pregnant died
-
విషాదం.. 8 నెలల గర్భిణీపై నుంచి దూసుకెళ్లిన మిలిటరీ బస్సు..
చెన్నై: నెలరోజులైతే పండటి బిడ్డకు జన్మనివ్వాల్సిన 8 నెలల గర్భిణీ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. తమిళనాడు రాజధాని చెన్నై మెరీనా బీచ్ సమీపంలో శుక్రవారం రాత్రి ఈ విషాద ఘటన జరిగింది. మృతురాలి పేరు లలిత(22). ఆమె భర్త పేరు శివారెడ్డి(26). భారత నావికాదళంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం తనను మెరీనా బీచ్ తీసుకెళ్లమని లలిత శివారెడ్డిని అడిగింది. దీంతో అతను ఆమెను బీచ్‌కు తీసుకెళ్లాడు. ఇద్దరూ గంటసేపు అక్కడే సేదతీరారు. అనంతరం తిరిగి క్వార్టర్స్ వెళ్లే క్రమంలో శివారెడ్డి నడుపుతున్న బైక్ స్కిడ్ అయింది. దీంతో వెనకాల కూర్చున్న లలిత రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో నేవీకి చెందిన బస్సు వచ్చి లలితపైనుంచి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే లలిత కడుపులోని బిడ్డ అయినా బతుకుతుందేమో అన్న ఆశతో హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ బిడ్డ కూడా చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో భార్యతో పాటు పుట్టబోయే బిడ్డను కూడా పోగొట్టుకుని శివారెడ్డి శోకసంద్రంలో మునిగిపోయాడు. చదవండి: శ్రద్ధ హత్య కేసు.. అడవిని జల్లెడ పట్టిన పోలీసులు.. 3 ఎముకలు స్వాధీనం -
ప్రసవం కోసం వెళ్తే ప్రాణం తీశారు
కోల్‌సిటీ(రామగుండం): సర్కారు ఆస్పత్రిపై నమ్మకంతో ప్రసవం కోసం వెళ్తే... వైద్యుల నిర్లక్ష్యంతో లేబర్ రూం(ప్రసూతీ కేంద్రం)లోని టేబుల్‌పైనే, గర్భిణీ లింగంపల్లి విజయ(30), కడుపులోని బిడ్డ ప్రాణాలు విడిచారు. డాక్టర్లకు బదులు సిబ్బంది ప్రసవం చేస్తున్న సమయంలో బిడ్డ బయటకు వచ్చిందని చెప్పినప్పటికీ మూడు గంటలపాటు వైద్యులు రాకుండా నిర్లక్ష్యం వహించి నిండుచూలాలును పొట్టనపెట్టుకున్నారు. దీంతో మృతురా లి బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో శుక్రవారం జరిగింది. మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. నార్మల్ డెలివరీ కోసం అడ్మిట్... గోదావరిఖని విఠల్‌నగర్‌కు చెందిన రేణికుంట సుగుణ, రాజయ్యల కూతురు లింగంపల్లి విజయ(30)కు కరీంనగర్ జిల్లాలోని చెర్లబుత్కూర్ గ్రామానికి చెందిన రేణికుంట శ్రీనివాస్‌తో వివా హం జరిపించారు. ప్రస్తుతం మహారాష్ట్రంలోని నాగపూర్ ప్రాంతంలో శ్రీనివాస్ పని చేస్తున్నాడు. వీరికి ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. విజయ రెండోసారి గర్భం దాల్చింది. గత నెల రాఖీపౌర్ణమికి గోదావరిఖనిలోని పుట్టింటికి వచ్చింది. ఈనెల 9న డెలివ రీ చెయ్యాల్సి ఉంది. పురుటి నొప్పులు రాకపోవడంతో 12న గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. మొదటి కాన్పు సాధారణ ప్రసవం జరిగిందని, ఇప్పుడూ నార్మల్ డెలివరీ చేస్తామని పరీక్షించిన వైద్యులు అడ్మిట్ చేసుకున్నారు. సకాలంలో స్పందించని వైద్యులు... శుక్రవారం ప్రసూతి కేంద్రంలోని డెలివరీ టేబుల్‌పై విజయను పడుకోబెట్టారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండానే నర్సింగ్ సిబ్బంది, శిక్షణ పొందడానికి వచ్చిన స్టూడెంట్స్‌తో సాధారణ ప్రసవానికి సిద్ధమయ్యారు. పురిటినొప్పులు రావడానికి ఇంజక్షన్లు ఇచ్చారు. కాసేటికి శిశువు తల బయటకు కనిపించడంతో, విజయతో ఉన్న మహిళ వెంటనే సిబ్బందికి చెప్పింది. డాక్టర్లతో ఫోన్లో మాట్లాడుతూ ప్రయత్నించిన సిబ్బంది ఇంజక్షన్ వేశారు. విజయ అపస్మారకస్థితిలో ఉండడంతో డాక్టర్లను పిలుచుకొస్తామని చెప్పిన సిబ్బంది మూడుగంటలపాటు పత్తాలేకుండా పోయారు. తర్వాత హడావుడిగా వచ్చిన డాక్టర్లు, విజయను పరీక్షించి వెంటనే వెళ్లిపోయారు. ఏం జరిగిందో తెలుసుకునేలోగా పోలీసులు వచ్చారు. ఏం జరిగిందని నిలదీస్తే విజయ చనిపోయిందని చెప్పారు. ఆస్పత్రిలో సమాధానం చెప్పడానికి ఒక్క డాక్టర్ కూడా లేకుండా మాయమయ్యారు. మృతదేహాన్ని మార్చురీకి తరలిస్తుండగా, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకొని మార్చురీలో భద్రపరిచారు. రాజీవ్ రహదారిపై రాస్తారోకో... విజయ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని, వారిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు ప్రధానరహదారిపై రాస్తారోకో చేపట్టారు. పోలీసుల జోక్యంతో విరమించి, ఆస్పత్రి ఆవరణలోని మెడికల్ సూపరింటెండెంట్ సూర్యశ్రీరావు ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు. వీరికి శాప్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ అండగా నిలిచారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతామని సీఐ వాసుదేవరావు హామీ ఇవ్వడంతో ఆందోళన వివరమించారు. అనంతరం బంధువుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వైద్యం అందక గర్భిణి మృతి
బెజ్జూర్ (ఆదిలాబాద్): రెండ్రోజుల క్రితం వైద్యం అందక సులుగుపెల్లి గ్రామానికి చెందిన సరిత మృతి చెందిన ఘటన మరువక ముందే మరో నిండు గర్భిణి ప్రాణాలు గాల్లో కలిశాయి. బెజ్జూర్ మండలం ఎల్కపెల్లి గ్రామానికి చెందిన నిండు గర్భిణి ఫర్జాన బేగం(28) సకాలంలో వైద్యం అందక సోమవారం మృతి చెందింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న పార్జన బేగంను కుటుంబీకులు ఆదివారం రాత్రి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి సిబ్బంది పరీక్షించారు. బ్లీడింగ్ అవుతోందని, సమయానికి డాక్టర్ అందుబాటులో లేడని సిర్పుర్(టి) ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లమని కుటుంబీకులకు చెప్పారు. దీంతో కుటుంబీకులు ప్రభుత్వ వాహనంలో సిర్పూర్ ఆసుపత్రిలో తీసకెళ్లారు. అక్కడి వైద్యులు రక్తం మడుగులో ఉన్న గర్భిణిని పరీక్షించి.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారు. వెంటనే వారు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు సైతం తమతో కాదని కరీంనగర్ కు తీసుకెళ్లాలని చెప్పి చేతులు దులుపుకున్నారు. అంతలోనే ఆరోగ్య పరిస్థితి విషమించి ఫర్జాన బేగం మృతి చెందిది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందితే ఫర్జాన బతికేదని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. -
రహదారి సమస్యతో నిండు చూలాలు మృతి
జయపురం : గ్రామానికి సరైన రోడ్డులేదు. కొద్ది రోజులుగా భారీ వర్షాల కారణంగా ఉన్న రోడ్డు బరదమయమైంది. అంబులెన్స్ వచ్చి రోడ్డు బాగోలేక మార్గంలో ఆగిపోయింది. ఈ కారణాలతో నిండు చూలాలు సమయానికి ఆస్పత్రికి చేరుకోలేక ప్రసవం అనంతరం మృతిచెందింది. వివరాలిలా ఉన్నాయి. నవరంగపూర్ జిల్లా పపడహండి సమితి మైదల్‌పూర్ గ్రామ పంచాయతీ మారుమూల కుసుముకుంటి గ్రామానికి చెందిన విమల నాయక్ సోమవారం పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబసభ్యులు 102 అంబులెన్స్‌కు ఫోన్లు చేశారు. అయితే అంబులెన్స్ ఆ గ్రామానికి వెళ్లేందుకు తగిన రోడ్డు లేక పోవడంతో రాలేక మార్గంలో నిలిచిపోయింది. దీంతో ఆ మహిళ నొప్పులతో మెలికలు తిరుగుతుండడంతో బాధ చూడలేక ఒక మంచానికి తొట్టి కట్టి అందులో ఆమెను కూర్చుండ బెట్టి బంధువులు 10 కిలోమీటర్లు మోసుకువెళ్లారు. అక్కడ ఆగి ఉన్న అంబులెన్స్ కనిపించడంతో అందులో ఆమెను మైదల్‌పూర్ ప్రాథమిక వైద్యకేంద్రానికి తీసుకువెళ్లారు. హాస్పిటల్లో ఆడబిడ్డను ప్రసవించిన తరువాత ఆమె మరణించింది. సకాలంలో ఆస్పత్రికి తీసుకు రాలేక పోవడం వల్ల రహదారి లేక 10 కిలోమీటర్లు మోసుకురావడం వల్ల ఆమె మరణించిందని బంధువులు విలపించారు. తమ గ్రామానికి తగిన రోడ్డు లేకపోవడమే విమల నాయక్ మరణానికి కారణమని, అందుకు అధికారులే బాధ్యులని కొంతమంది ఆరోపిస్తున్నారు. తాము ఎన్ని విజ్ఞప్తులు చేసినా అధికారులు తగు చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. ఇకనైనా వెంటనే తమ గ్రామానికి పక్కా రహదారి వేయాలని కోరుతున్నారు. -
ఫోన్లో సూచనలతో సిబ్బంది వైద్యం ..గర్భిణి మృతి
నాగర్‌కర్నూల్ ఎడ్యుకేషన్ : వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారిగా పక్క జిల్లాలో పనిచేస్తున్న ఓ అధికారి నర్సింగ్‌హోంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ గర్భిణిని చిదిమేసింది. అనుభవజ్ఞులైన వైద్యులు లేనప్పటికీ ఎక్కడో దూరంగా ఉన్న సదరు అధికారి ఫోన్లో ఇచ్చిన సూచనలు గర్భిణి పాలిట మృత్యుపాశమైంది. వివరాలిలా.. ఏడు నెలల గర్భంతో ఉన్న బిజినేపల్లి మండలం గుడ్లనర్వ గ్రామానికి చెందిన పద్మమ్మ కడుపునొప్పితో బాధపడుతుండగా భర్త శివశంకర్ వైద్యం కోసం పట్టణంలోని సత్యసాయి నర్సింగ్ హోంకు బుధవారం రాత్రి తీసుకువచ్చారు. ఆమెకు వైద్యాన్ని ప్రారంభించిన ఇక్కడి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విపరీతమైన వాంతులు అయ్యాయి. ఇంజెక్షన్ వికటించిందంటూ గుర్తించిన బాధితులు అక్కడి సిబ్బందిని నిలదీశారు. ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ లేకపోవడం, అనుభవజ్ఞులైన డాక్టర్లెవరూ మహిళను చూడకపోవడంతో ఆ రోజు అక్కడే కాలం గడిపారు. శుక్రవారం పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ వెళ్లాలంటూ సూచించారు. దీంతో ఆమెను హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది. కుటుంబ సభ్యుల ఆందోళన గర్భిణి మృతితో ఆగ్రహించిన బంధువులు శుక్రవారం ఉదయం సత్యసాయి నర్సింగ్ హోం ఎదుట ఆందోళన నిర్వహించారు. దీంతో దిగి వచ్చిన నర్సింగ్‌హోం యాజమాన్యం తమపై కేసు నమోదు చేయకుండా చూసుకున్నారు. బాధిత మహిళ కుటుంబానికి రూ.2 లక్షలు పరిహారం అందించేందుకు ఒప్పుకుని రాజీపడ్డారు. గతంలోనూ ఇక్కడ నిర్లక్ష్యంగా వైద్యం నిర్వహించారంటూ పలువురు చర్చించుకోవడం కనిపించింది. ఈ విషయమై ఆస్పత్రి నిర్వాహకులను వివరణ కోరగా ఇందులో తమ తప్పేమీ లేదన్నారు. రోగికి రక్తం తక్కువగా ఉండటం వల్లే అనుకోకుండా ప్రాణం మీదకి వచ్చిందన్నారు. తమ ఆస్పత్రిలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదని, ఇక మీదట జరగకుండా చూసుకుంటామని వారు పేర్కొన్నారు. -
వరకట్నం వేధింపులకు గర్భిణి బలి
బషీరాబాద్(తాండూరు): వరకట్న దాహనికి ఓ ఇల్లాలు బలైంది. పెళ్లై నాలుగేళ్లు గడుస్తున్నా భర్త వేధింపులు మాత్రం ఆగలేదు. పెళ్లినాడు ఇచ్చిన మాట ప్రకారం మిగిలిన వరకట్నం పుట్టింటి నుంచి తీసుకురావాలని భర్త పెడుతున్న వేధింపులకు తాళలేక ఏడు నెలల గర్భవతి అయిన భార్య పురుగుల మందుతాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నీళ్లపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ లక్ష్మయ్య, మృతురాలి బంధువులు తెలిపిన వివరాలప్రకారం.. నీళ్లపల్లి గ్రామానికి చెందిన తలారి ఆంజనేయులు, అమృతమ్మ(22) భార్యభర్తలు. వీరికి నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. ఈ దంపతులకు కూతురు భావ్యశ్రీ(3) ఉంది. వీరు హైదరాబాద్‌లో పనిచేస్తూ అక్కడే కాపురం పెట్టారు. కొన్ని నెలల కిందట స్వంత గ్రామం నీళ్లపలికి తిరిగి వచ్చారు. అయితే తనకు ఆరోగ్యం బాగాలేదని, ఆస్పత్రిలో చూపించాలని భర్త ఆంజనేయులుకు చెప్పింది భార్య. దీనికి భర్త అగ్గిమీద గుగ్గిలంలా భార్య అమృతమ్మను దూశిస్తూ.. ‘మీ పుట్టింటికి వెళ్లి మిగిలిన వరకట్నం డబ్బులు తీసుకొనిరా.. అప్పుడు నీకు ధవఖానాకు చూపిస్తా..’ అంటు బదులిచ్చాడు. అంతడితో ఆగకుండా భార్యను మానసికంగా, శారీరకంగా బాధపెట్టాడు. దీనికి తోడు అత్త వెంకటమ్మ కూడా కొడుకుకు అండగా నిలచి వేధింపులకు గురిచేసింది. దీంతో తీవ్ర మనస్థాపానికి లోనైన ఆమె అదే రోజు ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లి పోయింది. రాత్రికి పురుగుల మందు తాగి ఇంటికి చేరుకుంది. విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. రాత్రంతా అలాగే ఇంట్లోనే ఉంది. అయితే విషం శరీరంలోకి పాకడంతో తీవ్ర అస్వస్థకు గురైంది. గమనించిన కుటుంబæ సభ్యులు ఆదివారం తెల్లవారు జామున ఆమెను తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వికారాబాద్‌లోని మిషన్ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం అక్కడి నుంచి మొరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 11.30 గంటలకు ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తల్లితో పాటు కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా కండ్లు తెరవకుండానే మృతిచెందింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి శాంతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమృతమ్మ భర్త ఆంజనేయులు, అత్త వెంకటమ్మలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లక్ష్మయ్య తెలిపారు. శవపంచనామ అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. -
మూఢ నమ్మకాలకు గర్భిణి బలి
ఏడు నెలల గర్భిణి.. ఇంకో రెండు నెలలైతే మాతృత్వాన్ని వరంగా పొందుతానని సంబరపడింది. ఆ సమయంలో కడుపులో తీవ్రమైన నొప్పి.. కుటుంబీకులకు చెబితే గాలి దూలి అంటూ మూఢనమ్మకాలతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా ఇంటికే పరిమితం చేశారు. ప్రాణాల మీదకు వచ్చిన తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఆలోపే ఆమె నొప్పి భరించలేక పరలోకానికి వెళ్లిపోయింది. మూఢనమ్మకం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. భీమిని(నెన్నెల) : నెన్నెల మండలం మైలారం గిరిజన వాడకు చెందిన జంబి పోసక్క(25) కడుపు నొప్పితో బాధపడుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. పోసక్క ఏడు నెలల గర్భవతి. ఆదివారం రాత్రి ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దేవుళ్లకు మొక్కులు చెల్లిస్తే నొప్పి తగ్గిపోతుందని కుటుంబీకులు పోసక్కను ఇంట్లోనే ఉంచి సమయం వృథా చేశారు. ప్రాణాల మీదకు వచ్చాక ఆటోలో నెన్నెల పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఝాన్సీరాణి పోసక్కను పరీక్షించి అప్పటికే మృతి చెందిందని ధ్రువీకరించారు. నొప్పి వచ్చిన వెంటనే ఆస్పత్రికి తీసుకొస్తే ప్రాణానికి ఎలాంటి హాని ఉండేది కాదని తెలిపారు. పోసక్క భర్త వ్యవసాయ కూలీ. పోసక్కకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. -
పెద్దాసుపత్రిలో గర్భిణి మృతి
ఖమ్మంవైద్యవిభాగం : ఖమ్మంలోని జిల్లా కేంద్ర ప్రధానాసుపత్రిలో ఆదివారం గర్భిణి మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతిచెందిందని ఆరోపిస్తూ కుటుంబీకులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఖమ్మం నగర శివారులోని కైకొండాయిగూడేనికి చెందిన నకిరికంటి కీర్తి(23), నిండు గర్భిణి. ఆమె భర్త సురేష్, విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. కీర్తి గర్భవతయినప్పటి నుంచి జిల్లా కేంద్ర ప్రధానాసుపత్రిలోనే చూపించుకుంటోంది. డాక్టర్లు ఆమెకు జూన్ 12న డెలివరీ డేట్ ఇచ్చారు. ఆదివారం తెల్లవారుజామున 4.00 గంటల సమయంలో ఆమె ఆకస్మకంగా అస్వస్థురాలైంది. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతుండడం, దగ్గు, కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబీకులు, బంధువులు వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమెకు డ్యూటీ డాక్టర్ అత్యవసర చికిత్స అందించారు. ఈసీజీ చేయటంతోపాటు ఇంజక్షన్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కీర్తి నోట్లో నుంచి నురగ వచ్చింది. కొద్దిసేపటిలోనే (5.25 గంటల సమయంలో) మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యపు వైద్యం కారణంగానే కీర్తి మృతిచెందిందని ఆరోపిస్తూ ఆమె కుటుంబీకులు, బంధువులు ఆసుపత్రి క్యాజువాల్టీలో ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో టూటౌన్ పోలీసులు వచ్చారు. ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు యత్నించారు. ఆ తరువాత, మృతదేహాన్ని మార్చురీకి తరలిస్తుండగా అక్కడ (మార్చురీ ఎదుట) ఆమె ఆందోళనకారులు అడ్డగించారు. అక్కడి నుంచి మృతదేహంతో కలెక్టరేట్ గేటు ఎదుట ధర్నాకు దిగారు. ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది. వారికి పోలీసులు నచ్చచెప్పి శాంతింపచేశారు. వైద్యుల తప్పు లేదు దీనిపై ఆసుపత్రి మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ టి.మదన్సింగ్ను ‘సాక్షి’ వివరణ కోరింది. ‘‘ఆ గర్భిణి మృతి విషయంలో మా తప్పు ఎంతమాత్రం లేదు. బీపీ ఎక్కువై, గుండెపోటు రావటంతో మృతి చెందింది. ప్రతి నెల ఆమెను మా డాక్టర్లు పరీక్షిస్తున్నారు. ఆమెకు బ్లడ్ కూడా తక్కువగా ఉంది. దీనిని ఆమె భర్తకు కూడా చెప్పాం. వారు ఆమెను ఇక్కడకు తీసుకొచ్చిన గంటలోనే పరిస్థితి విషమించి మృతిచెందింది. పేషంట్‌ను రక్షించేందుకు డ్యూటీ డాక్టర్ ఇంజక్షన్ ఇస్తే... దాని కారణంగానే మృతిచెందిందని అనడం సమంజసం కాదు. సీరియస్ కండీషన్‌తో వచ్చే పేషంట్లను బతికించేందుకే ప్రయత్నిస్తాం’’ అన్నారు. -
వరకట్న వేధింపులకు గర్భిణి బలి
చేవెళ్ల : అదనపు కట్నం వేధింపులకు ఓ వివాహిత బలైంది. పెళ్లైన మూడు నెలల నుంచే వరకట్న వేధింపులకు ఐదునెలల గర్భిణి తనువు చాలించింది. కడుపులోని పసిప్రాణం ఈ లోకాన్ని చూడకముందే కన్నుమూసింది. ఈ దుర్ఘటన చేవెళ్ల మండలంలోని దేవునిఎర్రవల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మృతురాలి మెడపై గాయాలు ఉండడంతో అత్తింటివారే కట్నం కోసం గొంతు నులిమి హత్యచేశారని మృతురాలి కుటుంబసభ్యుల ఆరోపిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలంలోని దేవునిఎర్రవల్లి గ్రామానికి చెందిన పత్తి శ్రీశైలం, అంతమ్మల కుమారుడు పత్తి శ్రీనివాస్ అలియాస్ శేఖర్‌కు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఇంద్రానగర్‌కు చెందిన డిల్లెం మల్లేశ్, లక్ష్మీల ఒక్కగానొక్క కూతురు శిరీష (25) అలియాస్ మమతను ఇచ్చి 2017 జూన్ 16న వివాహం చేశారు. పెళ్లి సమయంలో 20 తులాల బంగారం, ఇతర సామగ్రితో మొత్తం రూ. 14 లక్షలు కట్నంగా ముట్టజెప్పారు. మూడు నెలలపాటు సాఫీగా సాగిన వీరి కాపురం.. మూడవ నెల నుంచి శిరీష అత్తింటివారు అదనపు కట్నం వేధిస్తున్నారు. మరో రూ. 2 లక్షల కావాలని అత్త, మామ, భర్త, ఆడపడుచులు నిత్యం గొడవలు సృష్టిస్తున్నారు. దీంతో శిరీష గొడవ పడి పుట్టింటికి వెళ్లింది. కుటుంసభ్యులు నచ్చజెప్పి గ్రామ పెద్దలతో మాట్లాడి మళ్లీ కాపురానికి పంపించారు. అప్పటి నుంచి తరుచూ కట్నం కోసం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే సోమవారం తెల్లవారుజామున ఐదు గంటలకు శిరీష మేనమామ శ్రీనివాస్‌కు భర్త శేఖర్ ఫోన్‌చేసి మీ కోడలు మాట్లాడటం లేదు ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని చెప్పాడు. మరోగంటకు ఫోన్ చేసి చనిపోయిందని చెప్పడంతో వెంటనే కుటుంబసభ్యులంతా గ్రామానికి చేరుకున్నారు. మిన్నంటిన రోధనలు సోమవారం ఉదయం మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి గొంతు భాగంలో గొంతు నులిమినట్లుగా గుర్తులు, మెడ మొత్తం గాయాలు ఉండడంతో అత్తింటివారు హత్య చేశారని నిలదీశారు. ఆదివారం రాత్రి కూడా భర్త, అత్త, మామ శిరీషను వేధింపులకు గురి చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. రాత్రి 11.30 గంటలకు శిరీష వికారాబాద్‌లో ఉండే మేనమామ శ్రీనివాస్‌కు ఫోన్ చేసేందుకు ప్రయత్నించడం.. ఫోన్ కలువకపోవడంతో తరువాత మెసేజ్ వచ్చిందని చెప్పారు. అప్పుడే ఆమెను కొట్టి హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఒక్కగానొక్క కూతురును, ఆమె కడుపులో పెరుగుతున్న పసికందును కూడా హత్య చేశారని కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి బంధువుల ఆందోళన శిరీషను అత్తింటివారే హత్య చేశారని మృతురాలి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో వికారాబాద్ జిల్లా నుంచి బంధువులు దేవునిఎర్రవల్లికి వచ్చారు. తమ కూతురును ఎందుకు హత్యచేశారని నిలదీస్తుండంగా భర్త, అత్తమామలు, ఆడపడుచులు అక్కడినుంచి తప్పించారు. దీంతో వారు వచ్చే వరకు మృతదేహాన్ని తీసేది లేదంటూ ఆందోళనకు దిగారు. సీఐ గురువయ్య, ఎస్ఐ శ్రీధర్‌రెడ్డిలు, గ్రామపెద్దలు కుటుంబసభ్యులకు నచ్చజెప్పడంతో శాంతించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. -
బాత్రూంలో జారిపడి గర్భిణి మృతి
కామారెడ్డి క్రైం : కాలకృత్యాలకు వెళ్లిన ఓ గర్భిణి కాలుజారిపడిపోవడంతో తీవ్రగాయాలై మృతిచెందిన సంఘటన కామారెడ్డి మండలం టేక్రియాల్‌లో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. దేవునిపల్లి ఎస్సై కథనం ప్రకారం.. లింగంపేట మండలం ఎల్లారం గ్రామానికి చెందిన రాధిక (24)కు గత డిసెంబర్లో టేక్రియాల్‌కు చెందిన గంగారాంతో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. బుధవారం రాత్రి ఆమె బాత్రూంలో కాలుజారిపడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు గమనించి కామారెడ్డిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దేవుపల్లి ఎస్సై సంతోష్‌కుమార్ విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
బైక్‌ను వెంబడించిన పోలీసులు.. గర్భిణి మృతి..!
సాక్షి, చెన్నై: తమిళనాడులోని తిరుచ్చి హైవేపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. హెల్మెట్ ధరించలేదని బైక్‌పై వెళ్తున్న దంపతులను పోలీసులు వెంబడించారు. ఈ ఘటనలో బైక్‌పై నుంచి గర్భిణి జారిపడింది. తీవ్ర గాయాలైన ఆమె అక్కడే మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయలయ్యాయి. వివరాలివి.. గణేష్ సర్కిల్ వద్ద పోలీసులు ట్రాఫిక్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో సూలపేటకు చెందిన రాజా, అతని భార్య ఉష బైక్‌పై వెళ్తున్నారు. వారి వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు నిలిపే ప్రయత్నాం చేశారు. కానీ రాజా బైక్ ఆపకుండా వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు మరో వాహనంలో వారిని వెంబడించారు. బైక్ వెనుక కూర్చున్న ఇన్స్పెక్టర్ వాహనాన్ని బలంగా తన్నాడు. ఇన్స్పెక్టర్ కాలు గర్భిణీ పొట్టపై బలంగా దంపతులిద్దరూ వాహనం నుంచి నడిరోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో ఉషకు తీవ్ర గాయాలు కావటంలో అక్కడే మృతిచెందగా, భర్తకు తీవ్ర గాయలయ్యాయి. దీంతో కోపోద్రిక్తులైన మృతురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పోలీసుల చర్యను ఖండిస్తూ స్థానికులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. స్థానికుల దాడిలో పోలీసు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన పలువురు పోలీసులకు గాయపడ్డారు. పరిస్థితి మితిమిరడంతో డీఎస్పీ అక్కడికి చేరుకున్నాడు. చర్చలకు వచ్చిన డీఎస్పీపై ఆందోళనకారులు చెప్పులు విసిరారు. రోడ్డుపై బైఠాయించడంతో బారీ స్థాయిలో పోలీస్ బలగాలు మోహరించాయి. పోలీసుల చర్యపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పోలీస్ అధికారి మాట్లాడుతూ.. రోజు మాదిరే పోలీసులు హైవేపై చేకింగ్ చేస్తున్నారు. ఆ సమయంలోనే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై తిరుచ్చి రేంజ్ డీఐజీ నేతృత్వంలో విచారణ మొదలెట్టామన్నారు. దీనికి కారణమైన ఇన్స్పెక్టర్ను అరెస్టు చేసినట్లు పోలీస్ అధికారి చెప్పారు. -
ప్రసవం చేశారు.. ప్రాణం తీశారు
జమ్మికుంట(హుజూరాబాద్): వివాహమైన ఐదేళ్లకు సంతానయోగం కలిగింది. తల్లివారింటికి వచ్చి స్థానిక ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంది. గతేడాది అక్టోబర్‌లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో ఏమైందో ఏ మోకానీ.. తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఆరోగ్యం విషమించడంతో పలు ఆస్పత్రుల్లో వైద్యం అందించారు. రూ. లక్షలు ఖర్చుపెట్టినా ఫలితం లేకుండా పోయింది. తన బిడ్డను చూడకుండానే.. మనసారా ముద్దాడకుండానే ఆ తల్లి కన్నుమూసింది.. ప్రసవం చేసిన వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ కుటుంబ సభ్యులు మంగళవారం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. రమ భర్త అశోక్ వివరాల ప్రకారం.. వీణవంక మండలం నర్సింగపూర్‌కు చెందిన పోతరవేన కనకయ్య కూతురు రమ(26)కు మంచిర్యాల జిల్లా శ్రీ రాంపూర్‌కు చెందిన బోయిన అశోక్‌తో 2012లో వివా హమైంది. 2017లో గర్భం దాల్చింది. నర్సింగపూర్‌లో ఉంటూ జమ్మికుంటలోని మమత ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుంది. అక్టోబర్ 29న నొప్పలు రావడంతో ఆస్పత్రిలోచేరింది. 30న మగబిడ్డకు జన్మనిచ్చింది. రక్తస్రావంతో పరిస్థితి విషమం.. ఆపరేషన్ సమయంలో తీవ్ర రక్తస్రావంకావడంతో రమ ఆరోగ్యం విషమించింది. 31న ఆస్పత్రి డాక్టర్ సుధాకర్‌రావు తన కారులో హన్మకొండలోని మాక్స్‌కేర్ ఆస్పత్రికి తరలించాడు. నవంబర్ 25వరకు అక్కడే చికిత్స పొందింది. డిశ్చార్జి చేసి ఇంటికి తీసుకెళ్లగా గుండెలో సమస్య తలెత్తింది. దీంతో జనవరి 23న మ్యాక్స్‌కేర్ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. ‘మమత’ వైద్యులే కారణం అంటూ.. తన భార్య రమకు ఆపరేషన్ చేసే సమయంలో వైద్యు లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే అనారోగ్యానికి గు రైందని ఈ నెల 1న మమత ఆస్పత్రి ఎదుట రమ భర్త అశోక్ బంధువులతో కలిసి ఆందోళనకు దిగాడు. దీంతో డాక్టర్ సుధాకర్‌రావు రమను హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం అందించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. మృతదేహాంతో ఆందోళన రమ మృతదేహాన్ని నేరుగా జమ్మికుంటలోని మమత ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి ఎదటు శవంతో ఆందోళనకు దిగారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని, ఆస్పత్రి గుర్తింపు రద్దు చేయాలంటూ డిమా ండ్ చేశారు.పోలీసులు అక్కడకు చేరుకుని అడ్డుకున్నారు. రూ. 14 లక్షలకు ఒప్పందం ఆస్పత్రి ఎదుట ఆరుగంటల పాటు ఆందో ళన చేయడంతో పోలీసులు సర్ధిచెప్పేందుకు యత్నించారు. పోలీసు స్టేషన్లో ఆరువర్గాలు చర్చించుకున్నారు. మృతురాలి కుటుం బానికి రూ.14 లక్షలు ఇచ్చేందుకు ఆస్పత్రి యాజమాన్యం అంగీకరించడంతో గొడవ సద్దుమణిగింది. -
నయాపూల్ ఆసుపత్రిలో ఇద్దరు గర్భిణుల మృతి
హైదరాబాద్: హైదరాబాద్‌లోని నయాపూల్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు గర్భిణులు మృతి చెందారు. గర్భిణుల మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ వారి బంధువులు ఆందోళనకు దిగగా, ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్లే వారు చనిపోయారని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. బీదర్‌కు చెందిన షబానా బేగం(21) కిషన్‌బాగ్‌లోని తన బంధువుల ఇంట్లో ఉంటూ పేట్లబురుజు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మంగళవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరింది. వైద్యులు వైద్యం అందిస్తుండగా రాత్రి 11.30 గంటలకు మృతి చెందింది. విషయం తెలుసుకున్న బంధువులు కిషన్‌బాగ్ మజ్లిస్ కార్పొరేటర్‌తో కలసి ఆందోళనకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చార్మినార్ పోలీసులు వచ్చి ఆందోళనకారులను శాంతింపజేశారు. అదే ఆసుపత్రిలో బుధవారం మరో గర్భిణి మృతి చెం దింది. 2 రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా యాలాల మండలానికి చెందిన షాహిన్(22) ప్రసవం కోసం నయాపూల్ ఆసుపత్రిలో చేరింది. బుధవారం తెల్లవారుజామున తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందింది. సరైన వైద్యమందకపోవడం వల్లే తన భార్య మృతి చెందిందని ఆమె భర్త మౌలానా ఆవేదన వ్యక్తం చేశారు. బీపీ ఎక్కువై ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. వైద్యుల వైఫల్యం లేదు: సూపరింటెండెంట్ గర్భిణులు మృతి చెందడంలో వైద్యుల నిర్లక్ష్యం ఏమీలేదని, వారికి సకాలంలో వైద్య సేవలు అందించామని నయాపూల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగమణి తెలిపారు. షబానా బేగం నాంపల్లిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తీవ్ర అనారోగ్యానికి గురై చివరి నిమిషంలో ఆసుపత్రిలో చేరారని, ఆమెకు ఫిట్స్ రావడంతో మృతి చెందిందని చెప్పారు. -
ఆపరేషన్ చేసిన నర్సు గర్భిణి మృతి
-
గర్భిణికి ఆపరేషన్ చేసిన నర్సు..
- బాలింత మృతి - బంధువుల ఆందోళన కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ గర్భిణికి నర్సు ఆపరేషన్ చేయడంతో ఆమె మృతిచెందింది. ఈ సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని బిక్కనూరుకు చెందిన కోనింటి భాగ్య ప్రసవం నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. సమయానికి వైద్యులు అందుబాటులో లేకపోవడంతో డ్యూటీలో ఉన్న నర్సు ఆపరేషన్ చేసి కాన్పు చేసింది. సిజేరియన్ చేసిన వెంటనే భాగ్య మృతి చెందింది. ఆపరేషన్‌కు ముందే భాగ్య కుటుంబసభ్యులు వైద్యులు లేనందున కామారెడ్డికి రెఫర్ చేయమని సిబ్బందిని వేడుకున్నారు. అయితే అంబులెన్స్ లేదని సాకు చెప్పి నర్సు మొండిగా సిజేరియన్ చేసిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కామారెడ్డికి రెఫర్ చేసి ఉంటే భాగ్య బతికి ఉండేదని వారు చెబుతున్నారు. భాగ్య మృతికి నర్సు నిర్లక్ష్యమే కారణమని వారు ఆరోపిస్తున్నారు. దీంతో ఆస్పత్రి ఎదుట గందరగోళ వాతావరణం నెలకొంది. -
స్వైన్‌ఫ్లూతో గర్భిణి మృతి
చిలకలగూడ(హైదరాబాద్): స్వైన్‌ఫ్లూ వైరస్ కారణంగా ఆరు నెలల గర్భిణి మృతి చెందింది. నల్లగొండకు చెందిన పర్వీన్ (32) ఆరు నెలల గర్భిణి. ఆమెకు స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ కావడంతో జిల్లా ఆస్పత్రి వైద్యులు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చేర్చాలని సూచించారు.. దీంతో ఈ నెల 5న పర్వీన్‌ను ఆమె కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతి చెందింది. దీంతో ఈ ఏడాది గాంధీలో స్వైన్‌ఫ్లూతో మరణించిన వారి సంఖ్య 32కు చేరింది. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో 27 మంది స్వైన్ ఫ్లూ బాధితులకు, పీఐసీయూలో ఏడుగురు చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా 44 మంది స్వైన్‌ఫ్లూ అనుమానితులు కూడా చికిత్స పొందుతున్నారు. -
పీఎంపీ నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి
క్లినిక్‌పై కుటుంబీకుల దాడి పలమనేరులో ఘటన రాజీ కోసం రంగంలోకి పీఎంపీ అసోసియేషన్ పలమనేరు, న్యూస్‌లైన్: పీఎంపీ నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు గర్భిణి మృతి చెందింది. ఈ సం ఘటన పలమనేరులో మంగళవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. మండలంలోని టీ.వడ్డూరుకు చెందిన హేమంత్ భార్య శివకుమారి (22)కి నొప్పులు రావడంతో కుటుం బీకులు సోమవారం సాయంత్రం పట్టణంలోని శ్రీనివాసా క్లినిక్‌కు తీసుకొచ్చారు. అక్కడ విధుల్లో ఉన్న పీఎంపీ పార్వతి పరీక్షించి తాను డెలివరీ చేస్తానని ఒప్పుకున్నారు. గర్భిణి కుటుంబీ కుల నుంచి అడ్వాన్స్‌గా రూ.7 వేలు తీసుకున్నారు. శివకుమారికి నొప్పులు ఎక్కువ కావడంతో ప్రసవం కావడానికి అవసరమైన ఇంజెక్షన్లు ఇచ్చారు. అయితే శివకుమారికి తొలి కాన్పు సిజేరియన్ అయింది. ఇవేమీ పట్టించుకోని పీఎంపీ తన క్లినిక్‌లోనే అబ్జర్వేషన్లో ఉంచుకున్నారు. అయితే మంగళవారం వేకువజామున గర్భిణి మృతి చెందింది. చేసే ప్రయత్నమంతా చేశానని, పరిస్థితి విషమంగా ఉందంటూ పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని కుటుంబీకులతో చెప్పా రు. అప్పటిదాకా చేసిన వైద్యం కోసం మరో రూ.10 వేలు తీసుకున్నారు. శివకుమారి పరిస్థితి విషమంగానే ఉందని భావించిన కుటుంబీకులు క్లీనిక్‌లోకి వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతి చెంది నట్టు తెలుసుకున్నారు. డబ్బుకోసమే నాటకం ఆడినట్టు గుర్తించిన కుటుంబీ కులు క్లినిక్‌పై దాడికి పాల్పడ్డారు. ఆస్పత్రిలోని ఫర్నిచర్, వస్తువులను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. క్లినిక్ ఎదుట ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం తెలియడంతో స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు సర్దిజెప్పారు. పీఎంపీ పార్వతిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. శివకుమారి మృతితో టీ.వడ్డూరులో విషాదఛాయ లు అలుముకున్నాయి. మృతురాలికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. రంగంలోకి దిగిన పీఎంపీ అసోసియేషన్ ఈ వ్యవహారంపై పోలీసు కేసు లేకుండా సెటిల్మెంట్ చేసుకోవడానికి స్థానిక పీఎంపీ అసోసియేషన్ రంగంలోకి దిగింది. మధ్యవర్తుల ద్వారా బాధితుల కుటుంబీకులతో సంప్రదింపులు జరిపారు. రూ.లక్ష పరిహారంగా చెల్లిస్తామంటూ మృతురాలి ప్రాణానికి వెలకట్టారు. ఈ వ్యవహారమంతా పోలీస్‌స్టే షన్ ఎదుటే జరగడం గమనార్హం. నిబంధనలకు నీళ్లు పట్టణంలోని పలువురు పీఎంపీ, ఆర్ఎంపీలు వచ్చీరాని వైద్యంతో రోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వీరు ప్రథమ చికిత్సలు చేయడానికి మాత్రమే అర్హులైనప్పటికీ తీరు మా త్రం సర్జన్లకు మించిపోతోంది. ధనార్జనే ధ్యేయంగా అన్ని చికిత్సలూ అందిస్తు న్నా వైద్యశాఖ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.