రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక  | Special Plan For Road Development Taneti Vanita | Sakshi
Sakshi News home page

రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక 

Published Mon, Apr 25 2022 8:44 AM | Last Updated on Mon, Apr 25 2022 8:58 AM

Special Plan For Road Development Taneti Vanita - Sakshi

తాళ్లపూడి: రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. మండలంలోని ప్రక్కిలంక నుంచి చిట్యాల వరకూ ఆర్‌అండ్‌బీ రోడ్డుకు ప్రక్కిలంకలో ఆదివారం ఆమె శంకుస్థాపన చేశారు. రూ.3.40 కోట్లతో ఎనిమిది కిలోమేటర్ల మేర ఈ బీటీ రోడ్డు పనులు చేపడుతున్నారు. శంకుస్థాపన అనంతరం తాళ్లపూడిలోని అబుబాకర్‌ మసీదులో జరిగిన ఇఫ్తార్‌ విందులో మంత్రి వనిత పాల్గొన్నారు. ముస్లింల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని అన్నారు. 

మసీదు కమిటీ ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ పోశిన శ్రీలేఖ, ఎంపీపీ జొన్నకూటి పోసిరాజు, వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ కాకర్ల వెంకటేశ్వరరావు, ఆర్‌అండ్‌బీ డీఈ హరికృష్ణ, ఏఈ సమీర్, సర్పంచులు యాళ్ల స్వప్న, కొమ్మిరెడ్డి పరశురామారావు, ఎల్లిన శివ, వైఎస్సార్‌ సీపీ నాయకులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement