రాధిక మృతదేహం
కామారెడ్డి క్రైం : కాలకృత్యాలకు వెళ్లిన ఓ గర్భిణి కాలుజారిపడిపోవడంతో తీవ్రగాయాలై మృతిచెందిన సంఘటన కామారెడ్డి మండలం టేక్రియాల్‌లో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. దేవునిపల్లి ఎస్సై కథనం ప్రకారం.. లింగంపేట మండలం ఎల్లారం గ్రామానికి చెందిన రాధిక (24)కు గత డిసెంబర్‌లో టేక్రియాల్‌కు చెందిన గంగారాంతో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. బుధవారం రాత్రి ఆమె బాత్‌రూంలో కాలుజారిపడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు గమనించి కామారెడ్డిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దేవుపల్లి ఎస్సై సంతోష్‌కుమార్ విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment