కొవ్వూరులో మంత్రి క్యాంపు కార్యాలయంలో మెగా జాబ్‌మేళా పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న హోంమంత్రి తానేటి వనిత
కొవ్వూరు: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్ధ, జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, సీడాప్ సంయుక్తంగా తూర్పుగోదావరి జిల్లాలో ఈనెల 9న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర హోమ్ మంత్రి తానేటి వనిత తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో సోమవారం దీనికి సంబంధించిన పోస్టరును ఆమె ఆవిష్కరించారు. ఈసందర్భంగా వనిత మాట్లాడుతూ కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి మేళా ప్రారంభం అవుతుందన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని కోరారు. 15 ప్రముఖ కంపెనీలు మేళాలో పాలుపంచుకుంటాయన్నారు. 1,367 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారన్నారు. పాలిటెక్నిక్, ఐటీఐ, బీఎస్సీ కెమీస్ట్రీ, బీకామ్, పదో తరగతి, ఎంఫార్మసీ,బీ ఫార్మసీ, డీఫార్మసీ, ఇంటర్ మీడియట్ పూర్తి చేసుకున్న 19 నుంచి 30ఏళ్ల లోపు యువతీ యువకులంతా జాబ్ మేళాను సద్వినియోగ పరుచుకోవాలన్నారు. ఎంపికైన అభ్యర్ధులకు రూ.10వేల నుంచి రూ.20వేల వరకు ఆయా కంపెనీలు వేతనం చెల్లిస్తాయన్నారు.
ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక నిర్వహిస్తారని జిల్లా ఉపాధి కల్పనా అధికారి కె.హరీష్ చంద్రప్రసాద్ తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ముందుగాపూర్తి వివరాలతో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. జాబ్ మేళాకు వచ్చే అభ్యర్ధులు తమ ఆధార్, పాన్, ఇతర సర్టిఫికెట్స్‌ను వెంట తెచ్చుకోవాలన్నారు. వివరాల కోసం 6303889174, 96664 72877, 90596 41596 నెంబర్‌లను సంప్రదించాలని సూచించారు. జిల్లా నైపుణ్యావృద్ధికారి శీలం ప్రశాంత్, జేడీ ఎం. సుమలత, ప్లేస్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: ఆరు గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరు..)
జగనన్న పాలనలో బీసీలకు ప్రాధాన్యం
చాగల్లు: బీసీల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశేష కృషి చేస్తున్నారని హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. చాగల్లు మండలం ఊనగట్లలో నియోజకవర్గ బీసీ నాయకులతో సోమవారం ఆమె సమావేశమయ్యారు. విజయవాడలో జరగనున్న జయహో బీసీ మహాసభకు అధిక సంఖ్యలో తరలి రావాలని మంత్రి పిలుపు నిచ్చారు. బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. కార్పొరేషన్ డైరెక్టర్లు సంసాని రమేష్, పొన్నాడ సింహాద్రి, చాగల్లు, తాళ్లపూడి, కొవ్వూరు వైఎస్సార్‌సీపీ మండల బీసీ సెల్ అధ్యక్షులు మేకా రాజు, ఎం.పోసిబాబు, కట్టా బ్రాహ్మజీ, వైఎస్సార్‌సీపీ బీసీ నాయకులు అక్షయపాత్ర రవింద్ర శ్రీనివాస్, మట్టా వెంకట్రావు, పిల్లి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: నేనూ బీసీ ఇంటి కోడలినే.. మంత్రి రోజా)
Comments
Please login to add a commentAdd a comment