగా భూమిని సేకరించాల్సి ఉంది. కానీ కేంద్రప్రభుత్వం ఇచ్చే పరిహారానికి స్థానికులు అంగీకరించటం లేదు. దీనిపై కోర్టుల్లో పెద్ద సంఖ్యలో కేసులు దాఖలయ్యాయి. ఫలితంగా రోడ్డు నిర్మాణ పనులు ఒక్క అడుగుకూడా ముందుకు పడలేదు. ఈ దుస్థితిని రాష్ట్రప్రభుత్వం తాజాగా కేంద్రం ముందుంచింది. సాగునీటి ప్రాజెక్టు పనుల్లో జాప్యం లేకుండా చేసేందుకు భూసేకరణ చట్టాన్ని మార్చామని, దీంతో ప్రాజెక్టుల నిర్మాణంలో ఊపు వచ్చినందున జాతీయ రహదారుల నిర్మాణం కోసం భూసేకరణకూ రాష్ట్రప్రభుత్వ విధానాన్నే అనుసరించాలని నిర్ణయించినట్టు కేంద్రానికి తెలి పింది. దీనిపై కేంద్రమంత్రితో చర్చించేం దుకు త్వరలోనే రోడ్లు భవనాల శాఖ మంత్రి, అధికారులు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. -
ఆర్‌అండ్‌బీలో పదోన్నతుల దుమారం!
- ఫైల్ వెనక్కు పంపిన మంత్రి శిద్ధా రాఘవరావు హైదరాబాద్ : ఏపీ రహదారులు, భవనాల శాఖలో అధికారుల పదోన్నతి వ్యవహారం ఒకడుగు ముందుకు.. నాలుగు అడుగుల వెనక్కు అన్న చందంగా సాగుతోంది. డిప్యూటీ ఇంజినీర్ల నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పదోన్నతులు కల్పించే సీనియారిటీ జాబితాపై రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగా, సూపరింటెండెంట్ ఇంజినీర్ల నుంచి చీఫ్ ఇంజినీర్లు.. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల నుంచి సూపరింటెండెంట్ ఇంజినీర్లుగా పదోన్నతులు కల్పించేందుకు జాబితా సిద్ధం చేశారు. ఆరుగురు ఎస్ఈలను చీఫ్ ఇంజినీర్లుగా, మరో ఆరుగురు ఈఈలను ఎస్ఈలుగా పదోన్నతి కల్పించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనల ఫైల్‌ను ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంబాబ్ ఆర్అండ్బీ మంత్రి శిద్ధా రాఘవరావుకు పంపారు. అయితే ఈ పదోన్నతుల వల్ల తమకు అన్యాయం జరుగుతుందని సదరు శాఖలోని కొందరు అధికారులు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. ముఖ్య ఇంజినీరు ఒకరు ఇష్టారీతిన పదోన్నతుల ఫైల్ రూపొందించారని ఫిర్యాదు చేశారు. డీఈల నుంచి ఈఈలుగా పదోన్నతులు కల్పించే అంశంలో సదరు ముఖ్య ఇంజినీరు అవకతవకలకు పాల్పడి ఆయన వర్గానికి పెద్ద పీట వేశారని ఆరోపిస్తున్నారు. దీంతో మంత్రి శిద్ధా రాఘవరావు ఆ ఫైల్‌ను వెనక్కు తిప్పి పంపారు. పదోన్నతుల వ్యవహారంపై ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో పదోన్నతుల వ్యవహారం మరికొంత కాలం వాయిదా పడే అవకాశం ఉంది. కాగా, ఆగస్టులో రూరల్ ఈఎన్సీగా ఉన్న వెంకటరెడ్డి పదవీ విరమణ చేస్తుండటం, కమిషనర్ ఆఫ్ టెండర్స్ సీఈ జ్ఞానరాజు వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవడంతో సీఈ పోస్టుల్లో ఖాళీలేర్పడనున్నాయి. -
మండుటెండల్లో పసికందు
♦ రోడ్డుపక్కన వదిలివెళ్లిన వైనం ♦ హత్నూర మండలంలో ఘటన ♦ మంగాపూర్ శివారులో రోడ్డు పక్కన ఆడ శిశువు ♦ దౌల్తాబాద్ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స ♦ సంగారెడ్డి శిశువిహార్‌కు తరలింపు ♦ గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు హత్నూర: అభం శుభం తెలియని సుమారు నెలరోజుల ఆడ శిశువును మండుటెండలో రోడ్డు పక్కన చెట్టుకింద ఓ తల్లి వదిలేసి వెళ్లింది. ఈ సంఘటన మండలంలోని మంగాపూర్ గ్రామ శివారులో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఎస్సై బాల్‌రెడ్డి, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మంగాపూర్ గ్రామ శివారులో సంగారెడ్డి-నర్సాపూర్ ప్రధాన రహదారి పక్కన ఓ చెట్టుకింద నెల రోజుల ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో వదిలేసి వెళ్లారు. నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన వాల్దాస్ గోపాల్‌గౌడ్, అవంచ గ్రామానికి చెందిన రాజులు ఇద్దరు బైక్‌పై పెళ్లికి వెళ్లి తిరిగి నర్సాపూర్ వైపు వస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపక్కన చెట్టు కింద చిన్న పరుపులో పాప ఏడుస్తూ కనిపించడంతో ఒక్కసారిగా ఇద్దరు యువకులు ఆగిపోయారు. ఈ వి షయమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై బాల్‌రెడ్డి, కానిస్టేబుల్ శర్మన్‌నాయక్‌లు వెంటనే సంఘటన స్థలానికి వెళ్లారు. చెట్టుకింద రోదిస్తున్న పసిపాపకు దౌల్తాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సూపర్వైజర్లు జ్యోతి, మహాలక్ష్మి ఇద్దరు ఆస్పత్రికి తరలివచ్చారు. అనంతరం శిశువును సంగారెడ్డిలోని శిశువిహార్‌కు తరలించినట్లు ఎస్సై బాల్‌రెడ్డి తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మాతృత్వానికే మచ్చ ప్రస్తుత కరువు పరిస్థితుల్లో ఇంకెందుకులే ఈ ఆడశిశువు అనుకుందో ఏమోగాని పేగు బంధాన్ని సైతం మరచిపోయింది ఆ తల్లి. పొత్తిళ్లలో ఉండాల్సిన పసి పాపను రోడ్డుపక్కన చెట్టుకింద హృదయ విదారకంగా పరుపులో పడవేసింది. ఆడ శిశువును ఇలా రోడ్డుపక్కన వదిలేయడాన్ని చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయారు. అయ్యో పాపం.. ఏ తల్లికన్న బిడ్డో అంటూ ఆస్పత్రి వద్ద కొంతమంది మహిళలు కంటతడి పెట్టా రు. పాపకు పాలు, నీళ్లు తాగిం చారు. అంతలోపే పాపను సంగారెడ్డి శిశువిహార్‌కు తరలిస్తుంటే అందరి కళ్లూ ఆ పాపపైనే ఉన్నాయి. ఏదిఏమైనా సభ్యసమాజం తలదించుకునే ఇలాంటి సంఘటనలు మానవత్వానికి, మాతృత్వానికి మాయని మచ్చలా మిగిలిపోతున్నాయి. -
ఆర్ అండ్ బీకి కొత్త ఇంజనీర్లు
♦ 82 మందికి నియామక పత్రాలు అందజేసిన మంత్రి తుమ్మల ♦ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా కేటాయింపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా రోడ్లు భవనాల శాఖకు ప్రభుత్వం కొత్త ఇంజనీర్లను కేటాయించింది. వీరిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) స్థాయిలో 82 మంది ఉన్నారు. శనివారం ఆర్అండ్ బీ శాఖ ప్రధాన కార్యాలయంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీరికి నియామక ఉత్తర్వులు అందజేశారు. 2012 తర్వాత ఈ శాఖకు కొత్త ఇంజనీర్లు రావటం ఇదే తొలిసారి. అప్పటి నుంచి చాలా పోస్టులు ఖాళీగా ఉండటంతో వాటిని భర్తీ చేయాల్సిందిగా ఆ శాఖ, సీఎం దృష్టికి తీసుకెళ్లింది. తెలంగాణ పబ్లిక్ సర్వీ స్ కమిషన్ ద్వారా పరీక్షలు నిర్వహించి 82 మంది అభ్యర్థులను ఏఈఈ పోస్టులకు ఎంపిక చేశారు. కాగా, వీరందరిని వివిధ జిల్లాలకు కేటాయించారు. ఇక 42 అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి మరో పరీక్ష నిర్వహించారు. వాటి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. శనివారం కేటాయించిన పోస్టుల్లో ఎస్సీలు 12 మంది, ఎస్టీలు నలుగురు, బీసీలు 33 మంది, వికలాంగుల కోటాలో ఒకరు, ఓసీలు 27 మంది ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక, నియామకాలు పూర్తి పారదర్శకంగా జరిగాయని ఆ శాఖ పరిపాలన వి భాగం ఈఎన్సీ భిక్షపతి పేర్కొన్నారు. కొత్త గా నియమితులైన ఇంజనీర్లకు వచ్చేనెల 4 నుంచి 3 నెలల పాటు న్యాక్‌లో శిక్షణ ఇస్తామన్నారు. -
రోడ్లకు మైనస్
గత బడ్జెట్లో భారీ కేటాయింపులు * పనుల్లో కనిపించని పురోగతి * దీంతో ఈసారి నిధుల్లో కోత సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం మంజూరు చేసిన పనులు.. వాస్తవంగా జరుగుతున్న పనులకు పొంతన లేకపోవటంతో కొత్త బడ్జెట్లో రోడ్లు, భవనాల శాఖకు కేటాయించే నిధుల్లో ప్రభుత్వం కోత పెట్టింది. గత బడ్జెట్ కంటే దాదాపు రూ. 1,600 కోట్ల నిధులు తగ్గించింది. గత బడ్జెట్లో భారీ ఎత్తున నిధులు కేటాయించినప్పటికీ వాటిని ఖర్చు చేయటంలో ఆ శాఖ విఫలం కావటంతో ప్రభుత్వం ఈసారి తక్కువ నిధులే సరిపోతాయని భావించి రూ. 4,322 కోట్లతో సరిపుచ్చింది. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి రాజధానికి రెండు వరసల రోడ్లు.. నదులు, వాగులు, వంకలపై అవసరమైన ప్రాంతాల్లో వంతెనలు అంటూ గత సంవత్సరం ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో దాదాపు రూ. 11,600 కోట్ల విలువైన పనులకు పచ్చజెండా ఊపింది. వీటిని నిర్వహించే క్రమంలో గత బడ్జెట్లో రూ. 5,917 కోట్లను ప్రతిపాదించింది. కానీ ఆర్థిక సంవత్సరం చివరకు వచ్చేసరికి రూ. 2,576 కోట్లనే ఖర్చు చేయగలిగారు. ఈ సంవత్సరం బడ్జెట్ సన్నాహక సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇదే విషయమై అధికారులను నిలదీశారు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా పనులను వేగంగా నిర్వహించలేకపోయామని, ఇకనుంచి ఊపందుకుంటాయని సమాధానమిచ్చారు. ఇందుకోసం కొత్త బడ్జెట్లో రూ. 5,500 కోట్లు కేటాయించాల్సిందిగా అధికారులు కోరారు. కానీ ఈసారి కూడా అధికారులు అనుకున్న వేగంతో పనులు చేయించలేరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి అన్ని నిధులివ్వలేనని తేల్చి చెప్పారు. అనుకున్నట్టుగానే తాజా బడ్జెట్లో భారీగానే కోత పెట్టారు. ఈసారి కొత్తగా మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. గత సంవత్సరం పనులే ఈసారి కొనసాగే అవకాశం ఉన్నందున వాటితోనే సరిపుచ్చుకోవాలన్న సంకేతాన్ని ప్రభుత్వం ఇచ్చింది. * ముఖ్యమైన జిల్లా రహదారుల నిర్మాణం కోసం రూ. 1,137 కోట్లు కేటాయించారు. * గజ్వేల్ ప్రాంతీయ అభివృద్ధి మండలి, ఇతర అనుసంధాన రోడ్ల అభివృద్ధి కోసం రూ. 30 కోట్లు కేటాయించారు. * ఔటర్ రింగు రోడ్డుకు అనుసంధానంగా నిర్మించే రేడియల్ రోడ్ల కోసం రూ. 250 కోట్లు ప్రతిపాదించారు. * కొత్త రైల్వే లైన్ల కోసం రూ. 50 కోట్లు ప్రతిపాదించారు. * కొత్త సచివాలయ భవన సముదాయ నిర్మాణం కోసం రూ. 50 కోట్లు, జిల్లా కలెక్టరేట్ భవనాల కోసం రూ. 3.50 కోట్లు, రాష్ట్ర ఎన్నికల సంఘం భవనం కోసం రూ. కోటి, తెలంగాణ జర్నలిస్టుల భవన నిర్మాణం కోసం రూ. కోటి, తెలంగాణ కళాభారతి, ఇతర భవనాల కోసం రూ. 50 కోట్లు, రాజ్‌భవన్‌లో నిర్మాణాల కోసం రూ. 50 కోట్లు, సీనియర్ అధికారుల నివాస భవనాల నిర్మాణం కోసం రూ. 20 కోట్లు ప్రతిపాదించారు. * తెలంగాణ రోడ్ సెక్టార్ కోసం రూ. 60 కోట్లు చూపారు. * కోర్ నెట్వర్క్ రోడ్లకు రూ. 360 కోట్లు ప్రతిపాదించారు. -
నిజాం కాలం నాటి ఫిరంగి స్వాధీనం
హైదరాబాద్: రోడ్డు విస్తరించే పనుల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం పురాతన భవనాన్ని కూలుస్తుండగా నిజాం కాలం నాటి ఫిరంగి బయటపడింది. పాత బస్తీలోని హుస్సేనీ ఆలంలోని కోకాకితట్టీ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఫిరంగి కనిపించడంతో అప్రమత్తమైన స్ధానికులు వెంటనే చార్మినార్ పోలీసులకు సమాచారం అందించారు. వారు ఫిరంగి స్వాధీనం చేసుకున్నారు. ఫిరంగిని చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. -
చుక్కలు చూపించిన అక్కా చెల్లెళ్లు
మొరదాబాద్: ఈవ్ టీజింగ్‌కు పాల్పడిన ఓ ప్రబుద్ధుడికి ఇద్దరు అక్కా చెల్లెళ్లు బుద్ధి చెప్పారు. తమ జోలికి ఇంకోసారి రాకుండా అతడికి చుక్కలు చూపించారు. ఉత్తరప్రదేశ్‌లోని మోరదాబాద్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెకిలి చేష్టలకు పాల్పడిన ఆ వ్యక్తిని కాలర్ పట్టుకొని ఆ చెంపా ఈచెంపా వాయించడమే కాకుండా కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మొరదాబాద్‌లో పోలీసు ఉద్యోగాలపై అభిరుచి ఉన్న ఇద్దరు అక్కా చెల్లెల్లు ప్రతి రోజు ఉదయాన్నే రన్నింగ్‌కు వెళుతుంటారు. అదే సమయంలో రోడ్డుపక్కనే ఓ తోపుడుబండి పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్న ఓ వ్యక్తి వారిని అభ్యంతరమాటలు అనేవాడు. అలా కొద్ది రోజులుగా అతడిని సహించిన ఆ ఇద్దరు యువతులు చివరకు తమ ఆగ్రహం ఆపుకోలేక అతడిని ఈడ్చి తన్నారు. చెంపలు వాయించి, కాళ్లతో తన్నారు. దీంతో వారి దెబ్బలు తాళలేక తనను వదిలిపెట్టమని అతడు బ్రతిమాలికున్నాడు. అయినా, వదిలిపెట్టని ఆ అక్కా చెల్లెళ్లు అతడిని కాలర్ పట్టుకొని తీసుకెళ్లి పోలీసులకు పట్టించారు. -
వారు కోరినట్టుగా నడుచుకోండి!
♦ అధికారులకు సీఎం ఆదేశాలు ♦ పనులు చేపట్టని కాంట్రాక్టర్లను వెనకేసుకొస్తున్న వైనం ♦ విపక్షంలో ఉన్నప్పుడు దీనిపై గగ్గోలు పెట్టిన బాబు సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులూ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు దోచిపెడుతోందంటూ గగ్గోలు పెట్టిన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే వారి విషయంలో మాట మార్చారు. పనులు చేయని కాంట్రాక్టర్లను తొలగించాలని కోరుతున్న ప్రభుత్వాధికారులపైనే ఇప్పుడు బాబు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ల తీరును తప్పుపడుతున్న అధికారులపై ఎదురుదాడి చేస్తూ ‘మీకే వారితో పనులు చేయించుకోవడం రావడం లేదు..’ అంటున్నారాయన. దీంతో ఖంగుతినడం అధికార యంత్రాంగం వంతు అవుతోంది. ఇటీవల జిల్లా కలెక్టర్ల సమావేశం సందర్భంగా ప్రపంచ బ్యాంకు సహకారంతో చేపట్టిన రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చసాగింది. ఈ చర్చ సందర్భంగా రోడ్లు భవనాల శాఖ అధికారులు పనులు చేయని కాంట్రాక్టర్ల గురించి ప్రస్తావించారు. ప్రధానంగా కాకినాడ-రాజమండ్రి కెనాల్ రహదారి విస్తరణ పనులు చేయడంలో కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ విఫలం చెందిందని, దీనిపై ప్రపంచబ్యాంకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఆ సంస్థను తొలగించేందుకు సంబంధించిన ఫైలును రెండు నెలల క్రితమే సీఎం కార్యాలయానికి పంపించామని అధికారులు పేర్కొన్నారు. దీనిపై బాబు స్పందిస్తూ కాంట్రాక్టర్లను శత్రువులుగా చూడవద్దని, వారికి అడిగినంత మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వాలన్నారు. కాంట్రాక్టర్లతో పనులు చేయించుకునేలాగా వ్యవహరించాలంటూ అధికారులకే సీఎం క్లాప్ పీకారు. మొబిలైజేషన్స్ అడ్వాన్సు ఇచ్చినప్పటికీ పనులు చేయడం లేదని, సంవత్సరాలు గడిచినా రెండు శాతం కన్నా పనులు కూడా పూర్తి కాలేదని అధికారులు చెప్పినా... బాబు మాత్రం కాంట్రాక్టర్లనే వెనకేసుకువచ్చేలా మాట్లాడటం పట్ల అధికారులు విస్మయం చెందారు. ఆ పనులు ఇప్పటికీ కాలేదు ప్రపంచబ్యాంకు ఆర్థిక సాయంతో 310 కోట్ల రూపాయల వ్యయంతో 62 కిలో మీటర్ల మేర కాకినాడ-రాజమండ్రి కెనాల్ రహదారి విస్తరణ పనులను పీపీపీ విధానంలో ట్రాన్స్ట్రాయ్ సంస్థకు మూడేళ్ల క్రితం అప్పగించారు. అయితే ఇప్పటి వరకూ రెండు శాతం పనులను కూడా పూర్తి చేయకపోవడంతో అటు ఆర్థిక సాయం అందించిన ప్రపంచ బ్యాంకు ఇటీవల సమీక్షలో తీవ్ర అసంతప్తి వ్యక్తం చేసింది. దీంతో ట్రాన్స్ట్రాయ్ను పనుల నుంచి తొలగించాల్సిందిగా రోడ్లుభవనాల శాఖ సీఎంను కోరినా ప్రయోజనం లేకపోయింది. -
‘ఆ కాంట్రాక్టర్లు’ బ్లాక్‌లిస్టులో: తుమ్మల
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రహదారుల నిర్మాణ పనుల్లో నాణ్యతపై నిర్లక్ష్యం ప్రదర్శించే కాంట్రాక్టర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడమే గాక వారి పేర్లను బ్లాక్‌లిస్టులో చేరుస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. రోడ్డు పనులపై మంగళవారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.10,800 కోట్లతో చేపడుతున్న మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు, రెండు లేన్లుగా సింగిల్ రోడ్ల విస్తరణ తదితర పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎర్రమంజిల్‌లో నిర్మిస్తున్న ఆర్ అండ్ బీ కొత్త భవనాన్ని అనంతరం మంత్రి సందర్శించారు. -
అసెంబ్లీ సాక్షిగా ‘చిల్లర’ వ్యవహారం
- బిల్లు ఆపేశారంటూ ఆర్అండ్బీ - అధికారులపై స్పీకర్‌కు ఫిర్యాదు - చెల్లించాల్సిన రూ. 80 వేల - విషయంలో వివాదం సాక్షి, హైదరాబాద్: అస్మదీయులైతే నిబంధనలు పక్కకు పెడతారు.. కోరినన్ని పనులు దక్కేలా చూస్తారు. తమవారు కాకపోతే కమీషన్ ఇవ్వనిదే బిల్లులు ముందుకు సాగవు.. రోడ్డు భవనాల శాఖ లో ఇలాంటి ఫిర్యాదులు కోకొల్లలు. తాజాగా ఆ శాఖ అధికారుల తీరుపై ఓ కాంట్రాక్టర్ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి ఫిర్యాదు చేశాడు. అధికారులు అడిగిన కమీషన్ గడువుకు ముందు ఇవ్వలేదని తనకు చెల్లించాల్సిన బిల్లు ఆపేశారని ఆరోపించాడు. ఆ అధికారికి రావాల్సి న బిల్లు విలువ రూ. 80వేలు మాత్రమే.. చివరకు రోడ్లు భవనాల శాఖ దగ్గరకు ఈ పంచాయితీ చేరింది. ఇదీ సంగతి...: శాసన సభ, మండలి భవనాల్లో ఫర్నీచర్, కుళాయి, నీటిపైపులకు రోజువారీ ఫిర్యాదుల ప్రకారం మరమ్మతులు చేసేందుకు ప్లంబర్, కార్పెంటర్లను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియ ఔట్సోర్సింగ్ పద్ధతిలో జరుగుతుంది. దీని టెండర్లను ఈ ఏడాది జనవరిలో పిలిచారు. 6నెలలకు రూ. 2.48 లక్షల కాంట్రాక్ట్‌ను పర్ఫెక్ట్ సర్వీసెస్ అనే సంస్థకు 5.2 శాతం తక్కువగా కట్టబెట్టారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో మూడు నెలలకు సంబంధించి రూ. 80వేలను చెల్లించాలని అధికారులను కాంట్రాక్టు సంస్థ కోరింది. ఎన్నిసార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా స్పందిచలేదని స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. అసెంబ్లీ, మండలి భవనాల పనులకు బిల్లులు చెల్లించేందుకు సిద్ధం చేసిన జా బితాలో పర్ఫెక్ట్ సర్వీసెస్ సంస్థ పనుల మొత్తాన్ని చేర్చకపోవడంతో ఈ వివాదం వచ్చింది. -
హైవే ప్రయాణం వయా ‘ఈజీ’కే
గుండుగొలను-కొవ్వూరు రహదారిని నేషనల్ హైవేగా మార్చేందుకు కేంద్రం ఓకే కార్యరూపం దాలిస్తే ఏలూరు-రాజమండ్రి మధ్య ప్రయాణ కష్టాలకు చెక్ ఏలూరు (ఆర్ఆర్ పేట) : ఏలూరు నుంచి రాజమండ్రికి కొవ్వూరు మీదుగా రోడ్డు మార్గంలో వెళ్లాలంటే ప్రయాణికులే కాదు.. వాహన చోదకులూ హడలిపోతారు. ఎక్కడికక్కడ తూట్లుపడి.. మిట్టపల్లాలుగా ఉండే ఈ రహదారిపై ప్రయాణించడమంటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టేనని భావిస్తారు. ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం, తణుకు, రావులపాలెం మీదుగా రాజమండ్రి వెళదామంటే దూరం ఎక్కువ కావడంతో అటుగా వెళ్లేందుకు పెద్దగా ఇష్టపడరు. ఆర్టీసీ బస్సులను ఆశ్రయించి గుండుగొలను, దేవరపల్లి, కొవ్వూరు మీదుగా రాజమండ్రి వెళ్తుంటారు. అన్నీ అనుకూలిస్తే రానున్న రోజుల్లో ఏలూరు-గుండుగొలను-కొవ్వూరు (ఈజీకే) రహదారిగా పిలిచే ఈ రూట్లో సునాయాసంగా ప్రయాణించే వీలుంది. గుండుగొలను నుంచి కొవ్వూరు వరకు 65 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ రహదారిని జాతీయ రహదారిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనిని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) పరిధిలోకి తీసుకునేందుకు హామీ ఇచ్చింది. ఇది సాకారమైతే ఉభయగోదావరి జిల్లాల ప్రజల చిరకాల స్వప్నం సాకారం అవుతుంది. తక్కువ దూరం.. తక్కువ సమయం గుండుగొలను-కొవ్వూరు రహదారి ఎన్హెచ్ఏఐ పరిధిలోకి వెళితే ఈ రహదారి అభివృద్ధి చెందుతుందని జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరు నుంచి రాజమండ్రి వెళ్లడానికి తక్కువ దూరంతోపాటు తక్కువ సమయంలో గమ్యానికి చేరుకునే ఈ రహదారికి జాతీయ హోదా వస్తే విస్తరణ, అభివృద్ధి చెంది ప్రయాణం మరింత సౌకర్యంగా ఉం టుంది. ఈ అవకాశం కోసం వివిధ సంస్థలు, ప్రజలు ఎన్నోసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ రహదారిని ఎన్హెచ్ఏఐ పరిధిలోకి తీసుకునేందుకు సూత్రప్రాయంగా అంగీకరించిందనే వార్తలు వెలువడటంతో జిల్లా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వాహనాలపై ఏలూరు నుంచి రాజమండ్రి వెళ్లేవారు ఈ రహదారిపై ప్రయాణించలేక తణుకు రావులపాలెం మీదుగా వెళ్తున్నారు. గుండుగొలను, భీమడోలు, నల్లజర్ల, దేవరపల్లి మీదుగా వెళితే దూరం తక్కువగా ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం తణుకు, రావులపాలెం రహదారినే ఆశ్రయిస్తున్నారు. ఏలూరు నుండి గుండుగొలను, చేబ్రోలు, తాడేపల్లిగూడెం, దువ్వ, తణుకు, పెరవలి, ఖండవల్లి, సిద్ధాం తం, గోపాలపురం, రావులపాలెం మీదుగా రాజమండ్రికి జాతీయ రహదారి ఉంది. ఈ రహదారిపై వెళితే రావులపాలెం వరకూ సుమారు 104 కిలోమీటర్లు, అక్కడి నుంచి రాజమండ్రికి సుమారు మరో 30 కిలోమీటర్లు వెరసి సుమారు 134 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. కాగా గుండుగొలను నుండి భీమడోలు జంక్షన్, దేవరపల్లి, పంగిడి, కొవ్వూరు మీదుగా అయితే 95 కిలోమీటర్ల ప్రయా ణంతో రాజమండ్రికి చేరుకోవచ్చు. అయితే, ఈ రహదారిపై ప్రయాణం కష్టంగా మారడంతో ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు తణుకు, రావులపాలెం రహదారిని ఆశ్రస్తున్నారు. దేవరపల్లి దాటిన తరువాత క్వారీలు అధికంగా ఉండటం, రహదారులు ఛిద్రం కావడంతో ఇటువైపు ప్రయాణం ఆలస్యమవుతోంది. అంతేకాకుండా వాహనాలు గతుకుల్లో పడి దెబ్బతింటున్నాయి. దీని వల్ల ప్రజలకు అధిక సమయం, అధిక ఇంధనం వెచ్చించాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం గుండుగొలను-కొవ్వూరు రహదారిని జాతీయ రహదారిగా తీర్చిదిద్దితే సుమారు 10 మీటర్ల వెడల్పున నాలుగు వరసుల రోడ్డు నిర్మితమై ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది. సుమారు 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. -
ఆర్ అండ్ బీ బడ్జెట్ రూ.10,800 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రోడ్ల అభివృద్ధి, కొత్త సచివాలయ నిర్మాణం, రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణ... వెరసి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.10,800 కోట్లను కేటాయించాలని రోడ్లు, భవనాల శాఖ ప్రతిపాదిస్తోంది. ఆర్థికమంత్రికి సమర్పించేందుకు నివేదికను సిద్ధం చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం గత నవంబర్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ శాఖకు రూ.3,806 కోట్లను కేటాయించిన విషయం తెలిసిందే. ప్రతిపాదనలు సిద్ధం కాకపోవటం, ఎక్కువ సమయం లేకపోవటంతో ఇందులో దాదాపు రూ.వెయ్యి కోట్లు మిగిలే అవకాశం ఉంది. దీంతో ఈసారి భారీ ఎత్తున నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేసి నివేదిక రూపొందించారు. ప్రస్తుతం ఉన్న 10 వేల కిలోమీటర్ల రోడ్లను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ. 5 వేల కోట్లను మంజూరు చేసింది. ఇందులో తొలుత రూ.2,500 కోట్ల పనులు ప్రారంభించాలని నిర్ణయించిన అధికారులు టెండర్లు పిలిచారు. ఈ పనులకు సంబంధించి కొత్త బడ్జెట్లో రూ.1,200 కోట్లు కేటాయించాల్సిందిగా అధికారులు ప్రతిపాదించారు. వచ్చే సంవత్సరకాలంలో ఇంతకంటే ఎక్కువ పనులు చేయటం సాధ్యం కానందున దాన్ని అక్కడికే పరిమితం చేశారు. ఇక నియోజకవర్గ కేంద్రాల మీదుగా ఉన్న అన్ని రోడ్లను డబుల్ రోడ్లుగా చేసే ప్రాజెక్టుకు రూ.5 వేల కోట్లు ప్రతిపాదించారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు కచ్చితంగా రెండు లేన్ల రోడ్లు ఉండాలని సీఎం స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ పనులకు రూ.వెయ్యి కోట్లు ప్రతిపాదించారు. జాతీయ రహదారులకు సంబంధించి పీపీపీ పనులకు రూ.వెయ్యి కోట్లు, భవనాల విభాగానికి రూ.వెయ్యి కోట్లు ప్రతిపాదించారు. ఎర్రగడ్డలో కొత్తగా నిర్మించబోయే సచివాలయానికి రూ.490 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్న అధికారులు... మంత్రివర్గ సమావేశం రూ.150 కోట్లకు తీర్మానం చేసినందున అంత మొత్తాన్ని ఇందులో చూపారు. ఇక రైల్వే లైన్ల కోసం అవసరమైన భూసేకరణ కోసం రూ.400 కోట్లు చూపారు. వెరసి రూ.10,800 కోట్లు కేటాయించాలని నివేదికలో స్పష్టం చేశారు. -
'తెలంగాణలో కొత్త సచివాలయాన్ని నిర్మిస్తాం'
హైదరాబాద్: తెలంగాణ కొత్త సచివాలయాన్ని నిర్మించి తీరుతామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో తుమ్మల విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ప్రతిపక్షాలు వేరే పనిలేక తమపై విమర్శలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కొత్త సచివాలయాన్ని ఎలా నిర్మించుకోవాలో తమకు తెలుసునని తుమ్మల అన్నారు. కారణం లేకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తున్నారని విమర్శించారు. ప్రజా ఆమోదం ఉంటేనే తెలంగాణలో పర్యటించాలి, లేదంటే ప్రజలు ఛీ కొడతారని తుమ్మల తెలిపారు. -
రోడ్లపై ‘నిధుల వరద’
వరంగల్ రూరల్ : జిల్లాలోని రహదారులు, భవనాల శాఖకు నిధుల వరద తాకింది. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల వరకు ఉన్న సింగిల్ రోడ్లను డబుల్ లేన్ రహదారులుగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం జిల్లాకు రూ.453.35 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 24 సింగిల్ రోడ్లను డబుల్ లేన్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.281.05 కోట్లు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల వరకు ఉన్న 13 సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు రూ.172.30 కోట్లు కేటాయించింది. ఈ రోడ్ల మధ్యలో ఉన్న కల్వర్టులు, బ్రిడ్జిల నిర్మాణాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డబుల్‌గా మారనున్న సింగిల్ రోడ్లు... ⇒ ఊకల్ నుంచి తొర్రూరు రోడ్డు 9/0 నుంచి 53/0 కి.మీ వరకు రూ.45 కోట్లు ⇒ జంగిలిగొండ నుంచి నర్సింహులపేట రోడ్డు 0/0నుంచి 15/0 కి.మీ వరకు రూ.15కోట్లు ⇒ పరకాల నుంచి ఎర్రగట్టుగుట్ట వరకు 2/0నుంచి 14/4 కి.మీ వరకు రూ.15కోట్లు ⇒ పెద్దపెండ్యాల నుంచి పున్నేలు రోడ్డు 0/0నుంచి 13/0 కి.మీ వరకు రూ.15కోట్లు ⇒ ఘనపూర్ నుంచి వర్థన్నపేట రోడు 13/8నుంచి 17/3 కి. మీ వరకు రూ.4కోట్లు ⇒ పురుషోత్తమాయగూడేం నుంచి ఎల్లంపేట 0/0నుంచి 14/450కి.మీ వరకు రూ. 14కోట్లు ⇒ సిర్సేడు నుంచి మొగుళ్లపల్లి 2/0నుంచి 13/0 కి.మీ వరకు రూ.12కోట్లు ⇒ ములుగు-బుద్దారం రోడ్డు 1/0నుంచి 16/2 కి. మీ వరకు రూ.15కోట్లు ⇒ రేగొండ నుంచి జాకారం వరకు 0/0 నుంచి 17/866 కి.మీ వరకు రూ.20కోట్లు ⇒ నర్సింహులపేట నుంచి ఉగ్గంపల్లి వరకు 0/0నుంచి 7/0 కి.మీ వరకు 7కోట్లు ⇒ ఆలేరు బచ్చన్నపేట రోడ్డు 6/475నుంచి 17/070 కి.మీ వరకు రూ.14కోట్లు ⇒ డోర్నకల్ నుంచి సీతారాంపురం 0/0నుంచి 9/0 కి.మీ వరకు రూ. 10కోట్లు ⇒ కాజీపేట నుంచి ఉనికిచర్ల 3/2నుంచి 6/0 కి.మీ వరకు రూ.3కోట్లు ⇒ మొండ్రాయి పాలకుర్తి 12/0నుంచి 16/8 కి.మీ వరకు రూ. 5కోట్లు ⇒ వర్థన్నపేట నుంచి అన్నారం 0/0నుంచి 10/0 కి.మీ వరకు రూ.12కోట్లు ⇒ చేర్యాల నుంచి సల్వాపూర్ -యాదగిరిగుట్ట 0/0నుంచి 20/6 కి.మీ వరకు రూ.20కోట్లు ⇒ పిడబ్ల్యూడీ రోడ్ నుంచి పర్వతగిరి వయా వడ్లకొండ 12/5నుంచి 14/660 కి.మీ వరకు రూ.2.50కోట్లు ⇒ కురవీ నుంచి ఎల్లందు ఎక్స్‌రోడ్ 0/0నుంచి 2/660 కి.మీ వరకు రూ.3కోట్లు ⇒ పోతన కళామందిర్ 0/0నుంచి 1/675, చింతల్ నుంచి ఖమ్మం రోడ్ వయా ఫోర్ట్వరంగల్ 1/0నుంచి 3/4వరకు రూ.6కోట్లు ⇒ హన్మకొండ- నర్సంపేట-మహబూబాబాద్ 7/0నుంచి 8/0 కి.మీ వరకు 2.75కోట్లు ⇒ వెంకటాపూర్ బ్రాంచ్ రోడు 0/0నుంచి 1/4 వరకు రూ.2.80కోట్లు ⇒ కందికొండ నుంచి చిన్నగూడూరు 0/0నుంచి 14/100 కి.మీ వరకు రూ.18కోట్లు ⇒ గిరిపురం నుంచి ఎల్లంపేట 0/0నుంచి 6/0వరకు రూ.10కోట్లు మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్లే... ⇒ శాయంపేట మండలంలో... ఆత్మకూరు టు శాయంపేట 0/0 నుంచి 5/0 కి.మీ వరకు రూ.6కోట్లు ⇒ నెక్కొండ నుంచి ఇనుగుర్తి వరకు 1/0నుంచి 3/0 వరకు చింత నెక్కొండ 23/2 నుంచి 27/960 కి.మీ వరకు రూ.8కోట్లు ⇒ ధర్మసాగర్మడికొండ నుంచి ధర్మసాగర్ వరకు 0/0 -6/240 కి.మీ వరకు రూ.7.50కోట్లు ⇒ సంగెం మండలంలోని ఊకల్ నుంచి తొర్రూరు వరకు 0/0 నుంచి 9/0వరకు రూ.10.80కోట్లు ⇒ పాలకుర్తి మండలంలోని స్టేషన్ఘనపూర్ నుంచి పాలకుర్తి 3/0నుంచి 14/0వరకురూ.13050కోట్లు ⇒ జఫర్గడ్ మండలంలోని స్టేషన్ఘనపూర్ నుంచి జఫర్‌గఢ్ వరకు 0/0నుంచి 9/50వరకు రూ.11.50కోట్లు ⇒ పర్వతగిరి మండలంలో పీడబ్ల్యూడీ రోడ్ నుంచి ఉప్పరపల్లి వయా వడ్లకొండ వరకు 7/0నుంచి 14/661వరకు రూ.9.50కోట్లు ⇒ కొడకండ్ల మండలంలో ఎలచల్ కొడకండ్ల రోడ్డుకు 0/0నుంచి 4/030 వరకు రూ.5కోట్లు ⇒ తొర్రూరు నుంచి వలిగొండ రోడ్డు 9/3 నుంచి 7/50 కి.మీ వరకు రూ.15 ⇒ కొత్తగూడ మండలం...ఎల్లందు పాఖాల్ 4/8 నుంచి 5/91 కి. మీ వరకుర రూ.13.50కోట్లు ⇒ దుగ్గొండి మండలంలో మహ్మద్ గౌస్‌పల్లి నుంచి గిర్నిబావి రోడ్ వయా నందిగామ-దుగ్గొండ 0/0నుంచి 11/00 వరకు 13.30కోట్లు ⇒ మద్దూరు మండలంలో.. మర్రిముచ్యాల నంచి వడ్లకొండ 7కిమీ (మద్దురు)జనగామ హుస్నాబాద్ 27కిమీవరకు(తరిగొప్పుల) రూ.23కోట్లు ⇒ నర్మెట్ట మండలంలో... రఘునాథపల్లి నుంచి నర్మెట్ట రోడ్డు 0/0 నుంచి 22/3వరకు రూ.27కోట్లు ⇒లింగాలఘనపూర్ మండలంలో.. జనగామ సూర్యాపేట ఎక్స్‌రోడ్ 4/2నుంచి నెల్లుట్ల-బండ్లగూడేం రోడ్డు 0/0 నుంచి 7/2 వరకు రూ.8.70 కోట్లు -
ముంబై-గోవాల మధ్య లాంచీ సేవలు
రూ. 868 కోట్ల ప్రాజెక్టుకు సిద్ధమవుతున్న ప్రతిపాదనలు సాక్షి, ముంబై: ముంబై-గోవాల మధ్య జలరవాణ మార్గాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయి. కొద్ది రోజుల కిందట ఈ ప్రతిపాదన తెరమీదకు వచ్చినప్పటికీ అనివార్య కారణాల వల్ల అది అటకెక్కింది. అయితే రోడ్డు మార్గం ద్వారా రాకపోకలు సాగించే ప్రజారవాణా సదుపాయాలపై ప్రయాణికుల భారం విపరీతంగా పడుతోంది. ఈ భారాన్ని తగ్గించాలంటే ముంబై-గోవాల మధ్య లాంచి సేవలు ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ప్రభుత్వం ఆ దిశగా మళ్లీ సన్నాహాలు చేస్తోంది. సుమారు 500 మంది ప్రయాణించే సామర్థ్యంగల స్టీమర్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ముంబై-గోవా మధ్య స్టీమర్లను ప్రారంభిస్తే గణపతి పుళే, మాల్వణ్, వెంగుర్లా, తార్కలి ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. విలువైన సమయంతోపాటు చార్జీలు కూడా గిట్టుబాటు అవుతాయి. అదే రోడ్డు మార్గం మీదుగా వెళ్లాలంటే వ్యయప్రయాసాలను భరించాల్సి వస్తోంది. ముంబైలోని భావుచా ధక్కా నుంచి నేరుల్ వయా జేఎన్పీటీ, అలాగే నారిమన్ పాయింట్ నుంచి జుహూ టెర్మినల్, మార్వే నుంచి బోరివలి ఇలా లాంచి సేవలు అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రయోజనకరంగా ఉటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకు రూ.868 కోట్ల ప్రాజెక్టుకు ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల కిందట కొంకణ్ శక్తి, కొంకణ్ సేవక్ పేరుతో రెండు లాంచీలు ముంబై-గోవా మధ్య ప్రయాణించేవి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ సేవలు నిలిపివేశారు. అనంతరం దమానియా షిప్పింగ్ కంపెనీ కొన్ని నెలలపాటు హోవర్ క్రాఫ్ట్ సేవలు అందించింది. ఇవి కూడా మూతపడిపోయాయి. దీంతో ప్రభుత్వం ఆధ్వర్యంలో లాంచీ సేవలను ప్రారంభించాలనే డిమాండ్లు పెరగడంతో అందుకు అవసరమైన టెండర్లను పిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సేవలు అందించే బాధ్యత మేరీ టైమ్ బోర్డుకు అప్పగించాలని యోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. -
ఒక్క వృక్షం ఉంటే ఒట్టు !
భువనగిరి జాతీయ రహదారి విస్తరణతో పచ్చదనం కోల్పోయి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్- భూపాలపట్నం జాతీయ రహదారి 163 విస్తరణ పనులు పూర్తయ్యాయి. అయితే నాలుగులేన్ల రోడ్డు విస్తరణకు ముందున్న రెండు వరుసల రోడ్డు పక్కన గల భారీ వృక్షాలను నిర్దాక్షిణ్యంగా నరికివేశారు. అప్పట్లో ప్రజలు చెట్లను నరకవద్దని అడ్డుకోగా నూతన సాంకేతిక విధానం ద్వారా చెట్లను నూతన రోడ్డు పక్కన ఏర్పాటు చేస్తామని అటవీశాఖ అధికారులు హామీ ఇచ్చారు. దీంతో చె ట్లు నరకడానికి అనుమతిని ఇచ్చారు. కానీ రోడ్డు పూర్తి చేయడానికి అధికారులు చెట్లు నరకడంలో చూపిన శ్రద్ధ వాటిని పెంచే విషయంలో చూపలేదు. ఫలితంగా జాతీయ రహదారికి ఇరువైపులా కనీసం నిలువ నీడలేని పరిస్థితి నెలకొంది. రాయగిరి నుంచి రంగారె డ్డిజిల్లా సంస్కృతి టౌన్ షిప్ వరకు 38 కిలోమీటర్ల దూరం ఒక్క నీడనిచ్చే చెట్టు లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమౌతోంది. 46 డిగ్రీల ఎండ వేడిమిలో ద్విచక్రవాహనాలు, ఇతర వాహనాల్లో ప్రయాణించే వారికి కనీసం నీడలేదు. తీవ్రమైన ఎండలో వడగాలిని తట్టుకుని ప్రయాణించే వారు కొద్ది సేపు ఆగి సేదదీరడానికి చెట్లు లేకపోవడంతో వారు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు, ఆనారోగ్యంతో బాధపడే వారికి రోడ్డుపై మధ్యాహ్నం ప్రయాణం ప్రాణాంతకంగా మారింది. వాహనాల ఇంజన్ల వేడి అయితే కొద్దిసేపు విరామం కోసం నిలిచిఉందామన్నా ఎక్కడా నీడలేదు. రోడ్డు పక్కన చెట్లు పెంచాలి జాతీయ రహదారి పక్కన చెట్లు పెంచాలి. ఒకప్పుడు ఈ రోడ్డు వెంట పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి. రోడ్డు విస్తరణ పేరుతో వాటిని తొలగించారు.ప్రస్తుతం ప్రయాణికులకు నిలువ నీడలేకుండా పోయింది. భువనగిరి నుంచి అన్నోజీగూడ వరకు ఒక్క చెట్టు లేదు. ఎండపూట ప్రయాణించే వారు నీడ కోసం అల్లాడిపోతున్నారు. జాతీయరహదారి అధికారులు చెట్ల పెంపకానికి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాలి. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలి. - మహమూద్, డ్రైవర్, భువనగిరి ఎండిపోయిన మొక్కలు జాతీయ రహదారి విస్తరణ తరువాత రోడ్డు పక్కన రోడ్డు నిర్వహణ సంస్థవారు నాటిన మొక్కలు సరైన ఆలనా పాలనా లేక ఎండిపోతున్నాయి. వేసవి ఎండలకు తోడు మొక్కలకు నీరు పోయకపోవడంతో రోడ్డు పక్కన నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. నిబంధనల ప్రకారం రోడ్డు విస్తరణచేపట్టిన నిర్మాణ సంస్థలు మొక్కలు పెంచాలి. ఇందుకోసం ప్రత్యేక సిబ్బందిని నియమించి మొక్కల ఆలనాపాలన చూడాలి. అయితే ఈ పరిస్థితి కన్పించడం లేదు. భువనగిరి, రాయగిరి, అనంతారం, బీబీనగర్ ప్రాంతాల్లో డివైడర్ల మధ్యన గల పూల మొక్కలు ఎండిపోయేస్థితికి చేరాయి. పెద్ద చెట్లను నరికేశారు విస్తరణకు ముందు రోడ్డుకు ఇరువైపులా పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి. వాటిలో చింత, మామిడి, తుమ్మ, వేప, అల్లనేరేడు వంటి చెట్ల నుంచి ప్రభుత్వానికి ఆదాయం సమకూరేది. రోడ్డును వెడల్పు చేస్తామని చెప్పి పెద్ద వృక్షాలను అడ్డంగా నరికేశారు. ఈ నేపథ్యంలో వందల సంవత్సరాల సంపదను నాశనం చేయవద్దని కొందరు అడ్డగించడంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. నరికిన వృక్షాలను రసాయనాల ద్వారా రోడ్డు పక్కన ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. చెట్ల మొదళ్లలో రసాయనాలు పూసి కొంతకాలం వాటిని పక్కన ఉంచి అనంతరం వాటికి తిరిగి ప్రాణఃపతిష్ట చేస్తామని చెప్పారు. ఇందుకోసంప్రత్యేక లేపనాలు వచ్చాయని చెప్పారు. తీరా రోడ్డు పూర్తయ్యేసరికి లక్షల రూపాయల విలువ చేసే చెట్లు కనుమరుగై పోయాయి. -
రహ‘దారి’ ఏది?
- ఏటా లక్షల్లో రోడ్లపైకి వస్తున్న కొత్త వాహనాలు - విపరీతంగా పెరుగుతున్న ద్విచక్రవాహనాల సంఖ్య - నగరవాసుల్లో ఏడాదికేడాది పెరుగుతున్న మోజు - ఫలితంగా ప్రమాదకరంగా మారుతున్న రహదారులు - ఆందోళనను కలిగిస్తున్న కాలుష్యం తీవ్రత సాక్షి, ముంబై: నగరంలో రోజురోజుకూ ద్విచక్ర వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. తత్ఫలితంగా కిక్కిరిసిన వాహనాలతో రహదారులు ప్రమాదకరంగా మారుతున్నాయి. ముంబై రిక్షామెన్ యూనియన్ నాయకుడు తంపీ కురేన్ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల మేరకు.. ఏప్రిల్-2013 నుంచి మార్చి 2014 మధ్య కాలంలో వాహనాల సంఖ్య 1,86,640 కు పెరిగింది. మార్చి 1998 నుంచి మార్చి 2013 వరకు ప్రతి సంవత్సరం 88,510 వాహనాలు సగటున రోడ్లపైకి వస్తున్నాయి. కొత్తగా రోడ్లపైకి వస్తున్న వాహనాలను చూసి అధికారులు నిర్ఘాంత పోతున్నారు. ప్రస్తుతం ద్విచక్ర వాహనాల కొనుగోళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం నగరంలోని మూడు ఆర్టీవో కేంద్రాల్లో 23,74,038 వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఇందులో అంధేరి ఆర్టీవో కార్యాలయంలో 1,86,640 ద్విచక్రవాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకోగా, వడాలా, తాడ్‌దేవ్ ఆర్టీవో కార్యాలయాలలో 1,02,829 ద్విచక్రవాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో నగరంలో ద్విచక్రవాహనాలు ఉపయోగించే వారి సంఖ్య ఎంతగా పెరిగిందో తెలుస్తోంది. 1998 ఆర్థిక సంవత్సరం వరకు నగరంలో కేవలం 3,54,799 ద్విచక్రవాహనాలు ఉండగా మార్చి 2013లో వీటి సంఖ్య 12,35,282కు పెరిగింది. 1998 నుంచి ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేస్తున్నవారి సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఇదిలా ఉండగా కార్లు ఉపయోగించే వారి సంఖ్య కూడా గణనీయంగానే పెరుగుతోంది. 1998లో నగర రోడ్లపై 2,73,581 కార్లు ఉండగా, మార్చి 31, 2014 వరకు కార్ల సంఖ్య 7,28,225కు చేరుకుంది. గత 16 సంవత్సరాల్లో 166 శాతం కార్ల సంఖ్య పెరిగిందని అధికారి తెలిపారు. దీంతో కాలుష్య కారకాల జాబితాలో ఆటోలతోపాటు కార్లు కూడా చేరాయి. ప్రస్తుతం నగర రహదారులపై డీజిల్ కార్ల సంఖ్య పెరగడంతో కార్ల వల్ల జరుగుతున్న కాలుష్యం కూడా ఏమంత తక్కువేం కాదన్నారు. దీంతోపాటు అత్యంత క్యూబిక్ కెపాసిటీ(సీసీ) ఉన్న వాహనాలు రోడ్లపైకి వస్తుండడం, వాటి వేగం కూడా ఎక్కువగా ఉంటుండడంతో రహదారులు ప్రమాదకరంగా మారుతున్నాయి. -
ఇదేం పని ?
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్: నిత్యం రద్దీగా ఉండే పరకాల-భూపాలపల్లి రోడ్డును దశల వారీగా అభివృద్ధి చేయూలని ప్రభుత్వం సంకల్పించింది. పరకాల నుంచి భూపాలపల్లి, కాటారం, మహదేవపూర్ మీదుగా పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం వరకు రహదారి అభివృద్ధికి మొదటి విడతగా ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో రూ 8 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ముందుగా ఆర్అండ్బీ శాఖ అధికారులు పరకాల నుంచి భూపాలపల్లి రహదారిలోని 7/0నుంచి 27/0 వరకు రోడ్డును 5.5 మీటర్ల నుంచి 7 మీటర్ల వరకు వెడల్పు చేసేందుకు టెండర్లను ఆహ్వానించి ఖరారు చేశారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టాడు. రోడ్డుకిరువైపులా మట్టితీసి కంకరచూర, మెటల్‌తో నింపాలి. అరుుతే నిర్దేశించిన ప్రమాణాలను పక్కనబెట్టి పనులు కొనసాగించాడు. మరోవైపు ఆర్థిక సంవత్సరం ముగుస్తుండంతో నిధులు మురిగిపోతాయని భావించిన కాంట్రాక్టర్... అధికారులతో కుమ్మక్కయ్యూడు. బీటీ వేయకుండానే మొత్తం రహదారి పనులు పూర్తయినట్లు మార్చి నెలలో ఎంబీ రికార్డు చేసి బిల్లులు పొందాడు. ఈ వ్యవహారంలో కాంట్రాక్టర్, అధికారులు పెద్ద ఎత్తున పంపకాలు చేసుకున్నట్లు సమాచారం. క్యూసీ ధ్రువీకరణ లేకుండానే... పనులు జరుగుతున్న సమయంలోనే క్వాలిటీ కంట్రోల్(క్యూసీ) అధికారులు తనిఖీలు నిర్వహించి నాణ్యత సర్టిఫికెట్ ఇవ్వాలి. ఆ తర్వాతనే బిల్లులను పీఏఓ చెల్లించాల్సి ఉంటుంది. అరుుతే కాంట్రాక్టర్ తన పలుకుబడిని ఉపయోగించి క్యూసీ ధ్రువీకరణ లేకుండానే బిల్లులు పొందినట్లు తెలిసింది. పనులు పూర్తయినట్లు తెలియడంతో ఈ ప్రాంతానికి చెందిన కొందరు దీనిపై క్వాలిటీ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేయగా.. రోడ్డు పనులకు సంబంధించిన రికార్డులందించాలని సబ్ డివిజన్ ఇంజినీర్లకు సూచించారు. అందుకు వారు స్పందించకపోవడంతో ఈ నెల మొదటి వారంలో మరోసారి కోరారు. అరుునా స్పందన లేకపోవడం.. ఈ విషయం వరంగల్ డివిజన్లో చర్చనీయాంశంగా మారడంతో క్యూసీ అధికారులు నేరుగా తనిఖీలు చేపట్టారు. రెండు రోజుల క్రితం రహదారిపై చేపట్టిన పరిశీలనలో బీటీ వేయకుండానే సుమారు రూ కోటి వరకు బిల్లులు పొందినట్లు నిర్ధారణ అయింది. అంతేకాదు... ఈ రహదారిలో పలు చోట్ల బీటీ వేయలేదన్న విషయాలు వారి పరిశీలనలో తేలినట్లు సమాచారం. ఈ మేరకు ఉన్నతాధికారికి క్యూసీ అధికారులు నివేదిక అందజేసినట్లు తెలిసింది. పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్... పనులు చేయకుండానే బిల్లులు పొందినట్లు అధికారులకు ఫిర్యాదు అందడంతో సంబంధిత కాంట్రాక్టర్ బీటీ వేసేందుకు పనులు ప్రారంభించాడు. ఎప్పుడో రోడ్డును వెడల్పు చేయగా... ఇప్పుడు రోలింగ్ చేస్తుండడంతో ఆ ప్రాంతం వారు విస్తుపోతున్నారు. కాగా, ఈ రహదారిలో మొత్తం పనులు అసంపూర్తిగా ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం వేస్తున్న బీటీ కూడా నాణ్యత లేకుండా తూతూ మంత్రంగా వేస్తున్నా... పట్టించుకునే నాథుడే కరువయ్యారని స్థానికులు చెబుతున్నారు. ఉన్నతాధికారి కనుసన్నల్లోనే... ఆర్‌అండ్‌బీకి చెందిన ఉన్నతాధికారి కనుసన్నల్లోనే ఈ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమాలను పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోకుండా కేవలం డిప్యూటేషన్‌పై పంపించడం ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది. బీటీ వేయకుండా సుమారు రూ కోటికి పైగా బిల్లులు పొందిన విషయం బయటకు పొక్కడంతో సంబంధిత సబ్ డివిజన్‌కు చెందిన డీఈ, ఏఈ, జేఈలను మహబూబాబాద్ డివిజన్‌కు డిప్యూటేషన్‌పై పంపించినట్లు తెలిసింది. వారి స్థానంలో హన్మకొండ డీఈకి అదనపు బాధ్యతలు అప్పగించి, మరో ఇద్దరు ఇతర ప్రాంతాలకు చెందిన ఏఈలను పరకాల సబ్‌డివిజన్‌కు ఇన్‌చార్జ్‌లుగా నియమించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై పరకాల ఇన్చార్జ్ డీఈ రామకృష్ణను సంప్రదించగా... పనులు పూర్తి కాలేదని, జరుగుతున్నాయని తెలిపారు.