
చెన్నై: నెలరోజులైతే పండటి బిడ్డకు జన్మనివ్వాల్సిన 8 నెలల గర్భిణీ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. తమిళనాడు రాజధాని చెన్నై మెరీనా బీచ్ సమీపంలో శుక్రవారం రాత్రి ఈ విషాద ఘటన జరిగింది. మృతురాలి పేరు లలిత(22). ఆమె భర్త పేరు శివారెడ్డి(26). భారత నావికాదళంలో పనిచేస్తున్నాడు.
శుక్రవారం సాయంత్రం తనను మెరీనా బీచ్ తీసుకెళ్లమని లలిత శివారెడ్డిని అడిగింది. దీంతో అతను ఆమెను బీచ్‌కు తీసుకెళ్లాడు. ఇద్దరూ గంటసేపు అక్కడే సేదతీరారు. అనంతరం తిరిగి క్వార్టర్స్ వెళ్లే క్రమంలో శివారెడ్డి నడుపుతున్న బైక్ స్కిడ్ అయింది. దీంతో వెనకాల కూర్చున్న లలిత రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో నేవీకి చెందిన బస్సు వచ్చి లలితపైనుంచి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
అయితే లలిత కడుపులోని బిడ్డ అయినా బతుకుతుందేమో అన్న ఆశతో హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ బిడ్డ కూడా చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో భార్యతో పాటు పుట్టబోయే బిడ్డను కూడా పోగొట్టుకుని శివారెడ్డి శోకసంద్రంలో మునిగిపోయాడు.
చదవండి: శ్రద్ధ హత్య కేసు.. అడవిని జల్లెడ పట్టిన పోలీసులు.. 3 ఎముకలు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment