దేవరపల్లి(పశ్చిమగోదావరి జిల్లా): పుట్టిన రోజే నాడే ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. దేవరపల్లి మండలం పోలీసుస్టేషన్ సమీపంలో తండ్రీ కూతుళ్లను ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో పాక నీరజ(14) అక్కడికక్కడే మృతిచెందగా..నీరజ తండ్రి శేఖర్‌కు తీవ్రగాయాలయ్యాయి. శేఖర్‌ను చికిత్స నిమిత్తం హుటాహుటిన రాజమండ్రి తరలించారు.
నీరజ భాష్యం పబ్లిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. స్కూలు దగ్గర విడిచిపెట్టడానికి వెళ్లినపుడు రాజమండ్రి వైపు వెళ్తున్న ఓ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. శేఖర్ విద్యుత్ శాఖలో లైన్‌మన్‌గా పనిచేస్తూ బందపురంలో నివాసముంటున్నాడు. శేఖర్ స్వస్థలం కొవ్వూరు మండలం ఔరంగాబాద్. నీరజ తన పుట్టిన రోజు నాడే ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పుట్టిన రోజు నాడే విషాదం
Published Fri, Oct 28 2016 9:33 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
Advertisement
Advertisement