KOVVURU
-
కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు కన్నుమూత
సాక్షి, తూర్పుగోదావది: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత పెండ్యాల వెంకట కృష్ణ బాబు మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. నేడు తెల్లవారుజామున కృష్ణబాబు చనిపోయినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.కృష్ణబాబు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామం దొమ్మేరుకు తరలించారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా 1953లో పాలకొల్లులో జన్మించిన కృష్ణబాబు.. కొవ్వూరు నియోజకవర్గంలో అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983 నుంచి 1994 వరకు(1983,1985, 1989, 1994) నాలుగుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో ఓటమి చెందిన ఆయన తిరిగి 2004లో అయిదవసారి కొవ్వూరు ఎమ్మెల్యేగా గెలిచారు.ఇక 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో కొవ్వూరు ఎస్సీ రిజర్వ్ కావడంతో ప్రత్యక్ష రాజకీయాలకు కృష్ణబాబు దూరంగా ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుదీర్ఘకాలం రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా కృష్ణబాబు పేరొందారు. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు ప్రస్తుతం స్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు నేతలు సంతాపం తెలియజేస్తున్నారు. -
15 కోట్లు కొవ్వూరు సీట్...టీడీపీ సంచలన ఆడియో..
-
కొవ్వూరు పచ్చపార్టీలో వర్గపోరు
గోదావరి ఒడ్డున ఉన్న కొవ్వూరు టీడీపీలో వర్గపోరు తీవ్రమవుతోంది. ఈ ఎస్సీ నియోజకవర్గంలో ఇద్దరు నేతలు ఘర్షణ పడుతుంటే చంద్రబాబు వినోదం చూస్తున్నారు. సీటు కోసం ప్రయత్నిస్తున్న మాజీ మంత్రిని అక్కడి క్యాడర్ అడ్డుకుంటోంది. మరో నేతను బరిలో దించేందుకు ప్లాన్ చేస్తున్న మాజీ మంత్రి వ్యతిరేకులు. రెండు వర్గాల మధ్య కుంపటి వెలిగించి చలి కాచుకుంటున్న చంద్రబాబు. అసలు కొవ్వూరు పచ్చ పార్టీలో ఏం జరుగుతోంది? తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ మాజీ మంత్రి కేఎస్ జవహర్ పై అసమ్మతి తీవ్రమవుతోంది. చంద్రబాబే రగిల్చిన కుంపట్లు చల్లార్చడానికి ఆయనే నియమించిన ద్విసభ్య కమిటీ ఒక వర్గం గానూ.. నియోజకవర్గంలో పార్టీని ప్రభావితం చేయగల మరో ముఖ్యనేత అచ్చిబాబు వర్గం మరోపక్క జవహర్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి. ఈ రెండు వర్గాలు నియోజకవర్గంలోని వారి సానుభూతిపరులతో రహస్య సమావేశాలు పెట్టి చర్చలు జరుపుతున్నాయి. జవహర్ కు కొవ్వూరు స్థానం కేటాయిస్తే అందరం కలిసి చిత్తుగా ఓడిస్తామని టీడీపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశాయి రెండు వర్గాలు. జవహర్ వద్దు - టీడీపీ ముద్దు అంటూ జవహర్ వ్యతిరేకులు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పార్టీ నాయకత్వం కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో కొవ్వూరు తెలుగుదేశంలో సీటు వ్యవహారం హీటెక్కింది. టీడీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న జవహర్ కొవ్వూరులో తనకంటూ ఒక బలమైన వర్గాన్ని తయారు చేసుకున్నా ఆయన పెత్తనం మాత్రం సాగడం లేదు. కొవ్వూరు వ్యవహారాల్లో తలదూర్చవద్దని గతంలో అధిష్టానం కూడా ఆయన్ను హెచ్చరించింది. కొవ్వూరులోనే నివాసం ఉంటున్న జవహర్ ను ద్విసభ్య కమిటీ నియోజకవర్గ రాజకీయాల్లో వేలు పెట్టనివ్వడంలేదు. ప్రస్తుతం సుబ్బరాయ చౌదరి, కంఠమని రామకృష్ణ ఆధ్వర్యంలోని ద్విసభ్య కమిటీ సారధ్యంలోనే కొవ్వూరు టీడీపీ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ పరిణామంపై జవహర్ వర్గం ఎప్పడినుంచో గుర్రుగా ఉంది. కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును బరిలోకి దింపేందుకు జవహర్ వ్యతిరేక వర్గాలు పావులు కదుపుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు సైతం ముప్పిడి అభ్యర్థిత్వాన్ని అంగీకరించారన్న ప్రచారం సాగుతుండగా..ఆయన రంగంలోకి దిగి నియోజకవర్గం అంతా పర్యటిస్తున్నారు. ద్విసభ్య కమిటీలోని ఓ సభ్యుడైన జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి గతంలో మాజీ మంత్రి జవహర్‌తో సన్నిహితంగానే ఉన్నారు. ఆ తర్వాత వారి మధ్య తలెత్తిన ఆర్థిక వివాదాల కారణంగా చౌదరి సైతం జవహర్‌కు దూరమయ్యారు. జవహర్ మంత్రిగా ఉన్న సమయంలో అచ్చిబాబును వ్యతిరేకించడంతో ఆయన కూడా ఇప్పుడు వ్యతిరేకం అయ్యారు. తమ పంతం నెగ్గించుకోవడానికి ద్విసభ్య కమిటీ, అచ్చిబాబు వర్గాలు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇటీవల జవహర్ పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల ఏర్పాటు దొమ్మేరు గ్రామంలో వివాదంగా మారింది. ఓ వర్గం నేతలు గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి మరీ జవహర్‌పై విమర్శలు గుప్పించారు. 2014 నుంచి సీనియర్ నాయకులను, కార్యకర్తలను పక్కన పెట్టిన ఆయన వర్గ విభేదాలకు కారకుడయ్యారని వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరుతున్నా టీడీపీ అధినేత చంద్రబాబు వాటిని చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదు. సీటు ఎవరికి ఇస్తారన్న స్పష్టత ఇవ్వకపోవడంతో ఇరు వర్గాల మధ్య రోజు రోజుకూ విభేదాలు తీవ్రమవుతున్నాయి. జవహర్ వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని ఆయన వర్గం ప్రచారం చేసుకుంటోంది. ఇదే జరిగితే జవహర్‌ను వ్యతిరేకిస్తున్న వర్గాలు టీడీపీకి దూరమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ జవహర్‌ను కాదంటే ఆయన వర్గం దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ పరిస్థితుల్ని పచ్చ పార్టీ అధినేత ఎలా చక్కదిద్దుకుంటారో చూడాలి. -
కొవ్వూరు రైల్వేస్టేషన్లో రైళ్లను పునరుద్ధరించాలి: తానేటి వనిత
సాక్షి, విజయవాడ: కరోనా సమయంలో లాక్ డౌన్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా కొవ్వూరు రైల్వేస్టేషన్లో రద్దు చేసిన రైళ్లును పునరుద్దరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత కోరారు. శనివారం ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న నిర్మలా సీతారామన్‌ను విజయవాడలో కలిసి ఈ మేరకు ఆయా రైళ్ల వివరాలను ప్రత్యేక లేఖ ద్వారా ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కొవ్వూరు రైల్వేస్టేషన్లో రెగ్యులర్‌గా నిలుపుదల చేయవలసిన రైళ్లను నిలుపుదల చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. హైదరాబాద్, మద్రాసు, బెంగుళూరు, తిరుపతి వెళ్లే ప్రయాణికులు రైళ్లు నిలుపుదల చేయకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని, వ్యయ ప్రయాసలకు గురై రాజమహేంద్రవరం వెళ్లి రైళ్లు ఎక్కవలసి వస్తుందన్నారు. ప్రజలశేయస్సు దృష్ట్యా కొవ్వూరు స్టేషన్లో కొవిడ్ కారణంగా రద్దుచేసిన రైళ్లును పునరుద్ధరించాలని కోరారు. సదరు విజ్ఞప్తిని కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి కొవ్వూరు నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను తొలగించాలని నిర్మలా సీతారామన్ ను హోంమంత్రి తానేటి వనిత కోరారు. కొవ్వూరు రైల్వేస్టేషన్ కొవ్వూరు, పోలవరం, గోపాలపురం మొత్తం మూడు నియోజకవర్గాల్లోని ప్రజలకు అందుబాటులో ఉంటుందని వివరించారు. కరోనా లాక్ డౌన్ అనంతరం 4 రైళ్లను మాత్రమే పునరుద్దరించారని.. మరో 9 రైళ్లను పునరుద్దరించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. కొవ్వూరులో పునరుద్దరించాల్సిన రైళ్ల జాబితాను అందజేశారు. పునరుద్దరించాల్సిన రైళ్లలో విజయవాడ వైపు, విశాఖపట్నం వైపు తిరిగే రైళ్లున్నాయి. తిరుమల ఎక్స్ ప్రెస్ (17488, 17487), సర్కార్ ఎక్స్ ప్రెస్ (17644, 17643), బొకారో ఎక్స్ ప్రెస్ (13351, 13352), కాకినాడ-తిరుపతి ఎక్స్ ప్రెస్ (17250, 17249), సింహాద్రి ఎక్స్ ప్రెస్ (17240, 17239), తిరుపతి-పూరి ఎక్స్ ప్రెస్ (17479, 17480), మచిలీపట్నం-విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ (17220, 17219), రాయగడ-గుంటూరు ఎక్స్ ప్రెస్ (17244, 17243), బిలాస్ పూర్ ఎక్స్ ప్రెస్ (17482, 17481) రైళ్లకు కొవ్వూరు రైల్వేస్టేషన్ లో ఆగేవిధంగా పునరుద్దరించాలని హోంమంత్రి అందజేసిన లేఖలో పేర్కొన్నారు. హోంమంత్రి విజ్ఞప్తి పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. కొవ్వూరు రైల్వే స్టేషన్లో రైళ్లు నిలుపుదల పునరుద్ధరణకు తన వంతు కృషి చేస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. -
చలించిపోయిన సీఎం జగన్.. విద్యార్థిని దివ్య కుటుంబానికి ఇంటి స్థలం
తాళ్లపూడి: ఇటీవల కొవ్వూరులో జరిగిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో తనకు విద్యా దీవెన పథకం ఎలా మేలు చేసిందో చెబుతూ అందరినీ ఆకట్టుకున్న పెద్దేవం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని తిరిగిపల్లి దివ్యకు అభినందనలు వెల్లువెత్తాయి. దివ్య కుటుంబం కష్టాలు విని సీఎం వైఎస్ జగన్ చలించిపోయారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె.మాధవీలత నుంచి విద్యార్థిని దివ్యకు శుక్రవారం పిలుపు వచ్చింది. ఆ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి తోట రామకృష్ణ, గ్రామ సర్పంచ్ తిరిగిపల్లి వెంకటరావు విద్యార్థిని దివ్యను వెంట పెట్టుకుని కలెక్టర్ వద్దకు తీసుకువెళ్లారు. విద్యార్థి దివ్య కుటుంబానికి ఇంటి స్థలం తక్షణమే కేటాయించినట్టు కలెక్టర్ తెలిపారు. అతి త్వరలో మంత్రి చేతుల మీదుగా అందజేస్తామన్నారు. అలాగే ఉన్నత చదువుకు, ఆ తర్వాత మంచి ఉద్యోగ అవకాశం కల్పించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం దివ్య హోంమంత్రి తానేటి వనితను కూడా కలిసింది. -
సీఎం వైఎస్ జగన్ కొవ్వూరు పర్యటన ఫొటోలు
-
రాబోయే రోజుల్లో ఏపీ దేశానికే దశ దిశ చూపిస్తుంది: సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొవ్వూరు పర్యటనలో ఉన్నారు. కాగా, సీఎం జగన్ శ్రీకారం చుట్టిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా జనవరి–ఫిబ్రవరి–మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన నిధులను జమచేశారు. దీంతో, జనవరి–మార్చి 2023 త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరనుంది. రూ.703 కోట్లను సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘విద్యాదీవెన ద్వారా ఇప్పటి వరకు రూ.10,636 కోట్లు ఖర్చు చేశాం. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు, నా నిరుపేదలు సామాజికంగా ఎదగాలి. వివక్ష పోవాలన్నా, పేదరికం పోవాలన్నా చదవన్నదే గొప్ప అస్త్రం. జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలంటే విద్యతోనే సాధ్యం. తరాల తలరాతలు మారాలంటే విద్య ఒక్కటే మార్గం. అందుకే నాలుగేళ్ల పాలనలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం. పిల్లల చదువులపై చేస్తున్న ఖర్చు హ్యూమన్ కేపిటల్ ఇన్వెస్ట్మెంట్. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే దశ దిశ చూపిస్తుంది. పిల్లలు చదువుకుంటే భావితరాలు బాగుపడతాయి. ప్రతీ పేద కుటుంబం నుంచి డాక్టర్, కలెక్టర్ రావాలన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య 30 లక్షల నుంచి 40 లక్షలకు పెరిగింది. ఉన్నత విద్యలో కరిక్యులమ్ మార్చేశాం. జాబ్ ఓరియోంటెడ్‌గా కరిక్యులమ్ మార్చాం. దేశంలోనే తొలిసారిగా నాలుగేళ్ల హానర్స్ కోర్స్ ప్రవేశపెట్టాం. పిల్లల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం నుంచి ఒక సత్యా నాదెళ్ల రావాలి. ప్రతిభ చూపించే ప్రతీ విద్యార్థికి తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. గత పాలకులు గజదొంగల ముఠాగా ఏర్పడ్డారు. ఆ ముఠా చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు. గత పాలనలో దోచుకో, పంచుకో, తినుకో అన్నట్టుగా ఉండేది. ఒక్క జగన్‌ను ఎదుర్కొనేందుకు తోడేళ్లంతా ఏకమవుతున్నాయి. పేదవాడికి, పెత్తందార్లకు మధ్య క్లాస్‌వార్ జరుగుతోంది’ అని అన్నారు. -
Live: కొవ్వూరులో జగనన్న విద్యా దీవెన
-
కొవ్వూరులో విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్
-
సమస్యలకు భగవద్గీతలో పరిష్కారాలు
కొవ్వూరు: మానవుని జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు భగవద్గీత పరిష్కారం చూపుతుందని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతీ స్వామి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సంస్కృత పాఠశాల ప్రాంగణంలో చంద్రశేఖరేంద్ర సరస్వతీ ఆరాధనోత్సవాల్లో భాగంగా సోమవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీమద్భగవద్గీత దశ సహస్ర పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతీ స్వామి మాట్లాడుతూ మార్గశిర ఏకాదశి రోజున భగవద్గీత పారాయణం వల్ల విశేష ఫలితాలు ప్రాప్తిస్తాయన్నారు. అనంతరం విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు భగవద్గీత పుస్తకాలు అందజేశారు. తమిళనాడుకు చెందిన మహిళా బృందం సౌందర్యలహరి పారాయణ చేశారు. సాయంత్రం ఆధ్యాత్మిక వేత్తల ప్రసంగాలు, సంగీత విభావరీ, హరికథ నిర్వహించారు. -
Mega Job Fair: కొవ్వూరులో 9న మెగా జాబ్‌మేళా
కొవ్వూరు: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్ధ, జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, సీడాప్ సంయుక్తంగా తూర్పుగోదావరి జిల్లాలో ఈనెల 9న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర హోమ్ మంత్రి తానేటి వనిత తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో సోమవారం దీనికి సంబంధించిన పోస్టరును ఆమె ఆవిష్కరించారు. ఈసందర్భంగా వనిత మాట్లాడుతూ కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి మేళా ప్రారంభం అవుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని కోరారు. 15 ప్రముఖ కంపెనీలు మేళాలో పాలుపంచుకుంటాయన్నారు. 1,367 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారన్నారు. పాలిటెక్నిక్, ఐటీఐ, బీఎస్సీ కెమీస్ట్రీ, బీకామ్, పదో తరగతి, ఎంఫార్మసీ,బీ ఫార్మసీ, డీఫార్మసీ, ఇంటర్ మీడియట్ పూర్తి చేసుకున్న 19 నుంచి 30ఏళ్ల లోపు యువతీ యువకులంతా జాబ్ మేళాను సద్వినియోగ పరుచుకోవాలన్నారు. ఎంపికైన అభ్యర్ధులకు రూ.10వేల నుంచి రూ.20వేల వరకు ఆయా కంపెనీలు వేతనం చెల్లిస్తాయన్నారు. ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక నిర్వహిస్తారని జిల్లా ఉపాధి కల్పనా అధికారి కె.హరీష్ చంద్రప్రసాద్ తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ముందుగాపూర్తి వివరాలతో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. జాబ్ మేళాకు వచ్చే అభ్యర్ధులు తమ ఆధార్, పాన్, ఇతర సర్టిఫికెట్స్‌ను వెంట తెచ్చుకోవాలన్నారు. వివరాల కోసం 6303889174, 96664 72877, 90596 41596 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. జిల్లా నైపుణ్యావృద్ధికారి శీలం ప్రశాంత్, జేడీ ఎం. సుమలత, ప్లేస్మెంట్ ఎగ్జిక్యూటివ్ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: ఆరు గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరు..) జగనన్న పాలనలో బీసీలకు ప్రాధాన్యం చాగల్లు: బీసీల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విశేష కృషి చేస్తున్నారని హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. చాగల్లు మండలం ఊనగట్లలో నియోజకవర్గ బీసీ నాయకులతో సోమవారం ఆమె సమావేశమయ్యారు. విజయవాడలో జరగనున్న జయహో బీసీ మహాసభకు అధిక సంఖ్యలో తరలి రావాలని మంత్రి పిలుపు నిచ్చారు. బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. కార్పొరేషన్ డైరెక్టర్లు సంసాని రమేష్, పొన్నాడ సింహాద్రి, చాగల్లు, తాళ్లపూడి, కొవ్వూరు వైఎస్సార్సీపీ మండల బీసీ సెల్ అధ్యక్షులు మేకా రాజు, ఎం.పోసిబాబు, కట్టా బ్రాహ్మజీ, వైఎస్సార్సీపీ బీసీ నాయకులు అక్షయపాత్ర రవింద్ర శ్రీనివాస్, మట్టా వెంకట్రావు, పిల్లి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: నేనూ బీసీ ఇంటి కోడలినే.. మంత్రి రోజా) -
కొవ్వూరు టీడీపీలో మరోసారి బయటపడ్డ వర్గ విబేధాలు
-
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీలో వర్గ విభేదాలు
-
కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల బాహాబాహీ
సాక్షి, కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. అమరావతి రైతుల పాదయాత్ర నేపథ్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ రెండు వర్గాలకు చెందిన టీడీపీ నాయకులు బాహాబాహీకి దిగారు. కొవ్వూరులో మాజీ మంత్రి జవహర్‌కు సంబంధం ఏంటని వ్యతిరేక వర్గం నిరసనకు దిగింది. ద్విసభ్య కమిటీ ముందే ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. చదవండి: (మహా పాదయాత్రతో టీడీపీ ముసుగు తొలిగి పోయింది: మంత్రి కారుమూరి) -
రాజమౌళి తండ్రి హైస్కూల్ వరకూ చదివింది ఇక్కడే..
కొవ్వూరు(తూర్పుగోదావరి): రాష్ట్రపతి కోటాలో ప్రముఖ సినీ కథా రచయిత కోడూరి విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభకు ఎంపిక కావడంపై ఆయన స్వస్థలం కొవ్వూరులో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యసభకు బుధవారం ఎంపిక చేసిన నలుగురు దక్షిణాది ప్రముఖుల్లో విజయేంద్ర ప్రసాద్ ఒకరు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణకు విజయేంద్ర ప్రసాద్ స్వయానా పెదనాన్న కొడుకు. చదవండి: దక్షిణాదికి అగ్రపీఠం.. తన కంటే పదిహేను రోజులు చిన్నవాడంటూ శివరామకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ఈయన పెదనాన్న కోడూరి అప్పారావుకు ఆరుగురు కుమారులు. వీరిలో ఆరో సంతానం విజయేంద్ర ప్రసాద్. ఈయన హైస్కూలు విద్యాభాస్యం వరకూ కొవ్వూరులోనే సాగింది. అనంతరం ఏలూరులో చదివారు. 1975–76 సంవత్సరాల్లో ఆయన కుటుంబం కర్ణాటకలోని తుంగభద్ర ప్రాంతానికి వెళ్లిపోయింది. కొన్నాళ్లు కర్ణాటక, కొవ్వూరులో కొన్ని వ్యాపారాలు చేశారు. వాటిలో రాణించలేకపోయారు. అప్పటికే సినీరంగంలో స్ధిరపడిన సోదరుడు శివదత్త ప్రోత్సాహంతో ఆ వైపు వెళ్లినట్లు విజయేంద్ర సన్నిహితులు చెబుతున్నారు. మద్రాసు సినీరంగంలో అడుగుపెట్టి వెండితెరకెక్కిన పెద్ద చిత్రాలకు రచయితగా కొనసాగారు. బాహుబలి..ఆర్ఆర్ఆర్ ఆయన కలం నుంచి రూపం దిద్దుకున్నవే. విజయేంద్ర కుమారుడు, ప్రముఖ సినీదర్శకుడు రాజమౌళి విద్యాభాసం కుడా కొవ్వూరులోని దీప్తీ పాఠశాలలోనే సాగింది. విజయేంద్ర ప్రసాద్ సినీరంగంపై వేసిన ప్రభావవంతమైన ముద్రకు గుర్తింపుగా రాజ్యసభ సీటు ఇవ్వడం ఆనందంగా ఉందని ఆయన కుటుంబీకులు న్యాయవాది కోడూరి నరసింహారావు అన్నారు. తన తాతయ్య విజయేంద్ర ప్రసాద్ తండ్రి, శివరామకృష్ణ తండ్రి అన్నదమ్ములని నరసింహారావు చెప్పారు. -
కవల కానిస్టేబుళ్లు.. రోజూ చూస్తున్నా సరే.. కనుక్కోవడం కష్టమే సుమా!
వారిద్దరూ కవలలు. పైగా ఒకే చోట పోలీసులుగా ఉద్యోగాలు. దీంతో రోజూ చూస్తున్నా సరే.. స్టేషన్‌కు వచ్చే ప్రజలతో పాటు అధికారులు కూడా ఒకింత కన్ఫ్యూజన్ అవ్వాల్సిందే. యూనిఫాం వేశారంటే ఎవరు.. ఎవరో గుర్తుపట్టడం అంత ఈజీ కాదు మరి. ఇద్దరూ ఒకేసారి జననం, కానిస్టేబుళ్లుగా ఉద్యోగాల్లో చేరడం, పెళ్లిళ్లూ ఒకేసారి కావడం.. ఇలా వీరి జీవితం అద్భుతాలమయంగా సాగుతోంది. కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పోలీసు స్టేషన్లో ఈ ఇద్దరు కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. ఒకరి పేరు యు.లక్ష్మణకుశ, మరొకరి పేరు యు.రాములవ. వీరి స్వస్థలం తాళ్లపూడి. ఊబా సన్యాసిరావు, సావిత్రి దంపతులకు ఆరుగురు మగపిల్లలు సంతానం. వీరు మూడు, నాలుగో సంతానంగా జన్మించారు. వీరి కంటే మరో ఇద్దరు కవలలు రామ్, లక్ష్మణ్ పుట్టి చనిపోయారు. తర్వాత నాలుగో కాన్పులో వీరు జన్మించారు. దీంతో రామ్, లక్ష్మణ్‌ల పేర్లు కలిసేలా వీరికి పేర్లు పెట్టారు. మరో విశేషం ఏమిటంటే ఈ అన్నదమ్ములు ఒకేరోజు పోలీసు, రైల్వే కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. ఇద్దరూ పోలీసు కానిస్టేబుళ్లుగా ఉద్యోగాల్లో చేరడం, వీరిద్దరి పెళ్లిళ్లు సైతం ఒకే రోజు కావడం విశేషం. -
హోం శాఖ అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నా: తానేటి వనిత
ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లో తొలిసారి మహిళకు హోం మంత్రి పదవి కట్టబెట్టిన ఘనత దివంగత మహానేత వైఎస్సార్‌దైతే, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకేశారు. వరుసగా ఇద్దరు దళిత మహిళలకు కీలకమైన ఈ బాధ్యతలు కేటాయించారు. రాష్ట్ర హోం, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత ఈ మాటలన్నారు. మొదటి విడతలోనే మంత్రి పదవి వస్తుందని ఊహించలేదన్నారు. రెండోసారి హోం శాఖ అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నియోజకవర్గానికి వచ్చిన వనిత బుధవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా ఏమన్నారంటే.. –కొవ్వూరు ప్రశ్న: పోలీసులపై పని ఒత్తిడి అధికంగా ఉంది. వారాంతపు సెలవులు కొన్నిచోట్ల సక్రమంగా అమలు కావడం లేదన్న వాదనలు ఉన్నాయి? మంత్రి: క్షేత్ర స్థాయిలో సిబ్బంది ఇబ్బందులను తెలుసుకుంటాను. పోలీసులకు కచ్చితంగా వారాంతపు సెలవులు అన్నిచోట్లా అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎంతో అవసరం. ఏ సమస్యపైనైనా ప్రజలు నిర్భయంగా స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే ప్రజలకు, పోలీసులకు మధ్య çసుహృద్భావ వాతావరణం ఉండాలి. దీనివల్ల ప్రజల్లో సదభిప్రాయం కలుగుతుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి. మహిళలు, యువతులపై అకృత్యాల నివారణకు ఏవిధమైన చర్యలు తీసుకుంటారు? ఇప్పటికే ప్రభుత్వం ప్రతి పోలీసు స్టేషన్లో మహిళా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. దిశ సహాయ కేంద్రం పేరుతో మహిళా కానిస్టేబుల్‌ను నియమించి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ప్రతి జిల్లాకి ఒక దిశ పోలీసు స్టేషన్‌తో పాటు ప్రత్యేకంగా దిశ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. దిశ యాప్ ద్వారా పోలీసుల నుంచి ఆపదలో ఉన్న మహిళలకు తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకున్నాం. మంత్రివర్గ పునర్ వ్యవస్ధీకరణ ఎలా ఉంది? మంత్రి వర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 70 శాతం పదవులు కేటాయించడం ద్వారా సామాజిక విప్లవానికి సీఎం జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, కాపు, మైనారిటీ వర్గాలకు చెందిన ఐదుగురు మంత్రులకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం ఓ చారిత్రక నిర్ణయం. భవిష్యత్తు తరాల రాజకీయాలకు సీఎం ఓ దిక్సూచిగా నిలిచారు. హైవే పెట్రోలింగ్ వాహనాల్లో పోలీసుల పని తీరుపై విమర్శలున్నాయి. దీనిపై మీ స్పందన.? హైవేల్లో ప్రమాదాలు సంభవించిన సమయంలో తక్షణ సాయం అందించేందుకు నిర్దేశించిన హైవే పెట్రోలింగ్ వాహనాల పనితీరు మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటాం. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పని చేసేలా చూస్తాం. పోలీసుల్లో అవినీతి నియంత్రణకు ఏవిధమైన చర్యలు తీసుకుంటారు.? అవినీతి అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. అందుకు ప్రజల వైఖరిలోను మార్పు రావాల్సిన అవసరం ఉంది. డబ్బులిస్తేనే తొందరగా పని అవుతుందన్న భావన నుంచి ప్రజలు బయటికి వస్తేనే అవినీతి కట్టడి అవుతుంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఏవిధమైన చర్యలు తీసుకుంటున్నారు.? రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ముఖ్యమంత్రి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా ఉంచుతాం. శాంతిభద్రతలకు విఘాతం కలించే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం. ఇటీవల తాడేపల్లిగూడెం నిట్ కళాశాలలో ర్యాగింగ్ అంశం తెరపైకి వచ్చింది. కళాశాలల్లో ర్యాగింగ్ నియంత్రణకు ఏవిధమైన చర్యలు తీసుకుంటారు.? ర్యాగింగ్‌కి పాల్పడితే కలిగే అనర్థాలు, శిక్షల గురించి విద్యార్థుల్లో అవగాహన పెంపొందిస్తాం. విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. ప్రతీ కళాశాలలో ర్యాగింగ్ నియంత్రణ కమిటీల పనితీరును మెరుగు పరిచేలా చర్యలు తీసుకుంటాం. -
కొవ్వూరులో జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించిన మంత్రి తానేటి వనిత
-
విజయవంతమైన ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం
సాక్షి, ఏలూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో ఘనంగా ప్రారంభమయ్యింది. ఉదయాన్నే రేషన్ పంపిణీ వాహనాల్లో బియ్యాన్ని నింపుకున్న వాలంటీర్లు, ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. ఇప్పటి వరకు లబ్ధిదారులు రేషన్ షాప్‌కి వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి రేషన్ తీసుకోవాల్సి వచ్చేది. దీని కోసం వారు ఒక రోజు పనిని కూడా కోల్పోవాల్సి వచ్చేది. అయితే ప్రభుత్వమే ఇంటింటికి వాహనాల ద్వారా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడంతో రేషన్ తీసుకోవడం చాలా సులభతరమైందని లబ్ధిదారులకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముందుగా కేటాయించిన సమయానికి రేషన్ నేరుగా ఇంటికే రావడంతో లబ్ధిదారుల ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. లబ్ధిదారుల కళ్లెదుటే బియ్యాన్ని కాటా వేసి, ప్రత్యేక సంచుల్లో వారికి అందిస్తున్నారు. నాణ్యమైన బియ్యం ఇంటికే రావడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువతులు మృతి
సాక్షి, కొవ్వూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. స్కూటీపై వెళుతున్న ఇద్దరు యువతులను క్వారీ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దాంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. స్కూటీని లారీ ఢీకొని వారిపై నుండి వెళ్లిపోవడంతో యువతుల శరీరాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన యువతులు కొవ్వూరు 23వ వార్డుకు చెందిన ఈర్ని భార్గవి, తనూషగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఇద్దరు కూతుళ్లతో తల్లి ఆత్మహత్యాయత్నం
సాక్షి, పశ్చిమగోదావరి : పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడే ఉన్న స్థానికులు గమనించి. తల్లి వరికూటి స్థాయి, పెద్ద కుమార్తె లాస్య లను కాపాడగా చిన్న కుమార్తె దర్శిని మాత్రం గోదావరిలో మునిగి గల్లంతయింది. భావిస్తున్నారు. తల్లి కుమార్తెలు ఇద్దరు ఆస్పత్రికి తరలించి చికిత్స పొందుతుండగా చిన్న కుమార్తె మృతదేహం కోసం పోలీసులు గోదావరిలో గాలిస్తున్నారు. 5 నెలల క్రితం వరికూటి సాయి భర్త ప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందగా అత్త, మరిది కుటుంబ కలహాల నేపథ్యంలో వేధించడంతో ఈ సంఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: యువతి అదృశ్యం: రెండేళ్ల తర్వాత.. -
'తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు'
సాక్షి, పశ్చిమగోదావరి : అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయకుంటే చర్యలు తప్పవని మంత్రి తానేటి వనిత హెచ్చరించారు. కొన్ని శాఖల అధికారులపై అవినీతి ఆరోపణలు తన దృష్టికి వచ్చాయని, పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని ఆమె పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో ఎంత సఖ్యతగా మెలుగుతారో వారు కూడా ప్రజలతో అంతే స్నేహపూర్వంగా మెలగాలని మంత్రి తెలిపారు. ప్రజా సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా కృషి చేయాలని పేర్కొన్నారు. (ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి అవంతి) -
మాజీ మంత్రికి బాధ్యతలు; కార్యకర్తల నిరసన
సాక్షి, పశ్చిమగోదావరి : మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్‌కు టీడీపీ అధిష్టానం రాజమండ్రి పార్లమెంటరీ ఇంచార్జి బాధ్యతలు ఇవ్వడంపై కొవ్వూరు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు భగ్గుమన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ముక్తకంఠంతో ఖండించారు. ఈ సందర్భంగా కొవ్వూరు పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. జవహర్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని లేదంటే కొవ్వూరు నియోజకవర్గానికి ఇంచార్జ్ వేరే ఒకరిని నియమించాలని తీర్మానించారు. (టీడీపీ కుట్ర.. ఆధారాలు బట్టబయలు) కొవ్వూరు నియోజకవర్గంలో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉందని ఇప్పటి వరకు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, 2014లో కొవ్వూరు నియోజకవర్గంలో పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టాక పార్టీలో వర్గ విభేదాలు సృష్టించి కార్యకర్తలపై కేసులు పెట్టించి పార్టీ ఓడిపోవడానికి కారణమయ్యారని నాయకులు వాపోయారు. అందువల్ల కొవ్వూరు నియోజకవర్గానికి వేరొకరిని నియమించి పార్టీని ఆదుకోవాలని ఆయన కోరారు. (‘అందుకే సబ్బం హరి నిర్మాణాన్ని తొలగించాం’) -
కుమార్తెల ముందే అశ్లీలం.. భార్యపై డంబెల్‌తో దాడి
-
కుమార్తెల ముందే అశ్లీలం.. భార్యపై డంబెల్‌తో దాడి
సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాలోని కాకినాడ రూరల్ మండలం కొవ్వూరులో దారుణం చేసుకుంది. మద్యం మత్తులో కన్న పిల్లలతో కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడో తండ్రి. కుమార్తెల ముందే అశ్లీల దృశ్యాలు చూస్తూ భార్యను, కూతుర్లను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే నిలదీసిన భార్యపై డంబెల్‌తో దాడికి పాల్పడ్డాడు. భార్య మాధవి పోలీసులకు చేసిన ఫిర్యాదు వివరాల ప్రకారం.. ఏపీఎస్ ఆర్టీసీలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్న భర్త దంగేటి శ్రీను గతకొంత కాలం నుంచి మద్యానికి బానిస అయ్యాడు. పుటుగా తాగి వచ్చి కుమార్తెల ముందే నీలి చిత్రాలు చూసేవాడు. భర్త తీరు నచ్చని భార్య మాధవి ఈ విషయంపై అనేకమార్లు భార్తతో వాగ్వాదానికి దిగింది. రెండు రోజుల క్రితం కూడా ఇలాంటి సీనే రిపీట్ అయ్యింది. ఈ క్రమంలోనే భార్యపై కోపంతో ఇంట్లో ఉన్న డంబెల్ తీసుకుని తలపై బలంగా కొట్టాడు. అమ్మను కొట్టవద్దూ.. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం అని పిల్లలు బతిలాడినా ఏమాత్రం పట్టించుకోకుండా దాడికి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలను కుమార్తెలు ఫోన్లో రికార్డు చేయడంతో అవికాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భర్త దాడి ఘటనలో తీవ్ర గాయాల పాలైన మాధవిని స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. అనంతరం తన భర్త నుంచి కుమార్తెలకు, తనకు ప్రాణహాని ఉందని స్థానిక ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే గతంలోనూ భార్యా, పిల్లలు చిత్ర హింసలకు గురిచేస్తే పోలీసులకు భార్య ఫిర్యాదు చేసిందని, కేసు నమోదు అయితే డ్రైవర్‌ఉద్యోగం పోతుందనే భయంతో ఫిర్యాదును ఉపసంహరించుకుంది. అప్పటి నుంచి వేదింపులు మరింత ఎక్కువయ్యాని బాధితురాలు తెలిపింది. -
'మా నాన్నని విడిచి ఉండలేకపోతున్నాం'
సాక్షి, కొవ్వూరు(పశ్చిమ గోదావరి) : అమ్మాయికి టీసీఎస్‌లో మంచి ఉద్యోగం. నెలకు రూ.లక్ష జీతం. కొడుకు ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఇంకేముంది కూతురి పెళ్లి ఘనంగా చేయాలనుకున్నారు. రూ.లక్షలు ఖర్చుపెట్టి ఇల్లు రీ మోడలింగ్ కూడా చేయించారు. అంతలోనే వారి ఆశలు అడియాసలయ్యాయి. కరోనా మహమ్మారి రూపంలో వచ్చిన మృత్యువు ఆ కుటుంబాన్ని మింగేసింది. పశివేదల గ్రామానికి చెందిన పరిమి వెంకట నరసింహరావు (నరసయ్య) ఈనెల 16న కోవిడ్‌కు చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు మూడు రోజులుగా మనస్తాపానికి గురయ్యారు. భార్య సునీత(41), కుమారుడు ఫణికుమార్(25), కుమార్తె లక్ష్మి అపర్ణ(23) మంగళ వారం రాత్రి 11 గంటల సమయంలో గోదావరిలోకి దూకడంతో గల్లంతయ్యారు. ఇంటి నుంచి ముగ్గురూ కారులో బయలుదేరి రోడ్డు కం రైలు వంతెనపైకి చేరుకుని నదిలోకి దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారు స్వాధీనం చేసుకున్నారు. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ముగ్గురి ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు, బంధువులు నది వెంబడి గాలిస్తున్నారు. అసలేం జరిగిందో..! ఈనెల 7న నరసయ్యకు జ్వరం వచ్చింది. స్థానిక ఆర్ఎంపీతో వైద్యం చేయించుకున్నారు. తొలుత సీజనల్ ఫీవర్‌గా భావించారు. ఎంతకీ తగ్గకపోవడంతో ఈనెల 14న సీటీ స్కాన్ చేయించారు. కరోనా సోకినట్లు గుర్తించారు. రాజమండ్రిలోని ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించారు. అప్పటికే పరిస్థితి విష మించి నరసయ్య ప్రాణాలొదిలారు. దీంతో బంధువులెవరూ అంత్యక్రియలకు రాలేదు. అప్పటి నుంచి భార్య సునీత, ఇద్దరు పిల్లలు మనోవేదనకు గురయ్యారు. ఫణికుమార్ కర్ణాటకలో మైనింగ్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. లక్ష్మీఅపర్ణ టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరూ విద్యావంతులే. జీవితంలో స్థిరపడిన వారే. అయినా ఆ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేయడం స్థానికులను కలచివేస్తోంది. నరసయ్య భార్య సునీత పుట్టినిల్లు కొవ్వూరు. దుర్ఘటనతో కొవ్వూరు, పశివేదలల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరికి సుమారు పదెకరాల పొలం, కొవ్వూరులో విలువైన స్థలాలు ఉన్నట్లు చెబుతున్నారు. నరసయ్య మృతి తర్వాత కుటుంబ సభ్యులు కరోనా పరీక్షలు చేయించుకుంటే నెగిటివ్ వచ్చింది. ఒకవేళ వీరికి కరోనా లక్షణాలు కనిపించి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారా అన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆర్డీఓ డి.లక్ష్మారెడ్డి పశివేదల వెళ్లి ఘటనపై ఆరా తీశారు. మృతుడు నరసయ్య బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేవీ రమణ కేసు నమోదు చేశారు. ఇంటిలో లేఖ : నరసయ్య ఇంట్లోని లక్ష్మి అపర్ణ డైరీలో ఓ లేఖ పోలీసులకు లభ్యమైంది. ఆ లేఖలో ‘మా అందరి కోరిక నిహారిక ఓణీల ఫంక్షన్ బాగా చేయాలి. దొరబాబు మావయ్య మమ్మల్ని క్షమించు. తాతయ్య, అమ్మమ్మల ఆరోగ్యం జాగ్రత్త. మా నాన్నని విడిచి మేం ఉండలేకపోతున్నాం.’ అంటూ లక్ష్మి అపర్ణ రాసినట్టు ఉన్న లేఖ లభ్యమైంది. -
ఇంటి పెద్ద మరణం తట్టుకోలేక..
-
ఆ కుటుంబం ఏకంగా ప్రాణాలే తీసేసుకుంది..
సాక్షి, పశ్చిమ గోదావరి : కరోనా మహమ్మారి ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఇంటిపెద్ద కరోనాతో చనిపోవడంతో కుటుంబసభ్యుల్ని కలిచి వేసింది. ఇక తమకు దిక్కెవరు అంటూ మనస్తాపంతో గోదావరిలో దూకేశారు. ఎవరైనా చనిపోతే బంధువులు, సన్నిహితులు వచ్చి ఆ కుటుంబానికి ధైర్యం చెబుతారు. మేమున్నామంటూ మాటలతోపైనా మానసిన స్థైర్యాన్ని ఇస్తారు. కానీ కరోనా వచ్చి ఆ మానవత్వాన్ని మటుమాయం చేసింది. సొంత వారు చనిపోయినా తిరిగి మళ్లి చూడకుండా చేసింది. ఆ మహమ్మారి వైరస్ తమకెక్కడ అంటుకుంటుందో అని బంధువులు కూడా దూరం జరుగుతున్నారు. కరోనాతో ఎవరైనా చనిపోతే వారి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు కూడా వెనకాడుతున్నారు. పలకరించే దిక్కు లేక బాధిత కుటుంబాలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి బాధను తట్టుకోలేకపోయిన ఆ కుటుంబం ఏకంగా ప్రాణాలే తీసేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన విషాద సంఘటన అందరినీ కలిచివేస్తోంది. కరోనా మహమ్మారి ఆ కుటుంబాన్నే చిన్నాభిన్నం చేసింది. కొవ్వూరు మండలం పసివేదలకు చెందిన నరసయ్య ఈనెల 16న కరోనాతో మృతి చెందాడు. కుటుంబ పెద్ద మరణించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు భార్య, పిల్లలు. ఇంత బాధలో ఉన్న వారిని పలకరించేందుకు... బంధువులు, సన్నిహితులు కూడా రాలేదు. కరోనా భయంతో వారి ఇంటి గడప కూడా తొక్కలేదు. దీంతో తమను అంటరాని వారిగా చూస్తున్నారన్న భావన వారిలో పెరిగింది. ఆ బాధతోనే నరసయ్య భార్య సునీత, అమె కుమారుడు ఫణికుమార్ (25), కుమార్తె అపర్ణ (23) గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నరసయ్య వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడని స్థానికులు చెప్తున్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడం వల్లే వారంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అంటున్నారు. రైల్వే బ్రిడ్జి పైనుంచి ఈ ముగ్గురూ గోదావరిలోకి దూకడంతో గల్లంతయ్యారు. గోదావరిలో వరద ఉద్ధృతి అధికంగా ఉండటంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గోదావరిలో దూకి ఇద్దరు యువకులు గల్లంతు
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు యువకులు ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అనారోగ్యంతో ఒకరు, రుణభారంతో మరొకరు గోదావరిలో దూకి గల్లంతయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా చీకటి పడటంతో నిలిపివేశారు. కొవ్వూరు రూరల్: కొవ్వూరు రోడ్ కం రైల్వే వంతెనపై నుంచి ఆదివారం ఓ యువకుడు గోదావరి నదిలోకి దూకాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం కొవ్వూరు మండలం నందమూరు గ్రామానికి చెందిన ఉక్కుజూరి రాజేశ్వరరావు(30) వంతెనపై నుంచి గోదావరి నదిలోకి దూకాడు. రాజేశ్వరరావు హైదరాబాద్‌లో కెమెరా అసిస్టెంటుగా పనిచేస్తుంటారు. కాలికి దెబ్బ తగలడంతో విశ్రాంతి కోసం ఇరవై రోజుల క్రితం హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన నందమూరు వచ్చాడు. ఆదివారం తన స్కూటీ వేసుకుని బ్రిడ్జిపైకి వెళ్లి బండిని వదిలి గోదావరిలో దూకాడు. అతని కోసం పట్టణ ఎస్సై కె.వెంకటరమణ ఆధ్వర్యంలో నదిలో సాయంత్రం వరకు గాలించారు. చీకటి పడటం, వర్షం కురవడం కారణంగా గాలింపు నిలిపివేశామని సోమవారం మళ్లీ గాలింపు చేపడతామని పోలీసులు తెలిపారు. చించినాడ వద్ద వేడంగి యువకుడు... యలమంచిలి: పోడూరు మండలం వేడంగి గ్రామానికి చెందిన శిరిగినీడి ఆంజనేయులు ఆలియాస్ అంజి (25) చించినాడ వద్ద వంతెనపై నుంచి ఆదివారం వశిష్ట గోదావరిలో దూకి గల్లంతయ్యాడు. ఆ సమయంలో అటువైపుగా వస్తున్న వ్యక్తులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ కొప్పిశెట్టి గంగాధరరావు ఆధ్వర్యంలో పోలీసులు, జాలర్లు యువకుని కోసం గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. వంతెనపై యువకుడు వేసుకువచ్చిన ఏపీ07ఎం 1575 బైక్, జోళ్లు, సెల్ అక్కడే ఉన్నాయి. పోలీసులు ఆ సెల్ నుంచి ఫోన్ చేసి యువకుని వివరాలు తెలుసుకున్నారు. ఆ యువకునికి వేడంగి సెంటర్లో పాదరక్షల దుకాణం ఉందని, ఆర్థికంగా దెబ్బతిని రుణగ్రస్తుడు కావడం వలన గోదావరిలోనికి దూకి ఉంటాడని ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. గల్లంతైన యువకుని ఆచూకీ రాత్రి వరకు లభించకపోవడం, మరో వైపు వర్షం కురుస్తున్నందున గాలింపు ఆపివేశారు. సోమవారం ఉదయం గాలింపు ప్రారంభిస్తామని ఎస్ఐ తెలిపారు. -
భౌతిక దూరంతోనే కరోనా నివారణ : తానేటి వనిత
సాక్షి, కొవ్వూరు : రాజకీయాలకు అతీతంగా అందరూ కరోనా వ్యాధి నియంత్రణకు సహకరించాలని మంత్రి తానేటి వనిత కోరారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిత్యావసర వస్తువులు దుకాణాలతో పాటు మెడికల్ షాపులను సందర్శించిన మంత్రి పలు సూచనలు చేశారు. షాపుల దగ్గర ప్రజలు భౌతిక దూరం పాటించేలా చూసుకోవాలని యజమానులకు సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన లాక్డౌన్ నిబంధనలను అందరూ తప్పకుండా పాటించాలని కోరారు. కేవలం భౌతిక దూరంతోనే కరోనాను కట్టడి చేయగలమన్నారు. -
హత్య చేసి.. గోనె సంచిలో పెట్టి
సాక్షి, కోవూరు(నెల్లూరు): మండలంలోని పడుగుపాడు జాతీయ రహదారి సమీపంలో ఉన్న జిమ్మిపాళెం రోడ్డు వద్ద బుధవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. హత్య చేసి మృతదేహాన్ని గోనెసంచిలో ఉంచి పడవేశారు. దీంతో కోవూరు పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. పోలీసుల కథనం మేరకు.. జమ్మిపాళెం రోడ్డుపక్కనే ఉన్న పంటకాలువలో గోనెసంచి అనుమానాస్పదంగా ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక సీఐ శ్రీనివాసరావు, ఎస్సై కృష్ణారెడ్డిలు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సంచిని బయటకు తీయించగా అందులో మహిళ మృతదేహం ఉంది. మహిళ నైటీ ధరించి తీవ్రగాయాలతో ఉంది. హత్య చేసి సంచిలో ఉంచి బూట్ల లేస్లతో కట్టి కాలువలో పడవేశారు. మహిళ హత్యకు గురైందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆమె వయస్సు 30 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. పోలీస్ జాగిలాలు పరిసర ప్రాంతాల్లో తిరిగాయి. హత్య జరిగి మూడురోజులై ఉంటుందని, మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉందని పోలీసులు తెలిపారు. స్థానికులను విచారించారు. వారినుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో బయటి ప్రాంతంలో హత్య చేసి వాహనంలో మృతదేహాన్ని ఇక్కడికి తీసుకువచ్చి పడవేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
‘మహిళల రక్షణకు సీఎం పెద్దపీట వేశారు’
సాక్షి, పశ్చిమ గోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళ పక్షపాతి అని మరోసారి నిరుపించుకున్నారని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. మంగళవారం కొవ్వూరులో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. మహిళల రక్షణకు సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. యానిమేటర్లు, సంఘమిత్ర ఉద్యోగుల జీతాలు పదివేలకు పెంచారని, మహిళల, పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మఒడి పథకాన్ని అమలు చేశారని మంత్రి పేర్కొన్నారు. అలాగే పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేరుస్తున్నారని తెలిపారు. మద్యపాన నిషేధాన్ని దశల వారిగా అమలు చేస్తూ, గ్రామాల్లో బెల్టు షాపులను తొలగించి మహిళల జీవితాల్లో ఆనందం నింపారని అన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూతను అందిస్తున్నారని తానేటి వనిత తెలిపారు. (చదవండి: వీవోఏ, ఆర్పీల గౌరవ వేతనం 10,000) -
‘మీ ఆదరాభిమానాలతోనే మంత్రినయ్యా’
సాక్షి, పశ్చిమగోదావరి(కొవ్వూరు రూరల్) : పదవులు, రాజకీయాలు శాశ్వతం కాదని, మనుషుల మధ్య బంధాలు నిలిచి ఉంటాయని నమ్మే వ్యక్తిలో తాను ఒకరినని స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. గురువారం మండలంలోని పశివేదలలో నిర్వహించిన కొవ్వూరు నియోజకవర్గ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ (కృపా) సమావేశానికి మంత్రి వనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి, తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి దైవసేవకుల ప్రార్థనలే కారణమన్నారు. అందరి అధరాభిమానాలతోనే 2009 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నానన్నారు. టీడీపీ కంచుకోటగా ఉన్న కొవ్వూరు నియోజకవర్గంలో ప్రతిపక్షంలో పనిచేయడం కత్తి మీద సాములాంటిదైనా, తనతో పాటు చాలా మంది నాయకులు కష్టనష్టాలకు ఓర్చి వెంట నడిచారన్నారు. ప్రతిపక్షంలో ఉండగా తనపై రకరకాల నిందలు వేశారని, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తరువాత సొంత పార్టీలోనే ఉంటూ అవే నిందలను కొనసాగిస్తున్నారని, వారి మనసు మారేలా అం దరూ ప్రార్థనలు చేయాలని కోరారు. మహిళగా తాను కుటుంబం, బంధువులను సైతం పక్కనబెట్టి పార్టీ కోసం పనిచేస్తున్నానన్నారు. క్రైస్ట్ ఫెలోషిప్ ప్రార్థనా మందిరంలో జరిగిన రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు బిషప్ ప్ర తాప్ సిన్హా, చీప్ అడ్వయిజర్ బిషప్ సుభాకర్ శాస్త్రి, జిల్లా అధ్యక్షుడు జోషప్ కొమ్మనాపల్లి, ట్రెజరర్ రెవ జ్యోతి ఆనంద్ ప్రసంగించారు. కృపా అధ్యక్షుడు రెవ. కె.జోషప్ అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సభ్యులకు మంత్రి తానేటి వనిత చేతులమీదుగా ఐడీ కార్డులను అందజేశారు. మంత్రి తానేటి వనితను కృపా కార్యవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు. కృపా గౌరవ అధ్యక్షుడు వై.ప్రభాకర్, కార్యదర్శి ఎంవీ సత్యన్నారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు మోజేస్, మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ సీనియర్ నాయకులు కోడూరి శివరామకృష్ణ, బొబ్బా సుబ్బారావు, ముళ్లపూడి కాశీవిశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ధవళేశ్వరం వద్ద ప్రమాద హెచ్చరిక
సాక్షి, పశ్చిమగోదావరి : గోదావరిలో వరద ఉగ్రరూపు దాల్చింది. ఐదు రోజుల నుంచి ఏజెన్సీలో 19 గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కొవ్వూరులో గోష్పాద క్షేత్రాన్ని గోదావరి వరద ముంచెత్తింది. క్షేత్రంలో రెండు అడుగుల మేరకు వరదనీరు ప్రవహిస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద రెండో ప్రమాద హెచ్చరికను దాటి వరద ప్రవహిస్తోంది. వందలాది ఎకరాల్లో లంకభూముల్లో పంటలు నీటమునిగాయి. యలమంచిలి మండలం కనగాయలంక కాజ్‌వేపై నుంచి నాలుగు అడుగుల మేరకు వరద ప్రవహిస్తోంది. దీంతో అధికారులు అక్కడ పడవలు ఏర్పాటు చేసి జనాన్ని ఒడ్డుకు చేర్చుతున్నారు. పెరవలి మండలంలో కానూరు, ముక్కామల, తీపర్రు, కాకరపర్రు, మల్లేశ్వరం, ఖండవల్లి తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పంటలు వరదనీట మునిగాయి. కొవ్వూరు, తాళ్లపూడి, పోలవరం, నిడదవోలు, పెనుగొండ మండలాల్లోను లంకభూములు ముంపుబారిన పడ్డాయి. ఏజన్సీలో పోలవరం, వేలేరుపాడు మండలాల పరిధిలో 39 గ్రామాలకు ఐదు రోజులుగా రాకపోకలు నిలిచి పోయాయి. ఆదివారం ఉదయం 7.30 గంటలకు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 13.75 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతంలో వరద నెమ్మదిస్తుండడంతో ఉదయం పది గంటల నుంచి ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వరద ఉధృతి 14.10 నుంచి నిలకడగా కొనసాగింది. ఒంటిగంటకి 14.20 అడుగులకు పెరిగింది. ఆనకట్టకి ఉన్న 175 గేట్లను పూర్తిగా ఆల్ క్లియర్‌లో ఉంచారు. ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు ఆనకట్ట నుంచి 13,50,363 క్యూసెక్కుల వరదనీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఎగువ ప్రాంతంలో ఉపనదుల నుంచి భారీగా వరద నీరొచ్చి చేరుతుండడంతో గోదావరిలో వరద ఆదివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు స్ధిరంగా కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ వద్ద 28.1 మీటర్ల ఎత్తున వరద ప్రవహిస్తోంది. గోదావరికి ఎగువ ప్రాంతంలో భద్రాచలంలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ కాళేశ్వరం, దుమ్ముగూడెం, పేరూరు తదితర ప్రాంతాల్లో నీటిమట్టాలు స్వల్పంగా పెరుగుతున్నాయి. దీంతో వరద ప్రభావం మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 7,800 క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నారు. తూర్పు డెల్టాకు 4వేలు, సెంట్రల్‌కి 1,800లు, పశ్చిమ డెల్టాకు 2వేల క్యూసెక్కుల చొప్పున సాగునీరు విడిచి పెడుతున్నారు. ముంపులోనే పంటపొలాలు డెల్టాలో గడిచిన వారం రోజులుగా కురిసిన వర్షాలకు జిల్లాలో ఇంకా 4,746 హెక్టార్ల పంట ముంపులోనే ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. 591 హెక్టార్లలో వరి నారుమళ్లు ముంపు బారిన పడితే దీనిలో 412 హెక్టార్ల నారుమళ్లు కుళ్లిపోయాయన్నారు. 7,550 మంది రైతులకు చెందిన 1,026 హెక్టార్లలో వరిపంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముంపులో ఉన్న పంటలు తేరుకుంటే నష్ట తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని అ«ధికారులు చెబుతున్నారు. పెరవలి మండలంలో సుమారు 2,200 ఎకరాల్లో పంట ముంపు బారిన పడింది. మిగిలిన తీర ప్రాంత మండలాల్లో సుమారు రెండు వందల ఎకరాల పంట నీటమునింది. ముంపు ప్రాంతాల్లో మంత్రి, ఎంపీ పర్యటన ఎంపీ రఘురామకృష్ణంరాజు, మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సబ్ కలెక్టర్ సలీమ్‌ఖాన్‌లు నరసాపురం పార్లమెంట్ పరిధిలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. లంక గ్రామాల్లో పునరావాసం కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పెద్దమల్లం లంక, అయోధ్యలంక, రవిలంక, మర్రిమూల, పుచ్చలలంక గ్రామాల్లో పర్యటించి అక్కడి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. 39 గ్రామాలకు రాకపోకలు బంద్ గోదావరి వరద ముంచెత్తడంతో పోలవరం, వేలేరుపాడు మండలాల్లో 39 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వరద బాధితుల కోసం పోలవరం, వేలేరుపాడు గ్రామాల్లో రెండు పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. 51 కుటుంబాలకు చెందిన 133 మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. జిల్లా కలెక్టర్ వరద పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు తానేటి వనిత, శ్రీరంగనాథరాజు, ఇన్చార్జ్ మంత్రి సుభాష్ చంద్రబోస్‌లు ముంపు ప్రాంతంలో పర్యటించారు. ముంపు ప్రభావిత గ్రామాలకు ప్రజలకు అవసరమైన సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించి ముందుస్తు ఏర్పాట్లు చేశారు. ముంపు ప్రాంతంలో 4,088 కుటుంబాలకు అధికారులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 1,022 క్వింటాళ్ల బియ్యం, బంగాళ దుంపలు, ఉల్లిపాయాలు, 4,088 లీటర్ల పామాయిల్, 8,716 లీటర్ల కిరోసిన్, 4,188 కేజీల కందిపప్పు అందజేశారు. 56 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతంలో 53 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. 1,156 మందికి వైద్య సేవలు అందజేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. 13 డెంగీ, డయేరియా కేసులకు వైద్యం చేశామన్నారు. ముంపు గ్రామాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, క్లోరిన్ మాత్రలతో పాటు అన్ని రకాలైన మందులను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. -
పోయిన ఆ తుపాకీ దొరికింది!
సాక్షి, పశ్చిమ గోదావరి : ఏఆర్ కానిస్టేబుల్ జోసఫ్ తంబి పోగొట్టుకున్న తుపాకీ లభ్యమైంది. కొవ్వూరు రైల్వే కీమ్యాన్ హరికిషన్ ఈ తుపాకీని దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. రైల్వే బ్రిడ్జి మీద దాచినట్లు నిర్ధారించిన పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకొని మరింత లోతుగా విచారణ చేపడుతున్నామని తెలిపారు. -
లేడీస్ హాస్టల్‌కి వెళ్లి ఆ తర్వాత...
సాక్షి, పశ్చిమగోదావరి : పట్టణంలో మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని వేధిస్తూ, అసభ్యకరంగా ప్రవర్తించిన గోశాల ప్రసాద్ అనే యువకుడిని గురువారం అరెస్ట్ చేసినట్లు పట్టణ ఎస్సై కె.కేశవరావు తెలిపారు. యువతి తల్లి జూలై 29న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. నిందితుడిని కోర్టుకి హాజరుపరచనున్నట్టు పేర్కొన్నారు. ఇద్దరు యువకులపై కేసు.. ఏలూరు టౌన్: లేడీస్ హాస్టల్లోకి అక్రమంగా ప్రవేశించి కిటికీలోంచి వీడియోలు తీస్తున్న ఇద్దరు యువకులపై ఏలూరు త్రీటౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు కట్టా సుబ్బారావుతోటలోని ఎంఆర్సీ వీధిలోని మనస్వి లేడీస్ హాస్టల్ వద్దకు రోజూ రాత్రివేళల్లో ఇద్దరు యువకులు గోడలు దూకి వస్తున్నట్టుగా గుర్తించారు. వారిద్దరూ గోడదూకి ప్రాంగణంలోకి వచ్చి కిటికీలోనుంచి వీడియోలు, ఫొటోలు తీస్తుండగా హాస్టల్ నిర్వాహకురాలు పెనుగొండ రేణుకా దేవి చూసి కేకలు వేశారు. ఒక యువకుడిని పట్టుకున్నారు. వారిద్దరూ ఏలూరు విద్యానగర్‌కు చెందిన ఏలూరి అనిల్ ఆశ, మరో యువకుడు చైతన్యగా గుర్తించారు. నిర్వహకురాలు ఏలూరు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్ మూర్తి ఆదేశాల మేరకు ఎస్ఐ రామకోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అల్పపీడనం.. అధిక వర్షం
సాక్షి, కొవ్వూరు(పశ్చిమ గోదావరి) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా గురువారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో కురిసిన వర్షానికి పలు మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డెల్టా ప్రాంతంలో భారీ వర్షాలకు పలు చోట్ల నారుమళ్లు, వరినాట్లు నీట మునిగాయి. దీనికి శుక్రవారం కురిసిన వర్షం తోడు కావడంతో ముంపు తీవ్రత మరింత పెరిగింది. పలుచోట్ల చెట్లు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. భీమవరం, ఉండి ప్రాంతాల్లో 6 స్తంభాలు నేలకూలాయి. యలమంచిలి మండలంలో చించినాడ కాలువకు గండిపడింది. దీంతో పలుచోట్ల నారుమళ్లు, వరినాట్లు నీటమునిగాయి. పాలకొల్లు మండలంలోను పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శుక్రవారం యలమంచిలి, పాలకొల్లు. పోడూరు, తణుకు, పెనుమంట్ర, అత్తిలి, పెనుగొండ, పెరవలి, పాలకోడేరు, ఆచంట, తాడేపల్లిగూడెం తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం భారీ వర్షాలకు తోడు ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల చెట్లు, వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకులాయి. జిల్లా వ్యాప్తంగా చెట్ల కొమ్మలు విరిగిపడడంతో 16 ఫీడర్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలడం, తీగలు తెగిపోవడం తదితర కారణాల వల్ల విద్యుత్ శాఖకు రూ.2.50 లక్షల నష్టం వాటిల్లింది. నారుమళ్లు, నాట్లకు తీరని నష్టం భారీ వర్షాల వల్ల నారుమళ్లకు తీరని నష్టం కలిగింది. నాట్లు వేసిన వరిపొలాలూ దెబ్బతిన్నాయి. వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా ప్రకారం.. 4,818 హెక్టార్లలో వరినాట్లు, 430 హెక్టార్లలో వరి నారుమళ్లు దెబ్బతిన్నాయి. రికార్డు స్థాయిలో వర్షం.. జిల్లా వ్యాప్తంగా గత 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఏకంగా 32.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇదే గరిష్ట వర్షపాతం. గత రెండు నెలలుగా వర్షాలు లేవు. జూన్ నెలలో అయితే లోటు వర్షపాతం నమోదైంది. యలమంచిలి మండలంలో రికార్డుస్థాయిలో 97.6 మిల్లీమీటర్లు పోడూరులో 90.0, పాలకొల్లులో 78.4, తణుకులో 71.0,పెనుమంట్రలో 60.2, అత్తిలిలో 59.8, పెనుగొండలో 58.6, పెరవలిలో 59.4, పాలకోడేరులో 55.6, ఆచంటలో 50.5 మిల్లీమీటర్లు చొప్పున వర్షం కురిసింది. వీరవాసరంలో 46.8, నరసాపురంలో 45.4, భీమవరంలో 39.4, మొగల్తూరులో 38.6, నిడమర్రులో 38.2, గణపవరంలో 38.0, ఉండిలో 31.2, జంగారెడ్డిగూడెంలో 29.0, వేలేరుపాడులో 28.0. టి.నరసాపురం లో 27.4, కుక్కునూరులో 27.2, పెంటపాడులో 26.4, కాళ్లలో 25.2, చాగల్లులో 22.6, తాళ్లపూడిలో 22.2, ఆకివీడులో 21.8, పెదవేగిలో 20.6, చింతలపూడి, తాడేపల్లిగూడెం మండలాల్లో 20.0, ఉంగుటూరులో 19.4, నిడదవోలులో 18.2, కొవ్వూరులో 17.4, భీమడోలులో 17.2, కొయల్యగూడెం లో 16.2, దేవరపల్లిలో 15.8,లింగపాలెం, కామవరపుకోటంలో 14.6, గోపాలపురంలో 12.6, దెందులూరులో12.2, ద్వారకాతిరుమలలో 12.0, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెంలలో 11.6, పెదపాడు,ఏలూరు మండలాల్లో 9.8 మిల్లీమీటర్లు చొప్పున, నల్లజర్లలో 6.2, పోలవరంలో 4.8 మిల్లీమీటర్లు చొప్పున వర్షం కురిసింది. -
మూడు తరాలు.. పూరి గుడిసెలోనే జీవనం
సాక్షి, పాలకొల్లు (పశ్చిమ గోదావరి): వారు నిరక్షరాస్యులు. చెమటోడ్చడం వారి నైజం. చేపల వేట, రైతుల పొలాల్లోని ఎలుకలు పట్టడం. తట్ట బుట్టలు అల్లుకోవడం వారి వృత్తి. మట్టి పనుల్లో అందెవేసిన చేతులు అవి. సుమారు 50 ఏళ్ల నుంచి మూడు తరాల వారికి అక్కడే స్థిర నివాసం. పూరి గుడిసె వారి ఆస్తి. ఇది పాలకొల్లు రూరల్ పంచాయతీ కొంతేరు రోడ్డు పక్కన నివాసం ఉంటున్న సగరుల(ఉప్పర్ల) పరిస్థితి. అయితే ఇటీవల వారిని రియల్ ఎస్టేట్ భూతం భయపెడుతోంది. వెంటనే వారితో ఆ ఇళ్లను ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తోంది. రెక్కాడితేకానీ డొక్కాడని స్థితిలో ఉన్న వారిని అర్జంటుగా పూరిగుడిసెలు ఖాళీ చేయాలని బెదిరించటంతో ఉప్పర్లు తల్లడిల్లిపోతున్నారు. కొంతేరు రోడ్డులో ఆర్ అండ్ బీ పోరంబోకు స్థలం సుమారు 20 సెంట్లు ఉంది. ఈ భూమిలో 50ఏళ్ల నుంచి పూరిగుడిసెలు వేసుకుని సగరులు నివాసం ఉంటున్నారు. మొదట్లో 10 కుటుంబాలు ఉండేవి. వీరి పిల్లలు, మనవళ్లతో ప్రస్తుతం 35 కుటుంబాలకు చేరుకున్నారు. ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అల్లు హయాంలో 11మందికి పట్టాలు మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ హయాంలో వీరికి 1986లో పట్టాలిచ్చారు. ఆ తరువాత మరికొంత మందికి పట్టాల కోసం ప్రయత్నించినా అధికారులు స్పందించలేదు. దీంతో అదే పూరిగుడిసెలో రెండు, మూడు కుటుంబాలు జీవనం సాగిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. దక్కని ప్రభుత్వ ఫలాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వీరికి దక్కటంలేదు. పక్కా గృహం కానీ, మరుగుదొడ్డి గానీ వీరికి మంజూరు కాలేదు. పంచాయతీ నుయ్యి తవ్వింది. ఆ నూతి నూటినే వారు వాడకం నీరుగా ఉపయోగించుకుంటున్నారు. భయపెడుతున్న సరిహద్దు రైతులు సగరులకు చెందిన పూరి గుడిసెలకు చేర్చి ఉన్న రైతులు తమ భూముల్ని రియల్ ఎస్టేట్‌గా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా వారు ఇళ్లు ఖాళీ చేయాలని సగరులను బలవంతం చేస్తున్నారని వాపోతున్నారు. మూడు తరాల నుంచి ఇక్కడే జీవనం సాగిస్తున్నామని, అర్జంటుగా ఖాళీ చేయాలని బెదిరిస్తుండటంతో ఎక్కడికి పోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. డాక్టర్ బాబ్జిని ఆశ్రయించిన బాధితులు ఇటీవల యాళ్లవానిగరువు విచ్చేసిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి(బాబ్జి), మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లెం ఆనందప్రకాష్‌ల దృష్టికి ఈ సమస్య తీసుకురావడంతో వారు బాధితులకు అభయమిచ్చారు. రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పట్టాల కోసం ప్రయత్నించాం తాతల కాలం నుంచి ఇక్కడే జీవిస్తున్నాం. పట్టాల కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాం. అయినా అధికారులు కనికరించలేదు. పూరి గుడిసెలు ఖాళీ చేయాలని వత్తిడి చేస్తున్నారు. – మిండ్యాల శాంతారావు, స్థానికుడు పూరి గుడిసెలోకి కాపురానికి వచ్చా నా వయసు 60 ఏళ్లు. నలభై ఏళ్ల క్రితం వివాహమైంది. పూరి గుడిసెలోకి కాపురానికి వచ్చా. ఇద్దరు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలతో పూరి గుడిసెలో కాపురం ఉంటున్నా. పిల్లలందరికీ వివాహాలు చేశా. పూరి గుడిసెలే మాకు పక్కా ఇళ్లు. – మిండ్యాల జయమ్మ, వృద్ధురాలు పట్టాలు ఇవ్వాలి ఆర్ అండ్ బీ పోరంబోకు స్థలంలో పూరి గుడిసె నిర్మించుకుని జీవనం సాగిస్తున్నాం. పట్టా ఇవ్వాలని అధికారులకు అర్జీ పెట్టుకున్నా. చాలీచాలని పూరి గుడిసెలో జీవనం సాగిస్తున్నాం. అధికారులు స్పందించి పట్టా ఇవ్వాలి. – పామర్తి వీరమ్మ, స్థానికురాలు మౌలిక వసతులు లేవు మాకు కనీస మౌలిక వసతులు లేవు. ఆరుబయట బహిర్భూమికి వెళుతున్నాం. ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం మాకు మరుగుదొడ్లు మంజూరు చేయలేదు. మంచినీటి వసతి లేదు. ఇబ్బందులు పడుతున్నాం. – మిండ్యాల నరసమ్మ, స్థానికురాలు -
వేర్వేరు చోట్ల.. వ్యక్తుల అదృశ్యం
సాక్షి, కొవ్వూరు (పశ్చిమ గోదావరి): పట్టణంలో నివాసం ఉంటున్న కాగిత త్రినాథ్ అనే వ్యక్తి గడిచిన పదిహేను రోజుల నుంచి కనిపించడం లేదని అతని భార్య శ్యామల పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.కేశవరావు తెలిపారు. విజ్జేశ్వరం జీటీపీఎస్ ప్లాంటు ఫైర్ డిపార్టుమెంట్లో అసిస్టెంట్‌గా పనిచేస్తున్న త్రినాథ్ పదిహేను రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. త్రినాథ్ ఆచూకీ తెలిసిన వాళ్లు పట్టణ పోలీసు స్టేషన్ 08813–231100 నెంబర్‌కి ఫోన్ చేయాలని ఎస్సై కోరారు. చాగల్లు గ్రామంలో.. చాగల్లు: వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి.విష్ణువర్థన్ తెలిపారు. చాగల్లు గ్రామానికి చెందిన సుంకవల్లి గంగాధర్(43) మతి స్తిమితం లేని వ్యక్తి ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతని ఆచూకీ కోసం బంధువులు ఇళ్ల వద్ద వెతికినా సమాచారం తెలియకపోవడంతో తల్లి సుంకవల్లి శకుంతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై జి.విష్ణువర్థన్ తెలిపారు. వివాహిత అదృశ్యం చాగల్లు: వివాహిత అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి.విష్ణువర్థన్ తెలిపారు. కలవలపల్లి గ్రామానికి చెందిన బోల్లా కీర్తి అనే 23 సంవత్సరాల వివాహిత ఈ నెల 24వ తేదీన నిడదవోలులో ఆస్పత్రికి వెళ్తానని భర్త నాగసూర్యచంద్రంకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభ్యంకాక భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై జి.విష్ణువర్థన్ తెలిపారు. -
ఆహాఏమిరుచి..అనరామైమరచి
సాక్షి, కొవ్వూరు (పశ్చిమ గోదావరి) : వర్షాకాలం వచ్చింది.. దాని వెంటే మొక్కజొన్న పొత్తులు వచ్చాయి. ఒక పక్క వర్షం కురుస్తుంటే మరో పక్క వేడి వేడి జొన్నపొత్తులు తింటుంటే ఆ మజానే వేరంటారు మొక్కజొన్న పొత్తుల ప్రియులు. ఏటా జులై నుంచి సెప్టెంబర్ వరకూ దొరికే మొక్కజొన్న పొత్తులకు మంచి గిరాకీ ఉంటుంది. రాష్ట్రంలో దొరికే మొక్కజొన్న పొత్తుల కన్నా దొమ్మేరు పొత్తుకు ఓ ప్రత్యేక రుచి ఉంటుంది. ఇక్కడ ఉండే నేల స్వభావంతో ఈ ప్రాంతంలో పండే మొక్కజొన్న పొత్తులు మంచి రుచిని కలిగి ఉంటాయి. స్థానికులకు ఉపాధి మొక్కజొన్నపొత్తుల సీజన్ పలువురికి ఉపాధిగా మారుతుంది. దొమ్మేరుతో పాటు దూర ప్రాంతాలకు సైతం పొత్తులు ఎగుమతి అవుతుండటంతో స్థానికులకు ఆదాయం సమకూరుతోంది. ఈ సీజన్లో ఇక్కడ రోడ్ల పక్కన దుకాణాలు ఏర్పాటు చేసుకుని పొత్తులు అమ్ముతూ జీవనం సాగిస్తారు. ఒక్కో దుకాణంలో వెయ్యి పొత్తుల వరకూ కాల్చి అమ్మి ఆదాయం పొందుతారు. ఈ ప్రాంతంలో దొరికే పొత్తులను హోల్‌సేల్‌గా కొని, దుకాణాల్లో కాల్చి రిటైల్‌గా అమ్ముతుంటారు. ఒక్కో పొత్తు ప్రస్తుతం రూ. 10 నుంచి రూ. 15 వరకూ సైజును బట్టి అమ్మకాలు జరుపుతున్నారు. అయితే ప్రస్తుతం ధరలు అధికంగా ఉండడంతో ఈ ధర గిట్టుబాటు కావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు ఎకరం మొక్కజొన్న చేను రూ.50 వేలు మొక్కజొన్న సీజన్ ప్రారంభం కావడంతో పొత్తులకు మంచి డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఎకరం మొక్కజొన్న తోటకు రూ.50 వేల వరకూ వ్యాపారులు చెల్లించి రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇది చాలా మంచి రేటని రైతులు చెబుతున్నారు. అయితే గత ఏడాది తయారవుతున్న మొక్కజొన్న పొత్తును పురుగు ఆశించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దిగుబడి లేక కొనుగోలు చేసిన వ్యాపారులు సైతం నష్టాలను చవిచూశారు. దీంతో సాగు విస్తీర్ణం తగ్గడంతో ధరలు పెరిగాయని చెబుతున్నారు. ఈ ఏడాది దొమ్మేరు, పరిసర గ్రామాల్లో అతి తక్కువ సాగు ఉండడం దీనికి కారణం అని చెబుతున్నారు. ఏది ఏమైనా కేవలం వర్షాకాలంలో దొరికే దొమ్మేరు ప్రాంతంలోని మొక్కజొన్న పొత్తును ఒక్కసారైనా రుచి చూడాలని ఈ ప్రాంతం మీదుగా వెళ్లే ప్రయాణికులు, ప్రజలు భావిస్తుంటారు. దొమ్మేరు మొక్కజొన్న పొత్తులకు భలే డిమాండ్ కొవ్వూరు మండలం దొమ్మేరులో మొక్కజొన్న పొత్తుల దుకాణాలు -
షుగర్ ఫ్యాక్టరీకి పూర్వవైభవం!
సాక్షి, కోవూరు(నెల్లూరు) : కోవూరు చక్కెర కర్మాగారంతోపాటు రాష్ట్రంలో ఉన్న చిత్తూరు, రేణిగుంట, కడప ప్రాంతాల్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీల్ని పరిశీలించి నివేదికను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని అమరావతి నుంచి వచ్చిన ప్రత్యేక బృందం సభ్యులు చీఫ్ ఇంజినీర్ ప్రసాద్‌రావు, చీఫ్ కెమిస్ట్ రవికుమార్, ప్రధాన వ్యవసాయాధికారి కె.వి.రమణ, ఇన్చార్జి షుగర్స్ ఏడీ తిరుపాలురెడ్డి తెలిపారు. శుక్రవారం కోవూరు చక్కెర కర్మాగారంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఫ్యాక్టరీలో ఏయే పరికరాలు పనికివస్తాయి.. ఎంత నిధులు అవసరమో పరిశీలించామన్నారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ పరిధిలో చెరకు సాగు ఏమాత్రం చేస్తున్నారు.. ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభిస్తే వారంతా కోవూరు షుగర్స్‌కు చెరకు సరఫరా చేస్తారా లేదా అనే అంశాలపై చర్చించారు. చక్కెర కర్మాగార కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో 6 చక్కెర కర్మాగారాల పరిస్థితి తదితర అంశాలను 6వ తేదీ లోపు పరిశీలించి నివేదిక అందజేస్తామన్నారు. గత నెల 28వ తేదీ నుంచి ఈ షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితుల్ని అధ్యాయనం చేస్తున్నామన్నారు. అనంతరం పలువురు రైతు నాయకులు, కర్మాగార ఉద్యోగులు మాట్లాడుతూ గతంలో జాతీయ స్థాయిలో అనేక అవార్డులు సాధించిన కోవూరు షుగర్ ఫ్యాక్టరీకి మరలా పూర్వవైభవం కల్పించేలా చూడాలని పరిశీలనకు వచ్చిన కమిటీని కోరారు. కోవూరు చక్కెర కర్మాగారానికి సంబంధించిన వాటాదారులైన తమతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని రైతు నాయకులు కోరారు. ప్రధానంగా ఫ్యాక్టరీ పట్ల రైతులకు నమ్మకం పెంచాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చాలని కోరారు. ఇప్పటివరకు కోవూరు చక్కెర కర్మాగారాన్ని నాలుగు సర్వే బృందాలు పరిశీలించి పోయాయన్నారు. సర్వే బృందాలు ఇచ్చిన నివేదికలు బుట్టదాఖలాలు అయ్యాయే తప్ప వాటి వల్ల ఉపయోగం లేదన్నారు. కర్మాగారాన్ని నమ్ముకొని జీవిస్తున్న కార్మికులు ఎంతో మంది అప్పులపాలై విగతజీవులుగా మృతిచెందిన సందర్భాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 21 చక్కెర కర్మాగారాలు ఉన్నాయన్నారు. కర్మాగారానికి సంబంధించి వందల కోట్ల రూపాయలు ఉన్నా వాటిని విడుదల చేసి బకాయిలు చెల్లించాలన్న ఆలోచన గత ప్రభుత్వాలు చేయలేదన్నారు. గతంలో రోడ్డు నిర్మాణ సమయంలో కర్మాగారానికి సంబంధించిన స్థలాన్ని బేరం పెట్టుకొని వాటిని అమ్మకాలు చేపట్టడం చాలా బాధకరమన్నారు. రైతులను సంప్రదించకుండా అమ్మకాలు చేపట్టడం చాలా బాధకరమన్నారు. ఫ్యాక్టరీ స్థితిగతుల్ని పరిష్కరించడానికి వచ్చిన సభ్యులు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ప్రస్తుతం వరిసాగు రైతులకు ఇబ్బందిగా ఉన్న విధి లేని పక్షంలో వరిసాగు చేయాల్సి వస్తుందన్నారు. చెరకు సాగుపై దృష్టి సారించే అవకాశం కోవూరు చక్కెర కర్మాగారం అందుబాటులోకి వస్తే ఆరుతడి పంట అయిన చెరకు సాగుపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందని రైతులు తెలిపారు. దీనిపై ఆధారపడి 4600 మంది రైతులు ఉన్నారని, 2020 నాటికి అయినా ఫ్యాక్టరీని ప్రారంభించేలా కమిటీ ప్రభుత్వానికి సూచించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 9.5 శాతం క్రషింగ్ ఉందన్న విషయాన్ని సర్వే బృందం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిందన్నారు. రాష్ట్రంలోనే ఈ కర్మాగారానికి ఎంతో ఘన చర్రిత ఉందన్న విషయం కూడా మరచిపోవద్దన్నారు. అనంతరం సర్వే బృందం కర్మాగారం మొత్తాన్ని పరిశీలించారు. సమావేశంలో రైతు సంఘం నాయకులు వెంకమరాజు, శ్రీనివాసరావు, నిరంజన్‌రెడ్డి, శ్రీరాములు, డానియల్, ఎంవీ రమణయ్య, శ్రీనివాసులురెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ నమ్మకాన్ని వమ్ము చేయను: వనిత
సాక్షి, కొవ్వూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై పెట్టిన బాధ్యత, నమ్మకాన్ని వమ్ము చేయనని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. అంతటి బాధ్యతలు తనకు ఇచ్చిన ముఖ్యమంత్రికి ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఆమె కొవ్వూరులో మాట్లాడుతూ.. మహిళలకు, శిశువులకు సేవ చేసుకోవడం ఓ మహిళగా తన అదృష్టమన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి కొవ్వూరు నియోజకవర్గ నాయకులు మంత్రిని కలిసి అభినందనలు తెలిపారు. కాగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 1999లో మినహా కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ గెలుస్తూ వచ్చింది. మరలా 20 ఏళ్ల తర్వాత టీడీపీ కోటలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి తానేటి వనిత పాగా వేశారు. గత 30 ఏళ్లలో ఏ ఎమ్మెల్యేకి దక్కని మెజార్టీని ఆమె సొంతం చేసుకున్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకూ ము గ్గురికి మంత్రి పదవులు దక్కాయి. 1978లో ఏఎం అజీజ్ అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందిన కేఎస్ జవహర్ ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. మళ్లీ ఇప్పుడు తానేటి వనితకి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మంత్రిగా స్థానం దక్కింది. -
కొవ్వూరు పీఎస్‌లో లగడపాటిపై ఫిర్యాదు
-
కొవ్వూరులో 7న ‘వై స్క్రీన్స్ మాల్’ ప్రారంభం
సాక్షి, అమరావతి : మిని డిజిటల్ థియేటర్ కాన్సెప్ట్‌తో బాగా ప్రాచుర్యం పొందిన వై స్క్రీన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ కొవ్వూరులో వై స్క్రీన్స్ మాల్‌ను ప్రారంభించనుంది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వురులోని మెయిన్ బైపాస్ రోడ్డులో మంగళవారం(మే 7వ తేదీ) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభం కానుంది. వై స్క్రీన్స్ ట్రేడ్ డెవలప్మెంట్ సెంటర్(వైఎస్టీడీ సెంటర్) పేరిట ఏర్పాటు చేయనున్న ఈ మాల్‌లలో మిని డిజిటల్ థియేటర్, ప్రభుత్వ సేవలు అందించే మీసేవ, బ్యాంక్ ఏటీఎమ్‌లు, గేమింగ్ జోన్, కాఫీ షాప్స్, బ్రాండెడ్ వస్తువుల విక్రయశాలలు, కార్పొరేట్ ఆఫీస్ కార్యాలయాలు ఉండనున్నాయి. వై స్క్రీన్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్, ఎండీ వైవీ రత్నకుమార్ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లలో ఏర్పాటు చేసిన థియేటర్లు ప్రజల ఆధారాభిమానాలు పొందటంతోపాటు ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. -
వనిత అనే నేను లోకల్
కొవ్వూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం కొవ్వూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభతో మెయిన్‌రోడ్డు జనసంద్రమైంది. ఈ సందర్భంగా ఆ పార్టీ కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనిత మాట్లాడుతూ తాను ఎప్పడూ ప్రజలకు అందుబాటులో ఉండే మనిషినని, తాను లోకల్ అని ప్రసంగించారు. జగనన్న వస్తున్నాడు... మన జగనన్న వస్తున్నాడు.. మన బతుకులు మారతాయంటూ ఉత్సాహభరితంగా ప్రసంగించారు. కొవ్వూరు ఏరియా ఆసుపత్రిలో సరైన వైద్యసేవలందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అత్యవసర సమయాల్లో కనీసం ప్రాథమిక వైద్యం అందని దుస్థితి ఉందన్నారు. ఈ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రి చేసుకుని ప్రతి పేదవాడికి వైద్యం అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. గోదావరి తీరంలోనే ఉన్నా తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రిసార్ట్స్ నిర్మాణం పేరుతో కార్తీకమాసంలో శివలింగాన్ని తొలగించి హిందూ సంప్రదాయాలను దెబ్బతీశారని ఆరోపించారు. శివుడితో పెట్టుకున్న వాళ్లకు ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్లాల్సి వచ్చిందన్నారు. టీడీపీ వాళ్లు పెట్టే ప్రలోభాలకు తలొగ్గవద్దని, ఒక్కసారి ఆలోచించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైకిల్ ఇంటి బయట ఉండాలని, ఏనుగు అడవిలో ఉండాలని, ఫ్యాను ఇంట్లో ఉండాలని, జగనన్న మన గుండెల్లో నిలవాలంటూ చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. బీసీకి ఎంపీ సీటిచ్చిన ఘనత వైసీపీదే: భరత్‌రామ్ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎంపీ సీటు ఇచ్చిన ఘనత ఒక్క వైఎస్సార్సీపీకే దక్కుతుందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్‌రామ్ పేర్కొన్నారు. మాట తప్పని, మడమ తిప్పని జగనన్నని ఆశ్వీరదించాలని కోరారు. చంద్రబాబు హామీలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. మన భవిష్యత్ జగనన్న చేతుల్లో పెడదామంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.రాజీవ్‌కృష్ణ, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, పార్టీ నేత వంకా రవీంద్రనాథ్, రాష్ట్ర కార్యదర్శి కోడూరి శివరామకృష్ణ, పార్టీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి ఆత్కూరి దొరయ్య, నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి జి.శ్రీనివాస నాయుడు, నాయకులు బొబ్బా సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు బండి పట్టాభి రామారావు(అబ్బులు) తదితరులు మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. పార్టీ నాయకులు కాకర్ల నారాయుడు, పట్టణ అధ్యక్షుడు రుత్తల భాస్కరరావు, వనిత భర్త శ్రీనివాసరావు, ముదునూరి నాగరాజు ఇమ్మణ్ని వీరశంకరం, ముళ్లపూడి కాశీ విశ్వనాథ్, పరిమి హరిచరణ్ తదితరులు పాల్గొన్నారు. -
విజ్ఞతతో ఓటేయండి
సాక్షి ప్రతినిధి, ఏలూరు, ఏలూరు టౌన్: ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పశ్చిమలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఏలూరు నగరం కొత్తపేట 12పంపుల సెంటర్లోనూ, కొవ్వూరు పట్టణంలోని విజయవిహార్ సెంటర్లోనూ భారీ బహిరంగ సభలకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. భానుడి భగభగల మధ్య వైఎస్ జగన్ టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, మోసాలపై నిప్పులు చెరిగారు. ఐదేళ్ళుగా చంద్రబాబు చేసిన మోసాలను ఎత్తిచూపుతూ.. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో ప్రజలకు వివరించారు. ధర్మానికీ అధర్మానికీ మధ్య యుద్ధం జరుగుతోందనీ.. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి వైఎస్సార్సీపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రజల జీవితాల్లో వెలుగులు రావాలంటే.. ఈ అరాచక పాలనకు వీడ్కోలు పలకాలంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇక యువత, మహిళలు వైఎస్ జగన్ సభలకు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సీఎం.. సీఎం..అంటూ యువత నినాదాలతో హోరెత్తించారు. జగన్ ప్రసంగిస్తున్నంత సేపూ ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. వైఎస్ జగన్ అడిగే ప్రతీ ప్రశ్నకు ప్రజలు స్పందిస్తూ పెద్దపెట్టున సమాధానాలు ఇచ్చారు. ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూ జగన్ చేస్తున్న ప్రసంగానికి ప్రజలు చప్పట్లు, ఈలలతో, హర్షధ్వానాలతో మద్దతు పలికారు. ఏలూరు సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.... ఆ రోజు ఇదే ఏలూరు పట్టణం గుండా పాదయాత్ర సాగింది. ఆరోజు మీరు చెప్పిన ప్రతి అంశము... ఈ రోజుకి కూడా గుర్తు ఉంది. ఏలూరు వన్‌టౌన్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కట్టాలని పది సంవత్సరాల కిందట దివంగత నేత రాజశేఖరరెడ్డి బతికున్నప్పుడు రూ. 15 కోట్లు విడుదల చేశారు. పనులు ప్రారంభించిన తరువాత దివంగత నేత మన మధ్య లేకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఐదు సంవత్సరాల వరకు చంద్రబాబు పాలన జరిగింది. కాని ఏ రకంగా పట్టించుకోని పరిస్ధితి. ఇక్కడే తమ్మిలేరు వర్షాలు పడినప్పుడు ఏ రకంగా దిగువ ప్రాంతాలు, ఏ విధంగా ముంపు గురవుతున్నాయోనని ఇప్పటికే చూస్తా ఉన్నాం. ఈ ఐదేళ్ళల్లో చంద్రబాబు పట్టించుకోలేదు. అప్పట్లో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ముంపును నివారించేందుకు అప్పట్లో రిటైనింగ్ వాల్ కట్టడం కోసం రూ. 30 కోట్లతో పనులు ప్రారంభించారు. ఆ మహానేత చనిపోయిన తరువాత పూర్తిగా పట్టించుకోని పరిస్థితి చూస్తా ఉన్నాం. కొవ్వూరు బహిరంగ సభల్లో వైఎస్ జగన్ మాట్లాడుతూ... తాళ్ళపూడి, తాడిపూడి, ప్రక్కిలంక, చిడిపి, కొవ్వూరు, బల్లిపాడు, ర్యాంపులలో రోజు వేల సంఖ్యలో లారీలు కనిపిస్తా ఉన్నాయ్. పొక్లెయిన్లు పెట్టి ఇసుకను దోపిడీ చేసుకుంటా పోతా ఉన్నారు. ఇక్కడు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తులు, మంత్రులుగా ఉన్న వ్యక్తులు సాక్షాత్తు ముఖ్యమంత్రిగారికి వాటాలు ఇస్తూ దోపిడీ చేస్తున్న విషయాలు కనిపిస్తా ఉన్నాయ్. దేవుడి కార్యక్రమం పుష్కరాలు జరిగాయ్ ఆ పుష్కరాలు జరిగినప్పుడు అంతా చూశారు. చెత్త ఏరివేసే పని దగ్గర నుండి ఘాట్ల నిర్మాణం దగ్గర నుంచి, రోడ్ల నిర్మాణం నుంచి ప్రతి పనిలో నామినేషన్ల పద్ధతిలో ఇష్టానుసారంగా రేట్లు పెంచేసి నాసిరకం పనులు చేయించారు. ఎంత అన్యాయంగా పాలన జరిపించారో మీకే తెలుస్తా ఉంది. బెల్టు షాపుల రద్దు సంతకానికి విలువ ఏదీ కొవ్వూరు నియోజకవర్గంలో ఎక్కడిపడితే అక్కడ బెల్టుషాపులు కనిపిస్తున్నాయ్. బడి పక్కన బెల్టుషాపు... గుడి పక్క బెల్టుషాపు... వీధి చివరా బెల్టుషాపే.. తెలుగుదేశం పార్టీ నాయకులే స్వయంగా బెల్టుషాపులు నిర్వహిస్తూ ఏకంగా ఎంఆర్పీ రేటు కన్నా 20 నుండి 30 రూపాయలకు అమ్ముకుంటా ఉన్న దారుణమైన పరిస్థితి. సాక్షాత్తు చంద్రబాబునాయుడు మొదటి సంతకం బెల్టుషాపుల రద్దు అని చెప్పిన దానికి విలువ ఏమిటో కొవ్వూరులో మీకే తెలుసు. గోదావరి తీరాన మంత్రి కుమారుడు రిసార్ట్స్ కడతాడు.. అక్కడ దేవత విగ్రహాలు అడ్డమొస్తున్నాయి కదా అని వాటిని తొలగిస్తారు. చింతలపూడి ఎత్తిపోతలు కొలిక్కిరాలేదు చింతలపూడి ఎత్తిపోతల పథకం ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు. ఐదేళ్ళు పూర్తయినా కూడా పశ్చిమగోదావరి జిల్లా మెట్ట ప్రాంతమైన చింతలపూడి ఎత్తిపోతల పథకంలో ఏం పని జరిగిందని ఒక ఆలోచన చేయమని అడుగతా ఉన్నా... ఇదే చింతలపూడి ప్రాజెక్టును పూర్తి చేస్తే ఈ ప్రాంతం నుంచి మెట్ట ప్రాంతం వరకు మంచి జరిగే అవకాశం ఉండేది. కావాలని చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయకుండా ఉండేందుకు ఒక మండలం నుంచి ఒక్కొక్క రేటు ఇస్తా ఉంటారు. మాకు ఎందుకు తక్కువ రేటు ఇస్తున్నారని రైతన్నలు ధర్నా చేసే పరిస్ధితికి రెచ్చగొడతా ఉన్నారు. చివరకు ఆ రైతన్నలు ధర్నా చేస్తే వాళ్ళే ఏదో తప్పు చేసినట్లుగా వాళ్ళ మీదే కేసులు పెట్టి చివరికి ఆ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని నీరుగార్చే పరిస్థితికి తీసుకువచ్చారు. వరి పంట పండిస్తున్న రైతన్నల పరిస్థితి క్వింటాల్‌కు కనీస మద్ధతు ధర రూ.1750 కాని రైతు చేతికి ఏ సంవత్సరమైనా రూ. 1200లకు మించి మద్దతు ధర వచ్చిందా అని అడుగుతున్నా. ఈ చెడిపోయిన వ్యవస్థకు మార్పు తీసుకుని రమ్మని, మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఆళ్ల నానికి, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోటగిరి శ్రీధర్‌కు, కొవ్వూరు అసెంబ్లీ అభ్యర్థి నా చెల్లి తానేటి వనితమ్మను, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి మార్గాని భరత్‌ను గెలిపించాలని కోరారు. ఈ సభల్లో దెందులూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి, నిడదవోలు వైఎస్సార్సీపీ అభ్యర్థి జీ.శ్రీనివాస్‌నాయుడు, వైఎస్సార్సీపీ వైద్యవిభాగం రాష్ట్ర అధ్యక్షులు శివభరత్‌రెడ్డి, మాజీ మంత్రి మరడాని రంగారావు, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, వంకా రవీంద్రనాథ్, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ మధ్యాహ్నపు ఈశ్వరి, ఎస్ఎంఆర్ పెదబాబు, ఎంఆర్డీ బలరాం, ఉభయగోదావరి జిల్లాల మహిళా సమన్వయకర్త పిళ్ళంగోళ్ళ శ్రీలక్ష్మి, బొద్దాని శ్రీనివాస్, గుడిదేశి శ్రీనివాస్, కోడూరి శివరామకృష్ణ, ఆత్కూరి దొరయ్య తదితరులు పాల్గొన్నారు. పేదవాడి ఇంటి రుణాన్ని మాఫీ చేస్తా ఇదే ఏలూరులో పాదయాత్రకు వచ్చినప్పుడు ఆరోజు మీరన్నమాట గుర్తుంది. అప్పట్లో దివంగత నేత రాజశేఖరరెడ్డి హయాంలో ఈ నియోజకవర్గంలో 12,000 ఇళ్ళను కట్టించి ఇచ్చారు. ఈ రోజు ఏ రకంగా పట్టాలు పంచిపెట్టాలని, అవినీతి ఫ్లాట్లు కట్టాలని ఆలోచన చేస్తున్న పరిస్థితులున్నాయి. పేదవాడికి చంద్రబాబు అమ్మే రేటు అడుగుకి 2 వేల రూపాయలు చొప్పున 300 అడుగుల ప్లాటు అక్షరాల 6 లక్షల రూపాయలు పేదవాడికి అమ్మే పరిస్థితి చేస్తా ఉన్నాడు. ఈ రూ. 6 లక్షల్లో మూడు లక్షల రూపాయలు పేదవాడి తరపున అప్పుగా రాసుకుంటాడట, ఆ పేదవాడు 20 సంవత్సరాలు పాటు నెల నెలా మూడు వేల రూపాయలు కడుతూ పోవాలట. మీ అందరికి ఒకటేహామీ ఇస్తా ఉన్నా.. మన ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ పేదవాడికి ఏదైతే 20 ఏళ్ళపాటు రూ.3 లక్షల రూపాయలు అప్పు కట్టాల్సి ఉందో. ఆ మొత్తం రూ. 3లక్షలు మాఫీ చేస్తామని హామీ ఇస్తా ఉన్నా. -
కొవ్వూరు బహిరంగ సభలో వైఎస్ జగన్
-
అధికారంలోకి రాగానే బెల్ట్ షాప్‌లను రద్దు
-
బాబుకు ఓటేస్తే...లారీ ఇసుక రూ.లక్ష: వైఎస్ జగన్
సాక్షి, పశ్చిమ గోదావరి : అధికారంలోకి రాగానే బెల్ట్ షాప్‌లను రద్దు చేస్తామని చంద్రబాబు చేసిన సంతకానికి విలువ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బడి, గుడి, వీధి చివరా.. ఎక్కడా చూసినా బెల్ట్ షాప్‌లు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. వీటి నిర్వహణకు అండగా టీడీపీ నాయకులు నిలబడుతున్నారని, ఎంఆర్పీ కంటే 20 నుంచి 30 రూపాయలు అధికంగా వసూలు చేస్తూ దండుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇక జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇసుక దోపిడీకి అడ్డూ అదుపూ లేకుండా పోయిందని అన్నారు. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు వాటాలు పంచుతూ యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తున్నారని అన్నారు. తాళ్లపూడి, తాడిపూడి, బల్లిపాడు, చిడిపి, పక్కిలంక, కొవ్వూరు, పోగిమ్మి ర్యాంపుల నుంచి ప్రొక్లెయిన్లు పెట్టి రోజూ వేల సంఖ్యలో లారీల్లో ఇసుక తరలిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. పుష్కరాలను వదలలేదు.. గోదారి తీరాన రిసార్ట్స్ కట్టిన మంత్రి కుమారుడు మరింత అన్యాయంగా వ్యవహరించారు. అడ్డుగా ఉన్నాయని దేవతల విగ్రహాలను సైతం తొలగించారు. జిల్లాలో జరిగిన పుష్కరాలో సైతం అవినీతి లేకుండా పనులు సాగుతాయని అందరూ అనుకుంటారు. కానీ, అలా జరగలేదు. చెత్త ఏరివేయడం.. ఘాట్ల నిర్మాణం.. తదితర పనులను నామినేషన్ల పద్ధతిలో చేపట్టి ఇష్టానుసారంగా రేట్లు పెంచేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం కొలిక్కి రాలేదు. చంద్రబాబు పాలనలో పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. చంద్రబాబు ప్రతి అడుగులో మోసం.. మోసం. మోసం. పొరపాటున బాబుకు ఓటేస్తే ప్రభుత్వ పాఠశాలలు ఉండవు. ఇప్పటికే 6 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసేశారు. బాబుకు మళ్లీ ఓటేస్తే.. ఆర్టీసీ, కరెంట్ చార్జీలు బాదుడే.. బాదుడు. భూములు లాక్కునేందుకు భూసేకరణ చట్టానికి సవరణలు చేశారు. భూ రికార్డులను సైతం తారుమారు చేశారు. పొరపాటున బాబుకు ఓటేస్తే మీ భూములను లాక్కుంటారు. లారీ ఇసుక లక్ష అవుతుంది.. ఇప్పటికే లారీ ఇసుక రూ.40 వేలు. మళ్లీ బాబును నమ్మి మోసపోతే.. లారీ ఇసుక లక్ష రూపాయలు అవుతుంది. రైతులకు ఉచిత విద్యుత్ సరిగా అందడం లేదు. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ నిర్వీర్యం చేశారు. పొరపాటున బాబుకు ఓటేస్తే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో బ్యాంకులు ఇచ్చే రుణాలకు సైతం ఇవ్వనివ్వరు. రాజధాని నుంచి గ్రామస్థాయి వరకు తనకు అనుకూలమైన పోలీసులను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను అధికారులను రానివ్వడం లేదు. రాబోయే రోజుల్లో మనుషులను చంపేసినా అగిగేవారుండరు. పొరపాటున బాబుకు ఓటేస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మధ్యతరగతి వారికి ఉద్యోగాలుండవు. జడ్జీ పదవులకు బీసీలు అనర్హులని ఇప్పటికే బాబు లేఖలు రాశారు. మరోసారి చంద్రబాబు అబద్ధాలకు మోసపోవద్దని కోరుతున్నా. వైఎస్సార్సీపీ కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా తానేటి వనిత, రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా మార్గాని భరత్‌ను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. 20 రోజులు ఓపిక పట్టండి.. ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు కుట్రలు మరింత పెరుగుతాయి. ఆయన చేయని మోసం ఉండదు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరిని కలిసి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దని చెప్పండి. 20 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని చెప్పండి. ఉన్నత చదువుల కోసం ఎన్ని లక్షలు ఖర్చయినా అన్న చదివిస్తాడని చెప్పండి. డ్వాక్వా మహిళలకు చెప్పండి.. ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా.. నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తామని చెప్పండి. బ్యాంకులకు సగర్వంగా వెళ్లే రోజులు మళ్లీ వస్తాయని చెప్పండి. మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు రావాలంటే జగనన్నతోనే సాధ్యమని చెప్పండి. 45 ఏళ్లు దాటి 60 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.75 వేలు ఇస్తామని చెప్పండి. ప్రతి రైతన్నకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని చెప్పండి. అవ్వా తాతల పెన్షన్ రూ.3 వేల వరకు పెంచుతామని చెప్పండి. -
పారదర్శక పాలన జగన్‌తోనే సాధ్యం
సాక్షి, కొవ్వూరు: కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు తానేటి వనిత. ఏడేళ్లుగా ఇక్కడి ప్రజలతో ఆమె అంతగా మమేకమయ్యారు. ఉచిత ఇసుక పాలసీ మాటున టీడీపీ నేతల అక్రమ వ్యాపారాలపై పోరాటాలు చేశారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా మద్యం ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు విక్రయించడంపై, బెల్టుషాపులు నియంత్రణపై ఆమె ఎనలేని పోరాటం సాగించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల తరఫున ఆమె ఆందోళనలు చేశారు. కొవ్వూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండోసారి పోటీ చేస్తున్న తానేటి వనిత అంతరంగం ఆమె మాటల్లోనే.. నీతివంతంగా పనిచేశాం పదేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా. ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేశాను. నాతండ్రి బాబాజీరావు పదేళ్లు (రెండుసార్లు) ఎమ్మెల్యేగా పనిచేశారు. ఏనాడు చిన్న అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేశాం. నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉండటంతో రాజకీయాల్లో రాణించగలుగుతున్నాం. 2014 ఎన్నికల్లో కొవ్వూరు నుంచి వైఎస్సార్ సీపీ నుంచి పోటీచేశాను. విజయానికి దూరమైనా ప్రజల మనస్సుకి ఎంతో దగ్గరయ్యాను. ఎల్లప్పుడు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. టీడీపీ ఐదేళ్ల పాలనలో నియోజకవర్గాన్ని అవినీతి, అక్రమాలకు అడ్డాగా మార్చారు. ఇసుక, మద్యం మాఫీయాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించడం ద్వారా ప్రజల్లో మంచిస్థానం సంపాదించుకోగలిగాను. ఇక్కడే పుట్టి పెరిగాను కొవ్వూరు నియోజకవర్గంలోనే పుట్టి పెరిగాను. కుమారదేవం మా స్వస్థలం. మా బంధువర్గం అంతా ఈ ప్రాంతంలోనే ఉన్నారు. మా నాన్న ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో చాగల్లు మండలం గోపాలపురం నియోజకవర్గం పరిధిలోనే ఉండేది. దీంతో ఈ నియోజకవర్గంతో మా కుటుంబానికి రాజకీయంగాను, బంధుత్వాలపరంగాను అనుబంధం ఉంది. భర్త శ్రీనివాసరావు ఎండీ జనరల్ వైద్యనిపుణుడు. తాడేపల్లిగూడెంలో ఆసుపత్రి నడుపుతున్నారు. కుమార్తె ప్రణవీ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతుంది. జగనన్న ఆశీస్సులతో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా రెండోసారి పోటీచేస్తున్నా. అన్నివర్గాలకు మేలు చేకూర్చేవి నవరత్న పథకాలు. జగన్సీఎం అయితే రాష్ట్రానికి మేలు చేస్తాడన్న ప్రజల నమ్మకంతో ఈసారి గెలుపొందడం ఖాయం. ప్రధాన సమస్యల పరిష్కారమే లక్ష్యం కొవ్వూరు చరిత్రలో తొలిసారి మహిళకి సీటు కేటాయించిన ఘనత జగన్మోహన్రెడ్డిదే. కొవ్వూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయించి అన్నీరకాల∙వైద్యసేవలు అందుబాటులోకి తెస్తాం. గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, డ్రెయిన్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనకి అధిక ప్రాధాన్యం ఇస్తా. అర్హులందరికీ ఇళ్ల నిర్మాణం. కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకి చర్యలు తీసుకుంటా. ఆరికిరేవుల ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయించేందుకు కృషి చేస్తా. జగన్‌తోనే వ్యవస్థలో మార్పు అన్నీవర్గాలకు పారదర్శకమైన పాలన అందించాలంటే జగన్ సీఎం కావాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారు. ఆయన మాట ఇస్తే మడమ తిప్పరని నమ్ముతున్నారు. గ్రామాల్లో టీడీపీ నాయకులు, జన్మభూమి కమిటీలు ఎంపిక చేసిన వాళ్లకే లబ్ధి చేకూర్చుతున్నారు. ఈ పరిస్థితి మారాలంటే జగన్ పాలన రావాలి. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి 72 గంటల్లో వారి సమస్యలు పరిష్కారిస్తామని జగన్ హామీ ఇచ్చారు. పథకాల లబ్ధిదారుల ఎంపికలో కులం, మతం, పార్టీ చూడమని ప్రకటించారు. 2009లో గోపాలపురం ఎమ్మెల్యేగా గెలుపొందాను. 2012 నవంబర్‌లో పదవి తృణప్రాయంగా విడిచిపెట్టి వైఎస్సార్ సీపీలో చేరి జగన్ సారథ్యంలో నడుస్తున్నా. అప్పటినుంచి కొవ్వూరు సమన్వయకర్తగా పనిచేస్తున్నా. -
ఎన్నారై ప్రతినిధుల ప్రచారం.. అనూహ్య స్పందన!
సాక్షి, రాజమండ్రి: కొవ్వూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్నారై ప్రతినిధులు చేపట్టిన ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తోంది. వైఎస్సార్సీపీ ఎన్నారై కో ఆర్డినేటర్ హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఎన్నారై ప్రతినిధులు ఇంటింటికి తిరిగి.. ప్రజలను కలుసుకొని.. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలిపించాలని, ఫ్యాన్‌ను గుర్తుకు ఓటువేసి.. వైఎస్సార్సీపీని అధికారంలోకి తీసుకురావాలని ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో వైఎస్సార్సీపీ గల్ఫ్, కువైట్ కన్వీనర్ ఇలియాస్ బీహెచ్, ముమ్మడి బాలిరెడ్డి, కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, ఎంవీ నరసారెడ్డి, గల్ఫ్ ప్రతినిధులు షేక్ నాసర్, జీఎస్ బాబు రాయుడు, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు లలితరాజ్, సలహాదారులు అబూ తురాబ్, యూత్ ఇన్చార్జ్ మర్రి కళ్యాణ్, వైస్ ఇన్చార్జ్ సుబ్రహ్మణ్యంరెడ్డి, ఎన్నారైలు వజ్ర శేఖర్‌రెడ్డి, బాలరాజు, సత్తార్, ఇంతియాజ్, మురళీమోహన్ నాయుడు, గంగాధర్ రెడ్డి, ఆనంద్, భరత్, సిద్ధూ, వెంకట్ రెడ్డి, రమణారెడ్డి, రాజు, డానీ, జయకర్ రాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇలియాస్, బాలిరెడ్డి, హర్షవర్ధన్ మాట్లాడుతూ మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వర్ణయుగం మళ్లీ రావాలంటే వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం వైఎస్సార్సీపీ ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గోవింద్ నాగరాజు, నరసారెడ్డి మాట్లాడుతూ ఎన్నకల సమయంలో అబద్ధాలు చెప్పడం చంద్రాబుకు అలవాటు అని, 2014 ఎన్నికల్లోనూ ఎన్నో అబద్ధాలు చెప్పి ఆయన అధికారంలో వచ్చి.. రాష్ట్ర ప్రజలను మోసం చేశారని అన్నారు. -
అందరికీ అందుబాటులో ఉంటా
సాక్షి, కొవ్వూరు: రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన తానేటి వనిత గతంలో ఎమ్మెల్యేగా సత్తాచాటారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ నుంచి కొవ్వూరు నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. ఐదేళ్లుగా అధికారపార్టీ అక్రమాలకు వ్యతిరేకంగా తాను చేసిన పోరాటాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్న ఆమె తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ప్రశ్న : ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది? వనిత : ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏ గ్రామం వెళ్లినా విశేష స్పందన వస్తోంది. ప్రశ్న : మీకు కలిసి వచ్చే అంశాలు ఏమిటీ? వనిత : ఇదే నియోజకవర్గంలో పుట్టి పెరిగాను. ఇక్కడి ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. మా తండ్రి జొన్నకూటి బాబాజీరావు రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఐదేళ్లుగా టీడీపీ అవినీతి పాలనపై ప్రజలు విసుగెత్తారు. ఆ పార్టీ ఇక్కడ స్థానికేతరురాలికి టికెట్ ఇచ్చింది. ఇవన్నీ నాకు కలిసి వచ్చే అంశాలు. ప్రశ్న : గెలుపుపై ధీమాగా ఉన్నారా? వనిత : గెలుపు తథ్యం. నవరత్న పథకాలు, వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంపై ప్రజలు ఎంతో నమ్మకంగా ఉన్నారు. దీనికితోడు రెండుసార్లు ఎమ్మెల్యేగా మానాన్న పని చేసినా, నేను ఎమ్మెల్యేగా ఐదేళ్లు కొనసాగినా ఎక్కడా అవినీతికి ఆస్కారం ఇవ్వలేదు. ప్రజలతో మమేకమయ్యాం. ఏడేళ్ల నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్నా. ఇవి నా గెలుపునకు దోహదం చేస్తాయి. ప్రశ్న : మీ ప్రాధాన్యాంశాలు? వనిత : గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, డ్రెయిన్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తా. అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మిస్తా. కొవ్వూరు ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిని వందల పడకలు అప్‌గ్రేడ్ చేయిస్తా. అన్ని వైద్యసేవలూ అందుబాటులోకి తెస్తా. ప్రశ్న : ఎంత వరకు చదువుకున్నారు? వనిత : ఎమ్మెస్సీ(జువాలజీ) ప్రశ్న : మీ కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉంది? వనిత : నా భర్త శ్రీనివాసరావు సహకారం ఎంతో ఉంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన సర్దుబాటు చేసుకుంటూ నాకు మద్దతు పలుకుతున్నారు. మా నాన్న బాబాజీరావు, ఇతర కుటుంబ సభ్యులంతా సహకరిస్తున్నారు. ప్రశ్న : మీ రాజకీయ ప్రస్థానం? వనిత : 2009లో గోపాలపురం ఎమ్మెల్యేగా గెలుపొందా. 2012 నవంబర్‌లో పదవిని త్రుణప్రాయంగా వదిలా. వైఎస్సార్ సీపీలో చేరా. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ఏడేళ్ల నుంచి కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేస్తున్నా. గత ఎన్నికల్లో కొవ్వూరు నుంచి బరిలో దిగినా గెలుపు చేజారింది. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా మరోసారి పోటీ చేస్తున్నా. ఈసారి టీడీపీ కోటలో వైఎస్సార్ సీపీ పాగా వేయడం ఖాయం. -
బీఎస్పీలో రగడ.. యూపీ నేతలకు ఇక్కడేం పని..?
సాక్షి, పశ్చిమ గోదావరి : ఏపీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకున్న జాతీయ పార్టీ బీఎస్పీలో రగడ మొదలైంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నేతలు ఏపీలో బీఎస్పీ టికెట్లు అమ్ముకుంటున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కారెం లెనిన్ ఆరోపించారు. స్థానిక కేడర్‌ను సంప్రదించకుండా కొవ్వూరు, గోపాలపురం అభ్యర్థులను ఎంపిక చేశారని ఆదివారం జరిగిన బీఎస్పీ జిల్లా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఇచ్చిన వ్యక్తులకు మాత్రమే పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు గుప్పించారు. జనసేన ప్రకటించిన అభ్యర్థులకు మద్దతివ్వబోమని, ప్రచారంలోపాల్గొనమని తేల్చిచెప్పారు. ఇదిలాఉండగా.. ‘పార్టీలో కొన్ని ఇబ్బందులు ఎదురవడం మామూలే. నాయకులు సంయమనం పాటించాలి’ అని జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు నేతల రమేష్ అన్నారు. -
చంద్రబాబు పాలనతో ప్రజలు విసిగిపోయారు
-
ఒకే కుటుంబం..ముగ్గురుమంత్రులు
సాక్షి, కొవ్వూరు : జిల్లా రాజకీయాల్లో మాగంటి కుటుంబం దశాబ్దాల నుంచి ఉంది. తల్లిదండ్రులు, తనయుడు ముగ్గురూ మంత్రులుగా అవకాశం దక్కించుకున్న ఆరుదైన ఘనత వీరికి సొంతం. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి జెడ్పీ చైర్మన్‌గా, 1989లో చెన్నారెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 1991 ఉప ఎన్నికల్లో ఆయన భార్య వరలక్ష్మి గెలుపొంది స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. వారి కుమారుడు మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) 2004లో వైఎస్సార్ ప్రభంజనంలో ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఏలూరు ఎంపీగా ఆయన గెలుపొందారు. ఇలా ఒకే కుటుంబంలో ముగ్గురు రాష్ట్ర మంత్రులు పనిచేయడం మాగంటి కుటుంబం ప్రత్యేకం. -
వైఎస్సార్ భరోసా.. రైతు కులాసా
సాక్షి, యలమంచిలి : ఐదేళ్లుగా వరి సేద్యం గిట్టుబాటు కావడం లేదు. నష్టాలు వెంటాడుతున్నాయి. ఆరుగాలం కష్టించినా.. చేసిన అప్పులు తీరడం లేదు. ఫలితంగా అన్నదాతలు బక్కచిక్కిపోతున్నారు. కొందరు ఆక్వా రంగం వైపు తరలిపోతున్నారు. దీంతో లక్షలాది ఎకరాల పచ్చని పంట భూములు మాయమైపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం సర్కారు తీరే. గిట్టుబాటు ధర కల్పించకపోవడం వల్ల అన్నదాతలు కోలుకోలేకపోతున్నారు. దీనికితోడు పెరిగిన ఎరువులు, కూలి ధరలు, సకాలంలో అందని పెట్టుబడి రైతును కుంగదీస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాగు ప్రారంభంలో రైతులు పెట్టుబడి కోసం వడ్డీవ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. ఈ దయనీయ స్థితిని గమనించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు. నవరత్నాల్లో భాగమైన ఈ పథకం రైతులకు ఆశా దీపంగా మారింది. ఇదీ రైతు భరోసా స్వరూపం ప్రతి రైతు కుటుంబానికీ ఐదేళ్లలో రూ.50 వేలు ప్రతి ఏడాదీ రూ.12,500 చొప్పున సాయం నేరుగా అన్నదాతల ఖాతాల్లో జమ వడ్డీ లేని పంట రుణాలు ఉచితంగా బోర్లు పగటి సమయంలో 9 గంటల ఉచిత విద్యుత్ ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి రూ.4 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయక నిధి శీతలీకరణ గిడ్డంగుల ఏర్పాటు అవసరం మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు సహకార డెయిరీలకు పాలుపోసే రైతులకు లీటరుకు రూ.4 సబ్సిడీ వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్సు రద్దు ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వైఎస్సార్ బీమా ద్వారా రూ.5 లక్షలు ఈ డబ్బు అప్పుల వాళ్లకు చెందకుండా చట్టం తండ్రి బాటలోనే జగన్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వ్యవసాయం పండగలా ఉండేది. ఆయన మరణానంతరం రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో తండ్రి మాదిరిగానే జగన్ కూడా నవ రత్నాలలో మొదటి అంశంగా ప్రవేశపెట్టిన వైఎస్సార్ భరోసా రైతులపాలిట ఆశాదీపంలా కనిపిస్తోంది. – గంధం సత్యకీర్తి, రైతు, మేడపాడు -
సీఎం ఇంటివద్దే ‘తమ్ముళ్ల’ తన్నులాట
సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ అధికార తెలుగుదేశం పార్టీలో ముఠా కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్దే తెలుగు తమ్ముళ్లు పరస్పరం ఘర్షణకు దిగారు. అరుపులు, కేకలతో తన్నులాటకు దిగగా.. ఈ ఘర్షణలో పలువురికి స్వల్ప గాయాలైనట్టు సమాచారం. శుక్రవారం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్లలో పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకుల సమావేశాలు జరిగాయి. ఈ నేపథ్యంలో కొవ్వూరు, నిడదవోలు సిట్టింగ్ ఎమ్మెల్యేలైన కేఎస్ జవహర్, బూరుగుపల్లి శేషారావులకు సీట్లు ఇవ్వొద్దని అక్కడి క్యాడర్, స్థానిక నాయకత్వం ఆందోళనకు దిగింది. నిడదవోలు నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాల నాయకులు ఒకరిపై ఒకరు దాడి చేసి కొట్టుకున్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు సీటిస్తే టీడీపీ గోదారిలో కలిసిపోయినట్లేనంటూ ఆయన్ను వ్యతిరేకించే నాయకులు ఆందోళనకు దిగారు. రెండు వర్గాల నాయకులు అరుపులు, కేకలతో తన్నులాటకు దిగగా.. పలువురు నేతలకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఇసుక క్వారీల్లో బూరుగుపల్లి తీవ్ర అవినీతికి పాల్పడ్డారని, గ్రామాల్లో తమను పట్టించుకోకుండా అణచివేశారని పలువురు ఆరోపించారు. సమావేశానంతరం వారంతా టెంట్లనుంచి బయటికొచ్చి బూరుగుపల్లికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. వారిని ఆపేందుకు పరిశీలకులుగా ఉన్న పార్టీ నేతలు నానాతంటాలు పడ్డారు. సమావేశంలో జరిగిన విషయాల్ని చంద్రబాబుకు వివరిస్తామని, ప్రశాంతంగా ఉండాలని సర్దిచెప్పినా అసమ్మతివర్గం వినిపించుకోలేదు. మంత్రి జవహర్‌ను నిలదీసిన వైరివర్గం.. మరోవైపు కొవ్వూరు నియోజకవర్గంపై నిర్వహించిన సమావేశంలో మంత్రి కేఎస్ జవహర్ ఎదుటే ఆయన అసమ్మతి వర్గం ఆందోళనకు దిగింది. పరిశీలకుల ఎదుటే జవహర్‌ను నిలదీయడమేగాక.. అవినీతికి పరాకాష్టగా మారిన ఆయనకు సీటిస్తే ఓడిస్తామని పలువురు నాయకులు హెచ్చరించారు. ఇందుకు జవహర్ అనుకూల వర్గం అభ్యంతరం చెప్పడంతో గొడవ జరిగి రెండు వర్గాలు తోపులాటకు దిగాయి. పరిశీలకులు ఆపినా పట్టించుకోని కార్యకర్తలు జవహర్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. జవహర్ డౌన్ డౌన్, అవినీతిపరుడు జవహర్‌కు సీటివ్వొద్దు అంటూ నినాదాలు చేశారు. రెండు నియోజకవర్గాల సమావేశాలు రసాభాసగా మారడంతో సీఎం నివాస ప్రాంతం వద్ద గందరగోళం నెలకొంది. పోలీసులు వచ్చి ఆందోళన చేసిన వారిని అడ్డుకుని దూరంగా పంపించివేశారు. కొవ్వూరు నుంచే పోటీ చేస్తా: జవహర్ సమావేశానంతరం మంత్రి జవహర్ మీడియాతో మాట్లాడుతూ తాను మళ్లీ కొవ్వూరు నుంచే పోటీ చేస్తానని, కొందరు నాయకులు అహంకారంతో కావాలని తనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. -
కొవ్వూరు టీడీపీలో వర్గ విభేదాలు
-
అవినీతి మంత్రి మాకొద్దంటూ టీడీపీ నేతల ర్యాలీ
సాక్షి, పశ్చిమ గోదావరి: జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గం టీడీపీలో నెలకొన్న వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య కుమ్ములాట రోడ్డుకెక్కింది. స్థానిక టీడీపీ నేతలు.. మంత్రి జవహర్ అనుకూల వర్గం, వ్యతిరేక వర్గంగా విడిపోయారు. టీడీపీ అధిష్టానం జవహర్‌కు టికెటు కేటాయించవద్దంటూ ఆయన వ్యతిరేక వర్గం బుధవారం భారీ ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగా అవినీతి మంత్రి మాకొద్దంటూ జవహర్‌కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేశారు. జవహర్ నుంచి పార్టీని రక్షించాలని డిమాండ్ చేశారు. కొవ్వూరు పట్టణంతో పాటు రూరల్ గ్రామాల్లో జవహర్‌కు వ్యతిరేకంగా బైక్ ర్యాలీలు చేపడుతున్నారు. జవహర్ వ్యతిరేక వర్గానికి కొవ్వూరు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సూరపునేని రామ్మోహన్రావు, సీనియర్ నాయకులు ఉప్పులూటి నారాయణరావు నాయకత్వం వహిస్తున్నారు. జవహర్‌కు టికెట్ కేటాయిస్తే పార్టీ దారుణంగా ఓడిపోతుందని హెచ్చరిస్తున్నారు. కాగా, మంగళవారం రోజున ప్రజా దీవెన యాత్ర పేరుతో జవహర్ అనుకూల వర్గం ర్యాలీ నిర్వహించింది. అందులో జవహర్ కూడా పాల్గొన్నారు. అయితే నిన్న జవహర్ చేపట్టిన ర్యాలీకి వ్యతిరేకంగానే ఆయన వ్యతిరేక వర్గం నేతలు ఈ ర్యాలీ చేపట్టినట్టుగా తెలుస్తోంది. -
విధినిర్వహణలో కుప్పకూలిన సబ్ రిజిస్టార్
సాక్షి, కొవ్వూరు: పశ్చిమగోదావరి జిల్లాలో కొవ్వూరు సబ్ రిజిస్టార్‌గా పనిచేస్తున్న ఆకాశం శారదాదేవి మంగళవారం విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుతో మరణించారు. ఆమె గత డిసెంబర్లో చింతలపూడి నుండి కొవ్వూరుకు బదిలీపై వచ్చారు. రానున్న ఏప్రిల్ నెలలో ఆమె పదవీవిరమణ చేయనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు కార్యాలయానికి వచ్చిన శారదాదేవి.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఛాతిలో నొప్పి వస్తుంది అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. సిబ్బంది ఆమెను వెంటనే పక్కనే ఉన్న ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శారదాదేవికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా. శారదాదేవి మాత్రం కొవ్వూరులో ఉంటూ సబ్ రిజిస్టార్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆమెకు గుండెపోటు రావడంతో చికిత్స పొందుతున్నారు. ఆమెకు ఆపరేషన్ చేయాలంటూ వైద్యులు చెప్పినట్లు కుమారులు చెప్పారు. ఆమె ఆకస్మిక మృతిపట్ల సబ్ రిజిస్టార్ కార్యాలయ సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. -
‘జవహర్‌కు టికెట్ ఇస్తే చిత్తుగా ఓడిస్తాం’
సాక్షి, అమరావతి : మంత్రి జవహర్‌పై సొంత పార్టీలోనే వ్యతిరేకత మొదలైంది. వచ్చే ఎన్నికల్లో మంత్రి జవహర్‌కు టికెట్ ఇస్తే చిత్తుగా ఓడిస్తామని కొవ్వూరు టీడీపీ నాయకులు పార్టీ అధిష్టానానికి తెలియజేశారు. గ్రూప్ రాజకీయాలను ప్రొత్సహిస్తూ పార్టీని నాశనం చేస్తున్నారని అధిప్టానానికి ఫిర్యాదు చేశారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలకు జవహర్ గౌరవం ఇవ్వడంలేదని మండిపడ్డారు. బ్రాందీ షాపుల్లో పనిచేసే వారే కొవ్యూరులో పార్టీని నడుపుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జవహర్‌కు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వోద్దని అధిష్టానాన్ని కోరారు. -
కొవ్వూరులో ఉద్రిక్త పరిస్ధితులు
-
పవన్ కల్యాణ్ అంటే గౌరవం కానీ..
కొవ్వూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే తనకు చాలా గౌరవం ఉంది కానీ టీడీపీ, ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి పవన్ యూటర్న్ తీసుకున్నారని ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో గురువారం లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ..ఎన్డీఏ నుంచి బయటకు రానంతవరకు చంద్రబాబు నాయుడి పరిపాలన గురించి అద్భుతం అని చెప్పిన ఆయన తర్వాత మాట మార్చారని విమర్శించారు. తాను చిన్న వయసులోనే దేవుడి దయ, ప్రజల వల్ల ఐటీ శాఖా మంత్రిని అయ్యానని చెప్పారు. పవన్ తన మీద అవినీతి ఆరోపణలు చేసే ముందు సాక్షాధారాలతో నిరూపించాలని కోరానని కానీ ఆయన నిరూపించలేక పోయారని అన్నారు. -
‘పర్యావరణాన్ని ఎలా నాశనం చెయ్యాలో చెప్తావా బాబూ..’
సాక్షి, పశ్చిమగోదావరి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా కలక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. కొవ్వూరులో జరిగిన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షునిగా కోడూరి లక్ష్మీనారాయణ ప్రమాణస్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయనతో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ అవినీతిని తూర్పారాబట్టారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద డ్రామా కంపెనీల తయారయిందని అన్నారు. లిక్కర్, ఇసుక మాఫియా ఆగడాలకు కొవ్వూరు నియోజకవర్గాన్ని అడ్డాగా మార్చారని ధ్వజమెత్తారు. అడ్డగోలు ఇసుక, మట్టి తవ్వకాలతో పర్యావరణాన్ని కాలరాస్తున్న చంద్రబాబు పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి సమావేశంలో మాట్లాడతాననడం.. దెయ్యాలు వేదాలు వల్లించడమేనని ఎద్దేవా చేశారు. ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టి టీడీపీ నేతల జేబుల్లోకి నేరుగా తీసుకెళ్లడమే బాబు ఉద్దేశమని కన్నా ఆరోపించారు. -
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో దొంగలు పడ్డారు
కొవ్వూరు: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దొంగలు పడ్డారు. అవును మీరు విన్నది నిజమే. అయితే ఎటువంటి సొత్తు చోరీ కాలేదు. పాత రికార్డులోని కొన్ని పేజీలు మాత్రం గల్లంతయ్యాయి. దీనిపై ఓ అజ్ఞాత వ్యక్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగుచూసింది. ఇది ఇంటి దొంగల పనా..? బయట వ్యక్తులు చేశారా అన్నది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. వివరాల్లోకి వెళితే.. కొవ్వూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో 1998కి చెందిన దస్తావేజు కాపీ రికార్డు (ఫైల్ వ్యాల్యూమ్)లోని కొన్ని పేజీలు గల్లంతయ్యాయి. దీనిపై ఫిర్యాదు అందడంతో ఉన్నతాధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న ఆరుగురు సిబ్బం దిపై బదిలీ వేటు వేశారు. రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 1999 నుంచి రికార్డులను ఆన్లైన్ చేస్తున్నారు. అంతకు ముందు రికార్డులన్నీ మాన్యువల్‌గా ఉన్నాయి. కొవ్వూరు కా ర్యాలయంలో ఉండే మాన్యువల్ రికార్డుల్లో కొన్నిపేజీలు గల్లంతవడం చర్చనీయాంశంగా మారింది. 10న డీఐజీ విచారణ కొవ్వూరుకి చెందిన గారపాటి రవికిషోర్ అనే వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు, సీఎంకు, డీఐజీకి రికార్డులో పేజీలు గల్లంతుపై ఫిర్యాదు అందింది. దీనిపై స్పందించిన స్టాంప్స్ అండ్ రిజి స్ట్రేషన్ శాఖ డీఐజీ బి.సూర్యనారాయణ ఈనెల 10న విచారణకు ఆదేశించారు. జిల్లా రిజిస్ట్రార్ పి.విజయలక్ష్మిని విచారణాధికారిగా నియమించారు. ఆమె అదేరోజు పేజీల గల్లంతుపై కొవ్వూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని 1007 నంబర్లోని ఒరిజినల్ ఫైల్ వ్యాలూమ్లో ఉండాల్సిన 2135, 2136, 2137, 2138 అనే నాలుగు నంబర్లకు సంబంధించిన పేజీలను చించుకునిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసుస్టేషన్లో క్రైమ్ నం.202/2018 కింద కేసు నమోదయ్యింది. ఐపీసీ 427,379 నంబర్ల కింద కేసు రిజిస్ట్రర్ అయ్యింది. ఎవరా అజ్ఞాతవాసి రికార్డులో పేజీలు గల్లంతుపై ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. అసలు గారపాటి రవికిషోర్ అనే వ్యక్తి కొవ్వూరులో ఎవరూ లేరనేది ప్రాథమికంగా గుర్తిం చారు. వాస్తవంగా రికార్డు గదిలోకి బయట వ్యక్తులు వెళ్లే అవకాశం లేదు. పేజీలు గల్లంతైన వ్యవహారం బయట వ్యక్తులకు తెలిసే అవకాశాలు తక్కువ. దీనిని బట్టి ఇక్కడ పనిచేసే సిబ్బంది సహకారంతోనే ఈ తంతు జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఏ తేదీన ఎవరు సబ్ రిజిస్ట్రార్‌గా, ఎవరెవరు విధుల్లో ఉండగా ఇది జరిగిందనే విషయం పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. గతంలో ఇక్కడ ఇన్చార్జ్ సబ్రిజిస్ట్రార్లుగా పనిచేసిన వారి పేర్లతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది పేర్లను, వారు చేస్తున్న ఉద్యోగం వివరాలను జిల్లా రిజిస్ట్రార్ విజయలక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరో తెలితే విచారణ సులభం కావడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఫిర్యాదుదారుడు గుర్తుతెలియని వ్యక్తి కావడంతో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిలో ఎవరైనా నింది తులు ఉంటే నేరం రుజువు కావడంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుందని భావించిన అధికారులు ఆరుగురిని బదిలీ చేసినట్టు తెలుస్తోంది. ఆయా పేజీల్లో ఏముంది..! రికార్డులో గల్లంతైన పేజీలు ఎవరి ఆస్తికి సంబంధించినవి అనే అంశం ఆసక్తిగా మారింది. ఇప్పటికే అధికారులు ఈ రికార్డుని సీజ్ చేశారు. గల్లంతైన పేజీలకు సంబంధించిన ఆస్తుల వివరాలు గురించి అడిగితే అధికారులు నోరు విప్పడంలేదు. విచారణలో ఉందని దాట వేస్తున్నారు. వాస్తవంగా ఈ ఘటన రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు గుణపాఠం నేర్పిందనే చెప్పవచ్చు. ఈ ఘటనలో నేరానికి పా ల్పడిన వ్యక్తి ఎవరనేది తేలకపోవడంతో ఇక్కడ పనిచేసే సిబ్బంది అంతా బాధ్యులు కావాల్సి వచ్చింది. గల్లంతైన నాలుగు పేజీలకు సంబంధించిన ఆస్తుల నకళ్లు తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో ఆయా నంబర్లకు సంబంధించి ఎవరైనా నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఆస్తులను విక్రయించి సొమ్ములు చేసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది మధ్య మా మూళ్ల వాటాలు తేలకపోవడం లేదా వ్యక్తిగత ద్వేషాల నేపథ్యంలో ఈ దుర్చశ్యకు పాల్పడ్డారా.. అన్నది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. జిల్లా రిజిస్ట్రార్ బదిలీ పోలీసులకు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన జిల్లా రిజిస్ట్రార్ విజయలక్ష్మికి పదోన్నతి రావడంతో ఫి ర్యాదు చేసిన మ రుసటి రోజే బదిలీ కావడం గమనార్హం. పేజీలు గల్లంతైన రికార్డుని ఆమె సీజ్ చేశారని కొవ్వూరు సబ్‌రిజిస్ట్రార్ ఎన్‌పీఎస్‌ఆర్ రాజు చెబుతున్నారు. ఇప్పటివరకూ గల్లంతైన నాలుగు పేజీల నంబర్లకు సంబంధించిన ఆస్తు ల వివరాలు కూడా పోలీసులకు అందలేదని తెలి సింది. ప్రస్తుతం పదోన్నతిపై వెళ్లిన జిల్లా రిజిస్ట్రార్ విజయలక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫోన్ నంబర్ స్విచాఫ్‌లో ఉంది. నూతనంగా జిల్లా రిజిస్ట్రార్‌గా మరో వ్యక్తి విధుల్లో చేరే వరకూ విచారణకు ఇబ్బందులు తప్పవని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఫిర్యాదుదారులే విచారణకు రావాల్సి ఉంటుం దన్నారు. దీంతో ఈ కేసు నీరుగారుతున్నట్టు స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా ఇక్కడ నుంచి ఆరుగురు సిబ్బందిని బదిలీ చేయగా వారి స్థానంలో విధుల్లో చేరేందుకు కొత్త సిబ్బంది సంకోచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కీలకమైన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 1998కి ముందు ఉన్న రికార్డులను అధికారులు తనిఖీ చేస్తున్నట్టు సమాచారం. -
ఏ కష్టమొచ్చిందో..
కొవ్వూరు రూరల్/కొవ్వూరు : ఏ కష్టమొచ్చిందో.. ఆరోగ్య సమస్యలా.. ఆర్థిక ఇబ్బందుల కారణమా.. ఏదైనా కాని ఓ కుటుంబం మూడు జిల్లాలు దాటి వచ్చి బలవన్మరణానికి పాల్పడింది. జిల్లాలోని కొవ్వూరు వద్ద గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఓ కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం కలిగించింది. శనివారం కొవ్వూరు లాంచీల రేవు శ్రీ కృష్ణ చైతన్య స్నానఘట్టంలో గోదావరిలో తేలి యాడుతున్న మూడు మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కొవ్వూరు డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు, సీఐ సుభాకర్, ఎస్సైలు ఎస్ఎస్ఎస్ పవన్‌కుమార్, పి.రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఒడ్డుకు తీసుకువచ్చారు. సంఘటనా స్థలంలో దొరికిన బ్యాగ్‌లో లభించిన ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డు ఆధారంగా మృతులు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళికి చెందిన పొందూరు రవికుమార్ (27), అతని భార్య పావని (24), కుమార్తె పూజిత (3)గా గుర్తించారు. ఈ మేరకు మృతుల బంధువులకు సమాచారం ఇచ్చారు. అనంతరం సీఐ సుభాకర్ మాట్లాడుతూ సంఘటనా స్థలంలో లభించిన బ్యాగ్‌లో ఆధార్‌కార్డులతో పాటు రవికుమార్ ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్ ఫైల్ ఉందన్నారు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో వీరు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నామని చెప్పారు. బ్యాగ్‌లో మృతుడి తల్లి రమణమ్మ, మరో కుమార్తె హారిక (2) ఆధార్‌కార్డులు కూడా లభించాయన్నారు. వీరంతా శుక్రవా రం స్థానిక ఆంజనేయస్వామి స్నానఘట్టం వద్ద సంచరించారనే సమాచారం ఉందని, ఆ ప్రాంతంలోనే గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నామన్నారు. అయితే మరో కుమార్తె హా రిక ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. మృతదేహా లను కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశామని సీఐ సుభాకర్ చెప్పారు. ఇదిలా ఉండగా శుక్రవారం గోదావరిలో తేలియాడిన మరో పురుషుడి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. కడతేరిన ప్రేమబంధం రవికుమార్, పావని ఐదేళ్ల క్రితం కులాంతర వివాహాం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. రవికుమార్ కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. వీటికి ఆర్థిక ఇబ్బందులు తోడు కావడంతో బలవర్మణానికి పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. రవికుమార్ తల్లి రమణమ్మ కూడా ఆత్మహత్య చేసుకునేందుకు గోదావరిలో దిగి భయంతో వెనక్కి వ చ్చినట్టు స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి చెప్పాడు. అప్పటికే రవికుమార్ దంపతులు, ఇద్దరు కుమార్తెలు నదిలో మునిగిపోవడంతో రమణమ్మ కేకలు వేసినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి కావడంతో ఆ సమయంలో ఎవరూ స్పందించలేదు. రవికుమార్ బీ టెక్ పూర్తి చేయగా పావని డిగ్రీ చదివింది. వీరు నరసన్నపేటలో నివాసముంటున్నారు. రవికుమా ర్ది గొర్రెలబంద గ్రామం కాగా, పావనిది కురుడు గ్రామం. చినవెంకన్నను దర్శించి.. నరసన్నపేట: తీర్థ యాత్రల పేరుతో బుధవారం నరసన్నపేట నుంచి బయలుదేరి గురువారం ఉద యం ద్వారకాతిరుమల వెళ్లామని రవికుమార్ త ల్లి రమణమ్మ నరసన్నపేటలో ‘సాక్షి’కి తెలిపారు. చినవెంకన్నకు పూజలు చేసి ఉన్న డబ్బు, బం గారు ఆభరణాలు హూండీలో వేసి సాయంత్రం నదికి వద్దకు వెళ్లి్లనట్టు చెప్పారు. అందరమూ ఒక రి చేతులు ఒకరు పట్టుకొని నదిలోని దిగామని ఇంతలో నీటి ఉద్ధృతికి తన చేతులు విడిపోయాయని.. వెంటనే తాను ఒడ్డుకు కొట్టుకు వచ్చానని, అక్కడి నుంచి నరసన్నపేట చేరుకున్నానని చెప్పింది. -
కొవ్వూరు లాంచీ రేవులో మృతదేహాల కలకలం
-
186రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, కొవ్వూరు : ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 186వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. సోమవారం ఉదయం ఆయన కొవ్వూరు నియోజకవర్గంలోని గౌరపల్లి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, పార్టీ నేతలు పాదయాత్రలో ఆయనతో పాటు అడుగులు చేస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను రాజన్న బిడ్డతో వెల్లబోసుకుంటున్నారు. వారికి భరోసా అందిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. నేటి ప్రజాసంకల్పయాత్ర గౌరపల్లి నుంచి పసివేదల, నందమూరు క్రాస్ రోడ్డు, కొవ్వురూ ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ మీదుగా విజయ్ విహార్ సెంటర్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. -
అధికారం అండగా.. ఇసుక దందా
కొవ్వూరు: తివిరి ఇసుమున దైలంబు దీయవచ్చు... అని భర్తృహరి తన సుభాషితాల్లో చెప్పినదానికి టీడీపీ నాయకులు కొత్త అర్థం చెప్తున్నారు. తివిరి ఇసుక నుంచి ధనమును తీయవచ్చు అని రుజువు చేస్తున్నారు. ఇసుక ర్యాంపులను టీడీపీ నేతలు తమ అధీనంలో పెట్టుకుని జనాన్ని నిలువు దోపిడీ చేస్తూ రూ. కోట్లు దండుకుంటున్నారు. అడ్డు అదుపు లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుకను రెట్టింపు ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమ సంపాదనలో కొందరు ఎమ్మెల్యేలకు, మంత్రులకు వాటాలు అందుతున్నట్లు తెలుస్తోంది. మంత్రుల ఇలాకాలో చుక్కల్లో ఇసుక ధరలు జిల్లాలో ఇద్దరు మంత్రుల ఇలాకాలో ఇసుక ధరలు చుక్కలనంటాయి. కొవ్వూరులో ఏకంగా యూనిట్ రూ. 3 వేలు చొప్పున విక్రయిస్తున్నారు. ప్రస్తుతం కొవ్వూరు, వాడపల్లి, ఔరంగబాద్ ర్యాంపులు మూత పడడం, తాడిపూడి ర్యాంపుని చింతలపూడి ఎత్తిపోతల పథకానికి కేటాయించడంతో ఇసుకకి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం కొవ్వూరు నియోజకవర్గంలో వేగేశ్వరపురం, ప్రక్కిలంక ర్యాంపులు మాత్రమే నడుస్తున్నాయి. రెండు చోట్ల అధికార పార్టీకి చెందిన నాయకులే వీటిని నడుపుతున్నారు. బోట్స్‌మెన్ సొసైటీ ముసుగులో అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఇక్కడ పడవలు నడుపుతున్నారు. జిల్లా శాండ్ మైనింగ్ కమిటీ నిర్ణయించిన ప్రకారం యూనిట్ ఇసుక లోడింగ్‌తో కలిపి రూ.850కి విక్రయించాల్సి ఉండగా ఇక్కడ ఏకంగా రూ.1,600 వసూలు చేస్తున్నారు. అవకాశాన్ని బట్టి మార్కెట్ లారీలSకు అయితే ఏకంగా రూ.2 వేలు వరకు తీసుకుంటున్నారు. రోజుకి 400 యూనిట్లు వరకు ఇసుక సేకరిస్తున్నారు. యూనిట్ రూ.100 చొప్పున ఓ ప్రజాప్రతినిధికి ముట్టజెప్పుతున్నట్టు చెబుతున్నారు. మండలానికి చెంది న ఇద్దరు ప్రజా ప్రతినిధుల భర్తలతో పాటు కొందరు టీడీపీ నాయకులు ఈ ర్యాంపులను నడుపుతున్నారు. కోడేరులోనూ అదే తీరు ఆచంట మండలం కోడేరు ఇసుక ర్యాంపులో కూడా ఉచిత ఇసుక పేరుతో యథేశ్చగా దోపీడీ సాగుతోంది. యూనిట్ ఇసుక రూ.750 చొప్పున అమ్మకాలు చేస్తూ టీడీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. ఓ మంత్రి అండదండలతో అధికార పార్టీ నేతలు సిండికేట్‌గా ఏర్పడి దోచేస్తున్నారు. వసూలు చేస్తున్న సొమ్ములో కూలీలకు రూ. 400 చెల్లిస్తూ మిగిలిన మొత్తం కొట్టేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ ఇక్కడి నుంచి సుమారు 30 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించేశారు. దాదాపుగా రూ. 30 లక్షల మేర కొల్లగొట్టేసినట్లు సమాచారం. నిబంధనలకు వ్యతిరేకంగా అమ్మకాలు సాగుతున్నా మామూళ్ల మత్తులో అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. బహిరంగ దోపీడికీ పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. అన్ని ర్యాంపుల్లో అధికార పార్టీ నేతల దోపిడీ పోలవరం, గుటాల ర్యాంపుల్లో ఓ ఎమ్మెల్యే అనుచరులు చక్రం తిప్పుతున్నారు. గుటాలలో డ్రెడ్జింగ్ కూడా చేస్తున్నారు. గతంలో యంత్రాలను సీజ్ చేసినప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. పోలవరం మండలానికి చెందిన టీడీపీ నాయకుడు ఇక్కడి వ్యవహారాలు చూసుకుంటున్నారు. యూనిట్ రూ.1,500 లకు పైబడి వసూలు చేస్తున్నారు. నిడదవోలు మండలం పందలపర్రు, పెండ్యాల గ్రామాల్లో ఇసుక ర్యాంపులు ఉన్నాయి. యూనిట్ ఇసుక లోడ్ చేసేందుకు యూనిట్‌కు కూలీలకు రూ.175లు వసూలు చేయాల్సివుండగా స్థానిక టీడీపీ నాయకులు రూ.300 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. వాహనాలు వెళ్లేందుకు బాట ఏర్పాటుకు యూనిట్‌కు రూ.100 అదనంగా వసూలు చేశారు. ఫిర్యాదులు రావడంతో సమిశ్రగూడెం పోలీసులు జనవరి 11వ తేదీన పందలపర్రులో ఇసుక ర్యాంపుపై దాడిచేసి నదిలో నుంచి ఇసుక తరలిస్తున్న 16 లారీలు, 10 ట్రాక్టర్లపై చర్యలు తీసుకు న్నారు. దీంతో ఈ రెండు ర్యాంపులు తాత్కాలికంగా మూతపడ్డాయి. పందలపర్రు, పెండ్యాల ర్యాంపులతో పాటు రావివారిపాలెంలో అక్రమంగా ఇసుక తరలించేందుకు టీడీపీ నాయకులు రోడ్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఓ ఎమ్మెల్యే సహకారంతో స్ధానిక టీడీపీ నాయకులు ఇక్కడ వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఎనిమిది ర్యాంపులే నడుస్తున్నాయి జిల్లాలో అధికారికంగా 18 ర్యాంపులకు అనుమతులుంటే ప్రస్తుతం వీటిలో ఎనిమిది మాత్రమే నడుస్తున్నాయి. తాడిపూడి ర్యాంపుని చింతలపూడి ఎత్తిపోతల పథకానికి కేటాయిస్తే, ఖండవల్లి ర్యాంపును అర్భన్ హౌసింగ్, భీమవరం హైవే పనులతో పాటు ఇతర ప్రభుత్వ పనుల కోసం కేటాయించారు. ఖండవల్లి ర్యాంపు కూడా మూతపడి నెలరోజులు కావస్తోంది. అఖండ గోదావరి తీరంలో పోలవరం, గుటాల, ప్రక్కిలంక, వేగేశ్వరపురం ర్యాంపులు నడుస్తున్నాయి. వశిష్ట గోదావరి తీరంలో ఆచంట మండలం కోడేరు, యలమంచిలి మండలంలో చించినాడ, యలమంచిలి లంక, దొడ్డిపట్ల నడుస్తున్నాయి. వాస్తవంగా సముద్ర తీరానికి దగ్గరగా ఉండడంతో కోడేరుతో పాటు యలమంచిలి మండలం ర్యాంపుల్లో ఇసుకలో ఉప్పుశాతం అధికంగా ఉంటుంది. వీటిని శ్లాబులకు వినియోగిస్తే ఐరన్ తుప్పుపడుతుంది. అందువల్ల నిర్మాణ పనులకు మాత్రమే వాడతారు. ఇళ్ల నిర్మాణ వ్యయం పెరిగింది స్థానికంగా ఉన్న ర్యాంపులు మూతబడటంతో ఇసుక కావాలంటే అక్రమ నిల్వదారులు యూనిట్ రూ.1000 వరకు తీసుకుంటున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణ వ్యయం బాగా పెరిగింది. ఉచిత ఇసుక అని ప్రభుత్వం ప్రకటించడం తప్ప ఆచరణలో లేదు. పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక కోసమే రూ.50 వేలు పైనే ఖర్చుచేయాల్సి వస్తోంది. పెరిగిన గృహనిర్మాణ సామాగ్రి ధరలతో ఇల్లు కట్టాలంటే భయంగా ఉంది. – కొండపల్లి శ్రీనివాసరావు, కంసాలిపాలెం -
కడుపులో కాటన్ పెట్టి కుట్టేశారు
-
చంద్రబాబుని నమ్మి మోసపోయాం
-
మా ఊరు పేరు నిలబెట్టాడు..
పశ్చిమగోదావరి, కొవ్వూరు రూరల్: స్టూడెంటు నంబర్ ఒన్ సినిమాతో సినీ వినీలాకాశంలో దర్శకుడిగా వెలసిన ధృవతార ఎస్ఎస్ రాజమౌళి. జిల్లాకు చెందిన ఈయనకు ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రచురించిన 2017లో అత్యధికంగా ఆర్జించిన వినోదరంగ ప్రముఖుల జాబితాలో చోటు దక్కింది. ఈ విషయం తెలుసుకున్న పశ్చిమగోదావరి జిల్లాలోని ఆయన బం ధువులు, స్నేహితులు, తెలిసిన వారు అందరూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశం మొత్తం మీద ఎంటర్టైన్మెంటు విభాగంలో అత్యధిక సంపాదనపరుల జాబితాలో ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన 100 మంది జాబితాలో బాహుబలి జక్కన్న 15 స్థానంలో నిలవడం పట్ల ఆయన సన్నిహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1973లో కొవ్వూరులో పుట్టిన ఆయన బాల్యం, విద్యాభ్యాసం చాలా వరకూ కొవ్వూరులోనే జరిగింది. కొవ్వూరుకు చెందిన ఆయన దర్శకుడిగా శిఖరానికి చేరుకోవడం ఇక్కడి వారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. కొవ్వూరుకు పేరు తెచ్చారు రాజమౌళి కొవ్వూరుకే పేరు తెచ్చిన వ్యక్తి. సినిమా రంగంలో ఎంతో మంది దర్శకులు ఉన్నా, జక్కన్నగా పేరు తెచ్చుకోవడం, మా ఊరు వాడు కావడం మాకు ఎంతో గర్వకారణం. నేటి యువతకు రాజమౌళి ఆదర్శంగా నిలుస్తాడు. ఫోర్బ్స్ మ్యాగ్జీన్ ప్రకటించిన 100మంది జాబితాలో ఆయన పేరు ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం – పరిమి హరిచరణ్, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి, కొవ్వూరు చాలా ఆనందంగా ఉంది ఎంటర్టైన్మెంటు విభాగంలో అత్యంత సంపాదనాపరులుగా రాజమౌళి పేరు ఉండడం ఆనందంగా ఉంది. ఫోర్బ్స్ మ్యాగ్జీన్ ప్రకటించిన జాబితాలో ఆయన 15వ స్థానంలో నిలవడం కొవ్వూరుకే గర్వకారణం. ఇక్కడ పుట్టి పెరిగిన ఆయనకు పేరు ప్రఖ్యాతులు రావడం గొప్ప విషయం – మద్దుల సత్యన్నారాయణ, లయన్స్ అధ్యక్షుడు, కొవ్వూరు -
అచ్చిబాబును పక్కన పెట్టినట్టేనా?
కొవ్వూరు: టీడీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం రసాభాసగా మారింది. రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశం అరుపులు కేకలతో దద్దరిల్లింది. మంత్రి ఎదుటే నాయకులు అసంతృప్తి గళం వినిపించడం చర్చనీయాంశమైంది. పార్టీలో మొదటి నుంచి కష్టించి పనిచేసే వాళ్లకు గుర్తింçపునివ్వడం లేదని ఓ సీనియర్ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పార్టీ నాయకుల మధ్య అంతర్గతంగా ఉన్న విభేదాలు సమావేశంలో బయట పడ్డాయి. నియోజకవర్గానికి పెద్దదిక్కుగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ నేత పెండ్యాల అచ్చిబాబుకు తగిన ప్రాధాన్యం ఎందుకు ఇవ్వడం లేదని ఓ నాయకుడు నిలదీసినట్టు సమాచారం. తమ గ్రామంలో రేషన్ దుకాణం కేటాయింపు విషయంలోనూ అన్యాయం చేశారని ఆ నాయకుడు ఆరోపించినట్టు చెబుతున్నారు. ఇటీవల వాడపల్లిలో నిర్వహించిన జనచైతన్య యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో అచ్చిబాబు ఫొటో ఎక్కడా ప్రచురించక పోవడానికి గల కారణం ఏమిటని ఆయన నిలదీసినట్టు తెలిసింది. జవహర్‌కి టికెట్ కేటాయింపు సమయంలో అచ్చిబాబు పార్టీ అధినేత చంద్రబాబును ఒప్పించిన విషయం మరిచిపోవద్దంటూ హితవు పలికినట్టు సమాచారం. ఎన్నికల సమయంలో అచ్చిబాబు రాత్రింబవళ్లు పార్టీ కోసం కష్టపడితే ఇప్పుడు ఆయన ప్రాధాన్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించినట్టు తెలిసింది. కేవలం తాను అచ్చిబాబు మనిషి అన్న కారణంతోనే జిల్లాలో కీలక పదవి నుంచి తనను తొలగించారని ఆ నాయకుడు సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. పార్టీ సభ్వత్వాల కోసం మూడు నెలలు అహ ర్నిశలు కష్టపడ్డానని, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కార్యకర్తలకు గుర్తింపునివ్వ డంలేదని మండిపడినట్టు సమాచారం. అభివృద్ధి పనుల్లోనూ అన్యాయం అభివృద్ధి పనులు కేటాయింపులోను ప్రతిపక్ష నాయకులకు ఇచ్చిన ప్రాధాన్యం కుడా పార్టీ నాయకులకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. పార్టీ కోసం ఇన్నాళ్లు పని చేసిన కార్యకర్తలకు ఏం న్యాయం చేస్తున్నారని నిలదీసినట్టు తెలుస్తోంది. పార్టీకి వీరవిధేయుడిగా పేరున్న ఆ నాయకుడి ప్రశ్నలకు ఏ ఒక్కరు నోరు మెదపలేదని సమాచారం. అచ్చిబాబును పక్కన పెట్టినట్టేనా? ఇటీవల చోటు చేసు కుంటున్న పరిణామాలు చూస్తుంటే అచ్చిబాబుకు పార్టీలో ప్రాధాన్యం తగ్గినట్టే ప్రచారం సాగుతోంది. ఇటీవల మండలంలోని ఓ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో కొవ్వూరు నాయకులు తమ గ్రామంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక అసూయతోనే సమావేశానికి రాలేదని ఓ ముఖ్య నాయకుడు ఆరోపించడంపైనా పట్టణానికి చెందిన ప్రముఖ నాయకులు నియోజకవర్గ సమావేశంలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వ్యక్తిగత కారణాలతో సమావేశానికి హాజరు కాలేదని, అంతమాత్రాన ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేస్తారా అని నిలదీసినట్టు తెలిసింది. దీంతో సమావేశం రసాభాసగానే ముగిసింది. సమావేశంలో నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి రామకృష్ణ, అర్బన్ బ్యాంకు చైర్మన్ మద్దిపట్ల శివరామకృష్ణ, పార్టీ జిల్లా కార్యదర్శి కేవీకే రంగారావు, జడ్పీటీసీ కైగాల మంగాభవానీ, కైగాల శ్రీనివాసరావు,కాకర్ల బ్రహ్మాజీ, అనుపిండి చక్రధరరావు, కోడూరి ప్రసాద్, వట్టికూటి వెంకటేశ్వరరావు, పాలడుగుల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
జవహర్ జవదాటు
చెప్పుల కాళ్లతో శివుడు, వినాయకుడు, నందీశ్వరుడి విగ్రహాల తొలగింపుపై చింతిస్తున్నాం. కమిటీ రాతపూర్వకంగా వినతి పత్రం అందజేస్తే విగ్రహాల ఏర్పాటుకు స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకుంటాం. హిందువుల మనోభావాలను గౌరవిస్తాం. – కేఎస్ జవహర్, రాష్ట్ర పొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి (శుక్రవారం మాట్లాడిన మాటలివీ..) శ్రీనివాస స్నాన ఘట్టంలో నీటిపారుదల శాఖ స్థలంలో అనుమతి లేకుండా పూజలు, ఇతర కార్యక్రమాలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదు. నిర్వహిస్తే శాంతిభద్రతల దృష్ట్యా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – ఎస్బీవీ శుభాకర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, పట్టణ పోలీసు స్టేషన్, కొవ్వూరు (ఈ మేరకు నోటీసూ జారీ చేశారు) కొవ్వూరు: జవహర్ అన్నమాట జవదాటారా? హిందువుల మనోభావాలను పట్టించుకోవడం లేదా.. తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వస్తోంది. శ్రీనివాస స్నానఘట్టంలో నిషేధాజ్ఞలు విధిస్తూ.. పోలీసులు తాజాగా జారీ చేసిన నోటీసు హిందువుల్లో ఆగ్రహం రేపుతోంది. కానరాని ప్రభుత్వ చొరవ కొవ్వూరు శ్రీనివాస స్నానఘట్టంలో చెప్పుల కాళ్లతో శివుడు, వినాయకుడు, నందీశ్వరుడి విగ్రహాల తొలగింపు వ్యవహారంపై ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఈ దుశ్చర్యను పార్టీలకు అతీతంగా అందరూ ఖండించారు. భక్తులకు మద్దతు తెలిపారు. సున్నితమైన ఈ సమస్య పరిష్కారానికి చొరవచూపాల్సిన ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. పైపెచ్చు సమస్యను మరింత జఠిలం చేసేలా యత్నిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గుర్తుకొచ్చిన శాంతిభద్రతలు ఓ మత విశ్వాసాలను దెబ్బతీస్తూ.. విగ్రహాలు తొలగించిన రోజున గుర్తుకురాని శాంతిభద్రతలు ప్రభుత్వానికి ఇప్పుడు గుర్తుకొచ్చాయి. విగ్రహాల తొలగింపును నిరసిస్తూ.. శుక్రవారం భక్తులు శివలింగానికి 108 బిందెలతో అభిషేకాలు చేశారు. మంత్రి కేఎస్ జవహర్‌కు, ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ గణపతి హోమం చేశారు. దీంతో ప్రభుత్వ పెద్దలకు చిర్రెత్తుకు వచ్చింది. శాంతి భద్రతలు గుర్తుకు వచ్చాయి. స్నానఘట్టంలో అనుమతిలేకుండా ఎలాంటి పూజలు, ఇతర కార్యక్రమాలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, అలాచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసుల ద్వారా తాఖీదులు జారీ చేసింది. ఈ చర్య సమస్యకు ఆజ్యం పోసినట్టయింది. శాంతియుతంగానే ఆందోళన హిందూ సంప్రదాయంలో కార్తీక మాసంలో శివరాధనకు అంత్యంత ప్రాముఖ్యం ఉంది. విగ్రహాలు తొలగించిన ప్రదేశంలోనే పునః ప్రతిష్ఠించాలని కొద్దిరోజుల నుంచి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంలు మద్దతు ప్రకటించాయి. భక్తులకు అండగా నిలిచాయి. చేతికి సంకెళ్లు వేసుకుని, నోటికి æనల్ల రిబ్బ న్లు కట్టుకుని అఖిలపక్షం ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన ర్యాలీ కూడా నిర్వహించారు. అధికారులకు, దేవాదాయ శాఖ మంత్రికి వినతిపత్రాలు సమర్పిం చారు. ఇప్పటి వరకు ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన దాఖాలాల్లేవు. విగ్రహాలు తొలగించిన రోజున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా.. అనంతరం నిర్వహించిన కార్యక్రమాలన్నీ శాంతియుత మార్గంలోనే నడిచాయి. ఇలాంటి తరుణంలో పోలీసులు తాఖీదులు ఇవ్వడం దూమారం రేపుతోంది. విగ్రహాలు ప్రతిష్ఠించాలి : సోము వీర్రాజు ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, నాయకులతో కలిసి విగ్రహాలు తొలగింపు ప్రాంతాన్ని సందర్శించారు. వెంటనే విగ్రహాల ప్రతిష్ఠకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విగ్రహాలను పునః ప్రతిష్ఠించి తీరుతామని ఆయన ప్రకటించడం, శాసనమండలిలోనూ ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని ఆయన ప్రకటించడం చర్చనీయాంశమైంది. స్నానఘట్టంలో పోలీసులు మోహరించడంపై ఆయన మండిపడ్డారు. ఇంతమంది పోలీసుల అవసరమేముందని, తమను అరెస్టు చేస్తారా అని ఘాటుగా ప్రశ్నించారు. టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయాలి ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కేంద్రమైన కొవ్వూరులో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయాలని, రిసార్ట్‌ల పేరుతో భక్తికి విరుద్ధమైన బార్లు ఏర్పాటు చేయకూడని డిమాండ్ చేశారు. గోదావరి పవిత్రతను దృష్టిలో ఉంచుకుని నదీతీరంలో చెత్త డంపింగ్ చేయడం, పందుల ఆవాసాలు ఏర్పాటు చేయడం వంటి వాటిపై అధికారులు సత్వరం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ప్రాంతాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. టెంపుల్ టూరిజం అభివృద్ధిపై కలెక్టర్, మంత్రి జవహర్, దేవదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావులతో మాట్లాడతానన్నారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోడూరి లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు ముప్పరాజు శ్రీనివాసరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు బీవీ ముత్యాలరావు, నాయకులు పరిమి రా«ధాకృష్ణ, పిల్లలమర్రి మురళీకృష్ణ, సలాది సందీప్‌కుమార్, దేవగుప్తాపు లక్ష్మణరావు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, కొండపల్లి రత్నసాయి, మాసా ఆనంద్, వీరమాచినేని చైతన్య, పెరుగు పోతురాజు, మండల పార్టీ అధ్యక్షుడు గన్నమని భాస్కరరావు, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పరిమి హరిచరణ్, దళిత విభాగం రాష్ట్ర కార్యదర్శి ముప్పిడి విజయరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు రుత్తల ఉదయభాస్కరరావు, నాయకులు నగళ్లపాటి శ్రీనివాస్, అడ్డూరి సుబ్బారావు,స్ధానికులు అనపర్తి శివరామ కృష్ణ, ఉప్పులూరి కృష్ణారావు, ఆర్యాద్యుల రాధాదేవి తదితరులు వెంట ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఘటనా స్థలానికి రాని టీడీపీ నాయకులూ విగ్రహాలు తొలగించిన ప్రాంతాన్ని సందర్శించి చెప్పులతో విగ్రహాలు తొలగింపును ఖండిస్తున్నట్టు ప్రకటించారు. -
కొవ్వూరులో దేవుడు విగ్రహాల తొలగింపు
-
మంత్రికి మంచిబుద్ధి ప్రసాదించాలని..
కొవ్వూరు : శివుడు, వినాయకుడు, నందీశ్వరుడి విగ్రహాలు తొలగించిన ప్రభుత్వానికి, మంత్రి కేఎస్ జవహర్‌కు మంచి బుద్ధిని ప్రసాదించి, విగ్రహాలు పునః ప్రతిష్టించే విధంగా చేయాలని కోరుతూ పట్టణంలో శ్రీనివాసపురం కాలనీ వాసులు శుక్రవారం గణపతి హోమం నిర్వహించారు. విగ్రహాలు తొలగించిన ప్రదేశంలో గణపతి హోమం నిర్వహించి పూజలు చేశారు. విగ్రహాల తొలగింపు సమయంలో కనీసం సంప్రోక్షణ చేయకపోవడం ఘోర అపచారమని ఈ హోమం చేసినట్టు స్థానిక భక్తులు తెలిపారు. అక్కడే ఉన్న మరో శివలింగానికి గోదావరి నీళ్లతో భక్తులు 108 బిందెలతో అభిషేకం చేశారు. విగ్రహాలు పునఃప్రతిష్టించే విధంగా ప్రభుత్వానికి, స్థానిక మంత్రి జవహర్‌కు మంచిబుద్ధి ప్రసాదించాలని కోరారు. అనపర్తి శివరామకృష్ణ, సిద్ధినేని రాఘవ, బిక్కిన రామకృష్ణ, మద్దూకూరి గణేష్, పి.సరోజిని దేవి, బి.వెంకటలక్ష్మి, ఆరాజ్యుల రాధాదేవి, సీహెచ్ సత్యవతి, ఎం.దుర్గ, జి.కుసుమ, జి.మల్లేశ్వరీ, పి.హేమ పాల్గొన్నారు. -
టీడీపీ పెద్దలకు స్థలం ఇచ్చేందుకు శివలింగం ధ్వంసం!
సాక్షి, కొవ్వూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని ఓ స్నానఘట్టంలో ఇరిగేషన్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. టూరిజం పేరుతో టీడీపీ పెద్దలకు స్థలం కేటాయించేందుకు ఏకంగా స్నానఘట్టంలోని శివలింగంతోపాటు దేవతా విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు. దీన్ని అడ్డుకున్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇరిగేషన్ అధికారులు, పోలీసుల తీరుకు నిరసనగా తానేటి వనిత ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేశారు. -
ఉద్విఘ్నం... ఉద్రిక్తం
రోడ్డు ప్రమాదంపై స్థానికుల ఆందోళన పోలీసుల ఓవరాక్షన్‌కు నిరసనగా రోడ్డుపై బైఠాయింపు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన మృతుడి బంధువు కొవ్వూరు రూరల్: పశ్చిమగోదావరి జిల్లాలో మంగళవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈజీకే (ఏలూరు, గుండుగొలను, కొవ్వూరు) రోడ్డులో కొవ్వూరు మండలం దొమ్మేరు వద్ద గుర్తు తెలియని వాహనం డీకొట్టడంతో అదే గ్రామానికి చెందిన ఫిజియోథెరపిస్ట్ తూతా రమేష్ (25) అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో మృతుడి బంధువులు, గ్రామస్థులు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు ముదునూరి నాగరాజు, జెడ్పీటీసీ గారపాటి శ్రీదేవి, సొసైటీ అద్యక్షుడు గారపాటి శ్రీరామకృష్ణల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మృతదేహం వద్దే టెంట్లు వేసి ఉదయం 10.30 గంటల నుంచి అక్కడే భైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ సీఐ పి. ప్రసాదరావు బాధితులతో చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. సంబంధిత అధికారులు వచ్చి సమాధానం చెప్పాలని, రోడ్డు పరిమితికి మించి వాహనాలు వెళుతున్నాయని, కేవలం గామన్‌బ్రిడ్జి టోల్గేట్ ఆదాయం కోసం భారీ వాహనాలను ఇటువైపు మళ్లిస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో బి. శ్రీనివాసరావు ఆందోళనకారులతో చర్చించాల్సిందిగా తహసిల్దార్ విజయకుమార్‌ను ఆదేశించడంతో ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని వారితో చర్చించారు. అసలు గామన్ వంతెనపై నుంచి వెళ్లడానికి అనుమతులు లేవని, అనధికారికంగా టోల్గేట్ వసూలు చేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే వాహనాల రాకపోకలను అడ్డుకుంటామంటూ స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు ముదునూరి నాగరాజు, జెడ్పీటీసీ గారపాటి శ్రీదేవిలు కొందరు ఆందోళనకారులతో కలిసి గామన్ వంతెన ముఖద్వారం వద్దకు చేరుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ఐరన్ పైపులతో వాహనాలు వెళ్లకుండా కాంక్రీట్‌తో బారికేడ్లను ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటేశ్వరరావు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను హెచ్చరించారు. అవసరం అయితే మృతదేహం వద్ద ధర్నా చేసుకోండని, రోడ్డు మార్గాన్ని మూస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో అందరిని అరెస్టు చేయాలంటూ ఆందోళనకారులతో కలిసి జెడ్పీటీసీ గారపాటి శ్రీదేవి, ముదునూరి నాగరాజులు రోడ్డుపై భైఠాయించారు. పరిస్థితి అందోళనకరంగా మారుతున్న దశలో ఆర్డీవో శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని వారితో చర్చించారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గుండుగొలను వద్ద నుంచి ట్రాఫిక్ మళ్లించడం జరిగిందని, తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా గామన్ వంతెనపైకి భారీ వాహనాలు రాకుండా అక్కడి కలెక్టర్‌తో పశ్చిమ కలెక్టర్ మాట్లాడారని, బుధవారం నుంచి గామ¯Œన్ వంతెనపై భారీ వాహనాల రాకపోకలు నిలిపివేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. ఆర్డీవో సూచనతో ఆందోళనకారులు మృతుడి కుటుంబ సభ్యులతో చర్చించి వెంటనే మీకు తెలియజేస్తామని అక్కడి నుంచి గ్రామంలోని మృతదేహం వద్దకు చేరుకున్నారు. ఇదే సమయంలో కొవ్వూరు డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు, రాజమండ్రి నుంచి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులు అడ్డుగా ఏర్పాటు చేసిన ఐరన్ పైపులను పోలీసులే తొలగించి ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో పోలీసుల చర్చలు ఆందోళనకారులతో పోలీసులు, రెవెన్యూ అధికారులు పలు ధపాలుగా చేసిన చర్చలు విఫలం అవడంతో ఆందోళన తీవ్రతరమయ్యింది. డీఎస్పీ వెంకటేశ్వరరావు, తహసిల్దార్ విజయకుమార్‌తో ఆర్అండ్బీ ఈఈ ఆందోళనకారులతో చర్చించారు. మృతదేహాన్ని తరలించడానికి ఒప్పుకోవాలని, ప్రమాదమానికి కారణమైన వాహనాన్ని పట్టుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి చంద్రన్న బీమా, ప్రమాదబీమా ఇప్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. అయితే గామన్ బ్రిడ్జి పైకి భారీ వాహనాల రాకపోకలే ప్రధాన కారణంగా చెబుతూ మృతుడి కుటుంబానికి టోల్గేట్ నిర్వాహకుల నుంచి నష్టపరిహారం ఇప్పించాలని, లేని పక్షంలో మృతదేహాన్ని తరలించడానికి ఒప్పుకోమని హెచ్చరించారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని తరలించడానికి చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని తరలించే సమయంలో ఉద్రిక్తత ఆందోళనకారులతో చర్చలు సఫలం కాకపోవడంతో పోలీసులు మృతదేహాన్ని తరలించడానికి సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో మృతుడి బంధువైన ఓ యువకుడు న్యాయం చేయకుండా మృతదేహాన్ని తరలిస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ పెట్రోలు పోసుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కొవ్వూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో సంఘటనా ప్రాంతంలో వేసిన టెంటులను పోలీసులే తొలగించారు. మహిళలని చూడకుండా పోలీసులు దౌర్జన్యంగా మృతదేహం వద్ద నుంచి బలవంతంగా ఈడ్చుకుపోయారు. పోలీసులను అడ్డుకున్నారంటూ మరో ఇద్దరు యువకులను కొట్టి ఈడ్చుకుంటూ లాక్కుపోయారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. అదే సమయంలో పోలీసులు బంధువులను చెదరగొట్టి మృతదేహాన్ని ఆటోలో కొవ్వూరు ప్రభత్వ ఆసుపత్రికి తరలించారు. న్యాయం చెయ్యమంటే కొడతారా తమకు న్యాయం చెయ్యమని ఆందోళన చేస్తుంటే పోలీసులు కొడతారా అని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకోవడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. -
నా రూటే సపరేటు!
కొవ్వూరులో మంత్రి పోటీ కార్యక్రమం జెండా వందనానికి ఏర్పాట్లు ఆర్డీఓ పేరుతో ఆహ్వాన పత్రిక సాక్షి ప్రతినిధి, ఏలూరు : నా రూటే సపరేటు అంటున్నారు అబ్కారీ మంత్రిగారు... ఈసారి జిల్లా ఇంఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు జెండా వందనం చేసే అవకాశం ప్రభుత్వం కల్పించడంతో తన నియోజకవర్గంలో పోటీగా కార్యక్రమం నిర్వహించేందుకు మంత్రి కె ఎస్ జవహర్ చేస్తున్న ఏర్పాట్లు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆర్డీఓ పేరుతో దీని కోసం ఆహ్వాన పత్రిక కూడా వేయించారు. జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేస్తుంది. అక్కడే జెండా వందనం చేసిన మంత్రి గారి సందేశం, పోలీసు వందనం, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రశంసా పత్రాల ప్రదానం, లబ్దిదారులకు వివిధ ప్రభుత్వ పథకాల రాయితీల పంపిణీ ఉంటుంది. ఈ ఏడాది కూడా ఏలూరులో పోలీసు పెరెడ్ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మిగిలిన చోట్ల మండల కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనవాయితీ. అధికారికంగా మాత్రం జిల్లాను యూనిట్‌గా తీసుకుని జిల్లా కేంద్రంలో ఈ వేడుకలు నిర్వహిస్తుంటారు. దీనికి జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన మంత్రి జెండా ఎగువవేయడం రివాజుగా వస్తుంది. గత మూడేళ్లు దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జెండా అవిష్కరణ చేస్తూ వచ్చారు. ఈ ఏడాది జిల్లా ఇంఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేరును ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాష్ట్ర పొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ మాత్రం కొత్త పం«థాకు తెరలేపారు. కొవ్వూరులో మాత్రం అన్ని శాఖల అ«ధికారుల భాగస్వామ్యంతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఏర్పాటు చేశారు. దీనికి ఆర్డీఓ పేరుతో ఆహ్వాన పత్రం ముద్రించడం తోపాటు అన్ని శాఖల అధికారులతో ఆయన ఏర్పాట్లు సమీక్షించారు. గృహ నిర్మాణ శాఖ, ఆర్డబ్ల్యూఎస్ శాఖలు శకటాలను సైతం ఏర్పాటు చేశాయి. ఇతర శాఖలను అడిగినా వారు సానుకూలంగా స్పందించలేదు. మరో ఆరుశాఖలు స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అధికారులంతా గత మూడు, నాలుగు రోజుల నుంచి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నాలుగు రోజుల పాటు వరుసగా సెలవులు వచ్చినప్పటికీ మంత్రి ఆగ్రహానికి లోనుకావాల్సి వస్తుందని అధికారులు ఏర్పాట్లులో తలమునకలయ్యారు. కొవ్వూరు మండలంతో పాటు పట్టణ వ్యాప్తంగా ఉన్న విద్యార్ధులను తరలించే బాధ్యతను ఎంఈఓకు అప్పగించారు. ఒక్కో శకటం తయారీకి రూ.50 వేలు ఖర్చువుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఖర్చులకు సంబంధించిన బిల్లులు అందజేస్తే సొమ్ములు చెల్లిస్తామని ఆర్డీఓ సమీక్షా సమావేశంలో వెల్లడించారు. తీరా ఖర్చు చేసిన తర్వాత సొమ్ములు వస్తాయో రావోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ శాఖ ద్వారా అందించే యంత్ర పరికరాలు, సబ్సిడీపై అందించే పరికరాలు, ఇతర శాఖలు ద్వారా అందించే సబ్సిడీ సామగ్రి అంతా ఈ వేడుకలకు తరలిస్తున్నారు. పట్టణంలో సంస్కృత పాఠశాలలో భారీ ఎత్తున నిర్వహించే ఈ వేడుకలకు సుమారు నాలుగు వేల మంది హాజరవుతారని ఆర్డీఓ బి.శ్రీనివాసరావు వెల్లడించారు. సోమవారం సాయంత్రం ప్రాంగణంలో ఏర్పాట్లును ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. కుర్చీలు, టెంటులు, వేదికలు, తాగునీరు, డ్రింక్స్ వంటి ఏర్పాటు చేశారు. వీటికి సుమారు రూ.ఐదు లక్షలకు పైనే ఖర్చులు అవుతున్నట్టు అంచనా. ఈ భారమంతా అధికారులపైనే వేస్తున్నారన్న విమర్శలున్నాయి. మొత్తానికి పోటీగా జరుపుతున్న ఈ వేడుకలు జిల్లాలో చర్చకు దారితీసాయి. -
గ్యాస్ మంట
కొవ్వూరు : ఇకపై జనం నెత్తినే వంట గ్యాస్ సబ్సిడీ పడనుంది. దీనికి కేంద్రం సుముఖంగా ఉన్నట్టు లోక్‌సభలో కేంద్రమంత్రి దర్మేంద్రప్రధాన్ లిఖితపూర్వకంగా వెల్లడించడంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జూలై నుంచి గ్యాస్ సిలిండర్‌పై రూ.4 పెంచనున్నట్టు ఆయన ప్రకటించడంపైనా ఆందోళన రేగుతోంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 15,72,415 గృహావసర వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి ప్రతి వినియోగదారునికీ మొత్తం 12 సిలిండర్లు సబ్సిడీపై లభిస్తున్నాయి. అంత కంటే ఎక్కువ వినియోగిస్తే సబ్సిడీ లేకుండా వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ సబ్సిడీని పూర్తిగా తొలగించే వరకు లేదా మార్చి 2018 వరకు, లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రతినెలా రూ.4 చొప్పున సిలిండర్ ధరను పెంచుతున్నట్టు కేంద్రమంత్రి ప్రకటించడం విమర్శలకు తావిస్తోంది. 2014 నుంచి సబ్సిడీ 2014 నవంబర్ నుంచి వంటగ్యాస్‌పై కేంద్రం రాయితీ ఇస్తోంది. దీనిని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమచేస్తోంది. ముందుగా లబ్ధిదారుడు ప్రభుత్వం అందించే సబ్సిడీ సోమ్ముతో కలిపి సిలిండర్ ధర చెల్లించి కొనుగోలు చేస్తే తర్వాత సబ్సిడీ సొమ్ము జమ చేస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో ఈ సబ్సిడీ సోమ్ము రూ.200లకు పైబడి ఉండేది. ఈనెల రూ.41కి తగ్గిపోయింది. గ్యాస్ ధర ఆధారంగా సబ్సిడీ నిర్ధారణ కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఇప్పుడు కేంద్రం యత్నిస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.ఐదు కోట్ల భారం: తాజాగా సిలిండర్ ధర రూ.4 చొప్పున పెంచడం వల్ల జిల్లాలో వినియోగదారులపై నెలకు రూ.63 లక్షలకుపైగా భారం పడుతున్నట్టు అంచనా. ఈ లెక్కన ఏడాదికి రూ.7కోట్లకుపైగా భారం పడుతుందని తెలుస్తోంది. సబ్సిడీ పూర్తిగా ఎత్తేస్తే..! అదే సబ్సిడీని పూర్తిగా ఎత్తివేస్తే భారం పదిరెట్లు పెరగనుంది. ఉదాహరణకు ఆగస్టులో ఒక్కో సిలిండర్‌పై రూ.41 చొప్పున సబ్సిడీ అందించాలని చరుము కంపెనీలు నిర్ణయించాయి. ఈ లెక్కన లెక్కిస్తే జిల్లాలో మొత్తం లబ్ధిదారులపై నెలకు రూ.6,44,69,015 చొప్పున సబ్సిడీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ఈ లెక్కన ఈ భారం ఏడాదికి సుమారు రూ.77.33కోట్లు ఉంటుందని అంచనా. క్రూడ్ ఆయిల్ ధరలు హెచ్చుతగ్గుల వల్ల గ్యాస్ ధరలల్లో స్వల్ప మార్పులున్నా.. సబ్సిడీ ఎత్తివేస్తే వినియోగదారులపై రెట్టింపు భారం పడుతుందనడంలో సందేహం లేదు. ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో మళ్లీ పేదలు వంటగ్యాస్ భారం తగ్గించుకోవడం కోసం కట్టెల పొయ్యిల వైపు అడుగులు వేయక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. సమజసం కాదు మార్చి నుంచి అన్ని ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ తొలగిస్తామని ప్రకటించడం సమజసం కాదు. ఇప్పటికే సిలిండర్ పొందాలంటే సబ్సిడీ సోమ్ము కలిపి చెల్లించాల్సి రావడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు సిలిండర్‌పై నెలకు రూ.4ల చొప్పున ధర పెంచడం పేదలపై మరింత భారం పడుతుంది. ప్రభుత్వం పేదలకు ఇచ్చే గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ కొనసాగించాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రకటనపై స్పదించకపోవడం బాధాకరం. తానేటి వనిత, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, కొవ్వూరు ఇబ్బందే గ్యాస్‌పై ఇస్తున్న సబ్సిడీని ఇక నుంచి పూర్తిగా ఎత్తి వేస్తామని చెప్పడం సరికాదు. మహిళలు చాలా బ్బంది పడాల్సి వస్తోంది. సిలిండర్‌కు రూ.4 చొప్పున పెంచుతామని చెప్పడం కూడా తగదు. ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. కావూరి కుమారి, మహిళా సర్పంచ్ వేగేశ్వరపురం